Rahul Ravindran
-
సమంత పోస్ట్‌పై వివాదం.. మద్దతుగా నిలిచిన నటుడు!
ప్రస్తుతం టాలీవుడ్లో హీరోయిన్ సమంత పేరే ఎక్కువగా వినిపిస్తోంది. గతేడాది మయోసైటిస్ నుంచి కోలుకున్న భామ.. ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అలాగే ఆరోగ్యానికి సహాయపడిన చికిత్సల గురించి సామ్ నెట్టింట సలహాలు ఇస్తోంది. అయితే ఇటీవల సమంత చేసిన పోస్ట్ వివాదానికి దారితీసింది. వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజేషన్ (పీల్చడం) చెయ్యండం వల్ల ఉపశమనం లభిస్తుందని సమంత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.అయితే సామ్ సలహాను ప్రముఖ డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ అకా "ది లివర్ డాక్" తప్పుపట్టారు. ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదని హెచ్చరించారు. ఈ టెక్నిక్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అతను చెప్పాడు. ఆరోగ్యం పట్ల సమంత ఒక నిరక్షరాస్యురాలని ఆయన అన్నాడు. ఇలాంటి సలహాలు ఇస్తున్న సమంతను జైళ్లో పెట్టాలని ఆయన కామెంట్ చేశాడు. అయితే సమంత కూడా దీనిపై స్పందించింది. ఓ సుదీర్ఘమైన లేఖను రాసుకొచ్చింది.తాజాగా ఈ విషయంపై నటుడు రాహుల్ రవీంద్రన్ స్పందించాడు. సామ్‌కు మద్దతుగా ట్విటర్లో పోస్ట్ చేశాడు. సమంత ట్యాగ్ చేసిన డాక్టర్ని మీరు డిబేట్‌కి ఆహ్వానించి ఉంటే బాగుండేందని అన్నారు. మనలో చాలా మందిలాగే సైన్స్ నిరక్షరాస్యురాలనడంలో సందేహం లేదు.. కానీ ఆమె చికిత్స తీసుకునే ముందు దాని గురించి కచ్చితమైన పరిశోధనలు చేసే వ్యక్తి అని తెలిపారు. అంతే కాదు సమంతకు అర్హత కలిగిన వైద్యుడే ఈ చికిత్సను సూచించాడని.. అందుకే ఆమె దానిని సిఫార్సు చేసిందని ట్విటర్లో రాసుకొచ్చారు. రాహుల్ తన ట్వీట్లో రాస్తూ..'మనకు అందరిలాగే ఏది సరైందో తెలియదు. అర్హత కలిగిన వైద్యులే భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నట్లు అనిపించినప్పుడు.. మనం ఇలాంటి సలహాలపైనే ఆధారపడతాం. ఇలాంటి థెరపీని ఆమె తీసుకుంటున్నది తప్ప.. నాకు దాని గురించి ఎలాంటి విషయాలు తెలియవు. ఒకవేళ ఆమెకు అది మంచిది కాకపోతే... నేనే తనను హెచ్చరిస్తా. నేను కూడా దయగల చాలా మంది వైద్యులను చూశా. చికిత్స అవసరమయ్యే పేషంట్‌కు ఇది ఎంత అవసరమో తెలుసు. ' పోస్ట్ చేశారు.ఒక వైద్యుడిగా ఈ సమాచారాన్ని బయటపెట్టడం పట్ల చూపిస్తున్న శ్రద్ధ.. తోటి వైద్యుడితో డిబేట్ పెట్టి ఉంటే బాగుండేది. మీరు ప్రజలకు సలహాలు సూచించే వైద్యులు అలాంటి వాటిపై దృష్టి పెట్టాలి. అంతే కాదు దాని ప్రభావం గురించి కథనాలను ప్రచురించాలి. కోవిడ్ వ్యాక్సిన్ల నుంచి సైన్స్‌పై ఆధారపడిన ప్రత్యామ్నాయ చికిత్సల వరకు... సైంటిఫిక్ కమ్యూనిటీలో భిన్నభిప్రాయాలు ఉంటే... మనం ఎవరిని నమ్మాలి?' అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయంలో సమంతకు రాహుల్ రవీంద్రన్ మద్దతుగా పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. Dear Doctor, it would have been really nice if you had invited the Doctor she had tagged in her same post to a debate and engaged with him. We would have all learned a lot from it. Would have helped us make up our minds about this alternate therapy. She is science illiterate like… https://t.co/UpUYnL7VlJ— Rahul Ravindran (@23_rahulr) July 5, 2024 -
మన అభిరుచులు వేరు.. కానీ శత్రువులం కాదు: రాహుల్ రవీంద్రన్
నటుడు, సింగర్ భర్త రాహుల్ రవీంద్రన్ పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ చాలా చిత్రాల్లో నటించారు. చివరిసారిగా గతేడాది ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్ అతనికి జంటగా నటించింది. అయితే 2014లో రాహుల్.. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాదను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రాహుల్ రవీంద్రన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. తన భార్య చిన్మయి ఉద్దేశించి ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.రాహుల్ ట్వీట్లో రాస్తూ..'మనం రాజకీయంగా, మిగతా వాటిలోనూ భిన్నంగా ఉండొచ్చు. మీ విలువలు, వ్యవస్థ ప్రమాదకరమని నేను చెప్పొచ్చు. కానీ నా విషయంలోనూ మీరు కూడా అలాగే భావిస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే నేను వందశాతం కరెక్ట్ అని చెప్పడాన్ని ఖండిస్తున్నా. నేను ద్వేషించే సినిమాలు మీరు ఇష్టపడొచ్చు. నేను ఇష్టపడే టీమ్స్‌ను మీరు ట్రోల్ చేయొచ్చు. మనం భిన్నమైన అభిరుచులు, వ్యక్తిత్వం కలిగి ఉండొచ్చు. మనం కాలానుగుణంగా మారొచ్చు లేదా మారకపోవచ్చు. కానీ నేను మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని వాగ్దానం చేస్తున్నా. ఏదైనా సరే మీతో చర్చిస్తానని మాటిస్తున్నా. అంతేకాదు మీరు లేనప్పుడు మీ గురించి చెడుగా మాట్లాడనని ప్రామిస్ చేస్తున్నా' అని రాసుకొచ్చారు. అంతే కాకుండా మనం ఏదో ఒక సందర్భంలో ఆమోదయోగ్యం కాని విధంగా ప్రవర్తించి ఉండొచ్చు. కానీ దాని చుట్టూ ఉన్న సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా. ఆ సమయంలో మీ మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటానని మాటిస్తున్నా. నాకు ఆసక్తి లేని వాటిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను. నేను ఏదైనా జడ్జ్ చేస్తే ఆ విషయాన్ని నా వద్దే ఉంచుకుంటా. అంతేకానీ ఇతరులతో పంచుకోను. ఒకవేళ ఏదైనా తప్పు చేసినట్లు అనిపించినా ఆ విషయాన్ని ఓపెన్‌గానే చెబుతా. నేను నిన్ను ప్రేమించలేకపోయినా సరే.. ద్వేషించే ఉద్దేశం లేదు. మన మధ్య రిలేషన్ అనే వారధిని నిర్మించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తా. నేను ఏంటనేది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. బహుశా ఏదో ఒక రోజు మనం మారొచ్చేమో. మనిద్దరం భిన్నమైన వ్యక్తులం కావొచ్చు. కానీ.. మనం శత్రువులుగా ఉండవలసిన అవసరం లేదు. అంటూ పోస్ట్ చేశారు. అయితే ఇది చూసిన చిన్మయి శ్రీపాద రిప్లా కూడా ఇచ్చింది. హలో .. బుద్ధ భగవాన్.. నేను వందశాతం అలాంటివారినే ప్రశ్నిస్తా.. అంతే కాదు.. ఎల్లప్పుడు ఉత్తమమైన వ్యక్తిగా ఉండేందుకు ప్రయత్నిస్తా అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. You and I… we may be different. Politically, you might be the other end of the spectrum. I might find your values and belief system problematic… dangerous even. But I understand that you might feel the same way about mine. And I refuse to assume with certainty that I am…— Rahul Ravindran (@23_rahulr) May 31, 2024 -
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రేసులో టాలీవుడ్ హీరో
భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఇదే విషయాన్ని బీసీసీఐ తెలిపింది. దీంతో టీమ్ఇండియాకు హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతాడా..? లేదా కొత్త కోచ్ వస్తారా..? అనేదానిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ పదవికి బీసీసీఐ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇందుకు అర్హతలు, బాధ్యతలను వెల్లడిస్తూ దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో తమ వివరాలు నింపాలని తెలిపింది.ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ అందరికీ అందుబాటులో వెబ్‌సైట్‌ను బీసీసీ ఉంచింది. దీంతో చాలామంది నెటిజన్లు సరదాగా భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కోసం దరఖాస్తు చేస్తున్నారు. ఆ స్క్రీన్ షాట్స్‌లను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. దీంతో దరఖాస్తుల సంఖ్య పెరగడంతో బీసీసీఐకి ఇబ్బందులు తప్పడంలేదు.అయితే, టాలీవుడ్ హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ కూడా భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కానీ, తన దరఖాస్తును బీసీసీఐ రిజక్ట్ చేసిందని ఆయన తెలిపారు. అయితే ఈ అప్లికేషన్‌ను నింపడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఈ క్రమంలో తనకు చాలా సరదాగా అనిపించిందని ఆయన అన్నారు. ' నేను ఒకసారైనా టీమ్ఇండియాకు హెడ్ కోచ్‌గా ఉండాలనుకుంటున్నాను.' అని రాహుల్ రవీంద్రన్ అన్నారు. I thought it’d be fun to just fill up the form and submit it for the heck of it. Thought I could tell my kids someday that “you know, I was in the running to be Head Coach of Team India once.” But… ☹️☹️ pic.twitter.com/b54ochsyhQ— Rahul Ravindran (@23_rahulr) May 15, 2024 -
Chinmayi Sripada And Rahul Ravindran: సింగర్ చిన్మయి శ్రీపాద వివాహ వార్షికోత్సవం.. అరుదైన ఫోటోలు
-
రష్మిక మందాన్నా ‘‘ది గర్ల్ ఫ్రెండ్’ మొదలైంది!
రష్మికా మందన్నా ప్రధాన ప్రాత్రలో నటించనున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మించనున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శక–నిర్మాత మారుతి కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇచ్చారు. దర్శక–నిర్మాత సాయి రాజేశ్ గౌరవ దర్శకత్వం వహించారు. వైవిధ్యమైన ప్రేమకథతో తెరకెక్కనున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. ఈ సినిమాకు సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్. -
'పదేళ్ల పనిని వారంలో చేశారు'.. ఆ డైలాగ్పై నటుడి ప్రశంసలు!
నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి చిత్రంపై ప్రశంసలు కురుస్తున్నాయి. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రం దసరా కానుకగా థియేటర్లలో సందడి చేసింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా కనిపించగా.. పెళ్లిసందడి ఫేమ్ శ్రీలీల ప్రత్యేక పాత్రలో కనిపించింది. అయితే ఈ మూవీలోని ఓ డైలాగ్ అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రబృందాన్ని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. సినిమాలోని గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ డైలాగ్పై నటుడు రాహుల్ రవీంద్రన్ ట్వీట్ చేశారు. ఆ ఒక్క డైలాగ్‌తో ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చారని కొనియాడారు. ఈ ట్వీట్‌కు అనసూయ రిప్ కూడా ఇచ్చింది. రాహుల్ తన ట్వీట్లో రాస్తూ.. 'ఈ చిత్రంలో ఒక్క డైలాగ్‌తో ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఒక్క వారంలోనే మెసేజ్ అందరికీ చేరేలా చేశారు. మీడియా ద్వారా అయితే దాదాపు 10 ఏళ్లు పట్టేది. మాస్ మసాల సినిమాలో ఇలాంటి గొప్ప అంశాన్ని పెట్టినందుకు చిత్రబృందానికి కృతజ్ఞతలు. బాలకృష్ణ వల్లే ఇది సాధ్యమైంది. అత్యంత ప్రభావవంతంగా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. బాలయ్య పక్కన శ్రీలీల చూడటం అద్భుతంగా అనిపించింది.' అంటూ చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ట్వీట్‌కు అనసూయం సైతం స్పందించింది. ఈ సినిమా గురించి ఇంతకంటే గొప్పగా ఎవరూ చెప్పలేరంటూ రిప్లై ఇచ్చింది. The good touch-bad touch scene in #BhagavantKesari will achieve in a week what other mediums will take 10 years. Thank you for bringing this topic to mass masala cinema @AnilRavipudi garu and NBK garu🙌🏽🙌🏽 Communicated in such a simple and yet highly effective manner like only NBK… — Rahul Ravindran (@23_rahulr) October 23, 2023 -
ఆ కిక్కే వేరు రా!
‘‘నేను దాన్ని ఎంత ప్రేమిస్తున్నానంటే, దానికి ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎవరూ అక్కర్లేదు రా..! నేను చాలు..! ట్వంటీఫోర్ హవర్స్ పిల్ల నాతోనే ఉండాలనిపిస్తది.. నాది అని చెప్పుకోవడానికి ఓ గర్ల్ ఫ్రెండ్ ఉంటే.. ప్చ్.. ఆ కిక్కే వేరు రా..!’’ అనే డైలాగ్స్‌తో కూడిన వాయిస్ ఓవర్‌తో మొదలవుతుంది ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా మోషన్ పోస్టర్. హీరోయిన్ రష్మికా మందన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ పతాకాలపై విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మించనున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమాను ఆదివారం అధికారికంగా ప్రకటించారు. ‘‘ఈ ప్రపంచం ప్రేమకథలతో నిండిపోయి ఉంది. కానీ ఈ ప్రేమ కథల్లో ఇప్పటివరకు ఎవరూ వినని, చూడనవి కూడా ఉన్నాయి. ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం అలాంటిదే’’ అని ట్వీట్ చేశారు రష్మికా మందన్నా. ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతిని ఇస్తుంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహబ్, కెమెరా: కృష్ణన్ వసంత్. -
సింగర్ చిన్మయిపై ట్రోల్స్ మొదటిసారి స్పందించిన రాహుల్
ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాదపై ట్రోల్స్ ఆపేయండని ఆమె భర్త నటుడు రాహుల్ వవీంద్రన్ తొలిసారి విజ్ఞప్తి చేశారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిన్మయి తరుచూ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతుంది. మీటూ ఉద్యమం సమయంలో కోలీవుడ్ సినీ గేయ రచయిత వైరముత్తు వంటి వారి ప్రవర్తనపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఆతనిపై చిన్మయి లైంగిక ఆరోపణలు కూడా చేసింది. వైరముత్తుపై చర్యలు తీసుకోవాలని పెద్ద పోరాటమే చేసింది. దీంతో ఆమె కోలీవుడ్ పరిశ్రమ నుంచి కూడా బహిష్కరణ ఎదుర్కొంది. తాజాగా మళ్లీ నెటిజన్లు ఆమెను ట్రోల్స్ చేస్తూ.. రాహుల్ ఖాతాను ట్యాగ్ చేయడంతో ఆయన ఒక నోట్ విడుదుల చేశారు. (ఇదీ చదవండి: అలాంటి సన్నివేశాల్లో నటిస్తే నా భర్తకు ఏం చెప్పాలి : ప్రియమణి) 'చిన్మయిని ఒక సెలబ్రిటీగా చూడకండి. సమాజంలోని సమస్యలపై ఆమె చేసే పోరాటాన్ని చూడండి. ఆమే చేస్తున్న పనిని మెచ్చుకోకపోయిన అర్ధం చేసుకునేందకు ప్రయత్నం చేయండి. ముందుగా ఒక్కసారి ఆమె చెప్పేది వినండి ఏకీభవిస్తారా వ్యతిరేకిస్తారా అనేది మీ ఇష్టం. ఆమె అందరితో ప్రేమగా ఉంటుంది. మీ అభిమానిలా, ఒక అక్కలా ఉంటుంది. ఆమె ప్రేమకు లిమిట్స్ ఉండవు. ఎవరికైన సమస్య వస్తే మరో కోణంలో చూడటం ఉండాలి. అప్పుడే విషయం అర్ధం అవుతుంది.' అని ఆయన నోట్లో తెలిపారు. రాహుల్ పోస్ట్‌పై తన అభిమానులు మద్దతుగా నిలవగా మరికొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు పెట్టారు. (ఇదీ చదవండి: Trolls On Bro Teaser: ఇదేం ట్రోలింగ్ 'బ్రో'.. ఆడుకుంటున్నారుగా!) -
అతన్నే జీవితాంతం ప్రేమిస్తా
-
'నువ్వు ఐరన్ ఉమెన్‌వి.. ఎన్ని కష్టాలు ఎదురైనా పోరాడుతునే ఉంటావు'
సినిమాల్లో నటిస్తున్నా, లేకపోయినా కొందరి క్రేజ్ ప్రజల్లో ఏ మాత్రం తగ్గదు. అలాంటి వారిలో నటి సమంత ఒకరు. నటిగా పరిచయం కాకముందు పాకెట్ మనీ కోసం పెళ్లి రిసెప్షన్లు, ఫంక్షన్లు తదితర సేవలు అందించారు. కథానాయకిగా పరిచయం అయిన తరువాత వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. తెలుగులో గౌతమ్ దర్శకత్వం వహించిన ఏ మాయ చేశావే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన సమంత తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్‌తో బృందావనం చిత్రంలో నటించే అవకాశం వరించడం.. అది ఘన విజయం సాధించడంతో ఒక్కసారిగా స్టార్ అంతస్తుకు చేరుకున్నారు. అలా తెలుగు, తమిళం భాషల్లో ప్రముఖ నటుల సరసన నటిస్తూ టాప్ హీరోయిన్గా ఎదిగారు. ది ప్యామిలీమ్యాన్–2 వెబ్ సిరీస్ జాతీయస్థాయిలో ఈమెకు క్రేజ్ తీసుకొచ్చింది. అలాంటి సమంత అనూహ్యంగా మయోసిటీస్ అనే అరుదైన వ్యాధికి గురవడం అందరికి షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం ఆమె ఈ వ్యాధితో గట్టిగా ఫైట్ చేస్తున్నారు. దీంతో సమంతకు పలువురు ధైర్యం చెబుతున్నారు. కాగా నటుడు రాహుల్ రవీంద్రన్ సమంతకు మంచి స్నేహితుడు. చదవండి: (Pooja Hegde: చిన్ననాటి కల నెరవేరింది) ఈయన సమంత గురించి తన ట్విట్టర్లో ‘‘ఎన్ని కష్టాలు ఎదురైనా నువ్వు పోరాడుతునే ఉంటావు ఇంకా ఇంకా పోరాడుతునే ఉంటావు.. ఎందుకంటే నువ్వు ఐరన్ ఉమెన్‌వి. నిన్ను ఏది ఓడించలేదు. కష్టాలు బాధించకుండా నిన్ను ఇంకా శక్తివంతంగా మారుస్తాయని’’ పేర్కొన్నారు. అందుకు సమంత బదులిస్తూ ధన్యవాదాలు రాహుల్. నాలాగే బయట ఎవరైనా పోరాడుతుంటే వారికి నేను ఇదే చెబుతాను. పోరాడుతునే ఉండండి మీరు ఇంకా బలంగా తయారవుతారు. ధృఢంగా కష్టాలను ఎదుర్కోండి అని పేర్కొన్నారు. కాగా సమంత త్వరగా కోలుకోవాలని ఆమెతో పాటు ఖుషి చిత్ర యూనిట్ కూడా బలంగా కోరుకుంటోంది. ఆమె విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంది. కాగా సమంత ప్రధాన పాత్ర పోషించిన శాకుంతలం చిత్రం 2023లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. -
సమంతకు క్రిస్మస్ స్పెషల్ గిఫ్ట్ పంపిన హీరో.. ఎమోషనల్ అయిన సామ్
సమంత ప్రస్తుతం మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్స్‌కి బ్రేక్ ఇచ్చిన సామ్ ప్రస్తుతం చికిత్స తీసుకుంటుంది. ఇప్పుడైతే కొత్త సినిమాలేవీ సైన్ చేయట్లేదట. కానీ వీలైనంత త్వరగా ఖుషీ సినిమా మాత్రం పూర్తి చేయాలని భావిస్తుందట. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రం కొద్దిరోజులు సినిమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే సమంతకు హీరో, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ఓ పవర్ఫుల్ మెసేజ్ ఉన్న ఓ స్పెషల్ గిఫ్ట్‌ను పంపాడు. అందులో ఏముందంటే.. ''చీకటితో కూడిన సొరంగం..వెలుతురు ఆనవాళ్లు కూడా లేవు. అడుగులు భారంగా మారినా శక్తినంతా కూడదీసుకుని ముందుకు సాగుతావు. భయాలు, సందేహాలు పక్కనపెట్టి సోల్జర్లా మారతావు. ఎందుకంటే నువ్వొక ఉక్కు మనిషివి. ఈ విజయం నీ జన్మహక్కు. ప్రస్తుతం నీ దారి చీకటిగా ఉండొచ్చు కానీ, త్వరలోనే అది ప్రకాశిస్తుంది. నువ్వొక యోధురాలివి, నిన్ను ఏదీ ఓడించలేదు. ఇలాంటివి నిన్ను ఇంకా బలపడేలా చేస్తాయని, ఎప్పటికీ బలంగా ఉండేలా చేస్తాయి'' అంటూ స్ట్రాంగ్ మెసేజ్‌తో కూడిన ఫలకాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఇది చూసి ఎమోషనల్ అయిన సమంత థ్యాంక్యూ అంటూ ఈ ఫోటోను షేర్చేసింది. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
ఆ నటుడి డైరెక్షన్లో సమంత నెక్ట్స్ మూవీ?
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం యశోద మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన యశోద చిత్రం మంచి విజయం సాధించింది. బక్సాఫీసు వద్ద ఈ మూవీ భారీ వసూళ్లు సాధించింది. సరోగసి నేఫథ్యంలో వచ్చిన ఈసినిమాలో తన నటన, యాక్షన్ సీక్వెన్స్‌లో అలరించింది. దీంతో ఆమె తదుపరి చిత్రాలపై ఆసక్తి నెలకొంది. నెక్ట్ సమంత ఎవరి డైరెక్షన్లో చేయనుంది, ఎవరికి ఒకే చెప్పనుందనేది చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో ఆమె ఓ నటుడు దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. చదవండి: సూపర్ స్టార్ కృష్ణకు ఘన నివాళి.. మహేశ్ బాబు కీలక నిర్ణయం! స్టార్ హీరోయిన్ సమంత నటుడు డైరెక్షన్లో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సమంతకు ఓ స్టోరీ లైన్ వినిపిండాడట. అది ఆమెకు బాగా నచ్చిందని, దీంతో వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్. అయితే మొదట రాహుల్ ఈ కథను రష్మికకు వినిపించాడట, ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా చేయలేనని చెప్పినట్లు సమాచారం. ఆ తర్వాత సమంత కోసం ఈ స్క్రీప్ట్ మర్పులు చేసి ఆమెకు స్టోరీ చెప్పగా సమంత ఒకే చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదు. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి. కాగా ప్రస్తుతం సమంత ఖుషి సినిమాలో నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రేమకథా రూపొందుతున్న ఈచిత్రంలో సామ్ విజయ్‌తో జతకట్టింది. చదవండి: కాబోయే భర్తను పరిచయం చేసిన తమన్నా! షాకవుతున్న నెటిజన్లు -
'గర్భం దాల్చిన మూడ్నెళ్లకే అబార్షన్'...సింగర్ చిన్మయి ఎమోషనల్
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఇటీవలే పండంటి కవలలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరిలో ఒకరికి ద్రిప్త అని.. మరొకరికి శర్వాస్ అని పిల్లల పేర్లు కూడా రివీల్ చేశారు. 2014లో నటుడు రాహుల్‌ని పెళ్లాడిన చిన్మయి ఇటీవలె ట్విన్స్‌కు జన్మనిచ్చి మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తుంది. అయితే తాజాగా చిన్మయి తన ప్రెగ్నెన్సీ స్టోరీని నెటిజన్లతో పంచుకుంది. తన స్వంత యూట్యూబ్ ఛానల్లో ఈ మేరకు వీడియోను షేర్ చేసింది. 'నేను, రాహుల్ ఎప్పటినుంచో తల్లిదండ్రులు కావాలనుకున్నాం. 2020లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయాలనుకున్నాం. కానీ అప్పుడు కరోనాతో అంతా అయోమయ పరిస్థితి. ప్రపంచమంతా తలకిందులయ్యింది. మా డాక్టర్ కూడా బయట ఏం జరుగుతుంతో తెలియదు.. ఇంతకాలం వెయిట్ చేశారు కదా ఇంకాస్త సమయం ఓపిక పట్టండి అని చెప్పింది. సెకండ్ వేవ్ అయిపోయాక నేను గర్బవతిని అయ్యాను. కానీ మూడు నెలలకే గర్భస్రావం(అబార్షన్)అయ్యింది. దీంతో చాలా బాధపడ్డాను. మానసికంగా చాలా డిస్ట్రబ్ అయ్యాను. కానీ తర్వాత కొన్నిరోజులకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెడిషనల్ చైనీస్ మెడికల్ డాక్టర్ ఎమిలీ నాకు పరిచయం అయ్యింది. తన సలహాతో నా డైట్, ఎక్సర్సైజ్ అన్నీ పాటించాను. అవి దాదాపు మన ఇండియన్ ఆయుర్వేదిక్ పద్దతులే. ఇక కొంతకాలానికి నేను మళ్లీ గర్భం దాల్చాను. కవలలకు జన్మనిచ్చాను. 37ఏళ్ల వయసులో తల్లి అయ్యాను' అంటూ చిన్మయి తన ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. -
పండంటి కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి
ప్రమఖ సింగర్ చిన్మయి శ్రీపాద తల్లయ్యారు. ఆమె పండంటి కవలలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని చిన్మయితో పాటు ఆమె భర్త రాహుల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇద్దరి పిల్లల చేతులను చిన్మయి, ఆమె భర్త పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ.. పిల్లల పేర్లను కూడా వెల్లడించారు. ఇద్దరిలో ఒకరికి ద్రిప్త అని.. మరొకరికి శర్వాస్ అని పేరు పెట్టినట్లు తెలియజేశారు. చిన్మయి, రాహుల్ తల్లిదండ్రులు కావడంపై నెటిజన్స్, సినీ ప్రముఖులు అభినందనలు తెలియజేస్తున్నారు. కాగా, రాహుల్, చిన్మయిలది ప్రేమ వివాహం. 2014లో వీరి పెళ్లి జరిగింది. ప్లేబ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు సంపాదించిన చిన్మయి మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని దక్షిణాదిని ఉవ్వెతున ప్రచారం చేశారు. ఇక రాహుల్ విషయానికొస్తే.. ‘అందాల రాక్షసి’చిత్రంతో టాలీవుడ్‌కి పరిచమయ్యాడు. హీరోగానే కాకుండా సహాయనటుడిగాను పలు సినిమాల్లో నటించాడు. నాని ‘శ్యామ్ సింగరాయ్’లో రాహుల్ పాత్రకు ప్రశంసలు దక్కాయి. ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. దర్శకత్వం దర్శకుడిగాను రాణిస్తున్నాడు. ‘చి..ల..సౌ’ చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించి, తొలి ప్రయత్నంలో విజయం సాధించాడు. Driptah and Sharvas The new and forever center of our Universe. ❤️ @rahulr_23 pic.twitter.com/XIJIAiAdqx — Chinmayi Sripaada (@Chinmayi) June 21, 2022 -
వెండితెరపై సందడి చేయబోతున్న రియల్ కపుల్
అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని, బుట్టబొమ్మ పూజా హెగ్డేలు జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదల కాబోతుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ గాయనీ చిన్మయి సందడి చేయబోతున్నారు. ఈ రోజు(సెప్టెంబర్ 10) ఆమె పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ తన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. చదవండి: ‘ఆ రెండు సినిమాలు తీయకపోతే నా జీవితానికి అర్థం లేదు’ ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చిన్మయికి విషెస్ కూడా తెలిపారు. అలాగే ఈ సినిమాలో ఆమె భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వీరిద్దరూ కీలక పాత్రలు పోషించనున్నారట. అయితే జంటగానా, వీడిగానా అనేది క్లారిటీ లేదు. కానీ ఈ రీయల్ కపుల్ మాత్రం రీల్‌పై తొలిసారిగా సందడి చేయడం విశేషం. దీంతో వారి ఫ్యాన్స్ వారి పాత్రలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ఇంతకాలం తెరవెనక తన గొంతులో ప్రేక్షకులను, సంగీత ప్రియులను ఆకట్టుకున్న చిన్మయి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీతో తెరపై అలరించబోతున్నారు. కాగా చిన్మయి స్టార్ హీరోయిన్ సమంతకు డబ్బింగ్ చెబుతున్న విషయం తెలిసిందే. చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ప్రముఖ లేడీ కమెడియన్ Wishing star singer @Chinmayi a very happy birthday - Team #MEB Also, Makes her Big-Screen Debut with #MostEligibleBachelor #AlluAravind @AkhilAkkineni8 @hegdepooja @baskifilmz @GopiSundarOffl #PradeeshMVarma #BunnyVas #VasuVarma @adityamusic @GA2Official #MEBOnOct8th pic.twitter.com/FiluWbzbTj — BA Raju's Team (@baraju_SuperHit) September 10, 2021 -
మరోసారి హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న డైరెక్టర్
రెండేళ్ల గ్యాప్ తర్వాత ఓ తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దర్శక–నటుడు రాహుల్ రవీంద్రన్ . మలయాళంలో ప్రేక్షకుల ప్రసంశలు అందుకున్న ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్ ’ సినిమా తమిళ రీమేక్‌లో రాహుల్ హీరోగా నటించనున్నారు. ఇందులో ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్ . కన్నడ దర్శకుడు. ‘‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’ సినిమాను చూశాను. సూపర్‌గా ఉంది. ఇదొక యూనివర్సల్ సబ్జెక్ట్. అన్ని భాషల్లోనూ ఈ సినిమాను తీయాలి. మణిరత్నంగారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్నప్పటి నుంచే నా భార్య (గాయని, అనువాద కళాకారిణి చిన్మయి)కి కన్నడ తెలుసు. 2012లో వచ్చిన నా తమిళ సినిమా ‘విన్ మీన్ గళ్’ స్క్రీనింగ్ టైమ్‌లో కన్నన్ గారిని నేను కలిశాను. అప్పుడు నాతో ఓ సినిమా చేయాలని ఉందని చెప్పారు. ఇప్పుడు ఆయన ఈ సినిమాతో వచ్చి నన్ను సంప్రదించినప్పుడు సర్ప్రైజింగ్గా అనిపించింది. ఐశ్వర్యా రాజేష్‌లాంటి అద్భుతమైన నటితో నటించడం ఓ చాలెంజ్’’ అని పేర్కొన్నారు రాహుల్ రవీంద్రన్ . కొత్తగా పెళ్లయిన దంపతుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అత్తింటికి తగ్గట్టు ఒదిగిపోవడానికి ఓ అమ్మాయి ఎలాంటి కష్టాలు పడుతుందనేది ప్రధానాంశం. మలయాళంలో ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. -
‘మా పెళ్లి ఇప్పుడే జరగడం లేదు’
ముందు నుంచీ చెప్పినట్లుగానే తాను ఇండస్ట్రీయేతర వ్యక్తినే పెళ్లి చేసుకోబోతున్నానని బాలీవుడ్ నటి నీతి టేలర్ అన్నారు. హిందీ సీరియళ్లతో పాటు తెలుగు తెరపై తళుక్కుమన్న నీతి ఎంగేజ్మెంట్ మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. భారత ఆర్మీ కెప్టెన్ పరీక్షిత్ బవాను ఆమె వివాహమాడనున్నారు. ఈ క్రమంలో తన నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నీతి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడిన నీతి ప్రేమకథ గురించి చెప్పుకొచ్చారు. ‘స్కూలు రోజుల నుంచే పరీక్షిత్ పరిచయం. అప్పుడు మేమిద్దరం మంచి స్నేహితులం. చాలా కాలం దూరంగా ఉన్న మేము కొన్ని నెలల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా మళ్లీ కలుసుకున్నాం. అప్పటి నుంచి మా మధ్య సంభాషణ పెరిగింది. ఆ క్రమంలో తను రత్నంలాంటి వాడని తెలుసుకున్నాను. ఢిల్లీకి వెళ్లి తనను కలిశాను. మా అమ్మానాన్న కూడా తనను కలిసి మాట్లాడారు. ఇరు కుటుంబాలు మా బంధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ప్రతీ విషయంలో మా ఇద్దరి అభిరుచులు, అభిప్రాయాలు ఒక్కటే. ఇండస్ట్రీ వ్యక్తిని కాకుండా బయటి వ్యక్తిని చేసుకుంటానని గతంలో చెప్పాను. ఇప్పుడదే నిజమైంది. తను ఆర్మీ కెప్టెన్. అయితే మా పెళ్లి ఇప్పుడే జరగబోవడం లేదు. పరీక్షిత్ తన ఉద్యోగం రీత్యా వివిధ ప్రదేశాలకు వెళ్తుంటాడు. నేనేమో ముంబైలో ఉన్నాను. బహుశా వచ్చే ఏడాది మా వివాహం జరుగుతుంది’ అని నీతి తనకు కాబోయే భర్త వివరాలు తెలిపారు. కాగా ఇష్క్బాజ్, గులాల్ వంటి హిట్ హిందీ సీరియళ్లలో నటిస్తున్న నీతి... టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. తనీశ్ హీరోగా నటించిన ‘మేం వయసుకు వచ్చాం’, రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రలో నటించిన పెళ్లి పుస్తకం సినిమాలోనూ ఆమె హీరోయిన్గా నటించారు. View this post on Instagram Aithey aa❤️ @parikshitbawa #partitayles 📸- @theglamweddingofficial Outfit- @kalkifashion Jewellery - @anmoljewellers Mu- @mahima.mua A post shared by Nititay💜 (@nititaylor) on Aug 14, 2019 at 5:26am PDT -
సినిమా కోసమే కాల్చాను!
సినిమా ఇండస్ట్రీ మారుతోంది. విభిన్నమైన సినిమాలు వస్తున్నాయి. సినిమాను సినిమాలా చూసే ఆలోచనాధోరణి ప్రేక్షకుల్లో పెరిగింది. ‘మన్మథుడు 2’ సినిమాలో సిగరెట్ కాల్చింది నేను కాదు.. అవంతిక (ఈ సినిమాలో రకుల్ పాత్ర పేరు). సిగరెట్ కాల్చడం అవంతికకు ఉన్న అలవాటు. సినిమాలో కూడా ఇవి రెండు మూడు షాట్స్ మాత్రమే ఉంటాయి. నా నిజజీవితంలో నేను సిగరెట్ కాల్చను. అయినా హీరోలు కాల్చితే ఏ ప్రాబ్లమూ ఉండదు. అదే సినిమాలో హీరోయిన్ సిగరెట్ కాల్చితే అదో పెద్ద టాపిక్. సినిమాలో ‘ధూమపానం ఆరోగ్యానికి హానికరం’ అనే క్యాషన్ కూడా వేస్తుంటాం కదా’’ అన్నారు రకుల్‌ప్రీత్ సింగ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు 2’. అక్కినేని నాగార్జున, పి. కిరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా రకుల్ చెప్పిన విశేషాలు. ► అల్లరి, చిలిపితనం, కోపం, బాధ ఇలా అన్నిరకాల భావోద్వేగాలతో నేను చేసిన అవంతిక పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. నా కెరీర్లో ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేయలేదు. నటనకు మంచి ఆస్కారం ఉన్న పాత్ర. అవంతికకు కొన్ని పంచ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఆడియన్స్‌కు తను తప్పకుండా నచ్చుతుంది. ► నాగార్జున సార్ మంచి కో–స్టార్. హీరోయిజమ్ అని కాకుండా కథలోని హీరో పాత్రకు తగ్గట్లు నటించారు. ఓ పాట చిత్రీకరణ కోసం మేం స్విట్జర్లాండ్ వెళ్లినప్పుడు నాకు ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ వద్దు.. యూనిట్ మెంబర్స్‌కు ఎలాంటి సౌకర్యాలు ఉంటాయో నాకూ అలాగే ఏర్పాటు చేయండి అన్నారు. అందుకే ఆయన కింగ్ అనిపించింది. లక్ష్మీగారు, ‘వెన్నెల’ కిశోర్ ఇలా అందరి పాత్రలు కథలో భాగంగానే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. హ్యాపీ హ్యాపీగా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేశాను. అప్పుడే షూటింగ్ అయిపోయిందా? అనిపించింది. ► రాహుల్ రవీంద్రన్ నాకు ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా నుంచే తెలుసు. చాలా ప్రతిభ ఉన్న రైటర్. యాక్టర్ కూడా. రాహుల్‌ను నేను బడే భయ్యా అని పిలుస్తాను. సెట్లో ఎప్పుడూ ఒక పాజిటివ్ వైబ్‌తోనే ఉంటాడు. బౌండ్ స్క్రిప్ట్ ముందే ఇవ్వడం వల్ల ఏ టెన్షన్ లేకుండా షూటింగ్ చేయగలిగాను. రాహుల్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘చిలసౌ’ ఫస్ట్ డే ఫస్ట్ షో చూశా. కానీ ‘చిలసౌ’ లోని అంజలి పాత్రకు ‘మన్మథుడు 2’ లోని అవంతిక పాత్రకు పోలిక పెట్టలేం. ► నేను హిందీలో చేసిన ‘దేదే ప్యార్ దే’ సినిమాకు, ‘మన్మథుడు 2’ చిత్రకథకు సంబంధం లేదు. ఉన్న కామన్ పాయింట్ ఒకటే... అతని కన్నా కాస్త తక్కువ వయసున్న అమ్మాయి హీరో లైఫ్‌లోకి వస్తుంది. ‘దేదే ప్యార్ దే’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారన్న వార్త నేను విన్నాను. అయితే రీమేక్ కోసం నన్ను ఎవరూ సంప్రదించలేదు. అయినా చేసిన పాత్రనే మళ్లీ చేయడం నాకు అంతగా ఇష్టం ఉండదు. సేమ్ రోల్ అయితే ఆడియన్స్ కూడా బోర్ ఫీల్ అవుతారు. నాకు పెద్ద కిక్ ఉండదు. ► సినిమాలో అవంతిక పాత్రకు వివాహం జరుగుతుందా? లేక లివింగ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్‌ను ప్రస్తావించామా? అనే అంశాలను ఇప్పుడు చెప్పలేను. సినిమా చూసి ఆడియన్స్ తెలుసుకోవాల్సిందే. ఇక లివింగ్ రిలేషన్షిప్ గురించి నా అభిప్రాయం చెప్పడానికి నేను ఏ రిలేషన్‌లోనూ లేను (నవ్వుతూ). పెళ్లి విధానంపై నాకు మంచి నమ్మకం ఉంది. ► నాగార్జునగారి ‘మన్మథుడు’ (2002) సినిమా చూశాను. ‘మన్మథుడు 2’ ఓ ఫ్రెంచ్ సినిమాకు తెలుగు రీమేక్. అయితే ఆ ఫ్రెంచ్ సినిమాను నేను చూడలేదు. ఒకవేళ చూస్తే మనకు తెలియకుండానే ఏదో ఒక సందర్భంలో ఆ సినిమాలోని హీరోయిన్లా చేయడానికి ట్రై చేస్తానేమో అని డౌట్. ► ‘దే దే ప్యార్ దే’లో అజయ్ దేవగన్, ‘మన్మథుడు 2’లో నాగార్జునగారు ఇలా సీనియర్ యాక్టర్స్తోనే నేను సినిమాలు చేస్తున్నాను కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం నితిన్ హీరోగా నటిస్తున్న సినిమాలో క్రిమినల్ లాయర్‌గా చేస్తున్నాను. ‘ఇండియన్ 2’ లో సిద్ధార్థ్ సరసన నటిస్తున్నాను. సినిమా కథ, అందులోని నా పాత్రే ఇంపార్టెంట్ నాకు. ఏవేవో ఆలోచించి మంచి పాత్రలను వదులుకోవాలనుకోను. హిందీలో మరో సినిమా కోసం చర్చలు జరుగుతున్నాయి. త్వరలో అనౌన్స్ చేస్తాను. -
‘మనం’ సీక్వెల్‌పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!
అక్కినేని ఫ్యామిలీ హీరోలందరూ కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా మనం. ఈ సినిమా లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం కూడా కావటంతో ఈ సినిమా ప్రత్యేకంగా గుర్తుండిపోయింది. అయితే చాలా రోజులు మనం సినిమాకు సీక్వెల్ తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. మరోసారి అక్కినేని కుటుంబ కథానాయకులంతా కలిసి నటించేందుకు రెడీ అవుతున్నారన్న టాక్ గట్టిగా వినిపించింది. ప్రస్తుతం మన్మథుడు 2 సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మనం సీక్వెల్‌ను కూడా రూపొందించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై రాహుల్ స్పందించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తాను మన్మథుడు 2 పనుల్లో బిజీగా ఉన్నట్టుగా చెప్పిన రాహుల్ ఆ సినిమా రిలీజ్ అయిన తరువాత తదుపరి ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తానని చెప్పారు. అంటే ప్రస్తుతానికి మనం సీక్వెల్‌కు సంబంధించి ఎలాంటి ఆలోచన లేనట్టే అని తెలుస్తోంది. నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన మన్మథుడు 2 ఆగస్టు 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో లక్ష్మీ, ఝాన్సీ, వెన్నెల కిశోర్, రావూ రమేష్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
‘బిగ్‌బాస్’లా టాస్క్‌లు ఇచ్చిన నాగ్!
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మన్మథుడు 2. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నటుడు, నిర్మాత నాగార్జున దర్శకుడు రాహుల్ రవీంద్రన్తో ఓ ప్రాంక్ వీడియో చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న రాహుల్‌ను ఓ రెస్టారెంట్‌కు పంపించి రకరకాల టాస్క్‌లతో ఇబ్బంది పెట్టాడు. ఈ ఆదివారం నుంచి ప్రసారం కానున్న బిగ్‌బాస్ రియాలిటీ షోకో హోస్ట్‌గా వ్యవహరించనున్న నాగ్, రాహుల్‌లో రియల్ లైఫ్‌లోనే అలాంటి టాస్క్‌లు చేయించాడు. నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో సమంత, కీర్తి సురేష్‌లు అతిథి పాత్రల్లో అలరించనున్నారు. వెన్నెల కిశోర్, లక్ష్మీ, రావూ రమేష్, ఝాన్సీలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
నువ్వు నీతులు చెప్పకు..!
సాక్షి, హైదరాబాద్: అవంతిక పాత్రలో సిగరెట్ తాగింది రకుల్ ప్రీత్ సింగ్ అయితే విమర్శలపాలవుతోంది మాత్రం గాయని చిన్మయి శ్రీపాద. కొన్ని రోజులుగా వేధింపులపై పోరాడుతున్న చిన్మయి.. మన్మథుడు 2 సినిమాలోని రకుల్ పాత్రకు సంబంధించిన టీజర్‌ను షేర్ చేయగా నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. సిగరెట్ సీన్‌కు అర్థం ఏంటంటూ ఆమెను పలువురు ప్రశ్నిస్తున్నారు. మీ భర్త చేస్తే ఒప్పు, మిగతావారు చేస్తే మాత్రం తప్పా? అంటూ నిలదీస్తున్నారు. ఈ విమర్శలకు కారణం లేకపోలేదు. మొన్నటివరకు కబీర్ సింగ్ చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగను ‘సినిమా తీసే పద్దతి ఇదేనా? ఆడవారిని అలా చూపించొచ్చా’ అంటూ దర్శకుడిపై తీవ్ర విమర్శలు చేసింది చిన్మయి. ఇప్పుడేమో చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ తన సినిమాలో హీరోయిన్‌తో సిగరెట్ తాగించాడు. అంతేకాక బోల్డ్ డైలాగ్స్ కూడా చెప్పించడంతో నెటిజన్లు చిన్మయికి చుక్కలు చూపిస్తున్నారు. ఇల్లు చక్కబెట్టుకోలేదు కానీ, అందరికీ నీతులు చెబుతోంది అంటూ చిన్మయిపై విరుచుకుపడుతున్నారు. చి.ల.సౌ. చిత్రంతో దర్శకుడిగా పరిచయమయిన రాహుల్ రవీంద్రన్ మన్మథుడు 2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో అవంతిక పాత్రలో రకుల్ ప్రీత్ నటిస్తోంది. జూలై 9న విడుదలైన టీజర్లో హీరోయిన్ రకుల్ ప్రీత్ గోడకు ఏటవాలుగా నిలబడి గుప్పుగుప్పుమంటూ సిగరెట్ పొగను గాల్లోకి వదలడం, హీరో నాగార్జునతో ఆమె డైలాగులు చర్చకు దారితీశాయి. కొందరేమో టీజర్ అద్భుతంగా వచ్చిందంటూ ప్రశంసిస్తుంటే, మరికొందరేమో రకుల్ సిగరెట్ తాగే సీన్‌ను తప్పు పడుతున్నారు. ఎటొచ్చీ రాహుల్, చిన్మయిలకు మాత్రం ట్రోల్స్ తప్పట్లేదు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది. -
‘మన్మథుడు 2’ ఫ్రీమేకా..?
కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మన్మథుడు 2. చిలసౌ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నటుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాకు దర్శకుడు. 2002లో రిలీజ్ అయిన మన్మథుడు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ ఫ్రెంచ్ సినిమా ఫ్రీమేక్ అన్న టాక్ వినిపిస్తోంది. 2006లో రిలీజ్ అయిన ఫ్రెంచ్ మూవీ ‘ప్రీట్-మోయి టా మెయిన్’ లైన్‌తోనే మన్మథుడు 2ను తెరకెక్కిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో 43 ఏళ్ల వ్యక్తిని కుటుంబం సభ్యులు పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతుంటారు. అతను మాత్రం ప్రేమ, పెళ్లి లాంటి కమిట్మెంట్స్ ఏవీ లేకుండా అమ్మాయిలతో సరదాగా గడిపేస్తుంటాడు. మన్మథుడు 2 టీజర్ లోనూ ఇదే కాన్సెప్ట్ కనిపించటంతో ఈ సినిమా రీమేక్‌గా ప్రచారానికి మరింత బలం చేకూరినట్టైంది. మరి ఈ వార్తలపై చిత్రయూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. -
మనసులు దోచే మన్మథుడు
నాగార్జున కింగ్ ఆఫ్ హార్ట్స్గా మారారట. మరి ఎవరెవరి మనసులు దోచుకున్నారో తెలియాలంటే టైమ్ పడుతుంది. నాగార్జున సూపర్ హిట్ చిత్రం ‘మన్మథుడు’ సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. రకుల్ ప్రీత్‌సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. నాగార్జున, పి. కిరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో సమంత, కీర్తీసురేశ్ అతిథి పాత్రల్లో కనిపిస్తారు. ఈ చిత్ర టీజర్‌ను రేపు(గురువారం) రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఒక షెడ్యూల్ మినహా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది’’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: ఎం.సుకుమార్. -
ద్యుతీ యూఆర్ ట్రూ చాంపియన్: తెలుగు డైరెక్టర్
హైదరాబాద్ : అమ్మాయితో సహజీవనం చేస్తున్నాని ప్రకటించిన భారత స్ప్రింటర్ ద్యుతీ చంద్‌పై టాలీవుడ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ ప్రశంసలు కురిపించాడు. ద్యుతీ చంద్‌పై ప్రముఖ స్పోర్ట్స్ చానెల్ రాసిన కథనాన్ని ప్రస్తావిస్తూ రాహుల్.. ద్యుతీని కొనియాడాడు. అయితే మూడు రోజుల క్రితమే తన రిలేషన్ గురించి ద్యుతీ బాహటంగా ప్రకటించినప్పటికీ.. మూడేళ్ల క్రితమే ఈ విషయాన్ని తమకు తెలిపినట్లు సదరు స్పోర్ట్స్ చానెల్ పేర్కొంది. ప్రేమకు జెండర్‌తో పనిలేదని, మనసులు కలిస్తే చాలని 2016లోనే ద్యుతీ చెప్పినట్లు ఆ కథనంలో పేర్కొంది. అప్పటికి భారత్‌లో స్వలింగ సంపర్కం నేరమని, అయినా తన సహచర్యం గురించి తెలిపిందని ప్రస్తావించింది. ఆమె తన ఆట కోసం ఎదుర్కొన్న ఒడిదుడుకులను కూడా వివరించింది. ఈ కథనానికి ముగ్ధుడైన రాహుల్.. ట్విటర్ వేదికగా ద్యుతీని ఆకాశానికెత్తాడు. ఈ కథనం చాలా స్పూర్తిదాయకంగా ఉందని, ఆమె తనకు ఎదురైన సమస్యలను అధిగమించి పోటీలో నిలవడం గొప్ప విషయమని, ‘ద్యుతీ యూ ఆర్ ట్రూ చాంపియన్’ అంటూ రాహుల్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం రాహుల్.. కింగ్ నాగర్జున హీరోగా మన్మథుడు-2 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. 2002లో కె. విజయభాస్కర్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి ఇది సీక్వెల్ అని తెలిసిందే. ఇక ద్యుతీ సహజీవనాన్ని ఆమె కుటుంబీకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ద్యుతీ తల్లి, సోదరి మీడియా వేదికగా ఆమెను తప్పుబడుతూ కెరీర్ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. ద్యుతీ మాత్రం ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తాను వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, తన ప్రియురాలితో బంధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. If you’re reading something today.. let it be this. Very very inspiring. Imagine all that this girl has had to go through before the tender age of 23. And yet she found the resolve to step out and compete. Uncommon courage. You’re a true champion @DuteeChand 🙏🏽🙏🏽🙏🏽 https://t.co/xmZuICXzM1 — Rahul Ravindran (@23_rahulr) May 22, 2019 -
రకూల్
పోర్చుగల్‌లో షూటింగ్‌కు అంతా అనువుగా ఉన్నప్పటికీ ‘మన్మథుడు 2’ టీమ్‌లో మాత్రం హాట్ హాట్ వాతావరణం ఉందని, అందుకు కథానాయిక రకుల్‌ప్రీత్‌సింగే కారణమనే వార్తలు రెండు రోజులుగా నెట్టింట్లో షికార్లు చేస్తున్నాయి. అయితే అలాంటిది ఏమీ లేదని తెలిసింది. అంత కూల్‌గానే సాగుతోందట. నాగార్జున హీరోగా ‘చి..ల..సౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. నాగ్ సరసన రకుల్ర్ పీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్నారు. అయితే రకుల్ నటన పట్ల టీమ్ సంతృప్తిగా లేదనే పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఈ విషయంపై రాహుల్ రవీంద్రన్ కూడా స్పందించారు. ‘‘ప్రచారంలో ఉన్న వార్తలు నిజం కాదు. అవి కేవలం పుకార్లు మాత్రమే. పోర్చుగల్ షెడ్యూల్ స్టార్ట్ అయిన తొలి రోజు నుంచే రకుల్ మా టీమ్‌తో ఉన్నారు. ఆమె మంచి ప్రతిభాశాలి. అద్భుతంగా నటిస్తోంది. టీమ్ అందరం హ్యాపీగా ఉన్నాం’’ అని పేర్కొన్నారు. సో.. ర‘కూల్’ అన్నమాట. ఇక్కడ ఇన్సెట్లో ఉన్న నాగార్జున ఫొటోను రాహుల్ రవీంద్రన్ షేర్ చేసి, ‘ఈ ఒక్క సీన్ మీ కోసమే’ అని ట్వీట్ చేశారు. 2002లో వచ్చిన ‘మన్మథుడు’ చిత్రానికి ‘మన్మథుడు 2’ సీక్వెల్ అనే ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని నాగార్జున, పి. కిరణ్ నిర్మిస్తున్నారు.