వినోదాత్మకంగా... | rahul ravindran new film opening | Sakshi

వినోదాత్మకంగా...

Mar 26 2016 12:02 AM | Updated on Sep 3 2017 8:34 PM

వినోదాత్మకంగా...

వినోదాత్మకంగా...

‘అందాల రాక్షసి’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ కథా నాయకుడిగా ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. రాథోడ్ దర్శకత్వంలో అమ్మా నాన్న ఫిలిమ్స్ పతాకంపై

 ‘అందాల రాక్షసి’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ కథా నాయకుడిగా ఓ కొత్త చిత్రం తెరకెక్కనుంది. రాథోడ్ దర్శకత్వంలో అమ్మా నాన్న ఫిలిమ్స్ పతాకంపై మణీంద్రన్ నిర్మించనున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘పూర్తి వినోదాత్మక చిత్రమిది. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలూ ఉంటాయి. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చేలా తీర్చిదిద్దుతాం. హీరోయిన్స్, ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది’’ అని తెలిపారు. ‘‘కథ నచ్చడంతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మిస్తున్నాం. మా బ్యానర్‌లో మంచి చిత్రంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాత పేర్కొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: జవహర్ రెడ్డి, సంగీతం: సునీల్ కశ్యప్, సహ నిర్మాత: ప్రశ్నాత్ తాత.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement