ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోయిన్ సమంత పేరే ఎక్కువగా వినిపిస్తోంది. గతేడాది మయోసైటిస్ నుంచి కోలుకున్న భామ.. ఆరోగ్యానికి సంబంధించిన టిప్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. అలాగే ఆరోగ్యానికి సహాయపడిన చికిత్సల గురించి సామ్ నెట్టింట సలహాలు ఇస్తోంది. అయితే ఇటీవల సమంత చేసిన పోస్ట్ వివాదానికి దారితీసింది. వైరల్ ఇన్ఫెక్షన్లు వచ్చినపుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి నెబ్యులైజేషన్ (పీల్చడం) చెయ్యండం వల్ల ఉపశమనం లభిస్తుందని సమంత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.
అయితే సామ్ సలహాను ప్రముఖ డాక్టర్ సిరియాక్ అబ్బి ఫిలిప్స్ అకా "ది లివర్ డాక్" తప్పుపట్టారు. ఇంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేదని హెచ్చరించారు. ఈ టెక్నిక్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని అతను చెప్పాడు. ఆరోగ్యం పట్ల సమంత ఒక నిరక్షరాస్యురాలని ఆయన అన్నాడు. ఇలాంటి సలహాలు ఇస్తున్న సమంతను జైళ్లో పెట్టాలని ఆయన కామెంట్ చేశాడు. అయితే సమంత కూడా దీనిపై స్పందించింది. ఓ సుదీర్ఘమైన లేఖను రాసుకొచ్చింది.
తాజాగా ఈ విషయంపై నటుడు రాహుల్ రవీంద్రన్ స్పందించాడు. సామ్‌కు మద్దతుగా ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. సమంత ట్యాగ్ చేసిన డాక్టర్‌ని మీరు డిబేట్‌కి ఆహ్వానించి ఉంటే బాగుండేందని అన్నారు. మనలో చాలా మందిలాగే సైన్స్ నిరక్షరాస్యురాలనడంలో సందేహం లేదు.. కానీ ఆమె చికిత్స తీసుకునే ముందు దాని గురించి కచ్చితమైన పరిశోధనలు చేసే వ్యక్తి అని తెలిపారు. అంతే కాదు సమంతకు అర్హత కలిగిన వైద్యుడే ఈ చికిత్సను సూచించాడని.. అందుకే ఆమె దానిని సిఫార్సు చేసిందని ట్విటర్‌లో రాసుకొచ్చారు.
రాహుల్ తన ట్వీట్‌లో రాస్తూ..'మనకు అందరిలాగే ఏది సరైందో తెలియదు. అర్హత కలిగిన వైద్యులే భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నట్లు అనిపించినప్పుడు.. మనం ఇలాంటి సలహాలపైనే ఆధారపడతాం. ఇలాంటి థెరపీని ఆమె తీసుకుంటున్నది తప్ప.. నాకు దాని గురించి ఎలాంటి విషయాలు తెలియవు. ఒకవేళ ఆమెకు అది మంచిది కాకపోతే... నేనే తనను హెచ్చరిస్తా. నేను కూడా దయగల చాలా మంది వైద్యులను చూశా. చికిత్స అవసరమయ్యే పేషంట్‌కు ఇది ఎంత అవసరమో తెలుసు. ' పోస్ట్ చేశారు.
ఒక వైద్యుడిగా ఈ సమాచారాన్ని బయటపెట్టడం పట్ల చూపిస్తున్న శ్రద్ధ.. తోటి వైద్యుడితో డిబేట్ పెట్టి ఉంటే బాగుండేది. మీరు ప్రజలకు సలహాలు సూచించే వైద్యులు అలాంటి వాటిపై దృష్టి పెట్టాలి. అంతే కాదు దాని ప్రభావం గురించి కథనాలను ప్రచురించాలి. కోవిడ్ వ్యాక్సిన్‌ల నుంచి సైన్స్‌పై ఆధారపడిన ప్రత్యామ్నాయ చికిత్సల వరకు... సైంటిఫిక్ కమ్యూనిటీలో భిన్నభిప్రాయాలు ఉంటే... మనం ఎవరిని నమ్మాలి?' అంటూ పోస్ట్ చేశారు. ఈ విషయంలో సమంతకు రాహుల్ రవీంద్రన్ మద్దతుగా పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Dear Doctor, it would have been really nice if you had invited the Doctor she had tagged in her same post to a debate and engaged with him. We would have all learned a lot from it. Would have helped us make up our minds about this alternate therapy. She is science illiterate like… https://t.co/UpUYnL7VlJ
— Rahul Ravindran (@23_rahulr) July 5, 2024
Comments
Please login to add a commentAdd a comment