మన అభిరుచులు వేరు.. కానీ శత్రువులం కాదు: రాహుల్‌ రవీంద్రన్‌ | Singer Husband Rahul Ravindan Post Goes In Social Media | Sakshi
Sakshi News home page

Rahul Ravindan: 'నీకు మాటిస్తున్నా.. ఎప్పుడు అలా చేయను'

Published Fri, May 31 2024 4:54 PM | Last Updated on Fri, May 31 2024 5:28 PM

Singer Husband Rahul Ravindan Post Goes In Social Media

నటుడు, సింగర్ భర్త రాహుల్ రవీంద్రన్‌ పరిచయం అక్కర్లేని పేరు.  కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ చాలా చిత్రాల్లో నటించారు. చివరిసారిగా గతేడాది ది గ్రేట్‌ ఇండియన్‌ కిచెన్ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్ అతనికి జంటగా నటించింది. అయితే 2014లో రాహుల్‌.. ప్రముఖ సింగర్‌ చిన్మయి శ్రీపాదను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రాహుల్ రవీంద్రన్‌ చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. తన భార్య చిన్మయి ఉద్దేశించి ఈ ట్వీట్‌ చేసినట్లు తెలుస్తోంది.

రాహుల్ ట్వీట్‌లో రాస్తూ..'మనం రాజకీయంగా, మిగతా వాటిలోనూ భిన్నంగా ఉండొచ్చు. మీ విలువలు, వ్యవస్థ ప్రమాదకరమని నేను చెప్పొచ్చు. కానీ నా విషయంలోనూ మీరు కూడా అలాగే భావిస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే నేను వందశాతం కరెక్ట్ అని చెప్పడాన్ని ఖండిస్తున్నా.  నేను ద్వేషించే సినిమాలు మీరు ఇష్టపడొచ్చు. నేను ఇష్టపడే టీమ్స్‌ను మీరు ట్రోల్ చేయొచ్చు. మనం భిన్నమైన అభిరుచులు, వ్యక్తిత్వం కలిగి ఉండొచ్చు.  మనం కాలానుగుణంగా మారొచ్చు లేదా  మారకపోవచ్చు. కానీ  నేను మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని వాగ్దానం చేస్తున్నా. ఏదైనా సరే మీతో చర్చిస్తానని మాటిస్తున్నా. అంతేకాదు మీరు లేనప్పుడు మీ గురించి చెడుగా మాట్లాడనని ప్రామిస్ చేస్తున్నా' అని రాసుకొచ్చారు. 

అంతే కాకుండా మనం ఏదో ఒక సందర్భంలో ఆమోదయోగ్యం కాని విధంగా ప్రవర్తించి ఉండొచ్చు. కానీ దాని చుట్టూ ఉన్న సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా. ఆ సమయంలో మీ మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటానని మాటిస్తున్నా. నాకు ఆసక్తి లేని వాటిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను. నేను ఏదైనా జడ్జ్ చేస్తే ఆ విషయాన్ని  నా వద్దే ఉంచుకుంటా. అంతేకానీ ఇతరులతో పంచుకోను.  ఒకవేళ ఏదైనా తప్పు చేసినట్లు అనిపించినా ఆ విషయాన్ని ఓపెన్‌గానే చెబుతా. నేను నిన్ను ప్రేమించలేకపోయినా సరే..  ద్వేషించే ఉద్దేశం లేదు. మన మధ్య రిలేషన్‌ అనే వారధిని నిర్మించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తా.  నేను ఏంటనేది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. బహుశా ఏదో ఒక రోజు మనం మారొచ్చేమో. మనిద్దరం భిన్నమైన వ్యక్తులం కావొచ్చు. కానీ.. మనం శత్రువులుగా ఉండవలసిన అవసరం లేదు.  అంటూ పోస్ట్‌ చేశారు. అయితే ఇది చూసిన చిన్మయి శ్రీపాద రిప్లా కూడా ఇచ్చింది. హలో .. బుద్ధ భగవాన్‌.. నేను వందశాతం అలాంటివారినే ప్రశ్నిస్తా.. అంతే కాదు.. ఎల్లప్పుడు ఉత్తమమైన వ్యక్తిగా ఉండేందుకు ప్రయత్నిస్తా అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement