chinmayi
-
బెస్ట్ ఫ్రెండ్ ఇంట్లో సమంత.. చాలా రోజుల తర్వాత!
సమంత ఇటీవల ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. మంత్రి కొండా సురేఖ కామెంట్స్ తర్వాత మరింత సామ్ ఒక్కసారిగా మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌కొచ్చిన సమంత జిగ్రా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేసింది. ప్రస్తుతం సినిమాలేవీ లేకపోవడంతో ఆధ్యాత్మిక బాట పట్టింది సామ్. అందులో భాగంగానే ఇటీవల కొయంబత్తూరులోని ఇషా ఫౌండేషన్‌లో అమ్మవారికి ప్రత్యేక పూజలు కూడా చేసింది.ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న సమంత.. తన క్లోజ్ ఫ్రెండ్ చిన్మయి శ్రీపాదను కలిసింది. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. ఈ సందర్భంగా సమంత నవరాత్రి పూజల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. సమంతతో కలిసి పూజలు చేసిన పిక్‌ను చిన్మయి తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. ఇందులో సమంత తన చేతిలో శారీ పట్టుకుని కనిపించింది. ఇది చూసిన ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.కాగా.. సమంత చివరిసారిగా విజయ్ దేవరకొండ సరసన ఖుషీ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం ఇండియన్ వర్షన్ సిటాడెల్లో కనిపించనుంది. ఆ తర్వాత బంగారం అనే మూవీలో నటించనుంది. -
చైసామ్ విడిపోయి నేటికి మూడేళ్లు.. ఇంతలా వాడుకుంటారా?
టాలీవుడ్ సెలబ్రిటీ జంట సమంత- నాగచైతన్య విడాకులు తీసుకుని సరిగ్గా నేటికి మూడేళ్లవుతోంది. 2021 అక్టోబర్ 2న పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రకటించారు. అప్పటినుంచి వీరి విడాకుల గురించి ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ మధ్యే నాగచైతన్యకు.. హీరోయిన్ శోభిత ధూళిపాళతో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అటు సమంత.. తన వర్క్ లైఫ్‌లో మునిగిపోయింది.దారుణ వ్యాఖ్యలుఇలాంటి సమయంలో మంత్రి కొండా సురేఖ.. సామ్-చైలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీరు విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని ఆరోపించారు. అక్కినేని కుటుంబ ప్రతిష్టను దిగజార్చేలా అనుచిత కామెంట్లు చేశారు. దీంతో నాగ్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డాడు. మీ రాజకీయాల కోసం సినీప్రముఖుల జీవితాలను వాడుకోవద్దని హెచ్చరించాడు. ఇంతకు దిగజారుతారా?తాజాగా సామ్ స్నేహితురాలు, సింగర్ చిన్మయి ఎక్స్ వేదికగా స్పందించింది. 'మీ ఎజెండా కోసం, మైలేజ్ కోసం, వ్యూస్ కోసం, డబ్బు కోసం సమంత పేరును ఇంత భయంకరంగా వాడుకుంటారా? అందరి దృష్టి మీవైపు మళ్లడం కోసం సమంతను అస్త్రంలా ఉపయోగిస్తున్నారని అర్థమవుతోంది. కానీ మీ అందరికంటే తనెప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుంది. తనను కనీసం కలలో కూడా టచ్ చేయలేరు. ఈ నవరాత్రికి మీ పాపాలను కడిగేసుకోండి' అని ట్వీట్ చేసింది. pic.twitter.com/o2nFKDIE26— chaitanya akkineni (@chay_akkineni) October 2, 2021 I have been unfortunately watching the truly horrifying manner in which multiple individuals, Telugu youtube channels, media persons have been using Samantha’s name for their own mileage, agenda and to make money from click baits and views.End of the day all it proves is that…— Chinmayi Sripaada (@Chinmayi) October 2, 2024 చదవండి: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున ఫైర్ -
'మా దగ్గర ఆ పరిస్థితి లేదు'.. హీరో కామెంట్స్‌పై మండిపడ్డ సింగర్!
హేమ కమిటీ నివేదిక మలయాళ ఇండస్ట్రీనే కాదు.. కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ఆ విషయం తనకేం తెలియదంటూ కామెంట్స్ చేశారు. తాజాగా కోలీవుడ్ నటుడు జీవా సైతం కోలీవుడ్‌లో హేమ కమిటీ నివేదికపై స్పందించారు. నేను కూడా దాని గురించి విన్నా.. అయితే తమిళ సినీ ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితులు మాత్రం లేవన్నారు. గతంలో మీటూ పార్ట్-1 చూశామని.. ఇప్పుడు పార్ట్-2 వచ్చిందని అన్నారు. వారిపేర్లను బయటికి చెప్పడం తప్పు.. కానీ సినిమాల్లో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కలిగి ఉండాలని తెలిపారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి వచ్చిన జీవా.. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు.తమిళంలో ఆ పరిస్థితి లేదు..జీవా మాట్లాడుతూ..' నేను ఒక మంచి ఈవెంట్ కోసం ఇక్కడకు వచ్చా. కాబట్టి మంచి విషయాలు అడగండి. చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. తేనవట్టు అనే సినిమా షూటింగ్ ముగించుకునివస్తున్నా. చాలా సినీ పరిశ్రమలలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. మీ పని వార్తలను సేకరించడం. మా పని మంచి వాతావరణాన్ని కాపాడుకోవడం. నటులుగా మేము చాలా మంది వ్యక్తుల ముఖాల్లో చిరునవ్వులు పూయిస్తాం. మలయాళంలో లాగా కోలీవుడ్‌లో జరగడం లేదు. ఈ విషయం గతంలోనూ చెప్పాను.. ఇప్పుడు కూడా చెబుతున్నా' అని అన్నారు. ఈ సందర్భంగా అయితే అక్కడే ఉన్న ఓ జర్నలిస్ట్‌తో కాసేపు వాగ్వాదం తలెత్తింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా.. రంగం సినిమాతో జీవా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. చిన్మయి రిప్లై.. కోలీవుడ్‌లో అలాంటి పరిస్థితులు లేవని జీవా చెప్పడంపై సింగర్ చిన్మయి శ్రీపాద రియాక్ట్ అయింది. తమిళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు లేవని ఎలా చెబుతారంటూ ప్రశ్నించింది. ఇలా ఎలా మాట్లాడుతారో తనకు అర్థం కావడం లేదన్నారు. గతంలో చాలాసార్లు చిన్మయి ఇండస్ట్రీలో జరుగుతన్న వేధింపులపై మాట్లాడారు. మహిళలపై ఎక్కడా అఘాయిత్యాలు జరిగినా సరే చిన్మయి సోషల్ మీడియా వేదికగా పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. I really do not understand how they are saying sexual harassment does not exist in Tamil Industry.HOW?! https://t.co/sm9qReErs0— Chinmayi Sripaada (@Chinmayi) September 1, 2024 -
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సింగర్ పోస్ట్ వైరల్!
సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహిళలు, చిన్నారులపై జరిగే దారుణాలపై నిత్యం యుద్ధం చేస్తూనే ఉంటోంది. ప్రపంచలో ఎక్కడ అఘాయిత్యం జరిగినా సోషల్ మీడియాలో వేదికగా పోరాటం చేస్తూనే ఉంది. గతంలో మీటూ ఉద్యమంలోనూ చిన్మయి శ్రీపాద గట్టిగానే మహిళల తరఫున పోరాడింది.తాజాగా నటుడు జాన్ విజయ్ మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది. కొన్ని రోజుల క్రితం ఇంటర్వ్యూకు వెళ్లిన ఓ మహిళా జర్నలిస్ట్‌తో అసభ్యంగా ప్రవర్తించాడని ప్రస్తావించింది. అతని ప్రవర్తనపై ఇతర మహిళలు కూడా తనతో మాట్లాడారని తెలిపింది. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్షాట్లను చిన్మయి ట్విటర్లో షేర్ చేసింది. పని ప్రదేశాల్లో, పబ్‌లు, రెస్టారెంట్లలో జాన్ విజయ్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తనకు వచ్చిన స్క్రీన్‌షాట్స్‌ను పంచుకుంది. కాగా.. 2018లోనూ అతనిపై లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.కాగా.. జాన్ విజయ్ చివరిసారిగా మలయాళ నటుడు దిలీప్ నటించిన తంకమణి చిత్రంలో విలన్‌గా కనిపించాడు. 2017లో దేశాన్ని కుదిపేసిన లైంగిక వేధింపుల కేసులో నిందితుల్లో దిలీప్ కూడా ఒకరు. అంతే కాకుండా 'ఓరం పో', 'సర్పట్ట పరంబరై, 'సలార్: పార్ట్ 1- సీజ్ఫైర్' లాంటి చిత్రాల్లో జాన్ విజయ్ నటించారు. ప్రభాస్ నటించిన సలార్ మూవీలో రంగ పాత్రలో జాన్ విజయ్ కనిపించారు.More on John Vijay from others who read the post.One of them interviewed him on camera. pic.twitter.com/md6TkyYNJn— Chinmayi Sripaada (@Chinmayi) July 26, 2024After The Newsminute report about the Sexual Assault case of Malayalam cinema also mentioned John Vijay for his misdemeanour with the journalistThere are other women speaking about his behaviour in general. pic.twitter.com/AfeLgdC0lY— Chinmayi Sripaada (@Chinmayi) July 26, 2024 -
మన అభిరుచులు వేరు.. కానీ శత్రువులం కాదు: రాహుల్ రవీంద్రన్
నటుడు, సింగర్ భర్త రాహుల్ రవీంద్రన్ పరిచయం అక్కర్లేని పేరు. కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ చాలా చిత్రాల్లో నటించారు. చివరిసారిగా గతేడాది ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేశ్ అతనికి జంటగా నటించింది. అయితే 2014లో రాహుల్.. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాదను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రాహుల్ రవీంద్రన్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం. తన భార్య చిన్మయి ఉద్దేశించి ఈ ట్వీట్ చేసినట్లు తెలుస్తోంది.రాహుల్ ట్వీట్లో రాస్తూ..'మనం రాజకీయంగా, మిగతా వాటిలోనూ భిన్నంగా ఉండొచ్చు. మీ విలువలు, వ్యవస్థ ప్రమాదకరమని నేను చెప్పొచ్చు. కానీ నా విషయంలోనూ మీరు కూడా అలాగే భావిస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే నేను వందశాతం కరెక్ట్ అని చెప్పడాన్ని ఖండిస్తున్నా. నేను ద్వేషించే సినిమాలు మీరు ఇష్టపడొచ్చు. నేను ఇష్టపడే టీమ్స్‌ను మీరు ట్రోల్ చేయొచ్చు. మనం భిన్నమైన అభిరుచులు, వ్యక్తిత్వం కలిగి ఉండొచ్చు. మనం కాలానుగుణంగా మారొచ్చు లేదా మారకపోవచ్చు. కానీ నేను మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తానని వాగ్దానం చేస్తున్నా. ఏదైనా సరే మీతో చర్చిస్తానని మాటిస్తున్నా. అంతేకాదు మీరు లేనప్పుడు మీ గురించి చెడుగా మాట్లాడనని ప్రామిస్ చేస్తున్నా' అని రాసుకొచ్చారు. అంతే కాకుండా మనం ఏదో ఒక సందర్భంలో ఆమోదయోగ్యం కాని విధంగా ప్రవర్తించి ఉండొచ్చు. కానీ దాని చుట్టూ ఉన్న సందర్భాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తా. ఆ సమయంలో మీ మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటానని మాటిస్తున్నా. నాకు ఆసక్తి లేని వాటిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను. నేను ఏదైనా జడ్జ్ చేస్తే ఆ విషయాన్ని నా వద్దే ఉంచుకుంటా. అంతేకానీ ఇతరులతో పంచుకోను. ఒకవేళ ఏదైనా తప్పు చేసినట్లు అనిపించినా ఆ విషయాన్ని ఓపెన్‌గానే చెబుతా. నేను నిన్ను ప్రేమించలేకపోయినా సరే.. ద్వేషించే ఉద్దేశం లేదు. మన మధ్య రిలేషన్ అనే వారధిని నిర్మించడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తా. నేను ఏంటనేది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. బహుశా ఏదో ఒక రోజు మనం మారొచ్చేమో. మనిద్దరం భిన్నమైన వ్యక్తులం కావొచ్చు. కానీ.. మనం శత్రువులుగా ఉండవలసిన అవసరం లేదు. అంటూ పోస్ట్ చేశారు. అయితే ఇది చూసిన చిన్మయి శ్రీపాద రిప్లా కూడా ఇచ్చింది. హలో .. బుద్ధ భగవాన్.. నేను వందశాతం అలాంటివారినే ప్రశ్నిస్తా.. అంతే కాదు.. ఎల్లప్పుడు ఉత్తమమైన వ్యక్తిగా ఉండేందుకు ప్రయత్నిస్తా అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం వీరిద్దరి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. You and I… we may be different. Politically, you might be the other end of the spectrum. I might find your values and belief system problematic… dangerous even. But I understand that you might feel the same way about mine. And I refuse to assume with certainty that I am…— Rahul Ravindran (@23_rahulr) May 31, 2024 -
మాజీ సీఎంపై కేసు.. ఆశ్చర్యం కలిగించిందన్న ప్రముఖ సింగర్!
కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పపై లైంగికదాడి కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన కూతురిపై యడ్యూరప్ప లైంగికదాడి చేశారని ఓ 17 ఏళ్ల బాలిక తల్లి బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద యడ్యూరప్పపై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ అరెస్ట్‌పై ఫెమినిస్ట్, సింగర్ చిన్మయి శ్రీపాద రియాక్ట్ అయింది. ఇది తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందని ట్వీట్ చేసింది. అంతే కాకుండా ఆ వార్తకు సంబంధించిన క్లిప్‌ను షేర్ చేసింది. కాగా.. దేశంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అన్యాయాలపై సోషల్ మీడియా వేదికగా పోరాటం చేస్తోంది. మనదేశంలో మహిళలకు రక్షణ లేదని చాలాసార్లు తన ట్వీట్ల ద్వారా వెల్లడించింది. ఇటీవల స్పెయిన్ జంటపై జరిగిన లైంగిక దాడిపై కూడా చిన్మయి స్పందించిన సంగతి తెలిసిందే. అసలేం జరిగిందంటే.. ఒక కేసులో సాయం అడిగేందుకు ఫిబ్రవరి 2న యడ్యూరప్ప ఇంటికి వెళ్లినపుడు తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో బాలిక తల్లి పేర్కొన్నట్లు సమాచారం. యడ్యూరప్ప ఇప్పటికి మూడుసార్లు కర్ణాటక సీఎంగా పనిచేశారు. 2021లో యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు. There is a POCSO case lodged against former Karnataka Chief Minister B S Yediyurappa for sexually harassing a minor. I am stunned. pic.twitter.com/vjY4ynwurR — Chinmayi Sripaada (@Chinmayi) March 15, 2024 -
సింగర్ చిన్మయి శ్రీపాదపై కేసు నమోదు
-
ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా నుంచి వీడియో సాంగ్ లాంచ్
ప్రణవ్, షజ్ఞ శ్రీ హీరో హీరోయిన్లుగా శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో కొవ్వూరి అరుణ గారి సమర్పణ లో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాతగా వస్తున్న సినిమా ప్రభుత్వ జూనియర్ కళాశాల. గతంలో ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్, టీజర్ అండ్ సాంగ్ విడుదలై మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన రెండో సాంగ్ చల్లగాలి అంటూ సాగే రొమాంటిక్ పాటని వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకు లిరికల్ సాంగ్స్ రిలీజ్ అవ్వడమే కానీ ఫస్ట్ టైం మూవీకి సంబంధించిన వీడియో సాంగ్ మూవీ రిలీజ్‌కు ముందే విడుదల చేయడం చాలా కొత్తగా ప్లాన్ చేశారు టీం. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు విచ్చేశారు. సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ : 2000's బ్యాక్ డ్రాప్ నేటివిటికి తగినట్టుగా సినిమాను తీసుకొచ్చారు. విజువల్స్ చాలా బాగున్నాయి. మంచి సినిమా, మంచి కంటెంట్‌కు మీడియా సపోర్ట్‌తో పాటు ప్రేక్షకుల సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అన్నారు. దర్శకుడు శ్రీనాథ్ పులకురం మాట్లాడుతూ : ఈ కాలంలో ప్రైవేట్ కాలేజీలు తప్ప ప్రభుత్వ జూనియర్ కళాశాల అనే మాట చాలా తక్కువ వినిపిస్తోంది. 2000's బ్యాక్ డ్రాప్లో పుంగనూరు గ్రామంలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. చిన్న సినిమా పెద్ద సినిమా అని చూస్తున్నారు కానీ మేము ఒక మంచి సినిమా మంచి బ్యానర్ అండ్ డీసెంట్ బడ్జెట్ తో సినిమాను తెరకెక్కించాం. ఈ సినిమాను ప్రేక్షకులు, మీడియా సపోర్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను అన్నారు. నిర్మాత భువన్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ : శ్రీనాథ్ చెప్పిన కథ బాగా నచ్చి తనని నమ్మి కథను నమ్మి సినిమా దర్శకుడు అని పేరే కానీ అన్ని దగ్గరుండి చూసుకుని మంచి కాన్సెప్ట్ తో కొత్త కథగా ఈ సినిమాను మీ ముందుకు తీసుకురాబోతున్నాడు. సినిమా మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. హీరో ప్రణవ్ మాట్లాడుతూ : డైరెక్టర్ శ్రీనాథ్ గారు నన్ను నమ్మి ఈ కథకు నన్ను సెలెక్ట్ చేశారు సంతోషంగా ఉంది. షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ ఒక యాక్టర్ గా ఎదగాలనుకున్న నన్ను హీరోను చేశారు. కథ చాలా కొత్తగా ఉంటుంది రెండు దశాబ్దాల వెనక్కు వెళ్లేలా రియలిస్టిక్ గా ఈ సినిమాను చేసాం. మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. చిన్మయి పాడిన ఈ పాట కూడా మంచి సక్సెస్ అవుతుంది. సినిమాను మంచి సక్సెస్ చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము అన్నారు. హీరోయిన్ షజ్ఞ శ్రీ మాట్లాడుతూ : ఈ సినిమాకి నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు మా డైరెక్టర్ శ్రీనాథ్‌కు థాంక్స్ చెప్పుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఈ సాంగ్ గురించి మాట్లాడదలుచుకున్నాను. విజువల్స్ చాలా బాగా వచ్చాయి డైరెక్టర్ టేకింగ్‌తో పాటు ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సాంగ్‌ను అలాగే సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. మీడియా తలుచుకుంటే ఏదైనా చేయగలదు. మీడియా ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరించి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. -
మళ్లీ రెచ్చిపోయిన సింగర్ చిన్మయి.. తమిళనాడు సీఎంపైనే విమర్శలు!
ప్రముఖ సింగర్ చిన్మయి మరోసారి తన రెచ్చిపోయింది. తనని లైంగికంగా వేధించి, కెరీర్ సర్వనాశనం అయ్యేలా చేసిన వ్యక్తిపై, అతడితో పాటు ఉన్న కమల్ హాసన్, పి.చిదంబరం, సీఎం స్టాలిన్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సింగర్ చిన్మయి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. (ఇదీ చదవండి: ఎంగేజ్మెంట్ చేసుకున్న 'దసరా' విలన్.. అమ్మాయి ఎవరో తెలుసా?) అసలేం జరిగింది? ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు రాసిన 'మహా కవితై' పుస్తకావిష్కరణ తాజాగా చెన్నైలో జరిగింది. దీనికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరం, స్టార్ హీరో కమల్‌హాసన్ తదితరులు హాజరయ్యారు. 'నన్ను వేధింపులకు గురిచేసిన వ్యక్తితో కలిసి తమిళనాడుకు చెందిన కొందరు ప్రముఖులు వేదికపై ఉన్నారు. అతడి గురించి బయటకు చెప్పిన నేను మాత్రం నిషేధానికి గురయ్యాను. కొన్నేళ్లపాటు నా వృత్తి జీవితాన్ని కోల్పోయాను. నా కోరిక నెరవేరేవరకు ప్రార్ధించడం మినహా నేను చేసేది ఏమీలేదు' అని చిన్మయి ట్వీట్స్ చేసింది. అసలేంటి గొడవ? సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ అయిన చిన్మయి.. 2018లో రైటర్ వైరముత్తుపై ఆరోపణలు చేసింది. తనని ఈయన లైంగికంగా వేధించాడని బయటపెట్టింది. మీటూ ఉద్యమం జరుగుతున్న సమయంలో చిన్మయి ఈ ఆరోపణలు చేసింది. ఈమెతో పాటు పలువురు కూడా వైరముత్తు నిజస్వరూపాన్ని బయటపెట్టారు. అయితే వైరముత్తుపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. తమిళ ఇండస్ట్రీలో చిన్మయిపై నిషేధం విధించారు. దీంతో అప్పటినుంచి వైరముత్తపై చిన్మయి ఎప్పటికప్పుడు విరుచుకపడుతూనే ఉంది. ఇప్పుడు కూడా అలానే వైరముత్తుకి సపోర్ట్ చేస్తున్న స్టాలిన్, కమల్ తదితరులపై కూడా విమర్శలు చేసింది. (ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) Some of the most powerful men in Tamilnadu platforming my molester whilst I got banned - years of my career lost. May the entire ecosystem that promotes and supports sex offenders whilst incarcerating honest people who speak up start getting destroyed from this very moment,… https://t.co/J7HcqJYAcV — Chinmayi Sripaada (@Chinmayi) January 1, 2024 Thodangi? yevangalta nyayathukku poganum? Ivangaltaya? Just check the number of politicians with Vairamuthu alone. How does one get justice in this ecosystem? https://t.co/0ubXKXZq7e pic.twitter.com/xjnVZL0xwb — Chinmayi Sripaada (@Chinmayi) January 1, 2024 -
ఐశ్వర్య రాయ్‌పై అత్యాచారం చేస్తానంటే స్పందించలేదేంటి?: చిన్మయి
స్టార్ హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దూమారం రేపుతున్నాయి. లియో సినిమాలో త్రిషతో బెడ్ రూమ్ సన్నివేశాలు ఉంటాయని భావించానని, అలాంటి సీన్స్ లేకపోవడం నిరాశకలిగించిందని మన్సూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అతని వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా మండిపడింది. ఇకపై అతనితో నటించబోనని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సినీ ప్రముఖులంతా త్రిషకు మద్దతుగా నిలిచారు. ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవితో పాటు పలువురు హీరోహీరోయిన్లు త్రిషకు మద్దతు ప్రకటిస్తూ..మన్సూర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఒక అడుగు ముందుకేసి ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని మన్సూర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే మన్సూర్ మాత్రం త్రిషకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదంటున్నారు. తాను సరదాగా అన్న మాటలను కొంతమంది కావాలనే వక్రీకరించారని ఆరోపించారు. ఇదిలా ఉంటే.. ఈ వివాదంపై గాయని చిన్మయి శ్రీపాద తనదైన స్టైల్లో స్పందించింది. మన్సూర్ మాత్రమే అలాంటి వ్యాఖ్యలు చేయలేదని..గతంలో చాలా మంది హీరోయిన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. నటుడు రాధా రవికి సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. (చదవండి: త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. సారీ చెప్పే ప్రసక్తే లేదన్న మన్సూర్) అందులో రాధా రవి ఓ సినిమా ఈవెంట్లో మాట్లాడుతూ..‘నాకు హిందీ భాష రాదు. ఒకవేళ వచ్చి ఉంటే ఐశ్వర్యను రేప్ చేసే వాడ్ని. ఎందుకంటే అక్కడి వాళ్లు ఎలాగో నాకు మంచి పాత్రలు ఇచ్చేవాళ్లు కాదు. అత్యాచారం చేసే పాత్రలే ఇచ్చేవాళ్లు’ అని సరదాగా అన్నారు. రాధ రవి మాటలకు అక్కడి వారంతా నవ్వేశారు. ఈ వీడియోని చిన్మయి ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ.. రాధరవి..ఐశ్వర్య రాయ్‌ని రేప్ చేస్తానంటే అంతా జోక్‌గా తీసుకొని నవ్వేశారు. అలాంటి వ్యాఖ్యలే చేసిన మన్సూర్‌పై చర్యలు తీసుకోవాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. మరి రాధ రవి వ్యాఖ్యల మీద ఎవరూ స్పందించకపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని ఉంది’అని చిన్మయి రాసుకొచ్చింది. (చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!) చిన్మయి షేర్ చేసిన వీడియోపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. అతను రేప్ సన్నివేశాల గురించి మాత్రమే మాట్లాడరని కొంతమంది కామెంట్ చేస్తే.. మరికొంతమంది రాధరవిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడుతున్నారు. "I have once said that if I had known Hindi, I would have had the opportunity to rape Aishwarya Rai. What I meant was I would have acted in Bollywood. Why the hell should I then act with these saniyans (idots/sinners in Tamil)." - Radha Ravi Here in this video in Tamil where you… pic.twitter.com/j9qLQwdRA7 — Chinmayi Sripaada (@Chinmayi) November 21, 2023 -
నన్ను చాల హెరాస్ చేశాడు..!
-
నేను చూసిన వారిలో సమంత స్ట్రాంగ్ ఉమెన్
-
అమ్మాయిలకు పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి: చిన్మయి
-
ఎంత కావాలో చెప్పు అంటూ.. సింగర్ చిన్మయిపై వల్గర్ కామెంట్
ప్రముఖ గాయనిగా చిన్మయి శ్రీపాదకు మంచి గుర్తింపు ఉంది. అంతేకాకుండా సమంతకు డబ్బింగ్ చెప్పడం ప్రారంభించిన ఆమె మల్టీటాలెంటెడ్‌గా చిత్ర పరిశ్రమలో రానించింది. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిన్మయి తరుచూ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతుంది. ఎదుటివారు ఎంతిటివారైనా సరే తను ఓపెన్‌గానే విరుచుకుపడుతుంది. దీంతో ఆమెపై ఒక వర్గం నెటిజన్లు ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు. (ఇదీ చదవండి: బోరున ఏడ్చేసిన రతిక తల్లిదండ్రులు.. అందరినీ కదిలిస్తున్న వ్యాఖ్యలు ) తాజాగా అలాంటి సంఘటనే సోషల్ మీడియాలో ఆమెకు ఎదురైంది. కొద్దిరోజుల క్రితం ఆమెకు ఒక నెటిజన్ ఇలా మెసేజ్ చేశాడు. 'మీరంటే నాకు చాలా ఇష్టం. సాటి అమ్మాయిల కోసం నిలబడే తీరు నాకు ఎంతో నచ్చింది. ఇలాగే మీరు ఎప్పుడూ ఉండాలి. మా సోదరికి కూడా అలాంటి చేదు అనుభవాల వల్ల ఇబ్బందులు ఎదుర్కుంది.' అని మెసేజ్ చేశాడు. కానీ చిన్మయి తిరిగి సమాధానం ఇవ్వకపోవడంతో అతనిలో దాగున్న అసలు స్వరూపం బయటకు వచ్చింది. మళ్లీ ఇలా మెసేజ్ చేశాడు. 'నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తా.. నాతో కొంత సమయం స్పెండ్ చేస్తావా.?' అంటూ మరో అర్థం వచ్చేలా మెసేజ్ పెట్టాడు. అంతటితో ఆగక 'నీకు ఏం కావాలన్నా కొంటాను.. లగ్జరీ జీవితాన్ని ఇస్తాను.' అని వరుసబెట్టి మెసేజ్‌లు పంపాడు. (ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్, ఏడ్చేసిన వరుడు) దీనిపై చిన్మయి ఫైర్ అయింది. ఈ చెత్త ఎదవను చూడండి మొదట పద్దతిగా మెసేజ్‌లు చేశాడు.. నేను తిరిగి రిప్లై ఇవ్వకపోవడంతో వాడి ఈగో దెబ్బతిన్నట్లు ఉంది. దీంతో వాడి అసలు రూపం బయటకొచ్చింది. ఇలాంటి వాడ్ని ఏం చేయాలి.. ముందు వాడి నాన్నను అనాలి. ఇంత చెత్తగా పిల్లలను ఎలా పెంచాడు. ఇలాంటి ఎదవలు సమాజంలో చాలామందే ఉన్నారు. అమ్మాయిలా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చిన్మయి తెలిపింది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
అక్కడికెళ్లిన అమ్మాయిల వీడియో షేర్ చేసిన నటి.. నెటిజన్ల ఫైర్
నటి కస్తూరి శంకర్ మొదట్లో సినిమాలకు మాత్రమే పరిమితం అయిన ఆమె పలు స్టార్ హీరోలతో నటించడమే కాకుండా పాపులర్ అయింది. ప్రస్తుతం ఆమె స్టార్ మాలో ప్రసారమయ్యే ఇంటింటి గృహాలక్ష్మి సీరియల్లో తులసిగా బుల్లితెరపై అలరిస్తోంది. ఓ గృహిని పడే కష్టాలు, భర్త నుంచి విడిపోయిన అనంతరం సమాజం నుంచి ఎదురయ్యే సవాళ్లు ఎలా ఉంటాయనేది తెరపై చూపిస్తోంది. దీంతో తులసిగా కస్తూరి బుల్లితెరపై ఎనలేని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే కస్తూరి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. సమాజంలో జరిగే ప్రతి అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది. దీంతో ఒక్కోసారి ఆమెపై వ్యతిరేకత కూడా వస్తుంటుంది. (ఇదీ చదవండి; స్టార్ హీరోపై విడాకుల రూమర్స్.. విదేశాల్లో ఉందంటూ!) తాజాగా ఆమె ఇద్దర అమ్మాయిలకు సంబంధించిన వ్యక్తిగత వీడియోను షేర్ చేసింది. దీంతో ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఆ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు వైన్ షాపునకు వెళ్లి మద్యం సీసాలు కొంటారు. దానిని షేర్ చేస్తూ ఇలా చెప్పుకొచ్చింది. 'తాగండి అమ్మాయిలు తాగండి.. ఏ మాత్రం తగ్గద్దు. ఎనిమిది మందిలో ఈమె ఒక్కరే మగరాయుడు. ఇదీ ఏ మాత్రం తప్పుకాదు, అసహ్యమూ కాదు. ఏమవుతుంది మహా అయితే వాట్సాప్ ఫార్వర్డ్ ఆఫ్ ద డే అవుతుంది. మీరు సూపర్.. మహిళల హక్కుల గురించి ఆలోచించకుండానే తిరిగి వస్తున్నాయి.' అంటూ కామెంట్ చేసింది. దీంతో వాళ్లను పొగుడుతున్నావా..? లేదా తప్పుబడుతున్నావా..? ఏ మాత్రం అర్థం కావడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే కస్తూరిపై సీరియస్ అవుతున్నారు. అమ్మాయిల వీడియోను ఇలా నెట్టింట షేర్ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చిత్రపరిశ్రమలోని ప్రముఖలకు చెందిన అమ్మాయిలు పబ్‌లకు వెళ్తున్నారు. వారి ఫోటోలు కూడా ఇలా షేర్ చేసే దమ్ము నీకు ఉందా..? అంటూ మండిపడుతున్నారు. ఇదే విషయంపై ప్రముఖ సింగర్ చిన్మయి కూడా స్పందించింది. 'కస్తూరి నువ్వు ఇలా షేర్ చేయాల్సిన అవసరం ఏమెచ్చింది. నిజాయితీగా చెప్తున్నా. ఇది చాలా తప్పు' అంటూ ట్వీట్ చేసింది. దీంతో చిన్మయిని నెటిజన్లు మెచ్చుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. అమ్మాయిలు అయినంత మాత్రనా మద్యం తీసుకోకుడదా..? వారికంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయినేది గుర్తించాలి. మద్యం మగవారు మాత్రమే తీసుకోవాలని రాసి ఉందా..? అని కస్తూరిపై ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా వీడియో షేర్ చేయడంతో ఆమెపై కోలీవుడ్‌లో పెద్ద దుమారమే రేగుతుంది. தண்ணியடி, பெண்ணே தண்ணியடி ! எட்டு மறிவினில் ஆணுக்கிங்கே பெண் இளைப்பில்லை காணென்று தண்ணியடி. WhatsApp fwd of the day. As received. Super. அப்ப பெண்கள் உரிமை தொகை சிந்தாம சிதறாம திரும்பிடும் 🫤#dravidamodel pic.twitter.com/7SA889fwpp — Kasturi (@KasthuriShankar) July 13, 2023 (ఇదీ చదవండి: స్టార్ హీరో కుమారుడు తెరంగేట్రం.. ఏకంగా స్టార్ హీరోయిన్ కూతురితోనే!) -
మీరు అలా మాట్లాడుతుంటే సిగ్గేస్తోంది సార్: సీఎం తీరుపై సింగర్ ఫైర్
సింగర్ చిన్మయి పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ఇప్పటికీ పోరాడుతూనే ఉంది. గతంలో మీటూ ఉద్యమంలో పలువురిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. తమిళ పాటల రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలతో ఆమెను కోలీవుడ్ నుంచి నిషేధానికి కుడా గురైంది. అయితే తాజాగా గురువారం వైరముత్తు బర్త్ డే సందర్భంగా సీఎం స్టాలిన్ చేసిన పనికి మరోసారి వార్తల్లో నిలిచింది. ట్విటర్ వేదికగా ముఖ్యమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. (ఇది చదవండి: నాది చాలా చిన్న వయసు.. వారి ఉద్దేశమేంటో గుర్తించలేకపోయా: బుల్లితెర నటి) సింగర్ చిన్మయి చేసిన ట్వీట్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వైరముత్తు బర్త్ డే సందర్భంగా సీఎం స్టాలిన్ వ్యక్తిగతంగా కలిసి.. ఇంటికి వెళ్లి మరీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సింగర్ చిన్మయికి ఆగ్రహం తెప్పించింది. రాజకీయ నాయకులు మహిళల భద్రతల గురించి మాట్లాడితే సిగ్గేస్తోందని ఘాటుగా విమర్శించింది. రాజకీయ నాయకుల అండతోనే వారు మరింత రెచ్చిపోతున్నారని ఆరోపించింది. ట్వీట్లో చిన్మయి రాస్తూ.. 'తమిళనాడు ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంటికి వెళ్లి అతని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపడం. నేను ఒక మహిళగా అతనిపై మీటూ ఉద్యమంలో ఆరోపణలు చేసినందుకు 2018 నుంచి తమిళ ఇండస్ట్రీలో బ్యాన్ విధించారు. రాజకీయ అండతో ఒక రచయిత ఏ స్త్రీపైనా చేయి వేయగలడని ఫిక్స్ అయిపోయాడు. రాజకీయ నాయకులతో అతనికి ఉన్న సాన్నిహిత్యంతో మౌనంగా ఉండమని ఓ మహిళను బెదిరించాడు. అందుకే పద్మ అవార్డులు, సాహిత్య నాటక అకాడమీ, జాతీయ అవార్డులను అందుకున్నాడు. ఈ మనిషికి ఉన్న శక్తి ఇది. నన్ను చాలా మంది మహిళలు ఇంతకు ముందు ఎందుకు మాట్లాడలేదని అడిగారు. తమిళనాడులో రాజకీయ నాయకులు చేసే ప్రసంగాల్లో మహిళల భద్రత కోసం మాట్లాడడం తలుచుకుంటే సిగ్గేస్తోంది. ఎందుకంటే వైరముత్తు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు వారంతా మౌనంగా ఉంటారు. ఈ భూమి అద్భుతమైన సంస్కృతిని కలిగి ఉంది. ప్రతి సంవత్సరం మహిళలను వేధించేవారి పుట్టినరోజు జరుపుకుంటారు. కానీ వీటిపై మాట్లాడిన మహిళలను వేధిస్తారు. మనకు సున్నితత్వం, సానుభూతి, విద్యపైనా అవగాహన మాత్రం శూన్యం. బ్రిజ్ భూషణ్ నుంచి వైరముత్తు వరకు ఎల్లప్పుడు రాజకీయ నాయకులు వీరిని కాపాడతారు. ఈ భూమిలో ప్రాథమికంగా దొరకని న్యాయం కోసం ఎదురుచూడటం బాధాకరమైన విషయం' అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్, వీడియో వైరల్) The Chief Minister of Tamilnadu personally visits the home of a man accused by several women of sexual harassment to wish him on his birthday; I, as a multiple award winning singer and voice over artiste, face a work ban by the Tamil Film Industry since 2018, for naming this poet… https://t.co/8RpQ120swZ — Chinmayi Sripaada (@Chinmayi) July 13, 2023 -
సింగర్ చిన్మయిపై ట్రోల్స్ మొదటిసారి స్పందించిన రాహుల్
ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాదపై ట్రోల్స్ ఆపేయండని ఆమె భర్త నటుడు రాహుల్ వవీంద్రన్ తొలిసారి విజ్ఞప్తి చేశారు. సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చిన్మయి తరుచూ సోషల్ మీడియా ద్వారా మాట్లాడుతుంది. మీటూ ఉద్యమం సమయంలో కోలీవుడ్ సినీ గేయ రచయిత వైరముత్తు వంటి వారి ప్రవర్తనపై ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఆతనిపై చిన్మయి లైంగిక ఆరోపణలు కూడా చేసింది. వైరముత్తుపై చర్యలు తీసుకోవాలని పెద్ద పోరాటమే చేసింది. దీంతో ఆమె కోలీవుడ్ పరిశ్రమ నుంచి కూడా బహిష్కరణ ఎదుర్కొంది. తాజాగా మళ్లీ నెటిజన్లు ఆమెను ట్రోల్స్ చేస్తూ.. రాహుల్ ఖాతాను ట్యాగ్ చేయడంతో ఆయన ఒక నోట్ విడుదుల చేశారు. (ఇదీ చదవండి: అలాంటి సన్నివేశాల్లో నటిస్తే నా భర్తకు ఏం చెప్పాలి : ప్రియమణి) 'చిన్మయిని ఒక సెలబ్రిటీగా చూడకండి. సమాజంలోని సమస్యలపై ఆమె చేసే పోరాటాన్ని చూడండి. ఆమే చేస్తున్న పనిని మెచ్చుకోకపోయిన అర్ధం చేసుకునేందకు ప్రయత్నం చేయండి. ముందుగా ఒక్కసారి ఆమె చెప్పేది వినండి ఏకీభవిస్తారా వ్యతిరేకిస్తారా అనేది మీ ఇష్టం. ఆమె అందరితో ప్రేమగా ఉంటుంది. మీ అభిమానిలా, ఒక అక్కలా ఉంటుంది. ఆమె ప్రేమకు లిమిట్స్ ఉండవు. ఎవరికైన సమస్య వస్తే మరో కోణంలో చూడటం ఉండాలి. అప్పుడే విషయం అర్ధం అవుతుంది.' అని ఆయన నోట్లో తెలిపారు. రాహుల్ పోస్ట్‌పై తన అభిమానులు మద్దతుగా నిలవగా మరికొందరు నెటిజన్లు నెగెటివ్ కామెంట్లు పెట్టారు. (ఇదీ చదవండి: Trolls On Bro Teaser: ఇదేం ట్రోలింగ్ 'బ్రో'.. ఆడుకుంటున్నారుగా!) -
తొలిసారి ట్విన్స్ ఫోటోలు షేర్ చేసిన సింగర్..ఏడాది తర్వాత!
సింగర్ చిన్మయి శ్రీపాద తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చురుక్కుగా ఉంటోంది. ఇటీవల ఎక్కువగా మహిళలు, బాలికలపై జరుగుతున్న దారుణాలను ప్రశ్నిస్తూ వారికి అండగా నిలుస్తోంది. అయితే నటుడు, దర్శకుడైన రాహుల్ రవీంద్రన్‌ను ఆమె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో ఈ జంటకు ట్విన్స్ జన్మించారు. వారిలో ఓ బాబు, పాప ఉన్నారు. కానీ ఇప్పటి వరకు తమ కవలలను బయటికి చూపించలేదు. (ఇది చదవండి: నేను వాటిని పట్టించుకోను.. కాబోయే వాడు మాత్రం ఇలా ఉంటేనే: శోభిత ధూళిపాళ) దాదాపు ఏడాది తర్వాత తన పిల్లల మొహాలను అభిమానులకు పరిచయం చేసింది చిన్మయి. తన పిల్లలతో దిగిన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ వావ్ క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. గతంలో చిన్మయి శ్రీపాద ప్రెగ్నెన్సీపై రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె సరోగసీ ద్వారా పిల్లలకు జన్మినిచ్చారని వార్తలొచ్చాయి. కానీ ఆమె తన బేబీ బంప్ ఫోటోలతో వాటికి చెక్ పెట్టింది. కానీ అదే సమయంలో తన పిల్లల ముఖాలను బహిర్గతం చేయనని కూడా శ్రీపాద చెప్పింది. నా వ్యక్తిగత జీవితం, నా కుటుంబం, నా స్నేహితుల విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటానని తెలిపింది. మా పిల్లల ఫోటోలు షేర్ సోషల్ మీడియాలో షేర్ చేయనని తెలిపింది. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు!) View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
సింగర్ చిన్మయి శ్రీపాద కవలలను చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నారో! (ఫొటోలు)
-
అవి వేసుకోవడం మన కల్చర్ కాదు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి పరిచయం అక్కర్లేదు. సింగర్‌గా మాత్రమే డిబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ రాణించారు. అయితే మహిళల సమస్యలపై ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోరాటం చేస్తూనే ఉన్నారు. ఎలాంటి విషయాన్నైనా ముక్కుసాటిగా మాట్లాడే చిన్మయి.. తాజాగా మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కొందరు యువకులు చేసిన ఇన్‌స్టా వీడియోపై ఆమె స్పందించారు. భారతీయ స్త్రీల వస్త్రధారణపై ఆమె చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. బ్లౌజ్‌లు వేసుకోవడం మన దేశ సంస్కృతి కాదంటూ చిన్మయి తెలిపారు. (ఇది చదవండి: ఎస్పీ బాలు చనిపోయినప్పుడు రోడ్డుపై ఏడ్చుకుంటూ వెళ్లాను: సింగర్) కొందరు మహిళలు కనీసం చున్నీలు కూడా వేసుకోవడం లేదని ఓ యువకుడు ఇన్‌స్టాలో వీడియో షేర్ చేశాడు. దీనికి తనదైన శైలిలో సమాధానమిచ్చారు చిన్మయి. చున్నీలు వేసుకోవాలని చెప్పేవాళ్లు ముందు మన దేశ సంస్క్రృతి ఏంటో తెలుసుకోవాలని హితవు పలికారు. చిన్మయి మాట్లాడుతూ..'రవీంద్రనాథ్ ఠాగూర్ అన్నయ్య సత్యేంద్రనాథ్ ఠాగూర్ భార్య జ్ఞానానందిని దేవి ఆడవాళ్లు వేసుకునే బ్లౌజ్ కల్చర్‌ను తీసుకొచ్చారు. అప్పటివరకు మనదేశంలో అసలు జాకెట్లు వేసుకునేవారు కాదు. మహిళలను చున్నీ వేసుకోమని చెప్పే మగవాళ్లు.. షర్ట్, ప్యాంట్లు వదిలి పంచెలు కట్టుకోండి. జాకెట్ లేకుండా ఉండటం చూసి బ్రిటిషర్లు షాక్ అయ్యారని.. అలా చూడడం వల్ల వారికి కలిగే లైంగిక కోరికల వల్లే భారతీయ మహిళలు జాకెట్లు వేసుకోవడం మొదలుపెట్టారు. మీ అమ్మమ్మలు, నాన్నమ్మలు బ్లౌజ్ వేసుకునేవారు కాదు. బ్లౌజ్ అనేది బ్రిటిష్ కల్చర్. ముందు మన కల్చర్ ఏంటో తెలుసుకోండి.' అంటూ ఘాటుగానే సమాధానమిచ్చారు. (ఇది చదవండి: PS 2లో జూనియర్ ఐశ్వర్యగా నటించిన ఈ చైల్డ్ఆర్టిస్ట్ ఎవరో తెలుసా?) View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
కష్టకాలంలో సమంత నాకు అండగా నిలిచింది : సింగర్ చిన్మయి
సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిన్మయి ఎక్కువగా సమంత నటించిన సినిమాలకు డబ్బింగ్ చెప్పడం ద్వారా పాపులర్ అయ్యింది. తొలి సినిమా ఏ మాయ చేశావే నుంచి సమంతకు-చిన్మయికి మంచి అనుబంధం ఉంది. కష్టకాలంలో ఇద్దరూ ఒకరికొకరు సపోర్ట్‌గా నిలుచున్నారు. ఈ విషయాన్ని స్వయంగా చిన్మయి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు సమంత నాకు అండగా నిలబడింది. ధైర్యాన్నిచ్చింది. మీటూ సమయంలో నేను పని కోల్పోయాను. ఆ సమయంలో సామ్ నాకు పని కల్పించింది. నాకు అన్నిరకాలుగా మద్దతు పలికింది అని పేర్కొంది. కాగా మీటూ ఉద్యమ సమయంలో తమిళనాడు సీనియర్ రచయిత వైరముత్తుపై చిన్మయి లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వివాదంలో కోలీవుడ్ ఇండస్ట్రీ చిన్మయిపై బ్యాన్ విధించింది. మరోవైపు సమంత తన భర్త నాగచైతన్యతో విడిపోయినప్పుడు చిన్మయి ఆమెకు సపోర్ట్‌గా నిలిచింది. విడాకులకు సమంతను టార్గెట్ చేసినప్పుడు చిన్మయి సోషల్ మీడియా వేదికగా సమంతకు మద్దతు పలికింది. ఇక ఇటీవలె సమంత మయోసైటిస్ బారిన పడిన సమయంలో కూడా చిన్మయి, ఆమె భర్త రాహుల్ సమంతకు ఎంతో మనోధైర్యాన్ని ఇచ్చి ఆమెకు అండగా నిలిచారు. -
చాలా కాలం తర్వాత చిన్మయి గురించి ట్వీట్ చేసిన సామ్!
చాలా రోజుల తర్వాత తన స్నేహితురాలు, గాయని చిన్మయి గురించి ట్వీట్ చేశారు స్టార్ హీరోయిన్ సమంత. కాగా వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ ఇటీవల కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే చిన్మయి స్పందించినప్పటికీ సామ్ ఎలాంటి సమాధానం రాలేదు. ఈ నేపథ్యంలో సమంత తాజాగా చిన్మయి గురించి చేసిన ట్వీట్ ఆసక్తిని సంతరించుకుంది. కాగా మయోసైటిస్ బారిన పడిన సామ్ ప్రస్తుతం కోలుకున్నారు. చదవండి: తీవ్ర గాయాల నుంచి కోలుకున్న స్టార్ హీరో దీంతో ఆమె తన బాలీవుడ్ వెబ్ సిరీస్ సీటాడెల్ షూటింగ్‌ను ప్రారంభించారు. తాము తెరకెక్కించనున్న సిరీస్‌లోకి సామ్‌కు స్వాగతం పలుకుతూ హాలీవుడ్ దర్శక ద్వయం రస్సో బ్రదర్స్ ట్వీట్ చేశారు. ఇక దీనిపై చిన్మయి భర్త, నటుడు రాహుల్ స్పందించాడు. ‘సమంత ప్రయాణం ఎలా మొదలైందో నాకు ఇంకా గుర్తుంది. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రస్సో బ్రదర్స్ సామ్‌ను తమ ప్రాజెక్ట్‌లోకి ఆహ్వానించడం చూస్తుంటే గర్వంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశాడు. ఇక అదే ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ చిన్మయి.. ‘సమంత ఒక క్వీన్.. దానికి ఇదే నిదర్శనం’ అని ప్రశంసించింది. చదవండి: నడవలేని స్థితిలో నటుడు విజయకాంత్.. వీల్ చైర్లోనే.. ఇక చిన్మయి ట్వీట్‌పై సామ్ స్పందిస్తూ.. ‘‘నేను కాదు నువ్వే చిన్మయి’’ అని అంటూ కిస్ ఎమోజీని జత చేసింది. దీంతో ట్విటర్ వేదికగా జరిగిన వీరి సంభాషణకు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కాగా ఏమ మాయ చేసావే మూవీ నుంచి చిన్మయి సమంతకు డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వీరిద్దరూ మంచి స్నేహితులయ్యారు. అయితే ‘యూటర్న్’ మూవీ నుంచి సామ్.. తెలుగులో తన పాత్రలకు తానే డబ్బింగ్ చెప్పుకుంటోంది. దాంతో చిన్మయి-సమంతకు మనస్పర్థలు వచ్చాయని, వారి మధ్య మాటలు లేవంటూ ప్రచారం జరిగింది. No you are @Chinmayi 💋 https://t.co/McAvAnedr9 — Samantha (@Samanthaprabhu2) February 1, 2023 -
ఆ నిర్మాతను కలిసిన నటి.. వార్నింగ్ ఇచ్చిన సింగర్ చిన్మయి
సింగర్ చిన్మయి.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. గాయనీగా, నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చిన్మయి ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఆమె సింగర్‌గా కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా మీ టూ ఉద్యమం నేపథ్యంలో చిన్మయి బాగా పాపులర్ అయ్యింది. అప్పట్లో నిర్మాత వైరముత్తుపై ఆమె చేసిన లైంగిక ఆరోపణలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఇక చిన్మయి సోషల్ మీడియా వేదికగా కూడా పలు సామాజీక అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. చదవండి: ఆనందంలో ఐశ్వర్యను హగ్ చేసుకున్న అభిషేక్, ఆకట్టుకుంటున్న వీడియో అంతేకాదు యువతకు, మహిళలు సూచనలు ఇస్తూ వారిలో ధైర్యం నింపుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా చిన్మయి సోషల్ మీడియా వేదికగా ఓ నటిని హెచ్చరించింది. ప్రముఖ తమిళ నిర్మాతను కలిసి ఆమెకు చిన్మయి వార్నింగ్ ఇస్తూ సూచనలు ఇచ్చింది. వివరాలు.. తమిళ నటి, వీజే అర్చనా అర్చన ఓ సినిమా షూటింగ్లో పాల్గొంది. ఆ షూటింగ్ సెట్‌కు వచ్చిన నిర్మాత వైరముత్తును ఆమె కలుసుకుంది. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో తన ఫొటోలపై చిన్మయి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘అది ఇలాగే మొదలవుతుంది. అతనితో చాలా జాగ్రత్తగా ఉండు. వీలైతే అతడికి తగినంత దూరం పాటించు. ముఖ్యంగా ఇలా ఒంటరిగా అసలు కలవకు. నీతో తోడుగా ఎవరైనా ఉండేలా చూసుకో.. జాగ్రత్త’ అంటూ అర్చన పోస్ట్‌కు కామెంట్ చేసింది. దీంతో ఆమె కామెంట్ తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కాగా నటి చిన్మయి శ్రీపాద ప్రముఖ తమిళ పాటల రచయిత వైరముత్తు మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ చిన్మయి సంచలన ఆరోపణలు చేశారు. చదవండి: రామ్ చరణ్‌పై ‘కింగ్ ఖాన్’ షారుక్ ఆసక్తికర వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Archana R (@vj_archana_) -
హీరోయిన్‌పై బహిరంగ కామెంట్స్.. నటుడిపై సీరియస్ అయిన చిన్మయి
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న విషయాలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తుంటుంది. కొన్నిసార్లు పలు అంశాల్లో తనదైనా శైలిలో స్పందించి వివాదాలు కూడా ఎదుర్కొంది. అలా తరచూ వివాదాలు, విమర్శలతో వార్తల్లో నిలిచే చిన్మయి తాజాగా ఓ నటుడిపై ఫైర్ అయ్యింది. పబ్లిక్‌లో ఓ హీరోయిన్ను పాయింట్ అవుట్ చేస్తూ చేసిన అతడి వ్యాఖ్యలను తప్పుబట్టింది. అసలేం జరిగిందంటే.. బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్, నటి దర్శగుప్తా లీడ్ రోల్లో నటిస్తున్న తమిళ చిత్రం ఓ మై ఘోస్ట్. ఇందులో తమిళ నటుడు సతీష్ ఓ కీ రోల్ పోషించాడు. చదవండి: రష్మికపై ఇంత నెగిటివిటీకి కారణం ఇదే! ఆ ఒక్క మాటకే విమర్శల దాడి ఈ మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న క్రమంలో తాజాగా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను చెన్నైలో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు సన్నీలియోన్ సాంప్రదాయంగా చీరకట్టులో రాగా దర్శగుప్తా మోడ్రన్ లెహెంగాలో వచ్చింది. ఇదే అంశంపై ఈవెంట్లో నటుడు సతీశ్ మాట్లాడుతూ నటి దర్శగుప్తాను ఉద్దేశిస్తూ పబ్లిక్‌గా షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ... ‘ఎక్కబో ముంబై నుంచి తమిళనాడుకు వచ్చిన సన్నీలియోన్ పద్ధతిగా చీరకట్టుకుని వచ్చారు. చూడటానికి ఆమె చాలా అందంగా ఉన్నారు. కానీ అటూ చూడండి మన దగ్గరి అమ్మాయి మాత్రం మోడ్రన్ డ్రెస్ వేసుకుని వచ్చింది’ అంటూ దర్శగుప్తాను చూపిస్తూ అన్నాడు. చదవండి: భర్తకు దూరంగా ఉంటున్న నటి స్నేహ! కారణం ఇదేనా? అంతేకాదు తానేమి ఆమెను విమర్శించడం లేదని, జస్ట్ పాయింట్ అవుట్ చేశానంతేనని అనడంతో అక్కడి వచ్చిన వారంత పగలపడి నవ్వారు. ఇక అతడి వ్యాఖ్యలపై చిన్మయి స్పందించింది. మహిళల డ్రస్సింగ్‌పై బహిరంగంగా కామెంట్స్ చేయడాన్ని ఆమె తప్పుపట్టింది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్లో షేర్ చేస్తూ ఆమె ఘాటుగా స్పందించింది. ‘ఒక స్త్రీని లక్ష్యంగా చేసుకుని, ఆమె వేసుకున్న డ్రెస్‌పై విమర్శలు చేయడమేంటి? ఆ మాటలకు జనాలు పగలబడి నవ్వడం ఏంటి? మహిళల డ్రస్‌పై విమర్శలు చేసే ఇలాంటి మగాళ్ల ప్రవర్తన ఇంకెప్పుడు మారుతుందో? ఇదేం అంత సరద విషయం కాదు’ అంటూ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె మాత్రమే నటుడు కామెంట్స్‌పై నెటిజన్లు సైతం మండిపడుతున్నారు. అలా బహిరంగంగా ఓ నటిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదంటూ ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. I mean - To actually *point* at a woman and ask for mass heckling of a crowd by a man on a woman who doesn’t dress according to culture. When will this behaviour from men stop? Its not funny. pic.twitter.com/HIoC0LM8cM — Chinmayi Sripaada (@Chinmayi) November 9, 2022 -
ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పిన సమంత.. ఇకపై తనే స్వయంగా..
నాగ చైతన్యతో విడాకుల తర్వాత నెట్టింట సమంత పేరు వినిపించని రోజంటూ లేదు. ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన అది క్షణాల్లో వైరల్ అవుతుంది. గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సామ్.. ఇటీవల మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. మళ్లీ తన పంథాను కొనసాగిస్తూ..అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఇదిలా ఉంటే సామ్‌కి సంబంధించిన ఓవార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. (చదవండి: బాహుబలి ఆఫర్‌ని వదులుకున్నందుకు గర్వపడుతున్న: మంచు లక్ష్మీ) సామ్ తాజాగా తన ఫ్రెండ్‌కి బ్రేకప్ చెప్పిందట. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి. సామ్‌కు చిన్మయి చాలా క్లోజ్ ఫ్రెండ్. కెరీర్ స్టార్టింగ్ నుంచి సమంత పాత్రకు చిన్మయియే డబ్బింగ్ చెబుతూ వచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ తాజాగా వీరిద్దరి మధ్య స్నేహం చెడిందట. మనస్పర్థలు రావడంతో చిన్మయిని సామ్ పక్కకు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సామ్ పాన్ ఇండియా మూవీ యశోదకు చిన్మయి డబ్బింగ్ కూడా చెప్పలేదు. చిన్మయిని దూరం పెట్టి స్వయంగా సమంతనే డబ్బింగ్ చెప్పుకుందట. ఇకపై ప్రతి సినిమాకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవాలని నిర్ణయించుకుందట. మరి ఈ వార్తల్లో నిజమెంత అనేది.. సామ్ కానీ చిన్మయి కానీ స్పందిస్తేనే తెలుస్తుంది. -
చిన్మయి త్రిపాఠి.. ఈమె కవిత్వం పాడుతుంది! రాక్ బ్యాండ్ ద్వారా...
తిలక్‌ని, కృష్ణశాస్త్రిని, శ్రీశ్రీని, జాషువాని పాడుతూ ఒక రాక్‌బ్యాండ్ ఉంటే ఎలా ఉంటుంది? తెలుగులో అలాంటిది లేదు. కాని చిన్మయి త్రిపాఠికి కవిత్వం అంటే ఇష్టం. కబీర్‌ని, తులసీదాస్‌ని, ఆధునిక హిందీ కవులను ఆమె తన రాక్ బ్యాండ్ ద్వారా పాడుతూ దేశమంతా తిరుగుతూ ఉంటుంది. ‘మ్యూజిక్ అండ్ పొయెట్రీ స్టుడియో’ పేరుతో చేస్తున్న ఈ కృషి చిన్మయిని ప్రత్యేకంగా నిలబెట్టింది. స్టేజ్ మీద ఇద్దరు ముగ్గురు వాద్యకారులు తప్ప ఎక్కువ మంది ఉండరు. చిన్మయి త్రిపాఠి తన భుజానికి ‘దోతార’ అనే సంప్రదాయ తీగ వాయిద్యాన్ని తగిలించుకుని పాడటం మొదలెడుతుంది. పాటంటే పాట కాదు. కవిత్వం. ఉదాహరణకు ప్రఖ్యాత హిందీ కవి వినోద్ కుమార్ శుక్లా రాసిన ‘మా ఇంటికి రాని అతిథుల కోసం’ అనే కవితను పాడుతుంది. ‘మా ఇంటికి కొందరు అతిథులు ఎప్పటికీ రారు. కొండలు, నదులు, రంగు రంగు చెట్లు, విరగపండిన పొలాలు ఇవి ఎప్పటికీ రావు. నేనే ఆ పొలాల వంటి మనుషులను కలవడానికి వెళతాను. నదుల వంటి మనుషుల్ని, కొండల వంటి, కొండ కొసల వంటి, చెట్లతో నిండిన అడవుల వంటి మనుషులను కలవడానికి వెళతాను. ఇదేదో నేను తీరుబడి చూసుకొని చేసే పని కాదు. చాలా అత్యవసరమైన పని అన్నట్టుగా వెళ్లి కలుస్తాను. మా ఇంటికి ఎప్పటికీ రాని అతిథుల కోసం నేనే బయలుదేరుతాను’ ఈ కవిత ఆమె పాడుతుంటే అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఆమె సుశీల్ శుక్లా అనే కవి రాసిన ‘వృక్షమా... నీవొక దర్జీవి’ అనే కవితను పాడుతుంది. ‘ఎన్ని గూళ్లను అల్లి ఉంటావు. ఎన్ని గాలులను కుట్టి ఉంచాము. ఎన్ని నీడలను ముక్కలు ముక్కలు చేసి కింద పరిచి ఉంటావు... ఓ వృక్షమా... నీవొక దర్జీవి’ అనే కవితను చాలా అందంగా పాడుతుంది. చిన్మయి త్రిపాఠిని చూస్తుంటే ఇలాంటి గాయని తెలుగులో గొప్ప గొప్ప కవిత్వాన్ని పాడేలా ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది. ఢిల్లీకి చెందిన చిన్మయి త్రిపాఠి ‘మ్యూజిక్ అండ్ పొయెట్రీ స్టుడియో’ స్థాపించి గాయకుడు, జీవన సహచరుడు అయిన జోయెల్ ముఖర్జీతో కలిసి హిందీ కవిత్వాన్ని దేశమంతా పాడుతోంది. నేను ఇందుకు పుట్టలేదు అనిపించింది ‘మాది ఢిల్లీ. చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకున్నాను. కాని అందరిలా చదువులో కొట్టుకుపోయాను. ఎం.బి.ఏ చేసి ఉద్యోగం మొదలెట్టాక నేను ఇందుకు పుట్టలేదు అనిపించింది. ‘స్పైస్ రూట్’ అనే ర్యాక్ బ్యాండ్ మొదలెట్టాను. కాని అది ఎక్కువ రోజులు నడవలేదు. ఒకరోజు స్నేహితులతో మాట్లాడుతుంటే ఇవాళ్టి పాటల్లో సరైన కవిత్వమే ఉండటం లేదన్న చర్చ వచ్చింది. హిందీలో భారతీయ సాహిత్యంలో ఎంతో గొప్ప కవిత్వం ఉంది. దానిని మళ్లీ ఈ తరానికి వినిపిస్తే ఎలా ఉంటుంది... అనిపించింది. ఈ విషయాన్ని నేనో క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌తో షేర్ చేసుకున్నాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. వెంటనే రంగంలో దిగాను’ అంటుంది చిన్మయి త్రిపాఠి. చిన్మయి కూడా కవిత్వం రాస్తుంది. చాలా కవిత్వం చదువుతుంది. కనుక ఆ కవిత్వం మీద ప్రేమతో పాడటం వల్ల వెంటనే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. కబీర్ దాస్‌తో మొదలెట్టి హిందీలో ఆధునిక కవులు– హరివంశ్రాయ్ బచ్చన్, మహదేవి వర్మ, నిరాలా, ధర్మ్వీర్ భారతి... వీరందరి కవిత్వాన్ని తనే ట్యూన్ కట్టి పాడుతుంది. చిన్మయి గొంతు చాలా భావాత్మకంగా ఉంటుంది. అందుకని కవిత్వంలో ఉండే ఎక్స్ప్రెషన్ బాగా పలుకుతుంది. ‘మన దేశంలో ఉర్దూలో చాలా మంచి కవిత్వం వచ్చి మరుగున పడిపోయింది. ఇప్పుడు దానిని వెతికి తీసే ప్రయత్నంలో ఉన్నాను’ అంటుంది చిన్మయి. ముంబైలో ఉంటూ తన బ్యాండ్‌తో తిరిగే చిన్మయి లండన్‌లో ప్రదర్శన ఇచ్చినప్పుడు అక్కడి ఇంగ్లిష్ ప్రేక్షకులకు హిందీ తెలియకపోయినా ఆ శబ్దాలకు తన్మయులయ్యారని చెబుతుంది చిన్మయి. తన ప్రదర్శనల్లో కశ్మీరీ, బెంగాలీ కవిత్వం కూడా పాడుతోంది చిన్మయి. ‘త్వరలో నేను భగవద్గీతను ఆధునిక సంగీత పరికరాలతో పాడాలని నిశ్చయించుకున్నాను. అదీ ఒక గొప్ప కవిత్వమే కదా’ అంటుంది చిన్మయి. మనకు ఘంటసాల పాడిన భగవద్గీత తెలుసు. ఆధునిక లయతో చిన్మయి ఎలా పాడుతుందో చూడాలి. చదవండి: గూగుల్‌ను వీడి.. పర్యావరణ పరిరక్షణ కోసం! నెదర్లాండ్స్ అమ్మాయి.. వ్యాన్నే ఇల్లుగా చేసుకుని! మన దేశమంతా చుట్టేస్తూ! View this post on Instagram A post shared by Chinmayi (@chinmayitripathi) -
వైరముత్తుకు భారీ షాక్.. ఓఎన్వీ అవార్డు వెనక్కి?
చెన్నై: సినీ గీత రచయిత వైరముత్తు తీవ్ర భంగపాటుకు గురి కాబోతున్నారని తెలుస్తోంది. ఆయనకు ఓఎన్వీ జాతీయ సాహితీ అవార్డును అందజేయనున్నట్టు ఆ అకాడమీ నిర్వాహకులు ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇంతకు ముందు తమిళంలో పూ, మరియాన్ తదితర చిత్రాల్లో కథానాయికగా నటించిన మలయాళ నటి పార్వతి ఓఎన్వీ గురుప్ అవార్డులు వైరముత్తుకు ప్రకటించడాన్ని తీవ్రంగా విమర్శించారు. గొప్ప కవి, సినీ గీత రచయిత ఓఎన్వీ పేరుతో నెలకొల్పిన అవార్డును లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న వైరముత్తుకు ప్రకటించడం ఆయన్ని అగౌరవపరచడమేనని పేర్కొన్నారు. ఇక సంచలన గాయని చిన్మయి కూడా చాలాసార్లు వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఆమె కూడా వైరముత్తుకు ఓఎన్వీ అవార్డు ప్రకటించడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో అవార్డు ప్రదానం చేసే విషయాన్ని పునర్ పరిశీలించనున్నట్లు ఓఎన్వీ కల్చరల్ అకాడమీ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. చదవండి : అవార్డు పొందడం సంతోషంగా ఉంది : వైరముత్తు వైరముత్తుకి పురస్కారం.. హీరోయిన్ల ఆగ్రహం -
లైంగిక ఆరోపణలేగా!.. మేమూ తగ్గం
చెన్నై: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ గేయ రచయిత వైరముత్తుకు వ్యతిరేకంగా మరోసారి గళం వినిపిస్తోంది. కేరళ ఒఎన్వీ గురువ్ జాతీయ పురస్కారాన్ని వైరముత్తుకు అందించడంపై పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ ఆ పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. గతంలో వైరముత్తుపై ఆరోపణలు చేసిన సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయితో పాటు మాలీవుడ్ హీరోయిన్లు కొందరు ఈ క్యాంపెయిన్‌లో పాల్గొంటున్నారు. కాగా, 2018 మీటూ ఉద్యమ సమయంలో గేయరచయిత వైరముత్తుపైనా చిన్మయితోపాటు మరో పదహారు మంది తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆ ఆరోపణలపై ఎటూ తేలకముందే.. ఓఎన్వీ అవార్డు ఇవ్వడం ఇప్పుడు మారం రేపుతోంది. మలయాళ నటి పార్వతి తిరువొతు, గీతూ మోహన్‌దాస్, రీమా కళింగల్ తో పాటు చిన్మయి కూడా గొంతు కలిపింది. అర్హతలేని ఆ వ్యక్తి నుంచి పురస్కారాన్ని వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. అది జరగదు ఈ విమర్శలపై ఒఎన్వీ కల్చరల్ అకాడమీ ప్రెసిడెంట్ అదూర్ గోపాలకృష్ణన్ స్పందించారు. ఈ పురస్కారం ప్రతిభ ఆధారంగా ఇచ్చిందే తప్ప.. క్యారెక్టర్ చూసి కాదని అన్నారు. వైరముత్తు మంచి గేయ రచయిత. అయినా ఆయనపై ఉన్నవి కేవలం ఆరోపణలు మాత్రమే. ఈరోజుల్లో ఎవరు.. ఎవరిపైన అయినా ఆరోపణలు చేయొచ్చు. జ్యూరీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు అని గోపాలకృష్ణన్ స్పష్టం చేశారు. ఈ తరుణంలో తాము పోరాటాన్ని ఆపబోమని హీరోయిన్లు స్పష్టం చేశారు. నాన్-మలయాళీ మలయాళంలో దివంగత ప్రఖ్యాత కవి, సినీ గీత రచయిత ఓఎన్వీ గురుప్ పేరుతో 2017లో జాతీయ సాహితీ అవార్డులు ఏర్పాటు చేశారు. దీన్ని మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ కవులు, గీత రచయితలకే ప్రదానం చేస్తున్నారు. ఈ ఏడాది తమిళ ప్రఖ్యాత గీత రచయిత వైరముత్తుకు ప్రకటించారు. ఈ అవార్డును రాష్ట్రేతర ప్రముఖులకు ప్రకటించడం ఇదే ప్రథమం. ఇక ఓఎన్వీ గురుప్ జాతీయ సాహితీ అవార్డు అందుకున్న వైరముత్తును తమిళనాడు సీఎం స్టాలిన్ అభినందించారు కూడా. -
ఇంకా విమర్శలు చేస్తే చిన్మయిపై పిటిషన్ వేస్తా
చెన్నై, పెరంబూరు: గాయనీ, డబ్బింగ్ కళాకారిణి చిన్మయిపై కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని సీనియర్ నటుడు, సౌత్ ఇండియన్ డబ్బింగ్ కళాకారుల యూనియన్ అధ్యక్షుడు రాధార చెప్పారు. ఈయనపై గాయనీ చిన్మయి మీటూ ఆరోపణలు చేయడంతో ఆమెను డబ్బింగ్ కళాకారుల యూనియన్ నుంచి తొలగించారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఆమెకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది. కాగా ఈ యూనియన్‌కు గత 15 తేదీన ఎన్నికలు జరిగాయి. నటుడు రాధారవి మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయగా, ఆయనకు వ్యతిరేకంగా చిన్మయి నామినేషన్‌ను వేసింది. అయితే ఆమె నామినేషన్‌ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. అది చట్టబద్దంగా లేదని పేర్కొన్నారు. దీంతో రాధారవి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. దీనిపై ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. డబ్బింగ్ కళాకారుల యూనియన్ సంక్షేమానికి పలు పథకాలును రచించినట్లు రాధారవి తెలిపారు. కాగా చిన్మయి వ్యవహారం గురించి మాట్లాడుతూ ఆమె తమపై ఆరోపణలు చేస్తున్నారని, ప్రచార ప్రియురాలిగా మారినట్లు విమర్శించారు. ఇంకా తమపై విమర్శలు చేస్తే చిన్మయిపై కోర్టులో పిటిషన్ వేస్తామని చెప్పారు. -
చిన్మయి వర్సెస్ రాధా రవి
‘మీటూ’ ఉద్యమం మన దేశంలోనూ ఊపందుకున్నప్పుడు సౌత్ ఇండస్ట్రీల్లో ఎక్కువగా వినిపించిన పేరు చిన్మయి. గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చిన్మయి పాపులర్. సాధారణంగా సినిమాల్లో హీరోయిన్లకు గొంతుగా ఉండే చిన్మయి, ఈ ఉద్యమంలో ఎందరో బాధితులకు గొంతుగా నిలిచారు. ధైర్యంగా నిలబడ్డారు. ‘మీటూ’ ఉద్యమంలో ఆమె ఎదుర్కొన్న లైంగిక వేధింపులను నిర్భయంగా బయటకు చెప్పడమే కాకుండా దాని వెనుక ఉన్నది ప్రముఖ గేయ రచయిత వైరముత్తు అని ఆయన పేరుని బయటపెట్టారు. తమిళ పరిశ్రమలో అది సంచలనం సృష్టించింది. ఆ తర్వాత తన ట్వీటర్ వేదికగా వైరముత్తు, నటుడు, నిర్మాత రాధారవిపై ఆరోపణలు చేసిన స్త్రీల వివరాలను గోప్యంగా ఉంచి వాళ్ల చేదు సంఘటనలు షేర్ చేస్తూ ఉన్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే చిన్మయి డబ్బింగ్ యూనియన్ సభ్యత్వం రద్దయింది. సభ్యత్వం కొనసాగించకపోవడానికి వార్షికరుసుము చెల్లించకపోవడమే కారణం అని, అందుకే సభ్యత్వాన్ని రద్దు చేశామని యూనియన్ పేర్కొంది. అప్పుడు డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ పదవిలో రాధారవి ఉన్నారు. సభ్యత్వం రద్దు విషయమై చిన్మయి కోర్టుని ఆశ్రయించగా, కోర్టు చిన్మయి వాదనకు అనువుగా ఇంటర్న్ ఆర్డర్ (ఈ కేసు పరిశీలనలో ఉన్నంత కాలం ఆమె డబ్బింగ్ యూనియన్ సభ్యురాలిగానే పరిగణించాలి) మంజూరు చేసింది. ఆ తర్వాత తమిళంలో చిన్మయి డబ్బింగ్ కెరీర్ మందకొడిగా సాగుతోంది. తాజాగా ఈ నెల డబ్బింగ్ యూనియన్ ఎన్నికలు జరగనున్నాయనే ప్రకటన విడుదలైంది. మరోసారి ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయడానికి రెడీ అయ్యారు రాధారవి. ఆయనకు ప్రత్యర్థిగా, రామరాజ్యం పార్టీ తరపున ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేశారు చిన్మయి. విశేషం ఏంటంటే సభ్యత్వం రద్దు చేసినప్పుడే డబ్బింగ్ యూనియన్ ఓటర్ల జాబితాలో నుంచి చిన్మయి పేరును తొలగించారు. ‘సభ్యులు కానివారు ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తారు?’ అని ఒక వర్గం వారు చిన్మయిని విమర్శించారు. ‘‘కోర్టు మంజూరు చేసిన ఆర్డర్లో ఎన్నికల్లో పోటీ చేసే హక్కు నాకుంది’’ అని పేర్కొన్నారు చిన్మయి. ప్రస్తుతం చిన్మయి నామినేషన్ పత్రాలు పరిశీలనలో ఉన్నాయి. ఫిబ్రవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. మరి ఎలాంటి నాటకీయత చోటు చేసుకుంటుంది? చిన్మయి వర్సెస్ రాధారవి.. గెలుపు ఎవరిది? అని తమిళ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తోంది. -
వాళ్లను చూస్తుంటే భయమేస్తోంది: చిన్మయి
సాక్షి, చెన్నై: సీనియర్ సినీ పాటల రచయిత వైరముత్తుపై సంచలన గాయనీ, డబ్బింగ్ కళాకారిణి చిన్మయి మరోసారి ఫైర్ అయ్యారు. అంతేకాకుండా ప్రముఖనటుడు, మక్కళ్ నీదిమయ్యం పార్టీ అద్యక్షుడు కమలహాసన్పై కూడా ఆమె పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. చిన్మయి గతంలో కూడా వైరముత్తుపై మీటూ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆమె ఆరోపణలు సినీ పరిశ్రమలో పెద్ద సంచలనాలనే సృష్టించాయి. ఫలితంగా తనూ నష్టపోయారు. దీంతో సయయం వచ్చినప్పుడల్లా చిన్మయి వైరముత్తును టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తాజాగా కమల్ పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యాలయంలో దివంగత దర్శకుడు కే.బాలచందర్ శిలావిగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రజనీకాంత్‌తో పాటు వైరముత్తు పాల్గొన్నారు. దీంతో గాయనీ చిన్మయి వైరముత్తుపై మరోసారి విరుచుకుపడ్డారు. ‘అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటున్న ఆయన జీవితం నశించిపోతుంది. ఇక బయట ప్రపంచంలో తలెత్తుకుని తిరగలేరు. ఇలాంటి వారిని కార్యక్రమాలకు అతిధులుగా ఎలా ఆహ్వానిస్తారు?అని ఆరోపించారు. మీటూ ఆరోపణలను ఎదుర్కొంటున్న వైరముత్తు ఈ ఏడాది పలు కార్యక్రమాల్లో, రాజకీయ కార్యక్రమాల్లోనూ అతిధిగా పాల్గొన్నారు. ఆయనకు జరిగిన నష్టం ఏమీలేదు అయితే బాధింపుకు గురైన నేను మాత్రం నిషేధానికి గురైయ్యాను. ఇదే సినీరంగంలో పెద్దల ద్వారా నాకు లభించిన న్యాయం. అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటున్నవారు బహిరంగ వేదికలపై తమ ఇమేజ్ను ఎలా కాపాడుకోవాలన్నది బాగానే తెలుసుకున్నారు. అలాంటి వారిలో కొందరు రాజకీయనాయకులూ ఉన్నారు. వారిని చూస్తుంటే భయం కలుగుతోంది’ అని చిన్మయి చేసిన ట్వీట్ ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాఫిక్‌గా మారింది. -
మీటూపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు!
తమిళనాడు, పెరంబూరు: మీటూపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని గాయని, డబ్బింగ్ కళాశారిని చిన్మయి ఆరోపించారు. సోమవారం నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈమె తాము మోదీ పేరును ప్రస్తావించడానికి పోలీసు అధికారులు అనుమతించలేదన్నారు. లలిత మోదీ గురించి పాడతామన్నా అంగీకరించలేదని తెలిపారు. అలాంటిది మీటూ వ్యవహారం గురించి చట్టంలో మార్పులు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి, ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి బదులు రాలేదన్నారు. దీంతో చట్టం నిరుపయోగంగా ఉన్న స్థితిలో మనం ఉన్నట్టు భావించాల్సి వస్తోందని చిన్మయి అన్నారు. తనను డబ్బింగ్ కళాకారుల యూనియన్ నుంచి తొలగించిన వ్యవహారంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని చిన్మయి పేర్కొన్నారు. -
మరో షాకిచ్చిన చిన్మయి
నటుడు రాధారవితో తాడో పేడో తేల్చుకోవడానికి గాయని చిన్మయి సిద్ధం అయినట్టున్నారు. రాధారవి, ప్రముఖ సీనియర్ నటుడు, దక్షిణ భారత బుల్లితెర, సినీ డబ్బింగ్ కళాకారుల సంఘం అధ్యక్షుడు అన్న విషయం తెలిసిందే. ఇక గాయని చిన్మయి డబ్బింగ్ కళాకారుల సంఘంలో సభ్యురాలు కూడా. ఆమె నటి త్రిష వంటి ప్రముఖ నటీమణులకు గొంతును అరువిస్తుంటారు. అయితే ఇటీవల రాధారవికి చిన్మయికి మధ్య బహిరంగ యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే కోలీవుడ్‌లో మీటూకు ప్రాబల్యం తీసుకొచ్చింది చిన్మయినే అని చెప్పవచ్చు. ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై లైంగిక వేధింపుల ఆరోపణలు గుప్పించి సంచలనం పుట్టించిన చిన్మయి నటుడు రాధారవిని వదలలేదు. దీంతో చిన్మయి ఆరోపణల్లో నిజం లేదంటూ కొట్టిపారేసిన రాధారవి అంతటితో ఊరుకోకుండా, ఆమెను డబ్బింగ్ కళాకారుల సంఘం నుంచి తొలగించారు. అందుకు చిన్మయి రెండేళ్లుగా సంఘ వార్షిక సభ్యత్వ రుసుంను చెల్లించలేదన్నది సాకుగా చూపారు. అందుకు చిన్మయి ఘాటుగానే స్పందించారు. మీటూ ఆరోపణ కారణంగానే రాధారవి తనను సంఘం నుంచి తొలగించారని, అయినా తన సభ్యత్వాన్ని రద్దు చేయడం ఆయనకు సాధ్యం కాదని, తాను శాశ్వత సభ్యురాలినని పేర్కొన్నారు. తాజాగా రాధారవికి మరో షాక్ ఇచ్చారు. రాధారవికి మలేషియా ప్రభుత్వం డటోక్ అనే ఆ దేశ ప్రతిష్టాత్మకమైన బిరుదుతో సత్కరించిందట. దీంతో ఆయన పేరు ముందు డటోక్ అపే బిరుదును తగిలించుకున్నారు. ఈ బిరుదు వెనుక గుట్టును గాయని చిన్మయి బయట పెట్టారు. ఈ బిరుదుపై మలేషియా ప్రభుత్వానికి చిన్మయి లేఖ రాసి నిజానిజాలు తెలిపాల్సిందిగా కోరారు. చిన్మయి లేఖకు స్పందించిన ఆ దేశ ప్రభుత్వం రాధారవికి తమ ప్రభుత్వం డటోక్ బిరుదును అందించిన దాఖలాలు లేవని, అసలు భారతదేశానికి సంబంధించి ఒక్క నటుడు షారూక్‌ఖాన్‌కు మినహా మరెవరికీ ఆ బిరుదును అందించలేదనిపేర్కొంది. ఈ విషయాన్ని గాయని చిన్మయి శనివారం తన ట్విట్టర్లో పోస్ట్‌చేసి రాధారవి డటోక్ పట్టం నకిలీ అని పేర్కొన్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మరి దీనికి రాధారవి స్పందన ఎలా ఉంటుందో? -
తమిళంలో చిన్మయి గొంతు వినిపించదు
‘మీటూ’ ఉద్యమం గురించి సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి నిర్భయంగా మాట్లాడిన సంగతి గుర్తుండే ఉంటుంది. తన ట్వీటర్ ఖాతా ద్వారా చాలా మంది అజ్ఞాత స్త్రీల ఆరోపణలకు గొంతునిచ్చారు. ప్రముఖ పాటల రచయిత వైరముత్తు, నటుడు రాధారవి మీద ఆరోపణలు చేశారు. వీటివల్ల మీకు అవకాశాలేమైనా తగ్గుతాయనుకుంటున్నారా? అని ఆ మధ్య ‘సాక్షి’ అడిగినప్పుడు ‘అలాంటిదేం లేదు. ఏం జరిగినా ధైర్యంగా ఎదుర్కొంటా’’ అని చిన్మయి అన్నారు. మరి.. తాజా పరిణామాన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి. విషయం ఏంటంటే.. చిన్మయిని డబ్బింగ్ అసోసియేషన్ నుంచి తొలగించారు. ‘‘నన్ను డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించారు. అంటే.. ఇక తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పలేను. రెండు సంవత్సరాలుగా నేను యూనియన్ ఫీజŒ కట్టలేదన్నదాన్ని కారణంగా చూపించారు. కానీ, ఇన్ని రోజులు డబ్బింగ్ చెప్పడం వల్ల నాకొచ్చిన ఆదాయంలో 10శాతం తీసుకున్నారు. పాత బకాయిలున్నట్టు మెసేజ్ కానీ, లెటర్ కానీ పంపకుండా నా మెంబర్షిప్ తొలగించారు. మళ్లీ తమిళ సినిమాలకు డబ్ చేస్తానో లేదో తెలియదు’’ అని చిన్మయి ట్వీట్ చేశారు. విశేషం ఏంటంటే.. డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్‌కు రాధారవి ప్రెసిడెంట్. -
యూట్యూబ్‌లో చిన్మయి సంచలనం
తమిళనాడు, పెరంబూరు: గాయని చిన్మయి యూట్యూబ్‌లో ట్రెండీగా మారారు. చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల ఆరోపణలు చాలాకాలంగా వస్తున్నా, గాయనీ చిన్మయి గీత రచయిత వైరముత్తుపై చేసిన వేధింపుల ఆరోపణలు తరువాత మీటూ బహుళ ప్రాచుర్యం పొందిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈమె ఆరోపణలు చిత్ర పరిశ్రమలో పెద్ద కలకలానికే దారి తీశాయి. ఇలాంటి పరిస్థితుల్లో దినతంది అనే ప్రముఖ తమిళ దిన పత్రిక గాయని చిన్మయిని ఇంటర్వ్యూ చేసింది. ఆ భేటీని యూట్యూబ్‌లో పొందుపరచారు. దీన్ని 24 గంటల్లో 15 లక్షల మంది యూట్యూబ్ ప్రేక్షకులు తిలకించారు. ఇలా ఒక సెలబ్రిటీ భేటీని అంత మంది వీక్షించడం రికార్డుగా నమోదైంది.ఆమె భేటీ అలా 24 గంటల పాటు మూడవ స్థానంలో నిలిచింది. నటుడు కమలహాసన్ భేటీని 24 గంటల్లో 10 లక్షలకు పైగా ప్రజలు వీక్షించారు. అదే విధంగా ప్రధాని నరేంద్రమోది, సీమాన్, నటుడు శివకార్తికేయన్, దీపతో ఆ పత్రిక జరిపిన ప్రశ్నోత్తరాల కార్యక్రమాలను పెద్దసంఖ్యలో తిలకించారనే కథనాన్ని ఒక సాయంకాల పత్రిక పేర్కొంది. -
షాక్ అయ్యా!
‘మీటూ’ ఉద్యమంలో భాగంగా పలువురు ప్రముఖులపై వస్తున్న ఆరోపణలు చాలామందికి షాకింగ్‌గా ఉన్నాయి. ముఖ్యంగా ప్రముఖ రచయిత వైరముత్తు గురించి గాయని చిన్మయి పోస్ట్ చేసిన ఆరోపణలు చాలామందిని ఆశ్చర్యానికి గురి చేశాయి. కాస్టింగ్ కౌచ్ నటీమణులకే కాదు.. సింగింగ్ విభాగంలోనూ ఎక్కువే అని ఈ ఆరోపణలు స్పష్టం చేశాయి. ఈ ‘మీటూ’ ఉద్యమంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ట్వీటర్ వేదికగా స్పందించారు. ‘‘మీటూ’ ఉద్యమాన్ని గమనిస్తూనే ఉన్నాను. ఇందులో వచ్చిన కొందరి బాధితులు, నిందితుల పేర్లు విని షాక్ అయ్యాను. మహిళలను గౌరవిస్తూ, వాళ్లు ఏ సమస్యలు లేకుండా ఇండస్ట్రీ ఉండాలని కోరుకునే వ్యక్తిని నేను. ప్రతిభను నిరూపించుకోవడమే కాకుండా, మెరుగుపరుచుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ సురక్షితమైన వాతావరాణాన్ని కల్పించాలని నేను, నా బృందం మరింత ధృడంగా నిర్ణయించుకున్నాం. బాధితులు తమ గొంతును స్వేచ్ఛగా వినిపించడానికి సోషల్ మీడియా మంచి వేదికగా మారింది. కానీ ఇంటర్నెట్ జడ్జ్మెంట్ సిస్టమ్‌లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొందరు దీన్ని దుర్వినియోగం చేసే ఆస్కారం ఉంది’’ అన్నారు రెహమాన్. -
యాసిడ్ దాడి చేస్తామని బెదిరిస్తున్నారు
‘‘ప్రశ్నలతో నన్ను వేధిస్తున్నారు’’ అని గాయని చిన్మయి వాపోయారు. ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై కొందరు స్త్రీలు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలను చిన్మయి ట్వీటర్ ద్వారా బయటపెట్టిన విషయం తెలిసిందే. చిన్మయి శనివారం చెన్నై పత్రికా సంఘం కార్యాలయంలో తమిళనాడు సినీ పరిశ్రమ పరిరక్షణ సమాఖ్య తరఫున ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – ‘‘లైంగిక వేధింపుల గురించి 2013లో నేను ట్వీటర్లో పేర్కొన్నప్పుడు బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు కూడా నాపై యాసిడ్ పోస్తామంటూ హత్యా బెదిరింపులు వస్తున్నాయి. అదే విధంగా గత వారం రోజులుగా ప్రశ్నలతో నన్ను వేధిస్తున్నారు. ఎప్పుడో జరిగిన సంఘటనను అప్పుడే బయటపెట్టకుండా ఇప్పుడెందుకు చెబుతున్నావని ప్రశ్నిస్తున్నారు. లైంగిక వేధింపుల వ్యవహారం పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టించి ఉండవచ్చు. అయితే మహిళల గొంతులు నొక్కే ప్రయత్నాలు కూడా ఆదే స్థాయిలో జరుగుతున్నాయి. వైరముత్తుపై కేసు వేస్తాను. అందుకు ఆధారాలను రెడీ చేసుకుంటున్నా. సాధారణంగా ఇలాంటి లైంగిక వేధింపుల గురించి తల్లిదండ్రులకు గాని, పోలీసులకు గాని చెబితే వాటిని నొక్కేసి, ఇంట్లో కూర్చోబెడతారు. మహిళల విషయంలో నాటి నుంచి జరుగుతున్నది ఇదే. మహిళా రక్షణకే మీటూ ఉద్యమం’’ అన్నారు. ఈ సమావేశంలో నటి, దర్శకురాలు లక్ష్మీరామకృష్ణన్, లీనా మణిమేఘల, శ్రీరంజని తదితరులు పాల్గొన్నారు. బెదిరిస్తున్నారు కోలీవుడ్‌లో ‘మీటూ’ కలకలం రేపుతోంది. ఆరోపణలు, బెదిరింపులతో దద్దరిల్లుతోంది. నటుడు జాన్ విజయ్, సంగీత విద్వాంసుడు ఉమాశంకర్పైన బుల్లితెర యాంకర్ శ్రీరంజని లైంగిక వేధింపుల ఆరోపణలు చేశాను. ఒక ఇంటర్వ్యూ సందర్భంలో నటుడు జాన్ విజయ్ను కలిశాననీ, ఆ తరువాత ఒక రోజు అర్ధరాత్రి ఆయన తనకు ఫోన్ చేసి అభ్యంతరకరంగా మాట్లాడారని ఆరోపించారు. దీని గురించి తెలిసి జాన్ విజయ్ భార్య తనకు ఫోన్ చేసి క్షమాపణ చెప్పారని శ్రీరంజని పేర్కొన్నారు. జాన్ విజయ్ మాట్లాడుతూ – ‘‘మురుగు కాలువలో రాయి వేస్తే అది తిరిగి మనపైనే పడుతుంది. కాబట్టి ఆ విషయం గురించి మాట్లాడటం వృథా’’ అన్నారు. కాగా సంగీత విద్వాంసుడు ఉమాశంకర్ తన గురించి చేసిన పోస్ట్‌ను తొలగించాలని బెదిరిస్తున్నారని శ్రీరంజని పేర్కొన్నారు. -
వైరముత్తు మంచోడేం కాదు: మరో గాయని
గీత రచయిత వైరముత్తు అంత సచ్చీలుడేంకాదు అంటూ ఆయనకు వ్యతిరేకంగా మరో మహిళ గొంతు విప్పింది. లైంగిక వేధింపులపై మీటూ అంటూ సామాజిక మాధ్యమం ద్వారా పలువురు గొంతు విప్పుతున్నారు. మీటూ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. మీటూతో ఒక కేంద్రమంతినే పదవి కోల్పాయారంటే ఆ ప్రభావం ఎంతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక కోలీవుడ్‌లో ప్రముఖ గీత రచయిత వైరముత్తుపై గాయని చిన్మయి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలాన్నే రేపుతున్నాయి. వైరముత్తులోని మరో కోణం గురించి బాధిత మహిళలు గొంతు విప్పుతున్నారు. చిన్మయి తరువాత అమెరికాకు చెందిన ఇద్దరు మహిళలు వైరముత్తు వేధింపుల బాధితులమేనని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా దివంగత ప్రఖ్యాత గాయకుడు, నటుడు మలేషియా వాసుదేవన్ కోడలు, గాయని హేమమాలిని వైరముత్తు గురించి మాట్లాడుతూ ఆయనేమంత సచ్చీలుడు కాదని పేర్కొంది. ఈమె తన ఫేస్బుక్లో గాయని చిన్మయికి మద్దతుగా నిలిచింది. హేమమాలిని పేర్కొంటూ తమిళ సినీ పరిశ్రమ గాయని చిన్మయికి మద్దతుగా ఎందుకు నిలబడడం లేదో తనకు అర్ధం కావడం లేదన్నారు. వైరముత్తు సచ్చీలుడు కాదన్న విషయం సినీపరిశ్రమకే తెలుసన్నారు. చిన్మయి ఎందుకు ఆ సంఘటనను 10 ఏళ్ల క్రితం చెప్పలేదు? అని ఆమెను ప్రశ్నిస్తున్నారెందుకు. ఇప్పటికైనా బహిరంగపరిచినందుకు దానిపై నిజా నిజాలను నిగ్గతేల్చాలన్నారు. చిన్నయిని ప్రశ్నిస్తున్న వారు వైరముత్తును ప్రశ్నించడం లేదే అని నిలదీశారు. ఆరోపణలను ఎదుర్కొంటున్నవారిని వదిలి బాధితులను ప్రశ్నించడం ఏంటని వాపోయారు. చిత్రపరిశ్రమ ఏక పక్షంగా వ్వవహరిస్తోందని ఆరోపించారు. తాను ఒక ప్రైవేట్ చానల్లో పనిచేస్తున్న సమయంలో వైరముత్తు అక్కడ పనిచేసే ఒక యువ యాంకర్‌తో ఈ వ్యవహారంపై వేధించిన విషయం తనకు తెలుసని చెప్పారు. ఆయన గురించి తాను10 ఏళ్లలో పలు చోట్ల మాట్లాడాని తెలిపింది. కాగా నోరు లేని వారి కోసం తన గొంతు విప్పుతున్న గాయని చిన్మయినిని అభినంధిస్తున్నాను అని గాయని హేమమాలిని పేర్కొన్నారు. ఇంతకు ముందు వైరముత్తుపై లైంగికవేధింపుల ఆరోపణలు చేసిన సింధూజా రాజారాం కూడా హేమమాలిని చెప్పిన ప్రైవేట్ చానల్లో పని చేసిన యువ యాంకర్ గురించి ప్రస్ధావించారన్నది గమనార్హం. ఆస్పత్రిలో వైరముత్తు.. లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న వైరముత్తు శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మదురైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. ఆయనకు ఫుడ్ పాయిజన్ అయినట్లు సమాచారం. -
లై డిటెక్టర్ ఉపయోగించండి
లైంగిక వేధింపుల గురించి అటు బాలీవుడ్లో తనుశ్రీదత్తా, తనతో చెప్పుకున్న వాళ్లకు జరిగిన వేధింపుల విషయమై ఇటు సౌత్‌లో గాయని చిన్మయి ఇద్దరూ ‘మీటూ’ ఉద్యమంలో తమ పోరాటం సాగిస్తున్నారు. అయితే ఈ ఇద్దరూ ఆరోపించిన నానా పటేకర్, వైరముత్తులను ఒకే విధంగా ఇన్వెస్టిగేట్ చేయమని కోరుతున్నారు. ‘వైరముత్తుగారూ.. మాట్లాడింది చాలు. ఆయన లై డిటెక్టర్ టెస్ట్ తీసుకోవాలి’’ అని ట్వీట్ చేశారు చిన్మయి. మరోవైపు తనుశ్రీ కూడా నానా పటేకర్‌కు లై డిటెక్టర్ టెస్ట్, నార్కో అనాలసిస్ పరీక్షలు చేయించాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కోరారట. ఇందులో నృత్య దర్శకుడు గణేశ్ ఆచార్య, నిర్మాత రాకేశ్ సారంగ పేర్లు కూడా ఉన్నాయని సమాచారం. -
ధీరగళం
సమంత నటనకు ఆమె గొంతు తోడైంది. సింగర్‌గా మంచి గాత్రం ఉంది. ‘అందాల రాక్షసి’ హీరో రాహుల్ రవీంద్రన్ భార్యగా సినిమా పరిశ్రమలో ఓ స్వరం అయింది. ఇప్పుడు అదే గొంతు.. అదే గాత్రం.. అదే స్వరం.. ‘మీటూ’ ఉద్యమానికి ఓ ధీరగళమైంది! తన అనుభవాలను చెబుతూనే.. మిగతా అమ్మాయిల్నీ ట్వీట్లతో అప్రమత్తం చేస్తోంది. ఆ ధీరమయి.. చిన్మయితో సాక్షి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ‘వైరమ్’ అంటే తమిళంలో డైమండ్. డైమండ్‌ని పగలగొట్టడం అంత సులువు కాదు. రచయిత వైరముత్తుని తమిళనాడులో వైరమ్ అంటారు. తనని ఢీ కొనేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? చిన్మయి: నా ఫ్యామిలీ నుంచి వచ్చింది. మా ఆయన (నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్), మా అత్తమామల నుంచి వచ్చింది. ఎప్పుడైతే ఫ్యామిలీ సపోర్ట్ దొరుకుతుందో అప్పుడు ఏ అమ్మాయి అయినా నోరు విప్పగలుగుతుంది. రాహుల్ సపోర్ట్ చేయబట్టే ధైర్యంగా బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? లేకపోతే మాట్లాడే వారు కాదా? నేను వేరే ఎవర్ని పెళ్లి చేసుకుని ఉన్నా ఈ సంఘటనలు బయటకు వచ్చేవి కాదేమో. రాహుల్ లాంటి భర్త దొరకడం అదృష్టం. మా ఇంట్లో మా అమ్మవాళ్లే భయపడ్డారు. బయటికి చెప్పొద్దు అన్నారు. కానీ రాహుల్, అత్తమామలు ధైర్యం ఇచ్చారు. రాహుల్ నాతో ఏం చెబుతాడంటే.. ఏ పని చేసినా సరిగ్గా చేస్తున్నావా లేదా చూసుకో. ఏ నిర్ణయాన్నీ ఎమోషనల్‌గా తీసుకోకూడదు. నువ్వు అనుకున్న విషయంలో నిజాయతీ ఉంటే.. ‘గో ఎహెడ్’ అంటాడు. వైరముత్తు మీద వేరే అమ్మాయిలు చేసిన ఆరోపణలను మీ ట్వీటర్ ద్వారా బ్రేక్ చేయబోతున్నాను అని ముందే ఇంట్లో చెప్పారా? నా పెళ్లి తర్వాత ఓ పబ్లిక్ ఈవెంట్ కోసం పాడమని వైరముత్తు అడిగారు. కుదరదు అని చెప్పాను. ‘నువ్వు పాడకపోతే నాకున్న పొలిటికల్ కనెక్షన్స్తో ఆయన (ఓ రాజకీయ నాయకుడు) గురించి నువ్వు ఓ వేదిక మీద తప్పుగా మాట్లాడావు’ అని చెబుతాను అన్నారు. ‘నేను స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి నిజానిజాలు చెబుతాను. ఆయన నన్ను నమ్ముతారు మిమ్మల్ని కాదు’ అన్నాను. రాహుల్‌కి, మా అత్తమామలకు ఈ విషయం చెప్పి, ఏడ్చాను. కానీ అప్పుడు నేను బయటకు చెప్పలేదు. ఇప్పుడు ‘మీటూ ఉద్యమం’ వల్ల ఈయన గురించి బయటకు చెప్పగలిగాను. ఇప్పటివరకూ తమిళనాడులో ఎవరికీ ఈయన గురించి మాట్లాడటానికి ధైర్యం సరిపోలేదనుకుంటాను. సంధ్యా మీనన్ అనే ట్వీటర్ అకౌంట్ నుంచి ఓ కథనం వచ్చింది. దాని తర్వాత నాతో కొందరు తమపై జరిగిన వేధింపులను షేర్ చేసుకున్నారు. ఇంతమంది ముందుకు వస్తున్నారు. నేను చెప్పకపోవడం కరెక్ట్ కాదనుకున్నాను. అందుకే పేరు చెప్పడానికి భయపడినవారి మెసేజ్‌లను నేను బయటపెట్టాను. నేను ఇలా ఆరోపించినందుకు కొంతమంది అసహ్యంగా మాట్లాడతారు. ఏం ఫర్వాలేదు. ఇప్పుడు మీరు స్టార్ సింగర్. ఒకవేళ కెరీర్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంటే ఈ ఆరోపణలు చేసేవారా? చేసి ఉండకపోవచ్చు. నేను షేర్ చేసిన కొన్ని కథనాల్లో కెరీర్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఓ సింగర్‌కి జరిగిన ఇన్సిడెంట్ ఉంది. తనకిలా జరిగింది అని వాళ్ల భర్తతోనే చెప్పలేకపోయింది. ఎందుకంటే ఈ ఫీల్డ్ వద్దు, ఇంట్లో కూర్చోమంటాడేమో అని భయం. ఎవరో చేసే తప్పుకు నా కల చెదిరిపోవడమేంటి? అని ఆ అమ్మాయి బాధ. ఇవన్నీ ఊహించుకుని ఆ అమ్మాయి తన భర్తకు విషయం చెప్పుకోలేకపోయింది. ‘నన్ను వేధిస్తున్నాడు’ అని అమ్మాయి చెప్పినప్పుడు ‘నీలోనే తప్పుంది’ అని కొన్నిసార్లు అమ్మాయినే నిందించడం చూస్తుంటాం.. అవును. అలాంటివి నాకూ తెలుసు. అమ్మాయిలను వేధిస్తున్నవాళ్లలో ముఖ్యంగా టీచర్స్, డాక్టర్స్, లాయర్స్, మావయ్య, అన్న, బావ ఉంటారు. ‘‘నాతో మా మామగారు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అని మా ఆయనకు చెబితే మా మామగారిని ఇంట్లోకి రావద్దని చెప్పారు’’ అని ఓ అమ్మాయి చెప్పింది. ఇంకో అమ్మాయి ఏమో ‘‘మా మామగారు ఇలా ఇబ్బంది పెడుతున్నారు అంటే నా మాట నమ్మలేదు. మా ఆయన నాకు విడాకులు ఇచ్చేశాడు’ అని చెప్పింది. సొసైటీలో అర్థం చేసుకునే అన్నలు, భర్తలు, మామలు దొరకడం చాలా రేర్ అయిపోయింది. కానీ అది చాలా కామన్ అవ్వాలి. దీని వల్ల మీకు అవకాశాలు తగ్గుతాయంటారా? నాకు తెలియదు. నాలుగైదు రోజులుగా మాట్లాడుతున్నాను. ప్రస్తుతానికి బిజీగా ఉన్నాను. ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చెప్పలేం. ఇప్పుడు సినీ పరిశ్రమలో చాలామంది మగవాళ్ల ‘డార్క్ సైడ్’ బయటకు వచ్చింది. ఈ ప్రభావంతో ఇక స్త్రీలపై వేధింపులు తగ్గుతాయంటారా? ఆ మార్పు వస్తుందనే ఆశ ఉంది. ఒక్క చిన్మయి కాదు నాతో పాటు వచ్చేవాళ్లు చాలామంది ఉన్నారు. ఇండస్ట్రీలో దీనికి సంబంధించిన స్టెప్స్ తీసుకుంటున్నాం. అసోసియేషన్ ఏర్పాటు చేస్తున్నాం. వేధింపులతో కుంగినవాళ్లను బయటకు తీసుకువచ్చి చికిత్స చేసి మామూలు జీవితాన్ని గడిపేలా చేస్తాం. వేధింపులు ఎదురయ్యాయని చెబితే, ‘నువ్వు అక్కడికి వెళ్లొద్దు.. ఉద్యోగం మానెయ్’ అనే బదులు ఎలా డీల్ చేయాలో నేర్పిస్తే బాగుంటుంది కదా? ఎగ్జాట్లీ. కొన్ని నెలల క్రితం ఒక అబ్బాయి నాతో ‘మీరంతా సెలబ్రిటీస్. మీకు సెక్యూర్టీ ఉంటుంది. మేం కామన్ పీపుల్. మా చెల్లెల్ని ఒకడు ఈవ్ టీజ్ చేశాడు. ఆ అబ్బాయిని కొట్టాను కానీ మా చెల్లిని చదువు మానేసి, ఇంట్లోనే ఉండమన్నాను’ అన్నాడు. దెబ్బలు తిన్నవాడు కొన్ని వారాల్లో మామూలుగా తిరుగుతాడు. కానీ వాళ్ల వల్ల వీళ్ల చదువు, కలలు అన్నీ పోతున్నాయి కదా. ఇంట్లో ఎందుకు కూర్చోవాలి? అమ్మాయికి బయట వేధింపులు ఎదురైతే, చదువు మానిపించేసి, పెళ్లి చేసేయడమేనా? అమ్మాయిలను ఓ ప్యాకేజ్ అనుకుంటారేమో? పుట్టింటి నుంచి ఆ ప్యాకేజీని మెట్టినింటికి పంపించేస్తే, తమ బాధ్యత తీరిపోయిందని కొందరు తల్లిదండ్రులు భావిస్తారు. అక్కడ్నుంచి అత్తింటివాళ్లు ఆ ప్యాకేజీని మోసే క్రమంలో చాలా ఆంక్షలు పెడతారు. చాలామంది అమ్మాయిలు ఇలాంటి దయనీయ స్థితిలో ఉన్నారు. ఇది మారాలి. కొందరు మగవాళ్లు ఈ మార్పుని ఆశిస్తున్నారు. ఎగ్జాంపుల్ మా ఆయన. స్త్రీ ఏదైనా మాట్లాడాలన్నా, చేయాలన్నా ఒక మగాడి సహాయం ఎందుకు కోరుకోవాలి? ఫ్యామిలీ. అదొక ధైర్యం. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం ఏమైనా చేయొచ్చు. ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా కూడా ఎన్నో సాధిస్తున్నారు. కాదనడంలేదు. ఫ్యామిలీ నుంచి స్త్రీకి మాత్రమే కాదు.. పురుషులకూ సపోర్ట్ లభిస్తుంది. రాహుల్ ఆర్టిస్ట్‌గా చేస్తున్నాడు. అయితే డైరెక్షన్ చేస్తానంటే వద్దన్నవాళ్లు ఎక్కువ. నేను సపోర్ట్ చేశాను. ఇప్పుడు తను నాకు అండగా నిలబడ్డాడు. స్త్రీకైనా, పురుషుడికైనా ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. బెదిరింపులు ఏమైనా వచ్చాయా? బెదిరింపులు రాలేదు కానీ, నా మంచి కోరి కొందరు ‘జాగ్రత్త’ అన్నారు. నువ్వు రోడ్డు మీద కనిపిస్తే నీ అంతు చూస్తాం లాంటివి అయితే రాలేదు. ప్రస్తుతానికైతే భద్రంగానే ఉన్నాను అని అనుకుంటున్నాను. ఇది జరగబోతోంది అనే అనవసరపు సందేహాలు ముందే చెప్పను. ఒకవేళ జరిగితే చూసుకుందాం. రుజువేంటి? అని అడిగే వాళ్ల గురించి? స్కూల్‌ని తీసుకుందాం. ఒక అమ్మాయి దగ్గర టీచర్ మిస్ బిహేవ్ చేస్తాడు. అతను అలా చేస్తాడని ఊహిస్తుందా? పోనీ ఊహించినా స్కూల్ పిల్లల దగ్గర కెమెరాలు, ఫోన్లు ఉంటాయా? స్కూల్ కాకపోతే ఆఫీసుని తీసుకుందాం. అమ్మాయిలు కెమెరాలు వెంటబెట్టుకుని తిరుగుతారా? ప్రతిదానికీ రుజువు అంటే చూపించలేం కదా. జనరల్‌గా అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురైనప్పుడు కొందరు అది తమ తప్పుగా ఫీలవుతుంటారు. వాళ్లు ధైర్యంగా బయటకు చెప్పాలంటే ఏం చేయాలి? ఒకవేళ లైంగిక దాడి జరిగితే ‘అది మీ తప్పు కాదు. శాడిస్ట్ మైండ్ ఉన్న ఒక కామాంధుడు చేసిన తప్పు, నేరం’ అని చిన్నప్పుడే పిల్లలకు చెప్పాలి. ఎందుకంటే ఏడెనిమిదేళ్ల వయసులో ఉన్నవాళ్లు ఎలా చెప్పగలుగుతారు? మామూలుగానే చిన్నపిల్లలు పెద్దలంటే భయపడతారు. పైగా ‘ఇంట్లో చెప్పావా.. జాగ్రత్త’ అని భయపెట్టినప్పుడు ఇంకా భయపడతారు. పసి వయసులో పడిన ఈ మచ్చ వాళ్లతో పాటే పెరిగి పెద్దది అవుతుంది. పెద్దయ్యాక కూడా చెప్పలేరు. ‘మీరు మాతో ఏదైనా చెప్పొచ్చు’ అని పేరెంట్స్ నుంచి భరోసా దొరికితే పిల్లలు ఇంట్లో చెప్పగలుగుతారు. ఈ సందర్భంగా ఓ సంఘటన గురించి చెబుతాను. ‘మీటూ’ వల్ల చిన్నప్పుడు మా అన్నయ్య నన్ను లైంగికంగా వేధించిన విషయాన్ని ఇప్పుడు మా ఇంట్లో చెప్పాను. అప్పుడు తెలిసింది ఏంటంటే వాళ్ల అమ్మాయి (ఏడేళ్ల పాప)ని కూడా మా అన్నయ్య లైంగికంగా వేధిస్తున్నాడు’ అని ఒకరు చెబితే షాకయ్యాను. ఇంకో అమ్మాయిని స్వయంగా ఆమె బావే వేధించాడు. బయటకు చెబితే.. మీ అక్కయ్య దగ్గర నువ్వే నన్ను కోరుకున్నావు అని చెబుతానని బెదిరించాడట. దాంతో పాటు మీ అక్క కాపురం పాడైపోతుంది, మా పిల్లలు ఉన్నారు అంటూ డ్రామా రుద్దుతారు. బాధితులకు ఈ లైంగిక వేధన ఒకవైపు.. ఇలాంటి యాతన మరోవైపు. పాపం.. ఎన్ని బాధలు మోస్తారు? నేను చెబుతున్నవన్నీ సాధారణ కుటుంబాలకు చెందిన ఆడవాళ్లు పడుతున్న బాధలే. ఆర్థిక పరిస్థితులు కూడా వేధింపులు బయటకు చెప్పకుండా నోరు నొక్కేస్తాయేమో కదా? అది ముఖ్యమైన కారణం. ఆర్థికంగా నిలబడగల స్వాతంత్రం లేనప్పుడు ఒకవేళ చెల్లెలే స్వయంగా చెప్పినా, గొడవ చేసి భర్త వదిలేస్తాడేమో? విడాకులు అంటాడేమో? అప్పుడు ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్న పుట్టింటికి వెళ్లి వాళ్లకు భారం కావాలా? పిల్లల పరిస్థితి ఏంటి? అని ఆ అక్కే మదనపడిపోతుంది. ‘నా ఖర్మ’ అని బాధనంతా మనసులోనే దాచేసుకుని అతనితోనే ఉంటుంది. అలాంటి వాళ్లను మనం నిందించలేం కూడా. ఎందుకంటే ఆవిడ తన పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది కాబట్టి. ఫైనాన్షియల్‌గా ఇతరుల మీద ఆధారపడినప్పుడు ఇలాంటివి భరించాల్సి వస్తుంది. అదే ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంటే ఈ భయం అక్కర్లేదు కదా. అందుకే ముందు ఆడపిల్లలు తమ కాళ్ల మీద తాము నిలబడగలిగేలా తల్లిదండ్రులు చేయాలి. బాగా చదివించాలి. పెళ్లి ఎంత ముఖ్యమో అమ్మాయికి కెరీర్ ఉండటం కూడా అంతే ముఖ్యం. ‘ఈ ఆరోపణలు నా మీద బురద జల్లే ప్రయత్నం’ అని వైరముత్తు పేర్కొన్నారు. ఏమంటారు? అలా అన్నారే కానీ ‘నేనలా చేయలేదు... ఇదంతా అబద్ధం’ అని ఆయన చెప్పాలి కదా. ఇలాంటివి వస్తాయి.. అలాంటివి వస్తుంటాయి అని మాట వరసకు అంటే సరిపోతుందా? ఏమీ లేనప్పుడు స్ట్రాంగ్‌గా ఖండించవచ్చు కదా. ఆడవాళ్ల కోసం ఆయన హాస్టల్స్ నడుపుతున్నారు. అక్కడి నుంచి ఆయన గురించి ఎక్కువగా వినిపిస్తుంటాయి. అయితే ఆయనకు ఎదురుగా నిలబడే ధైర్యం పాపం ఎవరికీ లేదు. అందుకే ఎవరూ బయటకు చెప్పరు. పదేళ్ల క్రితం నానా పటేకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని ఇప్పుడు బయటపెడితే.. ముందే ఎందుకు చెప్పలేదు అని తనుశ్రీని కొందరు తప్పుబడుతున్నారు.. అప్పుడే ఆవిడ కంప్లయింట్ ఇచ్చింది.. మేమే తీసుకోలేదు అని యాక్టర్స్ అసోసియేషన్ వాళ్లు రికార్డ్‌లో చెప్పారు. సొసైటీతో వచ్చిన సమస్యేంటంటే ఎవరు పవర్ఫుల్లో వాళ్లకే సపోర్ట్ చేస్తారు కానీ ఏది కరెక్టో దానికి చేయరు. అయితే ‘మీటూ’లాంటి వాటి వల్ల ఏదైనా మార్పు వస్తుందని చిన్న ఆశ కలుగుతోంది. నేను ఓ షోకి జడ్జిగా చేస్తున్నాను. ఒక అమ్మాయి పాట పాడుతూ ‘ఐ బిలీవ్ యు (నేను నిన్ను నమ్ముతున్నాను) అని చెప్పింది. ఆ మూడు పదాలు వినగానే ఎంత గొప్పగా అనిపించిందో చెప్పలేను. ఏదైనా ఇష్యూకి కొన్ని రోజులు మాత్రమే హైప్ ఉంటుంది. ఆ తర్వాత అందరూ మర్చిపోతారు. ‘మీటూ’ ద్వారా వినిపిస్తున్న సమస్యలు కూడా అంతేనా? మీరన్నట్లు ఇవాళ ఇది హాట్ టాపిక్. రేపు ఇంకోటి వెలుగులోకి వస్తే ఇది బ్యాక్‌సీట్ తీసుకునే అవకాశం ఉంది. కానీ దీని వల్ల ఉపయోగం ఏంటంటే.. ‘నాకు ఇలా జరిగింది అని ముందు ముందు ఎవరైనా చెబితే.. వింటారు. సైలెంట్‌గా ఉండు, ఇలాంటివి మాట్లాడొచ్చా అనరు అనే నమ్మకం నాకుంది. ‘మనం ఏదైనా చేస్తే కచ్చితంగా బయటకు వస్తుంది’ అనే భయం మొదలవుతుంది. అప్పుడు వేధింపులు తగ్గుతాయి. తగ్గుతాయనే ఫీలింగ్ చాలామందికి ఉంది. అయితే ‘నిర్భ య’ ఘటన తర్వాత ‘గ్యాంగ్ రేప్స్’ గురించి ఎక్కువ వింటున్నామేమో అనిపిస్తోంది? ఎక్కువ అయిపోవడం కాదు. అంతకుముందు కూడా ఎక్కువ జరిగేవే. కానీ బయటకు చెప్పేవాళ్లు కాదు. ఇప్పుడు చెబుతున్నారు కాబట్టి ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. అందుకని ఎక్కువ జరుగుతున్నాయనిపిస్తోంది. నిర్భయ రిపోర్ట్ చేయడంవల్లే అది ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది. రేప్‌కి గురైనవాళ్లు ధైర్యంగా చెబుతున్నారు. నేను మగాణ్ణి. స్త్రీని ఏమైనా చేస్తాను అనే వైఖరి చాలా వరకూ మారింది. ఫైనల్లీ స్త్రీ నడక, నడత బాగుంటే మాత్రమే కాదు.... ఆమె శీలవతి అయ్యుండాల్సిందే అనే అభిప్రాయం సమాజంలో ఉండబట్టే, ఆమె పరువు తీయాలంటే మానభంగం చేయాల్సిందేనని కొందరి మగవాళ్ల ఊహ... యాక్చువల్‌గా సమాజంలో ఈ ధోరణి ఉండడంవల్లే అత్యాచారం జరిగితే చాలామంది బయటకు చెప్పుకోవడం లేదు. ఆమె గుణం ఎంత మంచిదైనా ‘శీలవతి’ కాదని ముద్ర వేస్తారు. ‘శీలం అనేది నీ గౌరవంతో ముడిపడి ఉంది, నష్టాన్ని భయపెడితే నీకే లాస్’ అనే భ్రమలో ఆడవాళ్లను పడేశారు. వ్యక్తిత్వంకన్నా ‘ఫిజికల్ థింగ్’ ఇంపార్టెన్స్ అన్నట్లు అయిపోయింది. పురాణాల్లో ఆ సీతమ్మకే తప్పలేదు. రావణాసురుడు ఎన్ని ఇబ్బందులు పెట్టాడు. రాముడు తన భార్యను మళ్లీ తెచ్చుకోగలిగాడు. అయితే ఏం చేశాడు? ఎవరో ఏదో అన్నారని అగ్ని పరీక్ష చేసి, తాను పునీతను అని నిరూపించుకోమన్నాడు. పాపం సీతమ్మ. ఇక మనమెంత? మంచి మార్పుని ఆశిద్దాం. మార్పు కోసం ముందడుగు వేద్దాం. – డి.జి. భవాని -
చోరికి గురైన సింగర్ చిన్మయి కారు
శాన్ఫ్రాన్సిస్కో: మ్యూజిక్ టూర్‌కు వెళ్లిన సింగర్ చిన్మయి శ్రీ పాదకు చేదు అనుభవం ఎదురైంది. పార్క్ చేసిన ఉన్న ఆమె కారును పగులగొట్టిన దుండగులు కొన్ని వస్తువులను దొంగిలించారట. ఈ విషయాన్ని ఆమె ట్వీటర్ ద్వారా తెలిపారు. కారులోని వస్తువులను దొంగలించారని గుర్తించడానికి తనకు ఐదు నిమిషాలు పట్టిందన్నారు. కారు పార్కు చేసిన ప్రాంతంలో దొంగతనాలు సాధారణమేనని శాన్ఫ్రాన్సిస్కో పోలీసులు చెప్పనట్లు తెలిపారు. చోరీ జరుగుతుండగా చూసి కేకలు పెట్టిన వ్యక్తికి ధన్యవాదాలు చెప్పారు. భూమి మీద ఇంకా కొందరు మంచివాళ్లు ఉన్నారని అన్నారు. దొంగతనానికి గురైన వస్తువులన్నీ తిరిగి దొరుకుతాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. It took me 5 minutes to realize things were missing. The police here in SFO were really kind and told me break ins were common. — Chinmayi Sripaada (@Chinmayi) 9 May 2017 Thankfully a neighbor scared the thief from stealing more stuff and a red haired girl is caught on camera. Good people still walk the earth — Chinmayi Sripaada (@Chinmayi) 9 May 2017 -
'సమోసాలో ఆలూ ఉన్నంత కాలం..'
ఆలూ సమోసాలో ఆలూ ఎంతకాలం ఉంటుంది? అసలు ఆలూ లేకుండా ఎక్కడైనా ఆలూ సమోసా ఉంటుందా? అదే ఉదాహరణగా చెప్తుంది ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద. సమోసాలో ఆలూ ఉన్నంతకాలం.. సమంతకు తెలుగులో డబ్బింగ్ చెప్తానంటోంది. సమంత హీరోయిన్గా నటించిన 'జనతా గ్యారేజ్' విడుదల సందర్భంగా విషెస్ చెప్తూ ట్వీట్ చేసింది చిన్మయి. 'ఏ మాయ చేశావే' లో జెస్సీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అందరినీ నిజంగానే మాయ చేసింది సమంత. జెస్సీ క్యారెక్టర్ అంతగా ఆకట్టుకోవడానికి ఆమెకు చెప్పిన డబ్బింగ్ ఓ ప్రధాన కారణమని చెప్పొచ్చు. సమంతకు గాత్రదానం చేసింది సింగర్ చిన్మయే. ఇక అప్పటినుంచి తెలుగులో సమంతకు చిన్మయే డబ్బింగ్ చెప్తూ వస్తుంది. ఆమె గొంతు సమంత రూపానికి చక్కగా సరిపోయి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని పెంచేసింది. ప్రస్తుతం సమంత టాప్ హీరోయిన్గా ఉన్న సంగతి తెలిసిందే. సమంత కూడా పలుమార్లు చిన్మయి డబ్బింగ్ తన విజయానికి ఎంతగానో ఉపయోగపడిందని చెప్పుకొచ్చింది. సమోసాలో ఆలూ ఉన్నంతకాలం.. అంటూ చిన్మయి చేసిన ట్వీట్‌కు 'థాంక్యూ పాపా' అంటూ సమంత ముద్దులతో స్పందించింది. Wishing Sam papa the best for Janatha Garage. As saying goes, Jab tak rahega samose mein aaloo (God-willing) I’ll dub for Sam in Telugu.😜 — Chinmayi Sripaada (@Chinmayi) 31 August 2016 😋😋😋😋ha ha Muah thanks Paapa https://t.co/vFgjIdcpIR — Samantha Ruth Prabhu (@Samanthaprabhu2) 31 August 2016 -
గాయని చిన్మయి వివాహ రిసెప్షన్
ప్రముఖ యువ గాయని చిన్మయి, నటుడు రాహుల్ రవీంద్రన్‌ల వివాహ రిసెప్షన్ బుధవారం ఉదయం చెన్నైలో ఘనంగా జరిగింది. తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో పలు పాటలు పాడి బహుభాషా గాయనిగా పేరు తెచ్చుకున్న చిన్మయి, యువ నటుడు రాహుల్ రవీంద్రన్ ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. పెద్దల సమ్మతంతో వీరి వివాహం సోమవారం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్లో నిడారంబరంగా సాగింది. బుధవారం జరిగిన వివాహ రిసెప్షన్‌కు పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో నటుడు విజయ్, కుటుంబం, కార్తీ, మిర్చి శివ, వివేక్, గాయని పి.సుశీల, దర్శకుడు గౌతమ్ మీనన్, ధరణి, గీత రచయిత వైరముత్తు తదితర ప్రముఖులు ఉండడం విశేషం. -
మే 6న గాయని చిన్మయి వివాహం
అమె మాటలో ఓ విధమైన మత్తు ఉంది. మరీ చెప్పాలంటే గమ్మత్తు ఉంది. ఆమె ఏ హీరోయిన్‌కి అయిన డబ్బింగ్ చెప్పిందంటే .. ఆ హీరోయిన్ వెండి తెర మీద వెలిగిపోవాల్సిందే. ఆ డబ్బింగ్ కమ్ సింగర్ చిన్మయి శ్రీపాద. చిన్మయి వివాహం మే ఆరో తేదీన చెన్నైలో జరగనుంది. తమిళంతోపాటు, తెలుగు, హిందీ భాషాల్లో వెయ్యి పాటలను పాడిన చిన్మయి, అందాల రాక్షసి ఫేం నటుడు రాహుల్ రవీంద్ర గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు సమ్మతించి.. వివాహ ముహూర్తం నిశ్చయించారు. మే నెల 6వ తేదీన చెన్నైలోని నక్షత్ర హోటల్లో రాహుల్ రవీంద్ర, చిన్మయిల వివాహం వేడుకగా జరగనుంది. సరసర సాలై కాట్రు, సహానా సారల్ తూవుదో, కిళి మాంజారో వంటి పాటల ద్వారా ప్రాచుర్యం పొందిన గాయని చిన్మయి. ప్రముఖ హీరోయిన్ సమంతాకు తొలి చిత్రం ఏమాయ చేసావే నుంచి అన్ని చిత్రాలకు చిన్మయి డబ్బింగ్ చెబుతున్న సంగతి తెలిసిందే. తమ పెళ్లికి విచ్చేసే బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు ఆ కొత్త జంట ఓ వినూత్నమైన విజ్ఞప్తి చేశారు. తమకు ఎటువంటి బహుమతులు, బోకేలు, ఇతరత్రా కోసం నగదును నిరూపయోగంగా ఖర్చు చేయవద్దని కోరారు. అలా ఖర్చు చేసే నగదును లడక్‌లోని 17,000 ft Foundation కు డోనేట్ చేయాలి కోరారు. -
జగమే మాయ
తన స్వార్థం కోసం మనిషి ఎలాంటి మాయలు చేస్తాడు? ఎత్తుకు పైఎత్తు వేసి ఎదుటి వ్యక్తిని ఎలా చిత్తు చేస్తాడు? అనే అంశాలతో శ్రీ సాయి తిరుమల ప్రొడక్షన్స్ నిర్మించిన చిత్రం ‘జగమే మాయ’. జాహ్నవి కటకం సమర్పణలో మహేష్ ఉప్పుటూరి దర్శకత్వంలో ప్రసాద్ ఉప్పుటూరి నిర్మించారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ -‘‘సునీల్ కాశ్యప్ స్వరపరచిన పాటలకు మంచి స్పందన లభి స్తోంది. కామెడీ, యాక్షన్ సమాహారంతో సాగే యూత్‌ఫుల్ ఎంట ర్‌టైనర్ ఇది. కుటుంబ సమేతంగా చూడదగ్గ విధంగా ఉంటుంది. పాటలు విజయం సాధించినట్లుగానే సినిమా కూడా అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. శివబాలాజీ, సిద్ధు, క్రాంతి, చిన్మయి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి మాటలు: షాబీర్ షా, లైన్ ప్రొడ్యూసర్: భీమనేని తిరుపతిరాయుడు. -
వచ్చే ఏడాది చిన్మయితో నా పెళ్లి : రాహుల్
తెరవెనుక మరో ప్రేమకథ విజయవంతమైంది. ‘అందాల రాక్షసి’ ఫేమ్ రాహుల్... గాయని, అనువాద కళాకారిణి చిన్మయి ప్రేమకు పెద్దలు పచ్చజెండా ఊపారు. వీరిద్దరి పెళ్లికి ఇరువైపుల పెద్దల అంగీకార ముద్ర లభించింది. ఈ సందర్భంగా రాహుల్‌తో ఫోన్లో ముచ్చటిస్తే, చిన్మయితో తన ప్రేమ గురించి, పెళ్లి విషయాల గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. ** కంగ్రాట్స్ రాహుల్... మీ ప్రేమకథను సక్సెస్ చేసుకున్నారు! థ్యాంక్స్ అండీ. ** చిన్మయితో మీ తొలి పరిచయం ఎప్పుడు? ‘అందాల రాక్షసి’ స్క్రీనింగ్‌కి తను వచ్చింది. ఆ సినిమాలో హీరోయిన్ లావణ్య పాత్రకు తనే డబ్బింగ్ చెప్పింది. అప్పుడే తనతో నాకు పరిచయం ఏర్పడింది. అప్పటికే నేను తన వాయిస్‌కి వీరాభిమానిని. ‘ఏ మాయ చేశావె’లో సమంత పాత్రకు తను డబ్బింగ్ చెప్పిన తీరు చూసి ఫ్లాట్ అయిపోయాను. తను పాటలు కూడా బాగా పాడుతుంది. ** మీది లవ్ ఎట్ ఫస్ట్ సైటా? కాదు. ముందు తన వాయిస్‌ని ఇష్టపడ్డాను. మా పరిచయం వృద్ధి చెందాక తనని ఇష్టపడ్డాను. ** చిన్మయిలో మీకు నచ్చిన అంశాలు? ప్రధానంగా తన మనస్తత్వం. తనది చాలా ఓపెన్ మైండ్. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరితో ఒకేలా మాట్లాడుతుంది. ఎవరి గురించైనా వెంటనే ఒక నిర్ణయానికి రాదు. చాలా నిజాయితీగా ఉంటుంది. ఏ విషయాన్నీ మనసులో దాచుకోకుండా నాతో డిస్కస్ చేస్తుంది. చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుంది. చాలా తెలివైన అమ్మాయి. ఫెంటాస్టిక్ గాళ్. అందుకే నచ్చింది. నేను ఎలాంటి లక్షణాలున్న అమ్మాయిని భార్యగా కోరుకున్నానో, అవన్నీ తనలో పరిపూర్ణంగా ఉన్నాయి. తనే నా బెటర్‌హాఫ్. ** మీ ప్రేమని ఎప్పుడు సీరియస్‌గా తీసుకున్నారు? మూడు నెలల క్రితమే ఇద్దరం ఓ నిర్ణయానికొచ్చాం. ప్రేమ గురించి, పెళ్లి గురించి అప్పుడే చర్చించుకున్నాం. ** పెద్దల్ని ఎలా ఒప్పించారు? ఈ విషయంలో మేం పెద్దగా కష్టపడలేదు. మా ఇంట్లోవాళ్లు వెంటనే ఓకే చెప్పేశారు. మాది తమిళ కుటుంబం. చిన్మయి మదర్ తమిళియనే కానీ, ఫాదర్ మాత్రం తెలుగు. ** ఇంతకూ మీ పెళ్లెప్పుడు? వచ్చే ఏడాది మార్చిలో ఉంటుంది. 2012... ‘అందాల రాక్షసి’ సినిమాతో హీరోగా బ్రేకొచ్చింది. 2013... లవర్‌గా సక్సెసయ్యాను. 2014లో పెళ్లితో కొత్త జీవితం మొదలు పెట్టబోతున్నాను. ** పెళ్లి తర్వాత చిన్మయి తన కెరీర్‌ని కొనసాగిస్తారా? పెళ్లికి, కెరీర్‌కి సంబంధం లేదు. ఇప్పుడు ఎలా కెరీర్ ఉందో, పెళ్లి తర్వాత కూడా అలాగే కొనసాగుతుంది. ** మరి మీ కెరీర్ ఎలా ఉంది? రామానాయుడిగారి సంస్థలో ‘నేనేం చిన్నపిల్లనా’ చేశాను. వచ్చే వారమే ఆ సినిమా విడుదలవుతుంది. ఇంకొన్ని సినిమాలు చేతిలో ఉన్నాయి. నేనిక్కడ చాలా హ్యాపీ. అందుకే హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిపోయాను కూడా!