స్టార్ హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దూమారం రేపుతున్నాయి. లియో సినిమాలో త్రిషతో బెడ్ రూమ్ సన్నివేశాలు ఉంటాయని భావించానని, అలాంటి సీన్స్ లేకపోవడం నిరాశకలిగించిందని మన్సూర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అతని వ్యాఖ్యలపై త్రిష తీవ్రంగా మండిపడింది. ఇకపై అతనితో నటించబోనని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. సినీ ప్రముఖులంతా త్రిషకు మద్దతుగా నిలిచారు.
ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవితో పాటు పలువురు హీరోహీరోయిన్లు త్రిషకు మద్దతు ప్రకటిస్తూ..మన్సూర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఒక అడుగు ముందుకేసి ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని మన్సూర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే మన్సూర్ మాత్రం త్రిషకు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదంటున్నారు. తాను సరదాగా అన్న మాటలను కొంతమంది కావాలనే వక్రీకరించారని ఆరోపించారు.
ఇదిలా ఉంటే.. ఈ వివాదంపై గాయని చిన్మయి శ్రీపాద తనదైన స్టైల్లో స్పందించింది. మన్సూర్ మాత్రమే అలాంటి వ్యాఖ్యలు చేయలేదని..గతంలో చాలా మంది హీరోయిన్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ.. నటుడు రాధా రవికి సంబంధించిన ఓ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.
(చదవండి: త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. సారీ చెప్పే ప్రసక్తే లేదన్న మన్సూర్)
అందులో రాధా రవి ఓ సినిమా ఈవెంట్‌లో మాట్లాడుతూ..‘నాకు హిందీ భాష రాదు. ఒకవేళ వచ్చి ఉంటే ఐశ్వర్యను రేప్ చేసే వాడ్ని. ఎందుకంటే అక్కడి వాళ్లు ఎలాగో నాకు మంచి పాత్రలు ఇచ్చేవాళ్లు కాదు. అత్యాచారం చేసే పాత్రలే ఇచ్చేవాళ్లు’ అని సరదాగా అన్నారు. రాధ రవి మాటలకు అక్కడి వారంతా నవ్వేశారు.
ఈ వీడియోని చిన్మయి ఎక్స్(ట్విటర్)లో షేర్ చేస్తూ.. రాధరవి..ఐశ్వర్య రాయ్‌ని రేప్ చేస్తానంటే అంతా జోక్‌గా తీసుకొని నవ్వేశారు. అలాంటి వ్యాఖ్యలే చేసిన మన్సూర్‌పై చర్యలు తీసుకోవాలని అంతా డిమాండ్ చేస్తున్నారు. మరి రాధ రవి వ్యాఖ్యల మీద ఎవరూ స్పందించకపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలని ఉంది’అని చిన్మయి రాసుకొచ్చింది.
(చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!)
చిన్మయి షేర్ చేసిన వీడియోపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. అతను రేప్ సన్నివేశాల గురించి మాత్రమే మాట్లాడరని కొంతమంది కామెంట్ చేస్తే.. మరికొంతమంది రాధరవిపై కూడా చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడుతున్నారు.
"I have once said that if I had known Hindi, I would have had the opportunity to rape Aishwarya Rai. What I meant was I would have acted in Bollywood. Why the hell should I then act with these saniyans (idots/sinners in Tamil)." - Radha Ravi
— Chinmayi Sripaada (@Chinmayi) November 21, 2023
Here in this video in Tamil where you… pic.twitter.com/j9qLQwdRA7
Comments
Please login to add a commentAdd a comment