కోలీవుడ్ నటుడు,రాజకీయ నాయకుడు మన్సూర్ అలీఖాన్‌కు న్యాయస్థానంలో ఊరట లభించింది. కొన్ని రోజుల క్రితం నటి త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమె తీవ్రంగా ఖండించారు. అయితే నటి త్రిషకు మహిళా కమిషన్ సభ్యులు అండగా నిలిచి, చైన్నె పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నటుడు మన్సూర్ అలీఖాన్‌పై ఫిర్యాదు చేశారు. అలాగే త్రిషకు టాలీవుడ్ నటుడు చిరంజీవి మద్దతు పలికారు. వారిద్దరూ మన్సూర్ అలీఖాన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
దీంతో తన వ్యాఖ్యలను పూర్తిగా వినకుండా తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా నటి త్రిష, కుష్బూ, చిరంజీవి ప్రవర్తించారంటూ నటుడు మన్సూర్ అలీఖాన్ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈయన పిటిషన్ విచారించిన న్యాయస్థానం నిజానికి నటి త్రిషనే మీపై పిటీషన్ దాఖలు చేయాలని మందలించడంతోపాటు కోర్టు సమయాన్ని వృథా చేసినందుకుగాను నటుడు మన్సూర్ అలీఖాన్‌కు రూ.లక్ష జరిమానా విధించింది.
ఆ మొత్తాన్ని చైన్నె, అడయార్ క్యాన్సర్ ఆస్పత్రికి అందించాలని ఆదేశించింది. అయితే తనపై విధించిన జరిమానాలు రద్దు చేయాలంటూ నటుడు మన్సూర్ చైన్నె హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం ఆయనపై విధించిన రూ.లక్ష జరిమానాను రద్దు చేస్తూ, ఈ కేసును కూడా కొట్టివేయాలని సింగిల్ బెంచ్‌ను ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment