తమిళనాడు, పెరంబూరు: మీటూపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని గాయని, డబ్బింగ్ కళాశారిని చిన్మయి ఆరోపించారు. సోమవారం నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈమె తాము మోదీ పేరును ప్రస్తావించడానికి పోలీసు అధికారులు అనుమతించలేదన్నారు.
లలిత మోదీ గురించి పాడతామన్నా అంగీకరించలేదని తెలిపారు. అలాంటిది మీటూ వ్యవహారం గురించి చట్టంలో మార్పులు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి, ఒక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి బదులు రాలేదన్నారు. దీంతో చట్టం నిరుపయోగంగా ఉన్న స్థితిలో మనం ఉన్నట్టు భావించాల్సి వస్తోందని చిన్మయి అన్నారు. తనను డబ్బింగ్ కళాకారుల యూనియన్ నుంచి తొలగించిన వ్యవహారంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని చిన్మయి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment