
కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్పపై లైంగికదాడి కేసు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తన కూతురిపై యడ్యూరప్ప లైంగికదాడి చేశారని ఓ 17 ఏళ్ల బాలిక తల్లి బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద యడ్యూరప్పపై కేసు నమోదు చేశారు.
తాజాగా ఈ అరెస్ట్‌పై ఫెమినిస్ట్, సింగర్ చిన్మయి శ్రీపాద రియాక్ట్ అయింది. ఇది తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందని ట్వీట్ చేసింది. అంతే కాకుండా ఆ వార్తకు సంబంధించిన క్లిప్‌ను షేర్ చేసింది. కాగా.. దేశంలో బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అన్యాయాలపై సోషల్ మీడియా వేదికగా పోరాటం చేస్తోంది. మనదేశంలో మహిళలకు రక్షణ లేదని చాలాసార్లు తన ట్వీట్ల ద్వారా వెల్లడించింది. ఇటీవల స్పెయిన్ జంటపై జరిగిన లైంగిక దాడిపై కూడా చిన్మయి స్పందించిన సంగతి తెలిసిందే.
అసలేం జరిగిందంటే..
ఒక కేసులో సాయం అడిగేందుకు ఫిబ్రవరి 2న యడ్యూరప్ప ఇంటికి వెళ్లినపుడు తన కూతురిపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో బాలిక తల్లి పేర్కొన్నట్లు సమాచారం. యడ్యూరప్ప ఇప్పటికి మూడుసార్లు కర్ణాటక సీఎంగా పనిచేశారు. 2021లో యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు.
There is a POCSO case lodged against former Karnataka Chief Minister B S Yediyurappa for sexually harassing a minor.
I am stunned. pic.twitter.com/vjY4ynwurR— Chinmayi Sripaada (@Chinmayi) March 15, 2024