సింగర్ చిన్మయి శ్రీపాద తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చురుక్కుగా ఉంటోంది. ఇటీవల ఎక్కువగా మహిళలు, బాలికలపై జరుగుతున్న దారుణాలను ప్రశ్నిస్తూ వారికి అండగా నిలుస్తోంది. అయితే నటుడు, దర్శకుడైన రాహుల్ రవీంద్రన్‌ను ఆమె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో ఈ జంటకు ట్విన్స్ జన్మించారు. వారిలో ఓ బాబు, పాప ఉన్నారు. కానీ ఇప్పటి వరకు తమ కవలలను బయటికి చూపించలేదు.
(ఇది చదవండి: నేను వాటిని పట్టించుకోను.. కాబోయే వాడు మాత్రం ఇలా ఉంటేనే: శోభిత ధూళిపాళ)
దాదాపు ఏడాది తర్వాత తన పిల్లల మొహాలను అభిమానులకు పరిచయం చేసింది చిన్మయి. తన పిల్లలతో దిగిన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ వావ్ క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. గతంలో చిన్మయి శ్రీపాద ప్రెగ్నెన్సీపై రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె సరోగసీ ద్వారా పిల్లలకు జన్మినిచ్చారని వార్తలొచ్చాయి. కానీ ఆమె తన బేబీ బంప్ ఫోటోలతో వాటికి చెక్ పెట్టింది. కానీ అదే సమయంలో తన పిల్లల ముఖాలను బహిర్గతం చేయనని కూడా శ్రీపాద చెప్పింది. నా వ్యక్తిగత జీవితం, నా కుటుంబం, నా స్నేహితుల విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటానని తెలిపింది. మా పిల్లల ఫోటోలు షేర్ సోషల్ మీడియాలో షేర్ చేయనని తెలిపింది.
(ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు!)
Comments
Please login to add a commentAdd a comment