twin babies
-
కవలల అడ్డా.. వడ్డాడి
ఒకే పోలికలుండే కవలలను గుర్తు పట్టడానికి ఎవరైనా తికమక పడుతుంటారు. అలాంటిది ఒకే గ్రామంలో పదుల సంఖ్యలో కవలలుంటే?.. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడిలో 20 మంది వరకు కవలలు ఉండడంతో.. ఆ గ్రామాన్ని కవలల విలేజ్‌గా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఐదు కవలల జంటలు స్థానిక ప్రాథమికోన్నత పాఠశాలలో విద్య అభ్యసిస్తుండగా.. మిగతా పిల్లలు ఇతర చోట్ల చదువుతున్నారు. గ్రామ పాఠశాలలో విరాట్–విశాల్, కావ్య–దివ్య, గౌతమి–గాయత్రి, హర్షిత్–వర్షిత్, ప్రణాళిక–ప్రత్యక్ష చదువుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఆదిలాబాద్ -
కవలలకు జన్మనిచ్చిన బ్లడ్ క్యాన్సర్ బాధితురాలు
ఇండోర్(మధ్యప్రదేశ్): ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్ బాధితురాలు కవలలకు జన్మనిచ్చారు. ప్రపంచంలోనే ఈ అరుదైన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. మైయెలాయిడ్ లుకేమియా అనే ప్రాణాంతక రక్త క్యాన్సర్‌తో బాధ పడుతున్న మహిళకు సురక్షిత ప్రసవం జరిగేలా చూడటం సవాల్‌తో కూడుతున్న వ్యవహారమని ఆస్పత్రిలోని క్లినికల్ హెమటాలజీ విభాగం ప్రొఫెసర్ అక్షయ్ లహోటీ తెలిపారు. ‘ఈ గర్భవతిని మా ఆస్పత్రిలో చేరి్పంచిన సమయంలో ఆమె శరీరంలో తెల్ల రక్త కణాల(డబ్ల్యూబీసీ)సంఖ్య సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. దీంతో, కీమో థెరపీతోపాటు సాధారణ క్యాన్సర్ మందులు ఇవ్వలేకపోయాం’అని ఆయన చెప్పారు. ‘దేశ, విదేశాల్లోని నిపుణులను సంప్రదించాక ఆమె ఆరోగ్యంతోపాటు గర్భంలోని ఇద్దరు శిశువులకు ఎటువంటి హాని వాటిల్లకుండా ప్రత్యేకంగా మందులు ఇచ్చాం’అని లహోటీ తెలిపారు. ‘మొదటిసారి గర్భం దాలి్చన బాధితురాలికి బ్లడ్ క్యాన్సర్ ఉన్న విషయం చెప్పలేదు. గర్భవతిగా ఉండగా ఆమె మానసిక ఆరోగ్యం దెబ్బతినకుండా చూడాలన్నదే మా ఉద్దేశం. ఆమెకు సాధారణ ప్రసవం చేశాము. బాబు, పాప జని్మంచారు. వారు ఆరోగ్యంగా ఉన్నారు’ అని గైనకాలజిస్ట్ డాక్టర్ సుమిత్రా యాదవ్ వివరించారు. మైయెలాయిడ్ లుకేమియా ఉన్న మహిళలకు సురక్షిత ప్రసవం ప్రపంచంలోనే అరుదైన కేసుల్లో ఒకటని వైద్యులు చెబుతున్నారు. -
ఈ ట్విన్నర్స్.. ఆటల్లో విన్నర్స్..
ట్విన్స్.. అనగానే నైంటీస్ వారికి టక్కున హలో బ్రదర్ సినిమా కళ్లముందు కదులుతుంది.. మనలో చాలా మంది స్కూల్స్, కాలేజ్ ప్రయాణంలో అనేక మంది కవలలను కలిసే ఉంటారు.. వీరిలో ఎక్కువ మంది ఇద్దరు ఆడవారు.. ఇద్దరు మగవారిని చూసుంటాం.. కొందరు ఇద్దరినీ కలిసి ట్విన్స్‌గా చూసుంటాం.. మనం ఇప్పుడు తెలుసుకునే ట్విన్స్ కూడా అలాంటివారే.. అయితే అలాంటి ఇలాంటి ట్విన్స్ కాదండోయ్.. ఈ ట్విన్నర్స్.. ఆటల్లో విన్నర్స్..వీరే నగరానికి చెందిన అయమ అగర్వాల్, అనయ్ అగర్వాల్.. వీరు చెస్లోనూ, ఇతర ఆటల్లోనూ చిరుతల్లా పావులు కదుపుతూ.. పథకాలు గెలుస్తూ.. వరల్డ్ ఛాంపియన్స్‌గా నిలుస్తున్నారు..వారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం..శ్రీనగర్‌కాలనీ: హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త వరుణ్ అగర్వాల్, పనాషా అగర్వాల్ సంతానమే అయమ, అనయ్ అగర్వాల్ అనే కవలలు..వీరికి ప్రస్తుతం తొమ్మిదేళ్లు...నగరంలోని ఓ ప్రైవేటు స్కూల్లో మూడో తరగతి చదువుతున్నారు. చిన్నతనం నుండే అల్లరి ఎక్కువ... ఎక్కువగా గొడవపడుతూ బాగా అల్లరి చేసేవారు. ఆ అల్లరిని కట్టడి చేయాలనే ఉద్దేశంతో వీరిని ఆటల వైపు మళ్లించాలని తల్లిదండ్రులు భావించారు. చెస్ వల్ల క్రమశిక్షణతో పాటు మేధస్సు, మైండ్ రిలాక్స్ అవుతుందని తల్లి పనాషా ఇండియన్ చెస్మాస్టర్స్ స్కూల్లో చేరి్పంచారు. చేరిన కొద్దిరోజుల్లోనే నగరంలోని జూనియర్ టోర్నమెంట్స్‌లో మెడల్స్ సాధించి ప్రతిభను చాటారు. పాల్గొన్న ప్రతిటోర్నమెంట్లోనూ విన్నర్స్‌గా, రన్నర్స్‌గా నిలుస్తూ వచ్చారు. వీరి ప్రతిభకు ముగ్దులైన కోచ్ చైతన్య సురేష్ వీరికి మెరుగైన శిక్షణ ఇచ్చి ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్‌కి పోటీపడేలా తీర్చిదిద్దారు. వరల్డ్ ఛాంపియన్స్‌గా.. కోచ్‌ల సహాయంతోపాటు తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేషనల్, ఇంటర్నేషనల్ టోర్నమెంట్స్‌లో పాల్గొన్నారు. గతేడాది ఈజిప్‌్ట, సెర్బియాలోని బిల్గ్రేడ్లో జరిగిన చెస్టోరీ్నలో పాల్గొని ఛాంపియన్స్‌గా నిలిచారు. అమయ ప్రపంచవ్యాప్తంగా 60 మంది క్రీడాకారులతో పోటీపడి అండర్–8 విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. చైనా, కెనెడా, మలేషి యా, మంగోలియా, శ్రీలంకలాంటి ఆటగాళ్లను ఎత్తుకు పైఎత్తులతో చిత్తు చేసింది. ఫిబ్రవరిలో అనయ్ అండర్–8లో 90 మందితో పోటీపడి మెక్సికో, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, మంగోలియాపై విజయాన్ని, రష్యా, శ్రీలంక, ఆ్రస్టేలియా, స్లొవేకియాతో డ్రా చేసుకొని ఛాంపియన్‌గా నిలిచాడు. ఈ సంవత్సరం చెక్‌రిపబ్లిక్ పరాగ్వేలో జరిగిన చెస్టోర్నమెంట్లో ఫిడే రేటింగ్‌లో టాప్‌లో ఉన్న వారిలో అనయ్ విన్నర్‌గా, అయమ రన్నర్‌గా నిలిచి ప్రపంచ ఛాంపియన్ విశ్వనాథ్ ఆనంద్ ప్రశంసలు పొందారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఫిడే రేటింగ్స్‌లో అమయ 1728, అనయ్ 1773 రేటింగ్స్‌లో కొనసాగుతున్నారు. ఈ కవల చిచ్చరపిడుగులు రెండు సంవత్సరాలుగా శిక్షణ తీసుకుంటూ దేశ, విదేశాల్లోని చెస్ ఛాంపియన్ షిప్స్‌లో పాల్గొని మెడల్స్‌ను సాధిస్తున్నారు. చదువుల్లోనూ చురుకే... అమయ, అనయ్ చెస్‌లోనే కాకుండా చదువుల్లోనూ చురుగ్గా రాణిస్తూ, క్లాస్ టాపర్స్‌గా నిలుస్తున్నారు. చెస్‌తో పాటు పియానో, అథ్లెటిక్స్‌లోనూ తమ ప్రతిభను కనబరుస్తున్నారు. తల్లిదండ్రులు, కోచ్‌లు, స్కూల్ మేనేజ్మెంట్ల సహకారంతో ఆల్‌రౌండర్స్‌గా నిలుస్తూ ప్రపంచ ఛాంపియన్స్‌గా నిలుస్తున్న ఈ సూపర్ ట్విన్స్ మరిన్ని విజయాలు సాధించాలని మనసారా కోరుకుందామా మరి.. -
థాయిలాండ్‌లో అద్భుతం
అయూథలా: గజరాజును అత్యంత పవిత్రంగా భావించే థాయిలాండ్‌లో ఒక అద్భుతం జరిగింది. అరుదుగా సంభవించే కవలల జననానికి వేదికైంది. కవలలకు ఏనుగు జన్మనివ్వడం అరుదైన విషయమయితే అందులోనూ 36 ఏళ్ల ఒక ఏనుగు ఒక ఆడ, ఒక మగ గున్నలకు ఒకేసారి జన్మనివ్వడం అత్యంత అరుదైన సందర్భమని వెటర్నరీ వైద్యులు ప్రకటించారు. థాయిలాండ్‌లోని అయూథలా ప్రావిన్స్‌లోని అయూథలా ఏనుగుల ప్యాలెస్‌లో ఇటీవల జరిగిన ఈ ఘటన వివరాలను అక్కడి సిబ్బంది వెల్లడించారు. 36 ఏళ్ల ఛామ్చూరీ శుక్రవారం ఒక మగ గున్నకు జన్మనిచ్చింది. ప్రసవం సాఫీగా జరిగిందనుకుని సంతోషపడి ఆ గున్నను నిలబెట్టే ప్రయత్నం చేస్తుండగా ఛామ్చూరీ మళ్లీ నొప్పులు పడటం అక్కడి మావటి, సిబ్బందిని ఆశ్చర్యంలో పడేసింది. అతి కష్టమ్మీద ఆడ గున్న బయటకురావడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటికే మగ గున్నకు జన్మనిచ్చి బాగా నీరసించిపోయిన ఏనుగు వెంటనే మరో ఏనుగుకు జన్మనివ్వడంతో డీలాపడి కింద పడబోయింది. అప్పటికి ఆడ గున్నను కింద నుంచి తీయలేదు. ‘‘పెద్ద ఏనుగు మీద పడితే ఏమైనా ఉందా?. అందుకే వెంటనే ప్రాణాలకు తెగించి వెంటనే తల్లిఏనుగు కిందకు దూరి గున్న ఏనుగును బయటకు లాగేశా. కానీ అంతలోనే ఏనుగు పడిపోవడంతో నా కాలు విరిగింది. పసికూనను కాపాడాను అన్న ఆనందంలో నాకు కాలు విరిగిన బాధ కూడా తెలీలేదు. ఆస్పత్రికి వెళ్లాకే నొప్పి తెలిసింది’ అని 31 ఏళ్ల మావటి చరిన్ సోమ్‌వాంగ్ నవ్వుతూ చెప్పారు. ‘‘ నేనూ ఇదే ఏనుగుల ప్యాలెస్, రాయల్ ప్రాంగణంలో పుట్టి పెరిగా. కవలల జననాన్ని చూడాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఇంతకాలానికి ఇలా కుదిరింది. ఏనుగుల్లో కవలల జననం కేవలం ఒక్క శాతం మాత్రమే. ఇక ఆడ,మగ ఒకేసారి జననం అత్యంత అరుదైన విషయం’’ అని అక్కడి వెటర్నరీ మహిళా డాక్టర్ లార్డ్థోంగ్టేర్ మీపాన్ చెప్పారు. డాక్టర్ మీపాన్కు కూడా కవల పిల్లలున్నారు. కవల గున్నల జననం వార్త తెలిశాక స్థానికులు తండోపతండాలుగా ఏనుగుల పార్క్‌కు క్యూ కట్టారు. 60 కేజీల మగ, 55 కేజీల ఆడ గున్నలతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారు. -
కవలలకు జన్మనిచ్చిన తెలుగు సీరియల్ హీరోయిన్
తెలుగు సీరియల్ నటి కవల పిల్లలకు జన్మనిచ్చింది. చాలా ఏళ్ల క్రితమే సీరియల్ దర్శకుడిని పెళ్లి చేసుకున్న ఈమెకు పదేళ్ల వయసున్న కొడుకు కూడా ఉన్నాడు. అలాంటిది మళ్లీ చాన్నాళ్ల తర్వాత కరుణ్ భూషణ్ ట్విన్స్‌కి తల్లయింది. ఈ క్రమంలోనే తన ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించిన వీడియోని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్-సాయిధరమ్ తేజ్ వివాదంపై స్పందించిన నిహారిక)'ఆహా' సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కరుణ.. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని 'శంకర్ దాదా ఎంబీబీఎస్', కొంచెం ఇష్టం కొంచెం కష్టం, నిన్నే ఇష్టపడ్డాను, కాటమరాయుడు తదితర సినిమాల్లో నటించింది. మరోవైపు 'మొగలిరేకులు' నుంచి 'వైదేహి పరిణయం' వరకు తెలుగులో బోలెడన్ని సీరియల్స్ చేసింది.ముఖ్యంగా 'అభిషేకం' సీరియల్లో కరుణ అభినయానికి అందానికి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం 'వైదేహి పరిణయం'లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకుంటోంది. ఇప్పుడు ఈమె కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి పిల్లల్ని కనేంత వరకు తన జర్నీ ఎలా సాగిందో చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: తొమ్మిదేళ్ల తర్వాత తల్లి కాబోతున్న బుల్లితెర నటి!) View this post on Instagram A post shared by Karuunaa Bhushan (Nethikaruna) (@karuunaa_bhushan) View this post on Instagram A post shared by Bharath Bhushan Nethi (@bharathbhushan_nethi) -
నయనతార 'చిన్నారి కవల'లను చూశారా!
పిల్లలు నవ్వినా అందమే, ఏడ్చినా అందమే. ఏ కోణంలో చూసినా అందమే అందం! వారి అల్లరి ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఇలా ఇద్దరు పిల్లల అల్లరి... అందులో కవల పిల్లల అల్లరి... ఎంతో గమ్మత్తుగా వామ్మో అనాల్సిందే!నయనతార తన కవల పిల్లల ఫొటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తూ మురిసిపోతుంటుంది. తాజా విషయానికి వస్తే... తన కవల పిల్లలతో నయన ఆనంద క్షణాలను పట్టించే వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. పిల్లలతో సింపుల్‌గా ఆటో ప్రయాణం చేసిన నయనతార ఈ ఆటో రైడ్ విజువల్స్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లోపోస్ట్ చేసింది.‘సూపర్ స్టార్’గా పేరు తెచ్చుకున్న నయనతార సింపుల్‌గా ఆటోలో ప్రయాణించడం నెటిజనులను బాగా ఆకట్టుకుంది. పలువురు నెటిజనులు ఈ వీడియోను తమ సోషల్ పేజీలో షేర్ చేస్తున్నారు. మాతృత్వంలోని మధురిమ గురించి తీయటి కామెంట్లు పెడుతున్నారు.ఇవి చదవండి: తాను.. బాలీవుడ్ 'ఆస్థా'న ఫేవరెట్! -
ఈ సంగతి విన్నారా! ఒకే కాన్పులో.. 'నైన్ ఆల్ ఫైన్'..!!
సాధారణంగా మనం ఎన్నో వింటుంటాం, చూసుంటాం. వింతలైనా, విశేషాలైనా, మరేవైనా కావచ్చు. అలాగే ఇక్కడ కూడా అవాకయ్యేలాగా ఓ అద్భుతం జరిగింది. ఇంతకీ అది అద్భుతమేనా? ముమ్మాటికీ అవుననే చెప్పవచ్చు. అదే.. ఈ 'ఒకే కాన్పులో తొమ్మిది మంది పుట్టడం.. అదీ బతికి బట్టకట్టడం' ఎప్పుడైనా చూశారా? మరెందుకు ఆలస్యం.. ఇప్పుడే చూసేయండి. చూశారుగా.. అందరూ ఎంత చలాకీగా ఉన్నారో..! ఒకే కాన్పులో పుట్టి జీవించి ఉన్న తొలి 9 మంది కవలలు (నోనుట్లెట్స్) వీరు!! మొత్తం ఐదుగురు అక్కాచెల్లెళ్లు, నలుగురు అన్నదమ్ములు! దీనికి సంబంధించి గిన్నిస్ రికార్డు కూడా సాధించారు. ఈ నవ సోదరసోదరీమణులకు ఓ ఆరేళ్ల అక్క కూడా ఉందండోయ్! అంటే సంతానం టోటల్ టెన్ అన్నమాట. మాలి దేశానికి చెందిన హలీమా సిస్చే, అబ్జెల్కాదెర్ ఆర్బీ అనే దంపతులకు 2021 మే 4న ఈ తొమ్మిది మంది మొరాకోలో జన్మించారు. అత్యంత అరుదైన కేసు కావడంతో డెలివరీ నిమిత్తం హలీమాను మాలి ప్రభుత్వం ప్రత్యేక వైద్య సదుపాయాలున్న మొరాకోలోని ఓ ఆస్పత్రికి పంపింది. కొన్ని ఆరోగ్యపరమైన సమస్యల వల్ల తల్లికి ముందుగానే.. 30 వారాల గర్భం సమయంలోనే వైద్యులు సిజేరియన్ చేశారు. ఫ్రీ డెలివరీ కావడంతో ఒక్కొక్కరి బరువు కేవలం అరకిలో నుంచి కిలో మధ్య ఉంది. దీంతో పిల్లలు 10 నెలలపాటు ఇంక్యుబేటర్లు, ప్రత్యేక వసతులున్న కేంద్రంలో గడపాల్సి వచ్చింది. మరో రెండు నెలల్లో మూడో పుట్టినరోజు జరుపుకోనున్న వీరంతా ఇప్పుడు తమ ఇంటి గడపదాటి.. గిన్నిస్ చానల్ కార్యక్రమంలో సందడి చేసేందుకు తొలిసారి ఇటలీ పర్యటనకు వచ్చారు. ఈ నేపథ్యంలో వీరి ఫొటోలను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ నిర్వాహకులు విడుదల చేశారు. ఇవి చదవండి: ఆయుష్షులో సెంచరీ కొట్టి.. గిన్నిస్ రికార్డు కెక్కిన వృద్ధుడు! -
స్టార్ హీరోయిన్‌కు ట్విన్స్.. వైరలవుతున్న పోస్ట్!
కొత్త ఏడాది ప్రారంభంలోనే హీరోయిన్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ తాజాగా గర్భం ధరించినట్లు వెల్లడించింది. అయితే ఇప్పటికే అమలాపాల్‌కు పెళ్లి కాగా.. తన ప్రియుడు జగత్ దేశాయ్‌ను వివాహం చేసుకుంది. తాజాగా తాను ప్రెగ్నెన్సీతో ఉన్నానంటూ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ శుభవార్త తెలుసుకున్న ఫ్యాన్స్ అమలాపాల్‌కు అభినందనలు తెలిపారు. తాజాగా అమలాపాల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ పాపను తన చేతుల్లో ఎత్తుకుని కనిపిచింది. అంతే కాకుండా 'టూ హ్యాపీ కిడ్స్' అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు త్వరలోనే తల్లి కాబోతున్న అమలాపాల్‌ను ఉద్దేశించి క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ఈ పోస్ట్ ద్వారా తనకు కవల పిల్లలు పుట్టబోతున్నారన్న హింట్ ఇచ్చిందా అనే డౌటానుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. అమలాపాల్ తాజా పోస్ట్ బట్టి చూస్తే త్వరలోనే ట్విన్స్‌కు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది. కానీ దీనిపై ఇప్పటివరకైతే ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందేమో వేచి చూడాల్సిందే. కాగా.. గతేడాది జూన్ నుంచే డేటింగ్లో ఉన్న అమలాపాల్ నవంబర్‌లో జగత్ దేశాయ్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లైన రెండు నెలలకే జనవరి 3న ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జంటగా ఆడుజీవితంలో అమలాపాల్ కనిపించనుంది. ఆ తర్వాత ద్విజ అనే మరో మలయాళ చిత్రంలో నటిస్తోంది. కాగా.. టాలీవుడ్లో అల్లు అర్జున్‌కు జంటగా ఇద్దరమ్మాయిలతో సినిమాలో మెప్పించింది. గతంలో మలయాళ డైరెక్టర్ విజయ్ను పెళ్లాడిన భామ.. ఆ తర్వాత మనస్పర్థలతో విడిపోయిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Amala Paul (@amalapaul) -
ప్రెగ్నెన్సీ ప్రకటించారో లేదో.. ‘ట్విన్స్’ అంటూ సందడి చేస్తున్న ఫ్యాన్స్
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ త్వరలోనే తమ తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ శుభవార్తను ఫిబ్రవరి 29న సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు దీపికా, రణ్వీర్. ఈ సందర్బంగా ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది. అంతేకాదు పుట్టబోయేది కవలలు అంటు తెగ చర్చిస్తున్నారు ఫ్యాన్స్. ప్రెగ్నెన్సీని అలా ప్రకటించారో లేదో, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నారు అంటూ ఫ్యాన్స్ తెగ సందడి చేస్తున్నారు. ఇందుకు ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్న బ్లూ, పింక్ షేడ్స్‌లో షూస్, టోపీలు, ఫ్రాక్, ఇతర బొమ్మలను ఉదహరిస్తున్నారు. పింక్ కలర్ ఆడ బిడ్డకు, బ్లూ కలర్ మగబిడ్డకు సంకేతం కాబట్టి, దీపికా రణ్వీర్ దంపతులకు ట్విన్స్ పుట్టబోతున్నారంటూ నెటిజన్లు పలు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఇంకా బేబీ ఎవరనేది తెలియదు కాబట్టి ఈ రెండు కలర్స్ పెట్టారని మరో యూజర్ ఈ వాదనను కొట్టిపారేశారు. కాగా దీపికా, రణ్వీర్ 2018,నవంబర్ 14న ఇటలీలోని లేక్ కోమోలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్‌లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబరులో పుట్టనున్న బిడ్డకోసం అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. పెళ్లి తరువాతనటులుగా ఇద్దరూ దూసుకుపోతున్నారు. రోహిత్ శెట్టి 'సింగం ఎగైన్', నాగ్ అశ్విన్ 'కల్కి 2898 ఏడీ'లో దీపిక నటిస్తుండగా, మరోవైపు రణ్వీర్ 'సింబా 2', 'డాన్ 3' ,'సింగమ్ ఎగైన్' చిత్రాల్లో కనిపించనున్నాడు. -
నెలల తక్కువ కవలలు
సాధారణంగా తొమ్మిది నెలలు నిండాక పిల్లలు పుట్టడం సహజం. నెల ముందే పుట్టిన వాళ్లని నెల తక్కువ గడుగ్గాయిలు అంటూంటారు. అయితే ఈ పిల్లలు నాలుగు నెలలు ముందు పుట్టి.. వారి కుటుంబానికి, వైద్యం చేసిన డాక్టర్స్‌కి షాకిచ్చారు. కేవలం తల్లి గర్భంలో.. 22 వారాలు మాత్రమే ఉండి.. సుమారు 126 రోజుల ముందే పుట్టారు. ‘ఆదియా, అడ్రియాల్ నడరాజా’ అనే ఈ కెనడియన్ కవలలు.. 2022 మార్చి 4న జన్మించారు. వీరు పుట్టినప్పుడు బతకడానికి ‘జీరో చాన్స్’ అని చెప్పారు డాక్టర్లు. బతకడమే కష్టం అని వైద్యులు తేల్చేస్తే.. 2023 మార్చికి ఏడాది పూర్తి చేసుకుని రికార్డ్ సృష్టించారు. కేవలం 330 గ్రాములు (0.72 పౌండ్లు.), 420 గ్రాములు (0.92 పౌండ్లు.) బరువుతో పుట్టిన ఈ చిన్నారులు.. అత్యంత తక్కువ బరువున్న కవలలుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నిలిచారు. -
కవలలకు జన్మనిచ్చిన బిగ్‌బాస్ విజేత!
బుల్లితెర నటి, బిగ్‌బాస్ విజేత రుబీనా దిలక్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. తాను కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని నెల రోజుల తర్వాత రివీల్ చేసింది. నవంబర్ 27న గురునానక్ జయంతి సందర్భంగా జన్మించినట్లు ఆమె వెల్లడించింది. కానీ అంతకుముందే రుబీనా-అభినవ్ జంటకు ట్విన్స్ జన్మించినట్లు రుబీనా ఫిట్నెస్ ట్రైనర్ పోస్ట్ చేశారు. ఈ బుల్లితెర జంట తమ కుమార్తెల పేర్లను కూడా వెల్లడించారు. కవలలకు జీవా, ఈధా అనే పేర్లు పెట్టినట్లు తెలిపారు. పిల్లలు జన్మించి నెల రోజులు పూర్తి కావడంతో ఇంట్లో పూజలు నిర్వహించారు. తమ కూతుళ్లను చేతుల్లో పట్టుకుని కెమెరాల ముందు కనిపించారు. కాగా.. రుబీనా బుల్లితెర నటుడు అభినవ్ శుక్లాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తమ ఇన్‌స్టాలో రాస్తూ.. 'మా కుమార్తెలు జీవా, ఎధాలకు నెల రోజులు నిండాయని పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నా. గురుపురాబ్ లాంటి పవిత్రమైన రోజున ఆ దేవుడు ఆశీర్వదించాడు. ఈ సందర్భంగా దేవతలకు మా శుభాకాంక్షలు.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు బుల్లితెర జంటకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా.. ఈ జంట 2018లో సిమ్లాలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్- 14 లో పాల్గొన్నారు. ఈ సీజన్ విజేతగా రుబీనా నిలిచింది. అభినవ్ ఇంట్లో పెద్దమనిషిగా ప్రశంసలు అందుకున్నారు. View this post on Instagram A post shared by Rubina Dilaik (@rubinadilaik) -
70 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన వృద్దురాలు
సాధారణంగా 35-40 ఏళ్లు దాటితేనే ప్రెగ్నెన్సీ కష్టమనుకుంటున్న రోజుల్లో 70 ఏళ్ల మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చి ఆశ్చర్యపరిచింది. ఈ అరుదైన ఘటన తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాలో చోటు చేసుకుంది.ఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయా అనే మహిళ వయసు 70 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చింది. నముక్వాయా 1992లో భర్తను కోల్పోయింది. దీంతో నాలుగేళ్లకు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సుమారు 20 ఏళ్లకు సఫీనా ఐవీఎఫ్ ద్వారా ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. అయితే పాప పుట్టిన వెంటనే చనిపోవడంతో సఫీనా చాలా కుంగిపోయింది. దీంతో తల్లి కావలన్నా తన కోరికను 70 ఏళ్ల వయసులో తీర్చుకుంది. రెండోసారి కూడా ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా ఆమె కవలలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒకరు పాప కాగా, మరొకరు బాబు ఉన్నారు. ప్రస్తుతం తల్లితో సహా పిల్లలు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వయసులో కవలలకు జన్మనిచ్చిన సఫీనా.. ఆఫ్రికాలోనే అత్యంత పెద్ద వయసులో తల్లైన మహిళగా రికార్డు సృష్టించింది. A 70-year-old woman has given birth to twins following IVF treatment, a hospital in Uganda has said. Safina Namukwaya delivered a boy and a girl via caesarean at a fertility centre in the capital, Kampala. pic.twitter.com/XjGBgbkGPV — The Instigator (@Am_Blujay) December 1, 2023 -
నయనతార- విఘ్నేశ్ శివన్ ట్విన్స్.. ఈ అరుదైన ఫోటోలు చూశారా?
సౌత్ ఇండియాలో తన అభినయం, అందంతో అభిమానులను సొంతం చేసుకున్న లేడీ సూపర్‌స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇటీవలే బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ సరసన జవాన్ మూవీలో అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. సౌత్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను తెరకెక్కించగా.. దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లోన కనిపించారు. (ఇది చదవండి: వహీదా రెహమాన్‌కు దాదాసాహెబ్ ఫాల్కే..) అయితే గతేడాది కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట అధికారికంగా మూడుముళ్లబంధంతో ఒక్కటయ్యారు. అంతేకాకుండా ఈ జంటకు సరోగసీ ద్వారా కవల పిల్లలు కూడా జన్మించారు. వీరికి ఉయిర్, ఉలగం అని నామకరణం చేశారు. (ఇది చదవండి: ఒక్క సినిమాతో ఆ రేటింగ్స్‌నే మార్చేసిన నయనతార) తాజాగా నయన్ సోషల్ మీడియాలో పోస్ట్ తెగ వైరలవుతోంది. తన పిల్లలు, భర్తతో ఉన్న ఫోటోను పంచుకుంది. అయితే గతంలో ట్విన్స్‌తో ఉన్న ఫోటోను పంచుకున్న నయన్.. తాజాగా మరో పిక్‌ను షేర్ చేసింది. అయితే ఈ ఫోటో ట్విన్స్ పుట్టినప్పుడు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఫోటోల్లో కవల పిల్లలిద్దరూ చాలా క్యూట్‌గా ఉన్నారు . ఇది చూసిన ఫ్యాన్స్ సైతం క్యూట్ బేబీస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
వరల్డ్ రిచెస్ట్ మేన్‌తో రహస్యంగా కవలలు: ఈ టాప్ ఎగ్జిక్యూటివ్ గురించి నమ్మలేని నిజాలు
Shivon Zilis:వెంచర్ క్యాపిటల్ ప్రపంచం స్టార్‌గా అందరి దృష్టిని ఆకర్షించిన టాప్ మహిళా ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీలో నైపుణ్యం కలిగిన వ్యక్తి. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, ట్విటర్, టెస్లా ,స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ద్వారా రహస్యంగా కవలలకు జన్మనిచ్చి వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బ్రెయిన్ టెక్నాలజీ కంపెనీ న్యూరాలింక్‌లో డైరెక్టర్‌గా తన ప్రత్యకతను చాటు కుంటున్నారు జిలిస్. అయితే బయోగ్రఫీ రైటర్‌గా పాపులర్ అయిన వాల్టర్ ఐజాక్సన్ మస్క్ బయోగ్రఫీ పుస్తకం రిలీజ్ కాబోతున్న తరుణంలో జిలిస్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. టెక్సాస్‌లోని ఆస్టిన్లోని జిలిస్ నివాసంలో తీసిన రైటర్ వాల్టర్ ఐజాక్సన్ కవల పిల్లలతో మస్క్ ,జిలిస్ ఫోటోలను షేర్ చేయడం అప్పట్లో పెద్ద సంచలన క్రియేట్ చేసింది.అయితే ఈ జంట ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతి (ఐవీఎఫ్) ద్వారా 2021లో నవంబరులో వీరికి జన్మనిచ్చారు. ఈ కవలల పేర్లు స్ట్రైడర్ (కొడుకు), అజూర్ (కుమార్తె) గా ఇటీవల వెల్లడైంది. దీంతో మస్క్ సంతానం తొమ్మిదికి చేరింది. ఏప్రిల్ 2022లో, కవలల పేర్లను మార్చాలని మస్క్, జిలిస్ ఒక పిటిషన్‌ను మే 2022లో టెక్సాస్ న్యాయమూర్తి ఆమోదించారు. మాజీ భార్య, కెనడా రచయిత జస్టిన్ విల్సన్‌తో.. గ్రిఫిన్, వివియన్, కాయ్, శాక్సన్, డామియన్ అనే ఐదుగురు సంతానం ఉన్నారు. వీరితోపాటు సింగర్ గ్రిమ్స్‌తో ఆయనకు గ్జాయే ఆగ్జి, ఎక్సా డార్క్ సిడరేల్ అనే పిల్లలున్నారు. (రూ.25 కోట్ల బడ్జెట్, లాభాలు మాత్రం 876 శాతం, ఎవరీ హీరో? ఏంటా మూవీ?) షివోన్ జిలిస్ ఎవరు? ఎలాన్ మస్క్, జిలిస్ సంబంధం, అలాగే జిలిస్ గురించి చాలామందికి పెద్దగా తెలియదు. జిలిస్ కెనడాలోని అంటారియోలోని మార్ఖమ్‌లో కె ఫిబ్రవరి 8, 1986న పంజాబీ భారతీయ తల్లి శారద , కెనడియన్ తండ్రి రిచర్డ్‌కి జన్మించారు. అమెరికాలోని ప్రతిష్టాత్మక యేల్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం, తత్వశాస్త్ర డిగ్రీలు పూర్తి చేశారు. ఐటీ దిగ్గజం IBMలో తన కెరీర్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం కృత్రిమ మేధస్సుపై దృష్టి సారించే వెంచర్ క్యాపిటలిస్ట్‌గా ఉన్నారు. 2015లో మస్క్ సహ-స్థాపించిన లాభాపేక్ష రహిత సంస్థ OpenAIతో జిలిస్ మస్క్ మధ్య పరిచయం ఏర్పడింది. పలు మస్క్ కంపెనీలలో సీనియర్ పాత్రలలో పనిచేశారు. మే 2017 నుండి ఆగస్టు 2019 వరకు టెస్లాలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. 2016 జూలైలో మస్క్ స్థాపించిన న్యూరాలింక్, ఇంప్లాంటబుల్ బ్రెయిన్-మెషిన్ ఇంటర్ ఫేస్‌లను అభివృద్ధి చేసే న్యూరోటెక్ కంపెనీలో టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా పేరు పొందారు.ప్రస్తుతం న్యూరాలింక్ ఆపరేషన్స్ అండ్ స్పెషల్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ OpenAI బోర్డు మెంబర్‌గాఉన్నారు. జిలిస్ ప్రత్యేకతలు ♦ 2015లో వెంచర్ క్యాపిటల్ విభాగంలో ఫోర్బ్స్ 30 అండర్ 30కి ఎంపికయ్యారు. ♦ అవర్ లేడీ పీస్ అనే కెనడియన్ రాక్ బ్యాండ్ ది ఏజ్ ఆఫ్ స్పిరిచువల్ మెషీన్స్ అనే పుస్తకం తనకు ప్రేరణ అంటారు. కంప్యూటర్లు, మానవ మేథస్సును అథిగమిస్తున్న తరుణంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ , మానవాళి , భవిష్యత్తు గురించి తనకు తెలిపిందని ఒక ఇంటర్వ్యూలో స్వయంగా జిలిస్ తెలిపారు. అప్పటి నుండే కృత్రిమ మేధస్సు అధ్యయనంలో నిమగ్నమైనట్టు వెల్లడించారు. ♦ యేల్ విశ్వవిద్యాలయంలో చదువుకునే సమయంలో ఆమె ఐస్ హాకీ జట్టులో కీలక సభ్యురాలు. గోల్ కీపర్‌గా ఆల్-టైమ్ బెస్ట్. ఆమె గిటార్ , డ్రమ్స్ కూడా ప్లే చేసేది. ♦ అంతేకాదు మస్క్ తండ్రి తండ్రి ఎర్రోల్ షివోన్పై ప్రశంసలు కురిపించాడు. 2022లో ఒక ఇంటర్వ్యూలోఆ ఆమో IQ 170 అని ప్రకటించడం విశేషం. కాగా స్టీవ్ జాబ్స్ , ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ల ప్రశంసలు పొందిన జీవిత చరిత్రల రచయిత ఐజాక్సన్ రాసిన మస్క్ బయోగ్రఫీ సెప్టెంబరు 12న రిలీజ్ కానుంది. ఆయన రాసిన బయోగ్రఫీలు అత్యధికంగా అమ్ముడయ్యాయి. మరి మస్క్ బయోగ్రఫీ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయనుందో వేచి చూడాలి. -
ఓనం సెలబ్రేషన్స్‌లో స్టార్ కపుల్.. ట్విన్స్‌తో తొలిసారిగా!
సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన నటనతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న భామ గతేడాది జూన్‌లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు కూడా తల్లిదండ్రులయ్యారు. అయితే నయన్ దంపతులు సరోగసి ద్వారా బిడ్డలకు జన్మనివ్వడం అప్పట్లో పెద్ద వివాదానికి దారితీసింది. అయితే ఇప్పటివరకు తమ పిల్లల మొహాలను ఇప్పటివరకు అభిమానులకు చూపించలేదు. (ఇది చదవండి: రాజకీయాల్లోకి స్టార్ హీరో.. పక్కా ప్లాన్‌తో ప్రజల్లోకి!) తాజాగా కేరళలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఓనం పండుగ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తమ ఇద్దరు పిల్లలతో కలిసి తొలిసారిగా ఓనం జరుపుకోవడం సంతోషంగా ఉందంటూ విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. సెలబ్రేషన్స్‌తో పాటు తన భార్య, పిల్లలతో ఉన్న ఫోటోలను పంచుకున్నారు. 'మా జీవితంలో అందమైన, అద్భుతమైన క్షణాలు.. ఉయిర్, ఉలగంతో కలిసి తొలిసారిగా ఓనం పండుగ జరుపుకుంటున్నాం.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు సైతం వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
కవలలకు జన్మనిచ్చిన బుల్లితెర నటి.. సోషల్ మీడియాలో వైరల్!
రజియా సుల్తాన్ అనే సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ బుల్లితెర నటి పంకురీ అవస్తీ. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో నటించింది. ఆ తర్వాత సూర్యపుత్ర కరణ్, మేడమ్ సార్, యే రిస్తా క్యా కెహ్లాతా పై లాంటి సీరియల్స్‌లో కనిపించింది. సూర్యపుత్ర కరణ్ టీవీ షో నటించిన గౌతమ్‌ను ప్రేమ వివాహాం చేసుకుంది భామ. తాజాగా ఈ జంటకు కవల పిల్లలు జన్మనిచ్చారు. ఈనెల 25న బుల్లితెర భామకు ఓ పాప, బాబు జన్మించినట్లు తన ఇన్‌స్టాలో పంచుకుంది. (ఇది చదవండి: ఆ సీక్రెట్ చెప్పేస్తానంటోన్న ఆదిపురుష్ భామ.. ప్రభాస్ కోసమేనా అంటున్న ఫ్యాన్స్!) ఇన్‌స్టాలో రాస్తూ..' ఆనందం, కృతజ్ఞతతో నిండిన రెండు మనసులు.. ఇప్పుడు నలుగురిగా ప్రయాణం ప్రారంభించబోతున్నాం. ఈ సందర్భాన్ని ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాం. మా పట్ల మీ అందరి ప్రేమకు, ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన పలువురు నటీనటులు ఈ జంటకు కంగ్రాట్స్ చెప్పారు. గౌహర్ ఖాన్, రాజ్‌పుత్ పాయల్‌తో పాటు దివ్యాంక త్రిపాఠి, దేవోలీనా భట్టాచార్జీ, మొహ్సిన్ ఖాన్, అమీర్ అలీ, భారతీ సింగ్ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గౌతమ్-పంకురి ప్రేమకథ 'రజియా సుల్తాన్' షో ద్వారా పంకురికీ గుర్తింపు దక్కింది. 'సరస్వతీచంద్ర' అనే సీరియల్ ద్వారా పేరు తెచ్చుకున్న గౌతమ్.. ఆ తర్వాత 'సూర్యపుత్ర కరణ్' సీరియల్లో కలిసి నటించారు. అదే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కొన్ని నెలల పాటు డేటింగ్లో ఉన్న ఈ జంట.. ఫిబ్రవరి 2018లో రాజస్థాన్‌లోని అల్వార్ తిజారా ఫోర్ట్ ప్యాలెస్‌లో జరిగిన గొప్ప వేడుకలో పెళ్లి చేసుకున్నారు. (ఇది చదవండి: నిహారికతో విడాకులు.. తొలిసారి పోస్ట్ చేసిన చైతన్య!) View this post on Instagram A post shared by Pankhuri Awasthy Rode (@pankhuri313) -
సినిమాల్లో నటనే కాదు.. అమ్మతనం ఉట్టి పడుతోంది!
లేడీ సూపర్ స్టార్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు నయనతార. కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌ను పెళ్లాడిన భామ.. సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షారుక్ ఖాన్ సరసన జవాన్‌లో నటిస్తోంది. ఈ చిత్రం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఎప్పుడు సినిమాలతో బిజీగా నయన్.. చిన్న పిల్లలకు టైం కేటాయించేందుకు వీలు కాదు. అలా ప్రొఫెషనల్ లైఫ్‌తో పర్సనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేస్తోంది ముద్దుగుమ్మ. (ఇది చదవండి: ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!) ఆదివారం కాస్తా తన కుమారులతో అమ్మతన్నాని ఆస్వాదిస్తోంది. సినిమాల్లో ప్రియురాలుగా, భర్తకు భార్యగా, బిడ్డకు తల్లిగా ఎంతగా ప్రేమను చూపిన అది నటనే కాబట్టి అందులో మమతాను రాగాలు ఉండవు. అదే నిజ జీవితంలో ఇప్పుడు నయనతార అమ్మతనాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తున్నారు. అందులో సహజ సిద్ధంగా కలిగే మాధుర్యాన్ని అనుభవిస్తున్నారు. అలా ఆదివారం కాస్తా తీరిక లభించడంతో తన బిడ్డను లాలిస్తూ మురిసి పోతున్న దృశ్యాన్ని ఆమె భర్త విఘ్నేశ్ శివన్ ఫొటో తీసి దాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తమ ప్రాణంగా ప్రేమించే పిల్లలతో సమయాన్ని ఆనందంగా గడిపినట్లు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం నయనతార హిందీలో షారుక్ ఖాన్‌తో తొలిసారిగా జతకట్టిన జవాన్ చిత్ర విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు తన 75 చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలిసింది. గత ఆరేళ్లకు పైగా ప్రేమించుకుంటూ సహజీవనం చేసిన దర్శకుడు విఘ్నేష్ శివన్.. గతేడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. (ఇది చదవండి: హీరోయిన్ల చీరలు లాగి లాగి చిరాకొచ్చింది: ప్రముఖ నటుడు ) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
జంట అరటిపండ్లు తినకూడదా?.. దేవుడికి కూడా సమర్పించకూడదా?
అరటిపళ్ళు కొనడానికి వెళ్ళినప్పుడు అరటిపళ్ళ వ్యాపారి అరటి గెలలోంచి అరటి హస్తాలు కోస్తున్నప్పుడు మన కళ్ళు ఆ హస్తం మీదే నిలుస్తాయి. ఆ హస్తంలో ఒకదానితో మరొకటి అతుక్కుపోయి వున్న జంట అరటిపళ్ళుగానీ ఉన్నాయా అని చూస్తాం. ఒకవేళ వుంటే ఆ కవల పండు వద్దని చెప్పి తీయించేస్తాం. కారణం.. జంట అరటిపళ్ళు పిల్లలు తినకూడదు. పైగా తింటే కవల పిల్లలు పుడతారనే అనే ఒక నమ్మకం ప్రజల్లో నాటుకుపోయింది. అసలు నిజానికి తినొచ్చా..తింటే ఏమవుతుంది? దేవుడికి సమర్పించొచ్చా లేదా తదితరాలు గురించి తెలుసుకుందామా! కవల అరటి పళ్ళను దేవుడికి పెట్టకూడదు. ఇలాంటి నమ్మకాలు మనకి వుంటాయి. అందుకే కవల అరటిపళ్ళను తీసుకోవడానికి ఇష్టపడం. అయితే చాలాసార్లు మనం కొన్న అరటిపళ్ళలో మనకి తెలియకుండానే కవల అరటిపళ్ళు వచ్చేస్తూ వుంటాయి. వాటిని పిల్లలకి పెట్టకుండా, దేవుడికి పెట్టకుండా పెద్దవాళ్ళే తింటూ వుంటారు. ఇంతకీ, కవల అరటిపళ్ళను పిల్లలకు పెట్టోచ్చా, ముఖ్యంగా పెళ్లి కాని వారు తినోచ్చా అంటే..కవలలు పుడతారని భారతీయుల విశ్వాసమే గానీ శాస్త్రీయంగా మాత్రం ఎక్కడా నిరూపితం కాలేదు. ఇలా ఫిలిప్పీన్స్ వాసులు కూడా మనలానే నమ్ముతారట. వారు కూడా జంట అరటిపళ్లు తినరట. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు మొదటి మూడు నెలల్లోపు తింటే కవలలు పుడతారని మన వాళ్లు గట్టిగా నమ్ముతారు. అలాగే కొందరూ.. కవల పిల్లలు కావాలనే ఉద్దేశంతో జంట అరటిపళ్లు తింటారని చెబుతున్నారు. కానీ ఇందులో వాస్తవం లేదని నిపుణులు చెబుతున్నారు. అలా జరగలేదని నొక్కి చెబుతున్నారు. అదుకు ఆస్కారం లేదంటూ సైన్స్ కొట్టిపారేస్తుంది. అదొక మూఢ నమ్మకమే తప్ప మరేం కాదని తేల్చి చెబుతోంది. దేవతలకు పెట్టొచ్చా అంటే.. దీనికి పండితులు ఏం చెప్పారంటే.. ”అరటి చెట్టు అంటే మరెవరో కాదు. సాక్షాత్తూ దేవనర్తకి రంభ అవతారమే. శ్రీమహావిష్ణువు దగ్గర రంభ అందగత్తెనని అహంకార పూరితంగా వ్యవహరించడం వల్ల ఆమెను భూలోకంలో అరటిచెట్టుగా జన్మించమని మహావిష్ణువు శపించాడు. అయితే ఆమె తన తప్పు తెలుసుకుని ప్రాధేయ పడటంతో దేవుడికి నైవేద్యంగా వుండే అర్హతను విష్ణువు రంభకి వరంగా ఇచ్చారు. అందువల్ల అంత పవిత్రమైన పండులో మనం దోషాలను ఎంచాల్సిన అవసరం లేదంటున్నారు. కవల అరటిపళ్ళను నిరభ్యంతరంగా దేవతలకు అర్పించవచ్చు. అయితే తాంబూలంలో మాత్రం జంట అరటి పళ్ళను పెట్టకూడదట. ఎందుకంటే కవల అరటి పండులో రెండు పళ్ళు ఉన్నప్పటికీ అది ఒక్క పండుకిందే లెక్కలోకి వస్తుంది. మరి తాంబూలంలో ఒక్కపండు పెట్టకూడదు కదా..! అలాగని రెండు కవల అరటిపళ్లు తాంబూలంలో పెట్టడం బాగోదు. పైగా తీసుకోవడానికి అవతలి వాళ్లు సంకోచించే అవకాశం ఉంది, మరోవైపు తాంబులాన్ని వద్దనకూడదు అనేది శాస్త్రం. దీంతో అవతలి వ్యక్తి ఈ రెండు సమస్యలతో సందిగ్ధంలో పడి కలత చెందే అవకాశం ఉంది. ఇంటికి వచ్చిన అతిధిని గౌరవించడం మన సంప్రదాయమేగాక ఆనందంగానే వారిని సాగనంపుతాం. అందువల్ల తాంబూలంలో మాత్రం కవల అరటిపళ్ళను మినహాయించడమే మంచిది. (చదవండి: ఉపేక్షిస్తే ఉనికికే ప్రమాదం!) -
తొలిసారి ట్విన్స్ ఫోటోలు షేర్ చేసిన సింగర్..ఏడాది తర్వాత!
సింగర్ చిన్మయి శ్రీపాద తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు చురుక్కుగా ఉంటోంది. ఇటీవల ఎక్కువగా మహిళలు, బాలికలపై జరుగుతున్న దారుణాలను ప్రశ్నిస్తూ వారికి అండగా నిలుస్తోంది. అయితే నటుడు, దర్శకుడైన రాహుల్ రవీంద్రన్‌ను ఆమె పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్‌లో ఈ జంటకు ట్విన్స్ జన్మించారు. వారిలో ఓ బాబు, పాప ఉన్నారు. కానీ ఇప్పటి వరకు తమ కవలలను బయటికి చూపించలేదు. (ఇది చదవండి: నేను వాటిని పట్టించుకోను.. కాబోయే వాడు మాత్రం ఇలా ఉంటేనే: శోభిత ధూళిపాళ) దాదాపు ఏడాది తర్వాత తన పిల్లల మొహాలను అభిమానులకు పరిచయం చేసింది చిన్మయి. తన పిల్లలతో దిగిన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ వావ్ క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. గతంలో చిన్మయి శ్రీపాద ప్రెగ్నెన్సీపై రూమర్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె సరోగసీ ద్వారా పిల్లలకు జన్మినిచ్చారని వార్తలొచ్చాయి. కానీ ఆమె తన బేబీ బంప్ ఫోటోలతో వాటికి చెక్ పెట్టింది. కానీ అదే సమయంలో తన పిల్లల ముఖాలను బహిర్గతం చేయనని కూడా శ్రీపాద చెప్పింది. నా వ్యక్తిగత జీవితం, నా కుటుంబం, నా స్నేహితుల విషయంలో ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉంటానని తెలిపింది. మా పిల్లల ఫోటోలు షేర్ సోషల్ మీడియాలో షేర్ చేయనని తెలిపింది. (ఇది చదవండి: ప్రేమ పెళ్లి.. విడిపోయిన జంట.. నటికి భర్త అసభ్యకర సందేశాలు!) View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
సింగర్ చిన్మయి శ్రీపాద కవలలను చూశారా? ఎంత క్యూట్‌గా ఉన్నారో! (ఫొటోలు)
-
కవల పిల్లల పేర్లు రివీల్ చేసిన నయనతార
-
నయన్ కవలల పిక్ షేర్ చేసిన భర్త విఘ్నేశ్ శివన్
లేడీ సూపర్ స్టార్ నయనతార-దర్శకుడు విఘ్నేశ్ గతేడాది జూన్‌లో పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. దాదాపు 5 ఏళ్లు ప్రేమలో మునిగి తేలిన నయన్, విఘ్నేశ్‌లు లివింగ్ రిలేషన్లో ఉన్నారు. ఈ క్రమంలో 2022లో పెళ్లి చేసుకున్న ఈ జంట ఐదు నెలలు తిరక్కుండానే సరోగసి ద్వారా కవలకు తల్లిదండ్రులయ్యారు. అప్పట్లో ఈ వ్యవహరం వివాదం మారింది. అన్ని నిబంధనల ప్రకారమే తాము సరోగసికి వెళ్లామని నయన్ దంపతులు ప్రభుత్వానికి వివరణ ఇచ్చుకోవడంతో వివాదం సద్దుమనిగింది. చదవండి: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ‘మాతృదేవోభవ’ హీరోయిన్.. ఫొటోలు వైరల్ కవలలు జన్మించి నెలలు గడుస్తున్న ఇంతవరకు వారి ఫేస్ రివీల్ చేయలేదు ఈ జంట. దీంతో నయన్ పిల్లలను చూసేందుకు నెటిజన్లు, ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆమె భర్త విఘ్నేశ్ తాజాగా చిన్నారుల క్యూట్ పిక్స్ షేర్ చేశాడు. ఎప్పటిలాగే వారి ముఖం కనిపించకుండ విఘ్నేశ్ జాగ్రత్త పడ్డాడు. దీంతో నెటిజన్లు వారిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇంకా ఎంతకాలం ఇలా చేస్తారు’ అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. చదవండి: షాకింగ్: లాకర్లోని రజనీకాంత్ కూతురు ఐశ్వర్య బంగారం, వజ్రాలు చోరీ కాగా నయన్, విఘ్నేశ్‌లు చిన్నారుల చేతులు పట్టుకుని ఉన్న ఫొటోలన పోస్ట్ చేస్తూ.. ‘ఆనందం అనేది మన ప్రియమైన వారితోనే ముడిపడి ఉంటుంది. ప్రేమ అంటేనే ఆనందం.. ఆనందం అంటనే ప్రేమ’ అంటూ విఘ్నేశ్ తన పోస్ట్‌కు రాసుకొచ్చాడు. కాగా ఇటీవల ఈ స్టార్ కపుల్ తమ కవలలతో ముంబై ఎయిర్‌పోర్టులో దర్శనం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మీడియా వాళ్ళ కెమెరాలకు పనిచేప్పారు. స్టార్ కపుల్ వెంట పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టంట వైరల్‌గా మారాయి. కాగా తమ పిల్లలకు ఉయిర్, ఉలగం అని పేర్లు పెట్టినట్టు తెలుస్తోంది. ఉయిర్ అంటే ప్రపంచం అని.. ఉలగం అంటే జీవితం అని అర్ధం. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
ముద్దుల మనవలకు అంబానీ బ్రహ్మాండమైన గిఫ్ట్: వీడియో వైరల్
సాక్షి,ముంబై: బిలియనీర్, రిలయన్స్చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీ అమ్మమ్మ, తాతయ్యలుగా కవల మనవలకు బ్రహ్మాండమైన గిఫ్ట్ ఇచ్చారు. ఆకర్షణీయమైన ఐదడుగుల అల్ట్రా-లగ్జరీ క్లోసెట్ను బహుమతిగా ఇచ్చారు. మనవడు కృష్ణ మనవరాలు ఆదియా పుట్టిన సందర్భంగా గ్రాండ్‌గా పార్టీ ఇచ్చిన అంబానీ దంపతులు తాజాగా వారికిచ్చిన గిఫ్ట్ వైరల్‌గా మారింది. పాపులర్ మహిళా పారిశ్రామిక వేత్త, అంబారీ ఏకైక కుమార్తె ఇషా అంబానీ, వ్యాపార దిగ్గజం ఆనంద్ పిరమల్ దంపతులకు 2022 నవంబరులో కవల పిల్లలకు జన్మించిన సంగతి తెలిసిందే. ఈ కవలల కోసమే లగ్జరీ క్లోసెట్( కప్బోర్డ్)ను ప్రత్యేకంగా కస్టమైజ్ చేసి ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం విశేషం. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎల్లో కలర్ రూంలో హాట్-ఎయిర్ బెలూన్లతో మేఘాల వాల్‌పేపర్‌తో ఆకట్టుకుంటోంది. అలాగే టెడ్డీ బేర్లు, ఆకర్షణీయమైన రంగుల కృత్రిమ పువ్వులు, రెండు స్పెషల్ బాక్స్లతోపాటు, ఒక గ్లోబ్, రెండు పాస్‌పోర్ట్‌లు, ఒక చిన్న విమానాన్ని కూడా ఇందులో పొందుపర్చారు. అలాగే కస్టమైజ్డ్ క్లోసెట్ డోర్ పైన "అడ్వెంచర్స్ ఆఫ్ ఆదియా అండ్ కృష్ణ" అని రాసి ఉండటం గమనార్హం. View this post on Instagram A post shared by Gifts Tell All (@giftstellall) -
నయనతార-విగ్నేశ్ల ఇంటికి వెళ్లిన రాధికా శరత్‌కుమార్
తమిళసినిమా: సంచలన నటి నయనతార దర్శకుడు విగ్నేశ్ శివన్‌ల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. 2016 నుంచి ఈ జంట సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. కాగా గత జూన్‌లో ఈ ప్రేమ జంట వివాహం చేసుకున్నారు. అయితే నయనతార విజయ్ సేతుపతి జంటగా నటించిన నానుమ్ రౌడీదాన్ చిత్రానికి విగ్నేశ్ శివన్ దర్శకత్వం వహించారు. అప్పుడే నయనతార, విఘ్నేష్ శివన్‌ల మధ్య ప్రేమ చిగురించింది. కాగా ఈ జంట అద్దె తల్లి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలోనూ సంచలనం కలిగించారు. పలు వురి విమర్శల మధ్య ఇది ప్రభుత్వం వరకు వెళ్లింది. నయనతార విగ్నేశ్శివన్లకు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు సమన్లు జారీ చేయడం, వారు వి వరణ ఇవ్వడం విచారణ వంటి సంఘటన తరువాత అన్నీ సక్రమమే అన్న ప్రత్యేక కమిటీ ప్రకటనతో నయనతార విఘ్నే ష్ శివన్‌లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే పలువురు సినీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు అందించా రు. తాజాగా నటి రాధికాశరత్‌కుమార్ స్వయంగా స్థానిక ఎగ్మోర్‌లోని నయనతార ఇంటికి వెళ్లి ఆమె కవల పిల్లలను చూశారు. అలాగే నయనతార విఘ్నేష్ శివన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. వారితో దిగిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేసి, నయనతార కవల పిల్లలు చాలా బాగున్నారు అంటూ పేర్కొన్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
నయనతార-విగ్నేశ్ సరోగసి వివాదంలో కీలక మలుపు
తమిళసినిమా: నటి నయనతార సరోగసి పద్ధతి ద్వారా కవలపిల్లలకు తల్లి అయిన వి షయం తెలిసిందే. అయితే ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నయనతార ఈ వ్యవహారంలో నిబంధనలను పాటించారా? లేదా? అన్న విషయంపై పెద్ద చర్చే జరుగుతోంది. కారణం సరోగసి విధానంతో అద్దె తల్లి ద్వారా పిల్లలను కనడం అన్న అంశంపై ఈ ఏడాది జనవరిలోనే నిషేధం విధించారు. అలాంటిది గత జూన్ నెలలో నయనతార దర్శ కుడు విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకున్నారు. నాలుగు నెలల్లోనే నయనతార ఈ జంట సరోగసి ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులు కావడం వివాదంగా మారింది. సరోగసి పద్ధతి ద్వారా పిల్లలను కనడానికి కొన్ని చట్టపరమైన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని నటి కస్తరి లేవనెత్తారు. సరోగసి ద్వారా తల్లిదండ్రులు కావాలనుకుంటే వారికి పెళ్లి జరిగి కనీసం మూడేళ్లు పూర్తవ్వాలి. అలాగే తల్లికి పిల్లలు పుట్టే అర్హత లేకపోవడమో, లేక ఆమెకి ఇష్టం లేకపోవడమో వంటి తగిన ఆధారాలను చూపించాల్సి ఉంటుంది. అయితే నటి నయనతార ఈ విషయంలో విధి, విధానాలను మీరినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంలో నటి నయనతారను వివరణ కోరుతామని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణియన్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై కూడా పెద్ద చర్చే జరుగుతోంది. ఈ వ్యవహారంలో న్యాయనిపుణులు కూడా నయనతారకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ వ్యాఖ్యలు చేస్తున్నారు. పిల్లలను పొందడానికి నయనతార, విఘ్నేష్ శివన్ ముందుగానే చట్టబద్ధంగా నమోదు చేసుకున్నారని, కాబట్టి వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం లేదని కొందరు న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. వీరి సంగతి ఇలా ఉంటే వీరికి అద్దె తల్లి ద్వారా కవల పిల్లలు జన్మించారు. చెన్నైలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన ప్రముఖ వైద్యుడు నయనతారకు అద్దె తల్లి ద్వారా పిల్లలకు తల్లి కావచ్చని సలహా ఇచ్చినట్లు సమాచా రం. దీంతో వైద్యాధికారులు ఆస్పత్రి సిబ్బంది, వైద్యులపై చర్యలు తీసుకునే విషయమై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఎటు దారి తీస్తుందో అనే ఆసక్తి నెలకొంది -
కవల పిల్లలని ఎంతో సంబరపడ్డా, కానీ.. నా పిల్లలను ఆదుకోండి.. ప్లీజ్!
ఐదేళ్లుగా పిల్లల కోసం ఎంతగానో పరితపించిన దంపతులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఆస్పత్రులు చుట్టూ తిరిగి మందులు వాడగా.. ఆమె గర్భవతి అయ్యింది. ట్విన్స్ అని తెలిసి ఆ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆరు నెలలకే ఆమె బిడ్డలకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే.. మాతృత్వపు మాధుర్యాన్ని తలచుకుంటూ.. తొమ్మిది నెలల భారాన్ని ఆనందంగా అనుభవించి.. బిడ్డకు జన్మనివ్వాలని అనుకున్నాను. కానీ నేను అమ్మ తనం కోసం ఐదేళ్లు ఎదురు చూశా. దేవుడు కరుణించడంతో గర్భం దాల్చాను. అయితే గర్భవతిగా ఉన్న నాకు ఓ రోజు ఉదయం నాకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా.. వైద్య పరీక్షలు చేసి ఉమ్మనీరు తగ్గిందని, వెంటనే డెలివరీ చేయాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పిన విషయాన్ని అన్బుకరసి గుర్తు చేసుకున్నారు. మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి 26 వారాల గర్భిణీ స్త్రీగా ఉన్న నాకు డాక్టర్లు ప్రీ మెచ్యూర్ డెలివరీ చేశారు. ప్రీ మెచ్యూర్ డెలివరీ కారణంగా పుట్టిన కవలలకు శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో అప్పటి నుంచి వాళ్లిద్దరూ ఎన్ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.పిల్లలు ట్వీట్మెంట్కు సహకరిస్తున్నారని, సురక్షితంగా బయటపడాలంటే మరికొన్ని నెలలు ఎన్‌ఐసీయూలోనే చికిత్స పొందాల్సి ఉంటుందని డాక్టర్లు చెప్పారు. ఖరీదైన వైద్యం కోసం రూ.20 లక్షలు ఖర్చువుతుంది. చాలీ చాలని జీతాలతో బతుకు భారాన్ని మోస్తున్న మేం.. మా పిల్లల్ని రక్షించుకునేందుకు ఇల్లు వాకిలి అమ్ముకున్నాం. బ్యాంకు లోన్ తీసుకొని రూ.8 లక్షల వరకు ఖర్చు చేశాం. ఇప్పటి వరకు చేయాల్సిన వన్నీ చేశాం. మా పిల్లల ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయి. చికిత్స కోసం తగినంత ఆర్ధిక సాయం చేయండి. మా పిల్లల ప్రాణాల్ని కాపాడండి. (అడ్వర్టోరియల్) మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
Heteroparental superfecundation: కవలలే గానీ... తండ్రులు వేరు
బ్రెజిల్లో ఓ 19 ఏళ్ల యువతి కవలలకు జన్మనిచ్చింది. ఇందులో విశేషం ఏముందంటారా? చాలా పెద్ద విశేషమే ఉంది. ఆ కవలలిద్దరికీ తండ్రులు వేర్వేరు! నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజమే. సదరు యువతి ఒకే రోజున ఇద్దరు యువకులతో శారీరకంగా కలవడం ఇందుకు దారి తీసిందట!! పిల్లలకు 8 నెలలు వచ్చాక అసలు వారి తండ్రి ఎవరా అని ఆమెకు అనుమానం వచ్చింది. వారి తండ్రిగా తాను భావిస్తున్న యువకునికి పితృత్వ పరీక్ష చేయించగా కవలల్లో ఒకరి డీఎన్ఏతో మాత్రమే సరిపోయిందట. దాంతో ఆమెతో పాటు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. కాసేపు ఆలోచించిన మీదట, తాను అదే రోజు మరో యువకునితో శారీరకంగా కలిసిన విషయం ఆమెకు గుర్తొచ్చింది. డీఎన్ఏ పరీక్ష చేయించగా రెండో బాబుకు అతనే తండ్రి అని తేలింది! ‘‘ఇది అత్యంత అరుదైన సంగతి. 10 లక్షల్లో ఒక్క కేసులో మాత్రమే ఇలా జరిగేందుకు ఆస్కారముంటుంది’’ అని డాక్టర్లు చెబుతున్నారు. శాస్త్రీయంగా దీన్ని హెటరో పేరెంటల్ సూపర్ ఫెకండేషన్ (బహుళ పిండోత్పత్తి)గా పిలుస్తారట. ఒకే రోజు ఇద్దరు పురుషులతో శారీరకంగా కలిసి, సదరు స్త్రీ తాలుకు రెండు అండాలు వారి వీర్య కణాలతో వేర్వేరుగా ఫలదీకరణ చెందితే ఇలా జరుగుతుందట. ఫలితంగా తయారయ్యే రెండు పిండాలూ వేర్వేరు మావి (ఉమ్మనీటి సంచి)లో పెరుగుతాయట. మనుషుల్లో అత్యంత అరుదే అయినా పలు జంతువుల్లో మాత్రం ఇది కాస్త సాధారణమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
కవల పిల్లలతో దైవ దర్శనం చేసుకున్న నమిత
Namitha Visits Temple With Her Twin Baby Boys: బ్యూటిఫుల్ హీరోయిన్ నమితను చూసినా, ఆమె పేరు విన్న కుర్రకారులో ఒక్కసారిగా జోష్ పెరుగుతుంది. కారణం ఆమె వారిని ఎక్కడ చూసినా మచ్చాస్ అంటూ ఫ్లైయింగ్ కిస్ల వర్షం కురిపించడమే. ఇక సినిమాలో బొద్దుగా ముద్దుగా కనిపిస్తూ అందాల ఆరబోతతో యువతను గిలిగింతలు పెడుతుంది. విజయకాంత్ సరసన ఎళుగళ్ అనే చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథానాయికిగా దిగుమతి అయింది ఈ గుజరాతి భామ నమిత. ఆ తర్వాత అజిత్, విజయ్, చరణ్ కుమార్ వంటి ప్రముఖ హీరోలందరితో జతకట్టి టాప్ హీరోయిన్గా ఎదిగింది. అదేవిధంగా తెలుగు, మలయాళం వంటి ఇతర చిత్రాలలో నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. సినిమాలో నటిస్తూనే ఇతర వ్యాపార రంగాల్లో పెట్టుబడి పెట్టి వ్యాపారవేత్తగా ఎదిగిన ఈమె 2017లో వీరేంద్ర చౌదరి అనే నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కాగా ఆ మధ్య తను గర్భిణిగా ఉన్న ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి త్వరలో మాతృమూర్తిని కాబోతున్నట్లు సంతోషం వ్యక్తం చేసింది. చదవండి: ఒక్కరోజే 18 సినిమాలు, సిరీస్‌లు.. ఎక్కడో తెలుసా? తన భార్య సొంత చెల్లిని పెళ్లాడిన స్టార్ హీరో.. కష్టాలతో జీవితం ఇక ఈ శుక్రవారం (ఆగస్టు 19) అనూహ్యంగా భర్త, ఇద్దరు పురిటి బిడ్డలతో దైవ దర్శనం చేసుకుంటున్న ఫొటోలతో సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షం అయ్యింది. అందులో తాను చెన్నైలోని రేలా ఆసుపత్రిలో కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు పేర్కొంది. ఇద్దరూ మగ పిల్లలే అని, క్షేమంగా ఉన్నారనీ తెలిపింది. ఈ సందర్భంగా తనకు వైద్యం అందించిన ఆ ఆస్పత్రి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఈమె ప్రసవం ఎప్పుడు జరిగిందన్నది మాత్రం వెల్లడించలేదు. ఏదేమైనా నమిత కవల పిల్లలకు జన్మనిచ్చిందన్న విషయం తెలిసి ఆమె అభిమానులు ఖుషి అవుతున్నారు. చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు View this post on Instagram A post shared by Namita Vankawala Chowdhary (@namita.official) -
కవల పిల్లలకు జన్మనిచ్చిన హీరోయిన్ నమిత..
హీరోయిన్ నమిత గుడ్‌న్యూస్ షేర్ చేసుకుంది. ఆమె కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా నమిత తన ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. 'నాకు ట్విన్ బాయ్స్ పుట్టారు. కృష్ణాష్టమి రోజున(శుక్రవారం)ఈ గుడ్‌న్యూస్‌ను మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదాలు, ప్రేమ మాపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. హాస్పిటల్ సిబ్బందికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నా ప్రెగ్నెన్సీ జర్నీలో నన్ను గైడ్ చేసినందుకు, నా పిల్లలను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను' అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కాగా సొంతం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన నమిత వెంకటేశ్‌తో నటించిన జెమిని సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా క్రేజ్ దక్కించుకుంది. 2017లో ప్రియుడు వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకుంది. ఇక నమితకు ట్విన్స్ పుట్టారని తెలిసి పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. View this post on Instagram A post shared by Namita Vankawala Chowdhary (@namita.official) -
షాకింగ్ ఘటన: రోడ్డులేక డోలీలో ఆస్పత్రికి.. కవలలు మృతి!
ముంబై: దేశంలో ఇంకా చాలా గ్రామాలకు కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. రోడ్డు వసతి సరిగా లేకపోవటం వల్ల నెలలు నిండకముందే పుట్టిన కవల శిశువులు తల్లి కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయారు. తన బిడ్డలను చూసుకుని ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయిన ఈ సంఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో వెలుగు చూసింది. సరైన రోడ్డు మార్గం లేకపోవటంతో బాలింతను డోలీలో ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పాల్ఘర్ జిల్లా మోఖడా తహసీల్‌కు చెందిన వందన బుధర్ అనే మహిళ ఏడు నెలల గర్భవతి. అయితే, నెలలు నిండకముందే తన ఇంటిలోనే కవల పిల్లలకు జన్మనిచ్చింది. నెలలు నిండకుండానే పుట్టిన ఆ శిశువులు బలహీనంగా ఉన్నారు. ఆసుపత్రికి తరలించేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవటం వల్ల వారికి సమయానికి సరైన వైద్య సహాయం అందలేదు. దీంతో తల్లి కళ్లెదుటే ఇద్దరు శిశువులు కన్నుమూశారు. మరోవైపు.. తీవ్ర రక్తస్రావంతో మహిళ పరిస్థితి సైతం విషమంగా మారింది. దీంతో బెడ్‌షీట్‌తో డోలీ తయారు చేసుకుని బాలింతను సుమారు 3 కిలోమీటర్లు దూరం మోసుకెళ్లారు కుటుంబ సభ్యులు. మహిళ ప్రస్తుతం స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ సంఘటన తనను తీవ్రంగా బాధించిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిత్ర కిశోర్ వాగ్ ట్వీట్ చేశారు. సరైన సమయంలో వైద్యం అందకపోవటంతోనే కవల శిశువులు మరణించారని, అది దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు సరైన రోడ్డు మార్గం లేకపోవటం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇదీ చదవండి: రూ.500 కోసం హత్య.. తల నరికి చేతిలో పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు..! -
లేక లేక ట్విన్స్ పుట్టారు..కానీ ఆ సంతోషం నిలవాలంటే!
ఆస్తికి పేదలైనా, అమ్మా, నాన్న అనిపించుకోవాలని ప్రతీ జంట కోరుకుంటుంది. అలా లేక లేక...ఏడేళ్ల ఎదురు చూపుల తరువాత గర్భం దాలిస్తే... అందులోనూ కడుపులో ఉన్నది ట్విన్స్ అని తెలిస్తే.. ఇంకా ఆనందం. కానీ ఫాతిమా, జునైద్ కథ వేరే..అదేంటో ఒకసారి చూద్దాం..! ఫాతిమా, జునైద్ ఇద్దరూ అన్యోన్య దంపతులు. పెళ్లి అయ్యి 7 సంవత్సరాలు గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో ఆందోళన చెందారు. ఇక లాభం లేదు అని నిరాశపడుతున్న సమయంలో వారి ప్రయత్నాలు ఫలించి ఫాతిమా గర్భం దాల్చింది. దీంతో తమ ఆశలు నెరవేరబోతున్నందుకు, అందులోనూ కవలలకు జన్మనివ్వబోతున్నామని తెలిసి ఫాతిమా జునైద్ జంట ఆనందానికి అవధుల్లేవు. కానీ సరిగ్గా మూడు నెలలైనా తిరగకుండానే ఆ సంతోషం కాస్తా ఆందోళనగా మారిపోయింది. పిల్లల ఎదుగుదల సరిగ్గా లేదు. అబార్షన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అంతేకాదు గర్భాన్ని కొనసాగిస్తే తల్లికి కూడా ప్రమాదమని హెచ్చరించారు. అయినా ఫాతిమా, జునైద్ పెద్దసాహసమే చేశారు. ఎలాగైనా బిడ్డల్ని కనాలనే నిర్ణయించుకున్నారు. మొత్తానికి అలా ఎనిమిదినెలలు గడిచాయి. ఒకరోజు విపరీతమైన కడుపునొప్పితో ఫాతిమా ఇబ్బంది పడింది. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. కళ్లు తెరిచి చూసేసరికి ఎదురుగా ఆందోళనగా భర్త. ‘‘ఏమైంది’’ అని అడిగింది విచారంగా ఫాతిమా..కవలబిడ్డల్ని తలుచుకుంటూ..‘‘థ్యాంక్ గాడ్..నీకు గండం గడిచింది ఆ దేవుడు దయ వల్ల అతికష్టంమీద నువ్వు ప్రాణాపాయం నుంచి బయటపడ్డావు. మనకి ఇద్దరు కొడుకులు ఫాతిమా’’ అని చెప్పాడు ఉబికివస్తున్న కనీళ్లను అదుముకుంటూ. ‘‘కానీ ఇద్దరు వెంటిలేటర్‌పై NICUలో ఉన్నారు.డాక్లర్లు ఇంకా ఏ విషయమూ చెప్పడం లేదు’’ అన్నాడు నీరు నిండిన కళ్లను తుడుచుకుంటూ. అలా దాదాపు నెల రోజులు గడిచిపోయింది. అయినా ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. నెలలు నిండకుండా పుట్టడం వల్ల వచ్చిన సమస్యలతో పిల్లలు పూర్తిగా కోలుకోవాలంటే సుమారు 10 లక్షలు ($ 12506.89) ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఉన్నదంతా ఖర్చుపెట్టారు. జునైద్ నెల సంపాదన కేవలం 5 వేల రూపాయలుమాత్రమే. అయినా దాదాపు రెండు లక్షల వరకు ఖర్చుపెట్టారు. ఒకవైపు సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. మరోవైపు వైద్య ఖర్చులు భరించే శక్తి లేదు. అందుకే తన కుమారులను కాపాడుకునేందుకు దాతలు స్పందించాలని కన్నీళ్లతో వేడుకుంటున్నారు ఫాతిమా జునైద్ దంపతులు. ఇన్ని రోజులైనా బిడ్డలు ఇంకా కోలుకోలేదు.వారిని మనసారా గుండెలకు హత్తుకుని తడిమి చూసుకోలేదంటూ ఫాతిమా తల్లడిల్లిపోతోంది. నా కవల పిల్లల్ని కాపాడుకునేందుకు మీ మద్దతు చాలా అవసరం! దయచేసి నా కుటుంబాన్ని, నా మాతృత్వాన్ని, నా పిల్లలను రక్షించండి! వారి జీవితాలు మీచేతుల్లోనే.. దయచేసి మీకు వీలైనంత సాయం చేయండి అని ఫాతిమా ప్రార్థిస్తోంది. (అడ్వర్టోరియల్) మీవంతు సాయం అందించేందుకు ఇక్కడ క్లిక్ చేయండి -
Alia Bhatt: రణ్‌బీర్ జోక్ చేశాడు.. ఆ మాటల్లో నిజం లేదు
హీరోయిన్ ఆలియా భట్‌కి కవల పిల్లలు పుట్టబోతున్నారనే వార్తలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. దానికి కారణం హీరో, ఆలియా భర్త రణ్‌బీర్ మాటలే. ఇక ప్రచారంలో ఉన్న వార్త గురించి ఆలియా స్పందిస్తూ ‘ట్విన్సా.. అలాంటిదేం లేదు.. ఒక్కరే’ అంటూ క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ ప్రేమపక్షులు రణ్‌బీర్ కపూర్–ఆలియా భట్ ఈ ఏడాది ఏప్రిల్ 14న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లయిన రెండు నెలలకు తాను తల్లి కాబోతున్నానని ప్రకటించి, సంతోషాన్ని పంచుకున్నారు ఆలియా. కాగా ఇటీవల ఒక ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న రణ్‌బీర్‌కి యాంకర్ ఓ సరదా టాస్క్ పెట్టారు. ఒక అబద్ధం, రెండు నిజాలు చెప్పాలని కోరారు. దీనికి రణ్‌బీర్ స్పందించి ‘ట్విన్స్ పుట్టబోతున్నారు’ అంటూ సమాధానం ఇచ్చి, అది నిజమా? అబద్ధమా? అనేది మీరే చెప్పుకోండి అన్నారు. ఆయన మాటలతో ఆలియాకి ట్విన్స్ పుట్టబోతున్నారనే వార్తలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై తాజాగా ఆలియా స్పందిస్తూ– ‘‘నాకు ట్విన్స్ పుట్టబోతున్నారంటూ రణ్‌బీర్ జోక్ చేశాడు. ఆ మాటల్లో నిజం లేదు. సరదాగా జోక్ చేస్తే జనం ఇంత సీరియస్‌గా తీసుకుంటారనుకోలేదు. నాకు ఒక్కరే పుట్టబోతున్నారు. ఈ విషయంలో ఎలాంటి ఊహాగానాలు, పుకార్లు వద్దు. అయినా అమ్మాయిలకు పెళ్లయితే ఒక టాపిక్, తల్లి కాబోతోందంటే ఒక టాపిక్.. ఇలా ఏదైనా టాపిక్కే. పెళ్లి, తల్లవడం అనేది వ్యక్తిగత విషయాలు. ఇవి వృత్తిపరంగా ఎలాంటి ప్రభావం చూపవు’’ అని స్పష్టం చేశారు. కాగా ఆలియా నటించిన తాజా చిత్రం ‘డార్లింగ్స్’ ఆగస్టు 5 నుంచి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. -
Viral Video: అలియా భట్‌కు కవలలు? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
అలియా భట్‌కు కవలలు ? రణ్‌బీర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Ranbir Kapoor Says He Having Twins With Alia Bhatt: బాలీవుడ్ లవర్ బాయ్ రణ్‌బీర్ కపూర్ నటించిన తాజా చిత్రం షంషేరా. ఈ మూవీ జులై 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇందులో భాగంగానే రణ్‌బీర్‌తో యాంకర్ సరదాగా ఒక గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో 'రెండు నిజాలు, ఒక అబద్ధం' చెప్పాల్సిందిగా రణ్‌బీర్‌ను ఆ యాంకర్ కోరారు. ఈ గేమ్‌లో మూడు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు రణ్‌బీర్ కపూర్. యాంకర్ అడిగిన ప్రశ్నకు 'నేను కవలలకు తండ్రి కాబోతున్నాను. నేను చాలా పెద్ద పౌరాణిక చిత్రంలో భాగం కాబోతున్నాను. నేను పని నుంచి లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నాను' అని మూడు ఆసక్తికర విషయాలు చెప్పాడు రణ్‌బీర్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అయితే ఇందులో ఏవి రెండు నిజాలు, ఏది ఒక అబద్ధం అని తేల్చుకోలేకపోతున్నారు నెటిజన్స్. తన భార్య అలియా భట్‌తో కలిసి బ్రహ్మాస్త్రం సినిమాలో రణ్‌బీర్ నటిస్తున్న విషయం తెలుసు కాబట్టి, పౌరాణిక చిత్రంలో భాగం కానున్నాను అనేది నిజమేనని ఊహించడం తేలికైంది. మిగతా రెండు విషయాలకొస్తే నిజంగా అలియా భట్‌కు ట్విన్స్ పుట్టనున్నారా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రణ్‌బీర్ సుధీర్ఘ విరామం గురించి ప్రస్తావిస్తూ ఇప్పటికే రణ్‌బీర్ సినిమా కెరీర్‌కు రెండేళ్లు గ్యాప్ (2018లో చివరి సినిమా విడుదలైంది) వచ్చింది. దీంతో మరోసారి నిజంగా గ్యాప్ తీసుకుంటారా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే 'అతను తండ్రి కాబోతున్నాడు. విరామం తీసుకునే అవకాశం ఉంది' అని మరికొందరు వాదిస్తున్నారు. ఇక ఈ ప్రశ్నలన్నింటికి అసలైన సమాధానం దొరకాలంటే అలియా భట్ డెలివరీ దాకా ఆగాల్సిందే. -
మరోసారి సెన్సేషన్‌గా ఈలాన్ మస్క్: అంత పిచ్చా?
న్యూఢిల్లీ: టెస్లా సీఈఓ ఈలాన్ మస్క్‌కు సంబంధించి ఒక న్యూస్ సెన్సేషనల్‌గా మారింది. తన సంస్థలో పనిచేసే సీనియర్ ఎగ్జిక్యూటవ్ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చాడట. 2021 నవంబరులో తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ న్యూరాలింక్ టాప్ ఎగ్జిక్యూటివ్ షివోన్ జిలిస్‌తో కలిసి కవల పిల్లలకు జన్మనిచ్చారనేది ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు కోర్టు పత్రాలను ధృవీకరిస్తూ పలు నివేదికలు హల్చల్ చేస్తున్నాయి. దీంతో మస్క్ సంతానం తొమ్మది మందికి చేరింది. ఇన్సైడర్ రిపోర్ట్ ప్రకారం మస్క్, జిలిస్ జంట తమ కవల పిల్లల ఇంటి పేర్లను మార్చాల్సిందిగా టెక్సాస్‌లో కోర్టులో ఏప్రిల్ 2022లో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి కోర్టు ఆమోదం తెలిపింది. దీంతో ఎక్కుమంది పిల్లల్ని కనాలని ఇటీవల వ్యాఖ్యానించిన మస్క్‌కు పిల్లలంటే అంత పిచ్చా అని నెటిజన్లు కమెంట్ చేస్తున్నారు. మస్క్‌కు చెందిన స్టార్టప్ న్యూరాలింక్‌లో 2017లో జిలిస్ చేరారు. దీనికితోడు మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ డీల్ విజయవంతమైన తరువాత ట్విటర్ బాధ్యతలను ఆమెకు అప్పగించాలని మస్క్ ఆలోచిస్తున్నాడట. మొదటి భార్య జస్టిన్, మస్క్ జంటకు ఆరుగురు పిల్లలు. అయితే ఈ ఆరుగురిలో, 10 నెలల కుమారుడు అనారోగ్యంతో మరణించాడు. మస్క్‌కు కెనెడియన్ సింగర్ గ్రిమ్స్ (క్లైర్ బౌచర్)తో కలిసి మరో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇందులో రెండో బిడ్డను సరోగసీ ద్వారా పొందారు. కాగా గతంలో మస్క్ ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉండాలన్న కోరిక వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఎక్కువ మంది పిల్లలు లేకపోతే, నాగరికత కూలిపోతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు ఫాదర్స్ డే సందర్భంగా, మస్క్ ట్రాన్స్‌జెండర్ కుమార్తె (అలెగ్జాండర్ జేవియర్ మస్క్) తన పేరును మార్చుకునేందుకు పిటిషన్ దాఖలు చేసింది. 2008లో మస్క్‌కి విడాకులు ఇచ్చిన విల్సన్‌ను తల్లిగా పేర్కొంది. -
అంకుర ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్
హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెం. 12లోని అంకుర ఆస్పత్రిలో అత్యంత అరుదైన ఆపరేషన్ నిర్వహించి కవలలను బతికించినట్లు ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గా ప్రసాద్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ శారదావాణి వెల్లడించారు. ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... 30 ఏళ్ల ఆరోగ్యవంతమైన మహిళ అత్యంత అరుదైన రకానికి చెందిన గర్భంతో ఉన్నట్లుగా గర్భధారణ జరిగిన తర్వాత 18వ వారంలో తాము గుర్తించామన్నారు. ఆమె మోనో కొరియోనిక్ ట్విన్స్ (గర్భాశయంలో ఇద్దరు పిల్లలు ఒకే ప్లాజంటా అమినిటిక్ సాక్‌ను పంచుకోవడం)గా కలిగి ఉన్నట్లు తేలిందిన్నారు. ఇలా ఉండటం అత్యంత అరుదని 35 వేల నుంచి 60 వేల గర్భాల్లో ఒకటి మాత్రమే ఇలాంటివి చోటు చేసుకుంటాయన్నారు. దీని వల్ల పిండాలకు తీవ్ర మైన సమస్యలు తలెత్తుతాయని అలాంటి స్థితిలో పిండాలు బతికేందుకు 50 శాతం వరకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కేసు విషయంలో కవలలకు ఒకరికి కపాలం, మెదడు అసంపూర్ణంగా ఉందన్నారు. ఇలాంటి సమయంలో గర్భంలో ఉన్న శిశువును సెలక్టివ్ రిడెక్షన్ ప్రత్యేక టెక్నిక్స్‌ను ఉపయోగించి తొలగించడం జరిగిందన్నారు. ఇది దేశంలోనే అత్యంత అరుదైంది అన్నారు. ప్రసవం జరిగే వరకు ఎంతో జాగ్రత్తగా పరిశీలించాల్సి వచ్చిందన్నారు. వీరిని బతికించడం, డెలివరీ చేయడం సవాళ్లతో కూడుకున్నదని చక్కని వైద్య నిపుణులతో మంచి ఉపకరణాలున్న ఎన్ఐసీయూలతో ఇలాంటి కేసులో ఫలితాలు సాధించామని వారు వెల్లడించారు. -
మొదటి కాన్పులోనే కవలలు.. అంతలోనే తల్లిదండ్రుల ఆనందం ఆవిరి
సాక్షి, హన్మకొండ: మొదటి కాన్సు.. కవలలు జన్మించారు.. ఈ విషయం సంతోషాన్ని కల్గించినా.. పుట్టిన బిడ్డలిద్దరికీ అవయవాలు పెరగడంలేదనే విషయం తెలిసి ఆ తల్లిదండ్రుల ఆనందరం ఆవిరైంది. ఆ కవలలు సాధారణ స్థితికి చేరాలంటే రూ.10లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పెద్దపల్లి జిల్లా,కాల్వశ్రీరాంపూర్ మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన బండ రాజు, అనూషలకు గత ఏడాది వివాహం జరిగింది. ఈక్రమంలో అనూషకు జనవరి 31న పురిటినొప్పులు వస్తుండడంతో హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు అదే రోజు రాత్రి ఆపరేషన్ ద్వారా ప్రసవం చేశారు. ఇద్దరు కవలలు(మగ) జన్మించడంతో ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. నెలలు నిండకముందే (ఎనిమిది నెలల మూడు రోజులకే) అనూష ప్రసవించడంతో శిశువులు ఒకరు 1.2, 1.7 కేజీల బరువు మాత్రమే ఉన్నారు. అంతేకాకుండా రోజులు గడుస్తున్నా వారిలోని ఊపిరితిత్తులు, గుండె, ఇతర ప్రధాన అవయవాల ఎదగడంలేదని గుర్తించిన వైద్యులు మెరుగైన చికిత్స అవసరమని, అందుకు రూ.10లక్షలు అవసరం అని చెప్పారు. ఇప్పటికే రోజుకు రూ.40వేల చొప్పున ఖర్చు అవుతుందని, పూర్థిస్థాయిలో వైద్యానికి అయ్యే ఖర్చు భరించే స్థోమత తమకు లేని చిన్నారుల తండ్రి రాజు కన్నీటి పర్యంతమవుతూ వివరించాడు.దాతలు ఆర్థిక సాయమందించి ఆదుకోవాలని వేడుకున్నాడు. 88977 47685, 94283 32336, 95505 99202 ఫోన్ నంబర్ల ద్వారా సంప్రదించి ఆదుకోవాలని కోరారు. దాతలు సాయం అందించాల్సిన వివరాలు: పేరు: బండ రాజు అకౌంట్ నంబర్: 62251616556 ఐఎఫ్ఎస్సీ: ఎస్బీఐఎన్ 0020388, బ్రాంచ్: కాల్వశ్రీరాంపూర్ -
కేర్‌టేకర్ దాష్టీకం.. చిన్నారి బ్రేన్పై ఎఫెక్ట్!
పసి పిల్లల ఆలనా, పాలనా చూసుకోమని కేర్ టేకర్‌ని పెట్టుకుంటే సదరు మహిళ ఆ చిన్నారుల్ని చిత్రహింసలకు గురి చేసింది. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. పాలన్పూర్ పాటియా హిమగిరి సొసైటీలో నివాసముంటున్న ఓ దంపతులకు కవల పిల్లలు ఉన్నారు. తమ ఉద్యోగం కారణంగా వారిని చూసుకోవడానికి కోమల్ తంద్లేకర్ అనే మహిళను కేర్ టేకర్‌గా నియమించుకున్నారు. అయితే సదరు మహిళ ఓ రోజు ఆ కవలల్లో ఒకరిపై తన శాడిజమ్ ప్రదర్శించింది. ఒక బిడ్డను చెవులు మెలిపెట్టడంతో పాటు చెంపలపై కొట్టి, చేతి గోర్లను కొరకడమేగాక ఆ చిన్నారిని మంచంపై విసిరిపడేసింది. అలా ఓ ఐదు నిమిషాల పాటు కేర్‌టేకర్ పసికందును దారుణంగా కొట్టింది. ఇక ఆ దెబ్బలకు చిన్నారిలో కదలిక లేకపోవడంతో చేసేది లేక ఆ యువతి పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దాంతో చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ఆ దెబ్బలకు చిన్నారి తలలో మెదడు దెబ్బతిన్నట్లుగా వైద్యులు తెలిపారు. అయితే తమ ఇంట్లో అప్పటికే అమర్చి ఉన్న సీసీ ఫుటేజ్‌ని పరిశీలించడంతో కేర్‌టేకర్ చేసిన నిర్వాకం బయటపడింది. ఇక వెంటనే బాధిత చిన్నారుల తండ్రి మితేష్ పటేల్ కేర్ టేకర్‌పై రాందర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దాంతో కేర్‌టేకర్ కోమల్ తంద్లేకర్పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
కవలలే కానీ.. పుట్టిన ఏడాదులు వేరు
కాలిఫోర్నియా: కలిసి పుట్టే వాళ్లను కవలలంటారు. వారి డేట్ ఆఫ్ బర్త్ ఒకటే ఉంటుంది. కానీ కాలిఫోర్నియాకు చెందిన ఫాతిమా, రాబర్ట్ దంపతులకు పుట్టిన కవలలు మాత్రం అరుదైన çఘనత సాధించారు. పేరుకు కవలలే కానీ, వీరి పుట్టిన తేదీ వేరు. అంతేకాదు వీళ్ల పుట్టిన ఏడాది కూడా మారిపోయింది. కలిసి పుట్టారన్న పేరే కానీ వీరిద్దరూ ఇకపై వేర్వేరు రోజుల్లో పుట్టినరోజులు జరుపుకుంటారు. పాత సంవత్సరం ముగిసిపోయే క్షణంలో ఒకరు, కొత్త సంవత్సరం ఆరంభమయ్యే క్షణాల్లో మరొకరు పుట్టడమే ఇందుకు కారణం. ఫాతిమాకు గత డిసెంబర్ 31న నొప్పులొచ్చాయి. ఆమె ఆ రోజు రాత్రి 11.45కు మగబిడ్డకు జన్మనిచ్చింది. సుమారు పావుగంట అనంతరం తేదీ మారగానే అంటే జనవరి 1న ఆడ శిశువును ప్రసవించింది. దీంతో మగపిల్లవాడు (ఆల్ఫ్రెడ్ అని పేరు పెట్టారు) 2021లో, ఆడపిల్ల (ఐలిన్ అని పేరు పెట్టారు) 2022లో పుట్టినట్లయింది. సో.. వీరు కవలలే కానీ, పుట్టినేడాదులు మాత్రం తేడా అంటూ వీరికి కాన్పు చేసిన ఆస్పత్రి ట్వీట్ చేసింది. -
ముద్దులొలికే చిన్నారులు.. మూడు రికార్డులు!
నరసన్నపేట: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని మారుతీ నగర్‌కు చెందిన ప్రభుత్వ స్కూల్ టీచర్ రాడ సురేష్, ప్రమీల దంపతుల కవలలు ప్రార్ధన, సాధన నాలుగు రోజుల వ్యవధిలో మూడు బుక్ ఆఫ్ రికార్డులు సాధించి ఔరా అనిపించారు. నాలుగేళ్ల నాలుగు నెలల వయసు కలిగిన వీరి జ్ఞాపక శక్తిని 22 నెలల వయసు ఉన్నప్పుడే తల్లిదండ్రులు గుర్తించారు. వర్చువల్ పద్ధతిలో వీరి జ్ఞాపక శక్తిని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, కలాం వరల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు చెందిన ప్రతినిధులు పరిశీలించారు. ఈ బాలికలు 118 రసాయనిక శాస్త్ర మూలకాల పేర్లు, 195 దేశాలు, వాటి రాజధానుల పేర్లు నిమిషాల వ్యవధిలో చెప్పడంతో ఈ మూడు రికార్డులను సాధించారని తండ్రి సురేష్ తెలిపారు. ఈ నెల 21న తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, 22న కలాం వరల్డ్ రికార్డ్స్, 24న ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించినట్లు ఆయా సంస్థలు సమాచారం ఇచ్చాయని సురేష్ తెలిపారు. వేమన పద్యాలు, గణిత గుర్తులు, ఆకృతులు, చరిత్రకు సంబంధించిన కట్టడాలు, వ్యక్తుల పేర్లు కూడా వారు చెప్తారని తెలిపారు. కన్నడ, గుజరాతీతో పాటు మరో 8 భారతీయ భాషల్లో అంకెలు చెబుతారన్నారు. -
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన క్రిస్టియానో రొనాల్డొ..
Cristiano Ronaldo To Become Dad To Twins Again: స్టార్ ఫుట్‌బాలర్, పోర్చుగీస్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో అభిమానులకు శుభవార్త చెప్పాడు. నాలుగోసారి తండ్రి కాబోతోన్నట్లు ప్రకటించాడు. మరోసారి కవలలకు తండ్రి కాబోతున్నానని సోషల్‌మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఇప్పటికే ఈ స్టార్ ప్లేయర్‌కు నలుగురు పిల్లలు(క్రిస్టియానో రొనాల్డొ జూనియర్(11), ఈవా, మెటియో(కవలలు), అలానా మార్టినా(4)) ఉన్నారు. కాగా, తన భాగస్వామి జార్జినా రోడ్రిగ్జ్ గర్భవతి అని, కవలలు పుట్టబోతున్నారని రొనాల్డొ గురువారం ఇన్‌స్టా వేదికగా ప్రకటించాడు. చదవండి: టీమిండియాకు హెల్ప్ కావాలా..? నేను రెడీ అంటున్న 'జార్వో' View this post on Instagram A post shared by Cristiano Ronaldo (@cristiano) -
టీమిండియా క్రికెటర్‌కు డబుల్ ధమాకా.. కవల పిల్లలు జననం
Dinesh Karthik And Dipika Pallikal Blessed With Two Baby Boys: టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. తన భార్య దీపికా పల్లికల్ ఇద్దరు మగ కవలలకు జన్మనిచ్చిందని గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. పిల్లలకు కబీర్ పల్లికల్ కార్తీక్, జియాన్ పల్లికల్ కార్తీక్ అని పేర్లు పెట్టినట్లు తెలిపాడు. భార్య, ఇద్దరు పిల్లలతో ఉన్న ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ.. ‘ముగ్గురం ఐదుగురం అయ్యాం’ అంటూ క్యాప్షన్ జోడించాడు. ఇక్కడ డీకే తన పెంపుడు కుక్కను కూడా కుటుంబంలో కలుపుకుని చెప్పడం విశేషం. కాగా, దినేష్ కార్తీక్, దీపికా పల్లికల్‌లకు 2015లో వివాహం జరిగింది. దీపికా పల్లికల్ దేశంలోని ప్రముఖ స్క్వాష్ ప్లేయర్లలో ఒకరు. చదవండి: పాక్ గెలుపు సంబురాలు చేసుకున్న వారిపై దేశద్రోహం కేసులు: యూపీ సీఎం View this post on Instagram A post shared by Dinesh Karthik (@dk00019) -
చనిపోయి మళ్లీ అదే తల్లి కడుపున పుట్టారు..సైన్స్‌కే అందని అద్భుతం
పుణ్యఫలం, కర్మఫలం.. జీవాత్మ, పరమాత్మ.. గతజన్మ, పునర్జన్మ.. ఇవన్నీ అస్పష్టమైన నమ్మకాలే కానీ.. కొట్టిపారేయలేని అంశాలంటారు చాలామంది. అయితే నేటి స్మార్ట్ యుగాన్ని సైతం అబ్బురపరచే కొన్ని గత సంఘటనలు ఆ నమ్మకాలను బలపరచే ఆధారాలుగా నిలుస్తుంటాయి. అందులో ‘పొల్లాక్ సిస్టర్స్’ కథ ఒకటి. సైన్స్‌కే అందని ఓ అద్భుతమది. అమెరికాకు చెందిన ఆ అక్కాచెల్లెళ్లు.. చనిపోయి మళ్లీ పుట్టారు.. అవును.. 1957లో కారు యాక్సిడెంట్లో చనిపోయిన ఇద్దరూ.. తిరిగి కొన్ని ఏళ్లకు (1964లో..) అదే తల్లి కడుపున కవలలుగా పుట్టారు. మాటలు వచ్చే వయసుకి.. గతజన్మ సంఘటనలను పూసగుచ్చినట్లు చెప్పడంతో ఒక్కసారిగా జనాలు ఉలిక్కిపడ్డారు. పరిశోధకులు సైతం సమాధానం చెప్పలేని స్థితిలో.. ఈ పునర్జన్మ కథ ఓ మిస్టరీగా మారింది. అసలు ఏం జరిగింది? జొవాన్నా పొల్లాక్, జాక్వెలిన్ పొల్లాక్ అనే అమెరికన్ సిస్టర్స్.. మొదటి జన్మలో కవలలు కాదు. జాన్–ఫ్లోరెన్స్ అనే దంపతులకు 1946లో జొవాన్నా, 1951లో జాక్వెలిన్ జన్మించారు. జొవాన్నా కంటే జాక్వెలిన్ చిన్నది కావడంతో చెల్లెల్ని తల్లిలా చూసుకునేది జొవాన్నా. అయితే జాక్వెలిన్ పుట్టిన ఆరేళ్లకు చర్చ్ రోడ్లో స్నేహితుడు ఆంథోనీతో కలిసి నడుస్తున్న జొవాన్నా(11), జాక్వెలిన్(6) మీదకి ఓ కారు దూసుకొచ్చింది. ఆ ప్రమాదంలో ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. అయితే 1964లో ఫ్లోరెన్స్ మళ్లీ తల్లి అయ్యింది. ఆ సమయంలో జాన్ తన భార్య కడుపులో కవలలు ఉన్నారని బలంగా నమ్మాడు. ఫ్లోరెన్స్‌ని చెకప్ చేసిన డాక్టర్స్.. బ్ల్లడ్లైన్స్ ఆధారంగా కవలలు ఉండే అవకాశమే లేదని చెప్పినా సరే.. జాన్ తన నమ్మకాన్ని వదులుకోలేదు. అదే నిజమైంది. కవలలు పుట్టారు. మెల్లగా యాక్సిడెంట్ ట్రాజెడీని మరచిపోవడం మొదలుపెట్టారు జాన్ దంపతులు. కవలలకు గిలియన్, జెన్నిఫర్ అని పేర్లు పెట్టారు. బుడి బుడి అడుగులతో.. బోసి మాటలతో మళ్లీ కుటుంబంలో సంతోషాలు మొదలయ్యాయి. ఒకరోజు గిల్లియన్, జెన్నిఫర్లు తల్లిని ‘అటకపైన దాచిన ఫలానా పాత బొమ్మలు కావాలి, ఆడుకుంటాం’ అని అడిగారు. అప్పటి దాకా చూడని ఆ బొమ్మల గురించి కవలలకు ఎలా తెలిసిందో ఫ్లోరెన్స్‌కు అంతుచిక్కలేదు. అయినా పిల్లల కోరిక కాదనలేక అటకమీద నుంచి తీసి ఇచ్చింది. వాటిని అందుకున్న పిల్లలు.. వెంటనే ఇవి నా బొమ్మలు.. ఇవి నీ బొమ్మలు అని జొవాన్నా బొమ్మల్ని గిల్లియన్, జాక్వెలిన్ బొమ్మల్ని జెన్నిఫర్ పంచుకున్నారు. ఇదంతా వాళ్ల 3 ఏళ్ల వయసులో జరిగింది. ఆ ఘటన మరవకముందే.. చనిపోయిన ఇద్దరి పిల్లల ఫొటోని చూసిన ఆ కవలలు ‘ఇది నువ్వు.. ఇది నేను’ అని గుర్తుపట్టడం తల్లి కళ్లారా చూసింది. పిల్లల మాటలు విన్న ఫ్లోరెన్స్‌కి.. కాళ్ల కింద నేల కంపించినట్లైంది. వెంటనే ఆ ఫొటోని దాచిపెట్టింది. అయితే కవలల్లో గిల్లియన్.. గత జన్మలోని జొవాన్నా మాదిరే ఉదారస్వభావంతో ఉండేదట. అంతేకాదు తన వస్త్రధారణ, మాటతీరు అంతా తన చెల్లెలు జెన్నిఫర్‌తో పోల్చినప్పుడు చాలా పరిపక్వత కనిపించేదట. ఎందుకంటే తన గత జన్మలో తన చెల్లెలు జాక్వెలిన్ కంటే సుమారు ఐదారేళ్లు పెద్దది. మరో రోజు కవలలతో బయటికి వెళ్లిన జాన్ దంపతులకు ఇంకో షాక్ ఎదురైంది. గతంలో జొవాన్నా, జాక్వెలిన్‌లు చదివిన స్కూల్‌ని, యాక్సిడెంట్ అయిన ప్లేస్‌ని గుర్తుపట్టారు. అయితే అప్పటిదాకా కవలలు ఆ ప్లేస్‌ని ఎప్పుడూ చూడలేదు. ఇక రోడ్డుపై కవలలు వెళ్తున్నప్పుడు కారు కనిపిస్తే.. తమవైపే దూసుకొస్తుందని ఏడ్చేవారట. ఇలా ఐదారేళ్లు వచ్చేదాకా అచ్చం జొవాన్నా, జాక్వెలిన్‌లానే ప్రవర్తించేవారు కవలలు. షాకుల మీద షాకులు తిన్న తల్లిదండ్రులకు.. ఓ క్లారిటీ వచ్చింది. చనిపోయిన తమ పిల్లలే గిల్లియన్, జెన్నిఫర్ల్లా పుట్టారని నమ్మడం మొదలుపెట్టారు. తమకు కలిగిన అనుభవాలను అందరితో పంచుకోవడం ఆరంభించారు. ఏడేళ్ల వయసు వచ్చేసరికి.. గత జన్మ స్మృతులని పూర్తిగా మరచిపోయిన కవలలు.. సాధారణ పిల్లల్లా ప్రవర్తించడం మొదలుపెట్టారు. దాంతో సమస్య తీరింది. కానీ అదెలా సాధ్యం అనేది మాత్రం నేటికీ అంతుచిక్కలేదు. అయితే ఈ పొల్లాక్ సిస్టర్స్ పునర్జన్మ ఓ కట్టుకథ అని కొట్టిపారేసేవాళ్లూ లేకపోలేదు. అమెరికన్ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్.. పునర్జన్మలు, గత జన్మ జ్ఞాపకాలపై పలు పరిశోధనలు చేశారు. వేల కేసుల్ని స్టడీ చేశారు. 1987లో ఇలాంటి 14 ఆసక్తికర సంఘటనలతో ‘చిల్డ్రన్స్ హూ రిమెంబర్ దెయిర్ పాస్ట్ లైవ్స్ (గత జన్మలను గుర్తుపెట్టుకున్న పిల్లలు)’ అనే పుస్తకం కూడా రాశారు. కచ్చితంగా పునర్జన్మలు ఉన్నాయని, అందులో పొల్లాక్ సిస్టర్స్ కథ కూడా వాస్తవమేనని వెల్లడించారు. సాధారణంగా అమెరికన్లకు ఏలియన్స్, టైమ్ ట్రావెల్స్తో పాటు ఆత్మలన్నా, దెయ్యాలన్నా ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. పైగా చనిపోయిన వారిలో 24 శాతం మంది మళ్లీ తిరిగి పుడతారని వారు బలంగా నమ్ముతారు. --సంహిత నిమ్మన -
అయ్యో చిట్టి తల్లులు.. మీకు ఎంత కష్టమొచ్చింది?
నా పేరు లావణ్య, ఉన్న ఊర్లో ఆస్తులేమీ లేకపోవడంతో మా కుటుంబం హైదరాబాద్‌కి మారిపోయాం. నా భర్త భూపాల్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉన్నంతలో హాయిగా సాగిపోతున్న మా జీవితంలో మరో ఆనందం చోటు చేసుకుంది. గర్భిణీగా ఉన్న నన్ను పరీక్షించిన డాక్టర్లు కడుపులో కవలలు ఉన్నారని చెప్పారు. ఆ వార్త విన్నప్పటి నుంచి మేము ఇద్దరం రాబోయే పిల్లల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాం. ప్రసవించే తేదీ దగ్గర పడుతున్న కొద్దీ నాలో ఆయాసం, అలసట ఎక్కువయ్యాయి. ఒకరోజు ఉన్నట్టుండి ఒకరోజు ఆయాసం, కడుపులో నొప్పి పెరిగిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడే నెలలు నిండకుండానే కవలలైన ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చాను. మా కంటి పాపలను కళ్లారా చూడాలనిపించింది. నా బిడ్డలిద్దరు ఎక్కడా అని డాక్టర్లను అడిగితే పిల్లలు ఇద్దరికీ ఆరోగ్యం బాగా లేదని వాళ్లని ఎన్ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు. నెలలు నిండకుండా పుట్టినందు వల్ల వారి ఆరోగ్యం బాగాలేదని చెప్పారు.. వారిని సర్ఫాక్టంట్ మెకానికల్ వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. వాళ్లిద్దరి ఆరోగ్యం మెరుగవ్వాలంటే కనీరం రెండు నెలల పాటు ఎన్ఐసీయూలో చికిత్స అందివ్వాలని చెప్పారు. సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి కడుపులో నలుసు పడ్డట్టప్పటి నుంచి ప్రసవం వరకు ఆస్పత్రి ఖర్చుల కోసం ఇప్పటికే నా భర్త భూపాల్ రెండు లక్షల వరకు అప్పు చేశాడు. ఇప్పుడు ఇద్దరు పిల్లల ప్రాణాలు దక్కాలంటే రెండు నెలలు చికిత్స అవసరం. దాని కోసం ఏకంగా రూ. 13,50,000 ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి ఓ వైపు తన మనవరాళ్లు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్న అత్తమామలు మరోవైపు పిల్లల వైద్య చికిత్సకు అవసరమైన డబ్బుల కోసం అలసట అన్నదే లేకుండా తిరుగుతున్న భర్త. ఎక్కడ ప్రయత్నించినా మాకు డబ్బులు సర్థుబాటు కాలేదు. ఇంతలో అత్యవసర వైద్య ఖర్చుల కోసం ఫండ్ రైజింగ్ చేసే కెటో గురించి తెలిసి వారిని సంప్రదించాం. మా పాప వైద్య చికిత్స ఖర్చుల నిమిత్తం సాయం చేయండి. వారి ప్రాణాలను కాపాడండి. సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి -
గర్భశోకం కలిగిన రోజే.. కవలల జననం
దొండపర్తి (విశాఖ దక్షిణ): కాకతాళీయమో లేక ఆ దంపతులకు గర్భశోకాన్ని తొలగించేందుకు దేవుడిచ్చిన వరమో తెలియదు గానీ.. ఏ రోజున తమ బిడ్డల్ని కోల్పోయారో.. రెండేళ్ల తరువాత అదే రోజున కవలలు జన్మించారు. ఇద్దరు కుమార్తెలను కోల్పోయిన రోజునే తిరిగి కుమార్తెలు పుట్టడంతో ఆరిలోవ ప్రాంతానికి చెందిన తలారి అప్పలరాజు, భాగ్యలక్ష్మి దంపతుల ఆనందం అవధులు దాటింది. వివరాల్లోకి వెళితే.. 2019 సెప్టెంబర్ 15న ఆరిలోవలో నివాసముంటున్న తలారి అప్పలరాజు, భార్య భాగ్యలక్ష్మి, వారి కుమార్తెలు గీతా వైష్ణవి (3), ధాత్రి అనన్య (ఏడాదిన్నర)తో పాటు మరో ఏడుగురు కుటుంబ సభ్యులతో కలిసి రాయల్ వశిష్ట బోటులో రాజమండ్రి నుంచి భద్రాచలం బయలుదేరారు. దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామానికి సమీపంలో బోటు గోదావరిలో మునిగిపోయింది. ఆ ప్రమాదంలో 51 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే. ఇందులో భార్యాభర్తలు అప్పలరాజు, భాగ్యలక్ష్మి ప్రాణాలతో బయటపడినప్పటికీ.. వారి కుమార్తెలు వైష్ణవి, అనన్య, మిగిలిన ఏడుగురు కుటుంబ సభ్యులు సైతం మరణించారు. దీంతో ఆ దంపతులు గర్భశోకంతో తల్లడిల్లిపోయారు. జీవితాన్ని పునర్నిర్మించుకోవాలని.. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత భాగ్యలక్ష్మి ట్యూబెక్టమీ విధానంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైద్యులను సంప్రదించగా.. ఐవీఎఫ్ ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందని చెప్పడంతో పద్మశ్రీ ఆస్పత్రిని సంప్రదించి పిల్లల కోసం ప్రయత్నించారు. ఇద్దరు కుమార్తెలు చనిపోయిన రెండేళ్ల తరువాత సెప్టెంబర్ 15వ తేదీనే భాగ్యలక్ష్మి ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనిచ్చింది. ఆ కవలలు కూడా కుమార్తెలే కావడంతో ఆ భార్యాభర్తల ఆనందం వెల్లివిరిసింది. వైద్య చరిత్రలో అపురూప ఘట్టం గత ఏడాది అప్పలరాజు, భాగ్యలక్ష్మి దంపతులు ఔట్‌పేషెంట్ క్లినిక్‌లో సంప్రదించారు. వారిలో ఆత్మస్థైర్యం నింపి వైద్యం ప్రారంభించాం. అక్టోబర్ 20వ తేదీన ప్రసవం వస్తుందని అంచనా వేశాం. కానీ సెప్టెంబర్ 15వ తేదీనే భాగ్యలక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో ఆలస్యం చేయకుండా శస్త్ర చికిత్స చేశాం. 1.9 కిలోలు, 1.65 కిలోలతో పిల్లలిద్దరూ ఆరోగ్యంగా జన్మించారు. వైద్య చరిత్రలో ఇది అపురూప ఘట్టంగా భావిస్తున్నా. – డాక్టర్ సుధా పద్మశ్రీ -
108లో నలుగురి జననం
మాకవరపాలెం/గూడెంకొత్తవీధి/రౌతులపూడి: 108 వాహనాల్లో బుధవారం నలుగురు చిన్నారులు జన్మించారు. మూడో చోట్ల జరిగిన ఈ ఘటనల్లో ఓ తల్లి కవలలకు జన్మనివ్వడం విశేషం. విశాఖ జిల్లా మాకవరపాలెం మండలం మామిడిపాలేనికి చెందిన భవానికి బుధవారం పురిటినొప్పులొచ్చాయి. కుటుంబ సభ్యులు 108కి సమాచారం ఇవ్వగా సిబ్బంది వచ్చి గర్భిణిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తీసుకెళుతున్నారు. అయితే మార్గం మధ్యలోనే ప్రసవమై మగబిడ్డకు జన్మనిచ్చిందని 108 సిబ్బంది వినీత, మురళి తెలిపారు. అలాగే చింతపల్లి మండలం చెరపల్లికి చెందిన దేవూరు సుమలతకు పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో 108 సిబ్బంది వాహనంలోనే ఆమెకు ప్రసవం చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్టు సిబ్బంది రాజు, రెహమాన్‌లు చెప్పారు. గర్భిణికి సుఖప్రసవం.. కవలల జననం తూర్పుగోదావరి జిల్లా శంఖవరానికి చెందిన శివకోటి అనంతలక్ష్మికి పురిటి నొప్పులు రావడంతో మంగళవారం రౌతులపూడి సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అయితే పరిస్థితి కొద్దిగా ఆందోళనకరంగా ఉందని అక్కడి డాక్టర్.. కాకినాడ జీజీహెచ్‌కు తరలించాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు బుధవారం తెల్లవారుజామున 108లో ఆమెను తరలిస్తుండగా వాహనంలోనే కవలలు(ఆడ, మగ)కు జన్మనిచ్చింది. ఆ తర్వాత తల్లీబిడ్డలను జీజీహెచ్‌కు తరలించారు. -
అరుదైన ఘటన; కవలలకు మళ్లీ కవలలు..
కరీంనగర్ టౌన్: నిఖిత, లిఖిత ఇద్దరు కవలలు. ఇటీవల నిఖిత ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చారు. అయితే మూడు నెలల కిందటే లిఖిత కూడా ముగ్గురు కవల పిల్లలకు జన్మనిచ్చారు. దీంతో ఆ కుటుంబం అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఒకే కాన్పులో ముగ్గురు, నలుగురు పిల్లలకు జన్మనివ్వడం సాధారణమే అయినప్పటికీ కవల పిల్లలైన ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇలా కవల పిల్లలకు జన్మనివ్వడం అరుదైన రికార్డు అని వైద్యులు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం నాగుల మల్యాల గ్రామానికి చెందిన నిఖిత మొదటి కాన్పు కోసం కరీంనగర్‌లోని యశోద కృష్ణ ఆస్పత్రికి రాగా, పరీక్షించిన వైద్యురాలు ఆకుల శైలజ.. ఆమె గర్భంలో నలుగురు శిశువులు ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే 8 నెలలు దాటడం మహిళకు నొప్పులు రావడంతో శనివారం ఉదయం సిజేరియన్ చేశారు. దీంతో ఇద్దరు ఆడ, ఇద్దరు మగ శిశువులు జన్మించారు. శిశువుల బరువు తక్కువగా ఉండటంతో ఇంక్యుబేటర్‌లో ఉంచారు. నిఖిత సోదరి లిఖితకు కూడా 3 నెలల కింద అదే ఆస్పత్రిలో డెలివరీ కాగా, ఆమెకు ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు జన్మించారు. నిఖిత భర్త సాయికిరణ్ పోలీసు కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు. నిఖితతో పాటు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారని, జన్యుపరంగానే ఇలా పుడతారని డాక్టర్ శైలజ చెప్పారు. ఇది అత్యంత అరుదైన ఘటన అని ఆమె పేర్కొన్నారు. (చదవండి: హమ్మయ్య.. ఆ పాప మళ్లీ నవ్వింది..!) -
కవల పిల్లల హత్య కేసు: వీడిన మిస్టరీ, తండ్రే హంతకుడు
సాక్షి, నెల్లూరు: జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించిన కవల పిల్లల హత్య కేసులో మిస్టరీ వీడింది. మనుబోలు మండలం రాజోలుపాడులో గత నెల 20న పది నెలల వయస్సు కలిగిన ఇద్దరు కవల పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. తండ్రే పిల్లలకు పాలల్లో విషమిచ్చి చంపినట్లు పోలీసులు తేల్చారు. భార్యపై అనుమానమే పిల్లల హత్యకు కారణమని విచారణలో వెల్లడైంది. తండ్రి వెంకట రమణయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా తీవ్ర మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పిల్లల మృతిపై వీరి పాత్ర ఉందేమోనన్న అనుమానంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కోణంలో విచారణ చేపట్టిన పోలీసులు.. తండ్రే పిల్లలను చంపినట్లు నిర్థారించారు. -
కవలలకు జన్మనిచ్చి అనంత లోకాలకు..
సాక్షి,చిత్తూరు రూరల్: కవలలకు జన్మనిచ్చి ఓ బాలింత శుక్రవారం రాత్రి మృతి చెందింది. కుటుంబ సభ్యుల కథనం..పూతలపట్టు మండలం వడ్డెపల్లెకు చెందిన కుమారస్వామి భా ర్య అనిత (21)కు పురిటినొప్పు లు రావడంతో ఈ నెల 14న చి త్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. 15న డాక్టర్లు ఆపరేషన్ చేయడంతో ఆమె మగ కవలలకు జన్మనిచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆమెకు శ్వాస సరిగా ఆడలేదు. సాయంత్రం హుటాహుటిన అంబులెన్స్‌లో చీలా పల్లె సీఎంసీకి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. భూమి తాకట్టు..నగదు కాజేయడంలో కనికట్టు! యాదమరి: భూమి తాకట్టు పెట్టుకుని నగదు ఇస్తామంటూ మోసం చేస్తున్న ముఠాను యాదమరి పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు వెస్ట్ సీఐ శ్రీనివాసుల రెడ్డి కథనం.. గతవారం మండలంలోని చెన్నై– బెంగళూరు జాతీయ రహదారిలోని వరిగపల్లె వద్ద కృష్టా జిల్లావాసి సూర్యనారాయణ ను తమిళనాడు వేలూరు జిల్లాకు చెందిన శ్రీనివాస్ (31), అయ్యప్పన్ (35), దినకరన్(20),సయ్యద్ ఆలీ(30) కలిశారు. అతని భూమిని తాకట్టు పెట్టుకుంటా మని రికార్డులు, స్టాంపు కాగితాల రాసుకుని రూ.10 లక్షలు ఇచ్చారు. అయితే ఈ సొమ్మును కొట్టేయాలని ముందుగానే వేసిన స్కెచ్ మేరకు వారి తాలూకు మనుషులు కొందరు నకిలీ పోలీసుల గెటప్‌లో వచ్చి సూర్యనారాయణను బెదిరించి నగదుతో ఉడాయించారు. దీంతో బాధితుడు యాదమరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి మండల సరిహద్దులో ఎస్ఐ ప్రతాప్‌రెడ్డి తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తుండగా.. టవేరా వాహనం తమిళనాడు వైపు మళ్లడంతో అనుమానించి అందులోని వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సూర్యనారాయణను మోసం చేసి డబ్బు కొట్టేసింది వీరేనని తేలింది. దీంతో వాహనాన్ని సీజ్ చేసి నిందితుల నుంచి రూ.2.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. -
విషాదం: కవల పిల్లల అనుమానాస్పద మృతి..
నెల్లూరు: మనుబోలు మండలం రాజోలు గ్రామంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. పది నెలల వయస్సు కలిగిన ఇద్దరు కవల పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందడం సంచలనంగా మారింది. అయితే, నిన్న సాయంత్రం పాలు (తల్లిపాలు కాదు) తాగిన వెంటనే కవల పిల్లలిద్దరు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని హుటాహుటీన నెల్లూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చిన్నారులను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. అయితే, దంపతుల మధ్య గతకొన్ని రోజులుగా తీవ్ర మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ క్రమంలో పిల్లల మృతిపై వీరి పాత్ర ఉందేమోనన్న అనుమానంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకున్న పోలీసులు , దంపతులిద్దరిని అదుపులోనికి తీసుకున్నట్లు తెలిపారు. విచారణలో మరిన్ని విషయాలు రాబడతామని పేర్కొన్నారు. చదవండి: బంజారాహిల్స్: మూడేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. భర్త కొట్టడంతో.. -
బోల్ట్ దంపతులకు కవలలు.. సునామీ సృష్టిస్తున్న పేర్లు
జమైకా: చిరుత వేగంతో పరుగెత్తే ప్రపంచ ప్రఖ్యాత అథ్లెట్ ఉసేన్ బోల్ట్(34) మరోసారి తండ్రి అయ్యాడు. ఆయన జీవిత భాగస్వామి బెన్నెట్ కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని ఫాదర్స్ డే రోజున ఫ్యామిలీ ఫోటోతో ఉసేన్ బోల్ట్ సోషల్ మీడియాలో ఆదివారం పంచుకున్నారు. అయితే, బోల్ట్ పిల్లల పేర్లు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. వారి పేర్లు వరసగా ఒలింపియా లైటనింగ్ బోల్ట్, సెయింట్ లియో బోల్ట్, థండర్ బోల్ట్ కాగా.. ఒలింపియా లైటనింగ్ బోల్ట్ 2020 మేలో జన్మించింది. ఇక కవలల ఫొటో మాత్రమే పంచుకున్న బోల్ట్ వారు ఎప్పుడు జన్మించింది మాత్రం వెల్లడించలేదు. బోల్ట్ పిల్లల పేర్లపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘లైటనింగ్ (మెరుపు), థండర్ (ఉరుము)? ఇక ఇక్కడ తుపానే’’ అంటూ కామెంట్ చేశారు. ‘‘ఈ అందమైన కుటుంబానికి ఇక ఆనందం తప్ప మరేమీ ఉండదు.’’ అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చారు. బోల్ట్ తన ఫ్యామిలీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అభిమానుల నుంచి భారీ ఎత్తున స్పందన వచ్చింది. ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, బోల్ట్ జీవిత భాగస్వామి బెన్నెట్ స్పందిస్తూ.. ‘‘ ఈ కుటుంబానికి ఉస్సేన్ బోల్ట్ ఓ పెద్ద బలం.. పిల్లలకు ఓ గొప్ప తండ్రి.. ఎప్పటికీ ప్రేమతో ఫాదర్స్ డే శుభాకాంక్షలు.’’ అంటూ రాసుకొచ్చారు. ఇక 2008, 2012, 2016 లో జరిగిన ఒలింపిక్స్‌లో ఉసేన్ బోల్ట్ ఎనిమిది బంగారు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. వరుసగా మూడు ఒలింపిక్స్ క్రీడల్లో 100 మీటర్లు, 200 మీటర్ల రేసుల్లో రెండేసి పతకాలు గెలిచిన ఏకైక అథ్లెట్ ఉసేన్ బోల్ట్. Olympia Lightning Bolt ⚡️ Saint Leo Bolt ⚡️ Thunder Bolt ⚡️@kasi__b pic.twitter.com/Jck41B8j3J — Usain St. Leo Bolt (@usainbolt) June 20, 2021 చదవండి: Wrestler Khali: రెజర్ల్ కాళి ఇంట విషాదం -
దారుణం: కన్నతల్లిని చూడకుండానే కవలల మృతి
కరీంనగర్‌టౌన్: నిండు గర్భిణీ.. కాన్పు కోసం వస్తే ‘మీది ఈ జిల్లా కాదు.. ఎవరి జిల్లాలో వారే ప్రసూతి చేయించుకోవాలి..’ అని వెనక్కి పంపించారు కరీంనగర్‌లోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం వైద్యులు. దీంతో బాధితురాలు సొంత జిల్లాకు వెళ్లగా.. అక్కడా ఆమెకు నిరాశే ఎదురైంది. ఇలా రెండుమూడు చోట్లకు తిరగడంతో ప్రసవానికి ముందే ఓ బిడ్డ కన్నుమూయగా.. చికిత్స పొందుతూ మరో బిడ్డ చనిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరుబేగంపేటకు చెందిన బెజ్జంకి కమల రెండో కాన్పు కోసం ఈనెల 18న కరీంనగర్‌లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అయితే అక్కడి వైద్యులు ఎవరి జిల్లాలో వారే వైద్యం చేయించుకోవాలని వెనక్కి పంపించారు. దీంతో బంధువులు ఆమెను సిద్దిపేట ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు.. ఇక్కడ కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని, గజ్వేల్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. అయితే అక్కడి వైద్యులు సైతం ఆమెను చేర్చుకోకుండానే హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో అయోమయానికి గురైన కుటుంబ సభ్యులు హైదరాబాద్ వెళ్లలేక తిరిగి కరీంనగర్‌కే చేరారు. ఇక్కడి వైద్యులను బతిమిలాడుకున్నారు. దీంతో వైద్యులు ఈనెల 20న ఆపరేషన్ చేసి కవలలకు పురుడు పోశారు. అయితే అప్పటికే ఆడ శిశువు చనిపోయింది. మగ శిశువు బరువు తక్కువగా ఉండటంతో ఐసీయూలో పెట్టారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. చికిత్స పొందుతూ ఆ శిశువు కూడా శనివారం మృతిచెందింది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని, ముందే ఆపరేషన్ చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని పేర్కొంటూ బంధువులు మాతాశిశు ఆరోగ్యం కేంద్రం ఎదుట ఆందోళనకు దిగారు. కరోనా కారణం చెబుతూ వైద్యులు గర్భిణుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తున్నారని, ఆపదలో ఉన్న వారికి వైద్యం చేయకుండా సొంత జిల్లాలకు వెళ్లగొడుతున్నారని ఆరోపించారు. కరోనాతో తండ్రి, కొడుకు మృతి మానకొండూర్: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల గ్రామంలో కరోనాతో తండ్రీకొడుకులు గంటల వ్యవధిలో మృతిచెందారు. గ్రామానికి చెందిన మూల తిరుమల్ (52), అతడి కొడుకు మూల గిరి (30) గీత వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరిద్దరూ నాలుగు రోజుల క్రితం కరోనా బారినపడ్డారు. చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. కాగా, తిరుమల్ పరిస్థితి విషమించి శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. అతడికి రాత్రి అంత్యక్రియలు పూర్తిచేశారు. అదేరోజు రాత్రి 11 గంటలకు గిరి కూడా మృతిచెందాడు. శనివారం ఉదయం గిరి అంత్యక్రియలు పూర్తిచేశారు. చదవండి: Black Fungus: బ్లాక్‌ఫంగస్‌కు ‘ఆయుర్వేదం’ -
పాపం పసివాళ్లు: 2 తలలు, 3 చేతులతో కవలలు
భువనేశ్వర్: తన కడుపులో కవలలు ఊపిరిపోసుకుంటున్నారు అని తెలిసిన దగ్గర నుంచి ఆ తల్లి సంతోషం అంతా ఇంతా కాదు. ఒకేసారి ఇద్దరు చిన్నారులు తమ కుటుంబంలోకి రాబోతున్నారనే విషయం తెలిసిన నాటి నుంచి ఆ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. చిన్నారుల రాక కోసం కుటుంబంలోని అందరూ కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. వారి ఆశలు ఫలించాయి.. ఆ తల్లి బిడ్డలకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన పసికందులను చూసి ఆ మాతృహృదయం తల్లడిల్లిపోయింది. చిన్నారులను చూసిన కుటుంబ సభ్యులు బాధతో విలవిల్లాడారు. బిడ్డలు జన్మించినందుకు సంతోషించాలా.. లేక ఇలా అతుక్కుని పుట్టినందుకు బాధపడాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వారి బాధ ఆస్పత్రిలో పత్రి ఒక్కరిని కదిలిస్తోంది. ఇంతకు ఆ చిన్నారులకు ఏమయ్యింది అంటే వారి తలలు మాత్రం వేరుగా ఉండగా.. శరీరాలు కలిసి పోయాయి. ఇక ఇద్దరు బిడ్డలకు కేవలం మూడు చేతులు, రెండు కాళ్లు మాత్రమే ఉన్నాయి. వీరిని చూసిన ప్రతి ఒక్కరు కంట తడి పెడుతున్నారు. వైద్యులను దిగ్భ్రాంతికి గురిచేసిన ఈ సంఘటన ఆదివారం ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. రాజ్ నగర్ ప్రాంతంలోని కని గ్రామంలో నివసించే ఉమకాంత్ పరిదా, అతని భార్య అంబికాకు ఈ అరుదైన కవల శిశువులు జన్మించారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న అంబికాను స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. సీ సెక్షన్ ద్వారా బిడ్డలకు జన్మనిచ్చింది అంబికా. ఇక పుట్టిన శిశువుల శరీరాలు అతుక్కుపోయి ఉన్నాయి. తలలు మాత్రం వేరుగా ఉండగా.. ఇద్దరు కవలలకు మూడు చేతులు, రెండు కాళ్లు మాత్రమే ఉన్నాయి. అరుదైన సమస్యతో జన్మించిన ఈ నవజాత కవల శివువులను వెంటనే కేంద్రపారాలోని జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఓ వైద్యురాలు మాట్లాడుతూ.. ‘‘పిల్లల పరిస్థితి నిలకడగానే ఉంది. రెండు తలలు ఉండటంతో చిన్నారులు ఇద్దరు వేర్వేరుగా తినడం, శ్వాసించడం చేస్తున్నారు. కాకపోతే వారు ఒకే శరీరం.. మూడు చేతుల, రెండు కాళ్లను పంచుకున్నారు. ప్రత్యేక చికిత్స కోసం శిశువులిద్దరిని కటక్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీడియాట్రిక్స్ (సిషు భవన్) కు తరలించాము’’అని తెలిపారు. తమ బిడ్డలను ఆదుకోవాల్సిందిగా శిశువుల తండ్రి ఒడిశా ప్రభుత్వాన్ని కోరుతున్నాడు. చదవండి: కడుపు అతుక్కుని కవలల జననం -
పెరిగిపోతున్న కవలల సంఖ్య
సంతానం కోసం ఎంతో మంది దంపతులు ఎదురు చూస్తుంటారు. ఒకరు పుడితే ఓకే.. అదే ఒకేసారి ఇద్దరు పుడితే.. వారికి ఆ సంబరమే వేరు. మొదటిసారే అయినా, ఇప్పటికే పిల్లలున్నా.. మళ్లీ కవలలు పుడితే అదో ఆనందం, ఆశ్చర్యం.. మరి ఇలా ఏటా ప్రపంచవ్యాప్తంగా జన్మిస్తున్న కవల పిల్లల సంఖ్య పెరిగిపోతోందని తెలుసా? ఒకరిద్దరు కాదు ప్రపంచవ్యాప్తంగా ఏటా 16 లక్షల మంది కవలలు పుడుతున్నారు. ఇది మరింతగా పెరుగుతోంది. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో కవలల బర్త్ రేటు ఎక్కువగా ఉంటోంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం ఆఫ్రికాలో కవలల సంఖ్య ఎక్కువగా ఉంటున్నా.. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా కవలల పుట్టుకలో భారత్, చైనాలే టాప్కు చేరే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 165 దేశాల్లో 1980–1985 మధ్య, 2010–2015 మధ్య పుట్టిన కవలలకు సంబంధించి డేటాను ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు సేకరించి విశ్లేషించారు. మొత్తం ప్రసవాల్లో పుట్టిన కవలల శాతాన్ని.. అప్పటికి, ఇప్పటికి పోల్చి చూశారు. ఏయే ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉందన్నది లెక్కించి ఒక నివేదికను రూపొందించారు. ఉత్తర అమెరికా, ఆసియాలోనే ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా కవలలు జన్మిస్తున్న శాతం పెరిగినట్టు శాస్త్రవేత్తలు తేల్చారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈ రేటు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. 1980 దశకంతో పోలిస్తే ప్రధానంగా ఉత్తర అమెరికా (అమెరికా, కెనడా, మెక్సికో తదితర దేశాలు)లో ఏకంగా 71 శాతం పెరిగిందని, యూరప్‌లో 60 శాతం, ఆసియా ప్రాంతంలో 32 శాతం పెరిగిందని తెలిపారు. ఒక్క దక్షిణ అమెరికా ఖండంలో మాత్రమే కవలల బర్త్‌రేటు తగ్గిందని వెల్లడించారు. కవలల సంఖ్యాపరంగా చూస్తే.. ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో ఎక్కువ మంది జని్మస్తున్నారు. అంతేకాదు సహజంగా పుడుతున్న కవలలు ఈ రెండు ఖండాల్లోనే ఎక్కువ. సాధారణంగా రెండు రకాలుగా కవలలు పుడుతుంటారు. మహిళల్లో అండం ఫలదీకరణ చెందాక రెండుగా విడిపోయి వేర్వేరు శిశువులుగా ఎదగడం ఒక రకమైతే.. ఒకేసారి రెండు అండాలు విడుదలై (డైజైగోటిక్), ఫలదీకరణ ద్వారా కవలలు పుట్టడం రెండో రకం. ఆఫ్రికా మహిళల్లో జన్యుపరంగా డైజోగోటిక్ పరిస్థితి ఉంటుందని, ఆసియా ఖండంలోని కొన్ని దేశాల్లోనూ ఈ పరిస్థితి ఉందని ఈ పరిశోధనలో భాగమైన ఆక్స్ఫర్డ్ వర్సిటీ ప్రొఫెసర్ క్రిస్టియన్ మోండెన్ తెలిపారు. ఇక యూరప్, ఉత్తర అమెరికా, మరికొన్ని చోట్ల ఐవీఎఫ్, హార్మోన్ చికిత్స, ఇతర కృత్రిమ గర్భధారణ పద్ధతుల ద్వారా ఎక్కువగా కవలలు పుడుతున్నారు. వైద్యం, పోషణ లేక మరణాలు పేద, మధ్య ఆదాయ దేశాల్లో కవలలు ఎక్కువగా జన్మిస్తున్నా చిన్నతనంలోనే చనిపోతున్నారని ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ జెరోన్ స్మిత్ చెప్పారు. ఆఫ్రికాలో పుడుతున్న కవలల్లో చాలా వరకు ఇద్దరిలో ఎవరో ఒకరు మరణిస్తున్నారని.. తల్లికి పోషకాహారం లేక చిన్నారులు సరిగా ఎదకపోవడం, పుట్టిన తర్వాత కూడా సరైన పోషణ, వైద్యం అందకపోవడం దీనికి కారణమని పేర్కొన్నారు. ఇలా ఆఫ్రికాలో పుడుతున్న కవలల్లో ఏటా రెండు లక్షల మంది చనిపోతున్నారని తెలిపారు. కవలలు పుట్టడానికి కారణాలివీ.. కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్) వినియోగం పెరిగిపోవడం కవలలు పెరగడానికి కారణాల్లో ఒకటి. పిల్లలు లేని దంపతులు ఐవీఎఫ్ చేయించుకునేప్పుడే కవలల కోసం ప్రయతి్నస్తున్నారు. మరోవైపు ఈ విధానంలో ఫెయిల్యూర్ రేటు సగం దాకా ఉండటంతో.. డాక్టర్లు ఎక్కువ పిండాలను ఫలదీకరణం చెందించి మహిళల గర్భంలో ప్రవేశపెడుతున్నారు. మహిళలు ఆలస్యంగా పిల్లల్ని కనడం కవలల పుట్టుకలో మరో కారణం. ఉద్యోగాలు, కెరీర్‌కు ప్రాధాన్యం ఇస్తున్న దంపతులు లేటు వయసులో పెళ్లి చేసుకోవడం, ఇంకా లేటుగా పిల్లల్ని కనడం జరుగుతోంది. 35, 40 ఏళ్ల వయసు దాటిన మహిళల్లో కవలలు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ► 30% -1980వ దశకంతో పోలిస్తే పెరిగిన కవలల పుట్టుక శాతం ► 16 లక్షలు ప్రపంచవ్యాప్తంగా ఏటా జన్మిస్తున్న కవల పిల్లల సంఖ్య ► 42లో ఒకరు సగటు ప్రసవాల్లో కవల పిల్లలు జన్మించే అవకాశం ► 80% ప్రపంచంలోని కవలల డెలివరీల్లో ఆఫ్రికా, ఆసియాలో జన్మిస్తున్నవారి శాతం -
కడుపు అతుక్కుని కవలల జననం
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో అవిభక్త కవలలు జన్మించారు. ముస్తాబాద్‌కు చెందిన చెవుల శిరీష–వెంకటేశ్ దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మూడోసారి గర్భందాల్చిన శిరీషకు ప్రస్తుతం ఎనిమిదినెలలు, శనివారం రాత్రి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ముస్తాబాద్‌లోని ఓ నర్సింగ్‌హోమ్‌లో చేర్పించారు. వైద్యులు శిరీషకు స్కానింగ్ చేసి కవలలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ చేయగా, కడుపులో ఇద్దరు ఆడ శిశువులు అవిభక్తంగా ఉన్నారు. ఇద్దరికీ కడుపు భాగం అతుక్కుని ఉంది. కాళ్లు, చేతులు, తలలు వేర్వేరుగా ఉన్నాయి. ఇద్దరు శిశువులు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారు. లక్షల మందిలో ఒకరికి ఇలా జరుగుతుందని శిరీషకు వైద్యం అందించిన డాక్టర్ అనూష తెలిపారు. ఈ కవలలు రెండు కిలోల బరువుతో జన్మించగా.. మెరుగైన వైద్యం కోసం సిద్దిపేటలోని పిల్లల ఆస్పత్రికి తరలించారు. కాగా, అవిభక్త కవలలను చూసి శిరీష–వెంకటేశ్ దంపతులు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. రెక్కాడితే డొక్కాడని తాము ఈ కవలలను ఎలా కాపాడుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
10 ఏళ్ల గ్యాప్‌తో కవలల జన్మ
బీజింగ్ : మామూలుగా కవలలు ఒకే సారి పుట్టడమో.. లేదా కొద్ది రోజులు గ్యాపు తీసుకుని పుట్టడమో జరుగుతుంది. కానీ, చైనాకు చెందిన ఓ మహిళ మాత్రం 10 సంవత్సరాల గ్యాప్‌తో కవలలకు జన్మనిచ్చింది. ఈ సంఘటన హ్యూబేలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. హ్యూబేకు చెందిన వాంగ్ అనే మహిళ 2009లో ఐవీఎఫ్ పద్దతి ద్వారా గర్భం దాల్చింది. 2010 జూన్‌లో ఆమె లూలూ అనే శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఆమె శరీరంలోని అండాలను భవిష్యత్తు అవసరాల నిమిత్తం వైద్యులు అలానే ఉంచేశారు. అయితే పదేళ్ల తర్వాత వాంగ్ మళ్లీ తల్లి కావాలనుకుంది. తనకు ఐవీఎఫ్ చేసిన వైద్యుడిని సంప్రదించింది. అతడు మళ్లీ ఆమెకు ఐవీఎఫ్ నిర్వహించాడు. దీంతో ఆమె జూన్ 16న టాంగ్‌టాంగ్ అనే శిశువుకు జన్మనిచ్చింది. టాంగ్‌టాంగ్ అచ్చం లూలూ లానే అంతే బరువుతో పదేళ్ల తర్వాత ఒకే నెలలో జన్మించాడు. -
53 ఏళ్లకు మాతృత్వం.. కవలల జననం
తుమకూరు : ఇరవై, ముప్పై కాదు.. ఏకంగా యాభై మూడేళ్ల వయసులో ఓ మహిళ మాతృత్వ మధురిమల్ని చవిచూస్తోంది. ఒకరు కాదు ఇద్దరు పండంటి మగ బిడ్డలు జన్మించారు. కర్ణాటకలో తుమకూరు నగరంలో ఉన్న సిద్ధగంగ ఆస్పత్రిలో మంగళవారం వైద్యనిపుణుల పర్యవేక్షణ మధ్య ఆమె ప్రసవమైంది. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. టెస్ట్ ట్యూబ్ విధానంలో గర్భం దాల్చినట్లు తెలిసింది. -
ఆ కవలలకు కరోనా లేదు
గాంధీఆస్పత్రి : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో బుధవారం జన్మించిన కవలలకు కరోనా నెగిటివ్ వచ్చిందని, తల్లిబిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆస్పత్రి వైద్య వర్గాలు స్పష్టం చేశాయి. వివరాల్లోకి వెళితే... మేడ్చల్ జిల్లాకు చెందిన గర్భిణి (20) ప్రసవం కోసం నిలోఫర్ ఆస్పత్రిలో చేరింది. ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో ఈనెల 25న గాంధీ ఆస్పత్రికి తరలించారు. గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ మహాలక్ష్మి ఆధ్వర్యంలో వైద్యులు రేణుక, అపూర్వ, దీప్తి, పీజీలు రహస్య, చందన తగిన జాగ్రత్తలు తీసుకుని ఈనెల 26న ఆమెకు సిజేరియన్ చేయగా ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. అనంతరం చిన్నారులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా గురువారం అందిన నివేదికలో కరోనా నెగిటివ్ వచ్చింది. తల్లిబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, బాలింతను త్వరలోనే డిశ్చార్జి చేస్తామని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. (కరోనా బాధితురాలికి కవల పిల్లలు) -
కరోనా బాధితురాలికి కవల పిల్లలు
దుండిగల్: కరోనాతో బాధపడుతున్న ఓ గర్భిణి బుధవారం కవలలకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళితే.. గాజులరామారం ప్రాంతానికి చెందిన ఓ గర్భిణికి ఈ నెల 25న పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. అయితే బుధవారం ఆమె ఇద్దరు ఆడ శిశువులకు జన్మనిచ్చింది. పుట్టిన పిల్లలకు కరోనా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని అధికారులు తెలిపారు. కాగా ఆస్బెస్టాస్ కాలనీ నెహ్రునగర్‌కు చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో 16న నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించగా 17న ఆమె ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే 25న చిన్నారి అనారోగ్యానికి గురికావడంతో మళ్లీ నిలోఫర్‌కు తరలించగా అనుమానం వచ్చిన వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. చికిత్స పొందుతూ అదే రోజు చిన్నారి మృత్యువాత పడింది.(వారిద్దరూ అమ్మ వారసులే ) బాలింతకు సైతం పాజిటివ్ ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆమె కుటుంబసభ్యులు 11 మందిని హోం క్వారంటైన్ చేశారు. బుధవారం జగద్గిరిగుట్ట లెనిన్‌నగర్‌కు చెందిన యువకుడు, జీడిమెట్ల నెహ్రునగర్‌కు చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్ చేశారు. -
సందడిగా ట్విన్స్ 2కే రన్
-
తల్లి గర్భంలో తలలేని కవలలు!
పలమనేరు(చిత్తూరు): కడుపులో తల లేని కవలలున్న గర్భిణి తీవ్ర కడుపు నొప్పితో ఆదివారం కన్నుమూసింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం మేలుమాయి ఎస్సీ కాలనీకి చెందిన యుగంధర్ భార్య అన్నపూర్ణ (27) గర్భం దాల్చింది. అప్పటి నుంచి కడుపు నొప్పితో బాధపడుతూ పలమనేరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంది. ఈ నెల 9న తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వైద్యులు చిత్తూరులో స్కానింగ్ సెంటర్‌కు పంపారు. స్కాన్ చేయగా కడుపులో తలలు లేని కవలలున్నట్టు తేలింది. దీంతో అబార్షన్ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. ఈ నెల 10న ఆమెకు గర్భస్రావ మాత్రలిచ్చారు. వాటిని వేసుకున్నాక ఆమెకు ఫిట్స్ రావడంతో వెంటనే కుప్పం మెడికల్ కళాశాలకు తరలించారు. అక్కడ వైద్యులు ఆమెను పరీక్షించి మెదడులో రక్తం గడ్డ కట్టిందని తేల్చారు. అక్కడ న్యూరో సర్జన్లు లేరని ఆమెను తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. అన్నపూర్ణ మృతికి సంబంధించిన నివేదికను మండల వైద్యాధికారి డాక్టర్ మురళీకృష్ణ డీఎంహెచ్‌వోకు పంపనున్నారు. -
కొత్త శక్తి: కరణ్ జోహార్ భావోద్వేగ పోస్టు...
తన కవల పిల్లల పుట్టిన రోజు సందర్బంగా బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ భావోద్వేగ లేఖ షేర్ చేశారు. నేడు(ఫిబ్రవరి 7) కరణ్ కవలలు రూహీ జోహార్, యష్ జోహార్లు 3వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. దీంతో వారికి బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కరణ్ తన కవల పిల్లలకు, తన తల్లి హీరూ జోహార్లకు సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ లేఖ రాశారు. ‘అందరి దృష్టిలో నేను సింగల్ పేరెంట్‌ని.. అది నాకు కూడా తెలుసు.. కానీ వాస్తవానికి కాదు. ఎందుకంటే మా అమ్మ నా సింగిల్ పేరెంటింగ్ జీవితంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తను నాకు మాత్రమే కాకుండా నా కవల పిల్లలకు కూడా తల్లిగా మారారు. ప్రతీ విషయంలో నాతో పాటు వారికి ఓ తల్లిగా ప్రేమ, ఆప్యాయత పంచుతారు. అదే విధంగా తన మద్దతు లేనిదే ఏ విషయంలోనూ నిర్ణయం తీసుకోలేను’ అంటూ తన ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇక తన కవల పిల్లలను ఉద్దేశిస్తూ.. ‘ రూహీ, యష్‌లు ఇంట్లో అడుగుపెట్టడంతో మా సంతోషం రెట్టింపు అయ్యింది. ఈ కవలల అల్లరి, ముద్దు ముద్దు మాటలు వింటుంటే రోజురోజుకు ఓ నూతన శక్తిని పొందుతున్న భావన కలుగుతుంది. నిజంగా వీరి రాకతో మా కుటుంబం సంపూర్ణమైంది. ఈ రోజుతో రూహీ, యష్‌లు 3వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. కాగా రూహీ, యష్‌ల పేర్లను ఆయన తల్లిదండ్రులు హీరూ జోహార్, యష్ జోహార్ల పేర్లలోని మొదటి అక్షరంతో కలిసేలా పెట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా 44 ఏళ్ల మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌గా పేరున్న కరణ్ సరోగసీ ద్వారా రూహీ, యష్‌లకు తండ్రిగా మారారు. View this post on Instagram I am a single parent in social status...but in actuality am definitely not....my mother so beautifully and emotionally co parents our babies with me...I could never have taken such a big decision without her solid support...the twins turn 3 today and our feeling of being blessed continues with renewed vigour with every passing year...I thank the universe for completing us with Roohi and Yash.....🙏❤️🙏 A post shared by Karan Johar (@karanjohar) on Feb 6, 2020 at 6:32pm PST -
తీరిన కల.. 52 ఏళ్ల వయసులో కవలలకు జననం
టవర్‌సర్కిల్ (కరీంనగర్): ఆమె అమ్మమ్మ.. అయినప్పటికీ వారసత్వం కోసం మళ్లీ పిల్లలు కనాలని తపించింది. ఆమె ఆశయానికి కరీంనగర్‌లోని డాక్ట ర్ పద్మజ సంతానసాఫల్య కేంద్రం అండగా నిలిచింది. 52 ఏళ్ల వయసులో కూడా పండంటి కవలలకు జన్మనిచ్చింది. భద్రాచలంకు చెందిన ఆరె సత్యనారాయణ, రమాదేవి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు వివాహం కాగా, కుమారుడు 2013లో 13 ఏళ్ల వయసులో ప్రమాదవశాత్తు మరణించా డు. (చదవండి : ఇది చాలా అనైతికం) ఒంటరితనం బరించలేక ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కనాలనే ఆలోచనకు వచ్చి కరీంనగర్‌లోని పద్మజ సంతాన సాఫల్య కేంద్రాన్ని సంప్రదించారు. డాక్టర్ పద్మజ ఐవీ ఎఫ్ చికిత్సను ప్రారంభించి, ఈ నెల 11న సాధారణ ప్రస వంచేశారు. రమాదేవి కవలలకు జన్మనిచి్చంది. ఐవీఎఫ్ పద్ధతిలో 55 ఏళ్ల లోపు వయసున్న ఎవరికైనా టెస్ట్‌ట్యూబ్ ద్వారా పిల్లలను కనే అవకాశం ఉందని సంతాన సాఫల్య కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ పద్మజ తెలిపారు. (చదవండి : లేటు వయసులో... ఎంతటి మాతృత్వ అనుభూతులో) -
అతీంద్రీయ శక్తులు చెప్పాయని.. అత్యంత కిరాతకంగా
ముంబై: ‘నీకు ఎవరో చేతబడి చేశారు. అందుకే నీ జీవితంలో ఇన్ని కష్టాలు. ఈ కడగళ్లు తీరాలంటే.. కవలల్ని బలి ఇవ్వు. అప్పుడు జీవితం నువ్వు కోరినట్లు మారుతుంది’ ఈ వ్యాఖ్యలు పదే పదే చుగాని చెవుల్లో మారుమోగుతున్నాయి. అవును అతీంద్రీయ శక్తులు చెప్పింది నిజమే. నాకు చేతబడి చేశారు. అందుకే ఈ కష్టాలు. ఇవి తీరాలంటే కవలల్ని బలి ఇవ్వాలి. నా చుట్టుపక్కల, తెలిసిన వారిలో ఎవరికి కవల పిల్లలు ఉన్నారు. ఆ గుర్తుచ్చొంది. నా స్నేహితుడి ప్రేమ్‌కు ఇద్దరు కవల పిల్లలే కదా. వారిని చంపేస్తే.. నా సమస్యలు తీరిపోతాయి.. ఇలా రాసుకొచ్చాడు అనిల్ చుగాని అనే వ్యక్తి తన డైరీలో. నాలుగు రోజుల క్రితం ముంబై కొలబా ప్రాంతంలో మూడేళ్ల చిన్నారిని ఏడో అంతస్తు నుంచి కిందకు విసిరేసిన సంఘటన స్థానికంగా కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ దారుణానికి పాల్పడిన అనిల్ చుగాని స్వయంగా తానే పోలీసులకు లొంగిపోయాడు. విచారణలో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెల్లడించాడు. ఆ వివరాలు.. ముంబైకి చెందిన చుగాని మొరాకోలో ఓ బట్టల దుకాణంలో పని చేస్తున్నాడు. ప్రతి ఏడాది రెండు నెలల పాటు ఇండియాకు వచ్చే వాడు. కానీ ఈ సారి వచ్చి.. ఇక్కడే ఉండి పోయాడు. అయితే భారత్‌కు వచ్చే ముందు చుగానితో పాటు పని చేసే ఓ స్నేహితురాలు ఒకామె అతడికి చేతబడి చేశారని.. అందుకే అతన్ని సమస్యలు చుట్టుముట్టాయని తెలిపింది. కవలల్ని బలి ఇస్తే ఈ సమస్యలు తీరతాయని కూడా చెప్పింది. ఆమె మాటలు చుగాని మీద తీవ్ర ప్రభావం చూపాయి. ఇండియా వచ్చిన తర్వాత కూడా దీని గురించే ఆలోచించడం ప్రారంభించాడు చుగాని. ఈ క్రమంలో అతీంద్రీయ శక్తులు కూడా తనతో ఇదే విషయాన్ని చెప్పాయని డైరీలో రాసుకున్నాడు చుగాని. ఇక అప్పటి నుంచి కవలల కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలో అతడికి తన స్నేహితుడు ప్రేమ్ కవల పిల్లలు శ్రేయ, సన్యలు కనిపించారు. దాంతో వీరిద్దరిని చంపాలని భావించాడు చుగాని. ఈ ఏడాది మే నెల నుంచి వారిని చంపేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో గత శనివారం రాత్రి చుగాని, ప్రేమ్ కుటుంబాన్ని తన ఇంటికి ఆహ్వానించాడు. కాసేపు అతని పిల్లలతో ఆడుకుంటానని కోరాడు. దాంతో ప్రేమ్ తల్లి పిల్లలను తీసుకుని చుగాని ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన చుగాని తన ఇంటికి వచ్చిన పిల్లలకు భోజనం పెట్టి చేతులు శుభ్రం చేసే నెపంతో ఓ చిన్నారిని తీసుకెళ్లి తన ఇంటి నుంచి అనగా ఏడో అంతస్తు కిటికి నుంచి కిందకు పడేశాడు. మరో చిన్నారిని కూడా చంపడానికి ప్రయత్నించాడు. కానీ చిన్నారుల నానమ్మ ఆ పాపతో పాటే ఉండటంతో కుదరలేదు. చిన్నారి పై నుంచి కిందపడటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చుగానిని అరెస్ట్ చేశారు. పోలీసులను చూసిన చుగాని ఏ మాత్రం కంగారు పడకుండా చిన్నారిని తానే చంపానని ఒప్పుకోవడమే కాక ఇలా చేసినందుకు తనను అరెస్ట్ చేస్తారని తెలుసని పేర్కొన్నాడు. జైలుకు వెళ్లినప్పటికి తన సమస్యలు పరిష్కారం అవుతాయని చుగాని పోలీసులకు తెలిపాడు. -
ఇంత లేటు వయసులో... ఎంతటి మాతృత్వ అనుభూతులో
ఒక జీవి మరో జీవికి జన్మనివ్వడం సహజం.సంతానానికి జన్మనివ్వకపోవడాన్ని మనిషి అసంపూర్ణత్వంగా భావిస్తాడు.సంతానం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాడు.అయితే అలాంటి అన్ని ప్రయత్నాలూ సరైనవేనా? లేక చర్చకు ఆస్కారమిచ్చేవా? మాతృత్వంలోని మధురిమలు అనిర్వచనీయమైనవి. తల్లి కావడం ఒక తీయని అనుభూతే. కానీ బిడ్డకు జన్మనివ్వడం తల్లికి పునర్జన్మ అన్న వాడుక కూడా మనలో ఉంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపాడుకు చెందిన 74 ఏళ్ల మంగాయమ్మ గురువారం కవల పిల్లలకు జన్మనిచ్చారు. పుట్టిన ఆడ శిశువులు ఇద్దరూ 1.5 కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఇది చాలా సంతోషదాయకమైన అంశం. అయితే ఇంత లేటు వయసులో గర్భధారణ అన్నది చాలా రకాలైన ముప్పులతో కూడి ఉంటుంది. డెబ్బయి నాలుగేళ్ల వయసును పక్కన ఉంచితే... గర్భధారణ విషయంలో అసలు 35 ఏళ్లు దాటిన దగ్గర్నుంచి అనేక రకాల సమస్యలు పొంచి ఉంటాయి. ఇందులోని కొన్ని వైద్యపరమైన అంశాలతో పాటు అటు నైతిక, ఇటు సామాజిక అంశాలనూ ఒకసారి పరికిద్దాం. వయసు పెరుగుతున్న కొద్దీ మహిళల అండాల సంఖ్య, నాణ్యత తగ్గుతుంటుంది. అందుకే రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా ఒక మహిళలో ఇంకా మిగిలి ఉన్న అండాల సంఖ్యను (ఒవేరియన్ రిజర్వ్) తెలుసుకుంటారు. దాన్ని బట్టి వారికి అవసరమైన సంతాన సాఫల్య ప్రక్రియ ఏమిటన్నది నిర్ణయిస్తారు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. ఇలా చేసే పరీక్షల ఫలితాలన్నీ ఉజ్జాయింపుగా ఉంటాయే తప్ప... నిర్దిష్టంగా ఏ పరీక్ష కూడా వంద శాతం కచ్చితత్వంతో ఉండదు. ఇక గర్భధారణ జరిగినా పిండంలో వైకల్యాలు ఏర్పడే అవకాశాలూ పెరుగుతాయి. అంతేకాదు... గర్భస్రావం అయ్యే అవకాశాలూ హెచ్చుతాయి. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ ఆలస్యంగా గర్భధారణ జరిగే వారిలో గర్భస్రావాలు అయ్యే అవకాశాలు ఎక్కువ. గర్భస్రావం అయ్యే అవకాశాలు 35 ఏళ్ల కంటే చిన్నవయసు ఉన్నవారిలో 13 శాతం ఉంటాయి. అదే 45 ఏళ్ల వయసు పైబడిన వాళ్లలో అవి 54 శాతానికి పెరగవచ్చు. గర్భధారణకు పురుషుడి లోపాలూ దోహదం ఇక ఆలస్యంగా గర్భధారణ జరిగే ప్రక్రియలో పురుషుడి వీర్య సంబంధమైన లోపాలు కూడా గర్భధారణను సంక్లిష్టం చేస్తాయి. వయసు మీరిన పురుషుడికి సెమన్ అనాలసిస్ పరీక్ష చేసినప్పుడు అందులో పురుష బీజకణాలు తక్కువగా ఉండటం, వాటి రూపంలో లోపం, వాటి కదలికలు సరిపడనంతగా లేకపోవడం వంటి అసాధారణ పరిస్థితులు కనిపిస్తుంటాయి. అదే జరిగితే... అడ్వాన్స్డ్ స్పెర్మ్ అనాలిసిస్, టెస్టిక్యులార్ బయాప్సీ, జనెటిక్ టెస్ట్, స్క్రోటల్ అల్ట్రాసౌండ్, కేరియోటైప్ టెస్ట్ వంటి మరికొన్ని పరీక్షలూ అవసరమవుతాయి. పుట్టే పిల్లలకూ ఏర్పడే ముప్పులు ఆలస్యంగా గర్భధారణ జరిగిన మాతృమూర్తులకు పుట్టే పిల్లల్లోనూ జన్యుపరమైన కొన్ని లోపాలు తలెత్తేందుకు అవకాశం ఉంది. అదెలా జరుగుతుందో చూద్దాం.తల్లిదండ్రుల తాలూకు ఈ లక్షణాలన్నింటినీ బిడ్డలకు వచ్చేలా చేసే మౌలిక అంశాలను క్రోమోజోములు అంటారు. తల్లి నుంచి ఒక 23, తండ్రి నుంచి మరో 23... ఇలా ఈ రెండు 23 జతలు కలగలసి 46 క్రోమోజోములు పిండంలోకి చేరితేనే అది పూర్తిస్థాయిలో లోపాలు లేని ఒక మానవ పిండంగా ఎదుగుతుంది. పుట్టబోయే బిడ్డలందరిలోనూ ఇవే 23 జతల క్రోమోజోములుంటాయి. ఉండాలి కూడా. అయితే దురదృష్టవశాత్తు కొంతమంది పిల్లల్లో మాత్రం ఈ క్రోమోజోముల సంఖ్యలో తేడా వస్తుంది. అప్పుడు ఆ బిడ్డలో దేహనిర్మాణపరమైన లోపాలు, ఇతరత్రా లోపాలు రావచ్చు. అలా ఆ లోపాలతోనే బిడ్డ పుట్టేందుకు అవకాశం ఉంది.బిడ్డ పుట్టాక లోపాలను కనుగొంటే చేయగలిగేందేమీ ఉండకపోవచ్చు. అయితే బిడ్డ పుట్టకముందే వాటిని కనుగొనగలిగితే తల్లిదండ్రులకూ, కొన్నిసార్లు పుట్టబోయే బిడ్డకు ఉపయోగకరమైన నిర్ణయం తీసుకోడానికి వీలవుతుంది. ఇలా బిడ్డలోని క్రోమోజోముల సంఖ్యలో తేడా వచ్చినప్పుడు బిడ్డకు వచ్చే వ్యాధుల్లో ఒక ప్రధానమైన సమస్యే ‘డౌన్స్ సిండ్రోమ్’. ఏమిటీ డౌన్స్ సిండ్రోమ్? మానవుల్లో 23 జతల క్రోమోజోములకు బదులు ఒక క్రోమోజోము అదనంగా వచ్చి చేరినప్పుడు పెరిగే పిండం బిడ్డగా రూపొందితే అప్పుడు పుట్టే బిడ్డ కొన్ని లోపాలతో పుడుతుంది. అలా పుట్టే బిడ్డను ‘డౌన్ సిండ్రోమ్’తో పుట్టిన బిడ్డగా చెబుతారు. ఈ లోపాన్నే ‘ట్రైజోమీ 21’ అని కూడా అంటారు. బిడ్డలోని 21వ క్రోమోజోముకు అదనంగా మరో క్రోమోజోము చేరడం వల్ల ఇలా డౌన్ సిండ్రోమ్‌తో బిడ్డ పుడతాడు. ఇలా డౌన్స్ సిండ్రోమ్‌తో పుట్టిన బిడ్డలో మెదడు ఎదుగుదల తక్కువ. కాబట్టి ఆ బిడ్డలో నేర్చుకునే శక్తి, మానసిక ఎదుగుదల ఇవన్నీ తక్కువగా ఉంటాయి. కొందరిలో గుండె లోపాలు కూడా రావచ్చు. తల్లిలో గర్భధారణ చాలా ఆలస్యంగా జరిగినప్పుడు ఇలా డౌన్స్ సిండ్రోమ్‌తో బిడ్డ పుట్టే అవకాశం ఉంది. ఉదాహరణకు 20 ఏళ్ల వయసులో గర్భధారణ జరిగినప్పుడు ప్రతి 1140 మంది మహిళల్లో ఒకరికి డౌన్స్ సిండ్రోమ్‌తో బిడ్డ పుట్టే అవకాశం ఉండగా... 30 ఏళ్ల వయసులో గర్భధారణ జరిగినప్పుడు ప్రతి 720 మహిళల్లో ఒకరికీ, అదే 40 ఏళ్ల వయసు తర్వాత గర్భధారణ జరిగితే ప్రతి 65 మందిలో ఒకరికి ఇలా డౌన్స్ సిండ్రోమ్‌తో బిడ్డ పుట్టవచ్చు. కవలల తండ్రి డౌన్స్ సిండ్రోమ్‌ను ముందుగానే తెలుసుకోవచ్చా? కొన్ని పరీక్షలతో డౌన్స్ సిండ్రోమ్, మరికొన్ని జన్యుపరమైన సమస్యలను తెలుసుకోవచ్చు. ఇందులో మొదటిది స్క్రీనింగ్ పరీక్ష. ఈ స్క్రీనింగ్ పరీక్షలో.. సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేలితే, ఆ తర్వాత చేసేది నిర్ధారణ పరీక్ష. ఇందులో స్క్రీనింగ్ పరీక్షను హైరిస్క్ ఉన్న ప్రతి గర్భవతీ చేయించుకోవడం మంచిది. గర్భిణి పిండంలో ఏదైనా ముప్పు (హైరిస్క్) ఉందా అని తెలుసుకోవడం కోసం ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. ఇది చాలా చిన్న సాధారణ రక్త పరీక్ష మాత్రమే. కాకపోతే కొంచెం ఖర్చుతో కూడుకున్నది.ఒకవేళ ఈ స్క్రీనింగ్ పరీక్ష (డబుల్ మార్కర్ టెస్ట్, క్వాడ్రపుల్ టెస్ట్)లో ఏదైనా సమస్య ఉండే అవకాశమున్నట్లు ఫలితం వస్తే అప్పుడు పూర్తి స్థాయి నిర్ధారణ కోసం మరో పరీక్ష అంటే కోరియానిక్ విల్లస్ బయాప్సీ, అమ్నియోసెంటైసిస్ పరీక్ష (ఉమ్మనీరు పరీక్ష) అవసరమవుతాయి.ఇవేగాక ఆలస్యంగా గర్భధారణ జరిగిన తల్లిదండ్రులకు పుట్టే బిడ్డలు చాలా రకాల అవయవ లోపాలతోనూ, ఇంకా అనేక రకాల జన్యుపరమైన సమస్యలు, మెటబాలిక్ సిండ్రోమ్స్‌తో పుట్టవచ్చు. మూగ, చెవుడు, ఆటిజమ్ వంటి సమస్యలు రావడం కూడా ఎక్కువే. ఇలాంటి చాలా సమస్యలు ఎంత అడ్వాన్స్డ్ పరీక్షలు అందుబాటులోకి వచ్చినప్పటికీ అవన్నీ కచ్చితంగా తెలియకపోవచ్చు. పుట్టిన తర్వాత, బిడ్డ ఎదుగుతున్న క్రమంలో తెలుస్తాయి. ఇక ఇంత లేట్ వయసులో తల్లిలో క్యాల్షియం తగ్గడం, ఎముకలు అరిగిపోవడం, రక్తం గూడు కట్టుకుపోయే ముప్పు, గర్భధారణ సమయంలో సాధారణంగా రక్తపోటు పెరగడం, జెస్టెషనల్ డయాబెటిస్ వంటి అనేక ముప్పులు కలుగుతాయి. ఇవన్నీ వైద్యపరమైన ముప్పుల్లో కొన్ని మాత్రమే. కాగా ఇక నైతికంగా, సామాజికంగానూ, ఆర్థికపరమైన ముప్పులు కూడా ఉంటాయి.ఈ ముదిమి వయసులో పిల్లలు కలగాలనే తమ గాఢమైన తాపత్రయాన్ని నెరవేర్చుకుని సేఫ్‌గా ఆరోగ్యకరమైన పిల్లలను కన్న తల్లిదండ్రులనూ, బిడ్డలనూ అభినందించి తీరాలి. అలాగే ఈ వయసులో ప్రపంచ రికార్డు నెలకొల్పే ఫీట్‌ను అత్యంత సురక్షితంగా నెరవేర్చిన వైద్యబృందానికీ అభినందన దక్కాలి. అయితే... బిడ్డలను ఏ వయసులో కనాలి, అంత వయసు వారికి గర్భధారణ కోసం కృత్రిమ ప్రక్రియలు అవలంబించవచ్చా, ఏ వయసు వారి వరకు గర్భధారణ ప్రక్రియలు పాటించవచ్చు అనే విషయంలో స్పష్టమైన చట్టాలేమీ లేవు. నైతికతలను స్వచ్ఛందంగా పాటించే మనలాంటి దేశాల్లో ఉండవు కూడా. కాబట్టి ఇందులో ఎదురయ్యే సమస్యలూ, వాటి పరిష్కారాలు, వాటి ఆధారంగానే ముందుకు వెళ్లడం... ఇవన్నీ వారి వారి విచక్షణ మేరకే ఉంటాయి. కాబట్టి అటు వైద్యులూ, ఇటు తల్లిదండ్రులూ ఈ విషయంలో ఎవరికి వారే విచక్షణతో మెలగాలి. అలాంటి విచక్షణలతో కూడినది కనుకనే ఈ వార్త ఇప్పుడు మనందరిలోనూ, వైద్యవర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ఏమైనా అద్భుతాలు అరుదుగా మాత్రమే జరుగుతాయి. అద్భుతాలతో పాటు కాంప్లికేషన్లు ముడిపడి ఉంటాయి. సఫలమైనప్పుడు మాత్రమే అది అద్భుతం అవుతుంది. అందరూ ప్రతిసారీ తమ విషయంలో అద్భుతాన్ని ఆశించడం అంత సమంజసం కాకపోవచ్చు. అందుకే సాధ్యమైనంత వరకు ప్రకృతి ధర్మాన్ని అనుసరించే ముందుకెళ్లాలి. ఆర్థికపరమైనఅంశాలు సాధారణంగా తల్లిదండ్రులు పెద్ద వయసులో ఉన్న వారు కావడం, కృత్రిమ గర్భధారణ ద్వారా పిల్లలు పుట్టినందున, కవలలు అయినందున కొన్ని రకాల వైద్యపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది అటు తల్లిదండ్రులకూ, ఇటు బిడ్డలకూ రావచ్చు. వారు బాగా కలిగినవారే అయినప్పటికీ ఇప్పుడు వైద్యం చాలా ఖరీదైన నేపథ్యంలో ఇది ఖర్చు పరంగా కాస్తంత ఆర్థిక భారంగా పరిణమించేందుకే అవకాశాలు ఎక్కువ. నైతికపరమైన అంశాలు పిల్లలను పొందడం అన్నది ఒక భావోద్వేగపరమైన అంశం. ప్రతివారికీ తమ రక్తం పంచుకు పుట్టిన పిల్లలపై అపేక్ష, ప్రేమ, అనిర్వచనీయమైన అనుబంధం ఉంటాయి. ఆ హక్కును కాదనలేం. కానీ గర్భధారణ జరిగిన మహిళకు ఏదైనా ముప్పు వచ్చి, తల్లీబిడ్డలిద్దరిలో తల్లిని రక్షించాలా, బిడ్డను రక్షించాలా అన్న సంశయం వస్తే... పెద్దప్రాణానికే విలువనివ్వడం మన గమనానికి వచ్చే అంశమే. అలాంటప్పుడు 74 ఏళ్లు వయసులో బిడ్డ ఆరోగ్యంగానే పుడతాడా... ఒకవేళ పుట్టినా ఈ కేసులో అవసరమైనట్లే సిజేరియన్ అవసరమైతే ఆ మహిళకు శస్త్రచికిత్సలకు తట్టుకునే శక్తి ఉంటుందా... తల్లికి గండంగా పరిణమించే ఇంత రిస్క్ అవసరమా అన్నది ఆలోచించాల్సిన అంశం. ఇక మన మంగాయమ్మ గారి విషయంలో అదృష్టవశాత్తూ బిడ్డల్లో జన్యుపరమైన లోపాలేవీ తలెత్తలేదు. కానీ ఒకవేళ ఇంత పెద్ద వయసులో డౌన్స్ సిండ్రోమ్‌కు స్పష్టమైన అవకాశాలు ఉన్నందున అదేజరిగితే అది అటు తల్లిదండ్రులతో పాటు ఇటు సమాజంపై కూడా భారం పడేదే. ఇక ఇప్పుడు తల్లి వయసు 74 ఏళ్లు, మరి తండ్రి వయసు తప్పక అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ తండ్రి వయసు కూడా కాసేపు అంతే అనుకుందాం. ఉదాహరణకు ఆ పిల్లలను సాకే విషయంలో ఎదురయ్యే ఒక చిన్న అంశాన్ని చూద్దాం. ఆ పిల్లలిద్దరూ పదవ తరగతి, ఇంటర్‌కు చేరే సమయానికి వారి వయసు 89, 92కి చేరుతుంది. దాదాపు 90 ఏళ్ల నాటికి కూడా టీనేజీకి చేరని ఆ పిల్లలను ఆ తల్లిదండ్రులు సమాజానికి భారం కాకుండా బాధ్యతగా సాకగలరా అనేది మరో అంశం. డా‘‘ వేనాటి శోభ,సీనియర్ గైనకాలజిస్ట్‌బర్త్‌రైట్ బై రెయిన్బో,హైదర్‌నగర్, హైదరాబాద్ -
ఆ అమ్మకు కవలలు..
గుంటూరు మెడికల్/రామచంద్రాపురం రూరల్: బామ్మ వయసులో ఆమె అమ్మ అయింది. సంతానం కావాలన్న ఆమె కల కవలల రూపంలో నెరవేరింది. 73 ఏళ్ల వయసులో ఆమె మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తోంది. సంతానం కోసం ఏళ్ల తరబడి నిరీక్షించిన ఆమె కల ఎట్టకేలకు గురువారం నెరవేరింది. దేశం అంతా నివ్వెరపోయేలా 73 ఏళ్ల వయసులో గర్భం దాల్చడం.. వివాహమైన 57 సంవత్సరాలకు కడుపు పండి ఒకేసారి ఇద్దరు ఆడ శిశువులకు జన్మనివ్వడం అందరినీ ఆశ్చర్యపడేలా చేసింది. గుంటూరు కొత్తపేటలోని అహల్య ఐవీఎఫ్ సెంటర్లో గురువారం మంగాయమ్మకు విజయవంతంగా ఆపరేషన్ చేసి శిశువులను బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రి అధినేత, ఐవీఎఫ్ స్పెషాలిటీ వైద్య నిపు ణులు డా. శనక్కాయల ఉమాశంకర్ ఆస్ప త్రిలో మీడియాకు వివరించారు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం నెలపర్తిపూడి గ్రామానికి చెందిన మంగాయమ్మ, రామ రాజారావు దంపతులకు 57 ఏళ్లుగా పిల్లలు పుట్టలేదన్న బాధతో 2018 నవంబర్‌లో తమను సంప్రదించారన్నారు. వయసు పెద్దది కావటంవల్ల ఆమెకు కౌన్సెలింగ్ చేసి, మెడికల్ బోర్డు అనుమతి తీసుకున్న అనంతరమే ఆమెకు వైద్యం ప్రారంభించామని ఆయన చెప్పారు. తమ వద్దకు వచ్చిన నెలరోజులకు నెలసరి వచ్చిందన్నారు. రెండో నెలలో ప్రణాళిక ప్రకారం ఐవీఎఫ్ చేయడంతో అదే నెలలో గర్భ నిర్ధారణ అయిందన్నారు. 2019 జనవరి 28న గర్భం దాల్చినట్లు నిర్ధారించుకుని ఆమెకు ఆసుపత్రిలోనే ప్రత్యేక గదిలో వైద్య సేవలు అందించామన్నారు. బీపీ, సుగర్ లేకపోవడంతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గర్భంలో బిడ్డ ఎదిగిందన్నారు. పుట్టిన శిశువులు ఒకొక్కరు 1.8 కేజీలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం వీరిద్దరినీ ఎన్ఐసీయూలో ఉంచామని, 21 రోజుల తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని ఉమాశంకర్ తెలిపారు. దేశంలో మొట్టమొదటిసారిగా 73 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చడం ఇదే మొదటిసారి అని ఆయనన్నారు. ఆపరేషన్‌కు ముందు సీమంతం ఇదిలా ఉంటే.. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లే ముందు మంగాయమ్మకు ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది సీమంతం చేశారు. మంగాయమ్మ భర్త రామరాజారావు, తల్లి దేవళ్ల తులసమ్మ (93) అక్షింతలు వేసి ఆశీర్వదించారు. -
‘మంగాయమ్మ, పిల్లలు క్షేమంగా ఉన్నారు’
సాక్షి, గుంటూరు : 74 ఏళ్ల వయసులో కవలపిల్లలకు జన్మనిచ్చిన మంగాయమ్మ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని ఆమెకు ప్రసవం చేసిన డాక్టర్ ఉమాశంకర్ తెలిపారు. ఐవీఎఫ్ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన అతి పెద్ద మహిళగా మంగాయమ్మ రికార్డు నెలకొల్పారు. ఆమెకు గుంటూరు అహల్యా ఆస్పతిలో ఉమాశంకర్ నేతృత్వంలోని వైద్యుల బృందం గురువారం విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది. అనంతరం ఉమాశంకర్ మీడియాతో మాట్లాడుతూ.. సంతానం కోసం మంగాయమ్మ దంపతులు గతేడాది నవంబర్ 12న తమ ఆస్పత్రికి వచ్చినట్టు చెప్పారు. మంగాయమ్మ ఆరోగ్యంగా ఉండటంతో ఐవీఎఫ్ ద్వారా గర్భం కోసం ప్రయత్నించినట్టు వెల్లడించారు. అయితే గర్భం దాల్చిన తరువాత మంగాయమ్మకు ఆహారం విషయంలో కొంత ఇబ్బంది ఎదురైందని చెప్పారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆమెకు ప్రత్యేక వైద్యం అందించినట్టు వివరించారు. 10 మంది వైద్యులు మూడు బృందాలుగా విడిపోయి.. రాత్రింబవళ్లు కష్టపడి విజయం సాధించినట్టు పేర్కొన్నారు. ఒక పద్దతి ప్రకారం చికిత్స చేయడం వల్లే వైద్య రంగంలో అద్భుతమైన విజయం సాధించామన్నారు. నేడు గురుపూజోత్సవం కావడంతో ఈ విజయాన్ని తన గురువులకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటించారు. చదవండి : కవలలకు జన్మనిచ్చిన 74 ఏళ్ల బామ్మ -
కవలలకు జన్మనిచ్చిన బామ్మ
-
కవలలకు జన్మనిచ్చిన 74 ఏళ్ల బామ్మ
గుంటూరు : 74 ఏళ్ల వయసులో గర్భం దాల్చిన బామ్మ కవలలకు జన్మనిచ్చారు. గురువారం ఆమెకు సిజేరియన్ ద్వారా వైద్యులు ప్రసవం చేశారు. గుంటూరు అహల్యా ఆస్పతిలో నలుగురు వైద్యుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం తల్లి, పిల్లలు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. పండంటి ఇద్దరు ఆడపిల్లలు జన్మించడంతో.. 57 ఏళ్లుగా పిల్లల కోసం తపనపడ్డ ఆ దంపతుల కల నెరవేరింది. దీంతో వారి కుటుంబంలో సంతోషం నెలకొంది. కాగా, తూర్పుగోదావరి జిల్లా నెలపర్తిపూడికి చెందిన యర్రమట్టి రామరాజారావుతో మంగాయమ్మకు 1962లో వివాహమైంది. రైతు కుటుంబానికి చెందిన రామరాజారావు దంపతులు వివాహమైన నాటి నుంచి సంతానం కోసం ప్రయత్నించారు. గత ఏడాది మంగాయమ్మ ఇంటి పక్కనే ఉన్న ఓ మహిళ ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చింది. ఆ మహిళ వయసు 55 ఏళ్లు ఉండటంతో మంగాయమ్మ ధైర్యం తెచ్చుకుని.. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చేందుకు సిద్ధమైంది. 2018 నవంబర్‌లో ఆ దంపతులు గుంటూరు అహల్యా ఆస్పత్రిని సంప్రదించగా.. ఐవీఎఫ్ పద్ధతిలో మంగాయమ్మ గర్భం దాల్చింది. దీంతో ఆమెకు ఆస్పత్రిలోనే ప్రత్యేక గదిని ఏర్పాటుచేసి వైద్యసేవలందించారు. బీపీ, షుగర్ లేకపోవడంతో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా గర్భంలో బిడ్డ ఆరోగ్యంగా ఎదిగింది. గుండె వైద్య నిపుణుడు పీవీ మనోహర్, జనరల్ మెడిసిన్ వైద్య నిపుణుడు శనక్కాయల ఉదయ్‌శంకర్ పర్యవేక్షణలో రోజూ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ తల్లి, గర్భంలో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీంతో మంగాయమ్మ ప్రపంచంలో ఐవీఎఫ్ చేయించుకున్న అతి పెద్ద మహిళగా రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు రాజస్తాన్‌లో దల్జీందర్ పేరిట ఈ రికార్డు ఉంది. దల్జీందర్ 72 ఏళ్ల వయస్సులో మగ బిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా దల్జీందర్ రికార్డును అధిగమించి మంగాయమ్మ కవలలకు జన్మనిచ్చారు. -
మదర్స్ డే రోజు ఐరన్ లేడీకి ట్విన్స్
సాక్షి, బెంగళూరు: మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ మరోసారి ఐరన్ లేడీ అని నిరూపించుకున్నారు. 46 ఏళ్ల వయసులో షర్మిల కవల పిల్లలకు జన్మనిచ్చారు. అదీ మాతృదినోత్సవం (మే 12వ తేదీ ఆదివారం) రోజున ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం విశేషం. ఈ విషయాన్ని ఆమె సన్నిహితురాలు, దివ్యభారతి సామాజిక మాధ్యమంలో వెల్లడించారు. బెంగళూరు మల్లేశ్వరంలోని క్లౌడ్‌లైన్ గ్రూప్ ఆఫ్ హాస్పటల్లో ఆదివారం ఉదయం 9.21కి షర్మిల కవలలకు జన్మనిచ్చారనీ, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని ఆమె తెలిపారు. వీరికి నిక్స్ సఖి, ఆటం తారా అనే పేర్లను ఖాయం చేశారు షర్మిల, డెస్మండ్ దంపతులు. ఇది తనకు కొత్త జీవితమంటూ షర్మిల సంతోషం వ్యక్తం చేశారు. అందులోనూ మదర్స్ డే రోజు కవల ఆడబిడ్డలు కలగడం చెప్పలేని ఆనందాన్నిస్తోందన్నారు. ఆరోగ్యవంతమైన పిల్లలు కావాలని మాత్రమే తాను డెస్మండ్ కోరుకున్నామని ఆమె పేర్కొన్నారు. కాగా మణిపూర్ రాష్ట్రంలో భద్రతా దళాలకు ప్రత్యేక అధికారం అందించే చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ 16 ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటంతో ఉక్కు మహిళగా ఘనత కెక్కారు ఇరోమ్ షర్మిల. కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే నాజల్ ట్యూబ్ ద్వారా ఆమె ఆహారంగా తీసుకున్నారు. 2000 సంవత్సరం ఈ పోరాటాన్ని కొనసాగించారు ఆమె. ఆ తరువాత 2017 ఆగస్టులో తన ప్రేమికుడు గోవాలో పుట్టిన బ్రిటిష్ జాతీయుడు డెస్మండ్ కౌటిన్హోను ఆమె వివాహమాడారు. తమిళనాడులోని కొడైకెనాల్లో ఉంటున్నారు. సుదీర్ఘ నిరాహార దీక్ష విరమణ అనంతరం శరీరాన్ని తిరిగి పూర్తి స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు ఆమె మరో పోరాటమే చేశారు. -
మూఢనమ్మకాలతో కవలలకు వాతలు
విజయనగరం: పాచిపెంట మండలం కేసలి పంచాయతీ ఊబిగుడ్డిలో దారుణం చోటుచేసుకుంది. మూఢ నమ్మకాలతో అప్పుడే పుట్టిన కవల పిల్లలకు గిరిజనులు వాతలు పెట్టారు. పరిస్థితి విషమించడంతో సాలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు అనారోగ్యంతో కవలల తల్లి చికిత్స పొందుతూ శుక్రవారమే మృతిచెందడం ఆ కుటుంబంలో మరింత విషాదం నింపింది. విద్యుత్ స్థంభాన్ని ఢీకొన్న కారు..ఇద్దరికి గాయాలు లక్కవరపు కోటమ గ్రామ శివారు వద్ద విశాఖపట్నం నుంచి అరకు వైపు వెళ్తున్న డస్టర్ కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న విద్యుత్ స్థంభాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తోన్న ఇద్దరు నేవీ ఉద్యోగులకు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ కారులో సేప్టీ బెలూన్లు తెరుచుకోవడంతో చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి అతివేగమే కారణమని స్థానికులు చెబుతున్నారు. కారు వేగానికి విద్యుత్ స్థంభాలు కూడా విరిగిపోయాయి. షార్ట్ సర్క్యూట్‌తో 4 ఇళ్లు దగ్ధం జామి మండలంల లోట్లపల్లి గ్రామంలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా 4 ఇళ్లు దగ్ధమయ్యాయి. సుమారు రూ.6 లక్షల ఆస్తినష్టం సంభవించింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. -
బాలీవుడ్ నటికి పుత్రశోకం
ఇటీవల కవలలకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ ఇంట విషాదం నెలకొంది. తనకు జన్మించిన ఇద్దరు పిల్లల్లో ఒకరు అనారోగ్యం కారణంగా మరణించారు. పుట్టుకతోనే తీవ్ర హృదయ సంబంధ సమస్యతో జన్మించిన బాబు, చనిపోయాడని సెలీనా తన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలుపుతూ ఆవేదన వ్యక్తం చేసింది. తొలి కాన్పులోనూ సెలీనా దంపతులకు కవలలే జన్మించారు. 35 ఏళ్ల సెలీనాకు తొలి కాన్పులో జన్మించిన విన్ స్టన్, విరాజ్ లకు ప్రస్తుతం ఐదేళ్లు. సెప్టెంబర్ 10న మరోసారి కవలలకు జన్మనిచ్చిన ఆనందం వారి ఇంట ఎన్నో రోజులు నిలవలేదు. వారిలో ఒక బాబును మరణించటం సెలీనా ఇంట్లో విషాదం నింపింది. -
ఆస్పత్రి ఖర్చుచెల్లించలేక కవల పిల్లల విక్రయం
ప్రకాశం: పేదరికంతో భారమైన తమ చిన్నారులను కన్నతల్లిదండ్రులు అమ్మకున్న ఘటన ప్రకాశం జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో జన్నించిన ఆ ముక్కుపచ్చలరని ఇద్దరు కవలలను పేదరికం కారణంతో అమ్ముకోవడానికి సిద్ధమైయ్యారు ఆ తల్లిదండ్రులు. ఆస్పత్రిలో ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన ఆ తల్లి తన పిల్లలకు ఆస్పత్రి ఖర్చు చెల్లించలేక విక్రయానికి పెట్టినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరి కవలలను ఓ ఇద్దరి దంపతులు డబ్బ చెల్లించి తీసుకవెళ్లినట్టు తెలిసింది. ప్రస్తుతం కవలలిద్దరూ ఐసీడీఎస్ అధికారుల సంరక్షణలో ఉన్నట్టు సమాచారం. -
జన్మనిచ్చిన మూడు గంటలకే బీఈడీ పరీక్ష
హిందూపురం, న్యూస్‌లైన్: తన ప్రతిరూపానికి జన్మనివ్వడానికి తల్లి పడే బాధ, వేదన వర్ణించలేనిది. అంతటి బాధను భరించి కవల పిల్లలకు జన్మనిచ్చి ‘అమ్మ’గా నెగ్గిన ఓ మహిళ.. కాన్పు అయిన మూడు గంటలు కూడా గడవకుండానే బీఈడీ పరీక్షకు హాజరై జీవిత పోరాటంలోనూ ముందు వరుసలో నిలిచింది. హిందూపురం పట్టణంలోని సత్యసాయినగర్‌కు చెందిన తిప్పన్న కుమార్తె గీతావాణి(28) శుక్రవారం ఓప్రయివేట్ ఆస్పత్రిలో ఉదయం 10.20 గంటలకు ఒక పాప, 10.30 గంటలకు మరో పాపకు సాధారణ కాన్పుతో జన్మనిచ్చింది. బాధను పంటి బిగువన భరిస్తూ.. స్థానిక ఎస్‌డిజిఎస్ కళాశాలలో బీఈడీలో చివరి పరీక్ష ఇంగ్లిష్ రాసేందుకు బయలు దేరింది. ఆస్పత్రి సిబ్బంది, బంధువులు తొలుత వాణిని వారించినా, ఆమె పట్టుదల చూసి అంబులెన్స్ తెప్పించారు. బంధువుల సహకారంతో ఇద్దరు పిల్లలనూ వెంట బెట్టుకుని మధ్యాహ్నం 2 గంటలకు పరీక్ష కేంద్రం చేరుకుంది. మధ్యలో పిల్లలకు పాలు పట్టిస్తూ.. నిర్ణీత గడువులోగా పరీక్ష రాసింది. ఆమె పరీక్ష రాస్తుండగా గది బయట ఆమె బంధువులు కవలలను లాలించారు. ఆమెకు ఇది రెండవ కాన్పు. తొలి కాన్పులో బాబు పుట్టాడు. భర్త స్థానిక సూపర్ స్మిన్నింగ్ మిల్లులో పని చేస్తున్నారు.