
తుమకూరు : ఇరవై, ముప్పై కాదు.. ఏకంగా యాభై మూడేళ్ల వయసులో ఓ మహిళ మాతృత్వ మధురిమల్ని చవిచూస్తోంది. ఒకరు కాదు ఇద్దరు పండంటి మగ బిడ్డలు జన్మించారు. కర్ణాటకలో తుమకూరు నగరంలో ఉన్న సిద్ధగంగ ఆస్పత్రిలో మంగళవారం వైద్యనిపుణుల పర్యవేక్షణ మధ్య ఆమె ప్రసవమైంది. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. టెస్ట్ ట్యూబ్ విధానంలో గర్భం దాల్చినట్లు తెలిసింది.