Tamakuru
-
బంగారు దోసె @ రూ.వెయ్యి
తుమకూరు: సెట్ దోసె, నీరు దోసె, మసాల దోసె, ప్లెయిన్ దోసె ఇలా అనేక రకాల దోసెలను తినే ఉంటారు. వాటి ధర 50 నుంచి 100 మధ్య ఉంటే గొప్ప. కానీ ఇక్కడ ఎవరూ ఊహించని దోసెను అమ్ముతున్నారు. దానిని ఆరగించాలంటే రూ. వెయ్యి చెల్లించుకోవాలి. దోసెకు అంత ధర అని ఆశ్చర్యపోవద్దు, వివరాలు తెలుసుకుంటే నిజమే అని అంగీకరిస్తారేమో. ఇలా తయారవుతుంది తుమకూరు నగరంలో రైల్వేస్టేషన్ రోడ్డులోని ఓ హోటల్లో బంగారు దోసె లభిస్తోంది. మామూలు మసాలా దోసెను చేయగానే దానిపై అతి పల్చని బంగారు కాగితాన్ని పరుస్తారు. దోసె వేడికి అది అలాగే అతుక్కుపోతుంది. దోసెతో సహా బంగారాన్ని కూడా తినేయవచ్చు. గత మూడు నెలల నుంచి ఇక్కడ బంగారు దోసెలను అమ్ముతున్నారు. ఇప్పటికి 45 దోసెలు మాత్రమే హోటల్ యజమాని కార్తీక్ మాట్లాడుతు కొన్ని సంవత్సరాల కిందట బెంగళూరులో ఒక హోటల్లో ఇలాంటి దోసెను వేశారని, అది మనసులో పెట్టుకుని తాను కూడా బంగారు దోసెకి నాంది పలికినట్లు చెప్పాడు. అప్పటి నుంచి రూ. వెయ్యి చెల్లించి 45 మంది మాత్రం ఈ ఖరీదైన దోసెల సంగతి చూశారు. కాగా, బంగారాన్ని ఆరగించడం ఆరోగ్యానికి మంచిదని కొందరు, ఎలాంటి ఉపయోగం ఉండదని మరికొందరు తెలిపారు. ఎక్కువమంది కొనకపోయినప్పటికీ ఈ హోటల్‌కు వచ్చి బంగారు దోసెను చూసి ఫోటోలు వీడియోలు తీసుకోవడం పెరిగింది. (చదవండి: సాగర జలాశయంలో వింత మత్స్యం ..రెక్కలతో నిలబడే చేప ) -
వడ్డించేందుకు గరిట లేదని... చిప్పతో చట్నీ పోసెయ్
తుమకూరు: తుమకూరు నగరంలో ఉన్న తుమకూరు విశ్వ విద్యాలయానికి నిధులకు లోటులేదు. ప్రతి ఏటా కేంద్ర, రాష్ట్రాల నుంచి వందల కోట్ల రూపాయలు వస్తుంటాయి. ప్రొఫెసర్లు, అధికారులు అధునాతన వసతులతో తులతూగుతూ ఉంటారు. కానీ వర్సిటీ మెస్‌లలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు లబోదిబోమంటారు. వర్సిటీ పరిధిలో ఉన్న ఎస్సి, ఎస్టీ హాస్టల్లో విద్యార్థులకు ఆహారం వడ్డించేందుకు కనీసం గరిటెలు కూడా లేని దుస్థితి నెలకొంది. గరిటెతో కాకుండా కొబ్బరి చిప్పతో చట్నీని వడ్డించడమే దీనికి నిదర్శనం. శుక్రవారం రాత్రి విద్యార్థులకు భోజనం వడ్డించేటప్పుడు చిత్రాన్నంలోకి చట్నీ వేయడానికి గరిటె లేకపోయింది. దీంతో ఒక చిప్పతో చట్నీని పోశారు. ఈ వీడియో, ఫోటోలు వైరల్ అయ్యాయి. సౌకర్యాల లేమిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: నిరుద్యోగులకు మొండిచెయ్యి) -
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
ఢిల్లీ : కేంద్ర మంత్రి వర్గం బుధవారం ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మూడు పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో పాటు ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్ ఎగుమతికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఏపీలోని కృష్ణపట్నం, కర్ణాటక తూముకూరులో పారిశ్రామిక కారిడార్లతో పాటు గ్రేటర్ నోయిడాలోని మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ హబ్ & మల్టీ-మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్ లకు కేంద్రం అనుమతి తెలిపింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. మూడు పారిశ్రామిక కారిడార్లకు కలిపి కేంద్ర ప్రభుత్వం రూ. 7,725 కోట్లతో నిర్మించనున్నట్లు తెలిపారు. పారిశ్రామిక కారిడార్లను నిర్మించడం ద్వారా 2.8 లక్షల మందికి ఉపాది లభించనున్నట్లు అంచనా వేసినట్లుగా పేర్కొన్నారు. కాగా కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ ప్రతిపాదిత వ్యయం రూ.2,139 కోట్లుగా ఉందని తెలిపారు. కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వల్ల పెద్దఎత్తున ఉపాధి అవకాశాల కల్పనతో పాటు, తయారీ రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం ఉందని వెల్లడించారు. కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్ వల్ల లాజిస్టిక్ ఖర్చు తగ్గింపుతో పాటు, నిర్వహణ సామర్థ్యం మెరుగుపరచడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. వీటితో పాటు భారత్, భూటాన్ దేశాల మధ్య శాంతి భద్రతలకు సంబంధించి ఎంవోయూకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. -
53 ఏళ్లకు మాతృత్వం.. కవలల జననం
తుమకూరు : ఇరవై, ముప్పై కాదు.. ఏకంగా యాభై మూడేళ్ల వయసులో ఓ మహిళ మాతృత్వ మధురిమల్ని చవిచూస్తోంది. ఒకరు కాదు ఇద్దరు పండంటి మగ బిడ్డలు జన్మించారు. కర్ణాటకలో తుమకూరు నగరంలో ఉన్న సిద్ధగంగ ఆస్పత్రిలో మంగళవారం వైద్యనిపుణుల పర్యవేక్షణ మధ్య ఆమె ప్రసవమైంది. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. టెస్ట్ ట్యూబ్ విధానంలో గర్భం దాల్చినట్లు తెలిసింది. -
కన్నకూతురిపై తండ్రి కర్కశత్వం
సాక్షి, తుమకూరు : ఆస్తుల ముందు మానవ సంబంధాలు మంటగలిసిపోతున్నాయనడానికి మరో ఉదాహరణ. భూమిలో మట్టిని విక్రయం గొడవలో కూతురుపై తండ్రి, బంధువులతో కలిసి దాడి చేసి ఆమె దుస్తులు చించి అమానుషంగా ప్రవర్తించాడు. అల్లున్ని కూడా కొట్టాడు. ఈ సంఘటన తుమకూరు జిల్లాలోని తిపటూరు తాలూకాలోని గోపాలపుర గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఏం జరిగిందంటే నోవినకెరె పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమృత ఆమె భర్త సునీల్‌లు ఇద్దరూ దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అమృతకు ఆరేళ్ల కిందట బెంగళూరుకు చెందిన సునీల్‌తో పెళ్లయింది. మార్చిలో గోపాలపుర గ్రామంలో ఉన్న తండ్రి ఇంటికి భర్తతో పాటు వచ్చారు. కరోనా లాక్డౌన్ విధించడంతో బెంగళూరుకు వెళ్లలేక పుట్టినింట్లోనే ఉంటున్నారు. అమృత తండ్రి భైరప్ప తన పొలంలో మట్టిని తవ్వించి వేరే వారికి విక్రయించడం జరిగింది. ఈ విషయమై అమృత తండ్రిని ప్రశ్నించగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో అమృత న్యాయం కోసం నోవినకెరె పోలిసు స్టేషన్‌కు వెళ్ళి ఫిర్యాదు చేశారు. ఇంట్లో దాడి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన అమృత, తండ్రి భైరప్పల మధ్య మళ్ళి ఘర్షణ తలెత్తింది. ఆగ్రహానికి గురైన భైరప్ప తన అన్నదమ్ములను బంధువులను పిలిపించి కట్టెలు, కత్తులతో అమృత పైన దాడి చేయించాడు. అమృత తల, భుజాలకు గాయాలై రక్తం ధార కట్టింది. భర్త సునీల్‌కు కూడా గాయాలు కావడంతో ఇద్దరు తిపటూరులో ఉన్న అస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. భైరప్ప గోపాలపుర జీపీ సభ్యుడు. ఇతడు పరాయి మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని పిల్లలను హింసిస్తున్నాడని అమృత ఫిర్యాదు చేశారు. -
ఉదయం 6 గంటలకే మద్యం!
నెల్లూరు: ఉదయాన్నే మెడికల్ షాపులు తెరవకపోయినా మద్యం షాపులు మాత్రం తెరుస్తున్నారు. పట్టణాలలోనే కాదు గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయం మద్యం అమ్మకాల నుంచే వస్తోంది. దాంతో ప్రభుత్వాలు కూడా ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తున్నాయి. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉదయం ఆరు గంటలకే మద్యం షాపులను తెరుస్తున్నారు. మందు బాబులకు మద్యం షాపులు ఉదయాన్నే తెరవడం బాగానే ఉంది. అయితే మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారట. అదీ వారి బాధ. ఇందుకు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పట్టించుకోవడంలేదని వాపోతున్నారు.