తుమకూరు: తుమకూరు నగరంలో ఉన్న తుమకూరు విశ్వ విద్యాలయానికి నిధులకు లోటులేదు. ప్రతి ఏటా కేంద్ర, రాష్ట్రాల నుంచి వందల కోట్ల రూపాయలు వస్తుంటాయి. ప్రొఫెసర్లు, అధికారులు అధునాతన వసతులతో తులతూగుతూ ఉంటారు. కానీ వర్సిటీ మెస్‌లలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు లబోదిబోమంటారు.
వర్సిటీ పరిధిలో ఉన్న ఎస్‌సి, ఎస్టీ హాస్టల్‌లో విద్యార్థులకు ఆహారం వడ్డించేందుకు కనీసం గరిటెలు కూడా లేని దుస్థితి నెలకొంది. గరిటెతో కాకుండా కొబ్బరి చిప్పతో చట్నీని వడ్డించడమే దీనికి నిదర్శనం. శుక్రవారం రాత్రి విద్యార్థులకు భోజనం వడ్డించేటప్పుడు చిత్రాన్నంలోకి చట్నీ వేయడానికి గరిటె లేకపోయింది. దీంతో ఒక చిప్పతో చట్నీని పోశారు. ఈ వీడియో, ఫోటోలు వైరల్ అయ్యాయి. సౌకర్యాల లేమిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
(చదవండి: నిరుద్యోగులకు మొండిచెయ్యి)
Comments
Please login to add a commentAdd a comment