Coconut shell
-
అక్కడ మన కొబ్బరి చిప్ప చాలా కాస్ట్లీ గురూ!
పనికి రాని కొబ్బరి చిప్పలతో సహా అనేక ఇతర వస్తువులతో బోలెడన్ని పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేయడం చూస్తూనే ఉంటాం. కానీ వాడి పారేసిన కొబ్బరి చిప్పలు ప్రముఖ వ్యాపార కేంద్రాల్లో భారీ ధర పలుకుతున్న వైనం నెట్టింట సందడి చేస్తోంది. దీని రేటు తెలిస్తే ఔరా అనాల్సిందే. దీని అర చిప్ప ధర రూ. 23 పలుకుతోంది. దీంతో పారేసే కొబ్బరి చిప్పలకు ఇంత డిమాండ్ ఉందా అని కొందరు, కొన్నినమ్మేయాలి డ్యూడ్..అదే వ్యాపార సూత్రం అంటున్నారుమరికొందరు నెటిజన్లుసాధారణంగా దక్షిణాదిన కొబ్బరి కాయలను పూజల్లోనూ, వంటల్లోనూ వాడతాం. అనేక రకాల వంటకాల్లో కొబ్బరిని విరివిగా వాడతారు. లేత కొబ్బరి నీళ్లను ఆరోగ్యం కోసం తాగుతాం. కానీ చిప్పలతో కూడా వ్యాపారం చేయవచ్చు అనేది లేటెస్ట్ ట్రెండ్. ఇవి గొప్ప సరుకు.. వ్యర్థాలను వినియోగంలోకి తీసుకురావడం చాలా అవసరం. కొబ్బరి చిప్పద్వారా శ్రేష్టమైన బొగ్గు లభిస్తుంది. కాబట్టి మిడిల్ ఈస్ట్‌లో బార్బెక్యూలు, అనేక ఇతర ఉపయోగాల కోసం వాడుకుంటారట. కొబ్బరి చిప్ప ద్వారా తయారైన బొగ్గులో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ , చిన్న మొత్తంలో ఇతర మూలకాలుంటాయి. అలాగే కొబ్బరి చిప్ప బొగ్గులో పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం మొదలైన ఖనిజ మూలకాలు లభిస్తాయని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. కొబ్బరి చిప్ప బొగ్గు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే ఒక ముఖ్యమైన పారిశ్రామిగా వనరుగా మారింది. 2023 నాటికి దీని ప్రపంచ మార్కెట్ పరిమాణం సుమారు 315 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2024- 2032 నాటికి వార్షిక వృద్ధి రేటు (CAGR) 8 శాతంగా ఉంటుందని అంచనా ₹23 for half coconut shell. Never imagined that, what we consider as household waste in the southern part of India, is commercially valuable in West Asia.. Ee sala chippu namde 😀 pic.twitter.com/jZ3jOjzkcX— Kiran Kumar S (@KiranKS) August 25, 2024 కాగా ప్లాస్టిక్‌ను నిర్మూలించాలన్న లక్ష్యంలో భాగంగా కొబ్బరి చిప్పలతో అనేక రకాల వంట సామాన్లు కూడా తయారు చేస్తారు. ఇదికూడా పెద్ద వ్యాపారమే. అలాగే గతంలో ఈ-కామర్స్ వెబ్సైట్లలో వీటి విక్రయాలు జరిగిన సంగతి తెలిసిందే. -
కోనసీమలో ‘నల్ల బంగారం’
సాక్షి అమలాపురం: కోనసీమలో తయారయ్యే ‘కొబ్బరి చిప్ప బొగ్గు’ దేశంలోనే ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ సౌందర్యానికి ఫేస్‌ప్యాక్‌గా, తాగునీటిని శుద్ధిచేసేందుకు వినియోగించడంతో పాటు పెట్రోలియం ఉత్పత్తులు, దేశ రక్షణకు చెందిన విడి భాగాలు, ఆటో మొబైల్ పరిశ్రమలలో కీలక విడిభాగాల తయారీలో ఈ బొగ్గు అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. తయారీదారుల ఇంట నల్ల బంగారమై మెరుస్తోంది. ఇటువంటి అత్యుత్తమమైన, నాణ్యమైన కొబ్బరి చిప్ప బొగ్గు తయారీకి కేరాఫ్ అడ్రస్‌గా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నిలుస్తోంది. నదీతీరంలో బొగ్గు తయారీ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, అంబాజీపేట మండలాల్లో వైనతేయ నదీతీరంలో బొగ్గు తయారవుతోంది. ఇక్కడ నుంచి ఏడాదికి రూ. 2 కోట్ల విలువ చేసే 700 నుంచి 900 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడు లోని కాంగాయం, పల్లడం, కోయింబత్తూరు, కర్ణాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు, మన రాష్ట్రంలోని నెల్లూ రు, గూడూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రయోజనాలెన్నో.. కొబ్బరి చిప్ప బొగ్గు ప్రయోజనాలు తెలిస్తే నిజంగా నల్ల బంగారమే అంటారు. సౌందర్య పోషణకు వాడే ఫేస్‌ప్యాక్‌లతోపాటు కాస్మోటిక్స్, సబ్బులలో వాడకం అధికం. ఆటోమొబైల్‌లో కీలకమైన స్పేర్ పార్టుల తయారీ, రక్షణ రంగంలో యుద్ధ పరికరా లు, గ్యాస్ మాస్కుల తయారీలో వినియోగిస్తారు. పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తిలో అధిక శాతం రికవరీకి ఇది దోహదపడుతుంది. నీటిలోని క్లోరిన్, పురుగు మందులు, మలినాలను, వైరస్, బ్యాక్టీరియాలను నివారిస్తుంది. దీనిలో అధిక ఉష్ణ విలువ ఉంటుంది. మండించడానికి సమర్థవంతమైన ఇంధన వనరు గా ఉపయోగపడుతుంది. చిప్ప బొగ్గుతో భూమిలో వేగంగా సేంద్రియ కర్భనం ఉత్పత్తి అవుతుంది. బాగా ఆరిన కొబ్బరి చిప్ప బొగ్గు అత్యధిక ధర కేజీ రూ.35 నుంచి రూ.38 వరకు ఉండగా, ఈ ఏడాది ఆశించిన ఎగుమతులు లేకపోవడంతో ధర తగ్గిపోయింది. ప్రస్తుతం కేజీ రూ.24 నుంచి రూ.26 కాగా, తడిసిన బొగ్గు ధర రూ.19 వరకు మాత్రమే ఉంది. దీనివల్ల నష్టపోతున్నామని, ఎగుమతులు లేక సరుకు పెద్ద ఎత్తున పేరుకుపోయిందని, అక్టోబర్ నుంచి మంచి ధర వస్తుందని తయారీదారులు ఆశలు పెట్టుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం వన్ డిస్ట్రిక్ట్.. వన్ ప్రొడెక్టులో భాగంగా కోనసీమ జిల్లాను కొబ్బరికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ చిప్ప బొగ్గు తయారీ పరిశ్రమలను ప్రోత్సహించాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. కోకోనట్ బోర్డు, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రూ.25 లక్షల విలువైన యూనిట్‌కు 35 శాతం వరకు రాయి తీ అందించనుంది. అంతకన్నా పెద్ద ప్రాజెక్టు పెట్టుకుంటే రూ.పది లక్షల వరకు రాయితీ ఇవ్వనున్నా రు. జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా) ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో జిల్లాలో కోకోనట్ మిల్క్ యూనిట్‌తోపాటు కోకోనట్ చార్ కోల్ పరిశ్రమ ఏర్పాటుకు ఉద్యానశాఖ సన్నాహాలు చేస్తోంది. మన్నిక ఎక్కువ.. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక కన్నా ఇక్కడ ఉత్పత్తి అవుతున్న బొగ్గు నాణ్యమైంది. చిప్ప దళసరి కావడంతోపాటు దీనిలో అధిక శాతం గ్యాస్ నిక్షిప్తమైనందున ఇది వేగంగా మండుతోంది. మిగిలిన రాష్ట్రాలలో ఆరు బయట బొగ్గు తయారీ ఎక్కువ. కోనసీమలో బొగ్గు తయారీ డ్రమ్ములలో చేస్తారు. దీనివల్ల బూడిద శాతం తక్కువగా ఉంటోంది. ఇక్కడ తయారయ్యే బొగ్గు ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటుంది. మార్కెట్ అవకాశాలు పెరగాలి మనం తయారు చేసే బొగ్గే అత్యంత నాణ్యమైంది. మార్కెటింగ్ అవకాశాలు పెద్దగా లేక అనుకున్న ధర రావడం లేదు. ఇతర ప్రాంతాల వారు ఇక్కడ నుంచి బొగ్గు తీసుకెళ్లి మరింత నాణ్యంగా తయారు చేసి కేజీ రూ.50 నుంచి రూ.70 చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. మనకు మాత్రం ఆ ధర రావడం లేదు. మార్కెటింగ్ అవకాశాలు పెరిగితే మరింత ధర వచ్చే అవకాశముంది.– మట్టపర్తి రామకృష్ణ,ముంజువరం, పి.గన్నవరం మండలం అత్యంత ధృడమైంది ఇక్కడ తయారయ్యే కొబ్బరి చిప్పలో 80 నుంచి 90 శాతం మేర చిన్న చిన్న రంధ్రాలు ఉండడంతో ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటోంది. ఆటోమొబైల్, రక్షణ పరికరాలు, పెట్రోలియం ఉత్పత్తుల తయారీలో అధికంగా వాడుతున్నారు. – ఎ.కిరిటీ, ఉద్యాన శాస్త్రవేత్త, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట -
కొబ్బరి పొట్టు..లాభాలు పట్టు
సాక్షి, అమలాపురం: ఇరవై ఏళ్ల క్రితం కొబ్బరి పొట్టు నిరుపయోగ వ్యర్థ పదార్థం. దీనిని వదిలించుకోవడం పీచు పరిశ్రమల యజమానులకు తలకు మించిన భారంగా ఉండేది. కొబ్బరి పీచుకు ధర ఉంటేనే పరిశ్రమలు నడవడం.. లేదంటే మూసేయడంలా ఉండేది. కానీ.. ఆ వ్యర్థమే ఇప్పుడు బంగారమైంది. కొబ్బరి పొట్టును ఇటుకల తయారీలో వాడితే లాభమని గుర్తించారు. ఇటుక తేలిక కావడంతోపాటు ఆకర్షణీయమైన రంగు రావడంతో బట్టి యజమానులు దీని కొనుగోలు మొదలు పెట్టారు. ఆ తరువాత దీని నుంచి అత్యంత నాణ్యమైన కంపోస్టు తయారవుతోందని గుర్తించడంతో కంపోస్టును ఇటుక (కోకోపీట్ బ్లాక్)లుగా మార్చి విదేశాలకు ఎగుమతి చేస్తుండటంతో దీని దశ తిరిగింది. నష్టాల్లో ఉన్న పీచు పరిశ్రమల ఉనికిని ఇప్పుడు కొబ్బరి పొట్టు కాపాడుతోంది. రాష్ట్రంలో ఏడాదికి 24 వేల టన్నుల పొట్టు రాష్ట్రంలో చిన్నాపెద్ద కలిపి సుమారు 950 వరకు కొబ్బరి పీచు పరిశ్రమలు ఉండగా.. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 550 వరకు ఉన్నాయి. సగటున 350 గ్రాముల బరువు ఉన్న ఎండు కొబ్బరి కాయ నుంచి 80 గ్రాములు పీచు వస్తే.. కొబ్బరి పొట్టు 160 గ్రాముల వరకు వస్తోంది. రాష్ట్రంలో ఏడాదికి 24 వేల మెట్రిక్ టన్నుల పొట్టు ఉత్పత్తి అవుతోందని అంచనా. ఇందులో విద్యుత్ వాహకత (ఎలక్ట్రిక్ కండెక్టివిటీ–ఈసీ) 6 నుంచి 8 శాతం వరకు ఉంటోంది. అధిక ఈసీ ఉన్న కొబ్బరి పొట్టును నేరుగా వినియోగిస్తే మొక్కలు దెబ్బతింటాయి. దీంతో వివిధ పద్ధతులలో ఈసీ శాతం తగ్గించి కంపోస్టుగాను, బ్రిక్స్ రూపంలో తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. ఈసీ ఎక్కువగా ఉన్న పొట్టును ఇటుక బట్టీలకు టన్ను రూ.2,500 చొప్పున విక్రయిస్తుండగా.. తక్కువ ఈసీ ఉన్న పొట్టును టన్ను రూ.5 వేలకు విక్రయిస్తున్నారు. కొబ్బరి పొట్టు నాణ్యమైన సేంద్రియ ఎరువుగా తయారైతే.. దాని ధర పొట్టు రూపంలో టన్ను రూ.14 వేల నుంచి రూ.20 వేల వరకు ధర ఉంది. అదే ఇటుకల రూపంలో అయితే టన్ను ధర రూ.22 వేల నుంచి రూ.26 వేలు పలుకుతోంది. ఆన్లైన్ మార్కెటింగ్ చేసే అమెజాన్, ఇండియా మార్ట్ వంటి సంస్థలు కేజీ రూ.25 నుంచి రూ.55 వరకు కోకో బ్రిక్ అమ్మకాలు చేస్తున్నాయి. విదేశాలకు కోకోపీట్ బ్లాక్స్ కొబ్బరి పొట్టు ఉత్తరాది రాష్ట్రాలకు అధికంగా ఎగుమతి అవుతోంది. వీటిలో గుజరాత్‌ది అగ్రస్థానం. ఇక్కడి నర్సరీలకు మట్టికన్నా కొబ్బరి పొట్టు మేలైన ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. మన రాష్ట్రంతోపాటు దక్షణాది రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), సింగపూర్, మలేసియా, చైనా, జపాన్, అమెరికా, నెదర్ల్యాండ్, ఆస్ట్రేలియాలకు పొట్టుతో తయారు చేసిన బ్రిక్స్ ఎగుమతి అవుతున్నాయి. మొత్తం కొబ్బరి పొట్టు ఉత్పత్తిలో కేవలం 10% మాత్రమే బ్లాక్ రూపంలో వెళుతుండగా.. 20% కంపోస్టు రూపంలోను, 70% ఇటుక బట్టీలకు వెళుతోంది. మంచి డిమాండ్ ఉంది అంతర్జాతీయంగా కోకోపీట్ బ్లాక్స్‌కు మంచి డిమాండ్ ఉంది. కానీ.. ఎగుమతులకు వీలుగా కొబ్బరి పొట్టును తక్కువ ఈసీకి తీసుకువచ్చి బ్లాక్‌లుగా తయారు చేయడం వ్యయప్రయాసలతో కూడుకున్న వ్యవహారం. మాకు స్థానికంగా ఇటుక బట్టీలకు అధికంగా వెళుతోంది. క్వాయర్ పరిశ్రమలు నడుస్తున్నాయంటే అందుకు కొబ్బరి పొట్టే కారణం. – నండూరి ఫణికుమార్, క్వాయర్ పరిశ్రమ యజమాని -
వడ్డించేందుకు గరిట లేదని... చిప్పతో చట్నీ పోసెయ్
తుమకూరు: తుమకూరు నగరంలో ఉన్న తుమకూరు విశ్వ విద్యాలయానికి నిధులకు లోటులేదు. ప్రతి ఏటా కేంద్ర, రాష్ట్రాల నుంచి వందల కోట్ల రూపాయలు వస్తుంటాయి. ప్రొఫెసర్లు, అధికారులు అధునాతన వసతులతో తులతూగుతూ ఉంటారు. కానీ వర్సిటీ మెస్‌లలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు లబోదిబోమంటారు. వర్సిటీ పరిధిలో ఉన్న ఎస్సి, ఎస్టీ హాస్టల్లో విద్యార్థులకు ఆహారం వడ్డించేందుకు కనీసం గరిటెలు కూడా లేని దుస్థితి నెలకొంది. గరిటెతో కాకుండా కొబ్బరి చిప్పతో చట్నీని వడ్డించడమే దీనికి నిదర్శనం. శుక్రవారం రాత్రి విద్యార్థులకు భోజనం వడ్డించేటప్పుడు చిత్రాన్నంలోకి చట్నీ వేయడానికి గరిటె లేకపోయింది. దీంతో ఒక చిప్పతో చట్నీని పోశారు. ఈ వీడియో, ఫోటోలు వైరల్ అయ్యాయి. సౌకర్యాల లేమిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: నిరుద్యోగులకు మొండిచెయ్యి) -
ఇంటిప్స్
కొబ్బరి చిప్ప నుంచి కొబ్బరి సులువుగా వేరుపడాలంటే వేడి నీళ్లలో ముంచి తీయాలి.జిగురు మరీ గట్టిగా ఉండి, సీసాలోంచి రాకుండా ఉంటే అందులో నాలుగైదు చుక్కల వెనిగర్ వేయాలి. మిక్సీ బ్లేడ్లు మొండిబారకుండా ఉండాలంటే నెలకొసారి దొడ్డుప్పును మిక్సీలో వేసి తిప్పాలి. తేనె గట్టిపడితే వెడల్పాటి పాత్రలో సగం దాకా నీళ్లు మరిగించి అందులో తేనె సీసాను ఉంచాలి.