పనికి రాని కొబ్బరి చిప్పలతో సహా అనేక ఇతర వస్తువులతో బోలెడన్ని పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేయడం చూస్తూనే ఉంటాం. కానీ వాడి పారేసిన కొబ్బరి చిప్పలు ప్రముఖ వ్యాపార కేంద్రాల్లో భారీ ధర పలుకుతున్న వైనం నెట్టింట సందడి చేస్తోంది. దీని రేటు తెలిస్తే ఔరా అనాల్సిందే. దీని అర చిప్ప ధర రూ. 23 పలుకుతోంది. దీంతో పారేసే కొబ్బరి చిప్పలకు ఇంత డిమాండ్ ఉందా అని కొందరు, కొన్నినమ్మేయాలి డ్యూడ్..అదే వ్యాపార సూత్రం అంటున్నారుమరికొందరు నెటిజన్లు
సాధారణంగా దక్షిణాదిన కొబ్బరి కాయలను పూజల్లోనూ, వంటల్లోనూ వాడతాం. అనేక రకాల వంటకాల్లో కొబ్బరిని విరివిగా వాడతారు. లేత కొబ్బరి నీళ్లను ఆరోగ్యం కోసం తాగుతాం. కానీ చిప్పలతో కూడా వ్యాపారం చేయవచ్చు అనేది లేటెస్ట్ ట్రెండ్. ఇవి గొప్ప సరుకు.. వ్యర్థాలను వినియోగంలోకి తీసుకురావడం చాలా అవసరం. కొబ్బరి చిప్పద్వారా శ్రేష్టమైన బొగ్గు లభిస్తుంది. కాబట్టి మిడిల్ ఈస్ట్‌లో బార్బెక్యూలు, అనేక ఇతర ఉపయోగాల కోసం వాడుకుంటారట.
కొబ్బరి చిప్ప ద్వారా తయారైన బొగ్గులో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ , చిన్న మొత్తంలో ఇతర మూలకాలుంటాయి. అలాగే కొబ్బరి చిప్ప బొగ్గులో పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం మొదలైన ఖనిజ మూలకాలు లభిస్తాయని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. కొబ్బరి చిప్ప బొగ్గు ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే ఒక ముఖ్యమైన పారిశ్రామిగా వనరుగా మారింది. 2023 నాటికి దీని ప్రపంచ మార్కెట్ పరిమాణం సుమారు 315 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇది 2024- 2032 నాటికి వార్షిక వృద్ధి రేటు (CAGR) 8 శాతంగా ఉంటుందని అంచనా
₹23 for half coconut shell.
Never imagined that, what we consider as household waste in the southern part of India, is commercially valuable in West Asia..
Ee sala chippu namde 😀 pic.twitter.com/jZ3jOjzkcX— Kiran Kumar S (@KiranKS) August 25, 2024
కాగా ప్లాస్టిక్‌ను నిర్మూలించాలన్న లక్ష్యంలో భాగంగా కొబ్బరి చిప్పలతో అనేక రకాల వంట సామాన్లు కూడా తయారు చేస్తారు. ఇదికూడా పెద్ద వ్యాపారమే. అలాగే గతంలో ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లలో వీటి విక్రయాలు జరిగిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment