రూ.240కే ‘ఎక్స్‌’ సబ్‌స్క్రిప్షన్‌.. ఫీచర్లు ఇవే.. | Elon Musk's X Launches New Subscription Plans - Sakshi
Sakshi News home page

రూ.240కే ‘ఎక్స్‌’ సబ్‌స్క్రిప్షన్‌.. ఫీచర్లు ఇవే..

Published Sat, Oct 28 2023 12:33 PM | Last Updated on Sat, Oct 28 2023 12:48 PM

How Much Is The X Subscription - Sakshi

ప్రపంచ దిగ్గజ సంస్థ అయిన ‘ఎక్స్‌’(ట్విటర్‌) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ వినియోగదారులకు ప్రీమియం సేవలందిస్తూ డబ్బు సంపాదించాలనే యోచనలో ఉంది. అందుకు అనుగుణంగా రెండు ప్రీమియంలను తీసుకొచ్చింది. అందులో ప్రీమియం+, బేసిక్‌ ప్రీమియంలు ఉన్నట్లు సంస్థ చెప్పింది. వాటికి సంబంధించి ఒక్కోదానికి ప్రత్యేక ధర నిర్ణయించారు. 

ప్రీమియం+
ఈ శ్రేణిని ఎంచుకున్న వినియోగదారులు నెలకు 16 అమెరికన్‌ డాలర్లు(రూ. 1,300) చెల్లించాలి. ఇందులో యూజర్లతోపాటు, వారిని ఫాలో అవుతున్న వారినుంచి వచ్చే ప్రకటనలు తీసివేస్తారు. రిప్లై బూస్ట్‌ అవకాశం అధికంగా ఉంటుంది. క్రియేటర్‌ టూల్స్‌ను పూర్తిగా వాడే వెసులుబాటు కల్పిస్తున్నారు.

బేసిక్ ప్రీమియం
వినియోగదారులు ఈ శ్రేణిలో నెలకు 3 డాలర్లు(రూ.243.75) చెల్లించాలి. అయితే ఇది బ్లూ చెక్‌మార్క్‌ను కలిగి ఉండదు. ఇందులో పోస్ట్‌లను సవరించే అవకాశం ఉంటుంది. ఇది పొడవైన టెక్ట్స్‌, వీడియోలను పోస్ట్ చేయగల సామర్థ్యం వంటి ప్రాథమిక లక్షణాలను కలిగి ఉంటుంది. 

ఈ రెండు ప్లాన్‌లను వెబ్‌లో మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంచారు. ఎక్స్‌ ఇటీవల లైవ్‌స్ట్రీమింగ్ వీడియో, ఆడియో కాల్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్లాట్‌ఫారమ్‌ను ఎవ్రీథింగ్ యాప్‌గా మార్చే క్రమంలో వినియోగదారుల కోసం మరిన్ని ఫీచర్లను తీసుకొచ్చే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు తెలిపాయి. త్వరలోనే డిజిటల్ చెల్లింపుల వంటి బ్యాంకింగ్‌ సేవలను కూడా చేర్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement