ఎలాన్ మస్క్ ఎక్స్(ట్విటర్)లోని స్పేసెస్‌లో చర్చ సందర్భంగా మూడో ప్రపంచ యుద్ధంకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ నుంచి మాస్కో వెంటనే తమ బలగాలను విరమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందన్నారు.
డేవిడ్ సాక్స్, అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న అభ్యర్థి వివేక్ రామస్వామితో మస్క్ స్పేసెస్‌లో మాట్లాడారు. ఇజ్రాయెల్, హమాస్ భౌగోళిక రాజకీయాలపై విస్తృత చర్చ జరిగింది. రష్యా, చైనా సంయుక్త సైనిక విన్యాసాలను ప్రారంభించాయని మస్క్ పేర్కొన్నాడు. వ్లాదిమిర్ పుతిన్‌పై విస్తృతమైన ఆంక్షలు విధించాలనే పాశ్చాత్య నిర్ణయం ఊహించని పరిణామాలకు దారితీస్తుంది.
రష్యా ముడిసరుకులను అందిస్తుండడం, చైనా పారిశ్రామిక సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో గణనీయమైన సైనిక సామర్థ్యాన్ని సృష్టించే ప్రమాదం ఉందని తెలిపారు. వరుస అనాలోచిత నిర్ణయాలతో తెలియకుండానే మూడో ప్రపంచ యుద్ధం దిశగా పయనిస్తున్నట్లు హెచ్చరించారు. పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల రష్యా, చైనాల మధ్య అంతరం తగ్గుతున్నట్లు ఏకాభిప్రాయానికి వచ్చారు. అంతర్జాతీయంగా అనిశ్చితుల వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment