World War III
-
శరణమా.. రణమేనా?
వాషింగ్టన్: ఇటు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ. అటు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. దేశాధినేతలం అన్న విషయం కూడా మర్చిపోయి మీడియా సాక్షిగా వాగ్వాదానికి దిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. ఒకరినొకరు దుయ్యబట్టుకున్నారు. అచ్చం వీధి బాగోతాన్ని తలపించేలా పాత విషయాలన్నీ తిరగదోడుతూ, పరస్పరం దెప్పిపొడుచుకుంటూ రెచ్చిపోయారు. అంతర్జాతీయ స్థాయిలో ఎన్నడూ కనీవినీ ఎరగని ఈ దృశ్యాలకు వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసు వేదికైంది. ఉక్రెయిన్‌లోని అపార ఖనిజ నిక్షేపాల్లో అమెరికాకు 50 శాతం వాటా ఇవ్వాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేయడం, బదులుగా రష్యా నుంచి తమ దేశానికి కచి్చతమైన రక్షణ హామీలు కావాలని జెలెన్స్కీ కోరడం తెలిసిందే. వాటిపై స్పష్టమైన ఒప్పందాల నిమిత్తం అగ్ర రాజ్యం చేరిన ఆయన శుక్రవారం వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో తదితరులు పాల్గొన్న ఈ భేటీకి మీడియాను అనుమతించడమే గాక ప్రత్యక్ష ప్రసారం కూడా చేయడం విశేషం. భేటీ చాలాసేపటిదాకా ప్రశాంతంగానే సాగినా చివర్లో పూర్తిగా అదుపు తప్పింది. నేతలిద్దరి మాటల యుద్ధంతో రచ్చ రచ్చగా మారింది. చివరికి ఎటూ తేలకుండానే ముగిసింది. భేటీ అనంతరం జరగాల్సిన ట్రంప్, జెలెన్స్కీ సంయుక్త మీడియా భేటీ కూడా రద్దయింది! అంతేగాక, ‘జెలెన్స్కీ వైట్‌హౌస్ వీడి వెళ్లిపోవచ్చు’ అంటూ మీడియా సమక్షంలో ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. శాంతి ఒప్పందానికి సిద్ధపడితేనే తిరిగి తమతో చర్చలకు రావాలని సూచించారు. దాంతో ఎన్నో ఆశల నడుమ జెలెన్స్కీ చేపట్టిన అమెరికా యాత్ర ఆశించిన ఫలితం రాబట్టకపోగా వికటించిన్నట్టు కనిపిస్తోంది. అలా మొదలైంది... రష్యా–ఉక్రెయిన్ వివాదం విషయమై దశాబ్ద కాలంగా అమెరికా వ్యవహరిస్తున్న తీరును ఆక్షేపిస్తున్నట్టుగా జెలెన్స్కీ మాట్లాడటంతో పరిస్థితి వేడెక్కింది. అమెరికా మీడియా అంతా చూస్తుండగా అంత అమర్యాదకరంగా మాట్లాడటం సరికాదంటూ వాన్స్ జోక్యం చేసుకున్నా ఆయన వెనక్కు తగ్గలేదు. తమతో కుదుర్చుకున్న ఒప్పందాలన్నింటినీ రష్యా 2014 నుంచీ తుంగలో తొక్కుతూ వస్తున్నా అమెరికా సరైన రీతిలో జోక్యం చేసుకోలేదంటూ ఆక్షేపించారు. అధ్యక్షులు బరాక్ ఒబామా, ట్రంప్, బైడెన్ ఎవరూ తమకు చేయాల్సినంతగా సాయం చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ఖనిజ ఒప్పందానికి ప్రతిగా ఉక్రెయిన్ రక్షణకు అమెరికా స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ క్రమంలో, ‘‘యుద్ధంలో అంతులేని నష్టాన్ని చవిచూడాల్సి వస్తే ఎలా ఉంటుందో అమెరికాకు తెలియదు. బహుశా మున్ముందు తెలిసొస్తుందేమో!’’ అన్న జెలెన్స్కీ వ్యాఖ్యలతో పరిస్థితి మరింత అదుపు తప్పింది. ట్రంప్ ఒక్కసారిగా తీవ్ర అసహనానికి లోనయ్యారు. జెలెన్స్కీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘అలాంటి పరిస్థితి మాకెప్పుడూ రాదు. ఎప్పటికీ తిరుగులేని శక్తిగానే ఉంటాం’’ అంటూ ఆగ్రహంగా బదులిచ్చారు. ‘‘ఉక్రెయిన్‌కు ఇన్నేళ్లుగా అన్నివిధాలా ఆదుకుంటూ వస్తున్నాం. ఈ యుద్ధంలో ఇప్పటికే 350 బిలియన్ డాలర్ల మేర సాయుధ, ఆర్థిక సాయం అందించాం. లేదంటే రష్యాతో యుద్ధం కొనసాగించడం మీ తరమయ్యేదే కాదు. పోరు రెండే వారాల్లో ముగిసిపోయేది’’ అంటూ దుయ్యబట్టారు. అయినా జెలెన్స్కీకి మాత్రం కనీస కృతజ్ఞత కూడా లేదంటూ విరుచుకుపడ్డారు. మీడియా ముందే తనతో గొడవకు దిగుతూ అమర్యాదకరంగా ప్రవర్తిస్తున్నారంటూ విమర్శించారు. ‘‘అమెరికా దన్ను లేనిదే మీరెందుకూ కొరగారు! మాకు షరతులు విధించే, మమ్మల్ని డిమాండ్ చేసే పరిస్థితిలో అసలే లేరు. అది గుర్తుంచుకోండి’’ అంటూ వేలు చూపిస్తూ మరీ జెలెన్స్కీని కటువుగా హెచ్చరించారు. ‘‘మీరు లక్షలాది ప్రాణాలను పణంగా పెడుతున్నారు. మూడో ప్రపంచ యుద్ధాన్ని తెచ్చిపెట్టేలా ప్రమాదకర జూదం ఆడుతున్నారు’’ అంటూ జెలెన్స్కీని ఆక్షేపించారు. మధ్యలో పదేపదే ఆయన భుజంపై కొట్టి మరీ ఆగ్రహం వెలిగక్కారు. రష్యాతో ఏ విషయంలోనూ రాజీ పడేదే లేదన్న జెలెన్స్కీ వ్యాఖ్యలను కూడా ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ‘‘పుతిన్ ఒక ఉగ్రవాది. యుద్ధాల్లోనూ నిబంధనలుంటాయి. వాటన్నింటినీ కాలరాసిన పుతిన్ వంటి హంతకునితో ఎలాంటి రాజీ ఉండబోదు’’ అని జెలెన్స్కీ అన్నారు. అలా కుదరదని, యుద్ధానికి తెర దించాలంటే రష్యాతో చాలా విషయాల్లో రాజీ పడాల్సిందేనని ట్రంప్ కుండబద్దలు కొట్టారు. ‘‘ఇలాగైతే మాతో వ్యాపారం కష్టమే. అమెరికాతో ఖనిజ వనరుల ఒప్పందానికి అంగీకరిస్తారా, సరేసరి. లేదంటే మీకూ మాకూ రాంరాం’’ అంటూ తేల్చిపడేశారు. వాగ్వాదం పొడవునా నేతలిరువురూ పదేపదే వాగ్బాణాలు విసురుకున్నారు. కనీసం ఇప్పటికైనా అమెరికా చేస్తున్న దానికి కృతజ్ఞతలు చెప్పండంటూ వాన్స్ కల్పించుకోగా ట్రంప్ వారించారు. ‘‘పర్లేదు. ఈ డ్రామా నాకూ సరదాగానే ఉంది. జరుగుతున్నదేమిటో అమెరికా ప్రజలందరూ చూడాలి’’ అన్నారు.సాయానికి హామీ ఇవ్వలేం: ట్రంప్ జెలెన్స్కీతో భేటీకి ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్‌తో సహజ వనరుల ఒప్పందంపై ఆయన, తాను కాసేపట్లో సంతకాలు చేస్తామని ప్రకటించారు. యుద్ధం వీలైనంత త్వరగా ముగియాలన్నదే తన ఉద్దేశమన్నారు. అయితే, ‘‘ఉక్రెయిన్‌కు అమెరికా సైనిక సాయం కొనసాగుతుంది. కాకపోతే ఈ విషయంలో మానుంచి మరీ ఎక్కువగా ఆశించకూడదు’’ అని స్పష్టం చేశారు. యుద్ధాన్ని ముగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కృతనిశ్చయంతో ఉన్నారంటూ మరోసారి ప్రశంసించారు. -
రష్యాతో నాటో ఘర్షణకు దిగితే... మూడో ప్రపంచ యుద్ధమే
మాస్కో: రష్యా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మరుక్షణమే వ్లాదిమిర్ పుతిన్ పశ్చిమ దేశాలకు యుద్ధ హెచ్చరికలు పంపారు. ‘‘అమెరికా సారథ్యంలోని నాటో కూటమి, రష్యా సైన్యం మధ్య ప్రత్యక్ష ఘర్షణలు జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. ఆధునిక ప్రపంచంలో ఏదైనా సాధ్యమే. కానీ అంతటి దారుణ విపత్తును ఎవరూ కోరుకోరు’’ అన్నారు. ఉక్రెయిన్ సైన్యానికి తోడుగా కదనరంగంలోకి ఫ్రాన్స్ బలగాలను దింపే ఉద్దేశముందన్న ఆ దేశ అధ్యక్షుడు మేక్రాన్ వ్యాఖ్యలపై పుతిన్ ఇలా స్పందించారు. ‘‘ఉక్రెయిన్ యుద్ధంలో వందలాది ఇంగ్లిష్, ఫ్రెంచ్ సైనికులు చనిపోయారు. ఇది సరికాదు’’ అన్నారు. చర్చలకు సదా సిద్ధం ఉక్రెయిన్ సైన్యం దాడులు ఇలాగే కొనసాగితే దాని చుట్టూ ఒక బఫర్ జోన్‌ను సృష్టిస్తామని పుతిన్ అన్నారు. ‘‘దాన్ని దాటి వైరి సైన్యం రష్యా భూభాగంలోకి అడుగుపెట్టడం అసాధ్యం. పూర్తిగా ఓటమి పాలయ్యేలోపు శాంతి బాట పట్టడం ఉత్తమం. చర్చలకు సిద్ధమని మేం మొదట్నుంచీ చెబుతున్నాం’’ అన్నారు. రష్యా అధ్యక్ష ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగలేదన్న అమెరికా, పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. అమెరికాలోనే ఎన్నికలు సజావుగా జరగడం లేదని విమర్శించారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా అధ్యక్షుడు బైడెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 2030 దాకా అధ్యక్ష పీఠంపై రష్యా రాజకీయ వ్యవస్థపై పుతిన్ పట్టు మరోసారి రుజువైంది. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన ఘనవిజయం సాధించారు. పోలైన ఓట్లలో 87.29 శాతం (7.6 కోట్ల) ఓట్లు ఆయనకు పడ్డట్టు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సోమవారం ప్రకటించింది. పుతిన్‌కు ఇన్ని ఓట్లు రావడం ఇదే తొలిసారి. ఆరేళ్లపాటు, అంటే 2030 దాకా పుతిన్ అధ్యక్షునిగా కొనసాగుతారు. ఆయనకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల భాగస్వామ్యం మరింత సుధృఢంకావాలని అభిలషించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, ఉత్తరకొరియా పాలకుడు కిమ్, హోండురాస్, నికరాగ్వా, వెనిజులా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాధినేతలూ పుతిన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. పశ్చిమదేశాలు మాత్రం ఈ ఎన్నికలు పెద్ద మోసమని విమర్శించాయి. నవాల్నీని వదిలేద్దామనుకున్నాం.. దివంగత విపక్ష నేత అలెక్సీ నవాల్నీ ప్రస్తావనను పుతిన్ తొలిసారిగా బహిరంగంగా తెచ్చారు. ‘‘ఖైదీల మార్పిడిలో భాగంగా నవాల్నీని విదేశాలకు అప్పగించి పశ్చిమదేశాల జైళ్ల నుంచి రష్యన్లను వెనక్కు తెద్దామని మా అధికారుల సలహాకు వెంటనే ఒప్పుకున్నా. ఆ లోపే ఆయన జైల్లో చనిపోయారు. కొన్ని అలా జరుగుతాయంతే. ఇదే జీవితం’’ అన్నారు. -
అదే జరిగితే.. మూడో ప్రపంచ యుద్ధమే: జెలెన్స్కీ
కీవ్: మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉందని రష్యాకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హెచ్చరించారు. అమెరికా సహా అనేక యూరప్ దేశాలు తమకు మద్దతు తెలుపుతున్నందున యుద్ధానికి ఎంతో దూరంలో లేమని అన్నారు. నాటో కూటమిలో సభ్య దేశంపై రష్యా దాడి చేస్తే.. మరో యుద్ధం తప్పనిసరని పేర్కొన్నారు. ఈ ప్రమాదాన్ని జర్మనీ ఛాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్ ముందే ఊహించారని చెప్పారు. ఉక్రెయిన్ మొదటి ఆక్రమణలో జర్మనీ తన పాత్ర సరిగా పోషించలేదని జెలెన్స్కీ అన్నారు. రష్యాతో యుద్ధంలో ఐరోపా దేశాల బలహీనతలను తాను కూడా అర్ధం చేసుకోగలనని పేర్కొన్నారు. ఉక్రెయిన్ కోసం పెద్ద ఎత్తున నిధులను సమీకరించే అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు. అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తే.. ఉక్రెయిన్‌కు మద్దతు పోతుందా? అని ప్రశ్నించగా.. అమెరికా విధానం ఒక వ్యక్తితో ప్రభావితం కాబోదని అన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఏడాదికి పైగా యుద్ధం కొనసాగుతోంది. రష్యా సేనలు ఉక్రెయిన్ భూభాగాలపై విరుచుకుపడుతున్నాయి. అటు అమెరికా, ఐరోపా దేశాల మద్దతుతో ఉక్రెయిన్ ధీటుగా పోరాడుతోంది. ఇటీవల ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను తరలిస్తున్న రష్యా విమానం కూలిన ఘటనలో 65 మంది మృతి చెందారు. ఇరుదేశాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతున్న క్రమంలో అమెరికా ఆర్థిక సహాయం తగ్గడంపై ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదీ చదవండి: Sudan: సూడాన్‌లో హింస.. 52 మంది మృతి! -
World War: మూడో ప్రపంచ యుద్ధంపై మస్క్ కీలక వ్యాఖ్యలు
ఎలాన్ మస్క్ ఎక్స్(ట్విటర్)లోని స్పేసెస్‌లో చర్చ సందర్భంగా మూడో ప్రపంచ యుద్ధంకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ నుంచి మాస్కో వెంటనే తమ బలగాలను విరమించేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేదంటే ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందన్నారు. డేవిడ్ సాక్స్, అమెరికా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న అభ్యర్థి వివేక్ రామస్వామితో మస్క్ స్పేసెస్‌లో మాట్లాడారు. ఇజ్రాయెల్, హమాస్ భౌగోళిక రాజకీయాలపై విస్తృత చర్చ జరిగింది. రష్యా, చైనా సంయుక్త సైనిక విన్యాసాలను ప్రారంభించాయని మస్క్ పేర్కొన్నాడు. వ్లాదిమిర్ పుతిన్‌పై విస్తృతమైన ఆంక్షలు విధించాలనే పాశ్చాత్య నిర్ణయం ఊహించని పరిణామాలకు దారితీస్తుంది. రష్యా ముడిసరుకులను అందిస్తుండడం, చైనా పారిశ్రామిక సామర్థ్యాన్ని కలిగి ఉండటంతో గణనీయమైన సైనిక సామర్థ్యాన్ని సృష్టించే ప్రమాదం ఉందని తెలిపారు. వరుస అనాలోచిత నిర్ణయాలతో తెలియకుండానే మూడో ప్రపంచ యుద్ధం దిశగా పయనిస్తున్నట్లు హెచ్చరించారు. పాశ్చాత్య దేశాల ఆంక్షల వల్ల రష్యా, చైనాల మధ్య అంతరం తగ్గుతున్నట్లు ఏకాభిప్రాయానికి వచ్చారు. అంతర్జాతీయంగా అనిశ్చితుల వల్ల మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఇంత జరిగినా అదే పాట! ట్రంపా.. మజాకా!
శృంగార తారకు డబ్బు చెల్లింపుల కేసు విషయమై మాన్హాటన్ కోర్టులో డొనాల్డ్ ట్రంప్ హాజరైన సంగతి తెలిసిందే. దీంతో ట్రంప్ క్రిమినల్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న తొలి అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా నిలిచారు. విచారణ తదనతరం ట్రంప్ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా మళ్లీ అదే పాట పాడటం ప్రారంభించారు. ఈ మేరకు ట్రంప్ మాట్లాడుతూ.. అణ్వాయుధాల వినియోగంపై దేశాలన్ని బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నాయన్నారు. తన పరిపాలనలో ఇలా ఎప్పుడూ జరగలేదు, ఆ చర్చ కూడా రాలేదని అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన పూర్తిగా మూడో ప్రపంచ అణు యుద్ధానికి దారి తీస్తుందని, అది ఎంతో దూరంలో లేదు నన్ను నమ్మండి అంటూ హెచ్చరించారు. ప్రస్తుతం అమెరికా చాలా గందరగోళ స్థితిలో ఉందన్నారు. మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది, ద్రవ్యోల్బణం అదుపుతప్పింది, రష్యాతో చైనా జత కట్టింది.. అంటూ తనదైన శైలిలో బైడెన్ పాలనపై విరచుకుపడ్డారు. అలాగే చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా కలిసి భయంకరమైన విధ్వంసక కూటమిగా ఏర్పడ్డాయని, ఇలా తన నాయకత్వంలో జరగలేదని చెప్పారు. అలాగే మన కరెన్సీ ప్రపంచ ప్రమాణంగా ఇక మీదట ఉండకపోవచ్చని, 200 ఏళ్ల అమెరికా చరిత్రలో ఎదుర్కోని గొప్ప ఒటమి అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. అమెరికాని పాలించిన ఐదుగురు చెత్త అధ్యక్షుల గురించి ప్రస్తావిస్తే అందులో బైడెన్ పాలన అమెరికాను నాశనం చేసినంతగా మరెవరూ చేయలేదంటూ ఆరోపణలు చేశారు. కాగా, గతంలో ఉక్రెయిన్ యుద్ధం విషయంలో కూడా ఇలానే వ్యాఖ్యలు చేశారు ట్రంప్. తాను అధ్యక్షుడిగా ఉంటే ఒక్కరోజులో యుద్ధాన్ని ఆపేసేవాడినంటూ అందర్నీ షాక్‌కి గురిచేసేలా వ్యాఖ్యలు చేశారు. చదవండి: సినిమాని తలపించే సీన్..ప్రియురాలి కోసం ఏకంగా 21 గంటలు..) -
మూడో ప్రపంచ యుద్ధం రానివ్వను..ఎన్నికల ర్యాలీలో ట్రంప్ హామీ
అమెరికా అధ్యక్ష బరిలోకి దిగతానని ప్రకటించిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంచి జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు ఆయన సోమవారం అయోవాలోని డావెన్‌పోర్ట్‌లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో తాను మాత్రమే అమెరికాను రక్షించగల ఏకైక వ్యక్తినని, మూడో ప్రపంచ యుద్ధం రాకుండా చూస్తానంటూ ప్రగల్పాలు పలికారు. ప్రస్తుతం ప్రపంచం ఎన్నడూ లేనంతగా ప్రమాదకరమైన స్థితిలో ఉందన్నారు. ట్రంప్ తన ప్రసంగంలో..ఈ రోజు మీ ముందు నిలబడి వాగ్దానం చేయగల ఏకైక అభ్యర్థిని. మూడో ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుంటాను. ఎందుకంటే కచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని విశ్వసిస్తున్నా. అంతేగాదు రష్యాను అధ్యక్షుడు జో బైడెన్ చైనా చేతుల్లోకి నెట్టాడని విమర్మించారు. పుతిన్‌తో తనకు గొప్ప సంబంధాలు ఉన్నాయన్నారు. అతను తన మాట వింటాడు కాబట్టి ఉక్రెయిన్ సమస్యను సులభంగా పరిష్కరించగలనన్నారు. తాను ప్రతి విషయంలోనూ సరైనవాడనని గొప్పలు చెప్పారు. కాగా, అంతకుమునుపు ట్రంప్ కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ..మన దేశాన్ని ద్వేషించి పూర్తిగా నాశనం చేయాలనుకునే వ్యక్తుల నుంచి రక్షించే పోరాటం చేస్తున్నానన్నారు. అమెరికా నియోకాన్లు, గ్లోబలిస్టులు, బహిరంగ సరిహద్దు మతోన్మాదుల మూర్ఖులచే పాలించబడిందంటూ సాంప్రదాయ పార్టీలోని బహుముఖ ప్రముఖులను పేరుపేరున విమర్శించాడు. అమెరికన్లు చైనాను ప్రేమించే రాజకీయనాయకులతోనూ, అంతులేని విదేశీ యద్ధాల మద్దతుదారులతో అమెరికన్లు విసిగిపోయారని ట్రంప్ అన్నారు. (చదవండి: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు యత్నం.. రాళ్లు రువ్వి అడ్డుకుంటున్న మద్దతుదారులు) -
మూడో ప్రపంచ యుద్ధం తప్పదు! ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై కొన్ని నెలలుగా సైనిక చర్య పేరుతో భీకర దాడులకు పాల్పడుతోంది రష్యా. అందుకు దీటుగా కీవ్ సేనలు బదులిస్తున్నారు. వందల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ అంశంపై స్పందించారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తక్షణం శాంతియుతంగా యుద్ధానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. అమెరికాలోని నెవాడా రాష్ట్రంలో శనివారం నిర్వహించిన ‘సేవ్ అమెరికా’ ర్యాలీలో మాట్లాడుతూ.. అణ్వాయుధాల వినియోగంపై హెచ్చరించారు. ‘అజ్ఞానుల కారణంగా ఈ భూమిపై ఏమీ మిగలదు. ఉక్రెయిన్ యుద్ధానికి తక్షణ శాంతియుతంగా చర్చలు జరిపి ముగింపు పలకాలని మనమంతా డిమాండ్ చేయాలి. లేదా మూడో ప్రపంచ యుద్ధంతోనే ముగుస్తుంది. దాంతో మన భూమండలంపై ఏమీ మిగలదు.’ అని ప్రపంచాన్ని హెచ్చరించారు ట్రంప్. అణ్వాయుధాల వినియోగంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరికలు చేసిన తర్వాత ట్రంప్ ఈ మేరకు స్పందించటం సంచలనంగా మారింది. క్యూబన్ మిసైల్స్‌తో ఏర్పాడిన సంక్షోభంతో 60 ఏళ్ల తర్వాత మళ్లీ న్యూక్లియర్ బాంబుల ముప్పు పొంచి ఉందంటూ వ్యాఖ్యానించారు బైడెన్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధాల హెచ్చరికలు జోక్ కాదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటూ ప్రపంచానికి సూచించారు. గతంలోనూ ఇలాంటి హెచ్చరికలే చేశారు పలువురు ప్రపంచ నేతలు. వరుస హెచ్చరికల నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే భావనలు మొదలైనట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: Russia Ukraine War: పుతిన్ అణ్వాయుధ బెదిరింపులపై బైడెన్ సంచలన వ్యాఖ్యలు -
రష్యా ‘మూడో ప్రపంచ యుద్ధం’ హెచ్చరికలు.. ఉక్రెయిన్ స్పందన ఇదే!
కీవ్: ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలై 63 రోజులు గడుస్తున్నా పరిస్థితుల్లో మార్పులేం కనిపించడం లేదు. ఇరు దేశాల మధ్య యుద్ధ ముగియడం మాట అటుంచితే మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందంటూ రష్యా హెచ్చరికలు జారీ చేసింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందిస్తూ సహాయం చేయడం మూడో ప్రపంచ యుద్ధం ముప్పు ‘వాస్తవం’ అంటూ హెచ్చరించింది. రష్యాను దెబ్బ కొట్టాలనే ప్రణాళికలతో నాటో దేశాలు, పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్నాయని రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ మండి పడ్డారు. రష్యా సేనలు అలసిపోయినట్లు భావిస్తుండడం కూడా ఒక భ్రమే అన్నారు. ఉక్రెయిన్‌కు భారీ స్థాయిలో ఆయుధాలను సరఫరా చేసేందుకు అమెరికా దాని మిత్రదేశాలు సిద్ధమవుతోన్న వేళ రష్యా తాజా ప్రకటన భయాందోళనలు కలిగిస్తోంది. చదవండి👉 కిండర్‌గార్టెన్‌లో కాల్పుల కలకలం.. నలుగురి మృతి విషయం తెలిసే ఇదంతా.. మరోవైపు మూడోప్రపంచ యుద్ధం ముప్పుపై రష్యా విదేశాంగమంత్రి చేసిన వ్యాఖ్యలపై ఉక్రెయిన్ స్పందించింది. ‘ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వకుండా ప్రపంచ దేశాలను భయపెట్టాలని చూసిన రష్యా.. చివరకు ఆశలు కోల్పోయింది. అందుకే మూడో ప్రపంచ యుద్ధం ముప్పు వాస్తవం అంటూ బెదిరిస్తోంది. దీన్నిబట్టి చూస్తే ఉక్రెయిన్ ఓటమిని రష్యా గ్రహించినట్లు అర్థమవుతోంది’ అని ఉక్రెయిన్ విదేశాంగమంత్రి దిమిత్రో కులేబా పేర్కొన్నారు. ఇదిలాఉంటే, రష్యా సైనికచర్యతో అల్లాడుతోన్న ఉక్రెయిన్‌కు నేరుగా బలగాలను పంపించేందుకు నిరాకరిస్తున్నప్పటికీ ఆయుధ సామగ్రిని అందిస్తున్నాయి పశ్చిమ దేశాలు. తాజాగా ఉక్రెయిన్‌లో పర్యటించిన అమెరికా విదేశాంగ, రక్షణశాఖ మంత్రులు కూడా భారీ స్థాయితో ఆయుధ సహకారం అందిస్తామని ప్రకటించారు. ఓవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో అమెరికా మంత్రుల రహస్య భేటీ జరగడం,మరోవైపు రష్యా సరిహద్దు ప్రాంతంలో క్షిపణి దాడులు జరుగుతుండడంతో మూడో ప్రపంచ యుద్ధ ముప్పు అంటూ రష్యా మరిన్ని హెచ్చరికలు చేస్తోంది. చదవండి👉🏻 మస్క్ చేతికి ట్విటర్.. ట్రంప్ రీఎంట్రీ ఉంటుందా అంటే...? -
నాటో, రష్యా తలపడితే మూడో ప్రపంచ యుద్ధమే
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రసాయన ఆయుధాలు ఉపయోగిస్తే రష్యా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌లో రష్యాపై తాము పోరాటం చేయబోమని అన్నారు. నాటో, రష్యా ముఖాముఖి తలపడితే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని శుక్రవారం హెచ్చరించారు. దాన్ని నివారించేందుకు కృషి చేస్తామన్నారు. సభ్యదేశాల భూభాగంలో ప్రతి అంగుళాన్ని కాపాడుకునే శక్తిసామర్థ్యాలు నాటోకు ఉన్నాయన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా విజయం అసాధ్యమన్నారు. నాటో కూటమిని విచ్ఛిన్నం చేయాలన్న పుతిన్ ప్రయత్నాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. ప్రపంచం దశ, దిశను కొందరు నియంతలు నిర్ణయిస్తామంటే అనుమతించబోమన్నారు. -
88 యేళ్లనాటి కేకు.. ఇప్పటికీ తాజాగానే ఉంది!!
World's oldest wedding cake: పురావస్తు తవ్వకాల్లో ఎన్నో వస్తువులు బయటపడుతుండటం చూస్తుంటాం.. కానీ, మానవుడు తయారు చేసిన తినుబండారం చెక్కుచెదరకుండా బయట పడటం ఇదే మొదటిసారి కావొచ్చు. అది కూడా రెండు రోజుల్లో కుళ్లిపోగల కేకు.. ఇన్నేళ్లుగా ఎలా చెడిపోలేదో ఆశ్యర్యపోతున్నారా! నిజం.. ఇంగ్లండ్‌లోని దహనమైపోయిన ఓ ఇంటిలో సుమారు 88 సంవత్సరాల క్రితం తయారు చేసిన కేకు ఒకటి బయటపడింది. ఆ కేకు రూపం మాత్రం చెక్కు చెదరలేదు. పైగా గార్నిషింగ్ కోసం వాడిన చాక్లెట్ చిప్స్ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. పక్కనే ఓ కత్తి, నాలుగు చెంచాలు కూడా దొరికాయి. ఇదంతా చూస్తుంటే.. ఎవరి పుట్టినరోజో విషాదాంతంగా ముగిసినట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆ కేకు ఎవరు తయారు చేశారో తెలియదు కానీ, ఆ ఇంటి యజమానిని జోహాన్ వార్మ్ అనే వ్యక్తిగా గుర్తించారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో వందలాది ఇళ్లు మంటల్లో చిక్కుకుపోయాయి. ఈ ఇల్లు కూడా ఆ మంటల్లోనే చిక్కుకొని పూర్తిగా దహనమైపోయిందని అధికారులు తెలిపారు. పైగా ఈ కేకులో ఎటువంటి రసాయనాలను గుర్తించలేదని, ఇలా చెక్కు చెదరకుండా ఉండటానికి గల కారణం, త్వరలోనే కనుగొంటామని వారు చెప్పారు. చదవండి: అతిగా నిద్రపోతున్నారా? స్ట్రోక్ ఆ తర్వాత కార్డియక్ అరెస్ట్.. ఇంకా.. -
మూడో ప్రపంచ యుద్ధం గ్రహాంతరవాసులతోనే అటా!
న్యూయార్క్: ఇప్పటి వరకు దేశాల మధ్య పారిశ్రామిక ఒప్పందం, అణ్యాయుధాల ఒప్పందం, సరిహద్దుల ఒప్పందం విఫలం కావడం వంటి కారణాలు మూడో ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుందేమోనని దేశాధి నేతలు భయపడుతున్నారు. పరిస్థితి మరీ దిగజారకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సంప్రదింపులు, చర్చలు జరిపి పరిస్థితిని అదుపు చేసేవారు. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా మూడో ప్రపంచ యుద్ధం అంటూ వస్తే అది గ్రహాంతరవాసులతోటే అంటున్నారు యూఎస్ మిలటరీ ఆఫీసర్ రాబర్ట్ సలాస్ అంటున్నారు. (చదవండి: వెలుగులోకి 1,500 ఏళ్ల నాటి పురాతన వైన్ కాంప్లెక్స్) ఇంతకీ అసలు విషయం ఏమిటంటే గ్రహాంతరవాసులు అణు క్షిపణులను ట్యాంపరింగ్ చేస్తున్నట్లు తాను గుర్తించానని సలాస్ అంటున్నారు. ఈ మేరకు గ్రహాంతరవాసులు వేరోక గ్రహం నుంచి వచ్చి అణు లక్ష్యాల వద్ద ఆయుధ వ్యవస్థలను తారుమారు చేసి, వాటిని నిలిపివేసినట్లు పేర్కొన్నాడు. ఈ క్రమంలో అవి కొన్ని క్షిపణులను యాక్టివేట్ చేయడం మొదలు పెట్టడమే కాకా దాదాపు పది ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు నిర్విర్యం చేసినట్లు వెల్లడించారు. అంతేకాదు ఈ విషయానికి సంబంధించి నలుగురు యూఎస్ ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లు త్వరలో పత్రాలను విడుదల చేస్తారని కూడా సలాస్ అన్నారు. సలాస్ యూఎస్ ఆధునిక విధ్వంసక అణు క్షిపణి కార్యక్రమంగా పేరుగాంచిన టైటాన్ 3 ప్రోగ్రామ్‌లో ఎయిర్ ఫోర్స్ క్షిపణి ప్రొపల్షన్ ఇంజనీర్‌గానూ, యూఎస్ వెపన్ కంట్రోలర్‌గానూ పనిచేస్తున్నాడు. అంతేకాదు 1971నుంచి 1973 వరకు స్పేస్ షటిల్ డిజైన్ ప్రతిపాదనలకు సంబంధించిన మార్టిన్-మారిటా ఏరోస్పేస్, రాక్వెల్ ఇంటర్నేషనల్ సంస్థలకు అత్యంత విశ్వసనీయత కలిగిన ఇంజనీర్‌గా కూడా సేవలందించాడు. (చదవండి: ఆ కెమికల్ వల్లే అమెరికాలో ఏటా లక్ష మంది మృతి) -
చైనా కుతంత్రం: జీవాయుధంగా కరోనా
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ను చైనా లాబరేటరీలో తయారు చేసిందని.. కావాలనే భూమ్మీదకు వదిలిందని అమెరికా సహా పలు దేశాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బహిర్గతమైన ఓ డాక్యుమెంట్ డ్రాగన్ కుతంత్రాలను మరోసారి వెల్లడించింది. ఐదేళ్ల క్రితం నాటి ఈ డాక్యుమెంట్లో చైనా మిలిటరీ శాస్త్రవేత్త ఒకరు మూడో ప్రపంచం యుద్ధం గురించి చర్చించారు. సార్స్ వైరస్ జాతి నుంచి తయారు చేసిన జీవాయుధంతో యుద్ధం జరుగుతుందని చైనా ప్రభుత్వ ఆరోగ్య అధికారితో చర్చించినట్లు ఈ డాక్యుమెంట్ వెల్లడించింది. అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ దీనిని స్వాధీనం చేసుకుంది చైనా శాస్త్రవేత్తలు, ప్రజారోగ్య అధికారులు సార్స్ కరోనావైరస్ ఆయుధీకరణ గురించి మాట్లాడినట్లు పరిశోధనా పత్రం వెల్లడించింది. ఆస్ట్రేలియన్ న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ వెబ్సైట్ న్యూస్.కామ్ ప్రకారం, "ది అన్‌నాచుర్ ఆరిజిన్ ఆఫ్ సార్స్ అండ్ న్యూ స్పీసిస్ ఆఫ్ మ్యాన్-మేడ్ వైరసెస్ యాజ్ జెనెటిక్ బయోవెపన్స్" డాక్యుమెంట్లో చైనా మిలటరీ శాస్త్రవత్త తదుపరి ప్రపంచ యుద్ధం సార్స్ జాతికి చెందిన జీవ ఆయుధాలతో జరుగుతుందని అంచనా వేశారు. కరోనావైరస్లను "జన్యు ఆయుధాల కొత్త శకం"గా, "కృత్రిమంగా అభివృద్ధి చెందుతున్న హ్యూమండైజ్ వైరస్‌గా మార్చవచ్చని.. తరువాత తరంలో వాడే ఆయుధాలు మునుపెన్నడూ చూడని విధంగా ఉంటాయని" ఈ డాక్యుమెంట్లో వెల్లడించారు. చైనీస్ నేత్ర వైద్య నిపుణురాలు, వైరాలజిస్ట్ లి-మెంగ్ యాన్ చైనా ప్రభుత్వ ప్రయోగశాలలో సార్స్-కోవ్-2 వైరస్ తయారైనట్లు ఆరోపించిన డాక్యుమెంట్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. The mentioned breaking document to “predict World War III as biological war” is the PLA’s novel bioweapon textbook (by General Dezhong Xi, 2015) I’m translating into English with our Chinese volunteers! The brief introduction is in the 3rd Yan Report👇🏻 https://t.co/BxE22sQOuN pic.twitter.com/qkx7cLKclt — Dr. Li-Meng YAN (@DrLiMengYAN1) May 7, 2021 చదవండి: తండాలో నో కరోనా..! -
ప్రపంచానికి పెను సవాలు.. కరోనా
న్యూఢిల్లీ/రియాద్: రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచం ఎదుర్కొటున్న అతిపెద్ద సవాలు కరోనా వైరస్ అని ప్రధాని మోదీ జీ20 సదస్సులో వ్యాఖ్యానించారు. సౌదీ వేదికగా శనివారం జరిగిన ఈ సదస్సులో ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. మానవ చరిత్రను మలుపు తిప్పే ఘటన కరోనా అని చెబుతూ, కరోనానంతర కాలంలో రెండు విషయాలు ప్రధానమైనవన్నారు. మొదటగా ఎక్కడినుంచైనా పని చేయడం (వర్క్ ఫ్రం ఎనీవేర్) ఇప్పుడు కొత్త విధానంగా మారిందన్నారు. ఈ సందర్భంగా జీ20 వర్చువల్ సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. రెండవదిగా.. నాలుగు అంశాలపై ప్రపంచం దృష్టి సారించాలని చెప్పారు. నైపుణ్యాలను భారీగా సృష్టించడం, సమాజంలోని అన్ని వర్గాల వారికి సాంకేతికత చేరేలా చూడటం, ప్రభుత్వ విధానాల్లో పాదర్శకత, పర్యావరణ పరిరక్షణ వంటి వాటిని అనుసరించాలని అన్నారు. కొత్త ప్రపంచ నిర్మాణానికి ఈ జీ20 సదస్సు పునాది కావాలని ఆకాంక్షించారు. మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి పారదర్శకత సాయపడుతుందని అన్నారు. అనంతరం కరోనా నుంచి కోలుకొని ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడంపై పలువురు నేతలతో చర్చలు జరిపినట్లు మోదీ ట్వీట్ చేశారు. చర్చల ద్వారా పరిష్కారం: జిన్‌పింగ్ పరస్పర గౌరవం, సమానత్వం, ప్రయోజనాల ప్రాతిపదికన అన్ని దేశాలతో శాంతియుత సంబంధాలకు సిద్ధంగా ఉన్నామని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పేర్కొన్నారు. జీ 20 సదస్సులో శుక్రవారం ఆయన ప్రసంగించారు. చర్చల ద్వారా భిన్నాభిప్రాయాలను తొలగించుకోవాలని ఆయన సూచించారు. ప్రపంచ శాంతి, అభివృద్ధికి కలసికట్టుగా కృషి చేయాల్సి ఉందన్నారు. కోవిడ్‌ను తరిమికొట్టేందుకు అన్ని దేశాలు ఐక్యంగా కృషి చేయాలని పేర్కొన్నారు. వ్యాక్సిన్ పంపిణీ సమర్ధవంతంగా జరిగేందుకు వనరులను ఉపయోగించుకొనేలా ప్రపంచ ఆరోగ్య సంస్థకు సహకరించాలని కోరారు. కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ప్రపంచానికి తోడ్పడతామని చెప్పారు. కరోనా నేపథ్యంలో పేద దేశాలకు చైనా నిధులిచ్చేందుకు వీలుగా నిబంధనలను సవరిస్తున్నామన్నారు. సౌదీ వేదికగా జరిగిన ఈ సమావేశంలో అమెరికా, చైనా, భారత్, టర్కీ, ఫ్రాన్స్, యూకే, బ్రెజిల్ వంటి పలు దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సును తొలిసారి నిర్వహించనున్న అరబ్ దేశంగా సౌదీ నిలవనుంది. అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన అనంతరం ట్రంప్ పాల్గొం టున్న అంతర్జాతీయ సదస్సు కూడా ఇదే. -
ఇక మూడో ప్రపంచ యుద్ధమే..
-
ఇక మూడో ప్రపంచ యుద్ధమే.. సై అంటున్న దేశం!
మరో ప్రపంచయుద్ధానికి రష్యా సన్నద్ధమవుతున్నదా? ఇందులో భాగంగా ఆ దేశం ముందస్తుగా భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నదా? అంటే బ్రిటన్‌కు చెందిన ప్రముఖ టాబ్లాయిడ్ ‘ద సన్’ ఔననే అంటున్నది. అంతర్జాతీయ యుద్ధం పొంచి ఉన్న నేపథ్యంలో విదేశాల్లోని తమ పౌరులు వెంటనే స్వదేశం చేరుకోవాలని రష్యా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్టు ‘ద సన్’ ఓ కథనాన్ని ప్రచురించింది. మరో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశముండటంతో ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతినే ఈ ఆదేశాలు జారీచేసినట్టు తెలిపింది. నాలుగు కోట్ల మంది పౌరులకు రక్షణ కల్పించేరీతిలో రష్యా ఇటీవల సైనిక విన్యాసాలు నిర్వహించింది. పూర్తిస్థాయిలో అణ్వాయుధ యుద్ధం వస్తే దానిని ఎదుర్కొనేందుకు సన్నాహకంగానే ఈ విన్యాసాలు చేసినట్టు ఆ పత్రిక వివరించింది. సాధ్యమైనంత త్వరగా రష్యా అధికారులు, వారి పిల్లలు, బంధువులు స్వదేశం చేరుకోవాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిపింది. అంతేకాకుండా రష్యా రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు కూడా ఈ విషయంలో అధ్యక్షుడు పుతిన్ నుంచి అత్యున్నత స్థాయి హెచ్చరికలు అందినట్టు తెలిపింది. స్వదేశానికి తిరిగి రావాలన్న పుతిన్ పిలుపు ప్రభుత్వాధికారులందరికీ వర్తిస్తుందని పేర్కొంది. అధ్యక్షుడు పుతిన్ అకస్మాత్తుగా ఫ్రాన్స్ పర్యటనను రద్దు చేసుకున్న నేపథ్యంలో ఈ పిలుపు ఇవ్వడం గమనార్హం అని మరో బ్రిటన్ పత్రిక డెయిలీ స్టార్ పేర్కొంది. ఈ ఆదేశాలను ఎవరైనా పట్టించుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలుంటాయని, వారి ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని ప్రభుత్వం హెచ్చరించినట్టు తెలిపింది. ఉన్నపళంగా విదేశాల్లోని రష్యాన్లందరినీ తిరిగి స్వదేశానికి రమ్మనడం దేనికి సంకేతం అంటే ఇవన్ని యుద్ధ సంకేతాలేనని, పెద్ద యుద్ధాన్ని చేసేందుకు సన్నహాకాల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు రష్యా రాజకీయ విశ్లేషకుడు స్టానిస్లావ్ బెల్కోవ్స్కీ పేర్కొన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం అనంతరం అమెరికా-రష్యా మధ్య సంబంధాలు ఇటీవలికాలంలో దారుణంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సిరియా విషయంలో రష్యా-అమెరికా బాహాబాహీకి దిగుతున్నాయి. సిరియాలో శాంతికోసం తలపెట్టిన చర్చల ప్రక్రియ నుంచి అమెరికా తప్పుకోవడమే కాకుండా తమ దేశ వెబ్సైట్లను రష్యా హ్యాకింగ్ చేస్తున్నదని ఆరోపించిన సంగతి తెలిసిందే. -
'ఐఎస్‌పై పోరాటం మూడో ప్రపంచ యుద్ధం కాదు'
వాషింగ్టన్: ప్రపంచంలో అమెరికానే అత్యంత శక్తిమంతమైన దేశమని ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. దేశంలో పెరిగిపోతున్న తుపాకీ హింస నుంచి మన పిల్లలను రక్షించుకుందామని అమెరికన్లకు పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా పదవీకాలం పూర్తికాబోతున్న నేపథ్యంలో ఒబామా.. చివరిసారి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై పోరాటం మూడో ప్రపంచ యుద్ధం కాదని స్పష్టం చేశారు. భవిష్యత్ గురించి ఆందోళన వద్దని భరోసా ఇచ్చారు. విద్య, ఆరోగ్యం, స్వేచ్ఛ, ఆర్థికాభివృద్ధి, భద్రత, రాజకీయాలు, ఉగ్రవాదులపై చర్యలు తదితర అంశాల గురించి ప్రసంగించారు. ఆయన ఏం మాట్లాడారంటే.. సామాజిక భద్రత, ఆరోగ్యం అన్నింటికంటే ముఖ్యం. ఈ విషయాలను విస్మరించకుండా, అమలు చేయాలి ప్రతి అమెరికన్ ఉన్నత విద్య అభ్యసించేలా కాలేజీలను అందుబాటులో ఉంచాలి మన పిల్లల కోసం మరింతమంది ప్రతిభావంతులైన ఉపాధ్యాయులను నియమించి, వారికి మద్దతుగా నిలవాలి గత ఏడేళ్లుగా ఆర్థికాభివృద్ధిని సాధించాలనే లక్ష్యంతో పనిచేశాం, ఇది సత్ఫలితాలను ఇచ్చింది. పదవి నుంచి వైదొలిగినా మరో ఐదు, పదేళ్ల పాటు మన భవిష్యత్‌పై దృష్టి పెడతా దేశంలో ప్రతి ఒక్కరికీ తాను ప్రేమించినవారిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి మీపై నమ్మకముంది, మార్పుపై నమ్మకముంది ప్రజలను లక్ష్యంగా చేసుకునే రాజకీయాలను తిరస్కరించాలి ముస్లింలను విమర్శించడం వల్ల, మసీదును ధ్వంసం చేయడం వల్ల మనం సురక్షితంగా ఉండలేము అమెరికా చిత్తశుద్ధిపై కానీ నాపై కానీ సందేహం ఉంటే.. న్యాయం జరిగింది చూడండి. కావాలంటే బిన్ లాడెన్‌ను అడగండి అమెరికన్ల రక్షణకే తొలి ప్రాధాన్యం, ఆ తర్వాతి లక్ష్యం ఉగ్రవాదులు అమెరికా అస్తిత్వానికి ఐఎస్ ప్రమాదకరం కాదు ఆల్ ఖాయిదా, ఐఎస్ నుంచి మనకు ముప్పు పొంచి ఉంది. ఈ ఉగ్రవాద సంస్థలపై మన విదేశాంగ విధానం దృష్టిపెట్టాలి ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, దక్షిణ అమెరికాలో కొన్ని ప్రాంతాలు, ఆప్రికా, ఆసియాలో అస్థిరత ఉంది. వీటిలో కొన్ని దేశాలు ఉగ్రవాద కార్యకలాపాలకు సురక్షిత ప్రాంతాలుగా మారే అవకాశముంది -
ఇది మూడో ప్రపంచ యుద్ధం కాదా?
అస్పష్టత. నూటికి నూరింతలు అస్పష్టత ఉంటే తప్ప యుద్ధాలు జరగవు. ఇంతకీ ఎవరికి అస్పష్టత? శ్రమ, పరిశ్రమలతో ఆయా దేశాలకు కేవలం ఆదాయ వనరుగా ఉన్న సామాన్యులకు.. సాధారణ ప్రజలకు! మన స్పష్టత కోసం సిరియా సంక్షోభాన్ని పరిశీలిద్దాం.. ప్రస్తుతం ఇరాక్, సిరియాల్లో అరడజనుకు పైగా దేశాల సైన్యాలు, రెండు డజన్ల దేశాలకు చెందిన జిహాదీలతో తలపడుతున్నారు. అక్కడి పేలుళ్ల కర్మ, క్రియల్లో భారతీయులు, పాకిస్థానీలు, అరబ్బులు, అమెరికన్లు, కుర్దులు,తుర్కులు, యూరోపియన్లు, తాలిబన్లు, తాజాగా రష్యన్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్థలాభావం వల్ల ఈ జాబితా కుదించినప్పటికీ పోరాటంలోకి దిగుతున్న జాతులు లేదా దేశాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ సందర్భంలోనే ఎవరెవరు ఏం చేస్తున్నారో చూద్దాం.. రష్యా.. సిరియాలో గగనతలం నుంచి దాడులు చేస్తున్నది. వాళ్ల టార్గెట్ ఐఎస్ఐఎస్ కాదు. అసద్ వ్యతిరేకులు. అక్కడున్న స్థావరాల్లో ఏది ఐఎస్ దో, ఏది తిరుగుబాటు దళాలవో నిర్ధారించుకుని మరీ మిగ్ విమానాలు బాంబులు కురిపిస్తున్నాయి. అలాగని రష్యాకు ఐఎస్ తో దోస్తీ ఉందనీ చెప్పలేం. నిన్న (మంగళవారం) రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసిన టర్కీకి రెండు లక్ష్యాలున్నాయి. ఒకటి కుర్దుల అణిచివేత. రెండు అసద్ కూల్చివేత. అయితే మొదటి లక్ష్యం కోసం గట్టిగా ప్రయత్నించే టర్కీ.. రెండో లక్ష్యసాధనకు కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు రష్యా విమానం కూల్చివేతతో అర్థమవుతుంది. ఐఎస్ కు వ్యతిరేకంగా పోరాడే కుర్దులతో వీరిది జాతి వైరం. ఇక అమెరికా, అసద్ వ్యతిరేక దళాలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. అదే సమయంలో ఐఎస్ఐఎస్ పైనా పోరాడుతున్నట్లు ప్రకటించుకుంది. యూఎస్ తో కలిసి ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కెనడా యుద్ధ విమానాలు సిరియా గగన తలంలో చక్కర్లు కొడుతున్నాయి. మధ్యప్రాచ్యంలో అమెరికా పెత్తనాన్ని నిరోధించేందుకు ఇరాన్ లాంటి దేశాలు రష్యాతో కలిసి పోరాటంలోకి దిగాయి. ఇరాన్ కు కుర్దులతో వైరముంది. ఐఎస్ తో దోస్తానా విషయంలో ఎక్కడా బయటపడదు ఇరాన్. సిరియాలో అసద్ ప్రభుత్వాన్ని పడిపోనివ్వబోమంటూ ఇరాన్, రష్యాలు ప్రతినబూనిన కొద్ది గంటల్లోనే పశ్చిమ దేశాలపై ఐఎస్ఐఎస్ దాడులకు దిగింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఒత్తిడి ఏర్పడుతుందని, అంతర్జాతీయ సంస్థలే అసద్ ను గద్దెదింపుతాయని ఐఎస్ విశ్వాసం. ఆశించినట్లే 'సిరియాలో శాంతి స్థాపనకు ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గం' లాంటి ప్రకటనలు ఐక్యరాజ్యసమితి, జీ-20 సదస్సుల నుంచి వెలువడ్డాయి. ఈ సంక్షోభమేకాక ప్రపంచంలోని మిగతా దేశాల్లో సరాసరి మూడు తీవ్రవాద సంస్థలు ప్రభావాన్ని చూపుతుండటం, అవన్నీ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన(!) ఉగ్రసంస్థలతో సత్సంబంధాలూ ఏర్పర్చుకున్నాయి. అసలేమిటిదంతా? ఎవరు ఎవరి పక్షాన పోరాడుతున్నారు? ఎవరు ఎవరి కోసం తపిస్తున్నారు? అనే శేష ప్రశ్నలకు అస్పష్టత (యుద్ధం) ఒక మలుపే తప్ప అసలు సమాధానం కాదు. ఆ సమాధానం మనకు తెలిసేనాటికి ఈ ప్రపంచం ఇప్పుడున్నట్లుండదు. 20 వ శతాబ్ధంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలు, 21 వ శతాబ్ధంలో చోటుచేసుకున్న అఫ్ఘానిస్థాన్, ఇరాక్ యుద్ధాల సందర్భంలో యుద్ధం చేయడానికి చూపిన కారణాలు, యుద్ధం తర్వాత వెల్లడైన వాస్తవాలు పరస్పరం విరుద్ధంగా ఉండటం తెలిసిందే. ఈ లెక్కన ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్లే. 2011లో మొదలైన సిరియా సంక్షోభం మలుపులు తిరుగుతూ అనేక దేశాలను తనలోకి ఎలా లాగిందీ, ఉద్దేశపూర్వకంగానో, అనుకోకుండానో పోరులోకి ప్రవేశించి, ఆ తర్వాత విభిన్న లక్ష్యాల కోసం ఒకే ప్రాంతంలో పోరాడుతున్న తీరు గురించి ప్రముఖ కాలమిస్ట్, ప్రొఫెసర్ ఫ్రిదా ఘిటీస్ 'సీఎన్ఎన్'లో రాసిన ప్రత్యేక కథనం ఇది.