శృంగార తారకు డబ్బు చెల్లింపుల కేసు విషయమై మాన్‌హాటన్ కోర్టులో డొనాల్డ్ ట్రంప్ హాజరైన సంగతి తెలిసిందే. దీంతో ట్రంప్ క్రిమినల్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న తొలి అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా నిలిచారు. విచారణ తదనతరం ట్రంప్ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా మళ్లీ అదే పాట పాడటం ప్రారంభించారు. ఈ మేరకు ట్రంప్ మాట్లాడుతూ.. అణ్వాయుధాల వినియోగంపై దేశాలన్ని బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నాయన్నారు. తన పరిపాలనలో ఇలా ఎప్పుడూ జరగలేదు, ఆ చర్చ కూడా రాలేదని అన్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన పూర్తిగా మూడో ప్రపంచ అణు యుద్ధానికి దారి తీస్తుందని, అది ఎంతో దూరంలో లేదు నన్ను నమ్మండి అంటూ హెచ్చరించారు. ప్రస్తుతం అమెరికా చాలా గందరగోళ స్థితిలో ఉందన్నారు. మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది, ద్రవ్యోల్బణం అదుపుతప్పింది, రష్యాతో చైనా జత కట్టింది.. అంటూ తనదైన శైలిలో బైడెన్ పాలనపై విరచుకుపడ్డారు. అలాగే చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా కలిసి భయంకరమైన విధ్వంసక కూటమిగా ఏర్పడ్డాయని, ఇలా తన నాయకత్వంలో జరగలేదని చెప్పారు.
అలాగే మన కరెన్సీ ప్రపంచ ప్రమాణంగా ఇక మీదట ఉండకపోవచ్చని, 200 ఏళ్ల అమెరికా చరిత్రలో ఎదుర్కోని గొప్ప ఒటమి అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. అమెరికాని పాలించిన ఐదుగురు చెత్త అధ్యక్షుల గురించి ప్రస్తావిస్తే అందులో బైడెన్ పాలన అమెరికాను నాశనం చేసినంతగా మరెవరూ చేయలేదంటూ ఆరోపణలు చేశారు. కాగా, గతంలో ఉక్రెయిన్ యుద్ధం విషయంలో కూడా ఇలానే వ్యాఖ్యలు చేశారు ట్రంప్. తాను అధ్యక్షుడిగా ఉంటే ఒక్కరోజులో యుద్ధాన్ని ఆపేసేవాడినంటూ అందర్నీ షాక్‌కి గురిచేసేలా వ్యాఖ్యలు చేశారు.
చదవండి: సినిమాని తలపించే సీన్..ప్రియురాలి కోసం ఏకంగా 21 గంటలు..)
Comments
Please login to add a commentAdd a comment