warns
-
అధికారులకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వార్నింగ్
సాక్షి, హైదరాబాద్: కొందరు అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. చిన్న స్థాయి అధికారి నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు అలసత్వం వహిస్తున్నారని.. ఎమ్మార్వో అయినా, ఐఏఎస్ అయినా పని చేయకపోతే ప్రభుత్వం నుంచి సీరియస్ చర్యలు ఉంటాయంటూ ఆయన హెచ్చరించారు.‘‘కేటీఆర్, హరీష్ ఒకటై కవితని బయటకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. మహిళకు మంత్రి పదవి ఇవ్వకపోతే కవితకి అడగడం చేత కాలేదు. బీసీల కోసం మాట్లాడే హక్కు కవితకి ఎక్కడిది?. సామాజిక న్యాయానికి కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. తెలుగు ప్రజల గుండెల్లో విజయశాంతి ఉంటుంది. అద్దంకి, విజయశాంతి, శంకర్ నాయక్ రాకతో మండలిలో మా బలం పెరుగుతుంది’’ అని మహేష్ గౌడ్ చెప్పారు.అసెంబ్లీలో జగదీశ్వర్‌రెడ్డి వ్యవహరించిన తీరు సరిగా లేదు. కేటీఆర్ గవర్నర్‌పై వ్యవహరించిన తీరు అందరం చూశాం. దళితులపై కేసీఆర్ పద్ధతి ఎలా ఉండేదో అందరికీ తెలుసు. భట్టి విక్రమార్కకు సీఎల్పీ హోదా లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో విజయశాంతి పాత్ర ఉంది. 2023 ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌గా విజయశాంతి పని చేసింది. మహిళలకు మంత్రి పదవి ఇవ్వని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మహిళల కోసం మాట్లాడడం సిగ్గుచేటు’’ అంటూ మహేష్ గౌడ్ దుయ్యబట్టారు.‘‘నిరంతరం పార్టీ కోసం పని చేసిన వ్యక్తులకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చాం. దక్షిణాది రాష్ట్రాల రాజకీయ నాయకుల మీటింగ్ కి మేం తప్పకుండా వెళ్తాం. దక్షిణ భారత దేశంలో పార్లమెంట్ సీట్లు పెంచకపోతే ఊరుకోం’’ అని మహేష్ గౌడ్ వ్యాఖ్యానించారు. -
ఎవరూ సురక్షితంగా లేరు.. జీ7 దేశాలకు కెనడా హెచ్చరిక..
వాణిజ్య యుద్ధ భయాలు జి-7 దేశాలను వెంటాడుతున్నాయి. ఈ క్రమంలో జరిగిన జి-7 విదేశాంగ మంత్రుల సమావేశంలో వాణిజ్య యుద్ధం ప్రధాన చర్చగా మారింది. డొనాల్డ్ ట్రంప్ విధానాలతో ఎవరూ సురక్షితంగా లేరంటూ జీ7 దేశాలను కెనడా హెచ్చరించింది. కెనడా విదేశాంగ మంత్రి మెలానియో జోలీ.. అమెరికాతో తీవ్రమవుతున్న వాణిజ్య పోరాటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అగ్రరాజ్య చర్యలతో ఎదురయ్యే పరిణామాలపై మిగిలిన దేశాలను ఆమె హెచ్చరించారు.అత్యంత మిత్రదేశమైన మాతోనే అమెరికా ఇలా ఉంటే.. ఇక ఇతర దేశాలు సురక్షితంగా ఉండలేవంటూ ఆమె వ్యాఖ్యానించారు. రాబోయే విపత్తును ముందుగా అంచనా వేసి, మిత్రదేశాల మద్దతును కూడగట్టేందుకు కెనడా ఈ చర్యలు తీసుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయవ్యక్తం చేస్తున్నారు. కాగా, ఇక ట్రంప్ తరచూ కెనడా సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ చేస్తున్నవ్యాఖ్యలపై కూడా జోలీ స్పందిస్తూ.. అలాంటి బెదిరింపులకు తమ దేశం వెనుకంజ వేయదంటూ తేల్చి చెప్పారు. యుద్ధ విన్యాసాలు, ఆయుధ తయారీ వంటి చర్యలు తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు కీలకమైనవిగా ఆమె స్పష్టం చేశారు.మరోవైపు, ఆర్థిక కోణంలో మాత్రమే తమ అధ్యక్షుడు కెనడాను 51వ రాష్ట్రం కావాలని ఆకాంక్షించారంటూ అమెరికా మంత్రి మార్కో రూబియో వివరణ ఇచ్చారు. ఒక వేళ కెనడా 51 రాష్ట్రం అయితే అప్పుడు సరిహద్దుల గురించి, ఫెంటెనిల్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది ట్రంప్ భావన’’ అని రూబియో వ్యాఖ్యానించారు.అధికారంలోకి వచ్చిన వెంటనే.. ట్రంప్ పలు దేశాలపై భారీ స్థాయిలో సుంకాలు విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పొరుగు దేశాలతో ట్రేడ్వార్కు బీజం వేశారు. అమెరికా-కెనడా మధ్య సంబంధాలు కూడా ఎన్నడూ లేని స్థాయిలో దెబ్బతిన్నాయి. కాగా, ట్రంప్.. టారిఫ్ వార్‌లో కాస్త వెనక్కి తగ్గారు. మెక్సికోతో పాటు కెనడాపై విధించిన దిగుమతి సుంకాలను ఏప్రిల్ 2వ తేదీ దాకా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని ఉత్పత్తులపై మాత్రం ఈ నిర్ణయం యథావిధిగా కొనసాగుతుందని, ప్రతీకార సుంకాలు విధించే ప్రణాళికలో ఎటువంటి మార్పు లేదని అన్నారాయన. -
మొబైల్ యూజర్లకు ట్రాయ్ హెచ్చరిక
సైబర్ క్రైమ్స్ ప్రస్తుతం భారతదేశంలో ఒక పెద్ద సమస్యగా మారిపోతోంది. ఎప్పటికప్పుడు స్కామర్లు కొత్త అవతారాలెత్తి ప్రజలను మోసం చేస్తున్నారు, డబ్బు దోచేస్తున్నారు. ఇలాంటి వాటి విషయంలో మొబైల్ యూజర్లకు చాలా జాగ్రత్తగా ఉండాలని 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (TRAI) హెచ్చిరికలు జారీ చేసింది.స్కామర్లు బాధితులను మోసం చేయడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో ఎలక్ట్రిక్ కనెక్షన్ లేదా ఇంటర్నెట్ కనెక్షన్ వంటి సదుపాయాలను నిలిపేస్తామని బెదిరిస్తారు. బాధితుడు చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని నేరగాళ్లు తప్పుగా పేర్కొంటారు. దీంతో కొందరు భయపడి నేరగాళ్లు చెప్పినట్లు వింటారు, భారీగా డబ్బు కోల్పోతారు.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా.. షేర్ చేసిన ఒక వీడియోలో ఇలాంటి స్కామ్‌కు సంబంధించిన సంఘటనను చూడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క మొబైల్ యూజర్ తెలియని నంబర్స్ నుంచి వచ్చే కాల్స్ పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని.. సంచార్ సాథీ పోర్టల్‌ని ఉపయోగించి ఏవైనా అనుమానాస్పద కాల్‌లను నివేదించాలని ట్రాయ్ కోరింది.భారతదేశంలో పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్ప్రభుత్వ డేటా ప్రకారం.. 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు డిజిటల్ అరెస్ట్ స్కామ్ కారణంగా బాధితులు సుమారు రూ. 120.3 కోట్లు నష్టపోయినట్లు తెలిసింది. అక్టోబర్ 27న మన్ కీ బాత్ 115వ ఎపిసోడ్ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమాచారాన్ని అందించారు.నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) 2024 మొదటి త్రైమాసికంలో దాదాపు 7.4 లక్షల సైబర్ క్రైమ్ ఫిర్యాదులు అందుకున్నట్లు వెల్లడించింది.ఇదీ చదవండి: చెత్త సంపాదన రూ.2,364 కోట్లు: ప్రశంసించిన మోదీడిజిటల్ అరెస్ట్ స్కామ్‌లు లేదా సైబర్ నేరగాళ్లు బాధితురాలకు ఫోన్ చేసి అక్రమ వస్తువులు లేదా నిషిద్ధ వస్తువులకు సంబంధించిన నేరంలో మీ ప్రమేయం ఉందని భయపెడతారు. టెక్నాలజీలను ఉపయోగించి వీడియో కాల్స్ ద్వారా నకిలీ కోర్టులను, న్యాయమూర్తులను ఏర్పటు చేస్తారు. అరెస్టు లేదా చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండటానికి డబ్బు చెల్లించాలని.. భారీ మొత్తంలో మోసం చేస్తుంటారు. కాబట్టి ఇలా మోసం చేసేవారు మీకు ఎప్పుడైనా ఫోన్ చేసి బెదిరిస్తే.. తప్పకుండా సంబంధిత పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలి.अचानक से TRAI 📞 ने कि आपका नेटवर्क disconnect करने की बात 🧐🤔 सावधान रहे, ये एक scam है ! आपका अगला कदम ? रिपोर्ट करें चक्षु के साथ https://t.co/6oGJ6NSQal पर#SafeDigitalIndia pic.twitter.com/Zmkwj2Rjzg— DoT India (@DoT_India) November 9, 2024 -
ఇలా మోసం చేస్తున్నారు.. ఆర్బీఐ హెచ్చరిక!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ పేరును ఉపయోగించుకుని మోసాలకు పాల్పడుతున్న అసాంఘిక శక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలను ఆర్బీఐ హెచ్చరించింది. సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగులుగా నటిస్తూ నకిలీ లెటర్ హెడ్స్, ఈమెయిల్ అడ్రెస్‌లను ఉపయోగించి లాటరీలు.. ఫండ్ ట్రాన్స్ఫర్, విదేశీ రెమిటెన్సులు, ప్రభుత్వ పథకాల పేరిట కొందరు మోసగిస్తున్నారని పేర్కొంది.కరెన్సీ ప్రాసెసింగ్ ఫీజులు, ట్రాన్స్ఫర్/రెమిటెన్స్/ప్రొసీజర్ చార్జీలంటూ వసూలు చేస్తున్నారని వివరించింది. ఆర్బీఐ/ప్రభుత్వ అధికారుల్లాగా నటిస్తూ ప్రభుత్వ కాంట్రాక్టులు, స్కీములతో నిధులు పొందేందుకు సెక్యూరిటీ డిపాజిట్లు కట్టాల్సి ఉంటుందని చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థలను మోసగిస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. సాధారణంగా వీరు ఐవీఆర్ కాల్స్, ఎస్ఎంఎస్, ఈమెయిల్స్ ద్వారా బాధితులను సంప్రదిస్తున్నారు.ఆర్బీఐ అధికారులుగా పరిచయం చేసుకునే సదరు మోసగాళ్లు బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసేస్తామని బెదిరిస్తూ, నిర్దిష్ట వ్యక్తిగత వివరాలు ఇచ్చేలా బాధితులను బలవంతపెడుతున్నారు. ఈ నేపథ్యంలో అపరిచితులకు అకౌంట్ లాగిన్ వివరాలు, ఓటీపీ లేదా కేవైసీ పత్రాలు మొదలైనవి ఇవ్వరాదని రిజర్వ్ బ్యాంక్ సూచించింది. -
స్కూల్ హెచ్ఎంకు టీడీపీ నేతల బెదిరింపులు.. ఆడియో వైరల్
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: రాష్ట్రంలో టీడీపీ నేతల ఆగడాలు ఆగడం లేదు. బరితెగించి ప్రవర్తిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిపైనే దాష్టీకానికి దిగారు. పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం మేకలపల్లిలో స్కూల్ కమిటీ ఎన్నికల్లో తనకు అనుకూలంగా వ్యవహరించలేదని హెచ్ఎం గోవిందప్పపై సోమందేపల్లి టీడీపీ మండల కన్వీనర్ సిద్ధలింగప్ప నోరు పారేసుకున్నారు. ప్రభుత్వం మాదే.. జాగ్రత్తగా ఉండాలంటూ టీచర్‌ను హెచ్చరించారు. టీడీపీ నేత సిద్ధలింగప్ప వార్నింగ్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.కాగా, మరోవైపు చిరుద్యోగులపై కూడా టీడీపీ నాయకులు ప్రతాపం చూపుతున్నారు. ఎమ్మెల్యే పీఏ ద్వారా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ఇద్దరు ఉద్యోగులను విధుల నుంచి తొలగించారు. లేపాక్షి మండలం కోడిపల్లికి చెందిన అనిల్, బాలక్రిష్ణ శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం విభాగంలో అనేక ఏళ్లుగా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో ఎలాంటి రిమార్కూ లేదు. అయితే అధికార టీడీపీ నాయకులు ఆ ఉద్యోగులకు వైఎస్సార్సీపీ రంగు పులిమి వారి స్థానంలో తమకు కావల్సిన వారిని నియమించేందుకు పావులు కదిపారు.ఎమ్మెల్యే పీఏ ద్వారా ఆదేశాలు అందుకున్న శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం అధికారులు ఇక నుంచి విధులకు రావొద్దని కార్మికులకు తెలిపారు. 2004 నుంచి పనిచేస్తున్న తనను ఉన్నపళంగా ఉద్యోగం నుంచి తొలగిస్తే ఏం చేయాలో దిక్కుతోచడం లేదని వాటర్‌మెన్ అనిల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఉద్యోగంతోనే తాను భార్య, కుమారుడిని పోషించుకునేవాడినని, ఇప్పుడు జీవనం ఎలా సాగించాలో తెలియడం లేదని అన్నాడు.2010 నుంచి గొల్లపల్లి పంప్‌హౌస్ వద్ద ఫిట్టర్‌గా పనిచేస్తున్న తనను ఇక డ్యూటీకి రావొద్దని అధికారులు తెలపడంతో గుండె ఆగినంత పనైందని బాలక్రిష్ణ తెలిపాడు. తనకు భార్య, ఆరు నెలల కుమార్తె ఉందని, ఉద్యోగం పోతే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏమైనా సందేహాలుంటే ఎమ్మెల్యే పీఏను సంప్రదించాలని సలహా ఇచ్చారన్నారు. 2010 నుంచి గొల్లపల్లి పంప్‌హౌస్ వద్ద ఫిట్టర్‌గా పనిచేస్తున్న తనను ఇక డ్యూటీకి రావొద్దని అధికారులు తెలపడంతో గుండె ఆగినంత పనైందని బాలక్రిష్ణ తెలిపాడు. తనకు భార్య, ఆరు నెలల కుమార్తె ఉందని, ఉద్యోగం పోతే రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏమైనా సందేహాలుంటే ఎమ్మెల్యే పీఏను సంప్రదించాలని సలహా ఇచ్చారన్నారు. -
మామిడి పండ్ల వినియోగంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరిక! కెమికల్ ఫ్రీ పండ్లను ఎలా గుర్తించాలంటే..
వేసవి కాలం అంటే నోరూరించే మామిడి పండ్ల సీజన్. వీటిని ఇష్టపడని వారెవ్వరుంటారు. అయితే ఆ మామిడి పండ్లను కృత్రిమంగా పండించడంపై ఫుడ్ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) వ్యాపారస్తులను, పండ్ల వ్యాపరులను ఆహార భద్రత ప్రమాణలు పాటించాని పేర్కొంది. చట్టవిరుద్ధంగా కాల్షియం కార్పైడ్ వంటి రసాయనాలను వినియోగించకూడదని తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆరోగ్య అధికారులు ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అసలు కృత్రిమంగా మామిడి పండ్లను పండించేందుకు ఏం ఉపయోగాస్తారు? కెమికల్ ఫ్రీ పండ్లను ఎలా గుర్తించగలం తదితరాలు గురించి తెలుసుకుందాం.!కాల్షియం కార్బైడ్ అంటే..మామిడిపండ్లు తొందరగా పక్వానికి వచ్చేలా కాల్షియం కార్బైడ్ వంటి కెమికల్స్‌ని వినియోగిస్తారు. దీనిలో ఫాస్పరస్ జాడలు కలిగి ఉన్న ఎసిటిలీన్ వాయవుని విడుదల చేస్తుంది. అందువల్ల ఈ రసాయనాలతో పండించిన మామిడి పండ్లు ఆరోగ్యానికి హానికరం. ఇలా పండించిన పండ్లను తీసుకోవడం వల్ల తలనొప్పి, తరుచుగా దాహం, చికాకు, బలహీనత, మింగడంలో ఇబ్బంది. వాంతులు, చర్మపు పూతలు వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది. అందువల్ల ఇలాంటి కెమికల్స్ వినియోగాన్ని నిషేధించింది. 2011 రెగ్యులేషన్ నిబంధనల ప్రకారం కృత్రిమంగా పండించేందుకు కాల్షియ కార్బైడ్ వినియోగించొద్దని తెలిపింది. ప్రత్యామ్నాయంగా ఇథిలిన్ వాయువును ఉపయోగించొచ్చని తెలిపింది. ఇథిలిన్ వాయువు కార్బైడ్ వాయువుకు సురక్షితమైన ప్రత్యామ్నాయంగా పేర్కొంది. ఇది పండును సహజంగా పండేలా ప్రోత్సహిస్తుంది. ఇక్కడ ఇథిలిన్ వాయువుని గణనీయమైన పరిమాణంలోనే వినియోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇది పంట రకం, పరిపక్వత ఆధారంగా ఎంత మేర వినయోగించాలనేది నిర్ణయించడం జరుగుతుంది. చాలా వరకు సుమారు 100 పీపీఎంల వరకు వినియోగించేలా అనుమతి ఇచ్చింది ఎఫ్ఎస్ఎస్ఏఐ. దీన్ని ఎలా గుర్తించాలంటే..ఇక్కడ మామిడి పండ్లు కాల్షియం కార్బైడ్‌తో మామిడి పండ్లను పండించారా? లేదా సహజమైన రీతీలో పండాయా అనేది ఎలా గుర్తించాలంటే..అందుకు నాలుగు సింపుల్ చిట్కాల ఉన్నాయి. అవి ఫాలో అయిపోండి. అవేంటంటే..ఆకృతిని పరిశీలించటం: మామిడిపండ్లు అసహజంగా ఏకరీతిగా కనిపించి చుట్టూ ఈగలు, కీటకాలు లేకుంటే వాటికి ఘాటైన రసాయనాలను కలిపారని అర్థం. వాటర్ పరీక్ష: కృత్రిమంగా పండిన మామిడి పండ్లు నీటిపై తేలుతుంది. కాబట్టి కొనుగోలు చేసిన తర్వాత మామిడికాయలను ఒక బకెట్ నీటిలో ఉంచండి. అవి సేంద్రియంగా పండించారా లేదా అన్నది తెలిసిపోతుంది. టేస్టీని బట్టి: కృత్రిమంగా పండిన మామిడిపండ్లు సేంద్రీయ వాటితో పోల్చితే తక్కువ జ్యూసీ, తక్కువ బరువుని కలిగి ఉంటాయి. అగ్గిపుల్ల టెస్ట్: ఈ పరీక్ష అత్యంత భద్రతతో నిర్వహించాల్సి ఉంటుంది. అగ్గిపుల్లను వెలిగించి మామిడి పండ్ల దగ్గరకు తీసుకువస్తే..మంటలు లేదా మెరుపులో కూడిన మంట వెదజల్లిన కాల్షియం కార్బైడ్ వినియోగించి మాగబెట్టారని అర్థం. (చదవండి: హిమ శిఖరాల్లో పెళ్లి సందడి!..వణికించే చలిలో ఫోజులిస్తున్న జంట!) -
సీఫుడ్ ఇష్టంగా తినేస్తున్నారా? శాస్త్రవేత్తల స్ట్రాంగ్ వార్నింగ్!
సీఫుడ్స్ అంటే ఇష్టపడనివాళ్లు ఉండరు. వాటితో చేసిన వివిధరకాల రెసిపీలు చాలా రుచికరంగా ఉంటాయి. అదీగాక రెస్టారెంట్లలలో కూడా ఈ సీఫుడ్ వంటకాల ఖరీదు ఎక్కువే. అయినా కూడా ప్రజలు చాలా ఇష్టంగా లాగించేస్తుంటారు. ఇవి తీసుకోవడం వల్ల ఓమెగా 3 వంటి విటమిన్లు, పోషకాలు శరీరానికి అందుతాయి. అయితే ఇప్పుడున్న పారిశ్రామిక కాలుష్యం కారణంగా సీఫుడ్ ఆరోగ్యానికి అంత సేఫ్ కాదని శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. పైగా ఇది తినకపోవడమే మేలంటూ విస్తుపోయే విషయాలు చెప్పుకొచ్చారు. ఇంతకీ అధ్యయనాల్లో ఏం వెల్లడయ్యిందంటే.. యూకేలోని డార్ట్మౌత్ కళాశాల నిపుణులు పాదరసం వంటి ఇతర కలుషిత రసాయనాల దృష్ట్యా ప్రజలు సీఫుడ్ వినియోగంపై మార్గదర్శకాలు తీసుకోవాలని తెలిపారు. సముద్రాల్లో చమురు ఓడల క్రాష్ అవ్వడం లేదా మునిగిపోవడం, పారిశ్రామి రసాయనాలు వదలడం వంటి కారణంగా సీఫుడ్ వినియోగం ఎంత వరకు సురక్షితం అనే దిశగా పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు. దీని వల్ల లభించే విలమిన్లు, పోషకాలను పక్కనే పెడితే ప్రమాదకరమై పర్ పాలి ఫ్లోరో అల్కైల్స్ (పీఎఫ్ఏఎస్) వంటి విషపదార్థాల ప్రమాదానికి గురవ్వక తప్పదని హచ్చరిస్తున్నారు. వీటిని "ఫారెవర్ కెమికల్స్" అని కూడా పిలుస్తారు. అందువల్ల నిపుణులు సీఫుడ్ తీసుకోవద్దని సూచిస్తున్నారు. నిజానికి సీఫుడ్ లీన్ ప్రొటీన్లు, ఒమేగా ఫ్యాటీ యాసిడ్ల మూలం. కానీ కాలుష్యం కారణంగా సముద్ర జీవుల్లో మోతాదుకి మించి విషపదార్థులతో నిక్షిప్తమై ఉన్నాయి. అందువల్ల ఇవి మానవుని ఆరోగ్యానికి ఎంతమాత్రం సురక్షితం కాదని పరిశోధనలో తేలింది. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు, పిల్లలు వంటి వారికి ఈ సీఫుడ్ మరింత హానికరమని చెబుతోంది అధ్యయనం. నిపుణుల పరిశోధనలో సముద్ర జాతుల నమునాలో ఈ పీఎఫ్ఏఎస్కి సంబంధించిన 26 రకాల విషపూరిత రసాయనాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా కాడ్, హాడాక్, సాల్మన్, స్కాలోప్ వంటి చేపలు, పీతలు, రొయ్యల్లో ఇది ఎక్కువగా ఉన్నట్లు వెల్లడయ్యింది. ఆయా జీవుల్లో ఒక గ్రాము మాంసంలో దాదాపు 1.74 నుంచి 3.30 నానో గ్రాముల పీఎప్ఏఎస్ వంటి రసాయన సమ్మేళనాలు ఉన్నట్లు గుర్తించారు. కాల క్రమేణ పరిస్థితి ఇలా ఉంటే నెమ్మదిగా పర్యావరణ విచ్ఛిన్నమవుతుందని, అదిగాక ఈ పీఎఫ్ఏఎస్ పదార్థాలు పర్యావరణంలో వేల సంవత్సరాల అలానే ఉండిపోతాయని అందువల్ల ప్రజలకు, వన్యప్రాణుల మనుగడకు హానికరంగా మారుతుందని చెప్పారు. ఈ పీఎఫ్ఏఎస్ రసాయనాలు కారణంగా కేన్సర్, పిండ సంబంధిత సమస్యలు, అధిక కొలస్ట్రాల్, థైరాయిడ్, కాలేయం, పనరుత్పత్తి రుగ్మతలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. (చదవండి: 'ఖైమర్ అప్సర'గా భారత దౌత్యవేత్త!) -
జాగ్రత్త.. ఇన్వెస్టర్లకు సెబీ వార్నింగ్!
ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ (ఎఫ్‌పీఐ) విషయంలో అప్రమత్తంగా ఉండాలని క్యాపిటల్ మార్కెట్స్ నియంత్రణ సంస్థ సెబీ ఇన్వెస్టర్లను హెచ్చరించింది. ఎఫ్‌పీఐ మార్గం ద్వారా స్టాక్ మార్కెట్ యాక్సెస్‌ను సులభతరం చేస్తామంటూ మోసగిస్తున్న ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎఫ్‌పీఐలతో తమకు అనుబంధం ఉందని, ఎఫ్‌పీఐ లేదా సంస్థాగత ఖాతాల ద్వారా ట్రేడింగ్ అవకాశాలు కల్పిస్తామని కొన్ని మోసపూరిత ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఇన్వెస్టర్లను మభ్యపెడుతున్నాయని సెబీకి అనేక ఫిర్యాదులు అందాయి. దీంతో ఇన్వెస్టర్లను అప్రమత్తం చేస్తూ సెబీ ఈ హెచ్చరిక ప్రకటన విడుదల చేసింది. మోసగిస్తున్నారిలా.. స్టాక్ మార్కెట్లో ఆన్లైన్ ట్రేడింగ్ కోర్సులు, సెమినార్లు, మెంటర్షిప్ ప్రోగ్రామ్‌ల ద్వారా మోసగాళ్లు బాధితులను ప్రలోభపెడుతున్నారని, ఇందుకోసం వాట్సాప్ లేదా టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లతో పాటు లైవ్ బ్రాడ్క్యాస్ట్ను ఉపయోగిస్తున్నారని సెబీ పేర్కొంది. సెబీ నమోదిత ఎఫ్‌పీఐలకు చెందిన ఉద్యోగులు లేదా అనుబంధ సంస్థలుగా చెప్పుకొంటూ షేర్ల కొనుగోలు, ఐపీఓలకు సబ్స్క్రయిబ్ కోసం బాధితులతో యాప్‌లను డౌన్లోడ్ చేయిస్తున్నారని సెబీ తెలిపింది. ఇలాంటి మోసాలు చేయడానికి తప్పుడు పేర్లతో నమోదైన మొబైల్ నంబర్లను ఉపయోగిస్తాస్తున్నారని వెల్లడించింది. నిబంధనల ప్రకారం.. దేశంలో నివసిస్తున్న పౌరులకు ఎఫ్‌పీఐ పెట్టుబడి మార్గం అందుబాటులో ఉండదు. అయితే దీనికి కొన్ని పరిమిత మినహాయింపులు ఉంటాయి. -
పరిణామాలు తీవ్రంగా ఉంటాయి.. యాపిల్‌కు ఈయూ వార్నింగ్!
ప్రీమియం స్మార్ట్ఫోన్లు, ఉపకరణాలు తయారుచేసే ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం యాపిల్‌ను యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది. యాపిల్ యాప్‌స్టోర్‌లో చేస్తున్న మార్పులు యూరోపియన్ యూనియన్ తీసుకువచ్చే నిబంధనలకు అనుగుణంగా లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. యూరోపియన్ యూనియన్ తీసుకువస్తున్న డిజిటల్ మార్కెట్ల చట్టానికి (DMA) అనుగుణంగా యాపిల్.. సాఫ్ట్వేర్ డెవలపర్లు ప్రత్యామ్నాయ యాప్ స్టోర్ల ద్వారా యాపిల్ పరికరాలలో తమ అప్లికేషన్లను ఉంచడానికి అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. ఐఫోన్లలో యాప్‌స్టోర్ కాకుండా ప్రత్యామ్నాయ యాప్ స్టోర్లను అందించడానికి మార్చి ప్రారంభం నుంచి డెవలపర్లకు అవకాశం ఉంటుంది. యాపిల్ యాప్ స్టోర్‌లో ప్రస్తుతం డెవలపర్లు 30 శాతం వరకు కమీషన్ చెల్లించాల్సి ఉంది. ఈ సర్దుబాట్లు ఉన్నప్పటికీ యాపిల్ ఫీజు విధానం అన్యాయంగా ఉందని, ఇదిడిజిటల్ మార్కెట్ల చట్టాన్ని ఉల్లంఘించే అవకాశం ఉందని విమర్శకులు వాదిస్తున్నారు. యాపిల్ ప్రణాళికల గురించిన విచారణలకు ప్రతిస్పందిస్తూ ఈయూ ఇండస్ట్రీ చీఫ్ థియరీ బ్రెటన్.. ‘డిజిటల్ మార్కెట్లు సజావుగా.. బహిరంగంగా పోటీకి ఇంటర్నెట్ గేట్లను డిజిటల్ మార్కెట్ల చట్టం తెరుస్తుంది. మార్పు ఇప్పటికే జరుగుతోంది. మార్చి 7 నుంచి థర్డ్ పార్టీల అభిప్రాయంతో కంపెనీల ప్రతిపాదనలను అంచనా వేస్తాం" అని రాయిటర్స్‌తో అన్నారు. కంపెనీల ప్రతిపాదిత పరిష్కారాలు చట్టానికి అనుగుణంగా లేకపోతే తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి యూరోపియన్ యూనియన్ వెనుకాడదని బ్రెటన్ ఉద్ఘాటించారు. యాపిల్ యాప్‌స్టోర్ చెల్లింపు వ్యవస్థను ఉపయోగించకుండా డెవలపర్లకు ఎంపిక ఉన్నప్పటికీ ఒక యూజర్ అకౌంట్‌కు సంవత్సరానికి 50 యూరో సెంట్ల "కోర్ టెక్నాలజీ రుసుము" మాత్రం తప్పనిసరి. అయితే కొత్త వ్యాపార నిబంధనలను ఎంచుకున్న డెవలపర్లకు మాత్రమే ఈ రుసుము వర్తిస్తుందని యాపిల్ స్పష్టం చేసింది. -
సైనిక చర్యకు దిగుతాం.. హౌతీలకు అమెరికా వార్నింగ్
న్యూయార్క్: హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఓడలపై దాడులను నిలిపివేయాలని అమెరికా సహా 12 మిత్రదేశాలు పిలుపునిచ్చాయి. లేనిపక్షంలో సైనిక చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేశాయి. ఇదే చివరిసారి మరోసారి హెచ్చరికలు ఊహించకూడదని పేర్కొంటూ ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధానికి వ్యతిరేకంగా హౌతీ ఉగ్రవాదులు ఎర్ర సముద్రంలో డిసెంబర్ 19 నుంచి ఇప్పటివరకు 23 దాడులకు పాల్పడ్డారు. "చట్టవిరుద్ధమైన దాడులను తక్షణమే ముగించాలి. నిర్బంధించిన ఓడలు, సిబ్బందిని తక్షణమే విడుదల చేయాలని పిలుపునిస్తున్నాం. హౌతీలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే చర్యలకు పాల్పడుతున్నారు. జలమార్గాలలో వాణిజ్య ప్రయాణాలపై బెదిరింపులకు పాల్పడితే తర్వాత జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుంది." అని అమెరికా మిత్రదేశాలు హెచ్చరించాయి. ఎర్రసముద్రంలో ఓడలపై హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో అంతర్జాతీయ సహనం దెబ్బతింటుందని అమెరికా మిత్రదేశాలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. ఈ ప్రకటనపై అమెరికా, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, బెల్జియం, కెనడా, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, సింగపూర్, యునైటెడ్ కింగ్డమ్ సంతకాలు చేశాయి. ఇజ్రాయెల్‌పై అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదుల దాడితో యుద్ధం ప్రారంభం అయింది. హమాస్ ఉగ్రవాదులను అంతం చేసే దిశగా ఇజ్రాయెల్ ముందుకు వెళుతోంది. గాజాపై భీకర యుద్ధం చేస్తోంది. ఇప్పటివరకు జరిగిన యుద్ధంలో హమాస్ వైపు 22 వేలకు పైగా మంది మరణించారు. గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసిస్తూ యెమెన్ ఆధారిత హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో ఓడలపై దాడులు చేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు సంబంధం ఉన్న ప్రతి నౌకపై దాడి చేస్తున్నారు. ఇదీ చదవండి: 73కు చేరిన ‘జపాన్’ మరణాల సంఖ్య -
ఇజ్రాయెల్‌కు ఇరాన్ హెచ్చరికలు
టెహ్రాన్: గాజాపై ఇజ్రాయెల్ మారణహోమం అదుపు తప్పుతోందని ఇరాన్ హెచ్చరించింది. తక్షణమే ఆపకపోతే తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. హమాస్-నియంత్రిత గాజా భూభాగంలో ఇజ్రాయెల్ భూతల దాడులు చేస్తే ప్రతిస్పందించవలసి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి ఇరాన్ మిషన్ సోషల్ మీడియా పోస్టు ద్వారా తెలిపింది. 'గాజాపై ఇజ్రాయెల్ దాడులను తక్షణమే నిలిపివేయాలి. పరిస్థితి అదుపు తప్పుతోంది. ఈ రకమైన యుద్ధం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. దీని అంతాన్ని ఐక్యరాజ్య సమితి, సెక్యూరిటీ కౌన్సిల్ బాధ్యత తీసుకునే స్థాయికి వెళుతోంది.' అని ఇరాన్ స్పష్టం చేసింది. గాజా భూభాగంలో ఇరాన్ మద్దతుగల హమాస్‌పై భూదాడి చేయడానికి ఇజ్రాయెల్ శనివారం సిద్ధమైంది. అధిక జనసాంద్రత కలిగిన ఈ భూభాగంలో పాలస్తీనియన్లను గాజా దక్షిణం వైపు పారిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. హమాస్‌ను అంతం చేసే దిశగా ఇజ్రాయెల్ దళాలు అడుగులు వేస్తున్నాయి. ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్‌ను దాని నాయకత్వాన్ని నిర్మూలించడానికి ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం భూతల, వాయు, జల అన్ని మార్గాల్లో దాడులు చేయడానికి దళాలను సమన్వయం ఏర్పరిచింది. ఆకస్మిక దాడులతో విరుచుకుపడిన హమాస్‌ను నిర్మూలించడానికి భూతల దాడులను జరపనున్నట్లు తెలుస్తోంది. గాజాను రాజకీయంగా, సైనికంగా హమాస్ పాలించడానికి వీలు ఉండకూడదని ఇజ్రాయెల్ రక్షణ దళాల(ఐడీఎఫ్) ప్రతినిధి డానిల్ హాగరీ అన్నారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ హెచ్చరిలతో ఉత్తర గాజావాసులంతా ఇల్లూ వాకిలీ వీడి పొట్ట చేతపట్టుకుని వలసబాట పడుతున్నారు. వందలో, వేలో కాదు! అక్కడి 11 లక్షల మందిలో ఇప్పటికే 4 లక్షల మందికి పైగా వలస వెళ్లగా, ఇజ్రాయెల్ అతి త్వరలో పూర్తిస్థాయి భూతల దాడికి దిగనున్న నేపథ్యంలో మిగతావారూ అదే బాట పట్టారు. బెదిరింపులకు జడవద్దన్న హమాస్ పిలుపులను పట్టించుకుంటున్న దిక్కే లేదు. ఇదీ చదవండి: ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్.. భయానక పోరుకు ఇజ్రాయెల్ సిద్ధం -
ఇజ్రాయెల్ ‘హెచ్చరిక’ మరీ డేంజరస్
ఐక్యరాజ్య సమితి: పాలస్తీనాలోని ఉత్తర గాజాపై దాడుల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని 24 గంటల్లోగా వీడాలని అక్కడి పౌరులను ఇజ్రాయెల్ హెచ్చరించడాన్ని ఐక్యరాజ్యసమితి తీవ్రంగా తప్పుబట్టింది. న్యూయార్క్‌లో మీడియా సమావేశంలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ శనివారం మాట్లాడారు. ‘ పది లక్షల జనాభా ఉన్న ప్రాంతాన్ని కేవలం 24 గంటల వ్యవధిలో ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ ఆదేశించడం అత్యంత ప్రమాదకరం. అసలు ఇది అసంభవం. ఇలాంటి హెచ్చరికలు దారుణం. యుద్ధానికి కూడా కొన్ని కట్టుబాట్లు ఉంటాయని గుర్తుంచుకోవాలి’ అని గుటెరస్ వ్యాఖ్యానించారు. దాదాపు 11 లక్షల జనాభా ఉన్న ఉత్తర గాజాపై దాడులు చేస్తామని, ఆలోపు 24 గంటల్లో ఆ ప్రాంతాన్ని ఖాళీచేసి దక్షిణ గాజా వైపుగా స్థానికులు తరలిపోవాలని ఇజ్రాయెల్ వైమానిక దళం హెచ్చరించడం తెల్సిందే. జనావాసాలు మాత్రమేకాదు ఉత్తర గాజాలోని పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, చికిత్స కేంద్రాలు, ఐరాస శిబిరాలకూ ఇదే అలి్టమేటమ్ వర్తిస్తుంది. అందరూ ఉత్తర గాజా వైపు వస్తే ఆరోగ్య సంక్షోభం తలెత్తడం ఖాయం. యుద్ధవాతావరణంలో ఇంతటి భారీ వలసలు క్షేమం కాదు. ఆరోగ్య కేంద్రాలపై జరిగిన 34 దాడి ఘటనల్లో 11 మంది ఆరోగ్యసిబ్బంది సైతం ప్రాణాలు కోల్పోయారు. గాజాలో ఇంధనం, ఆహారం, తాగునీరు అవసరాలు తీర్చాల్సి ఉంది’ అని ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే నాలుగు లక్షలకుపైగా వలసలు ఇజ్రాయెల్ దాడులతో 7వ తేదీæ నుంచి ఇప్పటిదాకా 4,23,000కుపైగా స్వస్థలాలను వదిలిపోయారని ఐరాస రిలీఫ్, రెఫ్యూజీ విభాగం తెలిపింది. వీరిలో 2,70,000కుపైగా ఐరాస శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. గాజాలో ప్రస్తుతం 50,000 మంది గర్భిణులు ఉన్నారు. యుద్ధం నేపథ్యంలో వీరికి అత్యవసర ఆరోగ్య సేవలు కరువయ్యాయి. ఆస్పత్రులపైనా రాకెట్ దాడులు జరుగుతుండటంతో రాబోయే రోజుల్లో ఆరోగ్య పరిస్థితి మరింత అధ్వానంగా ఉండనుందని తెలుస్తోంది. -
‘మహాదేవ్’ కేసు: సెలబ్రిటీలకు కంగనా రనౌత్ హెచ్చరిక!
దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారంలో బాలీవుడ్ ప్రముఖ నటులకు భాగస్వామ్యం ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. రణబీర్ కపూర్, హుమా ఖురేషి, హాస్యనటుడు కపిల్ శర్మతో సహా మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసుతో ముడిపడి ఉన్న బాలీవుడ్ ప్రముఖులందరిపైనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నిఘా పెట్టింది. ఇదిలా ఉండగా నటి కంగనా రనౌత్ తనను కూడా మహాదేవ్ యాప్ ప్రమోటర్లు చాలాసార్లు సంప్రదించారని, కానీ తాను తిరస్కరించినట్లు తాజాగా పేర్కొన్నారు. "ఈ ఎండార్స్మెంట్ ఒక సంవత్సరం వ్యవధిలో దాదాపు ఆరు సార్లు నాకు వచ్చింది. ప్రతిసారీ అనేక రూ.కోట్లు ఆఫర్ చేశారు. కానీ నేను ప్రతిసారీ నో చెప్పాను. ఇది నయా భారత్, దీనికి అనుగుణంగా మనల్ని మనం మెరుగుపరుచుకోవాలి. లేకుంటే బలవంతంగానైనా మెరుగుపడాల్సి వస్తుంది" అని కంగనా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఈడీ స్కానర్‌లో ఉన్న ప్రముఖుల గురించిన కథనం స్క్రీన్‌షాట్‌ను షేర్ చేస్తూ రాసుకొచ్చారు. బెట్టింగ్ కేసులో పేరు బయటకు వచ్చిన నటీనటుల్లో కొందరు మహాదేవ్ యాప్‌ను ప్రమోట్ చేయగా, మరికొందరు విదేశాలలో జరిగిన యాప్ ప్రమోటర్ వివాహంలో ప్రదర్శనలు ఇచ్చినట్లు సమాచారం. ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్ ఫిబ్రవరిలో రస్ అల్-ఖైమాలో వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకలో కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులను తీసుకెళ్లేందుకు ప్రైవేట్ జెట్లను అద్దెకు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. -
సీఎం జగన్ సంక్షలో పవన్ కు వార్నింగ్
-
డేంజర్లో ఢిల్లీ.. కేజ్రీవాల్ కీలక ప్రకటన..
ఢిల్లీ: యమునా నది ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. బుధవారం రికార్డ్ స్థాయిని దాటిందని అధికారులు తెలిపారు. ఈ రోజు ఉదయం 4 గంటల సమయంలో యమునా నది ఢిల్లీ ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ వద్ద 207 మీటర్ల మేర ప్రవహించింది. అదే.. సాయంత్రం 4 గంటలకు వచ్చేసరిగా మరో 0.71 పెరిగి 207.71గా నమోదైందని సెంట్రల్ వాటర్ కమీషన్(సీడబ్ల్యూసీ) తెలిపింది. దీంతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు త్వరగా ఖాలీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏ మాత్రం వేచి చూడరాదని తెలిపారు. నది ప్రవాహాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. హర్యానాలోని హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని పరిమిత స్థాయిలో విడుదల చేయాలని కేంద్ర హూం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. Arvind Kejriwal's SOS To Centre As Yamuna Flows At All-Time High https://t.co/sUT5bOloRM pic.twitter.com/YNjWK8z8lp — NDTV News feed (@ndtvfeed) July 12, 2023 యమునా నది బుధవారం రికార్డ్ స్థాయిని దాటిందని అధికారులు తెలిపారు. 1978 నాటి 207.49 మీటర్లను దాటింది. దీంతో సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు త్వరగా ఖాలీ చేయాలని కోరారు. యమునా నది ఉప్పొంగడంతో పరివాహక ప్రాంతానికి దగ్గరగా ఉన్న వేల మందిని ఇప్పటికే పునరావాస ప్రాంతాల్లోకి తరలించామని తెలిపారు. నదీ సమీప ప్రాంతాల్లో రాకపోకలపై అధికారులు నిషేధాజ్ఞాలు జారీ చేశారు. "Beds Stacked Vertically": Desperation Kicks In As Water Enters Delhi Houses@Priyanshi50 reports pic.twitter.com/0VxpYdjZMg — NDTV (@ndtv) July 12, 2023 'దేశ రాజధానికి వరద సూచన ప్రపంచ దేశాలకు సరైన మెసేజ్‌ను ఇవ్వదు. ఢిల్లీ ప్రజలను కలిసి కాపాడదాం. ఈ రోజు రాత్రికి యమున నది 207.72కు చేరే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ తెలిపింది.' త్వరలో ఢిల్లీలో జీ-20 సమావేశం జరగనున్న నేపథ్యంలో యుమునా వరదను త్వరగా తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కేజ్రీవాల్ కోరారు. Central Water Commission predicts 207.72 meter water level in Yamuna tonite. Not good news for Delhi. There have been no rains in Delhi last 2 days, however, levels of Yamuna are rising due to abnormally high volumes of water being released by Haryana at Hathnikund barrage.… pic.twitter.com/3D0SI2eYUm — Arvind Kejriwal (@ArvindKejriwal) July 12, 2023 గత రెండు రోజులుగా ఢిల్లీలో వర్షం రాకపోయినా యమునా నది వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. ఢిల్లీకి పైన ఉన్న హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరఖండ్‌లో వర్షాల కారణంగా వరద యమునకు పోటెత్తుతోంది. ఢిల్లీ పైన ఉన్న హర్యానాలోని హత్నీకుండ్ డ్యామ్ నుంచి నీటిని అధికంగా విడుదల చేయడం వల్ల యుమున నది ప్రవాహం పెరుగుతోంది. దీనిపై ఆందోళన వ్యక్తం చేసిన కేజ్రీవాల్.. ఆ డ్యామ్ నుంచి పరిమితంగా నీటిని విడుదల చేయాలని కేంద్రాన్ని కోరారు. #WATCH | Water level of river Yamuna continues to rise in Delhi. Visuals from Old Railway Bridge. Today at 8 am, water level of the river was recorded at 207.25 metres at the Bridge, inching closer to the highest flood level - 207.49 metres. The river is flowing above the… pic.twitter.com/e46LLHdeVe — ANI (@ANI) July 12, 2023 యమునా నది కరకట్టలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం సరైన చర్యలను తీసుకుంటోందని ఢిల్లీ రెవెన్యూ మంత్రి అతిషి తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించామని వెల్లడించారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలాలని ఢిల్లీ విపత్తు నిర్వహణ శాఖ కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే.. ప్రభుత్వాలు హామీలు ఇవ్వడం తప్పా క్షేత్ర స్థాయిలో చేసిందేమీ లేదని ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు. Mathura, Uttarakhand | The water level of the Yamuna River is increasing due to rain. All the police stations along the banks of the river have been instructed to increase vigilance in the area. Coordination is also being established with other agencies so that if there is… pic.twitter.com/lHHAVVTn6f — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 11, 2023 ఇదీ చదవండి: Yamuna Rivar: డేంజర్ మార్క్ దాటి మహోగ్రంగా ప్రవహిస్తున్న యమునా.. ఢిల్లీ హై అలర్ట్.. -
కోహ్లీని లైట్ తీసుకుంటే ఆసీస్ అవుట్..!
-
WHO: మరో మహమ్మారి పొంచి ఉంది, సిద్ధంగా ఉండండి
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అధిపతి టెడ్రోస్ అధనామ్ ఓ కీలక ప్రకటన చేశారు. కోవిడ్-19 కంటే ప్రాణాంతకమైన మరో మహమ్మారి పొంచి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రపంచం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. కోవిడ్-19 ముగిసిందంటే ప్రపంచానికి ఆరోగ్య ముప్పు తొలగినట్టు కాదని టెడ్రోస్ చెప్పారు. 76వ ప్రపంచ ఆరోగ్య సభలో డబ్ల్యూహెచ్ఓ చీఫ్ ఈ విషయాన్ని వెల్లడించారు. వాస్తవానికి ఆ మహమ్మారి వ్యాప్తి చెందుతూ.. తొలుత ప్రాణాంతకంగా మారిన తదనంతరం తన ఉనికిని వివిధ వేరియంట్లగా మార్చుకుంటూ మనం ఎదుర్కునే తీవ్రత గల ముప్పుగా పరిణిమించడం నెమ్మదించిందన్నారు. అయినప్పటికీ ఇది మనకు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా..సాధ్యమైనంత త్వరగా ప్రతిస్పందించేలా ప్రభావవంతమైన ప్రపంచ యంత్రాగాల అవసరాన్ని గురించి నొక్కి చెప్పిందన్నారు. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్(ఎస్డీజీలు) కింద ఆరోగ్య సంబంధిత లక్ష్యాలు 2030ని మరింతగా అమలు చేయాల్సిన ప్రాముఖ్యతను ఈ కోవిడ్ 19 మహమ్మారి తెలియజెప్పిందన్నారు టెడ్రోస్. ఈ మహమ్మారి 2017 ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీని ప్రకటించిన ట్రిపుల్ బిలయన్ లక్ష్యాల పురోగతిని కూడా ప్రభావితం చేసిందన్నారు. ఒకరకంగా ఈ మహమ్మారి మనల్ని ఘోరంగా దెబ్బతీసి.. సస్టెనబుల్ డెవలప్మెంట్ గోల్స్(ఎస్డీజీ)ని నిర్వీర్యం చేసినప్పటికీ ఇలాంటి మహమ్మారీలను ఎదుర్కొనే అవశ్యకత తోపాటు భవిష్యత్తులో వీటి పట్ల ఎలా సన్నద్ధంగా ఉండాలో మనకు ఒక పాఠం నేర్పిందన్నారు డబ్ల్యూహెచ్ చీఫ్ టెడ్రోస్. (చదవండి: అలాంటివి మేము అంగీకరించం.. చర్యలు తీసుకుంటాం! భారత్‌కి హామీ) -
ఈ పెట్టుబడి పథకాలతో జాగ్రత్త: ఇన్వెస్టర్లకు కీలక హెచ్చరిక
న్యూఢిల్లీ: కచ్చితమైన రాబడులు ఇస్తామంటూ ముగ్గురు వ్యక్తులు ఆఫర్ చేస్తున్న పెట్టుబడి పథకాల్లో ఇన్వెస్ట్ చేయ వద్దంటూ పెట్టుబడిదారులకు ఎన్ఎస్ఈ హెచ్చరిక జారీ చేసింది. వీణ, అంకితా మిశ్రా, విషాల్ అనే వ్యక్తులు ఈ తరహా పెట్టుబడి పథకాలను ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ((2023-24లో రుణ వృద్ధి 10 శాతమే: నోమురా అంచనా) (ఇదీ చదవండి: బేబీ షవర్: ఉపాసన పింక్ డ్రెస్ బ్రాండ్, ధర ఎంతో తెలుసా?) వీరు ఎన్ఎస్ఈ వద్ద సభ్యులుగా లేదా అధికారిక వ్యక్తులుగా నమోదు చేసుకోలేదని ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది. ఇన్వెస్టర్లు తమ ట్రేడింగ్ ఖాతా వివరాలు (యూజర్ ఐడీ, పాస్వర్డ్) వీరితో పంచుకోవద్దని కోరింది. స్టాక్ మార్కెట్లో కచ్చితమైన రాబడులు అంటూ వీరు ఆఫర్ చేసే ఎలాంటి పథకం అయినా, ఉత్పత్తిలో, సంస్థలో ఇన్వెస్ట్ చేయవద్దని సూచించింది. ఒకవేళ పెట్టుబడులు పెడితే అది ఇన్వెస్టర్లు స్వీయ రిస్క్ తీసుకున్నట్టుగా పరిగణించాలని కోరింది. ఈ విషయంలో ఎన్ఎస్ఈకి ఎలాంటి బాధ్యత ఉండదని స్పష్టం చేసింది. (శ్యామ్ స్టీల్ బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ.. తెలుగు రాష్టాల్లో మరింత విస్తరణ) -
ఇంత జరిగినా అదే పాట! ట్రంపా.. మజాకా!
శృంగార తారకు డబ్బు చెల్లింపుల కేసు విషయమై మాన్హాటన్ కోర్టులో డొనాల్డ్ ట్రంప్ హాజరైన సంగతి తెలిసిందే. దీంతో ట్రంప్ క్రిమినల్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న తొలి అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా నిలిచారు. విచారణ తదనతరం ట్రంప్ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా మళ్లీ అదే పాట పాడటం ప్రారంభించారు. ఈ మేరకు ట్రంప్ మాట్లాడుతూ.. అణ్వాయుధాల వినియోగంపై దేశాలన్ని బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నాయన్నారు. తన పరిపాలనలో ఇలా ఎప్పుడూ జరగలేదు, ఆ చర్చ కూడా రాలేదని అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన పూర్తిగా మూడో ప్రపంచ అణు యుద్ధానికి దారి తీస్తుందని, అది ఎంతో దూరంలో లేదు నన్ను నమ్మండి అంటూ హెచ్చరించారు. ప్రస్తుతం అమెరికా చాలా గందరగోళ స్థితిలో ఉందన్నారు. మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతోంది, ద్రవ్యోల్బణం అదుపుతప్పింది, రష్యాతో చైనా జత కట్టింది.. అంటూ తనదైన శైలిలో బైడెన్ పాలనపై విరచుకుపడ్డారు. అలాగే చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా కలిసి భయంకరమైన విధ్వంసక కూటమిగా ఏర్పడ్డాయని, ఇలా తన నాయకత్వంలో జరగలేదని చెప్పారు. అలాగే మన కరెన్సీ ప్రపంచ ప్రమాణంగా ఇక మీదట ఉండకపోవచ్చని, 200 ఏళ్ల అమెరికా చరిత్రలో ఎదుర్కోని గొప్ప ఒటమి అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. అమెరికాని పాలించిన ఐదుగురు చెత్త అధ్యక్షుల గురించి ప్రస్తావిస్తే అందులో బైడెన్ పాలన అమెరికాను నాశనం చేసినంతగా మరెవరూ చేయలేదంటూ ఆరోపణలు చేశారు. కాగా, గతంలో ఉక్రెయిన్ యుద్ధం విషయంలో కూడా ఇలానే వ్యాఖ్యలు చేశారు ట్రంప్. తాను అధ్యక్షుడిగా ఉంటే ఒక్కరోజులో యుద్ధాన్ని ఆపేసేవాడినంటూ అందర్నీ షాక్‌కి గురిచేసేలా వ్యాఖ్యలు చేశారు. చదవండి: సినిమాని తలపించే సీన్..ప్రియురాలి కోసం ఏకంగా 21 గంటలు..) -
ఐఫోన్ 14 కొనుగోలు చేశారా? తాజా వార్నింగ్ ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ: యాపిల్ లేటెస్ట్ ఐఫోన్ 14 కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు సంస్థ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్ 14 మోడల్స్ (ఐఫోన్ 14 ప్రొ,ప్రో మ్యాక్స్) కొనుగోలు చేసిన వినియోగదారులకు మరికొంత కాలం వేచి ఉండాల్సి వస్తుందనే హెచ్చరికలను జారీచేసింది. కరోనా కారణంగా తమ వినియోగదారులకు ఐఫోన్ 14 డెలివరీ అనుకున్న దానికంటే ఆలస్యం కానుందని యాపిల్ తెలిపింది. ఇటీవల కోవిడ్ మళ్లీ విజృంభిస్తుండటం, ఆంక్షలతో ఉత్పత్తి ఆలస్యమవుతోందని వెల్లడించింది. చైనాలోని జెంగ్జౌలో కరోనా ఆంక్షలు అసెంబ్లింగ్ ప్లాంట్‌ను తాత్కాలింగా ప్రభావితం చేశాయని, ప్రస్తుతం చాలా తక్కువ సామర్థ్యంతో పనిచేస్తోందని వెల్లడించింది. అలాగే సప్లయ్ చెయిన్ కార్మికుల ఆరోగ్యం, భద్రకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఫలితంగా షిప్‌మెంట్స్ లేట్ అవుతున్నాయని తాజా ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లకు ఎక్కువ డిమాండ్ ఉందని తెలిపింది. (ఐఫోన్ లవర్స్‌కు గుడ్ న్యూస్: రూ.40 వేల భారీ డిస్కౌంట్) చైనాలో రానున్న ఇయర్ ఎండ్ హాలిడే సీజన్‌కు ముందు చాలావరకు ఎలక్ట్రానిక్స్ తయారీదారులు బిజీగా ఉంటారు. కానీ ఇదే సమయంలో కరోనా ఆంక్షలు అక్కడి ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపనుందని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. సుమారు 2 లక్షలమంది ఉద్యోగులు పనిచేసే సెంట్రల్ చైనాలోని జెంగ్జౌ యాపిల్‌కు ఎంతో కీలకమైన ప్లాంట్‌లో తీవ్రమైన కోవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. చైనాలో కోవిడ్ నియంత్రణల కఠినతరంతో వచ్చే నెలలో ప్రపంచంలోని అతిపెద్ద ప్లాంట్‌లో ఐఫోన్ల ఉత్పత్తి 30శాతం క్షీణించనుందని రాయిటర్స్ గత నెలలో నివేదించింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ట్రెండ్‌ఫోర్స్ గత వారం జెంగ్జౌ ప్లాంట్‌లో సమస్యల కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో ఐఫోన్ షిప్మెంట్ల అంచనాను 80 మిలియన్ల నుండి 2-3 మిలియన్ యూనిట్లకు తగ్గించడం గమనార్హం. మరోవైపు అతిపెద్ద ఐఫోన్ తయారీదారు తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్, కరోనా నియంత్రణలతో దెబ్బతిన్న జెంగ్జౌ ప్లాంట్‌లో పూర్తి ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడానికి కృషి చేస్తున్నట్లు సోమవారం తెలిపింది. -
తప్పుడు ప్రకటనలిస్తే...ఎడ్టెక్ కంపెనీలకు స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: తప్పుదారి పట్టించే ప్రకటనలు తదితర అక్రమ వ్యాపార విధానాలను అవలంబిస్తున్న ఎడ్టెక్ కంపెనీలకు ప్రభుత్వం తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. పరిశ్రమలో ప్రధాన సంస్థలు స్వీయ నియంత్రణలు పాటించని పక్షంలో కఠిన మార్గదర్శకాలను తీసుకురావలసి ఉంటుందని హెచ్చరించింది. ఎడ్టెక్ విభాగంలో నకిలీ రివ్యూలు పెరగడంతో వీటిని అరికట్టేందుకున్న అవకాశాలపై వినియోగ వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఒక సమావేశంలో చర్చించారు. ఇండియా ఎడ్టెక్ కన్సార్షియం(ఐఈసీ), తదితర పరిశ్రమ సంబంధ సంస్థలతో రోహిత్ కుమార్ చర్చలు నిర్వహించారు. దేశీ ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్(ఐఏఎంఏఐ) ఆధ్వర్యంలో ఐఈసీ నడుస్తోంది. ఈ సమావేశానికి ఐఈసీ సభ్యులతోపాటు ఐఏఎంఏఐ ప్రతినిధులు హాజరయ్యారు. ఈ జాబితాలో అప్‌గ్రేడ్, అన్అకాడమీ, వేదాంతు, గ్రేట్ లెర్నింగ్, వైట్‌హ్యాట్ జూనియర్, సన్‌స్టోన్ తదితరాలున్నాయి. -
రాజకీయ ప్రత్యర్థులకు ఉరిశిక్ష ... వార్నింగ్ ఇచ్చిన యూఎన్
Myanmar Junta Executions' Plan: మయన్మార్ జుంటా ప్రభుత్వం ఆంగ్ సాన్ సూకీ పార్టీకి చెందిన మాజీ శాసనసభ్యుడు, ఒక ప్రజాస్వామ్య కార్యకర్తని ఉరితీస్తామని ప్రకటించింది. ఇద్దరూ తీవ్రవాదానికి పాల్పడ్డారని, అందువలన మరణశిక్ష విధిస్తున్నట్లు తెలిపింది. అదీగాక 1991 తర్వాత దేశంలో తొలిసారిగా న్యాయపరమైన ఉరిశిక్ష విధించిబడుతుందని పేర్కొంది. ఈ మేరకు మాజీ ఎంపీ ఫియో జెయా థా, ప్రజాస్వామ్య కార్యకర్త కో జిమ్మీతో సహా నలుగురికి మరణశిక్ష విధించినట్లు జుంటా ప్రతినిధి జా మిన్ తున్ తెలిపారు. పైగా వారిని జైలు విధానాల ప్రకారం ఉరితీస్తామని వెల్లడించారు. ఐతే ఈ కేసును మయన్మార్ తరుపున యూఎన్ విచారణా యంత్రాంగానికి అధిపతి అయిన నికోలస్ కౌమ్జియాన్ దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ చట్టం ప్రకారం, విచారణలో దోషులుగా నిర్ధారించబడిన వ్యక్తుల ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడ్డాయని తెలుస్తోందన్నారు. రాజకీయ ప్రత్యర్థులను ఉరితీయడం అనేది యుద్ధ నేరం లేదా మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలతో సమానం అని ఆయన హెచ్చరించారు. గతేడాది అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత మయన్మార్ జుంటా ప్రభుత్వం అణిచివేతలో భాగంగా డజన్ల కొద్దీ తిరుగుబాటు వ్యతిరేక కార్యకర్తలకు మరణశిక్ష విధించింది. అయితే మయన్మార్ దశాబ్దాలుగా ఉరిని అమలు చేయలేదు. విచారణ న్యాయమైనదిగా పరిగణించబడాలంటే, సాధ్యమైనంత వరకు ఈ కేసుని బహిరంగంగా దర్యాప్తు చేయాలని యూఎన్ విచారణాధికారి కౌమ్జియాన్ అన్నారు. కానీ ఈ కేసులో పబ్లిక్ ప్రోసీడింగ్లు లేదా తీర్పులు బహిరంగంగా అందుబాటులో లేవు. ఇక్కడ ట్రిబ్యునల్ నిష్పక్షపాతంగా వ్యవహరించిందా లేదా అనే సందేహాన్ని రేకెత్తించిందన్నారు. మయన్మార్ కోసమే ఈ యూఎన్ విచారణా యంత్రాంగం 2018లో యూఎన్ మానవ హక్కుల మండలిచే రూపొందించబడింది. మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సాక్ష్యాలను సేకరించడం, క్రిమినల్ ప్రొసీడింగ్‌లను సులభతరం చేసేలా డాక్యుమెంట్ చేయడం దీని పని. (చదవండి: ఉక్రెయిన్ చిన్నారుల కోసం.. నోబెల్ బహుమతిని వేలానికి పెట్టిన రష్యాన్ జర్నలిస్ట్) -
Sakshi Cartoon: ప్రపంచాన్ని కూడా ఖతం చేద్దామనుకుంటున్నారా సార్!
ఈ మూడేండ్లలో ప్రపంచాన్ని కూడా ఖతం చేద్దామనుకుంటున్నారా ఏంటీ సార్! -
తస్మాత్ జాగ్రత్త!
మాస్కో: తమను బెదిరించాలనుకునేవాళ్లు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ శత్రుదేశాలకు వార్నింగ్ ఇచ్చారు. సర్మాత్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను రష్యా విజయవంతంగా పరీక్షించిందని బుధవారం ఆయన ప్రకటించారు. ఈ క్షిపణులకు ఎదురులేదని చెప్పారు. ప్రస్తుతం రష్యా అమ్ములపొదిలో ఉన్న కింజల్, అవాంగార్డ్ క్షిపణులకు సర్మాత్ తోడవనుంది. గతనెల తొలిసారి రష్యా కింజల్ క్షిపణులను ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. సర్మాత్ విజయవంతంపై సైంటిస్టులను పుతిన్ అభినందించారు. ఉత్తరరష్యాలో వీటిని ప్రయోగించామని, విజయవంతంగా ఈ క్షిపణి లక్ష్యాన్ని ఛేదించిందని రష్యా రక్షణ శాఖ తెలిపింది. ప్రపంచంలోని సుదూర తీరాలు కూడా ఈ క్షిపణి పరిధిలోకి వస్తాయని వెల్లడించింది. వీటిని నిఘా వ్యవస్థలు కనిపెట్టడం కూడా కష్టమని నిపుణులు తెలిపారు. 200 టన్నులుండే ఈ మిసైల్ భూమి మీద ఏ లక్ష్యాన్నైనా చేరగలదని పుతిన్ ధీమా వ్యక్తం చేశారు. డోన్బాస్లో సాధారణ జనజీవనం నెలకొనేవరకు తమ ప్రయత్నాలు ఆపమని చెప్పారు. మరోవైపు తమ డిమాండ్ల ముసాయిదా ప్రతిపాదనను చర్చల్లో భాగంగా ఉక్రెయిన్‌కు అందించామని రష్యా అధికారులు తెలిపారు. ఇకపై చర్చలు కొనసాగలంటే ఉక్రెయిన్ స్పందించాల్సిఉందన్నారు. చర్చల జాప్యానికి ఉక్రెయినే కారణమని విమర్శించారు. మారియుపోల్‌పై ఫోకస్ కొద్దిమంది ఉక్రెయిన్ సేనలు ప్రతిఘటిస్తున్న మారియుపోల్‌పై రష్యా మరింత ఒత్తిడి పెంచింది. దీంతో పాటు డోన్బాస్లో పలు ప్రాంతాల్లో యుద్ధ తీవ్రతను పెంచింది. మారియుపోల్‌లో ఉక్రెయిన్ సైనికులు తలదాచుకున్న స్టీల్‌ప్లాంట్‌పై రష్యా తీవ్రమైన బాంబింగ్ జరిపినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. స్టీల్మిల్ను తదనంతరం నగరాన్ని స్వాధీనం చేసుకోవడంపైనే రష్యా దృష్టి పెట్టిందన్నారు. నగరం నుంచి పౌరుల తరలింపునకు ప్రాథమిక అంగీకారానికి వచ్చామని ఉక్రెయిన్ ఉప ప్రధాని చెప్పారు. అయితే దీనిపై రష్యా స్పందించలేదు. స్టీల్‌ప్లాంట్‌లో సైనికులు సరెండర్ అవ్వాలని మాత్రం మరోమారు అల్టిమేటం జారీచేసింది. ఈ నేపథ్యంలో నగరవాసులు వీలైనంత త్వరగా నగరం వీడాలని మేయర్ విజ్ఞప్తి చేశారు. తమపై రష్యా అన్ని రకాలుగా పోరు చేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. తమను లొంగదీçసుకునేందుకు పౌర ఆవాసాలపై కూడా దాడులు చేస్తోందన్నారు. మారియుపోల్, డోన్బాస్ స్వాధీనానికి రష్యా వేలమందిని రంగంలోకి దించిందని పాశ్చాత్య దేశాలు తెలిపాయి. ఉక్రెయిన్‌కు సహాయాన్ని మరింత పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇందులో భాగంగా ఉక్రెయిన్‌కు నార్వే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను పంపింది. హెవీ ఆర్టిలరీని పంపుతామని కెనెడా ప్రకటించింది. ► డోన్బాస్ రక్షణకు సైనికులను తరలించకుండా అడ్డుకునేందుకు ఉక్రెయిన్ నగరాలన్నింటిపై దాడులు ముమ్మరం చేసిందని బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది. ► ఉక్రెయిన్‌లో శాంతిస్థాపన చర్చలపై చర్చించేదుకు ఉక్రెయిన్, రష్యాల్లో పర్యటిస్తానంటూ ఆయా దేశాధినేతలకు ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరస్ లేఖలు రాశారు. ► ఉక్రెయిన్‌కు మరో ప్యాకేజీ ప్రకటిస్తామని అమెరికా తెలిపింది. పలువురు ప్రపంచ నాయకులతో అధ్యక్షుడు బైడెన్ మాట్లాడారు. ► చెర్నోబిల్‌లో రష్యా సైనికులు ఇష్టారీతిన ప్రవర్తించడంతో అణులీకేజి ముప్పు పెరిగిందని ఉక్రెయిన్ ఆరోపించింది. రేడియేషన్ స్థాయిలను కొలిచే పరికరాలను రష్యా సైనికులు దొంగిలించారని తెలిపింది. ► ఉక్రెయిన్ సంక్షోభంతో 50 లక్షలకు పైగా శరణార్థులయ్యారని ఐరాస అంచనా వేసింది. ► రష్యా, బెలారస్ క్రీడాకారులను వింబుల్డన్‌లో నిషేధిస్తున్నట్లు ఆల్ ఇంగ్లండ్ క్లబ్ ప్రకటించింది. ► రష్యాకు మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదాను రద్దు చేస్తున్నట్లు జపాన్ ప్రకటించింది. -
గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ యూజర్లకు అలర్ట్..! కేంద్రం హెచ్చరికలు..!
కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ పరిధిలోకి వచ్చే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) గూగుల్ క్రోమ్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్ యూజర్లకు హెచ్చరికలను జారీ చేసింది. ఈ బ్రౌజర్స్‌లో లోపాలున్నట్లుగా గుర్తించింది. గూగుల్ క్రోమ్‌లో లోపాలు..! గూగుల్ క్రోమ్ 99.0.4844.74 వెర్షన్ కంటే ముందు బ్రౌజర్‌ను వాడుతున్నవారికి తీవ్ర ప్రమాదంలో ఉన్నట్లు సెర్ట్-ఇన్ హెచ్చరికలను జారీ చేసింది. దీంతో గూగుల్ క్రోమ్ బ్రౌజర్స్‌ను వాడే యూజర్ల డేటాను హ్యకర్లు సులువుగా అపరేట్ చేసే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాకుండా ఆయా యూజర్ల సున్నితమైన సమాచారాన్ని సులువుగా యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తాయని సెర్ట్-ఇన్ హెచ్చరించింది. సెర్ట్-ఇన్ హెచ్చరికల ప్రకారం... బ్లింక్ లేఅవుట్, ఎక్స్టెన్షన్స్, సేఫ్ బ్రౌజింగ్, స్ప్లిట్‌స్క్రీన్, ఆంగిల్, న్యూ ట్యాబ్ పేజీ, బ్రౌజర్ UI, GPUలో హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో వంటి లోపాలున్నట్లు పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ గూగుల్ క్రోమ్‌తో పాటు, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ బ్రౌజర్లో కూడా భద్రతా లోపాలున్నట్లు CERT-In నివేదించింది. యాంగిల్ ఇన్ హీప్ బఫర్ ఓవర్‌ఫ్లో, కాస్ట్ యూఐ ఇన్ ఫ్రీ యూజ్, ఓమ్నిబాక్స్ ఫ్రీ యూజ్‌వంటి లోపాల కారణంగా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వాడే యూజర్ల డేటాను హ్యకర్లు సులువుగా పొందే అవకాశం ఉందని సెర్ట్-ఇన్ పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ యూజర్లు వెంటనే తమ బ్రౌజర్‌ను అప్డేట్ చేసుకోవాలని సెర్ట్ ఇన్ సూచించింది. కొద్ది రోజుల క్రితమే యాపిల్ ఉత్పత్తులపై కూడా కేంద్రం తీవ్ర హెచ్చరికలను జారీ చేసింది. చదవండి: పెను ప్రమాదంలో ఐఫోన్, యాపిల్ ఉత్పత్తులు..! హెచ్చరికలను జారీ చేసిన కేంద్రం..! -
అలా చేస్తే పెను ముప్పే..! తీవ్రంగా హెచ్చరించిన ఆపిల్..!
అమెరికా, ఇతర దేశాల్లో గూగుల్, ఆపిల్ వంటి టెక్ కంపెనీలు గూత్తాధిపత్యాన్ని తగ్గించేలా ఆయా దేశాలు పలు కఠిన చట్టాలను తెస్తున్నాయి. యూరోపియన్ దేశాలు(ఈయూ) దిగ్గజ టెక్ కంపెనీలపై తీవ్రంగా వ్యవహరిస్తున్నాయి. టెక్ దిగ్గజ కంపెనీలను నియంత్రించేందుకు ఇప్పటికే పలు చట్టాలను తీసుకువచ్చాయి. కాగా ఈ చట్టాలను ఆపిల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. చదవండి: ప్రపంచ దేశాల అప్పు ఎంతో తెలిస్తే షాకే...! అలా చేస్తే పెనుముప్పే...! టెక్ దిగ్గజ కంపెనీలను నియంత్రణలో భాగంగా ఈయూ దేశాలు ఆపిల్ ప్లే స్టోర్‌పై భారీ షరతులను పెట్టాయి.ప్లే స్టోర్ యాప్స్‌లో ఇతర సైడ్ లోడింగ్ యాప్స్(థర్డ్‌పార్టీ యాప్స్)కు వీలు కల్పిస్తూ ఈయూ చట్టం చేసింది. దీనిపై ఆపిల్ ఈయూ దేశాలను తీవ్రంగా వ్యతిరేకించింది. థర్డ్‌పార్టీ యాప్స్‌ను ప్లే స్టోర్‌లోకి ఆలో చేస్తే యూజర్లపై సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని ఆపిల్ హెచ్చరించింది. సైడ్ లోడింగ్ యాప్స్‌తో జరిగే నష్టాల నివేదికను బుధవారం రోజున ఆపిల్ విడుదల చేసింది. మాల్వేర్ దాడులతో యూజర్ల ప్రైవసీ, భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఆపిల్ వెల్లడించింది. ప్లే స్టోర్‌పై ఈయూ విధించిన రూల్స్‌ను కాస్త సులభతరం చేయాలని ఆపిల్ విన్నవించింది. ప్రపంచవ్యాప్తంగా థర్డ్‌పార్టీ యాప్స్‌తో సుమారు 60 లక్షల యూజర్ల స్మార్ట్‌ఫోన్స్ సైబర్ దాడులకు ప్రభావితమయ్యాయని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్‌స్కై పేర్కొంది. ముందే హెచ్చరించిన టిమ్ కుక్..! గతంలో ఈయూ తెచ్చిన చట్టాలపై ఆపిల్ సీఈవో టిమ్ కుక్ పూర్తిగా వ్యతిరేకించాడు. సైడ్‌లోడింగ్ యాప్స్‌తో యూజర్ల భద్రతకు, ప్రైవసీ భంగం వాటిల్లుతుందనీ హెచ్చరించాడు. కాగా ఫోర్స్‌ఫుల్‌గా ఈ థర్డ్‌పార్టీ యాప్స్‌ను ఇన్స్టాల్ చేయడంతో ఆపిల్ ఐవోఏస్ ప్లాట్‌ఫాం దెబ్బతీనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆపిల్ స్టోర్‌లోకి యాప్స్ ఏంట్రీ ఇవ్వాలంటే వాటిపై కచ్చితమైన రివ్యూ చేశాకే స్టోర్‌లో ఉంచుతామని వివరించాడు. చదవండి: తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన సజ్జన్ జిందాల్..! -
కంగనాకు గట్టి వార్నింగ్ ఇచ్చిన కోర్టు
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ప్రముఖ సినీ పాటల రచయిత, కవి జావేద్ అఖ్తర్ వేసిన డిఫమేషన్ కేసులో గైర్హాజరు కావడంపై ముంబయి మెట్రోపాలిటన్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా హాజరు కాకుండా పదే పదే మినహాయింపు కోరుతుండడంపై అసహనం వ్యక్తంచేసిన కోర్టు తాజాగా గట్టి వార్నింగ్ ఇచ్చింది. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ వారెస్ట్ జారీ చేస్తానని న్యాయమూర్తి హెచ్చరించారు. అనంతరం కేసు విచారణను సెప్టెంబర్ 20 కి వాయిదా వేసారు. చదవండి : Terrific Road Accidents: తీరని విషాదాలు జావేద్ అఖ్తర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. పిటిషనర్ జావేద్ అఖ్తర్ హాజరుకాగా నటి కంగన రనౌత్ మాత్రం హాజరుకాలేదు. తన లాయర్ ద్వారా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించింది. ఇదంతా చూస్తుంటే కావాలనే కాలయాపన చేస్తున్నట్టు కనిపిస్తోందని కోర్టు మండిపడింది. ఇకపై ఇదే తరహాలో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని వ్యాఖ్యానించింది. వచ్చే విచారణకు తప్పకుండా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. లేదంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది. దీనిపై అఖ్తర్ తరఫు న్యాయవాది జే భరద్వాజ్ కోర్టులో అభ్యంతరం తెలుపడంతో తాజా హెచ్చరిక చేసింది. కంగనా రనౌత్ తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ మాట్లాడుతూ, కంగనా సినిమా యాక్టింగ్, ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉండటంతో పా టు, కొన్ని లక్షణాల కారణంగా కోవిడ్ పరీక్ష చేయించుకోనున్నారని, ఒకవేళ పాజిటివ్ వస్తే మరింత మినహాయింపు అవసరం ఉంటుందని కోర్టుకు తెలపడం గమనార్హం కాగా నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి కంగన తన పరువుకు నష్టం కల్గించే రీతిలో మాట్లాడారని జావేద్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు కంగనా. అయితే కంగనా పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
ఫీజు వసూళ్లపై ప్రైవేటు విద్యాసంస్థలకు తెలంగాణ సర్కారు హెచ్చరిక
సాక్షి, హైదరాబాద్: సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం.. కళాశాలలు, స్కూళ్లలో కరోనా నిబంధనల అమలుతో పాటు ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల వసూళ్లపై దృష్టి సారించింది. కరోనా కష్టకాలంలో ఫీజుల కోసం తల్లిదండ్రులను ఒత్తిడి చేసే విద్యాసంస్థల విషయంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ప్రైవేటు సంస్థలు మానవత్వంతో వ్యవహరించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆదివారం మీడియా ప్రతినిధులతో ఆమె ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల కోసం వేధిస్తున్న ఉదంతాలు తమ దృష్టికొచ్చాయని మంత్రి తెలిపారు. దీనిపై నిఘా పెట్టాల్సిందిగా అధికారులకు సూచించామన్నారు. ఫీజుల కోసం వేధిస్తే రాష్ట్ర ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా ఇచ్చామని, అయితే ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు కూడా మానవీయ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉందని అన్నారు. తల్లిదండ్రుల కోరిక మేరకే.. విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకే వచ్చేనెల ఒకటి నుంచి అన్ని విద్యాసంస్థలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు మంత్రి సబిత తెలిపారు. కరోనా నిబంధనల అమల్లో ప్రభుత్వం రాజీపడబోదని, ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో పర్యవేక్షణకు అధికారులను నియమించామని వెల్లడించారు. తల్లిదండ్రులు ఇష్టపడితేనే పిల్లలను స్కూళ్లకు పంపాలని చెబుతున్నామని తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిడీ లేదన్నారు. అవసరమైతే అందరికీ పరీక్షలు పాఠశాలలకు పంపే విద్యార్థులకు అనారోగ్య సమస్యలొస్తే తమదే బాధ్యతంటూ.. తల్లిదండ్రుల నుంచి ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ముందుగానే అంగీకారపత్రం తీసుకుంటున్న వైనంపై మంత్రి ఘాటుగా స్పందించారు. విద్యార్థులు కరోనా బారిన పడకుండా చూసే విషయంలో అందరూ భాగస్వాములు కావాల్సిందేనన్నారు. తరగతి గదిలో ఎవరికైనా కరోనా లక్షణాలుంటే క్లాసులోని పిల్లలందరికీ పరీక్షలు చేయిస్తామని, ఎక్కువ మందికి లక్షణాలుంటే స్కూలు మొత్తం పరీక్షలు చేయిస్తామని మంత్రి తెలిపారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విద్యాసంస్థను మొత్తం మూసేసే ఆలోచన లేదన్నారు. నేడు డీఈవోలతో భేటీ.. విద్యాసంస్థల పునఃప్రారంభంపై సోమవారం డీఈవోలతో సమీక్షించనున్నట్లు మంత్రి తెలిపారు. అవసరమైతే కొత్త మార్గదర్శకాలూ ఇస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఇప్పటికే క్షేత్రస్థాయి సమాచారం సేకరిస్తున్నామని, ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. విశ్వవిద్యాలయాల సమస్యలపై త్వరలో వీసీలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాయాల్సిందే.. ఇంటర్ సెకండియర్‌కు ప్రమోట్ అయిన విద్యార్థులంతా ఫస్టియర్ పరీక్షలు రాయాల్సిందేనని మంత్రి సబిత స్పష్టం చేశారు. పరీక్షలు ఎప్పుడనేది త్వరలో ప్రకటిస్తామన్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో గతేడాది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులను ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకుండా సెకండియర్‌కు ప్రమోట్ చేసింది. వీరికి ఫస్టియర్ పరీక్షలు ఐచ్ఛికమనే ప్రచారం తొలుత జరిగింది. కానీ మంత్రి సబిత దీన్ని కొట్టిపారేశారు. విద్యార్థులంతా పరీక్షలు రాయాల్సిందేనంటూ స్పష్టత ఇచ్చారు. దీని వెనుక బలమైన కారణాలున్నట్టు తెలుస్తోంది. కరోనా మూడోదశ ప్రచారం నేపథ్యంలో ఒకవేళ సెకండియర్ పరీక్షలనూ నిర్వహించలేకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటనే సందేహాలు విద్యాశాఖ వర్గాల్లో వ్యక్తమయ్యాయి. ఫస్టియర్ మార్కుల్నే ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు అధికారులు అభిప్రాయపడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు నిర్వహించాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు స్పష్టమవుతోంది. -
ఈ వెబ్సైట్ల జోలికి పోయారో అంతే సంగతులు..!
సాక్షి, హైదరాబాద్: గత కొంతకాలంగా సైబర్ మోసాలు భారీగా పెరిగాయి. కరోనా మహామ్మారి సమయంలో సైబర్ మోసాలు గణనీయంగా వృద్ధి చెందాయి. నకిలీ యాప్స్, వెబ్సైట్ల పేరుతో ప్రజలకు సైబర్ నేరస్తులు కుచ్చుటోపీ పెడుతున్నారు. ఆండ్రాయిడ్ స్మార్ఫోన్లలోకి నకిలీ వెబ్సైట్ల రూపంలో ప్రజలను దోచుకుంటున్నట్లు ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ జింపెరియం కూడా నిర్థారించింది. తక్కువ ధరలకే పలు వస్తువులు వస్తాయనే లింక్‌లను సామాన్య ప్రజలకు సైబర్ నేరస్థులు ఎరగా వేస్తున్నారు. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!) తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాల పట్ల జాగ్రత్త వహించాలని ప్రజలకు విన్నవించారు. తక్కువగా ధరలకే వస్తువులు వస్తున్నాయని చూపే వెబ్సైట్లను, ఇతర లింక్‌ల జోలికి వెళ్లకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డేబెట్, అమెజాన్93.కామ్, ఈబే19.కామ్, లక్కీబాల్, EZ ప్లాన్, సన్‌ఫ్యాక్టరీ.ETC వంటి నకిలీ వెబ్సైట్లు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. (చదవండి: మొబైల్ రీచార్జ్ టారిఫ్‌ల పెంపు తప్పనిసరి కానుందా..!) -
ఆ పని చేయండంటున్న స్వర్ణ పతక వీరుడు నీరజ్ చౌప్రా
సుదీర్ఘ కాలం తరువాత ఒలింపిక్స్ చరిత్రలోనే తొలిసారి జావలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని తెచ్చిపెట్టిన నీరజ్ చోప్రా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. కంగారు పడకండి . నీరజ్ చోప్రో ఏంటీ? ప్రజలకు వార్నింగ్ ఇవ్వడం ఏంటని అనుకుంటున్నారా? ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోయాయి. ట్రాన్సాక్షన్ల పేరుతో సైబర్ నేరగాళ్లు బాధితులకు పెద్ద ఎత్తున కుచ్చిటోపీ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కొత్త క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది. ఒలింపిక్ వీరుడు నీరజ్ చోప్రోతో కలిసి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పై అవగాహన పెంచేందుక ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. .@RBI Kehta Hai... Along with @Neeraj_chopra1 A little caution takes care of a lot of trouble. Never respond to requests to share PIN, OTP or bank account details. Block your card if stolen, lost or compromised.#rbikehtahai #StaySafe #BeAware #BeSecure #Tokyo2020 pic.twitter.com/v9aeOG7ZMP — RBI Says (@RBIsays) August 10, 2021 డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలంటూ నీరజ్ చోప్రో వీడియోలో మాట్లాడారు. అంతేకాదు పిన్, ఓటీపీ, బ్యాంక్ అకౌంట్లను జాగ్రత్త ఉంచుకోవాలని కోరారు. ఆన్లైన్ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మార్చుకోవాలని ఏటీఎం,క్రెడిట్ కార్డ్ల్‌లను పోగొట్టుకుంటే వెంటనే బ్లాక్ చేయాలని కోరుతూ ముగించాడు. కాగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ లతో పాటు మిగిలిన బ్యాంక్‌లు ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల గురించి ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. -
కోవిడ్ ముప్పు: అత్యవసర చర్యలపై లాన్సెట్ కీలక హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ: ఇపుడిపుడే కరోనా సెకండ్‌వేవ్‌నుంచి కోలుకుంటున్న దేశ ప్రజలను థర్డ్‌వేవ్ పొంచి ఉందన్న అంచనాలు వణికిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ భారత ప్రభుత్వానికి కీలక హెచ్చరికలు చేసింది. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగే అవకాశం ఉందని లాన్సెట్ మెడికల్ జర్నల్ హెచ్చరించింది. రానున్న కోవిడ్-19 ముప్పుపై అత్యవసర చర్యలు చేపట్టాల్సిందిగా హెచ్చరికలు జారీ చేసింది.ఆరోగ్య సేవలు, కీలక ఔషధాలపై పాదర్శకత, జాతీయంగా ఒకే ధరల విధానం ఉండాలని లాన్సెట్‌లో 21 మంది నిపుణులు సూచించారు. కరోనావైరస్ ఉధృతి తగ్గుతున్న తరుణంలో అన్ని రాష్ట్రాలు అన్‌లాక్ ప్రక్రియ షురూ అయిన తరుణంలో ది లాన్సెట్ వెబ్సైట్ 8 రకాల సూచనలను చేసింది. బయోకాన్ కిరణ్ మజుందార్ షా, టాప్ సర్జన్ డాక్టర్ దేవి శెట్టితో కూడిన 21 మంది ఈ చర్యలను సిఫారసు చేశారు. లాన్సెట్ సూచనలు 1. అవసరమైన ఆరోగ్య సేవలను వికేంద్రీకరించబడాలి. కేసుల సంఖ్య, అందుతున్న సేవలు జిల్లా నుండి జిల్లాకు చాలా తేడాలున్న నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లో ఒకే విధానం ఆమోద యోగ్యం కాదు. 2. అంబులెన్సులు, ఆక్సిజన్, అవసరమైన మందులు , ఆసుపత్రి సంరక్షణ లాంటి ముఖ్యమైన ఆరోగ్య సేవల ధరలపై పారదర్శక, జాతీయ ధర విధానం, ధరలపై నియంత్రణ ఉండాలి. కొన్ని రాష్ట్రాల్లో చేసినట్లుగా ప్రజలందరికీ ఇప్పటికే ఉన్న ఆరోగ్య బీమా పథకాలను అమలు చేయాలి. 3. కోవిడ్ కేసులు, నిర్వహణపై వాస్తవ సమాచారాన్ని మాత్రమే అందించాలి. పూర్తి స్పష్టతతో, ఆధారాల తో అంతర్జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా వైరస్‌పై అవగాహన, చికిత్స ఇతర సమాచారాన్ని విస్తృతంగా వ్యాప్తి చేయాలి. ఈ సమాచారం స్థానిక పరిస్థితులు, క్లినికల్ ప్రాక్టీస్‌లు ఉన్న స్థానిక భాషల్లోఉండాలి. హోం ఐసోలేషన్, చికిత్స, ప్రాధమిక సంరక్షణపై జిల్లా ఆసుపత్రుల్లో తగిన విధానాలుండాలి. 4. ఆరోగ్యం రంగానికి సంబంధించి ప్రైవేటు రంగంతో సహా అన్ని రంగాలలో అందుబాటులో ఉన్న అన్ని మానవ వనరులను కరోనా సంక్షోభ సమయంలో వినియోగించుకోవాలి. ప్రత్యేకించి తగినంత వ్యక్తిగత రక్షణ పరికరాలు, క్లినికల్ ఇంటర్వెన్షన్స్ బీమా, మానసిక ఆరోగ్య మద్దతు వాడకంపై మార్గదర్శకత్వాలను అనుసరించాలి. 5. ప్రాధాన్యత సమూహాలకు టీకా అందించడంపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ మోతాదుల వినియోగానికి నిర్ణయం తీసుకోవాలి. దీన్ని మార్కెట్ యంత్రాగాలకు ఏమాత్రం వదిలిపెట్టకుండా ప్రజా ప్రయోజనాలకనుగుణంగా వ్యవహరించాలి. 6. ప్రజల భాగస్వామ్యం, చొరవే కోవిడ్ నియంత్రణకు కీలకం. కరోనా నియంత్రణ, ఇతర అభివృద్ధి కార్యకలాపాలలో ప్రజల భాగస్వామ్యంతో ముంబై బాగా పనిచేసింది. ముంబైలో ముఖ్యంగా గ్రామీణ పౌర సమాజం చారిత్రాత్మక పాత్ర పోషించింది. (కరోనా సంక్షోభం: గూగుల్ మరోసారి భారీ సాయం) 7. ప్రభుత్వ డేటా సేకరణ, మోడలింగ్‌లో పారదర్శకంగా ఉంటూ రానున్న వారాల్లో కేసుల ఉధృతికి ఆయా జిల్లాలను ముందస్తుగా సిద్ధం చేయాలి. ఆరోగ్య సంరక్షణ విధానాలను బలోపేతం చేయడం, బాధితుల వయసు, జండర్ ఆసుపత్రిలో చేరిక, మరణాల రేట్లు, కమ్యూనిటీ-స్థాయిలో టీకాలు, చికిత్స ప్రోటోకాల్స్, దీర్ఘకాలిక ఫలితాలపై కమ్యూనిటీ-ఆధారిత ట్రాకింగ్ అవసరం. (Vaccine: గేమ్ ఛేంజర్, కార్బెవాక్స్ వచ్చేస్తోంది!) 8. అలాగే కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారికి, అట్టడుగువర్గాల వారికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే చేస్తున్నట్లుగా నగదు బదిలీ ద్వారా ఆర్థిక మద్దతునందించాలి. తద్వారా ఆయా కుటుంబాల్లో జీవనోపాధి కోల్పోవడం వల్ల కలిగే తీవ్ర బాధలు, అనారోగ్య ముప్పును తగ్గించాలి. సంఘటిత రంగంలోని సంస్థలు కార్మికులందరినీ పనిలో కొనసాగించేలా చూడాలి. ఆర్థిక రంగం తిరిగి పుంజుకున్న తరువాత ఈ సంస్థలకు పరిహారం అందించేలా ప్రభుత్వం హామీ ఇవ్వాలి. తద్వారా కాంట్రాక్టులతో సంబంధం లేకుండా ఆయా కంపెనీల యజమానులు కార్మికులకు ఉద్యోగ రక్షణ కల్పించేలా చూడాలి. చదవండి: టాప్-5 ఐటీ కంపెనీల్లోనే 96 వేల ఉద్యోగాలు: నాస్కామ్ -
ఇది ఆరంభం మాత్రమే : కంగనా సంచలన వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ రాజీనామా చేసిన అనంతరం ట్విటర్లో స్పందించారు. సాధువులను హత్య చేసి.. స్త్రీలను వేధించి, హింసించేవారికి ఎప్పటికైనా పతనం తప్పదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ అనిల్ దేశ్ముఖ్నుద్దేశించి హెచ్చరించారు. అంతేకాదు ముందు ముందు ఏం జరుగనుందో చూస్తూ ఉండు అంటూ ఫైర్ బ్రాండ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా గతంలో తన ఆఫీసుపై దాడి, కూల్చివేత విషయాలను గుర్తు చేస్తూ చేసిన ఒక ట్వీట్‌ను రీట్వీట్ చేయడం గమనార్హం. ఇప్పటికే శివసేన, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సమయంలో కంగనా వ్యాఖ్యలు మరోసారి అగ్గి రాజేశాయి. (సంచలనం: మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా) కాగా ముంబై మాజీ పోలీసు చీఫ్ పరం బీర్ సింగ్ హోంమంత్రి దేశ్‌ముఖ్ మీద చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు సోమవారం ఆదేశించింది. 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ నిర్వహించాలని హైకోర్టు సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. దీంతో అనిల్ దేశ్‌ముఖ్ మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. जो साधुओं की हत्या और स्त्री का अपमान करे उसका पतन निश्चित है #AnilDesmukh यह तो सिर्फ़ शुरुआत है, आगे आगे देखो होता है क्या #UddhavThackeray https://t.co/cvEZsjUxSc — Kangana Ranaut (@KanganaTeam) April 5, 2021 -
మరో వైరస్..! ఐసీఎంఆర్ హెచ్చరిక
సాక్షి,న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రకంపనలు కొనసాగుతుండగానే చైనా నుంచి భారత్‌కు మరో ముప్పు పొంచి ఉందనే అంచనాలు మరింత ఆందోళన పుట్టిస్తున్నాయి. చైనాతోపాటు, వియత్నాంలో అనేకమందికి సోకిన 'క్యాట్ క్యూ వైరస్' (సీక్యూవీ) భారత్‌లోనూ వ్యాప్తి చెందే అవకాశం ఉందని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) హెచ్చరించింది. క్యూలెక్స్ జాతి దోమలు, పందులను ఈ వైరస్ వాహకాలుగా మార్చుకుంటుందని చైనా, తైవాన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో ఇప్పటికే వెల్లడైందనీ, భారత్‌లోనూ ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. (కరోనా మరణాలపై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన) ఐసీఎంఆర్ అధ్యయనం ప్రకారం, ఆర్థ్రోపోడ్-బోర్న్ వైరస్లలో ఒకటి (ఆర్బోవైరస్), సీక్యూవీ మానవులలో జ్వరం, మెనింజైటిస్ , చిన్న పిల్లలో మెదడు వాపు లాంటి వ్యాధులకు కారణం కావచ్చు. ప్రధానంగా దోమలు సీక్యూవికి గురయ్యే అవకాశం ఉంది. వాటి ద్వారా ప్రజలకు సోకే అవకాశం ఉంది. ఐసీఎంఆర్, పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీ శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా సుమారు 883 హ్యూమన్ సీరం శాంపిల్స్ పరీక్షించగా ఆయా వ్యక్తుల్లో సక్యూవి యాంటీ బాడీస్ ఉన్నాయి కానీ వైరస్ లక్షణాలు లేనట్లు నిర్ధారించారు. అయితే కొంతమందికి వ్యాధికి గురయ్యే ఉంటారని అభిప్రాయపడ్డారు. దీంతో మరి కొంతమంది శాంపిల్స్ కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. 2014, 2017లో కర్ణాటకకు చెందిన రెండు శాంపిల్స్‌లో ఈ వ్యాధికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐజెఎంఆర్) తాజా సంచికలో ఈ అధ్యయన ఫలితాలు ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయన సమయంలో, మానవులు లేదా జంతువుల నమూనాలలో వైరస్ ను గుర్తించలేదు. -
కరోనా అంతం సాధ్యం కాదు!
లండన్: ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న కరోనా వైరస్ నివారణకు సంబంధించి యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహమ్మారిని అంతం చేయడం అంత సులభం కాదని ఆయన వ్యాఖ్యానించారు. వైరస్‌తో కలిసి జీవించడాన్ని ప్రజలంతా నేర్చుకోవలసి ఉంటుందని సూచించారు. ప్రెస్ అసోసియేషన్‌తో మాట్లాడుతూ కోవిడ్-19తో కలిసి జీవించబోతున్నాం. దానిని నివారించలేమని టోనీ బ్లెయిర్ హెచ్చరించారు. అలాగే నియంత్రణ చర్యలపై దృష్టి పెట్టాలని బోరిస్ జాన్సన్ ప్రభుత్వాన్ని కోరారు. 'ప్రభుత్వం ఇప్పటివరకు ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు' ఇదని కరోనా సంక్షోభాన్నిఆయన అభివర్ణించారు. రానున్న చలికాలంలో మహమ్మారి రెండవ దశలో మరింత విజృంభించే ప్రమాదం ఉందన్నారు. ఈ నేపథ్యంలో వైరస్‌ను ఎదుర్కొనేందుకు బ్రిటన్ ప్రజలంతా సంసిద్ధంగా ఉండాలని టోనీ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి మనల్ని వదిలి ఎక్కడికీ పోదు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కలిసి బ్రతకడం అలవాటు చేసుకోవాలన్నారు. అలాగే మరింత నియంత్రణ చర్యలు చేపట్టాలని పాలకులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వివిధ దేశాల్లో లాక్డౌన్ ఆంక్షల సడలింపుల తర్వాత కేసుల సంఖ్య భారీగా పుంజుకోవడాన్ని ఆయన గుర్తు చేశారు. ఆర్థిక సంక్షోభం కారణంగా దేశవ్యాప్తంగా దీర్ఘకాలికంగా లాక్డౌన్ విధించడం అసాధ్యం. కానీ కరోనా కట్టడికి దీర్ఘకాలిక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యం. దురదృష్టవశాత్తు కరోనా మళ్లీ వ్యాప్తిస్తే దేశంలో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు అందుబాటులో లేవనేదే తనకు అందోళన కలిగిస్తున్న అంశమని ఆయన ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. -
కరోనా : అమెరికాకు కొత్త హెచ్చరిక
వాషింగ్టన్ : కరోనా వైరస్ అమెరికాను వణికిస్తోంది. మరోవైపు భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైతే రోజుకు లక్ష కొత్త కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అమెరికా ఆరోగ్య నిపుణుడు నిన్న(మంగళవారం) హెచ్చరించారు. వైరస్ నియంత్రణ, నివారణ చర్యలపైనా ఆందోళన వ్యక్తం చేసిన ఆయన అత్యవసర చర్యలు చేపట్టాలని కాంగ్రెస్‌కు సూచించారు. ప్రమాదకరమైన పెరుగుదలను నివారించడానికి తక్షణమే అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని ఫౌసీ నొక్కిచెప్పారు. మహమ్మారిని అణిచివేసేందుకు అధికారులు, ప్రజలు చర్యలు తీసుకోకపోతే రోజుకు ప్రస్తుతం 40వేలకు పైగా నమోదవుతున్న కేసులు, ఇకపై లక్షకు చేరినా ఆశ్యర్యం లేదని కరోనావైరస్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ కాంగ్రెస్‌ను హెచ్చరించారు. మహమ్మారిపై సమీక్ష సందర్భంగా సెనేట్ హెల్త్, ఎడ్యుకేషన్, లేబర్ అండ్ పెన్షన్స్ కమిటీలో ప్రసంగిస్తూ ఫౌసీ ఈ హెచ్చరిక జారీ చేశారు. మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని, సామాజిక దూరం నిబంధలను కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అమెరికా మహమ్మారి నియంత్రణలో తప్పు దారిలో ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా కేసులు వ్యాపిస్తున్న తరుణంలో తక్షణమే ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని నొక్కి వక్కాణించారు. వ్యక్తులుగా, ప్రభుత్వాలుగా కరోనా కట్టడికి సామాజిక ప్రయత్నంలో భాగంగా, బాధ్యతగా వ్యవహరించాలని ఫౌసీ సూచించారు. ప్రధానంగా బార్లలో మాస్క్ లు ధరించకపోవడం, సామాజిక దూర మార్గదర్శకాలను పాటించకపోవడం వంటి "ప్రమాదకరమైన" ప్రవర్తన మంచిది కాదంటూ దేశ యువతను ఫౌసీ తీవ్రంగా హెచ్చరించారు. యుఎస్‌లో కరోనావైరస్ కేసులు పెరుగుతున్నప్పటి ప్రజలు ఒకే చోట పెద్ద సంఖ్యలో సమావేశమవుతున్నారని, ముసుగులు ధరించడంలేదని ఫౌసీ ఆరోపించారు. లాక్ డౌన్ మార్గదర్శకాలపై అమెరికన్లు సరైన శ్రద్ధ చూపడం లేదన్నారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అలాగే 2020 చివరిలో లేదా 2021 ప్రారంభంలో కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చని ఆశిస్తున్నానన్నారు. కాగా 2.6 మిలియన్లకు పైగా కేసులు, లక్షా 26 వేల మరణాలతో ప్రపంచంలోనే అత్యంత కరోనా ప్రభావిత దేశంగా అమెరికా నిలిచింది. -
డబ్ల్యూహెచ్ఓ నుంచి వైదొలగుతాం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)పై తన విమర్శల అస్త్రాలను ఎక్కుపెట్టారు. కరోనా వైరస్ విషయంలో చైనా ఒత్తిడికి తలొగ్గారని, పక్షపాతంతో వ్యవహరించారని ట్రంప్ పలుమార్లు వ్యాఖ్యానించడం తెల్సిందే. నెలలోపు తాను స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ చూపలేకపోతే అమెరికా ఇచ్చే వార్షిక నిధులను శాశ్వతంగా ఆపేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధోనంకు ట్రంప్ ఒక లేఖ రాస్తూ ‘మీరు.. మీ సంస్థ పదేపదే చేసిన తప్పులకు ప్రపంచం పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. చైనా ప్రభావానికి లొంగకుండా స్వతంత్రంగా పనిచేస్తున్నారని చూపగలిగితేనే డబ్ల్యూహెచ్ఓతో ముందుకెళ్లగలం’అని స్పష్టం చేశారు. సంస్థాగత మార్పుల గురించి అమెరికా ఇప్పటికే డబ్ల్యూహెచ్ఓతో చర్చలు మొదలుపెట్టిందని, సమయం వృథా చేయకుండా దీనిపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు ట్రంప్ ట్వీట్‌చేశారు. షరతులను పాటించకపోతే వార్షిక నిధులపై విధించిన తాత్కాలిక నిషేధాన్ని శాశ్వతం చేస్తామని, సంస్థలో సభ్యత్వం విషయాన్ని పునః పరిశీలిస్తామని ట్రంప్ హెచ్చరించారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ వాడుతున్నా.. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందేందుకు తాను శాస్త్రీయంగా నిరూపితం కాని మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను వాడుతున్నట్లు ట్రంప్ చెప్పారు. రెండు వారాల క్రితం నుంచి తాను ఈ మాత్రను తీసుకుంటున్నట్లు తెలిపారు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ తీసుకోవాల్సిందిగా వైట్‌హౌస్ వైద్యులెవరూ తనకు నిర్దుష్టంగా చెప్పలేదని, కాకపోతే... వాళ్లను అడిగినప్పుడు ఇష్టమైతే వాడమని సూచించారని, దాంతో తాను తీసుకోవడం మొదలుపెట్టానని వివరించారు. ఈ మాత్రను ఎప్పుడో ఒకప్పుడు నిలిపివేస్తానని చెప్పారు. అధిక కరోనా కేసులున్న దేశాలు -
కరోనా ఎప్పటికీ పోదు : డబ్ల్యూహెచ్ఓ తాజా హెచ్చరిక
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)మరో సంచలన హెచ్చరిక చేసింది. మహమ్మారి కరోనా హెచ్ఐవీ లాంటిదని ఎప్పటికీపోదని హెచ్చరించింది. 'ప్రపంచం దానితో జీవించడం నేర్చుకోవలసి ఉంటుంది' అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉన్నత నిపుణుడు హెచ్చరించారు. జనవరి 21నుండి వైరస్ పై రోజువారీ నివేదికను ఇస్తున్న సంస్థ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. (కరోనా : ట్విటర్ సంచలన నిర్ణయం) కరోనా వైరస్ ప్రపంచ సమాజంలో హెచ్ఐవీ లాంటి మరొక స్థానిక వైరస్ కావచ్చని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా సోకుతున్న హెచ్ఐవీ మాదిరిగానే కోవిడ్-19 కూడా ఎప్పటికీ పోదని సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ మైఖేల్ ర్యాన్ చెప్పారు. ఈ వైరస్ ఎప్పటికీ దూరంకాకపోవచ్చని ర్యాన్ వ్యాఖ్యానించారు. అలాగే కేసుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు కరోనావైరస్, లాక్డౌన్ పరిమితులను ఎత్తివేయడం మరింత సంక్రమణను దారితీస్తుందన్నారు. ప్రాణాంతక మహమ్మారిని అంతం చేసే టీకా కోసం ఎదురు చూడకుండా జాగ్రత్త వహించాలన్నారు. (కరోనాను జయించిన స్పెయిన్ బామ్మ) బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీకా లేకుండా ప్రపంచ జనాభా తగినంత స్థాయిలో రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి సంవత్సరాలు పట్టవచ్చు. ఈ వైరస్ ఎప్పటికి అంతమవుతుందో తెలియదు, దీన్ని నిరోధించగలిగే వ్యాక్సిన్ కనుగొని, దాన్ని ప్రతీ ఒక్కరికీ అందుబాటులోకి తేగలినపుడు మాత్రమే దీన్ని అరికట్టవచ్చని ర్యాన్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలను తగ్గించాలని యోచిస్తున్న సమయంలో డబ్ల్యూహెచ్ఓ ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. (లాక్డౌన్ ముగిసిన వెంటనే బరిలోకి దిగుతా: సెరెనా) -
అధిక ధరలకు విక్రయిస్తే కఠినచర్యలే: తలసాని
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ అమల వుతున్న నేపథ్యంలో మాంసాన్ని అధిక ధరలకు విక్రయిస్తే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. మాంసం, కోడిగుడ్లు, చేపలను సక్రమంగా సరఫరా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు గాను వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని, ఇందుకోసం పశుసంవర్ధక, మత్స్య శాఖ, పోలీసు, రవాణా శాఖల అధికారులతో కలిపి జిల్లా స్థాయిలో నోడల్ అధికారులను నియమిస్తామని మంత్రి తలసాని వెల్లడించారు. ఈనెల 29న ఆదివారం వివిధ మార్కెట్లలో మాంసం, చికెన్, చేపలు సరిగా అందుబాటులో లేవని, ఉన్న మాంసాన్ని అధిక ధరలకు విక్రయించారనే ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్రంలో మాంసం, చికెన్, చేపల లభ్యత, సరఫరాపై పశుసంవర్ధక శాఖ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన అత్యవసర సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్, ఎమ్మెల్యే ముఠాగోపాల్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్ర, మత్స్య శాఖ కమిషనర్ సువర్ణ, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకిల్, పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ హర్షవర్ధన్, స్నేహ చికెన్ అధినేత రాంరెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. లాక్డౌన్ నేపథ్యంలో గొర్రెలు, మేకల సరఫరా లేని కారణంగా మాంసం ధరలు పెరిగాయని చెప్పారు. గొర్రెలు, మేకల సరఫరాకు, విక్రయాలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం ద్వారా మాంసం ధరలను నియంత్రిస్తామని, ప్రజలు ఎలాంటి అసౌకర్యానికి గురికావద్దని హామీ ఇచ్చారు. ప్రత్యేక అనుమతులు ఇస్తాం గొర్రెలు, మేకలను జంట నగరాలకు కానీ, జిల్లా కేంద్రాలు, ఇతర పట్టణాలకు కానీ తీసుకెళ్లి విక్రయించుకునేందుకు అన్ని అనుమతులు ఇస్తామని చెప్పారు. గొర్రెలు, మేకలను తరలించే వాహనాలకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ అన్ని జిల్లాల ఎస్పీలు, రవాణా శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర డీజీపీకి లేఖ రాయాలని పశుసంవర్థక శాఖ కార్యదర్శి అనితా రాజేంద్రను మంత్రి ఆదేశించారు. మటన్ విక్రయ దుకాణాలపై అధికారులు తనిఖీలు నిర్వహించి అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గోశాలల్లో ఉన్న జీవాలకు పశుగ్రాసం కొరత ఉందని ఫిర్యాదులు వస్తున్నాయని, వెంటనే గోశాలల నిర్వాహకులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని అధికారులను మంత్రి కోరారు. వివిధ నీటి వనరులలో సైజుకు వచ్చిన చేపలను పట్టుకుని మత్స్యకారులు విక్రయించుకునేలా చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ కమిషనర్ సువర్ణను ఆదేశించారు. హైదరాబాద్‌కు చెందిన చేపల వ్యాపారులు ఎవరైనా ఇతర జిల్లాలకు వెళ్లి చేపలు తీసుకొచ్చి విక్రయించుకోవాలనుకుంటే వారికి కూడా అవసరమైన అనుమతులు ఇస్తామని, చికెన్ దుకాణాల్లోని వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించేలా అధికారులు ఏర్పాటు చేయాలని సూచించారు. -
జాగ్రత్త పడకపోతే.. వినాశనమే
టెహ్రాన్/వాషింగ్టన్: ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే కోవిడ్‌తో దేశవ్యాప్తంగా లక్షలాది మంది చనిపోయే ప్రమాదముందని ఇరాన్ హెచ్చరించింది. అనవసర ప్రయాణాలను రద్దు చేసుకోవాలని, ఆరోగ్య సూచనలను విధిగా పాటించాలని, లేదంటే, కనీవినీ ఎరగని ప్రాణ నష్టం జరిగే ప్రమాదముందని దేశ పౌరులకు సూచించింది. మధ్య ప్రాచ్యంలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో 90% ఇరాన్‌లోనే నమోదవుతున్నాయి. ఇరాన్లో 988 మంది చనిపోగా, 16 వేల కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలపై టెహ్రాన్‌కు చెందిన ప్రతిష్టాత్మక షరీఫ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ చేపట్టిన అధ్యయన వివరాలను ఇరాన్ అధికార టీవీ జర్నలిస్ట్ డాక్టర్ అఫ్రుజ్ ఎస్లామి మంగళవారం వెల్లడించారు. ఆ అధ్యయనం మూడు పరిస్థితులను అంచనా వేసింది. అవి.. ►1. దేశ పౌరులు పూర్తిగా సహకరిస్తే.. ఈ వైరస్ బారిన 1.2 లక్షల మంది పడతారు. 12 వేల మంది చనిపోతారు. ►2. పౌరులు సాధారణ స్థాయిలో సహకరిస్తే.. 3 లక్షల కేసులు నమోదవుతాయి. 1.1 లక్షల మంది చనిపోతారు. ►3. ఒకవేళ, పౌరులు సహకరించకుండా, జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే 40 లక్షల మందికి ఈ వైరస్ సోకుతుంది. 35 లక్షల మంది ప్రాణాలు కోల్పోతారు’. ఇరాన్లో 250 మంది భారతీయులకు వైరస్ సోకిందన్న వార్తను నిర్ధారించలేమని భారత్ తెలిపింది. ఆగస్ట్ వరకు ఈ సంక్షోభం కరోనా వైరస్ సంక్షోభం ఆగస్ట్ వరకు కొనసాగే ప్రమాదముందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో సోమవారం సాయంత్రానికి కరోనా కారణంగా 85 మంది చనిపోగా, 4500 నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. శాన్ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాల్లో దాదాపు 60 లక్షల మంది ప్రజలను ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ప్రపంచవ్యాప్తంగా 1.82 లక్షల కోవిyŠ కేసులు నమోదవగా, 7,100 మరణాలు సంభవించాయి. కరోనా భయంతో ఐక్యరాజ్య సమితి కూడా పలు సమావేశాలను రద్దు చేసుకుంది. ఐరాస న్యూయార్క్ కార్యాలయంలోని ఒక ఉద్యోగికి కూడా కోవిడ్ నిర్ధారణ అయింది. పాక్‌లో తొలి మరణం కరోనా కారణంగా పాకిస్తాన్లో మంగళవారం తొలి మరణం నమోదైంది. లాహోర్‌కు 150 కి.మీ.ల దూరంలోని హఫీజాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి కోవిడ్‌తో మరణించారు. పాకిస్తాన్లో మంగళవారం వరకు 193 కేసులు నమోదయ్యాయి. వీటిలో సింధ్ ప్రాంతంలోనే 155 కేసులు నిర్ధారణ అయ్యాయి. వుహాన్‌లో ఒకే కేసు కరోనా వైరస్ తొలి కేంద్రమైన చైనాలోని వుహాన్ నగరంలో సోమవారం ఒక్క కేసు మాత్రమే కొత్తగా నమోదైంది. అయితే, చైనా వ్యాప్తంగా కరోనా కారణంగా సోమవారం చనిపోయిన 13 మందిలో వుహాన్‌కు చెందిన వారే 12 మంది ఉన్నారు. చైనాలో మొత్తం మృతుల సంఖ్య 3226కి చేరింది. -
కరోనా మమ్మల్ని చంపితే నువ్వూ చస్తావ్: వర్మ
చైనాతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ కారణంగా ఎంతో మంది చనిపోతుంటే రామ్ గోపాల్ వర్మ మాత్రం కరోనా వైరస్‌కే వార్నింగ్ ఇస్తున్నారు. కరోనా.. నువ్వు మమ్మల్ని చంపితే నువ్వూ చస్తావన్న విషయం మర్చిపోకు అంటూ ప్రపంచాన్నే బయపెడుతున్న కరోనా వైరస్‌కి వర్మ తనదైన శైలిలో హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు తన ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. 'డియర్ వైరస్.. బుద్ధిలేకుండా అందరినీ చంపుకుంటూ పోతే నువ్వు కూడా చచ్చిపోతావు అన్న విషయాన్ని తెలుసుకో.. ఎందుకుంటే నువ్వు కూడా ఒక పారాసైట్ మాత్రమే. నా మాటపై నీకు నమ్మకం లేకపోతే వెంటనే వైరాలజీ క్రాష్ కోర్స్ తీసుకో.. కనుక నేను నీకు చెప్పేదేంటంటే.. నువ్వు బతుకు.. మమ్మల్ని బతకనివ్వు.. నీకు కూడా జ్ఞానం ఉంటే బాగుండు అని ఆశిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. చదవండి: తెలంగాణలో మరో రెండు కరోనా కేసులు! పెళ్లయ్యాక అదృశ్యం.. ఏడేళ్ల తర్వాత లవర్‌తో -
పాకిస్తాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
వాషింగ్టన్: భారత్‌పై మళ్లీ ఉగ్రవాదులు దాడులు జరిపితే తీవ్ర చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ‘‘ఉగ్రవాదులకు సురక్షిత స్థావరాలుగా మారిన ప్రాంతాల (పాక్)పై సహనాన్ని ప్రదర్శించేదే ప్రసక్తే లేదన్నారు. భారత్‌లో ఇంకొక్క ఉగ్రదాడి జరిగినా పాక్ తీవ్ర పరిణామాలకు సిద్ధంగా ఉండాలి’ అని వైట్‌హౌజ్‌కు చెందిన ఒక అధికారి బుధవారం మీడియాతో పేర్కొన్నారు. ‘పాకిస్థాన్‌లోని టెర్రరిస్ట్ గ్రూపులపై అమెరికా కఠిన చర్యలు తీసుకోడానికి వెనుకాడదు. ఉగ్రవాద నిర్మూలనకు పాక్ సరైన చర్యలు చేపట్టాలి. ప్రధానంగా జైష్-ఏ-మహ్మద్, లష్కర్-ఏ-తయిబా లాంటి ఉగ్రవాద సంస్థలను నిర్వీర్యం చేయాలి. ఉగ్రదాడులతో తిరిగి భారత ఉపఖండంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూడాలనేదే మా అభిమతం’ అని ఆయన తెలిపారు. ‘పాకిస్థాన్ తగు చర్యలు తీసుకోకుంటే ఇండియాలో మళ్లీ దాడులు జరిగే అవకాశముంది. దీనివల్ల ఇరు దేశాల మధ్య తిరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే ప్రమాదముంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లో భారత వైమానిక దాడుల అనంతరం ఉగ్రవాదులు, వారి శిబిరాల మీద పాక్ ఎలాంటి చర్యలు తీసుకుందోనని వేచి చూస్తాం’ అని తెలిపారు. ఉగ్రవాదాన్ని అరికట్టాల్సిందే ‘ఉగ్రవాదాన్ని తుదమొట్టించడానికి అంతర్జాతీయ సమాజం ఒక్క తాటిపైకి రావాల్సిన అవసరముందని అమెరికా భావిస్తోంది. పాక్ కూడా ఉగ్రవాద సంస్థల మీద కొన్ని చర్యలు తీసుకుంది. కొన్ని ఉగ్ర గ్రూపుల నిర్వీర్యం చేయడంతోపాటు జైషే మహ్మద్ సంస్థ పరిపాలనా కార్యకలాపాలను నియంత్రించే దిశగా నడుం బిగించింది. కానీ టెర్రరిస్ట్‌లను అరెస్ట్ చేయడం.. తర్వాత కొన్ని రోజులకు వారిని వదిలేయడం, దేశంలో ఎక్కడికైనా తిరిగే హక్కు, స్వేచ్ఛగా ర్యాలీలు చేసుకునే అనుమతులను ఉగ్ర నాయకులకు కల్పించడం పాక్‌కు పరిపాటి అయిపోయింది. అందుకే ఇంకొన్నాళ్లు పాకిస్థాన్ తీసుకునే చర్చలను నిశితంగా పరిశీలిస్తాం. పాక్‌కు ఉన్న ఆర్థిక అవసరాల దృష్ట్యా ఆ దేశం ఉగ్రవాద నిర్మూలన చర్యలను వేగవంతం చేసి, అంతర్జాతీయ సమాజం ముందు బాధ్యతాయుత దేశంగా నిలబడాలి. లేని పక్షంలో పాక్‌కు ఆర్థిక కష్టాలు తప్పవు. భారత్‌లో ఉగ్రవాదుల అటాక్, బాలాకోట్‌లో ఇండియన్ ఆర్మీ వాయు దాడులతో దాయాది దేశాల ఆర్మీలు ఇంకా హై అలర్ట్‌గానే ఉన్నాయి. ఇంకొక్క దాడి ఆ పరిస్థితులను ఇంకా క్లిష్టతరం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాంటి వాటికి తావివ్వొద్దనే తాము ముందస్తుగా పాక్‌ను హెచ్చరిస్తున్నాం. ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నప్పుడు అటు ఇస్లామాబాద్‌తో ఇటు న్యూఢిల్లీతో మేము సంప్రదింపులు జరిపి.. ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నం చేశాం’ అని సదరు వైట్‌హౌజ్ అధికారి తెలిపారు. -
మరో బాంబు పేల్చిన ఫేస్బుక్
శాన్ ఫ్రాన్సిస్కో: డేటా భద్రత యూజర్లకు పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. ఇప్పటికే సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ఫేస్బుక్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారుల డేటా లీక్ ప్రకంపనల నుంచి ఇంకా తేరుకోకుండానే ఫేస్బుక్ అధినేత మార్క్ జూకర్ బర్గ్ మరో బాంబు పేల్చారు. డేటా బ్రీచ్ ప్రమాదం మరింత పొంచి వుందని యూజర్లు, ఇన్వెస్టర్లను హెచ్చరించింది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్ఈసీ)కు సమర్పించిన త్రైమాసిక నివేదికలో భవిష్యత్తులో మరింతగా డేటా లీక్ ఉండే అవకాశముందని ఫేస్బుక్ వెల్లడించింది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ కు అందించిన త్రైమాసిక నివేదికలో, కేంబ్రిడ్జ్ ఎనలైటికా గురించి ప్రస్తావించకుండానే యూజర్లకు ఈ హెచ్చరిక చేసింది. థర్డ్ పార్టీల అవాంఛనీయ కార్యాచరణ ద్వారా వినియోగదారుల డేటా లీక్ సంఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపింది. తమ సంస్థ నుంచి మరింత డేటాను ఇతరులు తస్కరించి వాటిని దుర్వినియోగం చేసే అవకాశముందని ఫేస్బుక్ ఎస్ఈసీకి తెలిపింది. ఇది తమ కీర్తి, ప్రతిష్టలకు తీవ్ర హాని కలిగించవచ్చు. తమ వ్యాపారాన్ని, ఆర్థిక ఫలితాలను ప్రతికూలంగా ప్రభావితం చేయవచ్చని పేర్కొంది. కాగా ఫేస్బుక్ నుంచి అక్రమంగా సేకరించిన కోట్ల మంది యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా లీక్ చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదంలో అమెరికా, బ్రిటన్ చట్ట సభలు ఇప్పటికే విచారణ ప్రారంభించాయి. అంతేకాదు ఈ వ్యవహారంలో కంపెనీ నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించక తప్పదని అంచనా. -
మాట వినకుంటే పింఛన్లు పీకేస్తా
ఆర్బీపట్నం మహిళలపై మంత్రి రాజప్ప చిందులు ఆర్బీ పట్నం (పెద్దాపురం) : మేం చెప్పిందే వేదం.. మేం చేసిందే అభివృద్ధి.. ఏమనుకుంటున్నారో... వేషాలు వేస్తే మహిళలని చూడం. అవసరమైతే పింఛన్లు పీకేస్తాం. ఇవి ఎవరో తెలుగు తమ్ముడు అన్నమాటలు కావు .. సాక్షాత్తూ రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఊగిపోతూ మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైనమిది. పెద్దాపురం మండలం రాయభూపాలపట్నం గ్రామంలో మంగళవారం అభివృద్ధి కార్యక్రమాల పేరుతో రాత్రి వేళ గ్రామంలోకి వచ్చిన రాజప్పకు తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేవారు. తమ ఊరు అభివృద్ధిపై దృష్టి సారించాలని మహిళలు చెప్పే లోపే ఆయన ఆగ్రహంతో ఊగిసలాడిపోయారు. మహిళలని చూడకుండానే ఏదో పార్టీల అండ చూసుకుని ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారు. మేం చేసే అభివృద్ధి పనులకే వత్తాసు పలకాలంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవసరమైతే మీ పింఛన్లు పీకేస్తా.. అభివృద్ధికి సహకరించాలే తప్ప వేషాలు వేస్తే ఊరుకునేది లేదంటూ ఆగ్రహానికి లోనయ్యారు. దీనిని బట్టి అర్థమౌతోంది మంత్రి రాజప్పకు అభివృద్ధిపై ఎంత ఆసక్తి ఉందో. అంతేగాకుండా ఆ గ్రామానికి అనుకున్న సమయానికి వస్తే మహిళలు ప్రశ్నలు అడుగుతారనే ఆలస్యంగా వచ్చారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
రైతులతో మమేకం కాకుంటే మీరెందుకు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : రైతులకు అందుబాటులో ఉండేందుకే ఎంపీఈఓల వ్యవస్థను తీసుకువచ్చారని.. రైతులతో మమేకం కానప్పుడు వారి సేవలు ఎవరికి అవసరమని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని వ్యవసాయ అధికారులు, ఎంపీఈఓలతో నారుమడులు ప్రక్రియ, జేఎల్‌జీ, జేఎంజీ గ్రూపుల ఏర్పాటు తదితర అంశాలపై మంగళవారం ఆయన సమీక్షించారు. ఎంపీఈఓల కోసం రైతులు లేరని.. రైతులున్నారు కాబట్టే ఎంపీఈఓల వ్యవçస్థ తీసుకువచ్చారని కలెక్టర్ పేర్కొన్నారు. వారంతా గ్రామాల్లో రైతులకు కచ్చితంగా అందుబాటులో ఉంటూ కష్టపడి పనిచేయాలన్నారు. నూరు శాతం నారుమడులు పూర్తి కావాలి జిల్లాలో దశాబ్ద కాలంగా వ్యవసాయ క్యాలెండర్ దారి తప్పిందని.. అందువల్ల ఖరీఫ్ ఆలస్యమవుతోందని కలెక్టర్ పేర్కొన్నారు. గతంలో జూ¯ŒSలో నారుమడులు పూర్తి చేసుకుని అక్టోబర్ చివరి నాటికి కోతలు పూర్తయ్యేవన్నారు. తిరిగి నవంబర్‌లో రబీ పనులు ప్రారంభమయ్యేవని అన్నారు. రెండేళ్లుగా తీసుకుంటున్న చర్యల ఫలితంగా జూన్ 1న కాలువలకు నీరు విడుదల చేశామని.. భవిష్యత్‌లోనూ ఇదే పద్ధతి కొనసాగుతుందని చెప్పారు. గోదావరి డెల్టాలో నారుమడులు రేపటికల్లా పూర్తి కావాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. 90 శాతం కన్నా తక్కువ నారుమడులు పడిన చోట్ల సంబంధిత అధికారుల నుంచి సంజాయిషీ కోరాలని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ వై.సాయిలక్ష్మీశ్వరిని ఆదేశించారు. డెల్టాకు చేటు తేవద్దు : చేపల చెరువుల విషయంలో ఇష్టానుసారం వ్యవహరించవద్దన్నారు. వ్యవసాయ భూమిని సాగుకు పనికిరాదని నివేదికలు ఇస్తే డెల్టాకు ముప్పు చేసినవారవుతారన్నారు. ఈ విషయంలో సమగ్ర పరిశీలన చేయాలని, చిన్న అనుమానం తలెత్తినా కచ్చితంగా తిరస్కరించాలని ఆయన సూచించారు. కౌలు రైతులకు వెయ్యి కోట్లు జిల్లాలోని రైతుల్లో 75 నుంచి 80 శాతం కౌలు రైతులేనన్న విషయాన్ని వ్యవసాయ అధికారులు మరిచిపోవద్దన్నారు. జిల్లాలో 3.5 లక్షల మందికి రుణార్హత కార్డులు అందించామన్నారు. అయినప్పటికీ సరైన రీతిలో కౌలు రైతులకు రుణాలు అందడం లేదన్నారు. జిల్లాలో స్వయం సహాయక సంఘాల మాదిరిగా జేఎల్‌జీ, జేఎంజీ గ్రూపులను కౌలు రైతులతో ఏర్పాటు చేయాలన్నారు. తద్వారా కనీసం రూ.వెయ్యి కోట్లను రుణాలుగా అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. అదనపు జాయింట్ కలెక్టర్ ఎంహెచ్ షరీఫ్ మాట్లాడుతూ ప్రతి ఎంపీఈఓ వారి పరిధిలోని కాలువల నీటి మట్టాలను లాగ్‌బుక్‌లో నమోదు చేయాలన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ, ఎరువులు, విత్తనాల సరఫరా, భూసార పరీక్ష కార్డులు తదితర అంశాలపై సమీక్షించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి, డెప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, ఏఈఓలు, ఎంపీఈఓలు పాల్గొన్నారు. -
సెటిల్మెంట్లు చేస్తే చర్యలు తప్పవు
హోం మంత్రి రాజప్ప హెచ్చరిక అమలాపురం టౌన్ : న్యాయవాద వృత్తి చేస్తూ కొందరు భూ కబ్జాలు, సెటిల్మెంట్లకు పాల్పడుతున్నారని, అలాంటి న్యాయవాదులను ఉపేక్షించేది లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప హెచ్చరించారు. సెటిల్మెంట్లు, భూ కబ్జాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే న్యాయవాదులపై కేసులు నమోదు చేసి జైళ్లకు కూడా పంపుతామని స్పష్టం చేశారు. అమలాపురం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక అసోసియేషన్ కార్యాలయ ప్రాంగణంలో పలువురు ప్రజాప్రతినిధులకు ఆదివారం జరిగిన సత్కార సభకు రాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అమలాపురం బార్ అసోసియేషన్‌కు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఇక్కడ న్యాయవాదులుగా పనిచేసి నేడు న్యాయమూర్తులుగా అనేక మంది ఉన్నత స్థానాల్లో ఉన్నారని రాజప్ప గుర్తు చేశారు. అలాంటి అమలాపురంలో కొంత మంది న్యాయవాదులు సెటిల్మెంట్లు, భూకబ్జాలకు పాల్పడుతున్నట్టు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. అమలాపురంలో రౌడీయిజాన్ని అణిచివేశాం, తప్పు ఎవరు చేసినా క్షమించేది లేదన్నారు. రాష్ట్రంలో సెటిల్మెంట్లు, భూ కబ్జాలకు ముఖ్యంగా నకిలీ డాక్యుమెంట్లు... నకిలీ రిజస్ట్రేషన్లతో ప్రజలను మోసగిస్తే పోలీసు శాఖ ఉక్కుపాదం మోపుతుందన్నారు. విశాఖపట్నంలో ఈ తరహాలో మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటి అణిచివేతకు గతంలో అమలాపురం డీఎస్పీగా పనిచేసిన ప్రస్తుత విశాఖ సీపీ టి.యోగానంద్ ప్రత్యేక దర్యాప్తు, విచారణతో అలాంటి నేరాలను అదపు చేస్తున్నారని రాజప్ప గుర్తు చేశారు. బార్ అసోసియేషన్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలని సూచించారు. అందుకు తన సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. పేదలకు ఉచిత న్యాయం అందించాలని ఆయన ఆకాంక్షించారు. వాస్తవంగా తప్పులు చేసిన వారికి శిక్ష పడేలా న్యాయవాదులు పనిచేయాలని రాజప్ప సూచించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మట్టపర్తి మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాజప్పను అసోసియేషన్ తరపున ఘనంగా సత్కరించారు. ఆయనతోపాటు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, జడ్పీ చైర్మన్ నామన రాంబాబు, రాజోలు, అమలాపురం ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, అయితాబత్తుల ఆనందరావు, వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి, మాజీ ఎమ్మెల్సీ, పీసీసీ ప్రధాన కార్యదర్శి గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యం అప్పనపల్లి (మామిడికుదురు) : టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. రాజప్ప దంపతులు ఆదివారం అప్పనపల్లి శ్రీబాలబాలాజీస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రంలో విజయవాడ, శ్రీశైలం పుణ్యక్షేత్రాలకు ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ ఆలయాలను మరింత అభివృద్ధి చేసే లక్ష్యంతో ఐఏఎస్ అధికారులకు అక్కడ నియమించామన్నారు. జిల్లాలో వాడపల్లి, అప్పనపల్లి పుణ్య క్షేత్రాలను కూడా అభివృద్ధి చేయడంతో పాటు స్థానికంగా ఉన్న వనరులను వినియోగించుకుని వీటిని టెంపుల్ టూరిజం కేంద్రాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించామన్నారు.లంక గ్రామాలు ముంపు బారిన పడకుండా ఉండేందుకు కాజ్‌వేల ఎత్తు పెంచేలా కార్యాచరణ చేపట్టామన్నారు. తీర గ్రామాలకు సాగునీరు అందించే అప్పనపల్లి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. రైల్వేలైన్ నిర్మాణంలో భాగంగా కోటిపల్లి నదిపై వంతెన నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు. ఈ సీజన్లోనే పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంటామని రాజప్ప తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో 20 ఎకరాల విస్తీర్ణంలో అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. పలువురు పార్టీ నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. -
అక్రమ నిర్మాణాలపై చర్యలు తప్పవు
కొవ్వూరు రూరల్: నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇళ్లను గడువులోగా భవన క్రమబద్ధీకరణ (బీపీఎస్) పథకంలో క్రమబద్ధీకరించుకోవా లని, లేకుంటే అటువంటి నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని రాజమహేంద్రవరం రీజియన్ పట్టణ ప్రణాళిక శాఖ ఆర్జేడీ పీఎన్ఎస్ సాయిబాబా హెచ్చరించారు. స్థానిక మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ అనధికార లేఅవుట్లలో భవన నిర్మాణాలు చేపట్టరాదని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనుమతి లేని కట్టడాల ఫొటోలను ఆయా పురపాలక సంఘ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏపీ మున్సిపల్ వెబ్సైట్లో ఉంచాలని ఆదేశించామన్నారు. 20,483 దరఖాస్తులు రాజమహేంద్రవరం రీజియన్‌లోని తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో భవన క్రమబద్ధీకరణకు 20,483 దరఖాస్తులు వచ్చాయని ఆర్జేడీ సాయిబాబా తెలిపారు. వీటిలో 78 దరఖాస్తులను తిరస్కరించగా 6,104 పరిశీలనలో ఉన్నాయన్నారు. 14,286 మందికి భవన క్రమబద్ధీకరణ జరుపుతూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ట్రం లో ఆన్లైన్ ద్వారా కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేందుకు ప్రభుత్వం 2016 ఏప్రిల్‌లో ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు. సక్రమమైన బిల్డింగ్ ప్లాన్ ద్వారా గృహ నిర్మాణదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని అనుమతులు పొందవచ్చన్నారు. ఆన్లైన్లో బిల్డింగ్ ప్లాన్‌కు అప్రూవల్ వస్తే భవన యజమానికి ఎంత ఫీజు చెల్లించాలనేది మెసేజ్ ద్వారా తెలియజేస్తామని పేర్కొన్నారు. ప్లాన్ ప్రకారమే నిర్మాణం ఉండాలి దరఖాస్తుదారుడు ఆన్లైన్లో నియమ నిబంధనలు తప్పక పాటించాలని, మం జూరైన ప్లాన్ ప్రకారమే నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. టౌన్ ప్లానింగ్ సిబ్బందికి మెస్సర్స్ సాఫ్ట్ టెక్నాలజీ ఇంజినీరింగ్స్ సంస్థ ప్రతినిధులు శిక్షణ ఇస్తారని చెప్పారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఎప్పటికప్పుడు పోస్ట్ వెరిఫికేషన్ చేయాలని, నిబంధనలను అతిక్రమించి కట్టడాలు చేపడితే సంబం ధిత సిబ్బంది, ప్లాను వేసి లైసెస్డ్ సర్వేయర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొవ్వూరు మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం కొవ్వూరు పట్టణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ కోరుతూ మున్సిపల్ కౌన్సిల్ అభ్యర్థించగా ప్రభుత్వం ఆమోదం తె లిపిందని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం టెండర్ విధానం ద్వారా ఆన్ గ్రౌండ్ అభివృద్ధి, శాటిలైట్ చిత్రాల ద్వారా రివైజ్డ్ మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తామని ఆర్జేడీ సాయిబాబా పేర్కొన్నారు. -
సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే చర్యలు
జిల్లా ఎస్పీ రవిప్రకాష్ పిఠాపురం రూరల్ : పోలీసులు సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటే ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ రవిప్రకాష్ హెచ్చరించారు. పిఠాపురం రూరల్ పోలీసు స్టేషన్‌ను ఆదివారం రాత్రి ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో స్నేహ సంబంధాలు పెంచుకోవాలన్నారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ఫిర్యాదులను పరిష్కరించడంతో పాటు సివిల్ వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. సివిల్ దందాలో పోలీసుల పాత్ర ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. గత నెల 27న చిత్తూరులో జరిగిన బాంబు పేలుడు సంఘటనలో మావోయిస్టు దళ కమిటీ సభ్యులు హరిభూషణ్‌తో పాటు ఐతు చనిపోయినట్టు గుర్తించామన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమకు లభించాయని చెప్పారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కన్నయ్య, మోహన్‌లకు కాకినాడలో మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. అక్రమ పశు వధ, రవాణాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఇటీవల కొత్తపల్లి పోలీసు స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆత్మాహత్యాయత్నం సంఘటనలో ఆ స్టేషన్ ఎస్ఐ చైతన్యకుమార్పై సర్పవరం పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. రికార్డులు సక్రమంగా నిర్వహించని పిఠాపురం రూరల్ ఎస్ఐ వి.సుభాకర్కు మెమో జారీ చేస్తున్నట్టు తెలిపారు. -
వొకార్డ్‌కు అమెరికా డ్రగ్ రెగ్యులేటరీ దెబ్బ
న్యూఢిల్లీ: అమెరికా ఔషధ నియంత్రణా సంస్థ (యుఎస్ఎఫ్డిఎ) దేశీయ ఫార్మా దిగ్గజం వొకార్డ్ కు షాకిచ్చింది. వొకార్డ్‌కు అమెరికా ఇల్లినాయిస్లో గల అనుబంధ సంస్థ మోర్టన్ గ్రోవ్ ఫార్మాస్యూటికల్స్‌కు అక్కడి ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్‌డీఏ) హెచ్చరికలను జారీ చేస్తూ నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని వొకార్డ్ బిఎస్ఇ ఫైలింగ్ లో బుధవారం వెల్లడించింది. అలాగే తదుపరి ఆదేశాలవరకు తమ కొత్త ఆమోదాలకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది. అయితే ఈ వార్నింగ్ లెటర్‌కు సంబంధించిన వివరాలు అందించడానికి నిరాకరించింది. అలాగే మార్కెట్లో అందుబాటులో ఉన్న కరెంట్ పోర్ట్ ఫోలియో లో విక్రయాలకుఎలాంటి ఆటంకం ఉండదని వివరించింది. ఈ హెచ్చరికల కారణంగా సమస్య పరిష్కారమయ్యేంతవరకూ యూఎస్ఎఫ్డీఏ నుంచి మార్టన్ గ్రోవ్కు ఎలాంటి కొత్త అనుమతులూ లభించబోవు. ఈ ప్రకటనతో అసలే వీక్ గా ఉన్నీ కౌంటర్లో అమ్మకాలకు తెరలేచింది. దీంతో దాదాపు 7శాతం నష్టపోయింది. కాగా గత ఏడాది వొకార్డ్‌కు చెందిన యూకే అనుబంధ సంస్థ సీపీ ఫార్మాస్యూటికల్స్‌కు యూఎస్ ఎఫ్ఢీఏ నుంచి ఇలాంటి హెచ్చరికలు అందాయి. కాగా 2014లో క్వాలిఫైడ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ప్రొడక్ట్ (క్యుఐడిపి) హోదా పొందిన తొలి భారతీయ కంపెనీగా వొకార్డ్ చరిత్ర సృష్టించింది. -
అధికారుల తీరుపై న్యాయపోరాటం చేస్తా
ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా దివీస్ బాధిత రైతులు చేపట్టిన దీక్షకు మద్దతు తొండంగి : దివీస్ యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ అధికారులు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టులో న్యాయపోరాటం చేస్తానని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులకు, ప్రజలకు భరోసా ఇచ్చారు. సాగు భూముల్లో దివీస్ యాజమాన్యం చేపట్టిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు స్పందిం చకపోవడం దారుణమన్నారు. కొత్తపాకలు గ్రామంలో దివీస్ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో కొత్తపాకలు, పంపాదిపేట, తాటియాకులపాలెం తదితర గ్రామాల రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఎమ్మెల్యే రాజా పార్టీ మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, నాయకులు కొయ్య శ్రీనుబాబు, పేకేటి సూరిబాబు, మద్దకూరి చిన్నబ్బులు తదితరులు సోమవారం మద్దతు పలికారు. దీక్షలో కూర్చున రైతులు, మహిళలు, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వాశేషుబాబ్జితో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రోత్సాహంతోనే దివీస్ యాజమాన్యం బలప్రయోగానికి దిగుతుందన్నారు. బాధిత రైతులకు పూర్తిగా న్యాయం జరిగే వరకూ వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. ప్రజల ఆరోగ్యం గుర్తురాలేదా? ప్రజల ఆరోగ్యంతో ఉండాలన్న లక్ష్యంతో యనలమ ఫౌండేషన్‌ను స్థాపించామని చెబుతున్న ఆర్థిక మంత్రి యనమలకు కోన ప్రజలు, రైతుల ఆరోగ్యం గుర్తురాలేదా అని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. దీర్ఘకాలం ఈ ప్రాంత ప్రజల మద్దతుతో రాజకీయంగా ఎదిగిన యనమల ఇప్పుడా ఆ ప్రజల మనుగడ ప్రశ్నార్థకంగా మారేలా వ్యవహరించడం తగదన్నారు. ఎమ్మెల్యే వెంట వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, నాయకులు మద్దుకూరి వెంకటరామయ్య చౌదరి, మేరుగు ఆనందహరి, యూత్ కన్వీనర్ ఆరుమిల్లి ఏసుబాబు, పెరుమాళ్లలోవరాజు, కాలిన అప్పారావు, కొంజెర్ల వీరబ్బాయి, మేడిశెట్టి సుబ్బారావు, వెల్నాటి బుజ్జి, కందాబాబ్జి, చొక్కా కోదండం, చొక్కా రామచంద్రరావు, గాబురాజు, మేడిÔð ట్టి ఈశ్వరరావు, మేడిశెట్టి దారబాబు ఉన్నారు. రైతులను అడ్డుకున్న పోలీసులు దివీస్ చేపట్టిన అక్రమ నిర్మాణాలు జరిగిన ప్రాంతానికి బాధిత రైతులు, ప్రైవేటు సర్వేయర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జి తదితరులు వెళ్లే ప్రయత్నం చేశారు. వీరిని పోలీసులు అడ్డుకోవడంతో కొంత వాగ్వివాదం జరిగింది. దీంతో శాంతియుతంగా చేపట్టిన దీక్షల నేపథ్యంలో రైతులంతా చట్టపరంగానే పోరాటం చేస్తామంటూ దీక్షాబిరానికి చేరుకున్నారు. బాధిత రైతులు లేకుండా కేవలం గంటలోనే ఆదివారం అధికారులు సర్వే పూర్తి చేసి ఎటువంటి ఆక్రమణలు దివీస్ యాజమాన్యం నిర్మించలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వాశేషుబాబ్జి అన్నారు. బాధిత రైతులకు న్యాయం జరిగేంత వరకూ తాము ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కేఎస్ శ్రీనివాసరావు, జిల్లా నాయకుడు కె.సింహాచలం, కొవిరి అప్పలరాజు, సీఐటీయూ మండల నాయకుడు బద్ది శ్రీను ఉన్నారు. -
డీమానిటైజేషన్: రాష్ట్రపతి హెచ్చరిక
న్యూడిల్లీ: డీమానిటైజేషన్ పై దేశాధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ స్పందించారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్ల వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన రాష్ట్రపతి పెద్దనోట్ల రద్దు కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ తాత్కాలికంగా మందగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు.అయితే సుదీర్గ ఫలితాలు కోసం ఈ ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. నల్లధనాన్ని అరికట్టి, అవినీతిపై పోరాటం కోసం చేపట్టిన పెద్ద నోట్ల రద్దుతో తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చని ప్రణబ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ భేటీలో పాల్గొన్న ప్రణబ్.. డిమానిటైజేషన్ కారణంగా పేదలు ఇబ్బందుల పాలు కాకుండా చూడాలని, అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. పేదరికం నిర్మూలనలో కోసం చేపట్టిన ఈ ప్రక్రియను ప్రశంసిస్తూనే..నోట్ల కష్టాలను సుదీర్ఘంకాలం భరించలేరని భావిస్తున్నానన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంతో పాటు ఇతర యంత్రాంగం కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి అవసరం ఉందన్నారు. అలాగే భవిష్యత్తులో ఆకలి, నిరుద్యోగం, దోపిడీ నిర్మూలనలో జాతికోసం జరుగుతున్న పయనంలో ప్రజలు చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. సుదీర్ఘ ఫలితాలు సాధించాలంటే తాత్కాలికంగా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేందుకు సిద్ధపడక తప్పదని ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. -
తీవ్ర మార్పులు చేశారో...సీబీడీటీ గట్టి వార్నింగ్!
న్యూఢిల్లీ: పన్నుచెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖకు చెందిన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ మార్పుల్లో అక్రమాలకుపాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. పునశ్చరణ నియమాలను దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించిన వారిపై కఠిన చర్యలు తప్పవని బుధవారం హెచ్చరించింది. అక్రమాలను గుర్తిస్తే దర్యాప్తు చేస్తామని సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది. ఐటీఆర్ లోని నిబంధనను ఉపయోగించుకొని "విపరీత మార్పులు" చేస్తే జరిమానా, చట్టపరమైన శిక్షలు విధించనున్నట్టు తెలిపింది. పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ లో భారీ మార్పులు చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దాఖలు చేసిన ఐటీ రిటర్న్స్ మార్పులు చేసుకునే అవకాశాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని సీబీడీటీ భావిస్తోంది. ఐటిఆర్ లో అవకతవకలకు పాల్పడినవారిపై విచారణ చేపట్టి జరిమానా విధించనున్నట్టు హెచ్చరించింది. ఐటీ చట్టం 139)(5) నిబంధనను సెక్షన్ ప్రకారం ఐటీ రిటర్న్స్ లో మార్పులకు చేర్పులకు అవకాశం ఉంది. క్యాష్ ఇన్ హ్యాండ్, లాభాలు వగైరాల వివరాలను మార్చుకోవచ్చు. అయితే సరైన ఆదాయం నిర్ధారించేందుకు ఆయా కేసులను తప్పనిసరిగా పరిశీలిస్తామని చెప్పింది. అక్రమాలు చో్టు చేసుకున్నట్టు తేలితే ప్రాసిక్యూషన్, పెనాల్టీ అర్హులని సీబీడీటీ వెల్లడించింది. -
ట్రంప్‌కు ఒబామా హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా నిఘా సంస్థ సీఐఏ, ఇతర ఏజెన్సీల విషయంలో ట్రంప్ అనుసరిస్తున్న తీరు సరిగా లేదని.. అది ప్రమాదకరమైన ధోరణి అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు. డెమోక్రటిక్ పార్టీని, ముఖ్యంగా హిల్లరీని లక్ష్యంగా చేసుకొని జరిగిన సైబర్ దాడులలో రష్యా పాత్ర ఉందంటూ ఇటీవల సీఐఏ అందించిన రిపోర్ట్‌ను ట్రంప్ తోసిపుచ్చారు. ఇరాక్ విషయంలోనూ ఏజెన్సీల పనితీరు సరిగా లేదని ట్రంప్ మండిపడ్డారు. అమెరికా తదుపరి అధ్యక్షుడిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్న ట్రంప్.. నిఘా సంస్థలతో మంచి సంబంధాలను ప్రారంభించాల్సిన ప్రస్తుత తరుణంలో ఆయన తీరు మాత్రం భిన్నంగా ఉంది. దీంతో ట్రంప్ అనుసరిస్తున్న 'ఫ్లయింగ్ బ్లైండ్' విధానం ప్రమాదకరమైనదని ఓ మీడియా కార్యక్రమంలో మాట్లాడుతూ ఒబామా హెచ్చరించారు. 'నువ్వు ఎంత స్మార్ట్ అనేది ముఖ్యం కాదు. ఒక మంచి నిర్ణయం తీసుకోవాలంటే.. దానికి సంబంధించిన బెస్ట్ ఇన్ఫర్మేషన్ను మనం పరిశీలించాలి' అని ఒబామా అన్నారు. -
నల్లధనం వెలికితీసే అస్త్రాలు సిద్ధం
విశాఖ జోన్ ఇన్‌కంటాక్స్ కమిషనర్ ఓంకారేశ్వర్ భానుగుడి (కాకినాడ) : దేశంలో పన్ను పరిధిలోకి రాకుండా బ్లాక్‌మనీ రూపంలో చలామణిలో ఉన్న సొమ్ము రూ.14.5 లక్షల కోట్లని, అందులో రూ.ఎనిమిది లక్షల కోట్లు బ్యాంకు ఖాతాల్లో ఉండగా మిగిలిన నల్లధనాన్ని డిసెంబరు 30 నాటికి ఏ మూలనఉన్నా వెలికితీసేందుకు అస్త్రాలు సిద్ధంగా ఉన్నాయని విశాఖపట్నం జోన్ ఇన్‌కంటాక్స్ కమిషనర్ ఓంకారేశ్వర్ హెచ్చరించారు. సోమవారం స్థానిక మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో వ్యాపార సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో నల్లకుబేరులకు పలు హెచ్చరికలు జారీచేశారు. 2017 జనవరి నుంచి జీఎస్టీ బిల్లు అమలు కానుందని, దాచుకున్న నల్లధనాన్ని బయటపెట్టకుంటే కటాకటాల పాలవ్వాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్నారు. లక్ష్యంగా పెట్టుకున్న సొమ్ములో రూ.7వేల కోట్లు ఉగ్రవాదుల వద్ద, రూ.700 కోట్లు ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లలో ఉన్న మావోయిస్టుల వద్ద ఉందని ఇది రికవరీ కాదన్నారు. మిగిలినదంతా ఏ రూపంలో ఉన్నా పన్ను పరిధిలోకి తెచ్చేలా చర్యలు ఉంటాయన్నారు. 25 కోట్ల పాన్‌కార్డులు జారీచేస్తే అందులో ఐదుకోట్ల మంది మాత్రమే వాడుతున్నారన్నారు. ప్రభుత్వం తీసుకొనే ప్రతి విధాన నిర్ణయానికి కొందరు మోకాలడ్డుతూ పన్ను ఎగవేద్దామనుకుంటున్నారని, రానున్న చట్టాలతో అడ్డులన్నీ తొలగిపోనున్నట్టు పేర్కొన్నారు. కెన్యాలో 80 శాతం లావాదేవీలన్నీ నగదు రహితమేనని, మున్ముందు మనదేశం యావత్తు అదే తరహా వ్యవస్థ ఏర్పాటు కానుందన్నారు. పన్ను చెల్లించకుండా దాచినది ఏదైనా ( బంగారం, భవనాలు, స్థలాలు) అది బ్లాక్‌మనీ లిస్టులోకే వస్తుందన్నారు. అలా దాచినవారెవరైనా కఠినశిక్షలు అనుభవించక తప్పదని ఓంకారేశ్వర్ హెచ్చరించారు. వ్యాపారస్తులు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన దాడుల్లో 300 కోట్ల నగదు స్వాధీన పరుచుకున్న చరిత్ర ఉందన్నారు. ఇక అంతా బ్యాంకుల ద్వారానే లావాదేవీలు జరగనున్నందున దాచినవన్నీ బయటపెట్టి శిక్షల నుంచి తప్పించుకోవాలని సూచించారు. ఈ నగదు రహిత లావాదేవీల కారణంగా పేదప్రజలకు న్యాయం జరుగుతుందని, సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అర్హులకు అందుతాయన్నారు. ఈ సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు గ్రంధినారాయణరావు(బాబ్జీ), పలు వ్యాపార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
‘నీ పార్టీ పనైపోయింది బాబు’
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రజాగర్జనకు భారీ స్పందన చింతూరు : రాష్ట్రంలో టీడీపీ పనైపోయిందని అయినా నన్నేం చేయలేరని చంద్రబాబు విర్రవీగుతున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం స్ఫూర్తిగా ఆయన్ని తరిమి కొడతామన్నారు. పార్టీ ఆధ్వర్యంలో విలీన మండలాల్లో నిర్వహించిన పాదయాత్ర ముగింపు సందర్భంగా సోమవారం చింతూరులో ప్రజాగర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్, రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ఫిరాయించడం ద్వారా బలపడుతున్నానని చంద్రబాబు భ్రమపడుతునారని, ఆయన వెంట నాయకులే తప్ప ప్రజలంతా వైఎస్సార్ సీపీ, వామపక్షాల వైపే ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఉద్యమాలను అణగ దొక్కడం, ఉద్యమకారులను అరెస్టు చేసి జైళ్లకు పంపడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందని, దివీస్ కంపెనీకి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజలకు మద్దతు తెలిపితే తనను కూడా జైల్లో పెట్టారని ఆయన తెలిపారు. నోట్ల రద్దుతో దేశమంతా అట్టుడుకుతోందని, కార్మికులు, రైతుల్లో అసంతృప్తి పెరిగిపోతోందన్నారు. పోలవరం ముంపు కింద గతంలో ఎకరాకు రూ.లక్షా 15 వేలు ఇచ్చిన రైతులకు పరిహారం పెంచి ఇవ్వడం కదురదంటూ స్వయంగా చింతూరులో చంద్రబాబు తేల్చి చెప్పారని, పార్లమెంటు ఆమోదించిన కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఐదేళ్లలో ప్రాజెక్టు చేపట్టకపోతే తిరిగి వారికి పరిహారం చెల్లించాలని ఉన్నా ఇవ్వమనడం సబబు కాదన్నారు. పోలవరం ఉద్యమం భవిష్యత్ ప్రణాళికలో భాగంగా డిసెంబరు 5న ముఖ్యమంత్రిని కలసి సమస్యలు వివరిస్తామని, 6న వామపక్ష పార్టీలు, సంఘాలతో కలసి చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, మాజీ ఎంపీ మిడియం బాబూరావు, మాజీ ఎమ్మెల్యే కుంజా బొజ్జి, జిల్లా కార్యదర్శి అరుణ్, రాష్ట్ర నాయకులు కృష్ణమూర్తి, సుబ్బారావు, జిల్లా నాయకులు ప్రకాష్, రాధ, మురళి, శిరమయ్య, పెంటయ్య, సీతారామయ్య, శేషావతారం, వెంకట్, కృష్ణ, సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రజాగర్జనకు విశేష స్పందన సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం చింతూరులో నిర్వహించిన ప్రజాగర్జన సభకు విశేష స్పందన లభించింది. ఈ నెల నాలుగు నుంచి 28 వరకు విలీన మండలాల్లోని 250 గ్రామాల్లో 600 కిలోమీటర్ల మేర నాయకులు పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. 200 గ్రామాల్లో ప్రజలు తాగునీరు, విద్య, వైద్యం సరిగా అందడం లేదని నాయకులు తెలిపారు. ప్రజాగర్జన సందర్భంగా చింతూరులో నిర్వహించిన ర్యాలీలో పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్, రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులకు గిరిజన సాంప్రదాయ రీతిలో కొమ్ము, కోయ నృత్య బృందం తమ నృత్యాలతో స్వాగతం పలికింది. అనంతరం చింతూరులో నిర్వహించిన సభకు నాలుగు మండలాలకు చెందిన ప్రజలు భారీగా హాజరయ్యారు. ఈ సభకు వైఎస్సార్సీపీ నాయకులు, సీపీఐ నాయకులు హాజరై తమ సంఘీభావం ప్రకటించారు. నాయకుల ప్రసంగానికి ముందు ప్రజానాట్య కళామండలి సభ్యులు పలు నృత్యాలను ప్రదర్శించారు. -
హర్షకుమార్ ! పిచ్చి మాటలు తగ్గించుకో
కారెం శివాజీ కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : దళిత వ్యతిరేకి అయిన అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పిచ్చిమాటలు తగ్గించుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. లాలాచెరువు వద్ద గల దళిత, గిరిజన మహాగర్జన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాగర్జనకు దళిత, గిరిజనులను రాకుండా చేయడానికి హర్షకుమార్ విశ్వప్రయత్నాలు చేశారని ఆరోపించారు. పాతనోట్ల రద్దు ప్రభావం దేశ వ్యాప్తంగా ఉన్నా ఆర్థిక ఇబ్బందులను అధిగమించి దళిత, గిరిజన మహా గర్జన సభను విజయవంతం చేశారని శివాజీ అన్నారు. మహాగర్జన వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. క్రైస్తవులకు సమాధుల స్థలం, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, రెండు వారధుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు గోదావరి నదీ తీరాన బుద్ధ విహార్ నిర్మాణానికి సీఎం అంగీకరించారని శివాజీ వివరించారు. గర్జనకు వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, దళిత నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. దళిత, గిరిజన మహాగర్జన కన్వీనర్ అజ్జరపు శ్రీనివాస్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ధనరాశి శ్యామ్‌సుందర్, నాయకులు తాళ్లూరి బాబూరాజేంద్రప్రసాద్, కోరుకొండ చిరంజీవి, నీలాపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు -
హర్షకుమార్ ! పిచ్చి మాటలు తగ్గించుకో
కారెం శివాజీ కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : దళిత వ్యతిరేకి అయిన అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పిచ్చిమాటలు తగ్గించుకోవాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారెం శివాజీ అన్నారు. లాలాచెరువు వద్ద గల దళిత, గిరిజన మహాగర్జన కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మహాగర్జనకు దళిత, గిరిజనులను రాకుండా చేయడానికి హర్షకుమార్ విశ్వప్రయత్నాలు చేశారని ఆరోపించారు. పాతనోట్ల రద్దు ప్రభావం దేశ వ్యాప్తంగా ఉన్నా ఆర్థిక ఇబ్బందులను అధిగమించి దళిత, గిరిజన మహా గర్జన సభను విజయవంతం చేశారని శివాజీ అన్నారు. మహాగర్జన వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించిందన్నారు. క్రైస్తవులకు సమాధుల స్థలం, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, రెండు వారధుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు గోదావరి నదీ తీరాన బుద్ధ విహార్ నిర్మాణానికి సీఎం అంగీకరించారని శివాజీ వివరించారు. గర్జనకు వచ్చిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, దళిత నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. దళిత, గిరిజన మహాగర్జన కన్వీనర్ అజ్జరపు శ్రీనివాస్, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ధనరాశి శ్యామ్‌సుందర్, నాయకులు తాళ్లూరి బాబూరాజేంద్రప్రసాద్, కోరుకొండ చిరంజీవి, నీలాపు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఆ నోట్లు తీసుకుంటున్నారా? అయితే జాగ్రత్త!
ముంబై: దేశంలో నకిలీ కరెన్సీ చలామణీ పెరుగుతున్న నేపథ్యంలో రూ.500, రూ.1,000 నోట్లను స్వీకరించేటపుడు ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంలో ఈ నోట్లలో నకిలీలు పెరుగుతున్నందున, వాటిని స్వీకరించడంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆర్బీఐ సూచించింది. "జాగ్రత్తగా పరిశీలించిన" తరవాతే ఆ నోట్లు తీసుకోవాలని కోరింది. రోజువారీ లావాదేవీల్లో నకిలీనోట్లను ప్రవేశపెట్టేందుకు అసాంఘిక శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆర్బీఐ వివరించింది. నకిలీ కరెన్సీ చలామణి దారులు హయ్యర్ డినామినేషన్ లో ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్టు తమదృష్టికి వచ్చిందని తెలిపింది. కొంచెం నిశితంగా పరిశీలిస్తే నకిలీ నోట్లను గమనించడం చాలా సులువనీ, దీనికి సంబంధించిన వివరాలను ఆర్బీఐ వెబ్సైట్లో అందుబాటులో వున్నాయని పేర్కొంది. వెబ్సైట్లో పొందపర్చిన నోట్లపై ఉండే భద్రతా ప్రమాణాలను పరిశీలించాలని కోరింది. నకిలీ నోట్లను కలిగి ఉండడం, మార్పిడి, అంగీకారం, నకిలీ నోట్లను చెలామణి చేయడం, అలాంటి సహకరించిన వారికి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కఠినమైన శిక్షలు తీసుకుంటాయని హెచ్చరించింది. నకిలీ నోట్ల చలామణిని గుర్తించడంలో సహాయం చేయాలని అధికారులు, ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అలాగే పెద్ద సంఖ్యలో భారతీయ నోట్ల ఉపయోగం కోసం అదనపు గుర్తింపు అవసరాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ చెప్పింది. -
అమెరికాకు చైనా వార్నింగ్
-
అమెరికాకు చైనా వార్నింగ్
న్యూఢిల్లీ, బీజింగ్‌ల మధ్యనున్న సరిహద్దు సమస్యలో మధ్యలో తలదూర్చవద్దని అమెరికాకు చైనా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. చైనీస్ బోర్డర్‌కు పక్కనే ఉన్న అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ప్రాంతంలో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ పర్యటించిన అనంతరం, బీజింగ్ ఈ హెచ్చరికలు చేసింది. అమెరికా చేస్తున్న ఈ కార్యకలాపాలు ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను మరింత జటిలం చేయడమేనని, విద్రోహ శాంతిని రెచ్చగొట్టడేమనని విమర్శించింది. "ఏ ప్రాంతానైతే మీ సీనియర్ దౌత్య అధికారి సందర్శించారో, ఆ ప్రాంతం చైనా, భారత్‌లకు మధ్య వివాదాస్పదమైన రీజియన్‌గా ఉంది. చైనా, భారత్ వివాదాస్పదమైన ప్రాంతంలో అమెరికా రాయబారి సందర్శించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం" అని చైనా విదేశీ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ మీడియా ముందు వెల్లడించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి వాయువ్యంలో ఉన్న తవాంగ్ పట్టణం స్థానిక సంప్రదాయ జానపద పండుగ ఉత్సవాలను ఇటీవలే ఘనంగా నిర్వహించింది. ఈ ఫెస్టివల్‌కు అమెరికా రాయబారి వర్మ హాజరయ్యారు. ఈ ప్రాంతానే దక్షిణ టిబేట్గా చైనా పిలుచుకుంటోంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ జిల్లా తమదేనని చైనా వాదిస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్య నెలకొంది. అమెరికా రాయబారి ఈ ప్రాంతాన్ని సందర్శించడం సరిహద్దు ప్రాంతంలో వివాదాన్ని మరింత జఠిలం చేయడమేనని, శాంతి హరించి, సరిహద్దు ప్రాంతంలోని ప్రశాంతత వాతావరణానికి హానికలిగించడమేనని లూ వ్యాఖ్యానించారు. చైనా, భారత్‌ల మధ్య ఉన్న సరిహద్దు సమస్యల్లో అమెరికా తలదూర్చడాన్ని ఆపివేయాలని తాము కోరుతున్నట్టు లూ పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతికి అమెరికా కట్టుబడి ఉండాలని తెలిపారు. మూడో పార్టీ ప్రమేయంతో సరిహద్దు సమస్యలు మరింత సెన్సిటివ్‌గా మారే అవకాశముందని లూ భయాందోళ వ్యక్తంచేశారు. ఇరుదేశాల సంప్రదింపులతో ప్రాదేశిక వివాదాలను పరిష్కరించుకోవాలని తాము ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ వివాదాలను భారత్, చైనాలు సమసిపోయేలా చేసుకోగలవని విశ్వసిస్తున్నట్టు లూ ఆశాభావం వ్యక్తంచేశారు. -
జీఎస్టీ మినహాయింపులపై జైట్లీ హెచ్చరికలు
న్యూఢిల్లీ : దేశమంతటినీ ఒకే పన్ను విధానంలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఆమోదించిన జీఎస్టీ బిల్లుపై అత్యధిక మొత్తంలో మినహాయింపులు రావడాన్ని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ తప్పుబట్టారు. ఈ బిల్లుపై ఎక్కువ మినహాయింపులు రావడం, ఇతరులకు ఎక్కువ రేటు విధించే అవకాశాలకు దారితీస్తుందని హెచ్చరించారు. జీఎస్టీ బిల్లుపై కీలక అంశాలపై చర్చించడానికి ఒక్కరోజు ముందుగానే ఆర్థికమంత్రి ఈ హెచ్చరికలు చేయడం గమనార్హం. ఈ రేటు నుంచి ఎక్కువ మొత్తంలో మినహాయింపు ఇవ్వడం, ఇతరులపై అత్యధిక రేటు భారం పడే అవకాశం ఉందన్నారు. ఇన్క్రిడబుల్ ఇండియా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్‌లో జైట్లీ ప్రసంగించారు. ప్రోత్సహకాలు, మినహాయింపులతో భారత్ నిరవధికంగా ముందుకు సాగలేదని తెలిపారు. జైట్లీ హెచ్చరికలతో మినహాయింపు కోరుతూ ప్రభుత్వంతో ప్రస్తుతం లాబీయింగ్ చేస్తున్న వారికి నిరాశే ఎదురయ్యేటట్టు కనబడుతోంది. ఎక్కువ మొత్తంలో మినహాయింపులకు ప్రభుత్వం అవకాశం ఇవ్వదని వెల్లడవుతోంది. జీఎస్టీ కౌన్సిల్, కేంద్ర, రాష్ట్ర బాడీలు మొదటిసారి గురువారం, శుక్రవారం భేటీ అవుతున్నాయి. జీఎస్టీ రేటుతో పాటు, మినహాయింపులు ఇతర అంశాలను ఇవి చర్చిస్తాయి. ఈ చర్చల అనంతరం కేంద్ర జీఎస్టీ చట్టాన్ని, అంతరాష్ట్ర జీఎస్టీ చట్టాన్ని ప్రభుత్వం రూపొందించనుంది. వాటాదారుల సంప్రదింపుల అనంతరం ఈ చట్టాలు పార్లమెంట్ ముందుకు రానున్నాయి. 2017 ఏప్రిల్ 1 నుంచి ఎలాగైనా జీఎస్టీ బిల్లును అమలుచేయాలని కేంద్రం యోచిస్తోంది. ద్రవ్యోల్బణ పెంపు భయాందోళనలు లేకుండా ప్రామాణికమైన జీఎస్టీ రేటును నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ రేటు నుంచి ఎన్ని ఉత్పత్తులు మినహాయింపు పొందనున్నాయి. ఎన్ని తక్కువ రేటు ప్రయోజనం పొందనున్నాయి, వేటికీ భారం కొంత ఎక్కువ పడొచ్చో ఇక తేలాల్సి ఉంది. -
ఆపిల్ యూజర్లకు తాజా వార్నింగ్
కాలిఫోర్నియా: ప్రముఖ మొబైల్ మేకర్ ఆపిల్ వినియోగదారులకు మరో స్కాంకు సంబంధించి తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఐట్యూన్స్ గిఫ్ట్ కార్డ్, మనీ ట్రాన్స్ఫర్ పేరుతో జరుగుతున్న టిపిక ల్ స్కాం పట్ల యూజర్లను అప్రమత్తం చేసింది. ఐ ట్యూన్స్ బహుమతి కార్డులు కొనుగోలు ద్వారా డబ్బు బదిలీకి ఒత్తిడి చేస్తున్న మోసగాళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ వినియోగదారులను హెచ్చరించింది. ఆపిల్ తన అధికారిక వెబ్ సైట్ లో ఈ హెచ్చరికలను జారీ చేసింది. ఆపిల్ అందించిన సమాచారం ప్రకారం మొదట..ఈ తరహా నేరగాళ్లు పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేదా వేల డాలర్ల విలువగల గిప్ట్ కార్డ్ లు కొనుగోలు చేయమంటూ యూజర్లను మభ్యపెడతారు. అనంతరం యూజర్ ద్వారా 16 అంకెల కార్డు కోడ్ ను తెలుసుకొని మోసాలకు పాల్పడుతారని అధికారిక వెబ్ సైట్ లో హెచ్చరించింది. తాము ఎలాంటి నగుదు బట్వాడాలేవీ అంగీకరించడం లేదని, అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఐ ట్యూన్స్ కార్డులు, ఆన్ లైన్ కొనుగోళ్లకు, డిజిటల్ సంగీతం, పుస్తకాలు, యాప్స్ కొనుగోళ్లకు మాత్రమే ఉపయోగించుకోవాలని స్పష్టం చేసింది. గతంలో అధికారులు ప్రీపెయిడ్ డెబిట్ కార్డులకు సంబంధించి ఇలాంటి స్కామ్ గురించి హెచ్చరించారు. మరోవైపు పాపులర్ యాపిల్ గిఫ్ట్ కార్డుల ద్వారా నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, వీటిని ట్రేస్ చేయడం కష్టంగా మారిందని ఇటీవల ఐఆర్ఎస్, ఫెడరల్ ట్రేడ్ కమిషన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో యాపిల్ ఈ తాజా వార్నింగ్ జారీ చేసింది. అలాగే ఆన్ లైన్ లో పెద్దమొత్తంలో కొనుగోళ్లు చేస్తున్న వారికి తరచూ టిప్స్ యిస్తూ, అప్రమత్తం చేస్తున్నట్టు ఆపిల్ వెల్లడించింది -
అశాంతికి కారణమౌతున్న వారిని ఉపేక్షించం
-
అశాంతికి కారణమౌతున్న వారిని ఉపేక్షించం: మోదీ
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ లో అశాంతి సృష్టిస్తూ, కావాలనే అల్లర్లకు కారణమౌతున్న వారిని ఉపేక్షించేది లేదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హెచ్చరించారు. కశ్మీర్ లో కుట్రలు పన్నుతున్నవారికి సమాధానం చెప్పితీరుతామని స్పష్టం చేశారు. శాంతి స్థాపన విషయంలో అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా ఉండి సహకరించాల్సిందిగా కోరారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ 22 మంది సభ్యులతో కశ్మీర్ గురించి ప్రపంచం మొత్తం ప్రచారం చేస్తాననడం వేర్పాటు వాదులకు మరింత ఊతమిచ్చేదిగా ఉందని అన్నారు. కశ్మీర్లో అశాంతిని సృష్టించేందుకు పాకిస్థాన్ నుంచి రూ.24 కోట్లు చేరాయని చెప్పారు. కాగా కశ్మీర్ లో బుర్హాన్ వనీ మరణానంతరం చెలరేగిన అల్లర్లు 51 వ రోజుకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు 70 మంది మృతి చెందగా 5000 మంది గాయపడ్డారు. -
వారి కంటే పది రెట్లు క్రూరంగా వ్యవహరించగలను
మనీలా: ఫిలిప్పీన్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్టె ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికను జారీ చేశారు. తాను తలుచుకుంటే ఉగ్రవాదుల కంటే పది రెట్లు కిరాతకంగా వ్యవహరించగలనని అన్నారు. ఉగ్రవాదులకు ఒక సిద్ధాంతం లేదని వారికి మతమంటే ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు. ప్రజలను వికలాంగులుగా చేస్తూ, మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారని అన్నారు. అత్యంత కిరాతకంగా ప్రజల తలలను నరికేస్తున్నారని మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు కట్టుబడి ఉంటానని ప్రతిజ్ఞ చేశారు. -
దలైలామా..లేడీగాగా..చైనా వార్నింగ్
బీజింగ్: ప్రముఖ ఆధ్యాత్మిక బౌద్ధ గురువు దలైలామాను చైనా మరోసారి హెచ్చరించింది. దలైలామా అమెరికాతో మైత్రిని కొనసాగించడంపై చైనా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా పర్యటనలో ఉన్న దలైలామా ఆదివారం ఇండియానా పోలీస్ లో అమెరికా మేయర్ల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చైనా విదేశాంగ ప్రతినిధి హాంగ్ లీ స్పందిస్తూ..దలైలామా టిబెట్ పై అంతర్జాతీయంగా మద్దతును సాధించడానికే విదేశాలలో పర్యటిస్తున్నారని ఆరోపించారు. కాగా అంతకు ముందు తనను కలిసిన పాప్ సింగర్ లేడీగాగాకు ప్రేమ, కరుణ, ఆధ్యాత్మిక విషయాలను ఆయన వివరించారు. ఇక రెండు వారాల క్రితం ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అయిన విషయం తెలిసిందే. -
దేశంలో మూడోవంతు ఏటీఎంలు గోవిందా!
న్యూఢిల్లీ: దేశంలోని ఏటీఎంలలో దాదాపు మూడో వంతు పనిచేయడం లేదని రిజర్వబ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా చేసిన సర్వేలో వెల్లడైంది. తాజాగా 4,000 వేల ఏటీఎంలపై ఆర్ బీఐ నిర్వహించిన సర్వేలో ఈ విషయం బట్టబయలయింది. బ్యాంకులపై ఇందుకు సంబంధించి తక్షన చర్యలు తీసుకుంటామని ఆర్ బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముండ్రా తెలిపారు. బ్యాంకుల సర్వీసులు కస్టమర్ కు అనుకూలంగా ఉండేలా చూస్తామని అన్నారు. ఆన్ లైన్ బ్యాంకింగ్ లో నేరాలకు తావులేకుండా కొత్త నియమాలను తీసుకురావాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఉదాహరణకు ఏ వినియోగదారుడిదైనా క్రెడిట్ కార్డు పోయి అతని అకౌంట్ డబ్బును డూప్లికేట్ కార్డు ద్వారా వినియోగిస్తుంటే ఎలా పట్టుకోవాలనే విషయాలపై చర్చిస్తున్నట్లు వివరించారు. రానురాను డిజిటల్ బ్యాంకింగ్ కు ప్రాధాన్యం పెరుగుతూ పోతుండటంతో కస్టమర్ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి బ్యాంకులు గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. థర్డ్ పార్టీలకు చెందిన ఇన్సూరెన్స్ లు తదితరాలను బ్యాంకుల తరఫున ప్రోత్సహిత్సే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇతర వ్యక్తులకు సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్మకాలను నివారించేందుకు ప్రత్యేకంగా స్టాఫ్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. -
చైనానీ రెండు నాల్కల ధోరణి మార్చుకో..
మాస్కో: ఉగ్రవాదంపై చైనా తన రెండు నాల్కల ధోరణిని మార్చుకోవాలని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ ఘాటుగావిమర్శించారు. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ పై ఐక్యరాజ్య సమితిలోనిషేధం విధించే బిల్లును చైనా అడ్డుకోవడంపైఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మాస్కో పర్యటనలో ఉన్న సుష్మా రష్యా,చైనా సమ్మిట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు.'' ఉగ్రవాదంపై రెండు నాల్కలధోరణితో వ్యవహరిస్తే అది తమ దేశానికే కాకుండా ప్రపంచానికి సైతం హాని చేస్తుంది'' అని పేర్కొన్నారు. అంతకు ముందు చైనా విదేంశాంగమంత్రి వాంగ్ ఈ తో సమావేశమైన ఆమె ఐరాసలో చైనా వ్యవహరించిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏడుగురు భారత సైనికులు మృతి చెందిన పఠాన్ కోట్ సైనిక స్థావరంపై దాడి ఘటనలో అజర్ మాస్టర్ మైండ్ గా వ్యవరించాడు. దీనిపై తగిన ఆధారాలను భారత్ ఐరాసకు అందించింది. దీనిని సెక్యూరిటీ కౌన్సిల్ లోని 15 మంది సభ్యులు పరిశీలించారు. అతనిపై చర్యతీసుకునే చివరి నిమిషంలో చైనా తన వీటో అధికారంతో అడ్డుకుంది. గతంలో ముంబై దాడుల సూత్రదారి జఖి ఉర్ రహ్మాన్ లక్వీపై చర్యలు తీసుకునే విషయంలో కూడా చైనా మోకాలడ్డింది. -
ఉత్తర కొరియా అధ్యక్షుడికి రష్యా హెచ్చరిక!
మాస్కో: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన దుందుడుకు చర్యలను తగ్గించుకోవాలని రష్యా సూచించింది. శత్రుదేశాలను ఎదుర్కోవడానికి అణ్వాయుధాలను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ కిమ్ చేస్తున్న ప్రకటనలు అంతర్జాతీయ న్యాయ చట్టాల ఉల్లఘన కిందకు వస్తుందని, తద్వారా ఉత్తర కొరియాపై సైనిక చర్యకు దిగే చట్టపరమైన అవకాశం ఉంటుందని హెచ్చరిస్తూ రాష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. అంతర్జాతీయ అణ్వాయుధ నిరోధక చట్టాలను దిక్కరిస్తూ హైడ్రోజన్ బాంబు ప్రయోగం నిర్వహించి కిమ్ దూకుడును ప్రదర్శించిన విషయం తెలిసిందే. అనంతరం అణ్వాయుధాలను ప్రయోగించడానికి సిద్ధంగా ఉన్నామంటూ, బాలిస్టిక్ క్షిపణుల ద్వారా సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను సైతం చేదించేలా అణ్వాయుధాలను సూక్ష్మీకరించడంలో ఉత్తర కొరియా విజయం సాధించినట్లు కిమ్ ప్రకటించారు. ఉద్రిక్త పరిస్థితుల మధ్య అమెరికా, ఉత్తర కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా చర్యలపై రష్యా చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఐసిస్ అలకిడి..
-
'తీరు మార్చుకోకపోతే తిప్పలే'
‘‘మంత్రివర్గం ఏర్పాటై ఏడాదిన్నర దాటింది. ఏ విషయాన్ని మీరు సీరియస్‌గా పట్టించుకోవడంలేదు. మీ శాఖల అంశాలపై లోతుగా పట్టు సాధించడంలేదు. పార్టీ వ్యవహారాలను అంత శ్రద్ధగా పట్టించుకోవడంలేదు. మంత్రులం అయిపోయాంలే ఇక మాకు తిరుగు ఏముందిలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. మీ పద్ధతులు మార్చుకోండి. మీ మీ శాఖలపై పట్టు పెంచుకోండి. జిల్లాల్లోనూ పట్టు సాధించండి’’ అని ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి పనితీరు ఎలా ఉంది? మీ జిల్లాల్లో మీ పరిస్థితి ఏంటి? అన్ని సమగ్ర వివరాలు నా వద్ద ఉన్నాయి. మీరు ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని తీవ్రస్థాయిలో హెచ్చరించా రు. పనితీరు మార్చుకోకపోతే తరువాతి పరిణామాలకు చింతించాల్సి ఉంటుందని కేబినేట్ సమావేశంలో ఆయన పరోక్షంగా భవిష్యత్తు సూచనలను తెలియజేసినట్లు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. జన్మభూమి నిర్వహణ అంశంపై సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా పార్టీ ముఖ్య నాయకులతో జరిగిన సమావేశంలోనూ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. నాయకులు బాడీలాంగ్వేజ్ మార్చుకోవాలని, వ్యవహారశైలిలో, మాటతీరులో మార్పురావాలని సూచించారు. వారి చేరికవల్ల పార్టీకి ఉపయోగం ఉంటుందని భావిస్తే ఎవరినైనా పార్టీలోకి ఆహ్వానించండని ఆదేశించారు. ప్రస్తుతం పరిశ్రమలకు ఉన్న టారిఫ్‌పై 4% విద్యుత్తు ఛార్జీలను పెంచాలని కేబినెట్లో నిర్ణయం జరిగింది. గృహ వినియోగంలో 200 యూనిట్లు మించిన వారికి 2.5% ఛార్జీలను పెంచాలనే సూత్రప్రాయ నిర్ణయం జరిగింది. దీనిపై మంత్రులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడంతో మరోసారి చర్చించి నిర్ణయానికి వద్దామని మంత్రివర్గం అభిప్రాయపడింది. -
ఆక్రమణలతో నగరాలకు ముప్పు
- అప్రమత్తం కాకుంటే అన్ని సిటీలకూ చెన్నై తరహా ప్రమదం - కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హెచ్చరికలు - చెన్నైలోని ముంపు ప్రాంతాల సందర్శన, బాధితులకు పరామర్శ చెన్నై: పట్టణ ప్రాంతాల్లో మురుగు, వరద నీరు పారే నాలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని, అలాంటి ఆక్రమణల తొలగింపుపై అన్ని రాష్ట్రాలు దృష్టిసారించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే అన్ని పట్టణాలకు ఇటీవలి చెన్నై విపత్తు తరహా ముప్పు తప్పదని హెచ్చరించారు. ఆదివారం చెన్నైలోని వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాధితులను పరామర్శించారు. స్వర్ణభారత్ ట్రస్ట్ తరపున బాధితులకు బియ్యం తదితర వస్తువులను పంపిణీ చేశారు. వరద ప్రాంతాల సందర్శన అనంతరం వెంకయ్య.. తమిళనాడు సీఎం జయలలితతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆక్రమణ వల్ల ఎంతటి అరిష్టం వాటిల్లుతుందో ప్రభుత్వానికి, ప్రజలకు తెలిసి వచ్చిందన్నారు. ఈ దారుణ విపత్తు నుంచి ప్రతి ఒక్కరూ గుణపాఠం నేర్చుకోవాలని కోరారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వరదలు సంభవించే అవకాశం ఉన్నట్లు ఇటీవలే ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని, ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. -
ఫ్రాన్స్‌ను టర్కీ ముందే హెచ్చరించిందా!
పారిస్/ఇస్తాంబుల్: భారీ నరమేథం జరిగిన తర్వాత ఆకులు పట్టుకోవటంలో ఫ్రాన్స్ పోలీసులూ అతీతులు కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. గత శుక్రవారం పారిస్ నగరంలో చోటుచేసుకున్న ఉగ్రదాడులకు సంబంధించిన కీలక సమాచారం.. కొద్ది రోజుల ముందే తెలిసినప్పటికీ ఫ్రాన్స్ పోలీసులు అలసత్వం వహించారని వార్తలు వెలువడుతున్నాయి. ఏడు చోట్ల జరిగిన దాడుల్లో అత్యంత పాశవికమైనదిగా భావిస్తోన్న బెతాక్లాన్ కన్సెర్ట్ సెంటర్ ఘటనలో పాల్గొన్న ఉగ్రవాది గురించి, అతడి ప్రణాళికల గురించి ఫ్రాన్స్ పోలీసులను పలుమార్లు హెచ్చరించినట్లు టర్కీ ఉన్నతాధికారులు పేర్కొనడం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తోంది. బెతాక్లాన్ హాలులో ప్రేక్షకులను ఒక్క చోటికి చేర్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన ఉగ్రవాది ఒమర్ ఇస్మాయిల్ మొస్తాఫియా.. 2013 నుంచి టర్కీలో అక్రమంగా నివసించాడని అధికారులు చెబుతున్నారు. ఫ్రాన్స్ జాతీయుడైన 29 ఏళ్ల ఒమర్.. 2010 నుంచి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నాడని, స్వదేశంలో ఇతడిపై అనేక కేసులు కూడా నమోదయినట్లు తెలిసింది. అయితే ఇతడి కదలికలపై గట్టి నిఘా పెట్టకపోవడంతో పారిస్ దాడుల వ్యూహరచన సులువుగా అమలుచేసే అవకాశాన్ని పోలీసులే కల్పించినట్లయింది. '2014లో ఒకసారి, 2015 జూన్ లో మరోసారి ఒమర్ ఇస్మాయిల్ గురించిన సమాచారాన్ని ఫ్రాన్స్ పోలీసులకు అందించాం. ఇటీవలే తమ దేశానికి చెందిన నలుగురు ఉగ్రవాదుల జాబితాను ఫ్రాన్స్ అందించింది. ఆ జాబితాలో ఒమర్ పేరు లేకపోవడాన్ని బట్టి ఫ్రాన్స్ పోలీసులు మా హెచ్చరికలను పట్టించుకోలేదని అర్థమైంది. అయితే శుక్రవారం నాటి దాడుల తర్వాతే ఉగ్రవాది ఒమర్ వివరాలపై ఫ్రాన్స్ దృష్టి సారించింది' అని టర్కీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. బెతాక్లాన్ హాలులో 89 మందిని హతమార్చిన అనంతరం ఒమర్ ఇస్మాయిల్ తనను తాను పేల్చుకున్నాడు. సంఘటనా స్థలంలో తెగిపడివున్న చేతి వేలు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు.. అది ఒమర్ దేనని తేలటంతో అతడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఒమర్ వినియోగించిన కంప్యూటర్లతోపాటు ఇంటిని కూడా క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా పారిస్ ఉగ్రదాడిపై బ్రిటన్ ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత జెర్మీ కోర్బెయిన్ భిన్నంగా స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఐఎస్ఐఎస్ పై నేరుగా పోరాడేకంటే వారికి నిధులు సమకూర్చుతున్న దేశాల పనిపట్టాలన్నారు. ప్రధానంగా ధనిక దేశమైన సౌదీ అరేబియాకు ఐఎస్ కు మధ్య ఉన్న సంబంధాలపై చర్చ జరగాలన్నారు. మరోవైపు ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ మరిన్ని దాడులు జరిగే అవకాశాలున్నందున అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామన్నారు. ఉగ్రదాడికి ప్రణాళికలు ఫ్రాన్స్ లోనే జరిగాయన్నవాదనను కొట్టిపారేశారు. కచ్చితంగా సిరియాలోనే ప్లాన్ రూపొంది ఉంటుందని అభిప్రాయపడ్డారు. పారిస్ దాడుల నేపథ్యంలో ఆ దేశంలో మూడు నెలలపాటు ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. -
పత్తి దళారులను నిర్బంధించిన గ్రామస్తులు
ఖమ్మం: పత్తి మోసాలకు పాల్పడుతున్న దళారులను నిర్బంధించిన సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వేంసూర్ మండలం రామన్నపాలెంలో పత్తి కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడుతున్న పత్తి దళారులను గ్రామస్తులు మంగళవారం నిర్బంధించారు. ఆరుగాలం పండించిన పంటను దళారులు దోచుకుంటే సహించేది లేదని రైతులు తీవ్రంగా హెచ్చరించారు. -
ట్విట్టర్, ఫేస్ బుక్ లో వదంతులకు మరణశిక్షే..!
ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో వదంతులు సృష్టిస్తే ఏమవుతుందో తెలుసా.. ఇక్కడైతే ఏమో గానీ సౌదీ అరేబియాలో అయితే మాత్రం మరణశిక్ష విధిస్తారట. ఈ విషయాన్ని అక్కడి ప్రభుత్వ వెబ్సైట్లో అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ప్రకటనలపై ఎన్నో ఆంక్షలు విధిస్తున్న సౌదీ సర్కారు తాజా ప్రకటన సామాన్య ప్రజల్లో ఆందోళన రేపుతోంది. ఈ ప్రకటన వెనుక.. మొత్తం సోషల్ మీడియానే ఆ దేశంలో నిషేధించాలన్న ప్రయత్నం కనిపిస్తోందని పలువురు అంటున్నారు. కొత్తరాజు సల్మాన్ పాలనలో ఈ మరణ శిక్షల జోరు పెరిగిపోతోంది. సౌదీ రాజు కొత్త నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంస్థలు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల హజ్ యాత్రకు వెళ్లి తొక్కిసలాటలో వెయ్యిమంది వరకూ చనిపోవడం... దీనికి కారణం ప్రభుత్వ నిర్వహణ లోపమేనని సోషల్ మీడియాలో రావడంతో... ఆగ్రహానికి గురైన ప్రభత్వం ఈ కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చిందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు చిన్నపాటి తప్పులు చేసినవారికి.. ఖైదు, ప్రయాణ నిషేధం, గృహ నిర్బంధం వంటి శిక్షలు అమలులో ఉన్నాయని, ఇప్పుడు ఓ సామాజిక మాధ్యమంలో వదంతులు సృష్టించేవారికి మరణ శిక్ష విధించేందుకు నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి అని మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ చెప్తోంది. అయితే ఏ రకం వార్తలకు శిక్ష పడుతుందో స్పష్టంగా ధ్రువీకరించలేదని ఓ సీనియర్ న్యాయమూర్తి అంటున్నారు. ఇప్పుడు అందరిలో ఆందోళన కలిగిస్తున్న కొత్త చట్టాన్ని కొన్ని వారాల క్రితం వచ్చిన సౌదీ రాజు ప్రకటించారు. 79 ఏళ్లు కొత్త రాజు సల్మాన్, అతడి కుమారుడు 30 ఏళ్ల మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రవేశ పెట్టిన ఈ ప్రకటనకు జనం నుంచి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. మాస్ మీడియాను సెన్సార్ చేయడం కోసం ఇటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారంటూ విమర్శిస్తున్నారు. -
ఉగ్రదాడిపై ముందే హెచ్చరించిన నిఘావర్గాలు
-
పోలీసులనే బెదిరించారు....
-
నటుడు శివాజీకి బీజేపీ కార్యకర్తల వార్నింగ్
-
సభను అడ్డుకోవద్దని తెలంగాణవాదులకు పిలుపు
-
వెళ్లాల్సి వస్తే ...వలసవాది కేసీఆరే వెళ్లాలి