అమెరికా, ఇతర దేశాల్లో గూగుల్, ఆపిల్ వంటి టెక్ కంపెనీలు గూత్తాధిపత్యాన్ని తగ్గించేలా ఆయా దేశాలు పలు కఠిన చట్టాలను తెస్తున్నాయి. యూరోపియన్ దేశాలు(ఈయూ) దిగ్గజ టెక్ కంపెనీలపై తీవ్రంగా వ్యవహరిస్తున్నాయి. టెక్ దిగ్గజ కంపెనీలను నియంత్రించేందుకు ఇప్పటికే పలు చట్టాలను తీసుకువచ్చాయి. కాగా ఈ చట్టాలను ఆపిల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
చదవండి: ప్రపంచ దేశాల అప్పు ఎంతో తెలిస్తే షాకే...!
అలా చేస్తే పెనుముప్పే...!
టెక్ దిగ్గజ కంపెనీలను నియంత్రణలో భాగంగా ఈయూ దేశాలు ఆపిల్ ప్లే స్టోర్‌పై భారీ షరతులను పెట్టాయి.ప్లే స్టోర్ యాప్స్‌లో ఇతర సైడ్ లోడింగ్ యాప్స్(థర్డ్‌పార్టీ యాప్స్)కు వీలు కల్పిస్తూ ఈయూ చట్టం చేసింది. దీనిపై ఆపిల్ ఈయూ దేశాలను తీవ్రంగా వ్యతిరేకించింది. థర్డ్‌పార్టీ యాప్స్‌ను ప్లే స్టోర్‌లోకి ఆలో చేస్తే యూజర్లపై సైబర్ దాడులు జరిగే అవకాశం ఉందని ఆపిల్ హెచ్చరించింది. సైడ్ లోడింగ్ యాప్స్‌తో జరిగే నష్టాల నివేదికను బుధవారం రోజున ఆపిల్ విడుదల చేసింది. మాల్‌వేర్ దాడులతో యూజర్ల ప్రైవసీ, భద్రతకు భంగం వాటిల్లే అవకాశం ఉందని ఆపిల్ వెల్లడించింది. ప్లే స్టోర్‌పై ఈయూ విధించిన రూల్స్‌ను కాస్త సులభతరం చేయాలని ఆపిల్ విన్నవించింది. ప్రపంచవ్యాప్తంగా థర్డ్‌పార్టీ యాప్స్‌తో సుమారు 60 లక్షల యూజర్ల స్మార్ట్‌ఫోన్స్ సైబర్ దాడులకు ప్రభావితమయ్యాయని ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థ క్యాస్పర్‌స్కై పేర్కొంది.
ముందే హెచ్చరించిన టిమ్ కుక్..!
గతంలో ఈయూ తెచ్చిన చట్టాలపై ఆపిల్ సీఈవో టిమ్ కుక్ పూర్తిగా వ్యతిరేకించాడు. సైడ్‌లోడింగ్ యాప్స్‌తో యూజర్ల భద్రతకు, ప్రైవసీ భంగం వాటిల్లుతుందనీ హెచ్చరించాడు. కాగా ఫోర్స్‌ఫుల్‌గా ఈ థర్డ్‌పార్టీ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేయడంతో ఆపిల్ ఐవోఏస్ ప్లాట్‌ఫాం దెబ్బతీనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఆపిల్ స్టోర్‌లోకి యాప్స్ ఏంట్రీ ఇవ్వాలంటే వాటిపై కచ్చితమైన రివ్యూ చేశాకే స్టోర్‌లో ఉంచుతామని వివరించాడు.
చదవండి: తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన సజ్జన్ జిందాల్..!
Comments
Please login to add a commentAdd a comment