ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో కలకలం రేగింది. నవంబర్ 3న అమెరికా ఇన్ఫోసిస్ యూనిట్ ‘ఇన్ఫోసిస్ మెక్‌కామిష్ సిస్టమ్స్’ (ims)లో సైబర్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దీంతో సంస్థలోని కొన్ని యాప్స్, కంప్యూటర్లు తీరు సరిగా లేదని తెలిపింది. అయితే, సంస్థలో ఏం జరిగిందనే అంశంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సమస్యను పరిష్కరించడానికి సైబర్ సెక్యూరిటీ కంపెనీతో కలిసి పనిచేస్తున్నామని, సిస్టమ్‌లు, డేటాపై ఎంతమేరకు ప్రభావం చూపిందనే అంశంపై దర్యాప్తు చేస్తున్న ఇన్ఫోసిస్ వెల్లడించింది.
సమస్యను పరిష్కరిస్తాం
‘డేటా రక్షణ,సైబర్ సెక్యూరిటీ మాకు అత్యంత ముఖ్యమైనవి. మేము దీన్ని త్వరగా పరిష్కరించడానికి ప్రముఖ సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తుల ప్రొవైడర్‌తో కలిసి పని చేస్తున్నాము. సిస్టమ్‌లు, డేటాపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉందనే అంశాన్ని నిర్ధారించేందుకు స్వతంత్ర దర్యాప్తును కూడా ప్రారంభించాము’ అని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఇన్ఫోసిస్ పేర్కొంది.
సోఫియాలో ఇన్ఫోసిస్
ఇదిలా ఉండగా, ఇన్ఫోసిస్ ఐరోపాలో కొనసాగుతున్న వృద్ధిలో భాగంగా బల్గేరియాలోని సోఫియాలో ఇన్ఫోసిస్ కొత్త కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. త్వదారా 500 మందికి ఉద్యగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పింది. కొత్త ఉద్యోగులను ఆకర్షించేలా రీ-స్కిల్ చేయడానికి, అప్ స్కిల్ చేయడానికి ఇన్ఫోసిస్‌ను అనుమతిస్తుంది అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ ఉద్యోగులు ఇన్ఫోసిస్ కంపెనీలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఐవోటీ, 5జీ, ఇతర ఐటీ ప్రొడక్ట్‌ల విభాగాల్లో పనిచేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment