Systems
-
చెరువుల పరిరక్షణ... దీర్ఘకాలం కొనసాగాలి!
మునిసిపల్ కార్పొరేషన్ల వంటి వ్యవస్థలు తప్పులు జరిగాయని నిర్ధారణ జరిగినా అనేక రకాల కారణాలు చెబుతూ చర్యలు తీసుకోవడా నికి సాహసించడం లేదు. అదే కొత్తగా వచ్చిన ‘హైడ్రా’ చాలా వేగంగా పని పూర్తి చేస్తోంది. విచారణ, కోర్టుల పేరుతో కాలయాపన చేయకుండా చెరువులు, కుంటల పరి రక్షణకు; సామాన్యులకు న్యాయం చేసేందుకు ముందుకు సాగుతోంది. అందుకే ఇప్పుడు హైడ్రాలాంటి వ్యవస్థలు కావాలని ప్రతి జిల్లా, ప్రతి మునిసిపాలిటీ నుంచి డిమాండ్లు వస్తున్నాయి.రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రం, ప్రతినగరం, ప్రతి పట్టణంలో చెరువులు కబ్జా చేసి, బఫర్ జోన్లలో నిర్మాణాలు చేపట్టిన ఘటనలు కోకొల్లలు. నీటిని మోసుకెళ్లే నాలాలను సైతం వదిలిపెట్టలేదు. చెరు వులు, నాలాలను పూడ్చివేసి బిల్డింగులు కట్టుకు న్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది చెరువులు నామరూపాల్లేకుండా మాయమయ్యాయి. వేలాది చెరువులు సగానికి పైగా కుంచించుకుపోయాయి. నాలాలు నీటిని తీసుకెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చిన్నపాటి వర్షాలు వచ్చినా కాలనీలకు కాల నీలే నీట మునుగుతున్నాయి. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.తెలంగాణ మునిసిపాలిటీల చట్టం –2019ను రూపొందించిన అప్పటి ప్రభుత్వం... అందుకు అను గుణంగా ‘టీఎస్ బీపాస్’ అనే ప్రత్యేక వ్యవస్థను రూపొందించింది. భవన నిర్మాణ అనుమతుల కోసం ఆన్లైన్ అప్లికేషన్ వ్యవస్థను తీసుకువచ్చి ఈజీ చేసింది. అక్రమ నిర్మాణాలపై కూడా ఇందులో ఫిర్యాదు చేసే అవకాశమిచ్చింది. అయితే టీఎస్ నుంచి టీజీ బీపాస్గా మారిన ఈ వ్యవస్థ ప్రస్తుతం అనుమ తులు ఇవ్వడానికి మాత్రమే పరిమితమైంది. అక్రమ, నిబంధనలకు విరుద్ధమైన నిర్మాణాలపై ఎవరైనా టీజీ బీపాస్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదు.టీజీ బీపాస్ ద్వారా ఆన్లైన్లో అనుమతులు పొందుతున్న చాలా మంది వాటికి భిన్నంగా నిర్మా ణాలు చేపడుతున్నారు. ఎలాంటి సెట్ బ్యాక్స్ వదల కుండా, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలోనూ నిర్మాణాలు చేస్తు న్నారు. గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే పర్మిషన్ తీసుకొని రెండు, మూడు అంతస్తులు నిర్మిస్తున్న వారు సైతం ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణా ల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. టీజీ బీపాస్ అమలులో భాగంగా జిల్లా స్థాయిలో టాస్క్‌ఫోర్స్ బృందాలు, ఎన్ఫోర్స్మెంట్ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ఇందులో రెవెన్యూ, పొలీస్, ఫైర్, ఆర్ అండ్ బీ అధికారులను భాగస్వాములను చేశారు. నేరుగా, పోర్టల్, కాల్‌సెంటర్లు, మొబైల్ యాప్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై వీరు మూడు రోజుల్లో పరిశీలన జరపాలి. అక్రమమని తేలితే ఎలాంటి నోటీసు లేకుండా కూల్చివేయాలి. కూల్చివేతకు అయ్యే ఖర్చును కూడా వారి నుంచే వసూలు చేయాలి.అంతేకాకుండా స్థలం విలువలో 25 శాతం జరిమానా విధించవచ్చు. మూడేళ్ల జైలు శిక్షకు సైతం చర్యలు తీసుకునే నిబంధనలున్నాయి. నిర్మాణం/లే అవుట్ రిజిస్ట్రేషన్ కాకుండా డీటీఎఫ్సీలు, సబ్ రిజిస్ట్రార్లకు తెలియజేసి... అలాంటి స్థలాలను బ్లాక్ లిస్టులో పెట్టేలా ఫిర్యాదు చేయాలి. ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఇది స్పష్టంగా ఉన్నా అమలుకు నోచుకోవడం లేదు.గత ప్రభుత్వం తీసుకువచ్చిన మునిసిపల్ యాక్ట్ –2019ను సక్రమంగా, కఠినంగా అమలు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా సమస్యలు పరిష్కారమవుతాయి. అయితే కమిషనర్లు అందుకు సాహసించడం లేదు. ‘గట్స్’ ఉన్న ఒకరిద్దరు అధికారులు ఉన్న చోట అంతో ఇంతో చర్యలు కొనసాగుతున్నాయి. అందుకే రంగ నాథ్ లాంటి అధికారులతో కూడిన హైడ్రా లాంటి వ్యవస్థ ఉంటేనే చెరువులు పరిరక్షించొచ్చనీ, అక్రమ నిర్మాణాలను ఆపవచ్చనీ ప్రజల్లో అభిప్రాయం ఏర్ప డింది. ప్రభుత్వం ఆ డిమాండ్‌కు అనుగుణంగా హైడ్రా లాంటి వ్యవస్థలు ఏర్పాటు చేయడం మంచిదే. అయితే తాత్కాలిక ఉపశమన చర్యలకు బదులు పట్ట ణాలు, నగరాల్లో కీలకంగా వ్యవహరించే కమిషనర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి... ఇలాంటి చర్యలు ఎల్లప్పుడూ కొనసాగేలా చూడాలి. తప్పులను నిర్ధారించిన తర్వాత చర్యలు తీసుకోలేకపోతున్న కమిషనర్లపై ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి.– ఫిరోజ్ ఖాన్, వ్యాసకర్త, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, మొబైల్: 96404 66464 -
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో సైబర్ దాడుల కలకలం
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో కలకలం రేగింది. నవంబర్ 3న అమెరికా ఇన్ఫోసిస్ యూనిట్ ‘ఇన్ఫోసిస్ మెక్కామిష్ సిస్టమ్స్’ (ims)లో సైబర్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. దీంతో సంస్థలోని కొన్ని యాప్స్, కంప్యూటర్లు తీరు సరిగా లేదని తెలిపింది. అయితే, సంస్థలో ఏం జరిగిందనే అంశంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమస్యను పరిష్కరించడానికి సైబర్ సెక్యూరిటీ కంపెనీతో కలిసి పనిచేస్తున్నామని, సిస్టమ్‌లు, డేటాపై ఎంతమేరకు ప్రభావం చూపిందనే అంశంపై దర్యాప్తు చేస్తున్న ఇన్ఫోసిస్ వెల్లడించింది. సమస్యను పరిష్కరిస్తాం ‘డేటా రక్షణ,సైబర్ సెక్యూరిటీ మాకు అత్యంత ముఖ్యమైనవి. మేము దీన్ని త్వరగా పరిష్కరించడానికి ప్రముఖ సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తుల ప్రొవైడర్‌తో కలిసి పని చేస్తున్నాము. సిస్టమ్‌లు, డేటాపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉందనే అంశాన్ని నిర్ధారించేందుకు స్వతంత్ర దర్యాప్తును కూడా ప్రారంభించాము’ అని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఇన్ఫోసిస్ పేర్కొంది. సోఫియాలో ఇన్ఫోసిస్ ఇదిలా ఉండగా, ఇన్ఫోసిస్ ఐరోపాలో కొనసాగుతున్న వృద్ధిలో భాగంగా బల్గేరియాలోని సోఫియాలో ఇన్ఫోసిస్ కొత్త కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. త్వదారా 500 మందికి ఉద్యగ అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పింది. కొత్త ఉద్యోగులను ఆకర్షించేలా రీ-స్కిల్ చేయడానికి, అప్ స్కిల్ చేయడానికి ఇన్ఫోసిస్‌ను అనుమతిస్తుంది అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, ఈ ఉద్యోగులు ఇన్ఫోసిస్ కంపెనీలో రాబోయే నాలుగు సంవత్సరాల్లో ఐవోటీ, 5జీ, ఇతర ఐటీ ప్రొడక్ట్‌ల విభాగాల్లో పనిచేయనున్నారు. చదవండి👉 కెనడాకి బైబై చెబుతున్న భారతీయులు.. కారణం ఇదే? -
వ్యవస్థల కంటే దేశమే ముఖ్యం
న్యూఢిల్లీ: లిక్విడిటీ పెంచడం, వడ్డీ రేట్లు సహా ప్రభుత్వం నుంచి ఆర్బీఐకి పలు డిమాండ్లు చేయడాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ సమర్థించుకున్నారు. వ్యవస్థల కంటే దేశమే ఎంతో ముఖ్యమన్న విషయాన్ని గుర్తు చేశారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన అంతర్జాతీయ వ్యాపార సదస్సులో పాల్గొన్న సందర్భంగా జైట్లీ మాట్లాడారు. రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వం పూర్తి మెజారిటీతో ఎన్నిక కావాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. అప్పుడే ఆర్థిక రంగానికి స్థిరత్వం ఏర్పడుతుందని, రక్షకుడిని మార్చాల్సిన అవసరం రాదన్నారు. ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు లేదా ఎన్నికల తర్వాత ప్రకటనలు చేయడం వేర్వేరని, దీర్ఘకాలిక విధానాలపై దృష్టి పెట్టాలని అభిప్రాయపడ్డారు. -
కోర్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్‌లో తపాలా సేవలు
విశాఖ పోస్టల్ రీజియన్‌లో తొలిసారిగా అమలాపురం నుంచి శ్రీకారం ప్రారంభించిన రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ శ్రీలత అమలాపురం టౌన్ (అమలాపురం) : తపాలా సేవలపరంగా 160 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల తమ శాఖ ఇక నుంచి వాణిజ్య బ్యాంకులతో సమాంతరంగా, దీటుగా సేవలు అందించేందుకు కొత్తగా కోర్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్లోకి అడుగు పెట్టిందని విశాఖపట్నం రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ టీఎం శ్రీలత అన్నారు. ఈ సరికొత్త సేవలను తమ రీజియన్ పరిధిలోని అమలాపురం పోస్టల్ డివిజన్ నుంచే ప్రథమంగా ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. అమలాపురంలోని డివిజన్ పోస్టల్ కార్యాలయం (హెడ్ పోస్టు ఆఫీసు)లో ఏర్పాటుచేసిన కోర్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ విధానాన్ని ఆమె సోమవారం ఉదయం ప్రారంభించారు. అమలాపురం పోస్టల్ సూపరింటెండెంట్ జి.షణ్ముఖేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభకు శ్రీలత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కోర్ సిస్టమ్స్ వల్ల తపాలా సేవలు మరింత వేగంగా... పారదర్శకంగా అందనున్నాయన్నారు. ఈ విధానంతో దేశమంతా తపాలా సేవలు ఆన్లైన్ అనుసంధానంతో ఒకే ప్లాట్ ఫారంపైకి వచ్చినట్లయిందని చెప్పారు. వినియోగదారులు పోస్టల్ సేవలు పొందేందుకు తమ వద్ద ఉండే మొబైల్ ఫోన్ల ద్వారా సమాచార వ్యవస్థతో పొందవచ్చని తెలిపారు. వాణిజ్య బ్యాంక్‌లు ఎన్ని రకాలు సేవలు అందిస్తున్నాయో అలాంటి సేవలన్నీ తమ శాఖ అందించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుందన్నారు. తమ రీజయిన్ పరిధిలో 1,500 వాణిజ్య బ్యాంక్‌లు ఉంటే తమ తమ శాఖ కార్యాలయాలు ఆరు వేల ఉన్నాయని గుర్తు చేశారు. పోస్టల్ అంటే ఓ నెట్ వర్కింగ్...ఐటీ ప్రాజెక్టుగా మారిందన్నారు. ఈ వినూత్న, విస్తృత సేవలను గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సైతం ప్రచారం చేసేందుకు తమ సిబ్బంది ఫొటోలు, వీడియోలు, ఫ్లెక్సీలు, బ్యానర్ల ద్వారా సాధ్యం కాదని...వారు కూడా ప్రజల్లోకి వెళ్లాలి...నోటి మాటలతో అర్థమయ్యే రీతిలో క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. కోర్ సిస్టమ్స్ సేవలను రీజియన్ పరిధిలోని తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలో జూలై నెలాఖరుకు విస్తరింప చేస్తామని... వచ్చే సెప్టెంబర్ నాటికి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చేపడతామని శ్రీలత వివరించారు. త్వరలోనే రెండు పాస్ పోర్టు సేవా కేంద్రాలు తమ పోస్టల్ శాఖ కోర్ సిస్టమ్స్ సేవలనే కాకుండా త్వరలోనే పోస్ట్ ఆఫీసుల్లో పాస్‌పోర్టు సేవా కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఆ సేవలు అందించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయని శ్రీలత వెల్లడించారు. తొలి ప్రయత్నంగా రాజమహేంద్రవరం, శ్రీకాకుళంలలో ఈ సేవా కేంద్రాలు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికే తమ శాఖ, విదేశాంగ శాఖ ఈ విషయమై ఒక అవగాహనకు వచ్చాని తెలిపారు. ఇవి అందుబాటులోకి వస్తే పోస్టు ఆఫీసుల్లోనే పాస్‌పోర్టు దరఖాస్తు చేసుకునే వెసులబాటు వస్తుందన్నారు. అమలాపురం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎన్సీహెచ్వీ రాజేష్, హెడ్ పోస్టు మాస్టర్ వై.ప్రసాద్, పోస్టల్ ఇన్స్పెక్టర్లు వి.హరిబాబు, బీవీఎల్ విశ్వేశ్వరరావు, ఎ.వీరభద్రరావు పాల్గొన్నారు. రీజియన్‌లో తొలిసారిగా అమలాపురంలో కోర్ సిస్టమ్స్ ప్రారంభానికి ముందు శ్రీలత కేక్ కట్ చేయటంతో సిబ్బంది వేడుక చేసుకున్నారు. -
సిస్టమ్స్‌పై మాల్వేర్ దాడులు నిజమే
32 లక్షల కార్డుల వివరాల చోరీ ఉదంతంపై హిటాచీ పేమెంట్స్ సర్వీసెస్ ముంబై: కార్డు ఆధారిత లావాదేవీల భద్రతపై ఆందోళన కలిగించే విధంగా గతేడాది తమ సిస్టమ్స్ సైబర్ దాడులకు గురైన మాట వాస్తవమేనని హిటాచీ పేమెంట్స్ సర్వీసెస్(హెచ్‌పీఎస్) వెల్లడించింది. దీని వల్ల వినియోగదారులకు, బ్యాంకులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది. 2016 మధ్యలో హిటాచీ సెక్యూరిటీ సిస్టమ్స్‌పై మాల్వేర్ దాడి జరిగిన సంగతి సెక్యూరిటీ ఆడిట్ సంస్థ ఎస్ఐఎస్ఏ ఇన్ఫర్మేషన్ నివేదికలో తేలింది. తాము అత్యుత్తమ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నప్పటికీ ఊహించని విధంగా ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు హెచ్‌పీఎస్ ఎండీ లోనీ ఆంథోనీ తెలిపారు. మాల్వేర్ చొరబడిన తీరు గురించి తెలిసినప్పటికీ ఎంత మేర డేటా చౌర్యం జరిగిందన్నది నిర్ధారించలేమన్నారు. గతేడాది మే 21–జూలై 11 మధ్యకాలంలో హెచ్‌పీఎస్ సర్వీసులు అందిస్తున్న ఏటీఎంలలో మాల్వేర్ చొరబడటంతో దాదాపు 32 లక్షల పైగా డెబిట్ కార్డుల సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కినట్లు అంచనాలు ఉన్నాయి. 600 మంది పైగా కస్టమర్లు రూ. 1.3 కోట్ల మేర నష్టపోయినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) పేర్కొంది. హెచ్పీఎస్కి అతి పెద్ద క్లయింట్ అయిన యస్ బ్యాంక్‌కి చెందిన ఒకానొక ఏటీఎం నుంచి ఈ మాల్వేర్ .. మొత్తం వ్యవస్థలోకి ప్రవేశించింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా చాలా మటుకు బ్యాంకులు తమ ఖాతాదారులకు కొత్త కార్డులు జారీ చేయాల్సి వచ్చింది.