ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటీవ్ బిన్నీ మ్యాథ్యూ తాజాగా యాక్సెంచర్‌లో చేరారు. తమ సంస్థలో చీఫ్ ప్రొక్యూర్‌మెంట్ ఆఫీసర్‌గా బాధ‍్యతలు చేపట్టినట్లు యాక్సెంచర్ తెలిపింది.
‘‘భారత్‌లో కాగ్నిజెంట్ అనైతిక వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది. నిబంధల్ని ఉల్లంఘించి తమ ఎగ్జిక్యూటీవ్‌లను సంస్థలో చేర్చుకుంటుంది. నాన్-కాంపిటీ క్లాజ్‌ను ఉల్లంఘిస్తూ ఉద్యోగులు సైతం కాగ్నిజెంట్‌లో చేరుతున్నారంటూ ’’ ఇటీవల విప్రో- ఇన్ఫోసిస్‌లు బెంగళూరు కోర్టును ఆశ్రయించాయి.
జతిన్ దమాల్ రూ.25.15 కోట్లు చెల్లించాలి
దీంతో పాటు నాన్-కాంపిటీ నిబంధనల ప్రకారం.. విప్రోలో పనిచేస్తున్న ఉద్యోగులు రాజీనామా అనంతరం తమ కాంపిటీటర్ సంస్థల్లో 10ఏళ్ల వరకు చేరకూడదు. అలా చేరితే నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనని అస్త్రంగా చేసుకున్న విప్రో.. నాన్-కాంపిటేట్ నిబంధన ఉల్లంఘించారంటూ విప్రో సంస్థ మాజీ సీఎఫ్‌ఓ జతిన్ దలాల్‌ను రూ. 25.15 కోట్లు చెల్లించాలని కోర్టులో దావా వేసింది.
మీకు మీరే.. మాకు మేమే
అయినప్పటికీ ఆ రెండు సంస్థలోని ఉన్నతస్థాయి ఉద్యోగులు ఇతర సంస్థల్లో 10 ఏళ్ల పాటు చేరకూడదంటూ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పట్లో సఫలమయ్యేలా కనిపించడం లేదు. ఎగ్జిక్యూటీవ్‌లు, ఇతర సీనియర్ స్థాయి ఉద్యోగులు మీకు మీరే.. మాకు మేమే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్ధి కంపెనీల్లో చేరి భారీ ప్యాకేజీలను సొంతం చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ సీనియర్ ఎగ్జిక్యూటీవ్ బిన్నీ మ్యాథ్యూ యాక్సెంచర్‌లో చేరడం అగ్నికి ఆజ్యం పోసినట్లైందని టెక్నాలజీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. యాక్సెంచర్‌లో చేరడానికి ముందు మాథ్యూస్ 15 సంవత్సరాలకు పైగా ఇన్ఫోసిస్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ప్రొక్యూర్‌మెంట్ గ్రూప్ హెడ్‌గా పనిచేశారు. తాజాగా ఆ సంస్థకు గుడ్ బై చెప్పారు. జనవరి 3న యాక్సెంచర్‌లో చేరారు.
ఇన్ఫోసిస్, విప్రో వర్సెస్ కాగ్నిజెంట్
టెక్ కంపెనీలు ఇన్ఫోసిస్, విప్రో ప్రత్యర్థి సంస్థ కాగ్నిజెంట్‌పై చర్యలు తీసుకుంటున్నాయి.కాగ్నిజెంట్ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతుందంటూ కోర్టును ఆశ్రయించాయి. కాగ్నిజెంట్‌లో ఇటీవలి పునర్నిర్మాణం కింద, సంస్థ దాదాపు 20 మంది కొత్త ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకుంది. వీరిలో డజను మంది ఇన్ఫోసిస్, విప్రో ఉద్యోగుల్ని చేర్చుకుంది. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విప్రో.. కాంట్రాక్టు ఉల్లంఘించినందుకు సీఎఫ్‌ఓ జతిన్ దలాల్‌తో సహా కాగ్నిజెంట్‌లో చేరిన మాజీ ఉద్యోగులపై రెండు వ్యాజ్యాలను దాఖలు చేసింది. ఈ తరుణంలో బిన్నీ మ్యాథ్యూ నిర్ణయం టెక్నాలజీ కంపెనీల్లో వ్యవహారం ఎటు ములుపు తిరుగుతుందోనని ఆసక్తికరంగా మారింది.
విప్రో ప్రత్యర్థి కంపెనీలు ఇవే..
విప్రో ఎగ్జిక్యూటివ్‌ల కాంట్రాక్ట్‌లో పది ప్రత్యర్థి కంపెనీల పేర్లను పేర్కొంది. నాన్-కాంపిటేట్ నిబంధన కింద వారు విప్రోలో మానేసిన తర్వాత సంవత్సరం పాటు ఈ కంపెనీలలో చేరేందుకు వీలు లేదు. ఆ కంపెనీలు ఇవే.. యాక్సెంచర్, క్యాప్‌జెమినీ, కాగ్నిజెంట్, డెలాయిట్, డీఎక్స్‌సీ టెక్నాలజీ, హెచ్‌సీఎల్, ఐబీఎం, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా. ఈ పేర్లలో ప్రతి ఒక్కటి దలాల్ కాంట్రాక్ట్‌లో పేర్కొన్నట్లు విప్రో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment