cognizant
-
‘ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది’
ఐటీ దిగ్గజాలు కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ మధ్య న్యాయ పోరాటం తీవ్రంగా మారింది. తమ హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిందని కాగ్నిజెంట్ ఆరోపించింది. పోటీ ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి ఇన్ఫోసిస్ గోప్యమైన డేటాను దుర్వినియోగం చేసిందని, బహిర్గతం చేయని ఒప్పందాలను (NDAs) ఉల్లంఘించిందని కాగ్నిజెంట్ ఆరోపించింది .కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్‌ల మధ్య యూఎస్ కోర్టులో ఓ దావా నడుస్తోంది. తమ హెల్త్ కేర్ సాఫ్ట్వేర్ ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలను ఇన్ఫోసిస్ దొంగిలించిందని ఆరోపిస్తూ కాగ్నిజెంట్ కేసు దాఖలు చేసిందని మింట్ నివేదిక తెలిపింది. "నాన్ డిస్క్లోజర్ అండ్ యాక్సెస్ అగ్రిమెంట్స్ (NDAAs) ద్వారా ఇన్ఫోసిస్ తమ ట్రైజెట్టో వాణిజ్య రహస్యాలను దుర్వినియోగం చేస్తూ ఇన్ఫోసిస్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది" అని 22 పేజీల కోర్టు ప్రతిస్పందనను ఉటంకిస్తూ నివేదిక పేర్కొంది.ఇదీ చదవండి: టీసీఎస్ వీసా ఫ్రాడ్ చేసింది.. మాజీ ఉద్యోగుల ఆరోపణలు తమ ట్రైజెట్టో సమాచారాన్ని ఉపయోగించారా లేదా అన్నది ఆడిట్ చేయడానికి ఇన్ఫోసిస్ నిరాకరించిందని, ఇది తన తప్పును రుజువు చేస్తుందని కాగ్నిజెంట్ వాదిస్తోంది. ఈ చట్టపరమైన వివాదం 2024 ఆగస్టు నాటిది. కాగ్నిజెంట్ మొదట డల్లాస్ కోర్టులో ఈ ప్రకటన చేసింది. గత జనవరి 9న దాఖలు చేసిన కేసులో ఈ ఆరోపణను ఇన్ఫోసిస్ తిరస్కరించింది, కాగ్నిజెంట్‌కు సంబంధించిన హెల్త్ కేర్ సొల్యూషన్స్ బహిరంగంగానే ఉన్నాయని, అందులో వాణిజ్య రహస్యాలు ఏమున్నాయో వారే చూసుకోవాలని కాగ్నిజెంట్‌కు సూచించాలని కోర్టును ఇన్ఫోసిస్ కోరింది.ఇన్ఫోసిస్ ప్రతి దావాఇన్ఫోసిస్ తరువాత కాగ్నిజెంట్ పై ప్రతి దావా వేసింది. దాని సీఈవో రవి కుమార్ ఇన్ఫోసిస్ లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇన్ఫోసిస్ సొంత హెల్త్‌కేర్ సాఫ్ట్వేర్ ఉత్పత్తిని విడుదల చేయడాన్ని కావాలని ఆలస్యం చేశారని, కాగ్నిజెంట్‌లో ఉద్యోగం కోసం చర్చలు జరిపారని ప్రత్యారోపణలు చేసింది. రవి కుమార్ 2022 అక్టోబర్‌లో ఇన్ఫోసిస్‌ను వీడారు. ఆ తర్వాత ఏడాది అంటే 2023 జనవరిలో కాగ్నిజెంట్‌లో సీఈవోగా చేరారు. రెండు కంపెనీలు ఆరోగ్య సంరక్షణ సేవల రంగంలో పోటీ పడుతున్నాయి. ఇన్ఫోసిస్ ఆదాయంలో దాదాపు 7.5 శాతం లైఫ్ సైన్సెస్ రంగ క్లయింట్ల నుంచే పొందుతోంది. కాగ్నిజెంట్‌కు కూడా తమ క్లయింట్లలో దాదాపు మూడోవంతు హెల్త్ కేర్ నుంచే ఉన్నారు. -
కాగ్నిజెంట్ సరికొత్త ఎత్తుగడ.. ప్రత్యర్థులకు దడ!
ప్రముఖ బహుళజాతి ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ (Cognizant) భారత్‌లోని తమ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును (retirement age) 58 నుండి 60 సంవత్సరాలకు పెంచింది. విస్తృత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కాగ్నిజెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది.పేరోల్‌లో ఎలాంటి మార్పు లేకుండా ఆన్-సైట్లో బదిలీ అయిన వారితో సహా దేశంలోని కాగ్నిజెంట్ ఉద్యోగులందరికీ ఈ మార్పు వర్తిస్తుంది. అనుభవజ్ఞులను నిలుపుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ మెమోలో వివరించింది.దేశంలోని చాలా ఐటీ కంపెనీల్లో (IT Company) ప్రస్తుతం పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలుగా ఉంది. అయితే రిటైర్మెంట్ వయసును పెంచుతూ కాగ్నిజెంట్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో పోటీతత్వ ప్రపంచంలో సరికొత్త మార్పులు రానున్నాయి. అనుభవజ్ఞులైన నిపుణులను సద్వినియోగం చేసుకునేందుకు కంపెనీకి ఆస్కారం ఏర్పడుతుంది.చిన్న నగరాలపై దృష్టిభారత్లో జరిగిన ఒక కార్యక్రమంలో కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ పీటీఐతో మాట్లాడుతూ.. కంపెనీ ప్రపంచ కార్యకలాపాలలో భారత్ పాత్ర ఉంటుందన్నది వివరించారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నుండి ఇటీవల ప్రవాసీ భారతీయ సమ్మాన్ 2025 అవార్డును అందుకున్న రవి, గ్లోబల్ టెక్నాలజీ ల్యాండ్‌స్కేప్‌లో భారత్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యతను హైలైట్ చేశారు.“కాగ్నిజెంట్ చాలా పెద్ద కంపెనీ. భారత్‌లో మాకు 250,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇంతకుముందు, మేము పెద్ద నగరాల నుండి ఆపరేట్ చేశాము. ఇప్పుడు మేము చిన్న నగరాల నుండి ఆపరేట్ చేస్తున్నాము. మా ప్రయత్నం చిన్న నగరాలకు తీసుకెళ్లడం, కాబట్టి మేము ఇండోర్‌లో ప్రారంభించాము” అని పేర్కొన్నారు.పదవీ విరమణ వయస్సును పెంచడంతోపాటు భారత్-ఆధారిత ప్రతిభ వ్యూహాన్ని రెట్టింపు చేయడం ద్వారా గ్లోబల్ టెక్నాలజీ పవర్‌హౌస్‌గా ఎదుగుతున్న భారత్‌కు సహకారం అందిస్తూనే ప్రపంచ ఐటీ సేవల మార్కెట్లో అగ్రగామిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని కాగ్నిజెంట్ లక్ష్యంగా పెట్టుకుంది. -
ఐటీలో కొత్త ట్రెండ్.. మీరొస్తామంటే మేమొద్దంటామా?
ఐటీ పరిశ్రమలో కాగ్నిజెంట్ కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. సంస్థను వీడి వెళ్లిన ఉద్యోగులు తిరిగి రావాలనుకుంటే వారికి ‘మీరొస్తామంటే మేమొద్దంటామా’ అంటూ సాదరంగా స్వాగతం పలుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లొ 13,000 మంది మాజీ ఉద్యోగులను తిరిగి నియమించుకుని సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.ఒక కంపెనీలో పనిచేసి వ్యక్తిగత లేదా వృత్తిపరమైన కారణాలతో సంస్థను వీడి తిరిగి అదే కంపెనీలో చేరేవారిని ‘బూమరాంగ్ ఉద్యోగులు’ అని వ్యవహరిస్తారు. కాగ్నిజెంట్‌లో ఇలాంటి పునర్నియామకాలు గత రెండు సంవత్సరాలలో 40% పెరిగాయి.కాగ్నిజెంట్.. ఇతర కంపెనీల మాదిరిగా కేవలం ఉన్న ఉద్యోగులను నిలుపుకోవడంపైన మాత్రమే దృష్టి పెట్టకుండా సంస్థను వీడి వెళ్లిన మాజీ ఉద్యోగులను సైతం స్వాగతిస్తోంది. సాధారణంగా బూమరాంగ్ సంస్కృతి ఇతర రంగాలతో పోలిస్తే ఐటీ పరిశ్రమలో చాలా అరుదు.ఇదీ చదవండి: నో బోనస్.. ఉద్యోగులకు టీసీఎస్ ఝలక్!మాజీ ఉద్యోగులను తిరిగి ఆకర్షించడం అనేది ఇప్పుడు పెద్ద ట్రెండ్‌లో భాగం. దీనిలో కంపెనీలు ఉద్యోగి నిష్క్రమణలను దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగించడానికి అవకాశాలుగా చూస్తాయి. సంస్థను వీడి వెళ్తున్న ఉద్యోగులతో మంచిగా వ్యవహరించడం, వారు తిరిగి రావడానికి తలుపులు తెరిచి ఉంచడం ద్వారా సరికొత్త సంస్కృతికి నాంది పలుకుతున్నాయి. డెలాయిట్ వంటి ప్రముఖ కంపెనీలు మాజీ ఉద్యోగుల కోసం ఆలుమ్నీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. -
కంపెనీని వీడి తిరిగి సంస్థలో చేరిన 13 వేలమంది!
యూఎస్ ప్రధాన కేంద్రంగా ఉన్న ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ కాగ్నిజెంట్‌లో ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గతంలో వివిధ కారణాలతో కంపెనీని వీడిన ఉద్యోగుల్లో దాదాపు 13,000 మంది తిరిగి సంస్థలో చేరినట్లు కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎస్ రవికుమార్ తెలిపారు. మూడో త్రైమాసికంలో మొత్తం 3,800 మంది ఉద్యోగులు కొత్తగా సంస్థలోకి వచ్చినట్లు చెప్పారు.ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికుమార్ మాట్లాడుతూ..‘కంపెనీలో ఉద్యోగుల సంఖ్య పెరుగుతోంది. గతంతో పోలిస్తే మూడో త్రైమాసికంలో అదనంగా 3,800 మంది కొత్తగా సంస్థలో చేరారు. అయితే ఏడాది ప్రాతిపదికన చూస్తే 6,500 ఉద్యోగులు తగ్గినట్లు కనిపిస్తుంది. ఆగస్టులో కంపెనీ తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. బెల్కన్ కంపెనీలో మేజర్ వాటాను కాగ్నిజెంట్ కొనుగోలు చేయడంతో ఆ సంస్థ ఉద్యోగులు కూడా సంస్థ పరిధిలోకి వచ్చారు. దాంతో ఈ సంఖ్య పడిపోయినట్లు కనిపిస్తుంది. కొంతకాలంగా వివిధ కారణాలతో కంపెనీని వీడిన దాదాపు 13,000 మంది తిరిగి సంస్థలో చేరారు. కంపెనీ ఉద్యోగుల అట్రిషన్ రేటు(ఉద్యోగులు సంస్థలు మారే నిష్పత్తి) కూడా 14.6 శాతానికి తగ్గిపోయింది’ అని చెప్పారు.ఇదీ చదవండి: అలెక్సా చెబితే టపాసు వింటోంది!అంతర్జాతీయ ఉద్రిక్తతలు, రాజకీయ భౌగోళిక పరిణామాలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా క్లయింట్ కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలకు కాంట్రాక్ట్‌లు ఇవ్వడం ఆలస్యం చేశాయి. దాంతో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. క్రమంగా యుద్ధ భయాలు, ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండడంతో తిరిగి పరిస్థితులు గాడినపడుతున్నాయని కొందరు నిపుణులు చెబుతున్నారు. ఈ తరుణంలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో చేరుతున్న ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. -
గిఫ్ట్ సిటీలో కాగ్నిజెంట్.. 2000 మందికి ఉపాధి
అహ్మదాబాద్: గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం కాగ్నిజెంట్ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్‌సిటీ(గిఫ్ట్ సిటీ) గాంధీనగర్‌లో టెక్‌ఫిన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 2025 ఫిబ్రవరిలో ప్రారంభించనున్న ఈ సెంటర్‌ను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సొల్యూషన్ల వ్యూహాత్మక కేంద్రంగా వినియోగించనున్నట్లు పేర్కొంది.ప్రధానంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులు, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) పరిశ్రమలకు సంబంధించిన క్లయింట్లకు ఆధునిక సాంకేతిక సొల్యూషన్లు సమకూర్చనున్నట్లు తెలియజేసింది. ప్రాథమికంగా ఈ సెంటర్లో 500 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించనుంది. రానున్న మూడేళ్లలో ఈ సంఖ్యను 2,000కు పెంచనుంది.ప్రపంచస్థాయి కంపెనీలను ఆకట్టుకోవడంలో రాష్ట్రానికున్న పటిష్టతను గిఫ్ట్ సిటీలో కాగ్నిజెంట్ కొత్త కేంద్రం ప్రతిబింబిస్తున్నట్లు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పేర్కొన్నారు. కొత్త ఆవిష్కరణలు, అభివృద్ధికి అత్యుత్తమ వాతావారణాన్ని కల్పిస్తున్నట్లు తెలియజేశారు. కాగా.. టెక్‌ఫిన్ సెంటర్ ద్వారా బీఎఫ్ఎస్ఐ క్లయింట్లకు డిజిటల్ పరివర్తనలో తోడ్పాటునివ్వనున్నట్లు కాగ్నిజెంట్ పేర్కొంది. -
భారత్‌లో హెడ్ ఆఫీస్ అమ్మేస్తున్న అమెరికన్ కంపెనీ
ప్రముఖ టెక్ కంపెనీలన్నీ ఉద్యోగులను తొలగిస్తుంటే.. అమెరికాకు చెందిన 'కాగ్నిజెంట్' మాత్రం ఏకంగా భారతదేశంలోని ఆఫీసునే అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఇందులో నిజమెంత? ఆఫీసును విక్రయిస్తే.. ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? అనే వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.భారతదేశంలో సుమారు 20 సంవత్సరాలుగా ప్రధాన కార్యాలయంగా కలిగిన ఉన్న ఆఫీసును డిసెంబర్ నాటికి విక్రయించే అవకాశం ఉందని సమాచారం. ఈ విక్రయానికి సంబంధించిన బాధ్యతను అంతర్జాతీయ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ సంస్థ 'జేఎల్ఎల్'కు అప్పగించినట్లు చెబుతున్నారు.కాగ్నిజెంట్ విక్రయించనున్న ఈ ఆఫీసు చెన్నైలోని ఐటీ కారిడార్‌లో ఉంది. ఇది సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దీని విలువ సుమారు రూ. 750 కోట్ల నుంచి రూ. 800 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం. దీనిని కొనుగోలు చేయడానికి భాష్యం గ్రూప్, కాసాగ్రాండ్ సంస్థలు సుముఖత చూపుతున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం మీద ఆ రెండు సంస్థలు ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు.ఇదీ చదవండి: 30 నెలలు వెయింట్ చేయించి.. షాకిచ్చిన విప్రో!: మండిపడుతున్న ఫ్రెషర్స్2024 డిసెంబర్ నాటికి ఆఫీసును విక్రయించి.. చెన్నైలోని జీఎస్టీ రోడ్డులోని తాంబరం సమీపంలో కొత్త హెడ్ ఆఫీసు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కాబట్టి బహుశా ఉద్యోగులంతా ఆ కొత్త ఆఫీసు నుంచి పనిచేయాల్సి ఉంటుందని భావిస్తున్నాము. కొత్త భవనం అందుబాటులోకి రావడంతో.. కంపెనీ తన పాత భవనాన్ని విక్రయించడానికి సన్నద్ధమైంది. -
ఇన్ఫోసిస్‌కు షాక్.. కోర్టుకు వెళ్లిన కాగ్నిజెంట్
భారత ఐటీ సర్వీస్ దిగ్గజం ఇన్ఫోసిస్‌పై యూఎస్‌కు చెందిన ఐటీ సంస్థ కాగ్నిజెంట్ కోర్టుకు వెళ్లింది. తమ హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన వాణిజ్య రహస్యాలను దొంగిలించిందని ఆరోపిస్తూ టెక్సాస్ ఫెడరల్ కోర్టులో దావా వేసింది. గతంలో ఉద్యోగులను అక్రమంగా చేర్చుకుంటోందని కాగ్నిజెంట్‌కు ఇన్ఫోసిస్ లేఖాస్త్రం సంధించిన 8 నెలల తర్వాత కాగ్నిజెంట్ ఈ రూపంలో ఇన్ఫోసిస్‌కు షాకిచ్చింది.నివేదికల ప్రకారం.. తమ డేటాబేస్‌ల నుంచి ఇన్ఫోసిస్ చట్టవిరుద్ధంగా డేటాను సేకరించిందని, పోటీ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడానికి దాన్ని ఉపయోగించిందని కాగ్నిజెంట్ వ్యాజ్యంలో పేర్కొంది. అయితే కాగ్నిజెంట్ ఇంకా దీన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. “ఇన్ఫోసిస్‌కు దావా గురించి తెలిసింది. మేము ఆ ఆరోపణలన్నింటినీ ఖండిస్తున్నాం. విషయాన్ని కోర్టులో చూసుకుంటాం” అని ఇన్ఫోసిస్ ప్రతినిధి తెలిపారు.న్యూజెర్సీ ముఖ్య కేంద్రంగా ఉన్న కాగ్నిజెంట్.. ట్రైజెట్టో ఫేసెస్, క్యూఎన్ఎక్స్టీ సాఫ్ట్వేర్లను అందిస్తోంది. హెల్త్‌కేర్ ఇన్సూరెన్స్ కంపెనీలు వీటిని అడ్మినిస్ట్రేటివ్ టాస్క్‌లను ఆటోమేట్ చేయడానికి ఉపయోగిస్తున్నాయి. ట్రైజెట్టో సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేసి ఇన్ఫోసిస్ 'టెస్ట్ కేసెస్ ఫర్ ఫేసెట్స్'ను రూపొందించిందని, ట్రైజెట్టో డేటాను ఇన్ఫోసిస్ ఉత్పత్తికి రీప్యాక్ చేసిందని నివేదికలు పేర్కొన్నాయి.బెంగుళూరుకు చెందిన భారతీయ ఐటీ మేజర్ క్యూఎన్ఎక్స్టీ నుంచి రహస్యమైన ట్రైజెట్టో సమాచారం, వాణిజ్య రహస్యాలను సేకరించేందుకు సాఫ్ట్‌వేర్‌ను రూపొందించడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘించిందని ఫిర్యాదులో కాగ్నిజెంట్ పేర్కొంది. ఇందు కోసం భారీ నష్టపరిహారాన్ని కాగ్నిజెంట్ కోరింది. అలాగే తమ వ్యాపార రహస్యాల దుర్వినియోగాన్ని ఆపాలని ఇన్ఫోసిస్‌ను ఆదేశించాలని అభ్యర్థించింది. -
నాస్కామ్ ప్రెసిడెంట్‌గా రాజేశ్ నంబియార్
న్యూఢిల్లీ: నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్, సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) నూతన ప్రెసిడెంట్‌గా కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్ రాజేశ్ నంబియార్ నియమితులయ్యారు. దేబ్జానీ ఘోష్ పదవీకాలం పూర్తయిన తర్వాత నవంబర్ 2024లో నాస్కామ్ ప్రెసిడెంట్‌గా నంబియార్ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడైన ఆయన 2023లో నాస్కామ్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. టీసీఎస్, ఐబీఎం, సియెనా వంటి దిగ్గజ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉంది. కాగా, రాజేశ్ నంబియార్ కాగ్నిజెంట్ సీఎండీ పదవికి రాజీనామా చేశారు. గ్లోబల్ హెడ్ ఆఫ్ ఆపరేషన్స్, ఇండియా సీఎండీగా రాజేశ్ వారియర్‌ను ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ నియమించుకుంది.సెప్టెంబర్ 2 నుంచి గ్లోబల్ హెడ్‌గా, అక్టోబర్ 1 నుంచి సీఎండీగా బాధ్యతలు అందుకుంటారు. కాగ్నిజెంట్‌లో చేరక ముందు హెడ్ ఆఫ్ గ్లోబల్ సర్వీసెస్, ఇన్ఫోసిస్ అమెరికాస్ ఈవీపీగా వారియర్ పనిచేశారు. ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ ఇన్సూరెన్స్, యాక్టివ్క్యూబ్స్ వంటి సంస్థల్లోనూ ఉద్యోగం చేశారు. -
ఆ తక్కువ జీతం ఐటీ వాళ్లకు కాదు: కాగ్నిజెంట్ క్లారిటీ
ఫ్రెషర్లకు అత్యల్పంగా రూ. 2.52 లక్షల వార్షిక జీతం ఆఫర్ చేసినట్లు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ దానిపై స్పష్టత ఇచ్చింది. ఆ వేతనం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు కాదని, సాధారణ డిగ్రీ హోల్డర్లకు మాత్రమేనని తాజాగా పేర్కొంది.తాము ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు రూ. 4-12 లక్షల వేతనాన్ని అందిస్తున్నట్లు కాగ్నిజెంట్ వివరణ ఇచ్చింది. దీంతోపాటు తమ సంస్థలో ఉద్యోగులకు శాలరీ హైక్ మరీ తక్కువగా 1 శాతమే ఇస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఎగతాళిపైనా కాగ్నిజెంట్ స్పందించింది. వ్యక్తిగత పనితీరు ఆధారంగా ఇచ్చే వార్షిక ఇంక్రిమెంట్లలో 1-5 శాతం అనేది కనిష్ట బ్యాండ్ అని వివరించింది.కాగ్నిజెంట్ ఏటా ఇంజనీరింగ్, నాన్-ఇంజనీరింగ్/ఐటీ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్లను విభిన్న పాత్రల కోసం నియమించుకుంటుంది. ఈ రెండు రిక్రూట్మెంట్లు దాదాపు సమాంతరంగా నడుస్తుండటంతో మూడేళ్ల నాన్-ఇంజనీరింగ్/ఐటీ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్ల నియామకానికి సంబంధించిన ఫ్రెషర్ల శాలరీ ప్యాకేజీ సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయింది."నాన్ ఇంజినీరింగ్ నేపథ్యాల నుంచి 3-సంవత్సరాల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న ప్రతిభావంతుల కోసం చేసిన మా ఇటీవలి జాబ్ పోస్టింగ్ వక్రీకరణకు గురైంది. ఈ జాబ్ పోస్టింగ్‌లో ఉన్న రూ. 2.52 లక్షల వార్షిక పరిహారం మూడేళ్ల సాధారణ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు మాత్రమే. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం కాదు. ఫ్రెష్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు మా వార్షిక పరిహారం హైరింగ్, స్కిల్ సెట్, అడ్వాన్స్డ్ ఇండస్ట్రీ అక్రెడిటెడ్ సర్టిఫికేషన్ల కేటగిరీని బట్టి సంవత్సరానికి రూ. 4 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంటుంది" అని కాగ్నిజెంట్ అమెరికాస్ ఈవీపీ, ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి తెలిపారు. -
అవాక్కయ్యేలా ఐటీ కంపెనీ శాలరీ హైక్!
ఫ్రెషర్లకు అతి తక్కువ జీతాల ప్యాకేజీలను అందించినందుకు విమర్శలు ఎదుర్కొంటున్న ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ వేతనాల పెంపులోనూ అలాంటి ధోరణినే అవలంభిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది ఉద్యోగులకు వార్షిక జీతాల పెంపును అత్యల్పంగా కేవలం 1% మాత్రమే అందించినట్లు నివేదికలు వెల్లడించాయి.ది ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. కాగ్నిజెంట్ టెక్నాలజీ సర్వీసెస్ కంపెనీ నాలుగు నెలల ఆలస్యంగా జీతాల పెంపును ప్రారంభించింది. జీతాల పెంపు 1% నుంచి 5% వరకు ఉంటుంది. "3 రేటింగ్ ఉన్నవారు 1-3%, 4 రేటింగ్ ఉన్న ఉద్యోగులు 4%, 5 రేటింగ్ పొందిన వారు 4.5% నుంచి 5% వేతన పెంపు అందుకున్నారు" అని సంబంధిత వర్గాలు తెలిపాయి.ఈ అమెరికన్ ఐటీ కంపెనీ గత సంవత్సరం ఏప్రిల్‌లో ఉద్యోగులకు 7 శాతం నుంచి 11 శాతం వరకు వేతనాలు పెంచింది. భారత్‌లో ఈ కంపెనీకి సుమారుగా 254,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇది దాని మొత్తం శ్రామికశక్తిలో 70 శాతం. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 8,100 క్షీణించింది. దీనితో ఉద్యోగుల సంఖ్య 336,300కి తగ్గింది. -
హైదరాబాద్ మా బలం: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ‘పొరుగు రాష్ట్రాలు సహా భారతదేశంలోనే ఎవరి వద్దా లేని హైదరాబాద్ నగరం మా వద్ద ఉంది. ఇక్కడ ఉన్న ఔటర్ రింగు రోడ్డు వంటి మౌలిక వసతులు, వాతావరణం, శాంతిభద్రతలు దేశంలో మరెక్కడా లేవు. మేము పక్క రాష్ట్రాలతో పోటీ పడాలనే ఆలోచనలకంటే ప్రపంచంతో పోటీ పడాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం. కేవలం అమెరికా, దక్షిణ కొరియాకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్థలకు పిలుపునిస్తున్నా. తెలంగాణకు పెట్టుబడులతో వస్తే భద్రత, లాభంతో పాటు సాంకేతిక నైపుణ్యం అందించే యువశక్తి మా వద్ద ఉంది. పెట్టుబడులతో ఎవరు వచ్చినా రక్షణ ఉంటుందని హామీ ఇస్తున్నా. మీకు అవసరమైన అనుమతులు, వసతులు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది..’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ కోకాపేటలో 10 లక్షల చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన కొత్త క్యాంపస్‌ను సీఎం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘మా పోటీ కర్ణాటక, తమిళనాడు, ఏపీ వంటి రాష్ట్రాలతో కాదు. హైదరాబాద్ వంటి మహా నగరం, కాగ్నిజెంట్ వంటి దిగ్గజ సంస్థలు ఇక్కడ ఉన్నాయి. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపేలా పాలసీల్లో పారదర్శకత పాటిస్తాం. పెట్టుబడులకు ప్రోత్సాహం ఇవ్వాలని భావిస్తున్నాం’అని రేవంత్ చెప్పారు. భిన్నాభిప్రాయాలు ఉన్నా అభివృద్ధి ‘కులీ కుతుబ్‌షాహీలు మొదలుకుని హైదరాబాద్ నగరం 430 ఏళ్లుగా రాజకీయ భిన్నాభిప్రాయాలను అధిగమిస్తూ అభివృద్ధి చెందుతోంది. అధికారంలో ఎవరు ఉన్నా భేదాభిప్రాయాలు లేనందునే ప్రపంచంతో పోటీ పడుతోంది. నిరుద్యోగ సమస్యకు సాంకేతిక నైపుణ్యంతో పరిష్కారం చూపాలనే రాజీవ్‌గాంధీ ఆలోచన మేరకు 1992లో నాటి సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి హైటెక్ సిటీకి పునాది వేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత హైటెక్ సిటీ నిర్మించారు. వైఎస్ హయాంలో మూడో నగరంగా సైబరాబాద్ నిర్మాణం జరిగింది. భవిష్యత్తు అవసరాలను హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలు తీర్చే పరిస్థితి లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎయిర్‌పోర్టుకు కూతవేటు దూరంలో నాలుగో నగరం ‘ఫ్యూచర్ సిటీ’ని నిర్మిస్తాం. చైనా బయట పెట్టుబడుల కోసం చూస్తున్న అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాలకు ఫ్యూచర్ సిటీ సమాధానం చెప్తుంది. ఫ్యూచర్ సిటీలో కాగ్నిజెంట్ వంటి సంస్థలు భాగస్వాములు కావాలి..’అని సీఎం అన్నారు. ఇన్వెస్టర్ టాస్‌్కఫోర్స్ ఏర్పాటు ‘అమెరికా, దక్షిణ కొరియా పర్యటన ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30,750 ఉద్యోగాల కల్పన జరుగుతుంది. త్వరలో మరిన్ని పెట్టుబడుల సాధన దిశగా సమావేశాల నిర్వహణ కోసం ‘ఇన్వెస్టర్ టాస్‌్కఫోర్స్’ఏర్పాటు చేస్తాం. తెలంగాణను ఫ్యూచర్ స్టేట్‌గా మార్చేందుకు హైదరాబాద్‌ను కోర్ అర్బన్ ఏరియాగా, ఔటర్ రింగు రోడ్డు, రీజినల్ రింగు రోడ్డు నడుమ ప్రాంతాన్ని సెమీ అర్బన్ ఏరియాగా, రీజినల్ రింగు రోడ్డు వెలుపల ఉన్న ప్రాంతాన్ని రూరల్ తెలంగాణగా వర్గీకరిస్తున్నాం. సెమీ అర్బన్ ఏరియాను తయారీ కేంద్రంగా, రూరల్ తెలంగాణలోని ప్రాంతాలను ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలుగా అభివృద్ధి చేస్తాం..’అని రేవంత్ చెప్పారు. 57 వేల మంది హైదరాబాద్ నుంచే: కాగ్నిజెంట్ ప్రెసిడెంట్ ‘హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ను కేవలం ఆరు నెలల్లో సిద్ధం చేసి ప్రారంభిస్తున్నాం. 2002 నుంచి హైదరాబాద్ అభివృద్ధిలో కాగ్నిజెంట్ భాగస్వామిగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా కాగ్నిజెంట్‌కు 3.56 లక్షల మంది ఉద్యోగులు ఉంటే అందులో 70 శాతం అంటే 2.40 లక్షల మంది భారత్ నుంచే ఉన్నారు. వీరిలో 57 వేల మంది హైదరాబాద్‌లోనే పనిచేస్తుండగా, 39 శాతం మంది మహిళలే కావడం గమనార్హం..’అని కాగ్నిజెంట్ ఈవీపీ ప్రెసిడెంట్ సూర్య గుమ్మడి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఐటీ, పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, కాగ్నిజెంట్ ప్రతినిధులు నారాయణన్, జాన్కిమ్, కేథరిన్ డియాజ్ తదితరులు పాల్గొన్నారు. -
మూడు భాగాలుగా తెలంగాణ అభివృద్ధి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అత్యధికంగా ఉద్యోగాలు ఇస్తున్న రెండో సంస్థ కాగ్నిజెంట్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘ అమెరికా, దక్షిణ కొరియా పది రోజుల పర్యటన తర్వాత ఈరోజే తిరిగి వచ్చాము. అమెరికా, కొరియాలో మేం కలిసిన ప్రతి ఒక్క వ్యాపారవేత్త, కార్పోరేట్ లీడర్స్ తెలంగాణ, హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నా. ఈ పర్యటన ద్వారా రూ.31,500 కోట్ల పెట్టుబడులు, 30,750కి పైగా ఉద్యోగాలు లభించనున్నాయన్న సంగతి ఇప్పటికే మీకు తెలుసు. త్వరలోనే మరిన్ని ఒప్పందాలు కుదుర్చుకోనున్నాం. పెట్టుబడులకు సంబంధించి సమావేశాల నిర్వహణ కోసం ఇన్వెస్టర్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తాం. ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ. రాష్ట్రానికి మూడు రింగ్స్ ఉన్నాయి. మొదటిది కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్. రెండోది సెమీ-అర్బన్ ఏరియా.. ఇక్కడ మేము తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. మూడోది రీజనల్ రింగ్ రోడ్ బయట ఉన్న రూరల్ తెలంగాణ. అన్ని రకాల ఆధునిక సౌకర్యాలతో ఆసియాలోనే అత్యుత్తమ గ్రామాలను ఇక్కడ అభివృద్ధి చేస్తాం. వచ్చే 10 ఏళ్లలో తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనేది మా సంకల్పం. కాగ్నిజెంట్ విస్తరణకు పూర్తి మద్దతు ఉంటుందని నేను హామీ ఇచ్చాను. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. హైదరాబాద్ నగరానికి నాలుగు వందల ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కృషితో హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధికి పునాది పడింది. హైదరాబాద్‌లాగే కాగ్నిజెంట్ కూడా అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. రాష్ట్రంలోనే అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ గుర్తింపు పొందింది. రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉన్నా.. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంలో ఎలాంటి భేషజాలు లేవు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లాగే ఫోర్త్ సిటీ.. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయబోతున్నాం. మా చిత్తశుద్ధి ఏమిటో ఫ్యూచర్ సిటీ అభివృద్దే నిరూపిస్తుంది. హైదరాబాద్ నగరం పెట్టుబడులకు అనువైన ప్రాంతం. పారిశ్రామిక వేత్తలకు ఈ వేదికగా పిలుపునిస్తున్నా. రండి పెట్టుబడులు పెట్టండి.. మీకు కావలసిన సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంది’’ అని అన్నారు. -
నేడు కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన
సాక్షి, హైదరాబాద్: ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ హైదరాబాద్‌లో బుధవారం కొత్త క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తోంది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం కోకాపేటలో జరిగే శంకుస్థాపన కార్యక్రమంలో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్‌తో కలిసి పాల్గొంటారు. హైదరాబాద్‌లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ద్వారా మరో 15 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త క్యాంపస్ దృష్టి సారిస్తుంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో అమెరికాలో పర్యటించిన సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలోని అధికారుల బృందంతో ఈ నెల 5న కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ భేటీ అయ్యారు. కాగ్నిజెంట్ విస్తరణ ప్రణాళికలో భాగంగా హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తామని రవికుమార్ ఈ భేటీ అనంతరం ప్రకటించారు. న్యూజెర్సీలో ఈ నెల 5న రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం మేరకు కేవలం పది రోజుల వ్యవధిలోనే కొత్త క్యాంపస్ పనులకు కాగ్నిజెంట్ శ్రీకారం చుడుతోంది. 1994లో చెన్నై కేంద్రంగా ఆవిర్భవించిన కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలను విస్తరిస్తోంది. రాష్ట్రంలో 2002 నుంచి కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థకు హైదరాబాద్ ఐటీ కారిడార్‌లోని వివిధ ప్రాంతాల్లో ఐదు క్యాంపస్‌లు ఉన్నాయి. ప్రస్తుతం కాగ్నిజెంట్ హైదరాబాద్ క్యాంపస్‌లో 57 వేల మంది ఉద్యోగులున్నారు. తెలంగాణ ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్‌కు పేరుంది. గత రెండేళ్లలో ఈ కంపెనీ రాష్ట్రంలోని 34 వివిధ విద్యాసంస్థల నుంచి 7,500 మంది ఫ్రెషర్స్‌కు ఉద్యోగాలు ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ తెలంగాణ నుంచి రూ.7,725 కోట్ల ఐటీ ఎగుమతులను నమోదు చేసింది. గడిచిన ఐదేళ్లలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.22.5 కోట్లతో వివిధ సామాజిక కార్యక్రమాలు చేపట్టింది. -
కాగ్నిజెంట్ భారీ విస్తరణ!
సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ హైదరాబాద్‌లో భారీ విస్తరణకు ముందుకు వచ్చింది. దాదాపు 15 వేల మంది ఉద్యోగు లకు పని కల్పించేలా, 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్, కంపెనీ ఇతర ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జరి గిన చర్చల అనంతరం కాగ్నిజెంట్ విస్తరణ ప్రణా ళికపై ఒప్పందం జరిగింది. వాస్తవానికి గత ఏడాది ముఖ్యమంత్రి బృందం దావోస్ పర్యటన సందర్భంగానే ఈ ఒప్పందానికి పునాదులు పడ్డాయి. సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న నేపథ్యంలో కంపెనీ విస్తరణకు కాగ్నిజెంట్ ఈ నగరాన్ని ఎంచుకుంది. కాగా ఒప్పందం సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని చెప్పారు. కాగ్నిజెంట్ కంపెనీ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్‌ను తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటాయని అభిప్రాయపడ్డారు. కాగ్నిజెంట్‌కు తమ ప్రభుత్వం తగిన మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలు లభించడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని చెప్పారు. క్లయింట్లకు మెరుగైన సేవలుకాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ మాట్లాడుతూ.. టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్‌లో తమ కంపెనీ విస్తరించటం సంతోషంగా ఉందని అన్నారు. హైదరాబాద్‌లో నెలకొల్పే కొత్త సెంటర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలందించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్‌లో అత్యాధునిక పరిష్కారాలను అందిస్తామని పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్త కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందని తెలిపారు. కాగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని ఇతర టైర్–2 నగరాలలో కూడా ఐటీ సేవలను విస్తరించాలని ముఖ్యమంత్రి చేసిన సూచనపై కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, ఇక్కడ కొత్త కేంద్రాన్ని స్థాపించాలనే కాగ్నిజెంట్ నిర్ణయం హైదరాబాద్ అభివృద్ధికి దోహదపడుతుందని శ్రీధర్‌బాబు అభిప్రాయపడ్డారు. -
ప్రముఖ కంపెనీ లేఆఫ్స్.. వేలాదిమంది టెకీలు బయటకు
2024లో కూడా ఐటీ ఉద్యోగుల పరిస్థితి గాల్లో దీపంలాగా అయిపోయింది. కరోనా సమయంలో ఉద్యోగాలు పోయి ఇబ్బందులు పడిన సంఘటనలు మరువకముందే.. దిగ్గజ కంపెనీలు సైతం ఇప్పటికే అదే బాటలో నడుస్తున్నాయి. ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. తాజాగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ప్రొఫెషనల్ సర్వీసెస్ సంస్థ 'కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్' ఏప్రిల్ - జూన్ త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. ఇందులో ఏకంగా 8వేలకంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించినట్లు స్పష్టమవుతోంది.అమెరికా ప్రధాన కేంద్రంగా పనిచేసే కాగ్నిజెంట్ సంస్థలో ఎక్కువమంది భారతీయ ఉద్యోగులు ఉన్నారు. ఈ కంపెనీ జూన్ 2024తో ముగిసిన రెండవ త్రైమాసికంలో 566 మిలియన్ డాలర్ల నికర లాభం పొందింది. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే సుమారు 22.2 శాతం ఎక్కువని తెలుస్తోంది.కంపెనీ రాబోయే రోజుల్లో మరిన్ని లాభాలను ఆర్జించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే కంపెనీ ఎప్పటికప్పుడు తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూనే ఉంది. ఇందులో భాగంగానే.. సంస్థ ఏప్రిల్ - జూన్ త్రైమాసికంలో దాపు 8100 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. ఈ సంఖ్య 2024 మొదటి త్రైమాసికం కంటే ఎక్కువే.ఇప్పుడు కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 336300గా ఉన్నట్లు తెలుస్తోంది. 2024 ప్రారంభం నుంచి పెద్ద పెద్ద కంపెనీలు కూడా తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూ వస్తున్నాయి. అయితే టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా కంపెనీలో మాత్రం ఉద్యోగులు సంఖ్య కొంత పెరిగింది. కాగా హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య తగ్గింది. -
కాగ్నిజెంట్ చేతికి బెల్కాన్
న్యూఢిల్లీ: ఐటీ రంగంలో ఉన్న యూఎస్ సంస్థ కాగ్నిజెంట్ తాజాగా డిజిటల్ ఇంజనీరింగ్ కంపెనీ బెల్కాన్ను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. డీల్ విలువ రూ.10,861 కోట్లు. బెల్కాన్ను ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ ఏఈ ఇండ్రస్టియల్ పార్ట్నర్స్ ప్రమోట్ చేస్తోంది. ఈ డీల్ ద్వారా 190 బిలియన్ డాలర్ల ఇంజనీరింగ్ రీసెర్చ్, డెవలప్మెంట్ (ఈఆర్అండ్డీ) సర్విసెస్ రంగంలో విస్తరించాలన్నది కాగ్నిజెంట్ ఆలోచన. అలాగే ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్, మెరైన్ రంగాల్లో అడుగుపెట్టాలని భావిస్తోంది.ఈఆర్అండ్డీ సర్విసుల మార్కెట్లో సంస్థ స్థానం మరింత బలపడుతుందని కాగ్నిజెంట్ సీఈవో ఎస్.రవి కుమార్ తెలిపారు. కాగ్నిజెంట్‌కు ఇది రెండవ అతిపెద్ద డీల్‌గా నిలిచింది. 2014లో హెల్త్‌కేర్ సాఫ్ట్వేర్ కంపెనీ ట్రైజెట్టో కొనుగోలుకు 2.7 బిలియన్ డాలర్లు వెచ్చించింది. ఇక బెల్కాన్కు అంతర్జాతీయంగా 60 ప్రాంతాల్లో 10,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. బోయింగ్, జనరల్ మోటార్స్, రోల్స్ రాయిస్, యూఎస్ స్పేస్ ఏజెన్సీ అయిన నాసా, యూఎస్ నేవీ వంటి దిగ్గజ సంస్థలకు సేవలు అందిస్తోంది. -
దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం.. వేలకోట్ల డీల్
ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్పొరేషన్.. సిన్సినాటి, ఒహియోకు చెందిన ఇంజినీరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ER&D) సర్వీస్ ప్రొవైడర్ 'బెల్కాన్'ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..కాగ్నిజెంట్ కంపెనీ ఇప్పుడు బెల్కాన్ను 1.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 10800 కోట్లు. కాగ్నిజెంట్ ఈ కంపెనీని కొనుగోలు చేసిన తరువాత తన పరిధిని మరింత విస్తరించనుంది.ఇక బెల్కాన్ విషయానికి వస్తే.. ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 60 కంటే ఎక్కువ దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇందులో ఏకంగా 10000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. జనరల్ మోటార్స్, రోల్స్ రాయిస్, బోయింగ్, అమెరికా నేవీ, నాసా వంటి సంస్థలకు ఈ కంపెనీ సేవలు అందిస్తోంది. కంపెనీ విక్రయానికి సంబంధించిన అధికారిక ప్రకటనను బెల్కాన్ అధికారికంగా ప్రకటించలేదు.ఒప్పందంలో భాగంగా, బెల్కాన్ సీఈఓ లాన్స్ క్వానీవ్స్కీ నేతృత్వంలో కంపెనీ కొనసాగుతుందని, కాగ్నిజెంట్ యూనిట్‌గా పనిచేస్తుందని కాగ్నిజెంట్ తెలిపింది. బెల్కాన్ కంపెనీ వార్షిక ఆదాయం రూ. 66 వేలకోట్లు కంటే ఎక్కువని తెలుస్తోంది. ఈ కంపెనీ కొనుగోలుతో కాగ్నిజెంట్ మరింత అభివృద్ధి చెందుతుందని నిపుణులు భావిస్తున్నారు.Cognizant has agreed to acquire Belcan, expanding access to the high-growth Engineering Research & Development services market and establishing leadership in aerospace & defense. See the release here: https://t.co/2HS9UKKR5V pic.twitter.com/XoZqEHelEr— Cognizant (@Cognizant) June 10, 2024 -
ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం.. టెక్ దిగ్గజం వార్నింగ్
ఇప్పటికే ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థలు.. తమ ఉద్యోగులకు ఆఫీస్ నుంచే పనిచేయాలని (రిటర్న్-టు-ఆఫీస్) ఆదేశాలు జారీ చేశాయి. ఈ విధానాన్ని ఇప్పుడు 'కాగ్నిజెంట్' కంపెనీ అమలు చేసింది. ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను అతిక్రమిస్తే ఉద్యోగాల నుంచి తొలగించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.భారతదేశంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి తప్పకుండా 'రిటర్న్ టు ఆఫీస్' పాలసీకి అనుగుణంగా నడుచుకోవాలని స్పష్టం చేసింది. 2023లో విప్రో, టీసీఎస్ కంపెనీలన్నీ తమ ఉద్యోగులను ఆఫీసుకు రప్పించే ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలో కాగ్నిజెంట్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.టెక్ సంస్థలన్నీ కూడా తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్న క్రమంలో.. కాగ్నిజెంట్ సీఈఓ 'రవి కుమార్' తమ ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేస్తూ.. ఇండియాలో పనిచేస్తున్న కంపెనీ ఎంప్లాయిస్ ఆఫీసు నుంచి వారానికి కనీసం మూడు రోజులు పనిచేయాలని పేర్కొన్నారు.కాగ్నిజెంట్ కంపెనీలు మొత్తం 3.47 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో సుమారు 2.54 లక్షల మంది భారతదేశంలోనే పనిచేస్తున్నట్లు సమాచారం. ఇంటి నుంచి పని చేయడంలో కంటే ఆఫీసు నుంచి పనిచేస్తేనే పనితీరు మెరుగ్గా ఉంటుందని సీఈఓ రవి కుమార్ పేర్కొన్నారు. ఇప్పటికే పలు కంపెనీల సీఈఓలు కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించారు. -
ఆఫీస్‌కి రాకపోతే ఫైరింగే.. ప్రముఖ ఐటీ కంపెనీ వార్నింగ్!
ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) రిటర్న్-టు-ఆఫీస్ పాలసీకి సంబంధించి తమ ఉద్యోగులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. పదేపదే రిమైండర్లు చేసినప్పటికీ కార్యాలయానికి తిరిగి రావాలనే ఆదేశాన్ని విస్మరించేవారు తొలగింపు సహా తీవ్రమైన క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసిందని ‘లైవ్‌మింట్’ కథనం పేర్కొంది."నిర్దేశాలను పాటించడంలో వైఫల్యం కంపెనీ విధానాల ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తనకు దారితీస్తుందని దయచేసి గమనించండి. తదనుగుణంగా మీపై తగిన క్రమశిక్షణా చర్యలు ప్రారంభించడం జరుగుతుంది. ఇది తొలగింపునకు కూడా దారితీయవచ్చు" అని ఒక ఉద్యోగికి రాసిన లేఖలో కాగ్నెజెంట్ హెచ్చరించినట్లుగా నివేదిక పేర్కొంది.ఇన్ ఆఫీస్ వర్క్ ప్రాముఖ్యతను కాగ్నిజెంట్ ఇంతకు ముందే పునరుద్ఘాటించింది. ఆఫీస్ పాలసీని పాటించడంలో వైఫల్యాన్ని కంపెనీ పాలసీల ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తనగా పరిగణిస్తామని, ఇది టర్మినేషన్‌కు సైతం దారితీసే అవకాశం ఉందని ఏప్రిల్ 15 నాటి లేఖలో కాగ్నిజెంట్ స్పష్టం చేసింది.భారత్‌లో కాగ్నిజెంట్ శ్రామిక శక్తి గణనీయంగా ఉంది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం.. దాని 347,700 మంది ఉద్యోగులలో సుమారు 2,54,000 మంది భారత్‌లోనే ఉన్నారు. కంపెనీ అతిపెద్ద ఉద్యోగుల స్థావరం భారత్ అని దీనిని బట్టీ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ రిటర్న్-టు-ఆఫీస్ విధానం భారత్‌లో ప్రాధాన్యత సంతరించుకుంది.ఇన్ ఆఫీస్ వర్క్ తప్పనిసరి ఆదేశాలు అనేక కారణాల నుంచి వచ్చాయి. ఆవిష్కరణలు, జట్టు కృషి, బలమైన సంస్థాగత సంస్కృతిని వ్యక్తిగత సహకారం ప్రోత్సహిస్తుందని కంపెనీలు విశ్వసిస్తున్నాయి. అంతేకాకుండా, ప్రత్యేకించి సెన్సిటివ్ డేటా, కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌లను నిర్వహించే పరిశ్రమలలో కార్యాచరణ, భద్రతాపరమైన అంశాలు కూడా కారణంగా ఉన్నాయి.టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), విప్రో (Wipro) వంటి కంపెనీలు కూడా గతంలో రిటర్న్-టు-ఆఫీస్ విధానాన్ని తప్పనిసరి చేశాయి. అయితే, కొన్ని కంపెనీలు రిమోట్ పని సౌలభ్యానికి అలవాటుపడిన కొంతమంది ఉద్యోగుల నుంచి ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి. చాలా మంది ఉద్యోగులు రిమోట్ వర్క్ మెరుగైన పని-జీవిత సమతుల్యతను అందిస్తుందని, ప్రయాణ ఒత్తిడిని తగ్గిస్తుందని వాదించారు. అయితే కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఈ ఉద్యోగుల ప్రాధాన్యతలను వ్యాపార అవసరాలు, కార్యాచరణ సామర్థ్యాలతో సమతుల్యం చేస్తున్నాయి. -
దేశ ఐటీ రంగంలో టాప్.. అత్యధిక వేతనం ఈయనదే..
దేశ ఐటీ రంగంలో అత్యధిక వేతనం అందుకున్న సీఈవోగా కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ సింగిశెట్టి నిలిచారు. ‘మింట్’ నివేదిక ప్రకారం.. కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ గత సంవత్సరం వేతన పరిహారంగా 22.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 186 కోట్లు) అందుకున్నారు. కంపెనీ ఫైలింగ్ ప్రకారం, రవి కుమార్ సింగిశెట్టి గత సంవత్సరం మొత్తంగా 22.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 186 కోట్లు) అందుకోగా ఇందులో 20.25 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.169.1 కోట్లు) విలువైన షేర్లను అందుకున్నారు. గత ఏడాది కాగ్నిజెంట్ ఆదాయం రూ.19.35 బిలియన్ డాలర్లు ఉండగా ఇందులో సీఈవో రవి కుమార్ వేతన పరిహారం 0.11 శాతంగా ఉంది. ఇతర ఐటీ సీఈవోల వేతనాలు ఇలా.. విప్రో మాజీ సీఈవో థియరీ డెలాపోర్టే రూ. 10.1 మిలియన్ డాలర్లు (రూ. 83 కోట్లు) హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో విజయకుమార్ 10.65 మిలియన్ డాలర్లు (రూ. 88 కోట్లు) అసెంచర్ సీఈవో జూలీ స్వీట్ 31.55 మిలియన్ డాలర్లు (రూ.263 కోట్లు) ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ 6.8 మిలియన్లు ( రూ. 56.4 కోట్లు) టీసీఎస్ మాజీ సీఈవో రాజేష్ గోపీనాథన్ 3.5 మిలియన్ ( రూ. 29.16 కోట్లు) -
ఆశగా ఎదురుచూస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్
నాస్డాక్-లిస్టెడ్ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ ఉద్యోగులకు చేదు వార్త ఇది. ఏప్రిల్‌లో జరగాల్సిన జీతాల పెంపు వాయిదా పడనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ ఏడాది ఆగస్టు 1 నుండి "అర్హత" ఉన్న ఉద్యోగులకు జీతాల పెంపును అందజేస్తుందని ‘మనీకంట్రోల్’ నివేదించింది. జీతాల పెంపు గత సంవత్సరంతో పోలిస్తే సుమారు నాలుగు నెలల ఆలస్యం కానుంది. స్థూల ఆర్థిక సమస్యల కారణంగా కంపెనీ బలహీనమైన డిమాండ్ వాతావరణాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో జీతాల పెంపు ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఈ అంశం ఇతర ఐటీ కంపెనీలను కూడా ప్రభావితం చేయనుంది. జీతాల పెంపు ఆలస్యాన్ని కంపెనీ సైతం ధ్రువీకరించినట్లు మనీకంట్రోల్ పేర్కొంది. “వార్షిక మెరిట్ పెంపుదల, బోనస్‌ల ద్వారా మా ఉద్యోగుల కృషి, అంకితభావాన్ని గుర్తించడానికి మేము కట్టుబడి ఉన్నాం. ఈ నిబద్ధతలో భాగంగా, అర్హతగల అసోసియేట్లకు మెరిట్ పెంపుదల ఈ సంవత్సరం ఆగస్టు 1న అందిస్తాం. ముఖ్యంగా మూడు సంవత్సరాలలో మా చాలా మంది ఉద్యోగులకు నాలుగు మెరిట్ హైక్స్ దక్కాయి” అని కంపెనీ పేర్కొంది. తాజా చర్యతో మెజారిటీ కాగ్నిజెంట్ ఉద్యోగులు మూడు సంవత్సరాలలో నాలుగు పెంపులను అక్టోబర్ 2021, అక్టోబర్ 2022, ఏప్రిల్ 2023, ఆగస్టు 2024 పొందుతున్నట్లవుతుంది. కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా 3.47 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. వీరిలో దాదాపు 2.54 లక్షల మంది భారత్‌లోనే ఉన్నారు. -
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మరో ఐటీ కంపెనీ మంగళం!
వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఐటీ ఉద్యోగులకు మరో కంపెనీ ఆఫీసుకి పిలిచింది. ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ భారత్‌లోని తమ ఉద్యోగులను వారానికి కనీసం మూడురోజులు ఆఫీసుకి వచ్చి పని చేయాలని కోరినట్లు ఒక నివేదిక తెలిపింది. దీంతో రిమోట్ వర్కింగ్‌ను ముగించిన తాజా కంపెనీగా కాగ్నిజెంట్ అవతరించింది. వారానికి సగటున మూడు రోజులు ఆఫీసులో ఉండాలని, టీమ్ లీడర్ సూచన మేరకు నడుచుకోవాలంటూ భారత్‌లోని ఉద్యోగులకు గత వారం కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ పంపిన మెమోను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ కథనం పేర్కొంది. అయితే ఎప్పటి నుంచి ఈ ఆదేశాలు అమలవుతాయన్నది కంపెనీ పేర్కొనలేదని నివేదిక తెలిపింది. ఆఫీసు నుండి పని చేయడం వల్ల కంపెనీ సంస్కృతిపై మంచి సహకారం, అవగాహన లభిస్తుందని కాగ్నిజెంట్ చెబుతోంది. అయితే దీని వల్ల ఫ్లెక్సిబులిటీ, వర్క్-లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటాయని చాలా మంది ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఆఫీస్‌లో కలిసి పనిచేస్తూ సహకార ప్రాజెక్ట్‌లు, ట్రైనింగ్, టీమ్ బిల్డింగ్ వంటి అంశాలకు సమయం కేటాయించాలని కంపెనీ సీఈవో కోరుతున్నారు. కొత్త యాప్ భారత్ కోసం కొత్త హైబ్రిడ్-వర్క్ షెడ్యూలింగ్ యాప్‌ను కూడా కాగ్నిజెంట్ ప్రారంభించనుంది. ఇది మేనేజర్లకు షెడ్యూల్‌లను సమన్వయం చేయడంలో, వారి టీమ్‌ల కోసం ఆఫీస్‌లో స్పేస్‌ను రిజర్వ్ చేయడంలో సహాయపడుతుందని మెమోలో పేర్కొన్నారు. కాగ్నిజెంట్ 3,47,700 మంది ఉద్యోగులను కలిగి ఉంది. వారిలో దాదాపు 2,54,000 మంది భారతదేశంలోనే ఉన్నారు. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్టెక్తో సహా అనేక భారతీయ ఐటీ కంపెనీలు ఆఫీస్‌కి వచ్చి పనిచేయాలని ఉద్యోగులను ఇప్పటికే కోరాయి. మార్చి 31 నాటికి ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసు నుండి పని చేయడాన్ని టీసీఎస్ తప్పనిసరి చేసింది. -
కాగ్నిజెంట్ మాజీ సీఈవో బర్త్‌డే విషెస్.. ఎవరికో తెలుసా?
ప్రత్యర్థి కంపెనీల నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగులను నియమించుకుని వార్తల్లో నిలిచిన సాఫ్ట్వేర్ సంస్థ కాగ్నిజెంట్ మాజీ సీఈవో తాజాగా ఆ కంపెనీకి బర్త్‌డే విషెస్ చెప్పారు. కాగ్నిజెంట్ శుక్రవారం (జనవరి 26) నాటికి 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. కాగ్నిజెంట్ వృద్ధిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులలో మాజీ సీఈవో ఫ్రాన్సిస్కో డిసౌజా ఒకరు. 2007 జనవరి నుంచి 2019 మార్చి మధ్య కాలంలో 12 సంవత్సరాల పాటు కంపెనీ సీఈవోగా పనిచేసిన ఆయన ఆపై ఒక సంవత్సరం పాటు బోర్డు వైస్ చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. 1994 జనవరి 26న భారత్‌లోని చైన్నైలో కాగ్నిజెంట్ ఏర్పాటైంది. ఈ సంస్థకు ప్రస్తుతం ఎస్.రవికుమార్ సీఈవోగా ఉన్నారు. కాగ్నిజెంట్ 30వ వార్షికోత్సవం సందర్భంగా డిసౌజా లింక్డ్ఇన్లో ఓ పోస్టు పెట్టారు. సంస్థలో పనిచేసిన ప్రతి వ్యక్తి ప్రతిభకు, అంకితభావానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. "హ్యాపీ బర్త్‌డే కాగ్నిజెంట్! 30 సంవత్సరాల క్రితం, సాంకేతిక సేవల పరిశ్రమను ఏదో ఒకరోజు తీర్చిదిద్దే లక్ష్యంతో చిన్న జట్టులో భాగమయ్యే అవకాశం నాకు లభించింది. ఈరోజు కాగ్నిజెంట్‌కు 30 ఏళ్లు నిండుతున్నాయి. ఈ సందర్భంగా కంపెనీ ఎదుగుదల, ఆవిష్కరణలు, ఎక్సలెన్స్ ప్రయాణాన్ని ప్రతిబింబిస్తాను" అంటూ రాసుకొచ్చారు. -
పక్క కంపెనీల నుంచి లాగేసుకోవడం కరెక్టేనా? టెక్ సీఈవోల మాటలు ఇవే..
అన్ని పరిశ్రమల్లోనూ పోటీ అనేది సర్వసాధారణం. అయితే ఇది ఐటీ పరిశ్రమలో మరీ ఎక్కువైంది. పోచింగ్ (ఉద్యోగుల అక్రమ వలసలు) ఐటీ కంపెనీల మధ్య అనారోగ్యకరమైన పోటీకి దారితీస్తోంది. దీనిపై మిశ్రమ స్పందన వస్తోంది. దేశీయ ఐటీ దిగ్గజాలు విప్రో, ఇన్ఫోసిస్‌ల నుంచి చాలా మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లు బయటికి వెళ్లిపోయారు. వీరిలో చాలా మంది ప్రత్యర్థి కాగ్నిజెంట్‌లో చేరారు. కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ తాను ఇంతకుముందకు పనిచేసిన ఇన్ఫోసిస్, విప్రో నుంచి దాదాపు 20 మంది సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకున్నట్లు సమాచారం. విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జతిన్ దలాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ హక్ సహా 10 మంది టాప్ ఎగ్జిక్యూటివ్‌లను కాగ్నిజెంట్‌కు కోల్పోయింది. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయడానికి కాగ్నిజెంట్‌పై దావా వేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు సీఎఫ్ఓ జతిన్ దలాల్‌ను రూ.25.15 కోట్ల నష్టపరిహారం కోరింది. ఐటీ కంపెనీల మధ్య సాగుతున్న ఈ పోచింగ్ వార్‌పై ఆయా కంపెనీల సీఈవోలు స్పందించారు. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా సీఎన్‌బీసీ-టీవీ18తో ఎవరెవరు ఏమేమి అన్నారో ఇప్పుడు చూద్దాం.. ఒప్పందాన్ని గౌరవించడం ముఖ్యం తాము ఎవరికీ ఉపాధి లేదా ఉద్యోగ అవకాశాలను నిరోధించడం లేదని, సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని గౌరవించడం చాలా ముఖ్యం, ఇదేమీ అసమంజసమైన అభ్యర్థన కాదని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ అన్నారు. ఒప్పంద ఉల్లంఘనతో తమ సంస్థ సమాచార గోప్యతకు భంగం కలగకుండా తమను తాము రక్షించుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు. మేము అదృష్టవంతులం ఇన్ఫోసిస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సలీల్ పరేఖ్ స్పందిస్తూ "మేము అదృష్టవంతులం. మాకు నాయకత్వ కొరత లేదు. కంపెనీ నాయకత్వ పునర్నిర్మాణాన్ని చాలా త్వరగా పూర్తి చేశాం. కంపెనీలో ఉన్న చాలా మందిని పెద్ద బాధ్యతాయుతమైన పాత్రలలోకి తీసుకున్నాం. అది నిజంగా బాగా పనిచేస్తున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి నాకు ఎటువంటి ఆందోళనా కనిపించడం లేదు. నిజానికి మార్పు వల్ల కొన్నిసార్లు ప్రయోజనం కలుగుతుంది" అన్నారు. మాకేం డోకా లేదు "మేము చాలా కాలం నుంచి చాలా స్థిరమైన నాయకత్వాన్ని కలిగి ఉన్నాం. మా తోటివారిలో కొందరికి ఇది రాజీగా అనిపిస్తుంది. కానీ మేము మంచి స్థానంలో ఉన్నందుకు సంతోషిస్తున్నాము" అని హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో సి.విజయకుమార్ పేర్కొన్నారు. నా పని మాత్రమే చేస్తున్నా.. “నేను నా పని మాత్రమే చేస్తున్నాను. నేను కాగ్నిజెంట్‌ను ఉద్యోగులు కోరుకునే కంపెనీగా మార్చాలనుకుంటున్నాను” అని కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ అన్నారు. "ఇది స్థిరమైన ప్రక్రియ. నేను మొదటి నుంచి ఇదే చెప్తున్నాను. కంపెనీ కోసం సమర్థులైనవ్యక్తులను అన్వేషించడమే నా పని. మాకు క్లయింట్ సెంట్రిసిటీ డీఎన్ఏ ఉంది. కంపెనీ వారసత్వాన్ని నేను పునరుద్ధరిస్తున్నాను” అన్నారాయన. -
Poaching Row: ఐటీ కంపెనీల్లో అక్రమ వలసలు.. పెదవి విప్పిన కాగ్నిజెంట్ సీఎండీ
న్యూఢిల్లీ: ఇతర సంస్థల నుంచి అక్రమంగా అత్యున్నత అధికారులను ఆకట్టుకోవడం(పోచింగ్)వల్ల కంపెనీ బిజినెస్‌పై ఎలాంటి ప్రభావం పడబోదని ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, ఎండీ రాజేష్ నంబియార్ తాజాగా పేర్కొన్నారు. ఇటీవల దేశీ ఐటీ కంపెనీల మధ్య అత్యున్నత అధికారుల అక్రమ వలస(పోచింగ్)లపై తలెత్తిన ఆరోపణల నేపథ్యంలో నంబియార్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడేందుకు నిరాకరించిన నంబియార్ ఉద్యోగులతో గల కాంట్రాక్టు అమలుకు కంపెనీలు పట్టుబట్టడాన్ని సమర్ధించారు. ఇందుకు ఆయా కంపెనీలకు అధికారముంటుందని వ్యాఖ్యానించారు. అయితే నాన్పోచింగ్పై పరిశ్రమవ్యాప్తంగా వర్తించే నిబంధనలకు ఆస్కారంలేదని స్పష్టం చేశారు. ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీ అధికారులను లేదా నిపుణులను తీసుకోవడాన్ని నివారించేందుకు నిబంధనలు వర్తింపచేయలేమని అభిప్రాయపడ్డారు. ఐటీ పరిశ్రమ ప్రధానంగా నైపుణ్య ఆధారితంకావడమే దీనికి కారణమని తెలియజేశారు. నిపుణులతోనే నిర్మితమైన సాఫ్ట్వేర్ సేవల పరిశ్రమలో ఉద్యోగ వలసలకు చెక్ పెట్టేందుకు సరైన నిర్వచనాన్ని ఇవ్వలేమని వివరించారు. అయితే ఉపాధి కల్పనకు సంబంధించి పరిశ్రమవ్యాప్తంగా వర్తించే మార్గదర్శకాలకు వీలున్నట్లు తెలియజేశారు. పోచింగ్ సమస్య తమ కంపెనీపై ప్రభావాన్ని చూపబోదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతేకాకుండా పరిశ్రమపైన సైతం ప్రభావాన్ని చూపబోదని అభిప్రాయపడ్డారు. గత కొన్ని వారాలుగా సాఫ్ట్వేర్ సేవల దిగ్గజాల మధ్య పోచింగ్ వివాదాలు తలెత్తిన విషయం విదితమే. దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇటీవల.. తమ అధికారులను కాగ్నిజెంట్ అనైతిక పద్ధతుల్లో విధుల్లోకి తీసుకుంటున్నట్లు విమర్శించడంతో పరిశ్రమలో అలజడి తలెత్తింది. గతంలో ఇన్ఫోసిస్‌లో పనిచేసి ప్రస్తుతం కాగ్నిజెంట్ సీఈవోగా వ్యవహరిస్తున్న రవి కుమార్ ఇతర సంస్థల నుంచి 20 మంది సీనియర్ లీడర్లను ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది. వీరిలో పలువురు ఇన్ఫోసిస్, విప్రోలో బాధ్యతలు నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఉద్యోగులతో కనీసం ప్రాథమిక స్థాయిలో నియామకాలలో సైతం ఎలాంటి సర్వీసు ఒప్పందాలు లేదా బాండ్లకు తెరతీయడంలేదని నంబియార్ వివరించారు. క్యాంపస్‌ల నుంచి ప్రధానంగా ఉద్యోగులకు ఎంపిక చేసుకుంటున్నట్లు తెలియజేశారు. ఇది స్వేచ్చా ప్రపంచమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. -
ఇన్ఫోసిస్‌కు మరో భారీ షాక్, వరుస ‘ఝలక్’ ఇస్తున్న ఉద్యోగులు!
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ సంస్థలో పనిచేస్తున్న సీనియర్ ఎగ్జిక్యూటీవ్ బిన్నీ మ్యాథ్యూ తాజాగా యాక్సెంచర్‌లో చేరారు. తమ సంస్థలో చీఫ్ ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టినట్లు యాక్సెంచర్ తెలిపింది. ‘‘భారత్‌లో కాగ్నిజెంట్ అనైతిక వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుంది. నిబంధల్ని ఉల్లంఘించి తమ ఎగ్జిక్యూటీవ్‌లను సంస్థలో చేర్చుకుంటుంది. నాన్-కాంపిటీ క్లాజ్‌ను ఉల్లంఘిస్తూ ఉద్యోగులు సైతం కాగ్నిజెంట్‌లో చేరుతున్నారంటూ ’’ ఇటీవల విప్రో- ఇన్ఫోసిస్‌లు బెంగళూరు కోర్టును ఆశ్రయించాయి. జతిన్ దమాల్ రూ.25.15 కోట్లు చెల్లించాలి దీంతో పాటు నాన్-కాంపిటీ నిబంధనల ప్రకారం.. విప్రోలో పనిచేస్తున్న ఉద్యోగులు రాజీనామా అనంతరం తమ కాంపిటీటర్ సంస్థల్లో 10ఏళ్ల వరకు చేరకూడదు. అలా చేరితే నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిబంధనని అస్త్రంగా చేసుకున్న విప్రో.. నాన్-కాంపిటేట్ నిబంధన ఉల్లంఘించారంటూ విప్రో సంస్థ మాజీ సీఎఫ్ఓ జతిన్ దలాల్‌ను రూ. 25.15 కోట్లు చెల్లించాలని కోర్టులో దావా వేసింది. మీకు మీరే.. మాకు మేమే అయినప్పటికీ ఆ రెండు సంస్థలోని ఉన్నతస్థాయి ఉద్యోగులు ఇతర సంస్థల్లో 10 ఏళ్ల పాటు చేరకూడదంటూ చేస్తున్న ప్రయత్నాలు ఇప్పట్లో సఫలమయ్యేలా కనిపించడం లేదు. ఎగ్జిక్యూటీవ్‌లు, ఇతర సీనియర్ స్థాయి ఉద్యోగులు మీకు మీరే.. మాకు మేమే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్ధి కంపెనీల్లో చేరి భారీ ప్యాకేజీలను సొంతం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ సీనియర్ ఎగ్జిక్యూటీవ్ బిన్నీ మ్యాథ్యూ యాక్సెంచర్‌లో చేరడం అగ్నికి ఆజ్యం పోసినట్లైందని టెక్నాలజీ పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. యాక్సెంచర్‌లో చేరడానికి ముందు మాథ్యూస్ 15 సంవత్సరాలకు పైగా ఇన్ఫోసిస్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ప్రొక్యూర్మెంట్ గ్రూప్ హెడ్‌గా పనిచేశారు. తాజాగా ఆ సంస్థకు గుడ్ బై చెప్పారు. జనవరి 3న యాక్సెంచర్‌లో చేరారు. ఇన్ఫోసిస్, విప్రో వర్సెస్ కాగ్నిజెంట్ టెక్ కంపెనీలు ఇన్ఫోసిస్, విప్రో ప్రత్యర్థి సంస్థ కాగ్నిజెంట్‌పై చర్యలు తీసుకుంటున్నాయి.కాగ్నిజెంట్ అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతుందంటూ కోర్టును ఆశ్రయించాయి. కాగ్నిజెంట్‌లో ఇటీవలి పునర్నిర్మాణం కింద, సంస్థ దాదాపు 20 మంది కొత్త ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకుంది. వీరిలో డజను మంది ఇన్ఫోసిస్, విప్రో ఉద్యోగుల్ని చేర్చుకుంది. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన విప్రో.. కాంట్రాక్టు ఉల్లంఘించినందుకు సీఎఫ్ఓ జతిన్ దలాల్‌తో సహా కాగ్నిజెంట్‌లో చేరిన మాజీ ఉద్యోగులపై రెండు వ్యాజ్యాలను దాఖలు చేసింది. ఈ తరుణంలో బిన్నీ మ్యాథ్యూ నిర్ణయం టెక్నాలజీ కంపెనీల్లో వ్యవహారం ఎటు ములుపు తిరుగుతుందోనని ఆసక్తికరంగా మారింది. విప్రో ప్రత్యర్థి కంపెనీలు ఇవే.. విప్రో ఎగ్జిక్యూటివ్‌ల కాంట్రాక్ట్‌లో పది ప్రత్యర్థి కంపెనీల పేర్లను పేర్కొంది. నాన్-కాంపిటేట్ నిబంధన కింద వారు విప్రోలో మానేసిన తర్వాత సంవత్సరం పాటు ఈ కంపెనీలలో చేరేందుకు వీలు లేదు. ఆ కంపెనీలు ఇవే.. యాక్సెంచర్, క్యాప్‌జెమినీ, కాగ్నిజెంట్, డెలాయిట్, డీఎక్స్‌సీ టెక్నాలజీ, హెచ్‌సీఎల్, ఐబీఎం, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా. ఈ పేర్లలో ప్రతి ఒక్కటి దలాల్ కాంట్రాక్ట్‌లో పేర్కొన్నట్లు విప్రో తెలిపింది. -
విప్రోలో మానేస్తే ఇంట్లో కూర్చోవాల్సిందే! చుక్కలు చూపిస్తున్న కఠిన నిబంధన
అన్ని పరిశ్రమలలోనూ కంపెనీల మధ్య పోటీ అనేది సర్వ సాధారణం. అయితే ఇది ఐటీ కంపెనీల తారస్థాయికి చేరింది. కంపెనీల్లో కీలకంగా వ్యవహరించే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు ప్రత్యర్థి కంపెనీల్లోకి జంప్ అవుతుండటంతో భారతీయ ఐటీ కంపెనీ విప్రో కఠిన నిబంధన అమలు చేస్తోంది. ఈ నిబంధన కంపెనీ మారిన ఉన్నత ఉద్యోగులకు చుక్కలు చూపిస్తోంది. విప్రో నుంచి వైదొలిగే సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీలో వారి చివరి రోజు నుంచి ఒక సంవత్సరం పాటు 10 ప్రత్యర్థి సంస్థలలో చేరలేరు. ఈ సాఫ్ట్వేర్ సంస్థ నుంచి నిష్క్రమించిన వెంటనే ఈ కంపెనీలలో దేనిలోనూ చేరకుండా వారిని నిరోధించే వారి కాంట్రాక్ట్‌లోని నాన్-కాంపిటేట్ నిబంధన దీనికి కారణం. ఈ నిబంధన ఆధారంగా ప్రత్యర్థి కంపెనీ కాగ్నిజెంట్‌లో చేరిన తమ మాజీ సీఎఫ్‌వో జతిన్ దలాల్‌ను విప్రో ముప్పుతిప్పలు పెడుతోంది. నిబంధన ఉల్లంఘించి ప్రత్యర్థి కంపెనీలో చేరినందుకు గానూ నష్టపరిహారం కింద వడ్డీతో సహా రూ. 25.15 కోట్లు కట్టాలని కోర్టులో దావా వేసింది. విప్రో ప్రత్యర్థి కంపెనీలు ఇవే.. విప్రో ఎగ్జిక్యూటివ్‌ల కాంట్రాక్ట్‌లో పది ప్రత్యర్థి కంపెనీల పేర్లను పేర్కొంది. నాన్-కాంపిటేట్ నిబంధన కింద వారు విప్రోలో మానేసిన తర్వాత సంవత్సరం పాటు ఈ కంపెనీలలో చేరేందుకు వీలు లేదు. ఆ కంపెనీలు ఇవే.. యాక్సెంచర్, క్యాప్‌జెమినీ, కాగ్నిజెంట్, డెలాయిట్, డీఎక్స్‌సీ టెక్నాలజీ, హెచ్‌సీఎల్, ఐబీఎం, ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రా. ఈ పేర్లలో ప్రతి ఒక్కటి దలాల్ కాంట్రాక్ట్‌లో పేర్కొన్నట్లు విప్రో తెలిపింది. అయినప్పటికీ ఆయన ప్రత్యక్ష పోటీదారు కంపెనీలో చేరాడని విప్రో వాదిస్తోంది. -
ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌కు భారీ ఊరట!
అమెరికాకు చెందిన మల్టీనేషనల్ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌కు భారీ ఊరట దక్కింది. రూ. 4,300 కోట్ల పన్ను బకాయిలకు బదులుగా కంపెనీకి చెందిన రూ. 2,956 కోట్ల బ్యాంక్ డిపాజిట్లను ఆదాయపు పన్ను శాఖ లిక్విడేట్ చేయడంపై మద్రాస్ హైకోర్టు మధ్యంతర స్టే విధించింది. పన్ను బకాయిల కోసం నాలుగు వారాల్లోగా రూ.1,500 కోట్లు చెల్లించాలని, ఆస్తి భద్రతగా పెట్టాలని జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ మహమ్మద్ షఫీక్‌లతో కూడిన డివిజన్ బెంచ్ కాగ్నిజెంట్‌ను ఆదేశించింది. ఈ షరతులను పాటించడంలో విఫలమైతే కంపెనీకి ఇచ్చిన మధ్యంతర స్టే రద్దవుతుందని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పాటు రూ. 1,500 కోట్ల చెల్లించడానికి, ఆస్తిని భద్రతగా పెట్టడం కోసం బ్యాంకు డిపాజిట్లపై పెట్టిన తాత్కాలిక స్తంభనను విడుదల చేయాలని కోర్టు ఐటీ శాఖను ఆదేశించింది. ఈ వ్యవహారం 2017-18లో కాగ్నిజెంట్ చేపట్టిన రూ.19,000 కోట్ల షేర్ బైబ్యాక్‌కు సంబంధించినది. ఇది వాటాదారులకు మూలధన లాభాల పన్నును మాత్రమే ఆకర్షిస్తుందని కంపెనీ వాదించగా ఆదాయపు పన్ను శాఖ.. దీనిని సేకరించిన లాభాల పంపిణీగా పరిగణించి డివిడెండ్‌పై వేసినట్లుగా పన్ను విధించింది. -
కంపెనీ మారుతావా.. కట్టు రూ. 25 కోట్లు!
కంపెనీ మారిన మాజీ సీఎఫ్‌వో జతిన్ దలాల్ (Jatin Dalal)కు భారతీయ ఐటీ దిగ్గజం విప్రో (Wipro) ఝలక్ ఇచ్చింది. ఒప్పందాన్ని ఉల్లంఘించి ప్రత్యర్థి కంపెనీలో చేరినందుకు గాను రూ. 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరింది. అంతే కాకుండా వడ్డీ కూడా కట్టాలని కోర్టులో దావా వేసింది. కాగ్నిజెంట్ (Cognizant) లో చేరిన తమ మాజీ సీఎఫ్‌వో జతిన్ దలాల్‌పై ఐటీ కంపెనీ విప్రో బెంగళూరులోని సివిల్ కోర్టులో ఇటీవల దావా వేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు గాను రూ. 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరినట్లు తమకు లభించిన కోర్టు పత్రాలను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం పేర్కొంది. ఈ నష్టపరిహారంపై సెప్టెంబర్ 29 నుంచి చెల్లింపు తేదీ వరకు 18 శాతం చొప్పున వడ్డీ కూడా చెల్లించాలని దలాల్‌ను కోరింది. అంతేకాకుండా దలాల్ తమకు సంబంధించిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేయకుండా, తమ కస్టమర్లు లేదా ఉద్యోగులను ఏ విధంగానూ ప్రభావితం చేయకుండా జతిన్ దలాల్‌పై విప్రో శాశ్వత నిషేధం విధించింది. అయితే ఈ విషయాన్ని మధ్యవర్తిత్వానికి రిఫర్ చేయాలని కోర్టును కోరుతూ దలాల్ దరఖాస్తు చేసుకున్నారు. తదుపరి విచారణ జనవరి 3న జరగనుంది. ఈ విషయాన్ని మధ్యవర్తిత్వానికి సూచించాలా వద్దా అనే దానిపై కోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది. మధ్యవర్తిత్వం అనేది కోర్టులతో పని లేకుండా వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఉద్దేశించిన ప్రత్యామ్నాయ మార్గం. ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్‌లో దీనికి అవకాశం ఉంటే ఈ పద్ధతిని ఉపయోగించుకోవచ్చు. జతిన్ దలాల్ డిసెంబర్ 1న కాగ్నిజెంట్‌లో సీఎఫ్‌వోగా చేరారు. ఈ కేసులో మొదటి విచారణ నవంబర్ 28న జరిగింది. డిసెంబరు ప్రారంభంలో దలాల్ ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ యాక్ట్ 1996లోని సెక్షన్ 8 కింద మధ్యవర్తిత్వానికి దరఖాస్తు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం.. ఇరుపక్షాలను మధ్యవర్తిత్వానికి సూచించే అధికారం కోర్టులకు లభిస్తుంది. జతిన్ దలాల్‌కు విప్రోలో రెండు దశాబ్దాల అనుభవం ఉంది. 2015 నుంచి ఆయన ఇక్కడ సీఎఫ్‌వోగా పనిచేశారు. 2019 నుంచి ప్రెసిడెంట్‌గా అదనపు బాధ్యతలను సైతం నిర్వహించారు. కాగ్నిజెంట్‌లో ఆయన వీసా ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత యూఎస్ లేదా యూకే వెళ్తారని తెలుస్తోంది. -
‘మా ఉద్యోగుల్ని మీరెలా చేర్చుకుంటారు?’.. ఉక్కిరిబిక్కిరవుతున్న ఐటీ కంపెనీలు!
నిబంధనల్ని ఉల్లంఘించి మా సంస్థ ఉద్యోగుల్ని మీరెలా చేర్చుకుంటారంటూ ప్రముఖ దిగ్గజ టెక్ దిగ్గజ కంపెనీలు ఒకదానికొకటి నోటీసులు జారీ చేసుకుంటున్నాయి. ఇప్పుడీ నోటీసుల పర్వం ఐటీ జాబ్ మార్కెట్‌ను షేక్ చేస్తోందంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మీ పద్దతి అస్సలు బాగోలేదు.. మా కంపెనీ ఉద్యోగుల్ని మీరెలా చేర్చుకుంటారు? అంటూ భారత్‌కు చెందిన టెక్ కంపెనీలు ఒక్కటై అమెరికా టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్‌కు వరుస నోటీసులు జారీ చేస్తున్నాయి. ఇప్పటికే విప్రో.. కాగ్నిజెంట్‌కు నోటీసులు జారీ చేయగా.. తాజాగా ఇన్ఫోసిస్ సైతం ఆ జాబితాలో చేరిపోయింది. ‘‘ కాగ్నిజెంట్ భారత్‌లో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతుంది. నిబంధనల్ని ఉల్లంఘించి మా సంస్థకు చెందిన సుమారు 20 మంది ఉద్యోగుల్ని చేర్చుకుంది. అందులో సీఈఓ, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ స్థాయిలో విధులు నిర్వహించే నలుగురు టాప్ ఎగ్జిక్యూటీవ్‌లు ఉన్నారు’’ అని ఆరోపిస్తూ కాగ్నిజెంట్‌కు నోటీసులు పంపింది. ఈ సందర్భంగా ‘‘ తాము కాగ్నిజెంట్‌కు పంపిన నోటీసులు ఆ సంస్థకు ఓ హెచ్చరికలాంటిది. ఆ సంస్థ 20 మందికి పైగా ఉన్నత స్థాయి ఉద్యోగుల్ని నియమించుకున్న తర్వాత ఆ కంపెనీ ఆడుతున్న డ్రామాలు బయటపడ్డాయి’’ అంటూ ఓ జాతీయ మీడియాతో ఇన్ఫోసిస్ ప్రతినిధులు మాట్లాడినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. విప్రో వర్సెస్ కాగ్నిజెంట్ ఇటీవల, విప్రో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) జతిన్ దలాల్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ హక్ (Mohd Haque)లు కాగ్నిజెంట్‌లో చేరారు. వాళ్లిద్దరూ కాగ్నిజెంట్‌లో చేరిన రెండు రోజులకే విప్రో చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. బెంగళూరు హైకోర్టును ఆశ్రయించింది. జతిన్ దలాల్,మహమ్మద్ హక్ మహమ్మద్ హక్ తన ఉద్యోగ ఒప్పందంలోని నాన్-కాంపిటీ క్లాజ్‌ను ఉల్లంఘించి తమ కాంపిటీటర్ కాగ్నిజెంట్‌లో సీనియర్ వైస్ ప్రెసిడెంట్, లైఫ్ సైన్సెస్‌కు బిజినెస్ యూనిట్ హెడ్‌గా చేరారని కోర్టుకు తెలిపింది. ముఖ్యంగా, హక్ తన నాన్ కాంపిటేట్ నిబంధన గడువు ముగియడానికి ముందే చేరడం చట్ట విరుద్దం అని కోర్టుకు విన్నవించుకుంది. అంతేకాదు, విప్రోను వదిలి కాగ్నిజెంట్‌లో చేరే సమయంలో తమ సంస్థకు చెందిన ఏడు ఫైళ్ల రహస్య సమాచారాన్ని తన వ్యక్తిగత జీమెయిల్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని మా ఐటీ బృందం కనిపెట్టింది. దీనికి తోడు విప్రో అఫీషియల్ మెయిల్ నుంచి తన వ్యక్తిగత మెయిల్‌కు కంపెనీ రహస్యాల్ని సెండ్ చేసుకోవడం ఎంత వరకు సమంజసం అని కోర్టు ఫిర్యాదులో వెల్లడించింది. ఫిర్యాదు ప్రకారం.. హక్.. విప్రో లక్ష్యాల్ని, వ్యాపార వ్యహరాల్ని తప్పుదారి పట్టించేలా సమాచారాన్ని అందించారు. రాజీనామాకు కొద్ది సేపటి ముందే చాలా తెలివిగా విప్రో రహస్యాల్ని మెయిల్స్‌కి పంపుకున్నారు అని వరుస ఆరోపణల్ని గుప్పిస్తూ వస్తోంది. కాగ్నిజెంట్‌కు ఇన్ఫోసిస్, విప్రో ఎగ్జిక్యూటీవ్‌ల క్యూ 2022 నుండి విప్రో , ఇన్ఫోసిస్ సంస్థల్లో సీనియర్ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులు భారీ ఎత్తున కాగ్నిజెంట్‌లో చేరారు. ముఖ్యంగా, సీఎఫ్ఓ నిలంజన్ రాయ్, ఈవీపీ రాజీవ్ రంజన్, అధ్యక్షుడు మోహిత్ జోషి, ఎండీ రవి కుమార్ వంటి కీలక వ్యక్తుల ఇన్ఫోసిస్ నుంచి కాంగ్నిజెంట్‌లో చేరడం ఆగ్నికి ఆజ్యం పోసినట్లైంది. అదే విధంగా, విప్రో సీఎఫ్ఓ జతిన్ దలాల్, గ్రోత్ ఆఫీసర్ స్టెఫానీ ట్రౌట్‌మాన్, ఎస్వీపీ మొహమ్మద్ హక్, ఆశిష్ సక్సేనాతో పాటు ఇతర టాప్ ఎక్జిక్యూటీవ్‌లు సంస్థను వదిలి వెళ్లారు. వీరిలో ఎక్కువ మంది కాగ్నిజెంట్‌తో పాటు ఇతర కాంపీటీటర్ సంస్థల్లో చేరారు. ఉన్నత స్థాయి ఉద్యోగుల నిష్క్రమణ కారణంగా విప్రో, ఇన్ఫోసిస్‌లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడ్డ మాజీ ఉద్యోగులు, వారిని చేర్చుకున్న సంస్థలపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాయి. అందులో కాగ్నిజెంట్ కూడా ఉంది. మూల కారకులు కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ కాగ్నిజెంట్ ప్రస్తుత సీఈఓ రవికుమార్ గతంలో ఇన్ఫోసిస్‌లో కీలకంగా వ్యవహరించారు. అయితే, ఇన్ఫోసిస్ నుంచి బయటకొచ్చి సీఈఓగా కాగ్నిజెంట్‌లో చేరారు. అనంతరం ఇన్ఫోసిస్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లుగా, నలుగురిని వైస్ ప్రెసిడెంట్లుగా మొత్తం 20 మంది ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్న వారిని తన సంస్థలోకి ఆహ్వానించారు.ఈ అంశమే కాగ్నిజెంట్‌పై ఇన్ఫోసిస్, విప్రోలు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ప్రేరేపించాయి. -
హైదరాబాద్‌లో ఆస్తులు అమ్మనున్న టాప్ ఐటీ కంపెనీ..?
టాప్ టెక్ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతున్న కాగ్నిజెంట్.. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. సాధారణంగా కాస్ట్‌కటింగ్ పేరిట టెక్ సంస్థలు ఉద్యోగాల్లో కోత విధిస్తూ ఖర్చు తగ్గించుకుంటున్న సంగతి తెలిసిందే. దాంతోపాటు కాగ్నిజెంట్ ఆస్తులను సైతం విక్రయించాలని యోచిస్తున్నట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. కాగ్నిజెంట్ టెక్నాలజీస్ హైదరాబాద్, చెన్నైలోని తన ఆస్తులను విక్రయించడానికి సిద్ధంగా ఉందని సమాచారం. ఇది నాన్-కోర్ రియల్ ఎస్టేట్ ద్వారా నగదు సంపాదించడానికి సహకరిస్తుందని తెలిసింది. మీడియా కథనాల ప్రకారం.. రెండు సంవత్సరాల్లో రూ.3300 కోట్లు ఆదా చేసే లక్ష్యంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని 10 ఎకరాల క్యాంపస్‌ను, చెన్నైలోని సిరుసేరిలో 14 ఎకరాల క్యాంపస్‌ను విక్రయించాలని యోచిస్తోంది. రీస్ట్రక్చరింగ్‌లో భాగంగా తన వర్క్‌స్పేస్‌ను తగ్గించుకుని, వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడానికి హైబ్రిడ్ వర్క్ కల్చర్‌ను ఎంచుకుంది. టెక్ కంపెనీలు మారుతున్న వర్క్‌కల్చర్‌కు అనుగుణంగా హైబ్రిడ్‌వర్క్ మోడల్‌ను అనుసరిస్తున్నాయి. వివిధ నగరాల్లోని కార్యకలాపాలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే కాగ్నిజెంట్ ఈ చర్యలు చేపడుతున్నట్లు సమాచారం. అయితే కంపెనీ మాత్రం ఈ వార్తలపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇదీ చదవండి: ఆ సీఈవో వేతనం రోజూ రూ.5 కోట్లు..! ఇటీవల ఐటీ సేవల రంగంలోని కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లు ఖర్చులు తగ్గించుకుంటున్నారు. వారి వ్యాపారాల్లో జనరేటివ్ ఏఐను ఉపయోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. సెప్టెంబర్ త్రైమాసికం ముగింపు నాటికి కాగ్నిజెంట్‌లో 3,46,600 మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ నికర లాభం 16 శాతం క్షీణించి 525 మిలియన్లకు చేరుకుంది. ఆదాయం దాదాపు 4.89 బిలియన్ డాలర్లుగా ఉందని కంపెనీ వెల్లడించింది. -
ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ, కాగ్నిజెంట్ భాగస్వామ్యం
ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్, ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ విశాల్ సిక్కా జనరేటివ్ ఏఐ సేవలందించేలా భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. కాగ్నిజెంట్ సీఈవోగా రవికుమార్ నియమితులైన తర్వాత పోటీ కంపెనీలకు చెందిన ప్రముఖ ఎగ్జిక్యూటివ్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నారు. ప్రస్తుత తరుణంలో కాగ్నిజెంట్ వ్యాపారాన్ని, కస్టమర్ల సంఖ్యను వేగంగా పెంచటమే లక్ష్యంగా రవి కుమార్ పనిచేస్తున్నారు. కాగ్నిజెంట్ ఇప్పుడు ఇన్ఫోసిస్ మాజీ సీఈవో విశాల్ సిక్కాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇన్ఫోసిస్ సీఈవో పదవి నుంచి వైదొలిగిన తర్వాత విశాల్ సిక్కా వియానై సిస్టమ్స్‌ను స్థాపించారు. ఇప్పుడు కాగ్నిజెంట్, వియానై సిస్టమ్స్ వినియోగదారులకు నేరుగా జనరేటివ్ ఏఐ సేవలను అందించేందుకు జతకట్టాయి. వియానై సిస్టమ్స్ కు సంబంధించిన హిలా ఎంటర్ప్రైజ్ ప్లాట్‌ఫారమ్, కాగ్నిజెంట్ న్యూరో ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు ఏఐ సాంకేతికత ద్వారా వినియోగదారులకు సేవలను అందించనున్నాయి. -
సీఎఫ్‌వో జతిన్ దలాల్: విప్రోలో రాజీనామా.. కాగ్నిజెంట్‌లో ప్రత్యక్షం!
విప్రో (Wipro) మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) జతిన్ దలాల్ (Jatin Dalal)ను తమ సీఎఫ్‌వోగా నియమించుకుంది ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (Cognizant). ఆయన ఇటీవలే విప్రో సంస్థలో సీఎఫ్‌వోగా రాజీనామా చేశారు. (లెనోవో ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లూ తనిఖీ) ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ రవి కుమార్ ఎస్ కాగ్నిజెంట్ సీఈవోగా గత జనవరిలో బాధ్యతలు చేపట్టిన నుంచి ఆ కంపెనీలో జతిన్ దలాల్ రెండవ హై ప్రొఫైల్ నియామకం. 2024 ప్రారంభంలో పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎఫ్‌వో జాన్ సీగ్మండ్ నుంచి జతిన్ దలాల్ బాధ్యతలు స్వీకరిస్తారని కాగ్నిజెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. కంపెనీలు మారుతున్న టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ప్రముఖ భారతీయ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ గత మార్చిలో వైదొలిగారు. ఆయన స్థానంలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్లలో పనిచేసిన మోహిత్ జోషిని సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది టీసీఎస్. వచ్చే డిసెంబర్లో ఆయన విధుల్లో చేరన్నారు. (ఐటీ పరిశ్రమకు చల్లని కబురు.. మాంద్యం భయంపై సీఈవో ఊరట) ఇక జతిన్ దలాల్ విప్రోలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేశారు. ట్రెజరీ కార్యకలాపాలలో మేనేజర్‌గా చేరిన ఆయన ప్రెసిడెంట్, సీఎఫ్‌వో వరకూ ఎదిగారు. ఆయన నిష్క్రమించిన మరుసటి రోజే విప్రో షేర్లు దాదాపు 3 శాతం పడిపోయాయి. 2015లో విప్రో సీఎఫ్‌వో అయిన జతిన్ దలాల్.. కంపెనీ సీఈవో థియరీ డెలాపోర్టేతో కలిసి కోవిడ్ సమయంలో కంపెనీని విజయవంతంగా నడిపించారు. డిజిటల్ సేవలకు డిమాండ్ పెరగడంతో 2020, 2021 సంవత్సరాల్లో కంపెనీ షేర్లు వరుసగా 57 శాతం, 85 శాతం పెరిగాయి. అదే కాలంలో భారత నిఫ్టీ IT ఇండెక్స్‌లో 55 శాతం, 60 శాతం వృద్ధిని సాధించింది. -
డివిడెండ్ పంపిణీ పన్ను కట్టాల్సిందే..
న్యూఢిల్లీ: షేర్ల బైబ్యాక్‌కు సంబంధించి డివిడెండ్ పంపిణీ పన్నును చెల్లించవలసిందిగా ఆదాయపన్ను శాఖ అపిలేట్ ట్రిబ్యునల్(ఐటీఏటీ) తాజాగా ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియాకు స్పష్టం చేసింది. ఈ అంశాన్ని వ్యతిరేకిస్తూ కాగ్నిజెంట్ చేసిన అపీల్‌ను ఐటీఏటీ చెన్నై బెంచ్ కొట్టివేసింది. దీంతో మద్రాస్ హైకోర్టు అనుమతిమేరకు చేపట్టిన రూ. 19,080 కోట్ల విలువైన షేర్ల బైబ్యాక్ పథకంలో భాగంగా కాగ్నిజెంట్ డివిడెండ్ పంపిణీ పన్నును చెల్లించవలసి ఉంటుంది. 2017–18 అసెస్మెంట్ ఏడాదిలో కంపెనీ యూఎస్, మారిషస్‌లోని తమ వాటాదారుల నుంచి 94,00,534 ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది. షేరుకి రూ. 20,297 చొప్పున వీటిని సొంతం చేసుకుంది. కంపెనీ దాఖలు చేసిన రిటర్నులను పరిశీలించిన తదుపరి ఐటీ శాఖ రూ. 4,853 కోట్లకుపైగా డివిడెండ్ పంపిణీ పన్నును చెల్లించవలసి ఉన్నట్లు డిమాండ్ చేసింది. ఆదాయపన్ను శాఖ నిబంధనల ప్రకారం మూలధన వినియోగం కారణంగా పన్ను చెల్లించవలసి ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ అంశంపై కాగ్నిజెంట్ అపీల్‌కు వెళ్లింది. -
నాస్కామ్ చైర్‌పర్సన్‌గా రాజేశ్ నంబియార్
ముంబై: కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) రాజేశ్ నంబియార్‌ను తన చైర్‌పర్సన్‌గా నియమిస్తున్నట్లు టెక్నాలజీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం నాస్కామ్ చైర్‌పర్సన్‌గా మైక్రోసాఫ్ట్ ఇండియా మాజీ ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి బాధ్యతలు నిర్వహిస్తుండగా, నంబియార్ వైస్ చైర్పర్సన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తాజాగా అనంత్ మహేశ్వరి నుంచి నంబియార్ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. నాస్కామ్ భారత్‌కు సంబంధించి ఐటీ, టెక్ ట్రేడ్ సంస్థ. ప్రభుత్వం, ఐటీ పరిశ్రమ మధ్య సమన్వయం పెంపొందడానికి ఈ సంస్థ విశేష కృషి చేస్తోంది. ‘‘నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు చైర్‌పర్సన్‌గా నియమితులు కావడాన్ని గౌరవప్రదమైన అంశంగా భావిస్తున్నాను. ప్రపంచానికి అత్యంత విశ్వసనీయమైన సాంకేతిక భాగస్వామిగా భారతదేశ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి సంబంధిత అన్ని వర్గాలతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నాను’’ అని తన నియామకం సందర్భంగా నంబియార్ పేర్కొన్నారు. -
ఆఫీస్‌కు రావడం తప్పనిసరి కాదు.. భిన్నంగా ఆ ఐటీ కంపెనీ తీరు
Return to office not mandatory: వర్క్ ఫ్రం హోమ్‌కు అలవాటు పడిన ఉద్యోగులను ఆఫీస్‌లకు రప్పించడానికి అనేక ఐటీ కంపెనీలు నానా అవస్థలు పడుతుంటే తమ ఉద్యోగులు ఆఫీస్‌కు రావడం తప్పనిసరి కాదు అంటోంది ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్. ఈ విషయాన్ని ఆ కంపెనీ సీఈవో రవి కుమార్ స్వయంగా తెలిపారు. "ఉద్యోగుల్లో ఫ్రెషర్లు కూడా ఉన్న నేపథ్యంలో సమూహంగా పనిచేయడం అవసరమని మేము భావిస్తున్నాం. వారికి వారిని చేయి పట్టి నడిపించడం అవసరం. కానీ మేనేజర్లు, సీనియర్ ఉద్యోగులు ఆఫీస్‌కి రాకపోయినా ఎటువంటి ప్రభావం ఉండదు" అని కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ తాజా ఎర్నింగ్స్ కాల్ సందర్భంగా తెలిపారు. వాస్తవానికి తమ ఫ్లెక్సిబుల్ రిటర్న్ ఆఫ్ వర్క్ ఎక్కువ మంది మహిళలపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని ఆయన పేర్కొన్నారు. ఐటీ సేవల సంస్థలలో కాగ్నిజెంట్ రియల్ ఎస్టేట్ ఖర్చులను తగ్గించేందుకు అత్యంత దూకుడుగా ప్రయత్నిస్తోంది. ఓ పెట్టుబడిదారుల సదస్సులో కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ మాట్లాడుతూ, పెద్ద నగరాల్లో 80,000 సీట్లను తగ్గించి, టైర్-2 నగరాలకు విస్తరించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. కాగ్నిజెంట్ వర్క్‌ఫోర్స్, రియల్ ఎస్టేట్ ఖర్చులను తగ్గించడం ద్వారా మార్జిన్లను పెంచడానికి 400 మిలియన్ డాలర్ల ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. Google Back To Office Offer: గూగుల్ ఉద్యోగులకు బంపరాఫర్.. ఆఫీస్‌కు రప్పించడానికి కొత్త ఎత్తుగడ! -
కాగ్నిజెంట్ సీఈవో కీలక నిర్ణయం: ఉద్యోగుల్లో ఉత్సాహం
Cognizant appoints six women svps: ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ సంచలన నిర్ణయం తీసుకుంది. తన కార్యనిర్వాహక బృం దంలో ఏకంగా ఆరుగురు మహిళల్ని ఎంపిక చేసింది. కార్పొరేట్ కంపెనీల్లో కీలక పదవుల్లో మహిళలకు చోటు దక్కడం లేదడం లేదన్న ఆందోళన క్రమంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ స్థానాల్లో ఆరుగురు మహిళలను నియమించినట్లు జూలై 19న తెలిపింది. (న్యూయార్క్ బుద్ధిస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్: ప్రత్యేకతను చాటుకున్న నీతా అంబానీ) వీరిలో కొందరికి పదోన్నతి లభించగా, మరికొందరిగా కొత్తగా నియమించుకుంది.తద్వారా బలమైన, విభిన్నమైన సంస్థను నిర్మించడం కొనసాగిస్తోందనే ప్రశంసలు వెల్లు వెత్తాయి. 2023లో జనవరిలో కాగ్నిజెంట్ సీఈవోగా రవి కుమార్ నియామకం తరువాత జరిగిన ఈ పరిణామం ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపింది. మూడు కీలకమైన ఆవశ్యకాలపై దృష్టి సారించడంతో పాటు, నాయకత్వ స్థానాలతో సహా కాగ్నిజెంట్, విభిన్న ప్రతిభను పెంచడం తన ముఖ్య ప్రాధాన్యతలలో ఒకటి సీఈవో ప్రకటించారు ఈ సందర్భాన్ని సమిష్టిగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయమని పేర్కొన్న రవికుమార్. వైవిధ్యాన్ని ప్రోత్సహించడం సిస్టమేటిగ్గా ఉండాలి. మహిళా నిపుణులను రిక్రూట్ చేయడం, అభివృద్ధి చేయడం, ప్రోత్సహించడం, నిమగ్నం చేయడం, నిలుపుకోవడం వంటి వాటితో తాము మొదలుపెట్టినట్టు చెప్పుకొచ్చారు. (ఘోర ప్రమాదాలు, కీలక నిర్ణయం: రైల్వే ప్రయాణికులూ అలర్ట్!) శైలజా జోస్యుల కీలక స్థానాల్లో ఆరుగురు మహిళలు ♦ హైదరాబాద్‌లోని కంపెనీ సెంటర్ హెడ్ శైలజా జోస్యుల ఎస్వీపీగా ప్రమోషన్ లభించింది. 2018లో కాగ్నిజెంట్‌లో చేరిన శైలజా ఇప్పుడు ఉత్తర అమెరికాలోని వాణిజ్య మార్కెట్లతో పాటు గ్లోబల్ డెలివరీ కోసం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI) పరిశ్రమకు SVP, ఇంట్యూటివ్ ఆపరేషన్స్ & ఆటోమేషన్ (IOA)గా ఉన్నారు. చెన్నై తర్వాత 56,000 మంది అసోసియేట్లతో కాగ్నిజెంట్‌కు హైదరాబాద్ రెండో అతిపెద్ద డెలివరీ కేంద్రం. ♦ 2021లో కాగ్నిజెంట్‌లో చేరిన ఎలిసా డి రోకా-సెర్రా, SVP, EMEA జనరల్ కౌన్సెల్ అండ్ కాంట్రాక్ట్ లైఫ్‌సైకిల్ రిస్క్ మేనేజ్మెంట్ (CLRM)గా పదోన్నతి పొందారు. ♦ 2020లో కాగ్నిజెంట్‌లో చేరిన థియా హేడెన్ ఇప్పుడు ఎస్వీపీ. గ్లోబల్ మార్కెటింగ్. కాగ్నిజెంట్ బ్రాండ్, డిజైన్ , సృజనాత్మక సేవలు, సోషల్ మీడియా, ఆలోచనా నాయకత్వం , రీసెర్చ్కుహేడెన్ బృందం బాధ్యత వహిస్తుంది. ♦ ప్యాట్రిసియా (ట్రిష్) హంటర్-డెన్నెహీ ఎస్వీపీ (హెల్త్‌కేర్ ప్రొవైడర్/పేయర్ బిజినెస్ యూనిట్)గా పదోన్నతి పొందారు. హెల్త్‌కేర్ డెలివరీతో సహా అమెరికాలో ఆరోగ్య సంరక్షణ మొత్తం నిర్వహణకు ఆమె టీంమద్దతు ఇస్తుంది. ట్రైజెట్టో కొనుగోలులో భాగంగా ట్రిష్ 2015లో కాగ్నిజెంట్‌లో చేరారు. ♦ 2020లో కాగ్నిజెంట్‌కు రిజైన్ చేసిన అర్చన రమణకుమార్ జూలై 5న SVP, ఇండస్ట్రీ సొల్యూషన్స్ గ్రూప్ (ISG)గా తిరిగి కాగ్నిజెంట్‌లో చేరారు. ♦ సాండ్రా నటార్డోనాటో జూలై 17న కాగ్నిజెంట్‌లో పార్టనర్షిప్ అండ్ అలయన్స్ ఎస్వీపీగా చేరారు. కాగ్నిజెంట్‌కు ముందు, నటార్డొనాటో గార్ట్నర్తో 15 సంవత్సరాలు సీనియర్ ఈక్విటీ విశ్లేషకురాలిగా గా వివిధ వృత్తిపరమైన సేవల సంస్థలతో 11 సంవత్సరాల అనుభవం ఉంది. -
కారణం లేకుండానే.. బ్రియాన్ హంఫ్రీస్‌ను తొలగించిన కాగ్నిజెంట్!
బ్రియాన్ హంఫ్రీస్‌ను సీఈవో పదవి నుంచి తొలగించినట్లు అమెరికాకు చెందిన ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ కాగ్నిజెంట్ ప్రకటించింది. స్టాక్ ఎక్సేంజీ ఫైల్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించిన కంపెనీ.. హంఫ్రీన్ తొలగింపుకు గల స్పష్టమైన కారణాలు వెల్లడించలేదు. ఈ ఏడాది కాగ్నిజెంట్ బోర్డ్ సభ్యులు సంస్థ వేగంగా పురోగమించడం, వ్యాపార కార్యకలాపాల్ని వేగవంతం చేయడం, ఆదాయ వృద్ధి వంటి అంశాలపై దృష్టిసారించింది. కాబట్టే సీఈవో పదవీ బాధ్యతల్లో మార్పులు అవసరమని తాము విశ్వసిస్తున్నట్లు ఆ సంస్థ బోర్డ్ ఛైర్మన్ స్టీఫెన్ జె రోహ్లెడర్ తెలిపారు. సీఈవో పదవి నుంచి తొలగించడంతో జనవరి 12 నుంచి మార్చి 15 వరకు కాంగ్నిజెంట్‌లో సలహాదారులుగా పనిశారు. హంఫ్రీస్ సీఈవో పదవి నుంచి తొలగించడంతో ఆయన స్థానాన్ని భారత్‌కు చెందిన టెక్ జెయింట్ ఇన్ఫోసిస్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేసిన రవికుమార్ భర్తీ చేసిన విషయం తెలిసిందే. తొలగింపులకు కారణాలు హంఫ్రిస్ను ఫైర్ చేయడానికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆదాయం పడిపోవడం, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు సంస్థను విడిచిపెట్టడం, వార్షిక ప్రాతిపదికన అట్రిషన్ రేటు పెరిగిపోవడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. తగ్గిన పరిహారం సీఈవోగా బాధ్యతలు నిర్వహించే సమయంలో హంఫ్రీస్‌కు చెల్లించే పరిహారం భారీగా తగ్గినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. 2021తో పోలిస్తే 2022లో హంఫ్రీస్ పరిహారం 9 శాతం తగ్గిందని ప్రకటన హైలైట్ చేసింది. నాన్ ఈక్విటీ ఆధారిత ప్రోత్సాహకాలు సైతం 4 మిలియన్ల నుండి 1.7 మిలియన్లకు తగ్గాయి. చదవండి👉 భారత్‌లో తయారైన ఆ దగ్గుమందు కలుషితం.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ -
కాగ్నిజెంట్ ఉద్యోగులకు తీపి కబురు.. ఆరు నెలల ముందే జీతాల పెంపు
కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందుగానే వేతన పెంపును అందిస్తోంది. 18 నెలల్లో ఇది మూడవ వేతన పెంపు. పెరుగుతున్న అట్రిషన్ కంపెనీకి తలనొప్పిగా మారింది. దీన్ని కట్టడి చేయడంలో భాగంగా కంపెనీ షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందుగానే వేతన పెంపు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2022 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అట్రిషన్ 35 శాతం నుంచి 25 శాతానికి తగ్గింది. (apple saket: యాపిల్ ఢిల్లీ స్టోర్ ఫస్ట్ లుక్.. అదిరిపోయింది!) వేతన పెంపునకు సంబంధించిన లెటర్లను ఉద్యోగులు ఈ వారంలో అందుకుంటారని కంపెనీ వారికి పంపిన ఈ-మెయిల్స్‌లో పేర్కొంది. సంవత్సరాంతపు పనితీరు సమీక్షలను అనుసరించి ఆరు నెలల ముందుగానే ఈ మెరిట్ పెంపును అందిస్తున్నామని, 18 నెలల్లో ఇది మూడో మెరిట్ పెరుగుదల అని కంపెనీ సీఈవో రవికుమార్ వివరించారు. జనవరిలో డైరెక్టర్లు అంతకంటే పైస్థాయివారికి ఇచ్చిన పెంపుతో కలిపి 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు వేతన పెంపును అందుకుంటున్నారని తెలిపారు. అలాగే ఉద్యోగులకు నిరంతర శిక్షణ, నైపుణ్యం, వృత్తిపరమైన అభివృద్ధిలో కంపెనీ ఎప్పుడూ తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. కాగా షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందుగానే అమలు చేస్తున్న ఈ వేతన పెంపు కంపెనీ వన్-టైమ్ టూ-మెరిట్ సైకిల్ పెంపులో భాగం. ఈ వేతన పెంపును గత సంవత్సరమే ప్రకటించారు. 2022 అక్టోబర్‌లో, ఆపై 2023 ఏప్రిల్‌లో వేతన పెంపుదల ఉంటుందని కంపెనీ గతంలోనే పేర్కొంది. ఇదీ చదవండి: అపరిచితుడికి కిడ్నీ దానం.. అపర దాన కర్ణుడు ఈ బిలియనీర్.. -
ఈవీలపై దేశీ కార్పొరేట్ల దృష్టి
ముంబై: దేశీయంగా పలు కార్పొరేట్ దిగ్గజాలు ఇటీవల కొంత కాలంగా ఎలక్ట్రిక్ వాహనా(ఈవీ)లవైపు దృష్టి సారిస్తున్నాయి. తమ ప్లాంట్లు కార్యాలయాల్లో ఉద్యోగుల రవాణాకు ఇవి అనుకూలమని భావిస్తున్నాయి. దీంతో మెటల్ దిగ్గజాలు టాటా స్టీల్, హిందాల్కోతోపాటు ఐటీ బ్లూచిప్ కంపెనీలు క్యాప్‌జెమిని, కాగ్నిజెంట్, గ్లోబల్ బ్యాంకింగ్ సంస్థలు బార్క్లేస్, బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ మెలన్, అలియంజ్ టెక్నాలజీస్ ఎలక్ట్రిక్ వాహన పాలసీలకు తెరతీస్తున్నాయి. తద్వారా ఉద్యోగులను ఈవీలను కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇప్పటికే ఈవీల అమ్మకాలు ఊపందుకున్న నేపథ్యంలో పలు కార్పొరేట్ల తాజా ప్రణాళికలు పరిశ్రమకు జోష్‌నిచ్చే వీలున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరిన్ని సంస్థలు రెడీ బ్యాటరీ ఆధారంగా నడిచే ఈవీలు కొంతకాలంగా భారీగా విక్రయమవుతున్నాయి. మారియట్, నోవాటెల్ తదితర ఆతిథ్య రంగ కంపెనీలు సైతం ఈవీలను కొనుగోలు చేస్తున్నాయి. ఐటీ, బ్యాంకింగ్ సంస్థల బాటలో హోటల్ చైన్ కంపెనీలు ఈవీలను మాత్రమే వినియోగించవలసిందిగా విక్రేతలు(వెండార్ల)కు సూచిస్తున్నాయి. ఇక మరోపక్క ఎన్ఎంసీలు తమ కార్యకలాపాలలో ఈవీల వినియోగ ప్రభావాన్ని పరిశీలిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఈవీల వినియోగానికి మరింత మద్దతివ్వనున్నట్లు తెలియజేశాయి. పర్యావరణ పరిరక్షణ బాటలో ఈవీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు పేర్కొన్నాయి. డిసెంబర్లో డీలా రూ. 1,100 కోట్ల సబ్సిడీ పంపిణీ నిలిచిపోయిన నేపథ్యంలో గత నెల(డిసెంబర్)లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విక్రయాలు క్షీణించాయి. 2022 నవంబర్‌తో పోలిస్తే డిసెంబర్లో 20 శాతం నీరసించాయి. రోడ్, రవాణా, జాతీయ రహదారుల శాఖ వాహన పోర్టల్ గణాంకాల ప్రకారం స్థానిక మార్కెట్లో నవంబర్‌లో 76,162 వాహనాలు అమ్ముడుపోగా.. డిసెంబర్లో ఇవి 59,554 యూనిట్లకు పరిమితమయ్యాయి. ఈవీలను ప్రోత్సహించేందుకు తీసుకువచ్చిన ఫేమ్–2 విధానాలలో భాగంగా ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుంది. అయితే 2022 ఏప్రిల్ నుంచి సబ్సిడీలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. స్థానిక విలువ జోడింపు నిబంధనల ఉల్లంఘన ఆరోపణల నేపథ్యంలో సబ్సిడీ చెల్లింపులు నిలిచిపోయినట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. హీరో ఎలక్ట్రిక్, ఓకినావా ఆటోటెక్, రివోల్ట్, యాంపియర్ తదితర 6 కంపెనీలకు సబ్సిడీలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఓవైపు ఈ అంశాలపై ప్రభుత్వం దర్యాప్తు చేపట్టగా.. మరోపక్క సబ్సిడీలు ఆగిపోవడంతో క్యాష్ ఫ్లోలపై ఒత్తిడి పడుతున్నట్లు కంపెనీల ప్రతినిధులు తెలియజేశారు. సమస్య త్వరగా పరిష్కారంకాకుంటే అమ్మకాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని పేర్కొంటున్నారు. ప్రోత్సాహకాలు ఇలా ప్రభుత్వం ద్విచక్ర ఈవీలకు కిలోవాట్‌కు రూ. 15,000 చొప్పున ప్రోత్సాహకం అందిస్తోంది. అయితే మొత్తం వాహన వ్యయంలో 40 శాతం మించకుండా పరిమితి విధించింది. ఇందుకు స్థానికతకు ప్రాధాన్యతనిస్తూ విలువ జోడింపును చేపట్టవలసి ఉంటుంది. ఈ విషయంలో వాహన విక్రయం తదుపరి కంపెనీలు సంబంధిత ఆధారాలు దాఖలు చేయవలసి ఉంటుంది. ఆపై 45–90 రోజుల్లోగా వాహనం రిటైల్ ధరపై ప్రభుత్వం ప్రోత్సాహకాలను విడుదల చేస్తుంది. ఈవీ కంపెనీలకు ప్రభుత్వం అవాంతరాలు సృష్టించబోదని, దేశీయంగా పరిశ్రమలో సానుకూల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకే ప్రాధాన్యత ఇస్తుందని అధికారిక వర్గాలు వివరిస్తున్నాయి. 2023లో రెట్టింపునకు ఈ క్యాలండర్ ఏడాది(2023)లో ఎలక్ట్రిక్ వాహన రిటైల్ విక్రయాలు రెట్టింపునకు జంప్‌చేయనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. వెరసి 2.2 మిలియన్ యూనిట్లకు తాకనున్నట్లు అంచనా. ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీల సొసైటీ(ఎస్ఎంఈవీ) గణాంకాల ప్రకారం 2022లో ఈవీ రిటైల్ అమ్మకాలు మిలియన్ యూనిట్లకు చేరాయి. కాగా.. గత నెలలోనే వేదాంతా గ్రూప్ ఉద్యోగులకు ఈవీ పాలసీని ప్రవేశపెట్టింది. నెట్ జీరో కర్బన విధానాలకు అనుగుణంగా తాజా పాలసీకి తెరతీసింది. -
ఐటీలో ‘ఫేక్’ కలకలం.. యాక్సెంచర్ బాటలో మరో కంపెనీ, వేరే దారిలేదు వాళ్లంతా ఇంటికే!
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం పరిస్థితి అంతగా బాలేదు. దీనికి తోడు ఆర్థిక మాంద్యం కంపెనీలను భయపెడుతున్నాయి. ఈ పరిణామాలన్నీ అటు తిరిగి ఇటు తిరిగి చివరికి ఉద్యోగుల మెడకు చుట్టుకుంటోంది. ప్రస్తుతం నకిలీ పత్రాలు, ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ అంశం ఐటీలో కలకలం రేపుతోంది. ఇటీవల నియమాలను ఉల్లఘించి, నకిలీ డాక్యుమెంట్ల ద్వారా ఉద్యోగాలు పొందిన పలువురిని ప్రముఖ కంపెనీ యాక్సెంచర్ తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ జాబితాలోకి మరో దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ సైతం చేరింది. యాక్సెంచర్ బాటలో కాగ్నిజెంట్.. తమ ఉద్యోగుల్లో బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్‌లో విఫలమైన వారిపై వేటు వేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కొందరు నకిలీ పత్రాలు సమర్పించి ఉద్యోగాల్లో చేరిన 6 శాతం మంది సిబ్బందిని తొలగించినట్టు కాగ్నిజెంట్ ఇండియా తెలిపింది. ఈ అంశంపై కంపెనీ ఇండియా హెడ్ రాజేష్ నంబియార్ మాట్లాడుతూ.. ‘ఎంపిక చేసిన పోస్ట్‌కు వారి సరిపోరని కంపెనీ జరిపిన బ్యాక్‌గ్రౌండ్ చెకింగ్‌లో తేలింది. బ్యాక్‌గ్రౌండ్ చెక్‌ను క్లియర్ చేయనివారిని కంపెనీ ఏ మాత్రం ఉపేక్షించేది లేదని’ స్పష్టం చేశారు. సాధారణంగా నియామక ప్రక్రియ ఆలస్యం అవుతుందని, కంపెనీలు అభ్యర్థులను సంస్ధలోకి తీసుకునేముందు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వవు. ఒక్కోసారి ఈ ప్రక్రియ పాటించడం వల్ల ఉద్యోగులు తమ కంపెనీలో చేరేందుకు ఆసక్తి కూడా చూపరని భావిస్తూ.. వీటిపై సరైన శ్రద్ధ పెట్టవు. అయితే కరోనా సమయంలో మాత్రం పెద్ద ఎత్తున ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగాల్లో చేరారు. అయితే రానున్న సంక్షోభం నేపథ్యంలో ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్తగా నియామకాలకు కూడా ఫుల్స్టాప్ పెట్టాయి. ఇదిలా ఉండగా.. ఇదే తరహాలోనే మిగిలిన కంపెనీలు బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌ను చూస్తే వేల మంది సిబ్బంది వారి ఉద్యోగాలను కోల్పోయే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెప్తున్నారు. చదవండి: ఆ బ్యాంక్ కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు! -
ముందస్తు దీపావళి కాంతులు: ఐటీ ఉద్యోగులకు తీపి కబురు
సాక్షి, ముంబై: ప్రపంచ మాంద్యం భయాలు, మూన్‌లైటింగ్ వివాదాల మధ్య ఐటీ నిపుణులకు కంపెనీలు తీపి కబురు అందిస్తున్నాయి. ప్రధానంగా దేశీయ రెండో ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు వేతనాలను పెంచినట్టు ధృవీకరించింది. తన సిబ్బందికి 10 నుంచి 13 శాతం జీతాల పెంపును అందించినట్టు ప్రకటించింది. దీంతోపాటు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఉద్యోగులు 20-25శాతం ఇంక్రిమెంట్లు పొందినట్టు తెలిపింది. ఇన్ఫీ, టీసీఎస్, విప్రో,తోపాటు కాగ్నిజెంట్ సంస్థలు తమ ఉద్యోగులకు దాదాపు 10శాతం వేతనాలు పెంపును దిశలో ఉండటం విశేషం. ఇంక్రిమెంట్లు ఉద్యోగి గ్రేడ్‌పై ఆధారపడి ఉంటాయయనీ, సీనియర్ మేనేజ్మెంట్ జీతాలు ఎక్కువగా ఉన్నందున తక్కువ మొత్తంలో పెంపు ఉంటుందని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గ్రూప్ హెడ్ క్రిష్ శంకర్ తెలిపారు. తగ్గుతున్న అట్రిషన్ రేట్లతో, ఇన్ఫోసిస్ వినియోగ స్థాయిలను పెంచడం, పార్శ్వ నియామకాలు, ఆన్-సైట్ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ద్వారా వేతన వ్యయాలను నియంత్రించ డానికి ప్రయత్నిస్తోంది. ఇన్ఫోసిస్‌తోపాటు, టీసీఎస్, విప్రో, ప్రపంచ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా తన ఉద్యోగులకు 10 శాతం వరకు వేతనాలు పెంచనుందట. అక్టోబర్ మాసంనుంచి ఈ పెంపు వర్తించనుందని తెలుస్తోంది. కాగా కరోనా సంక్షోభకాలంలో ముఖ్యంగా 2021లో ఐటీ కంపెనీల బంపర్ జీతాల పెంపు, కౌంటర్ ఆఫర్లతో ఉద్యోగులను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేశాయి. ఇన్ఫోసిస్ కూడా గత ఏడాది జనవరి, జూలైలో రెండు పెంపులను ప్రకటించింది. ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. 345,218 మంది నిపుణులకు ఉపాధి కల్పించిన ఇన్ఫీ, అధిక వ్యయాలను నియంత్రించుకోవాలని చూస్తోంది. -
ఐటీ ఉద్యోగులు:పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయ్! ఆఫీస్‌కు రాలేం!
దిగ్గజ కంపెనీలకు చెందిన ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చి పనిచేసేందుకు ఇష్టపడడం లేదు. ఇంటి వద్ద నుంచి పనిచేయడం వల్ల వర్క్ ప్రొడక్టివిటీ పెరగుతుందని, అదే సమయంలో కుటుంబ సభ్యులతో గడిపేందుకు వీలైనంత సమయం దొరుకుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్‌ను తిరస్కరిస్తున్నారు. ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మ్యాప్స్‌కు చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆఫీస్‌కు వచ్చి పనిచేయడాన్ని తిరస్కరిస్తున్నారు. సుమారు 200 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తామని, ఆఫీస్‌కు రాలేమని ఖరాకండీగా చెబుతున్నారు. అంతేకాదు ఆఫీస్ టూ రిటర్న్ అంటే ట్రాన్స్ పోర్ట్ ఛార్జీలను భరించలేమని వాపోతున్నారు. పైగా గూగుల్ తమని (గూగుల్ మ్యాప్స్ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని) ఒకలా, గూగుల్ ఉద్యోగుల్ని మరోలా ట్రీట్ చేస్తుందని ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్(ఏడబ్ల్యూ)కు దాఖలు చేసిన పిటీషన్లో ప్రస్తావించారు. ఈ పిటిషన్‌ను ఏడబ్ల్యూ యూనియన్ సభ్యులు సైతం సమర్ధిస్తున్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలతో కాగ్నింజెంట్కు చెందిన సుమారు 200 మంది ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన గూగుల్ కోసం పని చేస్తున్నారు. ఆయితే ఆ ఉద్యోగుల్ని గూగుల్ ఇంటి వద్ద నుంచి పనిచేయడం ఆపేయాలని, జూన్ 6 నుంచి ఆఫీస్‌కు రావాలని గూగుల్ ఆదేశించింది. దీంతో రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు, ద్రవ్యోల్బణంతో పాటు, విజృంభిస్తున్న కరోనాతో పాటు పలు కారణాల్ని ఉదహరిస్తూ వర్క్ ఫ్రమ్ హోంను కొనసాగిస్తామని, ఆఫీస్‌కు రాలేమని ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. న్యూయార్క్ టైమ్స్ కథనం న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం..గూగుల్‌లో పనిచేస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులు రీటర్న్ టూ ఆఫీస్ పాలసీని వ్యతిరేకిస్తే గూగుల్ సదరు ఉద్యోగుల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తుందంటూ న్యూయార్స్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. కాగ్నిజెంట్ ఏమంటుందంటే! రిటర్న్ టూ ఆఫీస్ పాలసీ అనేది ఉద్యోగులు, క్లయింట్ రిక్వైర్ మెంట్‌పై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగులు భద్రతే మాకు ముఖ్యం. తరువాతే మిగిలిన అంశాల్ని పరిగణలోకి తీసుకుంటాం. అందుకే ఉద్యోగుల్ని కరోనా వ్యాక్సిన్ తీసుకుంటేనే ఆఫీస్‌కు రావాలని కోరుతున్నామని కాగ్నిజెంట్ చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ జెఫ్ డెస్మారైస్ తెలిపారు. మాకూ ఉద్యోగుల ఆరోగ్యమే ముఖ్యం! గూగుల్‌కు చెందిన ఉన్నతాధికారిణి కోర్టేనే మాన్సిని మాట్లాడుతూ..మాకు ఉద్యోగుల ఆరోగ్య భద్రతే ముఖ్యం. కాంట్రాక్ట్ ఉద్యోగులైన సరే వాళ్లకి గూగుల్‌లో తగిన ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పటికే సంస్థ ఆఫీస్ రిటర్న్ టూ పాలసీని అమలు చేశాం. సప్లయర్స్ (కాగ్నిజెంట్) ఈ పాలసీని ఎలా అమలు చేయాలో నిర్ణయించుకుంటారని కోర్టేనే మాన్సిని స్పష్టం చేశారు. చదవండి👉జీతం రూ.8కోట్లు..వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దన్నారని జాబ్‌కు రిజైన్ చేశాడు! -
ఐటీ ఉద్యోగులకు బంపరాఫర్! బోనస్‌లు,ప్రమోషన్లు..అబ్బో ఇంకా ఎన్నెన్నో!
ప్రపంచ దేశాలకు చెందిన ఐటీ కంపెనీల్ని అట్రిషన్ రేటు విపరీతంగా వేధిస్తుంది. వచ్చిపడుతున్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేయలేక..ఆఫర్లని, లేదంటే తమకు నచ్చిన రంగంలో అడుగుపెట్టేందుకు చేస్తున్న ఉద్యోగాల్ని ఉన్న ఫళంగా వదిలేస్తుంటే..ఆ ఉద్యోగుల్ని నిలుపుకోలేక ఐటీ సంస్థలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ టెక్ దిగ్గజాలు అట్రిషన్ రేట్ తగ్గించేందుకు మాస్టర్ ప్లాన్ వేశాయి. కోవిడ్-19 కారణంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఐటీ రంగానికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీనికి తోడు టెక్నాలజీ పరంగా అవకాశాలు విసృతంగా పెరిగిపోయాయి. అందుకే ఉద్యోగులు తమకు వస్తున్న అవకాశాల్ని వినియోగించుకుంటున్నారు. ఇతర సంస్థల నుంచి వస్తున్న ఆఫర్లను అందుకుంటున్నారు. దీంతో ఐటీ సెక్టార్‌ను ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో ప్రముఖ టెక్ దిగ్గజాలు డిజిటల్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫీయల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ విభాగాల్లో అట్రిషన్ రేట్ తగ్గిస్తూ, స్కిల్స్ ఉన్న ఉద్యోగుల్ని ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా విప్రో, కాగ్నిజెంట్, మైండ్ ట్రీ, టెక్ మహీంద్రా, ఎంఫసిస్లాంటి సంస్థలు ఉద్యోగులకు స్పెషల్ బోనస్‌లు ప్రకటిస్తున్నాయి. కంపెనీ స్టాక్స్(ఈఎస్ఓపీఎస్) భాగస్వామ్యం ఇవ్వడం, ఉన్న జాబ్‌లో స్మార్ట్‌గా చేసేందుకు సిల్స్, లేదంటే మరో విభాగానికి చెందిన ప్రాజెక్ట్ చేసేలా ప్రత్యేకంగా క్లాసుల్ని నిర్వహించడం, ఉన్న సంస్థలో చేస్తున్న జాబ్ నచ్చక ఇబ్బంది పడుతుంటే..అదే సంస్థలో వారికి నచ్చిన విభాగంలో పనిచేసేలా ప్రోత్సహించడం, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుకునేలా అనుమతి ఇవ్వడం, వర్క్ ఫ్రమ్ లేదంటే ఎక్కడి నుండైనా పనిచేసేలా ఉద్యోగులకు అవకాశాల్ని కల్పిస్తున్నాయి. తద్వారా అట్రిషన్ రేట్‌ను పూర్తి స్థాయిలో తగ్గించుకోవచ్చని ఐటీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఉద్యోగులు సైతం ఈ ఆఫర్లకు అంగీకరించే అవకాశాలు కనిపిస్తున్నాయని ఐటీ నిపుణులు భావిస్తున్నారు. చదవండి👉ఈ తరహా ఉద్యోగుల కోసం వేలకోట్ల ఖర్చు, పోటీపడుతున్న ఐటీ కంపెనీలు! -
వర్క్ ఫ్రం హోంకు గవర్నమెంట్ చెక్..! ఐటీ కంపెనీల నిర్ణయం ఇలా..!
కరోనా రాకతో ఐటీ ఉద్యోగులు ఇంటికే పరిమితమయ్యారు. కరోనా ఉదృతి కాస్త తగ్గడంతో దిగ్గజ ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు పిలిచేందుకు సిద్దమవ్వగా ఒక్కసారిగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ రాకతో ఐటీ కంపెనీలు సందిగ్థంలో పడిపోయాయి. దీంతో చేసేదేమీ లేక ఉద్యోగులను మళ్లీ ఇంటి నుంచే పనిచేయడంటూ ఆర్డర్స్ వేశాయి. భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ కాస్త తగ్గిపోవడంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగులను ఆఫీసులకు పిలవొచ్చునని ఐటీ కంపెనీలతో తెలిపాయి. దీంతో దిగ్గజ ఐటీ కంపెనీలు మరోసారి ఉద్యోగులను ఆఫీసులకు పిలిచే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. విప్రో, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి దిగ్గజ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను పూర్తిగా ఎత్తివేసేందుకు సిద్దమైనట్లు సమాచారం. ఆఫీసులకు పిలిచేందుకు సిద్దం..! కోవిడ్-19 తగ్గుముఖం పట్టడంతో దిగ్గజ ఐటీ కంపెనీలైన విప్రో, కాగ్నిజెంట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులను వచ్చే నెలలోగా కార్యాలయాలకు పిలిపించే అవకాశం ఉన్నందున ఉద్యోగుల సిద్ధంగా ఉండాలని కోరుతున్నట్లు సమాచారం. ► భారత ఐటీ దిగ్గజం విప్రో తమ ఉద్యోగులను ఆఫీసులకు పిలిచేందుకు సిద్దమైంది. బెంగళూరుకు చెందిన కంపెనీ మేనేజర్స్, సీనియర్ ఉద్యోగులను మార్చి 3లోగా కార్యాలయానికి తిరిగి రావాలని కోరింది. అయితే, ప్రస్తుతానికి వారానికి రెండు రోజులు మాత్రమే వారిని పిలుస్తారు. ఇక ఉద్యోగులను కూడా పూర్తి స్థాయిలో ఆఫీసులకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ► కాగ్నిజెంట్ తమ ఉద్యోగులను ఏప్రిల్ నాటికి కార్యకలాపాలను ప్రారంభించాలని చూస్తోంది. అయితే ఉద్యోగులను బలవంతం చేయకుండా వారిని పిలిచే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ సమాచారం. 2022 నాటికి హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను కొనసాగించాలనే అంచనాతో కంపెనీ ఉన్నట్లు సమాచారం. కాగ్నిజెంట్ ఏప్రిల్ నుంచి వారానికి 3 రోజుల పాటు ఉద్యోగులను తిరిగి ప్రాంగణంలో ఉంచే ప్రణాళికలను కలిగి ఉంది ► రిమోట్ వర్కింగ్ పాలసీని తీసుకొచ్చిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ట్రెండ్‌లో చేరింది. కంపెనీ అసోసియేట్స్ ఇంటి నుంచి పని చేస్తున్నప్పటికీ, వారిని కంపెనీ బేస్ లొకేషన్ నుంచి పని చేయడం తప్పనిసరి చేసింది. టీసీఎస్ భారీ ఎత్తున్న విద్యార్థులను రిక్రూట్ చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇక భవిష్యత్‌లోనూ 25-25 శాతం మోడల్ విధానాన్ని అమలు చేస్తామన్నారు. తొలుత 25/25 శాతం మంది సిబ్బందిని ఆఫీసులకు తీసుకొచ్చి క్రమంగా హైబ్రీడ్ మోడల్‌కు మళ్లిస్తామని తెలిపారు. ► ఇన్ఫోసిస్ రాబోయే 3-4 నెలల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల కోసం కార్యాలయాలను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇన్ఫోసిస్‌లో 96 శాతం మంది వర్క్ ఫ్రం హోం సేవలు కొనసాగిస్తారు. సంస్థ కూడా సిబ్బందిని ఆఫీసులకు రప్పించడానికి తొందర పడటం లేదు. కొవిడ్ కేసుల నేపథ్యంలో హైబ్రీడ్ మోడల్ పని విధానాన్నే కొనసాగిస్తామని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ హెడ్ రిచర్డ్ లోబో వ్యాఖ్యానించారు. 40-50 శాతం సిబ్బందిని ఆఫీసులకు రప్పిస్తామన్నారు. దశల వారీగా ఆఫీసులకు సిబ్బందిని తీసుకొస్తామన్నారు. చదవండి: హైదరాబాద్‌లో వర్క్ ఫ్రమ్ హోంకు ఎండ్‌కార్డ్..! ఐటీ కంపెనీల కీలక నిర్ణయం..! -
ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్ ! ఈ కార్పోరేట్ కంపెనీలో 45,000 ఉద్యోగాలు.. ఎప్పుడంటే?
న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ, అమెరికా కేంద్రంగా పనిచేసే కాగ్నిజంట్ సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో మెరుగైన పనితీరు చూపించింది. సంస్థ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 56 శాతం పెరిగి 544 మిలియన్ డాలర్లు (రూ.4,080 కోట్లు)గా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో (2020 సెప్టెంబర్ త్రైమాసికం) నికర లాభం 348 మిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. కంపెనీ ఆదాయం 12 శాతం పెరిగి 4.7 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం 4.2 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. రూ.4.69–4.74 బిలియన్ డాలర్ల మధ్య ఆదాయం ఉండొచ్చన్న గత అంచనాలకు అనుగుణంగానే సంస్థ పనితీరు ఉంది. ఫ్రెషర్లకు గుడ్‌న్యూస్: అక్టోబర్–డిసెంబర్ కాలంలో భారత్‌లో కొత్తగా 45,000 మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు ఇవ్వనున్నట్టు కాగ్నిజంట్ ప్రకటించింది. నిపుణులకు డిమాండ్– సరఫరా మధ్య అంతరం చాలా ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. వార్షికంగా చూస్తే స్వచ్చంద అట్రిషన్ (ఉద్యోగి స్వయంగా సంస్థను వీడడం) రేటు 33 శాతానికి పెరిగినట్టు తెలిపింది. ఈ సంస్థ జనవరి–డిసెంబర్‌ను వార్షిక సంవత్సరంగా పరిగణిస్తుంటుంది. భారత్‌లో కాగ్నిజంట్‌కు 2 లక్షల మంది ఉద్యోగులున్నారు. సెప్టెంబర్ త్రైమాసికంలో డిజిటల్ విభాగం ఆదాయం 18 శాతం వృద్ధిని చూపించినట్టు సీఈవో హంఫైర్స్ తెలిపారు. క్యూ4లో 4.75 డాలర్ల స్థాయిలో.. నాలుగో త్రైమాసికంలో (2021 అక్టోబర్–డిసెంబర్) ఆదాయం 4.75–4.79 బిలియన్ డాలర్ల మేర ఉండొచ్చన్న అంచనాను కాగ్నిజంట్ ఫలితాల సందర్భంగా వ్యక్తం చేసింది. ఇది వార్షికంగా చూస్తే 13.5–14.5 శాతం వృద్ధికి సమానమని వివరించింది. 2021 పూర్తి సంవత్సరానికి ఆదాయం 11 శాతం మేర వృద్ధి చెంది 18.5 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని ప్రకటించింది. సంస్థ ఉద్యోగుల సంఖ్య 3,01,300 నుంచి 3,18,400కు పెరిగింది. -
ప్రముఖ ఐటీ సంస్థకు లీగల్ నోటీసులు
సాక్షి, బెంగళూరు : ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ చిక్కుల్లో పడనుంది. అక్రమంగా, చట్టవిరుద్ధంగా ఉద్యోగులను తొలగించిందన్న ఆరోపణలతో కర్ణాటక స్టేట్ ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ (కేఐటీయూ) కాగ్నిజెంట్‌పై చట్టపరమైన చర్యలను ప్రారంభించింది. 18,000 మంది కాగ్నిజెంట్ ఉద్యోగులకు ఉద్వాసన పలకనుందన్న అంచనాల నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా వేలాది ఉద్యోగుల తొలగింపులను ఖండించిన కేఐటీయూ తొలగించిన కొంతమంది ఉద్యోగుల ద్వారా కాగ్నిజెంట్ యాజమాన్యానికి లీగల్ నోటీసులు పంపింది. 14 రోజులు కాగ్నిజెంట్ నుండి ఆమోదయోగ్యమైన ప్రతిస్పందన రాకపోతే, కార్మిక శాఖను ఆశ్రయించనున్నామని యూనియన్ ప్రధాన కార్యదర్శి ఉల్లాస్ చమలరంబిల్ చెప్పారు. కార్మిక చట్టాల ప్రకారం, 100 మందికి పైగా ఉద్యోగులున్న సంస్థలు తొలగింపుల అమలుకు మొదట కార్మిక శాఖ నుండి అనుమతి పొందాలని కేఐటీయూ కార్యదర్శి సూరజ్ నిడియంగా చెప్పారు. పైగా ఉద్యోగులు స్వచ్ఛంద రాజీనామా చేశారని కంపెనీ వాదిస్తోందనీ, వాస్తవానికి, రాజీనామా చేయవలసి రావడంచట్ట విరుద్ధమేనని పేర్కొన్నారు. అలాగే బాధిత ఉద్యోగులు రాజీనామా చేయకుండా తమ ఉద్యమానికి మద్దతివ్వాలని కోరారు. ఇందుకోసం ఒక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసినట్టు ఉల్లాస్ తెలిపారు. బెంగళూరుతోపాటు చెన్నై, పూణేలోని ఉద్యోగులు యూనియన్లను సంప్రదించాయనీ, ప్రాజెక్టులలో పనిచేసే ఉద్యోగులు కూడా రాజీనామా చేయమని కంపెనీ ఒత్తిడి తెస్తోందని ఉల్లాస్ ఆరోపించారు. ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకొని కార్మిక చట్టాల ఉల్లంఘనలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కర్నాటక ప్రభుత్వాన్ని కేఐటీయూ డిమాండ్ చేసింది. మరోవైపు సామూహిక తొలగింపుల ఆరోపణలను కాగ్నిజెంట్ ప్రతినిధి ఖండించారు. కాగ్నిజెంట్‌తో సహా ఐటీ పరిశ్రమల్లో పనితీరు నిర్వహణ ఆధారంగా తొలగింపు అనేది ఒక సాధారణ ప్రక్రియ అని తెలిపింది. Karnataka State IT/ITeS Employees Union #KITU opened a Help Desk to support the affected employees of Cognizant Don't Panic! Refuse to Resign! Call US @ 9605731771 / 7025984492 / 9742045570 pic.twitter.com/xvvyT1aUy7 — Sooraj Nidiyanga (@SNidiyanga) July 2, 2020 -
సీనియర్ లెవల్ పదోన్నతులకు టెకీల ఆసక్తి..
ముంబై: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవంతో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఈ నేపథ్యంలో సాఫ్ట్వేర్ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గత వారం నుంచి సీనియర్ లెవల్ ఐటీ(టెకీలు) ఉద్యోగులు పదోన్నత్తుల కోసం కంపెనీలకు రెజ్యూమ్స్ పంపిస్తున్నట్లు సాంకేతిక విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ఎక్కువగా నైపుణ్యాలు, కొత్త టెక్నాలజీని నేర్చుకోలేని వారికి ఉద్వాసన తప్పదని ఐటీ వర్గాలు తెలిపాయి. ఈ సంవత్సరం డిజిటల్ నిపుణులకు విపరీతమైన డిమాండ్ ఉంటుందని.. వాటిలో నైపుణ్యం పెంచుకోవడానికి ఉద్యోగులు కృషి చేయాలని నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీత గుప్తా తెలిపారు. ఉద్యోగుల డిజిటల్ నైపుణ్యాలకు కంపెనీలు అధిక ప్రాధాన్యత ఇస్తాయని గుప్తా అభిప్రాయపడ్డారు. దాదాపు 40 శాతం మంది సీనియర్ ఐటీ ఉద్యోగులు కంపెనీలకు రిజ్యూమ్స్ పంపిస్తున్నట్లు ఫీనో అనే కన్సెల్టెంట్ సంస్థ తెలిపింది. కరోనా ప్రభావం వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు ఉండకపోవచ్చని ఫీనో సహ వ్యవస్థాపకుడు కమల్ కరన్త్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ఐటీ దిగ్గజ కంపెనీలు ఐబీఎమ్, కాగ్నిజెంట్ తదితర సంస్థలు ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. -
ఫ్రెషర్లకు ‘కాగ్నిజంట్’ 20,000 ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం కాగ్నిజంట్ నికర లాభం ఈ మార్చి క్వార్టర్లో 17 శాతం తగ్గింది. గత ఏడాది మార్చి క్వార్టర్లో 44 కోట్ల డాలర్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది మార్చి క్వార్టర్లో 37 కోట్ల డాలర్లకు తగ్గిందని కాగ్నిజంట్ తెలిపింది. ఆదాయం 3 శాతం వృద్ధితో 420 కోట్ల డాలర్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ బ్రియాన్ హంఫ్రీస్ వెల్లడించారు. కరోనా వైరస్ కల్లోలం నేపథ్యంలో ఈ ఏడాది డిమాండ్ పరంగా సమస్యలు ఉండొచ్చని అంచనాలున్నాయన్నారు. అందుకే గతంలో వెలువరించిన ఈ ఏడాది ఆదాయ అంచనాలను వెనక్కి తీసుకుంటున్నామని వివరించారు. విభిన్నమైన సేవలందించడం, పటిష్టమైన బ్యాలన్స్ షీట్, లిక్విడిటీల దన్నుతో కరోనా కల్లోలాన్ని ఎదుర్కొనగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. మార్చి క్వార్టర్లో భారీ డీల్స్ సాధించామని బ్రియన్ వివరించారు. ఫ్రెషర్లకు 20,000 ఉద్యోగాలు ఇవ్వనున్నామని చెప్పారు. వ్యయాల నియంత్రణపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. -
కరోనా పోరు: ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: కరోనా వైరస్ (కోవిడ్ -19) లాక్డౌన్ నేపథ్యంలో కష్టాల్లో ఉన్న తమ ఉద్యోగులకు ప్రముఖ టెక్ సేవల సంస్థ కాగ్నిజెంట్ భారీ ఊరట కల్పించింది. భారతదేశం, ఫిలిప్పీన్స్ దేశాల్లో తన ఉద్యోగులకు సహాయం చేసేందుకు నిర్ణయించింది, అసోసియేట్ స్థాయి వరకు ఉద్యోగులకు ఏప్రిల్ నెలకు మూలవేతనంలో 25 శాతం అదనంగా చెల్లించనుంది. తాజా నిర్ణయం భారత్‌లో ఉన్న మూడింట రెండు వంతుల కాగ్నిజెంట్ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఈ విధానాన్ని నెలవారీగా సమీక్షిస్తామని కంపెనీ తెలిపింది. (లాక్డౌన్: ఏంటి సర్.. మీకిది కూడా తెలియదా?) ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతను నిర్ధారించేందుకు, ఖాతాదారులకు సురక్షతమైన సేవలను కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వెల్లడించింది. అంతేకాదు ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఇంటినుంచే పనిచేసేందుకు ఎక్కువ మందికి అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఆయా ఉద్యోగులకు కొత్త ల్యాప్‌టాప్‌లను అందించడం, డెస్క్‌టాప్ ఎన్ క్రిప్టింగ్, అదనపు బ్యాండ్‌విడ్త్ కనెక్టివిటీ, ఎయిర్ కార్డులను అందించడం లాంటి కీలక చర్యల్నికూడా తీసుకుంది. అన్ని గ్లోబల్ కంపెనీల మాదిరిగానే, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రభావానికి తాము కూడా గురవుతున్నామని కంపెనీ తెలిపింది. (కరోనా కథ.. ఇల్లే సురక్షితం) ఈ క్లిష్ట సమయంలో మనమందరం ప్రతిరోజూ కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాం..అయినా ఒకరికొకరం సాయం చేసుకుంటూ కలిసికట్టుగా, ధైర్యంతో పనిచేస్తూ సవాళ్లను అధిగమిద్దాం అని కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీరోచితంగా పనిచేస్తున్న ఉద్యోగ బృందాలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి సేవల్నీ ఎప్పటికీ మర్చిపోలేమనీ, విశేష సేవలందించిన కీలక ఉద్యోగులు, ముఖ్య వ్యక్తులకు బహుమతి ఇచ్చేలా భవిష్యత్తులో నిర్దిష్ట చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. (కరోనా మూడో దశకు చేరుకుంటే?) -
భారత ఐటీ గ్రాడ్యుయేట్స్‌కు శుభవార్త
సాక్షి, బెంగళూరు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేజర్ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్ప్ భారత ఐటీ గ్రాడ్యుయేట్స్‌కు శుభవార్త అందించింది. సంవత్సరం భారతదేశంలో ఎక్కువ మందిని టెకీలను నియమించుకోనున్నట్టువెల్లడించింది. ఎందుకంటే విద్యార్థులు డిజిటల్ నైపుణ్యాలలో మెరికల్లా యూనివర్శిటీల నుంచి విద్యార్థులు ఎక్కువ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2020లో ఇంజనీరింగ్, సైన్స్ గ్రాడ్యుయేట్ల నియామకంలో 30 శాతం పెంచాలని నిర్ణయించాలని తెలిపింది. 2019 జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా 10-12 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన కాగ్నిజెంట్ భారతదేశంలో నియామకాలను పెంచడం విశేషం. భారతదేశంలోని ప్రధాన ఇంజనీరంగ్ కాలేజీలనుంచి 20వేల మందికి పైగా అభ్యర్థులను నియమించుకోవాలని యోచిస్తున్నామని కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్ చెప్పారు. అంతేకాదు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు జీతాలను 18శాతం పెంచి, రూ. 4 లక్షలను ఆఫర్ చేయనుంది. దాదాపు 100 ప్రీమియర్ ఇంజనీరింగ్ క్యాంపస్‌ల నుంచి తమ సంస్థలో చేరుతున్న వారి శాతం 80 శాతానికి పైమాటేనని, కాగ్నిజెంట్ పై పెరిగిన విశ్వాసాన్ని ఇది ప్రతిబింబిస్తుందని హంఫ్రీస్ పేర్కొన్నారు. కాగా గత ఏడాది, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) తరువాత భారతదేశంలో 2 లక్షల మంది ఉద్యోగులతో రెండవ ఐటీ కంపెనీగా కాగ్నిజెంట్ నిలిచింది. మొత్తం 4.4 లక్షల మంది ఉద్యోగులతో భారతదేశపు అతిపెద్ద ఐటీ కంపెనీగా టీసీఎస్ ఉన్నసంగతి తెలిసిందే. -
5 వేల డాలర్ల ప్రైజ్‌మనీ గెలిచారు!
న్యూయార్క్: భారత ఉపఖండం ఏటా ఎదుర్కునే వరదలను సమర్థవంతంగా అడ్డుకునే పరిష్కార మార్గాన్ని చూపిన భారతీయ సాఫ్ట్వేర్ ఉద్యోగుల బృందాన్ని 5 వేల డాలర్ల ప్రైజ్‌మనీ వరించింది. వరదలను సమర్థంగా అడ్డుకుని, అనేకమంది జీవితాలను కాపాడే ఈ పరిష్కారాన్ని కనుగొన్నందుకు గాను టెక్ దిగ్గజం ఐబీఎం ఈ ప్రైజ్‌మనీని ఆ బృందానికి అందజేసింది. ఐబీఎం, డేవిడ్ క్లార్క్ కాజ్ ఫౌండేషన్ కాల్ ఫర్ కోడ్–2019 ఆసియా–పసిఫిక్ ప్రాంతానికి సంబంధించిన అవార్డులను శనివారం ప్రకటించింది. ‘పూర్వ సూచక్’ పేరుతో కాగ్నిజెంట్ పుణే క్యాంపస్‌లో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు సిద్దమ్మ తిగడి, గణేశ్ కదం, సంగీత నాయర్, శ్రేయాస్ కులకర్ణిలు సంయుక్తంగా రూపొందించిన ఈ ప్రాజెక్టు తొలి బహుమతి గెలుచుకుంది. ఈ విధానంలో వరదలను అడ్డుకునేందుకు గాను క్రమం తప్పకుండా రిజర్వాయర్లు, డ్యామ్‌లు వంటి వాటిలో నీటి స్థాయిలను గమనిస్తూ ఉంటారు. వాటికి సంబంధించిన సమాచారంతోపాటు వాతావరణ సూచనల సమాచారాన్ని సేకరిస్తారు. ఈ మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి వరదలను అంచనా వేస్తారు. అనంతరం బ్లాక్‌చైన్ సాంకేతికతను వినియోగించి ఈ వివరాలను ప్రభుత్వ సంస్థలు, ప్రకృతి విపత్తుల నిర్వహణ ఏజెన్సీలకు అందుబాటులో ఉంచుతారు. ఇక కృత్రిమ మేథస్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌ను ఉపయోగించి అగ్నిమాపక సిబ్బంది కోసం రూపొందించిన ప్రొమీటియోకు కాల్ ఫర్ కోడ్ –2019 గ్లోబల్ అవార్డు దక్కింది. ఇందుకు గాను 2 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ గెలుచుకుంది. గ్లోబల్ రన్నరప్ స్థానాన్ని భారత్, చైనా, అమెరికాలకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు అభివృద్ధి చేసిన ‘స్పారో’కు దక్కింది. -
కాగ్నిజంట్‌లో లక్ష దాటిన మహిళా ఉద్యోగుల సంఖ్య
న్యూఢిల్లీ: ఐటీ కంపెనీ కాగ్నిజంట్‌లో మహిళా ఉద్యోగుల సంఖ్య లక్ష మార్క్‌ను దాటింది. ఇందులో 75వేల మందికి పైగా మహిళలు భారత్‌లోనే పనిచేస్తుండడం గమనార్హం. మొత్తం ఉద్యోగులు రూ.2.88 లక్షల మందిలో మహిళలు 34 శాతానికి చేరినట్టు కాగ్నిజంట్ తెలిపింది. 100కు పైగా దేశాలకు చెందిన మహిళలు సంస్థలో పనిచేస్తున్నారు. కనీసం లక్ష మంది మహిళా ఉద్యోగులను 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా కలిగి ఉండాలని సంస్థ లక్ష్యాన్ని నిర్దేశించుకోగా, 2019లోనే దాన్ని సాధించేసింది. పైగా వారిలో 75 శాతం భారత్ నుంచే పనిచేస్తుండడం విశేషం. -
ఆదాయం తగ్గుతుంది
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం కాగ్నిజంట్ కంపెనీ మార్చి క్వార్టర్ ఆర్థిక ఫలితాలు నిరాశపరిచాయి. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నా, భారత్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉద్యోగులు ఉన్న ఈ కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో కంపెనీ నికర లాభం 15 శాతం తగ్గి 44.1 కోట్ల డాలర్లకు చేరింది.. గత ఏడాది ఇదే క్వార్టర్లో నికర లాభం 52 కోట్ల డాలర్లు వచ్చింది. ఆదాయం 5 శాతం ఎగసి 411 కోట్ల డాలర్లకు చేరింది. సగం తగ్గిన ఆదాయ అంచనాలు..: నిరాశకర ఫలితాలను ప్రకటించిన ఈ కంపెనీ పూర్తి ఏడాది ఆదాయం అంచనాలను సగానికి పైగా తగ్గించింది. ఈ ఏడాది ఆదాయం 7–9 శాతం రేంజ్లో వృద్ధి చెందగలదని ఒక నెల క్రితం ఈ కంపెనీ పేర్కొంది. తాజాగా ఈ అంచనాలను 3.6–5.1 శాతానికి తగ్గంచింది. ఆర్థిక సేవలు, హెల్త్‌కేర్ విభాగాల్లో వృద్ధి మందకొడిగా ఉండే అవకాశాలుండటంతో ఆదాయ అంచనాలను తగ్గించామని పేర్కొంది. ఈ ఏడాది రెండో క్వార్టర్ ఆదాయం అంచనాలు 3.9–4.9 శాతం రేంజ్లో ఉండగలవని వివరించింది. విఫలమయ్యాం..: మార్కెట్ అవకాశాలను సమర్థవంతగా అందిపుచ్చుకోవడంలో విఫలమయ్యామని కంపెనీ సీఈఓ బ్రియాన్ హంఫ్రిస్ పేర్కొన్నారు. ఫ్రాన్సిస్ డిసౌజా నుంచి ఏప్రిల్ 1 నుంచి సీఈఓ పగ్గాలను హంఫ్రిస్ తీసుకున్నారు. -
3% తగ్గిన కాగ్నిజంట్ నికర లాభం
న్యూఢిల్లీ: ఐటీ సేవల సంస్థ, కాగ్నిజెంట్ నికర లాభం ఈ ఏడాది ఏప్రిల్–జూన్ క్వార్టర్లో 3 శాతం తగ్గింది. గత ఏడాది జూన్ క్వార్టర్లో 47 కోట్ల డాలర్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది ఇదే క్వార్టర్లో 45.6 కోట్ల డాలర్లకు తగ్గిందని కాగ్నిజంట్ తెలిపింది. ఆదాయం మాత్రం 360 కోట్ల డాలర్ల నుంచి 400 కోట్ల డాలర్లకు పెరిగిందని కాగ్నిజెంట్ సీఈఓ, వైస్ చైర్మన్ ఫ్రాన్సిస్కో డిసౌజా తెలిపారు. ఈ ఏడాది మూడో క్వార్టర్లో ఆదాయం 406 కోట్ల డాలర్ల నుంచి 410 కోట్ల డాలర్లకు పెరగగలదని అంచనాలున్నాయని డిసౌజా తెలిపారు. అలాగే ఈ పూర్తి ఏడాదికి ఆదాయం 1,605 కోట్ల డాలర్ల నుంచి 1,630 కోట్ల డాలర్లకు పెరగవచ్చని అంచనా వేస్తున్నామన్నారు. డిజిటల్ సర్వీసులు, సొల్యూషన్లకు అధిక ప్రాధాన్యతనివ్వనున్నామని, వృద్ధికి తగినన్ని పెట్టుబడులు కేటాయిస్తామని, ఆర్థిక లక్ష్యాలను సాధిస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన ఈ కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ కంపెనీకి భారత్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉద్యోగులున్నారు. ఈ జూన్ క్వార్టర్లో కొత్తగా 7,500 మందికి ఉద్యోగాలిచ్చామని, దీంతో ఈ ఏడాది జూన్ క్వార్టర్ నాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,68,900కు పెరిగిందని కంపెనీ పేర్కొంది. -
కాగ్నిజెంట్ లాభాలు డౌన్
సాక్షి, ముంబై: ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ 2018 మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చలేకపోయింది. ముఖ్యంగా కంపెనీ నికలర లాభం క్షీణించింది. 6.6 శాతం క్షీణతతో కంపెనీ నికర లాభం 520 మిలియన్ డాలర్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ 557 మిలియన్ డాలర్లు లేదా 92 సెంట్ల నికర లాభం సాధించినట్లు కాగ్నిజెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే, గత ఏడాది ఇదే త్రైమాసికంలో 3.54 బిలియన్ డాలర్ల నుంచి 3.91 బిలియన్ డాలర్ల రెవెన్యూ వృద్ధిని నమోదు చేసింది. హెల్త్ కేర్, కమ్యూనికేషన్స్, మీడియా, టెక్నాలజీ వంటి అంశాలపై బలమైన వృద్ధిని సాధించినట్టు పేర్కొంది. ఇది మార్చి త్రైమాసికంలో డాలర్ గైడెన్స్ 3.88 బిలియన్ డాలర్లగా ఉంది. జూన్ త్రైమాసికంలో ఆదాయం 4-4.04 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని తెలిపింది., 2018 నాటికి డాలర్ అదాయం 16.05 నుండి 16.3 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. ఈ మొదటి త్రైమాసికంలో మంచి ఆర్ధిక ఫలితాలను సాధించామనీ, డిజిటల్ సేవలు, సొల్యూషన్స్‌లో మంచి పురోగతిని సాధించామని కాగ్నిజెంట్ సీఈవో ఫ్రాన్సిస్కో డిసౌజా చెప్పారు.మార్చి 2018 త్రైమాసికంలో 2,61,400 మంది ఉద్యోగులున్నారని వెల్లడించింది. -
కాగ్నిజెంట్ ‘కీ’ ఎగ్జిక్యూటివ్‌ల వేతన పెంపు కేవలం...
ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తన కీలక ఎగ్జిక్యూటివ్‌లకు వేతన పెంపును కేవలం సింగిల్-డిజిట్‌లోనే చేపట్టింది. కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫ్రాన్సిస్కో డి సౌజాతో పాటు మిగతా ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు - అధ్యక్షుడు రాజీవ్ మెహతా, చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ కరేన్ మెక్లౌగ్లిన్ వేతనాలను 2017లో కేవలం 3 శాతం నుంచి 8 శాతం మధ్యలోనే పెంచినట్టు వెల్లడైంది. మార్కెట్ ట్రెండ్లను పరిగణలోకి తీసుకున్న కాగ్నిజెంట్ ఈ మేరకు మాత్రమే వేతన పెంపును చేపట్టింది. ప్రత్యక్ష పరిహారాల్లో డి సౌజా పరిహారాలు మొత్తంగా 3 శాతం పెరిగాయి. 2017లో ఈయన పరిహారాలు 12.23 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వార్షిక పనితీరు పరంగా ఇచ్చే స్టాక్ యూనిట్లు, నియంత్రిత స్టాక్ యూనిట్లు 3 శాతం మాత్రమే పెరిగాయి. ఇక మెహతా పరంగా చూసుకుంటే, ఆయన 2016 సెప్టెంబర్‌లో అధ్యక్షుడిగా ప్రమోషన్ పొందినప్పుడు 14 శాతం పెంపు చేపట్టారు. అనంతరం 2017లో మొత్తంగా ప్రత్యక్ష పరిహారాల్లో కేవలం 3 శాతం పెంపును మాత్రమే ఆయన పొందినట్టు తెలిసింది. ఆయన వార్షిక పనితీరు పరంగా ఇచ్చే స్టాక్ యూనిట్లు, నియంత్రిత స్టాక్ యూనిట్లు 2016 నుంచి 3 శాతం, 4 శాతం చొప్పున పెరిగాయి. మెక్లౌగ్లిన్ కూడా మొత్తంగా 2017లో తన ప్రత్యక్ష పరిహారాల్లో 8 శాతం పెంపును పొందారు. అయితే 2016లో ఆమెకు బేస్ శాలరీ, వార్షిక నగదు ప్రోత్సహాకాల్లో 17 శాతం పెంపు ఉంది. ఆమె పీఎస్‌యూ, ఆర్ఎస్యూ గ్రాంట్లు 5 శాతం, 6 శాతం చొప్పున ఉన్నాయి. 2017, 2016లలో కంపెనీ పనితీరు పరంగా ఎగ్జిక్యూటివ్‌ల పరిహారాల పెంపును చేపట్టామని కంపెనీ చెప్పింది. పరిశ్రమ అంచనాలు, కంపెనీ లక్ష్యాలు, ఎగ్జిక్యూటివ్‌ల పనితీరు, బాధ్యత, ఎగ్జిక్యూటివ్ టాలెంట్ మార్కెట్ వంటి అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టు పేర్కొంది. -
కాగ్నిజెంట్ ఖాతాల జప్తు తొలగింపు
ముంబై: ఆదాయపు పన్ను వివాదానికి సంబంధించి స్తంభింపజేసిన తమ సంస్థ ఖాతాల్లో కార్యకలాపాలకు మద్రాసు హైకోర్టు అనుమతించినట్లు కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ తెలియజేసింది. ఆదాయపు పన్ను శాఖ చర్యలపై స్టే విధించాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు అనుమతించిందని సంస్థ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే స్టే ఉత్తర్వు ప్రకారం– రూ.2,800 కోట్ల పన్ను వివాదంలో 15 శాతం అంటే దాదాపు రూ.490 కోట్లను తాము డిపాజిట్ చేస్తున్నట్లు కాగ్నిజెంట్ తెలిపింది. దీనికి కోర్టు రెండు రోజుల గడువిచ్చిందని, ఈ పేమెంట్‌కు వీలుగా జేపీ మోర్గాన్... ముంబైలో కంపెనీకి ఉన్న బ్యాంక్ అకౌంట్‌ను జప్తును కోర్టు తొలగించింది. 15 శాతం చెల్లింపులతో పాటు వివాదాస్పద మిగిలిన మొత్తానికి వడ్డీని కూడా కేసు పరిష్కారమయ్యేంతవరకూ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 18వ తేదీకి వాయిదా పడింది. 2016లో కాగ్నిజెంట్ దాదాపు 1.2 బిలియన్ డాలర్ల విలువైన షేర్ బై బ్యాక్ చేపట్టింది. ఆ సమయంలో తన విదేశీ మాతృ సంస్థకు కాగ్నిజెంట్ చెల్లించిన డివిడెండ్‌పై ఎలాంటి పన్నూ చెల్లించలేదని భారత ఐటీ శాఖ ఆరోపించింది. దీనికి సంబంధించి కంపెనీకి చెందిన దాదాపు రూ.2,500 కోట్లమేర విలువైన 60 డిపాజిట్లను రెండు వారాల క్రితం జప్తు చేసింది. కార్పొ బ్రీఫ్స్... ఎన్సీసీ: మార్చి నెలలో రూ.1,085 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. ఇందులో ఎలక్ట్రికల్ విభాగంలో రూ.741 కోట్ల విలువ చేసే మూడు ఆర్డర్లతోపాటు, వాటర్, ఎన్విరాన్మెంట్ విభాగం నుంచి రూ.344 కోట్ల కాంట్రాక్టు ఉంది. నాట్కో: నరాల సంబంధ చికిత్సలో వాడే టెరిఫ్లూనమైడ్ జనరిక్ వర్షన్‌ను భారత్‌లో తొలిసారిగా విడుదల చేసింది. జగిల్: కస్టమర్లకు మెరుగైన సౌకర్యాల కోసం మార్కెటింగ్ ఆటోమేషన్ కంపెనీ రిటైన్లీ టెక్నాలజీస్‌తో చేతులు కలిపింది. -
11% పెరిగిన కాగ్నిజెంట్ లాభం
న్యూఢిల్లీ: అమెరికా ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో 49.5 కోట్ల డాలర్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం 44.4 కోట్ల డాలర్లతో పోలిస్తే 11 శాతం వృద్ధి సాధించినట్లు సంస్థ తెలియజేసింది. ఆదాయం 9 శాతం వృద్ధితో 377 కోట్ల డాలర్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ ఫ్రాన్సిస్కో డిసౌజా తెలిపారు. గతంలో తాము పేర్కొన్న 373– 378 కోట్ల డాలర్ల ఆదాయ అంచనాలను అందుకున్నామని తెలియజేవారు. ఈ జోష్‌తో పూర్తి సంవత్సరం ఆదాయ అంచనాలను పెంచుతున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది 9–10 శాతం రేంజ్లో ఉన్న ఆదాయ అంచనాలను 9.5–10 శాతానికి (1,478–1,484 కోట్ల డాలర్లు) పెంచుతున్నట్లు తెలిపారు. ఇక ఈ ఏడాది నాలుగో క్వార్టర్‌కు 379–385 కోట్ల డాలర్ల ఆదాయం ఆర్జించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కంపెనీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా పాటిస్తోంది. ఈ కంపెనీకి భారత్‌లోనే అధికంగా ఉద్యోగులున్నారు. -
కాగ్నిజెంట్‌కు కలిసొచ్చిన జూన్ క్వార్టర్
470 మిలియన్ డాలర్ల లాభం... 86 శాతం వృద్ధి న్యూఢిల్లీ: ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ జూన్ క్వార్టర్లో మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. లాభం ఏకంగా 86 శాతం పెరిగి 470 మిలియన్ డాలర్లకు చేరింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం రూ.252 మిలియన్ డాలర్లుగా ఉంది. ఆదాయం 9 శాతం వృద్ధితో 3.67 బిలియన్ డాలర్లుగా నమోదైంది. పూర్తి ఏడాదికి ఆదాయ వృద్ధి 8–10 శాతంగా ఉంటుందని లోగడ అంచనా వేయగా, తాజాగా 9–10 శాతానికి సవరించింది. ప్రస్తుత క్వార్టర్లో ఆదాయాలు 3.73–3.78 బిలియన్ డాలర్లుగా ఉండొచ్చని తెలిపింది. డిజిటైజేషన్ ద్వారా క్లయింట్లకు విలువను సమకూర్చడం వల్లే చక్కని ఫలితాలను నమోదు చేయగలిగినట్టు కంపెనీ సీఈవో ఫ్రాన్సిస్కో డిసౌజ తెలిపారు. ప్రధాన వ్యాపారంపై తమ పెట్టుబడులు కొనసాగుతాయన్నారు. 4,400 మంది అవుట్: ఐటీ రంగంలో ఉద్యోగులపై వేటు ఆందోళనలకు నిదర్శనంగా జూన్ త్రైమాసికంలో కాగ్నిజంట్ 4,400 మంది ఉద్యోగులను తగ్గించుకుంది. పనితీరు బాగాలేని వారు, స్వచ్చందంగా విరమించుకున్నవారు వీరిలో ఉన్నట్టు కంపెనీ తెలిపింది. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,56,800కు చేరింది. అట్రిషన్ రేటు 23.6 శాతంగా ఉంది. -
కాగ్నిజెంట్‌లో భారీగా తగ్గిన ఉద్యోగులు
బెంగళూరు : ప్రముఖ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్‌లో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. మార్చి క్వార్టర్ నుంచి ఈ క్వార్టర్‌కు 4000 మంది ఉద్యోగులు ఈ కంపెనీలో తగ్గిపోయారు. మార్చి క్వార్టర్లో కాగ్నిజెంట్‌లో 261,200 మంది ఉద్యోగులుంటే, జూన్ క్వార్టర్‌కు వచ్చేసరికి ఈ సంఖ్య 256,800కు తగ్గిందని కంపెనీ రెండో క్వార్టర్ ఫలితాల్లో తెలిసింది. టాప్ దేశీయ ఐటీ అవుట్సోర్స్ కంపెనీల్లో కెల్లా, దీనిలోనే అత్యధికంగా ఉద్యోగుల సంఖ్య పడిపోయింది. కాగ్నిజెంట్ ప్రత్యర్థులు టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహింద్రా కంపెనీల్లో కూడా ఉద్యోగులు తగ్గిపోయారు. కానీ ఈ మేర తగ్గడం దీనిలోనే. కాగ, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీ కంపెనీలు మాత్రం తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకున్నాయి. అయితే కాగ్నిజెంట్ తన రెవెన్యూ గైడెన్స్‌ను పెంచింది. గతంలో తక్కువగా అంచనావేసిన 8-10 శాతం వృద్ధిని, 9-10 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. అంతేకాక మూడో క్వార్టర్లో వృద్ధి రేటు 1.6-3 శాతముంటుందని కాగ్నిజెంట్ అంచనావేస్తోంది. గురువారం ప్రకటించిన ఫలితాల్లో కంపెనీ నికర లాభం 86 శాతం ఎగిసి ఈ క్వార్టర్లో 470 మిలియన్ డాలర్లుగా నమోదైంది. గతేడాది ఇదే క్వార్టర్లో ఈ లాభం 252 మిలియన్ డాలర్లు మాత్రమే. హెల్త్ కేర్ లాంటి వాటిలో గణనీయమైన వృద్ధిని సాధించడంతో కంపెనీ లాభాలు భారీగా ఎగిసినట్టు తెలిసింది. రెవెన్యూలు కూడా తొలి క్వార్టర్ కంటే ఈ క్వార్టర్లో 8.9 శాతం పెరిగి 3.67 బిలియన్ డాలర్లగా నమోదైనట్టు కాగ్నిజెంట్ తెలిపింది. రెండో క్వార్టర్లో బలమైన ఫలితాలను ప్రకటించామని కంపెనీ తెలిపింది. ఒక్కో షేరుకు 0.80 డాలర్ల లాభం చేకూరుతుందని కంపెనీ పేర్కొంది. గతేడాది ఇది 0.41 డాలర్లుగా మాత్రమే ఉందని కాగ్నిజెంట్ తెలిపింది. -
ఉద్యోగులకు కాగ్నిజెంట్ బ్యాడ్ న్యూస్
ప్రమోషన్లు, వేతనాల పెంపు కోసం ఎదురుచూస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులకు ఆ కంపెనీ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ప్రమోషన్లు, వేతనాల పెంపును మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. వృద్ధి రేటు మందగించడం, వ్యాపారాల వ్యయాలు పెరుగడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. ఈ విషయంపై ఇప్పటికే కంపెనీ తన ఉద్యోగులకు ఈ-మెయిల్స్‌ను పంపుతోంది. ఈ మెయిల్స్‌లో వేతనాల సవరణ, ప్రమోషన్లను అక్టోబర్ 1 నుంచి చేపడతామని కంపెనీ సీటీఎస్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ జిమ్ లెనోక్స్ చెప్పారు. ప్రతేడాది జూలై 1న వేతనాల సవరణను, ప్రమోషన్లను కంపెనీ ప్రకటిస్తుంది. కానీ ఈ ఏడాది అక్టోబర్‌లో చేపడతామని కంపెనీ చెప్పింది. ఈ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా 2,61,000 మంది ఉద్యోగులున్నారు. జిమ్ లెనోక్స్ పంపిన ఈ-మెయిల్స్‌లో మేనేజర్ స్థాయి వరకున్న ఉద్యోగులు తమ బేసిక్ వేతనంపై శాతం పెరుగుదల ఉంటుందని తెలిపారు. అదేవిధంగా సీనియర్ మేనేజర్, ఆపై స్థాయి వారికి మొత్తం ఒకేసారి చెల్లిస్తామని లేదా ప్రతినెలా పెంచుతూ ఉంటామని చెప్పారు. పనితీరుకు సంబంధించిన బోనస్‌లు వేరుగా ఉంటాయని పేర్కొన్నారు. అసోసియేట్లకు, వైస్ ప్రెసిడెంట్ స్థాయి వరకున్న ఉద్యోగులకు ప్రమోషన్లను త్వరలోనే ప్రకటిస్తామని, అవి కూడా అక్టోబర్ నుంచి అమల్లోకి వస్తాయని ఈ-మెయిల్లో తెలిపారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్, పై స్థాయి వారి ప్రమోషన్ల వివరాలను వేరుగా ప్రకటిస్తామని కంపెనీ చెప్పింది. అయితే వీటిపై స్పందించడానికి కాగ్నిజెంట్ అధికార ప్రతినిధి నిరాకరించారు. అప్రైజల్ సైకిల్‌ను జాప్యం చేయడం ఐటీ ఇండస్ట్రీ కఠినతరమైన సవాళ్లను ఎదుర్కొంటుందనే పరిస్థితులకు సంకేతమని కొంతమంది ఉద్యోగులంటున్నారు. వృద్ధి రేటు మందగించడం, టెక్నాలజీలో ఆందోళనలు మధ్యస్థాయి ఉద్యోగుల్లో ఉద్యోగాల కోత భయాలను పెంచుతుందని పేర్కొన్నారు. -
భారీగా అక్రమాలకు తెరతీసిన ఇన్ఫోసిస్
బెంగళూరు: ఓ వైపు ముంచుకొస్తున్న ఆటోమేషన్, మరోవైపు అమెరికా అధ్యక్షుడి ట్రంప్ ప్రభావంతో దేశీయ రెండో అతిపెద్ద టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్ అతిపెద్ద ఆక్రమణ యుద్ధానికి తెరతీసింది. ఉద్యోగ నియామకాల్లో అక్రమాలకు పాల్పడుతూ, ప్రత్యర్థ కంపెనీలకు ఝలకిస్తున్నట్టు పలు రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. మార్చితో ముగిసిన 2017 ఆర్థికసంవత్సరంలో ఇన్ఫోసిస్ అక్రమంగా కాగ్నిజెంట్ నుంచి 13 మంది ఎగ్జిక్యూటివ్ లను, కాప్జెమినీ నుంచి 13 మందిని, టీసీఎస్ నుంచి ఐదుగుర్ని, విప్రో, ఐబీఎం, అసెంచర్, ఐబీఎంల నుంచి 8 మందిని తన కంపెనీలోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇతరులను హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, జెన్సార్, టెక్ మహింద్రా, ఐటీసీ ఇన్ఫోటెల్ లనుంచి నియమించుకుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే ప్రత్యర్థి కంపెనీల నుంచి ఎగ్జిక్యూటివ్ ల తీసుకోవడంపై స్పందించడానికి ఇన్ఫోసిస్ నిరాకరించింది. కాగ, మరికొన్ని రోజుల్లో ఇన్ఫోసిస్ ఈ ఆర్థిక సంవత్సర తొలి క్వార్టర్ ఫలితాలను ప్రకటించనుంది.టెక్ దిగ్గజాలు ఒక కంపెనీ ఉద్యోగులను మరో కంపెనీలకి తీసుకోవడం సాధారణమే. కానీ హెచ్-1బీ వీసా నిబంధనలు కఠినతరం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ వీసాలపై ప్రతిభావంతులైన ఉద్యోగులనే తమదేశ కార్యాలయాల్లోకి తీసుకోవాలంటూ హెచ్చరికలు చేయడం కంపెనీ మరికొంత ఆక్రమణకు తెరతీసినట్టు తెలిసింది. గతేడాది ఇన్ఫోసిస్ అమెరికాలో 150 మంది టాప్-పెయిడ్ ఎగ్జిక్యూటివ్ లను నియమించుకుంటే, వారిలో సగానికి పైగా వ్యక్తులు ఇన్ఫోసిస్ ప్రత్యర్థి కంపెనీ వారేనని ఈటీ డేటాలో వెల్లడైంది. మరో రెండేళ్లలో ఇన్ఫోసిస్ అమెరికాలో 10వేల మందిని పైగా నియమించుకోనున్నట్టు పేర్కొంది. ఇన్ఫోసిస్ తో పాటు మిగతా కంపెనీలు కూడా స్థానిక ఉద్యోగులను భారీగా నియమించుకోనున్నట్టు ప్రకటించాయి. ప్రతిభావంతుల్ని దక్కించుకోవాలనే యుద్ధం కొత్తది కాదని, నైపుణ్యవంతుల కోసం తాము నిరంతరం పోటీపడుతూనే ఉంటామని ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావు చెప్పారు. ప్రస్తుతం ఆన్ షోర్ లో గతంలో కంటే ఎక్కువగా టాలెంట్ ఉన్న ఉద్యోగులు కావాలన్నారు. ప్రతి కంపెనీ ప్రస్తుతం నియామకాలు చేపడుతుందని, ఒకవేళ ఆన్ షోర్ లో మంచిగా పనితీరు కనబరిస్తే ఇదే వారికి మంచి సమయని ఓ ఇండియన్ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. అయితే తాము ప్రత్యర్థి కంపెనీల వైపు కాకుండా, క్యాంపస్ నియామకాల వైపు ఎక్కువగా మొగ్గుచూపినట్టు పేర్కొన్నారు. -
కాగ్నిజెంట్ చేతికి టీఎంజీ హెల్త్
న్యూఢిల్లీ: హెల్త్‌కేర్ సర్వీసెస్ కార్పొరేషన్ (హెచ్సీఎస్సీ) అనుబంధ కంపెనీ ‘టీఎంజీ హెల్త్’ను కొనుగోలు చేస్తున్నట్టు ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ తెలిపింది. 2017 మూడో త్రైమాసికంలో ఈ లావాదేవీ పూర్తవుతుందని... దీంతో ప్రభుత్వ, ప్రజారోగ్య విభాగాల్లో తమ సేవలు బలోపేతం అవుతాయని పేర్కొంది. ఎంత మొత్తానికి కొనుగోలు చేస్తుందీ కాగ్నిజెంట్ వెల్లడించలేదు. ఇదే సమయంలో హెచ్సీఎస్సీకి చెందిన పలు సబ్సిడరీ కంపెనీలకు ఐటీ, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ తదితర సేవలను అందించేందుకు టీఎంజీ హెల్త్ ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు వెల్లడించింది. -
ఉద్యోగులకు కాగ్నిజెంట్ గుడ్ న్యూస్
అమెరికా బహుళ జాతీయ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కాగ్నిజెంట్ లో భారీ ఉద్యోగాల కోత ఉండబోతుందంటూ, బలవంతంగా ఉద్యోగులపై వేటు వేస్తుందంటూ వస్తున్న రూమర్లను కంపెనీ యాజమాన్యం కొట్టిపారేసింది. ఈ విషయంపై నేడు కంపెనీ అధ్యక్షుడు రాజీవ్ మెహతా ఉద్యోగులకు లేఖ రాశారు. ఈ లేఖలో కాగ్నిజెంట్ ఎలాంటి లేఆఫ్స్ ప్రక్రియను కంపెనీ చేపట్ట లేదంటూ పేర్కొన్నారు. ''పరిశ్రమ ఉత్తమ పద్ధతులకు అనుగుణంగా ప్రతేడాది పర్ ఫార్మెన్స్ సమీక్ష చేపడతాం, గతేడాది పనితీరు ఎలా ఉందో తెలుసుకోవడం కోసమే ఈ ఏడాది కూడా రివ్యూలు చేపట్టాం. ఇది తర్వాతి సంవత్సరం లక్ష్యాలను నిర్దేశిస్తోంది'' అని రాజీవ్ మెహతా తెలిపారు. అయితే ఐటీ పరిశ్రమ వర్గాల నుంచి వస్తున్న సంకేతాల ప్రకారం భారత్ లో ఈ కంపెనీ 6వేల మంది ఉద్యోగులను తొలగించనుందని తెలిసింది. మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులకు కంపెనీ వాలంటరీ రిటైర్మెంట్ ప్రొగ్రామ్ కూడా ప్రకటించిందని రిపోర్టులు తెలిపాయి.అదేవిధంగా బలవంతంగా ఉద్యోగులను కాగ్నిజెంట్ ఇంటికి పంపించి వేస్తుందటూ కొంతమంది ఉద్యోగులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల మేరకు ఐటీ గ్రూప్ లు వివిధ రాష్ట్రాల్లో లేబర్ డిపార్ట్ మెంట్ ముందు తమ గోడును వెల్లబుచ్చుకున్నాయి. కానీ మార్కెట్లో వస్తున్న ఈ ఊహాగానాలన్నింటిన్నీ కాగ్నిజెంట్ మేనేజ్ మెంట్ కొట్టిపారేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని స్థానిక మార్కెట్లలో తాము నియామకాలు చేపడతామని పేర్కొంటోంది. చాలా ఏళ్ల నుంచి అమెరికాలో రిక్రూట్ మెంట్లు పెంచుతున్నట్టు కూడా తెలిపింది. తాము నియామకాలు చేపట్టబోయే దేశాల్లో భారత్ కూడా ఉందని లేఖలో రాజీవ్ మెహతా చెప్పారు. డేటా సైన్సు, బిగ్ డేటా, మిషన్ లెర్నింగ్, అడోబ్ స్టాక్ వంటి వాటిలో రీస్కిలింగ్ ప్రొగ్రామ్స్ ను ఉద్యోగులు చేపట్టాలని మెహతా సూచించారు. ప్రస్తుతం కాగ్నిజెంట్ కు ప్రపంచవ్యాప్తంగా 2,62,000 మంది ఉద్యోగులుండగా.. వారిలో 1,50,000పైగా మంది భారత్ లోనే ఉన్నారు. -
భారతీయ ఉద్యోగులకు కాగ్నిజెంట్ షాక్
చెన్నై : అమెరికా బహుళ జాతీయ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యుషన్స్ గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఉద్యోగులకు షాకిచ్చింది. ఈబీ2, ఈబీ3 మార్గాల్లో గ్రీన్ కార్డుల కోసం దరఖాస్తులను నింపడం లేదని కాగ్నిజెంట్ స్పష్టంచేసింది. తర్వాత నోటీసు వచ్చేంతవరకు ఈ ప్రక్రియ నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. ఈ రెండు కేటగిరీల్లో ప్రస్తుత దరఖాస్తుదారులకు మాత్రమే మద్దతు ఇస్తామని, కొత్త వాటిని సస్పెండ్ చేస్తామని పేర్కొంది. స్థానిక ఉద్యోగులను పెంచే ఉద్దేశ్యంతోనే కాగ్నిజెంట్ ఈ ప్రక్రియను నిలిపివేస్తుందని టెక్ విశ్లేషకులంటున్నారు. దీంతో భారతీయ ఉద్యోగులు గ్రీన్ కార్డులు పొందడం కష్టతరమేనని పేర్కొంటున్నారు. తమ వ్యూహాత్మక వ్యాపార లక్ష్యాల్లో భాగంగా దీర్ఘకాలిక లక్ష్యాలతో భాగమయ్యే అంతర్గత వ్యవహారాలను, ప్రయోజనాలను ఎప్పడికప్పుడూ అంచనావేస్తూ ఉంటున్నామని ఉద్యోగులకు పంపిన ఈ-మెయిల్స్ లో కాగ్నిజెంట్ స్పష్టంచేసింది. దీనిలో భాగంగానే తదుపరి నోటీసు వచ్చేంతవరకు గ్రీన్ కార్డు ఈబీ2, ఈబీ3 అప్లికేషన్స్ ను నింపడం లేదని పేర్కొంది. అసోసియేట్లకు శాశ్వత నివాసం కల్పించేందుకు ఓ ముఖ్యమైన స్పాన్సర్ గా కాగ్నిజెంట్ ఉంటుందని, భవిష్యత్తులో కూడా ఇదే కొనసాగుతుందని మరోవైపు నుంచి కంపెనీ చెబుతోంది. అయితే కాగ్నిజెంట్ ఈబీ2, ఈబీ3 అప్లికేషన్స్ ప్రక్రియను నిలిపివేయడం శాశ్వత నివాసం కోసం ఎదురుచూస్తున్న హెచ్-1బీ వీసా హోల్డర్స్ కు భారీ షాకేనని తెలుస్తోంది. అసాధారణమైన ప్రతిభ కనబర్చే సీనియర్ మేనేజ్ మెంట్ లేదా ప్రొఫిషినల్స్ కు గ్రీన్ కార్డు కోసం ఈబీ1 రూట్ వాడతారు. ఈబీ2, 3 వీసాలను ప్రతిభావంతులైన వర్కర్లు, ప్రొఫిషనల్స్ కు, మధ్య, దిగువ స్థాయి ఉద్యోగులకు వాడతారని డేవిస్ అండ్ అసోసియేట్స్ మేనేజింగ్ పార్టనర్ మార్క్ డేవిస్ తెలిపారు. ఇటీవల వెలువరించిన ఫలితాల్లోనే కాగ్నిజెంట్ హెచ్-1బీ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించనున్నట్టు పేర్కొంది. గతేడాది కంటే సగానికి తక్కువగా ఈ ఏడాది వీసాలను అప్లయ్ చేసింది. అమెరికా డెలివరీ సెంటర్లలో ఈ ఐటీ సంస్థ స్థానిక నియామకాలను పెంచింది. -
ఈ ఏడాది 1.5 లక్షల ఐటీ కొలువులు
♦ భారీ తొలగింపు వార్తలను ఖండించిన నాస్కామ్ ♦ ఐటీ రంగంలో కొనసాగాలంటే నైపుణ్యాలను పెంచుకోవాల్సిందే: చంద్రశేఖర్ న్యూఢిల్లీ: ఐటీ రంగంలో భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులంటూ వస్తున్న వార్తలను సాఫ్ట్వేర్ కంపెనీల అసోసియేషన్ (నాస్కామ్) తోసిపుచ్చింది. ఈ ఏడాది నికరంగా 1.5 లక్షల మందిని ఈ రంగం భర్తీ చేసుకోనుందని తెలిపింది. టెక్కీలు ఐటీ పరిశ్రమలో కొనసాగాలనుకుంటే మాత్రం తమ నైపుణ్యాలను మెరుగుదిద్దుకోవాల్సిందేనని సూచించింది. విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజంట్ తదితర కంపెనీలు ఈ ఏడాది 50,000 మందిని తొలగించనున్నట్టు ఇటీవల వార్తలు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ‘‘మేము ఈ వార్తలను చాలా స్పష్టంగా ఖండిస్తున్నాం. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంలో నికరంగా 1.7 లక్షల మంది ఉద్యోగాలు పొందారు. ఒక్క నాలుగో త్రైమాసికం (2017 జనవరి–మార్చి)లోనే నికరంగా 50,000ని టాప్ 5 కంపెనీలు నియమించుకున్నాయి’’ అని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్ చంద్రశేఖర్ గురువారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఈ సమావేశంలో విప్రో, కాగ్నిజంట్, మైండ్‌ట్రీ కంపెనీల ప్రతినిధులూ పాల్గొన్నారు. తమ సంఘంలో సభ్యులుగా ఉన్న వారిని సంప్రదించగా... ఈ ఏడాది నికరంగా 1.5 లక్షల మందిని నియమించుకోనున్నట్టు చెప్పారని ఆయన వెల్లడించారు. ఆటోమేషన్, రోబోటిక్స్, అనలైటిక్స్, సైబర్ సెక్యూరిటీ తరహా కొత్త టెక్నాలజీల వైపు ప్రపంచం అడుగులు వేస్తున్న క్రమంలో ఉద్యోగులు తిరిగి నూతన నైపుణ్యాలను సంతరించుకోవాలని లేకుంటే మనుగడ సాగించలేరని చంద్రశేఖర్ పేర్కొన్నారు. కొత్తగా 30 లక్షల ఉద్యోగాలు టెక్ స్టార్టప్‌లు, ఈకామర్స్, డిజిటల్ ఇండియా, డిజిటల్ పేమెంట్స్ వంటి కొత్త అవకాశాల నేపథ్యంలో 2025 నాటికి 30 లక్షల కొత్త ఉద్యోగావకాశాలు అందుబాటులోకి రానున్నట్టు అంచనా వేస్తున్నామని చంద్రశేఖర్ చెప్పారు. ఏటా పనితీరు మదింపు అనంతరం కొంత మంది ఉద్యోగులను తొలగించడం అన్నది ఐటీ పరిశ్రమలో సహజంగా జరిగే ప్రక్రియ. ‘‘ఈ ఏడాది కూడా ఈ కార్యక్రమం భిన్నంగా ఏమీ ఉండదు. పనితీరు ఆధారంగా ఉద్యోగుల్లో మార్పుల వల్ల 0.5% నుంచి 3% వరకు ఉద్యోగులపై ప్రభావం పడుతుంది’’ అని చంద్రశేఖర్ వివరించారు. ఉద్యోగులకు శిక్షణ, కొత్త టెక్నాలజీలపై నైపుణ్య సాధన కోసం కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని నాస్కామ్ చైర్మన్ రామన్‌రాయ్ వెల్లడించారు. -
ఐటీలో మరో రెండేళ్లు ఉద్యోగాల కోత
♦ కొత్త టెక్నాలజీలు...అమెరికా తదితర దేశాల విధానాల ప్రభావం ♦ మెరుగుదిద్దుకునేందుకు అవకాశమని నిపుణుల సూచన న్యూఢిల్లీ/బెంగళూరు: డిజిటలీకరణ, యాంత్రీకరణ (ఆటోమేషన్)కు తోడు అమెరికా తదితర దేశాల్లో ఉద్యోగ వీసా విధానాలు మారిన ఫలితంగా ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టెక్ మహింద్రా తదితర ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు జరుగుతోందని, ఈ ధోరణి మరో ఒకటి రెండేళ్ల పాటు కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు. ఏటా పనితీరు మదింపు ప్రక్రియలో భాగంగా వేలాది మందికి పింక్ స్లిప్‌లు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇది నాణేనికి ఒకవైపే. వాస్తవానికి పలు దేశాల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలన్న రక్షణాత్మక విధానాలు పెరిగిన క్రమంలో ఖర్చులను తగ్గించుకునే కార్యక్రమంలో భాగంగానే ఉద్యోగుల తొలగింపు జరుగుతోందన్న మరో వాదన కూడా వినిపిస్తోంది. వాస్తవానికి ఇటీవలి కాలంలో అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఉద్యోగుల వీసా నిబంధనలు కఠినతరం కావడంతో దేశీయ ఐటీ కంపెనీలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో సరికొత్త టెక్నాలజీలు అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్, క్లౌడ్ కంప్యూటింగ్ వాటివల్ల తక్కువ ఉద్యోగులతోనే ఎక్కువ పని సాధ్యమవుతోంది. దీంతో సాఫ్ట్వేర్ కంపెనీలు తమ విధానాలను తిరిగి సమీక్షించుకుంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మాన్యువల్ టెస్టింగ్, టెక్నాలజీ సపోర్ట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ఉద్యోగుల తొలగింపు ఎక్కువగా ఉంటోంది. ఈ పనులను ఆటోమేషన్ టెక్నాలజీలతో నిర్వహించే అవకాశం ఉండటమే అందుకు కారణం. అదే సమయంలో డేటాసైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ డొమెన్ నైపుణ్యాలకు డిమాండ్ పెరిగిన విషయాన్ని నిపుణులు గుర్తు చేస్తున్నారు. తొలగింపు సాధారణమే..: అందుబాటులో ఉన్న ఉద్యోగుల నైపుణ్యాలు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా లేవని, చాలా మంది తాము నిరుపయోగమని గుర్తిస్తున్నట్టు టీమ్‌లీజ్ సర్వీసెస్ ఈవీపీ, సహ వ్యవస్థాకులు రీతూపర్ణ చక్రవర్తి పేర్కొన్నారు. ‘‘కొత్త టెక్నాలజీలకు అనుగుణంగా ఉద్యోగుల క్రమబద్ధీకరణ అనేది పరిశ్రమలో ప్రతీ 3–5 ఏళ్లకు ఒకసారి జరిగేదే. కానీ, విదేశీ ఐటీ ఉద్యోగుల విషయంలో అమెరికా తన విధానాలు మార్చడంతో ఈ సారి ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది’’ అని గ్లోబల్‌హంట్ ఎండీ సునీల్ గోయెల్ అన్నారు. ఈ క్రమబద్ధీకరణ రెండేళ్ల పాటు కొనసాగొచ్చన్నారు. కానీ, కొత్త తరం టెక్నాలజీలకు అనుగుణంగా మెరుగుదిద్దుకునేందుకు ఐటీ నిపుణులకు ఇదొక అవకాశమని సూచించారు. ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, టెక్ మహింద్రా, విప్రో కంపెనీల్లోని 7,60,000 ఉద్యోగాల్లో 2–3% కోత ఉంటుందని జపాన్‌కు చెందిన బ్రోకరేజీ సంస్థ నోమురా పేర్కొన్నారు. -
టెక్ మహీంద్రాలో వెయ్యిమందికి ఉద్వాసన
బెంగళూరు: కీలకమైన మార్కెట్లలో మారుతున్న పరిణామాలతో.. సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్న దేశీ ఐటీ దిగ్గజాలు గణనీయంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ తదితర సంస్థల బాటలోనే తాజాగా సాఫ్ట్వేర్ సేవల సంస్థ టెక్ మహీంద్రా ఈ నెలలో సుమారు 1,000 మందికి ఉద్వాసన పలికింది. పనితీరు ఆశించినంతగా లేని సిబ్బందిని తప్పించే ప్రక్రియ ఏటా జరిగేదేనని, ప్రస్తుత తొలగింపులు కూడా ఆ కోవకి చెందినదేనని సంస్థ ప్రతినిధి తెలిపారు. గతేడాది డిసెంబర్ 31 నాటికి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,17,095గా ఉంది. సాఫ్ట్వేర్ విభాగంలో 80,895 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆటోమేషన్, కొంగొత్త టెక్నాలజీల రాక, ప్రధాన మార్కెట్లలో స్థానికులకే ఉద్యోగాలివ్వాలంటూ పెరుగుతున్న రక్షణాత్మక ధోరణులు మొదలైనవి భారత ఐటీ సంస్థలపై ఒత్తిడి పెంచుతున్నాయి. తాజా పరిస్థితులు సుమారు 10–15 సంవత్సరాల అనుభవం ఉన్న మధ్య స్థాయి సిబ్బందిపై ఎక్కువగా ప్రతికూల ప్రభావం చూపవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. వారు కొత్త నైపుణ్యాలు అలవర్చుకునేందుకు ఆసక్తి చూపకపోతుండటమే ఇందుకు కారణమని చెబుతున్నాయి. -
ట్రంప్ ఎఫెక్ట్: వారికి బంపర్ ఆఫర్
ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ అమెరికాలో తన ఉద్యోగులు సంఖ్యను దాదాపు రెట్టింపు చేయనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా హెచ్1బీ వీసా కఠిన నిబంధనల నేపథ్యంలో కాగ్నిజెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికాలో స్థానికంగా 8000 మంది ఉద్యోగులను నియమించుకునే అవకాశం ఉందని మార్కెట్ వర్గాల సమాచారం. అలాగే మరో ఏడు సెంటర్లను కొత్తగా ఏర్పాటు చేయనుందట. ముఖ్యంగా బై అమెరికన్, హైర్ అమెరికన్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రకారం స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పించాల్సిన అనివార్య పరిస్థితుల్లోకి ఐటీ కంపెనీలకు జారుకుంటున్నాయి. ఈ క్రమంలో ఐటీ దిగ్గజం ఇన్ఫీ బాటలోనే కాగ్నిజెంట్ కూడా పయనిస్తున్నట్టు కనిపిస్తోంది. కాగ్నిజెంట్ 2017సం.రంలో అమెరికాలో ఎనిమిదివేల మందిని కొత్తగా నియమించుకోనుంది. 2016 అమెరికాలో నాలుగువేలమంది ఐటి ఉద్యోగులను నియమించుకుంది. ప్రస్తుత 20 కేంద్రాలకు తోడు యూఎస్‌లో మరో ఏడు డెలివరీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనుంది. మరోవైపు అమెరికాలో ఉంటున్న సుమారు పదివేల మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని మరో ఐటీ దిగ్గజం ఇన్పోసిస్ నిర్ణయం తీసుకొంది. రానున్న రెండేళ్లలో 10 వేల మందిని రిక్రూట్ చేసుకోనున్నట్టు ఇన్ఫీ ప్రకటించిన సంగతి విదితమే. -
ఇన్ఫోసిస్లోనూ ఉద్యోగాల కోత!!
⇔ పనితీరు ఆధారంగానే ఉంటుంది ⇔ ఇది ఏటా రొటీన్‌గా జరిగేదే: ప్రతినిధి ⇔ అమెరికన్లకు ఉద్యోగాలివ్వటమే కారణమా? బెంగళూరు: ఉద్యోగులను ఇంటికి పంపే విషయంలో ఐటీ దిగ్గజాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. కాగ్నిజెంట్, విప్రో బాటలోనే ఇప్పుడు ఇన్ఫోసిస్ కూడా పయనిస్తోంది. దీంతో 2008–10 నాటి డౌన్‌ట్రెండ్ కనిపిస్తోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ఫోసిస్‌లో మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగాల్లో కోత ఉండొచ్చని, ఇది వందల సంఖ్యలో ఉండవచ్చని విశ్వసనీయంగా తెలిసింది. నిజానికి ఇన్ఫోసిస్ ఇటీవలే ఒక ప్రకటన చేస్తూ... వచ్చే రెండేళ్లలో 10,000 మంది అమెరికన్లను ఉద్యోగాల్లోకి తీసుకుంటామని, అమెరికాలో మరో నాలుగు కేంద్రాలను కూడా ఆరంభిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉండే మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులను కొందరిని ఇంటికి పంపే అవకాశం ఉందని ఆ కంపెనీ వర్గాలు ధ్రువీకరించాయి. పనితీరు ఆధారంగానే చర్యలు ‘‘ఉద్యోగుల పనితీరును మేనేజ్ చేసే ప్రక్రియ మా దగ్గర కొనసాగుతూనే ఉంటుంది. దీనివల్ల రెండేళ్ల కోసారి పూర్తిస్థాయిలో వారి పనితీరుపై ఒక అంచనాకు వచ్చే వీలుంటుంది. అదేపనిగా నాసిరకం పనితీరుతో కొనసాగే వారి విషయంలో కొన్ని క్రమశిక్షణ చర్యలు తప్పవు. ఈ చర్యల్లో కొందరి ఉద్యోగాలు కూడా పోవొచ్చు. కాకపోతే ఈ చర్యలనేవి వారి గురించిన పూర్తి ఫీడ్‌బ్యాక్ తరవాతే ఉంటాయి’’ అని ఇన్ఫోసిస్ ప్రతినిధి ఒకరు చెప్పారు. తన పేరు వెల్లడి కావటానికి మాత్రం ఆయన ఇష్టపడలేదు. ‘‘ప్రతి ఏటా మేం దీన్ని చేస్తూనే ఉంటాం. కాకపోతే ప్రతిసారీ ఈ సంఖ్య మారుతూనే ఉంటుంది’’ అని చెప్పారాయన. పనితీరు ఆధారంగా విప్రో కూడా 600 మందికి ఉద్వాసన పలికినట్లు ఇటీవలే వార్తలు వెలువడ్డాయి. కాకపోతే ఈ సంస్థ 2వేల వరకూ ఉండొచ్చని అనధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఐటీయే అతిపెద్ద ఉద్యోగ వనరు! దేశంలో ఐటీ కంపెనీలే అత్యధిక ఉద్యోగుల్ని తీసుకుంటున్నాయి. అయితే ఆటోమేషన్ ప్రక్రియ పెరిగిపోతూ ఉండటం వల్ల పలు స్థాయిల్లో ఉద్యోగాల కోత ఉండొచ్చని కొన్నాళ్లుగా అవి హెచ్చరిస్తూనే ఉన్నాయి. మరో సమస్యేమిటంటే... భారత ఐటీ రంగం 140 బిలియన్ డాలర్లకు చేరటానికి ప్రధానంగా దోహదపడింది ఔట్‌సోర్సింగే. కాకపోతే పలు దేశాల్లో దీనిపై ఆందోళనలు రేగుతున్నాయి. ఔట్‌సోర్సింగ్‌కు స్వస్థి చెప్పి స్థానికులకే ఉద్యోగాలివ్వాలని అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో డిమాండ్లు రేగుతున్నాయి. ఈ నేపథ్యంలనే భారత కంపెనీలు అమెరికాలో అక్కడి వారికే ఉద్యోగాలిచ్చే దిశగా అడుగులు వేస్తున్నాయి. దీనివల్ల వాటి లాభాలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశమున్నా... ఆయా దేశాల్లోని పాలసీలకు అనుగుణంగా ఇవి సిద్ధమవుతున్నాయి. -
కాగ్నిజెంట్‌పై పోరుకు సై అన్న ఉద్యోగులు
చెన్నై: భారీగా ఉద్యోగుల తొలగింపులపై ఐటీ ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా ప్రముఖ ఐటీసేవల సంస్థ కాగ్నిజెంట్ సీనియర్ స్థాయి టెకీలపై వేటు వేస్తున్న నేపథ్యంలో రెండు గ్రూపులు తమిళనాడు ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి. ఫోరమ్ ఆఫ్ ఐటి ఎంప్లాయీస్ (ఫైట్), ఎన్డీఎల్ఎఫ్ ఐటి ఉద్యోగుల వింగ్ ఈ తొలగింపులకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశాయి. పెర్ఫామెన్స్ఆధారంగా కాగ్నిజెంట్ ఉద్యోగులపై వేటు వేస్తున్న ధోరణినుంచి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ప్రయోజనాలను కాపాడాలంటూ రాష్ట్ర కార్మికశాఖ వద్ద ఈ పిటిషన్ దాఖలు చేశాయి. అయితే పెర్ఫామెన్స్ ఆధారంగా ఉద్యోగులను తొలగిస్తున్నారన్న ఆరోపణలను కాగ్నిజెంట్ తిరస్కరించింది. తక్కువ నైపుణ్య ప్రదర్శన కారణంగా ఉద్యోగులే కొంతమంది సంస్థను వీడుతున్నట్టు ప్రకటించింది. "కాగ్నిజెంట్ ఏ తొలగింపులను నిర్వహించలేదు. ప్రతి సంవత్సరం, మా పరిశ్రమ అంతటా ఉత్తమ సాధనంగా, మేము క్లయింట్ అవసరాలను తీర్చడానికి , మా వ్యాపార లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఉద్యోగి నైపుణ్యం ఉన్నట్లు నిర్ధారించడానికి మేము ఒక సమీక్షను నిర్వహిస్తాం. ఈ ప్రక్రియ కంపెనీల నుంచి మార్పు చెందుతున్న కొంతమంది ఉద్యోగులతో సహా మార్పులకు దారితీస్తుంది "అని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. న్యూ డెమోక్రటిక్ లేబర్ ఫ్రంట్ (ఎన్డీఎల్ఎఫ్) కు అనుబంధంగా పనిచేస్తున్న ఎన్డీఎల్ఎఫ్ ఐటి ఎంప్లాయీస్ వింగ్, ఇతర రాష్ట్రాల్లో యూనియన్లను స్థాపించాలని భావిస్తున్నట్టు తెలిపారు. వివిధ కంపెనీల నుంచి దాదాపు 100 ఫిర్యాదులు అందుతున్నాయని ఆరోపించింది. ఉద్యోగుల అక్రమ తొలగింపులపై ఆయా రాష్ట్రాల కార్మిక శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. తమ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి రాష్ట్రంలో యూనియన్ను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నామని అని యూనియన్‌కు చెందిన కుమార్ ఎస్ అన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో ఎన్డిఎల్ఎఫ్ ఐటి ఉద్యోగుల విభాగం ఉందని కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణాలకు విస్తరణ ప్రణాళికలతో ఉన్నట్టు చెప్పారు. -
ఇన్ఫీ బాటలోనే మరో టెక్ దిగ్గజం
ట్రంప్ దెబ్బకు టెక్ దిగ్గజాలన్నీ స్థానిక ఉద్యోగాల కల్పనకు తెరతీస్తున్నాయి. ఇటీవలే అమెరికాలోని ఐటీ కంపెనీలో 10వేల ఉద్యోగాలు కల్పిస్తామని టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. వీసా నిబంధనలను కఠినతరం చేసిన అమెరికాను ప్రసన్నం చేసుకునేందుకు ఈ టెక్ దిగ్గజం ఈ ప్రకటన చేసినట్టు ఓ వైపు నుంచి వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా ఇన్ఫీ బాటలోనే నడుస్తోంది. అంచనావేసిన దానికంటే మెరుగైన ఫలితాలను ప్రకటించిన కాగ్నిజెంట్, అమెరికాలో నియామకాల ప్రక్రియను పెంచనున్నట్టు ప్రకటించింది. ఈ కంపెనీకి 75 శాతానికి పైగా రెవెన్యూలు నార్త్ అమెరికా నుంచే వస్తున్నాయి. అయితే క్లయింట్స్ కు సర్వీసులు అందించడానికి ఎక్కువగా హెచ్-1బీ వీసాలపై ఆధారపడే ఈ కంపెనీ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. సుమారు 2,60,000 ఉద్యోగాలు భారత్ కు చెందినవారే ఉన్నారు. అమెరికా వీసా ప్రొగ్రామ్ ను కఠినతరం చేస్తూ ట్రంప్ ఆదేశాలు జారీచేయడంతో, ఇక టెక్నాలజీ సంస్థలు, అవుట్ సోర్సింగ్ కంపెనీలన్నీ స్థానిక ఉద్యోగాల కల్పన బాట పట్టాయి. డెలివరీ సెంటర్లను పెంచడం ద్వారా, హెచ్-1బీ వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించడం ద్వారా ఎక్కువగా అమెరికాలో నియామకాలు చేపట్టాలని కాగ్నిజెంట్ ప్లాన్ వేస్తోందని ప్రెసిడెంట్ రాజీవ్ మెహతా అనాలిస్టులకు చెప్పారు. గతేడాది కంటే సగం శాతం వీసాలను అప్లయ్ చేయడం తగ్గించామని, ఈ తగ్గింపును మరింత చేపడతామని ఆయన చెప్పారు. వీసాలపై ఆధారపడటాన్ని తగ్గించి, లోకల్ గా నియామకాలను చేపడతామన్నారు. గతేడాదే ఈ కంపెనీ అమెరికాలో 4వేల మంది ఉద్యోగులను నియమించుకుంది. కాగ్నిజెంట్, ఇన్ఫీలు మాత్రమే కాక, ఇటు విప్రో లిమిటెడ్ కూడా అమెరికాలో ఎక్కువమంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది. ఈ ఏడాది భారత్ కు చెందిన ఈ టెక్ దిగ్గజాలు తమ హెచ్-1బీ అప్లికేషన్లను తగ్గించేశాయి. -
కాగ్నిజెంట్‌లో స్వచ్ఛంద విరమణ ఆఫర్
న్యూఢిల్లీ: ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ స్వచ్ఛందంగా వైదొలగాలనుకునే కొందరు పైస్థాయి ఉద్యోగులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. దీని ప్రకారం హోదాను బట్టి ‘వాలంటరీ సెపరేషన్ ఇన్సెంటివ్’ కింద తొమ్మిది నెలల దాకా జీతాన్ని పరిహారంగా చెల్లించనుంది. సీనియర్ వైస్‌ప్రెసిడెంట్ స్థాయి ఉద్యోగులు ఆరు నెలలు, డైరెక్టర్స్ తొమ్మిది నెలల జీతం పరిహారంగా పుచ్చుకుని కంపెనీ నుంచి తప్పుకునే ఆప్షన్ ఇచ్చింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నుంచి డైరెక్టర్ స్థాయి దాకా ఉన్న మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగులకు ఈ స్వచ్ఛంద ఆఫర్ ఇస్తున్నట్లు, అర్హతను బట్టి కంపెనీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందని కాగ్నిజెంట్ ప్రతినిధి తెలిపారు. ఎంత మంది ఉద్యోగులకు ఇది వర్తించవచ్చు, ఆఫర్ వివరాలు మొదలైనవి వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. స్వచ్ఛందంగా వైదొలగాలనుకుంటున్న ఎగ్జిక్యూటివ్స్ మే 12లోగా తమ నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉంటుందని, తదుపరి కంపెనీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగ్నిజెంట్‌లోని సుమారు 2.6 లక్షల మంది ఉద్యోగుల్లో సింహభాగం భారత్‌లోనే ఉన్నారు. అత్యుత్తమ ఆర్థిక పనితీరుతో ముందుకెళ్లిన సంస్థ వృద్ధి గత కొన్నాళ్లుగా మందగిస్తోంది. గత సంవత్సరం వృద్ధి అంచనాలను మూడు సార్లు సవరించిన కాగ్నిజెంట్ ఆదాయాలు 8.6 శాతం వృద్ధితో 13.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే, 2017 సంవత్సరానికి గాను ఆదాయం 14.5–14.84 బిలియన్ డాలర్లుగా ఉండగలదని కాగ్నిజెంట్ గైడెన్స్ ఇచ్చింది. జనరల్ మోటార్స్‌లోనూ..: మరోవైపు జనరల్ మోటార్స్ ఇండియా సైతం హలోల్ ప్లాంట్‌లోని ఉద్యోగులకు తాజాగా మళ్లీ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) ఆఫర్ పరిశీలిస్తోంది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేయడం దీనికి కారణం. -
9నెలల జీతంతో ఇంటికి పంపిస్తున్న ఐటీ సంస్థ
కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలో ఉద్యోగులపై వేటు వేయనుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది భారీ సంఖ్యలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించాలని ప్రయత్నిస్తున్న కాగ్నిజెంట్ తాజాగా మరో ఈ చర్యకు శ్రీకారం చుట్టింది. నష్టపరిహార చెల్లింపుతో కూడిన వాలెంటరీ సెపరేషన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. కంపెనీ డిజిటల్ టెక్నాలజీ వైపు వేగంగా కదులుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా టాప్ లెవల్ ఉద్యోగులను వదిలించుకునేందుకు స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని అమలు చేస్తోంది. అంతేకాదు రెండవ త్రైమాసిక చివరి నాటికి ఈ ప్రక్రియ ముగించాలని ఆశిస్తోంది. నాస్డాక్ లిస్టెడ్ కంపెనీ ఈ వార్తలను ధృవీకరించింది. డిజిటల్ మార్పులు, అధిక నాణ్యత, స్థిరమైన వృద్ధిని సాధించే వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయమని తెలిపింది. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఉన్నత స్థాయి అధికారులకు, బోర్డు సభ్యులు, వైస్-ప్రెసిడెంట్లు ఇందులో ఉన్నారని వెల్లడించింది. ఇది వారి ర్యాంక్‌ల ఆధారంగా ఉండనుందని కంపెనీ వర్గాలు ప్రకటించాయి. ఇందులో భాగంగా రిజైన్ చేసిన ఉద్యోగులకు కనీసం తొమ్మిదినెలల జీతాన్ని పరిహారంగా చెల్లించనుంది. దాదాపు మూడు నెలల నుంచీ చర్చలు జరుగుతున్నాయన్నారు. కనీసం 40 లక్షల రూపాయల జీతాన్ని అందుకునే ఉద్యోగులు ఈ పథకం కిందికి వస్తారని చెప్పాయి. పరిహారంపై అధికార ప్రతినిధి మాట్లాడుతూ, ప్రోత్సాహక వివరాలు వెల్లడించలేదు కానీ, కంపెనీని వదిలివేయడానికి ఎంచుకునేవారికి ఇది మంచి ,అనుకూలమైన అనుభవాన్ని అందిస్తుందని తాము నమ్ముతున్నామన్నారు. ఏది ఏమైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా కంపెనీ కార్యకలాపాల విస్తరణ కొనసాగుతుందని, తన ఖాతాదారులకు మరిన్ని మెరుగైన సేవలను అందించడానికి నిపుణులైన ఉద్యోగుల ఎంపిక కూడా కొనసాగుతుందని స్పష్టం చేసింది. -
కాగ్నిజెంట్‌లో భారీగా ఉద్యోగాల కోత!
6,000 మందికి ఉద్వాసన పలికే అవకాశం బెంగళూరు: వ్యాపార పరంగా అనుకున్న లక్ష్యాలను సాధించడంలో తడబడుతున్న ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ ఏకంగా 6,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో ఇది 2.3 శాతం. ఉద్యోగుల పనితీరు ఆధారంగా చెల్లించే వేరియబుల్ పే అవుట్‌పైనా గణనీయమైన ప్రభావం పడినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఏటా మార్చిలో ముగిసే వార్షిక పనితీరు మదింపు కార్యక్రమంలో భాగంగా పనితీరు ఆశాజనకంగా లేని దిగువ స్థాయిలో ఉన్న ఒక శాతం ఉద్యోగులను తొలగించడం సాధారణంగా జరిగే ప్రక్రియ అని... ఈ ఏడాది ఇంతకంటే ఎక్కువ మందినే ఉద్యోగాల నుంచి తప్పించే అవకాశం ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. గతేడాది ఉద్యోగుల తొలగింపు 1–2 శాతం మధ్యలో ఉండగా, రెండేళ్ల క్రితం మాత్రం కేవలం ఒక శాతంగానే ఉంది. కాగ్నిజెంట్‌కు 2016 డిసెంబర్ 31 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు 2,60,200. వీరిలో 72 శాతం అంటే 1,88,000 మంది బారత్‌లో పనిచేస్తున్న వారే. అయితే, దేశీయంగా ఎంత మంది ఉద్యోగులను తొలగించేదీ, ఏ ఉద్యోగాలపై దీని ప్రభావం ఉంటుందన్న దానిపై ప్రస్తుతానికైతే స్పష్టత రాలేదు. అయితే, ఆటోమేషన్ కారణంగా అవసరం లేని దిగువ స్థాయి ఉద్యోగులను తొలగించనున్నట్టు కాగ్నిజెంట్ స్పష్టం చేసింది. ‘‘క్లయింట్ల అవసరాలకు, మా వ్యాపార లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యోగుల్లో సరైన నైపుణ్యాలు ఉండేలా చూసేందుకు క్రమం తప్పకుండా పనితీరును సమీక్షిస్తుంటాం. దీనివల్ల కొంత మంది ఉద్యోగులు కంపెనీని వీడాల్సి రావచ్చు’’ అని కాగ్నిజెంట్ ప్రతినిధి స్పష్టం చేశారు. కాగ్నిజెంట్ ఏటా రెండంకెల వృద్ధిని సాధిస్తుండగా, గతేడాది మాత్రం ఇది 8.6 శాతానికే పరిమితమైంది. -
6000 మందిని తీసేస్తున్న కాగ్నిజెంట్
బెంగళూరు: ఆటోమేషన్ ప్రభావం ఐటీ కంపెనీల్లో ఉద్యోగులకు భారీగా షాకిస్తోంది. ఐటీ కంపెనీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. తాజాగా అమెరికా టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ 6000 మందికి గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. అంటే మొత్తం వర్క్ ఫోర్స్ లో 2.3శాతం మందిని కంపెనీ తీసేస్తోంది. కొత్త డిజిటల్ సర్వీసులోకి మరలే క్రమంలో ఐటీ ఇండస్ట్రి ఎదుర్కొంటున్న సంక్షోభంతో కంపెనీలు ఉద్యోగులకు గుడ్ బై చెబుతున్నాయి.. ఈ నేపథ్యంలోనే కాగ్నిజెంట్ కూడా ఈ ఏడాది రెగ్యులర్ అప్రైజల్ సైకిల్ లో భాగంగా 6000 మందిని తొలగిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. కాగ్నిజెంట్ ఉద్యోగులకు ఇది చాలా క్లిష్టమైన సమయమని, ఉద్యోగులు తమకు తాముగా రీస్కిల్ చేసుకోలేని పక్షంలో కంపెనీలో కొనసాగడం కష్టతరమని పేర్కొన్నాయి. కాగ్నిజెంట్ కు గ్లోబల్ గా 2,65,000 మంది ఉద్యోగులుండగా... వారిలో 1,88,000 మంది భారత్ లో ఉన్నారు. గతేడాది కూడా కాగ్నిజెంట్ తమ వర్క్ ఫోర్స్ లో 1-2 శాతం తగ్గించుకుంది. అయితే ప్రస్తుతం ఎంతమందిని తీసేస్తున్నట్టో కంపెనీ స్పష్టంచేయనప్పటికీ, సంబంధిత వర్గాల ప్రకారం 6000 మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్ లు ఖాయమంటూ వెల్లడవుతోంది. తమ వర్క్ ఫోర్స్ మేనేజ్ మెంట్ స్ట్రాటజీలో ఎప్పటికప్పుడూ ఉద్యోగుల పనితీరుపై సమీక్షలు జరుగుతూ ఉంటాయని, క్లయింట్ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని, వ్యాపార లక్ష్యాలను సాధించాల్సి ఉంటుందని కాగ్నిజెంట్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా కంపెనీ ఏ చర్య తీసుకున్నా... అది పనితీరు ప్రకారమే ఉంటుందని చెప్పారు. -
కాగ్నిజెంట్ చేతికి జపాన్ సంస్థ
అమెరికాకు చెందిన ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ జపాన్ సంస్థను విలీనం చేసుకుంది. జపనీస్ కంపెనీ బ్రిలియంట్ సర్వీసెస్ ను కొనుగోలు చేసినట్టు కాగ్నిజెంట్ వెల్లడించింది. ఈ విలీనంలో భాగంగా బ్రిలియంట్కు చెందిన డిజిటల్ సొల్యూషన్స్‌లో అపార అనుభవమున్న 70మంది నిపుణుల బృందం కాగ్నిజెంట్‌లో చేరుతున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే కొనుగోలు మొత్తాన్ని మాత్రం వెల్లడించలేదు. 2004 లో స్థాపించబడిన బ్రిలియంట్ ఒసాకా ప్రధానకేంద్రంగా తన సేవలను అందిస్తోంది. ముఖ్యంగా డిజిటల్ స్ట్రాటజీ, ప్రొడక్ట్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ ఐఓటీ (థింగ్స్ ఇంటర్నెట్) ప్రత్యేకతలను కలిగి ఉంది. జపాన్ లోని ప్రధాన సంస్థలకు ఎండ్ టు ఎండ్ ఆండ్రాయిడ్ /ఐఓఎస్ అప్లికేషన్లు, ఎంబెడెడ్ సాఫ్ట్వేర్, వినియోగదారుకు అనుభవ రూపకల్పన మరియు ఆన్లైన్ టు ఆఫ్ లైన్ సేవలను అందిస్తుంది. కస్టమర్లు, టెక్నాలజీ డిమాండ్లకనుగుణంగా మరిన్న స్మార్ట్ సేవలను, ఉత్పత్తులను రూపొందించనున్నామని కాగ్నిజెంట్ ఆసియా-పసిఫిక్ హెడ్ జయజ్యోతి సేన్ గుప్తా చెప్పారు.ఈ విలీనంతో తమ సామర్థ్యాలను మరింత విస్తరించుకోని, వినియోగదారులు మెరుగైన సేవలను అందించనున్నామని బ్రిలియంట్ సీఈవో యోషిహికో సుగిమోటో తెలిపారు. కాగా జపాన్ లో కాగ్నిజెంట్ టోక్యో, ఒసాకాల్లో రెండు కార్యాలయాలతో సుమారు 400 మంది సిబ్బందితో ఐటీ సేవలను అందిస్తోంది. అయితే జపాన్ మార్కెట్ లో భారతీయ కంపెనీల 2 శాతం కస్టమర్లు, టెక్నాలజీ డిమాండ్లకనుగుణంగా మరిన్న స్మార్ట్ సేవలను, ఉత్పత్తులను రూపొందించనున్నామని కాగ్నిజెంట్ ఆసియా-పసిఫిక్ హెడ్ జయజ్యోతి సేన్ గుప్తా చెప్పారు. ఆదాయంతో పోలిస్తే కాగ్నిజెంట్ ఆదాయం తక్కువే. -
ఒత్తిళ్లకు తలొగ్గిన ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్
బెంగళూరు : ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యుషన్ కార్ప్ తన కంపెనీలోకి కొత్త డైరెక్టర్లను నియమించుకుంది. తన ప్రధాన పెట్టుబడిదారి ఇరియట్ మేనేజ్మెంట్ ఒత్తిళ్లకు తలొగ్గి ముగ్గురు కొత్త డైరెక్టర్లను నియమించుకునేందుకు సమ్మతించింది. అంతేకాక ఇన్వెస్టర్లకు 3.4 బిలియన్ డాలర్ల(రూ.22831కోట్లు)ను రిటర్న్ ఇవ్వనున్నట్టు పేర్కొంది. నవంబర్‌లో ఇలియట్కు 4 శాతం కంటే ఎక్కువ స్టాక్ ఉంది. షేర్‌హోల్డర్ విలువను పెంచడానికి ఈ ఐటీ సర్వీసు ప్రొవైడర్ మరింత సహకరించాలని ఇలియట్ ఎప్పటినుంచో వాదిస్తోంది. ఈ మేరకు ఒత్తిళ్లకు తలొగ్గిన కంపెనీ బోర్డు వచ్చే రెండేళ్లలో షేర్హోల్డర్స్కు రూ. 22,831 కోట్లకు పైగా కేటాయించే ప్లాన్‌ను బుధవారం ఆమోదించింది. షేర్ల బై బ్యాక్, డివిడెంట్ రూపంలో ఈ మొత్తాన్ని ఐటీ దిగ్గజం షేర్ హోల్డర్స్‌కు కేటాయించనుంది. 2017-18 ఆర్థికసంవత్సరంలో తొలి క్వార్టర్లో 1.5 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను, రెండో క్వార్టర్లో 1.2 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను పునః కొనుగోలు చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. -
కాగ్నిజెంట్ చేతికి ఆస్ట్రేలియా కంపెనీ
చెన్నై: ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్... ఆస్త్రేలియాకు చెందిన కన్సల్టింగ్, బిజినెస్ ట్రాన్స్ఫార్మేషన్ సర్వీసులందించే అడప్‌ట్ర సంస్థను కొనుగోలు చేసింది. డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలు వెల్లడికాలేదు. ఈకంపెనీ కొనుగోలుతో తమ బీమా వ్యాపార విభాగం మరింత శక్తివంతం కానున్నదని కాగ్నిజెంట్ వెల్లడించింది. కంపెనీ కొనుగోలులో భాగంగా అడప్‌ట్ర సంస్థకు చెందిన వంద మంది ఉద్యోగులు తమ సంస్థలో చేరతారని కాగ్నిజెంట్ హెడ్ (ఏషియా పసిఫిక్) జయజ్యోతి సేన్‌గుప్తా చెప్పారు. కొత్త వృద్ధి అవకాశాలు.. కాగ్నిజెంట్ కొనుగోలుతో కొత్త వృద్ది అవకాశాలు అందిపుచ్చుకోగలమని అడప్‌ట్ర ఎండీ పీటర్ ఓవర్టన్ పేర్కొన్నారు. కాగ్ని జెంట్ అంతర్జాతీయ అనుభవం, విస్తృతమైన డిజిటల్ శక్తి సామర్థ్యాల కారణంగా తాముభవిష్యత్తులో మరింత మెరుగైన సేవలందించగలమని వివరించారు. కాగ్నిజెంట్ టెక్నాలజీస్‌కు ప్రపంచవ్యాప్తంగా వంద డెవలప్మెంట్ సెంటర్లున్నాయి. 2.25 లక్షలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా సిడ్నికేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అడప్‌ట్ర 1998లో ప్రారంభమైంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో అగ్రస్థాయి 10 బీమా కంపెనీల్లో ఐదింటికి తన సేవలనందిస్తోంది.