![Former Cognizant Ceo Brian Humphries Was Involuntarily Terminated - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/26/Brian%20Humphries.jpg.webp?itok=ZlX6Z3b0)
బ్రియాన్ హంఫ్రీస్‌ను సీఈవో పదవి నుంచి తొలగించినట్లు అమెరికాకు చెందిన ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ కాగ్నిజెంట్ ప్రకటించింది. స్టాక్ ఎక్సేంజీ ఫైల్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించిన కంపెనీ.. హంఫ్రీన్ తొలగింపుకు గల స్పష్టమైన కారణాలు వెల్లడించలేదు.
ఈ ఏడాది కాగ్నిజెంట్ బోర్డ్ సభ్యులు సంస్థ వేగంగా పురోగమించడం, వ్యాపార కార్యకలాపాల్ని వేగవంతం చేయడం, ఆదాయ వృద్ధి వంటి అంశాలపై దృష్టిసారించింది. కాబట్టే సీఈవో పదవీ బాధ్యతల్లో మార్పులు అవసరమని తాము విశ్వసిస్తున్నట్లు ఆ సంస్థ బోర్డ్ ఛైర్మన్ స్టీఫెన్ జె రోహ్లెడర్ తెలిపారు. సీఈవో పదవి నుంచి తొలగించడంతో జనవరి 12 నుంచి మార్చి 15 వరకు కాంగ్నిజెంట్‌లో సలహాదారులుగా పనిశారు. హంఫ్రీస్ సీఈవో పదవి నుంచి తొలగించడంతో ఆయన స్థానాన్ని భారత్‌కు చెందిన టెక్ జెయింట్ ఇన్ఫోసిస్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేసిన రవికుమార్ భర్తీ చేసిన విషయం తెలిసిందే.
తొలగింపులకు కారణాలు
హంఫ్రిస్‌ను ఫైర్ చేయడానికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆదాయం పడిపోవడం, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌లు సంస్థను విడిచిపెట్టడం, వార్షిక ప్రాతిపదికన అట్రిషన్ రేటు పెరిగిపోవడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి.
తగ్గిన పరిహారం
సీఈవోగా బాధ్యతలు నిర్వహించే సమయంలో హంఫ్రీస్‌కు చెల్లించే పరిహారం భారీగా తగ్గినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. 2021తో పోలిస్తే 2022లో హంఫ్రీస్ పరిహారం 9 శాతం తగ్గిందని ప్రకటన హైలైట్ చేసింది. నాన్ ఈక్విటీ ఆధారిత ప్రోత్సాహకాలు సైతం 4 మిలియన్ల నుండి 1.7 మిలియన్లకు తగ్గాయి.
చదవండి👉 భారత్‌లో తయారైన ఆ దగ్గుమందు కలుషితం.. డబ్ల్యూహెచ్‌ఓ హెచ్చరికలు జారీ
Comments
Please login to add a commentAdd a comment