ravi kumar
-
సీనియర్ నటుడు మృతి.. రాధిక పోస్ట్ వైరల్
తమిళ, మలయాళ సినిమాల్లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రవి కుమార్ (71) చనిపోయారు. గతకొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన.. చెన్నై వళచెరిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని రవికుమార్ కొడుకు ధ్రువీకరించాడు. నటి రాధిక కూడా రవికుమార్ మృతిపై పోస్ట్ పెట్టింది. (ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 18 మూవీస్)కేరళ త్రిసూర్ కి చెందిన రవికుమార్.. 1975 నుంచి సినిమాలు చేస్తున్నారు. ఉల్లాస యాత్ర, అవరగళ్, సీబీఐ 5, పరమానందం తదితర మలయాళ చిత్రాలు చేశారు. తమిళంలోనూ అల్లాఉద్దీన్ అద్భుత విళక్కుమ్, రమణ, ఆనంద రాగం తదితర సినిమాలు చేశారు. చివరగా 2022లో వీట్ల విశేషమ్ మూవీలో నటించారు.(ఇదీ చదవండి: దర్శకుడు బుచ్చిబాబుకు గిఫ్ట్ పంపిన రామ్ చరణ్) View this post on Instagram A post shared by Radikaa Sarathkumar (@radikaasarathkumar) -
విశాఖలో దళిత మహిళపై టీడీపీ నేత పెబ్బిలి రవికుమార్ కీచకపర్వం
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. రవికుమార్ దాచిన హార్డ్ డిస్క్‌లు స్వాధీనం!
హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబీకి టెక్నికల్ సపోర్ట్ అందించిన ఇన్నోవేషన్ ల్యాబ్, ఆ సంస్థ చైర్మన్ రవికుమార్ ఇంటి నుంచి హార్డ్ డిస్క్‌లను సిట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ చైర్మన్ రవికుమార్‌కు చెందిన బెంగళూరు, హైదరాబాద్ ఇళ్లలో.. ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించారు. ఇన్నోవేషన్ ల్యాబ్ ఆఫీసుల నుంచి మూడు సర్వర్లు, ఐదు మినీ డివైజ్‌లు, హార్డ్ డిస్క్‌లను తమ వెంట తీసుకెళ్లారు. ఆ సమయంలో ల్యాబ్ ప్రతినిధుల స్టేట్మెంట్లను సైతం సిట్ రికార్డు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు రవికుమార్ ఇంట్లో దాచిన హార్డ్ డిస్క్‌లను సైతం సిట్ సేకరించినట్లు తెలుస్తోంది. ఇక.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితుడు ప్రణీత్ రావు ఈ ల్యాబ్ సహకారమే తీసుకున్నట్లు ఇదివరకే నిర్ధారణ అయ్యింది. అంతేకాదు.. ప్రతిపక్ష నేతల ఇళ్లతో పాటు మూడు జిల్లాల్లో ల్యాబ్ మినీ కంట్రోల్ రూమ్ ఏర్పాటులో రవికుమార్ కీలక పాత్ర పోషించినట్లు సిట్ నిర్ధారించుకుంది. ఈ క్రమంలో తాజాగా సేకరించిన టెక్నికల్ ఎవిడెన్స్ సేకరణ దర్యాప్తును మలుపు తిప్పుతాయా? అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రవికుమార్‌ను విచారణ చేపడతారా? నోటీసులు ఏమైనా జారీ చేశారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. -
దక్కని అమాత్యయోగం కాళింగుల అంతర్మథనం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించిన జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలకు నిరాశే ఎదురైంది. అచ్చెన్నాయుడితో పాటు కూన రవికుమార్, బెందాళం అశోక్, గౌతు శిరీష మంత్రి పదవి దక్కుతుందేమోనని ఆశించారు. పార్టీ విధేయత, సామాజికవర్గ సమీకరణాల నేపథ్యంలో మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ కింజరాపు ఫ్యామిలీకే చంద్రబాబు పెద్దపీట వేశారు. దీంతో జిల్లాలో ప్రధాన కీలక సామాజిక వర్గమైన కాళింగులకు మొండిచేయి మిగిలింది. అటు కేంద్రంలో ఎంపీ రామ్మోహన్నాయుడికి అవకాశమివ్వగా, ఇటు రాష్ట్రంలో అచ్చెన్నాయుడికి చోటు కల్పించడంతో మిగతా సామాజిక వర్గాలకు భంగపాటు తప్పలేదు. కూనకు నిరాశ.. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, పార్టీకి కష్టకాలంలో ఎదురొడ్డి పనిచేసినందుకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ భారీగా ఆశలు పెట్టుకున్నారు. గతంలో విప్‌గా పని చేసిన అనుభవంతో ఈసారి తనకు కేబినెట్లో బెర్త్ ఉంటుందని భావించారు. కేంద్ర కేబినెట్లో వెలమ సామాజిక వర్గానికి చెందిన ఎంపీ రామ్మోహన్నాయుడుకు అవకాశం ఇవ్వడంతో రాష్ట్ర కేబినెట్లో తప్పకుండా కాళింగులకు చోటు దక్కుతుందని, ఆ కోటాలో తనకే మంత్రి పదవి వస్తుందని ఆశించారు. అదే సామాజిక వర్గానికి చెందిన బెందాళం అశోక్ కూడా మంత్రి పదవి వస్తుందని ఊహించారు.కాళింగ సామాజికవర్గంలో ఒకరికి తప్పకుండా వస్తుందని, అది ఈ ఇద్దరిలో ఎవరికో ఒకరికి మంత్రి పదవి వస్తుందని అంచనా వేసుకున్నారు. జిల్లాలోని కాళింగ సామాజిక వర్గీయులు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఈసారి మంత్రి పదవి తప్పకుండా ఇవ్వాలని అధిష్టానానికి మొరపెట్టుకున్నారు. అయినా వీరి మొర వినలేదు. మంత్రి వర్గంలో కాళింగులను పరిగణనలోకి తీసుకోలేదు. తనకు సన్నిహితంగా ఉన్న కింజరాపు ఫ్యామిలీకే ప్రాధాన్యమిచ్చి, మంత్రి పదవులు కట్టబెట్టారు. కష్టం గుర్తించలేదంటూ.. జిల్లాలో టీడీపీ గెలుపునకు కాళింగ సామాజిక వర్గం పనిచేసినా, పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంలో కృషి చేసినప్పటికీ చంద్రబాబు గుర్తించకపోవడాన్ని కాళింగ సామాజిక వర్గీయులు ఆవేదన చెందుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో స్పీకర్, జెడ్పీ చైర్పర్సన్, ఎమ్మెల్సీ పదవులిస్తే ఈ ప్రభుత్వంలో కనీసం ఒక్కరికైనా మంత్రి పదవి ఇవ్వలేదని రుసరుసలాడుతున్నారు. ఈ మేరకు సామాజికవర్గ వాట్సాప్ గ్రూపుల్లో ఇదే చర్చ జరుగుతోంది. టీడీపీకి అండగా నిలిచినందుకు తగిన బహుమానం ఇచ్చారని చర్చించుకుంటున్నారు. ఇంకా ఉన్నది ఒక మంత్రి పదవి, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీప్ విప్, విప్ పదవులే ఉన్నాయని, వాటిలో మంత్రి పదవి, స్పీకర్ పదవి వచ్చే పరిస్థితి లేదని, ఇస్తే చీప్ విప్, విప్ ఇచ్చి చేతులు దులుపుకుంటారేమోని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కూన రవికుమార్ వర్గీయులు మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈసారి తప్పనిసరిగా మంత్రి పదవి వస్తుందని మంగళవారం అర్ధరాత్రి వరకు ఎదురు చూశారు. తీరా జాబితా వచ్చాక పేరు లేకపోవడంతో డీలా పడిపోయారు. సంతృప్తి పరచడానికి ఏదో కంటి తుడుపు పోస్టు ఇచ్చి చేతులు దులుపుకొంటారని కూన వర్గీయులు భావిస్తున్నారు. ప్రాధాన్యం లేని పోస్టులిస్తే ఎవరికి ఉపయోగమని కూడా చర్చించుకుంటున్నారు. మంత్రి పదవి కేటాయించకపోవడంపై నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. అయితే, పూర్తి మెజారిటీ ఉండటంతో వీరి మొర వినే పరిస్థితిలో చంద్రబాబు లేరని కచ్చితంగా చెప్పవచ్చు. మళ్లీ మంత్రి విస్తరణ జరిగితే అప్పుడు చూసుకోవల్సిందే తప్ప అంతవరకు అవమానకరంగానే భావించాలి. ఇక, గౌతు శిరీష పరిస్థితి కూడా అంతే. తన తండ్రి సీనియారిటీ, పారీ్టకి విధేయతను దృష్టిలో ఉంచుకుని మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నా చంద్రబాబు కనీసం పరిశీలించలేదు. -
కాగ్నిజెంట్ చేతికి బెల్కాన్
న్యూఢిల్లీ: ఐటీ రంగంలో ఉన్న యూఎస్ సంస్థ కాగ్నిజెంట్ తాజాగా డిజిటల్ ఇంజనీరింగ్ కంపెనీ బెల్కాన్ను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. డీల్ విలువ రూ.10,861 కోట్లు. బెల్కాన్ను ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ ఏఈ ఇండ్రస్టియల్ పార్ట్నర్స్ ప్రమోట్ చేస్తోంది. ఈ డీల్ ద్వారా 190 బిలియన్ డాలర్ల ఇంజనీరింగ్ రీసెర్చ్, డెవలప్మెంట్ (ఈఆర్అండ్డీ) సర్విసెస్ రంగంలో విస్తరించాలన్నది కాగ్నిజెంట్ ఆలోచన. అలాగే ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్, మెరైన్ రంగాల్లో అడుగుపెట్టాలని భావిస్తోంది.ఈఆర్అండ్డీ సర్విసుల మార్కెట్లో సంస్థ స్థానం మరింత బలపడుతుందని కాగ్నిజెంట్ సీఈవో ఎస్.రవి కుమార్ తెలిపారు. కాగ్నిజెంట్‌కు ఇది రెండవ అతిపెద్ద డీల్‌గా నిలిచింది. 2014లో హెల్త్‌కేర్ సాఫ్ట్వేర్ కంపెనీ ట్రైజెట్టో కొనుగోలుకు 2.7 బిలియన్ డాలర్లు వెచ్చించింది. ఇక బెల్కాన్కు అంతర్జాతీయంగా 60 ప్రాంతాల్లో 10,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. బోయింగ్, జనరల్ మోటార్స్, రోల్స్ రాయిస్, యూఎస్ స్పేస్ ఏజెన్సీ అయిన నాసా, యూఎస్ నేవీ వంటి దిగ్గజ సంస్థలకు సేవలు అందిస్తోంది. -
దేశ ఐటీ రంగంలో టాప్.. అత్యధిక వేతనం ఈయనదే..
దేశ ఐటీ రంగంలో అత్యధిక వేతనం అందుకున్న సీఈవోగా కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ సింగిశెట్టి నిలిచారు. ‘మింట్’ నివేదిక ప్రకారం.. కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ గత సంవత్సరం వేతన పరిహారంగా 22.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 186 కోట్లు) అందుకున్నారు. కంపెనీ ఫైలింగ్ ప్రకారం, రవి కుమార్ సింగిశెట్టి గత సంవత్సరం మొత్తంగా 22.56 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 186 కోట్లు) అందుకోగా ఇందులో 20.25 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.169.1 కోట్లు) విలువైన షేర్లను అందుకున్నారు. గత ఏడాది కాగ్నిజెంట్ ఆదాయం రూ.19.35 బిలియన్ డాలర్లు ఉండగా ఇందులో సీఈవో రవి కుమార్ వేతన పరిహారం 0.11 శాతంగా ఉంది. ఇతర ఐటీ సీఈవోల వేతనాలు ఇలా.. విప్రో మాజీ సీఈవో థియరీ డెలాపోర్టే రూ. 10.1 మిలియన్ డాలర్లు (రూ. 83 కోట్లు) హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో విజయకుమార్ 10.65 మిలియన్ డాలర్లు (రూ. 88 కోట్లు) అసెంచర్ సీఈవో జూలీ స్వీట్ 31.55 మిలియన్ డాలర్లు (రూ.263 కోట్లు) ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ 6.8 మిలియన్లు ( రూ. 56.4 కోట్లు) టీసీఎస్ మాజీ సీఈవో రాజేష్ గోపీనాథన్ 3.5 మిలియన్ ( రూ. 29.16 కోట్లు) -
సంక్రాంతికి మూవీ రిలీజ్.. ఇంతలోపే సూపర్ ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్!
తమిళ స్టార్ హీరో సూర్య.. మరో క్రేజీ దర్శకుడితో పనిచేయబోతున్నాడా? అంటే అవుననే టాక్ వినిపిస్తోంది. పాన్ ఇండియా మూవీ 'కంగువ'తో బిజీగా ఉన్న సూర్య.. దీని తర్వాత వరసగా సుధా కొంగర, వెట్రిమారన్ లాంటి క్రేజీ డైరెక్టర్స్‌తో కలిసి పనిచేయబోతున్నాడు. ఇది కాదన్నట్లు లోకేష్ కనకరాజ్ తీసే 'రోలెక్స్'లోనూ సూర్య లీడ్ రోల్ చేయనున్నాడు. వీటిలో వెట్రిమారన్, లోకేశ్ చిత్రాలు తీయడానికి ఇంకా చాలా టైమ్ ఉంది. ఇంతలో మరో యువ దర్శకుడిక సూర్య బంపరాఫర్ ఇచ్చినట్లు టాక్. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) గతంలో 'అండ్రు నేట్రు నాళై' లాంటి డిఫంట్ సినిమా తీసిన రవికుమార్.. ప్రస్తుతం శివకార్తికేయన్‌తో 'అయలాన్' తీశాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం.. జనవరి 12న అంటే ఈ వారాంతంలోనే థియేటర్లలోకి రానుంది. ఇంతలోనే సూర్య నుంచి ఈ దర్శకుడికి పిలుపొచ్చిందనే న్యూస్ వైరల్ అవుతోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని, త్వరలో ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. (ఇదీ చదవండి: బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్) -
టీడీపీ బండారు శ్రావణికి ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: శింగనమల నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి బండారు శ్రావణి శ్రీకి ఎదురుదెబ్బ తగిలింది. ఓ మహిళ ఆత్మహత్య కేసులో ఆమె తండ్రి బండారు రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయసముద్రం మండలం సిద్ధరాంపురంలో మూడు రోజుల క్రితం రాజమ్మ(45) ఆత్మహత్య చేసుకుంది. బండారు రవికుమార్ వేధింపులే కారణమంటూ రాజమ్మ సెల్ఫ్ విడియో తీసింది. భూ వివాదంలో బండారు రవికుమార్ వేధిస్తున్నారంటూ అందులో ఆరోపించింది బాధితురాలు. ఈ వీడియో బయటకు రావడంతో.. కేసు నమోదు చేసి టీడీపీ నేత రవికుమార్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
హీరోయిన్‌కు ముద్దు.. ఘాటుగానే స్పందించిన డైరెక్టర్!
రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా హీరో, హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'తిరగబడరాసామీ'. ఈ చిత్రానికి ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తున్నారు. సురక్ష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు మేకర్స్. హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్లో పలువురు చిత్ర యూనిట్ సభ్యులు కూడా పాల్గొన్నారు. (ఇది చదవండి: కోలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తోన్న రాజ్ తరుణ్ హీరోయిన్!) ముద్దు సీన్‌తో వివాదం అయితే ఈ ఈవెంట్‌కు హాజరైన ప్రేక్షకులకు ఊహించని సంఘటన ఎదురైంది. ఈవెంట్‌కు హాజరైన హీరోయిన్ మన్నారా చోప్రాకు దర్శకుడు రవికుమార్ బహిరంగంగా ముద్దుపెట్టడం వివాదానికి దారితీసింది. ఆయన తీరుపై పలువురు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో డైరెక్టర్ తీరును నెటిజన్స్ విమర్శించారు. కాగా.. గతంలో ఇలానే కాజల్ స్టేజీపై మాట్లాడుతుండగా సినిమాటోగ్రాఫర్ చోటా. కె. నాయుడు ముద్దుపెట్టేశాడు. మీకేం ఇబ్బంది? అయితే తాజాగా ఈ విషయంపై స్పందించారు. తాను హీరోయిన్‌కు ముద్దుపెట్టడంతో తప్పేంటని రవికుమార్ ప్రశ్నిస్తున్నారు. ఆమె పట్ల అప్యాయతతోనే అలా చేశానని చెప్పుకొచ్చారు. నా కూతురికి కూడా అలాగే ముద్దుపెడతా అంటూ వివరణ ఇచ్చారు. అయినా ఆమెకు, మా ఫ్యామిలీకి లేని ఇబ్బంది మీకేంటని నెటిజన్లను నిలదీశారాయన. నా సినిమాలో మన్నారా చోప్రా ఆమె చేసిన వర్క్ నచ్చడం వల్లే అలా చేశానని రవికుమార్ వెల్లడించారు. ఏదేమైనా ఈవెంట్లో అందరిముందు అలా ముద్దులు పెట్టడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. (ఇది చదవండి: రాఖీ సంబురాల్లో కాబోయే మెగా కోడలు.. సోషల్ మీడియాలో వైరల్!) Director kisses an actress earlier today!pic.twitter.com/JzyBbau45d — Manobala Vijayabalan (@ManobalaV) August 28, 2023 -
కాల్ చేస్తే మాట్లాడడం లేదని.. నమ్మించి.. మైకో లేఔట్‌కి పిలిపించి..
కర్ణాటక: వేరే సంస్థలో చేరిన ప్రియురాలు తనతో ఫోన్లో మాట్లాడడం లేదనే ఆక్రోశంతో ఉన్మాదిగా మారిన ప్రియుడు ఆమెను చావబాదాడు. ఈ ఘటన బెంగళూరు మైకోలేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. గాయాలైన యువతి స్నేహసిక్త చటర్జీ (26) నిమ్హాన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సైకో ప్రియుడు రవికుమార్ (28)ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఐటీ ఇంజినీర్లు. రవికుమార్ ఇందిరానగరలో ఓ సంస్థలో పని చేస్తుండగా స్నేహ అక్కడ శిక్షణకు వచ్చింది. వారి మధ్య పరిచయమై ప్రేమకు దారి తీసింది. ఇటీవల స్నేహకు మరో కంపెనీలో ఉద్యోగం రాగా అక్కడకు వెళ్లిపోయింది. అప్పటినుంచి రవికుమార్ కాల్ చేస్తే సరిగా మాట్లాడడం లేదు. ఈ నెల 3న తెల్లవారుజామున స్నేహను మైకో లేఔట్‌లోని తను ఉంటున్న హాస్టల్ వద్దకు పిలిపించాడు. ఎందుకు నాతో మాట్లాడడం లేదని ఆమెతో ఘర్షణ పడి ఇనుప రాడ్‌తో తలపై బాదటంతో గట్టి గాయాలయ్యాయి. కొందరు చూసి బాధితురాలిని నిమ్హాన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. మైకోలేఔట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
భారీ వృద్ధి దిశగా అడుగులు.. అప్‌స్టాక్స్ సీఈవో రవి కుమార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్రోకరేజి సంస్థ అప్‌స్టాక్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 50 శాతం ఆదాయ వృద్ధి లక్ష్యంగా పెట్టుకుంది. 25–30 శాతం మేర లాభాల వృద్ధి ఉండగలదని అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం కంపెనీ ఆదాయం రూ. 1,000 కోట్లు దాటగా.. బ్రేక్ ఈవెన్ సాధింంది. అప్‌స్టాక్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రవి కుమార్ గురువారమిక్కడ విలేకరుల సమావేశం సందర్భంగా ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం తమకు 1.1 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారని, 2030 నాటికి ఈ సంఖ్యను పది కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో క్లయింట్ల సంఖ్య గత రెండేళ్లలో 13% పెరిగిందని, వీరిలో 70% మంది యువ ఇన్వెస్టర్లేనని రవి కుమార్ చెప్పారు. డెరివేటివ్స్ ట్రేడింగ్‌లో దేశ సగటుతో పోలిస్తే ఇక్కడ రెట్టింపు స్థాయిలో ట్రేడర్లు ఉన్నట్లు వివరించారు. అడ్వాన్స్డ్ ట్రేడర్ల కోసం రియల్ టైమ్ సమాచారంతో ట్రేడ్ మోడ్, ఇన్వెస్టర్ల కోసం ఇన్వెస్ట్ మోడ్ పేరిట రెండు ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చామన్నారు. 2018 నుం ఇప్పటివరకూ 200 మిలియన డాలర్ల నిధులు సమీకరించామని చెప్పారు. అప్‌స్టాక్స్‌లో ప్రస్తుతం 600 మంది పైచిలుకు సిబ్బంది ఉండగా.. హైదరాబాద్‌లో దాదాపు 40 మంది ఉన్నారు. అవసరాన్ని బట్టి స్థానికంగా కార్యాలయం ఏర్పాటు చేసే Äñæచనలో ఉన్నట్లు కువర్ తెలిపారు. -
కారణం లేకుండానే.. బ్రియాన్ హంఫ్రీస్‌ను తొలగించిన కాగ్నిజెంట్!
బ్రియాన్ హంఫ్రీస్‌ను సీఈవో పదవి నుంచి తొలగించినట్లు అమెరికాకు చెందిన ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ కాగ్నిజెంట్ ప్రకటించింది. స్టాక్ ఎక్సేంజీ ఫైల్స్‌లో ఈ విషయాన్ని వెల్లడించిన కంపెనీ.. హంఫ్రీన్ తొలగింపుకు గల స్పష్టమైన కారణాలు వెల్లడించలేదు. ఈ ఏడాది కాగ్నిజెంట్ బోర్డ్ సభ్యులు సంస్థ వేగంగా పురోగమించడం, వ్యాపార కార్యకలాపాల్ని వేగవంతం చేయడం, ఆదాయ వృద్ధి వంటి అంశాలపై దృష్టిసారించింది. కాబట్టే సీఈవో పదవీ బాధ్యతల్లో మార్పులు అవసరమని తాము విశ్వసిస్తున్నట్లు ఆ సంస్థ బోర్డ్ ఛైర్మన్ స్టీఫెన్ జె రోహ్లెడర్ తెలిపారు. సీఈవో పదవి నుంచి తొలగించడంతో జనవరి 12 నుంచి మార్చి 15 వరకు కాంగ్నిజెంట్‌లో సలహాదారులుగా పనిశారు. హంఫ్రీస్ సీఈవో పదవి నుంచి తొలగించడంతో ఆయన స్థానాన్ని భారత్‌కు చెందిన టెక్ జెయింట్ ఇన్ఫోసిస్‌కు ప్రెసిడెంట్‌గా పనిచేసిన రవికుమార్ భర్తీ చేసిన విషయం తెలిసిందే. తొలగింపులకు కారణాలు హంఫ్రిస్ను ఫైర్ చేయడానికి అనేక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆదాయం పడిపోవడం, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు సంస్థను విడిచిపెట్టడం, వార్షిక ప్రాతిపదికన అట్రిషన్ రేటు పెరిగిపోవడం వంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. తగ్గిన పరిహారం సీఈవోగా బాధ్యతలు నిర్వహించే సమయంలో హంఫ్రీస్‌కు చెల్లించే పరిహారం భారీగా తగ్గినట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. 2021తో పోలిస్తే 2022లో హంఫ్రీస్ పరిహారం 9 శాతం తగ్గిందని ప్రకటన హైలైట్ చేసింది. నాన్ ఈక్విటీ ఆధారిత ప్రోత్సాహకాలు సైతం 4 మిలియన్ల నుండి 1.7 మిలియన్లకు తగ్గాయి. చదవండి👉 భారత్‌లో తయారైన ఆ దగ్గుమందు కలుషితం.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ -
కాగ్నిజెంట్ కొత్త సీఈవో రవి కుమార్ జీతం ఎంతో తెలుసా? అంబానీని మించి!
సాక్షి,ముంబై: భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన కాగ్నిజెంట్ కొత్త సీఈవోగా,ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ రవి కుమార్‌ను ఎంపికయ్యారు. నాలుగేళ్ల పాటు కంపెనీకి సేవలందించిన మాజీ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్ స్థానంలో రవి కుమార్ నియమితులయ్యారు. గ్రోత్‌కు సంబంధించి మంజి పొజిషన్లో ఉన్న కాగ్నిజెంట్ సీవోగాఎంపిగాకవడం సంతోషంగా ఉందని అని కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కంపెనీ బోర్డులో కూడా స్థానం దక్కించుకున్న కుమార్ కాగ్నిజెంట్‌లో ఆన్-డిమాండ్ సొల్యూషన్స్, సాలిడ్ బ్రాండింగ్ ,అంతర్జాతీయ విస్తరణను పర్యవేక్షిస్తారు. అయితే దేశంలోని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని సొంతం చేసుకున్న రవికుమార్ వార్షికవేతనం ఇపుడు హాట్ టాపిక్‌గా నిలిచింది. 2020లో అంబానీ జీతం కంటే నాలుగు రెట్ల అధికం రవి కుమార్ జీతం 2020లో ముఖేశ్ అంబానీ జీతం కంటే నాలుగు రెట్లు ఎక్కువట. రవి కుమార్ మొత్తం జీతం సంవత్సరానికి రూ. 57 కోట్లు (7 మిలియన్ డాలర్లు). దీంతోపాటు దాదాపు రూ. 6 కోట్లు( 7,50,000 డాలర్ల )జాయినింగ్ బోనస్‌ను కూడా అందు కోనున్నారు. యాన్యువల్ బేసిక్ సాలరీగా ఒక మిలియిన్‌డాలర్లు చెల్లింస్తుంది కంపెనీ. అలాగే 2 మిలియన్ డాలర్ల నగదు ప్రోత్సాహకం, వన్ టైమ్ హైర్ అవార్డుగా 5 మిలియన్ డాలర్ల విలువైన స్టాక్ రిటర్న్‌లను పొందనున్నారు. .కాగా గత రెండేళ్లుగా అంబానీ కేవలం రూ. 1 మాత్రమే జీతంగా తీసుకున్నారని గమనించాలి. 2019-20లో ముఖేశ్ అంబానీ వార్షిక వేతనం రూ.15 కోట్లు. కాగా 2016 నుంచి 2022 మధ్య కాలంలో మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు రవి కుమార్ అధ్యక్షుడిగా ఉన్నారు.మొత్తం రెండు దశాబ్దాల పాటు ఆ కంపెనీలోనే కొనసాగారు. కుమార్ ట్రాన్స్‌యూనియన్ , డిజిమార్క్ కార్ప్ బోర్డులలో కూడా పనిచేశారు. హంఫ్రీస్ రాజీనామా చేయడంతోరవికుమార్ను ఎంపిక చేసింది కాగ్నిజెంట్. ప్రత్యేక సలహాదారుగా మార్చి 15 వరకు కంపెనీలోనే ఉంటారు హంఫ్రీస్ . -
టీఆర్ఎస్ విజయానికి కృషి చేస్తా: పనస రవికుమార్
మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేస్తాం అని పారిశ్రామిక వేత్త పనస రవికుమార్ అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో రవి కుమార్ పనస, శ్రవణ్ దాసోజు తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రవి పనస సంతోషం వ్యక్తం చేశారు. ఇంకా రవి పనస, డాక్టర్ శ్రవణ్ దాసోజు మాట్లాడుతూ... తెలంగాణ, భారతదేశానికి గుండెలాంటిది. అలాంటి తెలంగాణని తెచ్చిన టీఆర్ఎస్తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ... ‘శ్రవణ్, రవి పనస పార్టీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. వారిని హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నా’ అన్నారు. -
కాంగ్రెస్‌కు షాక్.. గులాబీ గూటికి పల్లె రవికుమార్ దంపతులు
సాక్షి, హైదరాబాద్: మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్, ఆయన సతీమణి శనివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు భేటీ అయ్యారు. రవికుమార్ గౌడ్ భార్య కల్యాణి ప్రస్తుతం చండూరు ఎంపీపీగా కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా పల్లె రవికుమార్ దంపతులకు మంత్రి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తోపాటు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మర్రి రాజశేఖరరెడ్డి, కర్నె ప్రభాకర్, బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. కాగా మునుగోడు ఉప ఎన్నికలో పల్లె రవి కుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించారు. కానీ పార్టీ అధిష్టానం పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ప్రకటించడంతో పల్లె రవికుమార్ తీవ్ర నిరాశ చెందారు. ఈ నేపథ్యంలోనే పల్లె రవికుమార్ గులాబీ గూటికి చేరినట్లు తెలుస్తోంది. ఉద్యమ కాలం నుంచి తమతో కలిసి పని చేసిన పల్లె రవికుమార్ మళ్లీ టీఆర్ఎస్ పార్టీ కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ గెలుపు కోసం టీఆర్ఎస్లో చేరేందుకు ముందుకు వచ్చిన పల్లె రవికుమార్‌కు ధన్యవాదాలు తెలిపారు. పాత మిత్రుడు పల్లె రవికుమార్‌కు కచ్చితంగా భవిష్యత్తులో మంచి రాజకీయ అవకాశాలను పార్టీ కల్పిస్తుందని భరోసానిచ్చారు. చదవండి: కేసీఆర్ టార్గెట్‌పై టీఆర్ఎస్ నేతల్లో టెన్షన్.. కంటి మీద కునుకులేదు? Big Jolt to #Congress Chundur MPP Jyothi and her husband Palle Ravi joins #TRS ahead of #Munugode pic.twitter.com/k7dwPPmHI7 — Sarita Avula (@SaritaTNews) October 15, 2022 చండూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలన్న ప్రధానమైన ప్రజల కోరికను కేటీఆర్‌కు తెలియజేయగా.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు పల్లె రవికుమార్ తెలిపారు. మునుగోడు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తమ వంతు కృషిని చేస్తామని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీలో చేరిన మునుగోడు కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ దంపతులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRTRS గారి సమక్షంలో మునుగోడు కాంగ్రెస్ నాయకులు పల్లె రవికుమార్ గౌడ్, వారి సతీమణి చండూరు ఎంపీపీ కల్యాణి టీఆర్ఎస్ పార్టీలో చేరారు.#MunugodeWithTRS #VoteForCar pic.twitter.com/Ovdsq0IhyF — TRS Party (@trspartyonline) October 15, 2022 -
రవికుమార్‌తో వివాహేతర సంబంధం.. తెలంగాణకు చెందిన మరో వ్యక్తితో సహజీవనం
సాక్షి, ముమ్మిడివరం (కోనసీమ జిల్లా): మండలంలోని అనాతవరం ప్రసిద్ధ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో ఒక యువకుడు శనివారం అర్ధరాత్రి హత్యకు గురయ్యాడు. స్థానిక బోగాల తోటకు చెందిన పెదపూడి రవికుమార్(32)ను తలపై బలంగా కొట్టి సమీపంలో ఉన్న పంటబోదెలో పడేశారు. శనివారం రాత్రి 11గంటలకు కుమారుడికి బిస్కెట్ ప్యాకెట్లు తీసుకురావటానికి బయటకు వెళ్లి వచ్చాడు. భార్యతో మళ్లీ వస్తానని చెప్పి.. ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతకీ తిరిగి రాకపోవడంతో భార్య లలిత భర్తకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో కంగారు పడి మామగారు త్రిమూర్తులకు చెప్పటంతో ఆయన రవికుమార్ స్నేహితులకు ఫోన్ చేసినప్పటికీ సమాచారం తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. వారి ఇంటికి కొద్ది దూరంలో రోడ్డు పక్కన రవికుమార్ మోటారు బైక్, చెప్పులు కనిపించాయి. రవికుమార్ (పాత చిత్రం) పరిసర ప్రాంతాల్లో గాలించగా పక్కనే ఉన్న పంట బోదెలో రవికుమార్ విగత జీవుడై కన్పించాడు. దీంతో త్రిమూర్తులు ముమ్మిడివరం పోలీసులకు సమాచారం అందించారు. ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంటబోదె లోంచి తీసి పరిశీలించగా తలపై బలమైన గాయాలు ఉండటంతో రవికుమార్ హత్యకు గురైనట్టు గుర్తించారు. మృతదేహాన్ని ముమ్మిడివరం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: (పాము కాటుకు పురోహితుడు బలి.. రెండుసార్లు కాటువేసినా చంపకుండా..) వివాహేతర సంబంధమే కారణమా? రవికుమార్‌కు ఆరేళ్ల క్రితం కొమానపల్లికి చెందిన లలితతో వివాహమైంది. వీరికి తొమ్మిది నెలల బాబు నిహాన్షు ఉన్నాడు. రవికుమార్ అనాతవరం సెంటర్లో మీ సేవ కేంద్రం నిర్వహించేవాడు. ఇటీవల ఇసుక, కంకర సరఫరా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. స్థానికుల కథనం ప్రకారం రవికుమార్ కొన్నేళ్లుగా అదే గ్రామానికి చెందిన ఒక వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం ఆమె భర్తకు తెలియడంతో ఆమెను వదిలివేశాడు. ఆమె తెలంగాణకు చెందిన మరో వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది. తెలంగాణ వ్యక్తి రవికుమార్‌తో సంబంధం కొనసాగించవద్దని ఆమెను హెచ్చరించాడు. రవికుమార్‌కు కూడా ఫోన్లు చేసి హెచ్చరించాడు. కొన్ని నెలల క్రితం కొంతమంది యువకులు ముఖానికి ముసుగులు వేసుకుని రవికుమార్ ఇంటికి వచ్చి దాడికి యత్నించారు. వివాహేతర సంబంధం వల్లే రవికుమార్ హత్యకు గురయ్యాడని భావిస్తున్నారు. పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అమలాపురం సీఐ సీహెచ్ కొండలరావు ఆధ్వర్యంలో ముమ్మిడివరం ఎస్ఐ కె.సురేష్‌బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆలస్యం... అమృతం... విషం!
గణతంత్రదినోత్సవం నాడు రాష్ట్రంలో పరిపాలన, బౌగోళిక మార్పులకు శ్రీకారం చుడుతూ కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఏర్పాటుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం చారిత్రాత్మకం. బ్రిటిష్ వారు 120 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన జిల్లాలకు అదనంగా స్వాతంత్య్రం వచ్చిన తరువాత నేటికి జనాభా 5 రెట్లు పెరిగినా కొత్త జిల్లాలు కేవలం రెండు (విజయనగరం, ప్రకాశం) మాత్రమే ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వం 2021 జనగణనను కరోనా విపత్తు వల్ల నిరవధికంగా వాయిదా వేసి కొత్త పరిపాలనా విభాగాల ఏర్పాటు మార్పు చేర్పులపై వున్న నిషేధాన్ని 2022 జూన్ 30 వరకు ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్యాబినెట్ నూతన జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం సరైన సమయంలో తీసుకున్న సాహసోపేత చర్య. జూన్ 30 నాటికి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, రెవెన్యూ గ్రామాల ఏర్పాటు, సరిహద్దుల్లో మార్పులు వంటివి పూర్తి చేసి కేంద్ర హోంశాఖకు నివేదిస్తే జూలై తరువాత ఎప్పుడు జనగణన జరిగినా రాష్ట్రంలోని కొత్త జిల్లాల ప్రకారమే జనగణన చేపడతారు. కొత్త జిల్లాల ఏర్పాటు ఆవశ్యకత ఆంధ్రప్రదేశ్‌లో ఎంతైనా వుంది. రాష్ట్రంలో సగటు జిల్లా జన సంఖ్య 37.98 లక్షలు కాగా మొత్తం జిల్లాలు 13 మాత్రమే. నూతనంగా ఏర్పడిన తెలం గాణలో జిల్లా సగటు జనాభా 11.35 లక్షలు ఉంటే జిల్లాలు 33 ఉన్నాయి. మనకన్నా జిల్లా సగటు జనాభా (26.64 లక్షలు) తక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో 80 జిల్లాలు ఉండటం గమ నార్హం. దేశంలో ఒక్క పశ్చిమ బెంగాల్లో (39.68 లక్షలు) మాత్రమే ఏపీలోని జిల్లా సగటు జనాభా కన్నా ఎక్కువ జన సంఖ్య ఉంది. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకొని చూసిన ప్పుడు ఏపీలో జిల్లాల సంఖ్య బాగా తక్కువగా ఉన్నట్లు స్పష్ట మవుతున్నది. కొత్త జిల్లాల ఏర్పాటుకు ఇదీ ఒక కారణమే. దాదాపు పార్లమెంట్ నియోజకవర్గం సరిహద్దులే కొత్త జిల్లా సరిహద్దులకు ప్రాతిపదికగా తీసుకోవటం, అసెంబ్లీ నియోజక వర్గాలు రెండు మూడు జిల్లాల్లో విస్తరించకుండా ఏ జిల్లాకి ఆ జిల్లాలోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం మేలైన నిర్ణయం. ఆంధ్రప్రదేశ్‌లో 1974 జిల్లాల చట్టంలో ఉన్నవీ, 1984లో రూపొందించిన నిబంధనలనూ పరిశీలించినప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటుకు గమనించాల్సిన ముఖ్యాంశాలు– ప్రాంతం, జనాభా, ఆదాయం... కొత్త, పాత జిల్లాల్లో దాదాపు సమపాళ్లలో ఉండేటట్లు తుది ముసాయిదా నాటికి సవరిం చాలి. అలాగే చారిత్రక నేపథ్యం, ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలు; సాంస్కృతిక పరమైన, విద్య, మౌలిక సదుపాయాలూ; ఆర్థిక పురోభివృద్ధి అవకాశాలు వంటి వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. అభివృద్ధి చెందిన, లేదా బాగా వెనుకబడిన ప్రాంతాలు అన్నీ ఒకే దగ్గరకు రాకుండా చూడాలి. పార్లమెంట్ సరిహద్దు ప్రాతిపదికనే కాకుండా పరిస్థితిని బట్టి కొద్దిపాటి మార్పులు, చేర్పులు చేయవలసి ఉంది. కొంతమంది 2026లో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజక వర్గాల పునర్విభజన జరుగుతుంది కాబట్టి... పార్లమెంటు సరిహద్దులు మారుతాయనీ, అందువల్ల ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు సరికాదనీ అంటున్నారు. ఇది వాస్తవం కాదు. 2001లో జరిగిన 91వ రాజ్యాంగ సవరణను అనుసరించి 2026 తరువాత వచ్చే తొలి జనాభా లెక్కల ప్రకారం (అంటే 2031 సెన్సెస్) డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేసి దేశ వ్యాప్తంగా పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలు పునర్విభజన చేయ డానికి 3 సంవత్సరాలు పడుతుంది. అసలు జనాభా లెక్కల తుది జాబితానే 2034లో ప్రకటిస్తారన్న సంగతి గుర్తించాలి. అంటే 2039 ఎన్నికల వరకు పార్లమెంటు స్థానాల సంఖ్య తేలే అవకాశమే లేదన్నమాట! కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలకు... ప్రత్యేకించి మెడికల్ కాలేజీలు, కేంద్రీయ విద్యాలయాలు, గ్రామీణా భివృద్ధి, పశువైద్యశాలలు, యువజన కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ కళాశాలల ఏర్పాటుకు జిల్లాను యూని ట్‌గా తీసుకొని కేటాయింపులు చేస్తుంది. నూతన జిల్లాలను ఏర్పాటు చేస్తే... కొత్త జిల్లాలకు అదనపు నిధులు, మౌలిక సదుపాయాలకు హోం, డిజాస్టర్ శాఖల నుండి ప్రత్యేక నిధులు తెచ్చుకునే అవకాశం వుంటుంది. ఇంత ప్రయోజన కరమైన కొత్త జిల్లాల ఏర్పాటు ఎంత తొందరగా సాకారం అయితే అంతమంచిది. ‘ఆలస్యం అమృతం విషం!’ అందుకే వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర పరిధిలోనే ఉన్న కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై దృష్టి సారించింది. తద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల దగ్గరకు మరింత సమర్థవంతంగా, వేగంగా చేర్చడానికి వీలుండటమే కాక అభివృద్ధి ఊపందుకుంటుంది. ఇనగంటి రవికుమార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మొబైల్: 94400 53047 -
Virat Kohli: "ఇప్పటి నుంచే నన్ను ఔట్ చేసేందుకు ప్లాన్ చేస్తావా ఏంటి..?"
U19 Bowler Ravi Kumar Vs Virat Kohli: అండర్ 19 ప్రపంచకప్ 2022 గెలిచిన యువ భారత జట్టులో కీలక ఆటగాడైన రవికుమార్.. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి గురించిన ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. మెగా ఫైనల్‌కు ముందు జరిగిన ఓ సంభాషణ సందర్భంగా కోహ్లి తనకి కౌంటరిచ్చాడని రవికుమార్ పేర్కొన్నాడు. ఫైనల్‌కు ముందు జట్టులో స్ఫూర్తినింపేందుకు వీడియో కాల్ మాట్లాడిన కోహ్లిని తాను ఓ చిరాకు తెప్పించే ప్రశ్న అడిగానని, అందుకు కోహ్లి తనదైన స్టైల్లో ఫన్నీగా సమాధానమిచ్చాడని రవికుమార్ చెప్పుకొచ్చాడు. తాను కోహ్లిని బ్యాటింగ్ బలహీనత గురించి అడగ్గా, అందుకు అతను బదులిస్తూ.. "ఎందుకు.. ఇప్పటి నుంచే నన్ను ఔట్ చేసేందుకు ప్లాన్ చేస్తావా..?" అంటూ ఫన్నీగా కౌంటరిచ్చాడని రవికుమార్ తెలిపాడు. కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన అండర్19 ప్రపంచకప్ ఫైనల్లో రవికుమార్ 4 వికెట్లతో సత్తా చాటి జట్టు విజయంలో తనవంతు పాత్రను పోషించాడు. ఇదిలా ఉంటే, రవికుమార్ ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఓ ఇంటర్యూలో మరిన్ని ఆసక్తికర అంశాలను వెల్లడించాడు. తాను బౌలర్ అయినప్పటికీ.. తన ఆరాధ్య క్రికెటర్ ధోని అని, ఫేవరెట్ బౌలర్ విషయానికొస్తే.. ఆసీస్ స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్‌ని అమితంగా ఇష్టపడతానని చెప్పుకొచ్చాడు. త్వరలో జరగబోయే ఐపీఎల్ మెగా వేలంలో తప్పక అవకాశం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన 18 ఏళ్ల రవికుమార్.. తన క్రికెటింగ్ కెరీర్ కోసం కోచ్ సలహా మేరకు యూపీ నుంచి బెంగాల్‌కు వలస వెళ్లాడు. టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ కూడా రవికుమార్లాగే గతంలో యూపీ నుంచి బెంగాల్‌కు వలస వెళ్లి స్టార్ బౌలర్‌గా ఎదిగాడు. చదవండి: Virat Kohli: కేఎల్ రాహుల్ స్క్రీన్ షాట్ తీసి పంపాడు.. ఆ ఓటమి ఇప్పటికీ బాధిస్తుంది..! -
ఉత్తుత్తి కంపెనీలు.. ఊళ్లు దాటిన వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: చైనా, హాంకాంగ్‌లకు చెందిన గేమింగ్, డేటింగ్ యాప్స్ కేసులో ఈడీ సంచలన విషయాలు బయటపెట్టింది. యాప్స్ నిర్వహిస్తున్న కంపెనీల లావాదేవీలు చూస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ రవికుమార్.. రూ.1,500లకో సంతకంతో వేల కోట్లు దేశం దాటేలా సహకరించాడని వెల్లడించింది. షెల్ కంపెనీల లావాదేవీలకు బోగస్ సర్టిఫికెట్లు జారీ చేసి రూ.1,100 కోట్లు చైనా, హాంకాంగ్ చేరేలా చేశాడని చెప్పింది. హెయిర్ మర్చంట్స్.. క్రిప్టో కరెన్సీ రూపంలో ఢిల్లీకి చెందిన చార్టెట్ అకౌంటెంట్ రవికుమార్.. చైనా, హాంకాంగ్‌కు చెందిన లింక్యూన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, డోకిపే టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల లావాదేవీలు చూస్తున్నాడు. సంబంధిత కంపెనీలు మన దేశంలో డేటింగ్, గేమింగ్ యాప్‌ల ద్వారా వేల కోట్లు వసూలు చేసి మోసం చేశాయి. ఈ డబ్బు ను మనీలాండరింగ్ ద్వారా రవికుమార్ దేశం దాటించినట్టు ఈడీ గుర్తించింది. నకిలీ ఎయిర్ వే బిల్లులు, సీసీ కెమెరాల క్లౌడ్ స్టోరేజ్ మెయింటెనెన్స్ పేరుతో నకిలీ బిల్లులు సృష్టించి ఎస్బీఐ, ఎస్‌బీఎమ్ బ్యాంకుల ద్వారా రూ.1,100 కోట్ల డబ్బును రవికుమార్ దేశం దాటించినట్టు ఈడీ గుర్తించింది. కొంత డబ్బును హవాలా రూపంలో హెయిర్ మర్చంట్స్, క్రిప్టో కరెన్సీ పేరుతో సింగపూర్‌కు మళ్లించినట్టు తేల్చింది. సంతకానికి రూ. 1,500 మనీ లాండరింగ్ ద్వారా రూ.1,100 కోట్లను దేశాన్ని దాటించేందుకు చైనా, హాంకాంగ్‌లో ఉన్న మాఫియా నేతృత్వంలో రవికుమార్ 621 బోగస్ కంపెనీలు సృష్టించాడని, అలాగే బోగస్ ఫామ్ 15 సీబీ సర్టిఫికెట్లు జారీ చేశాడని ఈడీ గుర్తించింది. చార్టెడ్ అకౌంటెంట్‌గా బ్యాలెన్స్ షీట్లను చూడకుండానే షెల్ కంపెనీలకు సంతకాలు చేశాడంది. ఈ మొత్తం వ్యవహారంలో రవికుమార్ తన ప్రతి సంతకానికి రూ.1,500 చొప్పున తీసుకున్నట్టు గుర్తించింది. బోగస్ కంపెనీల సృష్టికర్తలు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, రవికుమార్‌ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టామని ఈడీ తెలిపింది. రవికుమార్‌ను విచారించేందుకు కోర్టు 5 రోజుల కస్టడీకి అనుమతించినట్టు చెప్పింది. -
టీడీపీ నేతల దౌర్జన్యం
సింహాద్రిపురం : వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురం మండలం నంద్యాలపల్లె గ్రామానికి చెందిన శివరామిరెడ్డి అనే రైతు శనగ పంటను స్థానిక టీడీపీ నాయకులు దౌర్జన్యంగా దున్నేశారు. బాధితుడు పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తెలుగుదేశం ఎమ్మెల్సీ బీటెక్ రవి అనుచరులు వై.గోపాల్‌రెడ్డి, లోక్‌నాథ్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, కేశవవర్దన్‌రెడ్డిలు శివరామిరెడ్డి పొలాన్ని దౌర్జన్యంగా తీసుకోవాలని తరచూ గొడవ సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు మూడు నెలల క్రితం బాధితుడి పొలంలో కొలతలు వేయనీయకుండా సర్వేయర్‌ను, తహసీల్దార్ మహబూబ్ బాషాను దౌర్జన్యంగా అడ్డుకున్నారు. దీనిపై అప్పట్లో బాధితుడు జమ్మలమడుగు ఆర్డీఓకు ఫిర్యాదు చేశాడు.(చదవండి: చిచ్చు పెట్టండి.. రచ్చ చేయండి) ఈ భూమికి సంబంధించి టీడీపీ వర్గీయులు ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో ఆర్డీఓ కూడా ఈ భూమి శివరామిరెడ్డికి సంబంధించినదే అని పేర్కొన్నారు. దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్సీ బీటెక్ రవి అనుచరులు ఆదివారం బాధితుడి పొలంలోని శనగ పంటను రెండు ట్రాక్టర్లతో దున్నేశారు. మరో 20 రోజుల్లో పంట చేతికందే సమయంలో దున్నేయడంతో రూ.2 లక్షల మేర నష్టం వచ్చినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ నేతల దౌర్జన్యానికి ఇది పరాకాష్ట అని అతను వాపోయాడు. స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ బీటెక్ రవి అండదండలతో తనను తరచూ ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. -
ఆక్సిజన్ పెట్టారా? లేదా?
సాక్షి, హైదరాబాద్: ‘‘కరోనాతో బాధపడుతున్న రోగి రవికుమార్‌కు ఆక్సిజన్ పెట్టామని చెస్ట్ ఆస్పత్రి సూపరింటెం డెంట్ చెబుతున్నారు. తనకు ఆక్సిజన్ మాస్కు తొలగించారని, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. మళ్లీ పెట్టాలని కోరినా పట్టించుకోలేదని రవికుమార్ వీడియో తీసి పంపారు. ఇందులో ఏది నిజం. ఈ వ్యవహారంలో వాస్తవాలేంటో తెలుసుకునేందుకు పోలీసు దర్యాప్తునకు ఆదేశించాలా?’’అని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే రవికుమార్ మృతి చెందారంటూ బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు బొల్గం యశ్పాల్గౌడ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యా జ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. రవికుమార్ గుండె సంబంధవ్యాధితో చనిపోయారని, వైద్యం అందించడంలో వైద్యుల నిర్లక్ష్యం లేదని ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. రవికుమార్‌కు సంబంధించిన వైద్య నివేదికలు సమర్పించారా? అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించగా లేదని సమాధానమిచ్చారు. కొంత సమయం ఇస్తే రికార్డులు సమర్పిస్తామని చెప్పగా ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘‘ఇందులో డాక్టర్ల నిర్లక్ష్యం లేదని తామెలా భావించాలి? నిబంధనల మేరకు కరోనా రోగికి అందించాల్సిన అన్ని చికిత్సలు చేశామంటున్నారు. మరి వైద్యనివేదికలు మా పరిశీలనకు ఎందుకు ఇవ్వడం లేదు ?’’అని ధర్మాసనం ప్రశ్నించింది. అదే ఆస్పత్రిలో మరో రోగి కూడా వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయారని, అతడు కూడా చనిపోయే ముందు వీడియో తీసి పంపారని పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రియాంకా చౌదరి నివేదించారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం..రవికుమార్‌కు సంబంధించిన వైద్య నివేదికలను సమర్పించాలని చెస్ట్ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశిస్తూ...విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది. -
వైద్యుల నిర్లక్ష్యం వల్లే రవికుమార్ మృతి
సాక్షి, హైదరాబాద్: చెస్ట్ ఆస్పత్రిలో రవికుమార్ అనే యువకుడు కరోనా వల్ల మరణించలేదని, వైద్యుల నిర్లక్ష్యం వల్లే అతడి ప్రాణం పోయిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటిలేటర్ తీసేయడం వల్లే అతడు చనిపోయాడని, ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.యశ్పాల్గౌడ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. సకాలంలో వైద్యం అందకే రవికుమార్ మరణించారని, వైద్యుల నిర్లక్ష్యం కూడా ఉందని పిటిషనర్ న్యాయవాది ప్రియాంక చౌదరి వాదించారు. ఇప్పటికే రవికుమార్ వీడియో వైరల్ అయ్యిందన్నారు. దీనిపై పూర్తి వివరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది. నివేదిక కప్పదాట్లతో ఉండకూడదని.. బాధ్యులు ఎంతటి సీనియర్ డాక్టర్లు అయినా చర్యలు ఉండాలని పేర్కొంది. విచారణ ఈ నెల 21వ తేదీకి వాయిదా పడింది. -
రూ.150 కోట్లకు పైగా ప్రజాధనం లూటీ
సాక్షి, విశాఖపట్నం: ఈఎస్ఐ (కార్మిక రాజ్య బీమా సంస్థ) ఆస్పత్రులకు మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో రూ.150 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడిన కేసులో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సహా ఆరుగురిని శుక్రవారం అరెస్టు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) జాయింట్ డైరెక్టర్ రవికుమార్ ప్రకటించారు. విశాఖపట్నంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేసు పూర్వాపరాలను వెల్లడించారు. మందుల స్కాంలో 19 మంది ప్రమేయం... ♦ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ మెడికల్ సర్వీసెస్ (డీఐఎంఎస్–డిమ్స్) విభాగంలో 2014–15 నుంచి 2018–19 వరకు జరిగిన కొనుగోళ్లపై విచారణ నిర్వహించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిపై ప్రభుత్వ ఆదేశాల మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన ఏసీబీ.. రూ.988.77 కోట్ల విలువైన మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో సుమారు రూ.150 కోట్లకుపైగా అవినీతి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ♦ ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం కలిగించిన ఈ వ్యవహారంలో అధికారులు, ప్రైవేట్ వ్యక్తులు కలిపి 19 మంది ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఏసీబీ నిమ్మాడలో అదుపులోకి తీసుకుంది. ఈఎస్ఐ మాజీ డైరెక్టర్లు డాక్టరు సీకే రమేష్‌కుమార్‌ను తిరుపతిలో, డాక్టర్ జి.విజయ్‌కుమార్‌ను రాజమహేంద్రవరంలో అరెస్టు చేసింది. ఇప్పటికే సస్పెన్షన్‌లో ఉన్న డిమ్స్ ఉద్యోగులు డాక్టర్ జనార్దన్, ఇ.రమేష్‌బాబు, ఎంకేబీ చక్రవర్తిలను కూడా అరెస్టు చేసింది. మార్కెట్ ధరకన్నా అధికంగా చెల్లింపులు.. ♦ మందులు, ల్యాబ్ కిట్స్, శస్త్రచికిత్స పరికరాలు, ఫర్నిచర్, బయోమెట్రిక్ పరికరాల కొనుగోళ్లతో పాటు కాల్‌సెంటర్, ఈసీజీ సర్వీసుల ఒప్పందాల్లో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ♦ మార్కెట్ ధర కన్నా 50 నుంచి 129 శాతం అధికంగా చెల్లించి మందులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కొన్ని సంస్థలతో కుమ్మక్కై ఇ–టెండర్లో కాకుండా నామినేషన్ విధానంలో కొనుగోళ్లు జరిపారు. ♦ కొందరు ‘డిమ్స్’ ఉద్యోగులే తమ కుటుంబ సభ్యుల ద్వారా బినామీ కంపెనీలను సృష్టించారు. తప్పుడు ఇన్వాయిస్లు, బిల్లులతో రూ.కోట్లలో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారు. ఈసీజీకి డబుల్కిపైగా చెల్లింపులు... ♦ టీడీపీ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడి ఆదేశాలతో అప్పటి డిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సీకే రమేష్‌కుమార్ టెలీహెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ♦ టెలిమెడిసిన్‌కు సంబంధించి కాల్‌సెంటర్, టోల్ ఫ్రీ, ఈసీజీ సేవల ఒప్పందం లోపభూయిష్టంగా జరిగింది. ఇతర ఆస్పత్రుల్లో సుమారు రూ.200 మాత్రమే ఖర్చు అయ్యే ఈసీజీకి రూ.480 చొప్పున చెల్లించారు. ♦ కాల్‌సెంటర్‌కు వచ్చిన కాల్స్‌కి కాకుండా సర్వీసు ప్రొవైడర్ మొత్తం రిజిస్టర్ ఐపీకి, ఫేక్ కాల్స్ లాగ్స్‌కి ఒక్కో కాల్కి రూ.1.80 చొప్పున బిల్లులు చెల్లించారు. ♦ బయోమెడికల్ వేస్ట్ డిస్పోజబుల్ ప్లాంట్ ఏర్పాటులోనూ అవకతవకలు, అవినీతి చోటుచేసుకుంది. -
కుట్రతోనే తబ్లీగీలు రాష్ట్రంలోకి ప్రవేశించారు
బెంగుళూరు : తబ్లీగి జమాత్, అజ్మీర్ దర్గాకు వెళ్లి వచ్చినవారి నుంచే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందిందని కర్ణాటక బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ రవికుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దొంగల్లాగా రాష్ట్రంలో ప్రవేశించి కరోనా వ్యాప్తికి కారకులయ్యారని దుయ్యబట్టారు. రాజస్తాన్‌లోని అజ్మీర్‌లోని దర్గాకు హాజరైన దాదాపు 1900 మంది, తబ్లీగికి వెళ్లొచ్చిన 500 మంది ద్వారానే కర్ణాటకలో సెకండరీ కాంటాక్ట్ ద్వారా వైరస్ వ్యాప్తికి కారకులయ్యారని ఆరోపించారు. మేధావులుగా పిలువబడే సమాజ పెద్దలు తబ్లీగీల చర్యలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. అంతేకాకుండా ఆశా వర్కర్లపై జరుగుతున్న దాడులను ఖండించిన రవికుమార్.. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు. అయితే ఒక మతానికి కరోనాను అంటగడుతూ, వారి వల్లే ఇలా జరిగిందని దూషించడం ఎంత మాత్రం సమంజసం కాదని ప్రధాని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై రవికుమార్ స్పందిస్తూ.. పార్టీ వైఖరి, వ్యక్తిగత అభిప్రాయాలు వేర్వేరని పేర్కొన్నారు. ఇప్పటివరకు కర్ణాటకలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 862కి చేరగా, 31 మంది మరణించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం 9 మంది ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది. (మా షాపులో ముస్లింలెవరు పనిచేయడం లేదు!) -
‘రామ’సక్కని సూరీడు!
తల్లి తన గర్భగుడిలో బిడ్డను నవమాసాలు మోస్తుంది.. ప్రాణాలకు తెగించి.. పురిటి నొప్పులతో జన్మనిస్తుంది. పాలిచ్చి.. లాలించి పెంచి పెద్ద చేస్తుంది.. తాను పస్తులుండైనా బిడ్డ ఆకలి తీరుస్తుంది. గోరుముద్దలు తినిపిస్తుంది.. చందమామ కథలు చెప్తుంది.ఆలనా పాలన చూస్తుంది.. అడిగిందల్లా ఇస్తుంది..జోలపాట పాడి నిద్రపుచ్చుతుంది..రుణం తీర్చుకునే సమయం వస్తే..కన్న కొడుకుగా.. ఏమిచ్చి తల్లి రుణం తీర్చుకోవాలి..?అమ్మంటే.. సాటి మనిషిగా చూడకుండా.. నిండైన అమ్మతనపు కమ్మదనం ఎరిగిన బిడ్డ..జబ్బు చేసిందని జాలి చూపలేదు..కలికాలం.. కరోనా కాటు.. జనం విలవిల్లాడుతుంటే..వైద్యాలయాలే దేవాలయాలు అనుకుని..వైద్యమో రామ‘చంద్రా’ అంటూ వైద్యుడే దేవుడంటూ..తల్లిని భుజానకెత్తుకొని వడివడిగా అడుగులేస్తూ.. పేగుతెంచుకు పుట్టిన ‘రవి’ పరుగులు తీశాడు.. వైద్యదేవత చల్లని చూపు చూసింది.. మాతృమూర్తి ఇంటికి చేరింది. (ఆకలితో అడవిలోనే..!) అనంతపురం, కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం మండలం దురుదకుంటకు చెందిన వృద్ధురాలు రామక్క మూడు రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. తల్లి బాధను చూసి తట్టుకోలేని తనయుడు రవికుమార్ ద్విచక్ర వాహనంపై కళ్యాణదుర్గం తీసుకెళ్లాడు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు అమలులో ఉన్నాయి. దీంతో ద్విచక్ర వాహనానికి అనుమతిలేకపోయింది. పట్టణంలోకి ప్రవేశించే ప్రధాన రహదారి వద్ద బైక్‌ను వదిలి, తల్లిని భుజంపై ఎత్తుకొని ఎర్రటి ఎండలో ప్రైవేట్ ఆస్పత్రి వద్దకు వెళ్తున్న దృశ్యాన్ని స్థానికులు చూసి ఆశ్చర్యపోయారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా దెబ్బకు ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యం చేయకూడదని నిబంధన ఉంది. దీంతో వైద్యం అందలేదు. ఎవరిని అడగాలో.. ఎక్కడికి వెళ్లాలో తెలియక.. చివరికి కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ స్టాఫ్‌నర్సును అడిగి తల్లికి వైద్యం చేయించుకొని స్వగ్రామానికి తిరిగి వెళ్లిపోయాడు. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రైవేట్ వైద్యులు ప్రభుత్వాస్పత్రిలో సేవలందించేందుకు వచ్చి ఉంటే వృద్ధురాలైన తల్లికి వైద్యం చేయించడానికి కుమారుడికి ఇన్ని అవస్థలు ఉండేవి కావని పలువురు అభిప్రాయపడ్డారు. తల్లి రామక్కను మోసుకుని వైద్యం కోసం తీసుకెళ్తున్న కుమారుడు రవికుమార్ -
డోపీలు సుమీత్, రవి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత బాక్సర్ సుమీత్ సాంగ్వాన్... షూటర్ రవి కుమార్ డోపింగ్ పరీక్షల్లో పట్టుబడ్డారు. వీరిద్దరు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత ఔషధాల జాబితాలో ఉన్నవాటిని వినియోగించినట్టు డోప్ పరీక్షల్లో తేలింది. సుమీత్ 2017 ఆసియా ఛాంపియన్ షిప్ లో రజతం గెలిచాడు. సుమీత్ ఎక్టెజోలామైడ్ ఉత్ప్రేరకం వాడినట్లు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తెలిపింది. గత ఏడాది జరిగిన కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకాలు గెలిచిన షూటర్ రవి కుమార్ ప్రొప్రానోలోల్ ట్యాబ్లెట్‌ను వాడినట్లు డోప్ పరీక్షలో తేలింది. మైగ్రేన్ తలనొప్పి వచ్చినపుడు డాక్టర్ వద్దకు వెళ్లగా అతను ఈ ట్యాబ్లెట్ రాసిచ్చాడని రవి తెలిపాడు. -
ఏసీబీ వలలో డీపీఓ రవికుమార్
సాక్షి, మేడ్చల్ జిల్లా: మేడ్చల్ కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ శాఖ కార్యాలయంలో రూ. లక్ష లంచం తీసుకుంటూ డీపీఓ రవికుమార్ అవినీతి నిరోధక శాఖకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టు బడ్డారు. వివరాలు.. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి గ్రామ పంచాయతీ (ప్రస్తుతం మున్సిపాలిటీ) మాజీ సర్పంచ్ భేరి ఈశ్వర్ తన పదవీ కాలం(2014ఏప్రిల్ నుంచి 2019 జూన్ వరకు) లోని అభివృద్ధి పనులు, ఖర్చులకు సంబంధించిన ఆడిట్ లెక్కల్ని నివేదించాలని డీపీఓగా పనిచేస్తోన్న రవికుమార్ అడిగారు. ఆయన చెప్పిన ప్రకారమే ఆడిట్ లెక్కల్ని క్లియర్ చేసేందుకు వెళ్లగా.. ఆపని పూర్తి చేసేందుకు రవికుమార్ రూ.15 లక్షలు డిమాండ్ చేశారు. ఇంత పెద్దమొత్తంలో డబ్బులివ్వలేనని ఈశ్వర్ తెలుపగా, ఇరువురి మధ్య రూ.5 నుంచి రూ.4 లక్షలకు ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని ఈశ్వర్ ఏసీబీకి తెలిపారు. గురువారం ఈశ్వర్ రూ.లక్ష రవికుమార్‌కు అందజేస్తుండగా.. ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొంపల్లిలోని రవికుమార్ ఇంటిలోనూ సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. -
ఐదుగురు లిఫ్టర్లు డోపీలు
సాక్షి, భువనేశ్వర్: భారత వెయిట్‌లిఫ్టర్లు డోపింగ్‌లో దొరికిపోయారు. నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్న ఐదుగురు డోపీల్లో కామన్వెల్త్ గేమ్స్ మాజీ చాంపియన్, ఒడిశాకు చెందిన కత్తుల రవికుమార్ ఉన్నాడు. 2010లో బంగారం నెగ్గిన రవి... 2014లో రజతం గెలిచాడు. అతనితో పాటు జూనియర్ కామన్వెల్త్ గేమ్స్ పతక విజేత పూర్ణిమా పాండే, హీరేంద్ర సారంగ్, దీపిక శ్రీపాల్, గౌరవ్ తోమర్ ఉన్నారు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) నిర్వహించిన పరీక్షల్లో వీరంతా నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు తేలడంతో వీరిపై సస్పెన్షన్ వేటు వేశారు. స్టార్ లిఫ్టర్ రవి ‘ఒస్టారిన్’ అనే ఉత్ప్రేరకం తీసుకున్నాడు. ఇది కండరాల శక్తిని పెంచేది. విశాఖపట్నంలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో అతనికి నిర్వహించిన పరీక్షల్లో దొరికిపోవడం జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ వర్గాల్ని కలవరపరిచింది. అయితే ఈ డోపింగ్ ఉదంతంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కోటా బెర్తులకు వచ్చిన ముప్పేమీ లేదని భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్ఎఫ్) కార్యదర్శి సహదేవ్ యాదవ్ స్పష్టం చేశారు. ‘నాడా’ భారత్‌కు సంబంధించిన సంస్థ అని అంతర్జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) చేసే పరీక్షల్నే అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎఫ్) పరిగణిస్తుందని ఆయన చెప్పారు. కొత్త ఐడబ్ల్యూఎఫ్ నిబంధనల ప్రకారం 2008 నుంచి 2020 వరకు ఏదైనా దేశంలో 20 లేదా అంతకంటే ఎక్కువ డోపీలు పట్టుబడితే ఒలింపిక్స్ కోటా బెర్తుల్ని ఆ దేశం కోల్పోతుంది. -
కండ ఉంది... సాయం చేసే గుండె కావాలి
ప్రతి రోజూ ఏడు గంటల వ్యాయం. రుచీ పచీ లేని ఆహారం. సరదాగా తిరగాల్సిన వయసులో ఏదో సాధించాలనే తపన. మరోవైపు బీదరికంతో పోరాటం. కష్టంగా ఉన్నా ఎంతో ఇష్టంతో ముందుకెళుతూ అంతర్జాతీయ పతకాలు సాధిస్తున్నాడు ఈ యువ యోధుడు. ఇంటర్మీడియట్ చదువుకున్న ఎన్.రవి కుమార్ (21) తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎవరూ సాధించని అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. సెప్టెంబర్‌లో ఇండోనేషియాలో జరిగిన ఏషియన్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించాడు. నవంబర్‌లో సౌత్ కొరియాలో జరగనున్న ప్రపంచ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికైన తొలి తెలుగువ్యక్తి రవికుమారే. అయితే పేదరికం మూలన ఆ ప్రపంచ కప్ పోటీలకు దూరం అయ్యాడు. ప్రతిభ పుష్కలంగా ఉన్నా ఆర్ధిక ఇబ్బందులను అధిగమించడమే అతనికి కష్టంగా ఉంది. నెలకు ఆహార ఖర్చులకే దాదాపు రూ.లక్ష అవుతుంది. స్పాన్సర్షిప్ కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. కొంత చేయూతనిస్తే తప్పకుండా ప్రపంచ మెడల్ సాధిస్తానని ఆత్మ విశ్వాసంతో చెబుతున్నాడు. లారీడ్రైవర్ కుమారుడు రవి కుమార్‌ది గుంటూరు జిల్లా ఏటుకూరు గ్రామం. తండ్రి వెంకట్రావు లారీడ్రైవర్. అమ్మ వెంకట నరసమ్మ గృహిణి. వారిది సాధారణ కుటుంబం. తండ్రి సంపాదన కుటుంబ పోషణకు సరిపోతుంది. అయితే వారు రాత్రింబగళ్లు కష్టం చేసి కుమారుడికి తమ వంతు ప్రోత్సాహం ఇస్తున్నారు. కొడుకు బంగారు పతకం సాధిస్తే చాలని నాన్న లారీ డ్రైవర్‌గా కష్టపడుతుంటే తల్లి చిల్లర అంగడి పెట్టుకొని వచ్చిన సంపాదనను కుమారునికే ఖర్చుపెడుతోంది. పోటీలకు వెళ్లేందుకు డబ్బులు లేకపోతే తన బంగారు నగలు తాకట్టు పెట్టి మరీ పోటీలకు పంపిందామె. ఆ తర్వాత ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రోత్సాహం లభించింది. కండలు పెంచే వ్యాయామం కోసం రవి కుమార్ తీసుకునే పాలు, గుడ్లు, చికెన్, పండ్లు, చేపలు, కూరగాయలు, ప్రోటీన్ పౌడర్లు వీటి ఖర్చు చాలా ఎక్కువ. ప్రస్తుతం స్నేహితుల సాయం, పోటీల ద్వారా వచ్చే ప్రైజ్‌మనీతో సాధన నడుస్తోంది. ఇటీవల సెప్టెంబరు నెలలో ఇండోనేషియా బాటమ్‌లో జరిగిన ప్రపంచ బాడీబిల్డింగ్ పోటీల్లో పతకం సాధించి, పతకంతోపాటు, భారతదేశ జెండాను ప్రదర్శిస్తూ... సరదాగా మొదలైన సాధన రవి కుమార్ తన 15వ ఏట స్నేహితులతో సరదాగా వ్యాయామం ప్రారంబించాడు. రోజుకు గంట సేపు చేస్తున్నా సీరియస్‌గా తీసుకుని చేసింది లేదు. 2014లో గుంటూరులో జి.శ్రీనివాసరావు అనే సీనియర్ బాడీ బిల్డర్ ఏర్పాటు చేసిన పోటీలకు అన్ని జిమ్లకూ ఆహ్వానం అందింది. రవి కుమార్ కూడా ఆ పోటీల్లో సరదాగా పాల్గొన్నాడు. అప్పుడు రవి దేహాన్ని చూసి కొంత మంది నవ్వారు. అది అతని మనస్సులో నాటుకుపోయింది. అప్పుడు కోచ్ జి.శ్రీనివాసరావును కలసి మంచి బాడీ బిల్డర్ అవ్వాలంటే ఏం చేయాలని అడగడం, అందుకు ఆయన కొన్ని సూచనలు చేయడంతో రవి జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఇక అప్పటి నుంచి సాధన గంట నుంచి రెండు, మూడు.. నాలుగు గంటలైంది. ‘మిస్టర్ ఆంధ్ర’ టైటిల్ సొంతమయ్యింది. ప్రస్తుతం రవికుమార్ 75 కేజీల విభాగంలో ఇండియాలోనే బెస్ట్‌గా కొనసాగుతున్నాడు. తల్లి వెంకట నరసమ్మతో చిల్లర కొట్టులో... ఆహార నియమాలు కఠోరం బాడీ బిల్డర్స్ ఆహార నియమాలు చాలా కఠినంగా ఉంటాయి. రవి కుమార్ తీసుకునే చికెన్, ఫిష్, కూరగాయలలో కనీసం ఉప్పుగాని, మసాలాలుగాని వాడరు. సగం ఉడికినవే తినాలి. అంతే కాదు పోటీలకు 10 రోజుల ముందు నుంచి మంచినీరు తాగడం క్రమేపీ తగ్గించేస్తారు. పోటీలకు మూడు రోజుల ముందునుంచి చుక్క నీరు కూడా తీసుకోరు. అప్పుడే బాడీలో ఉండే మజిల్స్‌ను పోటీల్లో ప్రదర్శించే అవకాశం లబిస్తుంది. ఈ మూడు రోజులు వారు పడే అవస్థలు వర్ణాతీతం. అయినా వాటిని ఎంతో ఆనందంగా స్వీకరిస్తారు. అప్పుడే కదా పతకాలు సాధించేది. సాధించిన పతకాలతో... ప్రపంచ కప్ పోటీలకు దూరం నవంబరు 5 నుంచి 11 వరకు దక్షిణ కొరియాలో జరిగే ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీలకు ఎంపిక అయ్యాడు రవి. కాని పేదరికం అడ్డొచ్చింది. స్పాన్సర్లు దొరకకపోవడంతో పోటీలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పతకం సంపాదించాలనే తపన ఉన్నా డబ్బులు లేక వెళ్లలేకపోయాననే బాధ అతనిని పట్టి పీడిస్తోంది. అతను మాత్రం పట్టు వదలకుండా మిస్టర్ ఇండియా బాడీ బిల్డింగ్ పోటీలకు వెళ్లాలని కఠోర శ్రమ చేస్తూనే ఉన్నాడు. ఈ పోటీలు ఫిబ్రవరి 1–2, 2020 సంవత్సరంలో జరగనున్నాయి. స్పాన్సర్లు, ప్రభుత్వం చేయూతనిస్తే, తెలుగోడి సత్తా చాటి బంగారు పతకం సాధిస్తానని ధీమాగా చెబుతున్నాడు. ‘నాకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందలేదు. గతంలో ప్రయత్నించి వదిలేసాను. వ్యాయామమే జీవితంలా బతుకుతున్నాను. దాని కోసం ఇంట్లో భారంగా ఉన్నా నెట్టుకొస్తున్నాను. ఒక్కొక్కసారి వదిలేద్దామని అనుకున్నా మళ్ళీ రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళుతున్నాను. త్వరలో ముఖ్యమంత్రి జగనన్నను కలుస్తాను. ఆయనకు నా పతకాలన్నీ చూపిస్తాను’ అని ఆశగా చెబుతున్నాడు రవి కుమార్. – ఒ.వెంకట్రామిరెడ్డి, సాక్షి అమరావతి బ్యూరో -
నిన్న జనసేన.. ఈరోజు బీఎస్పీ
పశ్చిమ గోదావరి జిల్లా: ఎన్నికల వేళ తెలుగురాష్ట్రాల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఈరోజు ఒక పార్టీలో ఉన్న అభ్యర్థులు మరుసటి రోజు ఏ పార్టీలో ఉంటారో తెలియడం లేదు. ఇటీవలే ఏలూరు రేంజ్ డీఐజీగా పదవీ విరమణ చేసిన రవికుమార్ మూర్తి జనసేన పార్టీలో చేరారు. తన సొంత ప్రాంతమైన తిరుపతి ఎంపీ సీటును జనసేన నుంచి రవికుమార్ ఆశించారు. తిరుపతి సీటు దక్కకపోవడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సూచనతో బీఎస్పీ అభ్యర్గిగా కొవ్వూరుకు మారారు. పొత్తులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సీటును జనసేన బీఎస్పీకి కేటాయించిన సంగతి తెల్సిందే. నిన్నటి వరకు జనసేనలో ఉండి ఒక్క రోజులోనే కండువా మార్చి బీఎస్పీ అభ్యర్థిగా సోమవారం మాజీ డీఐజీ రవికుమార్ మూర్తి నామినేషన్ దాఖలు చేశారు. దీంతో అవాక్కవడం పార్టీ నేతల వంతైంది. -
ఎంపీ యోధపై హరియాణా గెలుపు
లుథియానా: ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)లో యువ రెజ్లర్ రవికుమార్... సందీప్ కుమార్‌కు షాకిచ్చాడు. దీంతో శనివారం జరిగిన మ్యాచ్‌లో హరియాణా హ్యామర్స్ 4–3తో ఎంపీ యోధపై గెలుపొందింది. 86 కేజీల పురుషుల బౌట్లో అలీ షబనోవ్ 8–0తో దీపక్ (ఎంపీ యోధ)పై గెలుపొందగా, మహిళల 76 కేజీల విభాగంలో కిరణ్ 0–6తో అండ్రియా కరోలినా (ఎంపీ యోధ) చేతిలో కంగుతింది. పురుషుల 65 కేజీల కేటగిరీలో రజనీశ్ 0–5తో హాజి అలియెవ్ (ఎంపీ యోధ) చేతిలో కంగుతినడంతో హరియాణా 1–2తో వెనుకబడింది. ఈ దశలో హ్యామర్స్కు తయన ఒమెల్చెంకో (మహిళల 62 కేజీలు) 6–0తో ఎలైస్ మనొలొవ (ఎంపీ యోధ)పై గెలిచి స్కోరును 2–2తో సమం చేసింది. పురుషుల 74 కేజీల్లో ప్రవీణ్ రాణా 0–7తో వసిల్ మిఖాయిలొవ్ (ఎంపీ యోధ) చేతిలో పరాజయం చవిచూడగా, మహిళల 57 కేజీల విభాగంలో నిచిత 8–0తో పూజ ధండ (ఎంపీ యోధ)పై నెగ్గింది. స్కోరు 3–3తో సమమైన దశలో నిర్ణాయక పురుషుల 57 కేజీల విభాగంలో రవి 10–0తో సందీప్ తోమర్ (ఎంపీ యోధ)ను కంగుతినిపించడంతో లీగ్‌లో హ్యామర్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. -
పసిడి పతక పోరుకు రవి కుమార్ అర్హత
ప్రపంచ అండర్–23 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ రవి కుమార్ ఫ్రీస్టయిల్ 57 కేజీల విభాగంలో ఫైనల్‌కు చేరి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. రొమేనియాలో జరుగుతోన్న ఈ మెగా ఈవెంట్ సెమీఫైనల్లో రవి 10–8తో తురొబోవ్ (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందాడు. నేడు జరిగే స్వర్ణ పతక పోరులో జపాన్‌కు చెందిన తొషిహిరోతో రవి తలపడతాడు. ఒకవేళ రవి గెలిస్తే ఈ ఈవెంట్ చరిత్రలో స్వర్ణం నెగ్గిన తొలి భారతీయ రెజ్లర్‌గా గుర్తింపు పొందుతాడు. 2017లో బజరంగ్ పూనియా (65 కేజీలు), ఓంప్రకాశ్ (70 కేజీలు) రజత పతకాలు గెలిచారు. -
ఆసియన్ గేమ్స్‌లో భారత్ బోణీ
-
పోలీస్ ఇమేజ్ పెంచుతా
ఏలూరు టౌన్ : ఏలూరు రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాననీ ఏలూరు రేంజ్ డీఐజీగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన టి.రవికుమార్ మూర్తి చెప్పారు. ప్రణాళికబద్ధంగా పనిచేస్తూ పోలీసుల్లో జవాబు దారీ తనాన్ని పెంచేందుకు కృషి చేస్తానని, పోలీస్ ఇమేజ్ పెంచుతానని అన్నారు. శనివారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ‘సాక్షి’తో కొద్దిసేపు మాట్లాడారు. పోలీస్ శాఖలో మీ ఎంట్రీ ? డీఐజీ : 1992లో గ్రూప్–1 సర్వీసుకు ఎంపికై డీఎస్పీగా మొదట పోలీసు శాఖలో చేరాను. నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన చింతపల్లి, నర్సీపట్నం, కాశీబుగ్గ ప్రాంతాల్లోనూ, రంగారెడ్డి జిల్లా మల్కాజ్గిరి ప్రాంతాల్లోనూ డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తించా. అదనపు ఎస్పీగా పదోన్నతి పొంది నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పనిచేశాను. 2002వ సంవత్సరంలో ఎస్పీగా తిరుపతి, విజయవాడల్లో పనిచేయటంతోపాటు, గుంటూరులో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీగా, ఏపీ ట్రాన్స్‌కో ఎస్పీగా, రాజమండ్రి అర్బన్ జిల్లా ఎస్పీగా పనిచేశాను. అనంతరం విశాఖపట్నం క్రైమ్, లా అండ్ ఆర్డర్ డీసీపీగా పనిచేస్తూ 2017 నవంబర్‌లో డీఐజీగా పదోన్నతి పొంది విశాఖపట్నంలోనే జాయింట్ సీపీగా పనిచేశాను. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఏలూరు రేంజ్ డీఐజీగా పూర్తిస్థాయి బాధ్యతలు ఇస్తూ పోస్టింగ్ ఇచ్చింది. మీ ప్రాధాన్యతలు ఏమిటీ? డీఐజీ : ఏలూరు రేంజ్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకే పెద్దపీట వేస్తా. ప్రజలు స్వేచ్ఛగా జీవించేలా, ప్రజల్లో పోలీస్ వ్యవస్థ పట్ల భయాన్ని పోగొట్టి వారితో మమేకం అయ్యేలా చేయటమే ప్రాధాన్యతాంశం. పోలీసుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించి ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు కృషి చేస్తాను. పోలీస్ శాఖలోని అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాను. జిల్లాలో పరిస్థితులను సమీక్షించి ప్రతీ సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపడతాం. గోదావరిలో పడవ ప్రమాదాలపై మీ చర్యలు? డీఐజీ : జిల్లాలోనూ, రేంజ్ పరిధిలోనూ పడవ ప్రమాదాల కారణంగా అనేకమంది ప్రయాణికులు తమ విలువైన ప్రాణాలు పోగొట్టుకోవటం బాధాకరం. గోదావరి పరివాహక ప్రాంతాల్లో అనుమతుల్లేని బోట్లు విషయంలో కఠినంగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇష్టారాజ్యంగా పడవలు నడిపితే ఆయా యాజమాన్యాలపై కేసులు నమోదు చేసేందుకు వెనుకాడేదిలేదు. ఇక పడవల్లో విధిగా లైఫ్ జాకెట్లు, భద్రతా పరికరాలు ఏర్పాటు చేసేలా చర్యలు చేపడతాం. ప్రమాదాలకు కారణాలను విశ్లేషించి ఏఏ ప్రాంతాల్లో తరచూ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయో ఆయా ప్రాంతాల్లో నిఘా పెంచుతాం. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ శాఖ అధికారుల సమన్వయంతో బోట్లలో భద్రతా ప్రమాణాలపై సమీక్షిస్తాం. జిల్లాలో మావోల కదలికలు గురించి..? డీఐజీ : ఆంధ్రా, తెలంగాణ, చత్తీస్గడ్ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై నిరంతర నిఘా కొనసాగుతుంది. జిల్లాలో ఎప్పటికప్పుడు మావోల కదలికలు గుర్తిస్తూ దానికి అనుగుణంగా జల్లెడ పట్టే కార్యక్రమాన్ని చేపడతాం. ప్రభావిత ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తూ వారి కార్యకలాపాలను నిరోధించేందుకు గట్టి చర్యలు తప్పకుండా ఉంటాయి. ప్రస్తుతం ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ (ఏవోబీ)లో కొద్దిపాటి కదలికలు ఉన్నాయి..జిల్లాలో మావోల కార్యకలాపాలు లేవనే చెప్పాలి. సంఘ వ్యతిరేక శక్తులపై నిఘా ఉంటుందా? డీఐజీ : సంఘ వ్యతిరేక శక్తులను ఉపేక్షించేదిలేదు. ఏలూరు రేంజ్ పరిధిలో సమాచారాన్ని సేకరించి చట్టవ్యతిరేక, సంఘవ్యతిరేక కార్యకలాపాలు సాగించే వ్యక్తులు, ముఠాలను అణచివేసేందుకు చర్యలు తీసుకుంటాం. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి సమాచారాన్ని తనకు నేరుగా అందించవచ్చు. గంజాయి రవాణా, మహిళలు, యువతుల అక్రమ రవాణా వంటివాటిపై నిఘా పెంచి, అటువంటి ముఠాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తాం. ఇక జిల్లాలో అనధికార క్లబ్బులు, పేకాట, జూదం వంటివి లేకుండా చేసేందుకు చట్టం మేరకు చర్యలు తప్పవు. రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక కార్యాచరణ ఏమిటి? డీఐజీ : రేంజ్లో 890 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులు, 2800 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారులు ఉన్నాయి. రాష్ట్రంతో పోల్చితే జిల్లాలో ప్రమాదాల నివారణకు ఆయా జిల్లాల ఎస్పీలు చేపట్టిన భద్రతా చర్యలు సంతృప్తికరంగానే ఉన్నాయి. నిరంతరం ప్రత్యేకంగా రోడ్డు భద్రతపై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతాం. -
ఏలూరు రేంజ్ డీఐజీగా రవికుమార్ మూర్తి
ఏలూరు టౌన్ : ఏలూరు రేంజ్ డీఐజీగా టి.రవికుమార్ మూర్తిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు రేంజ్ డీఐజీ పోస్టు గత కొంతకాలంగా ఇన్ఛార్జ్ పాలనలో కొనసాగుతుండగా తాజాగా ప్రభుత్వం రెగ్యులర్ డీఐజీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం విశాఖపట్నం జాయింట్ కమిషనర్ –2గా పనిచేస్తూ బదిలీపై ఏలూరు రేంజ్ డీఐజీగా వస్తున్నారు. రవికుమార్ మూర్తి రెండురోజుల్లో ఏలూరు రేంజ్ డీఐజీగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. -
సుప్రీం మొట్టికాయలు: ఏపీకి ఆర్టీఐ కమిషనర్లు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు ఆర్టీఐ కమిషనర్ల నియామకం చేపట్టింది. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం మొద్దునిద్ర వీడింది. రాష్ట్రంలో నాలుగేళ్ల తర్వాత సమాచార కమిషనర్లను నియమించింది. మాజీ ఐపీఎస్ అఫీసర్ బీవీ రమణకుమార్(కృష్ణా జిల్లా), మాజీ ఐఎఫ్ఎస్ రవికుమార్ (రాజమండ్రి), టీడీపీ లీగల్ సెల్ సభ్యుడు జనార్థన్‌రావు(కడప)లను ఆర్టీఐ కమిషనర్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
టన్ను స్టీల్‌పై రూ.2,500 దాకా ఆదా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టీల్ రంగంలో భారత్‌లో తొలి అగ్రిగేటర్ అయిన స్టీల్ ఆన్ కాల్ సర్వీసెస్ తన కస్టమర్లకు త్వరితగతిన సరుకు చేర్చేందుకు భారీ గిడ్డంగులను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్, వైజాగ్, అమరావతి, బెంగళూరు, చెన్నై, కొచ్చిలో ఇవి రానున్నాయి. వీటి కోసం రూ.150–200 కోట్లు ఖర్చు చేస్తామని స్టీల్ ఆన్ కాల్ సీఎండీ ఎ.రవికుమార్ తెలిపారు. సీఈవో లక్ష్మి, సీఎంవో ఈశ్వరయ్యతో కలిసి ఆయన మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. 2016 ఏప్రిల్‌లో కంపెనీ ప్రారంభం అయిందని, ఈ ఏడాది దేశవ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పారు. లైవ్ ప్రైస్ ద్వారా కస్టమర్లకు 20 బ్రాండ్ల స్టీల్ విక్రయిస్తున్నామని తెలిపారు. తమ ప్లాట్‌ఫామ్ ద్వారా ఒక టన్నుపై వినియోగదార్లకు రవాణా, ఇతర ఖర్చులు రూ.2,500 దాకా ఆదా అవుతుందని వెల్లడించారు. ఇందుకు కనీసం ఒక టన్ను ఆర్డరు చేయాల్సి ఉంటుందన్నారు. 2017–18లో కంపెనీ రూ.76 కోట్ల టర్నోవర్ సాధించింది. -
రియల్ ఏజెంట్‌పై నటుడు జగ్గేశ్ దాడి
యశవంతపుర: మల్లేశ్వరంలో నటుడు జగ్గే శ్, రియల్ ఎస్టేట్ ఏజెంట్ మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగింది. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావటంతో వి వాదంగా మారింది. వివరాలు... మల్లేశ్వరం 8వ క్రాస్‌లో వరసకు బావైన మండల మాదేగౌడ కాయకూరల వ్యా పారం చేస్తున్నారు. శుక్రవారం రాత్రి 8:30 గంటల సమయంలో రియల్ ఏజెంట్ రవికుమార్ అంగడి వద్ద వాహనాలకు ఇబ్బంది కలుగుతుందని మాదేగౌడతో అప్పుడప్పుడు ఘర్షణ పడేవారు. ఈ విషయం మాదేగౌడ నటుడు జగ్గేశ్ దృష్టికి తీసుకురావటంతో స్థానిక కార్పోరేటర్ మంజణ్ణను కారులో తీసుకుని వెళ్లాడు. దీంతో ఒక్కసారిగా జగ్గేశ్ రవికుమార్‌పై రోల్‌కాల్‌కు వచ్చావంటూ దాడికి పాల్పడిన్నట్లు వైరల్ అయింది. తను దాడి చేయలేదని బావ మాదేగౌడ వద్ద అక్రమంగా డబ్బులు వసూలు చేయాటనికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తలకు పట్టుకుని పోలీసులకు అప్పగించిన్నట్లు జగ్గేశ్ వివరించారు. ఏవరో విడియో రికార్డు చేసి తనపై లేనిపోని అరోపణలు చేస్తున్నట్లు జగ్గేశ్ పేర్కొన్నారు. పోలీసులు ఎలాంటి కేసు నమోదు చేయలేదు. -
‘గిన్నిస్ కిక్స్’లో తాండూరువాసి
సాక్షి, తాండూరు టౌన్: గంట వ్యవధిలో అత్యధిక తైక్వాండో కిక్స్‌తో గిన్నిస్ రికార్డు సృష్టించిన జట్టు సభ్యుల్లో వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన రవికుమార్ ఉన్నారు. గత ఆగస్టు 12 న హైదరాబాద్‌లో నిర్వహించిన తైక్వాండో కిక్స్ గిన్నిస్ బుక్ అచీవ్మెంట్లో.. ఒకే గంటలో 58 వేల కిక్స్‌తో ఉన్న రికార్డును వీరు తిరగరాశారు. తైక్వాండో మాస్టర్ బొబ్బిలి ఆధ్వర్యాన నిర్వహించిన ఈవెంట్లో 89,402 కిక్స్‌తో రికార్డు సవరించారు. జట్టులో పాల్గొన్న రవికుమార్ గిన్నిస్ రికార్డు ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఈవెంట్లో పాలుపంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. -
రియల్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం
- యజమాని మృతి.. భార్య, కుమారుల పరిస్థితి విషమం - కరీంనగర్‌కు చెందిన వారుగా అనుమానం తిరువణ్ణామలై (తమిళనాడు): తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఓ లాడ్జిలో తెలంగాణకు చెందిన ఓ రియల్టర్ కుటుంబ సభ్యులందరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కుటుంబ యజమాని రవికుమార్ (55) మృతి చెందగా, అతని భార్య, ఇద్దరు కుమారుల పరిస్థితి విషమంగా ఉంది. భార్య పద్మ, కుమారులు శశి, శంకర్‌లతో కలసి రవికుమార్ మూడు నెలలక్రితం తిరువణ్ణామలై సెంగం రోడ్డులోని ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నాడు. గది తీసుకున్న సమయంలో కరీంనగర్ అని మాత్రం నమోదుచేశారు. పూర్తి వివరాలు తెలియరాలేదు. సోమవారం ఉదయం 10 గంటల వరకు గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది కిటికీలు తెరిచిచూడగా నలుగురూ స్పృహ తప్పి పడిఉన్నారు. తలుపులు పగలగొట్టి పరిశీలించగా శీతలపానీయాల్లో విషం కలిపి తాగినట్లు తెలిసింది. వెంటనే నలుగురినీ తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రవికుమార్ మంగళవారం ఉదయం మృతిచెందాడు. మిగిలిన ముగ్గురి పరిస్థితి సైతం విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడితే పూర్తి వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు. -
మోజు తీరాక... వద్దుపొమ్మన్నాడు..
భూపాలపల్లి అర్బన్: ప్రేమించానన్నాడు. పెళ్లికూడా చేసుకున్నాడు. తీరా మోజు తీరాక వద్దుపొమ్మంటున్నాడు. దీంతో ప్రేమించి పెళ్లి చేసుకొన్న వాడికోసం భార్య, భర్త ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది. వివరాలు.. పట్టణానికి చెందిన పెండెల రవికుమార్ వరంగల్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్న సమయంలో హన్మకొండ వడ్డేపల్లికి చెందిన మాడుచి చారుశీలతో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారడంతో 2016 సెప్టెంబర్ 13న వరంగల్ మ్యూజికల్ గార్డెన్లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వీరిద్దరు కలిసే ఉంటున్నారు. పెద్దల సమక్షంలో మరోసారి పెళ్లి చేసుకున్న అనంతరం ఇంటికి తీసుకెళ్తానని చెప్పాడు. ఈ విషయం పై పలుమార్లు ఒత్తిడి తెచ్చిన లాభం లేకపోయింది. కాగా.. గత నెల 17 వరకు ఫోన్లో మాట్లాడిన రవి అప్పటి నుంచి ఫోన్ స్విచ్ఛాప్ చేసుకున్నాడు. ఆందోళన చెందిన చారుశీల భర్త గురించి కూపీ లాగగా.. మరో పెళ్లికి సిద్ధమైనట్లు తెలిసింది. దీంతో ప్రేమించిన వాడికోసం రెండు రోజులుగా పట్టణంలోని రెడ్డికాలనీలోని రవికుమార్ ఇంటి ముందు చారుశీల నిరాహారదీక్షకు దిగింది. ఆమెకు మహిళా సంఘాలు తమ మద్దతు తెలిపాయి. -
ఎవరెస్ట్ ఎక్కాలని వెళ్లి.. ప్రాణాలు కోల్పోయాడు!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని జయించాలని బయల్దేరిన మరో భారతీయుడు.. ఆ కొండల్లోనే తుది శ్వాస విడిచాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రవికుమార్ మృతదేహాన్ని షేర్పాలు గుర్తించారు. కానీ, మృతదేహాన్ని వెలికితీయడం అసాధ్యంగా ఉందని తుప్‌డెన్ షేర్పా చెప్పారు. మామూలుగా వెళ్లే మార్గం కంటే దాదాపు 650 అడుగుల లోతుకు మృతదేహం పడిపోయి కనిపించిందన్నారు. గడిచిన వారం రోజుల్లో అమెరికా, స్లొవేకియా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన పర్వతారోహకులు కూడా ఎవరెస్ట్ మీద మరణించారు. శనివారం నాడు ఎవరెస్ట్ ఎక్కుతుండగా కుమార్ అనారోగ్యం పాలయ్యారు. దాంతో సమీపంలో ఉన్న క్యాంపు వరకు కూడా చేరుకోలేకపోయారు. అయితే అతడితో పాటు ఉన్న నేపాలీ షేర్పా గైడ్ మాత్రం క్యాంపు వరకు వెళ్లారు. గైడ్‌కు కూడా అనారోగ్యంగానే ఉన్నా, ఎలాగోఆలా 8వేల మీటర్ల ఎత్తున ఉన్న సౌత్‌కోల్ వద్ద క్యాంపు వరకు వెళ్లగలిగాడు. శనివారం మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో రవికుమార్, ఆయన గైడ్ కలిసి దాదాపు 8850 మీటర్ల ఎత్తు వరకు వెళ్లారు. అప్పటికే చాలా ఆలస్యం అయినట్లు లెక్క. వాళ్లు తిరిగి వచ్చేటపుడు వాళ్లతో ఎక్కువమంది పర్వతారోహకులు లేరు. రవికుమార్‌తో పాటు అమెరికాకు చెందిన పర్వతారోహకుడు రోలండ్ ఇయర్‌వుడ్ (50) కూడా మరణించినట్లు పర్యాటక శాఖ అధికారి కమల్ ప్రసాద్ అధికారి నిర్ధారించారు. అయితే, వాళ్ల మృతదేహాలను కిందకు తీసుకురాగలమా లేదా అన్న విషయాన్ని మాత్రం ఇంకా చెప్పలేకపోతున్నారు. స్లొవేకియాకు చంఎదిన వ్లాదిమిర్ స్ట్రాబా (50) కూడా ఆదివారం మరణించారు. ఆయన మృతదేహాన్ని మాత్రం సౌత్ కోల్ క్యాంపు వద్దకు తీసుకురాగలిగారు. ఆస్ట్రేలియాకు చెందిన ఫ్రాన్సెకో ఎన్రికో మార్చెటి (54) చైనా వైపు ఉన్న ఎవరెస్ట్‌పై మరణించారు. ఈ సీజన్లో ఇప్పటివరకు ఎవరెస్ట్ మీద మరణించినవారి సంఖ్య ఆరుకు చేరింది. -
తిరుమలలో వ్యక్తి ఆత్మహత్య
తిరుమల: తిరుమలలో బిల్డింగ్‌పై నుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నేపాల్‌కు చెందిన రవికుమార్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. తిరుమలలోని ఓ ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి స్థానిక దుకాణసముదాయం రెండో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘనస్థలికి చేరుకుని మృతదేహాన్ని తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినండంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని భావిస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో లోకాయుక్తా ఎస్పీ మృతి
బెంగుళూరు: బెంగుళూరు-మైసూరు రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న లోకాయుక్తా ఎస్పీ, కారు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లోకాయుక్తా మైసూర్ విభాగానికి చెందిన ఎస్పీ రవికుమార్ బుధవారం బెంగుళూరు వెళ్లారు. అనంతరం రాత్రి మైసూరుకు తిరిగి వెళ్తుండగా రామోహళ్లి సమీపంలో డివైడర్‌ను ఢీ కొట్టింది. ఆ తర్వాత ఎదురుగా వస్తున్న టిప్పర్, ఆటోలను ఢీ కొట్టడంతో కారు నుజ్జుయింది. కారులో ప్రయాణిస్తున్న ఎస్పీ రవికుమార్, కారు డ్రైవర్ కిరణ్‌లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న కంబళగూడు పోలీసులు మృతదేహాలను స్ధానిక రాజరాజేశ్వరి ఆసుపత్రికి తరలించారు. -
చెక్ డ్యాంలో పడి బాలుడి మృతి
ఈతకు వె ళ్లిన పదేళ్ల బాలుడు చెక్ డ్యాంలో పడి మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా బెత్సవారిపేట మండలం చెట్టిచర్ల గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన బి. రవికుమార్ స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి చెక్‌డ్యాం వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో మునిగి మృతిచెందాడు. ఇది గుర్తించిన స్నేహితులు మృతదేహాన్ని బయటకు తీయడానికి యత్నిస్తున్నారు. -
వృత్తి నైపుణ్యంపై రాయలసీమ సైకాలజిస్ట్లకు శిక్షణ
అనంతపురం సిటీ : ఈ నెల 13 నుంచి రెండ్రోజుల పాటు వృత్తి నైపుణ్యంపై రాయలసీమ ప్రాంత సైకాలజిస్ట్‌కు శిక్షణ ఉంటుందని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోషియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రవికుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. శిక్షణ పొంద దలచిన వారు కర్నూలులోని కె.వి.ఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, రైల్వే స్టేషన్ దగ్గర, ఎస్ఆర్పేటకు రావాల్సిందిగా సూచించారు. మరింత సమాచారం కోసం 9441371817లో సంప్రదించాలని కోరారు. -
విసుగులు..విస్మరింపులు!
-
విసుగులు... విస్మరింపులు!
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం విసుక్కోవడాలు, విస్మరింపుల మధ్య నిస్సారంగా జరిగింది. సమావేశంలో ప్రాధాన్యత అంశాలను పక్కన పెట్టి, అవసరం లేని అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. దీనికి తోడు పలు శాఖల అధికారులు హాజరు కాకపోవడంతో కలెక్టరే అన్నింటికీ స మాధానం చెప్పాల్సి వచ్చింది. సమావేశ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు ఇద్దరు, జెడ్పీటీసీలు 13 మంది సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు. జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం జెడ్పీ చైర్ ప ర్సన్ చౌదరి ధనలక్ష్మి అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశం జరిగింది. సమావేశానికి జిల్లా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమార్ తదితరులు హజరయ్యారు. సమావేశంలో చర్చలకు అజెండాగా జిల్లాలో 61 ప్ర భుత్వ రంగ విభాగాల్లో చర్చ జరగాల్సి ఉండగా... పదింటిపైనే చర్చ జరిగింది. గ్రామీణ నీటి పారుదల శాఖ, డీఆర్డీఏ, డుమా, గృహనిర్మాణ సంస్థ, జిల్లా సహకార శాఖ, మ త్స్యశాఖ, జిల్లా మహిళాభివృద్ధి, పశుసంవర్ధక శాఖ తదితర ప్రధాన శాఖలను ఈ సమావేశంలో విస్మరించారు. ప్రశ్నలు ఓకే... సమాధానాలు వీకే! సమావేశానికి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ హాజరు కాలేదు. దీనిపై కలెక్టర్ పి.లక్ష్మీ నృ సింహం, మంత్రి అచ్చెన్నాయుడులు ఆగ్రహం వ్యక్తం చేశా రు. జిల్లా వైద్యశాఖాధికారి బదిలీపై వెళ్లిపోవడంతో కింది స్థాయి అధికారులు మాత్రమే హాజరయ్యారు. దీంతో పలు ప్రశ్నలకు సమాధానాలు రాలేదు. వయోజనవిద్య, నెడ్కాప్ అధికారులు విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని మంత్రి, విప్‌లు అసంతృప్తి వ్యక్తంచేశారు. భూగర్భ జలశాఖ అధికారులు ఎన్టీఆర్ జలసిరి పథకం మంజూరుకు కావాల్సి న అనుమతులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని, వేగవం తం చేయాలని అధికారులను అదేశించారు. బ్యాంకర్లు ఖరీఫ్ రుణాలు ఇవ్వకపోతే ఫిర్యాదుచేయాలని మంత్రి అచ్చెన్న సూచించారు. ప్రభుత్వ వైద్యశాఖలో ప్రసూతి వైద్యులను నియమించాలని సభ్యులు కోరగా, ైవె ద్యుల కొరత ఉందని కలెక్టర్ తెలిపారు. ఆస్పత్రుల అభివృద్ధి కమిటీలు లేనందున, పలు ఆస్పత్రుల్లో పర్యవేక్షణ లోపం ఉందని కమిటీలు ఏ ర్పాటు చేయాలని సభ్యులు కోరగా... మూడు రోజుల్లో జిల్లాలో ఎన్ని ఆస్పత్రులకు కమిటీలు లేవో వివరాలు అందజేయాలని మంత్రి సం బంధిత అధికారులకు ఆదేశించారు. ఇంతవరకు ఈ కమిటీలు పాతపట్నం, టెక్కలి తదితర ఆస్పత్రులో ఏర్పాటు చేయలేదని పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీ తెలిపారు. అలాగే కిడ్నీ రోగాలను గుర్తించేందుకు ‘మెడాల్’ అనే ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పారని, ఆ మెడికల్ రిపోర్టులు పూర్తిగా తప్పులు వస్తున్నాయని, వాటిని రోగికి అందజేయకపోవడంతో సమస్యగా మారుతోందని, వీటిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని శివాజీ కోరారు. 104 వాహనాలు నెలలో ఎక్కడెక్కడ సందర్శించనున్నాయో తెలియజేసే చార్టులను సంబంధిత శాసన సభ్యులకు అంద జేయాలని, అయితే గత సమావేశంలో చర్చిం చినా, ఇప్పటివరకు అమలులోకి రాలేదని, తక్షణం అమలు చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలు, వస తి గృహాల విద్యార్థులకు ప్రభుత్వం అందజేసే యూనిఫారాల కుట్టు పని స్థానికంగా ఉన్న మహిళలకు అప్పగించాలని కలెక్టర్ మంత్రిని కోరారు. ఉపాధి కల్పనా కార్యక్రమంలో భాగంగా మహిళలకు న్యాప్కిన్స్, ప్యాడ్స్ తయారీలో శిక్షణ ఇచ్చే కార్యక్రమం చేయాలని, ఈ ఉత్పత్తులను కేజీబీవీ, వసతి గృహాలు, పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా సరఫరా చేసేందుకు పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు. -
బైక్‌పై వెళ్తూ గుండెపోటుతో మృతి
బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్ర గుండెపోటుకు గురై రోడ్డుపైనే కన్నుమూశాడు. నేరేడ్మెట్ గీతాన గర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రవికుమార్(35) తన బైక్‌పై వెళ్తూ అకస్మాత్తుగా తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. అతడు కిందపడిపోగా చుట్టుపక్కల వారు అతడిని ఆస్పత్రికి తరలించేలోగానే తుదిశ్వాస విడిచాడు. అతడి గురించి వివరాలు తెలియాల్సి ఉంది. -
నెలన్నర క్రితం ఒక్కటైన చోటే..
రోడ్డు ప్రమాదంలో నవ దంపతుల దుర్మరణం నర్సు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెళుతుండగా ఘటన భూత్పూర్ / వనపర్తి : నిండునూరేళ్లు కలిసి దాంపత్య జీవితం గడపాలని నెలన్నర క్రితం ఒక్కటైన ఆ జంట అంతలోనే అనంతలోకాలకు చేరుకున్నారు. ఉద్యో గం కోసం యత్నిస్తుండగా విధి మాత్రం వారిద్దరినీ మృత్యుఒడికి చేర్చింది.. ఈ సంఘటన ఇరు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మహబూబ్ నగర్ జిల్లా వనపర్తి పట్టణంలోని వెంగళరావునగర్‌కు చెందిన కాటి రవికుమార్ (25)కు తెలకపల్లి మండ లం చిన్నముద్దునూరు వాసి శ్రీలత (21) తో గత మార్చి 26న పెళ్లి జరిగింది. భర్త స్థానికంగా ఓ ల్యాబ్‌లో టెక్నీషియన్‌గా, భార్య ప్రైవేటు హాస్పిటల్లో స్టాఫ్‌నర్సుగా పని చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం అత్తగారింటికి వెళ్లిన రవికుమార్ భార్యకు వైద్య ఆరోగ్య శాఖలో నర్సింగ్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేయాలని కోరాడు. దీంతో జిల్లా కేంద్రానికి శుక్రవారం ఉదయం బైక్‌పై బయలుదేరారు. అమిస్తాపూర్ శివారులోని గణపతి దేవాలయం సమీపంలోకి చేరుకోగానే గొర్రెలు, మేకల లోడ్‌తో బీదర్ నుంచి చెన్నైకి వెళుతున్న లారీ ఎదురుగా వస్తున్న డీసీఎంను తప్పించబోయి అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లి బోల్తాపడింది. దీంతో రవికుమార్ అక్కడికక్కడే మృతి చెందగా శ్రీలతకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే ఆమెను 108 అంబులెన్సలో జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందింది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలాన్ని ఎస్ఐ అశోక్ పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. 45 రోజుల క్రితం ఆనందంగా ఒక్కటైన చోటే భార్యాభర్తలిద్దరూ విగత జీవులుగా ఉండటం చూసిన కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు, స్నేహితులు కన్నీరుమున్నీరయ్యారు. భాదిత కుటుంబాలను రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , మున్సిపల్ మాజీ చైర్మన్ బి.లక్ష్మయ్య తదితరులు పరామర్శించారు. -
ప్రేమ వేధింపులతో ఆరిన దీపం
= ప్రేమించాలని ఫోన్లో వేధింపులు = వివాహిత బలవన్మరణం కృష్ణరాజపురం : ఆమె ఇద్దరి పిల్లల తల్లి. భర్త, పిల్లలతో వారి సంసరనావ ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సాగిపోతోంది. ఊహించని విధంగా గుర్తు తెలియని వ్యక్తి ప్రేమ పేరుతో వేధింపులు మొదలు పెట్టి చిచ్చు రేపాడు. తన మనో వేదనను బయటకు చెప్పుకోలేక చివరకు ఆ వివాహిత ఉరికి వేలాడింది. ఈ ఘటన మహాదేవుపుర పోలీస్‌స్టేషన్ పరిధిలోని సరస్వతి నగర్లో మంగళవారం చోటు చేసుకుంది. మృతురాలి అన్న పృధ్విరాజ్ కథనం మేరకు.. సరస్వతి నగర్‌కు చెందిన దీపకు పదేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా, కదిరికి చెందిన మెకానిక్ రవికుమార్‌తో వివాహమైంది. దంపతులు సరస్వతి నగరంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి సమీపంలోని బ్యూటీ పార్లర్లో దీపా పని చేస్తుండగా భర్త కూడా అదే ప్రాంతంలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా గుర్తు తెలియని వ్యక్తి దీపా మొబైల్‌కు ఫోన్ చేసి తనను ప్రేమించాలని వేధించేవాడు. తనకు వివాహమైందని, ఇద్దరు పిల్లలు ఉన్నారని, ఇలా వేధించడం తగదని ఆమె మందలించింది. అయినా వేధింపులు ఆగలేదు. ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక మనో వేదనకు గురైన దీపా మంగళవారం ఉదయం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
అనుమానమే ఆత్మహత్య భూతమై..!
తల్లీ కొడుకుల బలవన్మరణం.. ఏడాదిన్నర క్రితం పెద్ద కొడుకు కుటుంబానికి చేతబడి చేశారని వారి అనుమానం అందుకే కమలకు అనారోగ్యమట.. కొన్నాళ్లుగా ఒంటరిగా జీవనం కుటుంబ పెద్ద మానసిక స్థితిపైనా సందేహాలు ఉద్యోగాలు మానేసి ఇంటిపట్టునే కొడుకులు అక్కయ్యపాలెం: ఏడాదిన్నర క్రితం పెద్ద కొడుకు.. ఇప్పుడు తల్లి, చిన్న కొడుకు ఆత్మహత్యకు పాల్పడటం విశాఖ నగరంలోని రామచంద్రనగర్‌లో కలకలం రేపింది. ఎవరో చేతబడి చేశారన్న అపోహతో కొన్నాళ్లుగా ఒంటరి జీవితం గడుపుతున్న ఆ కుటుంబంలో ఇప్పుడు తండ్రే ఒంటరిగా మిగిలిపోయారు. విశాఖ నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐ కె.వి.బాలకృష్ణ చెప్పిన వివరాల ప్రకారం.. నగరంలోని అక్కయ్యపాలెం రామచంద్రనగర్‌లో మాచర్ల మహేశ్వరరావు తన భార కమల(48), చిన్న కొడుకు రవికుమార్(30)తో కలిసి చాలాకాలంగా నివసిస్తున్నారు. మహేశ్వరరావు ఒక ప్రైవేటు కంపెనీలో కాంట్రాక్టరుగా పనిచేసేవారు. భార్యకు, కుటుంబానికి ఎవరో చేతబడి చేశారని అందుకే రెండేళ్లుగా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన అనుమానం. చేతబడి కారణంగానే భార్య అనారోగ్యం పాలైందని అంటున్నారు. ఈ క్రమంలో చేతబడి తీసే వారి కోసం మహేశ్వరరావు శనివారం సోంపేట వెళ్లాడు. అక్కడ నుంచి శ్రీకాకుళం, విజయనగరం వెళ్లినా.. ఎవరూ దొరక్కపోవడంతో సోమవారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే గేటుకు తాళం వేసి ఉంది. ఎంత కొట్టినా ఎవరూ బయటకు రాలేదు. కొడుకు రవికుమార్‌కు సెల్‌కు ఫోన్ చేసినా స్పందన లేదు. అనుమానం వచ్చిన మహేశ్వరరావు డయల్ 100కు ఫిర్యాదు చేశారు. సీఐ కె.వి.బాలకృష్ణ, ఎస్సై బి.బి.శంకర్‌గణేష్ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. తలుపు లోపలి నుంచి గడియ పెట్టినట్లు గుర్తించి, తలుపులు విరగ్గొట్టి లోపలకి ప్రవేశించారు. లోపల హాల్లోని ఫ్యాన్ హుక్కు వేలాడుతున్న కమల, రవికుమార్ మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను దించి పోస్టుమార్టం కోసం కేజీహెచ్‌కు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంటరి జీవితమే కారణమా? అయితే ఈ కుటుంబానికి చాలా కాలంగా బంధువులు,స్నేహితులు, చుట్టుపక్కల వారితో సంబంధాలు లేవని, ఎవరితోనూ మాట్లాడరని పోలీసుల విచారణలో తెలిసింది. తమ కుటుంబానికి చేతబడి చేశారన్న అనుమానం పెంచుకున్న మహేశ్వరరావు మానసిక పరిస్థితి కూడా సరిగా లేదని తెలుస్తోంది. ఇతని కారణంగానే భార్య అనారోగ్యం పాలైనట్టు స్థానికులు చెబుతున్నారు. తల్లి ఆరోగ్యం బాగోకపోవడంతో చిన్న కొడుకు రవికుమార్ టీసీఎస్‌లో ఉద్యోగం మానేసి ఏడాదిగా ఇంటి వద్దే ఉంటున్నాడు. పెద్ద కొడుకు భాస్కరరావు కూడా ఇదే రీతిలో 2014లో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు కూడా కొడుకు శవాన్ని మూడు రోజులపాటు ఇంటిలో ఉంచుకొని ఎవరికీ సమచారం ఇవ్వలేదు. దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారి పిర్యాదు మేరకు పోలీసులు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు కూడా కమల, రవికుమార్‌లు శనివారం రాత్రే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి మరణానికి మానసిక పరిస్థితే కారణామా లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల వారిని విచారిస్తున్నారు. బంధువులు, స్నేహితులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఈ కుటుంబంపై పోలీసులు ఒక అంచనాకు రాలేకపోతున్నారు. -
తల్లీ కుమారుడు ఆత్మహత్య
విశాఖ నగరంలోని రామచందర్‌రావు నగర్ లో తల్లీ కుమారుడు ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగు చూసింది. మాచర్ల మహేశ్వర్‌రావు, కమల (48) దంపతులకు కనకరాజు, రవికుమార్ అనే ఇద్దరు కమారులు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు కనకరాజు 2014లో ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుటుంబానికి ఎవరో చేతబడి చేశారని భావించిన ఈ కుటుంబం.. ఇరుగు పొరుగు వారితో సంబంధాలు కట్ చేసుకుంది. ఈ నేపథ్యంలో చేతబడి నివారణ కోసం మహేశ్వర్‌రావు శనివారం విజయనగరం వెళ్లి.. సోమవారం ఇంటికి తిరిగివచ్చారు. లోపల తలుపులు బిగించి ఉండటం, ఎంతకీ తెరవకపోయేసరికి పోలీసుల సాయంతో.. తలుపులు బలవంతంగా తెరిచారు. కమల, రవి కుమార్ (30) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించారు. వీరి పెద్ద కుమారుడు 2014లో ఇంట్లో ఆత్మహత్య చేసుకోగా మూడు రోజుల పాటు మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి ఎవరికీ చెప్పకుండా ఉండడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆత్మహత్య చేసుకున్న వారి మానసిక స్థితి సరిగా లేనట్టు తెలుస్తోంది. -
కరెంటు షాక్‌తో బాలుడి మృతి
-
కరెంటు షాక్‌తో బాలుడి మృతి
హైదరాబాద్: నగరంలోని రామాంతపూర్ పరిధి, గోఖలే నగర్లో బుధవారం విషాదం చోటు చేసుకుంది. ఇంటిపైన గాలి పటాన్ని ఎగరేస్తుండగా పక్కనున్న చెట్లలో గాలిపటం ఇరక్కపోయింది. గాలిపటాన్ని తీసే క్రమంలో ప్రమాదవశాత్తూ కరెంటు తీగలకు తగిలి రవి కుమార్(10) అనే బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యార్థిని చితకబాది పరారైన వాచ్‌మన్
విజయవాడ : హాస్టల్లో విద్యార్థిని వాచ్‌మన్ చితకబాదాడు. దాంతో తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయాడు. అనంతరం వాచ్‌మన్ అక్కడి నుంచి పరారైయ్యాడు. దాంతో తోటి విద్యార్థులు... బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. విద్యార్థుల కథనం ప్రకారం... మంగళవారం 8-9 గంటల మధ్య హాస్టల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆ సమయంలో కొందరు విద్యార్థులు బిగ్గరగా కేకలు వేశారు. 7వ తరగతి చదువుతున్న రాము గట్టిగా అరిచాడని వాచ్‌మన్ రవికుమార్ భావించాడు. ఆ క్రమంలో కర్రతో రామును తీవ్రంగా కొట్టాడు. దాంతో అతడికి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం భయంతో రవికుమార్ అక్కడి నుంచి పరారైయ్యాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎంఈవో, ఎంపీడీవో హాస్టల్‌కి వెళ్లి విచారించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి రామును పరామర్శించారు. ఈ ఘటనకు బాధ్యుడైన వాచ్‌మన్ రవికుమార్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని వారు విద్యార్థులకు హామీ ఇచ్చారు. -
నాలుగు ఎఫ్ఐఆర్లు.. ఇద్దరు ఎస్ఐల సస్పెన్షన్
బన్నప్ప మృతి, ఠాణాపై దాడి ఘటనపై కమిషనర్ సీరియస్ కంటోన్మెంట్: సికింద్రాబాద్ మారేడ్‌పల్లి పోలీసు స్టేషన్‌పై సోమవారం రాత్రి జరిగిన దాడి ఘటనకు సంబంధించి ఇద్దరు ఎస్ఐలపై పోలీసు ఉన్నతాధికారులు వేటువేశారు. మారేడుపల్లిలో ఆదివారం రాత్రి బన్నప్పను అదుపులోకి తీసుకున్న ఇద్దరు ఎస్సైలు బాధ్యతారహితంగా వ్యవహరించారనే ఆరోపణలతో ఎస్సైలు రవికుమార్, మధులను హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. సోమవారం రాత్రి బన్నప్ప బంధువులు, మహాత్మాగాంధీ నగర్ వాసులు పోలీస్‌స్టేషన్‌పై దాడికి పాల్పడి స్టేషన్‌కు నిప్పంటించిన సంగతి తెలిసిందే. పోలీసులు కొట్టడం వలే బన్నప్ప మృతి చెందాడని, అతడి బంధువులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకున్న బన్నప్పను పోలీసులు వదిలిపెట్టకుండా మరుసటి రోజు బెయిలుపై వదిలేయడంపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీస్‌స్టేషన్‌లో బన్నప్పను ఉంచినందుకు ఎస్సైలపై వేటు పడినట్టుగా సమాచారం. ఇదిలా ఉండగా, మారేడుపల్లి పోలీస్‌స్టేషన్‌పై సోమవారం రాత్రి దాడికి పాల్పడి కీలకమైన ఫైళ్లతోపాటు పోలీస్‌స్టేషన్ ధ్వంసానికి పాల్పడిన వారిపై పోలీసులు నాలుగు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. దాడి ఘటనలో సుమారు 100 మంది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని గుర్తించేందుకు పోలీస్‌స్టేషన్ దగ్గరున్న సీసీకెమెరాల డేటాను పరిశీలించి, కేసు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. -
విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి
ఆమదాలవలస: ప్రభుత్వ విప్ కూన రవికుమార్ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా అది విద్యుత్ తీగలకు తగిలి షాక్‌తో ఒకరు చనిపోగా, మరొకరు గాయపడి శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన ఆమదాలవలస కొత్తరోడ్ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా సరదాపురం గ్రామానికి చెందిన బేసి భాస్కరరావు (40) కొత్తరోడ్ సమీపంలో వెల్డింగ్ దుకాణం నడుపుతూ.. గత రెండేళ్లుగా శ్రీకాకుళం పట్టణంలోని ఆదివారంపేటలో నివాసముంటున్నాడు. గురువారం ప్రభుత్వ విప్ రవికుమార్ విదేశీ పర్యటన ముగించుకొని వస్తున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలిపేందుకు, ఆహ్వానం పలికేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు ఫ్రేమ్‌లు తయారు చేసి వాటిని వేలాడ దీసేందుకు భాస్కరరావు కాంట్రాక్టును ఒప్పుకున్నాడు. వీటిని ఆమదాలవలస, శ్రీకాకుళం ప్రాంతాల్లో కట్టాడు. ఈ నేపథ్యంలోనే కొత్తరోడ్ సమీపంలో తన వెల్డింగ్ దుకాణం ఆవరణలోని శ్లాబ్‌పై పెద్ద ఫ్లెక్సీ కట్టేందుకు భాస్కరరావు ప్రయత్నించాడు. అయితే శ్లాబ్ పైన ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలకు ఫ్లెక్సీ తగలడంతో దాన్ని పట్టుకొని ఉన్న భాస్కరరావు షాక్‌కు గురై అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మృతునికి భార్య జయలక్ష్మి, కుమార్తె జాన్సీ, కుమారుడు మురళీమోహన్‌లు ఉన్నారు. కుటుంబ యజమాని మృతి చెందాడని తెలుసుకున్న భార్య పిల్లలు సంఘటనా స్థలానికి చేరుకొని కన్నీరు మున్నీరై విలపించారు. సహాయం చేసేందుకని వెళ్లి గాయాలపాలు కొత్తరోడ్ సమీపంలో ఉన్న రైస్ మిల్లో పనిచేస్తున్న వంజంగి గ్రామానికి చెందిన చింతాడ నారాయణరావు ఫ్లెక్సీ కట్టడానికి సాయం చేసేందుకు వెళ్లి అతను కూడా విద్యుత్ షాక్‌కు గురై శ్లాబ్ పైనుంచి కిందకు పడిపోవడంతో గాయపడ్డాడని స్థానిక పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ రామచంద్రరావు తెలిపారు. అతన్ని చికిత్స నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతుడి కుటుంబానికి విప్ ఆర్థిక సాయం శ్రీకాకుళం :కొత్తరోడ్డు జంక్షన్ వద్ద ఫ్లెక్సీలు కడుతూ విద్యుత్‌షాక్‌తో మృతి చెందిన భాస్కరరావు కుటుంబానికి విప్ కూన రవికుమార్ లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించారు. శుక్రవారం మృతుని కుటుంబాన్ని పరామర్శించి వ్యక్తిగతంగా సహాయాన్ని అందించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ పరంగా సహాయం అందేలా చూస్తానని మృతుని కుటుంబానికి రవికుమార్ ఇప్పటికే హామీ ఇచ్చారు. -
పగతో రగిలిపోతూ...
గ్లామర్ లోకంలో విహరించి తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలని కలలు కంటున్న ఓ మోడల్ ఓ యువకునిపై పగబడుతుంది.ఆమె ఎందుకు పగబ ట్టిందనే సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘మోడల్’. రవికుమార్, పాండాల రాజ్‌కుమార్, మమతా కులకర్ణి, శోభశ్రీ ముఖ్యతారలుగా పాండాల బుజ్టి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ కుమార్ దర్శకుడు. ‘‘అందమైన ప్రేమకథ నేపథ్యంలో రివెంజ్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించాం. చిత్రీకరణ పూర్తయింది. వచ్చే నెలలో విడుదల చేయనున్నాం’’ అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సీ.హెచ్. నవీన్, సంగీతం: చక్రధర్. -
బదిలీల కౌన్సెలింగ్ పారదర్శకంగా జరగాలి
రామగిరి : జిల్లా కేంద్రంలో త్వరలో నిర్వహించనున్న ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్ పారదర్శకంగా నిర్వహించాలని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పన్నాల గోపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక టీపీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉపాధ్యాయుల నుంచి ఫిర్యాదులను కౌన్సెలింగ్ కంటే ఒకరోజు ముందే స్వీకరించాని, ఫైనల్ లిస్ట్ ప్రకటించిన తర్వాత మార్పులు-చేర్పులు చేయరాదన్నారు. స్పౌజ్ ప్రాధాన్యం కలిగిన ఉపాధ్యాయుల విషయంలో నిబంధనల ప్రకారం మాత్రమే కౌన్సెలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. 30వ తేదీ జూన్ 2015 వరకు విద్యార్థుల సంఖ్య ప్రకారం సక్సెస్ పాఠశాలలు కొనసాగించాలని కోరారు. ప్రాథమిక పాఠశాలలో రేషనలైజేషన్ గుర్తించిన తర్వాత ఆ పాఠశాలలో ప్రమోషన్ పొందిన ఎస్జీటీని సర్ప్లెస్గా గుర్తించాలన్నారు. టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పుప్పాల రవికుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి ఆర్.రాంనర్సయ్య, కె.యల్లారెడ్డి, ఎం.వెంకట్‌రెడ్డి, కె.రత్నయ్య, పి.ముత్తయ్య, బుచ్చిరెడ్డి, సైదులు, దుర్గాప్రసాద్, భిక్షం, వీరన్న, అంజయ్య పాల్గొన్నారు. -
'ఇంద్రు నేత్రు నాలాయ్' స్టిల్స్
-
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం
తిరుమలః తిరుమలలో బుధవారం ఓ ప్రేమజంట ఆత్మహత్యయత్నంకు పాల్పడింది. వీరిని 108 అంబులెన్స్‌లో స్ధానిక అశ్విని ఆస్పత్రిలో వైద్యం అందజేసారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్ధితి స్ధమితంగానే ఉంది. వివరాల్లోకి వెళ్లగా.. కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం సమీపంలోని ఈడిగపల్లెకు చెందిన రవికుమార్(28),పద్మా (25) వేరు వేరు కులాలు అయినప్పటికీ గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ పెద్దలకు విషయం తెలిస్తే పెళ్లికి ఒప్పుకోరనే ఉద్దేశ్యంతో గత రెండు రోజుల క్రితం తిరుమలకు వచ్చారు. స్ధానిక వరాహస్వామి కాటేజి -1 లో 314 నెంబరు గదని అద్దెకు తీసుకున్నారు. సోమవారం సాయంత్రం శ్రీవారి ఆలయం ముందున్న అఖిలాండం వద్ద నిలబడి శ్రీవారిసాక్షిగా రవికుమార్ పద్మా మెడలో తాళికట్టాడు. పెళ్లి చేసుకున్న విషయాన్ని బుధవారం ఉదయం ఇరు కుటుంబ పెద్దలకు సమాచారం ఇచ్చారు. అయితే వారి పెద్దలనుండి సానుకూల స్పందన లభించలేదు. దీంతో మనస్తాపానికి గురైయిన రవికుమార్, పద్మాలు తిరుమలలోనే చనిపోవాలని నిర్ణయించుకున్నారు. తిరుపతికి వెళ్లి పురుగుల మందు తెచ్చుకుని అతిధిగృహంలో తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనంతరం వారే , తమను రక్షించాలంటూ 108కు కాల్ చేసారు. ఈ మేరకు హుటాహుటిన ఘటన ప్రాంతానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది రవికుమార్, పద్మాలను అశ్విని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయాకు తరలించారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్ధితి బాగానే ఉందని వైద్యులు మీడియాకు తెలిపారు. కాగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఈ మేరకు పద్మా మీడియాతో మాట్లాడుతూ కులాలు వేరనే కారణంతో మా పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని, పెళ్లిచేసుకున్న విషయాన్ని తెలియజేస్తే తిరిగి మళ్లితిట్టారని తెలిపింది. అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నట్టు చెప్పింది. -
రెవె‘న్యూ’ చట్టాల కోసం ఉద్యమం
వామపక్షాలకు రౌండ్‌టేబుల్ సమావేశం పిలుపు సాక్షి, హైదరాబాద్: పాత రెవెన్యూ చట్టాల స్థానంలో ప్రత్యామ్నాయ చట్టాలను ప్రతిపాదించి, వాటి అమలుకోసం వామపక్షాలు ఉద్యమాలు చేపట్టాలని రౌండ్‌టేబుల్ సమావేశం పిలుపిచ్చింది. శనివారం మఖ్దూంభవన్‌లో సీపీఐ ఆధ్వర్యంలో ‘రాష్ట్రంలో రెవెన్యూచట్టాలు-విశ్లేషణ, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు’అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతమున్న అన్ని రెవెన్యూ చట్టాలను పరిశీలించి, రైతులు, ప్రజలకు ఉపయోగపడేలా సమగ్రమైన చట్టాన్ని ప్రభుత్వం రూపొందించేలా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలను సమర్పించాలని ఈ భేటీలో నిర్ణయించారు. భూసమస్య ప్రధాన ఎజెండాగా అఖిలపక్ష భేటీని ఏర్పాటుచేసి, వచ్చే సలహాలు, సూచనలకు అనుగుణంగా వివాదాలకు తావులేని పారదర్శక చట్టాలను తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వానికి రౌండ్‌టేబుల్ సమావేశం విజ్ఞప్తి చేసింది. చట్టాలను పరిశీలించి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు రూపొందించేందుకు విశ్రాంత ఐఏఎస్ టి.గోపాలరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య, రవికుమార్, సునీల్‌కుమార్, పశ్యపద్మ, రాంనర్సింహారావు, బొమ్మగాని ప్రభాకర్‌తో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూ సమస్యను సమస్యగా గుర్తించడం లేదని విశ్రాంత ఐఏఎస్ అధికారి టి.గోపాలరావు అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా భూమి రికార్డులను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం లేదన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శివర్గ సభ్యుడు నారాయణ మాట్లాడుతూ భూపోరాటాల ద్వారా పేదలు పట్టాలు పొందినా అటవీశాఖ అధికారులు అనేక సమస్యలు సృష్టిస్తున్నారన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో లిటి గెంట్ వ్యవస్థ పోవాలని, రెవెన్యూ చట్టాల్లోని లొసుగులు, తప్పులను గుర్తించి వాటిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో రవికుమార్ (భూమికేంద్రం), కందిమళ్ల ప్రతాపరెడ్డి, బొమ్మగాని ప్రభాకర్, పశ్యపద్మ మాట్లాడారు. వారి మిగులు భూమి స్వాధీనం చేసుకోవాలి రాష్ట్రానికి చెందిన నలుగురు ఎంపీలు, 11 మంది ఎమ్మెల్యేలకు మిగులు భూమి ఉందని, వెంటనే ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పశ్య పద్మ డిమాండ్ చేశారు. ఏపీ భూసంస్కరణల(సీలింగ్, అగ్రికల్చరల్ హోల్డింగ్స్) చట్టం-1973 ప్రకారం మెట్టభూమి 54 ఎకరాలకు మించి ఉండరాదని, అయితే 2014 ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లను బట్టి నలుగురు ఎంపీలు, 11 మంది ఎమ్మెల్యేలకు మిగులు భూమి ఉందని పేర్కొన్నారు. -
వాటా నీటి కోసం పోరాటం
నెర్రెలిచ్చిన సాగర్ ఆయకట్టు వైఎస్సాఆర్ సీపీ ఆధ్వర్యంలో నేడు జాతీయ రహదారి దిగ్బంధం రైతులకు బాసటగా ఎమ్మెల్యే రవికుమార్ సంతమాగులూరు : ‘సాగరమే నా చేరువునున్నా దాహం తీరదులే’ అనే సినీ గీతంలో విషాదం సాగర్ ఆయకట్టుదారుల్లోనూ తొంగిచూస్తోంది. సాగర్ జలాశయంలో నీరు పుష్కలంగా ఉన్నా ప్రభుత్వ వైఫల్యం కారణంగా కాలువలకు నీరు సక్రమంగా అందక వేసిన నాట్లు నిలువునా ఎండిపోతున్నాయి. ఇప్పటికీ నాట్లు పూర్తిచేయలేక ఎండిపోతున్న వరినారు చూసుకుంటూ అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. అద్దంకి బ్రాంచి కెనాల్ పరిధిలో జిల్లాలో రెండు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇప్పటికి 50 శాతం కూడా వరినాట్లు పూర్తికాకపోగా వేసిన నాట్లు, నార్లు నిలువునా ఎండిపోతున్నాయి. ఏబీసీ జిల్లా సరిహద్దు 18/0 మైలు రాయి వద్దకు 1800 క్యూసెక్కులు రావల్సి ఉండగా కేవలం 7 నుంచి 9 వందల క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోంది. ఎగువ మేజర్లకు కూడా నీరు ఎక్కక పైర్లు ఎండిపోతున్నాయి. ఈ నేపద్యంలో ప్రజా సమస్యలే తమ అజెండాగా పోరాటాలు చేస్తున్న వై.ఎస్.ఆర్. సీపీ రైతులకు అండగా నిలిచి ఆందోళనకు శ్రీకారం చుట్టింది. ఆయకట్టు రైతులతో కలిసి ఆదివారం జాతీయ రహదారిని ముప్పవరం టోల్ గేట్ వద్ద అద్దంకి శాసన సభ్యుడు గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసేందుకు నడుం బిగించింది. నేడు ఎమ్మెల్యే గొట్టిపాటి ఆధ్వర్యంలో రాస్తారోకో అద్దంకి : అద్దంకి బ్రాంచ్ కెనాల్‌కు విడుదల కావాల్సిన వాటా నీరు రాకపోవడాన్ని నిరసిస్తూ సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం అడ్డురోడ్డు వద్ద రైతులతో ఆదివారం ఉదయం 10.30 గంటలకు రాస్తారోకో నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏబీసీ పరిధిలో ఉన్న ఏ మేజరుకు సక్రమంగా విడుదల కావాల్సిన పరిమాణంలో నీరు విడుదల కావడం లేదన్నారు. సాగరు డ్యామ్‌లో పూర్తి పరిమాణంలో నీరున్నా ఆయకట్టు పరిధిలోని వరి పొలాలు ఎండిపోయే స్థితికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై శంఖవరప్పాడు రైతులు అద్దంకిలో రాస్తారోకో చేసినా తరువాత రెండు రోజులు అధికారులు హడావుడిగా నీరు తేవడమే కానీ శాశ్వత పరిష్కారం లభించడం లేదన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో మట్లాడినా ఫలితం కనిపించకపోవడంతో రాస్తారోకోకు సిద్ధమైనట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తామంటూ అటు విద్యుత్ కోతలు, ఇటు సాగరు నీటిలో రావాల్సిన వాటాకు కోతలు విధిస్తోందని విమర్శించారు. నీటి వాటా విషయంలో తాడోపేడో తేల్చుకునేందుకు చేసే ధర్నా కార్యక్రమానికి నియోజకవర్గంలోని రైతులందరూ హాజరు కావాలని పిలపునిచ్చారు. -
నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు తెరచి..
ఉద్యోగి అరెస్ట్ సిటీబ్యూరో: నాచారంలోని ఏపీ ఫుడ్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగి సైబర్ నేరానికి పాల్పడి పోలీసులకు చిక్కాడు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్.జయరాం కథనం మేరకు.. నల్లగొండ జిల్లా బీబీనగర్‌కు చెందిన కె.రవికుమార్ (44) నాచారంలోని ఏపీ ఫుడ్స్‌లో పర్సనల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అయితే ఇక్కడ యూనియన్‌లో ఆధిపత్య పోరు నెలకొనడంతో తన ప్రాబల్యం తగ్గిందని, ఇద్దరు మహిళా ఉద్యోగులపై కక్ష కట్టాడు. హెల్త్ కార్డుల కోసం అక్కడి ఉద్యోగులు పాస్‌పోర్టు ఫొటోలను రవికుమార్‌కు ఇచ్చారు. అందులో ఆ ఇద్దరు మహిళల ఫొటోలతో నకిలీ ఫేస్బుక్ అకౌంట్లను తెరిచి, అసభ్యకర దృశ్యాలు, వ్యాఖ్యలు పోస్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బాధితులు సైబర్‌క్రైమ్ అదనపు డీసీపీ బి.శ్రీనివాస్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఆశిష్‌రెడ్డి నిందితుడిని గుర్తించి శనివారం అరె స్టు చేశారు. -
భవిష్యత్తుకు రాచబాట
విశాఖపట్నం : ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్క్ ఎంతో కీలకం. ఇందులో చూపిన ప్రతిభ భవిష్యత్తులో ఉపాధికి ఉపకరిస్తుంది. ఆయా అంశాలపై విద్యార్థులకు ఉన్న పట్టు, పరిశీలనను తెలియజేస్తాయి. నవంబరు నెలాఖరు నుంచి డిసెంబరు, జనవరి మాసాల్లో విద్యార్థులు ఎక్కువగా ప్రాజెక్ట్ వర్కులు చేస్తారు. ఇందుకోసం విద్యార్థులు విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ఇందులో భాగంగా వివిధ ప్రొఫెషనల్ కోర్సుల ఇన్‌స్టిట్యూట్స్‌కు ముఖ్యకూడలిగా ద్వారకానగర్ కేంద్రీకృతంగా మారింది. ఇక్కడ వృత్తివిద్య, డిప్లొమా, ఉన్నత విద్యకు సంబంధించిన ప్రతిభావంతమైన ప్రయివేట్ ఇన్స్టిట్యూట్స్ అధికంగా ఉన్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన అనేక మంది ప్రొఫెషనల్ కోర్సు విద్యార్థులు ఇక్కడి ఇనిస్టిట్యూట్స్‌లో అధికంగా ప్రాజెక్టు వర్క్‌లు చేస్తున్నారు. నగరంలో థియిరీ ప్రాజెక్ట్, పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమల ప్రాక్టికల్ వర్క్‌లు చేయడానికి ఉపక్రమించారు. ఐటీ, ఈసీఈ, ఈఈఈ ఇంజినీరింగ్ విద్యార్థులు నగరలో పేరుగాంచిన శాస్త్ర, సాంకేతిక సంస్థల్లో ప్రాజెక్ట్ వర్కులు ప్రారంభించారు. మరికొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఏంసీఏ, ఎంబీఏ తదితర కోర్సులకు కూడా ప్రాజెక్టు వర్క్‌లు ప్రారంభమయ్యాయి. అవగాహన కోసమే... ఒక విషయాన్ని ఒకరు చెబితే వినడం కంటే..ప్రత్యక్షంగా చూసి తెలుసుకుంటే పూర్తి అవగాహన వస్తుంది. ఆ విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి. అందుకే వృత్తివిద్యా కోర్సుల్లో ప్రాజెక్ట్ వర్క్‌లు కీలకంగా మారాయి. విద్యార్థులు కూడా ప్రెజెంటేషన్‌లోప్రత్యేకత చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంజినీరింగ్, ఎంసీఏ, ఎంబీఏ తదితర కోర్సులకు సంబంధించిన విద్యార్థులు చివరి ఏడాదిలో ఈ ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. విజ్ఞాన సముపార్జనే ప్రధాన ధ్యేయం. కళాశాలల్లో నేర్చుకున్న పాఠ్యాంశాలను ప్రాక్టికల్‌గా అన్వయించటం కోసం సంస్థలు, కంపెనీలకు విద్యార్థు లు వెళ్తారు. అక్కడ పనితీరు, మార్కెటింగ్ విధానాలు, అమ్మకాలు, కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజా ్ఞనం, ఉత్పత్తుల తీరును ప్రత్యక్షంగా పరిశీలిస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో శైలి... ఈ పరిశీలన అనంతరం విద్యార్థులు నివేదికను రూపొందిస్తారు. విద్యార్థి ఆలోచనా తీరు, పరిశీలన, కొత్త విషయాల గ్రహింపు, అనుమానాలు అన్నీ ఇందులో ఉంటాయి. తద్వారా విద్యార్థుల ఆలోచననా శైలి తెలియడంతోపాటు వారిని ఏ అంశంలో మెరుగుపర్చాలో అధ్యాపకులకు తెలుస్తుంది. వారు పరిశీలించిన కంపెనీల నిర్వహణలో తీసుకోవాల్సిన మార్పులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాల్సిన తీరుపైనా విద్యార్థులు సూచనలు చేయవచ్చు. కాలానుగుణంగా పరిశ్రమల్లో చేపట్టాల్సిన మార్పులపై విద్యార్థులకు అవగాహన రావటానికి ప్రాజెక్టు వర్కు ఉపకరిస్తుందని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్.ఎన్.వి. రవికుమార్ తెలిపారు. -
మళ్లీ మొదలైన మక్కల కొనుగోళ్లు
తాండూరు: తాండూరు డీసీఎంఎస్ కేంద్రంలో మక్కల కొనుగోళ్లు తిరిగి మొదలయ్యాయి. సోమవారం డీసీఎంఎస్ కేంద్రంలో కొనుగోలు చేసిన మక్కల్లో నాణ్యత లేదంటూ సీడబ్ల్యూసీ కేంద్రంలో తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం వ్యవసాయ శాఖ అధికారులు కేంద్రానికి వచ్చారు. అయినప్పటికీ కొనుగోళ్ల విషయంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా గందరగోళం నెలకొంది. మక్కల నాణ్యతను పరిశీలించి గ్రేడ్‌ను నిర్ధారించాలని డీసీఎంఎస్ గోదాం ఇన్చార్జి ఎల్లయ్య కేంద్రానికి వచ్చిన వ్యవసాయ శాఖ ఏఈఓ రవికుమార్‌ను కోరారు. అయితే ఈ విషయమై ఉన్నతాధికారుల నుంచి తనకు ఆదేశాలు లేవని అతడు చెప్పడంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. మరోవైపు కొనుగోళ్లు జరపకపోవడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న డీసీఎంఎస్ స్థానిక మేనేజర్ షరీఫ్, వ్యవసాయ శాఖ ఏడీఏ సింగారెడ్డిలు కొనుగోలు కేంద్రానికి వచ్చి పరిస్థితిని చక్కదిద్దారు. తాము మక్కలను ఏ గ్రేడ్‌గా నిర్ణయిస్తే సీడబ్ల్యూసీ గోదాంకు వెళ్లిన తరువాత బీ గ్రేడ్‌గా నిర్ణయించి రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని డీసీఎంఎస్ అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు వివరించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఏడీఏ హామీ ఇచ్చారు. ఇక సోమవారం కొనుగోలు చేసిన మక్కలపై అధికారులు ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. 163.50 క్వింటాళ్ల కొనుగోళ్లు తూకాలు ఆలస్యంగా జరగటంతో మంగళవారం సాయంత్రం 6గంటల వరకు సుమారు 163.50క్వింటాళ్ల మొక్కజొన్నల కొనుగోళ్లు జరిగాయి. ఇందులో 96 క్వింటాళ్లు బ్రీగ్రేడ్, 67.50 క్వింటాళ్లు సీ గ్రేడ్ మక్కలను నాలుగురు రైతుల నుంచి కొనుగోలు చేశారు. అయితే తిరస్కరణ ప్రభావంతో మంగళవారం ఒక్క క్వింటాలు కూడా ఏగ్రేడ్‌లో కొనుగోలు చేయకపోవడం గమనార్హం. ముందుగా నమూనాలు తీసుకురావాలి మక్కల నమూనాలను ముందు కేంద్రానికి తీసుకురావాలని తాండూరు ఏడీఏ సింగారెడ్డి చెప్పారు. కేంద్రంలో నాణ్యతాప్రమాణాల ప్రకారం గ్రేడ్ నిర్ధారణ చేసుకున్న తరువాతనే పూర్తి పంటను కేంద్రానికి తరలించాలని ఆయన రైతులను సూచించారు. -
రైల్వేస్టేషన్లో 13 కిలోల వెండి స్వాధీనం
పోలీసుల అదుపులో ఇద్దరు వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్లో బిల్లులు లేకుండా తరలిస్తున్న 13 కిలోల వెండిని జీఆర్పీ సిబ్బంది పట్టుకున్నారు. జీఆర్పీ సీఐ రవికుమార్ కథనం ప్రకారం... తమిళనాడు సేలం జిల్లా సేలమంచి ప్రాంతానికి చెందిన అర్జునన్, మారెప్పన్ కరీంనగర్ జిల్లా మెట్పల్లి చక్ర గోల్డ్‌షాపు నుంచి రూ. ఐదు లక్షల విలువైన 13 కిలోల వెండిని తరలించేందుకు వరంగల్ రైల్వే స్టేషన్‌లోని ప్లాట్ ఫాం-1కు చేరుకున్నారు. రబ్దిసాగర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కుతుండగా అనుమానం వచ్చిన పోలీసులు వారి బ్యాగు తనిఖీ చేశారు. అందులో 13 కిలోల ముడి వెండి ఉంది. బిల్లులు లేకుండా వెండిని తరలిస్తున్న వారిద్దరినీ అదుపులోకి తీసుకుని, వెండిని స్వాధీనం చేసుకున్నారు. వెండిని కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పగించినట్లు జీఆర్పీ సీఐ తెలిపారు. -
వ్యవసాయ ప్రదర్శనలు ఏర్పాటు చేయండి
చిత్తూరు(సిటీ): జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి అక్టోబర్ 20 వతేదీ వరకు నిర్వహించనున్న జన్మభూమి కార్యక్రమంలో వ్యవసాయ ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ రవికుమార్ స్పష్టం చేశారు. జన్మభూమి కార్యక్రమ నిర్వహణలో భాగంగా తీసుకోవాల్సిన అంశాలపై వ్యవసాయశాఖాధికారులతో బుధవారం జేడీ తన కార్యాలయంలో సమీక్షించా రు. గ్రామ, మండల స్థాయిల్లో రెండు ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి, వారి ద్వారా క్షేత్రస్థాయికి వెళ్లి పంటలను పరిశీలించి రైతులకు సూచనలు అందజేయాలని సూచించారు. ము ఖ్యంగా మట్టినమూనాలు, ఎరువులను మిశ్ర మం తయారీ, వాడే పద్ధతులను వివరించాలన్నారు. మధ్యాహ్నం వరకు క్షేత్రస్థాయిలో పం టల పరిశీలన, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రైతులకు వివరణ కార్యక్రమాలను తప్పకుండా చేపట్టాలన్నారు. డీడీలు నిర్మల్ నిత్యానందం, యుగంధర్, ఏడీలు మనోహర్, భాస్కరయ్య, ఆత్మ డీడీ అనంతరావు, ఏడీఏలు, ఏవోలు పాల్గొన్నారు. పలు దశల్లో ఉన్న ఇళ్ల వివరాలను సిద్ధం చేయండి - హౌసింగ్ పీడీ జిల్లాలో వివిధ దశల్లో ఉన్న ఇళ్ల వివరాలను సిద్ధం చేసి ఉంచుకోవాలని జిల్లా గృహనిర్మాణ శాఖ పీడీ వెంకటరెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా సమాఖ్య భవనంలో జన్మభూమి కార్యక్రమంలో గృహనిర్మాణశాఖ పాత్రపై అధికారులకు అవగాహన కల్పించారు. నిర్ధారిత అధికారులు రెండు టీములుగా విడిపోయి ఆయా గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న, అసంపూర్తిగా ఉన్న ఇళ్లు, ఆలస్యానికి గల కారణాలను లబ్ధిదారులకు వివరించాలన్నారు. అలాగే లబ్ధిదారులు ఇచ్చే ఫిర్యాదులను స్వీకరించడం, ఆధార్ సీడింగ్ ఆవశ్యకతను తెలియజేయాలన్నారు. ప్రతి ఇంటిని స్వయంగా పరిశీలించిన తరువాతనే వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖలో పనిచేస్తున్న ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించండి జన్మభూమి కార్యక్రమంలో ఎన్టీఆర్ ఆరోగ్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యశాలల సమస్వయకర్త(డీసీహెచ్ఎస్) డాక్టర్ సరళమ్మ ఆదేశించారు. జన్మభూమి కార్యక్రమంలో చేపట్టాల్సిన అంశాలపై మెడికల్ ఆఫీసర్లకు అవగాహన కల్పించారు. మున్సిపల్, మండల స్థాయిల్లో రెండు టీములను సిద్ధం చేసి, ఎన్టీఆర్ ఆరోగ్యసేవ, మాతా శిశుమరణాల తగ్గింపు, గ్రహణమొర్రి తదితర అంశాలపై తెలియజేయాలన్నారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఆయా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తల సహకారం తీసుకుని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నివేదికలను సిద్ధం చేసుకోండి -డ్వామా పీడీ జిల్లాలో గురువారం నుంచి 20 వ తేదీ వరకు నిర్వహించే జన్మభూమి కార్యక్రమానికి సంబంధించి అన్ని నివేదికలను సిద్ధం చేసుకోవాలని జిల్లా నీటియాజమాన్య సంస్థ(డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్ గోపీచంద్ ఆదేశించారు. జన్మభూమి కార్యక్రమంలో తీసుకోవాల్సిన అంశాలపై పీడీ బుధవారం తన కార్యాలయంలో ఏపీడీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాఖ ద్వారా గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇందిర జలప్రభ, వాటర్‌షెడ్డు పథకాలకు సంబంధించి అన్ని రికార్డులను సిద్ధం చేసుకుని హాజరు కావాలని ఆదేశించారు. అనంతరం పలు రికార్డులను తనిఖీ చేసి సూచనలు, సలహాలు ఇచ్చారు. -
సిలిండర్ల సరఫరా లోపం వల్లే గ్యాస్ కొరత
కంప్లి : సిలిండర్ల సరఫరా లోపం వల్లే గ్యాస్ కొరత ఏర్పడుతోందని శరత్ గ్యాస్ ఏజెన్సీ మేనేజర్ కే.రవికుమార్ అన్నారు. వినియోగదారులు చేస్తున్న ఆరోపణలపై ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. తమ ఏజెన్సీ కింద 16,500 మంది వినియోగదారులున్నారని, ప్రస్తుతం ప్రధాన కేంద్రం నుంచి నెలకు 10 వేల సిలిండర్లు రావాల్సి ఉందన్నారు. 2013 ఆగస్టులో తమకు 10424 సిలిండర్లు అందగా, 2014 ఆగస్టు నాటికి వాటి సంఖ్య 7,700లకు త గ్గిందని, దీంతో సమస్య ఉద్భవించిందన్నారు. ప్రతి నెల కుటుంబానికి ఒక సిలిండర్ అందించాలనే ఆదేశాలుండగా దానికి అనుగుణంగా తమకు సరఫరా లేదన్నారు. ప్రస్తుతం తాము ప్రతి కుటుంబానికి సక్రమంగా సిలిండర్లు పంపిణీ చేయాలంటే మధ్యాహ్న భోజన పథకం హాస్టళ్లు, పాఠశాలలతో కలిపి 10 వేల సిలిండర్లు అవసరమవుతుండగా, కేవలం 7,700 సిలెండర్లు మాత్రమే అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్య అక్టోబర్ వరకు తప్పదని గ్యాస్ ప్రధాన కేంద్రం ప్రకటించిందన్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరా కోసం 180 లారీలు అవసరముండగా, ప్రస్తుతం 60 లారీలు మాత్రమే ఉన్నందున సిలిండర్లు సకాలంలో అందడం లేదన్నారు. లారీలతో సప్లయ్ చేసేందుకు ఆగస్టు 26న టెండర్లు పిలిచారని, ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే సుమారు ఒకటిన్నర నెలపడుతుందన్నారు. వచ్చిన స్టాక్ వచ్చినట్లే పంపిణీ చేస్తామని ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్‌లో సిలిండర్ల అమ్మకం చేసే ప్రశ్నే లేదన్నారు. ఒకే కుటుంబంలో నలుగురు వినియోగదారులుంటారని, ఆ నలుగురికి తాము నాలుగు సిలిండర్లు పంపిణీ చేస్తామని, వారి వద్ద అదనంగా సిలిండర్లు ఉన్నందున వారు అమ్ముకుంటే దానికి తాము బాధ్యులమా? అని ఎదురు ప్రశ్నించారు. -
6 భాషల్లో ఆర్తి అగర్వాల్ చిత్రం
-
దొంగ నోట్ల ముఠా అరెస్ట్
ఉరవకొండ : అంతర్రాష్ర్ట దొంగ నోట్ల ముఠా గుట్టు రట్టయ్యింది. తొమ్మిది మంది సభ్యులు గల ముఠాను ఉరవకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీ మొత్తంలో దొంగ నోట్లు, వాటి తయారీకి ఉపయోగించే సామగ్రి, వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ఓ మాజీ కానిస్టేబుల్, బీటెక్ విద్యార్థి ఉండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన వివరాలను గుంతకల్లు డీఎస్పీ రవికుమార్ శుక్రవారం ఉరవకొండ పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. ముఠాలో రాజ్‌కుమార్, వన్నారెడ్డి (కణేకల్లు), నరేంద్ర (తాడిపత్రి), కృష్ణయ్య (కర్నూలు జిల్లా మద్దికెర), అల్లాబకాష్ (గుత్తి), మాజీ కానిస్టేబుల్ తిరుపతయ్య, బీటెక్ విద్యార్థి ఖాసీం, శ్రీనివాసులు, చంద్రశేఖర్ (కర్నూలు) ఉన్నారు. ముఠాలో కీలకనేతలైన రాజ్‌కుమార్, వన్నారెడ్డి అనంతపురంలోని కోవూరునగర్‌లో ఓ అద్దె ఇల్లు తీసుకుని బీటెక్ విద్యార్థి సహకారంతో నకిలీ నోట్లు తయారు చేస్తున్నారు. ఈ నోట్లను మాజీ కానిస్టేబుల్ తిరుపతయ్య ద్వారా వివిధ ప్రాంతాలకు చేరవేస్తారు. రూ.లక్ష అసలు నోట్లు ఇస్తే రూ.4 లక్షలు విలువ చేసే నకిలీ నోట్లు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ ప్రాంతాల్లో ప్రతినిధులను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా చలామణి చేయిస్తారు. ఈ క్రమంలో ఉరవకొండ వుండలం బూదగెవి సమీపంలోని వూరెవ్ము ఆలయుం వద్ద దొంగనోట్ల వూర్పిడి జరుగుతోందన్న సవూచారం అందుకున్న స్పెషల్ పార్టీ ఎస్ఐ రాగిరి రావుయ్యు, మరో ఎస్ఐ వునోహర్ తమ సిబ్బందితో కలిసి గురువారం సాయంత్రం దాడులు నిర్వహించి, తొమ్మిది మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రెండు ద్విచక్ర వాహనాలు, ఒక టాటా సుమోతోపాటు నకలీ నోట్ల తయారీ పరికరాలు, ప్రింటర్, 21 నల్లని పేపర్ల కట్టలు, 11 సెల్ ఫోన్లు, అసలు నోట్లు రూ.5.49 లక్షలు, నకలీ కరెన్సీ రూ.1.67 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ముఠాను అరెస్ట్ చేయడంలో ప్రతిభ చూపిన ఎస్ఐలు రామయ్య, మనోహర్‌లను ఎస్పీ రాజశేఖర్‌బాబు, డీఎస్పీ రవికుమార్ అభినందించారు. -
నిషేధిత డ్రగ్ గుట్టు రట్టు
200కు పైగా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ల స్వాధీనం సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు చంచల్‌గూడ: అధిక పాల కోసం పశువులకు ఇచ్చే నిషేధిత ఇంజెక్షన్లను జంటనగరాల్లోని మెడికల్ షాపులకు సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని హైదరాబాద్ డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. డ్రగ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ కథనం ప్రకారం... కుర్మగూడ డివిజన్ భరత్‌నగర్‌కు చెందిన ముక్త రాహుల్ (27) కొన్ని నెలలుగా నిషేధిత ఆక్సిటోసిన్ ఇంజిక్షన్లను జంటనగరాల్లోని వెటర్నరీ మెడికల్ షాపులకు సరఫరా చేస్తున్నాడు. విశ్వసనీయసమాచారం అందుకున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు రాహుల్‌పై నిఘా పెట్టారు. గత సోమవారం అతను సికింద్రాబాద్‌లోని ఓ మెడికల్ హాల్‌కు ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లు సరఫరా చేస్తుండగా పట్టుకున్నారు. రాహుల్‌ను అదుపులోకి తీసుకొని భరత్‌నగర్‌లోని అతని ఇంట్లో సోదాలు చేయగా దాదాపు 200పైగా ఆక్సిటోసిన్ ఇంజెక్షన్ బాటిళ్లు దొరికాయి. ఈ రాకెట్‌కు సంబంధించి మరికొందరిని అదుపులోకి తీసుకొని విచారించనున్నట్లు డ్రగ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దేశం కోసం...
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నితిన్ నాష్‌ను హీరోగా పరిచయం చేస్తూ, జి. రవికుమార్, అనిల్ త్రెహాన్ నిర్మిస్తున్న చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ఆరంభమైంది. జి. రవికుమార్ దర్శకుడు. ఈ చిత్రం ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు కెమెరా స్విచాన్ చేయగా, తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి క్లాప్ ఇచ్చారు. నిర్మాత అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ప్రేమ, యాక్షన్ సమాహారంతో ఈ చిత్రం ఉంటుంది. దేశం కోసం ఓ యువకుడు ఏం చేశాడు? అనేది చిత్రకథ. ఉగ్రవాదం నేపథ్యంలో సాగే ప్రేమకథ. 70 శాతం షూటింగ్ ముంబయ్‌లో జరుపుతాం. అలాగే, కొన్ని కీలక సన్నివేశాలను కాశ్మీర్లో చిత్రీకరిస్తాం. ఓ కీలక పాత్రను మురళీమోహన్‌గారు చేస్తున్నారు. ఇదే పాత్రకు హిందీలో అమితాబ్ బచ్చన్గార్ని అడగాలనుకుంటున్నాం. ప్రముఖ నిర్మాత ఎ.యం. రత్నం రాసిన పాటలు, కబీర్‌లాల్ సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్లస్ అవుతాయి’’ అని చెప్పారు. రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నానని కబీర్‌లాల్ అన్నారు. లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రం ద్వారా పరిచయం కావడం ఆనందంగా ఉందని నితిన్ నాష్ చెప్పారు. -
ముంచెత్తిన వాన
తాండూరు: కాగ్నా నది (వాగు) ఉగ్రరూపం దాల్చింది. జిల్లాలోని పలు మండలాల్లో కురిసిన భారీ వర్షానికి పరవళ్లు తొక్కింది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి ఐదు గంటల వరకు యాలాల, పెద్దేముల్, ధారూర్, పూడూరు మండలాల్లో జోరు వాన కురిసింది. దీంతో కాగ్నాకు వరద నీరు పోటెత్తింది. చెరువులు, వాగులు సైతం నిండి వరద నీరు పొంగిపొర్లింది. కాగ్నా నది ఉధృతితో తాండూరు- మహబూబ్‌నగర్ రహదారిపై రాకపోకలు మూడు గంటలపాటు స్తంభించాయి. చాలాకాలం తర్వాత కాగ్నా ఉప్పొంగడంతో చూసేందుకు జనాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దాదాపు రెండు కి.మీ.మేరకు వాహనాలు నిలిచిపోయాయి. తాండూరు రూరల్ సీఐ రవి, ఎస్ఐ రవికుమార్ సిబ్బందితో కాగ్నా వంతెన వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వరదనీరుతో ముళ్ల చెట్లు, చెత్తాచెదారం కొట్టుకొచ్చి వంతెనపై చేరాయి. అధికారులు జేసీబీని తెప్పించి వాటిని తొలగించారు. ఉదయం 10గంటల తర్వాత ప్రవాహం కాస్త తగ్గడంతో వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతిచ్చారు. తాండూరు పట్టణానికి తాగునీటి సరఫరాచేసే ప్రాంతంలో సుమారు పన్నెండు అడుగుల ఎత్తులో వరదనీరు ప్రవహించింది. భారీ వర్షం నేపథ్యంలో తాండూరు పట్టణం జలమయమైంది. గ్రీన్‌సిటీ, సాయిపూర్, కోకట్ మార్గంలోవాగు, పాలిషింగ్ యూనిట్లు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. పట్టణ సమీపంలోని చిలకవాగు, కోకట్వాగులు ఉధృతంగా ప్రవహించాయి. ఉదయం వేళ ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పట్టణంలోని రైల్వే ఫ్లైవర్ బ్రిడ్జీ మార్గంలో రోడ్లు దెబ్బతిన్నాయి. సాయిపూర్లోని ప్రభుత్వ నంబర్-1 పాఠశాల, బాలికల హాస్టళ్లు జలమయమయ్యాయి. పట్టణ సమీపంలోని కంది, పత్తి, పెసరు తదితర పంటలు నీటమునిగాయి. పలుచోట్ల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఉదయం మున్సిపల్ సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు. మధ్యాహ్ననికి కాగ్నా నదికి వరద ఉధృతి తగ్గింది. తాండూరు పట్టణంలో 52.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ధారూరులో 74.2 మిల్లీమీటర్ల వర్షం ధారూరు: ధారూరు మండలంలో సోమవారం రాత్రి 74.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీంతో వాగులు ఉధృతంగా ప్రవహించాయి. ధారూరు, బాచారం గ్రామాల సమీపంలో ప్రవహిస్తున్న వాగులు రాత్రి వేళ ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు మంగళవారం ఉదయం వరకు నిలిచిపోయాయి. వర్షానికి చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరింది. వర్షాలు లేక వడపడిన పంటలన్నీ కళకళలాడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. ధారూరు మండలంలో భారీ వర్షం కురిసినా కోట్‌పల్లి ప్రాజెక్టులోకి మాత్రం నీరు అంతగా చేరలేదు. కేవలం ఒకటిన్నర అడుగులు మాత్రమే పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 7.5 అడుగుల నీటి నిల్వ ఉంది. మర్పల్లి, బంట్వారం మండలాల్లో వర్షాలు కురిస్తేనే ఈ ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. ధారూరు మండంలోని ధర్మాపూర్, నర్సాపూర్, అనంతగిరిగుట్ట ప్రాంతాల్లో వర్షాలుకురిస్తే వాగు ప్రవహించి ప్రాజెక్టులోకి నీరు వచ్చే అవకాశం ఉం ది. సర్పన్‌పల్లి ప్రాజెక్టులో సోమవారం నాలుగు అడుగులు ఉన్న నీటి మట్టం అదేరోజు రాత్రి కురిసిన వర్షానికి ఏడు అడుగులకు చేరింది. చేపల వేట పెద్దేముల్: భారీ వర్షం కారణంగా చెరువులు వాగులు పొంగిపొర్లడంతో పలు గ్రామాల్లో ప్రజలు చేపల వేటకు దిగారు. పెద్దేముల్ మండలంలోని మంబాపూర్ వాగులో గ్రామ ప్రజలు వలలువేసి చేపలు పట్టుకున్నారు. వికారాబాద్ డివిజన్లో.. వికారాబాద్ రూరల్: వికారాబాద్ డివిజన్లో సోమవారం రాత్రి కురిసిన వర్షాలకు ఆయా మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్‌లో 33.2 మి.మీలు, ధారూర్‌లో 74.2, బంట్వారంలో 14.0, పెద్దేముల్ 90.0, తాండూరు 52.4, బషీరాబాద్ 46.0, యాలాల 72.0 మి.మీటర్ల వ ర్షపాతం నమోదైంది. భారీ వర్షానికి తెగిన రోడ్డు పరిగి: పరిగి ప్రాంతంలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసింది. మల్కాపూర్ వాగు పొర్లుతుండడంతో పరిగి-షాద్‌నగర్, పరిగి-మహబూబ్‌నగర్ వెళ్లే దారిలో తాత్కాలికంగా ఏర్పాటుచేసిన రోడ్డు తెగిపోయింది. మల్కాపూర్ సమీపంలో షాద్‌నగర్ రోడ్డుపై వంతెన నిర్మాణంలో ఉండడంతో తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేశారు. భారీ వర్షానికి మల్కాపూర్ వాగు ఉధృతంగా ప్రవహించడంతో రోడ్డు తెగింది. వాగుకు అవతల పొలాలకు వెళ్లిన వారు, పశువులు, మేకలు, గొర్రెలు అవతలే ఉండిపోయాయి. -
రైతులకు భరోసా ఏదీ ?
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఈ ప్రభుత్వంలో రైతులకు భరోసా లేకుండా పోయిందని, నకిలీ విత్తనాలు, పురుగుమందులు, ఎరువుల వల్ల రైతాంగం నష్టపోతోందని జిల్లా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిలదీశారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన తరువాత అసెంబ్లీ సమావేశాల్లో జరిగిన తొలి ప్రశ్నోత్తరాల సమయంలో మొదటి ప్రశ్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కగా అది కూడా ప్రకాశం జిల్లాకి చెందిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌కు అవకాశం లభించింది. వీరిద్దరూ రైతు సమస్యలపై ఎలుగెత్తి వైఎస్సార్ కాంగ్రెస్ రైతుపక్షపాతి అని నిరూపించారు. విత్తనాలను సరఫరా చేయడంలో ప్రభుత్వ సన్నద్ధత ఎంతని వ్యవసాయ శాఖ మంత్రిని నిలదీశారు. మంగళవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో పెద్ద ఎత్తున నకిలీ విత్తనాల రాకెట్ జరుగుతున్నట్లు ఆంగ్ల దినపత్రికల్లో వచ్చిన క థనాలను ప్రస్తావించారు. ఇక్కడి నుంచే నకిలీ విత్తనాలు దేశం నలుమూలలకు వెళ్తున్నాయని పత్రికల్లో వచ్చినా అధికారులు స్పందించలేదన్నారు. జిన్నింగ్ మిల్లుల్లో పత్తి నుంచి సీడ్ విడదీసి కిలో 20 నుంచి 30 రూపాయలకు కొనుగోలు చేసి ఐదు వందల గ్రాముల ప్యాకెట్‌ను మార్కెట్లో నాలుగు వందల రూపాయలకు విక్రయిస్తున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికైనా ఈ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని వారు డిమాండ్ చేశారు. అక్రమార్కులపై నామమాత్రపు కేసులు పెట్టడం వల్ల వారు కొద్దిపాటి జరిమానాలతో బయటకు వస్తున్నారని, వారిపై పకడ్బందీగా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలో పొగాకు, మొక్కజొన్న, సజ్జలు, శనగల పంట కోసం ఎకరానికి పెరిగిన ధరల నేపథ్యంలో 20 వేల రూపాయల వరకూ ఖర్చు చేయాల్సి వస్తోందని, పంట చేతికి వచ్చే సమయానికి పూత రాకపోతేగానీ రైతుకు అవి నకిలీ విత్తనాలు అని తెలియడం లేదని వారు వివరించారు. ఎక్కువ పెట్టుబడి, నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ విత్తనాలను సేకరించడంలోనూ, జిల్లాలకు పంపించే సమయంలో ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడిందని వారు విమర్శించారు. నకిలీ విత్తనాలు లక్షలాది ఎకరాల్లో వేయడం వల్ల వేలాదిమంది రైతులు నష్టపోతున్నారన్నారు. కోల్డ్ స్టోరేజిలో ఉన్న విత్తనాలను అధికారులే రైతులకు అంటగడుతున్నారని, సంవత్సరం దాటిన తర్వాత శుద్ధి చేయకుండా ఇవ్వడం వల్ల రైతు నష్టపోతున్నాడన్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లా పత్తి, మిర్చి, శనగ తదితర విత్తనాలు ఎన్ని టన్నులు సేకరించారు, జిల్లా కేంద్రానికి ఎంత చేరిందని ప్రశ్నించారు. ప్రకాశం జిల్లాలో పొగాకుకు ప్రత్యామ్నాయంగా శనగ పంటను వేశారని, అయితే శనగకు గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల లక్షల క్వింటాళ్లు కోల్డ్‌స్టోరేజి గోడౌన్లలో మూలుగుతున్నాయని వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రైతులకు అవగాహన కల్పించకుండా ‘పొలం పిలుస్తోంది’ పేరుతో మొక్కుబడి కార్యక్రమాలు చేయడం వల్ల మీడియాలో ఫొటోల కోసం తప్ప ఉపయోగం లేదని వారు విమర్శించారు. శనగ రైతుల సమస్యపై వ్యవసాయ శాఖ మంత్రి సమాధానమిస్తూ తమను రైతు సంఘం నాయకులు వచ్చి కలిశారని, టన్నుకు 3,800 రూపాయలు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. -
ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలి
కలెక్టరేట్‌ను ముట్టడించిన వామపక్ష విద్యార్థి సంఘాలు గంటపాటు నిరసన సుబేదారి : పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చే యాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వామపక్ష విద్యా ర్థి సంఘాల ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా సుమారు 500 మంది విద్యార్థులు బాల సముద్రంలోని ఏకశిలాపార్కు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి గంటపాటు నిరసన వ్యక్తం చేశారు. కాగా, కలెక్టర్ కార్యాలయ గేట్లుదాటి లోనికి వెళ్లేందుకు విద్యార్థి సంఘాల నాయకులు ప్రయత్నించగా పోలీ సులు వారిని అడ్డుకున్నారు. అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టరేట్ ఏఓ లక్ష్మీపతికి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భం గా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి అశోక్స్టాలి న్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1050 కోట్లు, జిల్లాలో రూ.150 కోట్ల స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ లో ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నారని తెలిపారు. సంక్షేమ హాస్ట ళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయని, తాడ్వాయి మండలంలోని ప్రాజెక్టునగర్ హాస్టల్లో పాముకాటులో ఇటీవల బాలిక మృతిచెందడమే ఇందుకు నిదర్శనమన్నా రు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం జారీ చేసిన జీఓ 42ను వెంటనే అమలు చేయాలని కోరారు. పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి పైండ్ల యాక య్య మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాల న్నా రు. టీవీవీ జిల్లా కార్యదర్శి ఐత అనిల్ మాట్లాడుతూ విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏఐ ఎఫ్‌డీఎస్ జిల్లా కార్యదర్శి సందీప్ మాట్లాడుతూ ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. టివీఎస్ జిల్లా కన్వీనర్ కూనూరు రంజిత్ మాట్లాడుతూ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టమైన హామీ ఇచ్చి, వృత్తివిద్యా కోర్సులకు కౌన్సెలింగ్ వెంటనే నిర్వహించాలన్నారు. కార్యక్రమం లో టీవీవీ జిల్లా అధ్యక్షుడు బైరగోని సుధాకర్, ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు గిన్నారపు రోహిత్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నాగరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ శ్రీకాంత్, బాలరాజు పాల్గొన్నారు. -
చెట్టే కదా అని నరికేస్తే..రౌడీషీట్
గుంతకల్లు టౌన్ : ప్రత్యర్థుల తోటల్లో చెట్లు నరికే విష సంస్కృతిని విడనాడకుంటే రౌడీషీట్ ఓపెన్ చేస్తామని గుంతకల్లు డీఎస్పీ సీహెచ్ రవికుమార్ స్పష్టం చేశారు. ఆదివారం గుంతకల్లు మండలం పులగుట్టపల్లి పెద్దతండాలో వైఎస్ఆర్సీపీ ఎస్టీ సెల్ మండల కన్వీనర్ గోవింద్‌నాయక్ పొలంలో 150 మామిడి మొక్కలను అదే గ్రామానికి చెందిన వారు నరికి వేసిన విషయం తెలిసిందే. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఎస్పీ రాజశేఖర్‌బాబు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితులను మీడియా ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పులగుట్టపల్లి పెద్దతండాకు చెందిన మనేనాయక్ తండ్రి కమెలేనాయక్పై 2013లో ఓ కేసు నమోదైంది. ఈ కేసు మరో 15 రోజుల్లో తుది విచారణకు రానుంది. ఈ నేపథ్యంలో తన తండ్రికి శిక్ష పడకుండా కాపాడేందుకు ఫిర్యాదురాలితో రాజీ చేయాలని వైఎస్ఆర్సీపీ నేత గోవింద్నాయక్ని కోరాడు. తాను చెప్పినా వారు వినే పరిస్థితిలో లేరని గోవింద్‌నాయక్ చెప్పడంతో మనేనాయక్ కక్ష పెంచుకున్నాడు. రాజునాయక్ అనే మరో నిందితుడు కూడా గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా ప్రచారం చేశాడు. ఈ గ్రామంలో గోవిందనాయక్ వల్ల వైఎస్ఆర్సీపీ బలోపేతం కావడాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఇద్దరూ కలిసి గోవింద్‌నాయక్‌ను ఆర్థికంగా దెబ్బ తీయాలనుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన రాత్రి పొలంలోకి వెళ్లి 150 మామిడి మొక్కలను నరికివేశారు. సోమవారం నిందితులు పులగుట్టపల్లి బస్టాప్ వద్ద వుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ సుబ్రమణ్యం, ఎస్ఐ రామయ్య, ఏఎస్ఐ శ్రీరాములు పాల్గొన్నారు. నిందితుల ఫొటోలతో ఫ్లెక్సీలు జిల్లాలో రైతులు సాగు చేసిన పండ్ల తోటలను నరికివేసి ఆర్థికంగా నష్టపరిచే నిందితులపై రౌడీషీట్లను ఓపెన్ చేయాలని ఎస్పీ ఆదేశించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల ఫొటోలతో కరపత్రాలు, ఫ్లెక్సీలు, వాల్‌పోస్టర్లు వేయించే వినూత్న ఒరవడికి గుంతకల్లు నుండే శ్రీకారం చుట్టారని స్పష్టం చేశారు. ఇకపై ప్రతి రోజూ అన్ని పల్లెల్లో రాత్రి వేళ ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తామన్నారు. పండ్ల తోటల పెంపకందార్లకు ఎవరినుండైనా హాని ఉన్నట్లయితే వారి వివరాలను సేకరించి, ఇలాంటి ఘటనలు జరగకుండా ఇరువురికీకౌన్సెలింగ్ నిర్వహించి వారి మధ్య స్నేహసంబధాల్ని మెరుగు పరిచేందుకు చర్యలు చేపడతామన్నారు. గ్రామాల్లో వర్గ, రాజకీయ కక్షలను ఎవరైనా ప్రోత్సహిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. అనంతరం పులగుట్టపల్లిపెద్దతాండాలో మామిడి మొక్కలను నరికేసిన మనేనాయక్, రాజునాయక్‌ల ఫోటోలతో వేయించిన కరపత్రాలు, ఫ్లెక్సీలను డీయస్పీ రవికుమార్, రూరల్ సీఐ సుబ్రమణ్యం ఆవిష్కరించారు. ఈ ఫ్లెక్సీలను గుంతకల్లు పట్టణంతో పాటు అన్ని గ్రామాల్లో వేయించి, కరపత్రాల ద్వారా ఇలాంటి ఘటనలు జరగకుండా హెచ్చరికలు జారీ చేయనున్నామని వారు తెలిపారు. నిందితులకు ఎస్పీ కౌన్సెలింగ్ గుత్తి : మామిడి మొక్కలు నరికివేత ఘటనలో నిందితులకు ఎస్పీ రాజశేఖర్‌బాబు కౌన్సెలింగ్ ఇచ్చారు. సోమవారం గుత్తి పోలీస్‌స్టేషన్‌కు ఇద్దరు నిందితులను తరలించారు. అనంతరం అక్కడకు చేరుకున్న ఎస్పీ తనదైన శైలిలో కౌన్సెలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. కార్యక్రమంలో సీఐ మోహన్, ఎస్ఐలు కృష్ణారెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు. -
ఇంత అవినీతి ఎక్కడా లేదు
సీతంపేట: ‘‘ సీతంపేట ఐటీడీఏలో ఉన్నంత అవినీతి ప్రపంచంలో ఎక్కడా లేదు. గత ఐదేళ్లుగా దీనిని భ్రస్టు పట్టించారు, గిరిజనుల అభివద్ధికి ప్రభుత్వం తరుపున వస్తున్న పథకాలు సక్రమంగా అమలు చేయడంలేదు. ఒకరిద్దరు ఉద్యోగులపై చర్యలు తీసుకుంటే గానీ ఇక్కడి వ్యవస్థ బాగుపడదు’’ అంటూ రాష్ట్ర కార్మిక, క్రీడలశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఐటీడీఏ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక పీఎంఆర్సీలో బుధవారం ఐటీడీఏ పథకాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. గిరిజన సంక్షేమశాఖ ద్వారా చేపడుతున్న పనుల్లో నాణ్యతా లోపాలు ఉన్నా. గామాభివృద్ది కమిటీల(వీటీడీఏ) ముసుగులో బినామి కాంట్రాక్టర్లు పనులు చేయడంతో నాణ్యత లోపిస్తుందన్నారు. కొంతమంది ఇంజినీర్లు కూడా కాంట్రాక్టర్ల అవతారమెత్తుతున్నారన్నారని ఈ మాట వాస్తవమా కాదా అని మంత్రి ఇంజనీరింగ్ ఈఈ శ్రీనివాసరావును నిలదీయగా నిజమేనని ఆయన అంగీకరించారు. వీటీడీఏలకు ఆర్ధిక స్తోమత లేకపోతే టెండర్లు పిలవాలని, బినామీలు పనులు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతూ రూ.49 కోట్లతో 204 రోడ్లు గతంలో మంజూరు చేశారని పనులకు సంబందించి కొన్ని రోడ్లుకు రూ.25 లక్షలకు నామినేషన్ ఇచ్చారన్నారు. ఇప్పటివరకు ప్రారంభంకాని రోడ్లను రద్దు చేయాలన్నారు. బంద చెరువుపై పూర్తి విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఎంఐ పనులపై విచారణకు జేసీ నియామకం... ఐటీడీఏ ద్వారా జరుగుతున్న ఎస్ఎంఐ (స్మాల్ మైనర్ ఇరిగేషన్) పనుల్లో చెరువులు, చెక్‌డ్యాంల నిర్మాణాల్లో నాణ్యత, పర్యవేక్షణ పూర్తిగా లోపించిందని మంత్రి అచ్చెన్న ఆగ్రహించారు. ఈ శాఖపై అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. నందిగాం మండలంలో ఒకే ఒక పనిచేశారు, ఆ పనికి ఎంత ఖర్చు చేశారని ఈఈ ఎం.వీ.రమణను ప్రశ్నించగా ఆయన సమాధానం చెప్పలేకపోయారు. ఎమ్మెల్యే కలమట మాట్లాడుతూ తామరగడలో 50 సెంట్లు విస్తీర్ణంలో చెరువు ఉంటే ఆ చెరువులో మూడు చెక్‌డ్యాంలు ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు. ఎస్ఎంఐ పనులపై పూర్తిస్థాయిలో విచారణ చేసి పదిరోజుల్లో నివేదిక ఇవ్వాలని కోరగా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ దీనిపై జేసీ వీరపాండియన్‌ను విచారణాధికారిగా నియమిస్తున్నట్లు తెలిపారు. ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం.. ఏనుగులను ఇక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికి శాశ్వత పరిష్కారం చూపిస్తామని మంత్రి అచ్చెన్న హామీ ఇచ్చారు. ఈవిషయమై సీఎంతో కూడా చర్చించామన్నారు. వీఎస్‌ఎస్‌ల పనితీరుపై ప్రభుత్వ విప్ కూన రవికుమార్ డీఎఫ్‌వో విజయ్‌కుమార్‌తో చర్చించారు. గతంలో వీరఘట్టంలో ఏనుగుల దాడిలో నాగరాజు అనే విలేకరి మృతి చెందాడని ఆ కుటుంబానికి కేవలం రూ.లక్ష మాత్రమే ఇచ్చారని ఎమ్మెల్యే కలమట తెలిపారు. రెండున్నర ఎకరాల భూమి, ఉద్యోగం ఇచ్చేలా ఆ కుటుంబానికి గతంలో మంత్రి హామీ ఇచ్చారని ఆ హామీ నెరవేరలేదని డీఎఫ్‌వోను ఎమ్మెల్యే ప్రశ్నించారు. వైద్యులు స్థానికంగా ఎందుకు నివాసం ఉండడంలేదు.. ? వైద్యులు స్థానికంగా ఎందుకు ఉండడంలేదంటూ డీఎంఅండ్ెహ చ్వో గీతాంజలీ, డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో జె.కృష్ణమోహన్‌ను మంత్రి అచ్చెన్న ప్రశ్నించారు. వైద్యుల పోస్టులు త్వరగా భర్తీ చేయూలని, అవసరమైతే హెల్త్ కమిషనర్‌తో మాట్లాడుతానని అచ్చెన్న అన్నారు. పాలకొండలో మత్తుమందు డాక్టర్‌ను నియమించాలని జెడ్పీటీసీ దామోదర్ కోరారు. పాతపట్నం పీహెచ్సీలో ఒకే ఒక డాక్టర్ ఉంటే డెప్యుటేషన్ ఎందుకు వేశారని ఎమ్మెల్యే కలమట ప్రశ్నించారు. మంత్రి అచ్చెన్న కలుగజేసుకుని పీహెచ్‌సీల్లో అన్ని డెప్యుటేషన్లను రదు ్దచేయాలన్నారు. విద్యాశాఖపై నిర్వహించిన చర్చలో బాలికల వసతి గృహాల్లో మరుగుదొడ్లు లేక ఎక్కడెక్కడ ఇబ్బందులు పడుతున్నారో నివేదిక ఇవ్వాలని, వసతిగృహాల్లో మెనూ సక్రమంగా లేదని ఎప్పటికప్పుడు సందర్శించి ప్రక్షాళన చేయూలని పీవో సత్యనారాయణ, గిరిజన సంక్షేమ శాఖ డీడీ కొమరం నాగోరావుకు ఆదేశించారు.బెల్టు షాపులను ఏజెన్సీలో నిర్మూలించాలని ఎక్సైజ్ అధికారులకు ఆదేశించారు. అనంతరం ఐకేపీతో పాటు ఇతర శాఖలపై సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ధనలక్ష్మి, నరసన్నపేట, ఇచ్చాపురం ఎమ్మెల్యేలు బగ్గులక్ష్మణరావు, బెందాలం అశోక్, పాలకొండ, టెక్కలి ఆర్డీవోలు తేజ్‌భరత్, శ్యాంసుందర్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు ముఖలింగం, పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ నిమ్మక జయకృష్ణ, వివిధ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అత్తింటి ఆరళ్లకు వివాహిత బలి
మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ పోలీసుల అదుపులో భర్త, మరో నలుగురు విజయనగరం క్రైం: ఎన్నో ఊహలు.. ఎన్నో ఆశలతో.. సంసార జీవితాన్ని సంతోషంగా పండించుకోవాలని అత్తారింట్లో అడుగుపెట్టింది ఆ యువతి. సంప్రదాయబద్ధంగా తనను కోడలిని చేసుకున్న అత్తింటి వారు జీవితాంతం కష్టపెట్టకుండా చూసుకుంటారని ఆశించిన ఆమెకు నిరాశే ఎదురైంది. వరకట్న వేధింపులు భరించలేక పెళ్లయి ఏడాది తిరక్కముందే ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి, పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామానికి చెందిన ఎం.మహేష్‌కు ఇద్దరు కుమార్తెలు శిరీష, జ్యోతి. విజయనగరం పట్టణం సుద్ధవీధికి చెందిన కె.రవికుమార్‌కు శిరీష(19)ను ఇచ్చి గత ఏడాది ఆగస్టు 11న వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో రూ.రెండు లక్షల కట్నం, తులంన్నర బంగారు అభరణాలు, సారె అందించారు. పెళ్లయిన కొద్దిరోజులకే అల్లుడు రవికుమార్, కుటుంబసభ్యులు అదనపు కట్నం కోసం వేధించేవారు. గర్భం దాల్చిన ఆమెను కన్నవారింటికి పంపించేందుకు ఒప్పుకోలేదు. దీంతో అల్లుడు నివాసం ఉంటున్న దగ్గరలోనే ఇల్లు అద్దెకు తీసుకుని మహేష్ కుటుంబ సభ్యులు నివాసముంటున్నారు. సుమారు నెల కిందట శిరీషకు మగబిడ్డ జన్మించాడు. మంగళవారం ఉదయం శిరీషను, బిడ్డను అత్తవారు వారింటికి తీసుకెళ్లారు. సాయంత్రం కన్నవారింటికి వచ్చిన ఆమె ఫ్యాన్‌కు చీరతో ఉరుపోసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు 108 ద్వారా కేంద్రాస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో ఆమె మృతి చెందింది. శిరీష బంధువులు బుధవారం జిల్లా కేంద్రాస్పపత్రికి చేరుకొని రవికుమార్ వేధింపుల వల్లే ఆమె చనిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అత్తింటి వేధింపులే వల్లే ? అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపుల వల్లే తమ కుమార్తె ప్రాణాలు తీసుకుందని శిరీష తల్లిదండ్రులు ఆరోపించారు. అల్లుడు, అతని తల్లిదండ్రులు, అన్నయ్య అశోక్, వదిన సంధ్య, రవికుమార్ అక్క జయశ్రీ, బావ అప్పారావు నిత్యం వేధించేవారన్నారు. శిరీష మృతికి కారకులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. రవికుమార్‌తోపాటు మరో నలుగురిని కేంద్రాస్పత్రి వద్ద టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించినట్లు తెలుస్తోంది. -
యాక్షన్ ఎంటర్టైనర్
అర్జున్ యాజెస్, మౌర్యాని జంటగా పత్తికొండ సినిమాస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం హైదరాబాద్‌లో మొదలైంది. భానుశంకర్ .పి దర్శకత్వంలో రవికుమార్. ఎమ్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పత్తికొండ కుమారస్వామి కెమెరా స్విచాన్ చేయగా, సీనియర్ పాత్రికేయుడు పసుపులేటి రామారావు క్లాప్ ఇచ్చారు. ఎన్. శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘కొంతమంది పెద్ద హీరోలకు ఈ కథ చెప్పాను. వారికి ఈ కథ నచ్చినా, నటించడానికి సంశయించారు. అందుకే కొత్తవారితో చేస్తున్నా. ఇది యాక్షన్ ఎంటర్టైనర్’’ అని చెప్పారు. ఆగస్ట్ 1న రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తామని, పత్తికొండ కుమారస్వామి సహకారం మరవలేనిదని నిర్మాత అన్నారు. మంచి పాటలివ్వడానికి ఆస్కారం ఉన్న కథ ఇదని సంగీతదర్శకుడు రవివర్మ తెలిపారు. సీనియర్ హీరోలు చేయాల్సిన పాత్రను చేస్తున్నానని, ఈ పాత్రకు న్యాయం చేయడానికి కృషి చేస్తానని అర్జున్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సాయి శ్రీనివాస్. -
నేను చెప్పిన ట్టు వినండి.. లేదా..!
ఆమదాలవలస: నేను చెప్పే పనులు చేసే అధికారులే ఆముదాలవలస మున్సిపల్ కార్యాలయంలో ఉద్యోగులుగా ఉండండి లేదంటే స్వచ్చందంగా బదీలీలు చేయించుకుని వెళ్లిపోండి. ఈ రెండూ చేయకపోతే నేనే మిమ్మల్ని పంపించివేసి నాకు నచ్చిన వారిని తెచ్చిపెట్టుకుంటా. ఈ మాటలేంటని అనుకుంటున్నారా. ఇది ఆమదాలవలస మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే అధికారులతో మంగళవారం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్న మాటలు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఎన్ నూకేశ్వరరావు అధ్యక్షతన వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో రవికుమార్ పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ప్రతిరోజు తాగునీరు అందించడంతోపాటు, మున్సిపల్ పరిధిలో ఉన్న బోగస్ కార్డులు, పింఛన్లు రద్దుచేసేందుకు తగిన కార్యచరణ సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగే ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేయూలని కమిషనర్‌ను ఆదేశించారు. పారిశుద్ధ్య పనులు, సీసీరోడ్లు, ఆదాయ వ్యయూలపై అధికారులను నిలదీస్తూ ఆరాతీశారు. మున్సిపల్ మేనేజర్ కె శ్రీనివాసరావు, తహశీల్దారు శ్రీరాములు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వ్యాపార లక్ష్యం రూ.10 వేలకోట్లు
ఆంధ్రాబ్యాంక్ డీజీఎం రవికుమార్ వత్సవాయి : ఈ ఏడాది పదివేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని ఆంధ్రాబ్యాంక్ డీజీఎం జి.రవి కుమార్ తెలిపారు. వత్సవాయిలో బుధవారం జరిగిన ఆంధ్రాబ్యాంక్ శాఖ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 103ఆంధ్రాబ్యాంక్ శాఖలు, 87 ఏటీఎం సెంటర్లు ఉన్నాయని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం రూ.8,200 కోట్ల వ్యాపారం జరి గిందన్నారు. ఈ ఏడాది రూ.10 వేల కోట్ల వ్యాపారం చేయాలన్నది లక్ష్యమని పేర్కొన్నారు. 2013-14 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో 30 ఏటీఎం సెంటర్లు, 10 శాఖలను ప్రారంభించామని, ఈ ఏడాది జిల్లాలో మరో 30 ఏటీఎంలు, 10 శాఖలు ప్రారంభిస్తామని వెల్లడించారు. మరో ఐదు శాఖలకు అనుమతులు లభించాయని తెలి పారు. రైతులకు వ్యవసాయ రుణాలతో పాటు చేతి వృత్తుల వారికి తక్కువ వడ్డీకి అప్పులు ఇస్తామని ప్రకటించారు. వడ్డీ వ్యాపారుల బారిన పడి నష్టపోకుండా చిరువ్యాపారులు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రుణాలు అందజేస్తామని చెప్పారు. గత ఏడాది జిల్లాలో 1500 మంది చిరువ్యాపారులకు రుణాలు ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిన నేపత్యంలో జిల్లాలో జగ్గయ్యపేట, నందిగామ నిమోజకవర్గాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందన్నారు. అందుకనుగుణంగా పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇచ్చేందుకు తమ బ్యాంక్ ఎల్లప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. -
రూ.26 లక్షలకే ఫ్లాట్!
* కాప్రాలో సాకేత్ ప్రణామ్ రిటైర్మెంట్ కమ్యూనిటీ * గౌడవల్లిలో ‘భూ:సత్వ’ లగ్జరీ విల్లా ప్రాజెక్ట్ * సాకేత్ ఇంజనీర్స్ ప్రై.లి. డెరైక్టర్ రవి కుమార్ సాక్షి, హైదరాబాద్: ఫ్లాట్.. ఏ వెంచర్లో చూసినా చ.అ.కి రూ. 2,500- 5,000 పెట్టాల్సిందే. మరి సామాన్యుల సొంతింటి కల తీరేదెలా? అందుకే అందుబాటు ధరల్లో ఫ్లాట్లను అందించేందుకు సరికొత్త ప్రాజెక్ట్‌లను నిర్మిస్తోంది సాకేత్ ఇంజనీర్స్ ప్రై.లి. ప్రశాంత వాతావరణం.. ఆహ్లాదకర పరిసరాలు.. ఆధునిక రక్షణ ఏర్పాట్లు.. కుటుంబంతో కలసి ఆస్వాదించడానికి పచ్చికబయళ్లు.. బంధుమిత్రులొస్తే ఆవరణలో సమస్త సౌకర్యాలతో నగరంలో పలు సరికొత్త ప్రాజెక్ట్‌లను నిర్మిస్తున్నట్లు సంస్థ డెరైక్టర్ రవి కుమార్ ‘సాక్షి రియల్టీ’తో చెప్పారు. * హైదరాబాద్‌కే తలమానికంగా నిలిచేలా కొంపల్లికి అతి సమీపంలోని గౌడవల్లిలో ‘భూ:సత్వ’ లగ్జరీ విల్లాలను నిర్మిస్తున్నాం. మొత్తం 70 ఎకరాల్లో 500 విల్లాలొస్తాయి. ఫేజ్-1లో 19 ఎకరాల్లో 170 విల్లాలను నిర్మించాం. ఫేజ్-2ను ఈ నెలాఖరులోగా ప్రారంభిస్తాం. ఒక్కో విల్లా విస్తీర్ణం 200-400 చ.అ. మధ్య ఉంటుంది. ప్రారంభ ధర రూ.65 లక్షలుగా నిర్ణయించాం. * ఔటర్ రింగ్‌రోడ్ గ్రోత్‌కారిడార్‌లో నిర్మిస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ కూడా ఇదే. నిర్మాణంలో నాణ్యతతో పాటు పచ్చదనానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నాం. వెంచర్లోకి అడుగుపెట్టగానే సేదతీరేలా పచ్చని పచ్చిక బయళ్లు, స్విమ్మింగ్ పూల్, క్లబ్ హౌజ్, హెల్త్ క్లబ్, ఇండోర్ గేమ్స్, వాటర్ స్పోర్ట్స్, సైక్లింగ్, జాగింగ్, వాకింగ్ ట్రాక్‌ల ఏర్పాటు వంటి అంతర్జాతీయ సౌకర్యాలుంటాయి. ప్రతీ విల్లాకు సోలార్ వాటర్ హీటర్లు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వాటర్ రీసైక్లింగ్లు కూడా ఉంటాయి. * వృద్ధులకు ఆపన్నహస్తం అందించడానికి సరికొత్త రిటైర్మెంట్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. కాప్రాలో నాలుగున్నర ఎకరాల్లో సాకేత్ ప్రణామ్ పేరుతో ఈ ప్రాజెక్ట్ వస్తోంది. మొత్తం ఫ్లాట్ల సంఖ్య 333. ప్రారంభ ధర రూ.26 లక్షలు. ఆరోగ్యం, ఆనందం, విలాసం, శాంతి, భద్రత, ప్రేమానురాగాల కలబోతే ఈ గృహాల ప్రత్యేకత. ఇదే ప్రాంతంలో మూడున్నర ఎకరాల్లో ‘సాకేత్ శ్రీయం’ ప్రాజెక్ట్‌ను కూడా నిర్మించాం. మొత్తం 25 అంతస్తుల్లో 312 ఫ్లాట్లుంటాయి. ప్రారంభ ధర రూ.40 లక్షలు. * బెంగళూరులోనూ సాకేత్ సంస్థ పలు ప్రాజెక్ట్‌లను నిర్మిస్తోంది. సబ్జాపూర్రోడ్లో రెండున్నర ఎకరాల్లో క్వాలిపోలిస్ పేరుతో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం ఫ్లాట్ల సంఖ్య 200. ప్రారంభ ధర రూ.75 లక్షలు. త్వరలో మైసూర్ రోడ్‌లోని కింగేరిలో మరో ప్రాజెక్ట్‌కు ప్రారంభిస్తాం. -
అభివృద్ధిలో దళితులనూ భాగస్వాముల్ని చేయాలి
* డీఐసీసీఐ ఏపీ చాప్టర్ అధ్యక్షుడు రవికుమార్ నర్రా * తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో డీఐసీసీఐ శాఖల ఏర్పాటు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం పారిశ్రామికాభివృద్ధి చెందాలంటే ముందుగా దళితులు ఆర్థికంగా పురోగతిని సాధించాలని దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డీఐసీసీఐ) ఏపీ చాప్టర్ అధ్యక్షుడు, పద్మశ్రీ రవికుమార్ న ర్రా చెప్పారు. ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో పాటు పునఃపెట్టుబడులు పెరిగినప్పుడే పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో డీఐసీసీఐ శాఖలను శనివారం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో డీఐసీసీఐని కూడా రెండు రాష్ట్రాల్లో విస్తరించామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా శ్రీనివాస్‌ని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఎం. మధుసూదన్ రావును నియమించినట్లు చెప్పారు. ‘కేంద్ర ప్రభుత్వం ఏటా ఆయా రాష్ట్రాల్లో రూ.70 వేల కోట్ల విలువ చేసే పారిశ్రామిక వస్తువులను కొనుగోలు చేస్తోంది. ఇందులో 20 శాతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇందులో 4 శాతం (సుమారుగా రూ.7 వేల కోట్ల విలువ గల) ఎస్సీ, ఎస్టీలకు చెందిన పారిశ్రామిక వస్తువులను కొనుగోలు చేయాలి..’ అని రవికుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో దళితులను భాగస్వాముల్ని చేయడంతో పాటు ఆయా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ‘ప్రి-క్వాలిఫికేషన్’ను వెంటనే తొలగించాలని కోరారు. -
రైతులకు బాసట
వ్యవసాయ భూములున్నా అందులో ఎలాంటి సారం లేక, పంటలు పండక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నిరుపేద రైతులకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నాడు ఓ యువకుడు. బీడు భూములను సారవంతంగా మార్చేందుకు నడుం బిగించాడు. ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి నిస్సారంగా ఉన్న భూముల్లో చెరువు మట్టి నిపోయిస్తూ సాగులోకి తెస్తున్నాడు. ఆయనే మండల కేంద్రానికి చెందిన రవికుమార్. - న్యూస్‌లైన్, మునుగోడు మునుగోడుకు చెందిన రాధాకృష్ణమూర్తి, విజయలక్ష్మి దంపతుల కుమారుడు రవికుమార్. ఈయన యూకేలో ఎంఎస్ (పబ్లిక్‌హెల్త్ రీసర్చ్)చదువుకున్నాడు. పేద ప్రజలకు సేవచేయాలనే తపనతో 2005లో ఫ్రీడం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేశాడు. బీడుభూముల్లో చెరువుమట్టిని పోసి సాగులోకి తేవాలన్న ఆలోచనతో ముందడుగువేస్తున్నాడు. తానే స్వయంగా రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నాడు. జిల్లాలోని పలు మండలాల్లో నిరుపేద రైతుల భూములను ఎంపికచేసుకుని సాగులోకి తేవడానికి కృషిచేస్తున్నాడు. -
ఫలించిన దింపుడు కల్లం ఆశ!
సాక్షి ప్రతినిధి, అనంతపురం : మాజీ మంత్రి శైలజానాథ్ దింపుడు కల్లం ఆశ ఫలించింది. బండారు రవికుమార్‌తో కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టించిన టీడీపీ అధినేత చంద్రబాబు చివరి నిముషంలో టికెట్‌ను వెనక్కి తీసుకున్నారు. ఇది పసిగట్టిన మాజీ మంత్రి శైలజానాథ్ గురువారం అర్ధరాత్రి హడావుడిగా హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు కోటరీలో కీలకనేత సీఎం రమేష్‌తో సమావేశమై.. శింగనమల టికెట్ ఇస్తే భారీ ఎత్తున ముట్టచెబుతానని ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఇది పసిగట్టిన జేసీ దివాకర్‌రెడ్డి.. శైలజానాథ్‌కు తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఆయనకు టికెట్ ఇస్తే ఆ ప్రభావం అనంతపురం లోక్‌సభ స్థానంపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో అనూహ్యంగా శమంతకమణి వారసులు యామినీ బాల, అశోక్ పేర్లను టీడీపీ అధినేత చంద్రబాబు తెరపైకి తెచ్చారు. ఇంత జరిగినా చివరకు శైలజానాథ్ ఇవ్వజూపిన మొత్తం కళ్లు చెదిరేలా ఉండటంతో చంద్రబాబు ఆయన వైపు మొగ్గినట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. వివరాల్లోకి వెళితే.. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఫోరం చైర్మన్‌గా వ్యవహరించిన మాజీ మంత్రి శైలజానాథ్ మాజీ సీఎం కిరణ్ కోటరీలో అత్యంత ప్రధానమైన నేత. కిరణ్ స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్ష పదవి పొందిన కొద్ది రోజులకే ఆ పార్టీకి హ్యాండ్ ఇచ్చారు. శింగనమల నుంచి టీడీపీ టికెట్ తెచ్చుకోవడానికి తెరవెనుక ప్రయత్నాలు చేశారు. చంద్రబాబు కోటరీలో కీలకనేత సీఎం రమేష్‌తో శైలజానాథ్ పలు దఫాలుగా సమావేశమయ్యారు. టికెట్ ఇప్పిస్తే భారీ ఎత్తున డబ్బులు ముట్టచెబుతానని బేరసారాలు జరిపినట్లు టీడీపీ శ్రేణులు అప్పట్లో వెల్లడించాయి. అనంతపురం లోక్‌సభ టీడీపీ అభ్యర్థి జేసీ దివాకర్‌రెడ్డితోపాటు పయ్యావుల కేశవ్ వ్యతిరేకించడంతో శైలజానాథ్‌కు టీడీపీ టికెట్ దక్కలేదు. దాంతో చేసేదిలేక పీసీసీ చీఫ్ రఘువీరాతో మంత్రాంగం జరిపి ఎట్టికేలకు కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారు. ఈ నెల 15న శింగనమల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేశారు. అలా అనుకుంటే ఇలా అయ్యంది.. ఓరియంటల్ ఇన్సూరెన్స్ సంస్థలో పనిచేస్తోన్న బండారు రవికుమార్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భారీగా సంపాదించారు. సీఎం రమేష్‌తో రాయ‘బేరాలు’ జరపడం వల్లే బండారు రవికుమార్‌ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. ప్రాదేశిక ఎన్నికల్లో బండారు రవికుమార్ టీడీపీ తరఫున పోటీచేసిన జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు భారీ ఎత్తున పార్టీ ఫండ్‌గా డబ్బులు అందించారు. శనివారం నామినేషన్ దాఖలు చేయాలని భావించిన బండారు రవికుమార్ గురువారం మండలానికి రూ.పది లక్షల చొప్పున పంపిణీ చేసి, భారీ ఎత్తున జనసమీకరణ చేయడానికి ప్రణాళిక రచించారు. ఈ నేపథ్యంలో రవికుమార్‌కు టికెట్ క్యాన్సిల్ చేసినట్లు చంద్రబాబు నుంచి పార్టీ నేతలకు సమాచారం అందింది. ఈ విషయాన్ని పసిగట్టిన శైలజానాథ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేసింది విస్మరించి.. గురువారం అర్ధరాత్రి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. సీఎం రమేష్‌తో బేరసారాలు సాగించారు. టీడీపీ టికెట్ ఇప్పించాలని ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చారు. శైలజానాథ్‌కు టికెట్ దక్కడం ఖాయమన్న తరుణంలో జేసీ దివాకర్‌రెడ్డి రంగ ప్రవేశం చేశారు. శింగనమల నియోజకవర్గంలో శైలజానాథ్‌కు తీవ్రమైన వ్యతిరేకత ఉందని.. ఆయనకు టికెట్ ఇస్తే ఆ ప్రభావం అనంతపురం లోక్‌సభపై పడుతుందని జేసీ ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. జేసీ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తేవడంతో చంద్రబాబు వెనక్కి తగ్గి.. శైలజానాథ్‌కు టీడీపీ టికెట్ ఇవ్వలేమని తేల్చిచెప్పారు. ఇదే సందర్భంలో ఎమ్మెల్సీ శమంతకమణి అల్లుడైన ఓ పోలీసు ఉన్నతాధికారి రంగప్రవేశం చేశారు. చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్న ఆ పోలీసు అధికారి.. శమంతకమణి కూతురైన యామిని బాలకుగానీ ఆమె కుమారుడు అశోక్‌కుగానీ టీడీపీ టికెట్ ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇందుకు చంద్రబాబు అంగీకరించారు. శింగనమల నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా గార్లదిన్నె ఎంఈవోగా పనిచేస్తోన్న యామినీ బాల ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. చంద్రబాబును డబ్బుతో కొట్టారు.. డబ్బు ముట్టజెపితే టీడీపీలో కాని పనేదీ లేదని స్పష్టమవడంతో శైలజానాథ్ కళ్లు చెదిరే భారీ మొత్తాన్ని శుక్రవారం రాత్రి సీఎం రమేష్ ద్వారా చంద్రబాబుకు ఆఫర్ చేసినట్లు సమాచారం. ఆ ఫ్యాన్సీ ఫిగర్ చెవినపడటంతో చంద్రబాబు అన్ని అభ్యంతరాలను పక్కనపెట్టి శైలజానాథ్‌కు టికెట్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇదే విషయాన్ని శైలజానాథ్ శుక్రవారం రాత్రి తన అనుచరులకు తెలియజేసి.. శనివారం నామినేషన్‌కు సిద్ధమవ్వాలని సూచించినట్లు తెలిసింది. ఈ పరిణామంపై శమంతకమణి వర్గీయులు, జేసీ వర్గీయులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. -
బియ్యం తరలింపు ఘటనలో 48 మందిపై కేసు
మునగపాక, న్యూస్‌లైన్ : ఎన్నికల విధి నిర్వహణలో ఉన్న మునగపాక ఎస్ఐ రవికుమార్‌ను భయబ్రాంతులకు గురిచేసి బియ్యం ఆటోలను తరలించడంలో ప్రధానపాత్ర పోషించిన మాజీ సర్పంచ్ పెంటకోట సత్యనారాయణ, దేశం నాయకుడు డొక్కా నాగభూషణంతోపాటు మరో 48మందిపై కేసు నమోదు చేసి ఆటోను అదుపులోకి తీసుకున్నామని అనకాపల్లి రూరల్ సీఐ ఎస్.భూషణ్‌నాయుడు బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 5న ఎన్నికల ప్రక్రియలో భాగంగా మునగపాక బీసీ కాలనీ గోడౌన్ వద్ద ఆటోలో అక్రమంగా బియ్యం బస్తాలను తరలిస్తున్నారని అందిన ఫిర్యాదు మేరకు మునగపాక ఎస్ఐ జి.రవికుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారన్నారు. ఆటోలో పదిబస్తాల బియ్యాన్ని గమనించారన్నారు. అయితే అప్పటికే అక్కడకు చేరుకున్న టీడీపీ నేతలు పెంటకోట సత్యనారాయణ, డొక్కా నాగభూషణంతోపాటు మరో 48మంది కార్యకర్తలు ఎస్ఐ రవికుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భయబ్రాంతులకు గురి చేశారన్నారు. పోలీసులను పక్కకు నెట్టి బియ్యంలోడుతో ఉన్న ఆటోను సంఘటనా స్థలం నుంచి తరలించుకుపోయారన్నారు. విచారణలో భాగంగా సంబంధిత ఆటోను అదుపులోకి తీసుకున్నామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని భూషణ్‌నాయుడు తెలిపారు. -
నా వద్ద ఆధారాలున్నాయి
తమిళసినిమా, న్యూస్‌లైన్ : దర్శకుడు రవికుమార్‌కు తనకునిశ్చితార్థం మాత్రమే జరిగిందని, పెళ్లి జరగలేదని నటి సుజిబాల వడపళని పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అందులో రవికుమార్ తనను వేధిస్తున్నట్లు ఆమె ఆరోపణలు చేశారు. దీనికి స్పందించిన దర్శకుడు రవికుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సుజిబాల తన భార్యనేనన్నారు. తమకు పెళ్లి కూడా జరిగిందని తెలిపారు. అందుకు ఆధారాలు ఉన్నాయని చెప్పారు. సుజిబాల తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆమె పత్రికల వారికి చెప్పినవన్ని అబద్ధాలేనన్నారు. ఆమెపై తాను హత్యా బెదిరింపులకు పాల్పడుతున్నాననడం నిజం కాదన్నారు. వాస్తవానికి సుజిబాల తల్లినే చంపిస్తానని ఫోన్లో బెదిరించిందని తెలిపారు. తాను దర్శక, నిర్మాతగా రూపొందిస్తున్న చిత్రంలో హీరోయిన్ సుజిబాలనేనని ఆమె షూటింగ్‌కు రాకపోవడంతోనే చిత్రం ఆగిపోయిందని ఆరోపించారు. అదే విధంగా సుజిబాలకు తాను కారు, బంగ్లా, మామిడి తోట కొనివ్వడం అబద్దం అని అంటున్నారని వీటన్నింటికీ తన వద్ద ఆధారాలున్నాయని వాటిని పోలీసులకు అందచేస్తానని దర్శకుడు రవికుమార్ తెలిపారు. -
కాంగ్రెస్‌లో వర్గపోరు
పెద్దేముల్, న్యూస్‌లైన్: ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం పెద్దేముల్‌కు వచ్చిన డీసీసీబీ చైర్మన్ లక్ష్మారెడ్డిని పలువురు కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం చేయరాదంటూ పెద్దేముల్‌కు చెందిన మాజీ ఎంపీపీ భర్త రవికుమార్, నాయకులు కుమార్, గోపాలకృష్ణతో పాటు పలువురు నినాదాలు చేశారు. పెద్దేముల్ నాయకులకు పార్టీలో తగిన ప్రాధాన్యం కల్పించని వ్యక్తివి గ్రామానికి ఎందుకు వచ్చావంటూ ఆయనను ప్రశ్నించారు. వారిని మాజీ ఎంపీపీ రాంగోపాల్ తదితరులు సముదాయించినా ఫలితం లేకుండాపోయింది. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో చేసేదేమీలేక లక్ష్మారెడ్డి స్థానిక ఉపసర్పంచ్ విష్ణువర్ధన్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడినుంచి ఆయన వాహనంలో తాండూరుకు వెళుతుండగా.. డీసీసీబీ చైర్మన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నాలుగు రోజుల క్రితం తాండూరు సిండికేట్‌లో పెద్దేముల్ గ్రామానికి చెందిన ఓ కార్యకర్తపై లక్ష్మారెడ్డి చెయ్యిచేసుకున్నారని, అందువల్లే ఆయనను స్థానిక కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నట్లు సమాచారం. ఈ వర్గపోరు ప్రభావం కాంగ్రెస్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులపై పడవచ్చని కొంత మంది నాయకులు అంటున్నారు. బరిలో ఉన్న నాయకులు తలలు పట్టుకుంటున్నారు. -
ఐదేళ్లు ఆగితేనే తెలంగాణ అభివృద్ధి
నిస్వార్థంతో పనిచేసే పాలకులు రావాలి.. ఏడాదిలో సమస్యలన్నీ పరిష్కారం కావు ఈటెల రాజేందర్ స్పష్టీకరణ కవాడిగూడ,న్యూస్‌లైన్: రాష్ట్రం ఏర్పడినంత మాత్రాన గొప్ప మార్పులురావని..త్యాగం,అంకితభావం, నిస్వార్థం కలిగిన పాలకులు వస్తేనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే కనీసం 5 ఏళ్ల సమయం పడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ విద్య రద్దు, కామన్ స్కూల్ విద్యావిధానాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ (టీటీఎఫ్) ఆధ్వర్యంలో తెలంగాణ ఉపాధ్యాయ భేరి ఆదివారం ఇందిరాపార్కు వద్ద జరిగింది. దీన్ని ప్రొ.కేశవరావు జాదవ్ ప్రారంభించగా, ముఖ్యఅతిథులుగా ఈటెల రాజేందర్, టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్, ప్రజాగాయకులు గద్దర్, గోరెటి వెంకన్న, విమలక్క, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్రనేత గోవర్దన్ తదితరులు హాజరయ్యారు. ఈటెల ఈసందర్భంగా మాట్లాడారు. ‘మాటలు చెప్పడం వేరు, పాలనచేయడం వేరు. తెలంగాణను పాలించే వారికి త్యాగం,అంకితభావం, నిస్వార్థం కలిగిన పాలకులు రావాలి. ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న సమస్యలు ఏడాదిలో పరిష్కారమవుతాయని అనుకోవడం లేదు. దాదాపు ఐదేళ్లు పాలిస్తే తప్ప సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. సామాజిక చైతన్యాన్ని అందించిన ఉద్యమస్ఫూర్తితో నవతెలంగాణను నిర్మించుకుందామని’ పిలుపునిచ్చారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రభుత్వశాఖల్లో 70 శాతానికిపైగా ఉద్యోగులు సీమాంధ్రులే ఉన్నారని, జనాభా నిష్పత్తి లెక్కన ఉద్యోగులను విభజిస్తే తెలంగాణ రాష్ర్టంలో మళ్లీ సీమాంధ్ర ఉద్యోగులే ఆధిపత్యం చేసే అవకాశముందని అనుమానం వ్యక్తం చేశారు. స్థానికత ఆధారంగానే ఉద్యోగులను విభజించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో టీటీఎఫ్ అధ్యక్షుడు రాములు, ప్రధానకార్యదర్శి రఘునందన్, ప్రొ.తిరుమలి, వేద కుమార్, జూలూరి గౌరీశంకర్, ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాగాయకులు గద్దర్, గోరటి వెంకన్న, విమలక్క, పైలం సంతోష్, అరుణోదయ కళాకారులు పాడిన పాటలు అమితంగా ఆకట్టుకున్నాయి. -
కాళోజీ జీవితంపై సమగ్ర పరిశోధన జరగాలి
హన్మకొండ కల్చరల్ న్యూస్‌లైన్ : కాళోజీ వ్యక్తిత్వాన్ని, కవితల్లోని ఆత్మను వెలికితీసేలా ఆయన జీవితంపై సమగ్ర పరిశోధన జరగాలని సినీ రచయిత, చిత్రకారుడు, కాళోజీ శతజయం తి ఉత్సవ కమిటీ చైర్మన్ బి.నర్సింగరా వు అన్నారు. ప్రజాకవి కాళోజీ శతజయంతి వేడుకల్లో భాగంగా వరంగల్‌లోని పోతన విజ్ఞానపీఠం ఆడిటోరియం లో ఆదివారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. కాళోజీ చరిత్రాత్మక జీవితం గలవాడని ఆయన ‘నా గొడవ’లోని కవితలను ఎన్నిసార్లు చది వినా మళ్లీ మళ్లీ చదవాలనిపిస్తుందన్నా రు. కాళోజీని ప్రపంచానికి పరిచయం చేయడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉందన్నారు. ఇందుకోసం కాళోజీ ఫౌండేషన్‌తో పాటు ఇతర సంస్థ ల సహకారంతో ప్రణాళికలు చేపట్టామ ని చెప్పారు. మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో ప్రతినెలా కాళోజీ పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తూ పుస్తకావిష్కరణ చేస్తున్నారని వివరించారు. విశ్రాంతాచార్యులు కొవెల సుప్రసన్నాచార్య మాట్లాడుతూ కాళోజీ కటువుగా కన్పించినా మనసు మెత్తనిదని, ఎంతో మందిని అక్కున చేర్చుకున్నారని అన్నారు. కాళోజీ జీవితాన్ని, సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నర్సింగరావు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. డాక్టర్ అంపశయ్య నవీన్ మాట్లాడుతూ కాళోజీ కవిత్వంలో సూటిదనం, నిండుదనం, స్పష్టత ఉంటుందన్నారు. కేయూ ప్రొఫెసర్ బన్నా అయిలయ్య మాట్లాడుతూ కాళోజీని పాల్కూరికి సోమనాథుడు, గురజాడ, వేమనతో పోల్చవచ్చన్నారు. నమిలికొండ బాలకిషన్‌రావు మాట్లాడుతూ పోతన విజ్ఞానపీఠంలో కాళోజీ పేరిట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. ఆత్మీయ అతిథులుగా కాళోజీ కుమారుడు రవికుమార్, కోవెల సంతోష్ మాట్లాడారు. అలరించిన బహుభాషా సమ్మేళనం భోజనవిరామం తర్వాత ప్రముఖ కవి వీఆర్ విద్యార్థి అధ్యక్షతన జరిగిన బహుభాషా కవుల కవితాపఠనం అలరించింది. ఈ సందర్భంగా వీఆర్ విద్యార్థి మాట్లాడుతూ కాళోజీ ప్రపంచ కవులకు స్ఫూర్తి దాత అని చాటి చెప్పడానికే బహుభాషా కవిసమ్మేళనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముఖ్య అతిథులుగా రామాచంద్రమౌళి, గన్నమరాజు గిరిజామనోహర్‌బాబు, తాజ్ముష్తర్, అజీజ్ ఉర్సితోపాటు ఉర్దూ కవులు జనాబ్ మసూద్ మీర్జామహషర్, వహీద్ గుల్షన్, హిందీ కవి జగదీశ్ చంద్రసితార్, ఆంగ్ల కవులు ఫహిమ్ జావేద్, మెట్టు రవీందర్, వి.రంగాచార్య, వరిగొండ కాంతారావు, బండారు ఉమామహేశ్వర్రావు, అన్వర్, వి.వీరాచారి, వడ్డెబోయిన శ్రీనివాస్, ఎంఏ.బాసిత్, వల్సపైడి, నల్లెల రాజయ్య, ఎండీ.సిరాజుద్దీన్, శనిగరపు రాజ్‌మోహన్, శ్రవణ్‌కుమార్ రక్తాని, ఆడెపు చంద్రమౌళి, కొవెల శ్రీలత తదితర 40 మంది కవులు తమ కవితలు వినిపించారు. అన్వర్‌తో పాటు వడ్డెబోయిన శ్రీనివాస్ చదివిన కవితలు ప్రత్యేకంగా నిలిచారుు. కార్యక్రమంలో విశ్రాంతాచార్యులు ఎస్.లక్ష్మణమూర్తి, వి.విశ్వనాథరావు, పోట్లపల్లి ధరణిశ్వర్రావు, కె.కృష్ణమూర్తి, పోతన పీఠం మేనేజర్ జేఎన్.శర్మ తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులను హింసిస్తే ఊరుకోం : జోగి
ఎన్టీటీపీఎస్ కాంట్రాక్టు కార్మికుడు మృతి ఆగ్రహంతో కార్మికుల ఆందోళన ఎట్టకేలకు విరమణ ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : కార్మికులను హింసించే చర్యలను మానుకోని పక్షంలో భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వైఎస్సార్ సీపీ మైలవరం నియోజక వర్గ సమన్వయకర్త జోగిరమేష్ ఎన్టీటీపీఎస్ అధికారులను హెచ్చరించారు. స్థానిక ఎన్టీటీపీఎస్లోని 15ఎ/ కన్వేయర్స్ కోల్ విభాగంలోని కన్వేయర్ పుల్లీలో పడి సందిపాము రవికుమార్ (34) అనే కాంట్రాక్టు కార్మికుడు శుక్రవారం మృతి చెందడంతో ఆగ్రహానికి గురయిన కార్మికులు ప్లాంట్ ఆవరణంలోనే ఆందోళనకు దిగారు. కోల్ విభాగంలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న రవికుమార్ మృతికి ఏడీఈ భాస్కరరావే ప్రధాన కారణమంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతి చెందిన కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ ఆందోళనకు దిగిన కార్మికులకు మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్ సీపీ నేత జ్యేష్ట రమేష్‌బాబు, టీడీపీ మండల అధ్యక్షుడు రామినేని రాజశేఖర్, భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రఘునాధరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆవుల సీతారామయ్య, సీపీఐ నాయకుడు తాతయ్య, సీపీఎం నాయకులు తమ్మారాంబాబు, విఠల్‌లతో పాటు వివిధ కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. జోగి రమేష్ మాట్లాడుతూ ప్రమాదవశాత్తు చనిపోయిన కార్మిక కుటుంబాన్ని ఆదుకోవాలని, రూ.20 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని, కార్మికుని భార్యకు పర్మినెంట్ ఉద్యోగం కల్పించి వారి పిల్లలకు ఉచితంగా విద్య అందించాలని డిమాండ్ చేశారు. అధికారులు కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటే సహించబోమని చెప్పారు. భవిష్యత్‌లో కార్మికులకు ఇటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాల నాయకులు శ్రీనివాసరావు, పర్వతనేని సాంబశివరావు, కృష్ణబాబు మాట్లాడుతూ ప్లాంట్‌లో కార్మికులకు ప్రమాదాలు జరగకుండా భద్రతా పరికరాలు అందజేయాలన్నారు. అనంతరం జరిగిన చర్చల్లో ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ జె.సమ్మయ్య మాట్లాడుతూ మృతి చెందిన కాంట్రాక్టు కార్మికుడు రవి కుటుంబానికి రూ. 5 లక్షలు ఇప్పించడానికి చర్యలు తీసుకుంటానని, అతని భార్యకు కాంట్రాక్టు కార్మికురాలిగా ఉద్యోగం కల్పిస్తానని తెలిపారు. తాము డిమాండ్ చేసిన విధంగా నష్ట పరి హారం రూ. 20 లక్షలు ఇచ్చే వరకు శవాన్ని పోస్టుమార్టంకు తరలించేది లేదని కార్మికులు అడ్డుతగిలారు. సీఐ కనకారావు ఆధ్వర్యంలో పోలీసులు, ఎస్పీఎప్ బలగాలు మొహరించి ఉన్నాయి. శోక సంద్రంలో బంధువులు ఉదయం 8గంటలకు ప్రసాద్ నగర్‌నుంచి బయలు దేరి వెల్లిన రవికుమార్ (34) 9.30 గంటలకు ప్రమాదంలో దుర్మరణం చెందాడన్న విషయం తెలియగానే అతని కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. మృతునిది జీ కొండూరు మండలం కుంటముక్కల గ్రామం కాగా ఇబ్రహీంపట్నం ప్రసాద్ నగర్లో అద్దె ఇంటిలో ఉంటున్నారు. మృతునికి భార్య జ్యోతి, కుమార్తె లోరి (6) కుమారుడు నాగార్జున(8) ఉన్నారు. జోగి, జ్యేష్టల పరామర్శ మృతుడి భార్య జ్యోతిని, కుటుంబ సభ్యులను వైఎస్సార్ సీపీ మైలవరం నియోజక వర్గ సమన్వయకర్త జోగిరమేష్, పార్టీనేత, మాజీ ఎమ్మెల్యే జ్యేష్ట రమేష్‌బాబు వేర్వేరుగా కలిసి పరామర్శించారు. మృతుని కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
బరితెగింపు
యలమంచిలి, న్యూస్‌లైన్: శృతి మించి రాగాన పడుతోంది. పండగ సరదా పరాకాష్టకు చేరి పోలీసులపై దాడి వరకూ వెళ్తోంది. కోడి పందాల్లో రేగిన పౌరుషం మూకుమ్మడిగా గొడవ పడే స్థాయికి చేరుతోంది. పెద్ద పండగ వేళ, పందాలకు పగ్గాలు వేయాలన్న పోలీసులతో గ్రామస్తులు ఘర్షణ పడే వాతావరణం తలెత్తుతోంది. పరిస్థితి చేయి దాటకుండా గ్రామాల్లో పోలీసులను మోహరించాల్సి వస్తోంది. కోడిపందాలను అదుపు చేయాలన్న పోలీసుల ప్రయత్నాలకు ప్రతిఘటన ఎదురవుతోంది. కోడిపందాలరాయుళ్లు బరితెగిస్తూ ఉండడంతో వాతావరణం వేడెక్కుతోంది. పందాలు ఆపడానికి గ్రామాలకు వెళ్తున్న పోలీసులపై అక్కడివారు తిరగబడుతున్నారు. ఎదురుదాడులకు పాల్పడి పోలీసులనే హడలెత్తిస్తున్నారు. గురువారం యలమంచిలి మున్సిపాలిటీ పరిధి ఎర్రవరంలో ఇదే జరిగింది. ఎర్రవరాన్ని ఆనుకుని కొండకాలువ వద్ద కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో యలమంచిలి టౌన్ ఎస్ఐ చంద్రమౌళి, ట్రైనీ ఎస్ఐలు రామకృష్ణ, రవికుమార్, మరో నలుగురు హోంగార్డులు మఫ్టీలో వెళ్లారు. పోలీసులు నిక్కర్లు, లుంగీలు, తలపాగాలతో ఉండడంతో పందెంరాయుళ్లు కొద్దిసేపు వారిని గుర్తించలేదు. వెంటనే పోలీసులు దాడి చేశారు. దాంతో పందెంరాయుళ్లు చెల్లాచెదురయ్యారు. కొందరు గ్రామంలోకి పరుగులు తీశారు. పోలీసులు సంఘటన స్థలం వద్ద ఏడు కోళ్లను, నగదుతోపాటు నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీసులు గ్రామంలోకి వెళ్లి వీడియో క్లిప్పింగ్ ఆధారంగా నడిగట్ల చిన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు.అడ్డగించిన అతని భార్యను పోలీసులు నెట్టేయడంతో గ్రామస్తులు మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగారు. దుర్భాషలాడారు. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామస్తుల దాడిలో పోలీసులకు స్వల్పగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న యలమంచిలి సీఐ మల్లేశ్వరరావు సమైక్యాంధ్ర విధుల్లో ఉన్న సాయుథ బలగాలను ఎర్రవరానికి పంపారు. పోలీసులు పెద్ద ఎత్తున రావడంతో గ్రామస్తులు చెల్లాచెదురయ్యారు. ఈ సంఘటనను టౌన్ ఎస్ఐ సెల్ఫోన్లో వీడియో తీశారు. ఆ చిత్రాల ఆధారంగా దాడిచేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామానికి చెందిన పొన్నాడ రమణ, సోరంగి చిన్నలను యలమంచిలి టౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్ వద్ద జనం జరిగిన సంఘటనపై నర్సీపట్నం ఏఎస్పీ విశాల్ గున్ని టౌన్ పోలీస్‌స్టేషన్‌లో సాయంత్రం విచారణ జరిపారు. ఈ సంఘటనకు సంబంధించి ముత్తు గోవిందు, నడిగట్ల దుర్గతోపాటు మరో 18 మందిని వీడియో క్లిప్పింగ్‌ల ఆధారంగా గుర్తించినట్టు సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. రమణ, చిన్నలను అరెస్టు చేశామని మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. గ్రామస్తుల దాడి సంఘటనపై ఎస్ఐలు రాతపూర్వకంగా యలమంచిలి సీఐకి ఫిర్యాదుచేశారు. దీంతో ఎర్రవరం గ్రామస్తులు పెద్ద ఎత్తున యలమంచిలి టౌన్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. బుధ వారం రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలెంలోనూ ఇలాగే జరిగింది. అక్కడ పోలీసులపై దాడిచేసిన 14 మందిపై కేసులు నమోదు చేశారు. కోడిపందాలు, పేకాటలు నియంత్రించడానికి నర్సీపట్నం ఏఎస్పీ విశాల్ గున్ని ముందస్తు వ్యూహంతో మూడురోజులుగా ప్రత్యేక బృందాలతో దాడులు నిర్వహించడం సత్ఫలితాలనిస్తోంది. యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లోనే మూడురోజుల్లో 239 మంది పందెంరాయుళ్లను అరెస్టు చేసి రూ.3 లక్షలవరకు నగదును స్వాధీనం చేసుకున్నారు. -
గుప్తనిధుల ముఠా అరెస్ట్
డోన్‌టౌన్, న్యూస్‌లైన్: గుప్తనిధుల ముఠాను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హజరుపరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు. డోన్ మండలం వి. బొంతిరాళ్ల గ్రామంలో పోతురాజుగుట్ట వద్ద గత డిసెంబర్ 26వ తేదీన గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతుండగా ప్రమాదవశాత్తు అన్నాచెల్లెళ్లు నాగరాజు, రమాదేవి మృతి చెందిన విషయం విదితమే. ఈ ఘటనకు సంబంధించి మృతులతోపాటు జేసీబీ డ్రైవర్ రవికుమార్, డోన్‌కు చెందిన ఆంజనేయులుగౌడ్, కొలిమిగుండ్లకు చెందిన దూదేకుల వుసేన్, హైదరాబాద్‌కు చెందిన సుభాష్‌రెడ్డి, నాగేష్‌రెడ్డి, రాధాకిషన్, ఆపరేటర్ స్నేహితుడు సుంకన్నలతో పాటు ప్రధాన సూత్రధారులైన కోయిలకొండరాజు, విజయుడు, లక్ష్మిరెడ్డిలపై కేసు నమోదైంది. వీరిలో ప్రధాన సూత్రధారులు మినహా మిగిలిన ఏడుగురిని పట్టణ సమీపంలోని తిరుమల డాబా వద్ద తచ్చాడుతుండగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఐ డేగలప్రభాకర్ మాట్లాడుతూ.. కోయిలకొండ రాజు, ఈడిగె ఆంజనేయులు, లక్ష్మిరెడ్డిలు గుప్త నిధులకోసం వేటాడేవారన్నారు. ఈ క్రమంలో వారికి హైదరాబాద్‌కు చెందిన రాధాకిషన్, సుభాష్‌రెడ్డి తదితరులతో పరిచయం ఏర్పడిందని చెప్పారు. కాగా నిధుల తవ్వకాల్లో ప్రధాన నిందితుడైన కోయిలకొండ రాజుకు ప్రముఖుల అండ ఉన్నట్లు సమాచారం. ఈ ముఠా సభ్యులు హైదరాబాద్‌లోని శాతారాం, యాకత్‌పుర, మహబూబ్‌నగర్‌తో పాటు మరి కొన్ని ప్రాంతాలలో గుప్త నిధులు కోసం తవ్వకాలు జరిపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఏయే ప్రాంతంలో తవ్వకాలు జరిపారో పూర్తి స్థాయిలో విచారణ జరిగితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
తవ్వారు పల్లె టు ఫిలిం నగర్
పల్లెటూరులో పుట్టాడు.. సినిమా డెరైక్టర్ కావాలని కలలుగన్నాడు.. స్కూల్ ఎగ్గొట్టి హైదరాబాదుకు వెళ్లాడు. కాళ్లరిగేలా స్టూడియోల చుట్టూ తిరిగాడు. ఫలితం లేదు. అయినా అలసిపోలేదు. పట్టు వదలని విక్రమార్కుడిలా మళ్లీ ప్రయత్నించాడు. ఈ సారి డెరైక్ట్‌గా కథే రాసుకుని పోయాడు. చివరికి దర్శకుడిగా మారి కల సాకారం చేసుకున్నాడు. కృషి ఉంటే సాధించలేనిదేదీ లేదని యువతకు స్ఫూర్తినిస్తున్నాడు. ఆయనే ‘ప్రేమ ప్రయాణం’ సినిమా దర్శకులు, ఖాజీపేట మండలం తవ్వారుపల్లెకు చెందిన ఎస్.ఎస్. రవికుమార్. ఆదివారం తన స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా ‘న్యూస్‌లైన్’ పలకరించింది. తన సినిమా ప్రయాణ విశేషాలు ఆయన మాటల్లోనే..- న్యూస్‌లైన్, మైదుకూరు(చాపాడు) పదో తరగతి నుంచే.. మైదుకూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నప్పటి నుంచే సినిమాలపై ఆసక్తి పెరిగింది. నేను కూడా సినిమాలకు కథలు రాయగలను.. సినిమాలు తీయగలనని అప్పుడే అనుకున్నా. దీంతో ఎన్నోసార్లు తరగతులు ఎగ్గొటి హైదరాబాదుకు వెళ్లాను. స్టూడియోల చుట్టూ తిరగటం.. ఉండేందుకు డబ్బుల్లేక తిరిగి ఇంటికి రావటం జరిగేది. దీంతో ‘ముందు బాగా చదువుకో తర్వాత సినిమాలు చేద్దువుగానీ’ అంటూ నాన్న మందలించారు. ఎలాగోలాగా ఇంటర్ వరకు చదివా. ఆ తర్వాత ఇంట్లో చెప్పకుండానే హైదారాబాదుకు వెళ్లాను. రాజశేఖర్, జీవితల ప్రేరణతో.. ముందుగా ఒక కథ రాసుకుని రాజశేఖర్, జీవితలకు విన్పించా. అనంతరం వారి సూచనలు, సలహాల మేరకు హైదరాబాదులోని ఫిల్మ్ ఇన్స్ట్యూట్లో చేరి శిక్షణ పొందాను. ఆ తర్వాత మామూలే. సినిమా అవకాశాల కోసం వేట మొదలెట్టా. ఎనిమిదేళ్లు అసిస్టెంట్ డెరైక్టరుగా... 2004లో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన అనంతరం కొంతకాలానికి రోశిరాజు అనే దర్శకుడు వద్ద అసిస్టెంటుగా అవకాశం సంపాదించాను. అక్కడి నుంచి సభాపతి, నరేంద్ర, దేవిప్రసాద్, సముద్రలతో పాటు ఇంకా పలువరి దగ్గర 2012 వరకు పని చేశాను. హ్యపీ జర్నీ, బ్లేడ్‌బాబ్జీ, ఏకవీర, ఇంకా పలు చిత్రాలకు అసిస్టెంటు డెరైక్టరుగా పని చేశా. ప్రముఖ ఆర్టిస్టులతో.. ఇటీవలే ముఖ్య క్యారెక్టర్ ఆర్టిస్టులు గా ఉన్న పోసాని కృష్ణమురళి, నాగీనీడులతో పాటు హీరోగా మనోజ్ నందం, హీరోయిన్గా నీతూ అగర్వాల్, ఆర్టీస్టులుగా బస్టాఫ్ కోటేశ్వరావు, చిత్రం శ్రీను, ఉత్తేజ్, పొట్టిరాంబాబు, యాం కర్ ఫన్నీ, భానుశ్రీ, రమ్య చౌదరి ఇలా పలువురితో ప్రేమ ప్రయాణం చిత్రాన్ని తీశాను. మరికొన్ని కథలు రాస్తున్నాను. వరుణ్ సందేశ్‌తో సినిమా.. యూత్ ఫాలోయింగ్ హీరో అయిన వరుణ్ సందేశ్‌తో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నట్లు రవికుమార్ తెలిపారు. దీంతో పాటు రెండు ప్రముఖ నిర్మాణ సంస్థల్లో యువహీరోలతో సినిమాలు చేయబోతున్నట్లు తెలిపారు. -
‘కృష్ణా’ ఘటనపై విచారణ
కాజీపేటరూరల్/సంగెం/మట్టెవాడ,న్యూస్‌లైన్ : చింతలపల్లి రైల్వే స్టేషన్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ ను యూటీవీ టీటీ మిషన్(యుటిలిటీ ట్రాక్ వెహికిల్ ట్రాక్ ట్యాంపరింగ్ మిషన్) ఢీకొన్న సంఘటనపై సికింద్రాబాద్ రైల్వే ఉన్నతాధికారులు బుధవారం సాయంత్రం ప్రాథమిక విచారణ చేపట్టారు. రైల్వే మేనేజర్ పర్యవేక్షణలో విచారణ జరుగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదంలో దెబ్బతిన్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌ను లోకో ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో కాజీపేట జంక్షన్‌కు తీసుకొచ్చారు. అనంతరం స్టేషన్ మేనేజర్ ఓదెలు, చీఫ్ క్రూ కంట్రోలర్ సీవీ.రమణ, సీడబ్ల్యూఎస్ సాంబశివరావు, ఆర్పీఎఫ్ సీఐ నర్సింహ సమక్షంలో మెకానిక్ సిబ్బంది ఇంజిన్‌ను తొలగించారు. దెబ్బతిన్న ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ లోకోషెడ్‌కు మరమ్మతు కోసం పంపించారు. దీంతో కాజీపేటలో 20 నిమిషాలపాటు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశా రు. అనంతరం మరో ఇంజిన్‌ను అమర్చి రైలు ను ఆదిలాబాద్‌కు పంపించారు. మ్యానువల్ బ్రేక్ సిస్టం వల్లే ప్రమాదం మ్యానువల్ బ్రేక్ సిస్టం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ మెయిన్ డౌన్ లైన్లో సిగ్నల్ కోసం చింతలపల్లి రైల్వేస్టేషన్లో ఆగింది. అదే సమయంలో అప్ లైన్లో రైలు పట్టాలను తీసుకెళ్తు న్న యూటీవీ టీటీ మిషన్ రైలు సిగ్నల్ పాయిం ట్ వద్దకు వచ్చి షెడ్ సిగ్నల్ కోసం వేచి ఉంది. అయితే సిగ్నల్ ఇచ్చే క్రమంలో టీటీ మిషన్ బ్రేకులు కంట్రోల్ కాక ఫెయిల్యూర్ అయి సిగ్న ల్ దాటి కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌ను ఢీకొట్టింద ని రైల్వే ఇంజినీరింగ్ అధికారులు చెప్పారు. టీటీ మిషన్‌కు ఎయిర్ బ్రేక్ సిస్టం ఉంటే సిగ్నల్ దాటి ముందుకు పోయేది కాదని, కేవలం మ్యానువల్ బ్రేక్ ఉండటం వల్లే ఇలా జరిగింద ని వారు తెలిపారు. ఈ ఘటనలో టీటీ మిష న్ ఆపరేటర్ ఎస్కే.ఖాద్రి, చంద్రయ్య, సారయ్యతోపాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాల య్యా యి. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వరంగల్ జీఆర్పీ సీఐ రవికుమార్ జరిగిన సంఘటనపై రైలు డ్రైవర్ ఏకే.స్వరూప్‌తోపాటు ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. చింతలపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లి అక్కడ వివరాలు సేకరించారు. చిన్న ప్రమాదం కాబట్టి బతికిపోయాం.. : ప్రయాణికులు రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంగా సిగ్నల్ ఇచ్చి ట్రాక్ చేంజ్ చేయకపోవడం వల్లనే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను స్క్రాప్ ఇంజిన్ ఢీకొట్టిందని, ఇది చిన్న ప్రమా దం కాబట్టి బతికిపోయూమని పలువురు ప్ర యాణికులు భయంతో వణికిపోతూ వివరిం చారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండక పోవడం తోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయ ని, ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యతీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలును ఎలాంటి సౌకర్యాలు లేని చింతలపల్లిలో సుమారు 50 నిమిషాల పాటు నిలిపివేయడంతో ప్రయూణికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రమాదం జరగడంతో బెంబేలెత్తి న పలువురు రైలు దిగి బస్సులు, ఆటోల ద్వారా వరంగల్ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి పోయారు. మిగిలిన వారు మంచినీరు, ఆహా రం దొరకక తల్లడిల్లిపోయారు. సంఘటన గురించి బంధువులకు సెల్పోన్ల ద్వారా క్షేమసమాచారం అందించారు. ఒక్కసారిగా కిందపడిపోయా.. నెక్కొండ నుంచి వరంగల్‌కు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తున్నాను. చింతలపల్లి వద్ద రైలు ఆగింది. హఠాత్తుగా కొద్ది శబ్ధంతో రైలును టీటీ మిషన్ తాకడంతో కిందపడి పోయాను. నా నుదురుకు దెబ్బతాకింది. ఇంకా బెర్తులపై పడుకున్నవారు, నిలబడ్డవారు కిందపడిపోయారు. పెద్దగా ఎవరికీ దెబ్బలు తాకలేదు. -సోంద్మియా, నెక్కొండ, ప్రయాణికుడు -
విద్యుత్ అక్రమ వినియోగంపై విజి‘లెన్స్’!
పలాస, న్యూస్‌లైన్: విద్యుత్ అక్రమ వినియోగంపై విజిలెన్స్ అధికారులు కొరడా ఝులిపించారు. మంగళవారం ఆకస్మిక దాడులు చేసి, హడలెత్తించారు. పలాస- కాశీబుగ్గ పట్టణాలతో పాటు..పలాస మండలం బ్రా హ్మణతర్లాలో అధికారులు దాడులు జరిపి, విద్యుత్ మీ టర్లను పరిశీలించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న 26 మందిపై కేసులు నమోదు చేశారు. వారికి నోటీసులు ఇచ్చి..అదనపు విద్యుత్‌ను వాడినందుకు అ దనపు చార్జీలతో పాటు అపరాధ రుసుం వసూలు చేస్తామని టెక్కలి డీఈ రవికుమార్ చెప్పారు. ఆయన పర్యవేక్షణలో టెక్కలి డివిజన్లోని మొత్తం 16మంది ఏఈ లతో పాటు టెక్కలి ఏడీఈ రామకృష్ణ, సోంపేట ఏడీ ఈ పాత్రుడు, నరసన్నపేట ఏడీఈ ఈశ్వరరావు, పలాస ఏఈ మధు దా డుల్లో పాల్గొన్నారు. ఉదయం 10.30గంటల నుంచి సాయంత్రం 4.30 వరకు ఈ త నిఖీలు చేపట్టారు. కేటగిరీ -2 మీటర్లు పరిశీలించారు. పలాస కాశీబుగ్గ పట్టణంలో ఎక్కువగా పరిశ్రమలు ఉన్నందున..వాటికి మీటర్లు అమర్చకుండా..మీటర్లు ఉన్నా..సక్రమంగా వినియోగించకుండా..విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నారని డీఈ చెప్పారు. చౌర్యానికి పాల్పడినా..మీటర్లను సక్రమం గా వినియోగించకున్నా..చర్యలు తప్పవని హెచ్చరించారు. -
మరిన్ని బేస్ క్యాంపులు
=ఎర్రచందనం చెట్లను నరకక ముందే అడ్డుకుంటాం =త్వరలో రెండంచెలుగా ఎర్రచందనం వేలం =‘సాక్షి’తో అటవీశాఖ కన్సర్వేటర్ రవికుమార్ సాక్షి, తిరుపతి: వేలాది ఎకరాల్లో విస్తరించి ఉన్న శేషాచల అడవుల్లోంచి ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు మరి న్ని బేస్‌క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ రవికుమార్ తెలిపారు. దీని ద్వారా అడవిలో చెట్లను నరకక ముందే ఎర్రచందనం కూలీలను పట్టుకోవచ్చన్నారు. ఆయన శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన వారికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించేలా, జరిమానాను లక్ష నుంచి పది లక్షల రూపాయల వరకు విధించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. ఎర్ర కూలీలకు డబ్బు ఆశ చూపించి తీసుకుని వస్తున్నారన్నారు. రోజుకు వెయ్యి రూపాయలు కూలీ ఇస్తున్నారని, ఒక వేళ పట్టుబడినా, వదిలి పెట్టేస్తున్నారనే ఉద్దేశంతో ఎక్కువ మంది కూలీలు వస్తున్నారన్నారు. కఠిన శిక్షలు అమలు చే స్తే ఎర్రకూలీలు వచ్చేందుకు జంకుతారన్నారు. నిల్వ ఉన్న ఎర్రచందనం త్వరలో వేలం వివిధ సందర్భాల్లో పట్టుబడిన ఎర్రచందనం దుంగలను త్వరలోనే వేలం వేస్తామన్నారు. తమవద్ద ఐదువేల టన్నుల ఎర్రచందనం నిల్వ ఉందని, దీనిని రెండు దఫాలుగా వేలం వేస్తామని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనం ఏడాదికి రెండు వేల టన్నుల అవసరం ఉందన్నారు. తమ వద్ద ఉన్న ఐదువేల టన్నులను వేలం వేయడం ద్వారా అక్రమ రవాణా తగ్గే అవకాశం ఉందన్నారు. నెలకు సరాసరి 70 నుంచి వంద టన్నుల ఎర్రచందనం పట్టుబడుతోందని చెప్పారు. ప్రతి రోజూ దాదాపు 80 మంది టాస్క్ఫోర్సు సిబ్బంది కూంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారని తెలిపారు. 40 బేస్ క్యాంపులను ఏర్పాటు చేశామని వీటిల్లో 200 మందికి పైగా ఉన్నారన్నారు. దీంతో ఎర్ర కూలీలు అడవి లోపలికి వెళ్లలేకున్నారని తెలిపారు. అప్పుడప్పుడు వారు అసహనంతో సిబ్బందిపై దాడికి దిగుతున్నారని అటువంటి సమయంలో వారిని ఎదుర్కొనేందుకు పోలీసుల సాయం తీసుకుంటున్నామన్నారు. తిరుపతి అర్బన్, చిత్తూరు ఎస్పీల సహకారంతో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అడ్డుకోగలుగుతున్నామని చెప్పారు. ఎర్ర చందనం స్మగ్లర్లను అడ్డుకునేందుకు ఏడాదికి రూ.3.5 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నామన్నారు. ఎర్రచందనం వేలం ప్రారంభమయితే, అక్రమ రవాణా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
వివరం: కాళోజీ గొడవ
కాళోజీ అనే పదానికి సమానార్థకంగా నిలబడగలిగే మాట ఏమిటి? ప్రశ్న. తిరుగుబాటు. నిలదీత. గేయకవిత. దుఃఖం. ధిక్కారం. ఆత్మీయత. చట్టబద్ధత. నిజాయితీ. స్వీయపరిశీలన. వీటితోపాటు ‘తెలంగాణ ఆత్మ’ను అందులో చేర్చవచ్చేమో! జీవితమంతా పోరాటాల్లో మమేకమైన కాళోజీ నారాయణరావు... కాళన్నగా పరిణామం చెందడం ఒక చరిత్ర! ఉద్యమాలు జరుగుతున్నప్పుడు వాటిని ముందుండి నడిపించినా, తోడై వెంట నడిచినా, కవితై ప్రభవించినా... అప్పటికి మించినదేదో కూడా మాట్లాడగలిగినప్పుడే ఎవరికైనా ప్రాసంగికత! ప్రాంతాలకు అతీతంగా వారిని జనం కళ్ల కద్దుకుంటారు. కాళోజీ వ్యక్తిత్వం చాటేదిదే! 1914 సెప్టెంబర్ 9న జన్మించిన కాళోజీ శతజయంతి సంవత్సరమిది. ఆ ప్రజాకవి యాదిలో ఈ ప్రత్యేక కథనం... జరిగినదంతా చూస్తూ ఎరగనట్లు పడివుండగ సాక్షీభూతుణ్నిగాను సాక్షాత్తు మానవుణ్ని కాళోజీతో ఏ కొంత పరిచయమున్నవాళ్లయినా, ఆయన గురించిన అనెక్డోట్స్ ఇట్టే చెప్పేస్తూ ఉంటారు: ఒకసారి వరంగల్‌లో ఏదో సాహిత్య సమావేశం ప్రారంభం కావాల్సి ఉంది. సభికులు వచ్చారు. అతిథులు వచ్చారు. సమయం కూడా దగ్గరపడింది. అయినా అందరూ నిలబడే ఉన్నారు. కారణం? టెంట్‌హౌజ్ నుంచి వచ్చిన కుర్చీల బొత్తి మనిషెత్తు అలాగే ఉంది. వేసే మనిషి ఏమయ్యాడో తెలీదు. ఓహో, అయితే ఆ పనాయన వచ్చి, వేస్తేగానీ, ఈ కుర్చీలు వేసుకోమూ, కూర్చోమా; కాళోజీ చకచకా కుర్చీలు తీసి వేయడం మొదలుపెట్టారు. మిగిలినవాళ్లు ఆయన్ని అనుసరించారు. ‘మనిషంటే శ్రమ చేసేవాడే; అదే అసలైన నిర్వచనం’ అన్నాడు కాళోజీ మరో సందర్భంలో. ‘అన్యాయాన్నెదిరించినవాడు నాకు ఆరాధ్యుడు’ తండ్రి నుంచి మహారాష్ట్ర సత్వాన్ని, తల్లి నుంచి కర్ణాటక వారసత్వాన్ని పొంది, తెలుగు తత్వంతో పెరిగినవాడు కాళోజీ. ఆయన పూర్వీకులు ఎప్పుడో వరంగల్‌లో స్థిరపడ్డారు. జిల్లాలోని మడికొండ గ్రామం భవిష్యత్తులో కాళన్నగా మారబోయే కాళోజీని ప్రపంచానికి పరిచయం చేసింది. తండ్రి రంగారావు సహవ్యవస్థాపకుడైన ఊరి గ్రంథాలయం కాళోజీకి ప్రపంచాన్ని పరిచయం చేసింది. స్పందన కాళోజీ జీవగుణం. అది దుఃఖంలోంచి రావొచ్చు, అన్యాయం వల్ల కావొచ్చు. నూనుగు మీసాలు రాని పదహారేళ్ల ప్రాయపు కౌమారంలో ఆయన భగత్‌సింగ్ ఉరితీత(1931)కు బాధపడుతూ తన తొలి కవిత రాశాడు. వరంగల్ కాలేజియేట్ హైస్కూల్ విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శిగా, యాజమాన్యం గణపతి ఉత్సవాలకు సెలవు నిరాకరిస్తే, 1400 మంది విద్యార్థుల్లో 1200 మంది విశ్వాసానికి అది వ్యతిరేకమైనదని భావించి, సుమారు 1100 మంది విద్యార్థుల చేత వ్యక్తిగత సెలవుచీటీలు ఇప్పించి మాస్ ప్రొటెస్ట్ చేయించాడు. మాటలేక నేను లేను కాళోజీ మనసంత గట్టిది కాదు శరీరం. ఇంటర్ చదువుతున్నప్పుడు క్షయ సోకింది. క్షయ ప్రాణాంతకమైన కాలం అది. వరంగల్‌లో పెదవి విరిచారు. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తెస్తే, శస్త్రచికిత్స చేసి ఒక ఊపిరితిత్తిని తొలగించారు. ఆపరేషన్ తర్వాత విశ్రాంతి తీసుకొమ్మన్నారు వైద్యులు. ఆ సమయంలో కాళోజీ ఎవరితోనో మాట్లాడుతుంటే, ‘ఇలా ఎక్కువసేపు మాట్లాడితే ఆరు మాసాల్లో చనిపోతా’వన్నాడట డాక్టర్. ‘మాట్లాడకుంటే ఆరు రోజుల్లోనే చనిపోతా’నన్నాడట కాళోజీ. ఆ మాట అనేదాన్ని పోరాట ప్రతీకగా తీసుకుంటే, కాళోజీ మౌనంగా ఎన్నడూ లేడు; చివరిదాకా మాట్లాడుతూనే ఉన్నాడు. జీవితకాలమంతా మిగిలిన ఆ ఒక్క ఊపిరితిత్తితోనే బతికిన కాళోజీ, దాంతోనే ధైర్యాన్ని ఉచ్ఛ్వసించాడు; కవిత్వాన్ని నిశ్వసించాడు: అవనిపై జరిగేటి అవకతవకల చూసి ఎందుకో నా హృదిని ఇన్ని ఆవేదనలు పరుల కష్టము జూచి కరిగిపోవును గుండె మాయమోసము జూచి మండిపోవును ఒళ్లు ఇలా ప్రకటించుకున్నవాడు కాబట్టే, ఆంధ్రమహాసభ ఉద్యమంలో చేరాడు. ఆర్యసమాజ్‌లో పనిచేశాడు. భారత స్వాతంత్య్రానికి మునుపు, 1946లో వరంగల్ కోట మీద జాతీయ జెండా ఎగరేసిన కాంగ్రెస్ వాళ్లలో కాళోజీ ఉన్నాడు. కత్తులతో, కఠార్లతో రజాకార్లు స్వైరవిహారం చేస్తున్న సందర్భం అదని చెబితే ఈ సంఘటన తీవ్రత తెలుస్తుంది. స్వాతంత్య్రానంతరం హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో కలిపే పోరాటంలోనూ కాళోజీ పాల్గొన్నాడు. తెలంగాణ ఉద్యమానికి, మానవ హక్కుల ఉద్యమానికి, పౌర హక్కుల ఉద్యమానికి మద్దతుగా నిలిచాడు. ఏ పోరాటాలైతే ఆయన్ని ప్రజాకవిని చేశాయో, ఆ పోరాలన్నింటిలోనూ ఆయన ప్రజలకు బాధ్యుడిగా ఉన్నాడు. రచయితవల్ల ఏమవుతుంది? సాహిత్య సమాజంలో విశిష్టస్థానం ఉన్నవాడు, అందునా వేమన మళ్లీ పుట్టాడనిపించుకున్నంత పాటివాడు అతిశయపు బారిన పడటం సహజం. కానీ కాళోజీకి సాహిత్య పరిమితుల పట్ల చాలా స్పష్టత ఉండేది. ‘సమాజంలో విలువలను మార్చగలనన్న విశ్వాసం, మారుస్తానన్న ధీమా, మార్చవలెనన్న ఆతురత రచయితకు ఉంటుంది. అదంతా వట్టి భ్రమే,’ అన్నాడు. ఎందుకంటే, విలువలు మారడానికి కారణాలు వేరే ఉంటాయి. ‘(పాఠకుడి) వ్యక్తిగత టెంపరిమెంటు వల్ల, టెంపరిమెంటు వ్యక్తికి ఒక రకమైన సంస్కారాన్ని, అభిరుచులనూ, అలవాట్లనూ కలగజేస్తుంది. ఆ సంస్కారాన్నీ అభిరుచులనూ బట్టీ ఆ వ్యక్తి తన రచయితలనూ, సాహిత్యాన్నీ ఎంచుకుంటాడు. రచన పట్ల పాఠకునికి ఏర్పడే అభిమానం రచన యొక్క విశేషం కాదు,’ అన్నాడు. అయితే, సాహిత్యానికి ప్రయోజనం ఏమిటి? ‘రాజకీయ విప్లవాల ద్వారా స్వాతంత్య్రాన్ని సాధించవచ్చు. విప్లవానంతరం ఏర్పడిన ప్రభుత్వాలు తమ కృషి ద్వారా సమానత్వాన్నీ స్థాపించవచ్చు. కానీ సౌభ్రాతృత్వం లేనిదే ఈ రెండింటివల్ల కలిగే ఫలితం సర్వేజనులకు చెందదు. ఈ సౌభ్రాతృత్వానికి కృషి చేయవలసింది రాజకీయనాయకులూ, విప్లవ కోవిదులూ కాదు; రచయితలు. నాయకులు విఫలమైనచోట రచయిత విజయం సాధించగలిగేది ఇక్కడే,’ అన్నాడు. సాహిత్యం సర్వస్వం కాదని చెబుతూనే, సముచిత పీఠాన దాన్ని కూర్చోబెట్టాడు. తలవంచిన శిఖరం సాహిత్యమే కాదు, జీవితపు పరిమితులను కూడా ఎరిగినవాడు కాళోజీ. ఆయనకు జీవితం, సాహిత్యం వేర్వేరుకాదు; అయినప్పటికీ తనలో ఉన్న ఆ లేశమాత్రపు దారితప్పడాన్ని కూడా వెల్లడించకుండా ఊరుకోలేదు. గాంధీజీలాగా, చలంలాగా తన పొరపాట్లను తాను ప్రశ్నించుకున్నాడు. మానవ బలహీనతల గురించిన అత్యంత స్పృహ ఉన్నవాళ్లకు తప్ప ఇది సాధ్యం కాదు. కాళోజీ ఉద్యమ జీవితంలో ఎన్నోసార్లు జైలుపాలయ్యాడు. ఒకసారి తప్పనిసరై నేరస్థజాతికి చెందిన మనిషితో లాకప్‌ను పంచుకోవాల్సి వచ్చింది. రాజకీయఖైదీ తను. ‘వాడు’ నేరగాడు. ఇక సమానత ఎక్కడ? అలాంటిది అతడు గాంధీజీ పేరెత్తగానే విచిత్రపడిపోయి కౌగిలించుకున్నాడట. ‘నైజాం సంస్థానం మారుమూల గ్రామాల్లో అంత అట్టడుగు జీవితాల్లో కూడా గాంధీ పేరు చొచ్చుకుపోయింది. మేము మాత్రం మా అజ్ఞానంతో, అహంకారంతో గ్రామీణులను దూరం చేసుకున్నం. గ్రామీణులతో కల్సిమెల్సి ఉండాలనే గాంధీ బోధనలు మామీద ఏ ప్రభావం వెయ్యలేదన్న విషయం ఆ రోజున నాకు సాక్షాత్కారం జరిగిందన్నమాట. నా జీవితంల మరపురాని ఘట్టం. ఆ విషయం చెప్తుంటె ఇప్పుడు కూడా కన్నీరాగడం లేదు,’ అని ఆ అనుభవాన్ని పంచుకున్నాడు. అది తన గర్వభంగపు ఘటనగా చాటుకున్నాడు. చట్టబద్ధమైన పౌరుడు కాళోజీకి దేశమంతా పరిచయస్థులే, మిత్రులే! రావి నారాయణరెడ్డి, దేవులపల్లి రామానుజరావు, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, పొట్లపల్లి రామారావు, టి.హయగ్రీవాచారి, గాడిచర్ల హరిసర్వోత్తమరావు, గార్లపాటి రాఘవరెడ్డి, విశ్వనాథ సత్యనారాయణ, జాషువా, దాశరథి, సినారె, బిరుదురాజు రామరాజు, కన్నాభిరాన్, ఎస్ ఆర్ శంకరన్, సంజీవదేవ్, చలసాని ప్రసాద్, మో, శ్రీశ్రీ, కృష్ణాబాయి, కాళీపట్నం రామారావు, మహాశ్వేతాదేవి, జ్వాలాముఖి, ఆరుద్ర, నగ్నముని, జయశంకర్, నాగిళ్ల రామశాస్త్రి, గద్దర్, వరవరరావు, ఎన్.వేణుగోపాల్; వయసులు, సిద్ధాంతాలు, ప్రాంతాలు, హోదాలతో సంబంధం లేకుండా అందరూ ఆయనతో స్నేహం చేశారు. అటుగా వచ్చిన ప్రతివాళ్లూ కాళోజీని పలకరించకుండా, ఎటుగా వెళ్లినా వాళ్లను కాళోజీ పలకరించకుండా వచ్చేవాడు కాదు. కొండపల్లి సీతారామయ్య కూతురి వివాహం తన చేతుల మీదుగా జరిపించాడు. మిత్రుల జాబితాలో సాక్షాత్తూ పీవీ నరసింహారావులాంటి వ్యక్తి కూడా ఉన్నారు. పీవీ ప్రధాని కాబట్టి ఈ అదనపు విలువ ఇవ్వడం కాదు; ప్రధాని తన స్నేహితుడిగా ఉన్నా తన నిబద్ధత తను ఎరిగినవాడు కాళోజీ అని చెప్పడానికి. మద్య నిషేధం అమల్లో ఉన్నప్పుడు, ఒకాయన ఇంటికివెళ్తే కాళోజీకి మద్యం ఆఫర్ చేశాడట. ‘ప్రభాకర్! బయట మద్యనిషేధ చట్టం ఉన్నది గనక తాగవద్దు. ఐనా తాగుదామంటవు ఖైరతాబాద్ చౌరస్తాకు బోయి, విశ్వేశ్వరయ్య విగ్రహం దగ్గర నడీ చౌరస్తాల నిలబడి ఈ చట్టాన్ని మేము ఒప్పుకోవడం లేదు, కాబట్టి దీన్ని ఉల్లంఘిస్తున్నం అని తాగుదాం,’ అన్నాడు. అదీ ఆయన తత్వం. చాటుమాటుగా కాదు, ఏదైనా బాజాప్తాగా చేయాలనేవాడు. చేతికింద నలుగురు కుర్రాళ్లు ఉండగలిగే ‘పెద్దరికం’ వచ్చాక కూడా, కరెంటు బిల్లు కట్టడానికి వరుసలో నిలబడ్డవాడు కాళోజీ. పలుకుబడుల భాష కావాలి! శిష్ట వ్యవహారికం కాదు, వ్యవహార శిష్టత కావాలనేవాడు కాళోజీ. ‘నీ భాషల్నే నీ బతుకున్నది; నీ యాసల్నే నీ సంస్కృతున్నది... ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్లరాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నేనెన్నోసార్లు చెప్పిన. భాష రెండు తీర్లు- ఒకటి బడిపలుకుల భాష, రెండోది పలుకుబడుల భాష. పలుకుబడుల భాష గావాలె,’ అనేవాడు కాళోజీ. తెలంగాణ వరకే కాదు, తన భాషా సోయిని కళింగాంధ్ర, రాయలసీమకు కూడా వ్యాపింపజేసిన ‘వ్యవహార’దక్షుడు. రామలక్ష్మణులు కాళోజీ అన్న కాళోజీ రామేశ్వరరావు ‘షాద్’ పేరుతో ఉర్దూ కవిత్వం రాశాడు. తమ్ముడి హైపర్‌యాక్టివ్‌తనం వల్ల ఆయన ప్రభ వెనకబడిపోయినా వాళ్లిద్దరూ అన్యోన్యంగా బతికారు. న్యాయ శాస్త్రం చదివుండీ కాళోజీ ఏనాడూ రూపాయి సంపాదించకపోయినా ఆయనే ఇల్లు గడుపుతూ వచ్చాడు. ఒకవిధంగా తండ్రి తర్వాత తండ్రిలా సాక్కుంటూ వచ్చాడు. 1996లో రామేశ్వరరావు చనిపోయినప్పుడు, ‘నేను నా ఆరవయేట మా అన్న భుజాల మీదికెక్కినాను. ఆయన మరణించేదాకా దిగలేదు. నేను ఆయన భుజాల మీదికి ఎక్కడం గొప్ప కాదు. 70 ఏళ్ల వరకూ ఆయన నన్ను దించకుండా ఉండడం గొప్ప,’ అన్నాడు. అపురూప అతిథి ‘ఇచ్ఛయే నా ఈశ్వరుడని కచ్చితముగ నమ్ముతాను. ఇచ్ఛ వచ్చినట్టు నేను ఆచరించి తీరుతాను. జరిగిన దానిని తలవను. జరిగేదానికి వగవను. ఒరగనున్నదిది యని ఊహాగానము చేయను. సంతసముగ జీవింపగ సతతము యత్నింతుగాని ఎంతటి సౌఖ్యానికైన ఇతరుల పీడింపలేను- ఇది అభిలాష, ఆదర్శము,’ అని ప్రకటించుకున్న కాళోజీ తన సోదరుడు మరణించిన ఆరేళ్లతర్వాత, 2002లో భూమాత భుజాలు శాశ్వతంగా దిగిపోయాడు. జీవనశైలిలో గాంధీతత్వాన్ని నింపుకుని, సామాజిక కోణంలో సామ్యవాదిగా బతికిన కాళోజీ మరణానంతరం తన భౌతికకాయాన్ని కాకతీయ మెడికల్ కాలేజీకి దానం చేసేలా చూసుకున్నాడు. ‘అతిథి వోలె ఉండి ఉండి అవని విడిచి’ వెళ్లిపోయాడు. ‘ఎవడో కాళోజీ అట...’ చిన్న చిన్న ఉద్వేగాలకు కూడా కాళోజీ కళ్లనీళ్లు పెట్టుకునేవాడు. ‘మనమే నయం’, ‘తెలియక ప్రేమ తెలిసి ద్వేషము’, ‘విభూతి లేక ఫేస్‌పౌడర్’, ‘లంకా పునరుద్ధరణ’, ‘ఆగస్టు పదిహేను’ లాంటి కథలు రాశాడు. పురాణకథలను రీటోల్డ్ మాదిరిగా తిరగరాస్తూ, ప్రతికూల సామాజిక విలువలను నిరసించేవాడు. ఎక్కువగా మనుషుల బుద్ధిమారనితనం ఆయన కథావస్తువు. ఓసారి కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి ఆయనకు రాసిన ఉత్తరం సాక్ష్యంగా అరెస్టయ్యాడు. కాళోజీ నివాసమున్న హన్మకొండలోని నక్కలగుట్ట ప్రాంతాన్ని కాళోజీనగర్ అంటున్నారు. కాళోజీ 86వ జన్మదినం రోజున జరుగుతున్న సన్మానసభలో మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ‘పెద్దలు శ్రీ కాళోజీ నారాయణరావు గారు’ అని ఉపన్యాసం ప్రారంభించగానే, ‘గారెక్కడిదిరా?’ అని గర్జించాడు. ఏదో ఒక పార్టీకో, సిద్ధాంతానికో గుడ్డిగా కట్టుబడి ఉండటాన్ని పార్టీవ్రత్యం అనేవాడు. 32 మంది కవులు, పండితులకు ప్రభుత్వం ఉగాది పురస్కారాలు ఇచ్చే సందర్భం అది. వేదిక మీద మూడే కుర్చీలు వేశారు. ఆ మూడు ఎవరికీ అని వేస్తున్నతణ్ని అడిగితే, సీఎం, సంబంధిత మంత్రి, సాహిత్య సలహాదారుకని చెప్పాడు. సన్మానం అందుకునేవాళ్లలో వృద్ధులున్నారు. 90-95 ఏండ్ల రాజమండ్రి పండితుడు కూడా ఉన్నారు. వీళ్లందరూ వేదిక ఎక్కి, శాలువా కప్పించుకుని, సత్కారం అందుకునేదాకా నిలబడే ఉండాలా? ఇదేనా పెద్దలకిచ్చే మర్యాద? అందరికీ వేదిక మీద కుర్చీలు వేయాలన్నాడు కాళోజీ. నాకు అదంతా తెలియదని అతడు బదులిచ్చాడు. ‘నీకు ఇట్ల వెయ్యాలని చెప్పినోని దగ్గరికిపో, పోయి, ఎవడో కాళోజీ అట, ఇట్లన్నడు అని చెప్పు, నీదేమున్నది’ అన్నడట. తర్వాత అందరికీ వేదిక మీద కుర్చీలు ప్రత్యక్షమైనాయి. కాళోజీ జీవనరేఖలు జననం 9 సెప్టెంబర్ 1914 తల్లిదండ్రులు కాళోజీ రంగారావు (మహారాష్ట్ర), రామాబాయి (కర్ణాటక) భార్య రుక్మిణీబాయి (వివాహం; 1940) కొడుకు రవికుమార్ కాళోజీ కవితల సంకలనం ‘నా గొడవ’ ‘ఇదీ నా గొడవ’ పేరుతో ఆత్మకథ రాశాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు వ్యవస్థాపక సభ్యుడు ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీలో సభ్యుడు శాసనమండలి సభ్యుడు(1958-60) 1992లో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నాడు. మరణం 13 నవంబర్ 2002 తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు సంకోచపడియెదవు సంగతేమిటిరా? - కాళోజీ -
విభజనకు బాబే బాధ్యుడు
సాక్షి, ఒంగోలు : ‘‘రాష్ట్ర విభజనకు టీడీపీ అధినేత చంద్రబాబే బాధ్యుడు.. ఆయన రెండు కళ్ల సిద్ధాంతం వల్లే రాష్ట్ర విభజన జరిగింది. బాబును రాష్ట్ర ప్రజలెవరూ నమ్మరు’’ అని ఒంగోలు వాసులు చెప్పారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో సాక్షి దినపత్రిక, టీవీ ఆధ్వర్యంలో శనివారం ‘ఎవరెటు? చర్చావేదిక జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. విభజనలో భాగస్వాములై సీమాంధ్ర నేతలు భాగస్వాములు కావద్దని సూచించారు. సమైక్యాంధ్ర జేఏసీ కన్వీనర్ రవికుమార్ మాట్లాడుతూ, విద్య, ఉపాధి, జల, రాజధాని సమస్యల్ని ప్రస్తావించకుండా నిరంకుశంగా రాష్ట్ర విభజన ప్రకటన చేయడం వల్లే సీమాంధ్రలో ఉద్యమ జ్వాలలు ఎగసిపడుతున్నాయని చెప్పారు. ఉద్యోగ జేఏసీ చైర్మన్ బషీర్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ నేతల తరహాలో మిగిలిన పార్టీల ప్రజాప్రతినిధులు కూడా స్పీకర్ ఫార్మెట్లో తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వెంకయ్య మాట్లాడుతూ అశాస్త్రీయమైన విభజన ప్రకియ ద్వారా అన్ని వర్గాలు, రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. సీఎం మారినప్పుడల్లా 300 నుంచి 500 మెడికల్ సీట్లు తెలంగాణకు ఇచ్చేసి ఇక్కడ కోటా తగ్గిస్తున్నారని మండిపడ్డారు. ఏపీఎన్జీవో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డిల చేతగానితనం వల్లే రాష్ట్ర విభజన జరిగిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసోసియేషన్ కోశాధికారి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ వైఎస్ విజయమ్మ సమైక్యత కోసం దీక్ష చేయడం మంచి పరిణామమనీ, ఉద్యమం కోసం ముందుండి దీక్షలు, త్యాగాలు చేసే వారిని తాము నెత్తిన పెట్టుకుంటామన్నారు. విద్యావేత్త డాక్టర్ పీహెచ్‌జీ కృష్ణంరాజు మాట్లాడుతూ ఐఐటీ, ఐఐఎం, ఇక్రిశాట్ తదితర సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయనీ, రాష్ట్ర విభజనతో యువత భవితను అంధకారంలోకి నెడతామంటే ఊరుకోబోమని స్పష్టంచేశారు.