జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం విసుక్కోవడాలు, విస్మరింపుల మధ్య నిస్సారంగా జరిగింది. సమావేశంలో ప్రాధాన్యత అంశాలను పక్కన పెట్టి, అవసరం లేని అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. దీనికి తోడు పలు శాఖల అధికారులు హాజరు కాకపోవడంతో కలెక్టరే అన్నింటికీ స మాధానం చెప్పాల్సి వచ్చింది. సమావేశ తీరును నిరసిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన శాసనసభ్యులు ఇద్దరు, జెడ్పీటీసీలు 13 మంది సమావేశాన్ని బాయ్‌కాట్ చేశారు.