డీల్ విలువ రూ.10,861 కోట్లు
న్యూఢిల్లీ: ఐటీ రంగంలో ఉన్న యూఎస్ సంస్థ కాగ్నిజెంట్ తాజాగా డిజిటల్ ఇంజనీరింగ్ కంపెనీ బెల్కాన్‌ను కొనుగోలు చేస్తున్నట్టు ప్రకటించింది. డీల్ విలువ రూ.10,861 కోట్లు. బెల్కాన్‌ను ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ ఏఈ ఇండ్రస్టియల్ పార్ట్‌నర్స్ ప్రమోట్ చేస్తోంది. ఈ డీల్ ద్వారా 190 బిలియన్ డాలర్ల ఇంజనీరింగ్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ (ఈఆర్‌అండ్‌డీ) సర్విసెస్ రంగంలో విస్తరించాలన్నది కాగ్నిజెంట్ ఆలోచన. అలాగే ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్, మెరైన్ రంగాల్లో అడుగుపెట్టాలని భావిస్తోంది.
ఈఆర్‌అండ్‌డీ సర్విసుల మార్కెట్లో సంస్థ స్థానం మరింత బలపడుతుందని కాగ్నిజెంట్ సీఈవో ఎస్.రవి కుమార్ తెలిపారు. కాగ్నిజెంట్‌కు ఇది రెండవ అతిపెద్ద డీల్‌గా నిలిచింది. 2014లో హెల్త్‌కేర్ సాఫ్ట్‌వేర్ కంపెనీ ట్రైజెట్టో కొనుగోలుకు 2.7 బిలియన్ డాలర్లు వెచ్చించింది. ఇక బెల్కాన్‌కు అంతర్జాతీయంగా 60 ప్రాంతాల్లో 10,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. బోయింగ్, జనరల్ మోటార్స్, రోల్స్ రాయిస్, యూఎస్ స్పేస్ ఏజెన్సీ అయిన నాసా, యూఎస్ నేవీ వంటి దిగ్గజ సంస్థలకు సేవలు అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment