
మాజీ ఐపీఎస్ అఫీసర్ బీవీ రమణకుమార్, జనార్థన్‌రావు
సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు మొద్దునిద్ర వీడింది.
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు ఆర్టీఐ కమిషనర్ల నియామకం చేపట్టింది. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం మొద్దునిద్ర వీడింది. రాష్ట్రంలో నాలుగేళ్ల తర్వాత సమాచార కమిషనర్లను నియమించింది.
మాజీ ఐపీఎస్ అఫీసర్ బీవీ రమణకుమార్(కృష్ణా జిల్లా), మాజీ ఐఎఫ్‌ఎస్ రవికుమార్ (రాజమండ్రి), టీడీపీ లీగల్ సెల్ సభ్యుడు జనార్థన్‌రావు(కడప)లను ఆర్టీఐ కమిషనర్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.