
అమరావతి కేసుపై ఈనెల 23వ తేదీన సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
సాక్షి, ఢిల్లీ: అమరావతి కేసుపై ఈనెల 23వ తేదీన సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. అయితే.. రాజధాని కేసును త్వరగా విచారించాలని ప్రభుత్వం తరపున లాయర్ నిరంజన్‌రెడ్డి కోరారు.
మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం, సుప్రీం ధర్మాసనానికి తెలియజేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరుతోంది.