capital city
-
ఈ నెలలోనే విశాఖ కేంద్రంగా పరిపాలన: వైవీ సుబ్బారెడ్డి
-
ఉత్తరాంధ్రలో పండుగ వాతావరణం
-
రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టా రావడం సంతోషంగా ఉంది.. జగనన్న పాలనలో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందుతున్నారు..
-
Karnataka assembly elections 2023:ఎవరిదో రాజధాని!
రాష్ట్రాన్ని గెలవాలంటే ముందు రాజధానిని గెలవాలి. కర్ణాటకలో అధికారిక పీఠానికి తాళాలు బెంగళూరులోనే ఉన్నాయి. బీజేపీకీ, కాంగ్రెస్‌కూ ఈ విషయం బాగా తెలుసు. దాంతో ఈసారి అధికార విపక్షాల మధ్య సిలికాన్ సిటీలో సంకుల సమరం సాగుతోంది. సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీయే కర్ణాటకలో అధికారంలోకి వస్తుందని గడచిన పలు ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే తెలుస్తోంది. అందుకే బెంగళూరు పరిధిలోని 28 అసెంబ్లీ స్థానాల్లో అత్యధిక స్థానాలు నెగ్గి అధికారంలోకి రావాలని బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. గడిచిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తీరు తెన్నులు.. ► 2008లో బెంగళూరులో బీజేపీ 17, కాంగ్రెస్ పార్టీ 10 సీట్లు గెలవగా జేడీ(ఎస్) ఒక్క స్థానానికి పరిమితమైంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసి దక్షిణ భారతంలో తొలిసారి ఆ ఘనత సాధించింది. ► 2013 ఎన్నికల్లో కాంగ్రెస్ 13, బీజేపీ 12, జేడీ(ఎస్) 3 సీట్లు గెలిచాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సిద్ధరామయ్య తొలిసారి సీఎం అయ్యారు. ► 2018లో కాంగ్రెస్15, బీజేపీ 11, జేడీ(ఎస్) 2 స్థానాలు దక్కించుకున్నాయి. కాంగ్రెస్, జేడీ(ఎస్) సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కుమారస్వామి సీఎం అయ్యారు. కానీ సర్కారు బలపరీక్షలో ఓడి 14 నెలలకే కుప్పకూలింది. ► 2019లో కాంగ్రెస్, జేడీ(ఎస్) సభ్యులు బీజేపీకి ఫిరాయించడంతో 15 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. బీజేపీ ఏకంగా 12 సీట్లు నెగ్గింది. అలా బెంగళూరులో బీజేపీ బలం 15కు పెరగగా కాంగ్రెస్ 11 స్థానాలకు పడిపోయింది. బీజేపీ అధికారాన్ని స్థిరపరచుకుంది. వేధిస్తున్న తక్కువ ఓటింగ్ బెంగళూరులో ప్రతిసారీ తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుండడం పరిపాటిగా వస్తోంది. 2013, 2018 ఎన్నికల్లో ఓటింగ్ శాతం బాగా పడిపోయింది. సగానికి సగం, అంటే నియోజకవర్గాల్లో మరీ తక్కువ ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. బెంగళూరు వాసులు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపరన్న అపప్రథా ఉంది. దీన్ని ఈసారైనా తొలగించుకుంటారా అన్నది చూడాలి. ► 2013 ఎన్నికల్లో బెంగళూరు పరిధిలో కేవలం 55.04% ఓటింగ్ నమోదైంది. 2018లో అది కాస్తా 48.03 శాతానికి తగ్గింది. ► దాంతో ఈసారి ఎలాగైనా రాజధానిలో ఓటింగ్ శాతాన్ని పెంచడంపై ఎన్నికల సంఘం ప్రధానంగా దృష్టి పెట్టింది. కొద్ది రోజులుగా ప్రత్యేక ర్యాలీలు, వాకథాన్‌లు, ప్రచారాలు చేపడుతోంది. తటస్థ ఓటర్లే కీలకం ► ట్రాఫిక్ సమస్య, మౌలిక వసతుల లేమి వంటి పలు సమస్యలు బెంగళూరును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్నారన్నది నగరవాసుల ప్రధాన ఆరోపణ. ► ఇక్కడ 15 నుంచి 20 శాతం ఓటర్లు కులమతాలకు అతీతంగా తటస్థంగా ఉంటారు. ► వీరిని తమవైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ► బీజేపీ అవినీతి, పాలన వైఫల్యాలు, కుంభకోణాలను ప్రచారం చేస్తూ నగర వాసులను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. శాంతినగర, సర్వజ్ఞ నగర వంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో బలంగా ఉంది. ► ఇక తటస్థ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బీజేపీ నేతలు ఇంటింటి ప్రచారానికి దిగారు. ► కాంగ్రెస్, జేడీ(ఎస్)ల నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో నగరంలో బీజేపీ బలంగా కనిపిస్తోంది. -
సుప్రీంలో అమరావతి కేసు.. 23న విచారణ
సాక్షి, ఢిల్లీ: అమరావతి కేసుపై ఈనెల 23వ తేదీన సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. అయితే.. రాజధాని కేసును త్వరగా విచారించాలని ప్రభుత్వం తరపున లాయర్ నిరంజన్‌రెడ్డి కోరారు. మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సవాల్ చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని ఏపీ ప్రభుత్వం, సుప్రీం ధర్మాసనానికి తెలియజేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని కోరుతోంది. -
Sakshi Cartoon 28-09-2022
ప్రపంచమంతా తిరిగి రాజధాని ఎలా కట్టాలో తెలుసుకోవడానికి ఆ ఖర్చు చేశారట సార్! -
ఢిల్లీ–కేంద్రం వివాదం.. రాజ్యాంగ ధర్మాసనానికి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రభుత్వ సివిల్ అధికారులపై ఆజమాయిషీ ఎవరికి ఉండాలనే అంశంపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం తలెత్తిన వివాదాన్ని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాల శాసన, కార్యనిర్వాహక అధికారాల పరిధిని మాత్రమే ధర్మాసనం నిర్ణయిస్తుందని స్పష్టం చేసింది. ఈ నెల 11వ తేదీన విచారణ ప్రారంభమవుతుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. ‘క్యాట్’ ఖాళీలు భర్తీ చేయండి కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (క్యాట్)లో ఖాళీల పట్ల సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వాటిని ఇంకా భర్తీ చేయకపోవడం ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కేవలం ఒక్క సభ్యుడితో ధర్మాసనాన్ని ఏర్పాటు చేయలేమని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలంటూ కేంద్రానికి నోటీసు జారీ చేసింది. క్యాట్‌కు చెందిన జబల్పూర్, కటక్, లక్నో, జమ్మూ, శ్రీనగర్ బెంచ్‌లలో కేవలం ఒక్కో సభ్యుడే ఉన్నారని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. క్యాట్‌లో ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ క్యాట్ (ప్రిన్సిపల్ బెంచ్) బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ...న్యాయ వ్యవస్థకు అగౌరవం భూ సేకరణ వ్యవహారంలో తీర్పు ముసుగులో కక్షిదారుకు అనుచితమైన లబ్ధి కలిగించడం న్యాయ వ్యవస్థను అగౌరవపర్చడం, దుష్ప్రవర్తన కిందకే వస్తుందని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బేలా ఎం.త్రివేది నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది. అలాంటి తీర్పు ఇచ్చిన యూపీలోని ఆగ్రా మాజీ అదనపు జిల్లా జడ్జీ ముజఫర్ హుస్సేన్ ఉద్దేశాన్ని అనుమానించాల్సిందేనని పేర్కొంది. ముజఫర్ హుస్సేన్ దురుద్దేశపూర్వకంగా తీర్పు ఇచ్చారని అలహాబాద్ హైకోర్టు గతంలో తేల్చిచెప్పింది. జరిమానా కింద అతడి పెన్షన్‌లో 90 శాతం కోత విధించింది. దీన్ని సవాలు చేస్తూ ముజఫర్ హుస్సేన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. ‘‘ప్రజా సేవకులు నీటిలోని చేపల్లాంటి వారు. నీటిలో చేపలు ఎప్పుడు, ఎలా నీళ్లు తాగుతాయో ఎవరూ చెప్పలేరు’’ అని వ్యాఖ్యానించింది. ఆజం బెయిల్ ఆలస్యంపై అసంతృప్తి సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు ఆలస్యం కావడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది న్యాయాన్ని అవహేళన చేయడమేనంటూ జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. భూ ఆక్రమణ కేసులో బెయిల్ దరఖాస్తుపై విచారణ పూర్తి చేసిన అలహాబాద్ హైకోర్టు తీర్పును రిజర్వులో ఉంచినట్లు ఆజం ఖాన్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి నివేదించారు. ఆయనపై 87 కేసులకు గాను 86 కేసుల్లో బెయిల్ మంజూరైందన్నారు. ‘‘ఒక్క కేసులో బెయిల్‌కు ఇంత జాప్యమా? ఇది న్యాయాన్ని అవహేళన చేయడమే. ఇంతకు మించి ఏమీ చెప్పలేం. దీనిపై బుధవారం విచారణ చేపడతాం’అని పేర్కొంది. ఆజం ఖాన్ ప్రస్తుతం సితాపూర్ జైలులో ఉన్నారు. -
పెత్తందారీ పొలికేక
అన్నిభాషల్లో కూడా కొన్ని పదాలకు ఒక క్యారెక్టర్ స్థిర పడిపోయి ఉంటుంది. కొన్ని పదాల్లో హీరోయిజం కన బడుతుంది. కొన్ని పదాలు విలనిజాన్ని ప్రదర్శిస్తాయి. మరికొన్ని మాటల్లో శక్తిమంతుడైన ఒక సాఫ్ట్ విలన్ కనిపిస్తాడు. ఇంగ్లీష్ మాట ‘హెజెమొనీ’ (Hegemony) దీనికి మంచి ఉదాహరణ. తెలుగులో దీనికి సమానార్థకంగా ‘ఆధిపత్యం’ అనే మాటను ఉపయోగిస్తున్నాం. ఆధిపత్యం శ్రుతిమించినపుడు కొండొకచో... పెత్తందారీతనం అనే మాటను కూడా ఆశ్రయిస్తున్నాం. అనేక దేశాలున్న ప్రపంచంలో కొన్ని దేశాల ఆధిపత్యం, భిన్న వర్గాలతో కూడిన సమాజంలో ఒకటి, రెండు వర్గాల ఆధిపత్యం సమ్మతమేనా? అటువంటి సమ్మతి స్వచ్ఛందంగా వస్తుందా? లేక కండబలంతో, కత్తులు కటార్లతో, తుపాకీ తూటాలతో సాధిస్తారా? ఆదియందు కండబలంతోనే ఆధిపత్యాన్ని ప్రోది చేసుకున్నప్పటికీ కాలక్రమంలో బుద్ధిబలం ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఈ విషయాన్ని తొలుత గుర్తించి సిద్ధాంతీకరించిన వ్యక్తి ఇటాలియన్ తత్త్వవేత్త ఆంటోనియో గ్రామ్సీ. యథేచ్ఛగా కార్మికుల శ్రమశక్తిని దోపిడీ చేస్తున్నప్పటికీ పశ్చిమ యూరప్ దేశాల్లో పెట్టుబడిదారీ విధానం స్థిరపడి పోవడానికి కారణాలను ఆయన అన్వేషించారు. ఆధిపత్య వర్గాలు ప్రవేశపెట్టిన నీతినియమాలు, సాంఘిక కట్టుబాట్లు, కథలూ, సామెతలు, సంప్రదాయాలన్నీ కలిసి ఒక ఆధిపత్య భావజాలం ఏర్పడుతుందని ఆయన గుర్తించారు. మనదేశంలో కర్మ సిద్ధాంతం ఈ భావజాలాన్ని బలంగా నిలబెట్టింది. ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా?’ (కాపీరైట్: చంద్రబాబు) అనే వాక్యంలో ఎంత మహిళా విద్వేషం దాగి ఉన్నప్పటికీ చలామణి కావడానికి కారణం ఆధిపత్య భావజాల ప్రభావమే! ‘ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?’ (కాపీరైట్: చంద్రబాబు) అనే వాక్యం సామాజిక ఉన్మాదంలోంచి దూసుకొచ్చింది. సమాజంలో ఉన్న ఆధిపత్య భావజాలం కారణంగా ఇటువంటి అమానుష వ్యాఖ్యానాలన్నీ నిర్లజ్జగా ప్రవహిస్తూనే ఉన్నాయి. ప్రపంచంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులుగా ముందు కొచ్చిన కమ్యూనిస్టు, సోషలిస్టులు కూడా ఈ ఆధిపత్య భావజాలాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో ఆధిపత్య భావజాలం వల్ల అణచివేతకు గురవుతున్న వర్గాలు, ప్రాంతాల్లో ఒక చైతన్యం ప్రారంభమైంది. ఈ చైతన్యం అస్తిత్వ పోరాటాల రూపాన్ని, సాధికారత సాధన ఉద్యమాల రూపాన్ని తీసుకుంటున్నది. ఈ పరిణామాన్ని మనం ప్రపంచమంతటా చూడగలుగుతున్నాం. ఒకప్పటి మన ఉమ్మడి రాష్ట్రం, ప్రస్తుత తెలుగు రాష్ట్రాలు కూడా ఈ పరిణామానికి అతీతం కాదు. తెలుగువారి ఆధునిక చరిత్రను రెండున్నర కోస్తా జిల్లాల ఆధిపత్య వర్గ ప్రయోజనం, దాని భావజాలం చాలాకాలంగా ప్రభావితం చేస్తున్నది. పత్రికలు, పుస్తకాల ప్రచురణ, సినిమాలతో మొదలైన సాంస్కృతిక ఆధిపత్యం మొత్తం మీడియాను గుప్పెట్లోకి తీసుకునే దాకా నిరాటంకంగా సాగిపోయింది, సాగుతూనే ఉన్నది. ఆ రెండున్నర జిల్లాల తెలుగు యాసనే వారు ప్రామాణిక భాషగా స్థిరపరిచారు. మిగిలిన ఇరవై జిల్లాల వారు అంగీకరించక తప్పలేదు. ఎందుకంటే పాఠ్యపుస్తకాల దగ్గర నుంచి సమస్త గ్రంథాలు, పత్రికల ప్రచురణ మొత్తం వారి చేతుల్లోనే ఉన్నది. సినిమాల్లో, నవలల్లో... పనివాళ్లకూ, కమెడియన్లకూ మాత్రమే తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర యాస ఉండేది. వారితో మాట్లాడించి రెండున్నర జిల్లాల నాయికానాయకులు పడిపడి నవ్వేవారు. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర, హైదరాబాద్ పాతబస్తీలో, విశాఖ షిప్‌యార్డ్ సమీపంలో ఉండే దుర్మార్గులు, దుష్టులైన విలన్లకు రెండున్నర జిల్లాల కథానాయకులు తాట తీసే సన్నివేశాలను ఎన్ని సినిమాల్లో చూడలేదు. ఒక వర్గపు ఆధిపత్య భావజాలం తెలుగునాట గజ్జెకట్టి నర్తించిన వైనాన్ని మొత్తంగా రాస్తే రామాయణ మంత! చెబితే భారతమంత!! అస్తిత్వ పోరాటాల యుగం ఇది. అణచివేతకు గురైనవారు సాధికారత శంఖం పూరిస్తున్న కాలం ఇది. ఆధిపత్య ధోరణులకు వ్యతిరేకంగా మొదలైన అస్తిత్వ పోరాటానికి రాజకీయ వేదిక తోడవటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఇప్పుడు మిగిలిన ఆంధ్రప్రదేశ్ భౌగోళిక స్వరూపం 1953–56 మధ్యకాలం నాటిది. ఈ సమయంలో రాష్ట్రానికి కర్నూలు రాజధాని. హైకోర్టు గుంటూరులో ఉండేది. మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడటానికి ముందు అన్ని ప్రాంతాల నేతల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధాని ఏర్పాటైంది. ‘విశాలాంధ్ర’ అనే ఉమ్మడి ప్రయోజనం కోసం 1956లో రాజధాని హోదాను కర్నూలు త్యాగం చేసింది. ఇప్పుడు విశాలాంధ్ర రద్దయిన నేపథ్యంలో పూర్వపు ఆంధ్రరాష్ట్రం పునరుత్థానమైంది. తాను గతంలో త్యాగం చేసిన హోదాను ఇప్పుడు కర్నూలు డిమాండ్ చేస్తే తప్పెట్లా అవుతుంది? ఆధిపత్య భావజాలం ఇప్పుడు అమరావతి రూపంతో అస్తిత్వ పోరాటాలకు, సాధికారత ఉద్యమాలకు ఒక సవాల్‌ను విసురుతున్నది. న్యాయబద్ధంగా పూర్వపు రాజధాని హోదా దక్కవలసిన కర్నూలుకు న్యాయరాజధాని హోదాను కూడా ఇవ్వడానికి వీలులేదని వాదిస్తున్నది. ఎందుకు వీల్లేదో హేతుబద్ధంగా వివరించడానికి అది నిరాకరిస్తున్నది. రాయలసీమ ప్రాంత అస్తిత్వ గౌరవాన్నీ, ఆత్మగౌరవ ఆకాంక్షనూ అది తృణీకరిస్తున్నది. రాజధాని మొత్తం ఒకేచోట... అదీ అమరావతిలోనే ఉండాలనే వితండవాదాన్ని ముందుకు తెచ్చింది. ఈ ఆధిపత్య భావజాలం రాష్ట్రంలోని అన్ని జెండాలనూ ఏకం చేసింది. ఆధిపత్య వర్గాలకు జెండాలు ఎన్ని ఉన్నా ఎజెండా ఒక్కటేనని నిన్నటి తిరుపతి సభ నిర్ద్వంద్వంగా నిరూపించింది. కమ్యూనిస్టు నారాయణుడు, కాషాయ లక్ష్మీనారాయణుడూ చేతులు కలిపి భుజం, భుజం కలిపి నిలబడిన దృశ్యం భేష్. ఈ రాష్ట్రంలో అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, సాధికారత కోసం ఎదురుచూస్తున్న కోట్లాది కష్టజీవుల కళ్లలో ఈ దృశ్యం ముద్రితమైంది. వారిక తుది నిర్ణయం తీసుకుంటారు. చిరకాలంగా మన మెదళ్లను ఆధిపత్య భావజాలం నియంత్రిస్తున్న కారణంగా, తన ప్రచార–ప్రసార సాధనాల ద్వారా మన ఆలోచనల్ని ప్రభావితం చేస్తున్న కారణంగా రాజధాని విషయంలో తటస్థ మేధావుల ‘సమ్మతి’ని తనకు అనుకూలంగా ‘ఉత్పత్తి’ చేసే కార్యక్రమాన్ని ఆధిపత్య వర్గాలు చేపట్టాయి. ‘మ్యాన్యుఫ్యాక్చరింగ్ కన్సెంట్– ది పొలిటికల్ ఎకానమీ ఆఫ్ ది మాస్ మీడియా’ పేరుతో సుప్రసిద్ధ అమెరికన్ మేధావి నోమ్ చోమ్స్కీ ఒక పుస్తకాన్నే రాశారు. ఇక్కడ మాస్ మీడియా ఉండేది... ఆధిపత్య వర్గం చేతుల్లోనే. తమకు అనుకూలమైన విధంగా ప్రజాభిప్రాయాన్ని మాస్ మీడియా ద్వారా ఎలా ఉత్పత్తి చేస్తారో చోమ్స్కీ ఈ పుస్తకంలో వివరించారు. ఆధిపత్య భావజాలాన్ని ప్రచారం చేసే మన మీడియా చోమ్స్కీ చెప్పిన పద్ధతులకు మరిన్ని ‘మెరుగులు’ దిద్ది, అధిక ‘ఉత్పత్తి’ని ఇప్పటికే సాధించింది. రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలి కదా! మూడు చోట్ల ఎందుకు? ఒక్కచోటనే ఉంచి ఒక మహానగరాన్ని నిర్మించి నట్లయితే రాష్ట్రానికి ప్రయోజనం కదా? చంద్రబాబుకు హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన అనుభవం ఉన్నది కదా? ఆ అనుభవంతో ఇక్కడా అటువంటి నగరాన్ని నిర్మించలేరా? ఇటువంటి అభిప్రాయాలను ఉత్పత్తి చేసి ప్రజల మెదళ్ళలో జొప్పించడానికి ఆధిపత్య వర్గాలు శాయశక్తులా ప్రయ త్నిస్తున్నాయి. తటస్థులూ, బుద్ధిజీవులు, ఉద్యోగ–వ్యాపార, మధ్యతరగతి ప్రజలందరూ ఇక్కడొక రెండు విషయాలను గమనంలోకి తీసుకోవాలి. మొదటిది కర్నూలులో న్యాయరాజధాని సంగతి. ఇది అస్తిత్వ పోరాటాల యుగమని ముందుగానే చెప్పుకున్నాం. వెనకబాటుతనానికి గురైన రాయలసీమ ప్రాంతం తరఫున కర్నూలు పోటీలో నిలబడింది. గతంలో రాజధానిని త్యాగం చేసిన అనుభవంతో అర్హతల రీత్యా మొదటిస్థానంలో నిలబడి ఉన్నది. అటువంటి నగరానికి న్యాయ రాజధానినైనా కేటాయించకపోతే ఆ ప్రాంతంలో అసంతృప్తి రేకెత్తకుండా ఉంటుందా? ప్రాంతీయ ఆకాంక్షలను గుర్తించకుండా ఇప్పటికే భారీ మూల్యం చెల్లించిన సంగతిని విస్మరించడం సరైనదేనా? కర్నూలులో న్యాయ రాజధానిని ఏర్పాటు చేసినట్లయితే ఈ రాష్ట్రానికి వచ్చే నష్టమేమిటో సహేతుకంగా ఎవరైనా చెప్పగలరా? హైకోర్టును ఏర్పాటు చేయవచ్చును గానీ, న్యాయ రాజధానిగా చెప్పడానికి వీల్లేదని బీజేపీ మరొక వింత వాదన లేవదీసింది. అలా అనడం ఆ ప్రాంత ఆత్మగౌరవాన్ని కించపరచడం కాదా? ఇక రెండో విషయం విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని ఏర్పాటు గురించి! ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కూడా అస్తిత్వ సమస్య వెన్నాడుతున్నది. తరతరాలుగా వివక్షకు గురవుతన్నామన్న ఆవేదన ఈ ప్రాంతానికి ఉన్నది. పైగా ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద నగరం విశాఖ. వివిధ భాషలు, సంస్కృతులు, మతాల ప్రజలు కలిసి జీవించే కాస్మోపాలిటన్ నగరం. అమరావతి ప్రాంతంలో ఉన్నట్టుగా ఇల్లు అద్దెకు కావాలని వచ్చేవారిని కులం అడిగే సంప్రదాయం ఇక్కడ లేదు. అన్ని వర్గాల ప్రజలనూ అక్కున చేర్చుకునే స్వభావం. కొంత రాజకీయ సంకల్పం తోడైతే చాలు, తూర్పుతీరంలో ఒక మహానగరంగా అవతరించడానికి అనేక భౌగోళిక అనుకూలతలు ఉన్న నగరం. కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి కొంత ఫోకస్ పెడితే రెండు మూడేళ్ళలోనే రాష్ట్ర ఆర్థిక రంగానికి ఆలంబనగా నిలబడగల అభివృద్ధి ఇంజన్‌గా విశాఖ అవతరించగలదు. విశాఖతో పోలిస్తే ఆర్థికంగా అందుబాటులోకి రాగల అవకాశాలు అమరావతిలో మృగ్యం. రోమ్ నగరం ఒక్క రోజులో నిర్మాణం కాలేదన్న నానుడిని గమనంలో ఉంచుకోవాలి. హైదరాబాద్ నగరానికి పునాది వేసినప్పుడు ఖులీ ఖుతుబ్షా, అల్లాను వేడుకున్నాడు. నీళ్లలో చేపల్ని కలిపినట్టు నగరం జన సమ్మర్దంతో నిండేలా చూసే భారాన్ని ఆయన అల్లా దయకే వదిలేశారు. భవనాలు నిర్మించినంత మాత్రాన జరిగేది ఏముండదనీ, జనం నివసించాలంటే అక్కడ ఉపాధి అవకాశాలు లభించే, ఆర్థిక కార్యక్రమాలు పెరగాలనే విచక్షణ గలవాడు కనుకనే ఖులీ... అల్లాను ప్రార్థించాడు. మలేషియాలో కొత్త రాజధానిగా పుత్రజయను నిర్మించినప్పటికీ ఆర్థిక భారాన్ని మోస్తున్నది ఇప్పటికీ కౌలాలంపూరే! హైకోర్టు ఒక చోట, అసెంబ్లీ మరోచోట ఉన్న రాష్ట్రాలు మనదేశంలోనే అరడజన్ దాకా ఉన్నాయి. ఇదేమీ కొత్త విషయం కాదు. అస్తిత్వ సమస్యను పరిష్కరించడానికీ, ఆర్థిక చోదకశక్తిని తయారుచేసుకోవడానికి కూడా ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదిత మూడు రాజధానులు అత్యావశ్యకం. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసినట్టుగా చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేస్తారనేది కూడా ఒక బోగస్ ప్రచారం. హైదరాబాద్ అభివృద్ధిని చంద్రబాబు ఖాతాలో వేయడం కూడా ఆధిపత్య వర్గాలు ‘ఉత్పత్తి’ చేసిన అభిప్రాయమే. హైదరాబాద్ వయసు 430 సంవత్సరాలు. పుట్టినప్పటి నుంచీ ఇది రాజధాని నగరమే. ప్రపంచంలోనే విలువైన వజ్రాలకూ, మేలి ముత్యాలకూ కేరాఫ్ అడ్రస్. కోహినూర్, జాకబ్ వజ్రాలను సానబట్టిన నగరం. దేశానికి స్వాతంత్య్రం రాక మునుపు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచినవాడు – హైదరాబాద్ నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్. చంద్రబాబు రాజకీయాల్లోకి రాకముందే డజన్‌కు పైగా భారీ ప్రభుత్వరంగ పరిశ్రమలు వెలసిన నగరం. మరో డజన్ రక్షణ, పరిశోధనా సంస్థలకు ఆవాసం. ప్రసిద్ధ విశ్వవిద్యాలయాల కూడలి. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేసింది కూడా వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో! ఔటర్ రింగ్‌రోడ్డు అలైన్మెంట్ ఖరారు, భూసేకరణ, నిర్మాణం వైఎస్సార్ హయంలోనే జరిగాయి. అలైన్మెంట్ ఖరారు సమయంలోనే కదా ఎల్లోమీడియా మొఘల్ రాజశేఖర్ రెడ్డిపై కత్తి కట్టింది?. కానీ ఇప్పుడు ఔటర్ రింగ్‌రోడ్డునూ, ఎయిర్‌పోర్టునూ చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు. జనాన్ని పిచ్చివాళ్ళను చేయగల సామర్థ్యం ఆధిపత్య భావజాలానికి ఉన్నదని వారి గట్టి నమ్మకం. ఆ నమ్మకంతోనే వారు అమరావతి రూపంలో ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నారు. ఆ నమ్మకంతోనే ఇతర ప్రాంతాల అస్తిత్వ ఆకాంక్షలను అవహేళన చేస్తున్నారు. ఆ నమ్మకంతోనే నిరుపేదలకు, సామాన్యులకు, అమరావతిలో నివాసయోగ్యత లేదని న్యాయస్థానం దాకా వెళ్ళి అడ్డు కున్నారు. ఇప్పుడు ఆధిపత్య వర్గాల జెండాలన్నింటినీ ఏకం చేసి సామాన్య ప్రజల మీద వారి ఆకాంక్షల మీద యుద్ధాన్ని ప్రకటించారు. పెత్తందార్లంతా ఒక్కటై తిరుపతిలో పొలికేక పెట్టారు. సామాన్య ప్రజల సాధికార పోరాటశక్తిని వారు తక్కువగా అంచనా వేస్తున్నారు. ఒక సామాన్య మహిళ కణ్ణగి శపిస్తేనే మదురై నగరం దగ్ధమైందని ప్రాచీన తమిళ కావ్యం ‘శిలప్పదికారం’ మనకు బోధిస్తున్నది. అరడజన్ జెండాలు చూసి మురిసిపోతే భంగపాటు తప్పదు. అటువైపు ఐదుకోట్ల జనం. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
రాజధాని రాష్ట్ర పరిధిలోనిదే..
సాక్షి, అమరావతి: రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర పరిధిలోని విషయమని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఈ మేరకు గురువారంనాడు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. రాజధాని విషయం తమ పరిధిలోనిది కాదని, రాష్ట్ర పరిధిలోనిదని కేంద్ర ప్రభుత్వం కూడా హైకోర్టుకు తన కౌంటర్లో చాలా స్పష్టంగా తెలిపిందని గుర్తుచేసింది. రాజధానితో సహా అన్ని అభివృద్ధి కార్యక్రమాలను, ప్రణాళికలను సమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందని అందులో పేర్కొంది. ప్రత్యేక హోదా డిమాండ్‌ను విడిచిపెట్టలేదు.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీని అమలుపరిచేందుకు కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నామని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌ను తాము విడిచిపెట్టలేదని, ప్రతీ సమావేశంలోనూ, పార్లమెంట్లో సందర్భం వచ్చినప్పుడల్లా ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నామని కోర్టుకు తెలిపింది. ప్రత్యేక హోదా పునర్విభజన చట్టంలో భాగంగా ఉందని, అది లేకుండా రాష్ట్ర విభజన పరిపూర్ణం కాదంది. ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయంది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం భరించే వ్యయంలో 90 శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, మిగిలిన 10 శాతాన్ని కూడా వడ్డీ లేకుండా రాష్ట్రానికి రుణంగా ఇస్తుందని తెలిపింది. కేంద్ర నిధుల్లో ప్రాధాన్యత ఉంటుందని, ఎక్సైజ్ డ్యూటీ రాయితీలు, కస్టమ్స్, కార్పొరేట్, ఇన్కమ్ ట్యాక్స్‌లలో పలు మినహాయింపులు ఉంటాయని వివరించింది. ఇందుకోసమే ప్రత్యేక హోదా కోసం కేంద్రం వెంటపడుతూనే ఉన్నామని చెప్పింది. కార్యాలయాల తరలించరాదనడం న్యాయసమ్మతం కాదు.. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దుపై చట్టాలు అమల్లోకి వచ్చాయని, ఇవి అమల్లో ఉండగా కార్యాలయాలను ఎక్కడికీ తరలించరాదని పిటిషనర్ కోరడం న్యాయసమ్మతం కాదని తెలిపింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదానివ్వడంతో పాటు పునర్విభజన చట్టంలోని పలు నిబంధనలను అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన పోలూరి శ్రీనివాసరావు హైకోర్టులో 2018లో పిటిషన్ దాఖలు చేశారు. అమరావతిలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలను ఎక్కడికీ తరలించకుండా ఉత్తర్వులివ్వాలంటూ 2020లో ఓ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల రాజధాని కేసుల విచారణ సందర్భంగా ఈ వ్యాజ్యం విచారణకు రాగా, కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేయగా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కౌంటర్ వేసింది. ప్రభుత్వం తరఫున పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి వి.రామమనోహరరావు కౌంటర్ దాఖలు చేశారు. హైకోర్టు ప్రిన్సిపల్ సీటు, బెంచ్‌లు ఎక్కడ ఉండాలన్న విషయం పునర్విభజన చట్టం, వికేంద్రీకరణ చట్టంలో చాలా స్పష్టంగా ఉందన్నారు. ఈ అంశంపై మహారాష్ట్ర వర్సెస్ నారాయణ శ్యాంరాం పురాణిక్ కేసులో సుప్రీంకోర్టు 1982లో చాలా స్పష్టమైన తీర్పునిచ్చిందన్నారు. -
తుది అంకానికి వికేంద్రీకరణ
సాక్షి, అమరావతి: చరిత్రాత్మకమైన ‘పరిపాలన వికేంద్రీకరణ–ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020’ను రాష్ట్ర ప్రభుత్వం శనివారం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం కోసం పంపింది. దీనితోపాటు సీఆర్డీఏ చట్టం–2014 రద్దు బిల్లు కూడా పంపింది. ఈ రెండింటినీ రాష్ట్ర శాసనసభ ఇప్పటికే రెండుసార్లు ఆమోదించిన విషయం తెలిసిందే. కానీ, ఈ రెండు పర్యాయాలూ శాసన మండలిలో టీడీపీ గందరగోళం సృష్టించి ఈ బిల్లులకు మోకాలడ్డినప్పటికీ నియమిత కాలం పూర్తికావడంతో ఇక మండలితో పనిలేకుండా ఏపీ లెజిస్లేచర్ అధికారులు గవర్నర్ ఆమోదానికి వీటిని పంపారు. గవర్నర్ ఆమోదం ఇక లాంఛనమే కనుక ఆ తదుపరి రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది. ప్రాంతీయ సమానాభివృద్ధి లక్ష్యంగా.. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రాంతీయ సమానాభివృద్ధిని సాధించాలన్న బృహత్తరమైన లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ బిల్లులను ప్రతిపాదించింది. వీటిని శాసనసభ ఈ ఏడాదిలో రెండుసార్లు ఆమోదించింది. కానీ, ఈ రెండుసార్లూ శాసన మండలిలో టీడీపీ తనకున్న సంఖ్యాబలంతో ఆమోదం పొందకుండా అడ్డుకుంది. – ఈ ఏడాది జనవరి 20న తొలిసారి శాసనసభలో ఈ బిల్లులను ఆమోదించి మండలికి పంపగా.. అక్కడ జనవరి 22న గందరగోళ పరిస్థితుల నడుమ మండలి ఛైర్మన్ ఎటూ తేల్చకుండా సభను వాయిదా వేశారు. – శాసనసభ ఆమోదించిన బిల్లుపై మండలిలో ఎలాంటి తదుపరి చర్యలూ మూడు నెలలపాటు (నిర్ణీత గడువు) ముందుకు సాగకపోవడంతో దాని వ్యవధి పూర్తయింది. – మళ్లీ జూన్ 16న రెండోసారి రాష్ట్ర ప్రభుత్వం–ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020, సీఆర్డీఏ చట్టం–2014 రద్దు బిల్లును అసెంబ్లీలో ఆమోదించి మండలికి పంపారు. – కానీ, 17న టీడీపీ కుటిల వైఖరివల్ల ఈ బిల్లులు ఆమోదం పొందలేదు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు దౌర్జన్యకాండకు దిగిన విషయం తెలిసిందే. మండలి ముందు మూడు ప్రత్యామ్నాయాలు నిజానికి.. రెండోసారి అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు శాసన మండలికి వచ్చినపుడు సభ ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉంటాయి. అవి.. – శాసనసభ ఆమోదించిన బిల్లును తిరస్కరించడం తొలి ప్రత్యామ్నాయం. – గతంలో ఇదే బిల్లును తిరస్కరించినప్పుడు మండలిలో ప్రతిపాదించిన సవరణలను చేయాలని పట్టుబట్టడం రెండో ప్రత్యామ్నాయం. – రెండోసారి వచ్చిన బిల్లుపై 30 రోజుల వరకూ క్రియారహితంగా ఉండటం మూడో ప్రత్యామ్నాయం. – ప్రస్తుత పరిస్థితుల్లో తొలి రెండు ప్రత్యామ్నాయాలు సాధ్యంకాలేదు. – 30 రోజులపాటు ఈ బిల్లుపై కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది కనుక ఆ బిల్లు ఆమోదం పొందినట్లుగా ఆర్టికల్ 197(2)(బి) ప్రకారం పరిగణిస్తారు. ప్రస్తుతం అదే జరిగింది. – మండలికి పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు రెండూ చేరి ఈ నెల 17వ తేదీకి 30 రోజులు పూర్తయ్యాయి కనుక శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు వీటిని గవర్నర్ ఆమోదం కోసం శనివారం రాజ్‌భవన్‌కు పంపారు. – గవర్నర్ ఆమోదం పొందిన పిదప బిల్లు చట్టం అవుతుంది కనుక పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటుచేయడానికి అవకాశం కలుగుతుంది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై ఎప్పుడేం జరిగిందంటే.. – సెప్టెంబర్ 13, 2019 : రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటుచేసిన ప్రభుత్వం. – డిసెంబర్ 20, 2019 : రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని.. అమరావతిలో శాసన రాజధాని (లెజిస్లేటివ్ కేపిటల్), విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ (పరిపాలన రాజధాని), కర్నూలులో జ్యుడిషియల్ కేపిటల్ (న్యాయ రాజధాని) ఏర్పాటుచేయాలని సిఫార్సు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. – డిసెంబర్ 27, 2019 : జీఎన్ రావు కమిటీ నివేదిక.. బీసీజీ (బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూప్) ఇచ్చే నివేదికలను అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు హైపవర్ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. – డిసెంబర్ 29, 2019 : హైపవర్ కమిటీని ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. – జనవరి 3, 2020 : రాష్ట్ర సమగ్ర, సమతుల అభివృద్ధికి పరిపాలన వికేంద్రీకరణే ఏకైక మార్గమని.. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ కేపిటల్ ఏర్పాటుచేయాలని సిఫార్సు చేస్తూ సీఎం వైఎస్ జగన్‌కు నివేదిక ఇచ్చిన బీసీజీ. – జనవరి 17, 2020 : జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై అధ్యయనం చేసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి నివేదిక ఇచ్చిన హైపవర్ కమిటీ. – జనవరి 20, 2020 : హైపవర్ కమిటీ నివేదికపై చర్చించిన కేబినెట్.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన మంత్రివర్గం. ఆ బిల్లును తొలిసారి శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. బిల్లును ఆమోదించిన అసెంబ్లీ. – జనవరి 22, 2020 : బిల్లును అటు ఆమోదించకుండా.. ఇటు తిరస్కరించకుండా శాసన మండలిలో తొండాట ఆడిన టీడీపీ. – జూన్ 16, 2020 : రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును మరోసారి ఆమోదించిన శాసనసభ. – జూన్ 17, 2020 : శాసనసభ రెండోసారి ఆమోదించిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో అటు ఆమోదించకుండా.. ఇటు తిరస్కరించకుండా టీడీపీ సైంధవపాత్ర పోషించింది. ఏపీ లెజిస్లేచర్ అధికారులు గవర్నర్ ఆమోదానికి వీటిని పంపారు. గవర్నర్ ఆమోదం ఇక లాంఛనమే కనుక ఆ తదుపరి రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది. ప్రాంతీయ సమానాభివృద్ధి లక్ష్యంగా.. పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రాంతీయ సమానాభివృద్ధిని సాధించాలన్న బృహత్తరమైన లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఈ బిల్లులను ప్రతిపాదించింది. వీటిని శాసనసభ ఈ ఏడాదిలో రెండుసార్లు ఆమోదించింది. కానీ, ఈ రెండుసార్లూ శాసన మండలిలో టీడీపీ తనకున్న సంఖ్యాబలంతో ఆమోదం పొందకుండా అడ్డుకుంది. – ఈ ఏడాది జనవరి 20న తొలిసారి శాసనసభలో ఈ బిల్లులను ఆమోదించి మండలికి పంపగా.. అక్కడ జనవరి 22న గందరగోళ పరిస్థితుల నడుమ మండలి ఛైర్మన్ ఎటూ తేల్చకుండా సభను వాయిదా వేశారు. – శాసనసభ ఆమోదించిన బిల్లుపై మండలిలో ఎలాంటి తదుపరి చర్యలూ మూడు నెలలపాటు (నిర్ణీత గడువు) ముందుకు సాగకపోవడంతో దాని వ్యవధి పూర్తయింది. – మళ్లీ జూన్ 16న రెండోసారి పరిపాలనా వికేంద్రీకరణ–ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020, సీఆర్డీఏ చట్టం–2014 రద్దు బిల్లును అసెంబ్లీలో ఆమోదించి మండలికి పంపారు. – కానీ, 17న టీడీపీ కుటిల వైఖరివల్ల ఈ బిల్లులు ఆమోదం పొందలేదు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు దౌర్జన్యకాండకు దిగిన విషయం తెలిసిందే. మండలి ముందు మూడు ప్రత్యామ్నాయాలు నిజానికి.. రెండోసారి అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు శాసన మండలికి వచ్చినపుడు సభ ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉంటాయి. అవి.. – శాసనసభ ఆమోదించిన బిల్లును తిరస్కరించడం తొలి ప్రత్యామ్నాయం. – గతంలో ఇదే బిల్లును తిరస్కరించినప్పుడు మండలిలో ప్రతిపాదించిన సవరణలను చేయాలని పట్టుబట్టడం రెండో ప్రత్యామ్నాయం. – రెండోసారి వచ్చిన బిల్లుపై 30 రోజుల వరకూ క్రియారహితంగా ఉండటం మూడో ప్రత్యామ్నాయం. – ప్రస్తుత పరిస్థితుల్లో తొలి రెండు ప్రత్యామ్నాయాలు సాధ్యంకాలేదు. – 30 రోజులపాటు ఈ బిల్లుపై కౌన్సిల్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది కనుక ఆ బిల్లు ఆమోదం పొందినట్లుగా ఆర్టికల్ 197(2)(బి) ప్రకారం పరిగణిస్తారు. ప్రస్తుతం అదే జరిగింది. – మండలికి పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు రెండూ చేరి ఈ నెల 17వ తేదీకి 30 రోజులు పూర్తయ్యాయి కనుక శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు వీటిని గవర్నర్ ఆమోదం కోసం శనివారం రాజ్‌భవన్‌కు పంపారు. – గవర్నర్ ఆమోదం పొందిన పిదప బిల్లు చట్టం అవుతుంది కనుక పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటుచేయడానికి అవకాశం కలుగుతుంది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై ఎప్పుడేం జరిగిందంటే.. – సెప్టెంబర్ 13, 2019 : రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటుచేసిన ప్రభుత్వం. – డిసెంబర్ 20, 2019 : రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని.. అమరావతిలో శాసన రాజధాని (లెజిస్లేటివ్ కేపిటల్), విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ (పరిపాలన రాజధాని), కర్నూలులో జ్యుడిషియల్ కేపిటల్ (న్యాయ రాజధాని) ఏర్పాటుచేయాలని సిఫార్సు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీఎన్ రావు కమిటీ నివేదిక ఇచ్చింది. – డిసెంబర్ 27, 2019 : జీఎన్ రావు కమిటీ నివేదిక.. బీసీజీ (బోస్టన్ కన్సల్టెంగ్ గ్రూప్) ఇచ్చే నివేదికలను అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు హైపవర్ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. – డిసెంబర్ 29, 2019 : హైపవర్ కమిటీని ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. – జనవరి 3, 2020 : రాష్ట్ర సమగ్ర, సమతుల అభివృద్ధికి పరిపాలన వికేంద్రీకరణే ఏకైక మార్గమని.. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూలులో జ్యుడిషియల్ కేపిటల్ ఏర్పాటుచేయాలని సిఫార్సు చేస్తూ సీఎం వైఎస్ జగన్‌కు నివేదిక ఇచ్చిన బీసీజీ. – జనవరి 17, 2020 : జీఎన్ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై అధ్యయనం చేసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి నివేదిక ఇచ్చిన హైపవర్ కమిటీ. – జనవరి 20, 2020 : హైపవర్ కమిటీ నివేదికపై చర్చించిన కేబినెట్.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన మంత్రివర్గం. ఆ బిల్లును తొలిసారి శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. బిల్లును ఆమోదించిన అసెంబ్లీ. – జనవరి 22, 2020 : బిల్లును అటు ఆమోదించకుండా.. ఇటు తిరస్కరించకుండా శాసన మండలిలో తొండాట ఆడిన టీడీపీ. – జూన్ 16, 2020 : రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును మరోసారి ఆమోదించిన శాసనసభ. – జూన్ 17, 2020 : శాసనసభ రెండోసారి ఆమోదించిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో అటు ఆమోదించకుండా.. ఇటు తిరస్కరించకుండా టీడీపీ సైంధవపాత్ర పోషించింది. -
ఉద్యోగుల అంతర్గత చర్చలతో మాకేం సంబంధం లేదు
సాక్షి, అమరావతి: రాజధానిని విశాఖపట్నానికి తరలించే విషయంలో ఉద్యోగ సంఘాల అంతర్గత చర్చలతో తమకు ఏ మాత్రం సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఉద్యోగ సంఘాల చర్చల ఆధారంగా న్యాయస్థానాలు ఓ నిర్ణయానికి రావడానికి వీల్లేదని పేర్కొంది. దీనిపై హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. రాజధాని తరలింపు విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రాజధానిని విశాఖపట్నానికి తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై శుక్రవారం త్రిసభ్య ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. -
ఏపీ బాటలో ఉత్తరాఖండ్..
గైర్సైన్ : ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా గైర్సైన్ను ఎంపిక చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తివేంద్ర సింగ్ రావత్ ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఈ విషయాన్ని అసెంబ్లీలో పేర్కొన్నారు. గైర్సైను శాశ్వత రాజధానిగా చేయాలని కొంత కాలంగా పర్వత ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఉత్తరాఖండ్ జ్యుడీషియల్ క్యాపిటల్‌గా డెహ్రాడూన్, జ్యుడీసియల్ రాజధానిగా నైనిటాల్ కొనసాగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గైర్సైన్లో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించారు. అధికారుల నివాస భవనాలు సహా పలు భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. గైర్సైన్ ప్రాంత సమీపంలో విమానాశ్రయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. -
వికేంద్రీకరణే ముద్దు
-
ఉద్యమం ముసుగులో చంద్రబాబు అండ్ కో
-
హైపవర్ కమిటీ భేటీ
-
13 జిల్లాల సమగ్ర అభివృద్ధి
సాక్షి, అమరావతి: పరిపాలన ఒకేచోట కాకుండా వికేంద్రీకరణ ఎలా చేయాలి.. 13 జిల్లాల్లో సమాంతరంగా, సమంగా అభివృద్ధి ఎలా జరగాలనే దానిపై చర్చించినట్లు వికేంద్రీకరణపై ఏర్పాటైన హైపవర్ కమిటీ తెలిపింది. అభివృద్ధి కేవలం ఒకేచోట కేంద్రీకృతం కావడంవల్ల ఎంతో నష్టపోయినట్లు గత చరిత్ర చెబుతోందని.. అది పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని వివరించింది. అమరావతి రైతుల ప్రయోజనాలు కాపాడతామని కమిటీ తెలిపింది. జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదికలతోపాటు రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం, శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికలన్నింటిపై చర్చించినట్లు వివరించింది. హైపవర్ కమిటీకి నేతృత్వం వహిస్తున్న ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధ్యక్షతన కమిటీ రెండో సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది. వివరాలను కమిటీ సభ్యులు పేర్ని నాని, కురసాల కన్నబాబు, మోపిదేవి వెంకటరమణారావు వివరించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలనే అంశంపై చర్చించినట్లు పేర్ని నాని తెలిపారు. ప్రజల్లో ప్రాంతీయ భావోద్వేగాలు రాకుండా, అవి పెరిగే అవకాశాలు లేకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని, పరిపాలన అన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతం కావాలనే దానిపై సభ్యులు చర్చించినట్లు ఆయన తెలిపారు. అభివృద్ధిలో తనక్కూడా భాగస్వామ్యం ఉందని ప్రతిఒక్కరూ భావించేలా నిర్ణయాలు తీసుకోవాల్సి వుందన్నారు. ఈ నెల 13న కమిటీ మరోసారి సమావేశమవుతుందని, ఆ సమావేశంలో దాదాపు ఒక అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉందని పేర్ని నాని తెలిపారు. ప్రతి ఒక్కరి అభిప్రాయం, డిమాండ్, సూచనలను హైపవర్ కమిటీ చర్చిస్తుందని ఆయన స్పష్టంచేశారు. హైపవర్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి బుగ్గన. చిత్రంలో మంత్రులు ఉన్నతాధికారులు చంద్రబాబుకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి అక్కర్లేదా? కమిటీ సభ్యులు కన్నబాబు, మోపిదేవి వెంకట రమణారావు మాట్లాడుతూ.. చంద్రబాబుకు రాష్ట్ర సమగ్రాభివృద్ధి అక్కర్లేదా.. వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందడం ఇష్టంలేదా అని ప్రశ్నించారు. తన సొంత సంపద కోసం అమరావతిని సృష్టించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన చంద్రబాబుకు మిగతా ప్రాంతాలు నాశనమైపోయినా పర్వాలేదా అని ప్రశ్నించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని వారు స్పష్టంచేశారు. కాగా, ఏడు నెలల సీఎం వైఎస్ జగన్ పరిపాలన ఒక యజ్ఞంలా జరుగుతుంటే దాన్ని భగ్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్లకుండా చేసే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు రాజధాని అంశాన్ని తెరపైకి తెచ్చి రాద్ధాంతం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో ఎందుకు అపోహలు సృష్టించాలనుకుంటున్నారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. బాబు పాలనలో అణచివేత కాగా.. ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ విశాఖ వెళ్తే ఎయిర్‌పోర్టులో నిర్బంధించి తిరిగి వెనక్కి పంపింది.. అదే ఉద్యమం చేస్తున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అరెస్టు చేసింది.. కాపుల హక్కుల కోసం ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభంను అణచివేసి, ఆయన కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేసింది చంద్రబాబే అని మోపిదేవి, కన్నబాబు విమర్శించారు. తన పాలనలో ఇష్టానుసారం అణచివేతకు పాల్పడిన చంద్రబాబు ఇప్పుడు ప్రజాస్వామ్యం, గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసం ఇసుక, ఇంగ్లిష్ మీడియం, రాజధాని అంశాలపై రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు మంత్రులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, మేకతోటి సుచరిత, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం పాల్గొన్నారు. -
అందరి నోటా అదేమాట.. వికేంద్రీకరణే ముద్దు
‘అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడం ఇష్టం లేదా? సామాజిక న్యాయం జరగకూడదనుకుంటున్నారా? అభివృద్ధి అంతా ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కావాలన్నదే మీ ఉద్దేశమా? వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందంటే అడ్డుపడతారా? మీ స్వార్థం కోసం.. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అభివృద్ధి అంతా అమరావతిలోనే జరగాలనడం న్యాయమా? ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటూ మీరు చేసిందేమిటి? రాష్ట్రాభివృద్ధి గురించి ఏనాడైనా పట్టించుకున్నారా? గ్రాఫిక్స్‌తో చుక్కలు చూపించడం తప్ప ఏం చేశారు? ఇన్సైడర్ ట్రేడింగ్‌తో వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు సృష్టించుకోవడం తప్ప సామాన్య ప్రజానీకానికి ఏ విధంగానైనా లబ్ధి కలిగించారా?’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, ఆయనకు వంతపాడుతున్న ఎల్లో మీడియాపై నిప్పులు చెరిగారు. పాలన వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమన్న శివరామకృష్ణన్, జీఎన్‌రావు కమిటీలు, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ నివేదికలను అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ‘మీ హయాంలో ఎవరికీ మేలు చేయలేదు.. ఇప్పుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం పుణ్యమా అని మేలు జరగబోతుంటే సైంధవుడిలా అడ్డుపడుతున్నారు’ అంటూ ధ్వజమెత్తారు. బాబు తీరును నిరసిస్తూ అటు అనంతపురం నుంచి ఇటు శ్రీకాకుళం వరకు అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కారు. తీరు మారకపోతే మా ప్రాంతాల్లో అడుగు పెట్టలేరంటూ హెచ్చరించారు. ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూడటం సబబుకాదని హితవు పలికారు. సాక్షి, విశాఖపట్నం: విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయడం ద్వారా ఉత్తరాంధ్ర అభివృద్ధికి బాటలు వేయాలన్న నినాదాలు హోరెత్తాయి. నగరంలోని అన్ని నియోజకవర్గాలతో పాటు జిల్లా అంతటా శుక్రవారం భారీ ర్యాలీలు జరిగాయి. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలంటూ అన్నివర్గాల ప్రజలు నినదించారు. దక్షిణ నియోజకవర్గ ప్రజలు ర్యాలీ జరిపారు. అనకాపల్లి, పెందుర్తి, చోడవరం, గాజువాక, మాడుగుల నియోజకవర్గాల్లో ప్రజలు కదం తొక్కారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ చంద్రబాబు అమరావతి పరిసరాల్లో తన బినామీల ఆస్తులను కాపాడుకోవడానికే మూడు ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. పాలన వికేంద్రీకరణతోనే అభివృద్ధి వదరయ్యపాళెం/పలమనేరు/శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా సత్యవేడులో మహిళలు, విద్యార్థులు ఆర్టీసీ బస్టాండ్ నుంచి మూడు రోడ్ల కూడలిలోని గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లాలోని పలమనేరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, పూతలపట్టు తదితర నియోజకవర్గాల్లో ర్యాలీలు, మానవహారాలు, కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి. సత్యవేడులో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ.. అధికార, పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. పలమనేరులో ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ సీఎం నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తుంటే.. చంద్రబాబుకు వచ్చిన బాధేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండలో ర్యాలీ చేస్తున్న ఎమ్మెల్యే కళావతి అన్నింటికీ అమరావతే అనడం సరికాదు పాలన వికేంద్రీకణ జరగాలని ఆకాంక్షిస్తూ ‘తూర్పు’గోదావరి జిల్లా అంతటా శుక్రవారం ఉద్యమం ఊపందుకుంది. అమలాపురంలో మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు, ఎన్సీసీ, స్కౌట్ విద్యార్థులు ఎర్రవంతెన నుంచి హైస్కూల్ సెంటర్ వరకూ ర్యాలీలో పాల్గొన్నారు. తునిలో ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర నిర్వహించారు. రాజమహేంద్రవరం కోటగుమ్మం సెంటర్ నుంచి కోటిపల్లి బస్టాండ్ వరకూ ర్యాలీ నిర్వహించి నినాదాలు చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా రాజమహేంద్రవరాన్ని సాంస్కృతికంగా అభివృద్ధి చేస్తామని గృహనిర్మాణ శాఖామంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజుపేర్కొన్నారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ తదితరులు కోటిపల్లి బస్టాండ్ వద్ద చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేసి బైఠాయించారు. రామచంద్రాపురంలో ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో మహిళలతో ర్యాలీ నిర్వహించారు. అనంతపురంలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న యువత ఒకే సామాజిక వర్గానికి న్యాయం చేస్తారా? కడప కార్పొరేషన్: అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కడప ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. అమరావతి పేరిట ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడిన చంద్రబాబు నాయుడు కేవలం తన సామాజిక వర్గం ప్రయోజనాలను కాపాడటానికే మూడు రాజధానుల అంశంపై రాద్ధాంతం చేస్తున్నారని వైఎస్సార్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఆలూరు ఖాజా రహమతుల్లా విమర్శించారు. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకోవద్దు అనంతపురం: అభివృద్ధి, పాలన వికేంద్రీకరణ జరగాలని కోరుతూ అనంతపురంలో భారీ ర్యాలీ జరిగింది. ఈ మేరకు కలెక్టర్ గంధం చంద్రుడుకు విద్యార్థులు వినతిపత్రం సమర్పించారు. గిరిజన విద్యార్థి సంఘం, ఎంఐఎం విద్యార్థి సంçఘం, వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఇక్బాల్, ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, ప్రాథమిక విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సీఈఓ సాంబశివారెడ్డి మద్దతు ప్రకటించారు. హిందూపురంలో టీడీపీ వైఖరిపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మూడు ప్రాంతాల అభివృద్ధి విషయంలో స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఆందోళనలను అడ్డుకునే యత్నం చేయగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. థ్యాంక్యూ.. సీఎం కర్నూలు (రాజ్‌విహార్): కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలనే ఆలోచన కార్యరూపం దాల్చాలని ఆకాంక్షిస్తూ కర్నూలు నగరంలోని రాజ్‌విహార్ నుంచి కలెక్టరేట్ వరకు విద్యార్థులు, ప్రజా సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ‘థ్యాంక్యూ సీఎం జగన్ సర్’ అంటూ నినదించారు. కార్యక్రమానికి మద్దతు ప్రకటించిన పాణ్యం, కర్నూలు, కోడుమూరు ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, సుధాకర్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వం నడుచుకుంటుందని స్పష్టం చేశారు. నంద్యాల, దేవనకొండ, ఆస్పరి, ఆలూరు, మంత్రాలయంలో ర్యాలీ చేపట్టారు. సమగ్రాభివృద్ధి కోరుతూ.. పాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ విజయనగరం జిల్లావ్యాప్తంగా యువకులు, విద్యార్థులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శనలు, ర్యాలీలు హోరెత్తాయి. విజయనగరం మూడు రోడ్ల జంక్షన్లో మానవ హారం నిర్వహించారు. బొబ్బిలి, కురుపాం, పార్వతీపురం, సాలూరు, కొత్తవలస, భోగాపురంలో ర్యాలీలు జరిగాయి. నెల్లూరు రూరల్, ఆత్మకూరు పట్టణం, చేజెర్ల, సంగం, ఏఎస్‌పేట, అనంతసాగరం మండలాల్లోనూ ర్యాలీలు, ప్రదర్శనలు, ర్యాలీలు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, పోడూరు, ఏలూరు నగరం, ద్వారకా తిరుమల, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు మండలం బాదంపూడి తదితర ప్రాంతాల్లో బైక్, కార్ల ర్యాలీలు, ప్రదర్శనలు, మానవహారం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, డీసీసీబీ చైర్మన్ కవురు శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ, బొద్దాని శ్రీనివాస్, మంచెం మైబాబు, ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డీ బలరాం, ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, కొట్టు విశాల్ మద్దతు పలికారు. శ్రీకాకుళం జిల్లాలో పలుచోట్ల ర్యాలీలు, చర్చాగోష్టులు నిర్వహించారు. సోంపేటలో‘అధికారం–అభివృద్థి–వికేంద్రీకరణ’ అనే అంశంపై జరిగిన చర్చాగోష్టిలో.. ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ.. వికేంద్రీకరణతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని మేధావుల ఫోరం చెబుతోందని స్పష్టం చేశారు. టెక్కలిలో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజధాని వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారన్నారు. అమరావతిలో భూములు కొన్న నాయకులే దీనిపై రాద్ధాంతం చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
అభివృద్ధి చేస్తామంటే..బాబు అడ్డుకుంటున్నారు
-
అన్నీ ప్రాంతాల అభివృద్ధే జగన్ ధ్యేయం
-
రాజధాని ఎక్కడనేది రాష్ట్ర ప్రభుత్వ అధికారం
సాక్షి, అమరావతి: రాజధాని ఎక్కడ పెట్టుకోవాలన్నది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారమని, ఈ విషయంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని అంశంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని తాను ఎప్పుడూ చెప్పలేదన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రతిపక్షాలు కలిగిస్తున్న అపోహలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ రూపొందించిన కరపత్రాన్ని ఆదివారం విజయవాడలో కన్నా ఆవిష్కరించారు. మూడు రాజధానుల ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం తనంతట తానుగా ఎటువంటి జోక్యం చేసుకోదని, ఇది బీజేపీ తరఫున అధికారికంగా చేస్తున్న ప్రకటన అని జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించారు. ‘నేనూ దానికి తేడాగా చెప్పడం లేదు కదా?’ అని కన్నా ప్రశ్నించారు. మీడియానే భిన్నంగా అర్థం చేసుకుందన్నారు. రాజకీయ ఏకాభిప్రాయంతోనే రాజధానిగా అమరావతి ఏర్పాటైందని, ఇప్పుడు దాన్ని మార్చే అధికారం జగన్ ప్రభుత్వానికి లేదన్నారు. -
చంద్రబాబువి నిరాధార ఆరోపణలు
సాక్షి, అమరావతి: రాజధానితోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధిపై తన నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను కమిటీ కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు ఖండించారు. సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం చెప్పినట్టుగా నివేదిక ఇచ్చారని చంద్రబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. చంద్రబాబు ఆరోపణలన్నీ నిరాధారం, భ్రాంతితో కూడినవని ఆదివారం ఒక ప్రకటనలో జీఎన్ రావు పేర్కొన్నారు. నిపుణుల కమిటీలో అన్ని రంగాలకు చెందిన అపార అనుభవమున్న నిపుణులు, నిష్ణాతులు ఉన్నారని తెలిపారు. కమిటీలోని సభ్యులకు పట్టణ ప్రణాళిక, డిజైనింగ్, నగరాభివృద్ధి, ప్రపంచ నగరాల అభివృద్ధి అంశాల్లో విశేష అనుభవం, నైపుణ్యం ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రజల సలహాలను పరిగణనలోకి తీసుకుని సూచనలు చేశాం.. కమిటీలో సభ్యులను ప్రభావితం చేసి నివేదిక తయారు చేశారనడం అర్థరహితమని జీఎన్ రావు అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు, ప్రాజెక్టుల పూర్తికి అనుసరిస్తున్న వ్యూహాలపై మాత్రమే ప్రభుత్వంలోని వ్యక్తులతో మాట్లాడాం తప్ప నివేదికలోని అంశాలపై ఎవ్వరితోనూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతోపాటు ప్రజల నుంచి సలహాలు, అభిప్రాయాలను స్వీకరించామని తెలిపారు. రాజధానితోపాటు 13 జిల్లాల్లో మానవాభివృద్ధి సూచికల పరిస్థితులు, అభివృద్ధి, వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు ప్రజల ఆకాంక్షలు, సూచనలకు అనుగుణంగా రాజధానితోపాటు అన్ని ప్రాంతాల అభివృద్ధికి సూచనలు చేశామని ఆయన వివరించారు. ఎవరి ప్రమేయం లేదు.. నివేదిక తయారుచేసే సమయంలో కమిటీ సభ్యులకు కానీ, తనకు కానీ ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు లేదా ప్రభుత్వంలోని వ్యక్తులు ఎలాంటి మార్గదర్శకాలు ఇవ్వలేదని, వారి నుంచి ఎటువంటి సూచనలు తీసుకోలేదని జీఎన్ రావు స్పష్టం చేశారు. సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం మార్గదర్శకాల ఆధారంగా నివేదిక తయారు చేశామని చంద్రబాబు అనడం నిరాధారం, అవాస్తవం, ఊహాజనితమని స్పష్టం చేశారు. కన్వీనర్‌గా కమిటీలోని సభ్యులకు తాను సహాయ సహకారాలు అందించానని ఆయన పేర్కొన్నారు. ఎవరి ప్రమేయం లేకుండా కమిటీ సభ్యులందరూ కలసి సమష్టిగా రహస్యంగా నివేదిక రూపొందించారని తెలిపారు. -
మూడు రాజధానులు మంచిదే
తిరుమల: మూడు రాజధానుల యోచనను జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సమర్థించారు. శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో ఆయన తిరుమల వేంకటేశ్వరస్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా.. ఆలయ అధికారులు పట్టువస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తదుపరి ఆలయం వెలుపల రాపాక మీడియాతో మాట్లాడుతూ మూడు రాజధానుల నిర్ణయం సబబేనన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని, నిధుల్ని అక్కడే వెచ్చించి ఇతర ప్రాంతాల్ని నిర్లక్ష్యం చేశారని అన్నారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గత ప్రభుత్వం అమరావతిలో రైతుల భూముల్ని బలవంతంగా లాక్కుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయంతో రైతులకు ఇబ్బందేనని, అమరావతి రైతులను సర్కారు ఆదుకోవాలని కోరారు. నవరత్నాలు లాంటి సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. మంచి చేస్తే మద్దతిస్తామని.. చెడు చేస్తే వ్యతిరేకిస్తామని చెప్పారు. -
అమరావతిలో రాజధాని ఎక్కడ ఉంది
-
గత ప్రభుత్వం అప్పుల ఊబిలోకి నెట్టింది
-
ఏ ప్రాంతానికి అన్యాయం జరగదు
-
సీఎం ప్రకటనను అందరూ స్వాగతిస్తున్నారు
-
సీఎం జగన్ ప్రకటనపై వక్రభాష్యం
-
‘ఆయనను జానీ వాకర్ దివాకర్ రెడ్డి అనాలేమో’
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రానికి మూడు రాజధానులు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యలను నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రారెడ్డి స్వాగతించారు. అభివృద్ధి అనేది వికేంద్రీకరణ ద్వారానే జరుగుతుందని ఆయన అన్నారు. రాయలసీమకు పట్టిన శని చంద్రబాబు అని ఎమ్మెల్యే రవిచంద్రారెడ్డి బుధవారమిక్కడ విమర్శించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమలో కరువు పోయిందని అన్నారు. సీమ ప్రజల ఆకాంక్షలను ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని ఎమ్మెల్యే ప్రశంసించారు. రాష్ట్ర ప్రజలకు సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో మూడు రాజధానులు ఉండాలని ముఖ్యమంత్రి చెబుతున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లా అభివృద్థి అంతా ఒకే దగ్గర కాకుండా అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పి మాట మార్చారని ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రారెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లాగానే అమరావతిని చేస్తానంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారని, అభివృద్ధి హైదరాబాద్‌లో కేంద్రీకృతం కావడం వల్లే రాష్ట్రం విడిపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎన్నోసార్లు సీమ బిడ్డగా హైకోర్టును రాయలసీమలో పెట్టాలని కోరామన్నారు. సీమ ప్రాంతానికి చెందిన చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి రాయలసీమకు చేసిందేమీ లేదన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలను చంద్రబాబు మాయ మాటలతో మోసం చేశారని ధ్వజమోత్తారు. సీఎం వైఎస్ జగన్‌కు మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. కొన్ని మెరిగే కుక్కలను పక్కన పెట్టుకుని సీఎం జగన్‌పై విమర్శలు చేయిస్తున్నారన్నారు. ‘‘సీమలో పుట్టిన చంద్రబాబుకు అక్కడ మూడు సీట్లు వచ్చాయంటే ఆయన పాలన ఎలా ఉందో అర్థమవుతుంది. రాయలసీమ ప్రజల ఆకాంక్షను వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చుతున్నారు. సోషల్ ఎకనామిక్ సర్వే ప్రకారం రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు బాగా వెనుకబడి ఉన్నాయి. జీఎన్‌రావు కమిటీ నివేదిక కూడా ప్రజాభిప్రాయం మేరకే వస్తుందని భావిస్తున్నా. సీఎం జగన్ నిర్ణయానికి రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ నాయకులు అనుకులమో, వ్యతిరేకమో స్పష్టం చేయాలి. రాజధానిలో చంద్రబాబు తాను కొన్న భూములకు రేట్లు తగ్గిపోతాయని భయపడుతున్నారు. ఇక జేసీ దివాకర్ రెడ్డిని జేసీ దివాకర్ రెడ్డి అనాలో ...జానీ వాకర్ దివాకర్ రెడ్డి అనాలో అర్థం కావడం లేదు. రెండు పెగ్గులు వేస్తే ఏమి మాట్లాడతారో ఆయనకే అర్థం కాదు.’’ అంటూ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. -
అమరవావతి పేరుతో బాబు పెద్ద గుదిబండ తయారుచేసి పెట్టారు
-
మూడు రాజధానులు ఉంటే తప్పా..?
సాక్షి, తాడేపల్లి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన బినామీలు అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొన్నారని, అందుకే అమరావతి రాజధాని అంటున్నారని అనకాపల్లి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయంపై ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. బుధవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ నిర్ణయాన్ని ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తున్నారని, ఆయన ప్రకటనతో రాష్ట్రంలో పండగ వాతావరణం నెలకొందన్నారు. హైకోర్టు వస్తుందనడంతో రాయలసీమ ప్రజలు ఆనందంగా ఉన్నారని.. లెజిస్లేటివ్ రాజధానితో అమరావతి ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు కింద స్థాయి వరకు అందాలని ఎలా భావిస్తామో పరిపాలన కూడా అదేవిధంగా అందాలని సీఎం భావిస్తున్నారని పేర్కొన్నారు. పచ్చ కామెర్లు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు.. టీడీపీ నేతలు రాజధానిలో భూములు కొన్నారు కాబట్టి వైజాగ్ లో వైస్సార్సీపీ నేతలు భూములు కొన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీపై గుడివాడ అమర్నాథ్ విరుచుకుపడ్డారు ప్రజలకు చంద్రబాబు నమ్మక ద్రోహం చేశారు అనేక రాష్ట్రాల్లో మల్టిపుల్ రాజధానులు ఉన్నాయని.. అమరావతి రాజధాని అనేది ఒక పెద్ద కుంభకోణమని గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన అధికారాన్ని చంద్రబాబు దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఓట్లేసి గెలిపించిన ప్రజలకు చంద్రబాబు నమ్మక ద్రోహం చేశారని, రాజధానిలో ఎకరాకు 2 వేలు ఖర్చు చేసినా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతోందని తెలిపారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను చంద్రబాబు పరిగణనలోకి తీసుకోలేదని, అయిదు కోట్ల మంది ప్రజలు ఉంటే 1400 మంది అభిప్రాయం తీసుకొని నిర్మిస్తారా అని ప్రశ్నించారు. రాజదాన్ని అభివృద్ధి చేస్తే రాజధానిలో లోకేష్ ఎందుకు ఓడిపోయారని నిలదీశారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి అమరావతి పారిపోయి వచ్చారని, చంద్రబాబు రాజధాని ప్రాంతంలో కనీసం ఇల్లు కూడా నిర్మించుకోలేదని దుయ్యబట్టారు.అమరావతి ఉంటే చాలు మిగతా ప్రాంతాలు అవసరం లేదన్న విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని, ఉత్తరాంధ, రాయలసీమ ప్రాంతాల ద్రోహిగా బాబు మిగిలిపోతారని మండిపడ్డారు. అంతర్జాతీయ రాజధాని అని చెప్పి అయిదు వేల కోట్లు ఖర్చు చేశారని, రాజధాని నిర్మాణానికే లక్ష కోట్లు ఖర్చు చేస్తే సంక్షేమ కార్యక్రమాలు పరిస్థితి ఏంటని గుడివాడ అమర్నాథ్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ ట్విటర్.. చంద్రబాబు నాయుడు ట్విటర్ ఒకరే నడుపుతున్నట్లు ఉంది. రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటే తప్పా..? రాయలసీమ వెళ్లి అక్కడ రాజధాని ఏర్పాటు చేయాలని పవనే చెప్పారు. వైజాగ్ కొత్తగా అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. పరిపాలన రాజధానికి 300 ఎకరాలు ఉంటే సరిపోతుంది. చంద్రబాబు దత్త పుత్రుడుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు కానుకగా పరిపాలన రాజధాని ప్రకటనని ఉత్తరాంధ్ర ప్రజలు భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ పార్టీలను మూసుకోవాలి. పవన్ మాటలకు నిలకడ లేదు. ఉదయం ఒక మాట సాయంత్రం ఒక మాట మాట్లాడుతాడు’ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. -
సీఎం వైఎస్ జగన్ నిర్ణయంపై ప్రజలు సంతోషంగా ఉన్నారు
-
అభివృద్ధిపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు
-
రాజధాని@3
-
కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలి
సాక్షి, నంద్యాల : కర్నూలులో రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ విద్యార్థి, యువజన, జేఏసీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే శిల్పారవి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చిన విద్యార్థి సంఘం నాయకులు, ఎమ్మెల్యే ఇంటి ఎదుట ధర్నా చేశారు. విద్యార్థి సంఘాల జేఏసీ నాయకులు రాజునాయుడు, చంద్రప్ప, శ్రీరాములు, రామచంద్రుడు, రవీంద్రనాయక్ మాట్లాడుతూ రాయలసీమ నుంచి రాష్ట్రప్రతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు అయినా ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కర్నూలును రాజధాని చేయాల్సి ఉన్నా.. గత ప్రభుత్వం ఏకపక్షంగా కోస్తా ప్రాంతానికి తరలించి రాయలసీమకు తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. ధర్నా అనంతరం ఎమ్మెల్యే శిల్పారవిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం అనాలోచితంగా రాజధానిని ముంపు ప్రాంతంలో ఏర్పాటు చేసి, శాశ్వత భవనాలు నిర్మించకుండా రూ.కోట్లు తాత్కాలిక భవనాలకు వెచ్చించిందన్నారు. కర్నూలు రాజధానిని త్యాగం చేస్తే హైదరాబాద్ రాజధాని అయ్యిందని, మళ్లీ మనకు రాజధాని అవకాశం వచ్చినా గత ప్రభుత్వం ద్రోహం చేసిందని విమర్శించారు. రాజధాని, హైకోర్టు ఏర్పాటు అంశాలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే వారికి హామీనిచ్చారు. -
ఏపీ రాజదానిలో బడాబాబుల కబ్జా పర్వం
-
రాజధాని కాంట్రాక్టర్లకు డబ్బే.. డబ్బు!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ‘ముఖ్య’ నేత కమీషన్లకు పోలవరం ప్రాజెక్టు తరువాత రాజధాని అమరావతి కల్పతరవుగా మారింది. ఇందులో భాగంగా అటు పోలవరం ప్రాజెక్టులోనూ, ఇటు రాజధాని ప్రాజెక్టుల్లోని కాంట్రాక్టర్లను ‘ముఖ్య’ నేత ప్రత్యేకంగా చూస్తున్నారు. నాలుగేళ్లయినా రాజధానిలో ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేపట్టని విషయం విదితమే. అయితే ఎన్నికలకు ముందు చంద్రబాబు సర్కార్ ఇప్పుడు వేల కోట్ల రూపాయల పనులకు టెండర్లను ఆహ్వానిస్తోంది. ఎవ్వరికీ లేని విధంగా రాజధాని కాంట్రాక్టర్లకు ఏకంగా 15 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తప్పు అని న్యాయ, ఆర్థిక శాఖలు చెప్పినప్పటికీ కూడా ఆయన పట్టించుకోలేదు. తొలి దశలో భాగంగా మొత్తం రూ. 48,115 కోట్ల విలువవైన ప్రాజెక్టులకు టెండర్లను ఆహ్వానించాలని నిర్ణయించారు. టెండర్ల నిబంధనల్లో పది శాతమే మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా చెల్లించాలని ఉన్నా.. ఆ నిబంధనలు తుంగలోతొక్కి 15 శాతానికి పెంచేశారు. ఈ లెక్కన రాజధాని కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల కింద రూ. 7,217.25 కోట్లను చెల్లించనున్నారు. ఇప్పటికే టెండర్ల ఖరారైన ప్రాజెక్టులతో పాటు భవిష్యత్‌లో చేపట్టే ప్రాజెక్టుల కాంట్రాక్టర్లకు కూడా 15 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు చెల్లించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా అమరావతి బాండ్లతో పాటు రైతుల నుంచి తీసుకున్న వేల ఎకరాలను బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టి సీఆర్డీఏ ద్వారా రూ. 10 వేల కోట్లు అప్పు చేయాలని కూడా నిర్ణయించారు. ఈ అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వనుంది. ఈ విధంగా అప్పులు చేసి తెచ్చిన నిధులను కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ కింద చెల్లించనున్నారు. దుండుకోవడానికే పెంపు.. పెంచిన మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల నుంచి పెద్ద మొత్తంలో ‘ముఖ్య’ నేత కమీషన్లను దండుకోనున్నారని ఉన్నతస్థాయి అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అందుకే పది శాతం ఉన్న మొబిలైజేషన్ అడ్వాన్స్‌లను ప్రత్యేకంగా రాజధాని కాంట్రాక్టర్ల కోసం పదిహేను శాతానికి పెంచారని, విలువైన మెటీరియల్ వంక పెడుతున్నారని ఆ వర్గాలు విమర్శిస్తున్నాయి. సీఎం చంద్రబాబు ఏమి చేసిన సింగపూర్ కంపెనీల ప్రయోజనాలకేనని, అడ్వాన్స్‌లు పెంచి చివరకు సింగపూర్ కంపెనీలకే రాజధానిని కట్టబెడతారని ఆ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అసలే రాష్ట్రం రెవెన్యూ లోటుతో పాటు అప్పుల భారంతో సతమతం అవుతుంటే.. మళ్లీ అప్పులు తెచ్చి దోచుకునేందుకు అడ్వాన్స్‌లు పెంచడం దారుణం అని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రెవెన్యూ లోటులో ఉన్న ఏ రాష్ట్రం కూడా తాత్కాలిక నిర్మాణాల పేరుతో వేల కోట్ల రూపాయలు వృథా చేయదని, ఇలా మన రాష్ట్రంలోనే జరుగుతోందని ఆయన చెప్పారు. రాజధాని రహదారులు, ఇతర పనులను భారీ అంచనాలతో రూపొందించారని, దీని వల్ల కాంట్రాక్టర్లతో పాటు ‘ముఖ్య’ నేత భారీగా ఖజానా నుంచే ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారని, ఇలాంటి దోపిడీ ఎక్కడా చూడలేదని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాజధానికి సంబంధించి ఏ ప్రాజెక్టు చేపట్టినా తొలుతే అంచనాలను ఎక్కువగా రూపొందిస్తున్నారని సీఆర్డీఏలో పనిచేస్తున్న సాంకేతిక అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇప్పటికే ఖరారైన టెండర్లతో పాటు కొత్తగా ఆహ్వానించే టెండర్లు దక్కించుకునే కాంట్రాక్టర్లకు కూడా పది హేను శాతం మొబిలైజేషన్ చెల్లించాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. సీఆర్డీఏ అప్పులు ప్రణాళిక ఇలా ఉంది – ఆంధ్రా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, విజయ బ్యాంకు నుంచి రూ. 2,060 కోట్లు అప్పునకు సీఆర్డీఏ దరఖాస్తు చేసింది. ఈ రుణాల మంజూరుకు న్యాయశాఖ ఆమోదం రావాల్సి ఉంది. – హడ్కో నుంచి రూ.1,275 కోట్లను అప్పు చేశారు. ఇందులో ఇప్పటికి రూ. 900 కోట్లు వ్యయం చేశారు. హడ్కో నుంచి మరో రూ. 6,225 కోట్ల అప్పునకు దరఖాస్తు చేశారు. హడ్కో పరిశీలనలో ఉంది. – రూ. 3,306 కోట్ల అప్పునకు ప్రపంచ బ్యాంకుకు దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తు పరిశీలనలో ఉంది. రాజధాని రైతుల ఫిర్యాదు మేరకు స్వతంత్ర కన్సల్టెంట్ ద్వారా ప్రపంచ బ్యాంకు అధ్యయనం చేయిస్తోంది. – ప్రభుత్వ గ్యారెంటీతో రూ. 10,000 కోట్లు అప్పు చేసేందుకు వివిధ బ్యాంకులకు ప్రతిపాదనలను పంపించారు. – అమరావతి బాండ్ల ద్వారా రూ.2,000 కోట్లు అప్పు చేస్తున్నారు. -
రాజధాని కాంట్రాక్టర్లకు అ‘ధనం’
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో కాంట్రాక్టర్లు పవర్‌ఫుల్‌గా తయారయ్యారు. కాంట్రాక్టర్ల మాటే వేదంగా మారిపోయింది. సాక్షాత్తూ ముఖ్యమంత్రే వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. రోడ్ల నిర్మాణం, ఇతర పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు కోరిందే∙తడవుగా నిబంధనలు, జీవోలు, చట్టాల్లో సవరణలు జరిగిపోతున్నాయి. టెండర్ నిబంధనలకు సైతం తిలోదకాలు ఇస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా పట్టించుకోవడం లేదు. దీంతో ఈ వ్యవహారాలన్నీ భవిష్యత్తులో తమ మెడకు చుట్టుకుంటాయని అధికారులు ఆందోళన చెందుతున్నారు. అమరావతిలో పనులు ఖరీదట! అమరావతిలో కాంట్రాక్టర్లకు మెటీరియల్ కోసం అంటూ అదనంగా 5 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకోసం గతంలో కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందాలను సవరించడంతోపాటు టెండర్ నిబంధనలను సడలించాలని ఆదేశించారు. గతంలో జారీచేసిన జీవోలు 94, 50 ప్రకారం కాంట్రాక్టర్లకు 10 శాతం మాత్రమే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు చెల్లించాల్సి ఉంది. టెండర్ ఒప్పందం చేసుకున్న తరువాత కాంట్రాక్టు విలువలో 2.50 శాతం, మిషనరీ తెచ్చిన సమయంలో 2.50 శాతం, మెటీరియల్ కోసం 5 శాతం.. మొత్తం కలిపి 10 శాతం మాత్రమే మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు చెల్లించాలి. అయితే రాజధానిలో పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు అదనంగా మరో 5 శాతం చెల్లించాలని ప్రతిపాదించారు. రాజధానిలో పనులు చాలా ఖరీదుతో కూడినవని, స్పెషలైజ్డ్ మెటీరియల్ కాంట్రాక్టర్లు సమకూర్చుకోవాల్సి ఉందని, ఇందుకోసం అధికంగా వ్యయం అవుతుందని అమరావతి డెవలప్మెంట్ కార్పొషన్ పేర్కొంది. టెండర్ నిబంధనల్లో సడలింపులు కాంట్రాక్టర్లు, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చేసిన ప్రతిపాదనను మున్సిపల్ శాఖ(సీఆర్డీఏ) తిరస్కరించింది. అదనంగా 5 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు చెల్లించడం టెండర్ నిబంధనలకు విరుద్ధమని స్పష్టం చేసింది. టెండర్లు ఖరారైన తరువాత నిబంధనలను సడలించడంతో పాటు ఎలాంటి మినహాయింపులు ఇవ్వడానికి వీల్లేదని ఆర్థిక శాఖ తేల్చిచెప్పింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను ఉదహరిస్తూ టెండర్ నిబంధనలను సవరించడం, అదనంగా మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం సాధ్యం కాదని న్యాయ శాఖ కూడా పేర్కొంది. ఆర్థిక, న్యాయ, మున్సిపల్ శాఖల అభిప్రాయాలను సీఎం చంద్రబాబు లెక్కచేయలేదు. టెండర్ నిబంధనల్లో సడలింపులు ఇస్తూ అగ్రిమెంట్లలో సప్లిమెంటరీ ఒప్పందాలను చేసుకుంటూ బ్యాంకు గ్యారెంటీతో సంబంధం లేకుండా రాజధాని కాంట్రాక్టర్లకు అదనంగా 5 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ అదనపు మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల సదుపాయం ప్రస్తుతం రాజధానిలో పనులు చేస్తునన కాంట్రాక్టర్లతోపాటు భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టుల కాంట్రాక్టర్లందరికీ వర్తింపజేయాలని సీఎం నిర్ణయించారు. -
రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం మక్కీకి మక్కి
-
అరచేతిలో స్వర్గం అమరావతి స్వప్నం
-
రాజధాని, పోలవరానికి మేం అడ్డుకాదు
తాడేపల్లి రూరల్ (మంగళగిరి): రాష్ట్ర రాజధానికి, పోలవరానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అడ్డుకాదని, ఈ రెండింటి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసే అవినీతికి మాత్రమే అడ్డు అని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో రైతులను భయభ్రాంతులకు గురిచేస్తూ, ప్రభుత్వం భూసేకరణ నోటీసును ప్రకటించటంపై ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం ఆర్కే రైతులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు రాజధానికి, పోలవరానికి వైఎస్సార్సీపీ వ్యతిరేకమంటూ చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం రాజధాని ప్రాంతానికి వచ్చిన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భూములిచ్చిన రైతులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, రాజధాని నిర్మాణం ఇక్కడే జరుగుతుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చే సమయానికి ప్రభుత్వం బలవంతంగా లాక్కున్న భూములను వెనక్కివ్వడానికి సైతం వెనుకాడబోమని వైఎస్ జగన్ తెలిపారని వివరించారు. పోలవరం ప్రతిపాదనలు చేసిందే వైఎస్సార్ పోలవరం ప్రాజెక్టుకు అసలు ప్రతిపాదనలను చేసిందే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని, దాన్ని వైఎస్ జగన్ ఎలా అడ్డుకుంటారని ఆర్కే ప్రశ్నించారు. రాజధాని, పోలవరం పేర్లతో కోట్ల రూపాయిలు దండుకుంటున్న చంద్రబాబు అక్రమ సంపాదనకే వైఎస్సార్సీపీ అడ్డు అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం రాజధానిని నిర్మిస్తానంటే ప్రపంచ బ్యాంకు వద్దకు ఎందుకు అప్పు కోసం వెళ్తున్నారని ఆయన నిలదీశారు. పోలవరంలో అవినీతి జరుగుతోందని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని గుర్తుచేశారు. వాటికి సమాధానం చెప్పకుండా వైఎస్సార్సీపీని విమర్శించడమేంటని ప్రశ్నించారు. -
రైతు కన్నీళ్ళతో వ్యాపారమా!
-
అక్రమాలు అనంతం
* నిజనిజాలు తేల్చకుండా ప్లాట్ల కేటాయింపునకు నోటిఫికేషన్ * 'సాక్షి'లో వచ్చిన పేర్లలో కొన్నింటిని తొలగించారు * మిగిలినవి రాలేదు కదా అంటూ బుకాయింపు * కుమిలిపోతున్న అనంతవరం బాధితులు * పట్టించుకోని సీఆర్డీఏ అధికారులు రాజధాని గ్రామం అనంతవరంలో అక్రమాల నిగ్గుతేల్చకుండానే ప్లాట్ల కేటాయింపునకు సీఆర్డీఏ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో భూములను మాయం చేసి రాయించుకున్నవారు... భూమి లేకపోయినా ఉన్నట్లు రికార్డులు సష్టించుకున్నవారు మాత్రం దర్జాగా తిరుగుతుంటే.. భూములు పోగొట్టుకున్న బాధితులు మాత్రం లోలోన కుమిలిపోతున్నారు. మాయమైన తమ భూముల పరిస్థితి గురించి సీఆర్డీఏ అధికారుల వద్ద మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని నిర్మాణం కోసం దేశానికి అన్నం పెట్టే రైతుల భూములను లాక్కున్న ప్రభుత్వం వారికి జరుగుతున్న అన్యాయంపై నోరెత్తడం లేదు. అధికార పార్టీ నేతల జేబులు నింపే విషయంలో వారికి పూర్తి మద్దతు ఇస్తుండడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని గ్రామాల్లో రైతులకు చెందిన భూములు సెంట్ల రూపంలో మాయమైన బాగోతంపై సాక్షి వరుస కథనాలు ఇచ్చిన విషయం తెలిసిందే. గత నెల 16న ‘రాజధాని గ్రామాల్లో అవినీతి సెంటు’ శీర్షికన వచ్చిన కథనంలో ప్రచురించిన పేర్లలో కొందరివి మాత్రం సరిచేశారు. పత్రికలో రాని పేర్లకు సంబంధించి ఏ ఒక్కరివీ సరిచేయలేదు. అదేమని అడిగితే.. ‘సాక్షిలో వచ్చినవి అవే కదా’ అంటూ సీఆర్డీఏ అధికారులు సమాధానం ఇస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై వివక్ష.. రాజధాని కోసం భూములు వదులకున్న రైతులకు ప్రభుత్వం ఎంత చేసినా రుణం తీరదని ముఖ్యమంత్రి పదేపదే చెబుతూనే ఉన్నారు. మరోవైపు అధికార పార్టీకి చెందిన నాయకులు మాత్రం మరింత రెచ్చిపోతున్నారు. వారికి సీఆర్డీఏ, రెవెన్యూ, పోలీసు శాఖలోని కొందరు అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ప్రశ్నించిన వారిపై పార్టీ శ్రేణులు దౌర్జన్యానికి దిగుతున్నారు. ఒక్క అనంతవరంలో ఇంతపెద్ద ఎత్తున భూ కుంభకోణం జరిగితే... అధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలకు పాల్పడిన టీడీపీ నేతల పేర్లు పత్రికలో వచ్చినా.. లెక్కచేయకుండా స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అనంతవరం గ్రామానికి చెందిన వందలాది మంది రైతుల భూములు తారుమారైన విషయాన్ని సాక్షి ఆధారాలతో వెలుగులోకి తెచ్చినా... సీఆర్డీఏ అధికారులు వాటిని సరిచేయకుండా ప్లాట్ల కేటాయింపునకు నోటిఫికేషన్ ఇవ్వడం వెనుక మర్మం దాగి ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో అధికార పార్టీ నేతలు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు జనచైతన్యయాత్రల పేరుతో గ్రామాల్లోకి వెళ్తుండడం గమనార్హం. -
రాజధాని ప్రాంతంలో ట్రాఫిక్ మళ్లింపు
వీఐపీలు, సాధారణ ప్రజలకు వేర్వేరు రూట్లు సాక్షి, గుంటూరు: రాజధాని ప్రాంతంలోని రాయపూడి– లింగాయపాలెం గ్రామాల మధ్య శుక్రవారం జరగనున్న ప్రభుత్వ కార్యాలయ భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు పలువురు వీవీఐపీలు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణనాయక్ తెలిపారు. విజయవాడ నుంచి వచ్చే వీఐపీల వాహనాలు మొదటి రూట్లో కరకట్ట మీదుగా ఉద్దండరాయునిపాలెం బొడ్రాయి అక్కడ నుంచి లింగాయపాలెం నుంచి వీఐపీ పార్కింగ్‌కు వెళ్లాలని సూచించారు. రెండో రూట్లో కరకట్ట మీదుగా వెంకటపాలెం– మందడం– వెలగపూడి– ఉద్దండరాయునిపాలెం బొడ్డురాయి– లింగాయపాలెం– వీఐపీ పార్కింగ్‌కు చేరుకోవాలని చెప్పారు. గుంటూరు నుంచి వచ్చే వీఐపీ వాహనాలు తాడికొండ మీదుగా తుళ్లూరు– రాయపూడి నుంచి కరకట్ట వైపు వచ్చి లింగాయపాలెం వెనుకవైపు ఉన్న వీఐపీ పార్కింగ్‌కు చేరుకోవాలి. విజయవాడ వైపు నుంచి సామాన్య ప్రజలు ఉండవల్లి సెంటర్ నుంచి పెనుమాక– కృష్ణాయపాలెం– వెలగపూడి– రాయపూడి నర్సరీ– లింగాయపాలెం ఎన్సీసీ కాంక్రీట్ లిక్కర్ పార్కింగ్ ప్లేస్‌లో ఆర్టీసీ, సిటీ బస్సులకు పార్కింగ్ ఉంది. దాని వెనుక కార్లు, ద్విచక్ర వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశారు. మంగళగిరి నుంచి వచ్చే వాహనాలు ఎర్రబాలెం– కృష్ణాయపాలెం– వెలగపూడి– రాయపూడి నర్సరీ– లింగయపాలెం ఎన్సీసీ కాంక్రీట్ లిక్కర్ పార్క్ వద్ద పార్కింగ్ ఏర్పాటు చేశారు. గుంటూరు నుంచి వచ్చే సాధారణ వాహనాలు తాడికొండ మీదుగా తుళ్లూరు– రాయపూడి నర్సరీ– లింగాయపాలెం ఎన్సీసీ కాంక్రీట్ లిక్కర్ పార్క్ వద్ద పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. వీఐపీలు, ప్రజలు ట్రాఫిక్ మళ్ళింపులను గుర్తించి పోలీసులకు సహకరించాలని నాయక్ కోరారు. -
భూ సమీకరణ చట్ట విరుద్ధం
* తేల్చిచెప్పిన వెంకటపాలెం రైతులు * ప్లాట్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ * గ్రామసభలో రైతుల ప్రశ్నలకు అధికారులు ఉక్కిరిబిక్కిరి సాక్షి, అమరావతి బ్యూరో : భూ సమీకరణ చట్టవిరుద్దమని వెంకటపాలెం గ్రామానికి చెందిన రైతులు తేల్చి చెప్పారు....అంతేకాక వీరు సంధించిన ప్రశ్నలకు అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు... సమాధానం చెప్పలేక తడబడ్డారు. వివరాలు... రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వని రైతులు కొందరికి భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి కొందరికి ఇవ్వాల్సి ఉంది. నోటిఫికేషన్ ఇవ్వకముందు సామాజిక ప్రభావ మదింపు సర్వే నిర్వహించాల్సి ఉంది. ఆ సర్వేలో 70శాతం మంది అభిప్రాయం మేరకు నోటిపికేషన్ ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తారు. అందులో భాగంగా శుక్రవారం వెంకటపాలెంలో అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు రైతులు హాజరయ్యారు. గ్రామసభలో రైతులు మాట్లాడుతూ.. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా రాష్ట్రపతి ఆమోదం లేకుండా భూ సమీకరణను తెరపైకి తీసుకురావటం చట్ట విరుద్దమని విద్యావంతులైన కొందరు రైతులు పేర్కొన్నారు. అలాగే ల్యాండ్‌పూలింగ్‌లో రైతులను భాగస్వాములుగా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. గ్రామ కంఠాల సమస్యను ఎందుకు పరిష్కరించటం లేదని అధికారులను నిలదీశారు. రైతులకు సీఆర్డీఏ కేటాయించే ప్లాట్లకు చట్టబద్ధత∙కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం భూ సేకరణకు వెళితే... రిజిస్ట్రేషన్ వ్యాల్యూనే మార్కెట్ ధరగా పరిగణిస్తోందని, ఆ లెక్కన ప్రభుత్వం ఎకరానికి రూ.12.50 లక్షలు మాత్రమే ఇస్తామని చెబుతోందని గ్రామానికి చెందిన మరో రైతు వివరించారు. ప్రభుత్వం స్విస్‌ఛాలెంజ్ విధానంతో సింగపూర్ సంస్థకు ఎకరం భూమి రూ.4కోట్లకు కట్టబెడుతున్నప్పుడు... రైతుకు మాత్రం ఆ ధర ఎందుకు వర్తించటం లేదని ప్రశ్నించారు. తమ భూములతో ప్రభుత్వం వ్యాపారం చేయటానికేనా? అని నిలదీశారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు పర్యాయాలు రిజిస్ట్రేషన్ ధరలను పెంచినా... రాజధాని ప్రాంతాల్లో మాత్రం భూముల విలువను ఎందుకు పెంచటం లేదని ప్రశ్నించారు. రైతులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేక తడబడ్డారు. వారు చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోవటం కనిపించింది. -
డ్రోన్ కెమెరాల వినియోగం ఎందుకో..?
తుళ్లూరు: రాజధాని గ్రామాల్లో రోజు రోజుకూ డ్రోన్ కెమెరాల హడావిడి పెరుగుతోంది. కార్లలో డ్రోన్ కెమెరాలు తీసుకొచ్చి అప్పటికప్పుడు, అక్కడికక్కడ ఆకాశంలో ఎగుర వేసి చక్కర్లు కొట్టిస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట సిబ్బంది హడావిడి చేస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే.. రాజధాని గ్రామాల గత వైభవాలను చిత్రీకరిస్తున్నామని కొంతమంది, రాజధాని గ్రామాలను సర్వే చేస్తున్నామని మరి కొంతమంది, రాజధానిలో నిర్మించే భవనాలు, వంతెలను, లోతట్టు ప్రాంతాలను షూట్ చేస్తున్నామని మరి కొందరు చెబుతున్నారు. మరో పక్క డ్రోన్ కెమెరాలు విచ్చలవిడిగా వినియోగించరాదని ప్రభుత్వమే నిబంధనలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని పరిసర గ్రామాలలో జరుగుతున్న దానిపై ప్రజలకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కెమెరాల వ్యవహారంపై సీఆర్డీఏ అధికారులు, స్థానిక అధికారులు ప్రజలకు స్పష్టత ఇవ్వాలని రాజధాని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
రాజధానిలో పౌర హక్కుల ఉల్లంఘన
హైకోర్టు న్యాయవాది సురేష్‌కుమార్ తాడేపల్లి రూరల్: రాజధానిలో పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతోందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, హైకోర్టు న్యాయవాది పొత్తూరు సురేష్‌కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాజధాని గ్రామాలైన ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, ఉద్దండరాయనిపాలెం, మందడం, లింగాయపాలెం గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రైతులు, వివిధ వృత్తిదారులు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు. 2013 భూసేకరణ చట్టం కింద ప్రజలకు అందాల్సిన సాయం అందడం లేదన్నారు. రాజధానిలో వ్యవసాయ కార్మికులు, చేతివృత్తిదారులు, పేదల పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. చేతివృత్తిదారులకు ప్రభుత్వం ఇంతవరకు ప్రత్యామ్నాయం ఎందుకు చూపలేదో సమాధానం చెప్పాలన్నారు. సచివాలయం పక్కనే ఉన్న లింగాయపాలెంలో పెత్తందార్లు పేదలను ఇసుక పనులను కూడా చేసుకోనివ్వడం లేదని చెప్పారు. ఒక విధంగా ఫాసిజం రాజ్యమేలుతోందని మండిపడ్డారు. -
రాజధాని గ్రామాల్లో రోగుల పాట్లు
* ఆస్పత్రి వరండాలోనే చికిత్స * మూణ్ణాళ్ల ముచ్చటగా సీఆర్డీఏ మెగా వైద్య శిబిరాలు * మాటలకే పరిమితమైన మంత్రి హామీలు * అంబులెన్స్ సౌకర్యం లేక ప్రజల ఇక్కట్లు తుళ్లూరు రూరల్: రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లుగా ఉంది రాష్ట్ర ప్రభుత్వ పనితీరు. నవ్యాంధ్ర రాజధాని ప్రధాన కేంద్రమైన తుళ్లూరు మండల పరిధిలో డెంగీ, విషజ్వరాలు, అంటువ్యాధులతో జనం అల్లాడుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన నివారణ చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వ అధికారులు, పాలకులు సమీక్షలు, సమావేశాలు అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో తుళ్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం బురదమయమైంది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం నుంచి బాలింతలకు కు.ని. (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్ చేసి వరండాలోనే వైద్యం అందిస్తున్నారు. వరండాలో ఉండటంతో రోగులు చలికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆపరేషన్ చేయించుకున్నవారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన వైద్య సిబ్బంది ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోలేదు. ఆపరేషన్ చేసిన గంటల వ్యవధిలోనే వారిని ఇళ్లకు పంపేస్తున్నారు. గతంలో వైద్యశాఖకు సంబంధించిన ఆర్కిటెక్చర్ అధికారులు ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి పునర్నిర్మించాలని నివేదికలు ఇచ్చారు. ఇదే భవనంలో ఎక్కువlకాలం విధులు నిర్వహించటం మంచిది కాదని కూడా తేల్చిచెప్పారు. అయినా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టలేదు. గ్రామాల్లో వైద్య శిబిరాలేవీ? భూ సమీకరణ సమయంలో రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో సైతం ఉచిత వైద్యం అందిస్తామని పాలకులు ఇచ్చిన హామీలు నీరుగారిపోయాయి. గతంలో వ్యాధులు ప్రబలిన సమయంలో వైద్య శిబిరాలు నిర్వహించారు. ప్రజలతో అవసరం తీరిపోవటంతో నేడు గ్రామాల్లో వైద్యశిబిరాలు కరువయ్యాయి. అమరావతి రాజధాని అయిన ప్రాంతంలో కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో పేద, బడుగు వర్గాల వారికి అత్యవసర చికిత్స అవసరమైనప్పుడు అతి కష్టం మీద పెద్దాస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కష్టాలు ఇంకెన్నాళ్లు? తుళ్లూరు మండల ప్రజలకు వైద్యం అందించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని తేటతెల్లమవుతోంది. గతంలో మంత్రులు నారాయణ, పుల్లారావు, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్ ప్రాథమిక వైద్యశాలను పరిశీలించినప్పుడు వెనువెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ను పిలిపించి పరిస్థితి వివరించారు. ఆ సమయంలో మంత్రి రూ.4.30 కోట్లతో 30 పడకల ఆస్పత్రి నిర్మిస్తామని ప్రకటించారు. ఆ మేరకు 2016 ఏప్రిల్ 8న శంకుస్థాపన చేశారు. ఏడాదిలో కార్పొరేట్ స్థాయిలో ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. ఆరునెలలు గడచినా టెండర్లే పూర్తి కాలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు స్పందించి ఆస్పత్రి నిర్మాణాన్ని పూర్తిచేయాలని, రాజధాని ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు. కు.ని. కష్టాలు.. పాథమిక ఆరోగ్య కేంద్రంలోనే కుటుంబ నియంత్రణ చికిత్స కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం ఏఎన్ఎంలకు కేటాయించిన గదుల్లో కు.ని. శస్త్రచికిత్సలు నిర్వహించడంతో బాలింతలు అవస్థలకు గురవుతున్నారు. చిన్న గదుల్లో ఇటువంటి శస్త్రచికిత్సలు చేస్తే ఇన్ఫెక్షన్లు వస్తాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రాజధానిలో ఇక ఇళ్ల వంతు
* అక్రమ నిర్మాణాలంటూ ఆరోపణ * నోటీసులు జారీచేస్తున్న సీఆర్డీఏ అధికారులు * ఆందోళనలో యజమానులు మంగళగిరి: రాజధాని గ్రామాల్లో ఇప్పటివరకు భూములపైనే కన్నేసిన ప్రభుత్వ పెద్దలు, అధికార యంత్రాంగం తాజాగా ఇళ్ల జోలికి రావడం యజమానులకు ఆందోళన కలిగిస్తోంది. మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని పలు గ్రామాల రైతులు ఇప్పటికీ వేలాది ఎకరాల భూసమీ కరణకు అంగీకరించలేదు. దీంతో సామాజిక అంచనా మదింపు చేసి భూసేకరణ చేస్తామని అధికారులు బెదిరించినా లొంగలేదు. ఇప్పుడు కొత్తగా నివాసాలకు నోటీసులివ్వడం ఆందోళనకు గురిచేస్తోంది. కురగల్లు గ్రామంలో ఇళ్లు కట్టుకున్న తొమ్మిదిమంది యజమానులకు సీఆర్డీఏ అధికారులు సోమవారం నోటీసులు జారీ చేశారు. సీఆర్డీఏ నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు లేవని, అనుమతులు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తూ నిర్మాణాలను మీరే ఐదు రోజులలోపు తొలగిం చాలని నోటీసులిచ్చారు. సీఆర్డీఏ ఏర్పాటుకాకముందు నిర్మించిన గృహాలవారికి కూడా నోటీసులు రావడం గమనార్హం. రాజధాని పరిధిలోని అన్ని గ్రామాల్లోనూ క్షేత్రస్థాయి పరిశీలన జరిపి సీఆర్డీఏ అనుమతి లేని అన్ని నివాసాలకు నోటీసులు జారీ చేస్తామని చెబుతుండడం ఆయా గ్రామాల్లోని గృహాల యజమానులను ఆందోళన కలిగిస్తోంది. గ్రామకంఠం పరిధిలో నిర్మించుకున్న గృహాలను తొలగించబోమని తొలుత చెప్పిన మంత్రులు, అధికారులు.. ఇప్పుడు గ్రామకంఠంలో నిర్మించుకున్న నివాసాలకు నోటీసులు ఎలా జారీ చేస్తారని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. నివాసాల జోలికొస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నారు. నివాసాల జోలికొస్తే ఊరుకోం.. సీఆర్డీఏని ఏర్పాటుచేయకముందే కురగల్లు గ్రామంలో పంచాయతీ అనుమతి తీసుకుని ఇల్లు కట్టుకున్నాం. మాది అక్రమ కట్టడమంటూ అధికారులు నోటీసు ఇచ్చారు. నివాసాల జోలికొస్తే ఊరుకునేది లేదు. భూములనూ లాక్కుని, నివాసాలనూ లాక్కుంటే మేమంతా ఎక్కడికి వెళ్లాలి? – తాడిబోయిన వెంకటేశ్వరరావు, నోటీసు అందకున్న గృహ యజమాని -
రాజధాని రైతుల్లో అంతర్మథనం
* ప్రభుత్వ వైఖరిపై బయటపడుతున్న వ్యతిరేకత * ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారని మండిపాటు * ప్రజలకు ముఖం చాటేస్తున్న టీడీపీలోనే ఓ వర్గం * మంత్రులు నారాయణ, ప్రత్తిపాటిపై ఆగ్రహావేశాలు సాక్షి, అమరావతి బ్యూరో: ప్రభుత్వ వైఖరిపై బయటపడుతున్న వ్యతిరేకత ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయారని మండిపాటు ప్రజలకు ముఖం చాటేస్తున్న టీడీపీలోనే ఓ వర్గం మంత్రులు నారాయణ, ప్రత్తిపాటిపై ఆగ్రహావేశాలు వెనుకా ముందు ఆలోచించకుండా టీడీపీ పెద్దల మాటలు విని బంగారంలాంటి భూములు ఇచ్చి తప్పుచేశామా? అని రాజధాని నిర్మాణానికి భూములు వదులుకున్న రైతులు, ఆ పార్టీ నాయకులు ఇప్పుడు అంతర్మథనం చెందుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న స్థానికులతో కలిసి పార్టీ పెద్దలపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇకపై ఏ నిర్ణయం తీసుకున్నా.. మీ వెంటే ఉంటామని స్థానిక టీడీపీ నాయకులు రాజధాని రైతులకు మద్దతు తెలియజేస్తుండడం గమనార్హం. గుడ్డిలో మెల్ల చందంగా ఎన్నికల్లో బయటపడ్డ టీడీపీ ఎవరూ ఊహించని విధంగా రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి ఈ ప్రాంతం ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరించినా పట్టించుకోని ప్రభుత్వం నిర్మాణానికి పూనుకుంది. స్థానిక టీడీపీ నేతలతో సమావేశమై...రైతుల నుంచి భూములు ఇప్పించే బాధ్యతను వారి భుజాలపై మోపింది. దీంతో 29 గ్రామాలకు చెందిన రైతులతో స్థానిక టీడీపీ నేతలు కాళ్లావేళ్లా పడి ముఖ్యమంత్రి, మంత్రులచే రకరకాల హామీలిచ్చి ఒప్పించారు. గ్రామానికి ఒక్కోరకమైనా హామీలు ఇచ్చారు. అయితే కొందరు నమ్మకపోయినా... మరి కొందరు వ్యతిరేకించినా వారిని భయపెట్టి భూములు లాక్కున్నారు. హామీలన్నీ గాలికి.. భూములు తీసుకునే సమయంలో మంత్రులు పి. నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు వెంకటపాలెంలో గ్రామస్తులతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ప్లాట్లు, కౌలు, కూలీలకు ఫించన్లు, గ్రామాభివృద్ధికి రూ.30లక్షల నిధులు వంటి హామీలు ఇచ్చారు. ముందుగా ప్లాట్లు ఇచ్చే కార్యక్రమానికి వెంకటపాలెం నుంచే శ్రీకారం చుడతామని మాటిచ్చారు. అదే విధంగా 2.50 ఎకరాల్లో గ్రీన్‌పార్క్ ఏర్పాటు చేసి వాటి బాధ్యతలను స్థానికంగా ఉన్న టీడీపీ నాయకుడు ఒకరికి అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇలా మంత్రులు ఇచ్చిన రకరకాల హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు. పా్లట్ల పంపిణీ కార్యక్రమం వెంకటపాలెంలో ప్రారంభించకపోయినా... ఇప్పటి వరకు ప్లాట్లకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. గ్రామంలో కాకుండా వేరొక చోట ప్లాట్లు కేటాయించనున్నారనే విషయం తెలుసుకున్న స్థానికులు టీడీపీ పెద్దలపై మండిపడుతున్నారు. చెప్పిందేమిటి? చేస్తున్నదేమిటి? అని ప్రశ్నిస్తుండడంతో టీడీపీ నాయకులు నోరుమెదపలేకపోతున్నారు. భూములిచ్చి రెండేళ్లవుతున్నా.. ఇప్పటి వరకు గ్రామానికీ, రైతులకు ఎటువంటి ప్రయోజనం చూపించలేదని మండిపడుతున్నారు. భూముల కోసం రాత్రి, పగలు లెక్కచేయకుండా తిరిగిన మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు ఆ తరువాత గ్రామాలవైపు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల సమాధానం చెప్పలేక స్థానిక టీడీపీ నేతలు మౌనంగా వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా... అందుకు పూర్తి మద్దతు ఇస్తామని టీడీపీ నాయకులు కొందరు గ్రామస్తులకు ఇప్పుడు హామీ ఇస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికైనా సిద్ధమేనని తేల్చిచెప్పినట్లు సమాచారం. ఒక్క వెంకటపాలెం వాసులే కాదు... రాజధాని ప్రాంతంలోని అన్ని గ్రామాల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత చాపకిందలా పారుతోంది. -
ఇళ్లు నిర్మించారో.. కూల్చివేతే!
* సీతానగరంలో ప్రత్యేక బృందం సిద్ధం * మునిసిపల్ సిబ్బంది నిరంతర నిఘా సీతానగరం (తాడేపల్లి రూరల్): రాజధాని ప్రాంతమైన తాడేపల్లి మునిసిపాలిటిలో కొత్తగా ఎవరు ఇళ్లు నిర్మించినా దాన్ని కూల్చేందుకు మునిసిపల్ సిబ్బంది రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యంగా సీతానగరం, మహానాడు, సుందరయ్య నగర్ తదితర ప్రాంతాల్లో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. రాజధాని ప్రాంతానికి వెళ్లాలంటే మహానాడు, సుందరయ్య నగర్, సీతానగరం మీదుగా ప్రధాన రహదార్లు నిర్మించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందుకోసమే ఈ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు నిలిపివేసింది. అనుమతులు లేకుండా ఎవరైనా చిన్న గుడిసె వేసినా కూల్చేసేందుకు ప్రత్యేక బృందాన్ని సిద్ధం చేసింది. సెటిలర్స్‌కు కేటాయించి.. 1950 సంవత్సరానికి పూర్వం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో దోపిడీలు, దొంగతనాలకు పాల్పడేవారి కోసం సీతానగరం, మహానాడు, సుందరయ్య నగర్ ప్రాంతంలో ఓ జైలు ఏర్పాటు చేసి, సుమారు 200 ఎకరాల చుట్టూ కంచె ఏర్పాటు చేసి వారిని తీసుకువచ్చి ఇక్కడి జైలులో ఉంచేవారు. అప్పట్లో వారందరినీ పోషించడం ప్రభుత్వానికి కష్టంగా మారడంతో దాదాపుగా 100 కుటుంబాలుగా ఏర్పాటు చేసి, వారికి(సెటిలర్స్) ఆ భూములను కేటాయించారు. ఇప్పటికీ ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న సెటిలర్స్ కుటుంబాలు చాలా ఉన్నాయి. దీంట్లో 173 ఎకరాలు కాలక్రమేణా పంట పొలాల నుంచి పాట్లుగా రూపొందాయి. ఈ ప్రాంతం విజయవాడ, గుంటూరు నగరాలకు దగ్గరగా ఉండడం, స్థలాల రేట్లు తక్కువగా ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, కొంచెమో గొప్పో డబ్బు కలిగిన వారు ఈ ప్రాంతంలో మూడు నుంచి ఐదు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేసుకున్నారు. ఆ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకున్నవారికి తాడేపల్లి మునిసిపాలిటీ పరిధిలో ఇప్పటివరకు ప్రభుత్వం సూపర్ టాక్స్ పేరుతో రెట్టింపు ఇంటి పన్నులు వసూలు చేసింది. దీన్ని కూడా రద్దు చేస్తూ తాజాగా కొత్త చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. 2015 తరువాత ఎవరు ఇళ్లు నిర్మిచుకున్నా, దాన్ని కూల్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. నెల్లూరులో ఎదురుదెబ్బ... మొదట ఈ ప్రాంతంలో ప్రారంభిస్తే ఎక్కడ వ్యతిరేక వస్తుందోనని మునిసిపల్ మంత్రి నారాయణ తన సొంత జిల్లా నెల్లూరు మునిసిపాలిటిలో ఈ ప్రక్రియ చేపట్టారు. అక్కడ ఎదురుదెబ్బ తగలడంతోనే తాడేపల్లి మునిసిపాలిటిలో ఈ కార్యక్రమం చేపట్టాలని ఆలోచనతో ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. బిల్డింగ్ ప్లాన్ కావాలంటే ఆన్లైన్ ద్వారా అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అలా అనుమతి కోసం వెళితే, తాడేపల్లి మునిసిపాలిటీ పరిధిలోని 20 ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు లభ్యం కావు. ఒకవేళ కాదు కూడదని ఎవరైనా చిన్న గుడిసె వేసినా, దాన్ని కూల్చేందుకు ప్రత్యేక అధికారులు సిద్ధంగా ఉన్నారు. దీని నిమిత్తమే రెగ్యులేషన్ చేస్తామంటూ తాడేపల్లి మునిసిపాలిటిలో దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు కోరారు. సుమారు 7 వేల మంది యజమానులు తమ స్థలాలను రెగ్యులరైజ్ చేయాలంటూ దరఖాస్తు చేశారు. దీని ఆధారంగానే కూల్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. -
అత్యాశతో హైడ్రామా!
► మంగళగిరిలో ఆలయ భూములు అమ్మకానికి సిద్ధమైన కౌలుదారులు ► విషయం తెలుసుకొని కౌలు వేలం నిర్వహించిన అధికారులు ► అధికారుల ఎదుటే ఆత్మహత్యాయత్నం చేసిన తల్లీకుమారుడు రాజధాని ప్రభావంతో మంగళగిరి ప్రాంతంలో భూముల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. దేవాదాయ భూములనూ కౌలుదారులు అత్యాశకు పోయి అమ్ముకునేందుకు సిద్ధమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ శాఖ అధికారులు కళ్లు తెరవడంతో అమ్మకం ఆగిపోయింది. భూములకు కౌలు వేలం వేసేందుకు దేవాదాయశాఖాధికారులు సోమవారం సిద్ధమవ్వగా ఇప్పటికే సాగు చేసుకుంటున్న కౌలుదారులు నానా యాగీ చేశారు. సాక్షి, మంగళగిరి : పాత మంగళగిరిలోని సీతారామాంజనేయ దేవస్థానం భూముల అమ్మకం గుట్టురట్టయింది. కౌలు ముసుగులో కౌలు దారులు రూ.70 కోట్లు విలువ చేసే భూములను విక్రయించేందుకు సిద్ధమయ్యారు. చివరి నిమిషయంలో ఆలయ కార్యనిర్వహణాధికారి తెలుసుకొని ఆ భూములకు కౌలు వేలం నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఎలాగైనా వేలం అడ్డుకునేందుకు కౌలుదారులు ఆత్మహత్యాయత్నం హైడ్రామా నడిపారు. ఆలయానికి 80 ఎకరాల భూములు... సీతారామాంజనేయ స్వామి ఆలయానికి సుమారు 80 ఎకరాల భూములున్నాయి.డి.నెం 66లో 4.24 ఎకరాలు, డి.నెం 63లో 0.32 సెంట్లు, డినెం 61లో 0.04 సెంట్లు భూములకు పట్టణంలోని కొత్తపేటకు చెందిన నూతలపాటి అప్పారావు కౌలు దారుడుగా ఉన్నారు. 1975 నుంచి కౌలుకి సాగు చేస్తున్నారు. 2003లోనే స్వాహా చేసేందుకు పథకం... సొంత భూమిలే ని పేద రైతునని (ల్యాండ్ లెస్ పూర్ ) పత్రం పొంది ఆ భూములను స్వాహా చేసేందుకు 2003లోనే పథకం వేసి కౌలుదారుడు కోర్టు ను ఆశ్రయించారు. కానీ న్యాయస్థానంలో వారికి అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. కౌలుదారు అప్పారావు చనిపోవడంతో ఆయన తనయుడు శివకు ఆ భూములపై కన్నుపడింది. బహిరంగ మార్కెట్లో ఎకరం రూ.5 కోట్ల చొప్పున విక్రయానికి పెట్టారు. విషయం బయటకు పొక్కడంతో ఈవో భూములకు సోమవారం కౌలు వేలం నిర్వహణ చేపట్టారు. విషయం తెలుసుకొని అప్పారావు తనయుడు శివ ఆత్మహత్యాయత్నం పేరుతో దేవుని సాక్షిగా హైడ్రామా నడిపాడు. అప్పారావు తనపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడడమే కాక తన తల్లి పై కూడా కిరోసిన్ పోశాడు. సోమవారం జరగాల్సిన వేలం రద్దు కావడంతో మరోసారి వేలం నిర్వహిస్తామని ఈవో జె.నారాయణ తెలిపారు. పోలీసులు తల్లీకుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. -
ప్రత్యేక రైలు.. ప్రయోజనమెంత?
► ప్రస్తుతానికి ఆదరణ అంతంతమాత్రమే ► నాలుగు గంటల్లో హైదరాబాద్ చేరడం ► కష్టమేనంటున్న రైల్వే వర్గాలు ► బస్సులపై కొందరు అధికారుల ఆసక్తి సాక్షి, విజయవాడ: రాజధాని వాసుల కోసం విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు నూతనంగా ఏర్పాటు చేసిన సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(12795)కు ప్రయాణికుల నుంచి ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. మూడు రోజులుగా ఈ రైలు నడుపుతున్నారు. ప్రయాణికులు ఏసీ బోగీలపైనే ఆసక్తి చూపుతున్నారు. జనరల్‌లో రెండు మూడు వందల మందే.. ఈ రైలును 14 బోగీలతో నడుపుతున్నారు. ఇందులో రెండు ఎస్ఎల్ఆర్లు. మిగిలిన 12 బోగీల్లో రెండు ఏసీ చైర్ కార్లు, ఐదు సీటింగ్ రిజర్వుడ్ బోగీలు, ఐదు సీటింగ్ అన్ రిజర్వుడు బోగీలు, రెండు ఏసీ బోగీల్లోనూ కలిసి 156 సీట్లు ఉంటాయి. ఇందులో 60 వరకు నిండుతున్నాయి. సాధారణ రిజర్వుడు బోగీల్లో కేవలం 100 నుంచి 120 మంది మాత్రమే ఉంటున్నారు. జనరల్ బోగీలు కూడా అంతకు మించి ఉండటం లేదు. కాగా విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే ప్రయాణికులకు ఈ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. గతంలో 6.30 గంటల వరకు వేచి ఉండాల్సి వచ్చేదని, ఇప్పుడు గంట ముందుగా కొత్త రైలులో గుంటూరు నుంచి వచ్చే ఉద్యోగస్తులు తిరిగి వెళ్లుతున్నారని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇదే రైలులో గుంటూరు వెళ్లే ప్రయాణికులు సైతం ఉండడంతో కొంత మేర జనాలతో కనిపిస్తోంది. ఆదరణ ఉంటుందా..? విజయవాడ నుంచి సికింద్రాబాద్‌కు, సికింద్రాబాద్ నుంచి విజయవాడకు నడిపే ఈ రైలుకు ప్రయాణికుల నుంచి ఎంత మేర ఆదరణ ఉంటుందనేది ప్రశ్నార్థకం. ప్రస్తుతం జాతీయ రహదారి అభివృద్ధి చేయడంతో నాలుగు గంటల్లో విజయవాడ నుంచి ైెహ దరాబాద్ వెళుతున్నారు. రైలులో ఐదున్నర గంటలు వేచి ఉండాల్సి వస్తుంది. నిర్ణీత సమయానికి కొద్దిగా ఆలస్యమైనా రైలు వెళ్లిపోతుంది. బస్సులతో ఈ ఇబ్బంది ఉండదంటున్నారు ప్రయాణికులు. 27 నుంచి ఉద్యోగస్తులు తరలివస్తే... వారు వెలగపూడి నుంచి విజయవాడగానీ, గుంటూరుగానీ వెళ్లి ఈ రైలు ఎక్కాలంటే కనీసం గంట ముందు బయలుదేరాలి. విజయవాడలో 5.30 గంటలకు ఈ రైలు బయలుదేరితే 4.30 గంటలకు ఆఫీసుల నుంచి రావాలి. అలాంటప్పుడు తెల్లవారుజామున లేచి అక్కడ రైలు ఎక్కాలి. అందువల్ల ప్రయాణికులు రైలు కంటే బస్సులకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారని సమాచారం. హైదరాబాద్‌లో ఎల్బీనగర్, వనస్థలిపురం, దిల్సుఖ్నగర్, హయ్యత్నగర్ ప్రాంతాల వాసులు బస్సుల్లోనే వస్తారని, బాలానగర్, కూకట్పల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఈ రైలుపై ఆసక్తి చూపుతారని రైల్వే వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ప్రస్తుతానికి రైలుకు ఆదరణ అంతంతమాత్రంగా ఉన్నా భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముందని, వారాంతంలో డిమాండ్ బాగా ఉంటుందని చెబుతున్నారు. నాలుగు గంటల్లో రావడం కష్టమే... ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ హైదరాబాద్ నుంచి 5.30 గంటల్లో కాకుండా కనీసం 4 గంటల్లో రాజధానికి వచ్చే విధంగా రైలు నడపాలని రైల్వే అధికారులకు సూచించారు. అది ఇప్పట్లో సాధ్యపడదని రైల్వే అధికారులు అంటున్నారు. దీని కోసం రైల్వే ట్రాక్ మార్చాలని, వేగం పెంచితే సిగ్నలింగ్, క్రాసింగ్ రైళ్లను చూసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీంతో డిమాండ్ ఉన్నా లేకున్నా సమయం మాత్రం కుదించడం కష్టమేనంటున్నారు. అయితే రైలు ప్రయాణాన్ని ఇష్టపడే వారు ఈ సర్వీసును వినియోగించుకుంటారని అంచనా. -
కాల్‌నాగులు
► కాల్‌మనీ ఉచ్చులో భారీ బిల్డర్ ముఠా నుంచి పెరిగిన ఒత్తిళ్లు ► కానూరులో మహిళకు వేధింపులు ► రూ.26 లక్షల అసలుకు రూ.67 లక్షలు వసూలు ► అంతటితో ఆగకుండా రూ.5 కోట్ల విలువైన స్థలం స్వాధీనం ► మళ్లీ నగరంలో దందా షురూ సాక్షి, విజయవాడ : రాజధాని నగరంలో కాల్‌మనీ ప్రకంపనలు మళ్లీ మొదలయ్యాయి. కాల్‌మనీ ముఠా సభ్యులు నగరంలోని భారీ రియల్టర్‌కు ఆర్థిక అవసరాలకు అప్పు ఉచ్చి ఆస్తుల స్వాధీనానికి యత్నించారు. అంతటితో ఆగక వేధింపులు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఒక మహిళను కూడా ఈ ముఠా వేధించింది. అసలుకు రెండు రెట్లు వసూలు చేయటంతో పాటు కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని స్వాధీనం చేసుకుంది. ఇంకా డబ్బు కట్టాలని వేధిస్తూ మహిళను మానసిక క్షోభకు గురిచేసింది. పర్యవసానంగా సదరు మహిళ ఆత్మహత్య చేసుకునే స్థితికి వెళ్లింది. చివరకు గత్యంతరం లేని పరిస్థితుల్లో విజయవాడ కమిషనరేట్ పోలీసుల్ని ఆశ్రయించింది. ఈ ఘటనతో మళ్లీ కాల్‌మనీ దందా కార్యకలాపాలు జోరుగా సాగుతున్నట్టు తేటతెల్లమైంది. ఇదిగాక వెలుగులోకి రాని ఘటనలు అనేకం ఉన్నాయి. తాజాగా బీజేపీ నేతలు విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మరీ ఈ వ్యవహారాన్ని కదిలించారు. దీంతో మళ్లీ అనేక మంది కాల్‌మనీ ముఠా, బడా బాబుల ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళ ఫిర్యాదుతో మరోసారి వెలుగులోకి... విజయవాడ నగరంలో కాల్‌మనీ ముఠా ఆగడాలు మళ్లీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం పరిస్థితులు సద్దుమణగడంతో గతంలో అప్పులు ఇచ్చినవారు తిరిగి వేధింపులు సాగిస్తూ వసూళ్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. శుక్రవారం కానూరుకు చెందిన మహిళ చలసాని నిర్మల కాల్‌మనీ ముఠాపై ఫిర్యాదు చేయటంతో ఈ వ్యవహారం వెలుగులోకొచ్చింది. నిర్మల ఫిర్యాదులో తెలిపిన వివరాల ప్రకారం.. కానూరుకు చెందిన కాల్‌మనీ వ్యాపారి అన్నే శివనాగేశ్వరరావు వద్ద 2009లో అదే గ్రామంలో తనకున్న 2057 గజాల స్థలాన్ని తనఖా పెట్టి పిల్లల చదువు కోసం 26.90 లక్షలు అప్పుగా తీసుకున్నారు. దశలవారీగా 2014 సంవత్సరం కల్లా అసలు, వడ్డీ కలిపి రూ.67.88 లక్షలు చెల్లించారు. ఈ నేపథ్యంలో తాను తనఖా పెట్టిన స్థలం జీపీఏను రద్దు చేసి తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా కోరారు. అప్పటికే కాల్ ముఠా సభ్యుడు అన్నే శివనాగేశ్వరరావు ఆమెకు తెలియకుండా స్థలాన్ని వేరే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేశాడు. ప్రస్తుతం స్థలం బహిరంగ మార్కెట్ విలువ రూ.5 కోట్ల వరకు ఉంటుంది. ఈ విషయంపై గ్రామంలో పెద్ద మనుషుల వద్ద పంచాయితీ పెట్టినా న్యాయం జరగలేదు. దీంతో బాధితురాలైన నిర్మల కమిషనరేట్ పోలీసులను ఆశ్రయించారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కేసును విచారిస్తున్నారు. కాల్ ఉచ్చులో మరో బడా బిల్డర్ కాల్‌మనీ ముఠా ఉచ్చులో మరో బడా బిల్డర్ చిక్కుకున్నట్లు సమాచారం. కానూరు ప్రాంతానికి చెందిన ఒక బిల్డర్ అనతికాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో బాగా గడించారు. తొలుత వ్యాపారానికి బయట నుంచి అప్పులు తెచ్చి విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్‌లో పలు బహుళ అంతస్తుల సముదాయాలు పలు నిర్మించారు. ఈ క్రమంలో భారీగా సంపాదించినట్లు సమాచారం. ఒక దశలో ఆయనకు పెట్టుబడులు పెట్టేందుకు అనేకమంది ముందుకొచ్చారు. అదే క్రమంలో వ్యాపారంలో తాత్కాలిక సర్దుబాట్ల కోసం కాల్‌మనీ కేసు నిందితుల నుంచి గతంలో కొంత మొత్తం అప్పుగా తీసుకున్నారు. దీనికి నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న పలు ఆస్తుల్ని తనఖా పెట్టి జీపీఏ రిజిస్ట్రేషన్ చేశారు. ఇప్పుడు బకాయిని అసలు కంటే నాలుగు రెట్లు పెంచి మొత్తం ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి కాల్‌మనీ ముఠా యత్నిస్తున్నట్లు తెలిసింది. వేధిస్తున్న ముఠా సభ్యులు గతంలో కాల్‌మనీ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తులని సమాచారం. దీనికోసం బౌన్సర్లను వినియోగించి బిల్డర్‌పై దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు తెలిసింది. మరోవైపు ఈ కేసులో కాల్‌మనీ కేసులో పరారీలో ఉన్న వ్యక్తి కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. పరారీలో ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ ద్వారా ఈ అప్పులు తీసుకున్నట్లు తెలిసింది. వెనిగళ్ల శ్రీకాంత్ గతంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌తో కలిసి విదేశాలకు వెళ్లాడని విస్తృత ప్రచారం జరిగింది. పోలీసులు మాత్రం ఈ కీలక కేసులోని నిందితుడైన వెనిగళ్ల శ్రీకాంత్ ఆచూకీని మాత్రం ఇంతవరకు కనిపెట్టలేకపోయారు. రాజకీయంగా పరపతి ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ పరారీ వెనుక అధికార పార్టీ నేతల కీలక సహకారం ఉందనేది బహిరంగ రహస్యం. -
బ్లాక్‌మెయిలర్ల పంజా
► అడుగడుగునా నేరాలు ► మొన్న దేశాన్ని కుదిపేసిన కాల్‌మనీ వ్యవహారం ► నిన్న చర్చి ఫాదర్‌పై దందా ► నేడు వివాహితపై వెలుగుచూసిన అకృత్యాలు విజయవాడ కమిషనరేట్ పరిధిలో బ్లాక్మెయిల్ నేరాలు, అకృత్యాలు పెచ్చుమీరుతున్నాయి. కొంతమంది నగ్న చిత్రాలు, వీడియోలతో బెదిరించి లక్షలు, కోట్లలో నగదు వసూళ్లకు పాల్పడుతున్నారు. మరికొందరు.. మహిళలపై అకృత్యాలకు తెగబడుతున్నారు. ఇటీవలే వెలుగుచూసిన చర్చి ఫాదర్ బ్లాక్మెయిల్ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన కాల్‌మనీ వ్యవహారాన్ని మరువకముందే.. సింగ్‌నగర్ పరిధిలోని రామలింగేశ్వనగర్‌లో మరో మహిళపై అకృత్యం ఉదంతం తాజాగా వెలుగులోకొచ్చింది. సాక్షి ప్రతినిధి, విజయవాడ/ సాక్షి, విజయవాడ : రాజధాని నగరంలో నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. సంచలనం రేపిన కాల్‌మనీ వ్యవహారం నుంచి పేరెన్నికగన్న చర్చి ఫాదర్ వ్యవహారం వరకు నగరంలో నేరాలు రకారకాల తీరులో బయటపడుతున్నాయి. చర్చి ఫాదర్ ఘటనలో నగ్న చిత్రాలు, వీడియోలు చూపించి బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడిన వ్యక్తులను పోలీసులు ఇటీవల అరెస్టు చేసి కోర్టుకు పంపించారు. వారిపై ప్రత్యేక విచారణ కోసం కోర్టు పోలీసు కస్టడీకి ఇచ్చింది. ఈ ఘటనలో అనేక కోణాలు కూడా వెలుగు చూసిన విషయం తెలిసిందే. వివాహితపై టీడీపీ చోటా నేత లైంగిక దోపిడీ తాజాగా సింగ్‌నగర్ పరిధిలోని రామలింగేశ్వనగర్‌లో వెలుగుచూసిన ఘటన నగరంలో పెచ్చుమీరుతున్న నేరప్రవృత్తికి మరో ఉదాహరణ. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భర్తతో విభేదాల నేపథ్యంలో ఒక వివాహిత రామలింగేశ్వనగర్‌లో తన తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. పక్క ఇంట్లో మండవ రవికాంత్ అనే టీడీపీ చోటా నేత, రియల్టర్ తన రెండో భార్య శ్రీదేవితో కలిసి ఉంటున్నాడు. అతని మొదటి భార్య కృష్ణలంకలో నివసిస్తున్నారు. ఇంటి పక్కన నివసించే వివాహితపై కన్నేసిన రవికాంత్ ఆమెను లోబర్చుకునేందుకు తన రెండో భార్య సహకారం కోరాడు. తోటి స్త్రీ అన్న సంగతి మరచి ఆమె అతనికి సహకరించింది. వివాహితతో స్నేహం పెంచుకుని, బాత్రూమ్లో స్నానం చేస్తున్న నగ్న వీడియోలను మొబైల్లో చిత్రీకరించింది. వాటి ఆధారంగా బెదిరింపులకు దిగింది. లేని పక్షంలో వీడియో ఇంటర్నెట్లో పెట్టి కుటుంబం పరువు తీస్తానని, మీ కుటుంబ సభ్యుల్ని చంపి నాగాయలంకలో పడేస్తానని బెదిరించారు. ఈ నేపథ్యంలో నిందితుడు ఆమెను లొంగదీసుకుని పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఆగక ఆమెను నగ్నంగా చేసి మెడకు బెల్టు కట్టి మోకాళ్లపై నడిపించి పైశాచిక ఆనందం పొందేవారు. లక్షల్లో నగదు వసూలు... మరోపక్క లక్షల్లో నగదు కూడా వసూలు చేశారు. గత ఏడాది ఫిబ్రవరి 25న సదరు వివాహిత వద్ద 38 గ్రాముల ఆభరణాలు తీసుకున్నారు. అంతేగాక తన తండ్రి రిటైరైతే వచ్చిన రూ.6 లక్షల నగదు కూడా వడ్డీ పేరుతో తీసుకున్నారు. బయటికి చెబితే కుటుంబసభ్యులు, పిల్లలపై యాసిడ్ పోసి చంపుతామని బెదిరించి, కులదూషణకు పాల్పడ్డారు. అంతేగాక మరింత బరితెగించి ఆమెను వేరొకరికి అమ్మే ప్రయత్నం చేస్తుండగా తెలుసుకున్న వివాహిత ఇంటినుంచి పారిపోయి కొంతకాలం బంధువుల ఇంట్లో ఉంది. చివరికి వివాహిత తల్లిదండ్రులు ఆమెను వెతికి తెచ్చి అన్ని విషయాలు తెలుసుకుని రవికాంత్‌పై, అతని భార్య శ్రీదేవిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు విచారణ చేపట్టారు. ఏసీపీ సత్యానందం ఆధ్వర్యంలో నిందితులను మంగళవారం అరెస్టు చేశారు. వారినుంచి వీడియోలు తీసిన మొబైల్, ట్యాబ్‌లను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. పోలీసులకు సవాలే... ఒకవైపు నగదు వసూళ్లు, మరోవైపు లైంగిక దాడులకు పాల్పడటం వంటి నేరాలకు పాల్పడే ముఠాలు నగరంలో పెరుగుతుండటం పోలీసులకు సవాలుగా మారింది. ఫాదర్‌ను బ్లాక్మెయిల్ చేసిన వారిలో ఇప్పటికే ఐదుగురు అరెస్ట్ కావడంతో ఇంకా ఎవరైనా ఈ ముఠాకు సంబంధించిన వారు నగరంలో ఉన్నారేమోననే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు సాగుతోంది. కాల్‌మనీ వ్యవహారంలోనూ వేల సంఖ్యలోనూ ఫిర్యాదులు నమోదైన విషయం తెలిసిందే. మరి ఇలాంటి నేరాలకు చెక్ పెట్టేందుకు నగర పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి -
14 ఏళ్ల తర్వాత ఆంధ్రాకు కేసీఆర్
-
ఊళ్లను మింగేస్తోన్న రాజధాని
-
వారి కన్నీళ్లను తొక్కేసి రావాలా..?
-
వారి కన్నీళ్లను తొక్కేసి రావాలా..?
హైదరాబాద్: ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా విమర్శలు చేయడం సరికాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారథి అన్నారు. ప్రతిపక్ష నేత రాసిన లేఖపై మంత్రులు విమర్శలు చేయడం మాని వివరణ ఇవ్వాలని అన్నారు. తామెదో ఉద్దేశ పూర్వకంగా రాజధాని శంఖుస్థాపన కార్యక్రమానికి రావడం లేదనుకుంటే పొరపాటవుతుందని, ఎంతోమందిని బాధపెట్టి నిర్మిస్తున్న రాజధాని కార్యక్రమానికి తాము హాజరై వారి బాధను అవమానించలేమని, వారి కన్నీళ్లను తొక్కి అవమానించలేమని చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడిన పార్థసారథి.. రాజధాని పేరిట ప్రభుత్వం నిర్వహించిన తంతును ఆయన పూసగుచ్చినట్లు వివరించారు. సాక్షాత్తు ప్రధాని సైతం భూసేకరణ బిల్లు విషయంలో అందరి ఆందోళనలు పరిగణనలోకి తీసుకుంటామని, రైతులకు, పేదవారికి అనుకూలంగా ఉండేలా భూసేకరణ ఉంటుందని, అలా మార్పులు చేసేవరకు భూసేకరణ ఉండబోదని చెప్పినా.. అదే భూసేకరణ బిల్లుతో చంద్రబాబునాయుడు ప్రజల వద్ద నుంచి బలవంతంగా భూములు లాక్కున్నారని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం కేవలం 14 వేల ఎకరాలు, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కోసం 5వేల ఎకరాలు అవసరం ఉండగా ఎందుకు 33 వేల ఎకరాలు సేకరించారని ప్రశ్నించారు. భూమిని సేకరించిన ప్రాంతాల్లోని పేదలు, భూమిలేని వారు, వృత్తిపై ఆధారపడి బతుకులీడ్చేవారి భవిష్యత్తుకు ఏ మేరకు భరోసా ఇచ్చారని, వారంతా ఎటుపోతారని నిలదీశారు. మెడలు వంచి ఇళ్లలో నుంచి లాగేసి మరి పేదవారి భూములను రాజధాని పేరిట కొల్లగొట్టారని, ఇప్పుడు వారంతా కంటతడిపెడుతుంటే.. ఏ విధంగా రాజధాని శంఖుస్ధాపన కార్యక్రమానికి రావాలని చెప్పారు. తాము రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, అయితే, అంతకంటే ముందు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తేనే బావుంటుందనేది తమ అభిప్రాయం అన్నారు. వ్యక్తిగతంగా ప్రభుత్వం ఊహించుకుంటున్న రాజధాని కోసం అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బాబోయ్.. కుక్కలు!
ఇద్దరు చిన్నారులపై దాడి.. తీవ్ర గాయాలు హైదరాబాద్: రాజధాని నగరంలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. చిన్నారులు కనిపిస్తే చాలు రెచ్చిపోయి మీద పడుతున్నాయి. గురువారం ఆరేళ్ల చిన్నారితోపాటు ఓ హాస్టల్ విద్యార్థిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. మహబూబ్‌నగర్ జిల్లా జాతరపల్లికి చెందిన శ్రీకాంత్ బోయిన్‌పల్లిలోని బాపూజీనగర్‌లో గిరిజన సంక్షేమ హాస్టల్లో ఉంటూ సమీపంలోని పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. హాస్టల్లో నీరు లేకపోవడంతో సాయంత్రం దగ్గర్లోని ఓ హోటల్‌కు వెళ్లాడు. ఈ సమయంలో శ్రీకాంత్‌పై పిచ్చికుక్క దాడి చేసి నుదురు, కంటిరెప్పపై కరిచింది. స్థానికులు కుక్కను తరిమికొట్టి బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మరో ఘటన రామంతాపూర్‌లో చోటుచేసుకుంది. ధృతి అనే ఆరేళ్ల చిన్నారి ఉదయం స్కూల్‌కు వెళ్లేందుకు తయారై ఇంటి ముందు గేట్ వద్ద నిల్చుంది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ వీధి కుక్క ధృతిపై దాడి చేసింది. చిన్నారి కుడి కన్నుపై తీవ్రంగా గాయపర్చింది. తల్లిదండ్రులు చికిత్స కోసం పాపను ఆసుపత్రిలో చేర్చారు. -
'వారి కలే ఇంకా తీరలేదు.. ఇక తెలుగు వారిది'
రాంచీ: జార్ఖండ్ రాజధాని ఏది అనగానే టక్కున రాంచీ అని చెప్పేస్తాం. కానీ మిగితా రాజధాని ప్రాంతాలను తలపించేలాగా రాంచీ మాత్రం ఉండదంటే నమ్మలేరేమో. 2000 సంవత్సరంలో బీహార్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా జార్ఖండ్ విడిపోయింది. ఇలా విడిపోయి దాదాపు పదిహేను సంవత్సరాలు పూర్తి కావస్తుంది. అయినప్పటికీ ఆ రాష్ట్ర రాజధాని నిర్మాణ పనులు మాత్రం నత్తనడకనే ఉన్నాయి. రాంచీలోని హెవీ ఇంజినీరింగ్ కార్పొరేషన్(హెచ్ఈసీ) పరిధిలోని రెండు వేల ఎకరాల్లో ఈ రాజధాని నిర్మించే పనులు మొదలు పెట్టారు. నాటి డిప్యూటీ ప్రధాని ఎల్కే అద్వానీ, కొత్త రాజధాని నిర్మాణం కోసం 2002లో శంఖుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు రాజధాని ప్రాంతంలో ఒక్క నిర్మాణం కూడా పూర్తి కాలేదు. ఇప్పటికీ అసెంబ్లీ, సెక్రటేరియట్ పలు ప్రభుత్వ కార్యాలయాలన్ని కూడా ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకొని నడుపుతున్నారు. ఈ రాజధాని చుట్టూ ఓ రింగ్ రోడ్డు వేసేందుకు పనులు ప్రారంభించి ఎనిమిది సంవత్సరాలు పూర్తవుతున్నా అది ఇప్పటికీ పూర్తి కాలేదు. కొత్త రాజధాని ప్రాజెక్టు పూర్తికాకపోవడానికి ప్రధాన కారణం అక్కడి ప్రజల ఆందోళన. దాదాపు 50 సంవత్సరాలుగా ఉంటున్న వారంతా అనూహ్యంగా ఆ ప్రాంతాన్ని వెళ్లేందుకు నిరాకరించడం మొదటి కారణమైతే, ఖాళీ చేసి వెళ్లాల్సిన ప్రజలకు పూర్తి స్థాయిలో పునరావస కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం మరో కారణం. దీంతోపాటు రాజధాని ప్రాంతం కావడంతో అరకొర వసతులే ఉన్న రాంఛీకి అనూహ్యంగా జన ప్రవాహం పెరగడంతో ప్రస్తుతం ఆ రాజధాని ప్రాంతం విద్యుత్, నీరు, వసతి, రోడ్లతోపాటు సౌకర్యాల లేమిని ఎదుర్కోంటుంది. పదిహేనేళ్ల కిందట ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన జార్ఖండ్ రాజధాని నిర్మాణానికే ఇన్ని రకాల సమస్యలు తలెత్తి నిర్మాణ పనులు ఎక్కడికక్కడ అసంపూర్ణంగా ఉండిపోతే.. నిన్నకాక మొన్న ప్రత్యేక రాష్ట్రంగా మారిన ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో ఎన్ని సమస్యలు ఎదుర్కోనుందో కాలమే జవాబుదారి కానుంది. ఓ రాజధాని పూర్తయ్యేందుకు ఎన్నేళ్లు పడుతుందో పక్కనే ఉన్న రాష్ట్రం ద్వారా తెలుస్తున్నప్పుడు తన పదవికాలంలోనే రాజధాని పూర్తి చేస్తానని చెప్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాటలు ఎంతమేరకు నిజమో ఎదురుచూడాల్సిందే. -
కొత్త రాజధానికి వెళ్లాలా వద్దా?
-
కొత్త రాజధానికి వెళ్లాలా వద్దా?
హైదరాబాద్: కొత్త రాజధానికి తరలి వెళ్లే విషయంలో ఏపీ సచివాలయం ఉద్యోగులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ అంశంపై చర్చించుకునేందుకు బుధవారం ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాల సమావేశం నిర్వహించారు. రాజధానికి తరలి వెళ్లడంపై సమాలోచనలు చేశారు. ప్రత్యేక హోదా కోసం చేయాల్సిన పోరాటంపై కూడా ఉద్యోగ సంఘాలు చర్చించాయి. అనంతరం విజయవాడకు కార్యాలయాల తరలింపుపై సాయంత్రం సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు పలు డిమాండ్లు సీఎస్ ముందుకు తెచ్చారు. వాటిల్లో.. * సరైన సౌకర్యాలు కల్పిస్తేనే కొత్త రాజధాని ప్రాంతానికి వెళతాం. * ఇప్పటికిప్పుడు రాజధానికి తరలి వెళ్లాలంటే సాధ్యం కాదు * మౌలిక, గృహ వసతితోపాటు 35శాతం హెచ్ఆర్ఏ సంగతి కూడా తేల్చాలి * తమ పిల్లలు అక్కడ స్థానికేతరులుగా మారే అవకాశం ఉన్నందున స్థానికతపై స్పష్టత ఇవ్వాలి * వారానికి ఐదు రోజులే పనిదినాలు ఉండాలి * బస్సు సౌకర్యాలు కల్పించాలి * ముందు వీటిన్నింటిపై స్పష్టత ఇవ్వాలి.. అప్పుడే ఎంతమంది వెళ్లాలో నిర్ణయించుకుంటాం -
కొత్త రాజధానికి ఆశీస్సులివ్వాలని ప్రార్థించా
సాక్షి, తిరుమల: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణానికి ఆశీస్సులివ్వాలని తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ప్రార్థించానని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏడాది పాలన సమర్థవంతంగా సాగిందన్నారు. ఈ వారంలోనే నూతన రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరగనుందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇదొక కీలక పరిణామమని చెప్పారు. ఇందుకు శ్రీవారు కూడా సంపూర్ణమైన ఆశీస్సులు అందిస్తారన్నారు. -
సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బ
తెలుగుదేశం ప్రభుత్వానికి కోర్టులో మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజధాని ప్రాంత భూసేకరణ కోసం ప్రభుత్వం జారీచేసిన 166 జీవోపై రెండు వారాల పాటు స్టే ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సామాజిక ప్రభావ అంచనాను విస్మరించారని, అందువల్ల ఈ జీవో అమలును రెండు వారాల పాటు నిలిపివేస్తున్నామని కోర్టు తెలిపింది. ల్యాండ్ పూలింగ్ సాధ్యం కాకపోవడంతో భూసేకరణ చట్టాన్ని ప్రయోగించాలని ఈనెల 18న చంద్రబాబు సర్కారు ఈ జీవో జారీచేసింది. దీన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లు హైకోర్టులో విచారణకు రాగా ప్రముఖ న్యాయవాది రవిశంకర్ పిటిషనర్ల తరఫున వాదించారు. ఆ వాదనతో ఏకీభవించిన కోర్టు.. జీవో నెం. 166 అమలును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా, రాష్ట్ర రాజధాని అమరావతి నగర నిర్మాణానికి జూన్ 6వ తేదీన శంకుస్థాపన ముహూర్తం పెట్టుకున్నారు. ఇంతలోనే ఈ జీవోను నిలిపివేస్తూ కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం ప్రభుత్వానికి గట్టి దెబ్బేనని పరిశీలకులు అంటున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా భూసేకరణ మీద చర్చ జరుగుతోంది. పార్లమెంటు సమావేశాలు కూడా దీని గురించే వాయిదా పడుతున్నాయి. బహుళ పంటలు పండే భూములను తీసుకోకూడదని, సామాజిక ప్రభావ అంచనా తీసుకోవాలని, ఐదేళ్ల పాటు భూములను వినియోగించకపోతే వాటిని వెనక్కి ఇవ్వాలని, 80 శాతం రైతులు తప్పనిసరిగా భూసేకరణకు ఆమోదం తెలపాలని ఇంతకుముందు భూసేకరణ చట్టంలో ఉండగా, వాటిని తొలగిస్తూ ఇటీవల ఎన్డీయే ప్రభుత్వం ఆర్డినెన్సు జారీచేసింది. అయితే రెండుసార్లు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టినా అది ఆమోదం పొందలేదు. దాంతో ప్రభుత్వం కూడా ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గుతోంది. ఇలాంటి సమయంలో భూసేకరణ చట్టాన్ని ప్రయోగించాలనుకున్న ఏపీ సర్కారుకు కోర్టులో ఎదురుదెబ్బ తప్పలేదు. -
గుంటూరు జెడ్పీలో 'రాజధాని' పై చర్చ
గుంటూరు : గుంటూరు జిల్లా పరిషత్ సమావేశంలో శుక్రవారం రాజధాని అంశంపై చర్చ జరిగింది. శుక్రవారం ఉదయం సమావేశం ప్రారంభమైన వెంటనే వెఎస్సార్‌సీసీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని నిలదీశారు. రాజధాని నిర్మాణానికి భూ సేకరణ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ప్రభుత్వాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి వివరణ కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరపున వ్యవసాయ మంత్రి పత్తిపాటి పుల్లారావు, సభ్యుల ప్రశ్నలకు సమాధానమిచ్చారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రాజధాని ప్రాంతం రైస్ భౌల్ కాదు
-
రాజధాని ప్రాంతం రైస్ బౌల్ కాదు
హైదరాబాద్: రాజధాని ప్రాంతం రైస్ బౌల్ కాదని ఆంధ్రప్రదేశ్ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అన్నారు. శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదిక తప్పు అని ఆయన అన్నారు. అక్కడ పండే పంటలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చక్కటి ఆహార పంటలు పండే ప్రాంతాలను రాజధాని భూములుగా సేకరించి పొరపాటు చేస్తున్నారని శివరామకృష్ణన్ పేర్కొంటూ ఓ వ్యాసం రాసిన విషయం తెలిసిందే. దీనిపై కుటుంబరావు స్పందిస్తూ రాజధాని ప్రాంతంలో పండే పంటలపై జాతీయ స్థాయిలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. బహుళ పంటు పండే వ్యవసాయం లాభసాటిగా ఉంటే 75శాతం మంది రైతులు ఎందుకు తమ భూములను కౌలుకు ఇస్తారని ప్రశ్నించారు. చిన్న సమస్యలు పెద్దవిగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. -
మే 21లోగా ల్యాండ్‌పూలింగ్ పూర్తి
సాక్షి, హైదరాబాద్: రాజధాని కోసం చేపట్టిన భూసమీకరణ(ల్యాండ్‌పూలింగ్) ప్రక్రియను మే 21లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో భూ సమీకరణను మరింత వేగవంతం చేయడానికి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ సీహెచ్ శ్రీధర్‌కు బాధ్యతలు అప్పగిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి గిరిధర్ అరమానె బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. -
స్విస్ ఛాలెంజ్ విధానంలోనే..
రాజధాని మాస్టర్ డెవలపర్ ఎంపికపై కేబినెట్ నిర్ణయం అంతర్జాతీయ బిడ్డింగ్‌లు ఆహ్వానించేందుకు ఆమోదం రాజధానిలో మౌలిక సదుపాయాల క ల్పనకు సీసీడీఎంసీ పీపీపీ విధానంలో మౌలిక సదుపాయాలు: మంత్రి నారాయణ సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణానికి మాస్టర్ డెవలపర్‌ను స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఎంపిక చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అలాగే రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన, భవన నిర్మాణాలకుగాను కేపిటల్ సిటీ డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ కంపెనీ (సీసీడీఎంసీ)ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని తీర్మానించింది. సీఎం ఎన్.చంద్రబాబు అధ్యక్షతన బుధవారం ఇక్కడ సమావేశమైన కేబినెట్ దీనిపై చర్చించింది. స్విస్ చాలెంజ్ పద్ధతిలోనే మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేయాలని నిర్ణయించింది. సింగపూర్‌కు చెందిన జురాంగ్, సుర్బానా ఇంటర్నేషనల్ సంస్థలు మాస్టర్ ప్లాన్ రూపొందించిన నేపథ్యంలో.. మాస్టర్ డెవలపర్‌ను స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఎంపిక చేయబోతున్నారని ‘సాక్షి’ (ఏప్రిల్ 8 వ తేదీ) ముందుగానే పాఠకులకు తెలియజేసింది. మంత్రిమండలి సమావేశం అనంతరం మంత్రి పి.నారాయణ మీడియాతో మాట్లాడారు. స్విస్ చాలెంజ్ పద్ధతిలో మాస్టర్ డెవలపర్‌ను ఎంపిక చేసేందుకు గాను అంతర్జాతీయ బిడ్డింగ్‌లు ఆహ్వానించడానికి కేబినెట్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి సింగపూర్ ఇప్పటికే మాస్టర్ ప్లాన్ అందించిందనీ, మే 15 నుంచి నెలాఖరులోగా కేపిటల్ సిటీ ప్లాన్, జూన్ మొదటి వారం నుంచి రెండో వారంలోగా సీడ్ కేపిటల్ (రాజ్‌భవన్, సచివాలయం, అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించే ప్రాంతం) ప్లాన్ అందించనున్నట్లు మంత్రి తెలిపారు. సీసీడీఎంసీ విధి విధానాలపై ప్రాథమికంగా చర్చించామన్నారు. వాయు, జల, రోడ్డు రవాణా మార్గాల ఏర్పాటు, విద్యుత్, నీరు, డ్రెయినేజీ తదితర సౌకర్యాలన్నీ సీసీడీఎంసీ కల్పిస్తుందని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనను పీపీపీ విధానంలో చేపట్టే అంశం పరిశీలనలో ఉందన్నారు. కేపిటల్ సిటీ పరిధిని 225 చ.కి.మీ. నుంచి 375 చ.కి.మీ. మేరకు పెంచాలని తీర్మానించామన్నారు. పర్యాటకాభివృద్ధికి 10 వేల ఎకరాలు కృష్ణా నదికి ఉత్తరం వైపున రాజధాని ప్రాంతంలో పర్యాటకాభివృద్ధికి అయిదు నుంచి పది వేల ఎకరాలను భూ సమీకరణ కింద సేకరించాలని నిర్ణయించినట్టు మంత్రి వెల్లడించారు. విమానాశ్రయానికి 12 వేల ఎకరాలు: పల్లె విజయనగరం జిల్లా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇందుకు భూ సమీకరణ పద్ధతిలో 12 వేల ఎకరాల భూమిని సమీకరిస్తామని సమాచారశాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి విలేకరులకు తెలిపారు. కర్నూల్ జిల్లా జూపాడుబంగ్లా మండలం తంగడంచె గ్రామం సర్వే నంబరు 345లో 211 ఎకరాల భూమిని జొన్నల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కోసం గుజరాత్‌కు చెందిన అంబుజా ఎక్స్‌పోర్ట్స్ సంస్థకు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానించింది. ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వం నడుంకట్టింది. అటవీ చట్టానికి ప్రతిపాదించిన సవరణలకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. మే 1 నుంచి ఉద్యోగులకు కొత్త వేతనాలు పదో వేతన సంఘం ప్రతిపాదనల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్తో కూడిన నూతన వేతనాలను మే 1 నుంచి ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అంగన్వాడీ ఉద్యోగులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు (సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, మేయర్) వేతనాల పెంపుపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తారు. జూన్ 2న రాజధానికి శంకుస్థాపన ! నూతన రాజధాని నగరం అమరావతి నిర్మాణానికి జూన్ 2న శంకుస్థాపన చేయాలని మంత్రివర్గ సమావేశం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఒకవేళ ఆ రోజు వీలుకాని పక్షంలో అదే నెల 12 లేదా 13 తేదీల్లో శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. మహిళల నైపుణ్యాభివృద్ధికి తోడ్పాటు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏపీలో స్వయం సహాయక బృందాల మహిళలకు నైపుణ్యాభివృద్ధిలో తోడ్పాటు అందిస్తామని బహుళజాతి సంస్థ వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డేవిడ్ ఛీజ్ రైట్ బుధవారం తెలిపారు. సీఎంతో భేటీ అయ్యారు. స్మార్ట్ కాకినాడకు జపాన్ సహకారం కాకినాడను స్మార్ట్ సిటీగా రూపొందించడంలో ఏపీ ప్రభుత్వానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని జపాన్‌కు చెందిన యొకోహమా సిటీ కౌన్సిల్ అధికారులు ప్రకటించారు. -
జూన్‌లో రాజధానికి భూమి పూజ
తాడికొండ: నూతన రాజధానికి జూన్ మొదటివారంలో శంకుస్థాపన చేస్తామని రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడులో పొలం చదును చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకూ 5 వేల ఎకరాలకు సంబంధించి మొత్తం రూ.19.80 కోట్ల కౌలు డీడీలను రైతులకు అందించామన్నారు. తాత్కాలిక రాజధాని ఏర్పాటుపై ప్రభుత్వం ఆలోచనలో పడిందని చెప్పారు. పురపాలక మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ 2018 నాటికి రాజధాని నిర్మాణం తొలిదశ పూర్తవుతుందన్నారు. -
ఏపీ రాజధాని పేరు అమరావతిగా ఖరారు
ఏపీ పారిశ్రామిక విధానానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే రాజధానికి అమరావతి పేరును ఖరారు చేశారు. బుధవారం ఉదయం ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం.. మధ్యాహ్నం వరకు కొనసాగింది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇలా ఉన్నాయి.. ఇండస్ట్రియల్ పాలసీకి ఆమోదం ఏపీ రాజధానికి అమరావతి పేరు ఖరారు 10 లక్షల ఎకరాలతో ల్యాండ్ బ్యాంక్ వ్యవసాయం, బయోటెక్ రంగాలకు ప్రోత్సాహకాలు 99 ఏళ్ల పాటు భూములను లీజుకు ఇవ్వాలని నిర్ణయం 100 కోట్లకు పైగా పెట్టుబడి పెడితే ప్రత్యేక రాయితీలు స్వచ్ఛ్, గ్రీన్ ఏపీలకు సహకరిస్తే ఐదేళ్ల పాటు వ్యాట్, జీఎస్పీ రీయింబర్స్ చేయాలని నిర్ణయం ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు -
భూ సేకరణ బిల్లును వ్యతిరేకిస్తాం
హైదరాబాద్: కేంద్రం తీసుకొస్తున్న భూ సేకరణ చట్టం సవరణ బిల్లును లోక్‌సభలో వ్యతిరేకించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. ఆదివారం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ ఎంపీలు బుట్టా రేణుక (కర్నూలు), వరప్రసాద్ (తిరుపతి), వైవీ సుబ్బారెడ్డి (ఒంగోలు), పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఖమ్మం) ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం అనంతరం మేకపాటి వివరాలను వెల్లడిస్తూ.. భూసేకరణ బిల్లును సోమవారం లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతోందని, దీనిని తాము వ్యతిరేకించనున్నామని చెప్పారు. గత చట్టంలో ఉన్న బహళ పంటలు పండే భూములకు మినహాయింపు, రైతుల నుంచి భూమి సేకరించడం వల్ల సమాజంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడం తదితర క్లాజులను.. ప్రస్తుత సవరణ చట్టం నుంచి తొలగించడాన్ని తమ పార్టీ తొలినుంచీ వ్యతిరేకిస్తోందని, ఇపుడు కూడా అదే వైఖరిని అనుసరించాలని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తమకు చెప్పారని ఆయన వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే చట్టంలో ఈ రెండు క్లాజుల సవరణను తొలగిస్తే మంచిదని, లేనిపక్షంలో తామే వాటికి సంబంధించి సవరణలు ఇస్తామని, ఓటింగ్‌ను కూడా కోరతామని మేకపాటి వెల్లడించారు. ప్రత్యేక హోదా కోసం కృషి ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామనే హామీని అమలుకు లోక్‌సభలో కృషి చేస్తామని మేకపాటి చెప్పారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఈ విషయాన్ని లేవనెత్తుతామన్నారు. విభజన సమయంలో ప్రత్యేక హోదా పదేళ్లపాటు ఉండాలని బీజేపీ నేత వెంకయ్యనాయుడు కోరారని, ప్రస్తుతం కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే కనుక వారు మాట నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదాకు సానుకూలంగానే ఉన్నారు కాబట్టి.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. అటు కేంద్రంలో టీడీపీకి చెందినవారు, ఇటు రాష్ట్రంలో బీజేపీకి చెందిన వారు మంత్రులుగా ఉన్నారు కనుక ప్రత్యేక హోదా సాధించాల్సిన బాధ్యత చంద్రబాబుపైనే ఎక్కువగా ఉందని మేకపాటి అన్నారు. ప్రత్యేక హోదా ఉండటానికి, లేక పోవడానికి పెద్ద తేడా ఏమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పడం సరికాదన్నారు. ఏపీ మాదిరిగానే పశ్చిమబెంగాల్, బిహార్‌కు ప్రత్యేక ఆర్థికసాయం చేస్తామని బడ్జెట్లో చెప్పారే గాని ఏపీకి ఎలా ఇస్తారో చెప్పలేదని అన్నారు. అస్సాంకు 1969 నుంచీ ప్రత్యేక హోదా ఉందని, దానిని ఇంకా కొనసాగించాలని ఇటీవలే అక్కడి అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపిందన్నారు. పోలవరానికి కేవలం రూ. వంద కోట్లు కేటాయించడం శోచనీయమన్నారు. హైకోర్టు విభజనలో జాప్యం ఎందుకు?: పొంగులేటి తెలంగాణ అభివృద్ధి కోసం లోక్‌సభలో వైఎస్సార్సీపీ తరఫున పోరాడతామని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చక పోవడం వల్ల తమ రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. హైకోర్టును విభజించాలని ఎప్పటి నుంచో ప్రజా ప్రతినిధులు కోరుతున్నా జాప్యం ఎందు కు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణలోని ప్రాణహిత-చేవెళ్ల బృహత్తర ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించకుండా కేంద్రం చిన్నచూపు చూసిం దని, దీనిని తాము లోక్‌సభలో ప్రశ్నిస్తామని ఆయన చెప్పారు. ఇవే కాదు, తెలంగాణ ప్రజల తరఫున ఎలాంటి పోరాటానికైనా తాము సంసిద్ధంగాఉన్నామని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. -
రైతుల భూములతో.. టీడీపీ వ్యాపారం!
-
భయపెట్టి, హింసించి.. భూములు లాక్కుంటున్నారు!
-
పేద రైతుల పొట్ట కొట్టొద్దు!
-
రాజధాని ప్రాంతంలో సింగపూర్ టీం పర్యటన
-
ఫోర్త్ ఎస్టేట్ : రాజధాని పంట పొలాల్లో మంటలు!
-
'నాలుగు రోజులైనా నిందితులను పట్టుకోలేదు'
హైదరాబాద్: తుళ్లూరు మండలంలోని రైతుల ఆస్తుల విధ్వంసాన్ని ప్రతిపక్షాలు చేయించాయనడం సరికాదని జన చైతన్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు వి.లక్ష్మణ్‌రెడ్డి అన్నారు. గురువారం హైదరాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాజధాని భూముల్లో విధ్వంసం జరిగి నాలుగురోజులైనా ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదని అన్నారు. రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని.... అలాగే నిందితులను కఠినంగా శిక్షించాలని లక్ష్మణ్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో రాజధానిని నిర్మించి కృష్ణానదిని మరో మూసీ నదిగా మార్చవద్దని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైతల నుంచి స్వచ్ఛందంగా భూములు సేకరించాలి... రైతులను భయబ్రాంతులకు గురి చేయొవద్దని ఆయన ప్రభుత్వానికి హితవు పలికారు. భూములు పారిశ్రామికవేత్తలు, బినామీలకు కట్టబెట్టాలని చూసే ఐక్యంగా ఉద్యమిస్తామని చంద్రబాబు ప్రభుత్వాన్ని లక్ష్మణ్‌రెడ్డి హెచ్చరించారు. పోలీసు యంత్రాంగంపై సీఎం చంద్రబాబు, హోం మంత్రి చినరాజప్ప చేసిన ప్రకటనలను ఈ సందర్బంగా లక్ష్మణ్‌రెడ్డి ఖండించారు. -
సీఆర్డీఏ చట్టంపై ప్రత్తిపాటి పుల్లారావు
-
సింగపూర్ నుంచి ఒక బృందం వస్తోంది!