తాడికొండ: నూతన రాజధానికి జూన్ మొదటివారంలో శంకుస్థాపన చేస్తామని రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం దొండపాడులో పొలం చదును చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకూ 5 వేల ఎకరాలకు సంబంధించి మొత్తం రూ.19.80 కోట్ల కౌలు డీడీలను రైతులకు అందించామన్నారు. తాత్కాలిక రాజధాని ఏర్పాటుపై ప్రభుత్వం ఆలోచనలో పడిందని చెప్పారు. పురపాలక మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ 2018 నాటికి రాజధాని నిర్మాణం తొలిదశ పూర్తవుతుందన్నారు.