తుది అంకానికి వికేంద్రీకరణ | Decentralization of administration and CRDA Act bills came to Governor‌ approval | Sakshi
Sakshi News home page

తుది అంకానికి వికేంద్రీకరణ

Published Sun, Jul 19 2020 2:56 AM | Last Updated on Sun, Jul 19 2020 5:41 PM

Decentralization of administration and CRDA Act bills came to Governor‌ approval - Sakshi

సాక్షి, అమరావతి: చరిత్రాత్మకమైన ‘పరిపాలన వికేంద్రీకరణ–ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020’ను రాష్ట్ర ప్రభుత్వం శనివారం గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోదం కోసం పంపింది. దీనితోపాటు సీఆర్‌డీఏ చట్టం–2014 రద్దు బిల్లు కూడా పంపింది. ఈ రెండింటినీ రాష్ట్ర శాసనసభ ఇప్పటికే రెండుసార్లు ఆమోదించిన విషయం తెలిసిందే. కానీ, ఈ రెండు పర్యాయాలూ శాసన మండలిలో టీడీపీ గందరగోళం సృష్టించి ఈ బిల్లులకు మోకాలడ్డినప్పటికీ నియమిత కాలం పూర్తికావడంతో ఇక మండలితో పనిలేకుండా ఏపీ లెజిస్లేచర్‌ అధికారులు గవర్నర్‌ ఆమోదానికి వీటిని పంపారు. గవర్నర్‌ ఆమోదం ఇక లాంఛనమే కనుక ఆ తదుపరి రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది.
 
ప్రాంతీయ సమానాభివృద్ధి లక్ష్యంగా..
పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రాంతీయ సమానాభివృద్ధిని సాధించాలన్న బృహత్తరమైన లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ బిల్లులను ప్రతిపాదించింది. వీటిని శాసనసభ ఈ ఏడాదిలో రెండుసార్లు ఆమోదించింది. కానీ, ఈ రెండుసార్లూ శాసన మండలిలో టీడీపీ తనకున్న సంఖ్యాబలంతో ఆమోదం పొందకుండా అడ్డుకుంది. 
– ఈ ఏడాది జనవరి 20న తొలిసారి శాసనసభలో ఈ బిల్లులను ఆమోదించి మండలికి పంపగా.. అక్కడ జనవరి 22న గందరగోళ పరిస్థితుల నడుమ మండలి ఛైర్మన్‌ ఎటూ తేల్చకుండా సభను వాయిదా వేశారు. 
– శాసనసభ ఆమోదించిన బిల్లుపై మండలిలో ఎలాంటి తదుపరి చర్యలూ మూడు నెలలపాటు (నిర్ణీత గడువు) ముందుకు సాగకపోవడంతో దాని వ్యవధి పూర్తయింది. 
– మళ్లీ జూన్‌ 16న రెండోసారి రాష్ట్ర ప్రభుత్వం–ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020, సీఆర్డీఏ చట్టం–2014 రద్దు బిల్లును అసెంబ్లీలో ఆమోదించి మండలికి పంపారు. 
– కానీ, 17న టీడీపీ కుటిల వైఖరివల్ల ఈ బిల్లులు ఆమోదం పొందలేదు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు దౌర్జన్యకాండకు దిగిన విషయం తెలిసిందే.

మండలి ముందు మూడు ప్రత్యామ్నాయాలు
నిజానికి.. రెండోసారి అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు శాసన మండలికి వచ్చినపుడు సభ ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉంటాయి. అవి..
– శాసనసభ ఆమోదించిన బిల్లును తిరస్కరించడం తొలి ప్రత్యామ్నాయం. 
– గతంలో ఇదే బిల్లును తిరస్కరించినప్పుడు మండలిలో ప్రతిపాదించిన సవరణలను చేయాలని పట్టుబట్టడం రెండో ప్రత్యామ్నాయం. 
– రెండోసారి వచ్చిన బిల్లుపై 30 రోజుల వరకూ క్రియారహితంగా ఉండటం మూడో ప్రత్యామ్నాయం. 
– ప్రస్తుత పరిస్థితుల్లో తొలి రెండు ప్రత్యామ్నాయాలు సాధ్యంకాలేదు. 
– 30 రోజులపాటు ఈ బిల్లుపై కౌన్సిల్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది కనుక ఆ బిల్లు ఆమోదం పొందినట్లుగా ఆర్టికల్‌ 197(2)(బి) ప్రకారం పరిగణిస్తారు. ప్రస్తుతం అదే జరిగింది. 
– మండలికి పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు రెండూ చేరి ఈ నెల 17వ తేదీకి 30 రోజులు పూర్తయ్యాయి కనుక శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు వీటిని గవర్నర్‌ ఆమోదం కోసం శనివారం రాజ్‌భవన్‌కు పంపారు. 
– గవర్నర్‌ ఆమోదం పొందిన పిదప బిల్లు చట్టం అవుతుంది కనుక పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటుచేయడానికి అవకాశం కలుగుతుంది. 

పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై ఎప్పుడేం జరిగిందంటే..
– సెప్టెంబర్‌ 13, 2019 : రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చేందుకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటుచేసిన ప్రభుత్వం.
– డిసెంబర్‌ 20, 2019 : రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని.. అమరావతిలో శాసన రాజధాని (లెజిస్లేటివ్‌ కేపిటల్‌), విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ (పరిపాలన రాజధాని), కర్నూలులో జ్యుడిషియల్‌ కేపిటల్‌ (న్యాయ రాజధాని) ఏర్పాటుచేయాలని సిఫార్సు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఇచ్చింది.
– డిసెంబర్‌ 27, 2019 : జీఎన్‌ రావు కమిటీ నివేదిక.. బీసీజీ (బోస్టన్‌ కన్సల్టెంగ్‌ గ్రూప్‌) ఇచ్చే నివేదికలను అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు హైపవర్‌ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం.
– డిసెంబర్‌ 29, 2019 : హైపవర్‌ కమిటీని ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
– జనవరి 3, 2020 : రాష్ట్ర సమగ్ర, సమతుల అభివృద్ధికి పరిపాలన వికేంద్రీకరణే ఏకైక మార్గమని.. అమరావతిలో లెజిస్లేటివ్‌ కేపిటల్, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్, కర్నూలులో జ్యుడిషియల్‌ కేపిటల్‌  ఏర్పాటుచేయాలని సిఫార్సు చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌కు నివేదిక ఇచ్చిన బీసీజీ.
– జనవరి 17, 2020 : జీఎన్‌ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై అధ్యయనం చేసి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నివేదిక ఇచ్చిన హైపవర్‌ కమిటీ.
– జనవరి 20, 2020 : హైపవర్‌ కమిటీ నివేదికపై చర్చించిన కేబినెట్‌.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన మంత్రివర్గం. ఆ బిల్లును తొలిసారి శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. బిల్లును ఆమోదించిన అసెంబ్లీ.
– జనవరి 22, 2020 : బిల్లును అటు ఆమోదించకుండా.. ఇటు తిరస్కరించకుండా శాసన మండలిలో తొండాట ఆడిన టీడీపీ.
– జూన్‌ 16, 2020 : రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును మరోసారి ఆమోదించిన శాసనసభ.
– జూన్‌ 17, 2020 : శాసనసభ రెండోసారి ఆమోదించిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో అటు ఆమోదించకుండా.. ఇటు తిరస్కరించకుండా టీడీపీ సైంధవపాత్ర పోషించింది.  ఏపీ లెజిస్లేచర్‌ అధికారులు గవర్నర్‌ ఆమోదానికి వీటిని పంపారు. గవర్నర్‌ ఆమోదం ఇక లాంఛనమే కనుక ఆ తదుపరి రాష్ట్రంలో మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మార్గం సుగమం అవుతుంది.
 
ప్రాంతీయ సమానాభివృద్ధి లక్ష్యంగా..
పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ప్రాంతీయ సమానాభివృద్ధిని సాధించాలన్న బృహత్తరమైన లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ బిల్లులను ప్రతిపాదించింది. వీటిని శాసనసభ ఈ ఏడాదిలో రెండుసార్లు ఆమోదించింది. కానీ, ఈ రెండుసార్లూ శాసన మండలిలో టీడీపీ తనకున్న సంఖ్యాబలంతో ఆమోదం పొందకుండా అడ్డుకుంది. 
– ఈ ఏడాది జనవరి 20న తొలిసారి శాసనసభలో ఈ బిల్లులను ఆమోదించి మండలికి పంపగా.. అక్కడ జనవరి 22న గందరగోళ పరిస్థితుల నడుమ మండలి ఛైర్మన్‌ ఎటూ తేల్చకుండా సభను వాయిదా వేశారు. 
– శాసనసభ ఆమోదించిన బిల్లుపై మండలిలో ఎలాంటి తదుపరి చర్యలూ మూడు నెలలపాటు (నిర్ణీత గడువు) ముందుకు సాగకపోవడంతో దాని వ్యవధి పూర్తయింది. 
– మళ్లీ జూన్‌ 16న రెండోసారి పరిపాలనా వికేంద్రీకరణ–ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లు–2020, సీఆర్డీఏ చట్టం–2014 రద్దు బిల్లును అసెంబ్లీలో ఆమోదించి మండలికి పంపారు. 
– కానీ, 17న టీడీపీ కుటిల వైఖరివల్ల ఈ బిల్లులు ఆమోదం పొందలేదు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులు దౌర్జన్యకాండకు దిగిన విషయం తెలిసిందే.

మండలి ముందు మూడు ప్రత్యామ్నాయాలు
నిజానికి.. రెండోసారి అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు శాసన మండలికి వచ్చినపుడు సభ ముందు మూడు ప్రత్యామ్నాయాలు ఉంటాయి. అవి..
– శాసనసభ ఆమోదించిన బిల్లును తిరస్కరించడం తొలి ప్రత్యామ్నాయం. 
– గతంలో ఇదే బిల్లును తిరస్కరించినప్పుడు మండలిలో ప్రతిపాదించిన సవరణలను చేయాలని పట్టుబట్టడం రెండో ప్రత్యామ్నాయం. 
– రెండోసారి వచ్చిన బిల్లుపై 30 రోజుల వరకూ క్రియారహితంగా ఉండటం మూడో ప్రత్యామ్నాయం. 
– ప్రస్తుత పరిస్థితుల్లో తొలి రెండు ప్రత్యామ్నాయాలు సాధ్యంకాలేదు. 
– 30 రోజులపాటు ఈ బిల్లుపై కౌన్సిల్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది కనుక ఆ బిల్లు ఆమోదం పొందినట్లుగా ఆర్టికల్‌ 197(2)(బి) ప్రకారం పరిగణిస్తారు. ప్రస్తుతం అదే జరిగింది. 
– మండలికి పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లు రెండూ చేరి ఈ నెల 17వ తేదీకి 30 రోజులు పూర్తయ్యాయి కనుక శాసనసభ కార్యదర్శి పి.బాలకృష్ణమాచార్యులు వీటిని గవర్నర్‌ ఆమోదం కోసం శనివారం రాజ్‌భవన్‌కు పంపారు. 
– గవర్నర్‌ ఆమోదం పొందిన పిదప బిల్లు చట్టం అవుతుంది కనుక పరిపాలనా రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటుచేయడానికి అవకాశం కలుగుతుంది. 

పరిపాలన వికేంద్రీకరణ బిల్లుపై ఎప్పుడేం జరిగిందంటే..
– సెప్టెంబర్‌ 13, 2019 : రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇచ్చేందుకు రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌ రావు నేతృత్వంలో నిపుణుల కమిటీ ఏర్పాటుచేసిన ప్రభుత్వం.
– డిసెంబర్‌ 20, 2019 : రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించాలంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలని.. అమరావతిలో శాసన రాజధాని (లెజిస్లేటివ్‌ కేపిటల్‌), విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ (పరిపాలన రాజధాని), కర్నూలులో జ్యుడిషియల్‌ కేపిటల్‌ (న్యాయ రాజధాని) ఏర్పాటుచేయాలని సిఫార్సు చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి జీఎన్‌ రావు కమిటీ నివేదిక ఇచ్చింది.
– డిసెంబర్‌ 27, 2019 : జీఎన్‌ రావు కమిటీ నివేదిక.. బీసీజీ (బోస్టన్‌ కన్సల్టెంగ్‌ గ్రూప్‌) ఇచ్చే నివేదికలను అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు హైపవర్‌ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం.
– డిసెంబర్‌ 29, 2019 : హైపవర్‌ కమిటీని ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
– జనవరి 3, 2020 : రాష్ట్ర సమగ్ర, సమతుల అభివృద్ధికి పరిపాలన వికేంద్రీకరణే ఏకైక మార్గమని.. అమరావతిలో లెజిస్లేటివ్‌ కేపిటల్, విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్, కర్నూలులో జ్యుడిషియల్‌ కేపిటల్‌  ఏర్పాటుచేయాలని సిఫార్సు చేస్తూ సీఎం వైఎస్‌ జగన్‌కు నివేదిక ఇచ్చిన బీసీజీ.
– జనవరి 17, 2020 : జీఎన్‌ రావు కమిటీ, బీసీజీ నివేదికలపై అధ్యయనం చేసి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి నివేదిక ఇచ్చిన హైపవర్‌ కమిటీ.
– జనవరి 20, 2020 : హైపవర్‌ కమిటీ నివేదికపై చర్చించిన కేబినెట్‌.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆమోదించిన మంత్రివర్గం. ఆ బిల్లును తొలిసారి శాసనసభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం. బిల్లును ఆమోదించిన అసెంబ్లీ.
– జనవరి 22, 2020 : బిల్లును అటు ఆమోదించకుండా.. ఇటు తిరస్కరించకుండా శాసన మండలిలో తొండాట ఆడిన టీడీపీ.
– జూన్‌ 16, 2020 : రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ బిల్లును మరోసారి ఆమోదించిన శాసనసభ.
– జూన్‌ 17, 2020 : శాసనసభ రెండోసారి ఆమోదించిన పరిపాలన వికేంద్రీకరణ బిల్లును శాసన మండలిలో అటు ఆమోదించకుండా.. ఇటు తిరస్కరించకుండా టీడీపీ సైంధవపాత్ర పోషించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement