సాక్షి, అమరావతి: టెన్త్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. విద్యార్థుల భవిష్యత్‌తో ఆడుకున్న వారిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. నారాయణ విద్యాసంస్థల కేంద్రంగానే పేపర్ లీకేజీకి కుట్ర జరిగినట్లు గుర్తించారు. పోలీస్ కస్టడీలో నారాయణ విద్యా సంస్థల వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ రెడ్డి నిజాలు వెల్లడించారు. మాజీ మంత్రి నారాయణ ప్రోద్భలంతోనే పేపర్ లీక్ చేసినట్లు విచారణలో వైస్ ప్రిన్సిపల్ గిరిధర్ ఒప్పకున్నారు.
గిరిధర్ వాంగ్మూలం ఆధారంగా ఏపీ సీఐడీ పోలీసులు మంగళవారం నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగు రోజులుగా మాజీ మంత్రి నారాయణ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఎవరికీ అందుబాటులో లేరు. దీంతో ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో మాజీ మంత్రి నారాయణతో పాటు, ఆయన సతీమణి రమాదేవిని అదుపులోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరుకు తరలిస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఈ ఘటనలో మొత్తంగా చిత్తూరు వన్ టౌన్ పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు ప్రభుత్వ టీచర్లు ఉన్నారు. మిగిలిన వారు నారాయణ, శ్రీ చైతన్య, చైతన్య కృష్ణ రెడ్డి, ఎన్ఆర్‌ఐ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న వారుగా తెలుస్తోంది. వీరు అంతా కూడా గతంలో నారాయణ విద్యా సంస్థల్లో పనిచేసిన వేరే కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment