సాక్షి, విజయవాడ: నారాయణ అల్లుడు పునీత్ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఐడీ నోటీసులను సస్పెండ్ చేయాలని పునీత్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ నోటీస్ క్వాష్ చేయాలన్న పునీత్ పిటిషన్‌ను కోర్టు డిస్పోజ్ చేసింది. న్యాయవాదితో కలిసి రేపు సీఐడీ విచారణకు హాజరుకావాలని పునీత్‌ను హైకోర్టు ఆదేశించింది.
ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. కొత్త కోణాలు వెలుగులోకి
టీడీపీ హయాంలో అమరావతి భూదోపిడీ పర్వంలో కీలకమైన ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేదు..! మాకేం తెలియదంటూ చంద్రబాబు, నారాయణ, లోకేశ్ బృందం ఎంత బుకాయిస్తున్నా అక్రమాలు ఒక్కొక్కటిగాబయటపడుతున్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ గురించి తమకు ముందుగా ఏమాత్రం తెలియదన్న వారి వాదనలో నిజం లేదని తేలిపోయింది. రైతులు, ఇతరుల ప్రయోజనాలను దెబ్బ తీయడంతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టును కూడా అటకెక్కించినట్లు బహిర్గతమైంది.
ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడటం ద్వారా భారీ లబ్ధికి మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణ పక్కా ప్రణాళిక రచించారు. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబం, తమ బినామీల భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డును నిర్మించేలా అలైన్‌మెంట్‌లో మూడు సార్లు మార్పులు చేసి మరీ ఖరారు చేశారు.
అనంతరం ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించి తాము ముందస్తుగానే ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే మాస్టర్‌ప్లాన్‌లో పొందుపరచాలని షరతు విధించారు. అప్పటికే తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించుకున్నారు. తద్వారా అటు అమరావతి సీడ్ క్యాపిటల్ పరిధిలో ఇటు నదికి అవతల ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తమ భూముల ధరలు అమాంతం పెరిగేలా కుట్ర పన్నారు.
చదవండి: తోడు దొంగల ‘రింగ్’!
Comments
Please login to add a commentAdd a comment