సాక్షి, కృష్ణా: ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ స్కామ్ కేసులో.. మాజీ మంత్రి, టీడీపీ నేత పొంగూరు నారాయణకు ఝలక్ తగిలింది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే.. విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది. తాజాగా యానకు ఏపీ సీఐడీ నోటీసులు పంపింది. అక్టోబర్ 4వ తేదీన తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో పేర్కొంది దర్యాప్తు సంస్థ.
అమరావతి ఇన్నర్‌రింగ్ రోడ్డు స్కామ్‌లో ఏ2గా ఉన్న నారాయణ.. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ మీద బయట ఉన్నారు. తాజాగా ఈ కేసులో సీఐడీ దూకుడు పెంచడంతో.. ఆయన అరెస్టుకి భయపడి ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే.. ఈలోపే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌కు ఈ స్కామ్‌లో కీలక పాత్ర ఉందని నిర్ధారించుకుంది ఏపీ సీఐడీ. ఈ మేరకు కోర్టు ఆదేశాల ప్రకారం.. ఆయనకు నోటీసులు సైతం జారీ చేసింది.
అక్టోబర్ 4వ తేదీన నారా లోకేష్‌ను తమ ఎదుట హాజరు కావాలని స్వయంగా ఢిల్లీ వెళ్లి మరీ నోటీసులు ఇచ్చింది ఏపీ సీఐడీ. ఇప్పుడు అదే తేదీన నారాయణను సైతం విచారణ చేపడుతుండడం గమనార్హం. ఇన్నర్ రింగ్‌రోడ్డు స్కామ్ కేసులో.. ఈ ఇద్దరినీ కలిపి విచారించే అవకాశం కనిపిస్తోంది.
చంద్రబాబు హయాంలోఅమరావతి మాస్టర్ ప్లాన్‌లో అక్రమాలు జరిగాయంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ పేరిట జరిగిన భారీ అవినీతి దర్యాప్తులో వెలుగు చూసింది. ఏ-1గా చంద్రబాబు నాయుడు పేరును, ఏ-2గా మాజీ మంత్రి నారాయణ పేరును ఈ కేసులో చేర్చింది ఏపీ సీఐడీ. ఇప్పటికే చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ప్రధాన నిందితుడిగా అరెస్ట్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment