Question paper leakage
-
మార్కులు పెరిగినా.. ర్యాంకులు ఢమాల్!
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్య కోర్సులు ఎంబీబీఎస్, బీడీఎస్‌లలో ప్రవేశాలకు ఈసారి విపరీతమైన పోటీ నెలకొంది. గత రెండేళ్లతో పోలిస్తే ఎక్కువ మార్కులు సాధించినవారికి సైతం ఈసారి సీటు దక్కుతుందా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఎక్కువ మార్కులు సాధించినా ర్యాంకులు వేలల్లోకి చేరడంతో ఎక్కడ సీటు దక్కుతుందన్నదీ అర్థంకాని పరిస్థితి నెలకొంది. 2024–25 విద్యా సంవత్సరానికిగాను యూజీ వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్ కోసం వెబ్సైట్లో రిజి్రస్టేషన్ ప్రక్రియ కొనసాగుతుండగా.. ఆలిండియా కోటా (ఏఐక్యూ)కు సంబంధించిన కౌన్సెలింగ్ ఈనెల 14వ తేదీ నుంచి మొదలవనుంది. తొలుత ఆలిండియా కోటా సీట్ల కౌన్సెలింగ్ పూర్తిచేసి.. తర్వాత రాష్ట్ర స్థాయి సీట్లను భర్తీ చేస్తారు.లీకేజీ గందరగోళం మధ్య.. ⇒ ఈ ఏడాది యూజీ నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం విద్యార్థుల ను తీవ్ర గందరగోళంలోకి నెట్టింది. ఫలితాలు వెలువడ్డాక సుప్రీంలో కేసులు, వాదప్రతివాదనల అనంతరం కౌన్సెలింగ్‌కు మార్గం సుగమమైంది. దీనితో కాస్త ఆలస్యంగా రాష్ట్ర స్థాయి ర్యాంకులు వెలువడ్డాయి. వాటిని చూసుకున్న అభ్యర్థు లు సీటు వస్తుందా? రాదా? వస్తే ఎక్కడ రావొచ్చన్న ఆందోళనలో పడ్డారు.మార్కులు ఘనం.. ర్యాంకు పతనం.. ఈ ఏడాది రాష్ట్రస్థాయిలో టాప్ ర్యాంకు సాధించిన విద్యార్థికి వచి్చన మార్కులు 711, ఆలిండియా స్థాయిలో వచి్చన ర్యాంకు 137. అదే 2022 యూజీ నీట్లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన అభ్యర్థికి 711 మార్కులేరాగా.. జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు వచి్చంది. మంచి మార్కులు వచి్చనా.. ఆలిండియా ర్యాంకు బాగా తగ్గిపోయింది. పోటీ విపరీతంగా పెరగడం, చాలా మంది విద్యార్థులకు మార్కులు పెరగడమే దీనికి కారణం. మెరుగైన మార్కులు సాధించామనుకున్న విద్యార్థులు జాతీయ, రాష్ట్ర స్థాయి ర్యాంకులు మాత్రం తగ్గిపోవడంతో ఆందోళనలో పడ్డారు. దీంతో ఏ కాలేజీలో సీటు వస్తుందో అంచనా వేయలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ప్రధానంగా ఆలిండియా కోటా సీట్ల విషయంలో సీటు ఎక్కడ వస్తుందనేది అంచనా వేసే పరిస్థితి లేదని నిపుణులు పేర్కొంటున్నారు.రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌లోనూ అయోమయంప్రస్తుతం రాష్ట్ర స్థాయి ర్యాంకులు విడుదలవడంతో విద్యార్థులు రిజి్రస్టేషన్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏ కాలేజీలో సీటు వస్తుందనేది అంచనా వేసుకుంటున్నారు. కానీ ఏపీకి 15% కోటా సీట్లు రద్దు, స్థానికతపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, మార్కులు, ర్యాంకుల తీరు మారడం వంటివి విద్యార్థుల్లో అయోమయం సృష్టిస్తున్నాయి. కాలేజీల వారీగా సీట్లు, రిజర్వేషన్ కోటా ప్రకా రం విభజించి పరిశీలిస్తేనే ఏదైనా అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందని సీని యర్లు అభిప్రాయపడుతున్నారు. ఆలిండియా కోటాను మినహాయించి రాష్ట్ర స్థాయిలో సీట్ మ్యాట్రిక్స్ విడుదలైతేనే స్పష్టత వస్తుందని అంటున్నారు. -
Rahul Gandhi: ధనికులైతే చాలు పరీక్ష విధానాన్నే కొనేయొచ్చు
న్యూఢిల్లీ: ధనికులైతే చాలు పరీక్షా విధానాన్నే కొనేయొచ్చంటూ నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై పార్లమెంట్ వేదికగా విపక్షనేత రాహుల్‌గాంధీ ప్రభుత్వం తీవ్ర విమర్శలుచేశారు. గత ఏడేళ్లలో ప్రశ్నాపత్రాలు లీక్ అయినట్లు ఆధారాలు లేవంటూ లోక్‌సభలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పడంతో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాహుల్ మాట్లాడారు. ‘‘ నీట్ పేపర్ లీకేజీ ఉదంతంలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వీయతప్పిదాన్ని ఒప్పుకోవట్లేదు. ప్రతి ఒక్కరిపై నిందలేస్తూ తప్పుబడుతున్నారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుందనే కనీస అవగాహన కూడా ఆయనకు లేనట్లుంది. వరస లీకేజీలతో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడిందని కోట్లాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. భారత్‌లో పరీక్షల నిర్వహణ అనేది ఒక మోసపూరిత వ్యవహారమని అభ్యర్థులు ఒక నిర్ణయానికొచ్చారు. ధనికులైతే చాలు పరీక్షావిధానాన్నే కొనేయొచ్చు అనే పరిస్థితి నెలకొంది. ఈ తప్పు వ్యవస్థీకృతంగా జరుగుతోంది. ఈ పరిస్థితిని రూపుమాపేందుకు మీ వంతుగా ఎలాంటి కృషిచేస్తున్నారు?’ అని మంత్రిని రాహుల్ నిలదీశారు. దీంతో మంత్రి ప్రధాన్ మాట్లాడారు. ‘‘ మొత్తం పరీక్ష విధానమే నిష్పలం అన్నట్లుగా మాట్లాడటం దురదృష్టకరం. ఏడేళ్లలో 70 పేపర్లు లీక్ అయ్యాయని కాంగ్రెస్ సభ్యుడు మాణిక్కం ఠాకూర్ చెబుతున్నదంతా అబద్ధం. నిజానికి ఎన్టీఏను స్థాపించాక 240కిపైగా పరీక్షలను విజయవంతంగా నిర్వహించాం. ఐదు కోట్ల మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకున్నారు. 4.5 కోట్ల మంది వివిధ పరీక్షలు రాశారు’’ అని మంత్రి చెప్పారు. దీంతో ఠాకూర్ కలగజేసుకుని ‘‘ పేపర్ లీకేజీల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేలా ఎలాంటి నిర్ణయాలు ఆచరణలో పెడుతున్నారో మంత్రి చెప్పాలి. లేదంటే రాజీనామా చేయాలి’ అని అన్నారు. దీంతో మంత్రి స్పందించారు. ‘‘ ఇక్కడ మాలో ఏ ఒక్కరో జవాబుదారీ కాదు. ఏం జరిగినా ప్రభుత్వం మొత్తం జవాబుదారీగా ఉంటుంది’ అని వ్యాఖ్యానించారు. ‘‘పేపర్ లీకేజీల విషయంలో మోదీ సర్కార్ రికార్డ్ సృష్టించనుంది. ఒకే చోట రాసిన వారిలో ఎక్కువ మందికి అత్యధిక మార్కులు వచ్చిన పరీక్షకేంద్రాల జాబితాను విడుదలచేయాలి’ అని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ డిమాండ్‌చేశారు. అనంతరం టీఎంసీ, డీఎంకే సహా విపక్ష సభ్యులంతా వాకౌట్ చేశారు. -
రాజ్యసభలోనూ నీట్ రగడ
న్యూఢిల్లీ: నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం రాజ్యసభను కుదిపేసింది. పేపర్ లీక్‌తో లక్షలాది యువత భవిష్యత్తును నాశనం చేసిందని, రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని విపక్షాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ‘‘ దేశంలో రెండు ఐపీఎల్‌లు జరుగుతున్నాయి. ఒకటి ఇండియన్ ప్రీమియర్ లీగ్, మరొకటి ఇండియన్ పేపర్ లీక్. ఒక ఐపీఎల్ బాల్, బ్యాట్‌తో ఆడితే ఇంకో ఐపీఎల్ యువత భవిష్యత్తుతో ఆడుకుంటోంది.నీట్–యూజీ పరీక్ష చేపట్టిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అంటే ఇకపై నో ట్రస్ట్ ఎనీమోర్(ఎన్టీఏ)గా పలకాలి’ అని ఆప్ సభ్యుడు రాఘవ్ చద్దా అన్నారు. ప్రతిష్టాత్మక పరీక్షల పేపర్ లీకేజీల అంశాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని ఇంకొందరు సభ్యులు డిమాండ్‌చేశారు. ‘‘ తీవ్ర వివాదాస్పదమైన నీట్ పరీక్షను కేంద్రం ఇకనైనా రద్దుచేస్తుందా లేదా? ’’ అని కాంగ్రెస్ నేత దిగి్వజయ్‌సింగ్ సూటిగా ప్రశ్నించారు.ఎన్టీఏ చైర్మన్‌కు గతంలో మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ స్కామ్‌తో సంబంధం ఉందని దిగ్విజయ్ ఆరోపించారు. ‘‘ నీట్, నెట్ లీకేజీల్లో కోచింగ్ సెంటర్లదే ప్రధాన పాత్ర. అయినా వాటిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు’’ అని ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌ను తక్షణం డిస్మిస్ చేయకుండా రెండునెలల శాఖాపర దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పడంలో ఆంతర్యమేంటి?’ అని ఎస్పీ నేత రాంజీలాల్ సుమన్ అనుమానం వ్యక్తంచేశారు. -
‘నీట్’ నిందితులకు నార్కో బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టులు!
పాట్నా/దేవగఢ్: నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బిహార్ పోలీసు శాఖ ఆర్థిక నేరాల విభాగం అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నీట్ అసలైన ప్రశ్నపత్రాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎనీ్టఏ) నుంచి సేకరించారు. పేపర్ లీకేజీకి సంబంధించి గత నెలలో పాటా్నలోని ఓ ఇంట్లో సోదాల్లో స్వాధీనం చేసుకున్న ప్రశ్నపత్రాలతో ఈ ప్రశ్నపత్రాలను సరిపోల్చనున్నారు. ఫోరెన్సిక్ టెస్టు తర్వాత సరిపోల్చే ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు చెప్పారు. మరోవైపు ఈ కేసులో అరెస్టయిన నిందితులకు నార్కో అనాలిసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ టెస్టులు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. నీట్ పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాల్లో మనీ లాండరింగ్ కోణం కూడా ఉండడంతో ఈడీ సైతం దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
నీట్ పేపర్ లీకేజీ నిజమే
పట్నా: బిహార్‌లో చోటుచేసుకున్న నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. పేపర్ లీక్ నిజమేనని పోలీసుల విచారణలో నిందితులు అంగీకరించారు. నీట్‌కు ఒక్క రోజు ముందు ప్రశ్నపత్రంతోపాటు సమాధానాల ‘కీ’ని సైతం అభ్యర్థులకు అందజేసి, పరీక్షకు సిద్ధం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసులో బిహార్ పోలీసులు పలువురు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో నలుగురు నీట్ అభ్యర్థులు అనురాగ్ యాదవ్, శివానందన్, అభిõÙక్, ఆయుష్ రాజ్, ఇద్దరు లీకేజీ ముఠా సభ్యులు నితీశ్, అమిత్ ఆనంద్‌తోపాటు ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ సికిందర్ యాదవేందు ఉన్నారు. ఈ యాదవేందు మేనల్లుడే అనురాగ్æ. విచారణలో నిందితులు ఏం చెప్పారో వారి మాటల్లోనే... ‘‘బిహార్ దానాపూర్ టౌన్ కౌన్సిల్లో జూనియర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న సికిందర్ ప్రసాద్ యాదవేందు మమ్మల్ని సంప్రదించాడు. మేనల్లుడు అనురాగ్‌సహా నలుగురికి ప్రశ్నపత్రం ఇచి్చ యాదవేందు నుంచి రూ.32 లక్షలు తీసుకున్నాం’’ – నితీశ్, అమిత్, ‘‘ అమిత్, నితీశ్ ప్రశ్నపత్రం, కీ అందజేశారు. పరీక్షకు సిద్ధం కావడానికి సహకరించారు’ – అనురాగ్, నీట్ అభ్యర్థి ‘‘యాదవేందు అంకుల్ మే 4న ఓ ఇంటికి రమ్మని చెప్పాడు. అక్కడ నితీశ్, అమిత్ ప్రశ్నపత్రం ఇచ్చి నన్ను పరీక్షకు సిద్ధం చేశారు’’ – శివానందన్ కుమార్, నీట్ అభ్యర్థి ‘‘నీట్ ప్రశ్నపత్రం కోసం యాదవేందుకు రూ.40 లక్షలు చెల్లించాం’’ –అవదేశ్, అభిషేక్ కుమార్ తండ్రి ‘‘యాదవేందు రూ.40 లక్షలు తీసుకున్నాడు’’ నీట్ అభ్యర్థి ఆయుష్ రాజ్ తండ్రి ‘‘రాజస్తాన్‌లోని కోటాలో శిక్షణ పొందుతున్న నా మేనల్లుడు అనురాగ్ యాదవ్ నా సోదరి రీనా కుమారితో కలిసి నీట్ పరీక్ష రాయడానికి పాట్నా వచ్చాడు. వారికి పాటా్నలో ప్రభుత్వ అతిథి గృహంలో నేనే బస ఏర్పాట్లు చేశా. నీట్ పరీక్ష రాయడానికి నా మేనల్లుడు సహా నలుగురి అభ్యర్థులకు సహకరించా. నలుగురికి ప్రశ్నపత్రాలు సమకూర్చా. ఒక్కొక్కరి నుంచి రూ.40 లక్షల చొప్పున డిమాండ్ చేశా. నితీశ్ కుమార్, అమిత్ ఆనంద్ రూ.32 లక్షల చొప్పున తీసుకున్నారు’’ – యాదవేందు, ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ తేజస్వీ యాదవ్ సహాయకుడి హస్తం! ప్రభుత్వ అతిథి గృహంలో అనురాగ్ యాదవ్, ఆయన తల్లికి బస ఏర్పాట్ల వెనుక బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. గెస్టు హౌస్ బిల్లులను పరిశీలించగా, అందులో మంత్రిజీ అని ఉంది. తేజస్వీ యాదవ్ వ్యక్తిగత సహాయకుడైన ప్రీతమ్ కుమార్ ఈ గెస్టు హౌస్‌ను బుక్ చేసేందుకు యాదవేందుకు సహకరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
విచారణ జరిపించాలి: కపిల్ సిబల్
న్యూఢిల్లీ: నీట్ అవకతవకల ఆరోపణల్లో నిగ్గు తేల్చేందుకు అధికారులతో కమిటీని నియమించాలని రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ సుప్రీంకోర్టును కోరారు. భవిష్యత్తులో నీట్‌ను మరింత మెరుగ్గా నిర్వహించే అంశంపై రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. నీట్‌ను నిర్వహించే ఎన్టీఏ వ్యవస్థలోనే అవినీతి నెలకొన్న పరిస్థితుల్లో ప్రధాని మోదీ మౌనంగా ఉండటం ఏమాత్రం మంచిదికాదన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నీట్లో అక్రమాలను ప్రముఖంగా ప్రస్తావించాలని సిబల్ అన్ని రాజకీయ పారీ్టలను కోరారు. -
నీట్ ఒక కుంభకోణం: ఎంకే స్టాలిన్
చెన్నై: మెరిట్‌కు కొలమానంగా పేర్కొంటున్న నీట్ ఒక కుంభకోణం, ఈ పరీక్ష పేద విద్యార్థుల ప్రయోజనాలకు, సామాజిక న్యాయానికి విరుద్ధమని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ఇటువంటి విధానం అమలును నిలిపివేయాలని ఆదివారం ఆయన ‘ఎక్స్’లో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ‘నీట్ చుట్టూ ముసురుకున్న వివాదాలు, ఈ విధానంతో జరుగుతున్న అన్యాయాన్ని చెప్పకనే చెబుతోంది. సమాజంలో అణగారిన వర్గాల విద్యార్థుల అభ్యున్నతికి మరిన్ని దారులు తెరవడానికి బదులుగా వారికి నీట్ అవకాశాలను దూరం చేస్తోంది’అని ఆరోపించారు. ‘కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎన్టీఏను సమరి్థస్తున్నప్పటికీ వాస్తవం మరోలా ఉంది. గుజరాత్లో ఓఎంఆర్ షీట్లను ట్యాంపర్ చేసినట్లుగా వచ్చిన ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదంతా ఓ కుట్ర. నీట్ కోచింగ్ సెంటర్లు, ఫిజిక్స్ ఉపాధ్యాయుడు, ఓ స్కూల్ ప్రిన్సిపల్‌కు ఇందులో హస్తముంది. ఈ వ్యవస్థను మార్చాల్సిన అవసరముంది’అని స్టాలిన్ పేర్కొన్నారు. -
‘నీట్’లో అక్రమాల ఆరోపణలు..
పట్నా: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో బిహార్ పోలీసుల దర్యాప్తు మరింత పురోగతి సాధించింది. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని అదుపులోకి తీసుకున్న బిహార్ ఆర్థిక నేరాల విభాగం(ఈఓయూ) పోలీసులు ఆరు చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో అభ్యర్థి నుంచి రూ.30 లక్షలు డిమాండ్ చేసిన మాఫియా ముఠా సభ్యులకు చెందాల్సినవిగా వీటిని భావిస్తున్నామని ఈఓయూ డీఐజీ మానవ్‌జీత్ సింగ్ ధిల్లాన్ ఆదివారం చెప్పారు. సంబంధిత బ్యాంకుల నుంచి ఆయా ఖాతాదారుల వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అదేవిధంగా, పట్నాలో ప్రశ్నాపత్రాన్ని, జవాబులను అభ్యర్థులకు మాఫియా సభ్యులు వెల్లడించిన ఇంట్లో పాక్షికంగా కాల్చివేసిన ప్రశ్నాపత్రాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఎన్టీఏ నుంచి రిఫరెన్స్ ప్రశ్నాపత్రం కోరామని, అది అందాక రెండింటిని సరిపోల్చుతామని డీఐజీ చెప్పారు. ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో 9 మంది అభ్యర్థులతోపాటు నలుగురు ఎగ్జామినర్లున్నారు. వీరంతా బిహారీలే. అదేవిధంగా, ఈ లీకేజీ వ్యవహారంతో సంబంధమున్నట్లు అనుమానిస్తున్న బిహార్‌కే చెందిన మరో ఏడుగురు, యూపీ, మహారాష్ట్రలకు చెందిన ఓక్కో అభ్యర్థికి కూడా పోలీసులు నోటీసులు పంపారు. -
‘టీఎస్పీఎస్సీ’పై హైకోర్టు జడ్జితో..న్యాయ విచారణ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణస్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)లో ప్రశ్నపత్రాల లీకేజీ కోణంలోనే కాకుండా ప్రతి విభాగంలో నెలకొన్న లోపాలపై నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమైంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయముర్తికి లేఖ రాయనున్నారు. విచారణకు ప్రత్యేకంగా సిట్టింగ్ జడ్జిని నియమించాలని ఆ లేఖలో కోరనున్నట్టు సమాచారం. టీఎస్పీఎస్సీ వ్యవహారంపై గత ప్రభుత్వం సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) ఏర్పాటు చేయగా, ఆ దర్యాప్తు కొనసాగుతోంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక టీఎస్పీఎస్సీ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది. మరోవైపు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ చైర్మన్ పదవికి బి.జనార్ధన్‌రెడ్డి రాజీనామా చేయగా, సభ్యులుగా కొనసాగిన ఐదుగురు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సభ్యులంతా గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌కు రాజీనామా పత్రాలు పంపించారు. గవర్నర్‌ను అపాయింట్మెంట్ కోరినా, ఆమె సమయం ఇవ్వకపోవడంతో రాజీనామాలు పంపించినట్టు ఓ సభ్యుడు తెలిపారు. దీంతో కమిషన్‌లో చైర్మన్‌తో సహా సభ్యుల స్థానాలు ఖాళీ అయ్యాయి. ఇతర విభాగాల పనితీరు, లోపాలపై దృష్టి టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా జనార్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలోని ‘కోరం’వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 30 వేలకు పైబడి ఉద్యోగాల భర్తీకి 23 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో 19 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు పూర్తి కాగా, గ్రూప్–2, గ్రూప్–3, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. గ్రూప్–1 ప్రిలిమినరీ పూర్తి చేసిన కమిషన్ మెయిన్ పరీక్షలు చేపట్టాల్సి ఉంది. ఇవి కాకుండా వివిధ ప్రభుత్వ కాలేజీల్లో జూనియర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో నాలుగు పరీక్షలను రద్దు చేసి రెండుసార్లు నిర్వహించారు. మరికొన్నింటిని వాయిదాలు వేస్తూ పూర్తి చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీయే ఇందుకు కారణం. అయితే టీఎస్పీఎస్సీలోని ఇతర విభాగాల్లో పనితీరు, లోపాలు గుర్తించాలని రాష్ట్రం ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి విభాగంలో అధికారులు, ఉద్యోగుల పనితీరు, విధి నిర్వహణ, సమాచార వ్యవస్థ, గోప్యత తదితరాలను లోతుగా పరిశీలించనుంది. ప్రశ్నపత్రాల లీకేజీతో ఇతర విభాగాల అలసత్వం, అధికారుల ఉదాసీనతపై సమగ్రంగా విచారించనున్నారు. అక్రమాలకు పాల్పడిన, విధినిర్వహణలో అలసత్వం వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సీఎం నిర్ణయించినట్టు తెలిసింది. ఈ దిశగా హైకోర్టు సిట్టింగ్ జడ్జిని నియమించాలని సీజేకు లేఖ రాయనున్నారు. కొత్త కమిషన్ కొలువుదీరేలోపు... టీఎస్పీఎస్సీలో పదవులన్నీ ఖాళీ అయ్యాయి. సాధారణంగా కమిషన్‌లో సభ్యుల నిర్ణయం తప్పనిసరి. కనీసం ఇద్దరు సభ్యులున్నా అందులో సీనియర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎవరూ లేకపోవడంతో ఏ నిర్ణయమూ తీసుకునే అవకాశం లేదు. కొత్త కమిషన్ కొలువుదీరేలోపు విచారణ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విచారణకు ముందుగానే కొత్త కమిషన్ ఏర్పాటైతే తాజాగా చేపట్టదలచిన సమగ్ర విచారణకు ఆటంకాలు ఎదురవుతాయని, కొత్త కమిషన్‌కు నిర్ణయాధికారంలోనూ ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ దర్యాప్తు వేగవంతం చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టీఎస్పీఎస్సీ, సిట్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆదేశించారు. వీలైనంత వేగంగా విచారణ చేపడితే ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు అడుగులు పడతాయన్న ఆశలో నిరుద్యోగులు ఉన్నారు. -
గ్రూప్–1 ప్రిలిమ్స్ ‘లీకేజీ’ని సీబీఐకి అప్పగించాలి
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్న పత్రం లీకేజీ దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి అప్పగించాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. పిల్‌పై అభ్యంతరాలను పక్కకు పెట్టి, పిటిషన్‌కు నంబర్ ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్‌కుమార్ ధర్మాసనం బుధవారం రిజిస్ట్రీని ఆదేశించింది. ఫైలింగ్ నంబర్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, టీఎస్పీఎస్సీ చైర్మన్, హైదరాబాద్ సీపీ, సీబీఐ డైరెక్టర్‌కు నోటీసులిచ్చింది. అలాగే పేపర్ లీకేజీ దర్యాప్తు ఎంతవరకు వచ్చిందో నివేదిక అందజేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఆదేశించింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఏప్రిల్‌లో దాఖలు చేసిన పిటిషన్‌లోని అంశాలతో ఈ పిల్ దాఖలైంది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రిజిస్ట్రీ నంబర్ కేటాయించలేదు. సీజే ధర్మాసనం వద్ద విచారణ సందర్భంగా హోం శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది రూపేందర్ వాదనలు వినిపిస్తూ.. గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్ లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్ ఇప్పటికే సింగిల్ జడ్జి వద్ద పెండింగ్‌లో ఉందన్నారు. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా నిందితులపై కేసు నమోదు, అరెస్టు, దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది.. వంటి అంశాలపై సిట్ మూడు నివేదికలను కూడా కోర్టుకు సమర్పించిందన్నారు. ఈ పిల్ దాఖలు చేసిన పిటిషనర్ బక్క జడ్సన్.. కాంగ్రెస్ పార్టీ నేత అని చెప్పారు. నిష్పక్షపాతంగా సిట్‌ను దర్యాప్తు చేయకుండా ధిక్కరణ పిటిషన్లు కూడా వేస్తూ అడ్డుకుంటున్నారని చెప్పారు. కిందిస్థాయి సిబ్బందిపైనే కేసులు.. పిటిషనర్ తరఫున న్యాయవాది ఎస్.శరత్ కుమార్ వాదనలు వినిపించారు. పేపర్ లీకేజీ అంశంలో టీఎస్పీఎస్సీకి చెందిన కిందిస్థాయి సిబ్బందిపైనే సిట్ కేసులు పెట్టిందని.. ఉన్నతాధికారులను మాత్రం వదిలేసిందని చెప్పారు. పాస్వర్డ్ లీక్‌కు కారణమైన టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శిపై ఎలాంటి కేసు పెట్టలేదన్నారు. గ్రూప్–1 ప్రిలిమ్స్‌తో పాటు మరికొన్ని నియామక పరీక్షల పేపర్లు లీక్ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల్లో నిరాశ, నిస్పృహలు నెలకొన్నాయని వెల్లడించారు. పిల్‌కు నంబర్‌కు వేయాలని రిజిస్ట్రీని ఆదేశించడంతోపాటు దర్యాప్తును సీబీఐకి అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి వద్ద ఉన్న పిటిషన్‌ను కూడా ఈ పిల్‌కు జత చేసేలా దరఖాస్తు చేయాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశిస్తూ, విచారణను వాయిదా వేసింది. -
పేపర్లు పంపినందుకు రూ.16 లక్షలు!
సాక్షి, హైదరాబాద్:తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీతో పాటు హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన మాజీ ఏఈ పూల రమేశ్‌కు సహకరించిన ప్రైవేట్ కళాశాల చైర్మన్ సయ్యద్ మహబూబ్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులకు చిక్కాడు. సయ్యద్ వాట్సాప్ ద్వారా అసి స్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) ప్రశ్న పత్రాలను రమేశ్‌కు ‘పంపినందుకు’రూ.16 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. రమేశ్ అరెస్టు తర్వాత పరా రీలో ఉన్న సయ్యద్ మహబూబ్‌ను బుధ వారం పట్టుకున్న అధికారులు.. అతడిని జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తరలించారు. తదుపరి విచారణ కోసం తమ కస్టడీకి అప్పగించాల్సిందిగా కోరుతూ సిట్ అధికారులు శుక్రవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యాధునిక బ్లూటూత్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను వినియోగించి రమేశ్ ఏడుగురితో ఏఈఈ, డీఏఓ పరీక్షలు రాయించాడు. టోలిచౌకిలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీకి మహబూబ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 22, ఫిబ్రవరి 23న జరిగిన ఈ రెండు పరీక్షలకు సంబంధించిన సెంటర్ ఈ కాలేజీలోనే పడింది. ఈ నేపథ్యంలో రమేశ్‌తో రూ.16 లక్షలకు ఒప్పందం చేసుకున్న మహబూబ్.. పరీక్ష ప్రారంభమైన పది నిమిషాల్లోనే ప్రశ్నపత్రాలను తన సెల్ఫోన్లో ఫొటో తీసి, రమేశ్‌కు వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. ఆయా పరీక్షలకు గైర్హాజరైన వారి పేపర్లను దీనికి వినియోగించాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలను చాట్ జీపీటీ ద్వారా వెతికి, ఏడుగురు అభ్యర్థులకు అత్యాధునిక పరికరాల ద్వారా అందించే టీమ్‌కు రమేశ్ మలక్‌పేటలోని మహ్మద్ ఖాలేద్ ఇంట్లో షెల్టర్ ఏర్పాటు చేశాడు. దీని కోసం ఖాలేద్‌కు రూ.80 వేలు చెల్లించాడు. ఈ రెండు రోజులూ ఈ బృందం అక్కడ నుంచే జవాబులను అభ్యర్థులకు పంపింది. గత నెలలో రమేశ్ అరెస్టు అయిన నాటి నుంచి మహబూబ్‌తోపాటు ఖాలేద్, అభ్యర్థులు, వారికి సహకరించిన వారు పరారీలో ఉన్నారు. ఇప్పటివరకు సిట్ అధికారులు ముగ్గురు అభ్యర్థులతో పాటు ఈ నెల 9న ఖాలేద్‌ను, బుధవారం మహబూబ్‌ను పట్టుకున్నారు. మరో 35 మంది అభ్యర్థుల కోసం సిట్ అధికారులు గాలింపు కొనసాగిస్తున్నారు. ఈ హైటెక్ మాస్ కాపీయింగ్, ఏఈ పేపర్ లీకేజ్ ద్వారా రమేశ్ రూ.10 కోట్లు ఆర్జించాలని భావించినట్లు తెలుస్తోంది. హైటెక్ కాపీయింగ్ ద్వారా లబ్ధిపొందిన ఒక్కో అభ్యర్థి రూ.40 లక్షలు, ఏఈ పేపర్ లీక్ ద్వారా లబ్ధిపొందిన ఒక్కొక్కరు రూ.20 లక్షలు చెల్లించేలా రమేశ్ ఒప్పందాలు చేసుకున్నాడని సమాచారం. అయితే ఇతడికి ఇప్పటివరకు రూ.1.1 కోటి మాత్రమే ముట్టినట్లు తేలింది. -
పాస్వర్డ్ గుట్టు వీడలేదు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో (టీఎస్పీఎస్సీ) చోటుచేసుకున్న ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో సిట్ అధికారులు శుక్రవారం తొలి చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అరెస్టులు మొదలై 90 రోజులు కావస్తుండటంతో నాంపల్లి న్యాయస్థానంలో సప్లిమెంటరీ చార్జ్‌షీట్ వేశారు. ఇందులో 37 మందిపై అభియోగాలు మోపారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన వివరాల ఆధారంగా మిగిలిన వారిపై అదనపు చార్జిషీట్లు దాఖలు చేయనున్నారు. యూజర్ ఐడీ, పాస్వర్డ్ చేతికి చిక్కిందెలా? కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉన్న కంప్యూటర్ నుంచి మాస్టర్ ప్రశ్నపత్రాలను కమిషన్ మాజీ ఉద్యోగి పులిదిండి ప్రవీణ్ కుమార్, మాజీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అట్ల రాజశేఖర్ పెన్‌డ్రైవ్‌లోకి కాపీ చేసుకోవడం ద్వారా చేజిక్కించుకున్నట్లు సిట్ నిర్ధారించింది. అయితే ఆ కంప్యూటర్లోకి చొరబడటానికి వాడిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ వారి చేతికి ఎలా చిక్కిందనే అంశంపై మాత్రం ఇప్పటికీ స్పష్టత రాలేదు. నిందితులు పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇన్చార్జ్గా ఉన్న శంకరలక్ష్మి యూజర్ ఐడీ, పాస్‌వర్డ్స్‌ను తన పుస్తకంలో రాసి పెట్టుకున్నారు. వాటిని ప్రవీణ్ నోట్ చేసుకొని రాజశేఖర్‌కు తెలిపాడని దర్యాప్తు అధికారులు చెప్పారు. ఆపై కంప్యూటర్ను నిందితులు హ్యాక్ చేశారనే ఆరోపణలు వచ్చినా దానికీ ఆధారాలు లభించలేదు. 50 మంది నిందితుల్లో చిక్కిన 49 మంది... బేగంబజార్ పోలీసుస్టేషన్లో నమోదైన ఈ కేసు దర్యాప్తు నిమిత్తం సిట్‌కు బదిలీ అయింది. అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో ఏసీపీ పి.వెంకటేశ్వర్లు దర్యాప్తు చేపట్టిన ఈ కేసులో ఇప్పటివరకు 50 మందిని నిందితులుగా తేల్చి 49 మందిని అరెస్టు చేశామని సిట్ అధికారులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. న్యూజిల్యాండ్‌లో ఉన్న నిందితుడిని పట్టుకోవాల్సి ఉందన్నారు. 50 మందిలో 16 మంది పేపర్ల విక్రయంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వాళ్లే. అక్రమంగా ఏఈఈ ప్రశ్నపత్రం పొంది పరీక్ష రాసిన వాళ్లు ఏడుగురు, ఏఈ ప్రశ్నపత్రం పొంది రాసిన వాళ్లు 13 మంది, డీఏఓ పేపర్ పొంది పరీక్ష రాసిన వాళ్లు ఎనిమిది మంది ఉన్నారు. అరెస్టు అయిన నిందితుల్లో ప్రవీణ్ కుమార్, రాజశేఖర్‌లతోపాటు షమీమ్, రమేష్ కుమార్‌లు కమిషన్ ఉద్యోగులు. వారిలో రాజశేఖర్ మినహా మిగిలిన ముగ్గురూ గ్రూప్–1 పరీక్ష రాశారు. టీఎస్పీఎస్సీగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసి మానేసిన సురేష్ సైతం గ్రూప్–1 పేపర్ పొంది పరీక్ష రాశాడు. ఇరిగేషన్ శాఖ మాజీ ఏఈ పూల రమేష్ సహకారంతో ఏఈఈ పరీక్షల్లో హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన ముగ్గురినీ సిట్ అరెస్టు చేసింది. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన వివరాలను బట్టి ప్రశ్నపత్రాల క్రయవిక్రయాల్లో రూ.1.63 కోట్లు చేతులు మారినట్లు తేలింది. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న పెన్‌డ్రైవ్స్, ల్యాప్టాప్స్, హార్డ్డిసు్కలతోపాటు ఫోన్లను విశ్లేషణ నిమిత్తం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. ఈ వివరాలన్నీ క్రోడీకరించి న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్నాక నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మరోవైపు లీకేజీ కేసులో అరెస్టు అయిన మాజీ ఏఈ పూల రమేష్ ఆరు రోజుల పోలీసు కస్టడీ శుక్రవారంతో ముగిసింది. దీంతో ఇతడికి వైద్య పరీక్షల అనంతరం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం చంచల్‌గూడ జైలుకు తరలించారు. -
రవికిశోర్ ద్వారా మరో ముగ్గురికి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వి స్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజి కేసులో సిట్ అధికారులు గురువారం మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 43కి, అరెస్ట్ అయిన వారి సంఖ్య 42కు చేరింది. ఈ వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్న కమిషన్ మాజీ ఉద్యోగులు పులిదిండి ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి ద్వారా అనేక ప్రశ్నపత్రాలు ఒకప్పుడు కమిషన్‌లో పని చేసిన వీరి స్నేహితుడు సురేశ్‌కు చేరాయి. ఇతడు వీటిలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పేపర్లను తన అపార్ట్మెంట్లో నివసించే వారికి మధ్యవర్తి ద్వారా విక్రయించాడు. ఈ వ్యవహారంలో నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పూల రవికిశోర్ మధ్యవర్తిగా వ్యవహరించాడు. సురేశ్ గతంలోనే అరెస్టు కాగా... రవికిశోర్‌తోపాటు ఏఈ, డీఏఓ పేపర్లు ఖరీదు చేసిన అన్నాచెల్లెళ్లు రాయపురం విక్రమ్, దివ్యలను బుధవారం అరెస్టు చేశారు. సురేశ్ ద్వారా మొత్తం 14 పేపర్లు చేరినట్లు సిట్ ఆధారాలు సేకరించింది. వీరిలో దళారులతోపాటు అభ్యర్థులూ ఉన్నారు. మరోపక్క రవికిశోర్ ఏఈ సివిల్ పేపర్లను తమ బంధువులకు ఉచితంగా ఇవ్వడంతోపాటు బయటి వారికి అమ్మినట్లు గుర్తించారు. ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్‌ను రూ.3 లక్షలకు కొనేందుకు ఒప్పందం చేసుకుని, రూ.లక్ష అడ్వాన్స్ చెల్లించిన భరత్ నాయక్‌ను, వరంగల్‌కు చెందిన బంధువులు పసి కాంతి రోహిత్‌కుమార్, గాడె సాయి మధులను గురువారం అరెస్టు చేశారు. ప్రశ్నపత్రాలు సొంతం చేసుకుని రాసిన వారిలో చాలామందికి అత్యధిక మార్కులు వచ్చినట్లు సిట్ అధికారులు చెప్తున్నారు. -
ఏఈ పేపర్ ‘చూపించడానికి’ రూ.2 లక్షలు!
సాక్షి, హైదరాబాద్/గండేడ్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో ఇద్దరు నిందితులను శుక్రవారం సిట్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న లవడ్యావత్ డాక్యానాయక్‌కు రూ.2 లక్షలు చెల్లించి అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) ప్రశ్నపత్రాన్ని ‘చూసి రాసిన’అభ్యర్థి జనార్దన్‌తోపాటు ఈ డబ్బు ఇచ్చిన అతడి తండ్రి మైబయ్య పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు అయినవారి సంఖ్య 19కి చేరింది. కమిషన్ కార్యదర్శి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన పిలిదిండి ప్రవీణ్ కుమార్, నెట్వర్క్ అడ్మిన్‌గా పనిచేసిన రాజశేఖర్‌రెడ్డి కుమ్మక్కై పలు పరీక్షల ప్రశ్నపత్రాలు(మాస్టర్ క్వశ్చన్ పేపర్స్) తస్కరించినట్లు సిట్ అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. వీటిలో ఏఈ పేపర్‌ను ప్రవీణ్‌కుమార్ మహబూబ్‌నగర్ జిల్లా పగిడ్యాల పంచాంగల్ తండాకు చెందిన భార్యభర్తలు రేణుక, డాక్యాలకు విక్రయించాడు. కాగా, వికారాబాద్ జిల్లాలోని ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గండేడ్ మండలం జంగంరెడ్డిపల్లికి మైబయ్యతో అదే శాఖలో పనిచేసిన డాక్యాకు ఇదివరకే పరిచÄయం ఉంది. మైబయ్య కుమారుడు జనార్దన్ కూడా ఏఈ పరీక్షకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మార్చి 3న పరీక్ష పేపర్‌ను రూ.6 లక్షలకు విక్రయిస్తానని డాక్యా చెప్పగా, తన వద్ద అంత మొత్తం లేదని చెప్పి మైబయ్య తొలుత రూ.2 లక్షలు ఇచ్చాడు. పరీక్ష పేపర్ చూడు.. ప్రశ్నలు గుర్తుపెట్టుకో... డాక్యా మార్చి 4న జనార్దన్‌ను తన ఇంటికి పిలిచి పరీక్షపత్రంలోని ప్రశ్నలు చూపించాడు. తాను కోరి నట్లు రూ.6 లక్షలు చెల్లిస్తే జిరాక్సు ప్రతి ఇచ్చేవాడినని, రూ.2 లక్షలే ఇవ్వడంతో పేపర్ చూసుకుని ప్రశ్నలు గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఇస్తున్నానని జనార్దన్‌కు డాక్యా చెప్పాడని తెలిసింది. అయితే డాక్యాసహా ఇతర నిందితులు అరెస్టు, విచారణలో మైబయ్య, జనార్దన్ గురించి చెప్పలేదు. సిట్ పోలీసులు మార్చి మొదటివారంలో డాక్యా ఇంటి వద్ద ఉన్న సెల్‌ఫోన్ సిగ్నల్స్‌తోపాటు ఇతర కాల్స్ వివరాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే డాక్యా, మైబయ్యకు మధ్య ఉన్న లింకు బయటపడింది. మైబయ్య కుమారుడు జనార్దన్ పరీక్ష రాసినట్లు తేలింది. దీంతో వీరిని అదుపులోకి తీసుకుని విచారించగా ఏఈ పరీక్షపత్రం ‘చూసి రాసిన’వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కోర్టు అనుమతితో వీరిని కస్టడీలోకి తీసుకోవాలని, ఇతర లింకులపై విచారించాలని సిట్ నిర్ణయించింది. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు: ఖాకీ అంటే మోజు.. సెల్యూట్ అంటే క్రేజు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజ్ స్కామ్‌లో సూత్రధారిగా ఉన్న కమిషన్ కార్యదర్శి మాజీ వ్యక్తిగత సహాయకుడు పులిదిండి ప్రవీణ్ కుమార్‌కు పోలీసు డిపార్ట్మెంట్ అంటే ఎంతో మోజు.. యూనిఫామ్‌లో వస్తున్న వారిని చూసి ఎదుటి వాళ్లు చేసే సెల్యూట్ అంటే మహా క్రేజ్. అయితే ‘ఖాకీ’ఉద్యోగం సంపాదించడానికి కష్టపడకుండా ఇతగాడు అడ్డదారులు తొక్కాడు. తండ్రి ఖాకీ ఉద్యోగం రాకపోవడంతో.. ప్రవీణ్ తండ్రి ఏపీ రాజమండ్రికి చెందిన పి.హరిశ్చంద్రారావు డీజీపీ కార్యాలయం ప్రెస్‌కు అదనపు ఎస్పీగా పని చేస్తూ అనారోగ్యంతో మరణించారు. కారుణ్య నియామకం కింద తనకు ఆ ఉద్యోగమే వస్తుందని భావించాడు. నిబంధనలు, అతడి అర్హత పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇచ్చింది. అయితే ఎలాగైనా డీఎస్పీ లేదా జైళ్ల శాఖలో సూపరింటెండెంట్ అయి యూనిఫామ్ వేసుకోవాలని భావించిన ప్రవీణ్ కుమార్ గ్రూప్–1 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు. రాజశేఖర్‌రెడ్డి సహాయంతో కస్టోడియన్ శంకర లక్ష్మి కంప్యూటర్ను యాక్సస్ చేసి గ్రూప్–1 పేపర్ తస్కరించాడు. అయితే ప్రవీణ్ కుమార్ తన ఓఎంఆర్ షీట్‌ను డబుల్ బబ్లింగ్ చేయడంతో తిరస్కరించిన కమిషన్ వాల్యూషన్ చేయలేదు. కనీసం సొమ్మైనా చేసుకుందామని... డబుల్ బబ్లింగ్‌తో ‘ఖాకీ పోస్టుకు’అవకాశం కోల్పోయిన ప్రవీణ్‌కు పేపర్లు అమ్మి సొమ్ము చేసుకోవాలని దుర్భుద్ది పుట్టింది. ఈ నేపథ్యంలోనే మరో ఐదు పరీక్షలకు సంబంధించిన 14 పరీక్ష పత్రాలను రాజశేఖర్ సాయంతో చేజిక్కించుకున్నాడు. వీటిలో ఏఈ ప్రశ్నపత్రంలో పాటు డీఏఓ పేపర్‌ను ఐదుగురికి రూ.50 లక్షలుకు విక్రయించి రూ.29.45 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. మిగిలిన పేపర్లు విక్రయించే ప్రయత్నాల్లో ఉండగానే విషయం వెలుగులోకి రావడంతో కటకటాల్లోకి చేరాడు. తన మాదిరిగానే డబుల్ బబ్లింగ్ చేసిన వాళ్లు దాదాపు 8వేలమంది ఉన్నట్టు ప్రవీణ్ గుర్తించాడు. వీరిలో కొందరిని సంప్రదించి సహాయం చేస్తానని నమ్మబలికి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి టచ్‌లో ఉన్నాడు. సిట్ దర్యాప్తులో ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. -
లీకేజీ సూత్రధారి బండి
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక బీజేపీ నేతల కుట్రకోణం దాగి ఉందని రాష్ట్ర మంత్రులు ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఈ పనికి దిగజారి సూత్రధారిగా వ్యవహరించారని వారంతా మండిపడ్డారు. ఈ ఉదంతంపై మంత్రుల స్పందన వారి మాటల్లోనే.. ‘‘ప్రశ్నపత్రాల లీకేజీల వెనుక కుట్ర కోణం ఉంది. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కేంద్రంలోని బీజేపీ పెద్దల సూచనలతోనే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, అల్లర్లు సృష్టించేందుకు ఈ పనిచేశారు. – సబితారెడ్డి, విద్యాశాఖ మంత్రి ‘‘బండి సంజయ్ టెన్త్ పేపరు లీకేజీ సూత్రధారి. దీనికి అన్ని ఆధారాలున్నాయి. లక్షల మంది పిల్లల భవిష్యత్తుపై కనీస బాధ్యత లేకుండా బండి సంజయ్ వ్యవహరించారు. ఆయన అరెస్టుపై బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేస్తే భౌతికదాడులు తప్పవు’’ – వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్అండ్బీ శాఖ మంత్రి ‘‘వివిధ ప్రభుత్వ శాఖల్లో దాగిన బీజేపీ స్లీపర్‌సెల్స్‌ను గుర్తించి బయటికి లాగుతాం. తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు బీజేపీ పన్నిన కుట్రలను ఛేదిస్తాం. తనకు వచ్చిన ప్రశ్నాపత్రంపై పోలీసులకు చెప్పాల్సిన బాధ్యత సంజయ్‌కి లేదా?’’ – గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి ‘‘నిరుద్యోగులు, విద్యార్థులను రెచ్చగొట్టి, రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు బీజేపీ నాయకులు కుట్ర పన్నారు. అడ్డంగా దొరికిపోయిన బండి సంజయ్.. దొంగే ‘దొంగ.. దొంగ’అన్నట్లు మాట్లాడుతున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’’ – గుంటకండ్ల జగదీష్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి ‘‘రాష్ట్రంలో విద్యావ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగంగానే లీకేజీ కుట్ర జరిగింది. ఇందుకు బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదు. బండి ఆటలు సాగనివ్వబోం. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ – కొప్పుల ఈశ్వర్, ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ‘‘టీఎస్పీఎస్సీ, పదో తరగతి పేపర్ లీకేజీ వెనక బీజేపీ నాయకుల కుట్ర ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని చూస్తున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ చేసిన నిందితుడు కూడా బీజేపీ కార్యకర్తే’’ – శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి ‘‘ప్రశ్నపత్రాల లీకేజీ బీజేపీ పనే. పథకం ప్రకారమే ప్రశ్నపత్రం లీకేజీ జరిగింది. బండి నిజాయితీపరుడైతే పోలీసులకు ఫోన్ ఎందుకు ఇవ్వలేదు?. సంజయ్ ఫోన్ సంభాషణ బయటపడితే, లీకేజీలో బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ ప్రమేయం బట్టబయలవుతుంది’’ – ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం బీజేపీ నేతలు ప్రశ్నపత్రాల లీకేజీ వంటి కుట్రలకు పాల్పడుతున్నారు. బండి సంజయ్ పార్లమెంటు సభ్యత్వాన్ని లోక్‌సభ స్పీకర్ తక్షణమే రద్దు చేయాలి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల చర్యలతో రాష్ట్రం భ్రష్టు పడుతోంది.’’ – పువ్వాడ అజయ్‌కుమార్, రవాణా శాఖ మంత్రి -
బీజేపీ దూకుడుకు చెక్ పెట్టేలా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికార పార్టీని అన్నివిధాలా ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీని దీటుగా ఎదుర్కొనేలా వ్యూహానికి పదును పెట్టాలని భారత్ రాష్ట్ర సమితి నిర్ణయించింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ, ఎమ్మెల్సీ కవితపై ఈడీ విచారణ, సుఖేశ్ చంద్రశేఖర్ ఆరోపణలు, జర్నలిస్టు రాజ్‌దీప్ వ్యాఖ్యల నేపథ్యంలో.. ఆత్మరక్షణ ధోరణిలో కాకుండా ప్రతి విషయంలోనూ ఎదురుదాడి చేయాలని నిర్ణయించింది. మరికొన్ని నెలల్లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జాతీయ నాయకత్వం కనుసన్నల్లో రాష్ట్ర బీజేపీ రాజకీయంగా మరింత ఉక్కిరిబిక్కిరి చేసే అవకాశముందని బీఆర్ఎస్ అంచనాకు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపించే కొద్దీ ‘పశ్చి మ బెంగాల్ ఎన్నికల తరహా పరిస్థితిని సృష్టించేందుకు ప్రయత్నించవచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సంప్రదాయ పద్ధతిలో కేవలం ప్రతి విమర్శలు, ప్రత్యారోపణలతో, సాధారణ కార్యక్రమాలతో అడ్డుకట్ట వేయలేమని పార్టీ భావిస్తోంది. బీజేపీని ఆత్మరక్షణలోకి నెట్టే అంశాలకు పెద్దపీట వేయడం ద్వారా ఆ పార్టీ దూకుడుకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రతిదాడి చేసేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. ఆతీ్మయ సమ్మేళనాల పేరిట ఇప్పటికే క్షేత్ర స్థాయిలో పార్టీ యంత్రాంగాన్ని అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం చేసే పనిలో బీఆర్ఎస్ తలమునకలై ఉంది. తాజాగా ఈ సమావేశాలనే వేదికగా చేసుకుని.. రాబోయే రోజుల్లో బీజేపీ ఎలాంటి వ్యూహాలు, ఎత్తుగడలకు పాల్పడే అవకాశముందనే అంశంపై శ్రేణులకు విడమరిచి చెప్పాల్సిందిగా పార్టీ ముఖ్య నేతలను ఆదేశించింది. ‘స్లీపర్ సెల్స్’పై నిఘా బీజేపీతో పాటు ఆ పార్టీ అనుబంధ సంఘాలు కూడా ప్రభుత్వ వ్యతిరేకతను కూడగట్టడం, కేంద్ర నాయకత్వం వ్యూహాలను అమలు చేయడంలో భాగంగా క్షేత్రస్థాయిలో క్రియాశీలంగా పనిచేస్తున్న వైనంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందినట్లు తెలిసింది. భావోద్వేగాలు రెచ్చగొట్టడం, శాంతి భద్రతల సమస్య సృష్టించడం లాంటి ఘటనలు రాబోయే రోజుల్లో మరింత పెరుగుతాయని నిఘా వర్గాలు నివేదించినట్లు సమాచారం. మరోవైపు సుమారు ఏడాది కాలంగా బీజేపీ అనుబంధ సంఘాలకు చెందిన ఇతర రాష్ట్రాల నేతలు, కేడర్.. తెలంగాణలో ‘స్లీపర్ సెల్స్’లా పనిచేస్తున్నట్లు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. 2020 చివరలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని ఎంపిక చేసిన డివిజన్లలో ఈ స్లీపర్ సెల్స్ పనిచేశాయని బీఆర్ఎస్లో అనుమానాలు వ్యక్తమయ్యాయి. బీఆర్ఎస్ బలాలు, బలహీనతలను సూక్ష్మస్థాయిలో పోస్ట్‌మార్టం చేస్తున్న ఈ స్లీపర్ సెల్స్ వాటిని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఎప్పటికప్పుడు వ్యూహాలను రూపొందిస్తున్నట్లు సమాచారం. ఈ స్లీపర్ సెల్స్ నుంచి అందుతున్న ఆదేశాల మేరకే పేపర్ లీకేజీ వంటి కుట్రల్లో ఆ పార్టీ కేడర్ పాలుపంచుకుంటోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్లీపర్ సెల్స్‌పై నిఘా పెట్టాలని, బీజేపీ కుట్రలు, వ్యూహాలు సమర్ధంగా తిప్పికొట్టా లని అధికార పార్టీ నిర్ణయించింది. మంత్రులకే నాయకత్వం బీజేపీ నేతల వ్యూహాలు, కుట్రలను తిప్పికొట్టేలా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడంతో పాటు, ఆ పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వంపై ఎదురుదాడి బాధ్యతను మంత్రులకు అప్పగించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. బీజేపీపై విమర్శలు, ఎదురుదాడి విషయంలో కేవలం మీడియా సమావేశాలకే పరిమితం కాకుండా క్షేత్ర స్థాయిలో ప్రత్యక్ష కార్యాచరణలో భాగం కావాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలందరినీ పార్టీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రశ్నపత్రాల లీకేజీ కేసు లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ప్రధాన నిందితుడుగా ఉండటాన్ని ఆసరాగా తీసుకుని మంత్రులందరూ ఏకకాలంలో మీడియా ద్వారా ఎదురుదాడి చేశారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ చేపట్టిన బండి దిష్టిబొమ్మ దహనం, నిరసన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి స్వయంగా పాల్గొన్నారు. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్‌తో అప్రమత్తం.. ఎంసెట్‌కు బ్లాక్‌చైన్ టెక్నాలజీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మే 7 నుంచి జరిగే ఎంసెట్ ప్రశ్నపత్రాలకు పటిష్టమైన సాంకేతిక భద్రత అవసరమని అధికారులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వి స్ కమిషన్ ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో ఈ తరహా అభిప్రాయానికొచ్చారు. దీనికోసం అత్యంత పటిష్టమైన బ్లాక్‌చైన్ టెక్నాలజీ భద్రత వ్యవస్థను కల్పించే యోచనలో ఉన్నారు. దీనితోపాటే ఎంసెట్ పేపర్ రూపకల్పన, వాటిని కంప్యూటర్లు, సర్వర్లలో నిక్షిప్తం చేసిన విధానాలపై నిపుణులతో కలిసి అధికారులు లోతైన సమీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటి వరకూ పేపర్ తయారీలో ముఖ్యపాత్ర పోషించిన వ్యక్తులు, సాంకేతిక నిపుణుల వివరాలను క్రోడీకరిస్తున్నారు. ఇదే కోణంలో పేపర్లను భద్రత పరిచిన తర్వాత సంబంధిత సర్వర్లు, కంప్యూటర్లను ఎవరైనా వినియోగించారా? అనే కోణంలో సమాచార సేకరణకు సిద్ధమవుతున్నారు. ఎంసెట్‌కు ప్రశ్నపత్రాల సర్వర్లకు సంబంధించిన ప్రతీ ఐపీ అడ్రస్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, నివేదిక రూపొందించే పనిలో ఉన్నారు. ఎలాంటి తప్పిదాలు జరగకూడదు ఇతర రాష్ట్రాలతో సహా రాష్ట్రానికి చెందిన మొత్తం 2.50 లక్షల మంది ఎంసెట్ పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఇందులో ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం ఉన్నత విద్యా మండలికి స్పష్టం చేసినట్టు తెలిసింది. మేఘాలయాలో జరుగుతున్న అఖిల భారత విశ్వవిద్యాలయాల సమావేశంలో ఉన్న రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఎంసెట్ నిర్వహిస్తున్న జేఎన్టీయూహెచ్ వీసీ ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి ఎంసెట్ భద్రతపై సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించినట్టు తెలిసింది. ముట్టుకున్నా ‘బ్లాక్’అలారం.. ఎంసెట్ పేపర్ల భద్రతకు వాడబోతున్న బ్లాక్ చైన్ టెక్నాలజీ అత్యంత శక్తివంతమైందని నిపుణులు చెబుతున్నారు. ఒకసారి దీన్ని సర్వర్లకు, కీలకమైన కంప్యూటర్ డివైస్‌కు అనుసంధానం చేస్తే ఏ ఇతర వ్యక్తి ముట్టుకున్నా తక్షణమే కీలకమైన వ్యక్తులకు సంకేతాలిస్తుంది. ఇప్పటి వరకూ డివైజ్‌లోకి ఎవరెవరు? ఏ ఐపీ అడ్రస్‌తో వెళ్ళారనే రహస్య సమాచారం అందిస్తుంది. కంప్యూటర్ సైన్స్‌లో క్రిప్టోగ్రఫీ విధానంలో పనిచేసే బ్లాక్‌చైన్ టెక్నాలజీని ఇప్పటికే అనేక దేశాలు వాడుతున్నట్టు నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎంసెట్ పేపర్లకు బాధ్యులెవరు? ఏయే సమయాల్లో వాళ్ళు డివైజ్‌లోకి వెళ్ళాలి? అనేదానిపై ముందే స్పష్టత ఉంటుంది. ఇది బ్లాక్‌చైన్ టెక్నాలజీ మెమోరీలో నిక్షిప్తమై ఉంటుంది. ఆయా సమయాల్లో ఆయా వ్యక్తులు ప్రవేశించినా, అందుకు భిన్నంగా వెళ్ళినా తేలికగా ముందే గుర్తించడం ఈ సాంకేతికత ప్రత్యేకగా చెబుతున్నారు. అత్యంత రహస్యమైన వ్యవస్థను అంతకంటే రహస్యంగా భద్రతపర్చడమే కాకుండా, హ్యాక్ చేసే ప్రయత్నాలను అడ్డుకునే విధానం ఇందులో ఉందని చెబుతున్నారు. దీన్ని పక్కాగా నిర్వహించగల నమ్మకమైన వ్యక్తుల గురించి అధికారులు జల్లెడ పడుతున్నారు. అంతే కాకుండా పాస్వర్డ్స్, సమాచార ప్రవేశం ఎవరెవరికి ఏ మేర ఇవ్వాలనే విషయాలపై స్పష్టతకు రావాలనే ఆలోచనలో ఉన్నారు. దీనివల్లే ఏం జరిగినా వారినే బాధ్యులను చేయవచ్చని చెబుతున్నారు. ప్రత్యేక భద్రతపై పరిశీలిస్తున్నాం ఎంసెట్ ప్రశ్నపత్రాలకు పూర్తి భద్రత కల్పించే విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. ఉన్నత విద్యా మండలితో కలిసి ఈ విషయంలో చర్చలు జరుపుతాం. మేఘాలయ వీసీల సమావేశంలో ఉన్నప్పటికీ కీలకమైన ఈ అంశంపై దృష్టి పెట్టాం. ఎలాంటి భద్రత చర్యలు తీసుకున్నదీ త్వరలో వివరిస్తాం. - ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (వీసీ జేఎన్టీయూహెచ్) ఎన్క్రిప్షన్ కూడా అవసరమే ఎంసెట్ వంటి కీలకమైన ప్రశ్నపత్రాలకు బ్లాక్‌చెయిన్ టెక్నాలజీతో భద్రత మంచిదే. దీంతోపాటే, ఎన్క్రిప్షన్ విధానం అత్యంత ముఖ్యం. దీనివల్ల ప్రశ్నపత్రం ఎవరికైనా చిక్కినా ఏమీ అర్ధంకాని భాషలో ఉంటుంది. దీన్ని కేవలం వ్యాల్యూడ్ యూజర్ మాత్రమే డీకోడ్ చేయడం సాధ్యం. క్రిప్టోగ్రఫీ భాషా విధానంతో దీన్ని రూపొందించారు. విశ్వసనీయమైన వ్యక్తులకు అధికారం ఇచ్చిన ఈ టెక్నాలజీని వాడుకుంటే పేపర్ లీక్ వంటి ఘటనలకు ఆస్కారమే ఉండదు. - ప్రొఫెసర్ ఎస్ రామచంద్రన్ (వీసీ, అనురాగ్ యూనివర్సిటీ, సైబర్‌క్రైం ఫ్యాకల్టీ నిపుణులు) -
టెక్నాలజీనే నమ్ముకుంటే ప్రమాదమే..
సాక్షి, హైదరాబాద్: పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు లక్షల మంది ఉద్యోగార్ధులకు సంబంధించిన అంశంతోపాటు ప్రభుత్వ ప్రతిష్టతోనూ ఇమిడి ఉంటాయని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు (2005–11) చైర్మన్‌గా, యూపీఎస్సీ సభ్యుడిగా పనిచేసిన డాక్టర్ వై. వెంకటరామిరెడ్డి అభిప్రాయపడ్డారు. సైబర్ నేరగాళ్లు సులువుగా రూ. కోట్లు కొట్టేస్తున్న రోజుల్లో కీలకమైన ప్రశ్నపత్రాలను కేవలం టెక్నాలజీతో భద్రంగా ఉంచడం ఎంతవరకు సాధ్యమనే సందేహాన్ని ఆయన వెలిబుచ్చారు. సాంకేతికను కొంతవరకు నమ్ముకొని గత విధానాలను అనుసరిస్తే పేపర్ లీక్ వంటి ఘటనలకు తావుండబోదని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశ్నపత్రాల రూపకల్పన మొదలు అనేక అంశాలను వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే... మానవసహిత భద్రతకే ప్రాధాన్యమివ్వాలి... పాస్వర్డ్ లేదా ఓటీపీని తెలుసుకొని కేటుగాళ్లు రూ. కోట్లు కొల్లగొడుతున్న రోజులివి. కంప్యూటర్ యుగంలో రోజుకో సమస్య తెరపైకి వస్తోంది. అలాంటప్పుడు కేవలం సాంకేతికతపై ఆధారపడటం సరికాదేమో. టెక్నాలజీని అనుసరించడం అనివార్యమే అయినప్పటికీ లక్షల మంది జీవితాలతో ముడివడిన ఇలాంటి పరీక్షలపట్ల అప్రమత్తత అవసరం. మానవసహితమైన భద్రత కే ప్రాధాన్యం ఇవ్వడం మంచిదనేది నా అనుభవం. అప్పట్లో ఏం చేశామంటే.. నేను ఆరేళ్లు ఏపీపీఎస్సీ చైర్మన్‌గా పనిచేశాను. నా హయాంలో ఏనాడూ పేపర్ లీక్ ఘటనలు చోటుచేసుకోలేదు. అప్పట్లో మేం అనుసరించిన విధానాలు వేరు. చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఇలాంటి కీలక పరీక్షల ప్రశ్నపత్రాల రూపకల్పన సమయంలో అనుసరించిన విధానాలు లీక్‌లకు ఆస్కారం లేకుండా చేశాయి. ఒక్కో సబ్జెక్టుకు ఐదుగురు ఎగ్జామినర్లను పిలిచేవాళ్లం. వారిని పూర్తి భద్రత ఉన్న హాలులోకి పంపే ముందే సమగ్రంగా పరీక్షించే ఏర్పాట్లు ఉండేవి. వాళ్ల వద్ద పెన్ను, పెన్సిల్ ఆఖరుకు చిన్న కాగితం ముక్క కూడా లేకుండా జాగ్రత్త పడేవాళ్లం. వారు బయటకు వెళ్లేటప్పుడు కూడా ఇదే తరహా తనిఖీలు ఉండేవి. ప్రశ్నపత్రానికి సంబంధించిన అంశాలనేవీ వారు రాసుకొని వెళ్లేందుకు వీల్లేకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకొనేవాళ్లం. ప్రశ్నపత్రం చైర్మన్‌కు కూడా తెలిసేది కాదు... ఒక్కో సబ్జెక్ట్ నిపుణుడు ఒక్కో పేపర్‌ను సెట్ చేశాక దాన్ని సీల్డ్ కవర్లో కమిషన్ సెక్రటరీకి అందజేస్తారు. సెక్రటరీ తనకు అందిన ఐదు పేపర్లనూ కమిషన్ చైర్మన్ ముందు పెట్టేవారు. అందులోంచి ఒక పేపర్‌ను చైర్మన్ ఎంపిక చేశాక నేరుగా ప్రింటింగ్ కేంద్రానికి తరలేది. ఇక్కడ కమిషన్ చైర్మన్ లేదా సెక్రటరీ ప్రశ్నపత్రాన్ని చూసే అవకాశం లేదు. అలాగే ఎంపిక చేసిన పేపర్ ఏమిటనేది దాన్ని సెట్ చేయడానికి వచ్చిన ఐదుగురికి తెలిసే అవకాశమే ఉండదు. ప్రింటింగ్ కేంద్రం నిర్వాహకులకు మాత్రమే ఈ పేపర్ ఏమిటనేది తెలిసే అవకాశం ఉంటుంది. పేపర్ లీక్ అయితే కేవలం ప్రింటర్‌ను మాత్రమే బాధ్యుడిని చేసేలా అప్పట్లో నిబంధనలుండేవి. ఒకవేళ పేపర్ లీక్ అయితే ప్రింటర్‌కు భారీ జరిమానా విధించేలా నిబంధనలు తెచ్చాం. పేపర్ లీక్ అయితే ప్రింటర్ ఆస్తులన్నీ జరిమానా కింద పోయేంత ప్రమాదం ఉండేది. కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ ఇలాంటి రిస్‌్కను ప్రింటర్ తీసుకొనే అవకాశం ఉండేది కాదు. ఈ విధానాన్ని అనుసరించడం వల్లే అప్పట్లో పేపర్ లీకేజీలు ఉండేవి కావు. భద్రత ఎంత వరకూ? పేపర్ల లీకేజీపై పత్రికల్లో వస్తున్న కథనాలనుబట్టి ఒక వ్యక్తి పాస్వర్డ్ తీసుకొని ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి ఇప్పుడున్న టెక్నాలజీపై అనేక అనుమానాలు రావడం సహజమే. ఇది ఎంతవరకు భద్రత ఇస్తుందనేది ఇందులో ప్రధానాంశం. తాత్కాలిక ఉద్యోగులు ఉండటం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయనే వాదన అర్థరహితం. ఇప్పుడే కాదు... అప్పట్లోనూ తాత్కాలిక ఉద్యోగులు ఉండేవారు. కేవలం కమిషన్ నిర్వహణలో విశ్వసనీయతే ఇక్కడ ప్రధానం. ఏ వ్యక్తీ ప్రశ్నపత్రం చూసే అవకాశం లేకుండా చేయడమే ఇక్కడ ముఖ్యం. మళ్లీ పరీక్ష అనివార్యమే.. పేపర్ లీకేజీ వల్ల మళ్లీ పరీక్ష నిర్వహించడం అనివార్యమే. ఈ క్రమంలో పేద, మధ్యతరగతి వర్గాల మనో వేదన వర్ణనాతీతం. అప్పులు చేసి మరీ కోచింగ్ తీసుకున్న వాళ్లున్నారు. ఎన్నో ఆశలతో ఇదే జీవితమని భావించి చదివిన వాళ్లూ ఉన్నారు. మళ్లీ పరీక్ష రాయాలంటే వారికి సమస్యే. కోచింగ్ కోసం మళ్లీ అప్పులపాలవ్వాల్సిన పరిస్థితి వారికి ఉండొచ్చు. ఈ సమస్యకు ఎవరూ పరిష్కారం చూపలేరు. పరీక్షల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటి వారి ఆవేదనకు కమిషన్ కారణం కాకుండా చూడొచ్చు. -
ప్రశ్నపత్రాల లీకేజీ: టీఎస్పీఎస్సీ పరీక్షలన్నీ రీషెడ్యూల్?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్టేట్ పబ్లిక్ సర్వి స్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించనున్న ఉద్యోగ అర్హత పరీక్షల తేదీల్లో మార్పులు జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే జరిగిన నాలుగు పరీక్షలను రద్దు చేసిన కమిషన్.. మరో రెండు పరీక్షలను నిర్వహించకుండానే వాయిదా వేసింది. వీటితోపాటు వచ్చే నెలలో నిర్వహించే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను కొత్తగా తయారు చేసేందుకు చర్యలు చేపట్టారు. వీటన్నింటి క్రమంలో ఇప్పటికే నిర్దేశించిన తేదీల్లో ఉద్యోగ అర్హత పరీక్షల నిర్వహణ సాధ్యమయ్యే పరిస్థితి లేదని.. కొంతకాలం వాయిదా పడే అవకాశం ఉందని అధికారవర్గాలు చెప్తున్నాయి. దీనిపై టీఎస్పీఎస్సీ నుంచి త్వరలోనే ప్రకటన వెలువడవచ్చని అంటున్నాయి. కొత్త ప్రశ్నపత్రాల రూపకల్పన కోసం.. టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో పరీక్షల నిర్వహణ గందరగోళంగా మారింది. గతేడాది అక్టోబర్‌లో నిర్వహించిన గ్రూప్–1 ప్రిలిమినరీతోపాటు ఏఈఈ, డీఏఓ, ఏఈ అర్హత పరీక్షలను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. ఈ నెల 12న జరగాల్సిన టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్.. 15, 16 తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను వాయిదా వేసింది. ఈ ఆరు పరీక్షలను తిరిగి నిర్వహించాలి. మరో తొమ్మిది రకాల పోస్టులకు సంబంధించిన పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. లీకేజీ, రద్దు, వాయిదాల క్రమంలో ప్రశ్నపత్రాలను కొత్తగా రూపొందించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నిపుణులతో సంప్రదింపులు, కొత్త ప్రశ్నపత్రాల తయారీ, అందులో ఇప్పటికే రూపొందించిన ప్రశ్నపత్రాలతో సంబంధం లేకుండా ప్రశ్నల ఎంపిక, వివిధ దశల్లో ఆమోదం, పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు వంటి కార్యాచరణ అవసరం. ఇదంతా పూర్తయ్యేందుకు దాదాపు రెండు నెలల సమయం పడుతుందని అంచనా. రద్దయిన పరీక్షలను ముందుగా నిర్వహించాలంటే.. ఇప్పటికే నిర్దేశించిన ఇతర పరీక్షల తేదీల్లో మార్పులు చేయాల్సి రానుంది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని భావించినా.. రద్దయిన, వాయిదా పడిన పరీక్షలకు ఇబ్బంది వస్తుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ పరీక్షల షెడ్యూళ్లలో మార్పులు చేసి.. కొత్త తేదీలను ప్రకటించాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నట్టు తెలిసింది. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. గ్రూప్–1 మెయిన్స్‌కు తప్పని వాయిదా! గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసిన టీఎస్పీఎస్సీ.. ఈ ఏడాది జూన్ 11న తిరిగి నిర్వహిస్తామని ప్రకటించింది. ఈ పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రకటన తర్వాత మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేసి.. మెయిన్స్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రకటించిన గ్రూప్–1 మెయిన్స్ తేదీలు దాదాపు రద్దయినట్లేనని అధికారులు చెప్తున్నారు. ప్రిలిమ్స్ ఫలితాల తర్వాత మెయిన్స్ షెడ్యూల్ విడుదల అవుతుందని అంటున్నారు. -
TSPSC: పాలమూరులో ప్రకంపనలు.. 9 మందిలో ఆరుగురు ఇక్కడివాళ్లే
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/గండేడ్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపన లు సృష్టిస్తోంది. తొమ్మిది మంది నిందితుల్లో ఆరుగురు ఉమ్మడి పాలమూరుకు చెందిన వారే ఉండ డం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం మ హబూబ్‌నగర్‌తో పాటు గండేడ్ మండలంలోని మ న్సూర్‌పల్లి, పంచాంగల్ తండాలు, వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం చుట్టూ తిరుగుతోంది. ఈ బాగోతంలో వీరితో పాటు ఇంకెవరైనా ఉన్నారా?..అనే కోణంలో పోలీసులు జల్లెడ పడుతున్నారు. రేణుక, డాక్యా ఇక్కడి వారే.. పేపర్ల లీకేజీకి పాల్పడింది కమిషన్ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేస్తున్న ప్రవీణ్ కాగా..నిందితుల జాబితాలో రేణుక, లవుడ్యావత్ డాక్యా దంపతులు ఉన్నారు. రేణుకది మన్సూర్‌పల్లి తండా కాగా.. డాక్యాది అదే మండలంలోని పంచాంగల్ తండా. డాక్యా బీటెక్ పూర్తయిన తర్వాత 15 ఏళ్లుగా టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. వికారాబాద్ జిల్లా ధారూర్ మండలంలో నాలుగేళ్ల పాటు టీఏగా విధులు నిర్వర్తించాడు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో పనిచేస్తున్నాడు. రేణుకకు 2018లో వనపర్తి గురుకుల పాఠశాలలో హిందీ పండిట్ ఉద్యోగం రావడంతో మూడేళ్ల క్రితం మహబూబ్‌నగర్‌కు మకాం మార్చాడు. ప్రస్తుతం రేణుక బుద్దా రం గురుకుల పాఠశాలలో పనిచేస్తోంది. అంతా బంధువులు, సన్నిహితులే: ప్రవీణ్ ద్వారా పేపర్లు సంపాదించిన రేణుక మొదట తన తమ్ముడు రాజేశ్వర్‌కు సమాచారమిచ్చింది. ఇతను మహబూబ్‌నగర్‌లోనే ఉంటున్నాడు. రాజేశ్వర్ తన పెద్దనాయన చంద్రానాయక్ కొడుకు శ్రీనివాస్ (బీటెక్)కు సమాచారం ఇచ్చాడు. అతడికి 2020లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం మేడ్చల్‌లో పనిచేస్తున్నాడు. ఎస్సై ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాడు. దీంతో తనకు ప్రశ్నపత్రం వద్దని.. తనకు సన్నిహితులైన మన్సూర్‌పల్లి తండా కు చెందిన కేతావత్ నీలేశ్ నాయక్, అతడి తమ్ముడు రాజేంద్రనాయక్, వికారాబాద్ జిల్లా దుగ్యాల మండలం లగచర్ల తండాకు చెందిన పత్లావత్ గోపాల్‌నాయక్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రేణుక, డాక్యా దంపతులు ఒప్పందం కుదుర్చుకున్న వారిని వెంటబెట్టుకుని పంచాంగల్ తండాలోని ఇంటికి వచ్చినట్లు సమాచారం. అక్కడే వారితో రెండు రోజుల పాటు చదివించి.. పరీక్ష రోజు సరూర్‌నగర్‌లోని పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లారు. ఈ పరీక్షను రేణుక తమ్ముడు రాజేశ్వర్ కూడా రాశాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పరీక్షల నిర్వహణ యథాతథం
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్దేశించిన తేదీల్లోనే అర్హత పరీక్షలు నిర్వహించేందుకు కృతనిశ్చయంతో ఉన్నాం. కష్టపడి ఉద్యోగాలు సాధించాలన్న తపనతో లక్షలాది మంది నిరుద్యోగులు సిద్ధమవుతున్నారు. వారికి ఏమా త్రం అన్యాయం జరగకూడదనేదే మా లక్ష్యం. వాస్త వ పరిస్థితులకు భిన్నంగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు జరుగుతున్నాయి. తొందరపడి వాటిని నమ్మి అభ్యర్థులు సమయాన్ని వృథా చేసుకోవద్దు’అని టీఎస్పీఎస్సీ చైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు. గత 4–5 రోజుల పరిణామాల దృష్ట్యా ఆయన మంగళవారం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కమిషన్ సభ్యులు, కార్యదర్శితో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల రద్దు, ఇతరత్రా అంశాలపై పలు ప్రచారాల నేపథ్యంలో అభ్యర్థులకు స్పష్టత ఇచ్చేందుకే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. 17 వేల పోస్టులు... 26 ప్రకటనలు... ‘వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీకి అప్పగించింది. 17,134 కొలువులకు సంబంధించి ఏడాది కాలంలో 26 ప్రకటనలు జారీ చేశాం. ఇందులో 6 రకాల అర్హత పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాం. గత ఏడేళ్లలో 35 వేల ఉద్యోగాల భర్తీ జరిగితే కేవలం ఏడాదిలోనే 17 వేల కొలువులకు ప్రకటనలు జారీ చేశాం. మరో 10 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో ప్రకటనలు జారీ చేయనున్నాం. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసిన క్రమంలో అంతర్గత సమాచారం అందింది. దీంతో వెంటనే ఆ రెండు పరీక్షల నిర్వహణను వాయిదా వేశాం. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 5న నిర్వహించిన అర్హత పరీక్ష ప్రశ్నపత్రం లీకైందని గుర్తించాం. ఇది ఎందరికి చేరింది... ఏయే సమాచారం ఎవరెవరికి చేరిందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. సాంకేతికత ఆధారంగా లీకేజీని గుర్తించేందుకు ఫోరెన్సిక్, సైబ ర్ భద్రతా విభాగాలు ప్రయత్నిస్తున్నాయి. దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్షపై బుధవారం మళ్లీ సమీక్షించాక నిర్ణయాన్ని ప్రకటిస్తాం’అని జనార్దన్‌రెడ్డి వివరించారు. కార్యాలయానికి కొత్త సాంకేతికత... ప్రస్తుతం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో సాంకేతికతను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నాం. కంప్యూటర్ల మార్పుతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా కొత్తగా తయారు చేసేందుకు చర్యలు మొదలుపెట్టాం. అతిత్వరలో ఈ ప్రక్రియ పూర్తవుతుంది. మరోవైపు టౌన్‌ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ అర్హత పరీక్షల ప్రశ్నపత్రాలను తిరిగి రూపొందించాలని నిర్ణయించాం. అతిత్వరలోనే ఈ ప్రక్రియ పూర్తి చేసి పరీక్షలు నిర్వహిస్తాం. ఏప్రిల్ 4న నిర్వహించే హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష నుంచి అన్ని రకాల పరీక్షలను నిర్దేశించిన తేదీల్లోనే నిర్వహిస్తాం. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. అత్యంత పారదర్శకతతో అర్హతలున్న వారిని ఎంపిక చేయడయే మా పని’అని జనార్దన్‌రెడ్డి తెలిపారు. నమ్మించి గొంతు కోసినట్లుగా... ‘ఒక కార్యాలయం అన్నాక ఎంతో మంది ఉద్యోగులుంటారు. ప్రతి సమాచారాన్ని గోప్యంగా ఉంచేందుకే ప్రయత్నిస్తాం. అదే సమయంలో సహోద్యోగులకు వివిధ బాధ్యతలు అప్పగించి కార్యక్రమాలను సజావుగా సాగేలా చూస్తాం. ప్రవీణ్‌కుమార్ ఇక్కడ ఏళ్లుగా పనిచేస్తున్నాడు. రాజశేఖర్ రెడ్డి ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఏడేళ్లుగా పనిచేస్తున్నాడు. ప్రతి ఉద్యోగి ఎలాంటివాడు? అతని నేప థ్యం ఏమిటని ఆరాతీసే పరిస్థితి ఉండదు. కార్యాలయంలో పనిచేసే వ్యక్తి.. ఏళ్లుగా నమ్మకంతో ఉన్నందున వివిధ బాధ్యతలు అప్పగించాం. రాజశేఖర్‌రెడ్డి నెట్వర్క్ విభాగంలో పనిచేస్తున్నా డు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే నమ్మించి గొంతుకోసిన చందంగా ఉంది. ప్రవీణ్ శాఖా పరంగా అనుమతి తీసుకొని గ్రూప్–1 ప్రిలిమిన రీ పరీక్ష రాశాడు. 103 మార్కులు వచ్చినట్లు తెలిసింది. కానీ పేపర్ కోడ్ సరిగ్గా వేయలేదని అనర్హుడైనట్లు సమాచారం. అయితే గ్రూప్–1 ప్రిలిమిన రీ అర్హుల్లో అత్యధిక మార్కులు 103 కంటే ఎక్కు వ. ప్రిలిమినరీ పరీక్షలో ర్యాంకులను పరిగణనలోకి తీసుకోం. దీంతో ఎక్కడా మార్కులు వెల్లడించలేదు. అభ్యర్థులకు మాత్రం వారి మార్కు లు చూసుకొనే వెసులుబాటు కల్పిస్తూ ఓఎంఆర్ పత్రాలను స్కాన్ చేసి వెబ్సైట్లో అందుబాటులో ఉంచాం. ఈ పరీక్ష లీకేజీపై ఇప్పటివరకు ఎలాంటి ఆధారాల్లేవు. సామాజిక మాధ్యమాల్లో అనవసర రాద్ధాంతాన్ని పరిగణించొద్దు. ఒక్క అభ్యర్థికి కూడా అన్యాయం జరగదు. వాస్తవ పరిస్థితులను కనిపెట్టేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో తేలిన అంశాల ప్రకారం చర్యలుంటాయి’అని జనార్దన్‌రెడ్డి స్పష్టం చేశారు. -
నారాయణ ‘లీక్స్’: చంద్రబాబుకు మైనస్.. ఎలాగంటే?
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పి.నారాయణ పదో తరగతి పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో అరెస్టు అవడం, తెల్లవారేసరికల్లా ఆయన బెయిల్‌పై విడుదల కావడం జరిగిపోయాయి. నారాయణ బెయిల్‌పై విడుదల కాగానే తెలుగుదేశంకు చెందిన కొన్ని మీడియా సంస్థలు ఇదంతా ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘనతేనని ప్రచారం చేయడం విశేషం. నారాయణ విడుదల అయ్యేంతవరకు చంద్రబాబు క్షణం, క్షణం పరిస్థితిని మోనిటర్ చేశారని, లాయర్లతో నిరంతరం సంప్రదింపులు జరిపారని కూడా ఆ మీడియా తెలిపింది. ఇది ఆసక్తికరమైన విషయమే. చంద్రబాబుకు ఈ విషయంలో ఉన్న సమర్దత గురించి మరోసారి చెప్పకనే చెప్పేశారు. చదవండి: కార్పొరేట్ విద్యా మాఫియా అధిపతి నారాయణ చరిత్ర ఇదే.. దేశంలో అనేక చోట్ల ఎందరో ప్రముఖులు ఆయా కేసులలో అరెస్టు అయ్యాక, బెయిల్‌పై విడుదల కావడానికి, రోజులు, వారాలు పడుతుంటే, నారాయణ కనీసం జైలు వరకు వెళ్లకుండానే రావడం గొప్పతనమే అవుతుంది. ఇందుకు నారాయణను అభినందించాలో, చంద్రబాబును పొగడాలో తెలియదు. ఈ విషయంలో కొందరు కొన్ని చమత్కార వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు వద్ద అంత గట్టి లీగల్ టీమ్ ఉందన్న సంగతి తెలిస్తే విజయ్ మాల్యా, చోక్సి, నీరవ్ మోడీ వంటివారు దేశం వదలిపారిపోకుండా ఆయన సలహాలు పొందేవారేమోనని వారు అంటున్నారు. కాని, లక్షలాది మంది విద్యార్ధుల భవితవ్యానికి సంబంధించిన కేసులో ఇలా బెయిల్ రావడం మాత్రం అంత స్వాగతించవలసిన అంశం కాదు. టీడీపీ లాయర్ల సమర్ధతో, ఇంత పెద్ద పోలీసు యంత్రాంగం, ప్రాసిక్యూషన్ వ్యవస్థ ఉన్నప్పటికి ప్రభుత్వం ఇలాంటి కేసులలో నిందితులుగా పేర్కొన్నవారిని జైలుకు కూడా పంపలేని పరిస్థితి ఏర్పడడం ప్రభుత్వానికి కూడా కాస్త ఇబ్బందే అని చెప్పాలి. కాని రాజకీయంగా చూస్తే ఇది జగన్‌కు ప్లస్ అవుతుంది. చంద్రబాబుకు మైనస్ అవుతుంది. ఎలాగంటే విద్యారంగంలో పాతుకుపోయిన తిమింగలాలను పట్టుకోవడం ఎవరి వల్ల కాదని, ఆ మాఫీయా దెబ్బకు ఎవరైనా లొంగిపోవల్సిందేనని ప్రజలు భావిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి జగన్ ఆధ్వర్యంలోని ప్రభుత్వం నారాయణను టచ్ చేయడమే కాకుండా, కేసు నమోదు చేయగలిగింది. ప్రశ్నాపత్రాల లీకేజీలో నారాయణ ప్రమేయం ఉందని ఆధార సహితంగా పోలీసులు చెప్పగలిగారు. చదవండి: ఏది నిజం: రామోజీ చెప్పిన ‘కరెంటు కత’ నారాయణ కాలేజీల సిబ్బందే ఈ లీకేజీల వ్యవహారంలో కీలక భూమిక పోషించడం, అలా పట్టుబడ్డవారు ఇందులో నారాయణ పాత్ర గురించి వెల్లడించడం జరిగింది. అయితే నారాయణ ఆ విద్యా సంస్థలకు ఇప్పుడు చైర్మన్‌గా లేరంటూ రాజీనామా లేఖను కోర్టులో పెట్టి బెయిల్ పొందగలిగారు. నిజంగానే అది నిజమైన రాజీనామానా?లేక ఉత్తుత్తి రాజీనామానా అన్నది ప్రజలందరికి తెలుసు. ఆయనకు సంస్థతో సంబంధం లేకపోతే పరీక్షలకు ముందు వీడియో కాన్ఫరెన్స్‌లు పెట్టి తన సిబ్బందికి ప్రశ్నాపత్రాల లీకేజీ ఎలా చేయాలన్న దానిపై, ప్రభుత్వ టీచర్లను ఎలా ప్రలోభ పెట్టాలన్నదానిపై ఎందుకు క్లాస్ తీసుకున్నారో వివరించవలసి ఉంటుంది. సాంకేతిక కారణాలతో కోర్టు బెయిల్ ఇచ్చినా, ప్రజల దృష్టిలో ఈయన తప్పు చేసినట్లే లెక్క. కాకపోతే వేల కోట్ల అధిపతి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు అయిన నారాయణ ఎలాగైనా తన లాయర్ల ద్వారా బెయిల్ పొందగలిగారు. వ్యక్తుల హక్కులను,స్వేచ్ఛను కాపాడడంలో న్యాయ వ్యవస్థ ముందు ఉండవలసిందే. ఎవరికైనా ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే కోర్టులు నిరోధించవలసిందే. కాని ఇలాంటి వ్యవస్థీకృత కేసులలో నిందితుడు కనీసం జైలుకు కూడా వెళ్లకపోతే సమాజం ఎలా చూస్తుందన్నది అన్ని వ్యవస్థల వారు ఆలోచించాలి. కొన్ని కేసులలో ఇదే రకమైన వాదన ఎందుకు నిలబడలేదో తెలియదు. ఉదాహరణకు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు విజయవాడలో ఒక కేసులో సంబంధిత సంస్థకు తాను యజమానిని కానని నిందితుడు చెప్పినా, పోలీసులు అంగీకరించకుండా అరెస్టు చేశారు. న్యాయ వ్యవస్థ కూడా దానిని ఓకే చేసింది. . కాని అదే న్యాయ వ్యవస్థ ప్రశ్నాపత్రాల కేసులో నారాయణ చైర్మన్ పదవిలో లేడన్న వాదనను పరిగణనలోకి తీసుకుంది. మరి వీటిలో ఏది రైట్ అంటే ఏమి చెబుతాం. ఏపీలో గత నెలాఖరులో ప్రశ్నాపత్రాల లీకేజీ పెద్ద సంచలనంగా మారింది. వాట్సప్‌ల ద్వారా లీక్ చేసే కొత్త సంస్కృతికి కార్పొరేట్ కాలేజీలు తెరదీశాయి. మామూలు రోజులలో పోటీ ఉన్నట్లు వ్యవహరించే ఈ సంస్థలు ప్రశ్నాపత్రాల లీక్‌లో మాత్రం కలిసికట్టుగా ఉండడం గమనించవలసిన పరిణామం. ఈ విషయం చిత్తూరు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు అత్యంత పకడ్బందీగా కేసును డీల్ చేస్తే చంద్రబాబుకు మాత్రం ఇది కక్షగా కనిపించింది. తొలుత ఈ మాల్ ప్రాక్టీస్ మీద గగ్గోలు పెట్టిన చంద్రబాబునాయుడు ఇందులో తమకు సంబంధించిన నారాయణ స్కూల్స్ పాత్ర ఉందని తెలియగానే మాట మార్చేశారు. దీనిని మాస్ కాపీయింగ్ గాను, పరీక్షలను ప్రభుత్వం సరిగా నిర్వహించని విషయంగానూ మార్చేశారు. లక్షలాది మంది విద్యార్దులకు ఎంతో మానసిక ఆవేదన కలిగించే ఇలాంటి ఘటనలలో పద్నాలుగేళ్ల పాటు సీఎంగా, పదిహనేళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తి అనుసరించవలసిన పద్దతి ఇదేనా? ఎవరిది తప్పు ఉన్నా సహించవద్దని చెప్పవలసిన పెద్ద మనిషి, ఈ రకంగా కార్పొరేట్ కాలేజీల కొమ్ముకాయడం, దానికి ఒక వర్గం మీడియా అండగా నిలవడం దారుణమైన సంగతే. ఆయనకు ఇదేమీ కొత్తకాదు. తన హయాంలో 2017లో కూడా నెల్లూరులో నారాయణ సంస్థ నుంచి పేపర్ లీక్ అయింది. అప్పుడు ఈనాడు పత్రికలోనే దీనికి సంబంధించిన వార్త వచ్చింది. కాని ఆనాడు కనీసం కేసు కూడా పెట్టలేదు. దానికి కారణం నారాయణ తన క్యాబినెట్లో మంత్రి, ఆయన వియ్యంకుడు గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రి కావడమే వేరే చెప్పనక్కర్లేదు. నారాయణతో చంద్రబాబుకు అంత లోతైన సంబంధాలు ఉన్నాయని అంటారు. 2014 ఎన్నికల సమయంలో నారాయణ, సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు మూడు ప్రాంతాలలో టీడీపీ వ్యవహారాలను పర్యవేక్షించారు. ఆర్ధిక విషయాలు మొత్తం వారి అజమాయిషీలోనే ఉండేవని చెబుతారు. విశాఖతో సహా ఉత్తరాంధ్ర బాధ్యతలు నారాయణ చూశారని చెబుతారు. ఆ సందర్భంలో వందలకోట్ల వ్యయం జరిగిందని ప్రచారం అయింది. అంతేకాక తన విద్యా సంస్థల నుంచి విద్యార్ధులను తీసుకు వచ్చి తెలుగుదేశంకు అనుకూలంగా, వైసిపికి వ్యతిరేకంగా ప్రచారం కూడా చేయించారని అప్పట్లో విశ్లేషణలు వచ్చాయి. ఆ ఎన్నికలలో గెలవగానే చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి అయిపోయారు. ఆయన అప్పటికీ ఎమ్మెల్యే కాదు. ఎమ్మెల్సీ కాదు. మంత్రి అయ్యాక ఎమ్మెల్సీ అయ్యారు. తదుపరి రాజధాని భూముల విషయంలో ఎలాంటి డీల్స్ జరిగాయో అప్పట్లో పుంఖానుపుంఖాలుగా కథనాలు వచ్చాయి. అలాంటి సంబంధాలు ఉన్న నారాయణ ఈ లీకేజీ కేసులో జైలుకు వెళ్లకుండా చూడడానికి చంద్రబాబు బాధ్యత తీసుకోవడం ఆశ్చర్యం ఏమి ఉంటుంది? అసలు ఈ కేసు బయటకు రావడంలోనే మతలబు ఉన్నట్లు కనిపిస్తుంది.మామూలుగా అయితే ఈ కార్పొరేట్ కాలేజీల వారు తమ వాట్సప్ గ్రూపులలో ఈ ప్రశ్నాపత్రాలను షేర్ చేసుకుని కామ్‌గా ఉండిపోయేవారు. కాని ఒక వైపు తమ సంస్థలకు అక్రమ ప్రయోజనం పొందుతూనే, మరో వైపు ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలన్న వారి దుష్ట తలంపుతో మొత్తం కేసు బయటకు వచ్చింది. నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ ఈ ప్రశ్నాపత్రాన్ని చిత్తూరులోని విలేకరుల బృందానికి కూడా లీక్ చేయడంతో మొత్తం తేనెతుట్టి కదిపినట్లయింది. ఆ విషయం అర్థం కాక, తెలుగుదేశం మీడియా తొలుత ప్రభుత్వంపై బురద వేయడానికి విశ్వయత్నం చేసింది. తీరా అదంతా తమ వాళ్ల మహిమే అని తెలియగానే, టీడీపీతో పాటు ఈ వర్గం మీడియా కూడా మొత్తం స్వరం మార్చేసింది. ఇంత గొప్ప నారాయణను అరెస్టు చేయడమా అన్నట్లు వార్తలు ఇచ్చాయి. అదే సమయంలో నారాయణ కాలేజీలో లీకేజీ అక్రమాలు జరగలేదని మాత్రం వీరెవరూ ఖండించలేకపోతున్నారు. నారాయణ పాత్ర గురించే సిబ్బందే వాంగ్మూలం ఇవ్వడంతో ఈ కేసు ఆయన వరకు వెళ్లింది. కాని దానిని టీడీపీ మీడియా, చంద్రబాబు సహించలేకపోయారు. వెంటనే ఖండోపఖండనలు ఇచ్చేశారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అయితే నారాయణను పోలీస్ స్టేషన్ గోడలు బద్దలు కొట్టి బయటకు తీసుకువస్తామని హెచ్చరించారు. ఇది రాజద్రోహమో, ప్రజాద్రోహమో అవుతుందో లేదో తెలియదు. మహారాష్ట్రలో బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఠాక్రే ఇంటి వద్ద హనుమాన్ చాలీసా చదువుతానని ప్రకటించినందుకే కేసుకు గురై వారం రోజులపాటు జైలులో ఉండవలసి వచ్చింది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ట్వీట్ చేసిన గుజరాత్ ఎమ్మెల్యేని అసోంలో అరెస్టు చేసి రోజుల తరబడి జైలులో ఉంచారు. ఇలా కొన్ని రాష్ట్రాలలో ఉంటే, మరికొన్ని రాష్ట్రాలలో న్యాయవ్యవస్థలోని వారిని కించపరిచారని నెలల తరబడి జైలులో ఉంచారు. అదే ముఖ్యమంత్రిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో వ్యక్తికి అడ్వాన్స్ బెయిల్ వచ్చింది. న్యాయ వ్యవస్థలో ఇలాంటి వ్యత్యాసాలు లేకుండా ఉంటే సమాజానికి మంచిదని చెప్పాలి. ఏది ఏమైనా లక్షల మంది విద్యార్ధులను తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేసిన లీకేజీ ఘటనల వంటివాటిలో ప్రభుత్వ వ్యవస్థలు, న్యాయ వ్యవస్థలు, రాజకీయ వ్యవస్థలు మరింత బాధ్యతగా ప్రవర్తించి ఉంటే బాగుండేదేమో! కొమ్మినేని శ్రీనివాస రావు సీనియర్ జర్నలిస్టు -
అంతా నారాయణ ఆదేశాలతోనే..
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లాలో పదో తరగతి ప్రశ్నపత్రాల మాల్ ప్రాక్టీస్ వ్యవహారంలో మొత్తం చక్రం తిప్పింది టీడీపీ మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత పొంగూరు నారాయణ అని చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు. నారాయణ ఆదేశాలు, ప్రణాళికను ఆ విద్యా సంస్థ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్‌రెడ్డి పక్కాగా అమలు చేశారని వెల్లడించారు. ఈ వ్యవహారంలో టీడీపీ నేత నారాయణను హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అరెస్టు చేశామన్నారు. అక్కడ నుంచి తీసుకొచ్చి చిత్తూరులోని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచామని వివరించారు. అలాగే తిరుపతి నారాయణ విద్యాసంస్థల డీన్ బాలగంగాధర్ (36)ను కూడా అరెస్టు చేశామని చెప్పారు. ఈ మేరకు చిత్తూరులో ఎస్పీ రిషాంత్‌రెడ్డి, డీఎస్పీ సుధాకర్‌రెడ్డి మీడియాకు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఏమన్నారంటే.. నిందితులు నారాయణ డీన్ బాలగంగాధర్, వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్‌రెడ్డి ఫోన్‌తో ఫొటో.. వాట్సాప్ గ్రూపులో షేరింగ్.. ఏప్రిల్ 27న ప్రారంభమైన పదో తరగతి పరీక్షల్లో తెలుగు కాంపోజిట్ ప్రశ్నపత్రాన్ని తిరుపతి నారాయణ పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ ఎన్.గిరిధర్‌రెడ్డి ‘చిత్తూరు టాకీస్’ అనే వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. దీనిపై చిత్తూరు డీఈవో పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదుతో వన్‌టౌన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. ఏప్రిల్ 29న తిరుపతి జిల్లా చంద్రగిరిలోని శ్రీకృష్ణారెడ్డి చైతన్య ప్రిన్సిపాల్ పి.సురేష్, తిరుపతి ఎన్ఆర్ఐ అకాడమీ ఆంగ్ల ఉపాధ్యాయుడు కె.సుధాకర్, తిరుపతి చైతన్య పాఠశాల ప్రిన్సిపాల్ ఆరిఫ్, డీన్ కె.మోహన్, గిరిధర్‌రెడ్డితోపాటు గంగాధర నెల్లూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న పవన్‌కుమార్‌రెడ్డి, బి.సోమును అరెస్టు చేశాం. వీరిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు మినహా మిగిలినవాళ్లు గతంలో నారాయణ విద్యాసంస్థల్లో పనిచేసినవారే. మరికొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలతో కలిసి.. నిందితులు.. గిరిధర్‌రెడ్డి, సుధాకర్, సురేష్, పవన్‌కుమార్‌ను ఈ నెల 9న కస్టడీకి తీసుకుని విచారించాం. నారాయణ ఆదేశాలతోనే ఇదంతా చేసినట్లు వారు అంగీకరించారు. నారాయణ ఆదేశాలతో ఆ సంస్థ సిబ్బంది మరికొన్ని కార్పొరేట్ విద్యాసంస్థల ప్రతినిధులతో కలిసి మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు. నారాయణలో ఓ మోస్తరు మార్కులు వచ్చే విద్యార్థికి జిల్లా, రాష్ట్ర స్థాయి మార్కులు తెప్పించడం, ఫెయిల్ అయ్యే విద్యార్థిని పాస్ చేయడం వీళ్ల లక్ష్యం. ఇందుకోసం నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపాల్ గిరిధర్‌రెడ్డి.. ప్రభుత్వ ఉపాధ్యాయుడు పవన్‌కుమార్‌రెడ్డికి పలుమార్లు నగదు ఇచ్చాడు. పవన్ తన స్నేహితుడైన సోము అనే ఇన్విజిలేటర్ గదికి వెళ్లి ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి గిరిధర్‌రెడ్డికి వాట్సాప్‌లో పంపించాడు. దీన్ని గిరిధర్.. నారాయణ స్కూల్ డీన్ బాలగంగాధర్‌కు, మరికొందరికి వాట్సాప్‌లో పంపాడు. నారాయణ హెడ్ ఆఫీసులో సమాధానాల రూపకల్పన బాలగంగాధర్ దీన్ని నారాయణ హెడ్ ఆఫీస్‌కు వాట్సాప్ ద్వారా షేర్ చేశాడు. అక్కడ సమాధానాలను రూపొందించారు. అక్కడ నుంచి పరీక్ష కేంద్రాల్లోని ఇన్విజిలేటర్లు, వాటర్ బాయ్స్, ఆయాల ద్వారా విద్యార్థులకు చేరతాయి. మంచి ఫలితాలు వస్తే నారాయణ విద్యాసంస్థల్లో అడ్మిషన్లు పెరుగుతాయనే ఇలా ప్రణాళిక రచించారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.. పలు కీలక సాంకేతిక ఆధారాలు సేకరించాం. నేరం రుజువైతే గరిష్టంగా పదేళ్ల జైలుశిక్ష పడుతుంది. -
‘నారాయణ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకే పేపర్ లీక్’
సాక్షి, చిత్తూరు: నారాయణ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకే పేపర్ లీక్ చేశారని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చిత్తూరు ఎస్పీ మంగళవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఉద్దేశపూర్వకంగానే పేపర్‌ను లీక్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. ‘టెన్త్ పేపర్ లీక్ కేసులో నారాయణను అరెస్ట్ చేశాం.ఉదయం హైదరాబాద్‌లో నారాయణను అరెస్ట్ చేశాం. గత నెల 27న టెన్త్ పేపర్ మాల్ ప్రాక్టీస్ జరిగింది. చిత్తూరు పీఎస్‌లో నమోదైన కేసులో నారాయణను అరెస్ట్ చేశాం. నిందితుల చైన్ లింక్‌లో చైర్మన్ నారాయణ వరకు ఆధారాలు లభించాయి. నారాయణ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకే పేపర్ లీక్. ఇన్విజిలేటర్ల వివరాలు ముందుగానే తీసుకుని మాల్ ప్రాక్టీస్. వీరి దగ్గర చదివే విద్యార్థులను రెండు విభాగాలుగా విభజిస్తారు. ముందే ఏ విద్యార్థులు ఎక్కడ పరీక్ష రాస్తారో తెలుసుకుంటారు. హెడ్ ఆఫీస్ నుంచి వెంటనే కీ తయారు చేసి విద్యార్థులకు పంపుతారు. నారాయణతో పాటు తిరుపతి డీన్ బాల గంగాధర్‌ను అరెస్ట్ చేశాం. నిందితుల వాంగ్మూలం, టెక్నికల్ ఆధారాలతోనే నారాయణను అరెస్ట్ చేశాం. అరెస్ట్ అయిన వారంతా 2008 నుంచి నారాయణ విద్యాసంస్థల్లో పని చేసిన వారే. గత నెల 27న వాట్సాప్‌లో లీకయినట్లు ఫిర్యాదు వచ్చింది. గతంలో కూడా ఈ తరహా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. నారాయణను కోర్టులో హాజరుపరుస్తాం’ అని ఎస్పీ రిశాంత్ తెలిపారు. చదవండి👉పారిపోయే యత్నం చేసిన మాజీ మంత్రి నారాయణ!