తాడేపల్లి: ఏపీలో టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను దర్యాప్తులో భాగంగానే ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
నారాయణ స్కూల్ సిబ్బందే టెన్త్ పేపర్లు బయటకు పంపారని బొత్స తెలిపారు. టెన్త్ పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకూ 60 మందిని అరెస్ట్ చేశారన్నారు. రాజకీయ విమర్శలు ఆపి, తప్పు చేయలేదని ధైర్యంగా చెప్పాలన్నారు బొత్స. కాగా, టెన్త్ పేపర్ లీకేజీ కేసులో నారాయణను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ మేరకు ఐపీసీ 408, పబ్లిక్ పరీక్షల మాల్ ప్రాక్టీస్ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment