
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి నారాయణపై మరో కేసు నమోదైంది. అమరావతి ల్యాండ్ పూలింగ్ కేసులో అవినీతి అంశానికి సంబంధించి ఏపీ సీఐడీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయంటూ కేసు నమోదు అయ్యింది. దీనిపై సోమవారం(మే9వ తేదీన) ఏపీ సీఐడీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదుతో మంగళగిరి పీఎస్‌లో కేసు నమోదు చేయగా, దీనిపై ఏపీ సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. మాస్టర్ ప్లాన్‌లో ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ మార్చారనే ఫిర్యాదుపై చంద్రబాబు, నారాయణ, లింగమనేని రమేష్‌లపై కేసు నమోదు చేశారు.
చదవండి👉 ప్రూవర్‌గా మారిన వైస్ ప్రిన్సిపల్ గిరిధర్.. నారాయణ ప్రోద్బలంతోనే..
చదవండి👉🏻‘లీక్ చేసేది వీళ్లే.. గందరగోళం చేసేది వీళ్లే’