P Narayana Arrest: AP Ex-Minister P Narayana Try to Escape Before Arrest? - Sakshi
Sakshi News home page

పారిపోయే యత్నం చేసిన మాజీ మంత్రి నారాయణ!

Published Tue, May 10 2022 6:03 PM | Last Updated on Tue, May 10 2022 6:54 PM

Former Minister Narayana Trying To Escape - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో టెన్త్‌ ప్రశ్నాపత్రాల లీకేజ్‌ వ్యవహారంలో నారాయణను ఈరోజు(మంగళవారం) ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా,  మాజీ మంత్రి, నారాయణ సంస్థల అధిపతి నారాయణ అరెస్టు విషయంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అరెస్ట్‌ను ముందే ఊహించిన నారాయణ పారిపోయే యత్నం చేశారు.

గత ఐదు రోజులుగా స్థావరాలు మార్చడమే కాకుండా ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేశారు. హైదరాబాద్‌ నగరంలో పలుచోట్ల నారాయణ రోజుకో నివాసం మార్చారు. మాదాపూర్‌, గచ్చిబౌలి, కొండాపూర్‌, కూకట్‌పల్లిలో ఉంటూ తప్పించుకునే యత్నం చేశారు. ఈ క్రమంలోనే గత మూడు రోజులుగా ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేశారు. దీనిపై సీఐడీ పోలీసులు నిఘా పెట్టారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళుతున్న సమాచారంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఐకియా సెంటర్‌ వద్ద నారాయణను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 

చదవండి👉నారాయణ లీక్స్‌: బురద జల్లాలనుకున్నారు.. వాళ్లే దొరికిపోయారు-సజ్జల

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement