ssc exams
-
ఇవాల్టి నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు
-
మరికాసేపట్లో పది పరీక్షలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకూ ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్ష జరగనుంది. ఉదయం 9.35 దాటితే పరీక్షకు అనుమతించమని ఎస్సెస్సీ బోర్డు ఇప్పటికే స్పష్టం చేసింది.టెన్త్ పరీక్షల కోసం 5,09,403 మంది రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం 2,650 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయి. 28,100 మంది ఇన్విజిలేటర్లు, 2,650 మంది డిపార్ట్మెంట్ అధికారులు పరీక్ష విధుల్లో ఉండనున్నారు. సైన్స్ సబ్జెక్టును రెండు విభాగాలుగా విడగొట్టారు. ఈ కారణంగా ఫిజికల్, బయలాజికల్ పేపర్లు మాత్రం ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకూ జరుగుతాయి. ఇక.. ఈసారి అడిషనల్ లేకుండా పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ క్రమంలోనే 24 పేజీల బుక్లెట్ విద్యార్థులకు అందజేయనున్నారు. అలాగే.. ప్రశ్నపత్రంలోనూ క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే సీరియల్ నంబరు వస్తుంది. పేపర్ లీక్ అయితే అది ఎక్కడి నుంచి జరిగిందని వెంటనే గుర్తించే వీలుందని పాఠశాల విద్య డైరెక్టర్ నర్సింహారెడ్డి చెబుతున్నారు. ప్రతీ పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నపత్రాలను కెమెరాల ఎదురుగానే ఓపెన్ చేయాలని ఆదేశించారు. విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను పరీక్ష కేంద్రానికి తేవొద్దని సూచించారు. అనేక చోట్ల సమస్యలు టెన్త్ పరీక్షల నేపథ్యంలో పలుచోట్ల అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సమస్య ఉన్నట్టు ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులు డీఈవోలను ఆదేశించారు. ఆదిలాబాద్, కొత్తగూడెం జిల్లాల్లోని మారుమూల ప్రాంతాల్లో రవాణా సౌకర్యం లేకపోవడాన్ని గుర్తించారు. ప్రత్యేక బస్సులు నడపాలని ఆరీ్టసీని ఆ జిల్లా కలెక్టర్లు ఆదేశించారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో రోడ్డు సరిగ్గా లేకపోవడం, బస్సులు నడపలేని పరిస్థితి ఉందని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. వేసవితీవ్రత కారణంగా విద్యార్థులు డీ హైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదముందని జిల్లా అధికారులు చెబుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. -
ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు మొదటి లాంగ్వేజ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్‌రామరాజు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6,27,277 మంది విద్యార్థులకు గాను 6,16,451 మంది(98.27 శాతం) హాజరయ్యారని పేర్కొన్నారు. 3,450 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా.. 1,545 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశాయని తెలిపారు. కర్నూలు జిల్లాలో కాపీయింగ్‌కు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను డిబార్ చేసినట్లు వెల్లడించారు.కాంపోజిట్కు బదులు జనరల్ పేపర్ రాసిన విద్యార్థిని!తెనాలిఅర్బన్ : పదో తరగతి పరీక్షల్లో అపశృతి దొర్లింది. కాంపోజిట్ తెలుగు పరీక్ష రాయాల్సిన విద్యార్థిని జనరల్ తెలుగు పేపరు రాసింది. విద్యాశాఖ అధికారుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌లోని ఎన్ఎస్ఎస్ఎంహెచ్ స్కూ ల్లో కే ధనశ్రీ ³దో తరగతి పరీక్షలు రాసేందుకు సోమవారం పాఠశాలకు వచ్చింది.ఆమె కాంపోజిట్ తెలుగు పరీక్ష రాయాల్సి ఉండగా.. ఇన్విజిలేటర్ పొరపాటున జనరల్ తెలుగు పేపరు ఇచ్చారు. విద్యార్థిని కూడా సకాలంలో గుర్తించకుండా పరీక్ష రాసేసింది. చివరి సమయంలో గుర్తించి.. విషయాన్ని ఇన్విజిలేటర్‌కు తెలియజేసింది. అప్పటికే సమయం మించిపోవడంతో చేసేది లేక ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేసి.. రాసిన పేపరును పరిగణనలోకి తీసుకునేలా చూస్తామని ఇన్విజిలేటర్ చెప్పారు. దీనిపై విచారణ జరిపిన డీఈవో సీవీ రేణుక.. ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశారు. విద్యార్థికి ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని డీఈవో ప్రకటించారు. -
పదో తరగతి విద్యార్థులకు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
సాక్షి, తాడేపల్లి: ఏపీలో నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ శుభాకాంక్ష తెలిపారు. మంచి ఫలితాలు సాధించాలని కోరుకున్నారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు. ప్రశాంతంగా పరీక్షలపై దృష్టి సారించండి. మంచి ఫలితాలు సాధించాలి’ అని కోరుకుంటున్నట్టు తెలిపారు.Best of luck to all the students appearing for the 10th class exams!I Stay calm, stay focused, and give your best.— YS Jagan Mohan Reddy (@ysjagan) March 17, 2025ఇక.. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పదో తరగతి పరీక్షలు జరుగనున్నాయి. చివరి పరీక్షను రంజాన్ సెలవు ఆధారంగా ఈ నెల 31 లేదా ఏప్రిల్ ఒకటో తేదీన నిర్వహిస్తారు. 2024–25 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 6,19,275 మంది రెగ్యులర్, 30,609 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు.రెగ్యులర్ విద్యార్థుల్లో ఇంగ్లిష్ మీడియంలో 5,64,064 మంది, తెలుగు మీడియంలో 51,069 మంది, ఉర్దూలో 2,471 మంది, హిందీలో 16 మంది, కన్నడలో 623 మంది, తమిళంలో 194 మంది, ఒడియాలో 838 మంది పరీక్షలు రాసేందుకు ఎన్రోల్ చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. వాటిలో 163 సమస్యాత్మక సెంటర్లుగా గుర్తించి సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించనున్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన టెన్త్ పరీక్షలు (ఫొటోలు)
-
పరీక్షా టైమ్
-
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు..
-
తెలంగాణలో నేటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు..ఇంకా ఇతర అప్డేట్స్
-
ఎల్లుండి నుంచే టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తర గతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు దాదా పు పూర్తయ్యాయి. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షలకు 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది విద్యార్థులు హాజరు కా నున్నారు. ఇందులో బాలురు 2,57,952 మంది. బాలికలు 2,50,433 మంది ఉ న్నారు. అధికారులు మొత్తం 2,676 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అధికా రులు పరీక్షలు రాసే విద్యార్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లు, ప్రింటెడ్ నామినల్ రోల్స్‌ను పంపిణీ చేశారు. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల వద్ద ఈ హాల్‌టికెట్లను పొందే వీలు కల్పించారు. అంతే కాకుండా ‘బీఎస్ఈ.తెలంగాణ.జీవోవీ.ఇన్’ అనే వెబ్సైట్ ద్వారా కూడా హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. 5 నిమిషాల వరకు అవకాశం పరీక్ష రాసే విద్యార్థులు ఉదయం 8.30 గంటలకల్లా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని పరీక్షల విభాగం స్పష్టం చేసింది. 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, మరో ఐదు నిమిషాల వరకు విద్యార్థులను అనుమతిస్తామని తెలిపింది. ఆ తర్వాత అనుమతించబోరని తెలిపింది. -
టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్
సాక్షి, విజయవాడ: టెన్త్, ఇంటర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త తెలిపింది. పరీక్షల సమయంలో విద్యార్ధులకు బాసటగా నిలుస్తూ.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం కల్పించింది. విద్యార్థులు హాల్‌టికెట్లు చూపించి పరీక్ష కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించవచ్చని పేర్కొంది. పల్లె వెలుగు, ఆల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తోంది. కాగా, టెన్త్, ఇంటర్ విద్యార్థులు కలిపి 16 లక్షల మంది(టెన్త్‌లో 6 లక్షలు, ఇంటర్లో 10 లక్షలు) మంది పరీక్షలు రాయబోతున్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు 2024 మార్చి 18 నుండి 30 వరకు ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 వరకు ఉంటాయి. ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. -
పరీక్షలతో ఒత్తిడిగా ఫీలవుతున్నారా? అయితే ఇలా చేయండి..!
"పదో తరగతి, ఇంటర్ పరీక్షలతోపాటు పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌కు నోటిఫికేషన్లు వచ్చాయి. టెన్త్ పరీక్షలకు దాదాపు నెల రోజుల సమయం ఉండగా, ఇంటర్మీడియెట్ పరీక్షలకు రెండు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో పిల్లలు చాలా కష్టపడి చదువుతుంటారు. ఉత్తమ మార్కులు సాధించాలన్న ఒత్తిడి వారిలో అధికంగా ఉంటుంది. అత్యుత్తమ మార్కులు సాధించాలన్న లక్ష్యంతో సమయాన్ని వృథా చేయకుండా చదువుతుంటారు. సరిగా నిద్ర పోరు. ఆహారం కూడా సరిగా తీసుకోరు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపరు. ప్రణాళిక లేమి స్పష్టంగా కనిపిస్తుంటుంది. ఫలితంగా తీవ్రమైన ఆందోళన, మానసిక సమస్యలకు గురవుతారు. పైగా మార్కుల గురించి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల భారీ అంచనాలు కూడా వీరిని కుంగుబాటుకు గురిచేసే ప్రమాదముంది. పరీక్షల కోసం సిద్ధమయ్యేటపుడు లేదా జరుగుతున్నపుడు విద్యార్థులు, అభ్యర్థులు పలు విషయాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఒత్తిడిని అధిగమించేందుకు, కుంగుబాటు నుంచి తప్పించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..!" ఆరోగ్యకర ఆహారం తీసుకోవాలి.. పరీక్షల సమయంలో చాలా మంది విద్యార్థులు సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. జంక్ ఫుడ్ తాత్కాలికంగా మంచి అనుభూతినిస్తుంది.. కానీ, ఇది జీవక్రియలను మందగింపజేసి అలసటకు, బద్ధకానికి దారితీస్తుంది. కాబట్టి, సమతుల ఆహారం తీసుకోవడంపై దృష్టి సారించండి. ఆకుకూరలు, కూరగాయలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే పాలు, పెరుగుతో తయారు చేసిన పదార్థాలతోపాటు మాంసకృత్తులు కలిగివున్న కోడిగుడ్డును తినాలి. పండ్లలో అరటి, యాపిల్, బొప్పాయి, సపోటా పండ్లను తింటే మెదడు చురుకుగా పని చేస్తుంది. మంచి ఆహారం తీసుకోవడంతోపాటు శరీరంలో నీటిశాతం తగ్గిపోకుండా ఉండేందుకు ప్రతి రోజు ఎనిమిది పెద్ద గ్లాసుల నీటిని తాగాలి. పుష్కలంగా నీరు తీసుకోవడం ద్వారా హైడ్రేటెడ్‌గా ఉండండి. మీ స్టడీ డెస్క్‌పై, మీతోపాటు వాటర్ బాటిల్‌ను పెట్టుకోండి. నీటితోపాటు పుదీనా ఆకులు, లేదా నిమ్మకాయలతో తయారు చేసిన రసాయనాలను తీసుకోండి. ఈ సీజన్లో మీ శరీరం డీహ్రెడేషన్కు గురవుతుంది. కాబట్టి నీటితోపాటు జ్యూస్‌లు తీసుకోవడం చాలా కీలకం. కెఫీన్, నికోటిన్, ఆల్కహాల్ వంటి ఉత్ప్రేరక పదార్థాలు ఒత్తిడిని పెంచే అవకాశాలు అధికంగా ఉంటాయి. వీటికి దూరంగా ఉండాలి. సమయానికి తినాలి.. సమయానికి ఆహారం తీసుకోకపోవడం అనారోగ్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా పరీక్షల సమయంలో టైం టు టైం భోజనం చేయాలి. పరీక్షలకు సన్నద్ధమయ్యేటపుడు, పరీక్షా సమయాల్లో భోజనం చేయకపోవడం వల్ల అనారోగ్యం, చికాకు, తక్కువ శక్తికి దారితీయవచ్చు. పరీక్షల సమయంలో షెడ్యూల్ పెట్టుకోండి. దాని ప్రకారం ఫాలో అవ్వండి. మీకు శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఎక్కువగా తినేలా చూసుకోండి. జ్ఞాపకశక్తిని పెంచేలా.. జ్ఞాపకశక్తి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు అవసరం. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వాల్నట్లు, అవిసె గింజలు (అల్సీ), గుమ్మడికాయ గింజలు, నువ్వుల గింజలు (టిల్), సోయాబీన్ నూనె, కనోలా నూనె వంటివి తీసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో కూడిన సప్లిమెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పరీక్షల సమయంలో వీటిని తీసుకోవాలి. ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడం ద్వారా, విటమిన్లు A, C, E వంటి యాంటీఆక్సిడెంట్లు అధిక ఒత్తిడి కారణంగా మెదడు కణాలకు హానిని తగ్గిస్తాయి. ఎక్కువగా మేలుకోకూడదు.. రాత్రి వేళల్లో ఎక్కువసేపు మేల్కొని చదవడం వల్ల శరీరంలో కూడా వివిధ రకాల ప్రభావాలు ఏర్పడతాయి. ప్రధానంగా ఒత్తిడిని మరింత పెంచడంతోపాటు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్నే చూపుతుంది. అందువల్ల విద్యార్థులు ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు విధిగా నిద్రపోవాలి. సంపూర్ణ విశ్రాంతి పొందిన తర్వాత పరీక్షల తయారీకి తిరిగి కొత్త ఉత్సాహం పుంజుకోవచ్చు. తద్వారా మీరు చదివినదంతా మెరుగ్గా గుర్తు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. వ్యాయామం అవసరం! రోజూ కనీసం 15–20 నిమిషాల పాటు ఏదో ఒక వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి. తద్వారా శరీరం, మనసు కూడా పునరుత్తేజం పొందుతాయి. యోగా, ధ్యానం వంటివి చేయడం వల్ల ఒత్తిడి దూరమై మనసు ఉల్లాసంగా ఉంటుంది. ఫలితంగా మన శక్తిసామర్థ్యాలను సమర్థవంతంగా వినియోగించుకునే వీలుంటుంది. విరామం ముఖ్యం.. పరీక్షల సమయం ముంచుకొచ్చే కొద్ది అనేక మంది విద్యార్థులు క్షణం తీరిక లేకుండా చదువుతుంటారు. ఇలా చదవడం వల్ల మెదడుపై వత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా చదివిన విషయాలు గుర్తు పెట్టుకోవడం కష్టమవుతుంది. అందువల్ల విద్యార్థులు విడతల వారీగా విరామం తీసుకోవడం చాలా అవసరం. తేలికపాటి ఆటలు, సామాజిక–ఆధ్యాత్మిక కార్యకలాపాలు, సంగీతం, డైరీ రాయడం, చిత్రలేఖనం తదితర అభిరుచులతో మనసు తేలికపరుచుకోవాలి. టైం టేబుల్ ప్రకారం.. పరీక్షలకు సమయం తక్కువ ఉన్నందున విద్యార్థులు ఏ సబ్జెక్టు ఎప్పుడు చదవాలి అనే విషయంపై ఓ ప్రణాళికను రూపొందించుకోవాలి. అందుకు అనుగుణంగా టైం టేబుల్‌ను కూడా తయారు చేసుకొని ఆ సమయం ప్రకారం చదవాలి. చాలా మంది విద్యార్థులు కష్టతరమైన సబ్జెక్టులను చివరగా చదవుదామన్న అభిప్రాయం ఉంటుంది. అయితే ఇది సరైన అభిప్రాయం కాదని విద్యావేత్తలు అంటున్నారు. ముందు కష్టతరమైన పాఠ్యాంశాలను చదవడం పూర్తి చేస్తే ఆ తరువాత సులభతరమైన పాఠ్యాంశాలను త్వరగా చదివి పూర్తి చేసుకోవచ్చు. ఒత్తిడిని సూచించే కొన్ని సంకేతాలు.. కడుపులో తిప్పుతున్న అనుభూతి వికారంగా అనిపించడం అరచేతుల్లో చెమటలు పట్టడం మైకం కమ్మినట్లు అనిపించడం గుండె వేగంగా కొట్టుకోవడం మెదడులో శూన్య భావన ఏకాగ్రత లోపం అయోమయం, భారంగా, నిస్పృహగా అనిపించడం కుదురుగా ఉండకపోవడం, రోదించడం, పళ్లు కొరకడం, వ్యాకులత, అటూ ఇటూ తిరగడం, గోళ్లు కొరకటం వంటివి ‘నేనిది చేయలేను’, ‘నేనిందుకు తగను’ వంటి ఆలోచనలు. మరిన్ని జాగ్రత్తలు! సబ్జెక్టుకు సంబంధించిన అవసరమైన వివిధ చర్చనీయాంశాలు, తేదీలు, వనరుల గురించి ముందుగానే సమాచారం సేకరించుకోవాలి. దీనివల్ల చివరి నిమిషపు హడావుడి తప్పుతుంది. మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, చదువుకు తగిన వాతావరణం సృష్టించుకోవడం కూడా ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అలాగే ఏ పనినైనా ఓ క్రమపద్ధతి ద్వారా చేయడం వల్ల సమయాన్ని నియంత్రణలో ఉంచుకోవచ్చు. పని పూర్తి చేయడానికి మీకెంత సమయం పడుతుందో వాస్తవ అంచనా వేసుకుని, దానికి కట్టుబడటం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. పరీక్ష రోజున మీకు కావాల్సినవేమిటో నిర్ణయించుకుని ముందు రాత్రే సిద్ధంగా ఉంచుకోండి. అలాగే పరీక్షకు వెళ్లేముందు మీకు ఆందోళనగా అనిపిస్తే కాస్త నిదానించి, నిండైన శ్వాసతో ఏకాగ్రత సాధనకు ప్రయత్నించండి. నిండుగా ఊపిరి పీలుస్తూ 3 అంకెలు లెక్కించండి. ఆపైన ఊపిరి బిగబట్టి 3 అంకెలు, ఊపిరి విడుస్తూ 3 అంకెలు లెక్కించండి. ఇలా మీరు స్థిమితపడే దాకా శ్వాస మీదనే ధ్యాసను కొనసాగించండి. పరీక్ష వేళ ప్రశ్నపత్రంలో మీకు జవాబు తెలిసిన ప్రశ్నలకే ముందు సమాధానాలు రాయండి. ఇతరులు ఏం చేస్తున్నారో పట్టించుకోకండి. డాక్టర్‌ను సంప్రదించండి.. పరీక్షల సమయంలో మానసిక సమస్యలు, ఒత్తిడి, కుంగుబాటుకు గురైనపుడు అందుబాటులో ఉన్న సమాచారంతో స్వీయవైద్యానికి ప్రయత్నించకూడదు. పరిస్థితి తీవ్రతను బట్టి నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. అవసరమైనపుడు డాక్టర్‌ను తప్పకుండా సంప్రదించాలి. ఈ మధ్య నిర్మల(పేరు మార్చాం)కు నిద్రపట్టడం పెద్ద సమస్యగా మారింది. భోజనం కూడా సరిగా చేయాలనిపించడం లేదు. తరచూ తలనొప్పితో బాధపడుతోంది. చీటికీమాటికీ చిరాకు పడుతోంది. కుంగుబాటుకు లోనవుతోంది. రోజురోజుకూ మరింత ఆందోళనకు గురవుతోంది. ఫలితంగా ఏకాగ్రత దెబ్బతింటోంది. దీంతో సరిగ్గా చదవలేకపోతోంది. దీనికంతటికీ కారణం త్వరలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండటం. ఆమె పరీక్షలకు సిద్ధమయ్యే ప్రయత్నం బాగా చేస్తున్నా అనవసర భయాందోళనలకు గురవుతోంది. ఇది ఒక్క నిర్మల సమస్యే కాదు.. టెన్త్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న చాలా మంది విద్యార్థుల పరిస్థితి. మొబైల్ ఫోన్‌ను పక్కన పెట్టేయాలి.. ప్రతి విద్యార్థి పరీక్షల సమయంలో కచ్చితంగా మొబైల్ ఫోన్‌ను పక్కన పెట్టేయాలి. పూర్తిగా చదువు మీదనే శ్రద్ధ ఉంచాలి. మొబైల్ ఫోన్‌ను ఉపయోగిస్తే చదువుకున్నప్పటికీ ఏకాగ్రత సన్నగిల్లుతుంది. దీంతోపాటు మంచి నిద్ర, ఆహారం తీసుకోవాలి. కొన్ని గంటల పాటు చదివిన తరువాత మొక్కలకు నీళ్లు పోయడం, పెయింటింగ్, ఇతర మంచి అలవాట్లతో రిలాక్స్ కావాలి. తరువాత మరలా చదువుపై దృష్టి సారించాలి. – పి.వి.సునీత, సైకాలజిస్ట్, వన్‌స్టాప్ సెంటర్ మార్కులు, గ్రేడ్లు ముఖ్యం కాదు.. పరీక్షల సమయంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. తల్లిదండ్రుల పాత్ర కూడా ఇందులో ఉంది. పిల్లలు తగినంత నిద్రపోయేలా చూడాలి. మంచి ఆహారం తినేలా చూడాలి. అనవసరమైన ఒత్తిడికి గురికాకుండా వారిని ప్రోత్సహించాలి. మార్కులు, గ్రేడ్లు మాత్రమే జీవితం కాదని ధైర్యం చెప్పాలి. – డాక్టర్ వెంకటరాముడు, సూపరింటెండెంట్, మానసిక వైద్యశాల, రిమ్స్ -
ర్యాంకుల కోసం ప్రణాలు పణం.. విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి!
"1, 2, 3.. పదిలోపు ర్యాంకులు మా విద్యార్థులవే.. పరీక్షలు ఏవైనా మెరుగైన ర్యాంకులు మా విద్యా సంస్థలదే.. అని కార్పొరేట్, ప్రైవేట్ కళాశాలలు ఊదరగొడితే.. 'మా అబ్బాయికి మొదటి ర్యాంకు వచ్చింది.. మా అమ్మాయికి రెండో ర్యాంకు వచ్చింది..' అంటూ తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకొంటారు.. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ మధ్యలో విద్యార్థులు ఎంతటి ఒత్తిడి అనుభవిస్తున్నారు.. ఎలా చదువుకుంటున్నారు.. అని మాత్రం ఎవరూ పట్టించుకోరు.. ఈ క్రమంలో ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం ఒకరిపై ఒకరు నెట్టుకొంటూ విద్యాసంస్థలు చేతులు దులుపుకొంటే.. తల్లిదండ్రులు కడుపు కోతతో జీవితాలను నెట్టుకొస్తున్నారు.. మొత్తంగా తల్లిదండ్రుల అత్యాశ.. విద్యాసంస్థల ధనదాహం.. ప్రభుత్వ పట్టింపులేని తనం వల్ల విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారు.." - మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ ర్యాంకుల కోసం విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడికి గురిచేస్తున్నారు. సమయం.. సందర్భం లేకుండా ఎప్పుడూ ప్రిపరేషన్ అంటూ పుస్తకాలతో కుస్తీ పట్టిస్తున్నారు. రోజువారి సాధారణ తరగతులే కాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతుల పేరిట విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వీటిని కొందరు విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటూ మెరుగైన ఫలితాలు సాధిస్తే.. మరికొందరు మాత్రం తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఈ క్రమంలో సోమవారం మహబూబ్‌నగర్‌లోని మైనార్టీ గురుకులంలో ఓ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇందుకు తీవ్రమైన ఒత్తిడే కారణం అన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఇన్నాళ్లు ప్రైవేట్‌లో చోటుచేసుకున్న పై సంఘటనలు ఇప్పుడిప్పుడే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యా సంస్థలకు విస్తరిస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. - గత వారం రోజుల క్రితం క్రిష్టియన్‌పల్లి సమీపంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సెలవు దినాలు, ఆదివారాల్లోనూ తరగతులు నిర్వహిస్తూ.. పరీక్షలు పెడుతున్నారని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని పాఠశాల విద్యార్థులే స్వయంగా డీఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించిన ఆయన ఎంఈఓతో విచారణ జరిపించారు. స్పెషల్ క్లాస్‌లు, పరీక్షల నిర్వహణ నిజమే అని తేలడంతో పాఠశాలను హెచ్చరించారు. పాఠశాల స్థాయి నుంచే.. ఇంటర్మీడియట్ తర్వాత విద్యార్థులు ఐఐటీ, నీట్లో సీట్లు సాధించాలన్న ఉద్దేశంతో చాలా ప్రైవేట్ పాఠశాలల్లో 8వ తరగతి నుంచే మెటీరియల్స్ పంపిణీ చేస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రుల నుంచి అదనంగా రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ తరగతులు పూర్తయిన వెంటనే స్పెషల్ క్లాస్‌ల పేరిట ఐఐటీ, నీట్ కోసం శిక్షణ ఇస్తున్నారు. దీంతో విద్యార్థులు వార్షిక పరీక్షల సిలబస్‌పై దృష్టి సారించాలా.. లేక ఐఐటీ, నీట్ వంటి వాటిపై దృష్టిపెట్టాలా అన్న అంశాలతో గందరగోళానానికి గురవుతున్నారు. ఇవి చదవండి: సైబర్ వలలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. మెసేజ్ క్లిక్ చేయగానే బిగ్ షాక్! -
ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటన
-
మార్చిలోనే ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించింది విద్యాశాఖ. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంటర్‌తో పాటు పదో తరగతి పరీక్షలనూ మార్చిలోనే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గురువారం మధ్యాహ్నాం ఆయన విజయవాడలో పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. ‘‘సాధారణ ఎన్నికలు ఏప్రిల్‌లో ఉండనున్నాయి. టెన్త్, ఇంటర్ విద్యార్థులు కలిపి 16 లక్షల మంది(టెన్త్‌లో 6 లక్షలు, ఇంటర్లో 10 లక్షలు) మంది పరీక్షలు రాయబోతున్నారు. అందుకే విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే మార్చిలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించాం. మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నాం 12గం.45ని. వరకు పరీక్షల సమయంగా నిర్ణయించాం. మార్చ్ 18న ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1 మార్చ్ 19 న సెకండ్ లాంగ్వేజ్ 20 న ఇంగ్లీష్, 22 తేదీ లెక్కలు, 23 న ఫిజికల్ సైన్స్, 26 న బయాలజీ, 27 న సోషల్ స్టడీస్ పరీక్షలు 28 న మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ ఎస్ ఇ మెయిన్ లాంగ్వేహ్ పేపర్ -1 30 న ఓఎస్ఎస్ ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష ఏడు సబ్జెక్ట్ లకే టెన్త్ పరీక్షలు నిర్వహణ ..అలాగే మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులందరూ పాసై 100 శాతం సక్సెస్ సాధించాలని ఆశిస్తున్నాం’’ అని మంత్రి బొత్స అన్నారు. ఇంటర్ ఫస్టియర్ షెడ్యూల్ మార్చ్ 1 న సెకండ్ లాంగ్వేజ్ -1, మార్చ్ 4 న ఇంగ్లీష్ పేపర్ -1, 6 న లెక్కలు పేపర్ 1 A, బోటనీ -1, సివిక్స్-1 , 9 న లెక్కలు పేపర్ 1B, జువాలజీ-1, హిస్టరీ-1, 12 న ఫిజిక్స్ -1, ఎకనామిక్స్ -1 14 న కెమిస్ట్రీ-1, కామర్స్-1,సోషయాలజీ-1,ఫైన్ ఆర్ట్స్,మ్యూజిక్ -1 16 న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, లాజిక్ పేపర్ -1, బ్రిడ్జి కోర్సు లెక్కలు-1 ( బైపిసికి) మార్చ్ 19 న మోడర్న్ లాంగ్వేజ్- 4, జాగ్రఫీ- 1 ఇంటర్ సెకండియర్ షెడ్యూల్ మార్చ్ 2 న సెకండ్ లాంగ్వేజ్ -2, మార్చ్ 5 న ఇంగ్లీష్ పేపర్ -2, 7 న లెక్కలు పేపర్ 2 A, బోటనీ -2, సివిక్స్-2 , 11న లెక్కలు పేపర్ 2B, జువాలజీ-2, హిస్టరీ-2, 13న ఫిజిక్స్ -2, ఎకనామిక్స్ -2 15 న కెమిస్ట్రీ-2, కామర్స్-2,సోషయాలజీ-2,ఫైన్ ఆర్ట్స్,మ్యూజిక్ పేపర్-2 మార్చ్ 18 న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-2, లాజిక్ పేపర్ -2, బ్రిడ్జి కోర్సు లెక్కలు-2 ( బైపిసికి) మార్చ్ 20న మోడర్న్ లాంగ్వేజ్- 2, జాగ్రఫీ- 2 -
టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సీఎం రేవంత్ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టీఎస్పీఎస్సీపై సమీక్ష చేపట్టారు. మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. టీఎస్పీఎస్సీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలన్నారు. యూపీఎస్సీతో పాటు ఇతర రాష్ట్రాలలో పరీక్షల నిర్వహాణపై అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. టీఎస్పీఎస్సీకి కావాలసిన సిబ్బందిని, ఇతర వనరులు వెంటనే సమకూర్చాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. మూసి అభివృద్ధి పై సమీక్ష: మూసి నది ప్రారంభం నుంచి చివరి వరకు మొత్తాన్ని ఉపాధి, ఆర్థికాభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. మూసిని పర్యటన ప్రాంతంగా డెవలప్ చేయాలని తెలిపారు. మూసి నది వెంట బ్రిడ్జీలు, కమర్షియల్ షాపింగ్ కాంప్లెక్స్‌లు, ప్రైవేటు పార్ట్నర్ షిప్ విధానంతో నిర్మించే విధంగా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మూసిలో మురుగు నీటి తగ్గించే విధంగా అవసరమైన చోట మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయాలన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహాణపై సమీక్ష: టెన్త్,ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గతంలోలాగా పేపర్ లీక్‌లు జరగకుండా జాగ్రత్తపడాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ,ప్రైవేటు విశ్వ విద్యాలయాల పనితీరుపై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో జూనియర్ కాలేజీల అవసరం ఎక్కడ ఉందో వాటి వివరాలు వెంటనే ఇవ్వాలన్నారు. -
ఆ ఆరుగురూ ఎంతో ప్రత్యేకం.. డిజిటల్ విధానంలో పరీక్ష పాసై చరిత్ర సృష్టించారు
సాక్షి, అమరావతి: దేశంలోనే తొలిసారిగా డిజిటల్ విధానంలో సహాయకులు (స్క్రైబ్) లేకుండా పదో తరగతి పరీక్షలు రాసిన దృష్టిలోపం ఉన్న విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించడంపై విద్యాశాఖ అధికారులు వారికి అభినందనలు తెలిపారు. వీరందరూ ఎంతో ప్రత్యేకమని వారు అభివర్ణించారు. అనంతపురం జిల్లాలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్టీడీ) ఇన్‌క్లూజివ్ హైస్కూల్లో టెన్త్ చదివిన దృష్టిలోపం గల విద్యార్థినులు డిజిటల్ విధానంలో 2022–23 విద్యా సంవత్సరంలో పరీక్షలు రాశారు. వీరిలో పొలిమెర చైత్రిక, చెంచుగారి పావని, ఎక్కలూరు దివ్యశ్రీ, మేఖ శ్రీధాత్రి, ఏకుల సౌమ్య, ఉప్పర నాగరత్నమ్మ ఉత్తీర్ణత సాధించారు. వారికి పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్, కమిషనర్ ఎస్. సురేష్‌కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు బి.శ్రీనివాసరావు విద్యార్థులకు అభినందనలు తెలిపారు. తొలి ప్రయోగంతోనే చక్కటి విజయం ఏపీ విద్యాశాఖ తొలిసారిగా పదో తరగతి దివ్యాంగ (దృష్టి లోపం) విద్యార్థులను డిజిటల్ విధానంలో పరీక్షలు రాయించేందుకు సిద్ధంచేసింది. వారు ల్యాప్‌టాప్‌లో హిందీ మినహా మిగతా సబ్జెక్టులన్నీ స్వయంగా డిజిటల్ విధానంలో రాయడానికి కేవలం 45 రోజుల్లో సిద్ధమయ్యారు. ఈ విద్యార్థులకు ప్రత్యేకంగా డిజిటల్‌గా ప్రశ్నపత్రాలను రూపొందించారు. దేశంలో ఇలాంటి విద్యార్థులకు డిజిటల్ విధానంలో పరీక్షలు రాసే సౌలభ్యం ఎక్కడా కల్పించలేదు. తొలిసారిగా ఏపీలో ఈ తరహా పరీక్షలు విజయవంతంగా నిర్వహించి, ఉత్తమ ఫలితాలు సాధించి చరిత్ర సృష్టించారు. ఈ విద్యార్థుల కోసం ‘నాన్ విజిబుల్ డెస్క్‌టాప్ యాక్సెస్’ (ఎన్‌వీడీఏ) సాఫ్ట్‌వేర్‌తో ప్రశ్నలను విని సమాధానాలు టైప్ చేశారు. డిజిటల్ పరీక్షల్లో విజయం సాధించడంతో భవిష్యత్‌లోను వారు పోటీ పరీక్షలు స్వయంగా రాయడానికి నాంది పలికారు. అందరికీ ఆదర్శనీయం ప్రయత్నమే విజయానికి దారి చూపుతుంది. దివ్యాంగ విద్యార్థులైనా కంప్యూటర్ ద్వారా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించడం ఆదర్శనీయం. మన రాష్ట్రంలో పాఠశాలలను డిజిటల్‌గా మార్చేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆలోచన చేస్తోంది. దివ్యాంగ విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించేందుకు అంకితభావంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. – బొత్స సత్యనారాయణ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి -
నీ కాల్మొక్తా సార్.. నా కొడుకు భవిష్యత్ కాపాడండి
కారేపల్లి: ‘‘నీ కాల్మొక్తా సార్.. నా కొడుకు భవిష్యత్‌ను కాపాడండి.. ఎలాగైనా సరే నా కొడుకు పదో తరగతి పరీక్ష రాసేలా చేయండి సార్’’ అంటూ ఓ తల్లి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడి కాళ్లపై పడి రోదించింది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకిట్యాతండాకు చెందిన గుగులోతు రమేష్ – సునీత దంపతుల కుమారుడు తరుణ్.. గతేడాది కారేపల్లి హైస్కూల్లో పదో తరగతి చదివాడు. అయితే గణితంలో ఫెయిల్ అయ్యాడు. దీంతో, ఈ ఏడాది పరీక్ష రాసేందుకు హైస్కూల్ జూనియర్ అసిస్టెంట్ సులోచనకు పరీక్ష ఫీజు రూ.150తో పాటు ఆలస్యమైనందుకు అదనపు రుసుము రూ.వెయ్యి కూడా చెల్లించాడు. అయితే, ఆమె సెలవులో వెళ్తూ హెచ్ఎం పవన్‌కుమార్‌కు ఫీజు ఇచ్చినట్లుగా చెబుతోంది. బోర్డుకు మాత్రం ఫీజు అందకపోవడంతో తరుణ్‌కు హాల్‌టికెట్ రాలేదు. ఈ విషయమై విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్లో అడగ్గా.. ఎవరికి వారు తమకు సంబంధం లేదని చెబుతూ చివరకు తాము బోర్డుకు ఫీజు చెల్లించలేదని ఒప్పుకున్నారు. ఏం చేయాలో తెలియని తరుణ్ తల్లిదండ్రులు బుధవారం కారేపల్లి హైస్కూల్‌కు చేరుకుని హెచ్ఎం పవన్‌కుమార్ కాళ్లపై పడి రోదిస్తూ ఎలాగైనా తమ కుమారుడి భవిష్యత్‌ను కాపాడాలని వేడుకున్నారు. -
తెలంగాణ: టెన్త్ హిందీ పేపర్ లీక్!?
సాక్షి, వరంగల్: తెలంగాణలో పదో తరగతి పరీక్ష ప్రశ్నాపత్రాల లీక్ కలకలం నడుస్తోంది. తాజాగా ఇవాళ(మంగళవారం) రెండో రోజూ పరీక్షల్లో హిందీ పేపర్ సైతం లీక్ అయినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లాలో హిందీ పేపర్ బయటకు వచ్చింది. ఉదయం 9గం.30కే పేపర్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. టెన్త్ విద్యార్థులకు చెందిన పలు వాట్సాప్ గ్రూపుల్లో పేపర్ చక్కర్లు కొట్టింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామంపై అధికారులు స్పందించాల్సి ఉంది. మరోవైపు.. నిన్న తాండూరులో పదో తరగతి తెలుగు ప్రశ్నాపత్రం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసింది విద్యాశాఖ. అలాగే.. బందప్ప, సమ్మప్ప అనే ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. -
Tenth Class Exam Paper Leak: వాట్సాప్ గ్రూపుల్లో టెన్త్ పేపర్ చక్కర్లు.. లీక్?!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పేపర్ లీక్‌ల వ్యవహారం సంచలనంగా మారింది. రాష్ట్రంలో సోమవారం నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే, పరీక్ష ప్రారంభమైన కాసేపటికే పరీక్ష పేపర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. వాట్సాప్ గ్రూపుల్లో పదో తరగతి క్వశ్చన్ పేపర్ చక్కర్లు కొట్టింది. పరీక్ష ప్రారంభమైన ఏడు నిమిషాలకే(9 గంటల 37 నిమిషాలకు) తెలుగు పేపర్ తాండూరులో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తాండూరులో ప్రశ్నాపత్రం సర్క్యూలేట్ అయ్యింది. ఈ నేపథ్యంలో వాట్సాప్‌లో చక్కర్లు కొడుతున్న టెన్త్ పేపర్‌పై పోలీసులు, విద్యాశాఖ ఆరా తీస్తోంది. పేపర్ ఎలా లీక్ అయ్యింది అని దర్యాప్తు చేస్తున్నారు. దీన్ని ఎవరు ఫొటో తీశారు అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
Telangana: నేటి నుంచి టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13 వరకు జరిగే ఈ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో కలిపి మొత్తం 4,94,620 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఇప్పటికే వారికి హాల్‌టికెట్లు అందాయి. మొత్తం 2,652 కేంద్రాల్లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. సైన్స్, కాంపోజిట్ సబ్జెక్టులకు 20 నిమిషాల అదనపు సమయం ఇవ్వనున్నారు. కోవిడ్ మూలంగా గత రెండేళ్లుగా 70 శాతం సిలబస్ ఆధారంగానే పరీక్షలు జరగ్గా ఈసారి వంద శాతం సిలబస్‌తో పరీక్షలు జరుగుతున్నాయి. అలాగే 11 పేపర్లకు బదులు ఈసారి ఆరు పేపర్లతోనే పరీక్షలు జరగనుండటం గమనార్హం. మరోవైపు టీఎస్పీఎస్సీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటన నేపథ్యంలో ఆ తరహా అనుభవాలు ఎదురవకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని రాష్ట్ర కార్యాలయం నుంచి పరిశీలించనున్నారు. మరోవైపు పరీక్ష కేంద్రాలకు వెళ్లే విద్యార్థుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి ఈ సౌకర్యం పొందొచ్చు. -
ఏపీ: టెన్త్ పరీక్షలకు సర్వం సిద్దం.. ఆర్టీసీలో విద్యార్థులకు ఫ్రీ ప్రయాణం
సాక్షి, విజయవాడ: ఏపీలో సోమవారం(ఏప్రిల్ 3) నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు 18వ తేదీ వరకు జరుగనున్నాయి. కాగా, పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. టెన్త్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు. ఏపీ టెన్త్ పరీక్షలు 2023 మోడల్ పేపర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక, మంత్రి బొత్స సత్యనారాయణ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. టెన్త్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 3449 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాము. రాష్ట్రంలో 6.69 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 9.30 నుంచి 12.45 వరకు పరీక్ష సమయం ఉంటుందన్నారు. ఆరు సబ్జెక్ట్‌లకు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లకు అనుమతి లేదు. ప్రభుత్వ టీచర్లు మాత్రమే ఇన్విజిలేటర్లుగా ఉంటారు. పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినట్టు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద నో మొబైల్ జోన్‌గా ప్రకటించాం. సెల్ ఫోన్, స్మార్ట్ పరికరాలు మొదలైనవి ఇన్విజలేటర్లు కూడా తీసుకురాకూడదు. పరీక్షలు జరిగే రోజున పరీక్షా కేంద్రాల పరిధిలోని ఆయా పాఠశాలలకి సెలవు ఉంటుంది. పరీక్షల నిర్వహణకి 800 స్క్వాడ్లు ఏర్పాటు చేశాం. ఇక, వేసవి కాలం ఎండ నేపథ్యంలో ఈనెల 3వ తేదీ నుంచి ఏపీలో ఒంటిపూట బడులు నడుస్తాయని చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలు సైతం మూడో తేదీ నుంచి ఒంటి పూటే బడులు నిర్వహించాలి అని తెలిపారు. -
పదో తరగతి పరీక్షలు.. ఇన్విజిలేటర్లు ఎలా మెలగాలి?
ఏప్రిల్ 3 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 10వ తరగతి పరీక్షలు. పిల్లలు ఒత్తిడిలో ఉంటారు. పెద్దలు ఒత్తిడి పెడుతుంటారు. వీటికి తోడు పరీక్షా హాలులో ఇన్విజిలేటర్లు కూడా ఒత్తిడి పెడితే విద్యార్థుల పరిస్థితి సంకటంలో పడుతుంది. ‘ఇన్విజిలేటర్ల పని పిల్లలు ప్రశాంతంగా రాసేలా చూడటం. వారితో మృదువుగా ఉంటూనే పరీక్షల నియమ నిబంధనలు పాటించవచ్చు’ అంటారు పియాలి బెనర్జీ. ‘పిల్లలు ఎప్పుడూ కనిపించేలా అల్లరిగా కాకుండా గంభీరంగా మారిపోయే సమయం అది’ అంటుంది పియాలి బెనర్జీ పరీక్షల సమయం గురించి. ఆమె ముంబైలో సుదీర్ఘ కాలం హైస్కూల్లో ఇంగ్లిష్ బోధించింది. చాలాసార్లు ఇన్విజిలేటర్‌గా పని చేసింది. ‘ఇన్విజిలేటర్‌కు పిల్లలను పరీక్షలు రాయడానికి ఉత్సాహపరిచే స్వభావం ఉండాలి. అది లేనప్పుడు కనీసం ఊరికే ఉంటే చాలు. ఏవో ఒక మాటలు చెప్పి, గద్దించి వారిని నిరుత్సాహపరిచే హక్కు మాత్రం లేదు’ అంటుందామె. తాను ఇన్విజిలేటర్‌గా ఉన్నప్పుడు గమనించిన అంశాలు పియాలి చెప్పింది. ‘ఒకసారి ఒక పిల్లాడు తల ఒంచుకుని కూచుని ఉన్నాడు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నాడని అనుకున్నాను. రెండు నిమిషాలైనా కదల్లేదు. దగ్గరికెళ్లి చూశాను. నిద్రలో జారుకున్నాడు. పాపం రాత్రి ఎంతసేపు చదివాడో. మెల్లగా తట్టి లేపాను. ఉలిక్కిపడి లేచాడు. వాస్తవంలోకి వచ్చి ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నానని గ్రహించి పూర్తిగా కంగారుపడిపోయాను. మెల్లగా చెప్పాను– ఐదు నిమిషాలే పడుకున్నావు. ఏం కొంపలు మునగలేదు. రాయి అని. స్థిమితపడి రాయడంలో పడ్డాడు. పరీక్ష అయ్యాక మొహమాటంగా నవ్వుతూ థ్యాంక్స్ చెప్పాడు. తల్లిదండ్రులు పరీక్ష ముందురోజు రాత్రి తొమ్మిదిన్నరకంతా పిల్లలను నిద్రపోయేలా చూడాలి. పిల్లల్ని అలా చదువు ప్లాన్ చేసుకోమని చెప్పాలి. ఇంకోసారి ఇంకో పిల్లాడు మాటిమాటికి టైమ్ వైపు చూసుకుంటూ కంగారుగా రాస్తున్నాడు. టైమ్ సరిపోదేమోనని భయం. దగ్గరగా ఒంగి చెప్పాను– హైరానా పడకు. మూడు గంటల్లో పూర్తయ్యేలాగే నీ ప్రశ్నలు ఉంటాయి. వాచీ చూడకు. రాసుకుంటూ వెళ్లు. నేను టైమ్ అలెర్ట్ చెప్తానుగా అన్నాను. పిల్లలను టైమ్ చాలదని భయపెట్టకూడదు’ అంటుంది పియాలి బెనర్జీ. కొంతమంది పిల్లలు హడావిడిలో పెన్ను పెన్సిల్ కూడా తీసుకురారు. ఇంక్ అయిపోయిందని పెన్ కోసం అడుగుతారు. అప్పుడు వారిని సూటిపోటిగా ఏదో ఒక మాట అంటే తర్వాత ఏం రాస్తారు? చిర్నవ్వుతో ఒక పెన్ అందిస్తే ఏం పోతుంది?’ అంటుందామె. ఎగ్జామినేషన్ హాల్లో పెద్దగా అరవడం సరిౖయెన పద్ధతి కాదు అంటుందామె. ఎవరైనా కాపీ చేస్తూనో మరో కోతి పని చేస్తూనో దొరికిపోయినా హాలంతా అదిరిపోయేలా అరిచి అందరు పిల్లలనూ బెంబేలెత్తించకూడదు. చాలా నిశ్శబ్దంగానే ఆ కాపీ చేస్తున్న పిల్లలను హాలు బయటకు తీసుకెళ్లి వ్యవహారం తేల్చాలి అంటుందామె. ‘పిల్లలు ఏవైనా అనవసరమైనవి పెట్టుకున్నారా తమ దగ్గర అని ఒకసారి చెక్ చేస్తే చాలు. పరీక్ష మధ్యలో మాటి మాటికి వారిని శల్యపరీక్షకు గురి చేసి ఏకాగ్రతను భంగం కలిగించకూడదు’ అని చెబుతుంది. ‘పిల్లలు సరిగ్గా తమ నంబర్ వేశారో లేదో చెక్ చేయడం ఇన్విజిలేటర్ ప్రధానమైన పని. అది మాత్రం ప్రతి విద్యార్థి దగ్గరకు వెళ్లి చెక్ చేసి వారికి ఓకే చెప్పాలి. లేదంటే పరీక్ష రాసి ఇంటికెళ్లినా నంబర్ సరిగ్గా వేశానా లేదా అని కంగారు పడతారు’’ అంటుంది పియాలి. పదో తరగతి పరీక్షలంటే పిల్లలు జీవితంలో మొదట ఎదుర్కొనే పరీక్షలు. ఆ సమయంలో ఇన్విజిలేటర్లు వారి దృష్టితో ఆలోచించి వీలైనంత కంఫర్ట్‌గా పరీక్ష రాసేలా చూడాలి. వారు రాస్తున్నప్పుడు ఇన్విజిలేటర్లు శ్రద్ధగా, విసుగు లేకుండా ఉండటం అన్నింటి కంటే ముఖ్యం అని సూచిస్తున్నదామె. -
పదో తరగతి విద్యార్థుల డేటా తయారీ పదిలం
శ్రీకాకుళం న్యూకాలనీ: పదో తరగతి విద్యార్థుల డేటా తయారీని పకడ్బందీగా చేపట్టేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపుల పర్వం దాదాపుగా పూర్తయ్యింది. జిల్లాలో 589 ఉన్నత పాఠశాలల్లో 30214 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఇందు లో ప్రభుత్వ బడుల నుంచి 22979 మంది, ప్రైవేటు స్కూల్స్ నుంచి 7,235 మంది విద్యార్థులు ఉన్నారు. పక్కాగా, పారదర్శకంగా ఉండేందుకు.. ఏప్రిల్ 3వ తేదీ నుంచి మొదలుకానున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల డేటాతోపాటు వారి వ్యక్తిగత సమాచారం పక్కగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే భవిష్యత్‌లో విద్యార్థుల మార్క్స్ మెమోలో తలెత్తే తప్పులకు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులే బాధ్యులని అధికారులు పేర్కొంటున్నారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పాఠశాల విద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. నామినల్స్ సవరణకు అవకాశం పదో తరగతి విద్యార్థుల నామినల్ రోల్స్ సవరణకు ప్రభ్వుతం సన్నద్ధమైంది. దీంతో విద్యార్థుల వ్యక్తిగత సమాచారం ముఖ్యంగా విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, జన్మదినం, మీడియం, వారి ఫొటో, సంతకం, ఆధార్ కార్డు నంబర్, పుట్టుమచ్చలు, మొ దటి, ద్వితీయ భాష, తదితర సమాచారం పక్కాగా ఉండేలా చూడాలని పాఠశాల విద్య కమిషనర్ ఆదేశించారు. దీంతో ఒకవేళ పొరపాటున కంప్యూటర్లో డేటానమోదు సమయంలో తలెత్తిన దోషాలు, తప్పుల సవరణకు ఈనెల 11 నుంచి 20వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇందుకు పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయుల లాగిన్‌లో ‘ఎడిట్’ ఆప్షన్‌ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే పీహెచ్సీ విద్యార్థుల సర్టిఫికెట్ అప్లోడ్ చేసిన కాపీని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంబంధిత సెక్షన్లో ఒరిజినల్, జిరాక్స్ కాపీలను ఈ నెల 25వ తేదీలోగా తీసుకువచ్చి ధ్రువీకరించుకుని వెళ్లాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి జిల్లాలోని పదో తరగతి విద్యార్థుల నామినల్ రోల్స్‌లో తప్పులు, దోషాలు ఉంటే వాటిని సరిచేసేందుకు ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్‌ను ఇచ్చింది. ఈనెల 20వ తేదీ వరకు ఈ అవకాశం ఉంది. హెచ్ఎంల లాగిన్‌లో ఎడిట్ చేసుకోవచ్చు. భవిష్యత్‌లో విద్యార్థుల డేటాలో ఉండే తప్పులకు హెచ్ఎంలే బాధ్యులవుతారు. ఒకటికి రెండు సార్లు విద్యార్థుల డేటాను సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. – గార పగడాలమ్మ, డీఈఓ శ్రీకాకుళం -
Telangana: టెన్త్ ప్రశ్నపత్రంలో మార్పులు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల విధానంలో మార్పులపై వస్తున్న విమర్శల నేపథ్యంలో విద్యాశాఖ దిద్దుబాటు చర్యలకు దిగింది. ప్రశ్నపత్రాల్లో మార్పులు చేసి.. పరీక్ష విధానం కాస్త తేలికగా ఉండేలా మార్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ‘టెన్‌్త’కు కఠిన పరీక్ష శీర్షికన ఈ నెల 2న ‘సాక్షి’లో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. చాయిస్ తగ్గించడం, వ్యాసరూప ప్రశ్నల విధానాన్ని కఠినం చేయడం, ఒకేరోజు సైన్స్ సబ్జెక్టుకు సంబంధించిన రెండు పేపర్లు నిర్వహించడంపై విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళనను ఈ కథనం వెలుగులోకి తెచ్చింది. పలు ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు ఈ అంశాలను ఎత్తిచూపుతూ.. విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. దీనిపై స్పందించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులతో సమాలోచనలు జరిపారు. ఇబ్బందికరంగా ఉన్న ప్రశ్నపత్రాలు, విధానంలో మార్పు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎస్సీఈఆర్టీ) రంగంలోకి దిగింది. అభ్యంతరాలను పరిశీలించి, పరీక్ష పేపర్లలో మార్పులు తెస్తూ కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఆమోదించగానే ప్రశ్నపత్రాలను మార్చనున్నారు. చాయిస్ పెంపు.. ప్రశ్నల తగ్గింపు.. రెండేళ్ల కరోనా కాలం తర్వాత ఈసారి వందశాతం సిలబస్‌తో టెన్త్ పరీక్షలు జరుగనున్నాయి. ఏప్రిల్ 3 నుంచి పరీక్షల నిర్వహణకు బోర్డు ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఈసారి 11 పేపర్లకు బదులు ఆరు పేపర్లతోనే పరీక్షలు ఉంటాయంటూ.. సంబంధించిన మోడల్ పేపర్లను విడుదల చేసింది. ఆ పేపర్లను చూశాక విద్యార్థులు, విద్యారంగ నిపుణులు ఆశ్చర్యపోయారు. రెండు, మూడు మార్కుల సూక్ష్మప్రశ్నలకు గతంలో ఉన్న చాయిస్ ఎత్తివేయడంతో.. ఏ ఒక్క ప్రశ్నకు జవాబు తెలియకపోయినా విద్యార్థి ఆ మేర మార్కులు కోల్పోవాల్సి వస్తుందనే ఆందోళన మొదలైంది. ఇక వ్యాసరూప ప్రశ్నలను సెక్షన్ మాదిరి కాకుండా, గ్రూపులుగా ఇచ్చారు. సెక్షన్ మాదిరిగా అంటే మొత్తం 12 ప్రశ్నలు ఇచ్చి అందులోంచి ఆరింటికి సమాధానాలు రాయాలని కోరుతారు. దీనిలో విద్యార్థులకు చాయిస్ ఎక్కువగా ఉండి, ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మోడల్ పేపర్లలో రెండు ప్రశ్నల చొప్పున ఆరు గ్రూపులుగా ఇచ్చి.. ప్రతి గ్రూప్‌లో ఒకదానికి సమాధానం రాయాలని పేర్కొన్నారు. ఆ గ్రూపులోని రెండు ప్రశ్నలకు సమాధానం తెలియకపోతే.. ఆ మేర మార్కులు కోల్పోయినట్టే. మిగతా గ్రూపుల్లోని అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయగలిగినా ప్రయోజనం ఉండదు. ఈ ఆందోళనను ఎస్సీఈఆర్టీ అధికారులు పరిగణనలోనికి తీసుకున్నారు. సూక్ష్మప్రశ్నలకు ఎక్కువ చాయిస్ ఇవ్వడం మంచిదని.. వ్యాసరూప ప్రశ్నలనూ సెక్షన్ విధానంలో ఇవ్వాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. అంతేగాకుండా వ్యాసరూప ప్రశ్నల సంఖ్యను తగ్గించే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. అయితే సైన్స్ సబ్జెక్టులో ఫిజిక్స్–కెవిుస్ట్రీ/బయాలజీ పేపర్లను వేర్వేరు రోజుల్లో నిర్వహించాలనే డిమాండ్‌ను అధికారులు పరిగణనలోకి తీసుకోవడం లేదని.. దీనివల్ల విద్యార్థులకు ఇబ్బంది ఉండబోదని భావిస్తున్నట్టు తెలిసింది. మార్పులను పరిశీలిస్తున్నాం.. త్వరలో వెల్లడిస్తాం టెన్త్ ప్రశ్నపత్రాల విధానం వల్ల విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని వివిధపక్షాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను అధికారులు పరిశీలిస్తున్నారు. అధికారుల నివేదిక వచ్చాక ఏతరహా మార్పులు చేయాలనేది నిర్ణయిస్తాం. ఇప్పటికే సంబంధిత విభాగం ప్రశ్నపత్రాల మార్పులపై నిశితంగా అధ్యయనం చేస్తోంది. విద్యార్థుల ప్రయోజనం కోసం అవసరమైన మార్పులు చేస్తాం. – వాకాటి కరుణ, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ -
TS SSC Exam 2023: పిల్లకాకిపై ఉండేలు దెబ్బ!
గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ; రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి (ఎస్సీ ఈఆర్టీ) వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ అటు విద్యార్థులనూ, ఇటు ఉపాధ్యాయులనూ ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అటువంటి వివాదాస్పద ఉత్తర్వుల జాబితాలో తాజాగా 2022 డిసెంబర్ 28న పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ఇచ్చిన జీఓఎమ్ఎస్ నం. 33 ఒకటి. వాస్తవానికి ఈ ఉత్తర్వు విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వాల్సి ఉండగా సమ్మెటివ్ అసెస్మెంట్–1 పరీక్షలు 11 పేపర్లుగా రాసిన అనంతరం చాలా ఆలస్యంగా డిసెంబర్లో మేలుకోవడమే విద్యా శాఖ అలసత్వానికి నిదర్శనం. కోవిడ్‌కు ముందు 10వ తరగతి విద్యార్థులకు 11 పేపర్లతో పరీక్షలు నిర్వహించేవారు. హిందీ మినహా మిగిలిన అన్ని సబ్జెక్ట్‌లను రెండు పేపర్లుగా విభజించి పరీక్షలు నిర్వహించేవారు. గత రెండు, మూడు ఏళ్లుగా కోవిడ్ మహమ్మారి కారణంగా భౌతికంగా తరగతులు సరిగా జరుగకపోవడం వల్ల, విద్యార్థులు ఆన్లైన్ తరగతులు సరిగా వినకపోవడం వల్ల విద్యార్థుల్లో తగ్గిన అభ్యసన సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకొని పేపర్ల సంఖ్య తగ్గించడానికి ఉపాధ్యాయ సంఘాల ప్రాతినిధ్యం మేరకు రాష్ట్ర విద్యాశాఖ జీఓ 33 ద్వారా 11 పేపర్లను 6 పేపర్లకు తగ్గించడంతో పాటుగా... ఎస్సీఈఆర్టీ ద్వారా మోడల్ పేపర్లను కూడా విడుదల చేసింది. కానీ ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ రెండు సబ్జెక్ట్‌ల పరీక్షలను ఒకేరోజు ఒక్కొక్క పేపర్‌ను ఒక గంట ముప్పై నిమిషాలపాటు నిర్వహించాలని ఉత్వర్వులలో పేర్కొనడం హాస్యాస్పదంగా మారింది. వాస్తవానికి నిర్వాహణలో ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. ఒక పేపరు రాసిన వెంటనే ఆ పేపరును తీసుకొని మరో పేపరును విద్యార్థికి స్పల్ప సమయం తేడాతో ఇస్తారు. రెండు పేపర్లను చదువుకోవడానికి మరో ఇరవై నిముషాల సమయం అదనంగా ఇచ్చినా మూడు గంటల ఇరవై నిముషాల పాటు ఈ రెండు పరీక్షలు ఒకే రోజు నిర్వహించడం వలన విద్యార్థికి చాలా అన్యాయం జరుగుతుంది, ఇటు పరీక్ష నిర్వాహకులకూ ఇబ్బందే. అందుకని ఈ రెండు పరీక్షలను వేరు వేరు రోజులలో నిర్వహించాలని తెలంగాణ టీచర్స్ యూనియన్‌తో పాటు అన్ని ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖను కోరుతున్నా పట్టించుకోవడం లేదు. గతంలో ఒక్కొక్క సబ్జెక్ట్ రెండు పేపర్లు ఉండగా ఇప్పుడు ఒక సబ్జెక్ట్‌లోని అన్ని పాఠాలను మొత్తం చదివి ఒకే రోజు పరీక్షను రాయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించాల్సిన అవసరమున్నది. రెండు పేపర్ల విధానంలో పరీక్షలు ఉన్న సందర్భాలలో సంక్షిప్తరూప ప్రశ్నలు ఎక్కువగా ఉండి విద్యార్థులు తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు వ్యాసరూప ప్రశ్నల సంఖ్యను పెంచడం వలన రాసే సమయం అధికంగా పెరగడమేకాక, ఛాయిస్ విధానాన్ని తగ్గించడం వలన విద్యార్థులు అన్ని ప్రశ్నలకు జవాబులు రాయడానికి సమయం సరిపోక 10 జీపీఏను సాధించడం కష్టంగా మారింది. అలాగే 2022 డిసెంబర్ 30 నాడు స్పెషల్ రివిజన్ క్లాసుల పేరిట ఎస్సీఈఆర్టీ వారు మరో వివాదస్పద ఉత్తర్వును ఇచ్చారు. వారాంతపు సెలవులను, సెలవు దినాలను కూడా మినహాయించకుండా ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు నిర్వహించాలనేది దాని సారాంశం. ఇది ఇబ్బందులతో కూడుకున్నది. గ్రామీణ ప్రాంతాల్లో... చుట్టుపక్కల రెండు, మూడు గ్రామాల నుండి విద్యార్థులు తమ హైస్కూల్‌కు వస్తారు. ముఖ్యంగా అమ్మాయిలను సాయంత్రం 6 గంటల వరకు ఉంచడం వల్ల... తలెత్తే రవాణాసౌకర్యం సమస్య ఎలా పరిష్కరించాలి. ముఖ్యంగా భద్రతాపరమైన అంశాలపై జవాబుదారు ఎవరనే ప్రశ్న తలెత్తుతున్నది. పాఠశాలలో కేవలం మధ్యాహ్నా భోజన సౌకర్యం మాత్రమే ఉన్నది. ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకు విద్యార్థులకు ఉదయం టిఫిన్, సాయంత్రం స్నాక్స్ ఎవరివ్వాలి? జాయిఫుల్ లర్నింగ్‌కు, ఆర్టీఈకి విరుద్ధంగా వారాంతపు, ప్రభుత్వ సెలవు దినాలలో ప్రత్యేక తరగతులు నిర్వహించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఎస్సీఈఆర్టీ గతంలో ఎప్పుడూ నేరుగా ఉపాధ్యాయులకు ఆదేశాలు ఇచ్చేది కాదు. ఏ ఆదేశాలైనా పాఠశాల విద్యాశాఖాద్వారానే వచ్చేవి. కాని ఈ మధ్యకాలంలో నేరుగా పాఠశాల విద్యాశాఖతో సంబంధం, సమన్వయం లేకుండానే పాఠశాలకు సంబంధించిన పనిదినాలపైనా, సెలవులపైనా పాఠశాల విద్యాశాఖ జారీచేసిన అకడమిక్ క్యాలెండర్‌కు భిన్నంగా ఎస్సీఈఆర్టీ దాని పరిధిని దాటి ఆదేశాలు ఇస్తోంది. దీంతో అసలు ఎవరి ఆదేశాలను పాటించాలో అర్థంకాక ఉపాధ్యాయులలో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది. ఏదైనా విధానపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు కూడా తీసుకొని వివాదాలు లేకుండా రాష్ట్ర విద్యాశాఖ, టీఎస్‌ఎస్‌సీఈఆర్‌టీలు ఇప్పటికైనా విధానాల రూపకల్పన చేస్తే భవిష్యత్తులో ఎటువంటి విమర్శలు, వివాదాలు లేకుండా విద్యావ్యవస్థ సజావుగా కొనసాగుతుంది! (క్లిక్ చేయండి: రామప్ప దేవాలయానికి పొంచి ఉన్న ముప్పు) - డాక్టర్ ఏరుకొండ నరసింహుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ టీచర్స్ యూనియన్ -
‘పది’ గట్టెక్కేదెలా?.. సిలబస్ పూర్తి కాని వైనం..
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులను గటెక్కించడం విద్యాశాఖకు సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మహానగరంలోని సర్కారు బడుల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత, మరోవైపు సిలబస్ పూర్తి కాక పోవడం వంటివి తలకు మించిన భారంగా మారాయి. తాజాగా సర్కారు బడుల్లో మంచి ఫలితాల సాధన కోసం నిర్వహించ తలపెట్టిన ప్రత్యేక తరగతులు, వారాంతపు పరీక్షల అమలు ప్రశ్నార్థకంగా మారాయి. కరోనా నేపథ్యంలో విద్యార్థులో అభ్యసన సామర్థ్యాలు తగ్గడంతో పాటు సబ్జెక్టులపై కనీస పట్టులేకుండా పోయింది. వాస్తవంగా సబ్జెక్టు నిపుణుల కొరతతో ప్రధాన సబ్జె క్టుల్లో పాఠ్యాంశాల బోధన అంతంత మాత్రంగా తయారైంది. ఆయా పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులతోనే ప్రధానోపాధ్యాయులు బోధన కొనసాగిస్తున్నారు. కరోనా, ఆరి్థక పరిస్థితుల నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో కొత్త అడ్మిషన్లు బాగానే పెరిగాయి. అయితే విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యను విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయిందని సాక్షాత్తు ప్రధానోపాధ్యాయులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సర్కారు బడుల్లో వంద శాతం ఫలితాలు సాధించడానికి అధికారులు మాత్రం ఏటా మొక్కుబడిగా ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నా అందుకు అనుగుణంగా టీచర్ల ఖాళీల భర్తీ ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం కావడంతో మరింత వెనుకబాటు తప్పడం లేదు. సరికొత్త ప్రణాళిక ► సర్కారు బడుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితులను అధిగమించకుండా పదవ తరగతి పరీక్షలో మంచి ఫలితాల కోసం రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆరీ్ట) తొలిసారిగా ► సరికొత్త ప్రణాళిక రూపొందించింది. వాస్తవంగా పదవ తరగతి పరీక్షల నేప«థ్యంలో జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తరగతులు, పరీక్షలపై ప్రణాళిక రూపొందించి అమలు చేసేవారు. ఆయితే సర్కారు బడుల్లో తగ్గుతున్న పదవ తరగతి ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళిక రూపొందించడం విశేషం. 40రోజులు ప్రత్యేక తరగతులు.. ► పదవ తరగతి విద్యార్థులు సబ్జెక్టులపై మరింత పట్టు సాధించేందుకు 40 రోజుల పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. జనవరి 3 నుంచి మార్చి 10వ వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయి. పాఠశాల ప్రారంభ సమయం కంటే ముందు ఉదయం 8.30నుంచి 9.30 గంటల వరకు ఒక సబ్జెక్టు, పాఠశాల సమయం అనంతరం ► సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు మరో సబ్జెక్టులో తరగతులు నిర్వహిస్తారు. రోజుకు రెండు సబ్జెక్టులు బోధిస్తారు. వాటిపైనే వారం వారం పరీక్షలు నిర్వహిస్తారు. 3 నుంచి వారాంతపు పరీక్షలు ► పదో తరగతి వార్షిక పరీక్షలకు సన్నద్ధమయ్యేవిధంగా ప్రతి ఆదివారం, రెండో శనివారాల్లో వారాంతపు పరీక్షలు జరుగుతాయి. ప్రతి వారం ఒకే రోజు రెండు పరీక్షలు ► ఉదయం 9 నుంచి11 గంటల వరకు ఒక పరీక్ష, 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు రెండో పరీక్ష నిర్వహించాల్సి ఉంది.. చదవండి: ఐటీ కారిడార్‌కు మరో మణిహారం.. కొత్త సంవత్సరం కానుకగా ఫ్లై ఓవర్.. -
ఏపీలో టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2023 ఏప్రిల్ 3వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది టెన్త్ బోర్డు. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నాం టైం టేబుల్‌ను ప్రకటించింది. ఏపీలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఆరు సబ్జెక్ట్‌లకే పరీక్ష నిర్వహణ ఉండనుందని బోర్డు వెల్లడించింది. అలాగే.. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నాం 12.45 వరకు పరీక్షా సమయంగా నిర్ణయించారు. సిబీఎస్ఈ తరహాలో రోజు విడిచి రోజు పరీక్షలు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 3వ తేదీన ఫస్డ్ లాంగ్వేజ్ పేపర్-1. ఏప్రిల్ ఆరున సెకండ్ లాంగ్వేజ్. 8వ తేదీన ఇంగ్లీష్, 10వ తేదీ లెక్కలు, 13న సైన్స్, 15న సోషల్ స్టడీస్ పరీక్షలు ఉంటాయి. 17వ తేదీన మొదటి లాంగ్వేజ్ పేపర్-2 (కాంపోజిట్ కోర్సు)/ ఓఎస్ఎస్ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -1 నిర్వహిస్తారు. 18వ తేదీన ఓఎస్ఎస్ఇ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ -2 ( సంస్కృతం, అరబిక్,పర్షియన్), వొకేషనల్ కోర్సు పరీక్ష ఉండనుంది. -
ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇవి ఏప్రిల్ 13వ తేదీ వరకూ కొనసాగుతాయి. బుధవారం రాష్ట్ర పరీక్షల విభాగం దీనికి సంబంధించిన టైమ్ టేబుల్, ఇతర విధివిధానా లను విడుదల చేసింది. అలాగే పరీక్షల్లో ఇప్పటి వరకు ఉన్న 11 పేపర్ల విధానా నికి బదులు ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా మార్పులు చేస్తూ విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ జీవో జారీ చేశారు. టెన్త్‌తో పాటు 9వ తరగతి సమ్మేటివ్ అసెస్ మెంట్–2 కూడా 6 పేపర్లతోనే నిర్వ హించనున్నట్టు జీవోలో పేర్కొ న్నారు. ప్రతీ సబ్జెక్టులోనూ వంద మార్కులుంటాయి. 4 ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీ క్షల నుంచి 20 మార్కులు, పబ్లిక్ పరీ క్షలో 80 మార్కులు ఉంటాయి. మొత్తం ఆరు సబ్జెక్టులకు ఎఫ్ఏల ద్వారా 120 మార్కులు, పబ్లిక్ పరీక్షల ద్వారా 480.. మొత్తం 600 మార్కులకు పరీక్ష ఉంటుంది. సైన్స్ మినహా అన్ని సబ్జెక్టుల పరీక్షలకు 3 గంటల వ్యవధి ఉంటుంది. సైన్స్‌లో మాత్రం బయలాజి క ల్ సైన్స్, ఫిజికల్ సైన్స్.. 2 పేపర్లుగా విభజించా రు. ఒక్కో పేపర్‌కు గంట న్నర వ్యవధి ఇస్తారు. మొదటి పేపర్ పరీక్ష జరిగిన తర్వాత ఆ సమాధాన పత్రాల సేకర ణకు అదనంగా 20 నిమి షాలు ఇస్తా రు. అంటే సైన్స్ 2 పేపర్ల పరీక్ష వ్యవధి 3.20 గంటలు ఉంటుంది. ఓరియంటల్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్ పరీక్షల్లో సంస్కృతం పేపర్–1, పేపర్–2గా ఒక్కొక్కటి 200 మార్కులకు ఉంటుంది. ఇదీ టెన్త్ టైమ్ టేబుల్... వంద శాతం సిలబస్‌తో పరీక్షలు: మంత్రి సబిత ఈ సారి టెన్త్ పరీక్షలను వంద శాతం సిలబస్‌తో నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబిత తెలిపారు. పరీక్షల్లో వ్యాసరూప ప్రశ్న లకు మాత్రమే ఇంటర్నల్ చాయిస్ ఉంటుందని, సూక్ష్మరూప ప్రశ్నలకు చాయిస్ లేదని ఆమె వెల్లడించారు. టెన్త్ పరీక్షల నిర్వహణపై బుధవారం మంత్రి విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె అధికారులకు పలు సూచనలు చేశారు. టెన్త్ పరీక్షలకు సంబంధించి నమూనా ప్రశ్న పత్రాలను వెంటనే విద్యార్థులకు అందు బాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని, వాటికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయా లని సూచించారు. సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతులను నిర్వ హించాలని పేర్కొ న్నారు. ఏదైనా సబ్జెక్టులో వెనుకబడిన వారిని గుర్తించి ఆ విద్యార్థులకు ప్రత్యేక బోధన చేయాలని సూచించారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ప్రీ ఫైనల్స్ నిర్వహించాలని స్పష్టంచేశారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉత్తీర్ణత శాతం సాధించేలా చర్యలు తీసుకో వాలని కోరారు. ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరు ణ, పాఠశాల విద్యా సంచాలకు రాలు దేవసేన, ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు కృష్ణారావు తదితరు లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. -
TS: పరీక్షా విధానంలో సంస్కరణలు.. టెన్త్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్ష విధానంలో సంస్కరణలు తీసుకువచ్చింది. అందులో భాగంగానే 9, 10 తరగతి పరీక్షల్లో ఆరు పేపర్ల పరీక్ష విధానాన్ని ముందుకు తీసుకువచ్చింది. విద్యా విధానంలో సంస్కరణలో భాగంగా 9, 10వ తరగతి పరీక్ష విధానంలో విద్యాశాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది. 9, 10 తరగతి పరీక్షల్లో ఆరు పేపర్లను తీసుకువచ్చింది. కాగా, ఈ సంస్కరణలు 2022-23 నుంచి అమలులోకి రానున్నాయి. ఒక్కో సబ్జెక్టులో 80 మార్కులతో పరీక్ష విధానం ఉంటుంది. ఫార్మేటివ్ అసెస్మెంట్కు 20 మార్కులు ఇవ్వనున్నారు. ఫిజిక్స్, బయాలజీకి సగం సగం మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సందర్బంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఏప్రిల్ 3వ తేదీ నుంచి తెలంగాణలో టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతాయి. టెన్త్ పరీక్షలు ఆరు పేపర్లకు కుదించాము. వంద శాతం సిలబస్‌తో పరీక్షల నిర్వహణ ఉంటుంది. ప్రతీ పరీక్షకు 3 గంటల సమయం కేటాయించాము. టెన్త్ విద్యార్థులకు స్పెషల్ క్లాసులు ఉంటాయని సబిత స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి నమూనా ప్రశ్నా పత్రాలను వెంటనే విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పదో తరగతి పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని, వీటికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని అధికారులకు సూచించారు. సెలవు దినాల్లో కూడా ప్రత్యేక తరగతులను నిర్వహించాలని పేర్కొన్నారు. ఏదైనా సబ్జెక్టులో వెనుకబడిన వారిని గుర్తించి వారికి ప్రత్యేక బోధన చేయాలని సూచించారు. ఫిబ్రవరి, మార్చి మాసాల్లో ఫ్రీ ఫైనల్ పరీక్షలను నిర్వహించాలని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఉత్తీర్ణత శాతం సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. -
AP: టెన్త్.. నో టెన్షన్
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి.. నాణ్యమైన విద్యాబోధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో నూతన సంస్కరణల వైపు అడుగులు వేస్తోంది. విద్యార్థుల భవిష్యత్‌కు టెన్త్ కీలక మలుపు. పదో తరగతి పరీక్షలంటే విద్యార్థుల్లో ఎక్కడాలేని భయం. ఈ భయాన్ని పోగొట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షల్లో సమూల మార్పులు తీసుకు వచ్చింది. పది పబ్లిక్ పరీక్షల్లో 11 పేపర్లకు బదులు 6 పేపర్లు నిర్వహించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. సీబీఎస్ఈ తరహాలో పరీక్షలు నిర్వహించనున్నారు. నెల్లూరు (టౌన్): టెన్త్ పరీక్షలంటే.. ఇక నో టెన్షన్. విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణలతో విద్యార్థులపై చదువులు, ర్యాంక్‌లు, మార్కులు ఒత్తిడి తగ్గనుంది. తద్వారా నాణ్యమైన విద్య ప్రమాణాలు అందనున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి పబ్లిక్ పరీక్షల్లో 6 పేపర్లనే ఉండడంతో విద్యార్ధులపై ఒత్తిడి తగ్గుతుందని పలువురు విద్యావేత్తలు చెబుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ప్రభుత్వం నిర్ణయంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉన్నత పాఠశాలలు 420 వరకు ఉన్నాయి. వీటిల్లో 35 వేల మందికి పైగా విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. గతంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మొత్తం 11 పేపర్లు ఉండేవి. హిందీ మినహా మిగిలిన ఒక్కో సబ్జెక్ట్‌కు రెండు పేపర్లు ఉండేవి. కోవిడ్ కారణంగా గతేడాది çపది పబ్లిక్ పరీక్షల్లో 7 పేపర్లు నిర్వహించారు. కరోనా తీవ్రత నేపథ్యంలో 2019–20, 2020–21 విద్యా సంవత్సరాల్లో పది పబ్లిక్ పరీక్షలు నిర్వహించలేదు. సమ్మేటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకుని పబ్లిక్ పరీక్షలకు సంబంధించి మార్కులు కేటాయించారు. 2022–23 విద్యా సంవత్సరం నుంచి పది పబ్లిక్ పరీక్షల్లో 6 పేపర్లు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించారు. దీని వల్ల విద్యార్థులకు భారం తగ్గడంతో పాటు మానసిక ఒత్తిడి నుంచి కొంత ఉపశమనం కలుగుతుందని విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు. పది పబ్లిక్ పరీక్షల్లో తెలుగు, హిందీ, ఇంగ్లి‹Ù, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్ట్‌లు ఉంటాయి. వీటిల్లో హిందీకి తప్ప మిగిలిన సబ్జెక్ట్‌లకు రెండేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ విద్యా సంవత్సరం నుంచి బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తరహాలో ఒక్కో సబ్జెక్ట్‌కు ఒక్కో పరీక్షను మాత్రమే నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి మోడల్ పేపర్లను సిద్ధం చేసి ఉపాధ్యాయులకు అందజేశారు. చదువుకునేందుకు ఎక్కువ సమయం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 6 పేపర్లకు తగ్గించడంతో విద్యార్థులు చదువుకునేందుకు ఎక్కువ సమయం దొరుకుతుంది. ఎక్కువ రోజులు పరీక్షలు జరగకుండా నూతన పరీక్ష విధానం వల్ల పరీక్షలు కేవలం 6 రోజుల్లోనే ముగిసిపోతాయి. దీని వల్ల విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పరీక్షల సమయంలో ప్రశాంతంగా రాసి ఎక్కువ మార్కులు తెచ్చుకునేందుకు ఉపయోగపడుతుంది. పోటీ పరీక్షలకు కూడా విద్యార్థులు టెన్షన్‌ను పక్కన బెట్టి రాసేందుకు సిద్ధమవుతారు. – పి. రమేష్, డీఈఓ ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 6 పేపర్లు నిర్వహించాలని నిర్ణయించడంతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ పరీక్షల్లో తక్కువ పేపర్లు నిర్వహించడం వల్ల చదువుకునేందుకు సమయం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దీంతో పాటు టెన్షన్ కూడా తగ్గుతుందంటున్నారు. నూతన జిల్లాల్లోనే పది పబ్లిక్ పరీక్షలు నిర్వహించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షలను కూడా పకడ్బందీగా నిర్వహించేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించారు. -
టెన్త్ సప్లిమెంటరీ 2,07,160, బెటర్మెంట్ పరీక్షలకు 8,609 మంది విద్యార్థులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, బెటర్మెంట్ పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈనెల 15వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. 986 కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8.30 నుంచి 9.30 గంటలలోపు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకుని రిపోర్టు చేయాల్సి ఉంటుంది. తొలిసారిగా ఈసారి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీతోపాటు బెటర్మెంట్ పరీక్షను కూడా బోర్డు నిర్వహిస్తోంది. ఎస్సెస్సీ రెగ్యులర్ పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు భావిస్తుండటంతో మార్కులు పెంచుకునేందుకు ఈ బెటర్మెంట్ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 2,07,160 మంది, బెటర్మెంట్ పరీక్షలకు 8,609 మంది హాజరుకానున్నారు. ఇంతకుముందు పరీక్షల నిర్వహణలో తలెత్తిన సమస్యలు, ఇతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎస్సెస్సీ బోర్డు అనేక జాగ్రత్తలు చేపట్టింది. అన్ని కేంద్రాలను నోఫోన్ జోన్లుగా ప్రకటించింది. చీఫ్ సూపరింటెండెంట్లతో సహా ఏ ఒక్కరూ పరీక్ష కేంద్రాల్లోకి ఫోన్లు తీసుకెళ్లడానికి వీల్లేదు. డిజిటల్ డివైజ్‌లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. పోలీసులతో కూడిన మొబైల్ స్క్వాడ్లను ఏర్పాటుచేసింది. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఉంటుంది. -
తొలిరోజు కోదాడలో గడబిడ
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం మొదలయ్యాయి. తొలిరోజున అన్నిచోట్లా ప్రశాంతంగా పరీక్షలు జరిగాయని టెన్త్ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ప్రకటించారు. ఎస్సెస్సీ పరీక్షలకు మొత్తం 5,08,143 మంది దరఖాస్తు చేసుకోగా.. సోమవారం జరిగిన మొదటి భాష పరీక్షను 5,03,041 (99 శాతం) మంది రాశారని, 5,102 మంది గైర్హాజరయ్యారని ఎస్సెస్సీ బోర్డ్ తెలిపింది. ఎక్కడా ఎలాంటి మాల్ ప్రాక్టీసింగ్ కేసులు నమోదు కాలేదని ప్రకటించింది. పూర్తి నిఘా నీడలో పరీక్ష జరిగిందని, విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు లోనుకాకుండా పరీక్షలు రాశారని పేర్కొంది. అంతటా కోవిడ్ నిబంధనలు అమలు చేశామని తెలిపింది. వేసవి తీవ్రత తగ్గడంతో ఎక్కడా అసౌకర్యం కలగలేదని, అన్ని కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని వెల్లడించింది. జనరల్ తెలుగుకు బదులు... కాంపోజిట్ తెలుగు సూర్యాపేట జిల్లా కోదాడలో మాత్రం పరీక్షల్లో గందరగోళం నెలకొంది. కొన్ని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు జనరల్ తెలుగు (1టి, 2టి)కు బదులు కాంపోజిట్ తెలుగు (3టి, 4ఎస్) ప్రశ్నపత్రాలు ఇచ్చారు. ఇది చూసి కంగుతిన్న విద్యార్థులు.. పరీక్షా కేంద్రం నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లారు. తాము చదివినది తెలుగు భాష సబ్జెక్టు అని.. వేరే పేపర్లు వచ్చాయని చెప్పారు. దీనితో అధికారులు సదరు విద్యార్థుల నుంచి డిక్లరేషన్ తీసుకుని వారికి జనరల్ తెలుగు ప్రశ్నపత్రాలను ఇచ్చారు. ప్రైవేటు స్కూళ్ల నిర్వాకంతో.. కోదాడలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పరిమితికి మించి విద్యార్థులు ఉండటంతో వారిని పట్టణంలోని మరో కార్పొరేట్ స్కూల్ తరఫున పరీక్ష రాయించినట్టు తెలిసింది. సదరు ప్రైవేటు పాఠశాల విద్యార్థులు జనరల్ తెలుగు సబ్జెక్టు చదవగా.. కార్పొరేట్ స్కూల్ విద్యార్థులు కాంపోజిట్ తెలుగు సబ్జెక్టు చదివారు. పరీక్ష ఫీజు కట్టే సమయంలో కార్పొరేట్ స్కూల్ అందరు విద్యార్థుల సబ్జెక్టును కాంపోజిట్ తెలుగుగా నమోదు చేసిందని.. దీనిప్రకారమే విద్యార్థులకు కాంపోజిట్ తెలుగు పేపర్లను ఇచ్చారని తెలిసింది. పరీక్ష కేంద్రంలో పాము కలకలం ఖమ్మం జిల్లా ముత్తగూడెం పరీక్షా కేంద్రంలోని 7వ నంబర్ గదిలో పాము కలకలం రేపింది. ఆ గదిలో 24 మంది విద్యార్థులు పరీక్ష రాస్తుండగా పాము వచ్చి దూరింది. విద్యార్థులు భయంతో బయటికి పరుగెత్తేందుకు ప్రయత్నించగా.. ఇన్విజిలేటర్ వారికి సర్దిచెప్పి బెంచీలపై నిల్చోబెట్టారు. ఓ విద్యార్థి ధైర్యం చేసి కర్రతో పామును చంపడంతో అంతా ప్రశాంతంగా పరీక్ష రాశారు. పుట్టెడు దుఃఖంలోనూ నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చింతకుంట్లకు చెందిన ఇడికోజు లలిత కొండమల్లేపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. లలిత తండ్రి పురుషోత్తమాచారి అనారోగ్యానికి గురై చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతిచెందాడు. లలిత పుట్టెడు దుఃఖంలోనూ బంధువులు, స్నేహితుల సాయంతో పరీక్షకు హాజరైంది. -
విద్యార్థులకు నిజంగా ‘పరీక్షే’..!
సాక్షి, హైదరాబాద్: మండు వేసవిలో గొంతు తడుపుకొనే అవకాశం లేదు. ముక్కు మూసుకుంటే తప్ప మరుగుదొడ్లకు వెళ్లలేని పరిస్థితి. ఎప్పుడు ఊడిపడుతుందోనన్నట్టుగా ఉన్న భవనాల పైకప్పులు. కరెంటు సౌకర్యం ఉన్నా ఫ్యాన్లు లేవు. ఉన్నా పనిచేయడం లేదు. ఇదీ ఈ నెల 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు జరగనున్న అనేక కేంద్రాల దుస్థితి. ముఖ్యంగా మారుమూల పల్లెల్లో, ఓ మాదిరి పట్టణ కేంద్రాల్లో ఈ తరహా దయనీయ పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 5,09,275 మంది టెన్త్ విద్యార్థులు 2,861 కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సి ఉంది. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులు కాస్త మెరుగ్గానే ఉన్నాయి. ప్రైవేటు స్కూల్స్ పరీక్షా కేంద్రాలు కావడంతో సౌకర్యాలు బాగానే ఉన్నాయి. కానీ జిల్లాల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,500 పరీక్ష కేంద్రాల్లో ఏదో ఒక సమస్య కన్పిస్తోందని క్షేత్రస్థాయి అధికారులు ఇటీవల విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. నివేదికలు కూడా పంపారు. వీటి ప్రకారం.. దాదాపు 500 పాఠశాలల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు వాడుకలోనే లేవని తెలిసింది. 400 పాఠశాలల్లో శుద్ధమైన తాగునీటి సౌకర్యం లేకపోవడాన్ని గుర్తించారు. 145 పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం అంతంత మాత్రంగానే ఉంది. ఎక్కడ..ఎలా? ♦కరీంనగర్ పట్టణం సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆర్వోఆర్ ప్లాంట్ కొన్ని నెలలుగా వాడుకలో లేదు. దీన్ని మరమ్మతు చేయించకపోవడంతో మంచినీళ్లు అందే అవకాశం కన్పించడం లేదు. ఇదే స్కూల్లో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకుని అధ్వానంగా ఉన్నాయి. ♦ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని 5 పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు పనిచేయడం లేదు. నల్లబెల్లి మండలంలో మంచినీటి కొరత ఉంది. శౌచాలయాలు ఉపయోగంలో లేవు. ఖానాపురం పాఠశాల పరీక్ష కేంద్రంలో పైకప్పు పెచ్చులూడి మీద పడే పరిస్థితి ఉంది. ఈ పరీక్ష కేంద్రాన్ని చూసి ఉపాధ్యాయులే భయపడుతున్నారు. సంగెం మండల కేంద్రంలోని పాఠశాలలో ఎనిమిది గదులుంటే నాలుగింటికి విద్యుత్ సరఫరా లేదు. ఈదుల పూసపల్లి ఒకటో వార్డులో ప్రభుత్వ పాఠశాలకు మంచినీటి వసతి అంతంత మాత్రంగానే ఉంది. మరుగుదొడ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. గతంలో కూడా ఇక్కడ విద్యార్థులు ఇబ్బంది పడినా, మరోసారి కేంద్రంగా ఎంపిక చేయడం గమనార్హం. ఈ స్కూల్‌కు చెందిన పాత భవనంలో నాలుగు గదులు శిథిలావస్థలో ఉన్నాయి. ♦ఉమ్మడి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఉన్నత పాఠశాలలో 13 తరగతి గదులుంటే 8 గదులకే విద్యుత్ సౌకర్యం ఉంది. సూర్యాపేటలోని నంబర్ 2 జెడ్పీ ఉన్నత పాఠశాల కేంద్రంలో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. దేవరకొండ జిల్లా పరి«షత్ బాలికల ఉన్నత పాఠశాలలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ♦ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పరీక్ష కేంద్రం దారుణంగా ఉంది. ఫ్లోరింగ్ పగిలిపోయి అస్తవ్యస్తంగా తయారైంది. ఫ్యాన్ల రెక్కలు వంకర తిరిగి ఉన్నాయి. బెంచీలు విరిగిపోయి ఉన్నాయి. సమస్యలుంటే డీఈవో దృష్టికి తెండి సమస్యలు లేని స్కూళ్లనే పరీక్ష కేంద్రాలుగా ఎంపిక చేయమని క్షేత్రస్థాయి సిబ్బందికి మొదట్లోనే ఆదేశాలిచ్చాం. అయినా అక్కడక్కడ ఏమైనా సమస్యలుంటే డీఈవోల దృష్టికి తీసుకెళ్లాలి. సాధ్యమైనంత వరకు వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు నిర్వహించాలన్నదే మా లక్ష్యం. – కృష్ణారావు (పరీక్షల విభాగం అదనపు డైరెక్టర్) -
నారాయణ లేకుండా ష్యూరిటీలా?
-
TS: పదో తరగతి పరీక్షలపై మంత్రి సబిత సమీక్ష
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల కోసం ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణపై విద్యాశాఖ అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. ‘‘పదో తరగతి పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతీ పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమరాలను ఏర్పాటు చేయాలి. పొరపాట్లకు తావు లేకుండా పకడ్బంధీగా పరీక్షలను నిర్వహించాలి. మే 23వ తేదీ నుంచి జూన్ 1 వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షలకు 5,09,275 మంది విద్యార్థులు హాజరు. పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వర్తించే సిబ్బందిని కూడా మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలతో కేంద్రాల్లోకి అనుమతించకూడదు. పరీక్షల నిర్వహణ సందర్భంగా ఎలాంటి సమస్య ఉత్పన్నమైనా.. వెంటనే పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర డైరెక్టర్ కార్యాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలి. పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే ఫిర్యాదు చేసేందుకు వీలుగా ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద డీఈఓ, ఏంఈవో ఫోన్ నెంబర్లను డిస్ప్లే చేయాలి. ఇప్పటికే విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను ఆయా పాఠశాలలకు చేర్చడం జరిగింది. ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులను కలిసి హాల్ టిక్కెట్లను పొందాలని విద్యార్థులకు సూచిస్తున్నాం. పరీక్షలు జరుగుతున్న సమయంలో కరెంట్ సప్లైకు అంతరాయం కలగకూడదు. విద్యార్థులు పరీక్షా కేంద్రాల వద్దకు సకాలంలో చేరుకునేందుకు అవసరమైన రీతిలో ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లు చర్యలు చేపట్టాలి. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతీ పరీక్షా కేంద్రంలో ఒక ఏఎన్ఎం, ఒక ఆశా వర్కర్.. ఓఆర్ఎస్ పాకెట్లు, అవసరమైన మందులతో సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకున్నాం. పరీక్షల నిర్వహణకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించేందుకు వీలుగా జిల్లాల వారీగా పరిశీలకులను నియమించడం జరుగుతుంది. ప్రతీ పరీక్షా కేంద్రంలో తాగునీరు, ఫర్నీచర్, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్ సౌకర్యం ఉండేలా ముందస్తుగానే తనిఖీలను నిర్వహించాలి. ఎక్కడైనా లోపాలు ఉన్నట్లయితే పరీక్షలను నిర్వహించే నాటికి వాటిని పరిష్కరించాలి. పదో తరగతి పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదని, విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలకు హాజరు కావాలి’’ అని సూచించారు. ఇది కూడా చదవండి: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. తెలంగాణకు భారీ వర్ష సూచన -
‘నారాయణ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకే పేపర్ లీక్’
సాక్షి, చిత్తూరు: నారాయణ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకే పేపర్ లీక్ చేశారని చిత్తూరు ఎస్పీ రిశాంత్ రెడ్డి తెలిపారు. టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల అధిపతి నారాయణను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చిత్తూరు ఎస్పీ మంగళవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఉద్దేశపూర్వకంగానే పేపర్‌ను లీక్ చేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ.. ‘టెన్త్ పేపర్ లీక్ కేసులో నారాయణను అరెస్ట్ చేశాం.ఉదయం హైదరాబాద్‌లో నారాయణను అరెస్ట్ చేశాం. గత నెల 27న టెన్త్ పేపర్ మాల్ ప్రాక్టీస్ జరిగింది. చిత్తూరు పీఎస్‌లో నమోదైన కేసులో నారాయణను అరెస్ట్ చేశాం. నిందితుల చైన్ లింక్‌లో చైర్మన్ నారాయణ వరకు ఆధారాలు లభించాయి. నారాయణ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచేందుకే పేపర్ లీక్. ఇన్విజిలేటర్ల వివరాలు ముందుగానే తీసుకుని మాల్ ప్రాక్టీస్. వీరి దగ్గర చదివే విద్యార్థులను రెండు విభాగాలుగా విభజిస్తారు. ముందే ఏ విద్యార్థులు ఎక్కడ పరీక్ష రాస్తారో తెలుసుకుంటారు. హెడ్ ఆఫీస్ నుంచి వెంటనే కీ తయారు చేసి విద్యార్థులకు పంపుతారు. నారాయణతో పాటు తిరుపతి డీన్ బాల గంగాధర్‌ను అరెస్ట్ చేశాం. నిందితుల వాంగ్మూలం, టెక్నికల్ ఆధారాలతోనే నారాయణను అరెస్ట్ చేశాం. అరెస్ట్ అయిన వారంతా 2008 నుంచి నారాయణ విద్యాసంస్థల్లో పని చేసిన వారే. గత నెల 27న వాట్సాప్‌లో లీకయినట్లు ఫిర్యాదు వచ్చింది. గతంలో కూడా ఈ తరహా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. నారాయణను కోర్టులో హాజరుపరుస్తాం’ అని ఎస్పీ రిశాంత్ తెలిపారు. చదవండి👉పారిపోయే యత్నం చేసిన మాజీ మంత్రి నారాయణ! -
పారిపోయే యత్నం చేసిన మాజీ మంత్రి నారాయణ!
సాక్షి, అమరావతి: ఏపీలో టెన్త్ ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో నారాయణను ఈరోజు(మంగళవారం) ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా, మాజీ మంత్రి, నారాయణ సంస్థల అధిపతి నారాయణ అరెస్టు విషయంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అరెస్ట్‌ను ముందే ఊహించిన నారాయణ పారిపోయే యత్నం చేశారు. గత ఐదు రోజులుగా స్థావరాలు మార్చడమే కాకుండా ఫోన్‌ను స్విచ్ఛాఫ్ చేశారు. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల నారాయణ రోజుకో నివాసం మార్చారు. మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, కూకట్‌పల్లిలో ఉంటూ తప్పించుకునే యత్నం చేశారు. ఈ క్రమంలోనే గత మూడు రోజులుగా ఫోన్ స్విచ్చాఫ్ చేశారు. దీనిపై సీఐడీ పోలీసులు నిఘా పెట్టారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళుతున్న సమాచారంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఐకియా సెంటర్ వద్ద నారాయణను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. చదవండి👉నారాయణ లీక్స్: బురద జల్లాలనుకున్నారు.. వాళ్లే దొరికిపోయారు-సజ్జల -
టెన్త్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియ షురూ..
భానుగుడి (కాకినాడ సిటీ): పదో తరగతి పరీక్షల మూల్యాంకనానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచి చూడాల్సి వచ్చేది. ఆ పద్ధతికి స్వస్తి పలికి, పరీక్షలు ముగిసిన వెంటనే వీలైనంత త్వరగా ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగా పరీక్షలు జరుగుతుండగానే మూల్యాంకనం ఏర్పాట్లు షురూ చేసింది. మూల్యాంకన ప్రక్రియ పలు దశల్లో జరగనుంది. తొలుత పరీక్ష కేంద్రాల నుంచి ప్రశ్నపత్రాలను మూల్యాంకనం జరిగే కేంద్రానికి 20 చొప్పున కట్టగా కట్టి తెస్తారు. వీటిని స్ట్రాంగ్ రూములో పాఠశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకుడి (ఆర్జేడీ) పర్యవేక్షణలో భద్రపరుస్తారు. స్ట్రాంగ్‌రూము జిల్లా కామన్ ఎగ్జామినేషన్ బోర్డ్ (డీసీఈబీ) కార్యదర్శి, పరీక్షల విభాగం సహాయ సంచాలకుల పర్యవేక్షణలో ఉంటుంది. స్ట్రాంగ్ రూము నుంచి మూల్యాంకన పత్రాలను చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లకు వాల్యుయేషన్ నిమిత్తం అందిస్తారు. అసిస్టెంట్ ఎగ్జామినర్ రోజుకు 40 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలి. ఒక్కో జవాబు పత్రానికి టీఏ, డీఏలు కాకుండా రూ.6 చొప్పున చెల్లిస్తారు. మూల్యాంకనంలో చీఫ్ ఎగ్జామినర్లదే కీలక పాత్ర. అసిస్టెంట్ ఎగ్జామినర్లు, చీఫ్ ఎగ్జామినర్లు, స్పెషల్ అసిస్టెంట్లు, ప్రత్యేక సిబ్బందిగా ప్రభుత్వ ఉపాధ్యాయులను మాత్రమే విధుల్లోకి తీసుకుంటారు. నేటి నుంచి కోడింగ్.. 12 నుంచి మూల్యాంకనం మూల్యాంకన ప్రక్రియలో భాగంగా ఆదివారం నుంచి కోడింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు. జవాబు పత్రాలపై విద్యార్థుల వివరాలను తొలగించే విధానాన్ని కోడింగ్ అంటారు. కోడింగ్ అనంతరం మూల్యాంకనానికి 950 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లను, 160 మంది చీఫ్ ఎగ్జామినర్లను, మార్కులు, ఇతర వివరాలు నమోదు చేసేందుకు 320 మంది స్పెషల్ అసిస్టెంట్లను నియమించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ పీఆర్జీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో మూల్యాంకన ప్రక్రియకు ఏర్పాట్లు చేశారు. ఈ పాఠశాలలోని 36 తరగతి గదులను మూల్యాంకనానికి వినియోగించనున్నారు. మే 12 వరకూ కోడింగ్ ప్రక్రియ, అనంతరం 22వ తేదీ వరకూ మూల్యాంకనం జరగనున్నాయి. 4 లక్షల పరీక్ష పత్రాల మూల్యాంకనం రాష్ట్రంలోనే అతి పెద్ద జిల్లా కావడంతో 4 లక్షల ప్రశ్నపత్రాలను మూల్యాంకనం చేయనున్నాం. ఈ ప్రక్రియకు ఆదివారం నుంచి శ్రీకారం చుడుతున్నాం. అన్ని గదుల్లోనూ పక్కా ఏర్పాట్లు చేశాం. ఫ్యాన్లు, లైట్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాం. – డి.మధుసూదనరావు, ఆర్జేడీ, కాకినాడ ఏర్పాట్లు పూర్తి మూల్యాంకానికి విధుల్లోకి తీసుకునే ఉపాధ్యాయులకు ఇప్పటికే వాట్సాప్, మెయిల్ ద్వారా ఉత్తర్వులు జారీ చేస్తున్నాం. వేసవి కారణంగా సిబ్బందికి అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలూ తీసుకున్నాం. – దాట్ల సుభద్ర, జిల్లా విద్యాశాఖాధికారి, కాకినాడ -
వదంతులు.. తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: కలెక్టర్ హరి నారాయణ
సాక్షి, చిత్తూరు: చిత్తూరులో టెన్త్ క్లాస్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని జిల్లా కలెక్టర్ హరి నారాయణ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పరీక్షలు ప్రారంభమైన రెండు గంటల తర్వాత పేపర్ లీక్ అయినట్లు సోషల్ మీడియాలో వచ్చిందని తెలిపారు. కొందరు వ్యక్తులు డీఈఓకు వాట్సప్ ద్వారా పేపర్ లీక్ అయినట్లు మెసేజ్ పెట్టారని అన్నారు. విద్యార్థులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. వాట్సాప్ ద్వారా వచ్చిన సమాచారంపై డీఈఓ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారని అన్నారు. తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని తెలిపారు. ఈ వార్త కూడా చదవండి: AP SSC Exams 2022: ఏపీలో పదో తరగతి పరీక్షలు -
AP: టెన్త్ పరీక్షలకు 6.22 లక్షల మంది విద్యార్థులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రేపటి(బుధవారం) నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. డైలీ ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు ఏడు పేపర్లకే పరిమితమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ పరీక్షలకు 6.22 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాలను 2 వేల నుంచి 3800లకు పెంచినట్లు అధికారులు తెలిపారు. పరీక్షలపై టెన్షన్ వద్దు లబ్బీపేట (విజయవాడ తూర్పు): కరోనా కారణంగా రెండేళ్లుగా పదో తరగతి పరీక్షలు నిర్వహించలేదు. ఈ ఏడాది కరోనా ప్రభావం లేకపోవడంతో ఈ నెల 27వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు ఇంటర్మీడియెట్ పరీక్షల సైతం మే ఆరో తేదీ నుంచి ప్రారంభమవుతాయి. పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ విద్యార్థుల్లో ఆందోళన నెలకొనడం సహజం. దానిని అధిగమించి, భయాందోళనలను విడనాడి, సానుకూల దృక్పథంతో పరీక్షలు రాస్తే విజయం తథ్యమని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షల వేళ విద్యార్థుల్లో మనోస్థైర్యం నింపాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని పేర్కొంటున్నారు. చదువుకోవడంతోపాటు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని తీసుకుంటే పరీక్షల గండాన్ని దిగ్వి జయంగా అధిగమించొచ్చని వివరిస్తున్నారు. ఆరోగ్యం, ఆహారంపై శ్రద్ధ ► ప్రస్తుతం విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. ► పరీక్ష రాసేందుకు వెళ్తూ హడావుడిగా బ్రేక్‌ఫాస్ట్ చేస్తుంటారు. అయితే ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని తీసుకోవడం ముఖ్యం. ► పరీక్ష నుంచి రాగానే కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలను తాగాలి. ► రాత్రి వేళల్లో గోరువెచ్చటి పాలు తీసుకుంటే మంచిది. ► పరీక్షల సమయంలో విద్యార్థులు ఎక్కువగా వత్తిడికి గురవుతారు. సరిగా నిద్రపోక నీరసించిపోతారు. ► ఈ సమయంలో ద్రవాహారం ఎక్కువగా తీసుకోవాలి. ► డ్రైఫ్రూట్స్‌లో కావాల్సిన పోషకాలు అన్నీ లభిస్తాయి. బాధం, వాల్నట్స్, ఎండుద్రాక్ష, అంజూరి వంటి డ్రై ఫ్రూట్స్‌ను దగ్గర ఉంచుకుని, చదువుకునేటప్పుడు మధ్య మధ్యలో తినాలి. తల్లిదండ్రుల బాధ్యతలు ఇవీ.. ► ఇంట్లో ప్రశాంతంగా చదువుకునే వాతవరణం కల్పించి, సరైన సమయంలో ఆహారం తీసుకునేలా చూడాలి. ► పరీక్షలు బాగా రాయగలవంటూ పిల్లలను సానుకూల దృప్పథంతో ప్రోత్సహించాలి. ► పరీక్షల సమయంలో టీవీ పెట్టవద్దంటూ నిషేధం విధించడం సరికాదు. రోజుకు పది నిమిషాలపాటు టీవీ చూడటం ద్వారా ఉపశమనం పొందుతారు. ► పరీక్షల సమయమైనా రోజుకు కనీసం ఆరు గంటలు నిద్ర ఉండేలా చూడటం ముఖ్యం. ► పరీక్షలకు అవసరమైన హాల్‌టికెట్, పెన్ను, ప్యాడ్ ఇలా అవసరమైన వస్తువులను ఒకే చోట అందుబాటులో ఉంచాలి. ► కనీసం 20 నిమిషాలు ముందగానే పరీక్ష కేంద్రానికి పిల్లలను పంపించాలి. ఆలస్యమైతే ఆందోళనతో పిల్లలు సరిగా పరీక్ష రాయలేరు. ఏర్పాట్లు పూర్తి పదో తరగతి పరీక్షలకు సంబం«ధించి ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థులు ఏడు పేపర్లు రాయాలి. అందుకు అనుకుణంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చాం. ఇప్పటికే మోడల్ పరీక్షలు, ప్రీఫైనల్ నిర్వహించాం. విద్యార్థులు ఆందోళనకు గురికాకుండా ఆత్మస్థైర్యంతో పరీక్షలు రాయాలి. పరీక్ష హాళ్లలో అన్ని వసతులూ కల్పించాం. విద్యార్థులు మంచినీరు తాగేటప్పుడు గది బయటకు వచ్చి తాగితే మంచిది. పేపర్‌పై నీరు పడకుండా ఉంటుంది. విద్యార్థులకు టైమ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. – సి.వి.రేణుక, జిల్లా విద్యాశాఖాధికారి, ఎన్టీఆర్ జిల్లా ఆందోళనకు గురికాకూడదు పరీక్షల వేళ వత్తిడికి గురికాకూడదు. రోజులో ఆరు గంటల నిద్ర అవసరం. పరీక్ష హాలుకు 20 నిమిషాలు ముందుగా చేరుకోవాలి. ప్రశ్న పత్ర ఇచ్చాక దానిని మొత్తం చదివి బాగా తెలిసిన సమాధానాలను ముందుగా రాయాలి. ఏ ప్రశ్ననూ వదలకుండా అన్నింటికీ సమాధానాలు రాయడం మంచిది. పరీక్ష రాసి ఇంటికి వెళ్లాక గంటసేపు విశ్రాంతి తీసుకోవాలి. అనంతరం మురుసటి రోజు పరీక్ష సిలబస్‌ను రివిజన్ మాత్రమే చేయాలి. కొత్త అంశాల జోలికి వెళ్లకూడదు. ఆత్మస్థైర్యంతో పరీక్ష రాస్తే విజయం తథ్యం. – డాక్టర్ గర్రే శంకరరావు, మానసిక నిపుణుడు -
ఇంటర్నల్ మార్కులు.. అంతర్గత తనిఖీలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెలలో పదో తరగతి పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల మార్కులపై తనిఖీలకు విద్యాశాఖ రంగంలోకి దిగింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల అంతర్గత మార్కుల నమోదుపై ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్‌లోని ప్రతి మండల పరిధిలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడి నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ బృందాలు టెన్త్ ఇంటర్నల్ మార్కుల నమోదు తీరును పరిశీలించి ఉన్నత కమిటీకి నివేదిక సమర్పించనున్నాయి. ఆ తర్వాతే ఇంటర్నల్ మార్కులను ఎస్సెస్సీ బోర్డు వెబ్సైట్లో నమోదుకు వెసులుబాటు ఉంటుంది. ఇప్పటికే పాఠశాలల్లో విద్యార్థులకు ఫార్మేటివ్ టెస్టులు నిర్వహించడంతో పాటు ప్రాజెక్టులు, రికార్డులను పరిశీలించి ఆయా సబ్జెకుల ఉపాధ్యాయులు మార్కులు నమోదు చేసిన విషయం విదితమే. మూడు రోజుల పాటు.. మహానగర పరిధిలో పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్, ప్రాజెక్టుల మార్కుల నమోదు పరిశీలన మూడురోజుల పాటు జరగనుంది. డీఈఓల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు మండలాల వారీగా రంగంలో దిగి క్షేత్రస్థాయి పరిశీలనకు శ్రీకారం చుట్టాయి. కరోనా ప్రభావంతో అన్ని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ఇప్పటి వరకు రెండు ఎఫ్ఏ టెస్టులు మాత్రమే నిర్వహించారు. వీటితో పాటు ప్రాజెక్టులు, ఇతర రికార్డులను సైతం ప్రత్యేక బృందాలు పర్యవేక్షించనున్నాయి. ప్రతి ఎఫ్ఏ టెస్టుకు 5 మార్కుల చొప్పున నాలుగు టెస్టులకు 20 మార్కులు కేటాయించాల్సి ఉంటుంది. ప్రాజెక్టులకు ప్రత్యేక మార్కులు ఉంటాయి. రెండు ఎఫ్ఏ టెస్టులు మాత్రమే నిర్వహించిన కారణంగా మొత్తం మార్కులను పరిగణనలోకి తీసుకోనున్నారు. ఆ తర్వాత జిల్లా పరీక్షల విభాగం ఆమోదంతో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మార్కులను ఎస్సెస్సీ బోర్డుకు అందజేయాల్సి ఉంటుంది. ప్రైవేటు దూమారం ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులకు అశాస్త్రీయంగా అంతర్గత మార్కులు వేశాయనే ఆరోపణల దుమారం రేగింది. స్కూల్ పరిధిలో నిర్వహించిన ఫార్మేటివ్ టెస్ట్‌లో విద్యార్థికి అతితక్కువ మార్కులు వచ్చినా, ప్రాజెక్టు వర్కే చేయకపోయినా గరిష్ట మార్కులు వేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిని తప్పుబట్టిన విద్యాశాఖ వాస్తవ పరిస్థితి కోసం ప్రైవేటుతోపాటు ప్రభుత్వ స్కూళ్లలోనూ సైతం క్షేత్రస్థాయి విచారణ బృందాలను రంగంలోకి దింపింది. (క్లిక్: బస్తీ బడి.. దాతల ఒడి) అంతర్గత మార్కులు ఇలా.. ఎస్సెస్సీ వార్షిక పరీక్షల్లో ప్రతి పేపర్ 80 మార్కులకు ఉంటుంది. మరో 20 మార్కులను తరగతి గదిలో ఆయా సబ్జెక్టుల వారీగా కనబరిచే ప్రతిభ ఆధారంగా ఇంటర్నల్‌గా కేటాయిస్తారు. సరిగా నాలుగేళ్ల క్రితం కంటిన్యూస్ అండ్ కాంప్రెహెన్సివ్ ఇవాల్యుయేషన్ (సీసీఈ) విధానంలో భాగంగా పదో తరగతి విద్యార్థులకు ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో ఆయా స్కూళ్లు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) పేరిట ప్రతి విద్యార్థి చేసే ప్రాజెక్టు వర్క్, స్కూల్లో నిర్వహించే స్లిప్ టెస్ట్ ప్రకారం మార్కులు కేటాయిస్తూ వస్తున్నాయి. ఇలా కేటాయిస్తున్న మార్కులను ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు ఆన్లైన్ ద్వారా టెన్త్ పరీక్షల విభాగానికి డీఈవోల ద్వారా పంపాల్సి ఉంటుంది. కాగా.. ఇవేవీ నిర్వహించకుండానే ప్రైవేటు స్కూళ్లు ఇష్టానుసారం గరిష్టంగా మార్కులు వేసినట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. (క్లిక్: సెల్ ఫోన్ డ్రైవింగ్ వీకెండ్లోనే ఎక్కువ.. ఎందుకంటే!) -
విషాదం.. పరీక్ష హాల్లో కుప్పకూలిన అనుశ్రీ
మైసూరు: కర్నాటకలో ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) వార్షిక పరీక్షలు మొదలైన తొలిరోజే విషాదం చోటుచేసుకుంది. పరీక్ష రాస్తున్న విద్యార్థిని గుండెపోటు రావడంతో మృతి చెందిన సంఘటన మైసూరు జిల్లాలోని టి.నరిసిపుర పట్టణంలో ఉన్న విద్యోదయ పరీక్షా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. అదే తాలూకాలోని అక్కూరు గ్రామానికి చెందిన అనుశ్రీ (16) అనే 10వ తరగతి విద్యార్థిని పరీక్షకు హాజరైంది. పరీక్ష రాస్తూ 15 నిమిషాల తరువాత ఆమె అలాగే ఒరిగిపోయింది. అక్కడి సిబ్బంది టి.నరిసిపుర ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అనుశ్రీ గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, రెండు సంవత్సరాలుగా కోవిడ్ వేవ్‌ల వల్ల నామమాత్రంగా జరిగిన ఎస్ఎస్ఎల్సీ (టెన్త్) వార్షిక పరీక్షలకు ఈసారి అడ్డంకి తొలగిపోయింది. రాష్ట్రమంతటా సోమవారం నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కాగా విద్యార్థులు ఉత్సాహంగా తరలివచ్చారు. కోవిడ్ నిబంధనల ప్రకారం ఎక్కువ భాగం పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేసి శానిటైజర్ ఇచ్చారు. రాష్ట్రంలో 8.73 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు నమోదు చేయించుకొన్నారు. కొన్నిచోట్ల 50 సంవత్సరాల పైబడిన పెద్దలు కూడా పరీక్ష రాశారు. ప్రాథమికోన్నత విద్యాశాఖ మంత్రి బీ.సీ.నాగేశ్, బెంగళూరులో అగ్రహారం, దాసరహళ్ళిలో పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు గులాబి పుష్పాన్ని అందజేసి ధైర్యంగా పరీక్ష రాయాలని సూచించారు. హిజాబ్ వద్దని బుజ్జగింపు.. - విద్యార్థులు యూనిఫాంతో పరీక్షకు హాజరైన దృశ్యాలు అన్నిచోట్ల కనిపించాయి. అయితే హుబ్లీ, శివమొగ్గ, కోలారుతో పాటు పలుచోట్ల హిజాబ్ ధరించి వచ్చిన ముస్లిం విద్యార్థినులకు ఉపాధ్యాయులు నచ్చజెప్పారు. దీంతో హిజాబ్‌ను పక్కనపెట్టి పరీక్షలకు హాజరయ్యారు. - బీదర్ ఓల్డ్ సిటీ కాలేజీ వద్ద కొందరు అల్లరిమూకలు గొడవకు యత్నించగా పోలీసులు వారిని లాఠీలతో చెదరగొట్టారు. - బెళగావిలో ఓ విద్యాలయంలో హిజాబ్‌తో వచ్చిన విద్యార్థినులకు గులాబీ పువ్వులిచ్చి నచ్చజెప్పారు. కానీ హుబ్లీలో కొందరు విద్యార్థినులు పరీక్ష వద్దని వెళ్లిపోయారు. - బెంగళూరు రాజాజీనగరలో హిజాబ్ ధరించి డ్యూటీకి వచ్చిన ఉపాధ్యాయురాలిని బీఇఓ రమేశ్ వెనక్కి పంపారు. - బెళగావి జిల్లా చిక్కోడి పట్టణంలోని ఆర్.డీ.కాలేజీ పరీక్షా కేంద్రంలో ఐదుమంది అబ్బాయిలు, ఒక అమ్మాయి ఇతరులకు బదులుగా పరీక్ష రాస్తూ దొరికిపోయారు. -
టెన్త్ పరీక్షలు షురూ.. హిజాబ్‌పై విద్యాశాఖ మంత్రి సంచలన ప్రకటన
శివాజీనగర: విద్యార్థి జీవితంలో ఎంతో ముఖ్యమైన టెన్త్ పరీక్షలు రానేవచ్చాయి. రాష్ట్రమంతటా నేడు సోమవారం నుంచి ఎస్ఎస్ఎల్సీ పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. గత 2 సంవత్సరాల నుంచి కోవిడ్ బెడద వల్ల పరీక్షలు జరపకుండానే అందరినీ ఉత్తీర్ణులను చేశారు. అయితే ఈసారి కోవిడ్ లేకపోవడంతో మామూలుగా పరీక్షలు జరుగుతున్నాయి. ఉదయం 10:30 నుంచి ఆరంభం - రాష్ట్రంలో మొత్తం 3,444 పరీక్షా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. - పరీక్ష ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.45 గంటల వరకు జరుగుతుంది. - 5,387 పాఠశాలల నుంచి మొత్తం 8,73,846 మంది విద్యార్థులు రాయబోతున్నారు. ఇందులో 4,52,732 బాలురు, 4,21,110 బాలికలు, శారీరక, మానసిక దివ్యాంగ విద్యార్థులు 5,307 మంది ఉన్నారు. - అక్రమాల నివారణకు విస్తృతంగా స్క్వాడ్లను నియమించారు. అన్ని పరీక్షా కేంద్రాల్లోనూ సీసీ టీవీ కెమెరాలను అమర్చారు. పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల 144 సెక్షన్ క్రింద నిషేధాజ్ఞలను విధించారు. - విద్యార్థులు హాల్‌టికెట్‌ను చూపించి కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. - సమాధాన పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ఏప్రిల్ 21 నుంచి జరుగుతుంది. హిజాబ్‌కు అనుమతి లేదు: విద్యామంత్రి కోర్టు ఆదేశాన్ని పాటించి విద్యార్థులు హిజాబ్‌తో కాకుండా యూనిఫాం ధరించి పరీక్ష రాయాలి. హిజాబ్ కోసం పరీక్షను కాదనుకుంటే మళ్లీ పరీక్ష కూడా ఉండదని విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్ ఆదివారం తెలిపారు. హిజాబ్ ధరించి వచ్చే వారిపై పోలీసులు చర్యలు తీసుకొంటారన్నారు. -
విద్యార్థులకు గమనిక.. ఏపీలో టెన్త్ పరీక్షల కొత్త షెడ్యూల్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త షెడ్యూల్‌ను పాఠశాల విద్య డైరెక్టరేట్ కార్యాలయం శుక్రవారం విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం.. టెన్త్ పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి మే 9వ తేదీ వరకు జరుగునున్నాయి. కాగా, ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్ష ఉంటుందని ఎస్సెస్సీ పరీక్షల విభాగం తెలిపింది. -
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా..
-
AP: టెన్త్ పరీక్షలు వారం వాయిదా!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు వారం రోజులు వాయిదా పడనున్నాయి. మే 2 నుంచి జరగాల్సిన ఈ పరీక్షలు మే 9 లేదా 13 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. ఈ మేరకు విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు కొన్ని ఒకే తేదీల్లో జరగనుండడమే దీనికి కారణం. జేఈఈ పరీక్షల షెడ్యూల్ వల్ల ఇంటర్ పరీక్షలు వాయిదా వేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇంటర్ పరీక్షలు ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 8 నుంచి 28 వరకు జరగాలి. కానీ జేఈఈ పరీక్షలను ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరిగేలా ఎన్టీఏ తేదీలను ప్రకటించడంతో ఇంటర్ పరీక్షలను వాయిదా వేశారు. ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు. టెన్త్ పబ్లిక్ పరీక్షలు మే 2 నుంచి 13వ తేదీ వరకు జరగాల్సి ఉంది. అయితే ఇంటర్, టెన్త్ పరీక్షలు కొన్నిచోట్ల ఒకే సెంటర్లో నిర్వహించాల్సి ఉంది. అక్కడ టెన్త్ పరీక్ష కేంద్రాలను వేరేచోటుకు మార్చడానికి వీలుపడటం లేదు. ఇంటర్, టెన్త్ పరీక్షలు ఒకేసారి జరిగితే రెండిటి ప్రశ్నపత్రాలు, సమాధానాల బుక్లెట్లు, ఇతర పరీక్ష సామగ్రి భద్రపరిచేందుకు పోలీసు స్టేషన్లలో వసతి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు భద్రతకు, వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకానికి కూడా సమస్య వస్తుంది. ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షలను వారం రోజులు వాయిదా వేయాలని విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. మే 9నుంచి లేదా 13నుంచి పరీక్షలు నిర్వహించాలని పేర్కొంది. -
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
-
మేలో టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్షలు మే నెలలో నిర్వహించాలని ఎస్సెస్సీ బోర్డు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభించింది. త్వరలో పరీక్షల షెడ్యూల్‌ను వెల్లడించే వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఇటీవల పరీక్షల విభాగం డైరెక్టర్ ఓ సర్క్యులర్ జారీ చేశారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల సమగ్ర వివరాలతో కూడిన జాబితాలను రూపొందించి వీలైనంత త్వరగా వీటిని జిల్లా విద్యాశాఖాధికారులకు పంపాలని ఆదేశించారు. త్వరగా టెన్త్ సిలబస్ పూర్తిచేసి రివిజన్ చేపట్టాలని, పరీక్షల కోణంలో విద్యార్థులను సిద్ధం చేయాలని సూచించారు. కోవిడ్ కేసుల తగ్గుముఖంతో.. వాస్తవానికి టెన్త్ పరీక్షలు ఏప్రిల్‌లోనే జరగాల్సి ఉంది. ఇందుకోసం నవంబర్ నుంచే అధికారులు కసరత్తు చేయడం ఆనవాయితీ. అయితే కోవిడ్ మూలంగా పరీక్షలు లేకుండానే గతేడాది విద్యార్థులను పాస్ చేశారు. ఈసారి కూడా కోవిడ్ మూడోవేవ్‌ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలు ఉంటాయా? లేదా? అనే డోలాయమానంలో ఇప్పటివరకు విద్యాశాఖ ఉంది. తాజాగా కేసులు తగ్గుముఖం పట్టడంతో పరీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. ఏప్రిల్‌లో ఇంటర్ పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా పరీక్షలకు అవసరమైన బందోబస్తు సమస్య తలెత్తకుండా ఇంటర్ పరీక్షలు ముగిసిన వారం రోజుల్లో టెన్త్ పరీక్షలు నిర్వహించే వీలుందని అధికార వర్గాల సమాచారం. మే 5వ తేదీతో ఇంటర్ పరీక్షలు ముగియనున్నాయి. వారం రోజుల్లో విద్యార్థులపై స్పష్టత మరో వారం రోజుల్లో పరీక్షకు ఎంత మంది విద్యార్థులు హాజరవుతారు? ఇందులో ప్రైవేటు, ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు ఎంతమంది అనే డేటా సేకరించనున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈసారి 5.20 లక్షల మంది పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే వీలుందని భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగా పరీక్ష కేంద్రాల ఎంపిక చేసేందుకు మార్చి మొదటి వారంలో చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ప్రశ్నపత్రాల రూపకల్పన వేగవంతం టెన్త్ పరీక్షల నిర్వహణకు అవసరమైన ప్రశ్నపత్రాల రూపకల్పన ప్రక్రియకు కనీసం ఆరు నెలల సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. కానీ ఈసారి అంత సమయం లేకపోవడంతో వేగంగా వీటిని తయారు చేయాలని భావిస్తున్నారు. సీనియర్ అధ్యాపకుల చేత కొన్ని ప్రశ్నపత్రాల సెట్లను ఇప్పటికే సిద్ధం చేయించినట్టు పరీక్షల విభాగం అధికారి ఒకరు తెలిపారు. వీటిల్లో కొన్నింటిని ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నామని వెల్లడించారు. అయితే అత్యంత రహస్యంగా జరిగే ఈ ప్రక్రియకు కొంతమంది అధికారులను నియమించినట్టు తెలిసింది. కోవిడ్ మూలంగా అరకొరగా బోధన జరిగిన విషయాన్ని పరిగణనలోనికి తీసుకోవాలని, వీలైనంత వరకూ చాయిస్ ఎక్కువ ఉండేలా ప్రశ్నపత్రాలు రూపొందించాలని భావిస్తున్నట్టు తెలిసింది. -
ఏపీ, టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
-
ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ గురువారం విడుదలైంది. టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూలను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి విడుదల చేశారు. ఇంటర్మీడియట్ పరిక్షల షెడ్యూల్: మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరిక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్ బోర్డు పరిక్షలు జరుగుతాయని ఏపి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.1456 సెంటర్లలో ఈ పరిక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. మొదటి సంవత్సరం 5,05,052 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం 4,81,481 విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారని పేర్కొన్నారు. మొత్తం 9,86,533 మంది విద్యార్థులు ఈ పరిక్షలు రాయనున్నారని తెలిపారు. పదో తరగతి పరిక్షల షెడ్యూల్: టెన్త్ పరీక్షల తేదీలను మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. 2022 సంవత్సరం మే 2 నుంచి మే13 వరకు పదో తరగతి పరిక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పదోతరగతి పరిక్షలు రాయనున్నారని తెలిపారు. -
కరోనాను దృష్టిలో ఉంచుకొని పదో తరగతి పరీక్షలు: మంత్రి ఆదిమూలపు సురేష్
-
ఏపీ: షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు: మంత్రి సురేష్
సాక్షి, ప్రకాశం జిల్లా: జూన్ 7 నుంచి టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యంతో పాటు విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అన్నారు. ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ అవ్వాలని సూచించారు. రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేష్ తెలిపారు. చదవండి: వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: ఆళ్ల నాని ప్రభుత్వం నిర్ణయంపై మంత్రి అంజాద్ బాషా హర్షం -
టెన్త్, ఇంటర్ పరీక్షలపై విమర్శలు సరికాదు: సీఎం జగన్
-
కరోనా ఎఫెక్ట్: ఐసీఎస్ఈ 10వ తరగతి పరీక్షలు రద్దు
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతుండటంతో పరీక్షలు ఒక్కొక్కటిగా రద్దవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు పదో తరగతి, ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి. మరికొన్ని వాయిదా వేశాయి. తాజాగా మరో పరీక్ష రద్దయ్యింది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో ఇండియన్ సర్టిఫికెట్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ (ఐసీఎస్ఈ) పదో తరగతి పరీక్షల్ని రద్దు చేసింది. ఈ విషయాన్ని ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ 16వ తేదీన జారీ చేసిన సర్క్యూలర్‌ను ఉపసంహరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ ఆరోగ్యం ముఖ్యమని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీఎస్ఈ పేర్కొంది. అయితే ఐసీఎస్ఈ ఇంటర్ పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారం ఆఫ్‌లైన్‌లో జరగనున్నాయని పేర్కొంది. ఈ పరీక్షల తేదీలను జూన్‌లో నిర్వహించే సమీక్ష తర్వాత ప్రకటించనున్నారు. ఇదిలా ఉండగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. 12వ తరగతి పరీక్షలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. -
తెలంగాణ: టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర విద్యా శాఖ మంగళవారం విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పూర్తి విద్యా సంవత్సరం సాధ్యపడనందున కేవలం ఆరు పేపర్లకు మాత్రమే పరీక్షలు నిర్వహించనున్న టీఎస్ ఎస్ఎస్సీ బోర్డు వెల్లడించింది. మే 17 నుంచి 26 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు పేర్కొంది. పరీక్షా సమయం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు ఉంటుందని తెలిపింది. పరీక్షల షెడ్యూల్ వివరాలు.. మే 17న తెలుగు మే 18న హిందీ మే 19న ఇంగ్లీష్ మే 20న మ్యాథ్స్ మే 21న సైన్స్ మే 22న సోషల్ పరీక్షలు జరుగుతాయని ఎస్ఎస్సీ బోర్డు పేర్కొంది. -
32 మంది టెన్త్ విద్యార్థులపై కరోనా
-
32 మంది టెన్త్ విద్యార్థులపై కరోనా
సాక్షి, బెంగళూరు : సిలికాన్ సిటీ బెంగళూరును కరోనా మహమ్మారి చుట్టేస్తోంది. రాజధాని నలువైపులా కరోనా కేసులు నమోదవుతూ చక్రబంధంలోకి నెడుతోంది. తాజాగా పదో తరగతి విద్యార్థులకు కరోనా వైరస్ సోకడం తీవ్ర కలకలం రేపుతోంది. శుక్రవారం నగరంలో పరీక్షలకు హాజరైన 32 మంది విద్యార్థులకు వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మాస్కులు, భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించినప్పటికీ విద్యార్థులకు వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కొంతమంది విద్యార్థుల పరీక్షలు హాజరైయ్యేందుకు బయపడుతున్నారు. వారికి విద్యాశాఖ అధికారులు పరీక్షా కేంద్రాల్లో పర్యటిస్తూ ధైర్యం చెబుతున్నారు. (గ్రేటర్లో 3 వేల కరోనా కేసులు మిస్సింగ్!) బెంగళూరును కమ్మేసిన కరోనా మరోవైపురాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో సుమారు 70–80 శాతం మేర పాజిటివ్ కేసులు ఒక్క బెంగళూరులో నమోదవుతుండడంతో నగరవాసుల్లో భయాందోళనలు ప్రారంభం అయ్యాయి. గత జూన్ నెలలో బెంగళూరులో మొత్తం 4,198 కరోనా బారిన పడగా, అందులో 85 మంది మృత్యువాత పడ్డారు. కేవలం 312 మంది మాత్రమే కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. బెంగళూరు నగరంలో మార్చి 9న తొలి కరోనా కేసు నమోదు అయింది. అక్కడి నుంచి జూలై 1 వరకు మొత్తం 5,290 కరోనా కేసులకు చేరుకోవడం విశేషం. జూలై 1 నాటికి మొత్తం 543 మంది కోలుకోగా, 97 మంది మరణించారు. వాస్తవానికి మే 31 నాటికి కేవలం 357 మందిలో మాత్రమే కరోనా వైరస్ కనిపించింది. ఆ తర్వాత నుంచి ఒక్కసారిగా కరోనా విజృంభణ ప్రారంభమయింది. జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు బెంగళూరు పరిస్థితి సాధారణంగానే ఉంది. కానీ 16వ తేదీ నుంచి నగరంలో కేసుల సంఖ్య వేగంగా విస్తరించడం ప్రారంభమైంది. -
పది పరీక్షలు పూర్తిగా రద్దు చేయాలి: విష్ణు
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు నిర్వహించే విధానం పూర్తిగా రద్దు చేస్తే బాగుంటుందని టాలీవుడ్ హీరో మంచు విష్ణు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. ‘ఈ ఏడాదే కాకుండా పది పరీక్షలు పూర్తిగా రద్దు చేయబడాలని నేను బలంగా కోరుకుంటున్నాను. 14,15 ఏళ్ల వయసులో బోర్డు పరీక్షలు అంటూ విద్యార్థులపై ఒత్తిడి అవసరమా? ఈ పరీక్షల ఉద్దేశం ఏమిటి?’ అంటూ మంచు విష్ణు ట్విటర్లో ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక పలువురు నెటిజన్లు విష్ణు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు. గతంలో 7వ తరగతి విద్యార్థులకు కూడా బోర్డు పరీక్షలు ఉండేవని ఆ తర్వాత తీసేశారని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ‘విద్యాభ్యాసానికి మన పరీక్షల నిర్వహణ వ్యవస్థ ఒక శాపం లాంటిది’ అని జాకీర్ హుస్సేన్ కమిటీ 1939 లోనే వ్యాఖ్యానించిన విషయాన్ని మరో నెటిజన్ గుర్తుచేశాడు. ఇక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాలు పది పరీక్షలను రద్దు చేశాయి. అంతేకాకుండా సీబీఎస్ఈ పరిధిలోని 10,12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్ ఇస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. I strongly believe that board exams for 10th Grade must be abolished. Totally. Forever. Not just this year. What is the purpose of this board exam pressure for 14/15year olds????? — Vishnu Manchu (@iVishnuManchu) June 29, 2020 -
టెన్త్ పరీక్షల రద్దు సరైన నిర్ణయం: పవన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు రద్దు నిర్ణయం సరైనదని జనసేన పార్టీ పేర్కొంది. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల జీవితాలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం అభినందనీయమని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం ప్రకటించారు. దీనిపై స్పందించిన పవన్.. ‘ప్రభుత్వం సముచిత నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ అడ్వాన్స్, సప్లిమెంటరీ రద్దు చేసి ఉత్తీర్ణత ప్రకటించడం సరైన నిర్ణయమని పవన్ కల్యాణ్ కొనియాడారు. (కరోనా: ఏపీలో 8 వేలు దాటిన కేసులు) పదో తరగతి పరీక్షల రద్దు సముచిత నిర్ణయం. - JanaSena Chief Sri @PawanKalyan pic.twitter.com/POGimecY5n — JanaSena Party (@JanaSenaParty) June 20, 2020 -
ఏపీలో టెన్త్ పరీక్షలు రద్దు
సాక్షి, అమరావతి : కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షలతో పాటు, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా పరీక్షలను రద్దు చేస్తున్నట్లు విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం ప్రకటించారు.విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. పదో తరగతి విద్యార్థులతో పాటు ఇంటర్లో ఫెయిల్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులంతా పాస్ అయినట్టు మంత్రి ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కాగా, తెలంగాణతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు ఇప్పటికే పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి విద్యార్థులకు గ్రేడ్లు ఇచ్చిన విషయం తెలిసిందే. -
విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపాలి:మంత్రి సురేష్
సాక్షి, అమరావతి: పరీక్షల సంసిద్ధతకు విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పదవ తరగతి పరీక్షలపై ఆయన అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు,జేసీ, పేరెంట్స్ కమిటీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి పాల్గొన్నారు. (ఏపీలో టెన్త్ పరీక్షలు యథాతథం) -
టెన్త్ విద్యార్థులకు నేరుగా మెమోలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు నేరుగా మెమోలను పంపించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం ఇటీవల ఆ పరీక్షలను రద్దుచేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విద్యార్థులందరినీ పాస్ చేసింది కూడా. అయితే ఇక విద్యార్థులకు వారి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వడమే మిగిలింది. ఇందులో భాగంగా ప్రభుత్వ పరీక్షల విభాగం విద్యార్థుల ఇంటర్నల్ మార్కులు, వారికి సంబంధించిన వివరాల క్రోడీకరణ పనిని చేపట్టింది. ఇపుడు ఎంతమంది పాస్ అయ్యారు?, ఎంతమంది ఫెయిల్ అయ్యారనేది లేదు. పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసిన విద్యార్థులంతా పాస్ కాబట్టి వారికి మెమోలు జారీచేసే ప్రక్రియపైనే దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా ఫలితాల ప్రకటన అవసరం లేదని అధికారులు భావిస్తున్నారు. లక్షన్నర మందికి 10/10 జీపీఏ! రాష్ట్రవ్యాప్తంగా మార్చిలో జరగాల్సిన పరీక్షలకు 5,34,903 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇపుడు వారంతా పాస్ కాబట్టి వారికి ఇంటర్నల్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వడమే మిగిలింది. ప్రతి సబ్జెక్టులో 20 ఇంటర్నల్ మార్కులకు ఎన్ని వచ్చాయో వాటిని ఐదింతలుచేసి సబ్జెక్టుల వారీగా గ్రేడ్, గ్రేడ్ పాయింట్, మొత్తంగా గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) ఇవ్వడమే ప్రధానం. అందుకోసం పరీక్షల విభాగం చర్యలు చేపట్టింది. అవసరమైతే జీపీఏ వారీగా వివరాలను పది రోజుల్లోగా వెబ్సైట్లో పొందుపరిచేందుకు పరీక్షల విభాగం కసరత్తు చేస్తోంది. దాంతోపాటే విద్యార్థులకు నేరుగా మెమోలు పంపించేలా చర్యలు చేపట్టింది. అందుబాటులో ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం పది పరీక్షలకు హాజరైన విద్యార్థుల్లో దాదాపు లక్షన్నర మందికి 10/10 జీపీఏ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పరీక్షలు రాసేందుకు ఫీజు చెల్లించిన వారిలో రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలలకు చెందిన విద్యార్థులే దాదాపు 3.75 లక్షల మంది వరకు ఉన్నారు. వారిలో లక్షన్నర మంది విద్యార్థులకు యాజమాన్యాలు ఇంటర్నల్ మా ర్కులను 20కి 20 వేసినట్లు సమాచారం. వారందరికీ 10/10 జీపీఏ వచ్చే అవకాశం ఉంది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ లేదు.. ఈసారి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ లేదు. పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులందరినీ పాస్‌చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఫెయిలయ్యే విద్యార్థులు లేనట్లే. అందుకే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ నిర్వహణ ఉండదని విద్యాశాఖ చెబుతోంది. -
అంతా పాస్.. త్వరలోనే జీపీఏ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యారు. ఇక వారికి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) ఇవ్వనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్ బుధవారం జీవో జారీచేశారు. కరోనా నేపథ్యంలో పదో పరీక్షలను రద్దుచేసి అందరినీ పాస్‌చేసిన ప్రభుత్వం ఇపుడు వారి ఇంటర్నల్ మార్కుల ప్రకారం ప్రతి సబ్జెక్టుకు గ్రేడ్, గ్రేడ్ పాయింట్, మొత్తంగా గ్రేడ్ పాయింట్ యావరేజ్ (జీపీఏ) ఇచ్చి, త్వరలోనే ఫలితాలను ప్రకటించ నుంది. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, ఎయిడెడ్, ప్రైవేటు, ఇతర యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల పదో తరగతి (ఎస్ఎస్సీ, ఓరియంటల్ ఎస్సెస్సీ, వొకేషనల్) విద్యార్థులంతా పాసైనట్టేనని, వారి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్స్ ఇవ్వనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. (పరీక్ష లేకుండానే పాస్) జీపీఏ ఇచ్చేదిలా.. రాష్ట్రంలో మార్చి 22 నుంచి లాక్డౌన్ ప్రకటించడం, అదే నెల 23 నుంచి జరగాల్సిన టెన్త్ పరీక్షలను హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వాయిదా వేయడం తెలిసిందే. ఆ తరువాత జూన్ 8 నుంచి పరీక్షలు నిర్వహించేలా హైకోర్టు మే 19న అనుమతి ఇచి్చంది. అయితే జూన్ 6న కరోనా పరిస్థితిని సమీక్షించిన హైకోర్టు.. హైదరాబాద్, సికింద్రాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించవచ్చని పేర్కొంది. దీంతో ప్రభుత్వం అదే రోజు పరిస్థితిని సమీక్షించి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలను వాయిదావేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈనెల 8న జరిగిన సమావేశంలో పరీక్షలను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్నల్ మార్కుల ఆధా రంగా విద్యార్థులందరికి గ్రేడింగ్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే విద్యాశాఖ నాలుగు ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను నిర్వహించిందని, వాటి ఆధా రంగా ఇంటర్నల్ మార్కులను పాఠశాలలు విద్యాశాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేశాయని పేర్కొంది. ఆ మార్కులు ఇపుడు విద్యాశాఖ వద్ద ఉన్నాయని, వాటి ఆధారంగా విద్యార్ధులకు సబ్జెక్టుల వారీగా గ్రేడ్, గ్రేడ్ పాయింట్, మొత్తంగా జీపీఏ ఇవ్వాలని వెల్లడించింది. విద్యాశాఖ వద్ద ఉన్న 20 శాతం ఇంటర్నల్ మార్కులను వంద శాతానికి లెక్కించాలని, విద్యార్థులకు ఆ 20శాతంలో వచి్చన మార్కుల ప్రకారం ఐదింతలు వాటికి కేటాయించాలని పేర్కొంది. వన్‌టైమ్ మెజర్ కింద ఈ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించింది. దీంతో పరీక్షలకు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులంతా పాసైనట్టే. ఆ విద్యార్థుల విషయంలో... పరీక్షకు దరఖాస్తు చేసుకున్న 5,34,903 మందిలో 25 వేల మంది వరకు ప్రైవేటు విద్యార్థులున్నారు. వారికి గ్రేడింగ్ ఇచ్చే విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని ఓ ఉన్నతాధికారి చెప్పా రు. వారు పరీక్ష రాసేందుకు సిద్ధమై ఫీజు చెల్లించినందున వారికీ గ్రేడింగ్ ఇవ్వక తప్పదన్నారు. అయితే వారు పాసైన ఇతర సబ్జెక్టులకు ఇప్పటికే గ్రేడ్స్, గ్రేడ్ పాయింట్స్ ఉన్నాయి. ఆయా విద్యార్థులు గతంలో ఫెయిౖ లెన సబ్జెక్టు కూడా ఇపుడు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పాసైనట్లే లెక్క. ఇపుడు వారికి గ్రేడ్, గ్రేడ్ పాయింట్ ఇవ్వాల్సి ఉంటుంది. వాటి ఆధారంగానే మొత్తంగా జీపీఏ కేటాయించాల్సి వస్తుం ది. గతంలో పాసైన సబ్జెక్టును వదిలేసి, ఫెయిలైన సబ్జెక్టుల ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్, గ్రేడ్ పాయింట్‌ను కేటాయించాలా? అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడ్, గ్రేడ్ పాయింట్స్ ఇచ్చి జీపీఏ ఇవ్వాలా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటామని ఓ అధికారి తెలిపారు. విద్యార్థి ఫెయిలైన సబ్జెక్టుకు సంబంధించిన ఇంటర్నర్ మార్కుల ప్రకారమే గ్రేడ్, గ్రేడ్ పాయింట్ ఇచ్చి జీపీఏ నిర్ణయించే అవకాశం ఉంది. -
ఏపీలో టెన్త్ పరీక్షలు యథాతథం
-
షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ.. తెలంగాణలో పరిస్థితులకు మనకు తేడా ఉంది. కరోనా వైరస్ నియంత్రణలో దేశంలోనే మన రాష్ట్రం ఆదర్శంగా ఉంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత విషయంలో రాజీపడం. టెన్త్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయి’ అని స్పష్టం చేశారు. కాగా మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు కరోనా, లాక్డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు నిర్వహించనుంది. ప్రతి పేపర్‌కు 100 మార్కులు ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి ఒక్కో పేపర్ మాత్రమే ఉంటుంది. ఇక కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. (ఆ మూడింటి ఆధారంగా టెన్త్ అప్‌గ్రేడ్!) కాగా తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు అయిన విషయం విదితమే. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా టెన్త్ విద్యార్థులను పాస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఫలితాల వెల్లడిపై ప్రభుత్వ పరీక్షల విభాగం దృష్టి పెట్టింది. తమ వద్ద ఉన్న విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను ప్రాసెస్ చేసే ప్రక్రియను 10–12 రోజుల్లో పూర్తి చేసి ఫలితాలను వెల్లడించేందుకు బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. (తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు) -
తెలంగాణ బాటలో తమిళనాడు,పుదుచ్చేరి
-
కరోనా తీవ్రత దృష్ట్యా టెన్త్ ఎగ్జామ్స్ రద్దు
-
పరీక్ష లేకుండానే పాస్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతుండటంతో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెన్త్ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రస్తుత తరుణంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని, అందువల్ల పరీక్షలు నిర్వహించకుండానే టెన్త్ విద్యార్థులందరినీ పైతరగతులకు ప్రమోట్ చేయాలని విద్యాశాఖను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో 2 నెలలుగా పరీక్షలు జరుగుతాయో లేదో తెలియక ఉత్కంఠకు గురైన 5,34,903 మంది విద్యార్థులకు ఊరట లభించినట్లయింది. ఇలా టెన్త్ పరీక్షలు రద్దు కావడం ఉమ్మడి ఏపీ, తెలంగాణ చరిత్రలో ఇదే తొలిసారి. దేశంలో, రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసిన పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలు, విద్యార్థుల భవిష్యత్తుపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ్‌రావు పాల్గొన్న ఈ సమావేశంలో పదో తరగతి పరీక్షల విషయంలో వివిధ రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులను పరిశీలించారు. తెలంగాణలో ఏమి చేయాలనే విషయమై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రాష్ట్రంలో అనుసరించాల్సిన పద్ధతిని ఖరారు చేశారు. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడ్లను పరిగణనలోకి తీసుకొని పదో తరగతి విద్యార్థులను పైతరగతికి ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మరోవైపు డిగ్రీ, పీజీ తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులనుబట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిశ్చయించింది. మూడు పేపర్ల పరీక్షలు పూర్తయ్యాక... రాష్ట్రంలో మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం తొలుత ఏర్పాట్లు చేసింది. మొత్తం ఆరు సబ్జెక్టుల్లోని 11 పేపర్లకు పరీక్షలు జరగాల్సి ఉండగా అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యే సమయానికి కేంద్రం జనతా కర్ఫ్యూ, కరోనా లాక్డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశంతో మార్చి 23 నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను ప్రభుత్వం తొలుత వాయిదా వేసింది. ఆ తర్వాత కరోనా జాగ్రత్తలతో జూన్ 8 నుంచి తిరిగి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా కరోనా తీవ్రత దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే జిల్లాల్లో పరీక్షలు నిర్వహించరాదని, మిగతా జిల్లాల్లో మాత్రం టెన్త్ పరీక్షలు నిర్వహించొచ్చని హైకోర్టు శనివారం సాయంత్రం తీర్పు చెప్పింది. అయితే అలా వేర్వేరుగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం శనివారం రాత్రి అనూహ్యంగా పరీక్షలను మరోసారి వాయిదా వేసింది. సీఎం కేసీఆర్‌తో సమావేశమై తదుపరి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సోమవారం పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై సమీక్షించి టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. గ్రేడింగ్ ఇలా.. సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలను రద్దు చేసి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఈసారి టెన్త్ విద్యార్థులంతా పాస్ కానున్నారు. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇంటర్నల్స్‌లో 20కి 20 మార్కులు వేస్తుండటంతో దాదాపు 80 శాతం మంది విద్యార్థులకు 10/10 జీపీఏ లభించనుండగా విద్యార్థుల వాస్తవ ప్రతిభ ఆధారంగా ఇంటర్నల్ మార్కులను వేసే ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం విద్యార్థులకు కాస్త తక్కువ గ్రేడ్లు రానున్నాయి. రాష్ట్రంలో 2014లో అమల్లోకి తెచ్చిన నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) ప్రకారం 9, 10 తరగతుల్లో త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక పరీక్షల విధానాన్ని తొలగించి నిర్మాణాత్మక మూల్యాంకనం (ఫార్మెటివ్ అసెస్మెంట్–ఎఫ్ఏ), సంగ్రహణాత్మక మూల్యాంకనం (సమ్మెటివ్ అసెస్మెంట్–ఎస్ఏ) విధానం కొనసాగుతోంది. ఒక విద్యా సంవత్సరంలో నాలుగు ఎఫ్‌ఏలు, రెండు ఎస్ఏలు నిర్వహించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అలాగే 2015లో పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 20 మార్కులు ఇంటర్నల్స్‌కు ఇచ్చి 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తోంది. ఇంటర్నల్స్‌లో ఒక్కో ఎఫ్‌ఏకు 20 మార్కుల (ప్రతి సబ్జెక్టులో) చొప్పున నాలుగు ఎఫ్‌ఏలు ఉంటాయి. ప్రతి ఎఫ్ఏ మార్కులను (20 మార్కులను) ఐదు మార్కులకు (ప్రతి సబ్జెక్టులో) పాఠశాలలు కుదిస్తాయి. ఇలా నాలుగు ఎఫ్‌ఏలలో మార్కులను 20 నుంచి 5 మార్కులకు కుదిస్తాయి. అంటే నాలుగు ఎఫ్‌ఏలు.. ఒక్కో దానికి 5 మార్కుల చొప్పున 20 అవుతాయి. ప్రతి సబ్జెక్టులో అలా వచ్చిన 20 మార్కులను విద్యార్థుల ఇంటర్నల్ మార్కులుగా పాఠశాలలు పదో తరగతి పరీక్షల విభాగానికి పంపుతాయి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 2019 జూలై, ఆగస్టు, నవంబర్, 2020 జనవరిలలో ఎఫ్‌ఏలను నిర్వహించగా ఆయా పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్నల్ మార్కులను స్కూళ్లు పరీక్షల విభాగానికి పంపాయి. 100 మార్కులుగా ఇంటర్నల్స్ మార్కులు పరిగణన.. ఇప్పుడు ఒక్కో విద్యార్థికి ప్రతి సబ్జెక్టలో ఉన్న 20 ఇంటర్నల్ మార్కులను 100 మార్కులుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఇక 20 మార్కుల్లో విద్యార్థులకు ఎంత శాతం మార్కులు వచ్చాయో వాటి పర్సంటేజీ ప్రకారం మార్కులను ఇస్తారు. ఉదాహరణకు ఒక విద్యార్థికి గణితంలో ఇంటర్నల్ మార్కులు 20కి 20 వేసి ఉంటే అతనికి గణితంలో 100 మార్కులతో ఏ–1 గ్రేడ్ (10 గ్రేడ్ పాయింట్ యావరేజ్–జీపీఏ) వస్తుంది. అలాగే అన్ని సబ్జెక్టుల్లో ఏ–1 వస్తే 10/10 జీపీఏ వస్తుంది. ఒకవేళ ఇంటర్నల్‌లో 18 మార్కులే వస్తే అతనికి 90 మార్కులు వచ్చినట్లు లెక్క. దాని ప్రకారం ఆ సబ్జెక్టులో ఏ–2 గ్రేడ్‌తో 9 పాయింట్ జీపీఏ వస్తుంది. మార్కుల పర్సంటేజీ ఆధారంగా గ్రేడ్, గ్రేడ్ పాయింట్ కేటాయిస్తారు. ఇప్పటివరకు టెన్త్‌లో అమలు చేస్తున్న గ్రేడింగ్ విధానం.. (హిందీ మినహా)... గ్రేడ్ మార్కుల పరిధి జీపీఏ ఏ1 91–100 10 ఏ2 81–90 9 బీ1 71–80 8 బీ2 61–70 7 సీ1 51–60 6 సీ2 41–50 5 -
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు
-
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు
సాక్షి, హైదరాబాద్ : పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో పరీక్షలు లేకుండానే టెన్త్ విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 5.34 లక్షల మంది విద్యార్థులను ప్రమోట్ అయ్యారు. ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితుల దృష్ట్యా పరీక్షలు నిర్వహించకుండానే ఇంటర్నల్, అసైన్మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. (చదవండి : తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం) కాగా హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలతో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అనుమతిస్తూ హైకోర్టు శనివారం తీర్పునివ్వగా అలా వేర్వేరుగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం సోమవారం నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేసింది. కాగా అలాగే డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై కూడా ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. (చదవండి : తెలంగాణలో షూటింగ్‌లకు అనుమతులు ) -
టెన్త్ పరీక్షల పై నేడు సీఎం కేసీఆర్ సమీక్ష
-
టెన్త్ విద్యార్థులను ప్రమోట్ చేయాలి
కవాడిగూడ: రోజురోజుకూ కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో టెన్త్ విద్యార్థులకు ఉపశమనం కలిగించేలా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ రికగ్నైజ్ స్కూల్స్ మేనేజిమెంట్ అసోసియేషన్ (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. పదవ తరగతి పరీక్షలు రద్దుచేసి ఆన్లైన్లో అందజేసిన ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలు ప్రకటించి పై తరగతులకు అనుమతించాలని కోరారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే రెండు, మూడుసార్లు పరీక్షలు వాయిదా పడటం వల్ల విద్యార్థులు మానసికంగా ఇబ్బందులకు గురై పరీక్షలు రాయాలనే సంసిసద్ధతను కోల్పోయారన్నారు. కరోనా నేపధ్యంలో ఇప్పటికే పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం, మరి కొన్ని రాష్ట్రాలు కూడా ఎస్ఎస్సీ వార్షిక పరీక్షలు రద్దుచేసి పైతరగతులకు ప్రమోట్ చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం సైతం నిర్ణయం తీసుకొని పదవ తరగతి విద్యార్థులను పై తరగతులకు అనుమతి ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జలజం సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్.ఎన్. రెడ్డి, కోశాధికారి శ్రీకాంత్, నాయకులు రాంచంద్రారెడ్డి, రాంచంద్రం తదితరులు పాల్గొన్నారు. -
అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేనందున పంజాబ్, మహారాష్ట్ర తరహాలో విద్యార్థుల అంతర్గత మార్కుల ఆధారంగా గ్రేడింగులివ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ఆదివారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు. రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులు ఇంటర్, డిప్లొమా, ఐటీఐ, ఇతర జాతీయ స్థాయి కోర్సుల్లో చేరే విషయంలో ఆందోళనలో ఉన్నారని ఆ లేఖలో తెలిపారు. వెంటనే నిర్ణయం తీసుకుని పదో తరగతి ఫలితాలు ప్రకటించడం ద్వారా తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనలు పోగొట్టాలని జీవన్‌రెడ్డి కోరారు. -
తెలంగాణ: టెన్త్ పరీక్షలు రద్దు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల వల్ల రెండోసారి పదో తరగతి పరీక్షలను వాయిదా వేసిన ప్రభుత్వం... వాటిని తిరిగి నిర్వహించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై సోమవారం చర్చించి కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, అధికారులు పాల్గొనే ఈ సమావేశంలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కరోనా తీవ్రత దృష్ట్యా... హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు జీహెచ్ఎంసీ పరిధిలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రాంతాలు మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలతో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అనుమతిస్తూ హైకోర్టు శనివారం తీర్పునివ్వగా అలా వేర్వేరుగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం సోమవారం నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేయడం తెలిసిందే. ప్రస్తుత క్లిష్ట పరిస్థితిలో విద్యార్థుల భవిష్యత్తుపై ఎలాంటి నీలినీడలు పడకుండా సత్వరంగా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలో సీఎం కేసీఆర్ విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఉన్న అవకాశాలనూ పరిశీలించనున్నారు. అయితే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రమైన నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం శ్రేయస్కరం కాదని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దీనికితోడు హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం కొందరు విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే మిగిలిన విద్యార్థుల్లో మానసిక ఆందోళన మరింత పెరిగే ప్రమాదముందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో పరీక్షలను ఈ ఏడాది రద్దు చేసి ఇంటర్నల్ మార్కులు లేదా ప్రీఫైనల్ ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను సైతం ప్రభుత్వం పరిశీలించనుంది. వార్షిక పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసే ముందు నిర్వహించిన ప్రీ ఫైనల్ పరీక్షల మార్కుల ఆధారంగా ఈ ఏడాది పదో తరగతి విద్యార్థులందరినీ ఉత్తీర్ణులు చేయాలని ఉపాధ్యాయ వర్గాల నుంచి కూడా ప్రభుత్వానికి సూచనలు వస్తున్నాయి. ప్రీ ఫైనల్ పరీక్షల మార్కులు ఇప్పటికే విద్యాశాఖ వద్ద ఉండటంతో ఫలితాల ప్రకటన కూడా సత్వరంగా చేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీఎం సమీక్ష ముగిసిన వెంటనే పదో తరగతి పరీక్షలు, విద్యార్థుల భవితవ్యంపై తీసుకున్న నిర్ణయాలను వెల్లడిస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనుంది. ప్రస్తుతం నెలకొన్న క్లిష్ట పరిస్థితిల దృష్ట్యా పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించి ఇంటర్నల్ పరీక్షల ఆధారంగా వారికి గ్రేడింగ్ కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం అధికంగా ఉందని తెలుస్తోంది. 1951లో ఓయూ పరీక్షల రద్దు.. అంతా పాస్ హైదరాబాద్ సంస్థానం 1951లో భారత్‌లో విలీనమైనప్పుడు చెలరేగిన అల్లర్ల కారణంగా అప్పట్లో ఉస్మానియా యూనివర్సిటీ వార్షిక పరీక్షలను రద్దు చేసి విద్యార్థులందరూ ఉత్తీర్ణులైనట్లు ప్రకటించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల విలేకరుల సమావేశంలో గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితిల్లో ఇదే అత్యుత్తమ నిర్ణయమని ప్రభుత్వ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే హరియాణా, పంజాబ్ తదితర రాష్ట్రాలు టెన్త్ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. లాక్డౌన్ మళ్లీ కఠినం! రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తీవ్రమైన నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రగతి భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే ప్రకటించిన సడలింపుల్లో కొన్నింటిపై ఈ భేటీలో పునఃపరిశీలన చేసే అవకాశముంది. కొన్ని విషయాల్లో కఠిన నిర్ణయాలు తీసుకొనే అవకాశముంది. ప్రధానంగా మాల్స్‌తోపాటు ప్రార్థనా స్థలాలు, మతపరమైన ప్రాంతాల్లో ప్రజలను సోమవారం నుంచి అనుమతిస్తామని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించగా దీనిపై చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పునఃసమీక్ష జరిపి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తులు వస్తున్నాయి. లాక్‌డౌన్‌ను పూర్తిగా సడలిస్తే రాష్ట్రంలో కేసుల సంఖ్య భారీగా పెరిగి రోగులకు చికిత్స అందించేందుకు ఆస్పత్రులు, వైద్య సదుపాయాలు సరిపోవని కొందరు సీనియర్ అధికారులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అంశాలతోపాటు కరోనాకు సంబంధించిన అన్ని విషయాలను సమీక్షలో చర్చించి సీఎం కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశముంది. ఈ సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, సీనియర్ అధికారులు పాల్గొననున్నారు. -
టెన్త్ పరీక్షలు : కేసీఆర్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. ముఖ్యమంత్రి కార్యాలయం వేదికగా పరీక్షలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో టెన్త్ పరీక్షల నిర్వహణపై విద్యామంత్రి మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ముఖ్య అధికారులతో సీఎం కేసీఆర్ సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న తరుణంలో పరీక్షలు నిర్వహించాలా? లేదా ప్రమోట్ చేయాలా? అనే అంశంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే పలువురు విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, ప్రముఖలతో ముఖ్యమంత్రి మాట్లాడినట్లు తెలుస్తోంది. పరీక్షలు నిర్వహించకుండా ప్రమోట్ చేస్తే ఎలా ఉంటుంది అనే అంశంపై కూడా ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రమోట్ చేస్తేనే బాగుంటుందని ప్రభుత్వానికి ఇప్పటికే సూచనలు, సలహాలు అందుతున్నాయి. వాటిపై కూడా రేపటి సమావేశంలో చర్చించనున్నారు.(టెన్త్ పరీక్షలు మళ్లీ వాయిదా) కాగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున ఆయా ప్రాంతాల్లో పరీక్షలను వాయిదా వేసి మిగతా జిల్లాల్లో నిర్వహించుకోవచ్చని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దీనిపై అధికారులతో చర్చించిన కేసీఆర్ రెండుసార్లు పరీక్షలు నిర్వహించడం సరైన విధానం కాదని భావించి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురైయ్యారు. ఈ నేపథ్యంలోనే సోమవారం సీఎం స్థాయిలో కీలక సమావేశం ఏర్పాటు చేసి పదో తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు పరీక్షలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. మరోవైపు కరోనా నివారణ చర్యలపై సీఎం కేసీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. కరోనా కట్టడికి చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై చర్చించనున్నారు. -
టెన్త్ పరీక్షలు : కేసీఆర్ కీలక భేటీ
-
టెన్త్ పరీక్షలు మళ్లీ వాయిదా
-
టెన్త్ పరీక్షలు మళ్లీ వాయిదా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసుల కారణంగా ఇప్పటికే ఓసారి వాయిదా వేసిన పదో తరగతి పరీక్షలను సోమవారం నుంచి తిరిగి నిర్వహించేందుకు సిద్ధమైన ప్రభుత్వం చివరి నిమిషంలో వాటిని మళ్లీ వాయిదా వేసింది. పరీక్షల నిర్వహణపై హైకోర్టు శనివారం సాయంత్రం ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శనివారం రాత్రి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్, సికింద్రాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రాంతాలు మినహా మిగతా ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలతో ప్రభుత్వం టెన్త్ పరీక్షలు నిర్వహించేందుకు హైకోర్టు తీర్పు ఇవ్వగా కొన్ని ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించి మరికొన్ని చోట్ల నిర్వహించకపోవడం ఇబ్బందికరమనే భావనకు ప్రభుత్వం వచ్చింది. హైకోర్టు తీర్పుపై అధికారులతో సమీక్షించిన అనంతరం విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పరీక్షల నిర్వహణ విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై త్వరలోనే సీఎం కేసీఆర్‌తో సమావేశమై తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. దీంతో పదో తరగతి పరీక్షలకు సంబంధించి తల్లిదండ్రులు, విద్యార్థుల్లో నెలకొన్న ఉత్కంఠ వీడింది. రాష్ట్రంలో మార్చి 19 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమవగా కరోనా నేపథ్యంలో మార్చి 23 నుంచి ఏప్రిల్ 6 మధ్య జరగాల్సిన పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి పరీక్షకు మధ్య రెండు రోజుల వ్యవధితో పరీక్షలు నిర్వహించేలా విద్యాశాఖ షెడ్యూల్ రూపొం దిం చింది. ఈ నెల 8 నుంచి టెన్త్ పరీక్షలను తిరిగి నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పరీక్ష కేంద్రాలను రెట్టింపు చేసింది. విద్యార్థులు భౌతికదూరం పాటించేలా తగిన ఏర్పాట్లు చేయడంతోపాటు శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ పరికరాలను అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వం ఈ నెల 4న కోర్టుకు తెలియజేసింది. అయితే కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో హైదరాబాద్, సికింద్రాబాద్, జీహెచ్ఎంసీ పరిధిలోని ఇతర జిల్లాలకు చెందిన ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించవద్దని, రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో నిర్వహించుకోవచ్చని శనివారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో ఏం చేయాలన్న విషయంలో ప్రభుత్వం సందిగ్ధంలో పడింది. తప్పనిసరి పరిస్థితుల్లో చివరకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల వాయిదావైపే మొగ్గు చూపింది. ఫలితాల్లో వ్యత్యాసం వద్దనే.. తొలుత కొన్ని ప్రాంతాల్లో టెన్త్ పరీక్షలు నిర్వహించి మిగిలిన ప్రాంతాల్లో ఆ తర్వాత పరీక్షలు నిర్వహిస్తే ప్రశ్నపత్రాల్లో తేడాలు కచ్చితంగా ఉంటాయి. అన్ని ప్రాంతాల విద్యార్థులకు ఒకే రకమైన ప్రశ్నపత్రాలు ఉండవు. దానివల్ల ప్రశ్నల సరళి సైతం కఠినంగా లేదా సరళంగా ఉండే అవకాశం ఉంది. దాని ప్రభావం ఫలితాలపైనా పడే అవకాశం ఉండటంతో ఫలితాల్లోనూ తేడా ఉండే చాన్సుంది. ఈ పరిణామంతో విద్యార్థుల్లో అపోహలు ఏర్పడే ప్రమాదం ఉందని, అందువల్ల ప్రస్తుతానికి పరీక్షల వాయిదాయే సరైనదని భావిస్తూ ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు రాయనున్న విద్యార్థులు.. : 5,34,000 ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే పరీక్ష రాయనున్న విద్యార్థులు.. :1,45,227 లక్షన్నర మంది విద్యార్థులు జీహెచ్ఎంసీలోనే.. హైదరాబాద్ జిల్లాలో 700 పరీక్ష కేంద్రాలు ఉండగా వాటిలో 82 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే మేడ్చల్ జిల్లాలోని 281 పరీక్ష కేంద్రాల్లో 32,871 మంది విద్యార్థులు, రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌నగర్, హయత్‌నగర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ ప్రాంతాల్లోని 258 కేంద్రాల్లో 30,356 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉంది. రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే 5.34 లక్షల మంది విద్యార్థుల్లో 1,45,227 మంది విద్యార్థులు హైదరాబాద్‌లోనే పరీక్షలు రాయాల్సి ఉంది. అయితే ఈ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించకుండా ఇతర ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించడం వల్ల ప్రశ్నల కఠినత్వం, ఫలితాల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో అపోహలకు తావు ఏర్పడుతుందన్న అభిప్రాయంతో పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు జిల్లాలకు వెళ్లిపోయిన హాస్టల్ విద్యార్థులకు వారున్న ప్రాంతాల్లోనే పరీక్షలు రాసేలా అనుమతిస్తామని, ఇప్పుడు పరీక్షలకు హాజరుకాని విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైనా రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణనలోకి తీసుకుంటామని ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించినా హైదరాబాద్, సికింద్రాబాద్, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో పరీక్షలు వద్దని ఆదేశించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలను వాయిదా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థుల ప్రాణాలు పోతే బాధ్యత ఎవరిది?: హైకోర్టు కరోనా వైరస్ కారణంగా పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలనే రెండు ప్రజాహిత వ్యాజ్యాలపై అంతకుముందు విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కరోనా తీవ్రత నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్‌లో పరీక్షలను వాయిదా వేసి మిగతా ప్రాంతాల్లో నిర్వహించాలని కోర్టు సూచించగా ఈ ప్రతిపాదనను అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ తీవ్రంగా వ్యతిరేకించారు. పరీక్షల నిర్వహణకు పాక్షిక అనుమతి ఇవ్వడం కంటే రాష్ట్రమంతా పరీక్షలను వాయిదా వేయడమే ఉత్తమమన్నారు. దీనిపై హైకోర్టు ధర్మాసనం ఘాటుగా స్పందించింది. ‘శుక్రవారం ఒక్కరోజే జీహెచ్ఎంసీ పరిధిలో 116 కేసులు నమోదయ్యాయి. పరీక్షలకు హాజరయ్యే అమాయక విద్యార్థుల ప్రాణాలకు ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? విద్యార్థుల ప్రాణాలు, ఆరోగ్యం కంటే ముఖ్యం ఏముంటుంది? ఒకవేళ ప్రాణం పోతే పరిహారం ఎంత ఇస్తారు? పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారని బలవంతంగా పరీక్షలకు అనుమతి ఇచ్చి విద్యార్థులను వారి తల్లిదండ్రులను ప్రమాదంలోకి నెట్టేయలేం. మహారాష్ట్ర, పంజాబ్‌లలో చేసినట్లుగా ఇంటర్నల్ మార్కులను ప్రామాణికంగా చేసుకొని గ్రేడింగ్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావట్లేదో అర్ధం కావట్లేదు. కేసుల నమోదు తీరు చూస్తే పరిస్థితులు ఇప్పుడే అదుపులోకి వచ్చేలా లేదు. ప్రభుత్వం కూడా ప్రస్తుత తీవ్రతను పరిగణనలోకి తీసుకోవాలి. మనసుంటే మార్గం ఉంటుంది’అని వ్యాఖ్యానించింది. జీహెచ్ఎంసీ పరిధిలో పరీక్షల వాయిదాపై ప్రభుత్వ వైఖరిని తెలుసుకోవాల్సి ఉందని ఏజీ చెప్పడంతో విచారణ తిరిగి సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైంది. జీహెచ్ఎంసీ సహా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, పాక్షిక ప్రాంతానికి అనుమతి కాకుండా మొత్తానికి అనుమతి ఇవ్వాలని ఏజీ కోరారు. దీంతో ధర్మాసనం పై ఉత్తర్వులు జారీ చేసి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వొచ్చా? సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యమయ్యేనా అన్న ఆలోచన అధికారుల్లో మొదలయ్యింది. ముఖ్యంగా హైదరాబాద్‌లో కేసులు విపరీతంగా పెరుగు తుండటం.. హైకోర్టు కూడా జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహిం చొద్దని చెప్పడంతో ఏం చేయాలా.. అని ఆలోచనలో పడ్డారు. పైగా ఈ నెలాఖరు, వచ్చే నెలల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందన్న వార్తల నేపథ్యంలో పరీక్షల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం అవుతుందా లేదా అన్న గందరగోళం నెలకొంది. పరీక్షలు నిర్వహణ సాధ్యం కాకపోవచ్చని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో వార్షిక పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థుల ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వొచ్చా అన్న ఆలోచనలు మొదలయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం కంటే ఇంటర్నల్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వడమే ఉత్తమమని ఇటు ఉపాధ్యాయ సంఘాలతో పాటు ప్రైవేటు యాజమాన్యాలు కూడా తేల్చి చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. త్వరలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. -
తెలంగాణలో టెన్త్ పరీక్షలు వాయిదా
-
తెలంగాణలో టెన్త్ పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్ : పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అధికారులతో అత్యవసరంగా సమావేశమైన ముఖ్యమంత్రి తీర్పుపై చర్చించిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా పదవ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో సోమవారం నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల మినహా రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు శనివారం సాయంత్రం తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. కోర్టు తీర్పుపై సంతృప్తి చెందని రాష్ట్ర ప్రభుత్వం పరీక్షల వాయిదాకే మొగ్గు చూపింది. రాష్ట్రంలో రెండుసార్లు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని ప్రభుత్వం భావించింది. అనేక కోణాల్లో సమాలోచనల అనంతరం మొత్తం పరీక్షలను వాయిదా వేసి పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత ఒక్కసారే నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నందున విద్యార్థులకు ఇబ్బందులు కలగకూడదని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. (టెన్త్ పరీక్షలపై హైకోర్టు తీర్పు) ప్రభుత్వ తాజా నిర్ణయంపై రాష్ట్ర విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీర్పును అనుసరించి 10వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. పరీక్షల విషయంలో అనుసరించాల్సిన వ్యూహం గురించి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. కాగా రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నందున పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని కోరతూ.. బాలకృష్ణ, సాయిమణి వరుణ్‌లు దాఖలు చేసిన వ్యాజ్యాలపై శనివారం ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపి తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి మినహా రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు నిర్వహణకు అనుమతినిస్తూ.. కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నందున రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో పరీక్షలను వాయిదా వేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమంలోనే పరీక్షలను వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
జీహెచ్ఎంసీ పరిధిలో పరీక్షలు వాయిదా
-
తెలంగాణ: టెన్త్ పరీక్షలపై హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి మినహా రాష్ట్ర వ్యాప్తంగా టెన్త్ పరీక్షలు నిర్వహణకు అనుమతినిచ్చింది. కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్నందున రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలో పరీక్షలను వాయిదా వేయాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోని విద్యార్థులను సప్లమెంటరీ పరీక్షలకు అనుమతించాలని, వారిని రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణించాలని ప్రభుత్వానికి సూచించింది. విద్యార్థులకు వైరస్ వ్యాప్తి చెందకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే పలు జాగ్రత్తలు తీసుకున్నామని పరీక్షలకు అనుమతివ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని ధర్మాసనం తోసిపుచ్చింది. కరోనాతో ఎవరైనా విద్యార్థి మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థి మరణిస్తే ఆ కుటుంబానికి ఎన్ని కోట్లు ఇస్తారు? ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించింది. పరీక్షల కన్నా విద్యార్థుల జీవితాలే ముఖ్యమని స్పష్టం చేసింది. కాగా పరీక్ష కేంద్రాలు ఉన్న ప్రాంతాలు కంటైట్‌మెంట్ జోన్లుగా మారితే ఏం చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించగా.. ఎలాంటి సమాధనం చెప్పలేదని తెలిపింది. జీహెచ్ఎంసీలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లక్షల మంది విద్యార్థులను ప్రమాదంలోకి నెట్టలేమని న్యాయస్థానం అభిప్రాయపడింది. కాగా పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ బాలకృష్ణ, సాయిమణి వరుణ్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై శనివారం ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ సందర్భంగా తుది తీర్పును వెలువరించింది. హైకోర్టు తాజా తీర్పుతో పరీక్షలు నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోనుంది. -
హైకోర్టు: పరీక్షలు లేకుండా గ్రేడింగ్ ఇస్తే ఇబ్బందేంటి?
-
టెన్త్ పరీక్షలపై ఉత్కంఠ
-
టెన్త్ పరీక్షలపై ఉత్కంఠ: గ్రేడింగ్ ఇచ్చే అవకాశం?
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై హైకోర్టు వేదికగా ఉత్కంఠ కొనసాగుతోంది. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ బాలకృష్ణ, సాయిమణి వరుణ్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై శనివారం ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ, రంగారెడ్డిలో కాకుండా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పరీక్షలు నిర్వహంచడం సాధ్యమవుతుందా అని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పంజాబ్ తరహాలో పరీక్షలు లేకుండానే విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలని పిటిషనర్ వాదించారు. దీనికి న్యాయస్థానం స్పందిస్తూ.. అసలు పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులకు గ్రేడింగ్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? అని ఉంటే వెంటనే తమకు తెలియజేయాలని కోరింది. పరీక్షలు లేకుండా గ్రేడింగ్ ఇస్తే ఇబ్బందేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ధర్మాసనం ప్రశ్నలకు స్పందించిన అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్.. రాష్ట్రంలో వేర్వేరుగా పరీక్షలు నిర్వహించడం కష్టమని పేర్కొన్నారు. ప్రశ్నపత్రం మళ్లీ మళ్లీ తయారుచేయడం ఇబ్బంది అవుతుందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఏజీ వాదనపై న్యాయస్థానం ఘాటుగా స్పందించింది. విద్యార్థుల ప్రాణాలు ముఖ్యమా..సాంకేతిక అంశాలు ముఖ్యమా అని ప్రశ్నించింది. దీనిపై ఏజీ స్పందిస్తూ.. ప్రభుత్వాన్ని అడిగి పూర్తి వివరాలను తెలియజేస్తానని సమాధానమిచ్చారు. ఇక కరోనా తీవ్రత కారణంగా పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఆసక్తి చూపని విద్యార్థులు ఆగస్టు, సెప్టెంబర్‌లో జరిగే సప్లిమెంటరీలో పరీక్షలు రాస్తే వార్షిక పరీక్షలకు హాజరైనట్లుగా పరిగణిస్తారా లేదా అని ధర్మసనం అడగ్గా.. సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గానే పరిగణించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు నివేదించారు. తదుపరి విచారణను శనివారం సాయంత్రం నాలుగు గంటలకు హైకోర్టు వాయిదా వేసింది. (సాధారణ పరీక్షగానే పరిగణిస్తారా?) -
సాధారణ పరీక్షగానే పరిగణిస్తారా?
సాక్షి, హైదరాబాద్ : కరోనా తీవ్రత కారణంగా పదో తరగతి పరీక్షలు రాసేందుకు ఆసక్తి చూపని విద్యార్థులు ఆగస్టు, సెప్టెంబర్‌లో జరిగే సప్లిమెంటరీలో పరీక్షలు రాస్తే వార్షిక పరీక్షలకు హాజరైనట్లుగా పరిగణిస్తారో లేదో తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీనిపై ప్రభుత్వ విధానాన్ని తెలుసుకుని శనివారం చెబుతానని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ చెప్పారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం శనివారం ఈ వ్యాజ్యాన్ని ప్రత్యేకంగా విచారిస్తామని పేర్కొంది. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయి దా వేయాలని కోరుతూ బాలకృష్ణ, సాయిమణి వరుణ్‌లు వేర్వేరుగా దాఖలు చేసిన పిల్స్‌ను శుక్రవారం ధర్మాసనం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. చిన్న స్కూల్స్‌లోని పరీక్ష కేంద్రాలను పెద్ద స్కూళ్లకు మార్పు చేసినవి 69 ఉన్నాయని, ఇలాంటి చోట్ల ప్రభుత్వం తీసుకున్న చర్యలపై వివరణ ఇవ్వాలని సూచించింది. కేసులు అధికంగా నమోదవుతున్న ఈ పరిస్థితుల్లో విద్యార్థులను పరీక్షలకు పంపేందుకు తల్లిదండ్రులు సుముఖత చూపకపోవచ్చని, ఈ కారణంగా విద్యార్థులు నష్టపోవద్దనే కోణంలో ఆలోచించాలని ప్రభుత్వానికి సూచించింది. కాగా, ఈ నెల 8 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందని ఇప్పటికే ప్రభు త్వం నివేదించింది. కరోనా వైరస్ కారణంగా వైద్యపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నందున పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని ఏజీ కోరారు. పిటిషనర్ తరఫు న్యాయవాది కె.పవన్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. కరోనా వైరస్‌కు భయపడి తల్లిదండ్రులు తమ పిల్లలను పరీక్షలు రాయిం చేందుకు భయపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నా యన్నారు. పరీక్షలు రాయని విద్యార్థులు ఉంటే వాళ్లు సప్లిమెంటరీకి హాజరైనా రెగ్యులర్æ పరీక్షలు రాసినట్లుగా ప్రభుత్వం పరిగణించాలని కోరారు. -
ఎక్కడుంటే అక్కడే టెన్త్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్ : పదో తరగతి విద్యార్థులు వారు నివాసం ఉంటున్న ప్రాంతాల్లోనే పరీక్షలు రాసేలా తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. హాస్టళ్లలో ఉండి చదువుకున్న విద్యార్థుల కోసం ఈ అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు కేటాయించిన కేంద్రాల్లో పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సత్యనారాయణ రెడ్డి తెలిపారు. అయితే సమయం తక్కువగా ఉన్నందు వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల హాల్‌టికెట్ల వివరాలు, తాము నివాసముంటున్న ప్రాంతాలు, పరీక్ష రాయాలనుకునే సెంటర్లు, జిల్లా, మండలాల వివరాలను సంబంధిత డీఈవోలకు ఈ నెల 7వ తేదీ వరకు తెలియజేయాలని స్పష్టం చేశారు. దాంతో విద్యార్థుల కోసం ఆయా పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయగలుగుతామని వెల్లడించారు. విద్యార్థుల వివరాలను జిల్లాల డీఈవో కార్యాలయాల్లో నేరుగా కానీ, ఫోన్ నంబర్ల ద్వారా కానీ, లేదంటే జిల్లాల్లో ప్రత్యేకంగా పదో తరగతి పరీక్షల కోసం ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ కేంద్రాల ద్వారా ఇవ్వొచ్చని తెలిపారు. కరోనా కారణంగా పట్టణాల్లోని హాస్టళ్లు కొన్ని తెరవలేదని, తెరిచినా ఆయా పాఠశాలలకు వచ్చి హాస్టళ్లలో ఉండి పరీక్షలకు హాజరు కాలేని విద్యార్థులు తాము ఉంటున్న నివాస ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాసేందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5 వేల పాఠశాలల నుంచి 5.34 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు. అందులో దాదాపు లక్ష మందికి పైగా విద్యార్థులు వివిధ పట్టణ ప్రాంతాల్లోని హాస్టళ్లలో ఉండి చదువుకుంటుండటంతో ప్రభుత్వ పరీక్షల విభాగం ఈ మేరకు చర్యలు చేపట్టింది. మరోవైపు ఇప్పుడు పరీక్షలు రాయలేని విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరైనా వారిని రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణించే అంశాన్ని పరీక్షల విభాగం పరిశీలిస్తోంది. దీనిపై శనివారం స్పష్టత రానుంది. -
జులై అఖరుకు నాడు నేడు తొలి దశ పూర్తి కావాలి
-
టెన్త్ పరీక్షలు రాసే గురుకుల విద్యార్థులకు వైద్య పరీక్షలు: కొప్పుల
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల 8 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలు రాసే గురుకుల విద్యార్థులు జూన్ 1వ తేదీ కల్లా రెసిడెన్షియల్ పాఠశాలలకు చేరుకోవాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. ఆ విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. లాక్డౌన్ వల్ల నిలిచిపోయిన పదో తరగతి పరీక్షలను పునఃప్రారంభం చేస్తున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం మంత్రి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు కరోనా వైరస్ పట్ల ఆందోళన చెందకుండా ప్రిన్సిపల్, స్టాఫ్ నర్సులు సూచనలు చేయాలన్నారు. కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిశుభ్రత, భౌతిక దూరం తదితర అంశాలపై అవగాహన పెంచాలన్నారు. ప్రతి పాఠశాల ప్రాంగణంలో థర్మల్ స్క్రీనింగ్ సిస్టం ఏర్పాటు, విద్యార్థులకు ఉచితంగా శానిటైజర్లు, మాస్కులు అందించాలన్నారు. తరగతి గదిలో, డైనింగ్ హాలులో సామాజిక దూరం తప్పనిసరిగా పాటించేలా చూడాలని, తరగతి గదులను, విద్యార్థులు కూర్చునే బెంచీలను, బల్లాలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని తెలిపారు. విద్యార్థులకు ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించాలని, ముఖ్యంగా విద్యార్థులు ఎలాంటి మానసిక ఆందోళనకు గురికాకుండా చదువుపైనే ధ్యాసపెట్టేలా చూడాలన్నారు. ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ తమ సొసైటీ పరిధిలో 173 పాఠశాలల్లో మొత్తం 12,163 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని వెల్లడించారు. -
టెన్త్ పరీక్షలు జూన్ 8 నుంచి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 5.34 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. హైకోర్టు ఆదేశాల మేరకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ జూన్ 8 నుంచి పరీక్షలను నిర్వహించేలా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు. ప్రధాన పరీక్షలు జూన్ 29తో ముగియ నుండగా ఓరియంటల్, వొకేషనల్ పరీక్షలు అన్నీ జూలై 5తో ముగియనున్నాయి. ప్రతి పరీక్షకు రెండు రోజుల వ్యవధిని ఇస్తూ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేశారు. భౌతిక దూరం పాటించేలా పరీక్ష కేంద్రాలను పెంచడం, పాత కేంద్రాలకు అర కిలో మీటర్ దూరంలో కొత్త కేంద్రాలను ఏర్పా టు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆయా కేంద్రాలకు విద్యార్థులను పంపిం చేందుకు పాత కేంద్రాల వద్ద సహాయ కులను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఉదయం 9:30 గంటల నుంచి... పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసా గుతాయి. ఓరియంటల్ పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయి. వొకేషనల్ థియరీ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు ఉంటుంది. ప్రతి బెంచిపై ఒకరే పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల మధ్య ఆరు అడుగుల భౌతిక దూరం ఉండేలా పరీక్ష కేంద్రాలను పెంచాం. ప్రస్తుతం 2,580 పరీక్షాకేంద్రాలు ఉండగా అదనంగా 2,005 కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఇందుకోసం అదనంగా 26,422 మంది ప్రభుత్వ సిబ్బంది సేవలను వినియోగించు కోనున్నాం. పరీక్షా కేంద్రాలను ప్రతిరోజూ శానిటైజ్ చేయడంతోపాటు విద్యార్థులకు మాస్కులను అందిస్తాం. థర్మల్ స్క్రీనింగ్ చేశాకే విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తాం. ప్రతి బెంచిపై ఒకరే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. గంట ముందే పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతిస్తాం. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సులను నడిపిస్తాం. పరీక్షలకు సంబంధించి హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. విద్యార్థులెవరికైనా దగ్గు, జలుబు, జ్వరం ఉంటే వారిని ప్రత్యేక గదుల్లో పరీక్ష రాయిస్తాం. ఎవరైనా ఇన్విజిలేటర్లకు దగ్గు, జలుబు, జ్వరం ఉంటే వారిని విధుల నుంచి తప్పించి రిజర్వులో ఉన్న వారిని నియమిస్తాం. సిబ్బంది మాస్కులు ధరించడంతోపాటు చేతులకు గ్లౌజ్‌లు ధరించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – మంత్రి సబితా ఇంద్రారెడ్డి -
కంటైన్మెంట్ జోన్లలో ప్రత్యేక ఏర్పాట్లు
-
తెలంగాణ: టెన్త్ పరీక్షలకు సన్నద్ధం
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాలతోనే పదవ తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మార్గదర్శకాలను పాటిస్తూ జూన్ 8 నుంచి జులై 5 వరకు పరీక్షలు జరపనున్నామని వెల్లడించారు. పరీక్షా కేంద్రాల్లో భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. అదనంగా మరో 2,005 పరీక్షా కేంద్రాలను పెంచామని పేర్కొన్నారు. (పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల) తల్లిదండ్రులు తమ పిల్లలను పరీక్షా కేంద్రాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. గంట ముందుగా వచ్చినా విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పారు. విద్యార్థులకు మాస్క్‌లు ఇస్తామని పేర్కొన్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులకు ప్రత్యేక పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. సెంటర్ల వివరాలు, సహాయం కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. విద్యార్థులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. -
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
-
టెన్త్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు నిర్వహించనుంది. ప్రతి పేపర్‌కు 100 మార్కులు ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి ఒక్కో పేపర్ మాత్రమే ఉంటుంది. విద్యార్థుల ఆరోగ్య రక్షణకు అన్నివిధాలా కట్టుదిట్టమైన చర్యలను తీసుకోబోతున్నట్టు వెల్లడించింది. పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు కానీ, తల్లిదండ్రులు కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. కాగా,లాక్డౌన్ కారణంగా మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసింది. ►జూలై 10న ఫస్ట్ లాంగ్వేజ్ (9.30am- 12.45pm) ►జూలై11న సెకండ్ లాంగ్వేజ్ (9.30am- 12.45pm) ►జూలై 12న ఇంగ్లీషు (9.30am- 12.45pm) ►జూలై 13న మ్యాథ్స్ (9.30am- 12.45pm) ►జూలై14న జనరల్ సైన్స్ (9.30am- 12.45pm) ►జూలై 15న సోషల్ స్టడీస్ (9.30am- 12.45pm) -
టెన్త్ ఎగ్జామ్స్ : ఆ వదంతులు నమ్మొద్దు!
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పదోవ తరగతి పరీక్షలకు సంబంధించి సామాజిక మాధ్యమంలో వస్తున్న వదంతులు నమ్మవద్దని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చిన వీరభద్రుడు విజ్ఞప్తి చేశారు. రోజుకు ఒకరకంగా పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫేక్ న్యూస్‌లను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారన్నారు. మొన్న టైమ్ టేబుల్ విషయంలో వదంతులు సృష్టించగా, నేడు ఏకంగా తన పేరును ఫోర్జరీ చేసి పరీక్ష తేదీలను ఆన్లైన్లో పెట్టారని తెలిపారు. (‘అప్పుడే పదో తరగతి పరీక్షల నిర్వహణ’) పదవ తరగతి పరీక్షలపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇలాంటి వదంతులు సృష్టించడం సైబర్ నేరాల కిందకి వస్తోందని, అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే విద్యార్థులు మానసికంగా ఆందోళన చెందుతున్నారని వారిని ఇలా గందరగోళానికి గురిచేయడం సమంజసం కాదన్నారు. ప్రజలెవరు ఈ వదంతులు నమ్మి ఆందోళన చెందవద్దని వీరభద్రుడు కోరారు. (పరీక్షలు జరుగుతాయి.. చదువుకోండి) -
‘అప్పుడే పదో తరగతి పరీక్షల నిర్వహణ’
సాక్షి, అమరావతి : లాక్డౌన్ ముగిసిన అనంతరం రెండు వారాల తర్వాత రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణ చేపడతామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. ఆన్లైన్, డిజిటల్ తరగతుల నిర్వహణ మరింత పెరగాలని కేంద్ర మంత్రి సూచించారు. విద్యా సంవత్సరంలోనే కాకుండా వేసవిలో కూడా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయం తీసుకున్నారు. (కరోనా టెస్టులు: దేశంలోనే ప్రథమ స్థానం..) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన మేరకు ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేశామని మంత్రి ఆదిమూలపు సురేష్ కేంద్రమంత్రికి తెలిపారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లో 9,10 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం వర్తింపజేశామని మంత్రి తెలిపారు. ఈ మేరకు వారికి సహాయ సహకారాలు అందించాలని కేంద్రమంత్రిని కోరారు. రాష్ట్రానికి మరిన్ని కేజీబీవీ, మోడల్ స్కూళ్లను మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో రేడియో, దూరదర్శన్ ద్వారా డిజిటల్, ఆన్ లైన్ క్లాస్‌లను అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. మౌలిక వసతులను బలోపేతం చేయాలని మానవ వనరుల అభివృద్ధి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి ధోత్రే సంజయ్ శ్యాంరావును కోరారు. (హిట్ మీ ఛాలెంజ్.. నెటిజన్ల మండిపాటు ) రాబోయే విద్యాసంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ త్వరలోనే విడుదల చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. లాక్డౌన్ ముగిసిన అనంతరం రెండు వారాల తర్వాత పదో తరగతి పరీక్షల నిర్వహణ చేపట్టనున్నట్లు, త్వరలోనే పదో తరగతికి పరీక్షల సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయననున్నట్లు తెలిపారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లు ధరించి పరీక్షలు నిర్వహించే అంశంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. సమగ్రశిక్ష విధానంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.1529 కోట్ల నిధుల్లో రూ.923 కోట్లు వచ్చాయని, మిగిలిన రూ.606 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. సాంకేతిక విద్యావిధానంలో భాగంగా దూరదర్శన్ ద్వారా విద్యామృతం, ఆల్ ఇండియా రేడియో ద్వారా విద్యాకలశం పేరుతో విద్యార్థులకు ఆన్ లైన్ విద్యను అందిస్తున్నామని మంత్రి సురేష్ తెలిపారు. (‘ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తున్న మొసలి’) -
‘కరోనా’ తగ్గే వరకు టెన్త్ పరీక్షలు వద్దు
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా, ఏప్రిల్ 14 వరకు కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎస్ఎస్సీ బోర్డును హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్.రామచందర్‌రావు, జస్టిస్ కె.లక్ష్మణ్‌తో కూడిన ధర్మాసనం సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా వ్యాప్తిని నిరోధించే క్రమంలో టెన్త్ పరీక్షలన్నీ వాయిదా వేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన ఎం.బాలకృష్ణ దాఖలు చేసిన ప్రజాహిత వాజ్యాన్ని ధర్మాసనం మరోసారి విచారించింది. ఈ పిల్‌ను గతంలో విచారించిన హైకోర్టు ఈ నెల 23 నుంచి జరగాల్సిన టెన్త్ పరీక్షలను 30వ తేదీకి వాయిదా వేయాలని గతంలో ఆదేశించింది. అయితే కరోనా తీవ్రత దృష్ట్యా సాధారణ పరిస్థితి నెలకొనే వరకు అన్ని సబ్జెక్టు పరీక్షలను పూర్తిగా వాయిదా వేయాలని ధర్మాసనం సోమవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాయిదా వేసినట్టు ప్రసార మాధ్యమాల ద్వారా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తెలియజేయాలని, తర్వాత పరీక్షల రీషెడ్యూల్ వివరాలను ప్రకటించాలని సూచించింది. సోమవారం జరిగిన విచారణ సమయంలో ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ బీఎస్.ప్రసాద్ వాదిస్తూ.. కరోనా నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వం ఆదివారమే నిర్ణయం తీసుSSC Public Examinations Postponed Again In Telanganaకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సత్యనారాయణరెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల ప్రతిని ఆయన ధర్మాసనానికి నివేదించారు. ఆన్లైన్లో జరిగిన ఈ విచారణలో జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు నివాసంలో ధర్మాసనం ఉండగా, అడ్వొకేట్ జనరల్ ప్రసాద్ తన నివాసం నుంచి వాదనలు వినిపించారు. పరీక్ష తేదీలు తరువాత ప్రకటిస్తాం: పరీక్షల విభాగం వాయిదా పడిన టెన్త్ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది తరువాత ప్రకటిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సత్యనారాయణరెడ్డి సోమవారం తెలిపారు. హైకోర్టు తాజా ఆదేశాలతో పరీక్షలను పూర్తిగా వాయిదా వేసినట్టు ప్రకటించారు. -
త్వరలోనే పదోతరగతి పరీక్షల షెడ్యూల్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్లో త్వరలోనే వెల్లడిస్తామని రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. మార్చి 23 నుంచి 30 వరకు జరగాల్సిన పదో తరగతి పరీక్షలను హైకోర్టు ఆదేశాలతో వాయిదా వేసిన తెలిసిందే. అయితే మార్చి 31 నుంచి ఏప్రిల్ 7 వరకు పరీక్షలను నిర్వహించాలని తొలుత ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మరోసారి వాయిదా తప్పలేదు. ఈ మేరకు భారత్‌లో కరోనా వ్యాప్తిని నివారించేందుకు ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ. సత్యనారాయణ రెడ్డి సోమవారం వెల్లడించారు. వాయిదా పడిన పదో తరగతి పరీక్షలతోపాటు అన్ని ఇతర పరీక్షల రీ షెడ్యూల్ తేదీలను తర్వలోనే వెల్లడిస్తామని ఆయన తెలిపారు. కాగా తెలంగాణలో కరోనా కేసులు సోమవారం నాటికి 70కి పైగా నమోదయ్యాయి.ఇక భారత్‌లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. సోమవారం ఉదయం నాటికి దేశంలో 1074 కేసులు నమోదయ్యాయి. అప్డేట్: పది పరీక్షలు మళ్లీ వాయిదా.. టెన్త్ పరీక్షలను మరోసారి వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర హైకోర్టు సోమవారం వెల్లడించింది. కరోనా నేపథ్యంలో పది పరీక్షలు వాయిదా వేయాలని ఉపాధ్యాయుదు బాలకృష్ణ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. కరోనా వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే లాక్ డౌన్ ప్రకటించాయని.. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించలేమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం ఉన్న స్టేను పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 15 తర్వాత పరిస్థితులను బట్టి తమ నిర్ణయం చెప్తామని కోర్టు పేర్కొంది. తదుపరి విచారణను ఏప్రిల్ 15కు వాయిదా వేసింది. -
ఉద్యోగ పరీక్షలపైనా కరోనా ప్రభావం
సాక్షి, హైదరాబాద్: కరోనా ప్రభావం ప్రవేశ పరీక్షలే కాదు ఉద్యోగ పరీక్షలపైనా పడింది. యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ), తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించాల్సిన వివిధ ఉద్యోగ పరీక్షలు, ఇంటర్వూ్యలను వాయిదా వేశాయి. టీఎస్పీఎస్సీ అయితే వివిధ శాఖలతో సంప్రదింపులను కూడా రద్దు చేసుకుంది. వాయిదా పడిన యూపీఎస్సీ పరీక్షలు ఈనెల 23 నుంచి మెుదలుకొని వచ్చే నెల చివరకు వివిధ విభాగాల్లో నిర్వహించాల్సిన సైంటిస్ట్‌లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ తదితర 12 రకాల ఉద్యోగ పరీక్షలను యూపీఎస్సీ వాయిదా వేసింది. వచ్చే నెల 3 వరకు నిర్వహించాల్సిన సివిల్స్ ఇంటర్వూ్యలను వాయిదా వేసింది. ఎస్ఎస్సీ వాయిదా వేసినవి ఎన్ఐఏ, సీఏపీఎఫ్ కానిస్టేబుల్స్ (జీడీ), ఎస్ఎస్ఎఫ్, రైఫిల్ వ్యూన్ ఇన్ అస్సాం రైఫిల్స్‌లో ఈనెల 24 నుంచి వచ్చే నెల 30 వరకు నిర్వహించాల్సిన రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్స్‌ను (ఆర్ఎంఈ) స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) వాయిదా వేసింది. వాటితోపాటు సీఏపీఎఫ్ కానిస్టేబుల్స్ (జీడీ), ఎన్ఐఏ, ఎస్ఎస్ఎఫ్, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్ వ్యూన్ పోస్టులకు ఈనెల 26 నుంచి వచ్చే నెల 7 వరకు నిర్వ హించాల్సిన డీటేయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్స్‌ను (డీఎంఈ) వాయిదా వేసింది. ఢిల్లీ పోలీసు విభాగంలో ఎస్ఐ, సీఏపీఎఫ్, సీఐఎస్ఎఫ్లో ఏఎస్ఐ పోస్టుల భర్తీకి ఈనెల 30 వరకు నిర్వహించాల్సిన డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ పరీక్షలను వాయిదా వేసింది. వీటితోపాటు కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ (లెవల్–1) పరీక్షలను, అలాగే ఈనెల 30 నుంచి నిర్వహించాల్సిన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, క్వాంటిటీ సర్వే యింగ్, కాంట్రాక్ట్ జూనియర్ ఇంజనీర్ పోస్టుల పరీక్షలను వాయిదా వేసింది. టీఎస్పీఎస్సీ పరీక్షలు.. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పలు పరీక్షలను వాయిదా వేసింది. ఈనెల 27 నుంచి 30 వరకు ఆల్ ఇండియా సర్వీసెస్, స్టేట్ సర్వీసెస్ వారికి నిర్వహించాల్సిన హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ టెస్టు పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. మరోవైపు కరోనా అదుపులోకి వచ్చే వరకు ఎలాంటి పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించవద్దని నిర్ణయించింది. వివిధ శాఖలతో నిర్వహించాల్సిన సమావేశాలన్నింటినీ రద్దు చేసుకుంది. వివిధ శాఖలతో ఈ–మెయిల్ ద్వారానే సంప్రదింపులు జరపాలని కమిషన్ నిర్ణయం తీసుకుంది. -
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా..
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. రెండు వారాలపాటు పరీక్షలు వాయిదా వేయనున్నట్టు ఆయన తెలిపారు. మార్చి 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి కొత్త తేదీలు ప్రకటిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం కరోనా కట్టడిపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాపి నిరోధక చర్యల్లో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పెంపు.. రాష్ట్రంలో లాక్డౌన్ నేపథ్యంలో ఎంసెట్, ఈసెట్, ఐసెట్ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడవును పొడిగిస్తున్నట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విద్యార్థులకు ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మార్చి 29 వరకు ఉన్న ఎంసెట్ దరఖాస్తు గడువును ఏప్రిల్ 5కు పొడిగించారు. అలాగే ఏప్రిల్ 2వరకు ఉన్న ఈసెట్, ఐసెట్ ప్రవేశ పరీక్షల గడువును ఏప్రిల్ 9వరకు పొడిగించారు. -
టెన్త్ పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 10వ తరగతికి సంబంధించిన పలు పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను రప్పించడం సరికాదని, పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించడంతో ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించాల్సిన పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే శనివారం జరిగే పరీక్షను వాయిదా వేయాలని హైకోర్టు చెప్పనందున ఆ పరీక్షను మాత్రం యథాతథంగా నిర్వహించనుంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాయిదా పడిన పరీక్షలను మళ్లీ ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత తెలియజేస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ.సత్యనారాయణరెడ్డి తెలిపారు. ఏప్రిల్ 6లోగా నిర్వహించడాన్ని పరిశీలించండి: హైకోర్టు రాష్ట్రంపై కరోనా ప్రభావం కొనసాగుతున్నప్పటికీ 10వ తరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడాన్ని సవాల్‌చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజనాల వ్యాజ్యంపై హైకోర్టు అంతకుముందు విచారణ చేపట్టింది. ఈ నెల 23 నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరీక్షలను రీ షెడ్యూల్ చేయాలని స్పష్టం చేసింది. ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 6లోగా పరీక్షలను నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని పేర్కొంది. ఒకవేళ పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే ఆ తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేస్తుందని ఆశిస్తున్నామని హైకోర్టు తెలిపింది. పరీక్షలను ఎప్పుడు నిర్వహించాలన్నది అధికారుల విచక్షణాధికారమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అన్నిరెడ్డి అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుందని, విద్యార్థుల మధ్య మీటరు దూరం ఉండేలా ఏర్పాట్లు చేసిందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనల సందర్భంగా హైకోర్టుకు వివరించారు. (కరోనా ఎఫెక్ట్ : సిలికాన్ వ్యాలీ షట్‌డౌన్) పరిణామాలను ఊహించడమే కష్టంగా ఉంది... ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ‘రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికే పలు దేశాల్లో ప్రమాద స్థాయికి చేరుకుంది. ఇరాన్, ఇటలీల్లో కరోనా ఏ స్థాయిలో ప్రబలిందో అందరం చూస్తున్నాం. రాష్ట్రంలో వైరస్ కట్టడికి ప్రభుత్వం కూడా తగిన ముందస్తు చర్యలు తీసుకుంటోంది. యుద్ధప్రాతిపదికన స్పందిస్తోంది. కరీంనగర్లో 7 కరోనా కేసులు బయటపడ్డాయి. ఎవరైనా విద్యార్థి వైరస్ బారినపడి, ఆ తల్లిదండ్రులకు ఆ విద్యార్థి ఒక్కరే బిడ్డ అయితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకే గదిలో 30 మంది విద్యార్థులు 2–3 గంటలపాటు ఉంటున్నప్పుడు జరగరానిది జరిగితే అందుకు బాధ్యత ఎవరిది? ఈ పరిణామాలను ఉహించడమే కష్టంగా ఉంది. విద్యార్థులు పరీక్షలు రాసి ఇళ్లకు వెళ్లాక కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుంది? పరీక్ష సందర్భంగా కేంద్రాల్లో ఉపాధ్యాయుల సంగతి ఏమిటి? పరీక్ష చాలా ముఖ్యమైనదే. కాని ప్రస్తుత పరిస్థితుల్లో స్వీయ జాగ్రత్త చర్యలు అంతకన్నా ముఖ్యమైనవి. ఇదే విషయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను రప్పించడం సరైన నిర్ణయం కాదు’అని ధర్మాసనం స్పష్టం చేసింది. -
పదో తరగతి పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టు శుక్రవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. శనివారం జరగనున్న పరీక్ష యథాతథంగా కొనసాగించాలని పేర్కొంది. సోమవారం(మార్చి23) నుంచి మార్చి 30వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేయాలని హైకోర్టు తెలిపింది. మార్చి 29న అత్యుతన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహణపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. కాగా, తెలంగాణలో గురువారం పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే దేశంతోపాటు తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పదో తరగతి పరీక్షల నిర్వహణను సవాలు చేస్తూ మందడి బాలకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ గైడ్‌లైన్స్ పాటించడం లేదని బాలకృష్ణ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పరీక్షా కేంద్రాల్లో మౌళిక వసతులు, శానిటైజేషన్ ఏర్పాట్లు సరిగా లేవని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. లక్షలాది మంది విద్యార్థులు పరీక్షలు రాస్తుండటంతో కరోనా విస్తరించే అవకాశం ఉందన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించింది. మార్చి 23 నుంచి మార్చి 30 వరకు జరిగే పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. శనివారం జరిగే పరీక్షకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మరోవైపు ఇప్పటివరకు తెలంగాణలో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. చదవండి : కరోనాపై పోలీస్ శాఖ మరింత అప్రమత్తం -
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు
-
నేటి నుంచి పదో తరగతి పరీక్షలు
-
పదో తరగతి విద్యార్థులకు మాస్కులు
సాక్షి, హైదరాబాద్: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు సంక్షేమ శాఖలు ఉపక్రమించాయి. గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి. గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న పదో తరగతి విద్యార్థులకు మాస్క్‌లు పంపిణీ చేస్తున్నాయి. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇప్పటికే వాటిని జిల్లా సంక్షేమ శాఖాధికారులకు పంపిణీ చేశాయి. వీటిని సంబంధిత అధికారులకు అందించి పిల్లలకు పంపిణీ చేశారు. లక్ష మందికి పంపిణీ.. ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన, బీసీ సంక్షేమ శాఖల ద్వారా రాష్ట్రంలో 1,750 సంక్షేమ వసతి గృహాలు నిర్వహిస్తున్నారు. వీటి పరిధిలో దాదాపు 25 వేల మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో 325 ఆశ్రమ పాఠశాలల్లో దాదాపు 20 వేల మంది విద్యార్థులుంటారు. గురుకుల సొసైటీల పరిధిలో 906 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో 622 పాఠశాలల్లో పదో తరగతి వరకు ఉంది. వీటిలో దాదాపు 48 వేల మంది విద్యార్థులున్నారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆయా పాఠశాలలు, హాస్టళ్లలో ఉన్నారు. వీరు నేటి నుంచి పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్ష రాశాక తిరిగి రావాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కరోనా బారిన పడకుండా మాస్కులను పంపిణీ చేశారు. పరీక్ష కేంద్రం నుంచి తిరిగి వచ్చాక చేతులు శుభ్రపర్చుకోవడానికి హ్యాండ్‌వాష్‌లు, సబ్బులు సైతం పంపిణీ చేశారు. మొత్తంగా లక్ష మంది విద్యార్థులకు పంపిణీ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. -
ఆసుపత్రి బెడ్‌మీద టెన్త్ క్లాస్ ఎగ్జామ్..
ముంబై : చదువుమీద ఉన్న శ్రద్ధ ఓ బాలికను ఆసుపత్రి బెడ్‌మీద నుంచి ఎగ్జామ్ హాల్‌కు నడిపించింది. ప్రాణం తీసే రోగాన్ని లెక్కచేయకుండా పదవ తరగతి పరీక్షలు రాయటానికి వెళ్లింది. అయితే బాలిక పరిస్థితిని గుర్తించిన ఎగ్జామ్ సెంటర్ అధికారుల చొరవతో ఆసుపత్రి బెడ్‌మీదనుంచే ఎగ్జామ్స్ రాసే అవకాశం దొరికింది. ఈ సంఘటన ముంబైలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన ఓ బాలిక క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. పరేల్‌లోని టాటా మెమోరియల్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. అయితే తను ఎగ్జామ్స్ రాయటానికి దగ్గరలోని ఎగ్జామ్ సెంటర్, ఎక్కువ సమయం కేటాయించాలని స్టేట్ బోర్డుకు విన్నవించుకుంది. దీంతో దగ్గరలోని కన్నోసా హైస్కూల్లో ఎగ్జామ్స్ రాసేందుకు ఆమెకు ఏర్పాటుచేయబడింది. మొదటి నాలుగిటి కోసం బాలిక సెంటర్ దగ్గరకు వెళ్లింది. ఆమె పరిస్థితిని గుర్తించిన సెంటర్ అధికారులు బోర్డుకు ఓ విన్నపం చేశారు. ఆసుపత్రి బెడ్‌మీద నుంచే తను ఎగ్జామ్స్ రాసేలా చూడాలని కోరారు. ఇందుకు స్టేట్‌బోర్డు ఒప్పుకోవటంతో శనివారం ఆసుపత్రి బెడ్‌మీదనుంచే జియోమెట్రీ ఎగ్జామ్ రాసింది. -
మార్చి 4 నుంచి ఇంటర్ పరీక్షలు
-
నిజంగా ‘పరీక్షే’
సాక్షి, అమరావతి : ఎంకి పెళ్లి సుబ్బడి చావుకొచ్చిందన్న చందంగా ఎన్నికల సందడి విద్యార్థుల భవిష్యత్తుకు గండంగా మారింది. రాజకీయ నాయకులు నామినేషన్ల సమయంలో చేసే హడావుడితో పరీక్ష రాస్తున్న విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. రాజకీయ నాయకులు తన అనుచరగణంతో పదుల కొద్ది వాహనాలు చేసే ర్యాలీల్లో హారన్ శబ్దాలతో చెవులు వాచిపోతున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి పదోతరగతి పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. అదే సమయంలో రాజకీయ నాయకుల పాదయాత్రలు, ర్యాలీలు మొదలవుతున్నాయి. ఆ సమయంలో రాజకీయ నాయకులు డప్పు వాయిద్యాలు, ఈలలు, కేకలతో మోతమోగిస్తున్నారు. ఈ ర్యాలీలు పదోతరగతి పరీక్షా కేంద్రాల నుంచి పోతున్నప్పుడు అందులో పరీక్ష రాస్తున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మోతల మధ్య రాతలెలా రా దేవుడా...? అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఒకేసారి రెండు పరీక్షలు... మార్చి 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మరో పక్క అదే రోజు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడింది. ఇలా ఒకేసారి విద్యార్థులకు, రాజకీయ నాయకులకు పరీక్షలు మొదలయ్యాయి. మంచి ముహూర్తాలు లేకపోవటమో లేక మరేదైనా కారణమో తెలియదు కాని మొదటి రెండు రోజులు పెద్దగా నామినేషన్ల హడావుడి కనిపించలేదు. బుధవారం నుంచి జిల్లాలో నామినేషన్ల సందడి మొదలైంది. జిల్లా వ్యాప్తంగా బుధవారానికి 19 అసెంబ్లీ, 3 పార్లమెంట్ నామినేషన్లు దాఖలయ్యాయి. గద్దె నామినేషన్‌తో ఇక్కట్లు.. విజయవాడ తూర్పు నియోజవకర్గ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్రావు బుధవారం అట్టహాసంగా నామినేషన్ వేశారు. ఇందులో భాగంగా పటమట లంకలోని కృష్ణవేణి రోడ్డులో తన అనుచరులు చేసిన ర్యాలీతో ఆ రోడ్డులో ఉన్న మూడు పదోతరగతి పరీక్షా కేంద్రాల్లోని విద్యార్థులు తీవ్ర ఆటంకం కలిగింది. వల్లూరి సరోజని ఉన్నత పాఠశాల, సీతారామమ్మ బాలికల పాఠశాల, కృష్ణవేణి హైస్కూల్లు ఉన్నాయి. బుధవారం ఉదయం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి క్యాంప్ కార్యాలయం నుంచి డప్పలు, వాయిద్యాలు, బ్యాండ్సెట్లతో పదుల సంఖ్యలో వాహనాలలో ర్యాలీ ప్రారంభించారు. వీరు చేసిన హడావుడితో పరీక్షా కేంద్రాలలో ఉన్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఒకనొక సమయంలో కేంద్రాల బయట ఉన్న తల్లిదండ్రులు తెలుగుదేశం నాయకులతో వాగ్వాదానికి దిగారు. పరీక్షా కేంద్రాల వద్ద ఇలా ప్రవర్తించటం ఏంటంటూ నిలదీశారు. స్వీయ నియంత్రణ అవసరం... పదోతరగతి పరీక్షలు కోసం విద్యార్థులు ఏడాదంతా కష్టపడి చదువుతారు. ఈ పరీక్షలు వారి భవిష్యత్తుకు సంబంధించిన విషయం. రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో అడుకుంటూ ర్యాలీలతో ఇబ్బంది పెట్టడం సరైంది కాదని రాజకీయ నాయకలు గుర్తించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇలాంటి వాటిని ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవటం కన్నా నాయకులే స్వీయ నియంత్రణ పాటించటం ఉత్తమమని చెబుతున్నారు. పరీక్షా కేంద్రాల ఇరువైపులా వంద మీటర్ల మేర ఎటువంటి ఆర్భాటాలు లేకుండా ముందుకుసాగి విద్యార్థులకు సహకరించాలని విన్నవిస్తున్నారు. -
గుండె నిండా బాధతోనే పరీక్షకు..
సాక్షి, హన్వాడ (మహబూబ్‌నగర్): తండ్రి అకస్మాత్తుగా మరణించడంతో పదోతరగతి పరీక్షలకు హాజరుకావాల్సిన ఆ విద్యార్థి మనోవేదనకు లోనయ్యాడు. అయినా పంటిబిగువన బాధను అదిమిపట్టి పరీక్షకు హాజరయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ జిల్లా కొనగట్టుపల్లికి చెందిన దర్పల్లి కేశవులు హన్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. కాగా, కుష్టువ్యాధితో బాధపడుతున్న అతని తండ్రి దర్పల్లి చెన్నయ్య ఆదివారం సాయంత్రం అకస్మాత్తుగా మరణించడంతో దిక్కుతోచని స్థితికి చేరుకున్నాడు. పెద్దమ్మతోపాటు గ్రామస్తులు ఆ విద్యార్థికి సోమవారం ధైర్యం చెప్పి పరీక్ష కేంద్రానికి పంపించారు. గుండెల నిండా బాధతో పంటిబిగువున అదిమిపట్టి తెలుగు–2వ పేపర్ పరీక్ష రాశాడు. 12ఏళ్ల క్రితం ఎటో వెళ్లిపోయిన తల్లి ఇదిలాఉండగా, కేశవులు మూడేళ్ల వయస్సులోనే 12ఏళ్ల క్రితం ఇంటి నుంచి తల్లి, ఏడాది పాపతో కలిసి ఎటో వెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదు. అప్పటి నుంచి తండ్రి దర్పల్లి చెన్నయ్య సంరక్షణలోనే ఈ విద్యార్థి పెరిగాడు. అయితే తండ్రికి కుష్టువ్యాధి సోకడంతో చేతులకున్న ఫింగర్ప్రింట్లు రాకపోవడంతో ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం కాక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమకున్న 35 కుంటల పొలానికి పాసుపుస్తకాలు రాలేదు. చివరకు రైతుబంధు, రైతుభీమా, పెట్టుబడి సాయం వీరి దరిచేరలేదు. చేసేది లేక తండ్రికి వచ్చే ఫించన్‌తోనే జీవనం ఇప్పటివరకు సాగింది. ఇప్పుడు తండ్రి మరణంతో ఆ విద్యార్థి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. తండ్రి అంత్యక్రియల కోసం సర్పంచ్ మానస, స్థానిక నాయకులు బసిరెడ్డి, మరణారెడ్డి, సందీప్‌రెడ్డి, సంజీవ్, కృష్ణయ్య తదితరులు చందాలు పోగుచేసి విద్యార్థి కేశవులుకు రూ.పది వేల ఆర్థికసాయం అందించారు. -
18 నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరగనున్నాయి. 2,839 పరీక్షా కేంద్రాలలో జరిగే ఈ పరీక్షలకు 6,21,634 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణపై విజయవాడ గొల్లపూడిలోని ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను చేశామన్నారు. 11,690 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు చెందిన 6,21,634 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారన్నారు. వీరిలో 3,18,524 మంది బాలురు 3,03,110 మంది బాలికలున్నారని చెప్పారు. వీరిలో 1,803 మంది దివ్యాంగ విద్యార్థిని, విద్యార్థులకు అనువుగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు, పరీక్షలు రాసేందుకు వారికి ఒక గంట ఆదనపు సమయాన్ని కేటాయించినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణను పరిశీలించేందుకు 156 ఫ్లయ్యింగ్ స్క్వాడ్లు, 289 సిట్టింగ్ స్క్వాడ్లను నియమించామన్నారు. సమస్యాత్మకమైన 209 పరీక్షా కేంద్రాలలో నిశితంగా పరిశీలించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరంతరం మంచినీటి సౌకర్యం ఏ ఒక్క విద్యార్థి నేలపై కూర్చోని పరీక్షలను రాసే పరిస్థితులు ఉత్పన్నం కాకుండా అన్ని పరీక్షా కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. నిరంతరం మంచినీటి సరఫరా చేయడంతో పాటు విద్యార్థులకు అవసరమైన మరుగుదొడ్లను ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. పరీక్షల నిర్వహణకు అవసరమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో సమావేశాలను నిర్వహించారని, విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించామని వివరించారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపి రవాణా సౌకర్యాన్ని పొందవచ్చన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్ఈఏపీ.జీవోవీ.ఐఎన్’ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మరిన్ని వివరాలకు హెల్ప్‌లైన్ నంబర్ 0866–2974540 లేదా 18005994550 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలన్నారు. 22న శాసనమండలి సభ్యుల ఎన్నికను దృష్టిలో పెట్టుకుని ఆరోజు జరగవలసిన పరీక్షను ఏప్రిల్ 3న నిర్వహిస్తున్నామని, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ మార్పును గుర్తించాలని సూచించారు. పిల్లలను సమయానికి పరీక్ష కేంద్రానికి పంపండి తల్లిదండ్రులు తమ పిల్లలకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను సందర్శించి ప్రతిరోజూ సరైన సమయానికి వారిని పరీక్ష కేంద్రానికి చేరుకొనేలా చూడాలన్నారు. విద్యార్థులు రోజూ ఒక గంట ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష రాయడానికి విద్యార్థులు, రైటింగ్ ప్యాడ్, పెన్నులు, పెన్సిల్స్, రబ్బరు, స్కేల్ వగైరా తీసుకురావాల్సి ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాలలో సెల్ఫోన్లు, క్యాలిక్యులేటర్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించబోమన్నారు. విద్యార్థులు ఎటువంటి స్కూల్ యూనిఫారంతో పరీక్షలకు హాజరుకాకూడదన్నారు. విద్యార్థులను బూట్లతో రాకూడదన్నారు. -
ముచ్చటైన మార్కులకు..ముత్యాల అక్షరాలు
సాక్షి, అచ్చంపేట/పిడుగురాళ్లటౌన్: ప్రస్తుతం కంప్యూటర్ యుగంలో ప్రతిది కీబోర్డుల పైనే ఆధారపడుతున్నారు చాలా మంది విద్యార్థులు. ఒక ప్రశ్నకు సమాధానం కావాలంటే ఒకప్పుడు టెస్ట్‌బుక్ మొత్తం తిరగేసి ముఖ్యమైన పాయింట్లను నోట్ చేసుకుని తరచూ వాటిని మననం చేసుకునేవారు. దానివల్ల చేతి రాత పెరగడమే కాకుండా జ్ఞాపకశక్తి కూడా వృద్ధి చెందుతుంది. కాని ఇప్పుడు కావలసిన ప్రశ్నను సూటికా గుగుల్ సర్చ్ చేసి, ఆ ప్రశ్నకు మాత్రమే సమాధానం తెలుసుకోవడం, దానిని సేవ్ చేసుకుని అవసరమైనపుడు ఉనియోగించుకోవడం జరుగుతుంది. దీనివల్ల చేతికి పని తగ్గిపోతుంది. స్పష్టం రాయగలిగేవారు కూడా అప్పుడప్పుడు మాత్రమే రాయడం వల్ల స్పష్టతను కోల్పోతున్నారు. ఈ ప్రభావం పబ్లిక్ పరీక్షలో విద్యార్థులపై పడి బాగా చదివినా ఎక్కువ మార్కులు సాధించలేకపోతున్నారు. బాగా చదివాం, చదివిన ప్రశ్నలే వచ్చాయి, బాగానే రాశాం, కాని మార్కులు రాలేదని తెగ బాధపడిపోతారు. కారణం తెలుసుకునేందుకు రీవాల్యూషన్ పెట్టుకుని, చేతి రాత సక్రమంగా లేకపోవడం, మనం రాసినవి మనకే అర్థంకాకపోవడం వల్లనేనని అప్పుడు తెలుసుకుంటాం. మార్కులు ఎందకు తక్కువ వచ్చాయో.. అప్పుడు చింతించిన ఎంత మాత్రం ప్రయోజనం ఉండదు. ముందుగా కష్టపడి చదవడం ఎంతముఖ్యమో.. చదివిన విషయాన్ని స్పష్టంగా రాయడం కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. చేతి రాత మార్చుకోవాలన్నా, అక్షరాలు గుండ్రంగా, సష్టంగా ఉండాలన్నా సాధన చేయాలి. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో రాత బాగుండాలంటే అచ్చు అక్షరాలను సవ్వదిశలో కూర్చుని అనుసరించి రాయడం అలవరుచుకోవాలి. ఎలాబడితే అలా కూర్చోవడం, పడుకుని రాయడం వల్ల చేతి రాత ఎంత మాత్రం మారదు. చదివిన ప్రతి ప్రశ్నను రాయడం చేర్చుకోవాలి. అలా చేయడం వల్ల రాత సక్రమంగా, స్పష్టంగా రావడమే కాకుండా చదివిన సమాధానాన్ని ఎక్కువ రోజులు గుర్తుంచుకునే అవకాశాలుంటాయి. ఏ భాషనైనా రాసేటపుడు పదానికి పదానికి మధ్య ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి. అన్ని పదాలు కలిపి రాయడం వల్ల సమాధానాలు దిద్దేవారికి అర్థమయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా పరీక్షలు రాసే విద్యార్థులు అక్షర దోషాలు లేకుండా చూచుకోవాలి, వత్తులు, పల్లులు, కొమ్ములు, దీర్ఘాలు ఎక్కడ ఎలా రాయాలో ఖచ్చితంగా పాటించాలి. ఇంగ్లిషు కలిపి రాత రాసే టప్పుడు కూడా ఖచ్చితత్వం పాటించాలి. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా ఎగ్జామ్ ప్యాడ్ తీసుకువెళ్లాలి. అలా చేయడం వల్ల మనకు ప్యాడ్‌పై రాసే అలవాటను ముందు నుంచే అలవరచుకునే వెసులుబాటు ఉంటుంది. అదికాక ఎగ్జామ్ హాలులో ఉండే డస్క్లపై రాయడం ఇబ్బందికరంగా ఉండవచ్చు. రాత రాసేటపుడు కూర్చునే భంగిమ, పెన్ను పట్టుకునే విధానం, పేపర్‌పై రాసే విధానం ఎప్పుడు ఒకే విధంగా ఉండేలా చూచుకోవడం మంచిది. ‘పది’లో పట్టుకు ప్రణాళిక అవసరం గుడ్లవల్లేరు: పదో తరగతి పబ్లిక్ పరీక్షలంటే చాలామంది పిల్లల్లో భయం ఉంటుంది. ఆ భయాన్ని పోగొట్టాలంటే ముందు నుంచే ప్రణాళిక అవసరం. అలా చేస్తే అమ్మో పాసవుతామో లేదో అన్న భయం వారిలో పోతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో టెన్త్ పిల్లలకు డీ–గ్రేడ్ వచ్చిందంటే వారిని తామున్నామంటూ ఉపాధ్యాయులు దత్తత తీసుకుంటున్నారు. అలా చాలా పాఠశాలల్లో పిల్లల్ని దత్తత తీసుకుని పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి ఉత్తీర్ణులను చేస్తున్నారు. ఆ వివరాలను గుడివాడ డీవైఈవో ఎం.కమలకుమారి వెల్లడించారు. టెన్త్‌లో ఉత్తీర్ణతకు నియమాలిలా.. విద్యా సంవత్సరంలో విద్యార్థులు పాఠశాలకు గైర్హాజరు కాకుండా చూసుకోవటం. ఉపాధ్యాయులు తమ అనుభవంతో తయారు చేసిన స్టడీ మెటీరియల్ విద్యార్థులకు ఇవ్వాలి. వందశాతం ఉత్తీర్ణతకు ఉపాధ్యాయులంతా సమష్టిగా కృషి చేయాలి. స్టడీ అవర్స్ ప్రారంభించాలి. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.45 నుంచి 5.45 గంటల వరకు ఉండాలి. మానసికోల్లాసం, శారీరక దారుఢ్యం కోసం చదువుతో పాటు క్రీడలను ప్రోత్సహించాలి. మానసిక ప్రశాంతత కోసం ఫస్ట్ ఫిరియడ్లోనే యోగ తరగతుల నిర్వహించాలి. విద్యార్థుల ఉత్తీర్ణతపై తల్లిదండ్రులతో ప్రతినెలా జరిగే సమావేశంలో చర్చలు జరపాలి. సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆసక్తి కనబరిచే విధంగా శిక్షణ ఇవ్వాలి. కంప్యూటర్లో బేస్డ్ నాలెడ్జ్ నుంచే తర్ఫీదు ఇవ్వాలి. పబ్లిక్ ఎగ్జామ్స్ కోసం క్వార్టర్లీ, ఆఫర్లీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలు, జవాబులపై ముఖ్యమైన వాటిని విద్యార్థులకు తెలియజేయాలి. సబ్జెక్ట్ కార్నర్ పేరుతో ఏ సబ్జెక్ట్ టీచర్ ఆ సబ్జెక్ట్‌లో అంశాలను క్లాసులోని పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా నోటీసు బోర్డులో ప్రదర్శించాలి. ముందు నుంచే డీ గ్రేడ్ విద్యార్థునులను గుర్తించాలి. వారిని ఉపాధ్యాయులు దత్తత తీసుకుని చదివించాలి. హాజరు శాతం కూడా 90 ఉండాలి. శెలవు పెట్టాలంటే విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాలలో చెప్పకపోతే అనుమతి ఇవ్వకూడదు. - డీవైఈవో కమలకుమారి అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాయాలి కొంత మంది విద్యార్థులు అడిగిన ప్రశ్నకు కాకుండా అలానే ఉండే మరో ప్రశ్నకు సమాధానాలు రాస్తూ ఉంటారు. అదే ప్రశ్న రాస్తున్నామా లేదా అనే ఆందోళనతో రాస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల అక్షరాలు సక్రమంగా రాయలేరు. రాసిన సమాధానంలో స్పష్టత ఉండదు. అక్షర దోషాలు కూడా ఎక్కువగా దొర్లుతాయి. ఫలితంగా ఆశించిన మార్కులను కోల్పోవలసి వస్తుంది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులంతా ముందునుంచే చేతి రాతపై దృష్టిపెట్టాలి. – టి.బాలశౌర్రెడ్డి, ఉపాధ్యాయుడు, తాళ్లచెరువు చేతి రాత కీలకం విద్యార్థులు చదవడంతో పాటు బాగా రాయడం కూడా ముందునుంచే సాధన చేయాలి.మనం రాసే అక్షరాలు స్పష్టంగా, గుడ్రంగా అందంగా ఉంటే మన సమాధానం పత్రం దిద్దే ఉపాధ్యాయుడు మరికొన్ని మార్కులను అదనంగా రాసే అవకాశంం ఉంటుంది. పరీక్షల సమయంలో మంచి మార్కులు సాధించాలంటే చేతి రాత కీలకం అనే విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలి. – వి.రాజశేఖర్, ఎంఈవో, అచ్చంపేట మండలం నిబంధనలు పాటిస్తే మేలు జవాబులు రాసే విధానంలో దిద్దుబాట్లు లేకుండా జాగ్రత్తపడాలి. వ్యాసరూప ప్రశ్నలకు పాయింట్లవారిగా సమాధానాలు రాస్తూ మధ్యలో ఉపశీర్షికలు ఇవ్వాలి. పదాల మధ్య స్పేస్, కామా, పుల్‌స్టాప్ ఇవ్వటం మూలంగా వాక్యాలు అందంగా కనిపిస్తాయి. బిగ్ ప్రశ్నలకు సమాధానం రాసేటప్పుడు కొట్టి వేతలు ఉండకూడదు. ప్రశ్నలపై సందేహాలుంటే ఇన్విజిలేటర్‌ను అడిగి నివృత్తి చేసుకోవాలి. –బి.మల్లికార్జునశర్మ, ఎంఈవో, పిడుగురాళ్ల -
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను మంత్రి గంటా శ్రీనివాసరావు సోమవారం విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకూ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 6.10 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు మంత్రి గంటా తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకూ జరగనున్నాయని, హాల్ టికెట్లను విద్యార్థులు ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. నెల రోజుల్లో పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామన్ని మంత్రి గంటా వెల్లడించారు. పరీక్షల షెడ్యూల్ : 18/03/2019, ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-1 19/03/2019 , ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు) పేపర్-2 20/03/2019, సెకండ్ లాంగ్వేజ్ (హిందీ) 22/03/2019, ఇంగ్లీష్ పేపర్-1 23/03/2019, ఇంగ్లీష్ పేపర్-2 25/03/2019, మ్యాథ్స్ పేపర్-1 26/03/2019, మ్యాథ్స్ పేపర్-2 27/03/2019, జనరల్ సైన్స్ పేపర్-1 28/03/2019, జనరల్ సైన్స్ పేపర్-2 29/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-1 30/03/2019, సోషల్ స్టడీస్ పేపర్-2 -
తొమ్మిది రోజుల్లో ఐదు చోట్ల పేపర్లు లీక్
-
వాట్సాప్‌లో ‘పది’ ప్రశ్నాపత్రం.. అలజడి
సాక్షి, కడప: వైఎస్ఆర్ కడప జిల్లాలో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయింది. జిల్లాలోని బద్వేల్లో శనివారం జరుగుతున్న టెన్త్ క్లాస్ హిందీ పరీక్ష ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో హల్ చల్ చేయడం కలకలం రేపుతోంది. పరీక్ష ప్రారంభమైన అరగంటకే క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో జిల్లాలో ఒక్కసారిగా అలజడి రేగింది. ప్రశ్నాపత్రం లీక్‌పై పలువురు విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటే.. కొంతమంది అక్రమార్కులు పేపర్ లీక్ చేసి తమ జీవితాలతో ఆడుకుంటున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీ విషయంపై అధికారులు సమగ్ర విచారణ చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
పదో తరగతి పరీక్షలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఏపీలో పదోతరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈనెల 29 వరకు ఉదయం 9.30 నుంచి 12.15 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. విద్యార్థుల హాల్‌టికెట్లను ఇప్పటికే ఆయా పాఠశాలలకు పంపించడంతో పాటు వాటిని వెబ్సైట్లో (www.bseap.org) కూడా పొందుపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా 11,356 పాఠశాలలకు చెందిన 6,17,484 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణకోసం రాష్ట్ర వ్యాప్తంగా 2,834 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలోనూ పదోతరగతి పరీక్షలకు మొదలయ్యాయి. గురువారం నుంచి ఏప్రిల్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు (కొన్ని సబ్జెక్టులు 12:45 గంటల వరకు) జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 8:45 గంటల కల్లా పరీక్ష కేంద్రంలోకి చేరుకోవాల్సి ఉంటుంది. నిర్ణీత సమయం 9:30 గంటల తర్వాత ఐదు నిమిషాల వరకే విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,542 కేంద్రాల్లో 5,38,867 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులందరికీ ఇప్పటికే హాల్‌టికెట్లు జారీ చేసినట్లు విద్యాశాఖ తెలిపింది. హాల్‌టికెట్లు అందని వారు www.bse.telangana.gov.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించింది. పరీక్ష హాల్లోకి సెల్ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించబోరు. హాల్‌టిక్కెట్లు తప్ప ఇతర పేపర్లను తీసుకుపోరాదు. హాల్టిక్కెట్ల రోల్ నెంబర్లను, మెయిన్ ఆన్షర్ షీట్లు, అడిషనల్, బిట్, మ్యాప్, గ్రాఫ్ షీట్లతో సహ ఎక్కడా రాయరాదు. ఊరు, పేరు, సంతకం వంటి ఇతర చిహ్నాలు పెట్టరాదని అధికారులు పేర్కొన్నారు. అభ్యర్థులను తొలి రెండు రోజులు మాత్రమే పరీక్ష ప్రారంభమైన అరగంటవరకు అనుమతిస్తామని, తరువాత నుంచి అనుమతించబోమని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఇన్విజిలేటర్లకూ జంబ్లింగ్
విజయనగరం అర్బన్: పదోతరగతి పరీక్షలు సక్రమంగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ సన్నద్ధమైంది. పరీక్షల విధుల్లో నిర్లక్ష్యం వహించే టీచర్లపై చర్యలకు సిద్ధమవుతోంది. పరీక్షల్లో ఇప్పటివరకు ఇన్విజిలేషన్ నిర్వహించే ఉపాధ్యాయులకు ఏ పరీక్షకు ఏ గది కేటాయించేది ఆయా పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు నిర్ణయించేవారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఆయా కేంద్రాల సూపరింటెండెంట్లు, ఉపాధ్యాయులను మచ్చిక చేసుకుని తమకు నచ్చిన వారిని ఆయా పాఠశాలల విద్యార్ధులున్న ఫలానా గదిలో వేయాలని లాబీయింగ్ చేసుకునే వారు. చాలా పాఠశాలల్లో కష్టపడి చదివిన విద్యార్థులు ఈ తతంగంతో తీవ్రంగా నష్టపోయేవారు. మాస్ కాపీయింగ్ కూడా జోరుగా సాగేది. అయితే వీటన్నింటికి అడ్డుకుట్ట వేసేందుకు ఈ ఏడాది ఈ విధానానికి పాఠశాల విద్యాశాఖ స్వస్తి పలికింది. ఈ మేరకు ఆదేశాలు జిల్లా విద్యాశాఖకు వచ్చాయి. రోజూ పరీక్ష నిర్వహణకు అరగంట ముందు చీఫ్ సూపరింటెండెంట్ ఆయా పరీక్ష కేంద్రాల్లో లాటరీ తీసి ఇన్విజిలేటర్‌కు ఏ గది వచ్చిందో తెలియజేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వం ఈ ఏడాది అమలు చేస్తున్న నూతన విధానంతో పరీక్షలను పారదర్శకంగా నిర్వహించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 గంటలకు ప్రారంభమవుతున్నందున విధులు నిర్వహించే ఇన్విజిలేటర్లు మాత్రం గంట ముందుగానే పరీక్ష కేంద్రాల విధులకు హాజరు కావాలని కూడా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. మూడు రోజులకోసారి ఇన్విజిలేటర్ల మార్పు.. ఇన్విజిలేటర్లకు లాటరీ ద్వారా గంట ముందు గదులను కేటాయించడంతో పాటు మూడు రోజులకోసారి పరీక్ష కేంద్రాన్ని మార్చుతారు. తాజాగా ఉన్నతస్థాయిలో జరిగిన సమీక్ష సమావేశంలో ఇన్విజిలేటర్‌ను మూడు రోజులకోసారి కచ్చితంగా పాఠశాలలను మార్చాలని నిర్ణయించారు. అదే విధంగా పరీక్షల నిర్వహణలో భాగంగా చీఫ్ సూపరింటెండెంట్లు, విభాగాల అధికారులు, పర్యవేక్షకులుగా వెళ్లే వారు విధుల్లో అప్రమత్తంగా ఉండాలి. లేదంటే కఠన చర్యలు అనుభవించాల్సి వస్తుంది. 1997 చట్టం 25 సెక్షన్ 10లోని నిబంధనలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ చట్టం ప్రకారం పదో తరగతి పరీక్షల విధుల్లో సక్రమంగా పనిచేయలేదని రుజవైతే కఠిన చర్యలు తప్పవు. బాధ్యులపై క్రిమినల్ కేసు నమోదుతో పాటు ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా తప్పదు. ఈ నెల 15 నుంచి జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో ఇది తప్పనిసరిగా అమలు చేస్తున్నామని పరీక్షల రాష్ట్ర పరిశీలకులు, విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ బీ.భాస్కరరావు, డీఈఓ జి.నాగమణి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పది పరీక్షల ఏర్పాట్లపై వారు వివరించారు. గంట ముందే పరీక్ష కేంద్రానికి.. పరీక్ష కేంద్రాలకు ఇన్విజిలేటర్ గంట ముందే వెళ్లాలి. విద్యార్థిని నిశితంగా తనిఖీ చేసి 30 నిముషాల ముందు గదిలోకి పంపాలి. ఓఎంఆర్ షీట్లో విద్యార్థి వివరాలను పూర్తి చేసే సమయంలోనూ జాగ్రత్తలు వహించాలి. 137 పరీక్ష కేంద్రాలకు 1,515 మంది ఇన్విజిలేటర్లు.. జిల్లాలో ఈ నెల 15 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు 30,248 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. బాలురు 15,009, బాలికలు 15,239 మంది ఉన్నారు. మరో 264 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. మొత్తం 137 పరీక్ష కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేశారు. వీటిలో స్టోరేజీ పాయింట్స్ మూడు కిలోమీటర్ల దూరం ఉన్న సీ–కేటగిరి పరీక్ష కేంద్రాలు 37 ఉన్నాయి. మొత్తం 1,515 మంది ఇన్విజిలేటర్లను, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు 137, చీఫ్ ఇన్విజేటర్లు 137 మంది, 9 ఫ్లయింగ్ స్క్వాడ్లు పనిచేస్తారు. అలాగే స్టోరేజ్ పాయింట్స్ 37, పంపిణీ రూట్స్ 16 ఏర్పాటు చేశారు. నేలపై కూర్చొనే పరీక్ష కేంద్రం ఉండదు.. జిల్లాలో పది పరీక్షలు నిర్వహిస్తున్న 137 కేంద్రాలలోనూ అభ్యర్ధులకు బెంచీలను ఏర్పాటు చేస్తున్నాం. చెంచీలు లేని పరీక్ష కేంద్రాల్లో తాత్కాలికంగా ఏర్పాటు చేశాం. ఎక్కడా నేలకూర్చొని రాసే పరిస్థితి లేదు. పరీక్ష కేంద్రాల నిర్వాహకులు రెండు రోజుల ముందే వెళ్లి తాగునీరు, వెలుతురు వంటి మౌలిక సదుపాయాలను సమకూర్చుకుంటారు. విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత, ఆహ్లాదకర వాతావరణంలో పరీక్షలు రాసేలా చర్యలు తీసుకున్నాం. ఇందుకు అన్ని వసతులు, సదుపాయాలు ఉన్న పాఠశాలలనే పరీక్ష కేంద్రాలుగా గుర్తించాం. ముఖ్యంగా తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్తు సరఫరాను పరిగణలోకి తీసుకున్నాం. ప్రతి కేంద్రం వద్ద మట్టి కుండలను ఏర్పాటు చేసి అందులో మినరల్ వాటర్, ప్రతి పరీక్ష గదిలో రెండు ఫ్యాన్లు ఉండేలా ఏర్పాట్లు చేశాం. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు.. పాఠశాలలకు పంపిన హాల్ టికెట్లను యాజమాన్యాలు ఇవ్వని పక్షంలో ‘బీఎస్ఈ.ఏపీ.బీఓవీ.ఇన్’ వెబ్సైట్ నుంచి తీసుకోవచ్చు. ఫిర్యాదులు, సూచనలు స్వీకరించడానికి కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ఫోన్ నంబబర్ ‘08922–252253, 9493313271, 8179928099 (బొబ్బిలి డివి జన్)లకు సూచనలు, ఫిర్యాదులు ఇవ్వొచ్చని తెలిపారు. అందుబాటులో ఆర్టీసీ సర్వీసులు.. పట్టణాలకు దూరంగా ఉన్న 37 సీ–కేటగిరి పరీక్ష కేంద్రాలకు రవాణా ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ సేవలను అందుబాటులో ఉంచాం. ఈ మేరకు ఆర్టీసీ ఆధికారులను విద్యాశాఖ అధికారులు కోరారు. సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు.. సమస్యాత్మక కేంద్రాలుగా జిల్లాలో ఆరింటిని గుర్తించారు. పార్వతీపురం ఏజెన్సీ ప్రాంతాల్లోని డోకిశీల, చినమేరంగి, టిక్కబాయి, రేగిడి, కొత్తవలస గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఏ, బీ పరీక్ష కేంద్రాలను గుర్తించారు. ఇక్కడ పక్కా ఏర్పాట్లలో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. -
ఎస్ఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల కోసం స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) పరీక్షల కుంభకోణంపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు సీబీఐ విచారణకు ఆదేశించింది. పలువురు అభ్యర్ధులు విజ్ఞప్తి మేరకు సీబీఐ విచారణను ఆదేశించామని, ఇక నిరసనలు ఆపాలని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సూచించారు. కాగా సుమారు 9,372 ఖాళీల భర్తీ కోసం ఫిబ్రవరిలో నిర్వహించిన ఎస్ఎస్సీ పరీక్షల్లో ప్రశ్నాపత్రం ముందుగానే లీకైందని అభ్యర్ధులు ఆరోపిస్తూ ఆందోళనలు, నిరసనలు చేసిన విషయం తెలిసిందే. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగడంతో పాటు, సమాధానాలతో సహా ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో షేర్ అవడంతో ఫిబ్రవరి 21న జరిగిన పరీక్షను ఎస్ఎస్సి రద్దు చేసింది. ఈ స్కాంపై సీబీఐతో విచారణ జరపాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేసిన విషయం విదితమే. -
‘లక్ష్యం’ గాలికి..
హుస్నాబాద్‌రూరల్ : పదో తరగతి పరీక్షల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రణాళికబద్ధంగా తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు సబ్జెక్టు ఉపాధ్యాయులతో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని హెచ్ఎంలకు సూచించింది. అయితే, రోజుకు ఒక సబ్జెక్ట్ ఉపాధ్యాయుడితోనే ప్రత్యేక తరగతుల నిర్వహించి ప్రధానోపాధ్యాయులు చేతులు దులుపుకుంటున్నట్టు సమాచారం. వార్షిక ఫలితాలపై ప్రభావం హుస్నాబాద్, అక్కన్నపేట మండలాలలో 15 ప్రభుత్వ పాఠశాలలో 350 మంది 10వ తరగతి చదువుతున్నారు. వీరికి వారం వారం ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది మండలంలో మీర్జాపూర్, మోడల్ స్కూల్, సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలు వంద శాతం ఫలితాలు సాధించాయి. మొత్తంగా హుస్నాబాద్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలు గత ఏడాది 87 శాతం ఫలితాలు సాధించాయి. ఈసారి ప్రతి పాఠశాల వందశాతం ఫలితాలు సాధించాలనే పట్టుదలతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. హెచ్ఎంల తీరుపై విమర్శలు సిద్దిపేట విద్యాధికారి ఆదేశాల మేరకు గత ఏడాది అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 31 వరకు నిత్యం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు ఒక సబ్జెక్ట్ టీచర్ విద్యా బోధన చేశారు. జనవరి నుంచి ఉదయం, సాయంత్రం 2 గంటలు ప్రత్యేక తరగతులు బోధిస్తున్నారు. సెలవు రోజుల్లో మాత్రం ఉదయం 8.30 నుంచి 11.30 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో హెచ్ఎంల తీరుతో ఫలితాలపై దుష్ప్రభావం పడే ప్రమాదం ఉంది. మరోవైపు తాగునీరు, అల్పాహారం అందక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు రాత్రి 7 గంటలకు ఇళ్లకు చేరుతుండటంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. హెచ్ఎంల పనితీరు మార్చుకోవాలని అటు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల గ్రాంట్స్‌కు బోగస్ బిల్లులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు ఏటా రాజీవ్ విద్యా మిషన్(ఆర్వీఎం) కింద రూ.10 వేలు ప్రాఠశాల గ్రాంట్, రూ.15,000 నిర్వహణ ఖర్చులు, ఒక టీచర్‌కు రూ.500 టీచింగ్ గ్రాంట్స్ ప్రభుత్వం విడుదల చేస్తుంది. వీటితో పాటు ఆర్‌ఎంఎస్‌ఏ(రాజీవ్ మాధ్యమిక శిక్షా అభియాన్) కింద పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ఏటా రూ.50 వేలు అందుతాయి. గత ఏడాది డిసెంబర్ నుంచి ఒక్కో 10వ తరగతి విద్యార్థికి స్నాక్స్, ఇతర సౌకర్యాల కోసం రూ.4 అందిస్తున్నారు. కాగా, హెచ్ఎంలు గ్రామాలకు చెందిన దాతలతో అల్పాహారం ఏర్పాటుచేయిస్తూ.. నిధులు కాజేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలలో గ్రంథాలయ పుస్తకాలు, సైన్స్ పరికరాలు ఏర్పాటుచేయకుండానే గ్రాంట్స్ కాజేస్తున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు. అక్కన్నపేట పాఠశాలకు సంబంధించిన బిల్లుల విషయంలో యువజనులు గతంలో సమాచార చట్టం కింద వివరాలను సేకరిస్తే ఇలాంటి అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. హెచ్ఎంలు అందుబాటులో ఉండాలి 10వ తరగతి ప్రత్యేక తరగతులకు సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు ఉన్నప్పటికీ పిల్లలు పాఠశాల నుంచి ఇంటికి వెళ్లే వరకు ప్రధానోపాధ్యాయులు ఉండాల్సిందే. ఒకటి, రెండు రెండు చోట్ల హెచ్ఎంలు సక్రమంగా విధులు నిర్వర్తించకపోవచ్చు. దీనిపై ఆరా తీస్తాం. – మారంపల్లి అర్జున్, ఎంఈఓ -
పుట్టెడు దుఃఖంతో పరీక్షకు హాజరు
నందలూరు: తండ్రి మరణాన్ని తలచుకుంటూ మరోవైపు జీవితానికి సంబంధించిన పరీక్ష ఒకేసారి రావడంతో పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుతూ పదో తరగతి పరీక్ష రాశాడు ఓ విద్యార్థి. వివరాలల్లోకి వెళితే.. మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అరవపల్లె తోటపాళెంకు చెందిన షేక్ అబ్దుల్ రెహమాన్ సెయింట్ జోసఫ్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఇతడు నందలూరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పరీక్షలు రాస్తున్నాడు. విద్యార్థి తండ్రి షేక్ అహమ్మద్ పీర్ (57) అనారోగ్యంతో తిరుపతి స్విమ్స్‌లో చికిత్సపొందుతూ శుక్రవారం మృతిచెందాడు. అదే రోజు మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. తండ్రి మరణంతో దుఖఃసముద్రంలో మునిగిపోయిన ఆ విద్యార్థిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. పెద్దలు ఆ విద్యార్థిని ఓదార్చి శనివారం సైన్స్ పరీక్షకు హాజరు అయ్యేలా చూశారు. పరీక్ష కేంద్రం తనిఖీ నిమిత్తం వచ్చిన ఆర్ఐపీ భానుమూర్తిరాజు విషయం తెలుసుకుని ద్యార్థికి ధైర్యం చెప్పారు. పరీక్ష అనంతరం ఆ విద్యార్థి తండ్రి అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జిల్లాఅధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి అహమ్మద్పీర్ మృతదేహానికి నివాళులర్పించి విద్యార్థి అబ్దుల్ రెహమాన్‌ను ఓదార్చి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. -
టెన్త్ పరీక్షల్లో టాప్ గ్రేడ్ రావాలా..
⇒ రేపటి నుంచే సాక్షి మెయిన్‌లో.. ⇒ ప్రతిరోజూ 4పేజీల టెన్త్‌క్లాస్ స్పెషల్స్ ⇒ తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో.. ⇒ కనీసం ఏ గ్రేడ్ సాధించేలా స్టడీమెటీరియల్ ⇒ ముఖ్య ప్రశ్నలు–సమాధానాలు, సమగ్ర బిట్‌బ్యాంక్ హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో టాప్ గ్రేడ్ కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్న విద్యార్థులకు సాక్షి అండగా నిలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న లక్షల మంది విద్యార్థుల కోసం ప్రతిరోజూ మెయిన్ ఎడిషన్‌లో మొత్తం 4 పేజీలు.. రెండు పేజీలు ఇంగ్లిష్ మీడియం, రెండు పేజీలు తెలుగు మీడియం విద్యార్థుల కోసం కేటాయించనుంది. తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు సంబంధించి సిలబస్‌ను అనుసరించి ఆయా పేపర్ల వారీగా పరీక్షకు ముందురోజు స్టడీ మెటీరియల్ ప్రచురించనుంది. తెలంగాణ, ఏపీకి చెందిన తెలుగు, ఇంగిష్ మీడియం విద్యార్థుల కోసం అత్యంత అనుభవజ్ఞులైన నిపుణులు రూపొందించిన ముఖ్యమైన ప్రశ్నలు–సమాధానాలు, సమగ్ర బిట్ బ్యాంక్స్, ఎగ్జామ్ డే టిప్స్‌ను ఈనెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ అందించనుంది. -
సెల్‌ఫోన్ కనిపిస్తే యాక్ట్ 25
► హాల్‌టికెట్ చూపిస్తే బస్సులో ఉచితం ► ఐడీ ఉన్నవారు తప్ప ఎవరూ కేంద్రంలో ఉండకూడదు ► రోజూ ఉదయం సీఎస్,డీఓలతో సెట్ కాన్ఫరెన్స్ ► జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి పరీక్షల నిర్వహణలో ఛీప్ సూపరింటెండెంట్లు మినహా తక్కిన ఏ ఒక్కరి వద్ద సెల్‌ఫోన్ దొరికినా వారిపై యాక్ట్ 25 కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి పగడాల లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్‌తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ ఈనెల 17 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. జిల్లాలో మొత్తం 49,576 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. వీరిలో 49,073 మంది రెగ్యులర్ విద్యార్థులు, 503 మంది సప్లిమెంటరీ విద్యార్థులు ఉన్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 193 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 145 ప్రభుత్వ పాఠశాలలు, 48 ప్రైవేట్ పాఠశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షలు రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి విద్యార్థీ ఖచ్చితంగా బెంచీలపై కూర్చునే పరీక్షలు రాయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దూర ప్రాంతాల్లో ఉన్న కేంద్రాలకు చేరుకోవడానికి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్టీసీ అధికారులు బస్సులు నడుపుతారన్నారు. హాల్‌టికెట్ చూపిస్తే చాలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చన్నారు. విద్యార్థులు తొలిరోజు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. హాల్ టికెట్లు డైన్లోడ్ చేసుకోండిలా..: హాల్ టికెట్టు లేని విద్యార్థలు http://hall17.bseap.org/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. ఛీప్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులకు రోజూ ఉదయం 8 నుంచి 8.20 గంటల వరకు పోలీస్స్టేషన్లలో సెట్ కాన్ఫరెన్స్ ఉంటుందన్నారు. పరీక్ష కేంద్రంలో 15 నిముషాల ముందు ప్రశ్నపత్రం బండిలు ఓపెన్ చేయాలన్నారు. మూడో అంతస్తులో కేంద్రం ఉంటే 20 నిముషాల ముందు ఓపెన్ చేయాలన్నారు. తెలుగు, ఇంగ్లీష్ పరీక్షలకు ప్రశ్నపత్రంతో పాటు బిట్ పేపర్ కూడా ఒకేసారి ఇవ్వాలన్నారు. తక్కిన పరీక్షలకు చివర అరగంట ముందు బిట్ పేపర్లు ఇవ్వాలన్నారు. 20 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నియమించామన్నారు. వీరిలో పోలీసు, రెవెన్యూ, విద్యాశాఖ నుంచి సభ్యులుగా ఉంటారన్నారు. యాక్ట్ 25 పక్కాగా అమలు చేయనున్నామన్నారు. పరీక్షల విధుల్లో ఉన్న ఏస్థాయి వారైనా మాస్ కాయీపింగ్, చూసిరాతలను ప్రోత్సహిస్తే జైలుశిక్ష ఉంటుందన్నారు. ఏసీ గోవిందునాయక్ మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. జిరాక్స్ కేంద్రాలు మూసివేయాలన్నారు. పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అందరికీ ఐడీ కార్డులు ఇస్తున్నామన్నారు. ఐడీ కార్డులు లేకుండా ఎవరైనా ఉంటే వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు. జవాబుపత్రాలు రోజూ సాయంత్రం 4 గంటల దాకా పోస్టల్ అధికారులు తీసుకోవాలని కోరారు. -
పది పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
► 35,992 మంది విద్యార్థుల కోసం 164 కేంద్రాలు ► తొలిసారిగా సీసీఈ విధానంలో పరీక్ష ► జంబ్లింగ్ విధానంలో ఇన్విజిలేటర్ల నియామకం కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షల కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 164 కేంద్రాల్లో 35,992 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. సీసీఈ విధానం ద్వారా తొలిసారి 80 మార్కులకు పరీక్షలు జరగనుండగా గతంకంటే 15 నిమిషాలు అదనపు సమయాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. సీసీఈ మోడల్లో ప్రశ్నపత్రం ఇవ్వడంతో చదువుకునేందుకు ఈ సమయాన్ని ప్రభుత్వం కేటాయించింది. పది పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 12.15 గంటల వరకు ఉంటాయి. అన్ని కేంద్రాల్లో ఖచ్చితంగా బెంచీలు ఉండేటట్లు చూడాలని రాష్ట్ర అధికారులు ఆదేశించడంతో అందుకుతగ్గ ఏర్పాట్లను జిల్లా అధికారులు చేస్తున్నారు. 5 కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు: పది పరీక్షలను నిర్వహించేందుకు, పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్‌కు విద్యార్థులు పాల్పడకుండా ఉండేందుకు అధికారులు ఐదు సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో తాళ్లపొద్దుటూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాల, కమలాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల, దువ్వూరు జెడ్పీ ఉన్నత పాఠశాల, చక్రాయపేట మండలం గండిలోని గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాల, పెనగలూరు మండలం చక్రంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. సమస్యాత్మక కేంద్రాలుగా 8 సెంటర్లు: జిల్లాలోని ఎనిమిది సెంటర్లను సమస్యాత్మక సెంటర్లుగా గుర్తించారు. ఇందులో నందిమండలం జెడ్పీ ఉన్నత పాఠశాల, వనిపెంట గురుకుల పాఠశాల, గండి గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాల, మఠం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కడప జయనగర్‌కాలనీ(ప్రైవేటు సెంటర్), తాళ్లపొద్దుటూరులోని జెడ్పీ ఉన్నత పాఠశాల, కమలాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల, దువ్వూరు జెడ్పీ ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. ఈ సెంటర్లపై స్క్వాడ్ ప్రత్యేక దృష్టిపెట్టనుంది. 50 మంది స్పెషల్ ఆఫీసర్ల నియామకం: పది పరీక్షల్లో ఎలాంటి ఆరోపణలకు తావివ్వకుండా ప్రతి మండలానికి ఒక జిల్లా అధికారిని స్పెషల్ ఆఫీసర్‌గా కలెక్టర్ కేవీ సత్యనారాయణ నియమించారు. వీరు ఆయా మండలాల్లోని సెంటర్లలో ఉండే విద్యార్థులు మాస్‌కాపీయింగ్‌కు పాల్పడకుండా ప్రత్యేక పర్యవేక్షణను చేయనున్నారు. దీంతోపాటు విద్యాశాఖ మరో 20 టీంలను పరీక్షల పర్యవేక్షణకు నియమించింది. ఈ స్క్వాడ్‌లోని ప్రతి బృందంలో విద్యాశాఖ నుంచి ఒకరు, రెవెన్యూ నుంచి ఒకరు. పోలీస్వాఖ నుంచి ఒకరు ఉంటారు. వీరు ముగ్గురు కలిసి ఒక బృందంగా ççపరీక్షల తీరును పర్యవేక్షించనున్నారు. ఇన్విజిలేటర్ల నియామకంలో జంబ్లింగ్: ఈసారి జరిగే పది పరీక్షల్లో మాస్‌కాఫీయింగ్‌కు తావ్వకుండా గతమెన్నడూ లేని విధంగా కలెక్టర్ పరీక్షలకు వెళ్లే ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ విధానంలో విధులను నియమించనున్నారు. ఈ మేరకే కలెక్టర్ నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ విధానం కిందిస్థాయిలో అమలు కొంతమేర కష్టతరం అవుతుందని మేధావులు, విద్యావంతులు అంటున్నారు. ఎందుకుంటే పరీక్ష 9.30 గంటలకు ప్రారంభం అయితే పరీక్ష నిర్వహించే రోజు ఉదయం 7 గంటలకు ఇన్విజిలేటర్ల సెల్‌కు ఏసెంటర్ అనేది మెసేజ్ వస్తుందని కలెక్టర్ గారు చెప్పారు. ఇది అమలు కొంతమేర కష్టతరంగా ఉంటుందని పలువురు అంటున్నారు. కొన్ని కారణాల చేత ఇన్విజిలేటర్ల సెల్‌కు మేసేజ్ చేరకపోయినా సంబంధిత ప్రక్రియ జరగడం కొంతమేర ఆలస్యమైనా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందని పలువురు అంటున్నారు. 25 యాక్టు అమలు: రాష్ట్ర ప్రభుత్వం ఈఏడాది నుంచి 25 యాక్టు (ప్రిలెన్స్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్)ను అమలు చేయనుంది. ఈ యాక్టు వల్ల పరీక్ష కేంద్రాలలోని విద్యార్థులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే సంబంధిత సెంటర్ ఇన్విజిలేటర్‌ని బాధ్యుడిగా చేయనుంది. దీంతో అతనిపై కేసు నమోదు చేయడంతోపాటు చర్యలు తీసుకోనున్నారు. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: పది పరీక్షల కోసం అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. ఎక్కడా కూడా నేలబారు పరీక్షలు లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆయా మండలాల ఎంఈఓలను ఆదేశించాం. మేము కూడా పర్యవేక్షిస్తున్నాం. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించేందుకు అన్ని చర్యలను తీసుకుంటున్నాం. ---పొన్నతోట శైలజ, జిల్లా విద్యాశాఖాధికారి -
పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
సాక్షి, సిటీబ్యూరో: పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. 14 నుంచి ఒకేషనల్, 17 నుంచి జనరల్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మంగళవారం ప్రారంభం కానున్న వృత్తివిద్యా కోర్సుల పరీక్షలకు పది సెంటర్లు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జిల్లాలో 162 మంది విద్యార్థులు సంస్కృతం, అరబిక్, పర్షియన్ లాంగ్వేజ్ పరీక్షలకు హాజరుకానున్నారు. యూనిఫాంలో వస్తే నో ఎంట్రీ: నగరంలోని ట్రాఫిక్‌రద్దీని దృష్టిలో ఉంచుకుని విద్యార్థులను ఉదయం 8.45 గంటల నుంచి 9.35 గంటల వరకు పరీక్ష కేంద్రంలోనికి అనుమతిస్తారు. నిర్థేశిత సమయం 9.35కి నిమిషం ఆలస్యంగా వచ్చిన వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని హైదారాబాద్ జిల్లా విద్యా శాఖాధికారి రమేష్ స్పష్టం చేశారు. స్కూల్ యూనిఫాంలో వచ్చే విద్యార్థులను కూడా లోపలికి అనుమతించబోమని తెలిపారు. పరీక్షహాల్లోకి విద్యార్థులు, ఇన్విజిలేటర్ల సెల్ఫోన్లు అనుమతించమని తెలిపారు. అత్యవసరమైతే డ్యూటీలో ఉన్న పోలీసుల వద్ద ఉన్న ఫోన్లను వాడుకోవచ్చని సూచించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని, హాల్‌టికెట్ల జారీ, పరీక్ష కేంద్రాలు, ఇతర సమస్యలపై 040-65537350 ఫోన్ నెంబర్లో సంప్రదించవచ్చని సూచించారు. వెయ్యి ప్రత్యేక బస్సులు: పదో తరగతి పరీక్షల కోసం ఆయా రూట్లలో 1000 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ తెలిపింది. విద్యార్థులు తమ హాల్‌టికెట్లను చూపించి బస్సులను ఎక్కవచ్చని ప్రకటించింది. ఉదయం ఏడు గంటలకే విద్యార్థులు ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు, తిరిగి మధ్యాహ్నం ఇళ్లకు చేరేందుకు కూడా ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. బస్సులపై ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్స్ అనే బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాల కోసం 9959226160/ 9959226154 నంబర్లలో సంప్రదించవచ్చు. ఆటంకం లేకుండా కరెంటు సరఫరా: పరీక్ష సమయంలో అత్యవసరమైతే తప్ప ఎట్టి పరిస్తితుల్లోనూ కరెంట్ సరఫరా నిలిపివేయవద్దని ఆయా సర్కిళ్ల ఇంజనీర్లకు డిస్కం ఆదేశాలు జారీ చేసింది. పరీక్షల సమయంలో రాత్రిపూట విద్యార్థులు చదుకునే అవకాశం ఉండటంతో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని సూచించింది. అత్యవసర పరిస్థితుల్లో 1912 కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. -
డిప్యూటీ డీఈఓ ఆకస్మిక తనిఖీలు
యాలాల(రంగారెడ్డి): యాలాల మండలంలోని పగిడియాల, ముద్దాయిపేట ఉన్నత పాఠశాలల్లో డిప్యూటీ డీఈఓ హరీష్ చందర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పదో తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న సందర్భంగా విద్యార్థులు ఏ విధంగా వత్తిడిని జయించాలి అనే అంశంపై మాట్లాడారు. దీంతో పాటు డిజిటల్ క్లాసుల ద్వారా ప్రముఖ సైకాలిజిస్టు డా. బి.వి పట్టాభిరామ్.. వత్తిడి సంబంధిత సీడీలను విద్యార్థుల ముందు ప్రదర్శించారు. డీఈవో హరీష్ చందర్ తో పాటు మండల విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి ఈ ఆకస్మిక తనిఖీలలో పాల్గొని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. -
‘ఇంటర్నల్ మార్కుల’ గడువు పెంపు
సాక్షి, హైదరాబాద్: ఎస్ఎస్సీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను ఆన్లైన్ (https://bsetelangana.org)లో నమోదు చేసేందుకు ఈ నెల 25 వరకు గడువు పెంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ మన్మథరెడ్డి మంగళవారం తెలిపారు. -
టెన్త్ సోషల్ పరీక్షలు వాయిదా
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల రెండో విడత ఎన్నికల నేపథ్యంలో ఈనెల 10, 11వతేదీల్లో నిర్వహించాల్సిన పదో తరగతి సోషల్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 10వ తేదీన జరగాల్సిన సోషల్ పేపర్ 1ను, 11వతేదీన జరగాల్సిన సోషల్ పేపర్ 2 పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రభుత్వ పరీక్షల డెరైక్టర్ మన్మథరెడ్డి తెలిపారు. తాజా షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 12న సోషల్ పేపర్ 1 పరీక్షను, 15వ తేదీన సోషల్ పేపర్ 2 పరీక్షను నిర్వహించనున్నారు. 12వతేదీన జరగాల్సిన ఓరియెంటల్ ఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్(సంస్కృతం, అరబిక్, పర్షియన్) పేపర్-2 పరీక్షను 16 తేదీకి వాయిదా వేశారు. 15న జరగాల్సిన ఒకేషనల్ థియరీ పరీక్ష 17కు వాయిదా పడింది. రెండు పరీక్షల టైమింగ్స్ మార్పు: ఏప్రిల్ 7వతేదీన జరగనున్న సైన్స్ పేపర్ 1తోపాటు 12వ తేదీ జరగనున్న సోషల్ పేపర్ 1 పరీక్షల సమయంలో మార్పు చేశారు. ఈ పరీక్షలు ఉదయం 9.30 గంటలకు కాకుండా 11 గంటల నుంచి 1.30 గంటల వరకు నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే నెల 6వతేదీన, 11వతేదీన రెండు విడతల్లో జరగనున్న విషయం తెలిసిందే. పోలింగ్ తర్వాత రోజుల్లో జరగనున్న ఈ రెండు పరీక్షలకు సెంటర్లలో తగిన ఏర్పాట్లు చేయడానికి వీలుగా పరీక్షల నిర్వహణ సమయంలో మార్పు చేసినట్లు అధికారులు తెలిపారు. షెడ్యూల్లో మార్పులు ఇవీ... పరీక్ష పాత తేదీ కొత్త తేదీ సోషల్ పేపర్-1 ఏప్రిల్ 10 ఏప్రిల్ 12 సోషల్ పేపర్-2 ఏప్రిల్ 11 ఏప్రిల్ 15 ఓరియంటల్ మెయిన్ లాంగ్వేజ్ ఏప్రిల్ 12 ఏప్రిల్ 16 వొకేషనల్ థియరీ ఏప్రిల్ 15 ఏప్రిల్ 17 -
భయం వీడితే విజయం ‘పది’లమే..
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : ఎస్సెస్సీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో విద్యార్థుల్లో ‘టెన్’షన్ మొదలైంది. ఆందోళన అనేది సహజమే. కానీ, ఆందోళన వీడితే విజయం మనదే అనే విషయాన్ని మరిచిపోవద్దు. ఉన్నత విద్యకు పదో తరగతి తొలి మెట్టయితే, ఉన్నత ఉద్యోగాలకు ఆ మార్కులే కీలకం. ఈ పరీక్షల్లో నెగ్గడం నిజంగా విద్యార్థులకు పరీక్షే. ఇందుకు కష్టంగా కాదు ఇష్టంగా చదువుతూనే పక్కా ప్రణాళికతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈనెల 27 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అంటే ఇంకా ఆరు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే విజయం మీ సొంతమవుతుంది. పరీక్ష నిర్వహణకు పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఈనెల 27 నుంచి ఏప్రిల్ 15 వరకు జరగనున్నాయి. ఇందుకోసం జిల్లా విద్యాశాఖాధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జిల్లా వ్యాప్తంగా 178 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు మొత్తం 39,449 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రెగ్యులర్ విద్యార్థుల కోసం 160, ప్రైవేటు విద్యార్థులు కోసం 18 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. 4,342 మంది ప్రైవేటు విద్యార్థులు, 35,117 రెగ్యులర్ విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. పరీక్ష నిర్వాహణ కోసం 178 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 178 డిపార్ట్మెంటల్ అధికారులు, 39 కస్టోడియన్లు, పది మంది ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. బట్టి చదువులకు స్వస్తి పలకండి ఎన్నిసార్లు చదివినా గుర్తుండటం లేదనే బెంగ అసలే వద్దు. చదివి ఒక్కసారి చూస్తే అందులో లోపాలు తెలుస్తాయి. మననం చేయడం ద్వారా గుర్తుంటుంది. అంతేగాని చదివిన ప్రతి అంశంపై పట్టు సాధించాలని బట్టి విధానానికి పాల్పడద్దు. మనసు పెట్టి ఇష్టంగా చదివితే లక్ష్యం సులువవుతుంది. గ్రూప్ డిస్కషన్స్ మేలు.. మరో వారం రోజుల్లో పరీక్షలు ఉన్న నేపథ్యంలో మెలకువలు పాటిస్తూ జవాబులు రాయడంలో సృజనాత్మకంగా వ్యవహరించాలి. సమూహ చదువులు, గ్రూప్ డిస్కషన్స్ ద్వారా తెలియని విషయాలు తెలుసుకోవచ్చు. పునశ్చరణలో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. అక్షర దోశాలు లేకుండా.. చేతిరాత మెరుగు పర్చుకుని సమాధానాలు సులువుగా అర్థమయ్యేలా రాయాలి. అక్షర దోశాలు లేకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే మార్కులు తగ్గే అవకాశం ఉంది. పునఃశ్చరణ తరగతుల నిర్వాహణ, ప్రతి జవాబును పలుమార్లు రాయడం, మ్యాప్ పాయింటింగ్‌ను గుర్తించడం మేలు. ఒత్తిడికి లోనుకావద్దు.. ఏకధాటిగా చదవకూడదు. ప్రతి 45 నిమిషాలకోసారి విశ్రాంతి తీసుకోవాలి. చదువుకునే గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. వీలైనంత వరకు ఉదయం పూట మాత్రమే ఎక్కువ చదవాలి. ఒత్తిడికి లోనుకావద్దు. ఒత్తిడితో చదివితే సమతుల్యత లోపిస్తుంది. ఆహార పరంగా.. పరీక్షలు ముగిసే వరకు చిరుతిండికి దూరంగా ఉండాలి. ముఖ్యంగా బయట తోపుడు బండ్లపై చేసే వంటకాలు తీసుకోవద్దు. అనారోగ్యకరమైన ఆహార పదార్థాలు, అలవాట్లకు దూరంగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో.. టమాట, బీట్రూట్, క్యారెట్, జ్యూస్ తాగాలి. మొలకెత్తిన విత్తనాలు తినాలి. పండ్లు తీసుకోవడంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోజు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. టెన్షన్‌కు లోనుకాకుండా క్రమపద్ధతిలో చదవాలి. పరీక్షలు పూర్తయ్యే వరకు టీవీలు, చాటింగ్, సినిమాలు, షికార్లు వదులుకోవాలి. ఎండలో ఎక్కువ సమయం తిరగొద్దు. నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు అధికంగా తీసుకోవాలి. తల్లిదండ్రులకు సూచనలు.. పరీక్షలు అయ్యేవరకు పిల్లలను పెళ్లిళ్లు, శుభకార్యాలయాలకు తీసుకెళ్లవద్దు. పరీక్షల సమయంలో తల్లిదండ్రులు పిల్లలను మందలించవద్దు. ఇతర పిల్లలతో పోల్చి తక్కువ చేయొద్దు. మార్కులు ఎక్కువ రావాలని ఒత్తిడి తేవొద్దు. తల్లిదండ్రులు గొడవ పడవద్దు. పిల్లలు చదువుకునేందుకు వీలుగా ప్రశాంత వాతావరణం కల్పించాలి. పిల్లల్ని ప్రోత్సహించాలి. ఎస్సెస్సీ హాల్‌టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోండి పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం వెబ్సైట్లో హాల్ టిక్కెట్లను అందబాటులో ఉం చినట్లు డీఈవో రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఠీఠీఠీ.ఛట్ఛ్చఞ.ౌటజ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. జిల్లా, పాఠశాల, విద్యార్థి పేరు నమోదు చేసి ఆన్లైన్ నుంచి హాల్‌టిక్కెట్ పొందవచ్చన్నారు. పరీక్ష కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్లు ఈ హాల్ టిక్కెట్లను అనుమతించాలన్నారు.