సాక్షి, ప్రకాశం జిల్లా: జూన్ 7 నుంచి టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యంతో పాటు విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అన్నారు. ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ అవ్వాలని సూచించారు. రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేష్ తెలిపారు.
చదవండి: వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: ఆళ్ల నాని
ప్రభుత్వం నిర్ణయంపై మంత్రి అంజాద్ బాషా హర్షం
Comments
Please login to add a commentAdd a comment