![Andhra Pradesh: SSC Exams Will be Conducted as per Schedule: Adimulapu Suresh - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/10/Tenth-class-exams.jpg.webp?itok=jy4HqMNf)
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో షెడ్యూల్ ప్రకారమే పదో తరగతి పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఆయన బుధవారమిక్కడ మాట్లాడుతూ.. తెలంగాణలో పరిస్థితులకు మనకు తేడా ఉంది. కరోనా వైరస్ నియంత్రణలో దేశంలోనే మన రాష్ట్రం ఆదర్శంగా ఉంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రత విషయంలో రాజీపడం. టెన్త్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయి’ అని స్పష్టం చేశారు.
కాగా మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలు కరోనా, లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు నిర్వహించనుంది. ప్రతి పేపర్‌కు 100 మార్కులు ఉంటాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టులకు సంబంధించి ఒక్కో పేపర్ మాత్రమే ఉంటుంది. ఇక కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు విద్యార్థులందరినీ ప్రమోట్ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇదివరకే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. (ఆ మూడింటి ఆధారంగా టెన్త్ అప్‌గ్రేడ్!)
కాగా తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు అయిన విషయం విదితమే. ఇంటర్నల్ మార్కుల ఆధారంగా టెన్త్ విద్యార్థులను పాస్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఫలితాల వెల్లడిపై ప్రభుత్వ పరీక్షల విభాగం దృష్టి పెట్టింది. తమ వద్ద ఉన్న విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను ప్రాసెస్ చేసే ప్రక్రియను 10–12 రోజుల్లో పూర్తి చేసి ఫలితాలను వెల్లడించేందుకు బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. (తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రద్దు)
Comments
Please login to add a commentAdd a comment