
తొలి రోజు 98.27 శాతం హాజరు
సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు మొదటి లాంగ్వేజ్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్‌రామరాజు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 6,27,277 మంది విద్యార్థులకు గాను 6,16,451 మంది(98.27 శాతం) హాజరయ్యారని పేర్కొన్నారు. 3,450 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా.. 1,545 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్లు తనిఖీ చేశాయని తెలిపారు. కర్నూలు జిల్లాలో కాపీయింగ్‌కు పాల్పడిన ఇద్దరు విద్యార్థులను డిబార్ చేసినట్లు వెల్లడించారు.
కాంపోజిట్‌కు బదులు జనరల్ పేపర్ రాసిన విద్యార్థిని!
తెనాలిఅర్బన్ : పదో తరగతి పరీక్షల్లో అపశృతి దొర్లింది. కాంపోజిట్ తెలుగు పరీక్ష రాయాల్సిన విద్యార్థిని జనరల్ తెలుగు పేపరు రాసింది. విద్యాశాఖ అధికారుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌లోని ఎన్‌ఎస్‌ఎస్‌ఎంహెచ్ స్కూ ల్లో కే ధనశ్రీ ³దో తరగతి పరీక్షలు రాసేందుకు సోమవారం పాఠశాలకు వచ్చింది.
ఆమె కాంపోజిట్ తెలుగు పరీక్ష రాయాల్సి ఉండగా.. ఇన్విజిలేటర్ పొరపాటున జనరల్ తెలుగు పేపరు ఇచ్చారు. విద్యార్థిని కూడా సకాలంలో గుర్తించకుండా పరీక్ష రాసేసింది. చివరి సమయంలో గుర్తించి.. విషయాన్ని ఇన్విజిలేటర్‌కు తెలియజేసింది. అప్పటికే సమయం మించిపోవడంతో చేసేది లేక ఉన్నతాధికారులకు విషయాన్ని తెలియజేసి.. రాసిన పేపరును పరిగణనలోకి తీసుకునేలా చూస్తామని ఇన్విజిలేటర్ చెప్పారు. దీనిపై విచారణ జరిపిన డీఈవో సీవీ రేణుక.. ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేశారు. విద్యార్థికి ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని డీఈవో ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment