ssc students
-
టెన్త్ విద్యార్థులకు మేలు జరిగేలా ఏపీ ఎస్ఎస్ సీ బోర్డు చర్యలు
-
పదో తరగతి విద్యార్థుల డేటా తయారీ పదిలం
శ్రీకాకుళం న్యూకాలనీ: పదో తరగతి విద్యార్థుల డేటా తయారీని పకడ్బందీగా చేపట్టేందుకు ప్రభు త్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే విద్యార్థుల పరీక్ష ఫీజుల చెల్లింపుల పర్వం దాదాపుగా పూర్తయ్యింది. జిల్లాలో 589 ఉన్నత పాఠశాలల్లో 30214 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. ఇందు లో ప్రభుత్వ బడుల నుంచి 22979 మంది, ప్రైవేటు స్కూల్స్ నుంచి 7,235 మంది విద్యార్థులు ఉన్నారు. పక్కాగా, పారదర్శకంగా ఉండేందుకు.. ఏప్రిల్ 3వ తేదీ నుంచి మొదలుకానున్న టెన్త్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల డేటాతోపాటు వారి వ్యక్తిగత సమాచారం పక్కగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అయితే భవిష్యత్‌లో విద్యార్థుల మార్క్స్ మెమోలో తలెత్తే తప్పులకు సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులే బాధ్యులని అధికారులు పేర్కొంటున్నారు. అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పాఠశాల విద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. నామినల్స్ సవరణకు అవకాశం పదో తరగతి విద్యార్థుల నామినల్ రోల్స్ సవరణకు ప్రభ్వుతం సన్నద్ధమైంది. దీంతో విద్యార్థుల వ్యక్తిగత సమాచారం ముఖ్యంగా విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, జన్మదినం, మీడియం, వారి ఫొటో, సంతకం, ఆధార్ కార్డు నంబర్, పుట్టుమచ్చలు, మొ దటి, ద్వితీయ భాష, తదితర సమాచారం పక్కాగా ఉండేలా చూడాలని పాఠశాల విద్య కమిషనర్ ఆదేశించారు. దీంతో ఒకవేళ పొరపాటున కంప్యూటర్లో డేటానమోదు సమయంలో తలెత్తిన దోషాలు, తప్పుల సవరణకు ఈనెల 11 నుంచి 20వ తేదీ వరకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఇందుకు పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయుల లాగిన్‌లో ‘ఎడిట్’ ఆప్షన్‌ను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే పీహెచ్సీ విద్యార్థుల సర్టిఫికెట్ అప్లోడ్ చేసిన కాపీని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంబంధిత సెక్షన్లో ఒరిజినల్, జిరాక్స్ కాపీలను ఈ నెల 25వ తేదీలోగా తీసుకువచ్చి ధ్రువీకరించుకుని వెళ్లాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి జిల్లాలోని పదో తరగతి విద్యార్థుల నామినల్ రోల్స్‌లో తప్పులు, దోషాలు ఉంటే వాటిని సరిచేసేందుకు ప్రభుత్వం ఎడిట్ ఆప్షన్‌ను ఇచ్చింది. ఈనెల 20వ తేదీ వరకు ఈ అవకాశం ఉంది. హెచ్ఎంల లాగిన్‌లో ఎడిట్ చేసుకోవచ్చు. భవిష్యత్‌లో విద్యార్థుల డేటాలో ఉండే తప్పులకు హెచ్ఎంలే బాధ్యులవుతారు. ఒకటికి రెండు సార్లు విద్యార్థుల డేటాను సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. – గార పగడాలమ్మ, డీఈఓ శ్రీకాకుళం -
మార్కుల మాయ.. ఇష్టానుసారంగా ఇంటర్నల్ మార్కులు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెలలో టెన్త్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు అన్ని ప్రైవేటు స్కూళ్లు టెన్త్ విద్యార్థులకు అశాస్త్రీయంగా అంతర్గత మార్కులు వేశాయనే ఆరోపణలు రావడం, ప్రతి స్కూల్ నుంచీ ప్రతి విద్యార్థికీ గరిష్ట మార్కులు రావడంపై ఫిర్యాదులు అందడంతో వాస్తవ పరిస్థితిని తెలుసుకొనేందుకు ప్రైవేటుతోపాటు ప్రభుత్వ స్కూళ్లలోనూ క్షేత్రస్థాయి విచారణకు పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఇందుకోసం ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక పరిశీలన బృందాలను ఏర్పాటు చేయాలంటూ అన్ని ప్రభుత్వ స్కూళ్లు, మండల విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవాలు పరిశీలించాకే స్కూళ్లు పంపిన మార్కులను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. అసలేం జరిగింది? తెలంగాణలో మే 23 నుంచి టెన్త్ పరీక్షలు జరగనుండగా ప్రతి పేపర్ 80 మార్కులకే ఉండనుంది. మరో 20 మార్కులను విద్యార్థుల ప్రావీణ్యత ఆధారంగా స్కూళ్లు కేటాయించే అంతర్గత మార్కులతో పాఠశాల విద్యాశాఖ కలపాలి. ఇందుకోసం ఆయా స్కూళ్లు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ) పేరిట ప్రతి విద్యార్థి చేసే ప్రాజెక్టు వర్క్, స్కూల్లో నిర్వహించే స్లిప్ టెస్ట్ ప్రకారం మార్కులు ఇవ్వాల్సి ఉంది. ఇలా గుర్తించిన మార్కులను ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు ఆన్లైన్ ద్వారా టెన్త్ పరీక్షల విభాగానికి డీఈవోల ద్వారా పంపాలి. కానీ ఇవేవీ నిర్వహించకుండానే ప్రైవేటు స్కూళ్లు ఇష్టానుసారం 20 మార్కులకు గరిష్టంగా 19 మార్కులు కూడా వేయడం, దాదాపు అన్ని ప్రైవేటు స్కూళ్లలోనూ ఇదే పద్ధతి కనిపించడం అనుమానాలకు కారణమైంది. స్కూల్ పరిధిలో నిర్వహించిన ఫార్మేటివ్ టెస్ట్‌లో విద్యార్థికి అతితక్కువ మార్కులు వచ్చినా, ప్రాజెక్టు వర్కే చేయకపోయినా గరిష్ట మార్కులు వేశారని, కొన్ని ప్రైవేటు స్కూళ్లు విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు కూడా చేశాయంటూ ఉన్నతాధికారులకు ఆరోపణలు అందినట్లు తెలియవచ్చింది. దీంతో వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు అధికారులు రంగంలోకి దిగారు. తనిఖీల తర్వాతే మార్కుల ఖరారు.. పాఠశాలలు పొందుపర్చిన ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులను పరిశీలించేందుకు ప్రతి మండల పరిధిలో ఓ ప్రధానోపాధ్యాయుడి నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రతి సబ్జెక్టు నుంచి ఒక ఉపాధ్యాయుడు ఉంటారు. కేటాయించిన స్కూళ్లకు ఈ బృందం వెళ్లి విద్యార్థి ఏడాదిపాటు రాసిన నోట్‌బుక్స్ (ఇందులో రాత విధానం గుర్తిస్తారు), సమాధాన పత్రాలను తనిఖీ చేయనుంది. అవసరమైతే విద్యార్థితో ముఖాముఖి మాట్లాడి మార్కులను ఖరారు చేయనుంది. ఈ పరిశీలన పూర్తయిన తర్వాత ప్రత్యేక బృందాలు ఇచ్చే నివేదికల ఆధారంగానే ఇంటర్నల్ మార్కులను పాఠశాల విద్యాశాఖ నిర్ణయించనుంది. ప్రాజెక్టు వర్క్ ఏం చేయించారు? ఎలా చేయించారు? వాటి ఫలితాలను విద్యార్థి ఎలా విశ్లేషించారనే అంశాలకు ఈ బృందాలు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి. అయితే ఈ పరిశీలనపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వచ్చే నెలలో పరీక్షలు జరగాల్సి ఉండగా ఇప్పుడు హడావిడిగా క్షేత్రస్థాయి పరిశీలన ఎలా వీలవుతుందని, ప్రైవేటు స్కూళ్లు తనిఖీ బృందాలను మేనేజ్ చేసుకుంటే పరిస్థితి ఏమిటనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మంది టెన్త్ విద్యార్థులుండగా 3 లక్షల మంది ప్రైవేటు స్కూళ్లలోనే ఉన్నారు. అంత మంది విద్యార్థుల రికార్డులను ప్రత్యేక బృందాలు పరిశీలించడం ఆచరణ సాధ్యమేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలి విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించడానికే ఇంటర్నల్ అసెస్మెంట్ మార్కులు ఇస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్లో ఎక్కడ చదివినా ఆ విద్యార్థి సామర్థ్యాన్ని నిష్పాక్షికంగా గుర్తించగలగాలి. ఇది సాధ్యం కావాలంటే మొదట్నుంచీ పూర్తిస్థాయి పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. –పి. రాజభాను చంద్రప్రకాశ్, ప్రభుత్వ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కార్పొరేట్ మాయాజాలమే ప్రభుత్వ స్కూళ్లలో సామర్థ్యాన్ని బట్టే విద్యార్థులకు మార్కులొస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లలో ఇదో పెద్ద మాయాజాలం. అసెస్మెంట్ పరీక్ష పేపర్ ఇచ్చి దగ్గరుండి సమాధానాలు రాయిస్తున్నారు. పదికి పది జీపీఏ సాధించడం కోసమే ఇదంతా చేస్తున్నారు. – చావా రవి, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి -
కొత్తగా పదో తరగతిలో చేరిన విద్యార్థులకు గుడ్‌న్యూస్..
సాక్షి, ఎడ్యుకేషన్: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పదో తరగతి జాయిన్ అయిన విద్యార్థులకు ఎడ్యుకేషన్.సాక్షి.కామ్ అందిస్తున్న సువర్ణావకాశం. కొత్తగా చేరిన విద్యార్థులకు ఈవిధంగా సందేహాలు ఉండోచ్చు. పదో తరగతి సిలబస్ ఎలా ఉంటుంది..? స్టడీమెటీరియల్ ఎక్కడ దొరుకుంది.? టెక్ట్స్ బుక్స్ కావాలంటే ఎలా..? పబ్లిక్ పరీక్షల మోడల్ పేపర్స్, ప్రివియస్ పేపర్స్ ఎక్కడ అందుబాటులో ఉంటాయి..? పదో తరగతి తర్వాత బెస్ట్ కెరీర్ ఎంచుకోవడం ఎలా..? ఎలా చదవాలి? ప్రిపరేషన్ ఎలా ప్రారంభించాలి? ...ఇంకా ఇలాంటి ఎన్నో సందేహాలు సరైన సమాధానం ఇచ్చే సరైన వేదిక education.sakshi.com. పైన సంబంధించిన తాజా పూర్తి క్వాలిటీ సమాచారం ఉచితంగా ఎడ్యుకేషన్.సాక్షి.కామ్‌లో అందుబాటులో ఉంది. ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు మోడల్ పేపర్స్, స్టడీమెటీరియల్, గైడెన్స్ మొదలైనవి ప్రిపేర్ చేశారు. అలాగే గైడెన్స్ వీడియోలు, తాజా టెన్త్ క్లాసు సమాచారం కూడా ఈ కొత్త వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే education.sakshi.comలో మీకు కావాల్సిన సమాచారం తెలుకోండి. ఏపీ పదో తరగతి స్టడీమెటీరియల్, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రివియస్ పేపర్స్,కెరీర్ గైడెన్స్, ప్రిపరేషన్ టిప్స్ మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి తెలంగాణ పదో తరగతి స్టడీమెటీరియల్, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రివియస్ పేపర్స్,కెరీర్ గైడెన్స్, ప్రిపరేషన్ టిప్స్ మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి -
‘పది’ విద్యార్థులకు సెలవులు: ఫోన్లో నిత్యం అందుబాటులో
సాక్షి, అమరావతి: కోవిడ్–19 ప్రభావంతో తీవ్రంగా నష్టపోయినవారిలో మొదటి వరుసలో పదోతరగతి విద్యార్థులు ఉంటారు. విద్యా సంవత్సరంలో సగం కరోనాతో పాఠశాలలు మూతపడ్డాయి. మిగతా సగం పూర్తవకముందే మరోసారి మహమ్మారి విరుచుకుపడటంతో ఉన్నపళంగా మే ఒకటో తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరముంది. ఆదమరిస్తే ఫలితాలు తారుమారయ్యే ప్రమాదమున్నందున సెలవు రోజుల్లో విద్యార్థులు బడి లేదన్న భావనతో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా జాగ్రత్తగా చదువుకుంటేనే మంచి మార్కులు తెచ్చుకోగలుగుతారని ఉపాధ్యాయులు సలహా ఇస్తున్నారు. కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇంటిపట్టునే ఉండి మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 61,589 మంది విద్యార్థులు పరీక్షల రాయటానికి సిద్ధంగా ఉన్నారు. కీలకమైన నెలలో సెలవులు... గతేడాది సెప్టెంబర్‌లో 9, 10 తరగతుల విద్యార్థులకు సందేహాల నివృత్తి కోసం పాఠశాలలు తెరచినా డిసెంబర్ నుంచే పూర్తి స్థాయిలో తరగతిలో పాఠాలు చెప్పగలిగే అవకాశం వచ్చింది. కరోనా కారణంగా కొంత సమయం కోల్పోవడంతో ప్రభుత్వం విద్యా సంవత్సరాన్ని కొంతమేరకు పొడిగించింది. సాధారణంగా మార్చి మూడో వారంలో ప్రారంభం కావాల్సిన పదో తరగతి పరీక్షలను ఈ ఏడాది జూన్ ఏడు నుంచి 16వ తేదీ మధ్య నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేసింది. విద్యార్థులు పరీక్షలను ఎదుర్కోవడానికి కీలకమైన ఆఖరి నెల రోజులు కరోనా కారణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాల్సి రావడంతో వారి చదువుపై తీవ్రంగా ప్రభావం చూపనుంది. పబ్లిక్ పరీక్షల ముందు సన్నాహక పరీక్షలు, సబ్జెక్టుల వారీగా విశ్లేషణ చేసుకోవడం, సందేహాలను నివృత్తి చేసుకోవాల్సిన సమయంలో సెలవులు విద్యార్థులకు ఇబ్బందికరమే అయినా దానిని సరైన ప్రణాళికతో అధిగమించాల్సిన అవసరముంది. అలసత్వం వహిస్తే అసలుకే మోసం.. వరుస సెలవులతో విద్యార్థుల్లో అలసత్వం, అశ్రద్ధ సహజంగానే ఏర్పడతాయి. సంవత్సరమంతా కష్టపడి చదివింది మర్చిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా పిల్లల్లో అలసత్వం వహించి అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. పరీక్షల సమయంలో సాధారణంగా విద్యార్థులు చదివిన పాఠ్యాంశాలను పునశ్చరణ చేసుకుంటూ ఉంటారు. ప్రైవేట్ పాఠశాలల్లో అయితే ఉపాధ్యాయులు విద్యార్థులను రాత్రీపగలు పాఠశాలల్లోనే పుస్తకాలతో కుస్తీ పట్టిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో విద్యార్థులకు అలాంటి అవకాశం లేదు. డిజిటల్ వేదికగా అందుబాటులో ఉపాధ్యాయులు.. సెలవుల కారణంగా విద్యార్థులు చదువులో వెనుకబడకుండా ఉండేందుకు ఉపాధ్యాయులు వాట్సాప్‌ను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఫోన్లో మాట్లాడి సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు. నమూనా ప్రశ్నపత్రాలను తయారు చేసి వాట్సాప్ గ్రూపుల్లో విద్యార్థులకు చేరవేస్తున్నారు. పలు పాఠ్యాంశాలకు చెందిన వీడియోలను షేర్ చేస్తున్నారు. అనుమానాలను నివృత్తి చేయడానికి ఉపాధ్యాయులు ఫోన్లో రికార్డ్ చేసి పిల్లల మొబైల్‌కు పంపుతున్నారు. ఈ సదుపాయాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు. సెలవులను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే సబ్జెక్టుల వారీగా విద్యార్థులు పట్టు సాధించవచ్చని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు తగిన ఏర్పాట్లు చేయాలి... పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వారికి బలవర్థకమైన ఆహారం అందిస్తూనే కోవిడ్ బారిన పడకుండా కనిపెట్టుకోవాలని పేర్కొంటున్నారు. సందేహాలు నివృత్తి చేసుకునేలా పిల్లలను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. ఫోన్లో నిత్యం అందుబాటులో... పదో తరగతి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండాలి. విద్యార్థులు అలసత్వం ప్రదర్శిస్తే ఫలితాలు తారుమారయ్యే ప్రమాదముంది. విద్యార్థులు ఒక్కో సబ్జెక్టుకు రోజులో కొంత సమయాన్ని కేటాయించేలా టైం టేబుల్ వేసుకుని రివిజన్ చేసుకోవాలి. ఉపా«ధ్యాయులందరం విద్యార్థులకు నిత్యం ఫోన్లో అందుబాటులో ఉంటున్నాం. వారికి సందేహం వస్తే ఫోన్ ద్వారా నివృత్తి చేస్తున్నాం. వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి మోడల్ పేపర్లు, చార్టులను షేర్ చేస్తున్నాం. – సీహెచ్ సుమతి, గణిత ఉపాధ్యాయురాలు, జెడ్పీ హైస్కూల్, దొనపూడి, కొల్లూరు మండలం సెలవులను సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థులు కరోనా బారిన పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. ఈ నెల రోజులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఉపాధ్యాయులు వాట్సాప్, ఫోన్ కాల్స్ ద్వారా నిత్యం విద్యార్థులకు అందుబాటులో ఉంటున్నారు. విద్యార్థులకు ఎంతో కీలకమైన ఈ నెలలో ఆలసత్వం వహిస్తే తీవ్రంగా నష్టపోతారు. జాగ్రత్తగా సబ్జెక్టుల వారీగా రివిజన్ చేసుకోవాలి. పిల్లలు చదువుకొనే వాతావరణాన్ని తల్లిదండ్రులు కల్పించాలి. విద్యార్థులు ఇంటిపట్టునే ఉంటూ కరోనా బారిన పడకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. – ఆర్ఎస్ గంగాభవానీ, డీఈఓ చదవండి: తిరుపతి ఉప ఎన్నికపై పిటిషన్ల కొట్టివేత -
టెన్త్ విద్యార్థులకు శుభవార్త..!
సాక్షి, హైదరాబాద్: పదో తరగతిలో 11 ప్రశ్నపత్రాలకు బదులు ఆరు ప్రశ్నపత్రాల విధానాన్ని అమలు చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ ఆమోదం కోసం ప్రతిపాదనలను పంపించింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ప్రత్యక్ష విద్యా బోధన లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే ఏప్రిల్/మేలో నిర్వహించే టెన్త్ పరీక్షల్లో ఆరు ప్రశ్నపత్రాల విధానాన్ని అమలు చేస్తామని ప్రతిపాదించింది. ప్రస్తుతం తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో రెండు పేపర్ల చొప్పున ఉండగా హిందీ మాత్రం ఒకే పేపర్ ఉంది. ఇకపై సబ్జెక్టుకు ఒక పేపరే ప్రశ్నపత్రం ఉండేలా చర్యలు చేపట్టనుంది. ఇక ఇంటర్ పరీక్షలను ఏప్రిల్‌లో నిర్వహించాలని యోచిస్తోంది. ముందుగా 9, 10 తరగతులకు... పాఠశాలల్లో ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభంపై ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తనను కలిసిన మీడియా ప్రతినిధులకు చెప్పారు. ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభించాలని భావించినా ప్రస్తుత చలికాలంలో కరోనా వ్యాప్తి ఎలా ఉంటుందో తెలియని పరిస్థితుల్లో ప్రత్యక్ష విద్యా బోధనపై నిర్ణయం తీసుకోలేదన్నారు. జనవరి మొదటి వారంలో లేదా సంక్రాంతి తర్వాత 9వ తరగతి నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని, దీనిపై సీఎం కేసీఆర్‌తో చర్చించాక తుది నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించారు. 9, 10 తరగతుల వారికి కనీసం మూడు నెలలపాటు ప్రత్యక్ష బోధన ఉండేలా చూస్తామన్నారు. వాటితోపాటు జూనియర్ కాలేజీల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభానికి చర్యలు చేపడతామన్నారు. ఆ తరువాత దశలవారీగా కింది తరగతుల వారికి ప్రత్యక్ష బోధనకు నిర్ణయం తీసుకోనున్నారు. యూనివర్సిటీల వీసీల నియామకాలకు సంబం ధించిన ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలో∙నియామకాలు చేపడతామన్నారు. (చదవండి: 33 సార్లు ఫెయిల్.. కరోనాతో పాస్) ఆన్లైన్లో టెట్? టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో అంతకంటే ముందుగానే టెట్ నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అయితే ఈసారి టెట్‌ను ఆన్లైన్లో నిర్వహించేలా సీఎం ఆమోదం కోసం ప్రతిపాదనలను పంపామన్నారు. -
'బాయ్స్ లాకర్ రూమ్'లో కొత్త ట్విస్ట్
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'బాయ్స్ లాకర్ రూమ్' కేసులో కొత్త ట్విస్ట్ బయటపడింది. తమ క్లాస్మేట్స్ అమ్మాయిల బాడీ షేమింగ్‌పై మాట్లాడుతూ గ్యాంగ్ రేప్ చేద్దాం అంటూ కొందరు విద్యార్థులు చేసిన గ్రూప్ చాట్ సర్వత్రా చర్చనీయాంశమైంది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. ఓ టీనేజీ అమ్మాయే అబ్బాయిగా ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి అబ్బాయిలతో చాట్ చేసినట్లు విచారణలో తేలింది. తన శరీరంపై తానే అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, దానికి అబ్బాయిలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలని తాను ఈ పని చేసినట్లు పేర్కొందని ఢిల్లీ సైబర్ పోలీసులు వెల్లడించారు. తన పేరు సిద్దార్థ్‌గా పరిచయం చేసుకొని తన శరీరంపై అసభ్యకర వ్యాఖ్యలు చేసింది. దానికి అబ్బాయి ఎలా రియాక్ట్ అవుతాడో దాన్ని బట్టి తన క్యారెక్టర్ తెలుసుకోవచ్చని సదరు టీనేజీ అమ్మాయి విచారణలో పేర్కొంది. (డర్టీ ఛాట్ ) కొంతమంది టీనేజీ విద్యార్థులు ఇన్‌స్టాగ్రామ్‌లో బాయ్స్ లాకర్ రూం అనే అకౌంట్ క్రియేట్ చేసి తమ క్లాస్మేట్స్ అమ్మాయిల బాడీ షేమింగ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ చాటింగ్ చేసిన ఘటన తెలిసిందే. వీరంతా ఢిల్లీలోని ప్రముఖ స్కూల్లో చదువుతున్న వారే. గ్యాంగ్ రేప్ చేద్దామంటూ సదరు విద్యార్థులు చాట్ చేసిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీరంతా 18 ఏళ్లు అంతకంటే తక్కువ వయసు ఉన్నవారే. అమ్మాయిల ఫోటోలు అశ్లీలంగా మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా గ్రూప్‌లో చర్చించుకున్నారు. దీనికి సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులు 24 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. (‘బాయ్స్ లాకర్ రూం’ తరహాలో.. ఆ యూనివర్సిటీలో ) -
అమ్మా తప్పు చేశానా?
మంచివాళ్లనుకున్న అబ్బాయిలు మంచి స్కూళ్లలోని అబ్బాయిలు మంచి కుటుంబాల అబ్బాయిలు ఇలా ఎలా చేయగలుగుతారు?.. మోనా తల్లి విస్మయం. మోనాకైతే లోకం మీదే నమ్మకం పోయింది. టీనేజ్‌లో ఉన్న అమ్మాయి వందల్లో ఫాలోవర్స్ ఉన్న అమ్మాయి వేల లైక్స్ ఉండే అమ్మాయి బాయ్స్ దగ్గర తన మార్ఫింగ్ ఫొటోలు చూసి గదిలోకి వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తోంది. అబ్బాయిలూ.. ఆలోచించండి. ఏడిపించడం ఫన్ అవుతుందా?! ‘‘అమ్మా.. నేనేమైనా తప్పు చేశానా? నువ్వు వద్దంటున్నా వినకుండా ఫొటోలు షేర్ చేసి తప్పు చేశాను కదా..’’ గట్టిగా ఏడుస్తోంది మోనా (పేరు మార్చాం). పద్నాలుగేళ్ల అమ్మాయి. ఢిల్లీలో మంచి పేరున్న స్కూల్లో చదువుతోంది. ఇన్స్టాగ్రామ్ ‘బాయ్స్ లాకర్ రూమ్’ స్క్రీన్ షాట్స్‌లో మోనా మార్ఫింగ్ ఫొటో ఉంది. మోనాపై బాయ్స్ చేసిన బాడీ షేమింగ్ కామెంట్స్ ఉన్నాయి. వాటిని తనే తల్లికి చూపించింది. ‘‘లేదురా.. నువ్వు తప్పేం చేయలేదు. నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం కూడా లేదు. అబ్బాయిలదే తప్పు. నేను నీవైపే ఉన్నాను. వాళ్లకు బద్ధొచ్చేలా చేస్తాను’’ అన్నారు మోనా తల్లి. ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు. అబ్బాయిలు మళ్లీ ఇలాంటి పని చేయకుండా గట్టి శి„ý పడేలా చేయడానికి ఏమేమి చట్టాలు ఉన్నాయో పుస్తకాలు తిరగేయడం మొదలుపెట్టారు. ∙∙ ఇది ఢిల్లీలో జరిగిన ఘటన. అయితే మిగతా చోట్ల భవిష్యత్తులో బయట పడబోయే ఘటన కూడా కావచ్చు! ‘బాయ్స్ లాకర్ రూమ్’ అనే మాటను దేశం ఈ ఆదివారం తొలిసారిగా వినింది. ఇదేమీ భారత్‌పై ఉగ్రవాదులు తలపెట్టిన దాడుల ఆపరేషన్ పేరు కాదు. దేశవిద్రోహల కోడ్ లాంగ్వేజి కూడా కాదు. ఒక ఇన్స్టాగ్రామ్ గ్రూప్ అకౌంట్ పేరు. అందులో ఉన్నవాళ్లంతా పసితనం వీడని పద్నాలుగూ పదిహేనేళ్ల మగ పిల్లలే. ఢిల్లీలోని ఐదారు స్కూళ్లలోని వాళ్లు. వాళ్లలోనే ఒకరిద్దరు అడ్మిన్లు. ఆ అకౌంట్ చాట్ గ్రూప్‌లో జరిగే రహస్య సంభాషణలన్నీ తమ క్లాస్మేట్స్ అయిన ఆడపిల్లల గురించే! వాళ్ల ఫొటోలను షేర్ చేస్తారు. మార్ఫింగ్ చేస్తారు. కామెంట్స్ రాస్తారు. నవ్వుకుంటారు. వాటిల్లో బాడీ షేమింగ్ ఉంటుంది, రేపిస్టు మెంటాలిటీ ఉంటుంది. వీళ్ల చాటింగ్ స్క్రీన్ షాట్స్ కొందరు అమ్మాయిల (వాళ్లలో మోనా కూడా ఉంది) ఇన్‌స్టాగ్రామ్‌లో, ట్విట్టర్లో షేర్ అవడంతో ‘బాయ్స్ లాకర్ రూమ్’ సంగతి బయటపడింది. ఎదిగే వయసులో ఉన్న ఆడపిల్లల్ని మానసికంగా కృంగదీసి, వారి కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీసే చాటింగ్ అది. సున్నిత మనస్కులు తట్టుకోలేరు. కరోనా వైరస్‌ను వుహాన్‌లో మొదట ఒక చైనా నర్సు గుర్తించారు. అలా ఈ ప్రమాదాన్ని మనదేశంలో వెంటనే గుర్తించిన వ్యక్తి.. స్వాతీ మలీవాల్. ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్. ఢిల్లీపోలీసులకు, ఇన్స్టాగ్రామ్ సంస్థకు మర్నాడే.. అంటే సోమవారమే.. ఆమె నోటీసులు పంపారు. ఇలాంటి తత్వం ఉన్న మగపిల్లలకు తక్షణం ఒక బలమైన హెచ్చరిక వెళ్లాలి అని స్వాతి అనుకున్నారు. ∙∙ మంగళవారం ఉదయానికి పోలీసులు లాకర్ రూమ్ సభ్యుడొకరిని కనిపెట్టారు. పద్నాలుగేళ్ల విద్యార్థి అతడు. ఢిల్లీలో పేరున్న స్కూల్లో చదువుతున్నాడు. ‘రూమ్’ తాళం చెవిలా దొరికాడతడు. మిగతా సభ్యులు పేర్లు, వాళ్లు ఏయే స్కూళ్లలో చదువుతున్నదీ అతడి నుంచి, అతడి స్నేహితుల నుంచి పోలీసులు రాబట్టారు. వాళ్లలో ఒకరిద్దరు ఇంటర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఏప్రిల్ మొదటివారంలో ‘బాయ్స్ లాకర్ రూమ్’ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మొదలైంది. ఒకర్నుంచి ఒకరు జమ అయ్యారు. ఇద్దరు అడ్మిన్లు కాబట్టి గ్రూపు త్వరత్వరగా వృద్ధిచెందింది. గ్రూపు టాపిక్ ఒక్కటే.. అమ్మాయిలు.. అమ్మాయిలు.. అమ్మాయిలు! తెలిసిన అమ్మాయిలు. క్లాస్మేట్స్ అయిన అమ్మాయిలు! వాళ్ల ఫొటోలను సోషల్ మీడియా అకౌంట్ల నుంచి సంపాదించడం, ఇందులో షేర్ చేయడం. షేమింగ్ చేయడం! బుధ, గురువారాల్లో వీళ్లలో మరికొందరు బయటపడ్డారు. వీరిపైన ఏం చర్య తీసుకుంటారని తెలియకపోయినా, ఈ పిల్లల తల్లిదండ్రులు మాత్రం.. ‘పోలీసులు ఇంటికి రావడం’ అనే శిక్షను అనుభవిస్తున్నారు. లాక్‌డౌన్‌తో జువెనైల్ జస్టిస్ బోర్డు.. కేసులేమీ తీసుకోవడం లేదు. దాంతో పోలీసులు నిందిత విద్యార్థులను ప్రస్తుతానికి వాళ్ల తల్లిదండ్రుల అదుపులోనే ఉంచుతున్నారు. మొబైల్ ఫోన్స్ తీసేసుకున్నారు. తమకు తెలియకుండా వాళ్లను సిటీ బయటికి పంపించడం చేయకూడదని చెప్పి వెళుతున్నారు. బాయ్స్ లాకర్ రూమ్ చాట్‌లో తమ కూతుళ్ల ఫొటోలు ఉన్నాయని తెలుసుకున్న తల్లిదండ్రుల పరిస్థితీ దాదాపుగా అలానే ఉంది. ‘‘అమ్మా.. నా తప్పేమీ లేదు కదా’’ అని కూతురు అపరాధిలా అడగడం ఏ తల్లిని మాత్రం బాధించదు! ∙∙ తల్లి చెబుతున్న దానిని బట్టి మోనాకైతే ఈ అనుభవం తర్వాత లోకం మీదే నమ్మకం పోయింది! ‘నేనీ సమాజంలో ఉండలేను మమ్మీ’ అంటోంది. ‘ఫొటోలు షేర్ చెయ్యకమ్మా.. ఎవరైనా మిస్ యూజ్ చేస్తారు’ అని మొదట్లో తల్లి చెప్పినప్పుడు మోనా నవ్వింది. ‘పిచ్చి భయాలు మమ్మీ నీవన్నీ. మీ రోజుల్లో అలా ఉండేదేమో. బాయ్స్ ఇప్పుడు మర్యాదగా ఉంటున్నారు. గర్ల్స్‌ని, ఆడవాళ్లని రెస్పెక్ట్ చేస్తున్నారు’ అని మోనా అంది. ఇప్పుడు అదే బాయ్స్ ఆమె నమ్మకాన్ని వమ్ము చేశారు! ఎందుకిలా చేశారు అని అడితే.. ‘ఫర్ ఫన్’ అంటున్నారు! దుర్గంధం ఈ దర్గంధపూరిత ప్రవర్తనకు అబ్బాయిల తల్లిదండ్రులనే నిందించాలి. ఎవరికీ రెస్పెక్ట్ ఇవ్వక పోవడం మీ హక్కు అన్నట్లు అబ్బాయిల్ని పెంచుతున్నారు. బాయ్స్.. ఈ పనికి మీరు సిగ్గుపడాలి. – నటి సోనమ్ కపూర్ ఇంత విషమా! ఈ వయసులో ఇంత పురుషాహంకారం అంటే ఈ విషం ఎంతవరకూ పాకపోబోంది! అత్యాచారాలను ప్రేరేపించే ఇలాంటి ఆలోచనా ధోరణులను ఇప్పుడే అదుపులో పెట్టాలి. – నటి స్వరా భాస్కర్ -
టెన్త్ ఇంటర్నల్ మార్కులు రద్దు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల కేటాయింపు రద్దు చేయనున్నామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి మంగళవారం తెలిపారు. నిరంతర సమగ్ర మూల్యాంకన విధానం యథాతథంగానే కొనసాగిస్తూనే పబ్లిక్ పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు లేకుండా 100 మార్కులకే పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్నల్ మార్కులు కేటాయింపు విధానంలో లోపాలు ఉన్నాయి. పాఠశాలల్లో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వీటిని రద్దు చేయాలని పలువర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి. వీటిని పరిశీలించిన పాఠశాల విద్యాశాఖ ఈ ఇంటర్నల్ మార్కులను రద్దు చేసేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది. వీటికి ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ఇంటర్నల్ మార్కుల రద్దు అమల్లోకి వస్తుందని కమిషనర్ వివరించారు. మంగళవారం ఎస్సెస్సీ ఫలితాల విడుదల సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. వచ్చే ఏడాది నుంచి టెన్త్ ప్రశ్నపత్రం మోడల్లో కూడా మార్పులు ఉంటాయని, దీనిపై నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటున్నామని తెలిపారు. టెన్త్ మార్కుల్లో స్పోర్ట్సు కోటాకు కూడా కొన్ని మార్కులు కేటాయించాలని భావిస్తున్నామన్నారు. టెన్త్ ఫలితాల విడుదలలో పలు జాగ్రత్తలు తీసుకోవడంతో ఎలాంటి లోపాలు లేకుండా ధ్రువపత్రాలు జారీ కానున్నాయని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి జూన్ నుంచే నామినల్ రోల్స్‌ను స్కూళ్ల నుంచి తీసుకుంటామని తెలిపారు. ముందుగానే తప్పులను సవరించి ధ్రువపత్రాలు ఇవ్వడానికి వీలవుతుందన్నారు. జూన్ ఆఖరుకు డీఎస్సీ నియామకాలు డీఎస్సీ నియామకాలను జూన్ ఆఖరుకు పూర్తిచేసే అవకాశాలున్నాయని కమిషనర్ పేర్కొన్నారు. డీఎస్సీ ఫలితాలు ఇంతకు ముందే ప్రకటించినా.. ఎన్నికల కోడ్ వల్ల జిల్లాల వారీగా ఎంపిక జాబితాల ప్రకటన చేయలేదన్నారు. కొత్త ప్రభుత్వ ఆదేశాల ప్రకారం డీఎస్సీ నియామకాలపై చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త టీచర్ల నియామకానికి ముందే బదిలీల ప్రక్రియ ఉంటుందన్నారు. ఇదివరకటి దరఖాస్తులను అనుసరించి వీటిని చేస్తారన్నారు. సాధారణ బదిలీలు ఉండవని తెలిపారు. పాఠశాలల రేషనలైజేషన్ ప్రక్రియ కూడా ఉంటుందని చెప్పారు. -
ఆకలి చదువులు!
పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణత సాధించేందుకు ప్రతిరోజు ఉదయం.. సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో విద్యార్థులకు కాస్త ఆహారం అందిస్తే చదువుపై శ్రద్ధ పెడతారని భావించారు ఉన్నతాధికారులు. అల్పాహారం రూపంలో టీ, స్నాక్స్, ఉప్మా వంటి ఆహారం అందించాలని నిర్ణయించారు. అయితే దాతలెవరూ ముందుకురాకపోవడంతో జిల్లావ్యాప్తంగా విద్యార్థులు ఆకలితోనే చదువుకుంటున్నారు. కరీంనగర్‌ఎడ్యుకేషన్: పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం వద్ద నిధులు లేవని, అవసరమైతే ఆర్‌ఎంఎస్‌ఏ (రాజీవ్ సర్వశిక్ష అభియాన్) నిధులు వెచ్చించుకోవచ్చని ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. ఈ మేరకు డిసెంబర్ 28న కరీంనగర్ కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో.. ఉమ్మడి జిల్లాల పరిధిలోని ప్రధానోపాధ్యాయులతో సమావేశమయ్యారు. మార్చిలో జరిగే పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.45 నుంచి 5.45 గంటలవరకు నిర్వహించే ప్రత్యేక తరగతుల్లో భాగంగా విద్యార్థులకు అల్పాహారం అందించాలని సూచించారు. అయితే ఆ ఖర్చుకు సంబంధించి ప్రభుత్వం తరఫున ప్రత్యేక నిధులు ఏమీలేవని, ఆర్‌ఎంఎస్‌ఏ నిధుల నుంచి వాడుకోవచ్చునని కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రధానోపాధ్యాయులకు సూచించారు. మిగతాచోట్ల వీలునుబట్టి పాఠశాల యాజమాన్య కమిటీలు, గ్రామాల్లోని ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసి అల్పాహారం అందించేలా చూడాలన్నారు. కలెక్టర్ ఆదేశాలు ఇచ్చి 22 రోజులు గడుస్తున్నా.. ఇప్పటివరకు ఎక్కడా అల్పాహారం అందిస్తున్న దాఖలాలు లేవు. దీంతో విద్యార్థులు ప్రత్యేక తరగతులకు ఖాళీ కడుపులతోనే హాజరవుతున్నారు. జిల్లావ్యాప్తంగా 148 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి 4,850 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. విద్యార్థులకు ఉదయం గంట, సాయంత్రం గంట చొప్పున ప్రత్యేక తరగతులు నిర్వహించి మెరుగైన ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. పాఠశాలల్లో నవంబర్ నుంచి ఒకపూట, డిసెంబర్ నుంచి మార్చి 10 వరకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించేలా జిల్లా విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. తరగతుల నిర్వహణ విద్యార్థుల హాజరును వారంవారం పర్యవేక్షించేందుకు అధికారులను సైతం నియమించింది. ఉపాధ్యాయుల సహకారం, విద్యార్థుల శ్రమ, విద్యాశాఖ ప్రణాళికలు బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో విధానాలు అమలు కాకపోవడంతో గ్రామీణప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులు అల్పాహారం లేక ఆకలితోనే చదువులు వెళ్లదీస్తున్నారు. సాయంత్రం బడి ముగియగానే గంటపాటు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తుండడంతో మధ్యాహ్నం తిన్న భోజనంతో నీరసించిపోతున్నారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం విద్యార్థులకు అల్పాహరం పెట్టే విషయంలో స్పష్టత ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు సైతం పట్టింపు లేకుండా దాతల సహకారం కోసం వేచిచూస్తుండడం తో కాలం గడిచిపోతోంది. వీరే ఆదర్శం ♦ కరీంనగర్ నగరంలోని 16 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో మేయర్ రవీందర్‌సింగ్ గతేడాది సరస్వతీప్రసాదం పేరిట దాతల నుంచి విరాళాలు సేకరించారు. ఆ నిధులతో విద్యార్థులకు అల్పాహారం అందించారు. ♦ గంగాధర మండలం ఒద్యారంలో సర్పంచ్ కూనబోయిన అమ్మాయిసత్తయ్య సహకారంతో విద్యార్థులకు గతంలో అల్పాహారం అందించారు. ఈ ఏడాది కూడా అందిస్తున్నారు. ♦ తిమ్మాపూర్ మండలం నల్లగొండ పాఠశాల విద్యార్థులకు ఉపాధ్యాయులే చొరవ తీసుకుని అల్పాహారం అందిస్తున్నారు. -
టెన్త్ పరీక్షల్లో టాప్ గ్రేడ్ రావాలా..
⇒ రేపటి నుంచే సాక్షి మెయిన్‌లో.. ⇒ ప్రతిరోజూ 4పేజీల టెన్త్‌క్లాస్ స్పెషల్స్ ⇒ తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో.. ⇒ కనీసం ఏ గ్రేడ్ సాధించేలా స్టడీమెటీరియల్ ⇒ ముఖ్య ప్రశ్నలు–సమాధానాలు, సమగ్ర బిట్‌బ్యాంక్ హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో టాప్ గ్రేడ్ కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్న విద్యార్థులకు సాక్షి అండగా నిలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న లక్షల మంది విద్యార్థుల కోసం ప్రతిరోజూ మెయిన్ ఎడిషన్‌లో మొత్తం 4 పేజీలు.. రెండు పేజీలు ఇంగ్లిష్ మీడియం, రెండు పేజీలు తెలుగు మీడియం విద్యార్థుల కోసం కేటాయించనుంది. తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు సంబంధించి సిలబస్‌ను అనుసరించి ఆయా పేపర్ల వారీగా పరీక్షకు ముందురోజు స్టడీ మెటీరియల్ ప్రచురించనుంది. తెలంగాణ, ఏపీకి చెందిన తెలుగు, ఇంగిష్ మీడియం విద్యార్థుల కోసం అత్యంత అనుభవజ్ఞులైన నిపుణులు రూపొందించిన ముఖ్యమైన ప్రశ్నలు–సమాధానాలు, సమగ్ర బిట్ బ్యాంక్స్, ఎగ్జామ్ డే టిప్స్‌ను ఈనెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ అందించనుంది. -
పంచతంత్రం.. ఫలితం అద్భుతం
టెన్త్ విద్యార్థులకు 40 రోజుల ప్రణాళిక నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యం ఏలూరు సిటీ : పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ’పశ్చిమ’ అత్యుత్తమ ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ 40 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. ఈ విద్యాసంవత్సరంలో జిల్లా విద్యార్థులు అగ్రస్థానంలో నిలిచేందుకు ’పంచతంత్రం’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేసేందుకు వినూత్న కార్యక్రమాన్ని రూపొందించారు. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు జిల్లాలోని 30 వేల మంది ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను అందించారు. ఈ నేపథ్యంలో పంచతంత్రం పక్కాగా అమలు చేసి మంచి ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమష్టిగా కృషి చేసేందుకు సన్నద్ధమయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి డి.మధుసూదనరావు ఆధ్వర్యంలో పంచతంత్రాన్ని ప్రయోగించనున్నారు. 1) విద్యార్థుల వర్గీకరణ విద్యార్థులను సమ్మెటివ్ ఎసెస్మెంట్2 పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా నాలుగు గ్రేడులుగా విభజించారు. 034 శాతం మార్కులు సాధిస్తే పశ్చిమ ఆశాజ్యోతులు, 3570 శాతం పశ్చిమ బంగారాలు, 7190 శాతం పశ్చిమ వజ్రాలు, 91100 శాతం మార్కులు సాధిస్తే పశ్చిమ ఆణిముత్యాలుగా విభజించారు. ఈ గ్రేడుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి కనీసం ఉత్తీర్ణత సాధించేలా శిక్షణ ఇస్తారు. 2) విద్యార్థుల దత్తత ఆయా పాఠశాలల్లో ప్రతి ఉపాధ్యాయుడు కనీసం 5 నుంచి 10 మంది విద్యార్థులను దత్తత తీసుకోవాలి. ప్రతి గ్రూపులోనూ అన్నివర్గాల విద్యార్థులూ ఉంటారు. సబ్జెక్టుల్లో ఫెయిలవుతున్న విద్యార్థులను ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులే దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థులు ఏఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించి ఉదయం, సాయంత్రం ఒక్కో గంట సమయాన్ని కేటాయించి ప్రత్యేకంగా బోధించాలి. 3) మార్గదర్శక బృందాలు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు వారానికి రెండుసార్లు విద్యార్థుల ఇళ్లను సందర్శించాలి. విద్యార్థి తల్లీదండ్రీతో పిల్లల ప్రగతిని చర్చించాలి. రోజూ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకూ, వేకువజాము 5 గంటల నుంచి 6.30 గంటల వరకూ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి సందేహాలు నివృత్తి చేయాలి. వారానికి రెండు సార్లు ఇళ్లను సందర్శించాలి. మహిళా ఉపాధ్యాయులకు ఉదయం మినహాయింపు ఇచ్చారు. సోమవారం, గురువారంగణితం, పీఎస్, ఎన్ఎస్, మంగళవారం, శుక్రవారంఇంగ్లిష్, సోషల్, బుధవారం, శనివారంతెలుగు, హిందీ సబ్జెక్టు ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లను సందర్శించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. 4) వారాంతపు పరీక్షలు విద్యార్థులకు పంపిణీ చేసిన స్టడీ మెటీరియల్ మేరకు వారం రోజులు బోధించిన సబ్జెక్టుల్లో 25 మార్కులకు వారాంతపు పరీక్షలు నిర్వహించాలి. పంచతంత్రం వీక్లీ టెస్ట్‌లను ఆయా సబ్జెక్టు పీరియడ్స్‌లోనే నిర్వహించాలి. ఈ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులు, ప్రగతిని జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి నివేదించాలి. సోమవారంతెలుగు, మంగళవారంహిందీ, బుధవారంఇంగ్లిష్, గురువారంగణితం, శుక్రవారం సైన్సు, శనివారంసోషల్ సబ్జెక్టుల్లో పరీక్షలు నిర్వహించాలి. 5) స్టడీ క్యాంపులు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు వారి నివాస గ్రామాల ఆధారంగా ఆయా గ్రామాల్లో 1015 మంది విద్యార్థుల చొప్పున స్టడీ క్యాంపు ఏర్పాటు చేస్తారు. ఆ గ్రామంలో నివాసముంటున్న ఉపాధ్యాయులను కేర్‌టేకర్‌గా నియమిస్తారు. బాలురు, బాలికలకు వేర్వేరుగా స్టడీ క్యాంపులు నిర్వహిస్తారు. ఇవి రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు, ఉదయం 4.30 గంటల నుంచి 6.30 గంటల వరకూ ఉంటాయి. తరగతుల్లోనూ టెన్త్ విద్యార్థులకు ప్రత్యేకంగా లాంగ్ పీరియడ్స్ నిర్వహించి సబ్జెక్టులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక బోధన చేస్తారు. అత్యుత్తమ ఫలితాలే లక్ష్యం జిల్లా విద్యార్థులు టెన్త్ ఫలితాల్లో అత్యుత్తమ ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిచేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. 40 రోజుల ప్రణాళిక రూపొందించాం. జిల్లాలోని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారుల సమష్టి కృషితో మంచి ఫలితాలు సాధించేందుకు పంచతంత్రాన్ని తయారు చేశాం. విద్యార్థి భవిష్యత్‌కు అత్యంత కీలకమైన పబ్లిక్ పరీక్షల్లో వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తూ ప్రోత్సహించాలని నిర్ణయించాం. డి.మధుసూదనరావు, జిల్లా విద్యాశాఖ అధికారి