టెన్త్ పరీక్షల్లో టాప్ గ్రేడ్ రావాలా..
⇒ రేపటి నుంచే సాక్షి మెయిన్‌లో..
⇒ ప్రతిరోజూ 4పేజీల టెన్త్‌క్లాస్ స్పెషల్స్
⇒ తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో..
⇒ కనీసం ఏ గ్రేడ్ సాధించేలా స్టడీమెటీరియల్
⇒ ముఖ్య ప్రశ్నలు–సమాధానాలు, సమగ్ర బిట్‌బ్యాంక్
హైదరాబాద్:
పదో తరగతి పరీక్షల్లో టాప్ గ్రేడ్ కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్న విద్యార్థులకు సాక్షి అండగా నిలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న లక్షల మంది విద్యార్థుల కోసం ప్రతిరోజూ మెయిన్ ఎడిషన్‌లో మొత్తం 4 పేజీలు.. రెండు పేజీలు ఇంగ్లిష్ మీడియం, రెండు పేజీలు తెలుగు మీడియం విద్యార్థుల కోసం కేటాయించనుంది.
తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు సంబంధించి సిలబస్‌ను అనుసరించి ఆయా పేపర్ల వారీగా పరీక్షకు ముందురోజు స్టడీ మెటీరియల్ ప్రచురించనుంది. తెలంగాణ, ఏపీకి చెందిన తెలుగు, ఇంగిష్ మీడియం విద్యార్థుల కోసం అత్యంత అనుభవజ్ఞులైన నిపుణులు రూపొందించిన ముఖ్యమైన ప్రశ్నలు–సమాధానాలు, సమగ్ర బిట్ బ్యాంక్స్, ఎగ్జామ్ డే టిప్స్‌ను ఈనెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ అందించనుంది.