study material
-
గురి పెట్టాల్సిందే.. సెల్యూట్ కొట్టాల్సిందే..
సిద్దిపేట జోన్: వారంతా కొన్ని రోజులుగా కఠోరంగా పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం శ్రమిస్తున్నారు. ఆదివారం వారికి సిద్దిపేట పట్టణంలోని విపంచి ఆడిటోరియంలో ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా వ్యాఖ్యాత ఎజాజ్ అహ్మద్ యువతను ఉద్దేశించి ‘భవిష్యత్‌లో మీరు పోలీస్ అవుతారు. తుపాకీ ఎలా వినియోగించాలో ఒకసారి చూపించండి’అని కోరగా.. మంత్రి సమక్షంలో వారంతా ఒకేసారి రెండు చేతులతో తుపాకీ కాల్చే ప్రక్రియ చేసి చూపించారు. అది చూసిన మంత్రి అభినందన తరహాలో యువతకు సెల్యూట్ చేసి వారిని ప్రోత్సహిస్తూ లక్ష్యంతో పోలీస్ ఉద్యోగం సాధించాలని పిలుపునిచ్చారు. -
స్టడీ మెటీరియల్స్ దండగ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్స్‌తో పాటు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు సిఫార్సు చేస్తున్న స్టడీ మెటీరియల్స్‌పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యతలేని మెటీరియల్‌ను విద్యార్థులకు అంటగడుతున్నారని నిపుణుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి మెటీరియల్‌తో లాభం కన్నా నష్టమే ఎక్కువని, క్లిష్టమైన ప్రశ్నలకు సమా ధానాలు రాయడం కష్టమని వారు అభిప్రాయపడుతున్నారు. మూస విధానంలో, షార్ట్ కట్ పద్ధతిలో మెటీరియల్స్ ఉంటున్నాయని చెబుతున్నారు. కొన్ని మెటీరియల్స్ అడ్డగోలుగా, తప్పులతడకగా ఉంటున్నాయని.. అకడమిక్ పాఠ్య పుస్తకాల్లో చదివిన దానికి, మెటీరియల్స్‌లో ఇచ్చే దానికి పోలిక ఉండటం లేదని, దీనిపై వివరణ అడిగినా కోచింగ్ సెంటర్స్ సరిగా స్పందించట్లేదని అభ్యర్థులు అంటున్నారు. అంటగట్టేస్తున్నారు.. గ్రూప్స్‌కు ఉన్న డిమాండ్, అభ్యర్థుల్లో ఆత్రుతను కోచింగ్ కేంద్రాలు సొమ్ము చేసుకుంటున్నాయి. వాటిని ఎవరు రాశారు, రచయిత ప్రొఫైల్ ఏంటి అనే విషయాలను వెల్లడించలేదు. చరిత్ర మెటీరియల్స్‌లో చారిత్రక తేదీలు కూడా తప్పుగా ఇస్తున్నారని, అభ్యర్థులు గుర్తించి చెబితే అచ్చు తప్పులని దాటేస్తున్నారని అంటున్నారు. కోచింగ్ కేంద్రాలకు వెళ్లే అభ్యర్థులకు ఎక్కడ మెటీరియల్ కొనాలో నిర్వాహకులు సూచిస్తున్నారని, ఇదంతా వ్యాపారంగా సాగుతోందని నిపుణులు అంటున్నారు. డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులతో ముందే మాట్లాడుకుని, వారికి నెలకు కొంత ముట్టజెప్పి మెటీరియల్ రాయిస్తున్నట్టు తెలుస్తోంది. గ్రూప్స్ ప్రకటన విడుదలైన మర్నాటి నుంచి ఈ ప్రక్రియ మొదలైందని, ఎక్కడా నిష్ణాతులైన అధ్యాపకులను ఎంపిక చేసుకోలేదనే వాదన వినిపిస్తోంది. ఒక్కో అభ్యర్థి కేవలం మెటీరియల్ కోసమే రూ. 7 వేల వరకూ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అకాడమీ దగ్గర బారులు.. తెలుగు అకాడమీ స్టడీ మెటీరియల్‌లో నాణ్యత ఉందని, చాప్టర్లలో లోతైన విధానం కనిపిస్తోందని అన్ని వర్గాలు అంగీకరిస్తున్నా యి. నిష్ణాతులైన అధ్యాపకులతో గ్రూప్స్ సిలబస్ ప్రకారం మెటీరియల్ సిద్ధం చేయించినట్టు అభ్యర్థులు చెబుతున్నారు. అయితే తగినవిధంగా పుస్తకాలు అందుబాటులో లేవు. మెటీరియల్ ముద్రణ, పంపిణీలో జరిగిన జాప్యమే దీనికి కారణమని అకాడమీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే మెటీరియల్ విడుదలవగా విక్రయ కేంద్రం వద్ద అభ్యర్థులు బారులు తీరుతున్నారు. లాభాలే కొలమానంగా.. ప్రైవేటు కోచింగ్ కేంద్రాలు లాభాలే కొలమానంగా పనిచేస్తున్నాయి. అభ్యర్థులకు ఇచ్చే మెటీరియల్‌లో నాణ్యత కనిపించట్లేదు. ఇది వ్యాపారమైనప్పుడు నాణ్యత ఉంటుందని ఆశించడం కూడా సరికాదు. తెలుగు అకాడమీ లాభాపేక్ష లేకుండా పుస్తకాలు ముద్రిస్తుంది. కాబట్టి నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తుంది. ఈ పని ఓపెన్ వర్సిటీ కూడా చేయాలి. అక్కడ అవసరమైన వనరులున్నాయి. – ప్రొఫెసర్ హరగోపాల్ (సామాజిక వేత్త) ఎన్సీఈఆర్టీ పుస్తకాలు బెస్ట్ ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదివిన అభ్యర్థి గ్రూప్స్‌లో ఎలా ప్రశ్న వచ్చినా సమాధానం రాయగలడు. ప్రైవేటు స్టడీ మెటీరియల్ ఫాలో అయితే ప్రధాన పరీక్షలో తికమకపడటం ఖాయం. నాణ్యత కన్పించని ప్రైవేటు మెటీరియల్‌కు దూరంగా ఉండటమే మంచిది. – దండెబోయిన రవీందర్ (ఉస్మానియా వర్సిటీ వీసీ) డెప్త్ ఉండట్లేదు కోచింగ్ కేంద్రం వాళ్లు తాము చెప్పిన చోట మెటీరియల్ కొనాలని చెప్పారు. అకాడమీ మెటీరియల్‌కు, ప్రైవేటు స్టడీ మెటీరియల్‌కు అస్సలు పోలిక ఉండట్లేదు. లోతైన అవగాహన కనిపించట్లేదు. కొన్న తర్వాత గానీ ఈ విషయం తెలియట్లేదు. హిస్టరీలోనైతే సంఘటన తేదీలు కూడా తప్పుగా ముద్రించారు. చరిత్రలో వరుస సంఘటనల్లో కొన్ని తప్పించారు. దీంతో సబ్జెక్టు పూర్తిగా అర్థం కావట్లేదు. – సబ్బతి రమ్య (గ్రూప్స్ అభ్యర్థిని) -
బోర్డు మెటీరియల్ భేష్! కొన్ని సబ్జెక్టుల్లో 100 శాతం ప్రశ్నలు అక్కడి నుంచే..
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు జరిగిన ఇంటర్ పరీక్షల్లో బోర్డు ఇచ్చిన స్టడీ మెటీరియల్ విశ్వసనీయతను చాటుకుంది. ఇందులోంచే ఎక్కువ ప్రశ్నలు రావడంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే కొన్ని సబ్జెక్టుల్లో 100 శాతం ప్రశ్నలు బోర్డు మెటీరియల్ నుంచే రావడం విశేషం. ఈసారి చాయిస్ ఎక్కువ ఇవ్వడంతో సమాధానం తెలియని ప్రశ్నలను చాయిస్ కింద వదిలేసే అవకాశం ఉంది. అయితే చాయిస్లోని ప్రశ్నలు కూడా మెటీరియల్ నుంచే ఉంటున్నాయని విద్యార్థులు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి వల్ల ఆలస్యంగా ఇంటర్ తరగతులు మొదలయ్యాయి. దీంతో మారుమూల గ్రామాల విద్యార్థులు సరిగా పాఠాలు వినలేకపోయారు. అయితే వారిలో చాలా మంది బోర్డు మెటీరియల్‌ను అనుసరించడంతో పరీక్షలను తేలికగా రాయగలిగారు. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల్లోనూ ఇది స్పష్టంగా కనిపిస్తోంది. ► ఇంటర్ ఫస్టియర్ బోటనీ పేపర్లో సెక్షన్–ఏ నుంచి ఇచ్చిన 15 ప్రశ్నలు, సెక్షన్–బీలోని 14 ప్రశ్నలకు, సెక్షన్–సీలో 4 ప్రశ్నలూ మెటీరియల్లోనివే కావడం విశేషం. ► ఫస్టియర్ పొలిటికల్ సైన్స్ పేపర్లో సెక్షన్–ఏలో ఇచ్చిన ఏడు ప్రశ్నలూ బేసిక్ మెటీరియల్ నుంచే వచ్చాయి. సెక్షన్–బీలో 18 ప్రశ్నలకు 14, సెక్షన్–సీలో 25 ప్రశ్నలకు 21 ప్రశ్నలు బోర్డు మెటీరియల్ నుంచే వచ్చాయి. ► గణితం పేపర్లో సెక్షన్–ఏలో 15 ప్రశ్నలకు 11, సెక్షన్–బీలో 12 ప్రశ్నలకు 6, సెక్షన్–సీలో 10కి ఆరు ప్రశ్నలు మెటీరియల్లోనివే. ► ఇంటర్ సెకండియర్ బోటనీ పేపర్ సెక్షన్–ఏలో ఇచ్చిన 15కు 15 ప్రశ్నలు, సెక్షన్–బీలోని 14కు 14 ప్రశ్నలు, సెక్షన్–సీలో ఇచ్చిన 4 ప్రశ్నలూ మెటీరియల్ నుంచే రావడం విశేషం. ► పొలిటికల్ సైన్స్ పేపర్లోని సెక్షన్–ఏలో ఏడుకు ఏడు, సెక్షన్–బీలో 18కి 14, సెక్షన్–సీలో 25 ప్రశ్నలకు 19 ఇందులోంచే అడిగారు. ► సెకండియర్ గణితంలో సెక్షన్–ఏలో 15ప్రశ్నల కు 13, సెక్షన్–బీలో 12కు 6, సెక్షన్–సీలో పదికి 9 ప్రశ్నలు బేసిక్ మెటీరియల్ నుంచే వచ్చాయి. భయం పోయింది.. కరోనా వల్ల క్లాసులు రెగ్యులర్‌గా జరగకపోవడంతో పరీక్షలంటే కొంత భయం ఉండేది. నెల నుంచి బోర్డు స్టడీ మెటీరియల్ చదివాను. బోటనీ పేపర్లో ప్రశ్నలన్నీ మెటీరియల్ నుంచే వచ్చాయి. అనుకున్నదానికన్నా ఎక్కువ మార్కులు వస్తాయనే నమ్మకం కలిగింది. – వైద్యం అమర్త్య శాండిల్య, (ఇంటర్ సెకండియర్ విద్యార్థి, హైదరాబాద్) మెటీరియల్‌పై దృష్టి పెట్టండి.. ప్రతి విద్యార్థికీ ఇది కీలక సమయం. ప్రశ్నలన్నీ మెటీరియల్ నుంచే వస్తున్నాయి. మున్ముందు రాసే పేపర్లు కూడా ఇదే రీతిలో ఉండే వీలుంది. ఎక్కువ సమయం బోర్డ్ స్టడీ మెటీరియల్‌పై దృష్టి పెట్టండి. – ఉడిత్యాల రమణారావు (రీడర్, ఇంటర్ బోర్డ్) నూరు శాతం ఉపయోగపడాలనే.. కరోనా వల్ల జరిగిన విద్యా సంవత్సర నష్టం విద్యార్థుల పై పడకూడదనే బేసిక్ స్టడీ మెటీరియల్ అందించాం. ఇది 100% విద్యార్థులకు ఉపయోగపడాలన్న కోణంలోనే రూపొందించాం. విద్యార్థులు మానసిక ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేందుకు మెటీరియల్ దోహదపడాలన్నదే మా లక్ష్యం. మున్ముందు కూడా ఇదే రీతిలో స్టడీ మెటీరియల్ మేలు చేస్తుంది. – సయ్యద్ ఒమర్ జలీల్ (ఇంటర్ బోర్డ్ కార్యదర్శి) 75కు 70 మార్కులు గ్యారంటీ.. నెల నుంచి ఇంటర్ బోర్డు స్టడీ మెటీరియల్ చదివాను. ఎక్కువ ప్రశ్నలు అందులోంచే రావడంతో మ్యాథమెటిక్స్‌లో 75కు 70 మార్కులు వస్తాయనే నమ్మకం ఉంది. – టి. నిఖిత, ఇంటర్ సెకండియర్ విద్యార్థిని (వంగూర్, నాగర్‌కర్నూల్) -
కొత్తగా పదో తరగతిలో చేరిన విద్యార్థులకు గుడ్‌న్యూస్..
సాక్షి, ఎడ్యుకేషన్: తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల పదో తరగతి జాయిన్ అయిన విద్యార్థులకు ఎడ్యుకేషన్.సాక్షి.కామ్ అందిస్తున్న సువర్ణావకాశం. కొత్తగా చేరిన విద్యార్థులకు ఈవిధంగా సందేహాలు ఉండోచ్చు. పదో తరగతి సిలబస్ ఎలా ఉంటుంది..? స్టడీమెటీరియల్ ఎక్కడ దొరుకుంది.? టెక్ట్స్ బుక్స్ కావాలంటే ఎలా..? పబ్లిక్ పరీక్షల మోడల్ పేపర్స్, ప్రివియస్ పేపర్స్ ఎక్కడ అందుబాటులో ఉంటాయి..? పదో తరగతి తర్వాత బెస్ట్ కెరీర్ ఎంచుకోవడం ఎలా..? ఎలా చదవాలి? ప్రిపరేషన్ ఎలా ప్రారంభించాలి? ...ఇంకా ఇలాంటి ఎన్నో సందేహాలు సరైన సమాధానం ఇచ్చే సరైన వేదిక education.sakshi.com. పైన సంబంధించిన తాజా పూర్తి క్వాలిటీ సమాచారం ఉచితంగా ఎడ్యుకేషన్.సాక్షి.కామ్‌లో అందుబాటులో ఉంది. ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు మోడల్ పేపర్స్, స్టడీమెటీరియల్, గైడెన్స్ మొదలైనవి ప్రిపేర్ చేశారు. అలాగే గైడెన్స్ వీడియోలు, తాజా టెన్త్ క్లాసు సమాచారం కూడా ఈ కొత్త వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే education.sakshi.comలో మీకు కావాల్సిన సమాచారం తెలుకోండి. ఏపీ పదో తరగతి స్టడీమెటీరియల్, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రివియస్ పేపర్స్,కెరీర్ గైడెన్స్, ప్రిపరేషన్ టిప్స్ మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి తెలంగాణ పదో తరగతి స్టడీమెటీరియల్, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రివియస్ పేపర్స్,కెరీర్ గైడెన్స్, ప్రిపరేషన్ టిప్స్ మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి -
గుడ్‌న్యూస్: పదో తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్
సాక్షి, ఎడ్యుకేషన్: త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో టెన్త్ పబ్లిక్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్థుల సౌలభ్యం కోసం...స్టడీ మెటీరియల్, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, టెక్ట్స్‌బుక్స్, కెరీర్ గైడెన్స్, వర్క్ షీట్స్ మొదలైనవి www.sakshieducation.com లో అందుబాటులో ఉన్నాయి. పదో తరగతి స్టడీ మెటీరియల్, సిలబస్, మోడల్ పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, టెక్ట్స్‌బుక్స్, కెరీర్ గైడెన్స్, వర్క్ షీట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.. https://www.sakshieducation.com/TCLASS/Index.html -
‘వదంతులు నమ్మొద్దు.. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ’
సాక్షి, జంగారెడ్డి గూడెం: గ్రామ సచివాలయ ఉద్యోగాల ఎంపిక పారదర్శకంగా జరుగుతాయని... వదంతులు నమ్మొద్దని చింతలపూడి ఎమ్మెల్యే ఏలీజా అన్నారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో గ్రామ సెక్రటేరియట్ ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు. ఇంటికొక ఉద్యోగం పేరుతో నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీకి కట్టుబడి నాలుగు లక్షల వాలంటీర్ల పోస్టులు భర్తీ చేయడంతో పాటు లక్షా ఇరవై ఏడు వేల గ్రామ సెక్రటేరియట్ పోస్టులను భర్తీ చేస్తున్నారని తెలిపారు. జంగారెడ్డిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే ఏలీజా ఆకస్మిక తనిఖీ చేశారు. ఎటువంటి సదుపాయాలు అందుతున్నాయో విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి ఆయన అల్పహారం చేశారు. ఎమ్మెల్యే వెంట పొల్నాటి బాబ్జి, పిపియన్ చంద్రరావు, ఇతర నాయకులు ఉన్నారు. -
వాళ్లేం పాపం చేశారు!
వచ్చే నెలలో పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు. వాటిలో మంచి మార్కులు తెచ్చుకునేందుకు స్టడీ మెటీరియల్ దోహదపడుతోంది. ఎందుకో మరి విద్యాశాఖ ఆ మెటీరియల్ తెలుగు, ఇంగ్లిషు మీడియం విద్యార్థులకు మాత్రమే అందజేసి ఉర్దూ, కన్నడ మాధ్యమం విద్యార్థులకు మొండిచేయి చూపించింది. కారణమేమిటంటే ముద్రణ సమస్య, భాష బదలాయింపు అని చేతులు దులుపుకుంది. విద్యార్థులు మాత్రం స్టడీ మెటీరియల్ లేకుండా పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలని ఆందోళన చెందుతున్నారు. కర్నూలు సిటీ: పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు బట్టీ విధానానికి స్వస్తి చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది నుంచి నిరంతర సమగ్ర ముల్యాంకనాన్ని(సీసీఈ) అమలు చేస్తోంది. ఈ విధానంలో విద్యార్థులు సమాధానాలను గైడ్లు, పుస్తకాల్లో చదివి కాకుండా ప్రశ్నను అవగాహన చేసుకుని రాయాల్సి ఉంటుంది. ఇందులో 100 శాతం ఫలితాలు సాధించేలా వారిని సన్నద్ధం చేసేందుకు ఎస్సీఈఆర్టీ మాదిరి ప్రశ్నల పుస్తకాన్ని ఆధారం చేసుకున్నారు. అందులో భాగంగా ఆయా జిల్లాల్లో అందుబాటులో ఉన్న సబ్జెక్టు టీచర్లతో ప్రతి ఏటా స్టడీ మెటీరియల్ తయారు చేయించి డీసీఈబీ ద్వారా ఇస్తున్నారు. దీంతో చదువులో వెనుకబడిన విద్యార్థి సైతం ఈ స్టడీ మెటీరియల్ చదివి సులువుగా పాస్ అయ్యేందుకు అవకాశం ఉంది. గతేడాది నిధుల కొరత.. ఈసారి ముద్రణ సాకు జిల్లాలో ఉర్దూ పాఠశాలలు 17, కన్నడ మీడియం పాఠశాలలు 11 ఉన్నాయి.వీటిలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు వెయ్యిమందికి పైగా ఉన్నారు. గతేడాది నిధుల కొరత పేరుతో మెటీరియల్ ఇవ్వలేదు. ఈ ఎఫెక్ట్ ఫలితాల్లో కొంత చూపింది. ఈసారి అయినా మెటీరియల్ ఇస్తారనుకుంటే ముద్రణ సమస్య అని సాకు చూపి విద్యాశాఖ చేతులు ఎత్తేసింది. మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలో తెలియక ఉర్దూ, కన్నడ భాష విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు విద్యాసంవత్సరం ప్రారంభమైన రెండున్నర నెలల తర్వాత పాఠ్యపుస్తకాలు ఇచ్చినట్లు వారు వాపోతున్నారు. కన్నడ, ఉర్దూ మీడియం చదివే వారు తక్కువగా ఉంటారనే విద్యాశాఖ నిర్లక్ష్య ధోరణే దీనికంతటికి కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్టడీ మెటీరియల్ ఇవ్వాలని కోరాం జిల్లాలో ఉర్దూ మీడియంలో చదువుతున్న విద్యార్థులకు డీసీఈబీ ద్వారా తెలుగు, ఇంగ్లిషు మీడియం వారికి ఇచ్చినట్లు మెటీరియల్ ఇవ్వాలని అధికారులను కోరాం. అయితే ట్రాన్స్లేషన్ సమస్యతో ఇవ్వలేకపోతున్నామని చెబుతున్నారు. – దాదాపీర్, ఏపీ ఉర్దూ ఉపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి -
టెన్త్ పరీక్షల్లో టాప్ గ్రేడ్ రావాలా..
⇒ రేపటి నుంచే సాక్షి మెయిన్‌లో.. ⇒ ప్రతిరోజూ 4పేజీల టెన్త్‌క్లాస్ స్పెషల్స్ ⇒ తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో.. ⇒ కనీసం ఏ గ్రేడ్ సాధించేలా స్టడీమెటీరియల్ ⇒ ముఖ్య ప్రశ్నలు–సమాధానాలు, సమగ్ర బిట్‌బ్యాంక్ హైదరాబాద్: పదో తరగతి పరీక్షల్లో టాప్ గ్రేడ్ కోసం రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్న విద్యార్థులకు సాక్షి అండగా నిలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న లక్షల మంది విద్యార్థుల కోసం ప్రతిరోజూ మెయిన్ ఎడిషన్‌లో మొత్తం 4 పేజీలు.. రెండు పేజీలు ఇంగ్లిష్ మీడియం, రెండు పేజీలు తెలుగు మీడియం విద్యార్థుల కోసం కేటాయించనుంది. తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులకు సంబంధించి సిలబస్‌ను అనుసరించి ఆయా పేపర్ల వారీగా పరీక్షకు ముందురోజు స్టడీ మెటీరియల్ ప్రచురించనుంది. తెలంగాణ, ఏపీకి చెందిన తెలుగు, ఇంగిష్ మీడియం విద్యార్థుల కోసం అత్యంత అనుభవజ్ఞులైన నిపుణులు రూపొందించిన ముఖ్యమైన ప్రశ్నలు–సమాధానాలు, సమగ్ర బిట్ బ్యాంక్స్, ఎగ్జామ్ డే టిప్స్‌ను ఈనెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ అందించనుంది. -
స్టడీ మెటీరియల్ కోసం ఆందోళన
ఎస్కేయూ : వర్సిటీ దూరవిద్య విద్యార్థులకు స్టడీమెటీరియల్‌ను అందించడంలో జాప్యంపై శనివారం విద్యార్థి నాయకులు దూరవిద్య విభాగం స్టడీమెటీరియల్ కేంద్రం వద్ద ధర్నా చేసి, అధికారులను ఘెరావ్ చేశారు. మెటీరియల్ అందించడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా స్టడీ మెటీరియల్ అందిజేయాలని కోరారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి జాన్సన్‌బాబు, వీర, క్రాంతి, లింగ, దేవరాజు, నగేష్, శివ తదితరులు పాల్గొన్నారు. -
మార్గదర్శిని పంపిణీకి చర్యలు
వెంకటగిరి: జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ మార్గదర్శిని పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి తెలిపారు. వెంకటగిరిలోని ఆదర్శ పాఠశాలను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 1.34 లక్షలమంది విద్యార్థులకు మార్గదర్శిని ఉపయోగపడుతుందన్నారు. గత ఏడాది జెడ్పీ నిధులు రూ.3కోట్లు వెచ్చించి ప్రభుత్వ వసతిగృహలు, పాఠశాలల భవనాలకు మరమ్మతులు చేయించామన్నారు. ఈ ఏడాది నిధుల లేమితో నిధులు కేటాయించలేదన్నారు. ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం తమిళనాడు తరహాలో జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సును ప్రవేశపెట్టాలని కోరారు. మోడల్ స్కూల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మోడల్‌పాఠశాల ప్రిన్సిపల్ అపర్ణ, వైఎస్సార్సీపీ నేత గూడూరు భాస్కర్‌రెడ్డి, పద్మశాలీయుల సాధికార సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నక్కా వెంకటేశ్వరరావు, పెంచలకోన ట్రస్టు బోర్డు మాజీ సభ్యుడు ఢిల్లీబాబు, మాజీ ఎంపీపీ తాండవ రాజారెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటరత్నం రాజు, తోట గిరిరెడ్డి, వెంగమాంబపురం సింగిల్‌విండో ఉపాధ్యక్షుడు రావెళ్ల వెంకటకృష్ణమనాయుడు ఉన్నారు. -
రాశి కాదు.. వాసి ముఖ్యం
నిరుద్యోగులు తల్లిదండ్రుల కలలు నేరవేర్చాలి రాష్ర్ట నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట జోన్ : గ్రూప్ టూ ఉచిత శిక్షణకు ఎంతమంది అభ్యర్థులు అర్హులయ్యారనేది ముఖ్యం కాదని, ప్రతిభ కనబర్చి ఎంతమంది ఉద్యోగాలు సంపాదించారన్నదే ముఖ్యమని, రాశి కన్నా వాసి ముఖ్యం అన్నట్లు ప్రతి ఒక్కరూ నిర్ధేశిత లక్ష్యంతో రెండు నెలలు కష్టపడి చదివి ఉద్యోగాలు సంపాదించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సిద్దిపేటలోని పత్తి మార్కెట్ యార్డులో ఆదివారం మంత్రి హరీశ్‌రావు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచితంగా ఇస్తున్న గ్రూప్2 శిక్షణ తరగతులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల సిద్దిపేటలో కానిస్టేబుల్ పోస్టుల నియమకాల కోసం నిర్వహించిన పరీక్షను దృష్టిలో పెట్టుకొని శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నామన్నారు. యువత నుంచి వచ్చిన స్పందనతో మరోసారి గ్రూప్2 పరీక్షకు ఉచిత శిక్షణ తరగతులను సొంతంగా నిర్వహిస్తున్నానన్నారు. ఉచితం అనగానే నిర్లక్ష్యం, అశ్రద్ధ ఉంటుందని అది మంచిదికాదన్నారు. ప్రముఖ కోచింగ్ సంస్థ డీజేఆర్కు శిక్షణ బాధ్యత అప్పగించి, తాను సొంతగా డబ్బులు చెల్లిస్తున్నానన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించినప్పుడే తన అశయం నేరవేరుతుందన్నారు. పేద కుటుంబాల నుంచి వచ్చే పిల్లల ఆర్ధిక పరిస్థితి తనకు తెలుసని, వారిపై ఆర్ధిక భారం పడకుండా ఉచిత శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. తల్లిదండ్రుల అశలను, కలలను నిజం చేయాలని నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. ఉచిత భోజన వసతి కల్పిస్తాం నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 350 మంది విద్యార్ధులు భవిష్యత్తులో ఉద్యోగాలు సాధించినప్పుడే తన ప్రయత్నానికి సార్ధకత చేకూరుతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పేదవర్గాలకు నాణ్యతతో కూడిన శిక్షణను అందించేందుకు చేసే కృషిలో భాగంగానే 717 మందికి ఆర్హత పరీక్షలు నిర్వహించగా 350 ఆర్హత సాధించడం జరిగిందన్నారు. వీరందరికి రెండు నెలల పాటు శిక్షణ ఇప్పించి, శిక్షణ సమయంలో ఉచిత భోజన వసతి కల్పిస్తామన్నారు. అదే విధంగా స్టడీ మెటీరియల్‌ను అందిస్తామన్నారు. అంతకు ముందు డీ జేఆర్ సంస్థ చీఫ్ జగదీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రధాన నగరాలకే పరిమితమైన శిక్షణ తరగతులను మంత్రి హరీశ్‌రావు చొరవతో సిద్దిపేటలో నిర్వహిస్తున్నామన్నారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అంతకు ముందు శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుంటామని మంత్రి హరీశ్‌రావు యువతీయువకులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో జెడ్పీవైస్ చైర్మన్ రాగుల సారయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, నాయకులు చిన్నా, మచ్చవేణుగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి కొత్త బడి గంటలు
విజయనగరం అర్బన్: ప్రభుత్వ పాఠశాలల పనివేళల పెంపు అంశంపై కొద్దిరోజులుగా సాగుతున్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల మేరకు సవరించిన పనివేళలను శనివారం నుంచి పాటించాలని ప్రధానోపాధ్యాయులకు తాజాగా విద్యాశాఖ ఆదేశాలిచ్చింది. విద్యాహక్కు చట్ట ప్రకారం బడిగంటల పెంపు ప్రతిపాదన విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ఉంది. ఉపాధ్యాయ సంఘాలు అంగీకరించకపోవడంతో అమలులో జాప్యం జరిగింది. తాజాగా వచ్చిన ఆదేశాల మేరకు సవరించిన సమయాలు శనివారం నుంచి అమలులోకి వస్తాయని, ప్రధానోపాధ్యాయులు పాటించాలని విద్యాశాఖ అధికారి జి.కృష్ణారావు శుక్రవారం ఆదేశించారు. ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పనివేళలు ఒక్కో రకంగా ఉన్నాయి. కొత్తగా అన్ని పాఠశాలలు ఒకే సమయానికి ప్రారంభమై ఒకే సమయానికి విద్యార్థులను విడిచి పెట్టాలనే నిబంధనలను అమలు చేస్తున్నారు. ఉదయం 9 గంటలకే తరగతులు ప్రారంభించి సాయంత్రం 4.30 గంటలకు విద్యార్థులను విద్యాహక్కు చట్టం ప్రకారం విడిచి పెట్టాలి. ఈ పనివేళలను ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర పరిధిలోని కేంద్రీ య విద్యాలయం, నవోదయ, ఆదర్శ, సాంఘిక సంక్షేమ, గురుకుల పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలలు అమలు చేస్తున్నాయి. కేవలం రాష్ట్రప్రభుత్వం పరిధిలోని మండల,జిల్లాపరిషత్ పాఠశాలలు అమలు చేయడం లేదు. టీచరు-బోధన కాలం ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు తరగతులు బోధించడానికి రోజుకు ఏడున్నర గంటల చొప్పున వారానికి 45 గంటల సమయాన్ని కేటాయించాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో బోధించడానికి ఏడాదికి 800 గంటలు, ఉన్నత పాఠశాలల్లో ఒక 1,000 గంటలు కేటాయించాలని చట్టం పేర్కొంది. స్టడీ మెటీరియల్, గైడ్లకు గుడ్‌బై పాఠశాలల్లో గైడ్లు, మెటీరియల్‌కు స్వస్తి చెప్పాలని విద్యాహక్కు చట్టం చెబుతున్న నేపథ్యంలోనే నిర్మాణాత్మక మూల్యాంకనం కోసం పాఠశాల పనివేళలు పెంచుతున్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థులు తమకు అర్ధంకాని అంశాలను స్పష్టంగా తెలుసుకునేందుకు అదనపు సమయాన్ని కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు. కళావిద్య, నైతిక విద్య, పనివిద్య, ఆటపాటలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఎనిమిది పీరియడ్ల స్థానంలో మరో పీరియడ్ ఆదనంగా చేరుతుంది. ఉన్నత పాఠశాల స్థాయిలో వారానికి ఉన్న 48 పీరియడ్లు కాస్త 54కు పెరిగాయి. -
కొత్త సిలబస్‌తో 'ఎంసెట్' స్టడీ మెటీరియల్ పోర్టల్
ఎప్పటికప్పుడు విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తోన్న సాక్షిఎడ్యుకేషన్.కామ్ మరో అడుగు ముందుకేసి ఎంసెట్ కోసం ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో కొత్త సిలబస్‌కు అనుగుణంగా నిపుణులతో రూపొందించిన పూర్తి స్థాయి స్డడీ మెటీరియల్ తో పాటు ప్రిపరేషన్ గెడైన్స్, క్విక్ రివ్యూస్, బిట్ బ్యాంక్, మాక్ టెస్ట్స్, ప్రీవియస్ పేపర్స్ వంటి సమగ్ర సమాచారం లభిస్తోంది. ఇప్పుడే 'ఎంసెట్' స్టడీ మెటీరియల్ పోర్టల్ లో లాగాన్ అయి ఎంసెట్‌లో మంచి ఫలితాలు పొందండి. -
‘పది’పై ప్రత్యేక దృష్టి ఏది?
విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : జిల్లాలో గత ఏడాది పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 92.4శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ప్రభుత్వ, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఇది 90 శాతం వరకు నమోదైంది. రాష్ట్రస్థాయిలో జిల్లా నాలుగో స్థానం, తెలంగాణలో మొదటి స్థానంలో నిలిచింది. ఇది సంతృప్తిగానే ఉన్నా ఈసారి మరిం త మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాల్సి న విద్యాశాఖాధికారులు ఇంత వరకు మేల్కొనలేదు. ప్రత్యేక బోధన తరగతులు ఏర్పాటుచేయడంతో పాటు స్టడీ మెటీరియల్ అందజేయాల్సిన అధికారులు ఆ దిశ గా దృష్టి సారించకపోవడంపై విమర్శలొస్తున్నాయి. జిల్లాలో 23,308 మంది.. జిల్లావ్యాప్తంగా 503 ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటన్నింటిలో 23వేల 308 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వా ర్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రణాళికాయుతంగా బోధించేడమే కాకుండా పాఠ్యాంశాలను రివిజన్ చేసేందుకు ప్రత్యేక తరగతులు ఏర్పాటుచేయాల్సి ఉం టుంది. వీటిని పట్టించుకోకపోగా, పదో తరగతి పా ఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయులకు స్టడీమెటీరియ ల్ కూడా ఇంత వరకు అందించలేదు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించేందుకు కృషి చేయాల్సిన అధికారులు.. ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కరువైన 40రోజుల ప్రత్యేక ప్రణాళిక ప్రతీ విద్యాసంవత్సరం అక్టోబర్-నవంబర్ నెలల్లో జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు(డీసీఈబీ) ద్వారా జిల్లా విద్యాశాఖాధికారులు పదో తరగతి విద్యార్థులను వార్షి క పరీక్షలకు సిద్ధం చేయడంలో భాగంగా ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలకు స్టడీ మెటీరియల్ అందజేయడ మే కాకుండా ప్రతిరోజు పాఠశాల సమయానికి ముం దు, తరగతులు ముగిశాక గంట చొప్పున ప్రత్యేక తరగతులు ఏర్పాటుచేస్తారు. ఇదంతా కొన్నేళ్లుగా జరుగుతుండగా, ఈసారి హెచ్ఎంలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఇక వార్షిక పరీక్షలకు ముందుగా 40 రోజుల ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ప్రతీ సబ్జెక్టులో ముఖ్యమైన అంశాలతో పుస్తకాలు అందజేసేవారు. ఇది కూడా అమలుకు నోచుకోలేదు. మార్చి 27నుంచి ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు ప్రారంభం కానుండగా.. అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. నిధుల కొరతే కారణమా..? ఏటా పదో తరగతి విద్యార్థుల కోసం స్టడీ మెటీరియ ల్, పాఠ్యాంశాల్లోని ముఖ్యమైన విషయాలతో జాబితా ముద్రించే జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు(డీసీఈబీ) వద్ద నిధులు లేకపోవడమే ఈసారి అధికారులు స్పందించకపోవడానికి కారణమని తెలుస్తోంది. 6నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల నుంచి అధికారులు కొంతమేర ఫీజు తీసుకుని ప్రశ్నాపత్రాలు, ఇతరత్రా ముద్రించేవా రు. అయితే, విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో 6, 7, 8వ తరగతుల విద్యార్థుల నుంచి ఫీ జు వసూలు చేయడాన్ని నిలిపివేసిన అధికారులు 9, 10వ తరగతి విద్యార్థుల నుంచి మాత్రం వసూలు చేస్తున్నారు. ఫలితంగా ఆదాయం రూ.50లక్షల నుంచి రూ.35లక్షలకు పడిపోయింది. దీంతో స్టడీ మెటీరియ ల్, ప్రత్యేకప్రణాళిక జాబితా ముద్రించలేదని తెలుస్తోంది. కాగా, పాఠశాలలను నిరంతరం పర్యవేక్షిస్తు న్న డీఈఓ విజయ్‌కుమార్.. ఎస్సెస్సీ విద్యార్థులపై కూ డా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. -
వంద శాతం సాధిస్తాం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పదో తరగతి పరీక్షల్లో ‘వంద శాతం ఫలితాలే లక్ష్యం’.. అదే ‘మా నినాదం’ అంటోంది జిల్లా విద్యాశాఖ యంత్రాంగం. టెన్త్ క్లాస్ వార్షిక పరీక్షలు దగ్గర పడుతుండడంతో క్షేత్రస్థాయి పరిస్థితిని అంచనా వేస్తూ.. తదుపరి చర్యల్లో బీజీ అవుతోంది. గతేడాది ప్రభుత్వ పాఠశాలలు పదోతరగతి వార్షిక పరీక్షల్లో 72 శాతం ఫలితాలు సాధించగా.. ఈ ఏడాది పూర్తిస్థాయిలో ఉత్తీర్ణత సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. స్టడీ మెటీరియల్ రూపొందించడంతో పాటు ప్రత్యేక తరగతులు నిర్వహించి విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నామని డీఈఓ పేర్కొంటున్నారు. ఇటీవల సంక్రాంతి సెలవుల్లోనూ నిర్వహించిన ప్రత్యేక తరగతులకు మంచి స్పందన రావడంతో విద్యాశాఖ అధికారులు మరింత ఉత్సాహంతో ఉన్నారు. టెన్త్‌లో అత్యుత్తమ ఫలితాల కోసం తీసుకుంటున్న చర్యలు.. ప్రత్యేక ఏర్పాట్లను జిల్లా విద్యాశాఖ అధికారి యం.సోమిరెడ్డి ‘సాక్షి’కి వివరించారు. అవి ఆయన మాటల్లోనే... ప్రతి విద్యార్థి పాస్ కావాల్సిందే.. జిల్లాలో 436 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 24వేల మంది పదోతరగతి విద్యార్థులున్నారు. ఈ ఏడాది టెన్త్ వార్షిక పరీక్షల్లో ప్రతి విద్యార్థి కూడా ఉత్తీర్ణత సాధించాలనేది మా లక్ష్యం. బడిలో 60శాతం హాజరు నిండిన విద్యార్థి తప్పకుండా పాసవుతాడు. ఆమేరకు ఉపాధ్యాయులు విద్యార్థులను సన్నద్ధం చేశారు. డిసెంబర్ నెలాఖరులో బోధన పూర్తి కావడంతో ఇప్పుడు రివిజన్ తరగతులు నిర్వహిస్తున్నాం. అదేవిధంగా కింది తరగతి విద్యార్థులకు ప్రాథమిక మెళకువలు నేర్పేందుకు చర్యలు తీసుకుంటున్నాం. రూ.21లక్షలతో స్టడీ మెటీరియల్ విద్యార్థులు సులభమైన పద్ధతిలో పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు ప్రత్యేకంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో స్టడీ మెటీరియల్‌ను రూపొందించాం. దాదాపు రూ.21 లక్షలు వెచ్చించి ఈ మెటీరియల్‌ను త యారు చేయించాం. మరో రెండుమూడు రోజుల్లో విద్యార్థులందరికీ ఉచితంగా పంపిణీ చేస్తాం. ఒక్కో విద్యార్థిపై రూ.92 చొప్పున వెచ్చిస్తున్నాం. హెచ్ఎంలతో ప్రత్యేక సమీక్ష ఈ వారంలో ఉన్నత పాఠశాలల హెడ్మాస్టర్లతో కలెక్టర్ శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి పాఠశాలపై చర్చిస్తాం. పురోగతిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాం. వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేకంగా పునఃశ్చరణ తరగతులు నిర్వహించేందుకు కూడా ప్రణాళిక తయారు చేస్తున్నాం. 6,7,8,9 తరగతుల విద్యార్థుల బోధన తీరుపైనా సమీక్ష చేస్తాం. క్షేత్రస్థాయి తనిఖీలు విస్తృతం చేస్తాం హెచ్ఎంల మీటింగ్ తర్వాత నేను కూడా విస్తృత తనిఖీలు చేస్తా. అవేవిధంగా జి ల్లాలోని నలుగురు ఉపవిద్యాధికారులకు ప్రత్యేకంగా వాహనాలు ఇచ్చాం. ప్రతిరో జు క్షేత్ర పర్యటనలు తప్పకుండా చేయా ల్సి ఉంటుంది. వచ్చేవారం నుంచి వారి పరిధిలోని అన్ని పాఠశాలలను క్ర మం తప్పకుండా తనిఖీ చేసి నివేదిక ఇ స్తారు. ఉపాధ్యాయుల బోధన, పిల్లల పరిస్థితి మెరుగుపడుతుంది. ఇందుకుగాను ఉప విద్యాధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశాం. అదేవిధంగా మండల విద్యాధికారులు కూడా ఉన్నత పాఠశాలల తనిఖీల్లో భాగస్వాములయ్యేలా చూస్తాం.