విద్యారణ్యపురి, న్యూస్‌లైన్ : జిల్లాలో గత ఏడాది పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 92.4శాతం మంది ఉత్తీర్ణులు కాగా, ప్రభుత్వ, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఇది 90 శాతం వరకు నమోదైంది. రాష్ట్రస్థాయిలో జిల్లా నాలుగో స్థానం, తెలంగాణలో మొదటి స్థానంలో నిలిచింది. ఇది సంతృప్తిగానే ఉన్నా ఈసారి మరిం త మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాల్సి న విద్యాశాఖాధికారులు ఇంత వరకు మేల్కొనలేదు. ప్రత్యేక బోధన తరగతులు ఏర్పాటుచేయడంతో పాటు స్టడీ మెటీరియల్ అందజేయాల్సిన అధికారులు ఆ దిశ గా దృష్టి సారించకపోవడంపై విమర్శలొస్తున్నాయి.
జిల్లాలో 23,308 మంది..
జిల్లావ్యాప్తంగా 503 ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటన్నింటిలో 23వేల 308 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. వా ర్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ప్రణాళికాయుతంగా బోధించేడమే కాకుండా పాఠ్యాంశాలను రివిజన్ చేసేందుకు ప్రత్యేక తరగతులు ఏర్పాటుచేయాల్సి ఉం టుంది. వీటిని పట్టించుకోకపోగా, పదో తరగతి పా ఠ్యాంశాలు బోధించే ఉపాధ్యాయులకు స్టడీమెటీరియ ల్ కూడా ఇంత వరకు అందించలేదు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఫలితాలు సాధించేందుకు కృషి చేయాల్సిన అధికారులు.. ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
కరువైన 40రోజుల ప్రత్యేక ప్రణాళిక
ప్రతీ విద్యాసంవత్సరం అక్టోబర్-నవంబర్ నెలల్లో జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు(డీసీఈబీ) ద్వారా జిల్లా విద్యాశాఖాధికారులు పదో తరగతి విద్యార్థులను వార్షి క పరీక్షలకు సిద్ధం చేయడంలో భాగంగా ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇందులో భాగంగా ప్రభుత్వ, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలకు స్టడీ మెటీరియల్ అందజేయడ మే కాకుండా ప్రతిరోజు పాఠశాల సమయానికి ముం దు, తరగతులు ముగిశాక గంట చొప్పున ప్రత్యేక తరగతులు ఏర్పాటుచేస్తారు. ఇదంతా కొన్నేళ్లుగా జరుగుతుండగా, ఈసారి హెచ్‌ఎంలకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. ఇక వార్షిక పరీక్షలకు ముందుగా 40 రోజుల ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ప్రతీ సబ్జెక్టులో ముఖ్యమైన అంశాలతో పుస్తకాలు అందజేసేవారు. ఇది కూడా అమలుకు నోచుకోలేదు. మార్చి 27నుంచి ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు ప్రారంభం కానుండగా.. అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు.
నిధుల కొరతే కారణమా..?
ఏటా పదో తరగతి విద్యార్థుల కోసం స్టడీ మెటీరియ ల్, పాఠ్యాంశాల్లోని ముఖ్యమైన విషయాలతో జాబితా ముద్రించే జిల్లా ఉమ్మడి పరీక్షల బోర్డు(డీసీఈబీ) వద్ద నిధులు లేకపోవడమే ఈసారి అధికారులు స్పందించకపోవడానికి కారణమని తెలుస్తోంది. 6నుంచి 10వ తరగతి వరకు విద్యార్థుల నుంచి అధికారులు కొంతమేర ఫీజు తీసుకుని ప్రశ్నాపత్రాలు, ఇతరత్రా ముద్రించేవా రు. అయితే, విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో 6, 7, 8వ తరగతుల విద్యార్థుల నుంచి ఫీ జు వసూలు చేయడాన్ని నిలిపివేసిన అధికారులు 9, 10వ తరగతి విద్యార్థుల నుంచి మాత్రం వసూలు చేస్తున్నారు. ఫలితంగా ఆదాయం రూ.50లక్షల నుంచి రూ.35లక్షలకు పడిపోయింది. దీంతో స్టడీ మెటీరియ ల్, ప్రత్యేకప్రణాళిక జాబితా ముద్రించలేదని తెలుస్తోంది. కాగా, పాఠశాలలను నిరంతరం పర్యవేక్షిస్తు న్న డీఈఓ విజయ్‌కుమార్.. ఎస్సెస్సీ విద్యార్థులపై కూ డా దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
‘పది’పై ప్రత్యేక దృష్టి ఏది?
Published Sat, Jan 25 2014 2:28 AM | Last Updated on Thu, Jul 11 2019 5:23 PM
Advertisement
Advertisement